Skip to content
Transcript తెలుగు
జీవితం ఉండగా, దేహం ఉండగా మనం గనక ఎరుకలోకి వెళ్ళగలిగినట్లయితే అదే జీవన్ముక్తి. జీవన్ముక్తికి సోపానాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవాన్ చాలా రమణీయంగా, సుందరంగా తాము పొందిన, తాము చెందించుకున్నటువంటి ఒక ఆత్మానుభూతి లో నుంచి ప్రపంచానికి చాలా విస్పష్టంగా పరిచయం చేస్తూ వచ్చారు. ప్రబోధం చేస్తూ వచ్చారు. ఇది అనేకమైనటువంటి భారతీయమైనటువంటి అధ్యాత్మ మార్గంలో సహజ స్థితి ఉత్తమమైన స్థితి అని వారిని ఎవరో "మేము ఎట్లా ఉండాలి? మాకు ఏదైనా బోధ చేయండి" అని అడిగితే "ఏమీ లేదు ఉరకుండండి" అన్నారు. అన్నీ ఉన్నాయ్ అనుకునే మనం అన్నిటా ఉంటున్నాం. అన్నిటా ఉన్న మనం దేనికి చెందకుండా ఉన్నాం. దేనికి చెందకుండా ఉన్న మనం దేన్నీ పొందకుండా ఉన్నాం. దాని బదులు అసలు ఏమీ లేదు అన్న భావనలో గనక ఆత్మనిష్ట లో ఉండగలిగినట్లయితే, ఆత్మానుభూతిని గనక వశం చేసుకోగలిగినట్లయితే అనాత్మ యొక్క చలనం అంతా ఆత్మ యొక్క సంచలనమే మూలమే దాని కదలికే దాని ప్రకారమే అన్ని జరుగుతున్నాయి అని గనక మనం అనుకోగలిగినట్లయితే అది సహజ స్థితి. సుఖం లేదు, దుఃఖం లేదు, కష్టం లేదు, నష్టం లేదు, లాభం లేదు, మోద ప్రమోదాలు లేవు, ఏమీ లేవు. ద్వంద్వాతీతమైనటువంటి స్థాయిలో గనక మనం ఉండగలిగినట్లయితే అది అచలమని. ఎప్పుడైతే వస్తువుతో నీకు బాంధవ్యం తెగిపోతుందో అరుణం అవుతుందని, రుణం తీరుతుందని. వస్తువుతో రుణం ఎప్పుడైతే, బంధం ఎప్పుడైతే తొలగిపోతుందో disconnect అయిపోతుందో నీకు బాంధవ్యం లేదని. బాంధవ్యం లేదు గనుక వ్యామోహం లేదని, వ్యామోహం ఏర్పడలేదు గనుక వ్యసనం పుట్టలేదని, నీవు నీవుగా సహజమైనటువంటి స్థితిలో నీవు ఉండగలుగుతావని అనుకున్నప్పుడు ఇవాళ ఉపదేశ సారం అనబడేటువంటి పరమాద్భుతమైనటువంటి ఒక విచార ధార శంకర వాంగ్మయమైనటువంటి వివేక చూడామణి కి శంకరుల దక్షిణామూర్తి స్తోత్రానికి ఒక practical tool చేతికి కావాలి. అదే ఉపదేశ సారం. The very essence of ఉపదేశ. A celestial advice that is ఉపదేశ సారం. మొదటి నుంచి చూసినట్లయితే కర్త, కర్మ, క్రియ. కర్త ఎవడో ఉన్నాడు. కర్మలు చేయబడుతూ ఉన్నాయి. క్రియ జరగబడుతూ ఉన్నది. నీవు నిమిత్త మాత్రుడివి. నీ ద్వారా జరగబడుతున్నాయే తప్ప కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమే నువ్వు వచ్చావు. నువ్వు కాలాధీనుడివి. కార్యాచరణ నీకు నిర్దేశింపబడింది. నువ్వు చేయవలసిన పనులు ఏవో ఉన్నాయి, అవి చెయ్. కారణ, దానికేదో కాజ్ ఉంది. కాజ్ ఏదైతే ఉందో అది నీకు అనవసరం, నువ్వు చేస్తూ వెళ్ళు. దాన్ని ధర్మనిష్టగా, కర్మనిష్టగా, కర్తవ్యనిష్టగా నువ్వు విచారణ చెయ్. నాలుగింటిని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ధర్మాచరణ సంపూర్ణమవుతుంది. శరీరం ద్వారా చేయబడుతున్నాయి గనుక శరీరమాజ్యం ఖలు కర్మ సాధనం. శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం. అవతారమూర్తి అయినా, ఒక భగవాన్ శ్రీ రమణ మహర్షి అయినా, జ్ఞాని అయినా ఆత్మానుభవాన్ని పొందాలి అంటే ఎక్కడ ఆత్మానుభవాన్ని పొందాలి? దేహంలోనే పొందాలి. కనుకనే అది పొందటానికి ఒక దేహాన్ని తీసుకుని వచ్చిన జ్ఞానమూర్తులు గాని, అవతారమూర్తులు గాని వారు కూడా దేహాత్మ భావన నుంచి అతి తొందరగా వైదొలుగుతారు. మానవుడే అజ్ఞానం చేత, మాయావరణం చేత, జన్మాంతరమైన సంస్కార ధార చేత తాను అనేకమైన వాటిలతో మమేకాన్ని చెంది తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ తనను తాను పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆత్మ విచార మార్గం అనేది ఒక dry subject కాదు. జీవితాన్ని కూడా మనం చూడండి మనం ఉన్నాం. పోగొట్టుకోవటమే జీవితం మనమంతా రాబట్టుకుంటున్నాం అనుకుంటాం. బాల్యం పోగొట్టుకున్నాం మనకు తెలియదు. కౌమార యవ్వనాలు పోయినాయి మనకి తెలియదు. మధ్య వయస్సు మిడిమిడి పోయింది. పరిపాకమైన స్థాయి వచ్చింది, అది పోతుంది. కాబట్టి the life itself is a chain of separation. There is no aggregation. There is no accumulation. ఉన్నదంతా devoid and avoid. పోగొట్టుకుంటూ, పోగొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక రాజకుమార్తెకి వివాహం చేయవలసి వచ్చింది. రోజుల్లో పంద్యాలు పెట్టేవాళ్ళు. స్వయంవరం అని ఒకడు, ఏదో మత్స్య యంత్రం అని ఒకడు ఇట్లా మనకి అన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. వీడికి ఏకాగ్రత ఉందా లేదా, నా కుమార్తెని వివాహం చేసుకునే శక్తిమంతుడా కాదా, యుక్తిశాలి అవునా కాదా, బుద్ధిశాలి అవునా కాదా, ఇవన్నీ కూడా పరీక్షలో తేలుతాయి గనుక రాజైనటువంటి వాడు ఒక పరీక్షా ప్రకటన చేస్తాడు. అట్లాగే రాజకుమార్తె తండ్రి "మా అమ్మాయిని ఎవరైనా సరే పరుగు పందెంలో గనక ఓడిస్తే వాడికి వివాహం చేస్తాను మా అమ్మాయిని ఇచ్చి" అన్నాడు.చాలా మంది యువకులు అంతా అనుకున్నారు యువతి మనలాగా పరిగెత్త లేదు కదా ఆడపిల్ల ఎక్కడో అలసిపోతుంది అప్పుడు మనం పరిగెత్తి గెలవచ్చు అసలు మనతో పోటీ పడలేదు మన శారీరక బలం ఎక్కడ ఆడపిల్ల రాజకుమార్తె అందులో అంతఃపురంలో అల్లారుముద్దుగా పెరిగింది నడకే అలవాటు లేదు పరుగు ఎక్కడ అలవాటు అవుతుందని అందరూ సిద్ధమై వచ్చారు కానీ అమ్మాయి అతి వేగంగా చెంగుచెంగున గాలికంటే వేగంగా పరిగెత్తుతున్నది వచ్చిన వాళ్ళంతా ఓడిపోతున్నారు సర్వాభరణాలు ఒంటిన ధరించి పరిగెత్తుతున్నది రాజకుమార్తె కదా నిరలంకారంగా అంటే అలంకారం లేకుండా రాదు బయటికి చక్కగా షోకు చేసుకుని సొమ్ములు పెట్టుకుని ఆమె పరిగెత్తుతూ ఉంది ఆమె సౌందర్యాన్ని చూస్తూ పరిగెత్తలేక కొందరు ఆమె ఎట్లా పరిగెత్తుతున్నదన్న ఆలోచన కలిగి మరికొందరు ఇదేమిటి ఆడపిల్ల ఇంత అద్భుతంగా పరిగెత్తుతున్నదే అని సంభ్రమాశ్చర్యాల కులైన మరికొందరు ఇట్లా వేరే వేరే కారణాల వలన అందరూ ఓడిపోతున్నారు రాజు గారికి దిగులు పట్టింది అమ్మాయి మాత్రం విజయ ఉత్సాహంతో ఉన్నది నన్ను జయించగల తద్వారా నన్ను వరించగల యువకుడే లేడా మా రాజ్యంలో ఆశ్చర్యంగానే ఉన్నదని అనుకుంటున్నది కానీ పరీక్ష సాగుతూ ఉన్నది రోజు time వచ్చింది తరుణాధీనం అయింది వ్యక్తి రానే వచ్చాడు ఏమన్నాడంటే నేను ఇవాళ పరుగు పందెంలో అమ్మాయితో పోటీ పడతానన్నాడు అమ్మాయి ఏం చేసిందంటే రోజున తన అందాన్ని తన వేగాన్ని చూసి కదా యువకులంతా ఓడిపోయారు ఇవాళ నా ఒక్కొక్క ఆభరణం తీసి వెనక్కి విసిరేస్తూ ముందుకు పరిగెత్తుతాను నా వెనక వస్తున్న వాడు నన్ను వదిలిపెట్టి ఆభరణాలను పట్టుకునే ప్రయత్నంలో వాడు వెనకబడి పోతాడు అని ఆమె ఆలోచించింది ఆలోచించి తన ప్రయా తన పరుగు పందాన్ని ప్రారంభించింది యువకుడు కూడా వెనక పరిగెత్తుతున్నాడు ఆమె ముందు అనుకున్నట్లుగానే తన ప్రణాళిక ప్రకారం చెవి కమ్మలు గ్రేవేయకాలు అంటే మెళ్ళో ఉన్న గొలుసులు దండలు చేతి గాజులు ఒక్కోటి తీసి విసిరేస్తూ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉన్నది వెళ్తూ ఉంటే యువకుడు చూశాడు గమనించాడు రాజకుమార్తె చాలా తెలివిగలది అసలే చాలా వేగంగా పరిగెత్తుతుంది ఇవాళ తను ఒంటిమీద ఉన్నటువంటి ఆభరణాలు కూడా లెక్క పెట్టకుండా విసిరేస్తుంది నా వైపు అంటే నేను ఆభరణాలకి వ్యామోహం చెందుతాను తద్వారా నేను ఆమెకి ఇంకా వెనకబడతానని ఆమె అనుకుంటున్నదేమో వస్తువులతో నాకు పని లేదు నా ఏక లక్ష్యం రాజకుమార్తెని ఓడించటం ఆమెను ఓడించటం ద్వారా ఆమెను వివాహం చేసుకోవటమే నా లక్ష్యం గనుక ఆమె ఏం విసిరినా నాకు సంబంధం లేదు అని ఇతను చిత్తశుద్ధితో ధృడ మనసుకుడై వెళ్తున్నాడు అమ్మాయి పరుగు పందెంలో కొత్తది ప్రవేశపెట్టింది వస్తువులు వెనక్కి పడేస్తూ ఆగి ఆగి చూస్తున్నది యువకుడు ఏదన్నా ఒక వస్తువుని ఎత్తుతాడా పట్టుకుంటాడా తద్వారా కొంత time వెనకబడి పోతాడని అనుకుంటే యువకుడు వస్తువు వైపే వెళ్ళటం లేదు అంటే తను విసిరేసిన వస్తువు తా యువకుడు పట్టుకుంటున్నాడా లేదా అన్న సమయం ఆమెకు పోయింది వస్తువుతో నాకు పని లేదు అనుకున్నటువంటి యువకుడు రాజకుమార్తె వైపు మనస్సును పెట్టి ఆమెను ఎట్లాగైనా వాళ గెలవాలి అనుకున్నాడు నిజానికి రా రాజకుమార్తె వెనకబడి పోయింది కొన్ని క్షణాల తేడాతో యువకుడు రాజకుమార్తెను ఓడించాడు ఉపదేశ సారం కడకి వచ్చినప్పుడు మన మనస్సంతా రాజకుమార్తె అనబడేటువంటి ఆత్మ వైపే ఉండాలి ఆకర్షణలు రాని ఎన్ని ప్రలోభాలు రాని ఎన్ని అవాంతరాలు రాని ఎన్ని ఆఘాతాలు ఏర్పడని ఎన్ని కష్ట నిష్టూరాలు ఏర్పడని ఎన్ని ద్వంద్వ స్థితులు ఏర్పడని మన లక్ష్యమంతా కూడా నేను ఆత్మను అన్నటువంటి ఒక ఆత్మ నిష్ఠలో సంస్థితమై ఉండాలి గనుక సంస్థితమైన సహజమైనటువంటి స్థితిలో ఉండాలి ఇదే ఆత్మ నిష్ఠో భవత్వం
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -76

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -76

Source: TFC Spiritual on YouTube

0:00 / 12:04

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

    Now playing
  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77