No transcript for this section.
Transcript begins at 0:00.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం భణిహి అన్నారు సంగీతాన్ని గురించి. పసి పిల్లవాడికి సంగీతం లాలిపాట. పశువుకి ఆత్మానందాన్ని కలిగించేటువంటి ఒక పాట. సర్పానికి అంటే పాముకి ఆ నాదస్వరం తల ఊపేటువంటి పాట. కాబట్టి ఇది మామూలుగా పైకి కనిపించే అర్థం అయితే, ఇక్కడ శిశువు అంటే కుమారస్వామి. పశువు అంటే నంది. భణి అంటే వెయ్యి పడగలా అది శిశువు అని అర్థం. అంటే సంగీతం ఒక పసివాడిని, పసరాన్ని, పశువుని ఏకకాలంలో మహాద్భుతమైన ఆనంద అనుభూతిలో నిలబెట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటి విషయం. అనేకమంది వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులు, రసికులు, రసజ్ఞులు అనేకమంది ఈ లోకంలోకి వచ్చి వాఙ్మయ సృష్టి చేసి తమ రచనలతో తమదైన స్వీయ సంస్కార ధారతో దానికి సంగీతం అనబడేటువంటి ఒక మహాద్భుత ప్రక్రియలో దాన్ని మిక్కి, సుభగసుందరమైనటువంటి శ్రావ్యమైనటువంటి తమ కంఠస్థానంలో భాషని, భావాన్ని, అభిజ్ఞని, ప్రజ్ఞని, ప్రతిభని, ఉత్పత్తిని అన్నింటినీ సమన్వయించేస్తూ నాదోపాసన చేయడమే నిజానికి సంగీత సాధకుడి యొక్క లక్షణము, లక్ష్యము, గమ్యము. ఈ మూడు ఒకటే. కాబట్టి అనేకమంది మహానుభావుల గురించి చాగరాజ స్వామి వారు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని వారు నమస్కరించినట్లుగా, ఇవాళ కాలానుగుణంగా అనేకమైనటువంటి ప్రక్రియలు వినూత్నమైనటువంటి రీతిలో సాగుతున్నటువంటి వేళ శ్రీమతి ఆలూరి కళ్యాణి ఒక మంచి గాయని. స్వయంగా ఆమె రచయిత్రి, స్వరకర్త్రి. ఇన్ని విశేషాలు తన యందు ముడుచుకున్నటువంటి ఒక మహిళా రత్నం ఆలూరి కళ్యాణి. నిజానికి ఘంటసాల వారు సాహిత్యాన్ని అర్థం చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని, దాని భావాన్ని ఆకళింపు చేసుకొని సంగీతం సృష్టించినప్పుడు స్వర కల్పన చేసినప్పుడు ఆయన సాధ్యమైనంతవరకు ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రకంగా ఈ ప్రక్రియలో ఆయన ఆచార్యుడు. ఏమిటీ ప్రక్రియ అంటే, ఓ సాహిత్య పరమైనటువంటి ఒక గేయం, కీర్తన రచించబడినప్పుడు దాని యందు లలిత, లవంగలత అని ఒక మాట వచ్చింది. కళ్యాణి అని ఒక మాట వచ్చింది. ఇట్లా రాగాల పేర్లు గనుక ఆ సాహిత్యంలో ఇమిడిపోతే అదే రాగంలో పాడటం, స్వర కల్పన చేయటం, స్వర ప్రస్తారం చేయటం అది ఘంటసాల వారు ప్రవేశపెట్టినటువంటి మహాద్భుత ప్రక్రియ. మళ్ళీ ఈవేళ జనరంజకంగా ఒక సమర్థమైనటువంటి ప్రజ్ఞని ఈ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి దిశగా ఆలూరి కళ్యాణి ఇందాకే అన్నట్లుగా ఆమెకున్నటువంటి స్వీయ ప్రతిభ ఆధారంగా చేసుకొని తన సంగీత సాధనని, సాహిత్య ఉపాసనని, భగవంతుని యందున్నటువంటి భక్తిని, కళ యందున్నటువంటి తన ఆసక్తిని, ప్రజ్ఞని సమన్వయం చేసుకుంటూ సుమారు ఆరు గంటలకు పైగా తన కవిత, రచన, గాత్ర వినానంతో అంటే అది అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో నిర్విరామంగా కొనసాగించటం అది ఒక రికార్డు. ఈవేళ ఆమె రికార్డు కోసం పాడలే, ఆమె పాడితే అది ఒక రికార్డు అయిది. అది మనం గర్వించదగిన విషయం. ఒక తెలుగింటి ఆడపడుచు శుద్ధమైనటువంటి స్వరంలో, శుద్ధమైనటువంటి సంగీత ధారతో, ప్రజ్ఞతో పరమేశ్వరుడికి కైంకర్యం చేసినటువంటి ఈ కళాప్రజ్ఞ ఏదైతే ఉన్నదో ఇది అనేక తరాలకి మార్గదర్శనం చేసేటువంటి దశ, ఇది ఒక దిశ. ఇక ఆకాశము నుండి అందగించును గాని ఎవరి చేతికందు ఇంద్రధనువు, ఇంపుగొరుపు కవిత హృదయేకవేద్యము వింగడింపగరాదు వెంబడించి అని ఒక మాట ఉంది. అంటే ఏంటంటే, సంగీతాన్ని గాని సాహిత్యాన్ని గాని మనం laboratory లో విమర్శించినట్లుగా చీలికలు, పేలికలు చేసి దాని ఆ స్వరస్యాన్ని పోగొట్టుకునే కంటే హృదయేకవేద్యంగా దాని వెనక అనుభవించగలిగినట్లయితే సాహిత్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంగీతము ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్నుకున్నటువంటి రాగం హృదయాన్ని తాకుతుంది. దాని కారణంగా లోక లోకాంతర ప్రాణాలు స్థిమిత పడతాయి. ఇది శాంతాన్ని, ఒక ప్రేమని, భక్తిని, జ్ఞానాన్ని మనకి ఏకకాలంలో అనుభవించేటువంటి ఒక అనుగ్రహాన్ని ఇస్తుంది గనుక శ్రీమతి ఆలూరి కళ్యాణి తాను ఏ దిశగా ప్రయాణం చేస్తున్నదోఅనేకమైనటువంటి సంవత్సరాలు దశాబ్దాలు దాటి ఈవేళ ఈ ప్రక్రియలో తాను సాధించినటువంటి ఈ విశేషాన్ని గమనించినప్పుడు ప్రధానంగా యువతరం సంగీత సాహిత్యాల వైపు ఒక్కసారి దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఒక జీవితాన్ని భద్రంగా ఆనందంగా శాంతంగా ప్రసన్నంగా గడపటానికి ఈ రెండు కూడా సరస్వతీదేవి మనకు అనుగ్రహించినటువంటి రెండు వరాలు. సాహిత్యం అర్థమైతే జీవితం సగం అర్థమవుతుంది. జీవితం నిజానికి కృష్ణ సంగీతం అంటే ఆనంద సంగీతం అది. ఈ ఆనంద గీతికాలాపరలో భగవంతుడ్ని రూప నామ భావ తత్త్వార్దాలతో జీవుడు పరమానంద తారక స్థితిలో ఉపాసన చేసినప్పుడు ఆ సంగీతమే అపాత మధురమై అంటే వింటూ ఉండగానే మాధుర్యాన్నిస్తూ వినగా వినగా మననం చేసుకోగా ఆలోచనామృతమై ఈ రెండూ కూడా సరస్వతీదేవికి సమార్చనగా ప్రతి కళాకారుడు భావిస్తాడు కళాకారుడే కాదు శ్రోత కూడా అదే స్థాయిలో ఆ రస స్థాయిని అనుభవిస్తాడు. ఆ అనుభవించడానికి ఇటువంటి విదుషీమణులు అందరూ కూడా నడుము కట్టుకోవాలి. ఏదో కాసేపు టెక్నికల్ గా అద్భుతంగా పాడాం అని కాక భావ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి అందించాలి. భావము లేని భాష నిర్జీవం. భాష లేని భావం అది మృతప్రాయం. కాబట్టి భావము భాష దానితో పాటు అభివ్యక్తి దానికి ఇంకా సంగీతం కూడా తోడైనట్లయితే అది బలమైనటువంటి ఆత్మ ముద్రగా నేను భావన చేస్తూ ఆలూరి కళ్యాణి ఇటువంటి ప్రయోగాలు ఇంకా బాగా చేయాలని అలాగే సాహిత్యాన్ని బట్టి సంగీతము సంగీతాన్ని బట్టి సాహిత్యము రెండింటిని కూడా జమిలిగా సాగించేటువంటి ఒక ప్రజ్ఞని యోగాన్ని అవకాశాన్ని అనుగ్రహాన్ని సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారే స్వయంగా సామగాన ప్రియుడు సామగ్రామ లోలుడు. ఆయనకు ప్రియత్వం ఉంది లోలత్వం ఉంది. దేనియందంటే వేదము నుంచి పుట్టిన నాదము నాదము నుంచి అభివ్యక్తమైనటువంటి సంగీతము ఆ సంగీతం ద్వారా ఆ మానవుడు భక్తి మార్గంలో తనను తాను తరింపజేసుకునేటువంటి ఒక అధ్యాత్మ విధానాన్ని సృష్టించుకునే దశగా ఉన్నది గనుక స్వామి యొక్క అనుగ్రహం ఆమెపై నిండుగా ఉండాలని అలాగే కలకాలం చల్లగా ఆమె ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటువంటి అధ్యాత్మ కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవితాన్ని స్వసంపన్నము సమర్థవంతము ధన్యవంతము చేసుకోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం. సత్యసాయి సేవా సమితి కోటి సంకల్పించినటువంటి ఈ ప్రతి నెలా మహిళా కార్యక్రమంలో ఒక భాగంగా శ్రీమతి ఆలూరి కళ్యాణి ప్రతిభా విశేషాలను గుర్తిస్తూనే సమ్మానించుకుంటూనే గౌరవించుకుంటూనే కోటి సమితి నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి ఒకేషనల్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి మహిళా సమూహం అంతా కూడా ఇటువంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని అభిలషిస్తూ అది ఒకేషనలు ఇది ఓకలు రెండు కలవాలి. ఆ కలిసినట్లయితే తద్వారా వారికి కూడా సంగీతం పట్ల సాహిత్యం పట్ల అనేకమైనటువంటి అభిరుచులు కలుగుతూ ఈ సంగీత సాహిత్య పరివ్యాప్తికి ప్రతి వ్యక్తి కూడా తనవంతు కృషి తాను చేయాలని దానికే భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్ప ఈ పనులు జరగవని నేను భావిస్తూ ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సద్భావనతో సంకల్పించిన కోటి సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టి సత్యసాయి భగవానుని పట్ల ఉన్నటువంటి భక్తిని గౌరవాన్ని మరింత ప్రకాశమానం చేసుకోవాలని ఆ చేసుకోవటానికి కావలసిన సర్వ అవకాశాలను స్వామి అనుగ్రహించాలని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థిస్తూ ఆలూరి కళ్యాణికి శ్రోతలైనటువంటి ఒకేషనల్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మహిళా సమూహానికి కోటి సమితికి మరొక్కసారి ఆ మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio
Sandesham . On 19Th Mahila Day's Program - Koti Samithi
Sandesham . On 19Th Mahila Day's Program - Koti Samithi
Source: P V S on YouTube
0:00 / 11:01