Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం సూర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాం మే పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యసాయి సేవా సంస్థలు స్వామి అనుగ్రహంతో సంకల్పించుకున్న ఉపనిషద్ వాహిని ఇది ఉపనిషత్ సుధ ఇది అమృతోపమానమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి విషయం దీనిని ధారావాహికంగా ఏడు వారాలు మాట్లాడుకునేటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి హిమాయత్ నగర్ కి సమితికి స్వామి దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించు గాక అని ముందే అనుకుంటూ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం సదాశివుడు అంటే ఈశ్వరుడు కాదు సదాశివుడు అంటే రుద్రుడు కాదు సదాశివుడు అంటే మనమెరిగిన శివుడు మాత్రమే కాదు సదాశివోక్తాని సపాద లక్షలయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మన్యతమం లయానాం అంటారు శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక లక్షా ఇరవై ఐదు వేల లయ యోగాలలో నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనది అని ప్రారంభించి శంకర భగవత్పాదులు ప్రపంచానికి మహోపదేశం చేశారు అలాగే సదాశివుడితో ప్రారంభించి ఎవరు సదాశివుడు అంటే శ్రీ లలితా దేవిని మనం శ్రీమత్ సింహాసనేశ్వరిగా భావన చేస్తాం ప్రతి సింహాసనానికి నాలుగు కోణులు ఉంటాయి కానీ అమ్మవారిది శ్రీమత్ సింహాసనం అది శ్రీమత్ ఎందుకైందంటే ఐదవ కోణం బయటకు కనిపించనటువంటి ఒక కోణం మధ్యలో ఉండి ఆధారభూతమై ఉంటుంది గనుక అక్కడ ఉన్నటువంటి వాడు సదాశివుడు అమ్మకు అయ్య ఆధారం గనుక సదాశివ సమారంభాం అంటారు గురు పరంపరలో మరి మధ్యలో వ్యాస శంకర మధ్య మామ్ అంటాం ద్వాపర యుగంలో గనుక వ్యాసుల వారు వచ్చి ఉండకపోతే పద్దెనిమిది పురాణాలు దక్కేవి కాదు ఉపనిషత్తులు దొరికేవి కాదు భగవద్గీత దొరికేది కాదు బ్రహ్మసూత్రాలకి ఉన్నాయి ఐదు వందల యాభై ఏడు బ్రహ్మసూత్రాలు ఉన్నాయని చెప్పిన వాడు దొరికేవాడు కాదు అలాగే భగవద్గీత అలాగే విష్ణు సహస్రనామం ఇట్లా అనేకమైనటువంటి మహా వాంగ్మయ స్వరూపంగా వచ్చినవారు వ్యాసుల వారు గనుక వారు కృష్ణ నామంతోనే వారు కూడా వచ్చారు గనుక కృష్ణం ధర్మం సనాతనం అని ఒక మాట ఉంది మనం రామో విగ్రహవాన్ ధర్మః అంటాం త్రేతాయుగంలో కృష్ణ పరంగా వచ్చినప్పుడు కృష్ణం ధర్మం సనాతనం ఏది సనాతనమై ఉన్నదో ఏది నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక దివ్యానుభూతిని జగత్తుకు కలిగించటానికి ఒక శారదా ప్రవాహంగా ప్రపంచంలోకి వచ్చిందో దానిని ఉడిసి పట్టి పండితులకి, పామరులకి, మాన్యుడికి, సామాన్యుడికి, అసామాన్యుడికి అర్థం అయ్యేటువంటి రీతిలో విస్తృతంగా చెప్పారు గనుక వారు వ్యాసులవారు అయినారు వ్యాసులవారే కృష్ణ ద్వాయ్ పాయలుడు అన్న ఆయనే, బాదరాయనుడు అన్న ఆయనే, వ్యాసులవారు అన్న ఆయనే ఇవన్నీ కూడా అనేకమైనటువంటి నామాలు ఇక ద్వాపర యుగం తర్వాత వచ్చిన కలియుగ ఆరంభ వేళల్లోనే శంకర భగవత్పాదులు వచ్చారు శంభోర్మూర్తిశ్చరతి భోనే శంకరాచార్య రూపా వాయు పురాణంలో పన్నెండు మంది ఆదిత్యులు అంటే సూర్యదేవులు ఉన్నారు గనుక అంటే ద్వాదశాదిత్యులు అంటాం అందులో ఒక ఆదిత్యుడు జ్ఞానాదిత్యుడు జ్ఞానాదిత్యుడే శంకర రూపంలో వచ్చి శివాత్మకమైన, మంగళాత్మకమైన, శంకరమైన రూపంలో శం అంటే శుభం కర అంటే చేసేవాడు అని లోకానికి మంగళప్రదమైనటువంటి ఒక వాంగ్మయాన్ని అందించటానికి వచ్చారు గనుక ఆయన శంకర స్వరూపమైనారు ఆయనే జ్ఞానాదిత్యుడు అయినారు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అయితే ప్రస్థానత్రయం భారతీయ అధ్యాత్మ తత్వశాస్త్రంలో ప్రామాణికమైనటువంటిది ప్రస్థానం ప్రస్థానత్రయం ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని చెప్పిన వారు వ్యాసులవారైతే వ్యాఖ్యానం చేసినటువంటి వారు అంటే భాష్యం చెప్పినవారు శంకర భగవత్పాదులు అందుకనే వ్యాస శంకర మధ్య మామ్ అంటాం సదాశివుడి నుంచి ఇవాళ ఉన్నటువంటి అస్మదాచార్య పర్యంతాం ఇవాళ మనకున్నటువంటి గురువు వరకు లేదా ఆచార్య సత్యాచార్యులైన ఆచార్య మూర్తుల వరకు అట్లాగే దైవంగా కనిపించే గురువు, గురువుగా అనిపించే దైవం రెండు ఉన్నటువంటి సత్య సాయి భగవానుడి వరకు మనం గురు వందనం చేసే ప్రారంభించాలి ప్రస్థానత్రయంలో ఇవాళ ఉపనిషత్తుల గురించి మనం మాట్లాడుకోవాలి ఇది చాలా విస్తృతమైనటువంటి విషయం విస్తృతమైనటువంటి విషయాన్ని సంక్షిప్తంగా, క్లుప్తంగా కానీ సుందరంగాకానీ సరళంగా కానీ గంభీరంగా సూటిగా ఉదాత్తంగా ఉత్తమంగా యదార్థంగా చెప్పుకోవాలి గనుక ఉపనిషద్ వాహిని సత్యసాయి భగవానుడు రాసినటువంటి వాహినిలలో సర్వోత్కృష్టమైనటువంటి వాహిని ఇది. అయితే ఉపనిషద్ వాహిని మళ్ళీ ఈవేళ ఎందుకు చెప్పుకోవాలి? చాలాసార్లు ఉపనిషత్తులు మాట్లాడుకున్నాం కదా! కేనోపనిషత్తు, కఠోపనిషత్తు అన్నీ మాట్లాడుకున్నామే, మళ్ళీ ఈవేళ ఎందుకు ప్రత్యేకంగా అంటే ఎప్పుడూ చెప్పుకోవాలి గనుక. ఇదే సమాధానం. ఆంధ్రదేశంలో శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహాకావ్య నిర్మాణం చేసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాసినప్పుడు ఆయన్ని కూడా ఇదే ప్రశ్న వేశారు. రెండు వందల ఎనభై ఎనిమిది భాషలలో రామాయణం ఉంటే పైగా అన్ని భాషలలో అనేకమంది రామాయణం రాస్తే ప్రతిభా, ప్రజ్ఞా, వ్యుత్తత్తి, పాండిత్యము అన్నీ ఉన్నటువంటి మీరు మళ్ళీ రామాయణమే ఎందుకు రాశారు? అని అడిగినప్పుడు "మరల ఇదేల రామాయణంబు అన్నచో ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్లు తన రుచి బ్రతుకును తనదిగాన. చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన. పలచిన రామునే కొలుతును నేనును నా భక్తి రచనలు నావిగాన. కవిప్రతిభ యుండున కావ్యగత శతాంశమున తొంబదియైన పాండ్లు ప్రాగ్విపశ్చన్మంతంబున రసము వెయ్యిరెట్లు గొప్పది నవకదాదృతిని మించి" అని సమాధానం ఇచ్చారు. అంటే అందరూ రాముణ్ణి కొలిచినట్టే నేను కొలిచాను. రోజూ తింటున్న అన్నమే మళ్ళీ తింటూ తింటూనే ఉన్నాము. అయినా తినటం మానలేదు కదా! సంసారం మంచిది కాదంటున్నాం, మంచిదేనంటున్నాం, సుందరమైనదనింటున్నాం. దానిని అనేక విధాల అర్థం చేసుకుంటున్నాం కానీ సంసారం చేయటం మాత్రం మానటం లేదే. సంసారము అంటే కేవలము కుటుంబం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండటమే ఒక సంసార యాత్ర. అందరూ తలచినట్లే నేను కూడా రాముణ్ణి కొలుచుకున్నాను నేను కాబట్టి నా భక్తి రచనలు నావిగాన. నా భక్తి నాది-నాది మాత్రమే ఇంకొకరితో పంచుకోటానికి వీలు లేదు. కానీ ఏదో ఒక కొత్త కథ రాసి ప్రపంచానికి అందించేకంటే, అత్యున్నతమైన, సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మ ప్రతిపాదన చేస్తూ రామాయణం వంటి ఆదికావ్యాన్ని గనుక మళ్ళీ తెలుగున రచించగలిగినట్లయితే దానిలో ఉండే రసము వెయ్యిరెట్లు గొప్పది కొత్త వాటికంటే. రసో వై సహ, ఈశ్వరుడు రస స్వరూపుడు. ఆయన నిజానికి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమే. కానీ సాకార సగుణ బ్రహ్మంగా లోకంలోకి రావాలి. ఎందుకు రావాలి? "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" ధర్మగ్లాని జరిగినప్పుడల్లా నేను వస్తూనే ఉంటా. అనేక రూపాల్లో వస్తా. అనేక అవతార తారుష్యాలుగా వస్తా. అంశావతారాలు, అర్చావతారాలు, కళావతారాలు, ప్రసవావతారాలు, ప్రభవావతారాలు, అణుప్రవేశావతారాలు, ఆదేశావతారాలు, కారణావతారాలు ఎన్నెన్ని విధాలుగానో నేను ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్య అనేటువంటి అనేక రీతుల, ఇవన్నీ కూడా భారతీయమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని మానవీయం చేస్తూ సర్వ ప్రపంచానికి, మానుష్య జాతికి అందించటానికి నేను యుగే యుగే సంభవామి యుగే యుగే అంటే యుగే యుగే అంటే యుగం తర్వాత మళ్ళీ ఇదంతా అయ్యాక ఎప్పుడో వస్తారు అని. యుగే యుగే అంటే క్షణే క్షణే అని. ఒక్కొక్క క్షణంలో ఎటు నుంచి ఎటు పరమాత్మ రూపంలో జగత్తులోకి వస్తారో తెలియదు. కానీ ఎందుకు రావాలో ఆయనకు తెలుసు. ఎందుకు వచ్చారో తెలుసుకోవటానికి మనకు చాలా సమయం పడుతుంది. కనుక, ఇవాళ మళ్ళీ మనం ఉపనిషత్తులు మరొక్కసారి తలాస్పర్శగా కాకుండా సమయం మనకు ఉన్నది కాబట్టి చాలా గంభీరంగా, గభీరంగా అంటే లోతుగా, విస్తృతంగా, విస్తారంగా విషయ విశ్లేషణ చేసుకుంటూ మనం వెళ్దాం. ప్రస్థానత్రయంలో మిగతా రెండింటిని కాసేపు పక్కన పెట్టినట్లయితే అసలు ఉపనిషత్ అనేటువంటిది ఏమిటి? ఉపనిషత్తులు అనగానే ఇవాళ మన తరం అంటే మన పిల్లలే అనుకుందాం, "అమ్మో మాకు అర్థం కాదు" అంటారు. అర్థం చేసుకోవటం ప్రయత్నిస్తే చాలా తేలిక. అది ఎంత తేలిక అంటే ఇంతేనా విషయాలే దీంట్లో ఉన్నాయా అన్నంత తేలిక అన్నమాట. ఉప అంటే దగ్గరక, నిషత్ అంటే కూర్చొని ఇదే ఉపనిషత్ అంటే అర్థం. దేనికి దగ్గరగా కూర్చొని? పరమేశ్వర భావానికి, పరమేశ్వరుడి యొక్క ఆలోచనాధారకి, పరమేశ్వరుడి యొక్క భావ సామ్రాజ్యానికి, పరమేశ్వరుడి యొక్క మూలతత్వానికి దగ్గరగా కూర్చొని ఉండటమే దాని పేరు ఉపనిషత్. ఒక గురువు ఒక శిష్యుడు కూర్చొని ఉన్నారు. ఒక స్వామి స్వామిని చూడటానికి వెళ్ళిన ఒక భక్తుడు ఇద్దరూ కూర్చొని ఉన్నారు అది ఉపనిషత్. అంటే బోధకుడు సాధకుడు, తండ్రి కుమారుడు, అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థి, ఆచార్యుడు అంతేవాసి. వీళ్ళందరూ కూడా ఇద్దరూ కలిసి ఎక్కడ కూర్చుంటున్నారో దాని పేరే ఉపనిషత్తు. భావనకు ఉపనిషత్ అని పేరు. కాబట్టి పరమేశ్వర భావానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలని మహర్షులు, మహాత్ములు, దార్శనికులు, తత్వజ్ఞులు, జ్ఞానులు, జ్ఞానార్థులు అందరూ కూడా దర్శనం చేసివీళ్ళు అం చేసిన దర్శనాలన్నింటినీ ఋషి గణాలన్నీ కూడా ఒడిసి పట్టుకొని మళ్ళీ దానిని decode చేసి అంటే ఆనాడు భాష లేదు, ఆనాడు లిపి లేదు వ్యాసులవారు వచ్చేదాకా సంస్కృత భాషే నిజానికి లేదు. కాబట్టి వ్యాసులవారు వచ్చి సంస్కృత భాషలో మనకి జన సామాన్యానికి అందించే రీతిలో దానిని సమన్వయం చేశారు గనుక వ్యాసులవారి కంటే ముందు వాల్మీకి సంస్కృతం ఉంది కానీ ఉపనిషత్ పరమైన తత్వ విధానమైనటువంటి పరంగా సంస్కృత భాషను వాళ్ళు వాడుకోలేదు గనుక వ్యాసుల వారు ఉపనిషత్ భావనని ప్రపంచానికి ఇచ్చారు. ఎందుకిచ్చారు? ఉపనిషత్తులు చదవకపోతే ఏమవుతుంది అని. మానవుడి మేధలో ఒక second కి ఆరువేల ఆలోచనలు పుడతాయి. ఆరువేల ఆలోచనలు co current గా counter current గా భిన్నభిన్న స్థాయిలలో ఉంటాయి. కొన్ని కేవల ప్రాపంచికమైనవి ఉంటాయి. కొన్ని కాస్త మేధాశక్తికి సం-సంబంధించి ఉంటాయి. కొన్ని లౌకిక పారలౌకిక స్థితులు దాటి ఉంటాయి. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవటానికి ముందు మనిషి మనసులో తారాడు పారాడు అనేకమైన సందేహాలకి సమాధానం ఇవ్వాలి. బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే ఉపనిషత్తులు, మహర్షులు, మహాత్ములు, ఋషులు వీళ్ళు తీసుకున్నారు. జీవితంలో చూడండి సమాధానం పొందటం అవసరం. సమాధాన పడటం compromise కావటం. compromise కావాలి. కావాలా? కాకూడదు. ఎందుకంటే మనిషి యొక్క గౌరవాన్ని దిగజార్చేది compromise కావటం. కానీ జీవితంలో adjust కావాలి. తప్పనిసరి విషయం ఇది. అంటే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై దేవుడు ఎట్లా వచ్చాడో అదే కాల కార్య కారణ నిమిత్తమై జీవుడు కూడా వచ్చాడు గనుక జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధాన మహాయోగానికి దారి తెలియాలి గనుక దారి ఎట్లా పట్టుకుంటే విషయాన్ని తెలుసుకుంటే మనకు దారి దొరుకుతుందో దానిని స్పష్టంగా ఉపనిషత్తుల నిండా నింపి ఉంచారు మహర్షులంతా కూడా. అయితే అవి ఒక్కొక్క అంశం మీద ఉన్న ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ లఘు స్వరూపాలు చిన్న చిన్నవి. శంకర భగవత్పాదులు ప్రపంచంలోకి వచ్చి ఇన్ని ఉపనిషత్తులు గనుక ఉన్నట్లయితే వీటిలల్లో ఇంత వైవిధ్యంగా ఉన్నాయి. వైరుధ్యాలు ఎక్కడా లేవు. కానీ వైవిధ్యంగా ఉన్నాయి. భిన్న భిన్నంగా ఉన్నాయి. వీటన్నింటినీ సామాన్యుడు తికమక పడతాడేమో అని వాటన్నింటినీ కూడా సంక్షిప్తీకరించారు. చేసి ప్రధానంగా దశ ఉపనిషత్తులుగా వాటిని ప్రపంచానికి అందించారు. దశోపనిషత్తులే ఇవాళ మనం ఉపనిషత్తులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఉపనిషత్తులు మనకిచ్చినటువంటి ఒక అది అవకాశము, ఒక అధికారము ఏమిటంటే దేనినైనా ప్రశ్నించి తెలుసుకోమన్నది. దేనినైనా ప్రశ్నించి తెలుసుకోవాలి అంటే జిజ్ఞాస ఉండాలి. సమాధానం చెప్పటానికి తెలివితేటలు కాస్త తక్కువున్నా పనిచేస్తుంది. కానీ ప్రశ్నించడానికి మాత్రమే తెలివితేటలు ఎక్కువ కావాలి. పరి ప్రశ్న వెయ్యాలి అంటే ఇంకాస్త ఎక్కువ తెలివితేటలు ఉండాలి. అది విశ్వజనీనం కావాలి, సార్వకాలికం కావాలి గనుక ఉపనిషత్తులు అన్నీ కూడా ఇటువంటి ఒక సమాధానం ఇవ్వటానికి ప్రతి దానికి మానవుడి మనసులో, బుద్ధిలో, చిత్తంలో, మస్తష్కంలో పుట్టే ప్రతి ప్రశ్నకి సమాధానము ఇవ్వగలిగినటువంటి ప్రస్థానత్రయంలో శిఖర స్థాయికి చెందినటువంటిది ఉపనిషత్తు గనుక ఉపనిషత్తు మానవుడు ఎక్కడ నుంచి ఎందుకని పొందాడు? ఇది రావటానికి గల కారణం ఏమిటి? ఇది కూడా మనం తెలుసుకోవాలి. నిజానికి వేదవ్యాసులవారు వచ్చేదాకా వేదాలన్నీ ఒక, ఒక గంపలో పోసినటువంటి ఒక రాశి వేదరాశి అన్నారు దాన్ని. వేదరాశిలో ఉంటే దాన్ని ఆయన విభజించారు. విభజించి పాడుకోవటానికి వీలుగా ఉన్నటువంటి సస్వర సుస్వరమైనటువంటి మంత్రాలనండి, దానిలో ఉన్నటువంటి బీజాక్షరాలనండి, లేదు దాని ద్వారా ప్రపంచానికో మహత్తర బృహత్తర సందేశాన్ని ఇవ్వాలి కానివ్వండి వీటిని ఆయన ఏం చేశారంటే దీనిని సామవేదము అని పేరు పెట్టారు. సామము అంటే గానము అని అర్థం. కనుక సామవేదము అది సామగానమే. సామవేదమన్నా సామగానమన్నా ఒకటే. అందుకే మనం పరమాత్మని ఆయన సామగాన లోలుడు అంటాం. సామగాన ప్రియుడు అంటాడు. అని మనం పిలుస్తాం. సామవేదం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అనాహత నాదంగా సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అనాహత నాదం అంటే ఆగనిది. పనస ప్రారంభిస్తే అది అయ్యేదాకా ఆపటానికి వీల్లేదు. ఘనాఘనంగా చెప్తూ వెళ్ళాలి. అయితే పాట మాత్రం ఒక మనిషి ఎంతకాలం వినగలడు? విన్న పాటలో నుంచి అర్థాన్ని వాడు ఎలా పొందగలడు? పొందలేడు గనుక దీనిని వచనం చేద్దాము అనుకున్నారు వ్యాసులవారు. దాంట్లో అన్నీ ఏరారని వచనానికి అనుగుణంగా ఉన్నవేవి, మాట్లాడుకోవటానికి వీలైనవేవి అని ఆయన ఏరి దానికి ఋగ్వేదము అని పేరు పెట్టారు. ఋక్ అంటే మాట. సంస్కృతంలో ఋక్ అంటే మాట. కరెక్ట్ మాటలన్నీ గనక ఉంటే దానికి ఋగ్వేదము అన్నారు. మరి సామవేదము అని ఎందుకన్నారు? సామగానమే పెట్టొచ్చు కదా అని అంటే ఇదంతా వేదము యొక్క మూలం, కాండం ఇదంతా కూడా. వేదము అంటే తెలియబడవలసినది అని అర్థం. తెలుసుకోవలసినది అని అర్థం. తెలియ తగినది అని అర్థం. కాబట్టి పాట ద్వారానైనా తెలుసుకో, నీ వల్ల కాకపోతే ఇదిగో మాట ద్వారానైనా తెలుసుకో.ఇది కాక పాట మాట అయిన తర్వాత ఏదన్నా చేస్తే విషయం బాగా తెలుస్తుందేమో అంటే వేళ ప్లే స్కూల్ విధానంలో లాగా బొమ్మ చూపించి బ్రహ్మను చూపించినట్టుగా అందుకనే ఆయన కర్మకాండ యజ్ఞ కాండ ప్రవేశపెట్టి దానికి యజుహు అంటే యజ్ఞము. యజుర్వేద భాగం చేసి మూడే మూడు వేదాలు. ఏవి? సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము. ఇవన్నీ కాగా పోగా కొన్ని మిగిలిపోయి ఉంటే సమయంలో అథర్వణుడు అనేటువంటి ఒక మహాముని వచ్చి "ఇవి కూడా ప్రపంచానికి వినియోగిస్తాయి గనుక వీటన్నింటినీ ఒకచోట గుద్ది గుచ్చుదాం" అన్నాడు. అప్పుడు వ్యాసులవారు "అది నీ పేర ప్రపంచంలో ప్రాచుర్యం పొందు గాక" అన్నాడు. కనుక అది అథర్వణ వేదం అయింది. నాలుగు. కనుక మనం వేదాలను త్రయీ విద్యగా, ఆత్మ విద్యగా, శ్రీ విద్యగా, బ్రహ్మ విద్యగా ఉపాసన చేస్తాం. అయితే వేదాలన్నీ బాగా చదువుకున్న వారికి, అర్థం చేసుకోగలిగిన మేధాశక్తి ఉన్నవారికి ప్రశ్నించకుండా ఇది ఇంతే అని చెప్పేది వేదం. ఇది ఇట్లా అని చెప్పేది ఉపనిషత్తు. ఇది ఇంతే అంటే ఇంక అడగటానికి అవకాశం లేదు. ఆయన ఇదే ఇంతే అంటున్న తర్వాత ఇంకేముంది? అట్లా కాదు ఉపనిషత్తులు ఇది ఇట్లా, విధంగా వెళ్ళాలి, మార్గంలో వెళ్ళాలి, ఆత్మజ్ఞానం అంటే ఇది, లోకజ్ఞానం అంటే ఇది అని విడమరచి చెప్పినటువంటిది. కనుక, ఉపనిషత్తులని వేద శిరోభాగం మీద శిఖర స్థాయిలో వేద శిరోమణి అన్నారు. వేదములకి శిరస్సు ఎక్కడ? అనంతం." అనంతో వై వేదః" అని కదా! కాబట్టి అనంతమైనటువంటి ఒక మహా స్వరూపం పైన శిఖర స్థాయిలో ఏదన్నా ఉన్నదా అంటే అది అంచము కాబట్టి వేదముల యొక్క అంతము వేదాంతం అయింది. వేదాంతం అంటే ఇంగ్లీషు వాడు చెప్పిన ఫిలాసఫీ కాదు. వేదముల చివరి కొస ఏదైతే ఉన్నదో ఉపనిషత్తు. అంటే వేదాలు ఎక్కడ ఆగుతాయో ఉపనిషత్తులు అక్కడ ప్రారంభం అవుతాయి అని. ఇది ఒక పెద్ద మాలలో రెండు కొసలు. వేదం ఒక కొస, ఉపనిషత్తు రెండవ కొస. రెండూ కలుపుకోగలిగితే ఒక భాగంగా సామవేదం చదవండి, పాడుకోండి. ఋగ్వేదంలో మాటలు వింటూ ఉండండి. యజుర్వేదంలో కర్మకాండ చేయండి. అంతే కాదు సుమా, రెండవ కొస కూడా ఆత్మతత్వ విచారణలోకి మీరు వెళ్ళాలి. ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఆత్మ, అనాత్మ అనేటువంటి రెండు వస్తువులు ఉన్నాయి గనుక ఆత్మ అంటే తర్వాత తెలుసుకుందాం. అనాత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే ప్రపంచం. ఆత్మ కానిది అనాత్మ. అనాత్మ ద్వారా, జగత్తు ద్వారా, జీవుడి ద్వారా, మేధ ద్వారా, హృదయం ద్వారా, విచారణ ద్వారా, మేధోమధనం ద్వారా, వీటన్నింటి ద్వారా నీలో ఉన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. It is a beautiful journey into the realms of spirituality. Where that is truth. ఫైనల్ గా సత్యం వైపు మనం వెళ్ళాలి గనుక సత్యాన్వేషణకు కావలసిన సాధన సంపత్తి అంతా పది ఉపనిషత్తులలో భగవత్పాదులు కథా కథనంగా ద్వైతాద్వైత మార్గంలో ద్వైతం చెప్తూ అంటే ప్రపంచం, నేను, నువ్వు, నేను, వారు, వీరు, మనందరం ఇదంతా ద్వైతం. "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అనేటువంటి ఒక భావనతో దాన్ని సమన్వయం చేస్తూ, ఇట్లా ద్వైతంలో రెండు వస్తువులని చూపిస్తూ, మళ్ళీ రెండూ ఒకటే అని చెప్తూ భగవత్పాదులు మనల్ని చిట్టచివరగా బృహత్ అరణ్యకమైనటువంటి ఒక ఉపనిషత్తులో మనలని అక్కడ వదిలేశారు. కాబట్టి జగత్తుని గురించి ఒక విచారణ చేయాలి. జగత్తు అర్థం కాకపోతే మనకు మనం అర్థం కాము. తర్వాత తర్వాత ఆత్మానాత్మ విచారణలో చివరి కొస దాకా వెళ్ళినప్పుడంతా ఒకటే అని తెలుస్తుంది. మొదటి రోజే తెలీదు. కాబట్టి జగత్తు కూడా ఆత్మ యొక్క ఒక స్వరూపమే. ఆత్మ కానిదంటూ ఏం లేదు. సకల చరాచరమైనటువంటి సృష్టి ఆత్మ యొక్క ఒక ఛాయ. ఆత్మ యొక్క మహా శక్తితో ప్రపంచం నడుస్తున్నది అనేటువంటి భావనని తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తులని తీవ్రమైన అధ్యయనం చేయాలి. ఇది కాలక్షేపానికి చెప్పుకునే ఉపన్యాస పరంపర కాకూడదు, కాదు. ఎందుకంటే దీనికి ఒక basis కావాలి. దీనిలో కథలుండవ్. ఉపనిషత్తు కథలు గాని ఉన్నాయి. అవి మనకు పెద్దగా ఉపయోగించవ్. ఒక దాని రససార సర్వస్వం ఏదైతే ఉన్నదో దానిని మనం జగత్తులో మనకున్నటువంటి అతి స్వల్పమైనటువంటి సమయంలో అంటే మానవుడు పుట్టి మానవుడు గిట్టే దాకా నూరు సంవత్సరాల ఆయు ప్రమాణం మనకిచ్చాడు. నిజానికి త్రేతాయుగం, ద్వాపర యుగం నాటికి నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం. మనం దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాం. ప్రలోభం చేత, లాలస చేత, ఆకర్షణ చేత, ఆహార, వ్యవహార విహారంలో దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్ల చేత వందేళ్ళకు తెచ్చుకుని శతమానం భవతి అనిపించుకున్నాం. అలాగే "జీవామ శరదమ్మమా" అని మళ్ళీ వేద వాక్యమే. నేను నూరు ఏళ్ళు బతకాలి అని ప్రతిరోజూ మనం కోరుకోవాలని అనుకోమన్నది వేదం. కాబట్టి ఇవన్నీ అనుకున్నా వందేళ్ళు అనుకుంటే మొదటి ఇరవై ఏళ్ళు తల్లి చాటునో, తండ్రి చాటునో గడుస్తుంది. చివరి ఇరవై ఏళ్ళు ఎవరికీ ఉపయోగం లేకుండా గడుస్తుంది. నలభై ఏళ్ళు అయిపోయినాయి. మిగిలిన అరవైలో సుమారు నలభై సంవత్సరాలు పొట్ట కోసం, కుటుంబం కోసం, ఇంకోటి దగ్గర ఉద్యోగం చేయటమో, వ్యాపారం చేయటమో దాంట్లో సమయం గడిచిపోతుంది. ఇక మిగిలింది ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాలు సగం ఆలోచనతో, విచారంతో, దుఃఖంతో, సమస్యలతో, ఆందోళనతో, ఆవేదనతో, ఆర్తితో కాలం చెల్లుబడి అయిపోతుంది. దీనిలోనే నిద్రా విభాగం ఉన్నది సగం. అంటే ఇరవై ఏళ్ళల్లో పదేళ్ళు నిద్రపోతాం మనం. కాబట్టి మనకి నిజంగా చేతికి వచ్చింది ఎంత అంటే కేవలం పట్టుమని పది సంవత్సరాలు కూడా లేదు. కనుకనేతంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంగం రోయనప్పుడే కురుల్ వెల్వెల్లా కానప్పుడే చింతెంపన్ బదని పదాజ్జములన్ శ్రీకళహస్తీశ్వరాణి దుర్జటి చిన్న ప్రాయంలోనే పసితనంలోనే మనం గనక దీనిలో ప్రవేశించినట్లయితే అధ్యాత్మ దివ్య జీవన విధానం మనకు అర్థమవుతుంది. దీనికి ఉదాహరణగా ఎనిమిదేళ్ల వయస్సులో శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారితో మాట్లాడాడు మనస్సు గురించి. అవి ముప్పై మూడు వేల శ్లోకాలు అది వశిష్ఠ గీత. అంటే మహాత్ములు అనబడ్డ వాళ్ళు, దేవతా మూర్తులు, అవతార మూర్తులు తొలి పదహారు సంవత్సరాల షోడశి రావటానికి ముందే జగత్తులో తమను తాము ప్రకటించుకున్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. భగవత్పాదులైతే కేవలం మూడు సంవత్సరాలకే సర్వ వేదాల సారాన్ని ఆయన పుట్టిట పెట్టారు. మూడు సంవత్సరాలు రాకుండా ఋగ్వేదాన్ని పరమాద్భుతంగా ప్రపంచంలో ఆయన సాటి చెప్పగలిగారు. అంటే వీళ్లంతా కూడా కాలకార్యానికి కారణం కోసం వస్తారని అనుకున్నామే! వాళ్ళకి జీవితం ఎంతో తెలుసు. అది ఎంత నిడుపాటిదో తెలుసు, ఎంత కురసదో అంటే ఎంత చిన్నదో తెలుసు. కానీ వచ్చి ఎన్నాళ్ళు జీవించామని కాక, జీవించినన్నాళ్ళు ఎట్లా ఉన్నామని ప్రశ్న వేసుకుని వాళ్ళ వాళ్ళ అవతార కార్యక్రమాన్ని నిర్దుష్టంగా, స్పష్టంగా, ప్రణాళికాబద్ధంగా, ప్రాపంచికమైన అల్ప భావనలకు దేనికి చోటు ఇవ్వక, ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి భావ పరిమళంతో వాళ్ళ ఆలోచనా రీతులు సాగి అవతారమూర్తులందరూ కూడా చేశారు. కనుక ఇక్కడ ఉపనిషత్తులు మనకి ప్రధానంగా చెప్పేటువంటిది ఏమిటి అంటే ప్రశ్నించు. ఇది ఇంతే కాదు, ఇది ఎట్లా అని నువ్వు అడగాలి, ఇది ఇట్లా అని గురువుగారు చెప్పాలి. ఇది ఇట్లా అని చెప్పేటువంటి గురువుగారు కేవలం పుస్తకంలో తెచ్చి నలుగురు ముందు చెప్తే ప్రయోజనం లేదన్నారు. తాను దానిని అనుభవించాలి. Become what you study అంటాడు కదా! అంటే మనం ఏం చదివామో అది కావాలి. రామాయణం చదివితే మనం రాముడు కావాలి. అలాగే భాగవతం చదివితే కృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క సర్వ లక్షణాలు మనకు ఆపాదింపబడాలి. అలాగే ఉపనిషత్తులు గనక మనం చదివినట్లయితే మనలో ఇంటెలిజెంట్ కోషెంట్ అనబడేటువంటి మేధాశక్తి పరమాద్భుతంగా సాగిపోతుంది. అది ఎంతవరకు వెళుతుందంటే చూస్తుండగానే విషయాలన్నీ గ్రహణానికి వస్తాయి. వెంట వెంటనే స్పురణకు వస్తాయి. ఇదంతా కూడా ఉపనిషత్ మంత్రాలు అంటారు వాటిని. ఎందుకని మననాత్రాయతే ఇతి మంత్రః. మాటలు అనగా అనగా అనగా వినగా వినగా అవి మంత్రాలై అవుతాయి కాబట్టి మంత్రాలు వేరే రాయబడలే. కానీ ఉపనిషత్-ఉపనిషన్ మంత్రాలు అన్నారు తర్వాత వాటిని ఉపనిషత్ వాణి అన్నారు. వాణి అంటే వాక్కు అని అర్థం. అంటే ఎవరు మాట్లాడగలిగినవారు? వాక్కు వారిలో నుంచి ఎక్కడ నుంచి వస్తున్నది? అంటే నాభి స్థానంలో మూలాధారంలో పుట్టి నెమ్మది నెమ్మదిగా స్వాధిష్ఠానానికి చేరుకొని అక్కడి నుంచి మణిపూరకానికి వెళ్లి మణిపూరకం నుంచి అనాహతం హృదయ స్థానం దాకా వచ్చి కంఠ స్థానమైనటువంటి విశుద్ధ చక్రం దాకా వచ్చినప్పుడు అది ఒక మాటగా రూపాంతరం చెంది ఒక ఆలోచన రూపాంతరం చెంది ఒక మాటగా ప్రపంచంలోకి రావాలి. అప్పుడు మాత్రమే దానికి వాక్కు అని పేరు. మనం మాట్లాడేది అంతా వాక్కు కాదు. వాక్కు అంటే అగ్ని స్వరూపం అది. జ్ఞానాగ్నిలో తప్తమై, దగ్ధమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, గంభీరమై, ఉదాత్తమై, ఉన్నతమై, స్పష్టమై, యదార్థమై ఏదైతే వచ్చుతుందో అది మాత్రమే వాక్కు అవుతుంది. ఎందుకంటే సత్య సాయి భగవానుడు వంటి అవతార మూర్తులు మాట్లాడితే వారు మాట్లాడరు. వారు మాట్లాడేది మంత్రమే. మనం మంత్రం చదివితే మన నోటది మాట అయిపోతుంది. వారు మాట మాట్లాడితే అది మంత్రం అయిపోతుంది. అంతే తేడా. జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా. కనుక వ్యాసులవారు ఇవన్నీ కూడా ఆలోచించి ఎట్లాగైతే ఉపనిషత్తులన్నీ కూడా ప్రపంచానికి ఇచ్చారో శంకర భగవత్పాదులు మాత్రం పది ఉపనిషత్తులని మనకు అందించి పది ఉపనిషత్తులు నీకు అధ్యయనం చేయటానికే సుమారు ఇరవై సంవత్సరాలు పడుతుంది. దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే నువ్వు ఆచరించాలి. ఆచరించాలి అంటే ముప్పై సంవత్సరాలు ఆచరించాలి. ముప్పై ప్లస్ ఇరవై యాభై ఏళ్లు వచ్చేప్పటికి ఆచరణలో నుంచి ఒక అనుభవం కలుగుతుంది. అనుభవంలో నుంచి ఒక అనుభూతి పుడుతుంది. అనుభూతిలో నుంచి విభూతి స్థాయికి మనం వెళ్ళాలి. అంటే ఉపనిషత్తులన్నీ కూడా మనకు మార్గోపదేశనం చేస్తాయి. నువ్ ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళు, అలా వెళితే ఇదవుతుంది, ఇట్లా వెళితే ఇదవుతుందని చెబుతుంది. అయితే దాంట్లో మధ్యలో అనేక కథలు, గాథలు, అనేక పాత్రలు అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ దీన్ని ఒక నవనీతంగా గనక భావించినట్లయితే ఎట్లాగైతే అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిదానవతి ఉపాసన అని మనకు మూడు ఉన్నాయి. అంగవతి ఉపాసన అంటే ఉపనిషత్తుల శ్లోకాలన్నీ, మాటలన్నీ హాయిగా నోట్లో పెట్టుకొని కూర్చోవటం. అంటే మంత్రాలన్నీ మనకు కూడా వచ్చు. దాని వల్ల ప్రయోజనం లేదు. దానిని అన్యవతి ఉపాసన చేయాలి. దానిని ఆలోచనా శక్తితో మేధోపరమైనటువంటి దివ్య ఆలోచనమే ఆలోచనాత్మకమైనటువంటి చింతనాత్మకమైన భూమికలో దాన్ని గనక విచారణ చేసినట్లయితే నెమ్మదిగా అన్యవతి ఊహించాలి. ఇమేజరీ అంటాం. దాన్ని ఊహించాలి. అబ్స్ట్రాక్ట్ కాబట్టి, కంటికి కనపడదు కాబట్టి, చెప్పే తాత్విక చింతన మామూలు కథ కాదు కాబట్టి. అది అన్యవతి ఉపాసన అన్నీ భావించి సంభావించి అనుకొని ఇది ఇట్లా అయి ఉండాలి అని మళ్ళీ అనుకొని అవునో కాదో తెలుసుకోవాలి అంటే తడగా నిదానవతి ఉపాసన పాలు బాగా కాయాలి, తోడు పెట్టాలి.మేగడ కట్టాలి, దాన్ని దాచిపెట్టాలి, దాన్ని చిలకాలి, దానిలో నుంచి వెన్న తీయాలి. వెన్న తీసిన తర్వాత కాచితే దానిలో నుంచి నెయ్యి ఎలా బయటకు వస్తుందో ముందు చూడండి. అంగవతి ఉపాసనలో పెద్ద సమస్య లేదు, ధారణ చేయొచ్చు. అన్యవతి ఉపాసన దాని కంటే కష్టమైనది, సమన్వయం చేసుకోవాలి. మూడవది, నిదానవతి ఉపాసన ఆచార్య స్థానీయులైనటువంటి వారు మాత్రమే సాధించగలిగినటువంటి దివ్యమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమే. ఎవరికి? ఎవరు ప్రయత్నమును ఆరంభిస్తారో తొందరగా, ఎవరు దానిని పట్టిన పట్టు పట్టకుండా తమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారో, ఏది విన్నారో, ఏది కన్నారో, ఏది చదివారో, దేనిని జీర్ణం చేసుకున్నారో దానినంతా తమ నిత్య జీవితంతో అనుసంధానం చేసుకోగలిగారో, జీవితం విసిరేటువంటి ప్రతి సవాలికి సమాధానాన్ని ఉపనిషత్తుల నుంచి పొందారో అంటే వాటిని ఆచరించి జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఉపనిషత్తులు నిత్యమూ గురు స్వరూపమై ఉంటాయి. కనుక, ఉపనిషత్తులన్నీ మనకి ఒక స్థాయిలో ఉపాధ్యాయ స్థాయి. రెండవ స్థాయిలో అధ్యాపక స్థాయి. మూడవ స్థాయిలో ఆచార్య స్థాయి. ఆచార్య స్థాయిలో ఆయన ఎక్కువ మాట్లాడరు. మౌనంగా కూర్చొని ఉంటారు. "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం" అని దక్షిణామూర్తి స్తోత్రంలో మనం ఎలా అనుకుంటామో ఆచార్య స్థానానికి వెళ్ళిన తర్వాత అంతేవాసిని ఇలా వెళ్లి ఇదంతా చదువుకో అని చెప్తారు. వాడు యాతన పడి నేర్చుకోవాలి, సంపాదన సంపాదించాలి, జ్ఞానాన్ని సమన్వయం చేయాలి. తాను పొందిన దాన్ని మళ్ళీ ఆచార్యుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. చేతను నేర్చుకున్నది కరెక్టేనని ఆయన certify చేయాలి. అప్పుడు మాత్రమే నిదానవతి ఉపాసనా మార్గంలోకి మనం వస్తాం గనుక, ఉపనిషత్తు అనేటువంటి ప్రస్థానత్రయంలో శిరోభాగమైనటువంటి, అలాగే వేదాలలో శిరోరత్నమైనటువంటి ఉపనిషత్తులలో నుంచి పుట్టినదే నిజానికి యోగవాసిష్టం. యోగవాసిష్టం లో నుంచి ఉపనిషత్తులలో నుంచి పుట్టిందే మళ్ళీ భగవద్గీత. కాబట్టి మూడింటికీ రకమైన భేదం లేదు. చెప్పటంలో తేడా. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" The truth is one but it's told differently by the wise. ఉపనిషత్తులు అలా చెప్పబడ్డాయి. మహర్షులు చెప్పారు. ఉపనిషత్తులకు వ్యాఖ్యానం భగవత్పాదులు చేశారు. తర్వాత అనేకమైనటువంటి చదువుకున్నటువంటి వారు, విజ్ఞులైనటువంటి వారు, ప్రాజ్ఞులైనటువంటి వారు, జ్ఞాన సాధన చేసిన వారు, జ్ఞానంలో తాము పొందినటువంటి ఒక దివ్యానుభూతులను ప్రపంచానికి ఇచ్చినటువంటి వారు, వీరందరూ కలిసి ప్రపంచానికి ఉపనిషద్ భావనని అలవాటు చేశారు గనుక ఉపనిషత్తులు ఇవాళ తరం, నేను గటిం-ఘటించిన తరానికి తొంబై ఏళ్ళు పైబడిన వాడికి ఉపనిషత్తు ఉపయోగపడుతుందా అంటే శ్రవణ, మనన, నిధిధ్యాసములు మూడు కూడా పాతంజలిక యోగశాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటివి. అది వాడు ఎనిమిది ఏ- ఎనిమిదేళ్ళ student ఆ, ఎనభై ఏళ్ళ student సంబంధం లేదు. శ్రవణము ప్రధమమైనటువంటిది. మొట్టమొదట వినాలి. వినటానికి మనస్సుని చిత్తైకాగ్ర స్థితిలో నిలబెట్టుకోవాలి. మనస్సుని అనుసంధానం చేయాలి. ఎందుకంటే అన-అనటము అనేటువంటిది ఎంత యజ్ఞమో, వినటము కూడా అంతే యజ్ఞం. అనేవాడు ఎంత తెలివితేటలు ఉన్నవాడో, వినేవాడికి కూడా అంతే తెలివిటే-తేటలు ఉంటేనే వాడు గ్రహించగలడు. కాబట్టి స్వస్వామి సంబంధతః అంటారు భగవత్పాదులు. స్వస్వామి ఎవరంటే ఆత్మానుసంధానం-తత్వానుసంధానం చేసిన వారు, ఆత్మానుసంధాన యోగంలో నిలకడ చెందినటువంటి వారు, వీరందరూ కూడా ఉపనిషత్తులు చదవాలి. ఇక్కడ మూడు విషయాలు మనం ఇవాళ మాట్లాడుకోవాలి. ఒకటి, ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి ఉపనిషత్తులు గనక చెప్తే లాభం ఏమిటి? ఇవాళ consumerism ప్రపంచాన్ని ముంచెత్తింది. ప్రతి దానిని angle లోనే మనం చెప్పుకోవలసిన ఒక విపరీత పరిణామం ఏర్పడింది. అది మంచా చెడా కాలం నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా కాలంలో ఉన్నటువంటి అనేక స్వరూపాలు. ఆ-ఆ గతించిన కాలం మంచిది, నడుస్తున్నది చెడ్డది, రాబోయేది బంగారం అనటానికి వీల్లేదు. ఎందుకనంటే కాలము బహువేషధారిణి. అనేక రూపాలలో, అనేకమైనటువంటి స్థాయిలలో, అనేక శక్తులతో మనల్ని శాసిస్తూ వచ్చి ప్రపంచాన్ని అంటే జగత్తుని మరం మత్తు చేస్తుంది గనుక "కాలాయ నమః, కాలాతీతాయ నమః" అని కూడా ఉన్నది. "కాలాయ నమః" అంటే సగుణం. "కాలాతీతాయ నమః" అంటే నిర్గుణం. సగుణ నిర్గుణమైనటువంటి అంటే It is a journey between the form and formless. రెండింటిని అర్థం చేసుకోగలిగినట్లయితే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి గనక అది ఉపనిషత్తులు చక్కగా వాడికి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో చెప్పగలిగితే, వాడి మిగతా తొంభై రెండు సంవత్సరాలు ఒక గుణాత్మకమైనటువంటి ఋషిత్వంతో జీవితాన్ని కొనసాగిస్తాడు. వాడు తొంభైవ ఏట గనక ఉపనిషత్తులు మొదలు పెడితే లాభం ఏమిటండి ఇంక పదేళ్లే కదా ఆయన ఉండేది అంటే, పదేళ్ళైనా ఉండబోతున్నాడుగా. పదేళ్ళైనా చెవిన వినబడుతున్నాయి కదా మాటలు. ఉపని-- ఈశావాస్యంలో ఇది ఉంది, కేనోపనిషత్తులో ఇది ఉంది, ఫలానా దాంట్లో ఇది ఉందని ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో, గతించినది గతించింది, అయిపోయింది అది. కానీ పది సంవత్సరాలలో దేనిని శ్రవణం చేస్తాడో అంటే దేనిని వింటాడో దానిని మననం చేసుకుంటూ ఉంటాడు. నెమరువేసుకుంటూ ఉంటాడు. నిన్న ఉపనిషత్తులో మాటలు చెప్పారు, వీళ్ళు నిన్న ఇవి చెప్పారు, ఇవి చెప్పారు అనుకుంటూ అనుకుంటూ ఉండగా నెమ్మదిగా మాటలు మలుగుతుండై మౌనం వెలుగుతుంది. అయి నిధిధ్యాసనంలోకి వెళతాడు. తాను దేనిని విన్నాడో, తొంభై సంవత్సరాలు తన జీవితాన్ని ఎట్లా గడిపి వచ్చాడోతాను ఏమి పొందాడో, ఏమి పోగొట్టుకున్నాడో, ఏమి చేయాలని కలలు కన్నాడో, ఏమి చేయలేక ఆగిపోయినాడో, ఏమి చేజేతులా పోగొట్టుకున్నాడో, మణిమాణిక్యాలను పోగొట్టుకున్నాడో, అక్కరలేని గులకరాళ్లను ఇంటికి తెచ్చుకున్నాడో, ఇవన్నీ సింహావలోకనం చేసుకున్నప్పుడు ఉపనిషత్తులు ఉపశమనాన్నిస్తాయి. అయిందేదో అయింది. నువ్వు నీ చివరి శ్వాస వరకు ఉపనిషత్తులు విన్నావు కదా! వాటిని మననం చేసుకుంటూ ఉండు అన్నట్లయితే వాడికి శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. పర్వాలేదు తొంభై ఏళ్ల జీవితమంతా వృధా అయిపోయినా చివరి పదేళ్లు అక్కడికి వచ్చినాయి కదా! నన్ను నేను ఎరుగు ఎరుకలోకి ప్రస్థానం చేయటానికి ఉపనిషత్తులు నాకు సహాయపడ్డాయి కదా అని మన తాత వంటి ఒక తొంభై ఏళ్ల వయసున్నవాడు ఆయన ఆనందపడతాడు. సరే బాలుడు సరే అనుభవించడానికి సమయం ఉంది. వృద్ధుడు సరే అనుభవించడానికి సమయం లేదు. మరి మధ్యలో ఉన్న వాడి సంగతి ఏమిటి? ఎనిమిదేళ్ల నుంచి తొంభై ఏళ్ల మధ్యనే అసలు ఉన్నదంతా నా నడినడి కాలము నాటకం. మధ్యలోదంతా డ్రామా గ్రేట్ ట్రాజిక్ డ్రామా వేర్ వి హ్యావ్ టు ప్లే అవర్ రోల్. మన పాత్ర మనం నిర్దిష్టంగా మనంతట మనం మనకు కావలసినట్లుగా జీవించటానికి ప్రపంచం అవకాశం ఇవ్వదు. కానీ ఉపనిషత్తులు గనక చదువుకున్నట్లయితే, నువ్వు ఉద్యోగస్తుడివైనా, వ్యాపారస్తుడివైనా, అసలు పనీ లేనివాడివైనా, నీవు వ్యవసాయదారుడివైనా ఉపనిషత్తుల యొక్క సారము నీకు అర్థమైనట్లయితే, నువ్వు ఎట్లా జీవిస్తావంటే, జీవితం సవాలు విసరనివ్వండి దానిలో యదార్థం ఏమిటో చూస్తావు. వాట్ ఇస్ ట్రూత్ బిహైండ్? కష్టం నాకెందుకు వచ్చింది? ఇంత ఆనందం నాకెందుకు వస్తున్నది? అసలు ఎక్కడా రకమైన ఒడుదుడుకులు లేని జీవితం నాకు ఎలా సంభవించింది? కానీ ఎంత కష్టపడ్డా అన్నీ ఒడుదుడుకులే. అంతా ఎదురీతే దీనికి కారణం ఏమిటి? చూసారా! ప్రతి దానికి సుఖానికో కారణం ఉంది, దుఃఖానికో కారణం ఉంది, ఆనందానికో కారణం ఉంది. కానీ కారణం తెలియకుండా అన్నీ అనుభవిస్తాం. మనకు తెలుసా? దుఃఖం వచ్చింది కారణం తెలియదు మనకి. మనకే ఎందుకు వచ్చింది అనుకుంటాం. మనకు కూడా రావచ్చు అనుకోము. ఉపనిషత్తులు చదివితే రెండోది వస్తుంది. అంటే మనం కూడా వి ఆర్ నో ఎక్సెప్షన్. మనకు కూడా కష్టాలు రావచ్చు. మనకు కూడా ఇబ్బందులు కలగవచ్చు. మరి ఇబ్బందులు కలిగితే ఉపనిషత్తులు రకంగా సహాయపడతాయి అంటే, వచ్చిన ఇబ్బందితో నువ్వు ఎట్లా బతకబోతున్నావో మనకు నిర్ణయిస్తుంది. మనకు ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ఒక కష్టం కర్మనిష్ఠగా ఎలా మారుతుందో, అవి రూపాంతరీకరణం చేస్తాయి. కాబట్టి ఉపనిషత్తులు కేవలం మంత్రాలు మాత్రమే కావు. ఇవాళ మనం చెప్పేటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మనం పేరు చెప్పి మనకు అవి ఏవీ లేకుండా ఏదో బతుకు తెరువు కోసం ఇవన్నీ చేస్తున్నాం గానీ, ఉపనిషత్తులను మించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఇంక ఎక్కడా దొరకవు. దానిలో నుంచి వచ్చినటువంటి భగవద్గీత ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్ కి, మేనేజ్మెంట్ కి, ఎథిక్స్ ఇన్ మేనేజ్మెంట్ కి, మా ఎట్లాగైతే భగవద్గీతను సమన్వయం చేస్తూ అనేకమైనటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయో ముందు దానికంటే ముందు ఉపనిషత్తులు అధ్యయనం చేయండి. ఉపనిషత్తులు ఎవరు అధ్యయనం చేస్తారో, ఎవరికి దానికి ఒక సాధికారము లభిస్తుందో వారికి భగవద్గీత అప్పుడు అర్థమవుతుంది. ముందు భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన తెలియదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ దానిని అర్జునుడు అనేటువంటి ఒక మానవ సాధకుడి ద్వారా కలియుగానికి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఉపనిషత్తులు కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలా. సార్వకాలికమై, విశ్వజనీనమై, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సమస్తమైనటువంటి మనుష్య జాతికి కూడా ఒక సంస్కార ధారణి, ఒక ఆధ్యాత్మిక వికాసాన్ని, ఒక సమష్టి జీవితాన్ని, ఒక సాంఘిక, నైతిక, భౌతిక, లౌకిక, పారలౌకికమైనటువంటి దివ్య జీవన విధానానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక పటం కట్టారు. దే ఫ్రేమ్డ్ ఎన్ ఎంటైర్ థింగ్ ఇంటూ వన్ అండ్ సెడ్ దిస్ ఇస్ దిస్. కాబట్టి ఉపనిషత్తులు మంత్రాలు కాదు, భయపడక్కర్లేదు. నిజమే రెండు మూడు వేల పేజీలుగాక మాట్లాడొచ్చు ఇందాక అన్నట్లుగా, విస్తృతంగా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడైతే విస్తృతంగా మాట్లాడుతామో సత్యం మరుగున పడిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడుతామో చెప్పవలసింది వెనక్కి వెళ్ళిపోతుంది గనుక ఉపనిషత్తులు మనకి చాలా చాలా నేర్పుతాయి. నేర్పటంలో ఒకటి మనోనిగ్రహం నేర్పుతుంది. రెండవది ఆత్మ సంయమనాన్ని నేర్పుతుంది. మనకో ఆత్మ ఉన్నదని, దానికి ఒక ప్రజ్ఞ ఉన్నదని, ప్రజ్ఞని ఎట్లా వాడుకోవాలో, ఏయే స్థాయిలలో వాడుకోవాలో మనకు నేర్పుతుంది. అట్లాగే నిజానికి ఇవాళ మనందరం కూడా మానవ జన్మ ఎత్తి వచ్చాం. పశువుకి మరణాన్ని గురించిన ఆలోచన లేదు. కనుక అది హాయి. దానికి ప్రాణం సుఖం. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మానవుడికి మాత్రమే మరణాన్ని గురించిన ఆలోచన ఉన్నది. ఆలోచన ఉన్నది గనుకనే ఆవేదన ఉన్నది. ఆవేదన ఉన్నది గనుకనే అనిశ్చితి ఉన్నది. అనిశ్చితి ఉన్నది గనుకనే ఆర్తి ఉన్నది. ఆర్తి ఉన్నది గనుకనే దుఃఖం ఉన్నది. దుఃఖం ఉన్నది గనుకనే శాంతి లేకుండా పోయింది. నేను ఎప్పుడు పోతానో, ఎట్లా పోతానో, ఏమైపోతానో, ఇవాళ ప్రపంచం ఎదుర్కుంటున్న పెను సవాలు నేను రేపు ఎలా బతుకుతానని ఎవ్వడు ఆలోచించటంలే. నేను ఎట్లా పోతానో, కారణంతో పోతానో అనేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కుంటున్నాం. కానీ మానవజాతి జగత్తు మీదికి వచ్చినప్పటినుంచి ప్రశ్నని ఎదుర్కుంటూనే ఉంది. రెండవది మనుష్యజాతికి అంటే మనందరికీ రెండు విషయాలుంటాయి. ఇక్కడ ఎక్కువ కాలం జీవించాలి అని కోరికుటుంది. ఇది సత్యం. మనం ఉపయోగమా ప్రపంచానికి, ఉపయోగం లేదా, మనం ఎవన్నా మంచివాళ్ళమా, చెడ్డవాళ్ళమా అది అనవసరం. మనం దేహంలో చాలా కాలం ఉండాలి ఇది ఆశ.రెండవది పోతామేమో ఇది దుఃఖం చూశారా పోతామని తెలుసు ఎందుకంటే ఎవరు బ్రతికారు నూట యాభైలని వంద Maximum మరి లోగా మనం ఏం చేయాలి సంసారం చేయాలా ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా పిల్లల్ని కనాల వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా అన్నీ చేయాలి స్పష్టతతో చేయాలి అది యాదార్ధికంగా చేయాలి దాన్నే మన వాళ్ళు Absolute reality జీవితాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి అందుకే భగవత్పాదులు ఉపనిషద్ భావనని సామాజిక భావనతో సమన్వయం చేశారు సమాజం అంటే అందులో వ్యక్తి ప్రధానుడు గనుక ప్రధానమైనటువంటి వ్యక్తి ఒక కుటుంబంలో గృహస్తు గనుక ఉపనిషత్తులు గురు ముఖతః నేర్చుకు గురువు అంటే ఏం లేదు అది ఇంతకు ముందే చదివి దాన్ని అధ్యయనం చేసి కష్ట చెప్పగలిగిన వాడు ఆయన ఎదురుగా కూర్చొని గనుక తాను సాధన చేస్తూ తాను చక్కగా స్వాధ్యాయం చేస్తూ తాను కూడా కొంత పరిశ్రమించి శ్రమించి గురువు దగ్గరకు గనుక వెళ్ళినట్లయితే ఆయన పరిష్కార మార్గాలన్నీ చెప్తూ ఇది ఇట్లా కాదు అట్లా నువ్వు అనుకున్నది ఇది కాదని వివరణ ఇస్తూ తీసుకుని వెళతాడు గనుక గురు ముఖత్-ముఖతః అంటే అది అర్థం. గురువు అంటే కాషాయం కట్టినవాడు గడ్డ మీసాలు పెంచిన వాడు గురువు కాదు ఎవడు జ్ఞానార్ద్రి అయి ఉన్నాడో వాడికి తన జ్ఞానాన్ని ధారపోయగలిగిన వాడు నిరపేక్షంగా అవ్యాజంగా కారణం ఏం లేదు ఎందుకు జ్ఞానం అందరికీ పంచి పెడుతున్నావ్ అంటే కారణం ఏం లేదంటాడు అవ్యాజ కరుణామూర్తులు అవుతారు అటువంటి గురు స్వరూపాలు వాళ్ళకి చెప్పటమే వాళ్ళకి ఉన్నటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత కాబట్టి భౌతిక జీవితంలో సమన్వయ స్థితి కొరవడిన కారణంగా జీవితమంతా అల్లకల్లోలం అయిపోతున్నది గనుక దీనికి సమాధానం ఎక్కడ దొరకాలి అంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి. ఇక రెండవది సమాజం ఒక వ్యక్తి కాదు అనేకమంది వ్యక్తులు కలిస్తే ఒక సమాజం ఏర్పడుతున్నది గనుక దీనిలో భిన్న భిన్న ప్రవృత్తులు కలిగిన వారు అవి మానసిక ప్రవృత్తులు అలాగే భిన్న భిన్నమైనటువంటి స్థితులు గతులు ఇవన్నీ కూడా అంతా భిన్నమే కానీ అభిన్నమైనటువంటి స్థాయిలో ఒక పండితుడు పామరుడిని గనుక ఆదరించగలిగితే అది ఉపనిషత్తు చదివిన ఫలితం అవుతుంది ఉపనిషత్తు చదివితే పండితుడు కూడా పామరుడిని గౌరవిస్తాడు పామరుడికి నమస్కరిస్తాడు ఎందుకంటే పామరుడికి భగవంతుడి రక్ష ఉంది పండితుడికి మాత్రం నిత్యం పరీక్షే కాబట్టి వీడు పరీక్షలో రోజూ pass అవ్వాలి పామరుడికి అది లేదు ఇంకా బాగా చదవాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఉండాలి వీటన్నింటికంటే ముందు సంసారంలో ఒక భార్య ఒక భర్త మహాద్భుతమైనటువంటి భారతీయమైన దాంపత్య ధర్మంలో మొదటి నుంచి చివరి వరకు మన వానప్రస్థాశ్రమంలో వాళ్ళు స్నేహితులుగా ఉంటారు అని అంటాం ఉండటం ఏం చేస్తారు వాళ్ళకి వేరే దారి లేదు కదా ఇంద్రియాలు అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఇక కాలం కాస్త మిగిలి ఉంది అది complete చేయాలి వాళ్ళని అట్లా పక్కన పెట్టినట్లయితే చిన్నప్పటినుండి వివాహం అయినప్పటినుంచి గనుక వేదాంత భూమికలోకి వెళితే వేదన లేని జీవితం ఏర్పడుతుంది కాబట్టి వేదన లేని ఒకవేళ వేదన ఉన్నా దానికి కారణం తెలుసుకోగలిగిన ఒక శక్తి మనకు ఉపనిషత్తులు ఇస్తాయి గనుక సమాజం సుహృద్భావంతో మనం అందుకేనే సుహృద్ అంటాం ఇవన్నీ కొన్ని కొన్ని అందమైనటువంటి సంస్కృత పదాలు వాటన్నింటినీ మనం ఏరి పట్టుకోవాలి అవి మనం కావాలి మనం కావటం కోసమే మహాత్ములంతా పదాలను సృష్టించారు వీటిని అర్థం చేసుకుంటూ గనుక మనం వెళ్లగలిగినట్లయితే ఉపనిషత్తులన్నీ కూడా మనకి విజ్ఞానాన్ని బోధిస్తాయి జ్ఞానాన్ని బోధిస్తాయి లోకంలో ఎలా బతకాలో చెప్తాయి అసలు మన శరీరం ఎలా పుట్టిందో చెప్తాయి శ్వేతాశ్వతర ఉపనిషత్తు నిండా ఉన్నాయి మనం అవన్నీ చెప్పుకుంటాం కాబట్టి శరీరం వచ్చింది ఎలా వచ్చింది అంటే I am born to my parents అని మనం కథ మొదలు పెడతాం అది నిజమే కానీ నువ్వసలు ఎలా పుట్టావ్ నీ శరీరంలో ఎముకలు మాంసము మజ్జ ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి వీటి మూలాలు ఏమిటి వీటి ధాతువులు ఏమిటి పుట్టి పెరిగి పెరిగి పెరిగి ఎందుకని ఉరుగుతున్నాయి షడూర్నములు షడ్వికారములు షడ్వర్గములతో కూడిన దేహం ఒక్కసారి పతనమైపోతున్నదే ఒక్కసారి ఏమీ లేకుండా అయిపోతున్నదే శ్వాస యొక్క ప్రయాణం ఎక్కడ ఉన్నది శ్వాస అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి ప్రాణం అంటే ఏమిటి చైతన్యం అంటే ఏమిటి వీటన్నింటినీ కూడా బహు విస్తృతంగా విచారణ చేసినటువంటివి ఉపనిషత్తులు అంటే ఇవాళ మనం చెప్పే pure science అంటున్నామే అవే ఉపనిషత్తులు వైజ్ఞానిక భూమికలు చదవండి అద్భుతం power of physics చదవండి ఉపనిషత్తుల యొక్క సారమే మనం పుస్తకం కొంటాం ఉపనిషత్తు పది రూపాయలు పెట్టుకొనం ఎందుకంటే సంస్కృతంలో ఉందండి మాకు అర్థం కాలేదండి వాడు ఇంగ్లీష్ లో రాశాడండి బాగుందండి అంటాం ఎక్కడి నుంచి బాగా వచ్చింది మూలాలు ఇక్కడ ఉన్నాయి మూలల్లోకి వెళ్ళాలి మన ఉపనిషత్తులు మన మహర్షులు రకమైనటువంటి స్వార్థం లేకుండా జగత్తుకి ఇవాళ మనం సుమారుగా రెండు యుగాలు అయిపోయి ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు సంవత్సరాల కలియుగంలో మనం జీవిస్తూ ఇంకా ఉపనిషత్తులు ఎక్కడున్నాయి అంటే ఏమిటి అనుకుంటున్నామే అది వాటి గొప్పతనం వాటి వైపు మన మనస్సు మరలుతున్నది అని దాని అర్థం అంటే నిత్య నైమిత్తికమైనటువంటి జీవితం మన సంపాదన మన ఐశ్వర్యం మన ఆనందాలు మనం పొందుతున్న సుఖాలు ఇవేవీ మనకు ఆనందాన్ని మిగల్చటం లేదు ఒకవేళ ఇచ్చినా అవి ఎక్కువ కాలం ఉండటం లేదు గనుక నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆనంద తారక స్థితిని జీవుడు అనుభవించాలి అంటే ఉపనిషత్తులు చదవాలి ఉపనిషత్తులు చదవటం కాదు అధ్యయనం చేయాలి అధ్యయనం చేయటం కాదు ఆచరించాలి ఆచరించడం మాత్రమే కాదు అనుభవించాలి అనుభవించి అనుభూతిని పొందాలి కడగా నేను అనే నేను నేను కాదుఈ శరీరం నేను కాదు. పేరుతో పిలవబడుతున్న నేను, నేను కాదు. నేను నేనైనా నేను నాలో ఉన్నా అని పట్టుకోవటానికి మనల్ని బృహదారణ్యక ఉపనిషత్తు ద్వా-దాకా నడిపించేటువంటి బృహత్తరమైనటువంటి విషయాలన్నీ కూడా ఉపనిషత్తులలో ఉన్నాయి. రామావతారం, కృష్ణావతారం మనకు ఒక దివ్య గాథలవి. మనం చూడలే, చూశామేమో గుర్తు లేదు. మరపు అయిపోయింది అది. కానీ మనకి రాముడు పూర్ణ పురుషుడు. కృష్ణ పరమాత్మ సనాతన ధర్మ స్వరూపుడు. "రామో విగ్రహవాన్ ధర్మః" ముందే చెప్పాను. ధర్మాన్ని గురించి మాట్లాడండి అంటే రామ గాథ గనక చదువుకోగలిగినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఎట్లా ఉంది రాముడి యొక్క కథ? రాముడంటే దశరథుడికి పుట్టాడు, జానకిని వివాహం ఆడాడు, అరణ్యాలకు వెళ్ళాడు, ఆంజనేయుడితో మైత్రి నెరిపాడు, రావణ సంహారం చేశాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇదేనా? ఇదేనా ఆయన అయనం? కాదు. "రామో విగ్రహవాన్ ధర్మః" ధర్మం అనేది గనక ఒక సాకారమై రూపం తీసుకుంటే అది రాముడు అని చెప్పారు. రెండు యుగాలు దాటిపోయింది. అంటే మధ్యలో ద్వాపర యుగం అయిపోయింది. "కృష్ణం ధర్మం సనాతనం" ధర్మాన్ని శ్రీరామచంద్రుడు జగత్తులో ఆచరించి చూపించాడో, తన నిత్య జీవితాన్ని పణం పెట్టాడో, అన్ని స్పర్ధలకి, అన్ని విషయాలకి కూడా తాను నిలబడ్డాడో, అనేక కష్ట నిష్ఠూరాలన్నింటినీ అను-మానవుడి వలె అనుభవించాడో అది ధర్మ స్వరూపం. అయితే ధర్మం ఎప్పటిది? త్రేతాయుగం కంటే ముందు లేదా అంటే "కృష్ణం ధర్మం సనాతనం" శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ధర్మము సనాతనమైనది. అందుకనే ఇవాళ సత్యసాయి భగవానుడు నిజానికి మన సనాతన సారథికి పేరు పెట్టబడలా, ఇంకేదో పేరు పెట్టారు. కానీ స్వామి దాన్ని ఇంటూ పెట్టారు, కొట్టేసి సనాతన సారథి అని రాశారు. అంటే సనాతనమైన ఒక ధర్మము కృష్ణ స్వరూపంగా, లీలా కాండగా, మహిమా కాండగా, ప్రణ చాతుర్యంగా, పరమాద్భుతమైన చమత్కార సంస్కార అనేటువంటి పరా-పరోపకార సాక్షాత్కార విభాగింగా సత్యసాయి భగవానుడు ఒక అద్భుతమైన canvas మీద మానవజాతి ఈవేళ అర్థం చేసుకునే రీతిలో ఉపనిషద్వాహిని అనేటువంటి దానిని రచించారు. అయితే ఆనాడు స్వామి తనకు ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి, సమయంలో ఉన్నటువంటి శిష్ట వ్యావహారిక భాషలో రాశారు గనుక అది కాస్తం తెలుగు అసలే రావటం లేదు. కాస్తో కూస్తో వచ్చినా పాత తెలుగు అర్థం కాదు గనుక వాటన్నింటినీ కూడా ఇవాళ మనం సరళసుందరమైనటువంటి తెలుగులో ఉపనిషద్వాహిని స్వరూపంగా మనం విచారణ చేసుకోవాలి. అసలు ఉపనిషత్తులు స్థూలంగా రెండు principles అంటే రెండు సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఒకటి ఏమిటంటే "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే" అంటే ఏం లేదు కంటికి కనపడని ఈశ్వరుడు, ఎప్పటికైనా కనుక్కోవలసిన ఆత్మ, రెండూ గనక రూపం తీసుకుంటే వచ్చే గురువు, ముడు ఒకటే. కాసేపు ఈశ్వరుడన్నాం కంటికి కనపడలేదు కాబట్టి, ఎప్పటికైనా కనుక్కోవాలి అన్నాం దానికి ఆత్మ అని పేరు పెట్టాం. కానీ గురువుగారు ఎదురుగా నిల్చున్నారు. నిల్చొని కనపడుతున్నారు. కాబట్టి ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా ఒకటే. ఒకటే అని అంటున్నారు గానీ అంటుండగానే ఆయన ఏమన్నారంటే "మూర్తి భేద విభాగిణే" మూర్తి అంటే ఉపాసి, మూర్తి అంటే బొమ్మ, మూర్తి అంటే శరీరం. ఈశ్వరుడి శరీరం మనం అనుభవించలేం. అది వెలుగు, పెను వెలుగు. ఆత్మ అసలు ఏమీ లేకుండా ఉన్నది. ఏమీ లేదా అంటే అంతా తానై ఉన్నది. మరి ఏమీ క-కంటికి కనపడనిది, అంతా తానై ఉన్నది, రెండూ కలిపితే అది గురు స్వరూపం కాబట్టి "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే". ఇది ముందు మనం ఉపోధ్యాసంలో ఉపనిషత్తుల యొక్క మూల స్వరూప స్వభావ సగుణాలు గనక మనం తెలియకుండాము లోపలికి దూకితే ఈత రాణి వాడు సముద్రంలో దూకినట్టు అయిపోతుంది. గట్టు కాదు ఇక్కడ గట్టు దగ్గరే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈశ్వరుడు, గురువు, ఆత్మ దీని మీద ఒక్కొక్క దాని మీద మూడు వేల పేజీలు మనం రాయొచ్చు. ఏం ప్రయోజనం? ఈశ్వరుడు కనపడడు. ఈశ్వరుడు అంటే నశ్వరుడు. ఈశ్వరుడు అంటే చావు పుట్టుకలు లేనివాడు. ఆది మధ్యాంత రహితుడు. నిత్య సచ్చిదానంద స్వరూపుడు. ఎవరో అతడు ఈశ్వరుడు అయినాడు. "ఈశ్వరః సర్వభూతానాం" సర్వభూతముల యందు ఈశ్వరుడున్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ నుండి శివుడి వరకు ఉన్నదంతా ఈశ్వరుడే. చైతన్యం నాలో ఉన్నదో, చైతన్యం అవతార మూర్తిలో ఉన్నదో, చైతన్యం చీమలో, దోమలో, శివకేశవులలో ఉన్నారో జాగరాజ స్వామి వారు. కాబట్టి సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర తత్వము నశ్వరమైనం ఇప్పుడు మనం ఉన్నాం. అదేంటి? మనం పోతాం కదా, మనుషులు చాలామంది పోయారు కదా అంటే, ఏది పోతున్నది? దేహం పోతున్నది. దేహము పతాళం అవుతున్నది. కానీ దేహంలో ఉన్నటువంటి నిత్య నిరంజనమైనటువంటి ఒక ఆత్మ అఖండమై, చిద్ఘనమై, నిత్యమై, అవ్యయమై, అచ్యుతమై, శాశ్వతమై, సుబోధకమై, పెను వెలుగై విరాజిల్లుతున్నది గనుక దేహాన్ని మార్చుకుంటున్నది. ఘటం పోతున్నది. ఇంకో ఘటంలో, ఘటం అంటే కుండ. కుండ వదులుతోంది, రెండో కుండలోకి వెళ్తోంది. పొద్దున్న మనం ఒక బట్టలు ఒక dress వేసుకుని సాయంకాలం కాగానే ఇంకో dress మార్చుకున్నట్టుగా దేహాలు మారిపోతూ ఉన్నాయి. అందుకనే భగవాన్ రమణ మహర్షి మరణం అంటే మార్పే, దాని గురించి పెద్దగా ఆలోచించకండి అన్నారు. నిజమే. మార్పే It's a simple change. సత్యసాయి భగవానుడు దాన్ని It's a simple transition అన్నారు. అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళటమే దానికే మరణం, దాని గురించి ఎంత ఆలోచన ఎందుకన్నారు స్వామి. "దేహను పంచభౌతికము కూలక తప్పదప్పుడున్ దేహిని రామయ్యుండు గణుతింపగా దేహియే దేవదేవుడవ్" సత్యసాయి భగవానుడు చెప్పిన పద్యమిది.దేహి నీ యందున్నాడు దేహము నీవై యున్నావు దేహము లోపల దేహి ఉన్నాడు. నీలో ఉన్నటువంటి దేహి- కనుక నిరంతరమైనటువంటి నిత్య సత్య శాశ్వతానంద అనుభూతిని పొందాలి అంటే ఈశ్వరుడు తెలియాలి, గురువు తెలియాలి అలాగే ఆత్మను గురించి కూడా తెలియాలి. ఇక కడగా, చివరగా జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒక్కటే. మూడు మూడు ఉపాధులతో, స్వరూపాలతో ఉన్నది గనుక జీవుడు అంటే మనం, జగత్తు ప్రపంచం, దీన్ని నడిపిస్తున్నటువంటి జగదీశ్వరుడు లేదా జగన్నాయకుడు, లోకేశ్వరుడు ముగ్గురూ కూడా ఒక్కటే అని ప్రతిపాదన చేసి దాన్ని నిరూపణ చేస్తూ వెళుతుంది. మరణం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? మనం ఎలా పుట్టాం? మన పుట్టుకకు కారణం ఏమిటి? పుట్టిన తర్వాత ఏం చేయాలి? దేన్ని సాధించాలి? సాధించిన దాన్ని మళ్ళీ జగత్తుకి ఎట్లా మనం అందించాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి, ప్రబోధాత్మకమైనటువంటి విచార సారకే ఉపనిషత్తు అని పేరు పెడితే. సత్య సాయి భగవానుడు దానిని ఉపనిషద్వాహిని స్వరూపంగా జగత్తుకి అందించాడు. వాటిని మనం చక్కగా అర్థం చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ హిమాయత్ నగర్ సత్య సాయి సేవా సమితి ప్రారంభించినటువంటి కార్యక్రమం సత్య సాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది? స్థూలంగా కానీ క్లుప్తంగా కానీ సుందరంగా, సరళంగా, హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ దాని విచార ధారని సంపూర్ణం చేస్తూ ఇవాళ జరిగిన సత్సంగాన్ని సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి, మహర్షులకి, మహనీయులకి, ఆచార్య సత్తములకి, గురు కోటికి సమర్పణం చేస్తూ సాయి రామ్.
YouTube · audio

Upanishad Vahini

Home
0:00 / 2:07:41

More in this series

Upanishad Vahini

4 episodes · 7 hr 32 min

  1. 56 min 1

    Upanishad Vahini

    Now playing
  2. 1 hr 9 min 2

    UPANISHAD VAHINI - I Part-2

  3. 1 hr 4 min 3

    UPANISHAD VAHINI - I Part-3

  4. 1 hr 6 min 4

    UPANISHAD VAHINI - I Part-4