Skip to content
Transcript తెలుగు
కాలం మారింది, యుగం మారింది, ధర్మం మారుతున్నది. శంకర భగవత్పాదులు వచ్చారు. ఆత్మబోధ చేశారు. ఆత్మవిచార మార్గంలోకి జాతిని నెమ్మదిగా సనాతనమైన వైదిక ధర్మ మార్గం వైపు నడిపిస్తూనే అన్నీ చెప్పి కడగా ఒక్కమాట అన్నారు. "ఆత్" అంటే ఏమి? "మా" అంటే లేదు. ఏమీ లేదు అంటే అది లేకుండా లేదు ఉన్నదంతా ఆత్మే. మళ్ళీ ఉన్నదంతా ఆత్మే అన్న భావన ఎక్కడిది అంటే "సర్వం ఖల్విదం బ్రహ్మ". బ్రహ్మము కానిది ప్రపంచంలో లేదు గనుక బ్రహ్మమయమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆత్మమయంగానే ఉన్నది. అందులో మనం దేహాన్ని తీసుకున్నాం. దేహం లోపల మనస్సు అనే ఆలోచనల పుట్ట ఒకటి ఏదైతే ఉన్నదో అది కాస్త సంతోషాన్ని అప్పుడప్పుడు అంటే మనలో ఉన్న ఈగో, మనలో ఉన్న అహం చల్లారినప్పుడు, మనం కావాలి అనుకున్న వస్తువును మనం సాధించుకున్నప్పుడు లేదా మనం మరెవరినో జయించినప్పుడు వేదంలో, వాదంలో, వివాదంలో, తర్కంలో సుఖానికి, సంతోషానికి, ఆనందానికి చాలా తేడా ఉంది. ఇవాళ మనం కొన్ని మాటలు ఉపదేశ సారం లోపలికి వెళ్ళేలోగా ఎరగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. సుఖం అంటే దేహానికి సంబంధించిందని, సంతోషము అంటే మనసుకు సంబంధించిందని, ఆనందం అంటే హృదయానికి సంబంధించిందని ఒక విచార ధార. ఆనందం ఎన్ని రకాలు? అనేక రకాలుగా ఉన్నది. మనుష్య ఆనందము, మనీష్ ఆనందము, గంధర్వ ఆనందము, దేవగంధర్వ ఆనందము, పితృపితా ఆనందము, ప్రజాపితా ఆనందము, కడగా హిరణ్యగర్భ ఆనందం. ఇన్ని ఆనందాలు ఎప్పుడన్నా మనం అనుభవించామా? మనం ఆనందం అంటే వస్తువును పొందటం అనుకుంటున్నాం, దుఃఖం అంటే వస్తువును పోగొట్టుకోవటం అనుకుంటున్నాం. వస్తువు వచ్చినా, రాకపోయినా, మనం ఉన్నా, లేకపోయినా ద్వంద్వాతీతమైన అంటే జనన-మరణాలకు, ఎత్తుపల్లాలకు సమస్తమైనటువంటి కాలాధీనమైన వస్తువుని దాటి ఎవరైతే సద్వస్తువైనటువంటి ఆత్మను ఎరుగు ఎరుకలోకి వెళతారో అటువంటి వారు ఆత్మ పిపాసులవుతారు. ఆత్మానందాన్ని అనుభవిస్తారు. కనుకనే శంకర భగవత్పాదులు "ఆత్ అంటే ఏమి? మా అంటే లేదు" అన్నప్పుడు ప్రపంచం అంతా "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనుకున్నాం. చుక్కలన్నియు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, స్వర్గం అన్నది బ్రహ్మ, వాళ్ళభ్యమది బ్రహ్మ, జీవులన్నియు బ్రహ్మ, జీవరాసులు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నియు బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియు సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు వాక్కు బ్రహ్మ. అంటే సమస్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా బ్రహ్మీభూతమై, బ్రహ్మ సమానమై ఉన్నది గనుక అది వాక్క, అది చూపు, అది కదలిక, అది మెదలిక. మానవ జీవితం ఒక మహా విస్తృతమైనటువంటి వేదిక గనుక దీనిలో జరిగేటువంటి ప్రతి అణువు యొక్క కదలిక ఆత్మ యొక్క సంచలనమే అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావన, దానిలో నుంచి ఒక ఆత్మానుభూతిని గనుక మనం పొందగలిగితే మన యందు ఒక వస్తువు ఉన్నదని, దానికి సద్వస్తువు అని పేరని చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక భగవద్గీతలో మనం ముందే చెప్పుకున్నట్లుగా ఆహ్ దాని లక్షణాలు చెప్పాడు. శంకర భగవత్పాదులు "ఉన్నదంతా బ్రహ్మమే" అని ఒక ప్రతిపాదన చేశారు. నిజమే! శరీరంలో అంగాంగీభావంలో ఉన్న మన మనసుకు మెదడు ఎక్కడ ఉన్నదో తెలుసు, సర్వ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నదో ఎనాటమీ మనకు తెలుసు కానీ మనసు ఎక్కడ ఉన్నదో తెలియదు. ఆలోచన ఎక్కడ పుడుతున్నదో మనసు అక్కడ పుడుతున్నది. మనసుకు రూపం లేదు. మనసుకు రకమైన స్వభావం లేదు. మన స్వభావమే మన ఆలోచనే ఒక మనసుగా మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఉన్నది మనస్సు అని అడిగినప్పుడు కాలి గోటి నుంచి శిఖ వరకు అంటే తలపైన ఉన్నటువంటి వెంట్రుక మొన వరకు చివరి వరకు కూడా మనసు ఆక్రమించి ఉన్నది. అది ఎక్కడ ఉంటుందో, అది ఎప్పుడు బయటకు వస్తుందో, అది ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఏడిపిస్తుందో, ఎందుకు ఆనందాన్ని కలిగిస్తుందో, ఎందుకు సుఖాన్ని ఇస్తుందో, దేనిని కోరుతుందో, దేనిని కాదనుకుంటుందో ఇప్పటివరకు ఎవరికీ ఎరుక లేదు. కానీ మనసు లేకపోతే విచారణ లేదు. మనసు లేకపోతే మాట పుట్టదు. మనసే లేకపోతే జీవితమూ లేదు, ప్రపంచమూ లేదు. ప్రపంచాన్ని గురించిన విచారణ లేదు. ప్రపంచానికి మూలమైనటువంటి సత్తును గురించిన విచారణ కూడా లేదు గనుక మానవుడికి కించిత్ మనసు కావాలి, శుద్ధ మనసు కావాలి. సూడో మైండ్ నుంచి రియలిస్టిక్ మైండ్ లోకి, ఒక ప్యూర్ మైండ్ లోకి మనం వెళ్ళాలి. దానికి అధ్యాత్మ శాస్త్రం మనకు మార్గోపదేశనం చేస్తుంది గనుక ఇక్కడ భగవాన్ రమణ మహర్షి వచ్చిన సమయానికి ఇదే ప్రశ్న అనేకమంది తాత్వికులు అడిగారు. మన దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది? అది కొద్దిగా మాకు వివరంగా చెప్పండి అన్నప్పుడు నాటి వేదాన్ని దాటి, శంకరులను దాటి, శ్రీకృష్ణ పరమాత్మ వదిలిపెట్టినటువంటి దానిని అన్నింటినీ సమన్వయం చేసి భగవాన్ శ్రీ రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతా వా పవనచరణ రోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆధునిక కాలంలో ఒక మహర్షి ప్రపంచానికి వచ్చి, వారి ఉనికి చేత, అస్తిత్వం చేత, వ్యక్తిత్వం చేత, స్వీయ సాధనా బలం చేత, ఆత్మానుభవం చేత ప్రపంచానికి ఏమిచ్చారు, దేనిని అనుగ్రహ వరదానం చేశారు అని విచారణ చేసినప్పుడు...మన దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నదో ఆయన చెప్పేశారు. ఎక్కడ ఉన్నది? దేహంలో ఎడమ వైపు రొమ్మున ఒక మంత్రయుక్త యంత్రయుక్తమైనటువంటి ఒక గుండెకాయ ఉన్నది. అది కేవలం యంత్రం మాత్రమే. దానికి ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడివైపున హృదయము అనేటువంటి ఒక గుహ ఉన్నది. గుహ అంటే ఖాళీ. ఖాళీ ప్రదేశం శూన్యంగా ఉన్నది. కానీ దానిలో "యహం మహమితి సాక్షాత్" నేను నేను నేను అంటున్నది. ఒక్కసారి మనల్ని మనం విచారణ చేద్దాం. మనం ఎన్ని పనులలో ఉన్నా, ఇదిగో ఎట్లా మాట్లాడుతున్నా, వింటున్నా, అంటున్నా, కంటున్నా మనకి లోపల ఎవరో నేను నేను అని చెప్తూనే ఉన్నాడు. నువ్వు పని చెయ్, నువ్వు పని చేయొద్దు, పని ఇట్లా చెయ్, ఇట్లా చేస్తే ఇది ప్రపంచానికి నీకు ఉపయోగిస్తుంది, అట్లా చేస్తే ప్రపంచానికి వినాశకారి అవుతుంది అని ఎవడో లోపల చెప్తూ ఉన్నాడే, ఎవడు ఆ? అని విచారణ చేసినట్లయితే వాడు నేను నేను నేను అంటున్నది ఎలా ఉన్నది? ఒక జ్యోతిర్మయమై, చరాచరమయమై, వాంగ్మయమై, శ్రీమయమై, నిరంతరమై, అవ్యయమై, అఖండమై, చిద్ఘన రసమై, ఆత్మ స్వరూపంగా అఖండంగా వెలుగుతున్నది. అయితే, అయ్యా! ఇంత గట్టి భాష, ఇన్ని మాటలు మాకు తెలియవు కానీ అంటే ఏమిటో మాకు విశదంగా చెప్పండి అని ఎవరన్నా అడుగుతారని దానికి ఒక ఉపమానం చెప్పారు. ఒక దేవుడి చిత్రపటం ముందు ఒక ఇల్లాలు దీపం వెలిగించినప్పుడు దీపం ఆరిపోకుండా దానిపైన ఒక చెమ్మ ఉంచుతుంది. ఒక గాజుది ఉంచుతుంది. గాజుది ఎందుకు ఉంటుంది ఉంచుతుంది అంటే రెండు కారణాలు. లోపలి వెలుగు బయటంతా ప్రసరించాలి అని ఒకటి, రెండవది లోపల ఉన్నటువంటి వెలుగు దీపం జ్యోతి బయట వచ్చే వీచే గాలి వలన ఆరకూడదు అని రెండవది. జంఝామారుతాలు వీచినా, మలయ పవనాలు వీచినా, అనేక సుడిగాలులు, వడగాలులు వచ్చినా అన్నీ ఆరిపోతాయి, అన్నీ మలగిపోతాయేమో కానీ దీపపు చెమ్మలో ఉన్నటువంటి జ్యోతి మాత్రం నిశ్చలమై, నిభృతమై, నిరంతరమై, నికేతనమై, నిరంజనమై, అది పూర్ణమై శక్తివంతంగా వెలుగుతూనే ఉంటుంది. అటువంటిది ఆత్మ. "ఆత్మనిష్ఠో భవత్వం" నేను ఆత్మను అన్న భావనలో నిలకడ చెందరాజ. ఆత్మ కూడా ఒక దేహాన్ని ధరించింది అని అనుకో. ఇది ఎట్లాగంటే జడమయమైనటువంటి దేహంలో చైతన్యవంతమైనటువంటి ఆత్మ ఉన్నది. ఒక ఇనుప పెట్టెలో బీరువాలో వజ్రాల హారాన్ని దాచినట్లు. ఒక వజ్రాల హారాన్ని దాచాలి అంటే వజ్రాలతో చేసినటువంటి బీరువాలో పెట్టం. ఇనుప బీరువాలోనే పెడతాం. వజ్రాల హారం లోపల బానే ఉంటుంది, నెమ్మదిగా బయట బీరువా శిథిలమైపోతుంది. అలాగే లోపల అంతర్ జ్వాల ఏదైతే అంతర్ జ్యోతి ఏదైతే ఉన్నదో అది అఖండమై దేహ-దేహం నుంచి దేహం దేహం నుంచి దేహంగా అది రూపాంతరీకరణం చెందుతూ మారుతూ వెళుతున్నదే తప్ప దేహాలు పతనమై పోతున్నాయి. అంటే దేహం ఉండేది కాదు. ఇందాక అనుకున్నాం "దయతి ఇతి దేహః" రెండో మాట ఉంది "శర్యతి ఇతి శరీరః" నిరంతరం మార్పు చెందుతుంది శరీరం. కొన్ని వేల లక్షణ కణాలు పుడుతూ ఉంటాయి. శాస్త్రం ప్రకారం. నశిస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఇదిగో మనమంతా బాల్య, కౌమార, యవ్వన, మధ్య వయస్సులు దాటి వృద్ధాప్యం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న వేళ శరీరం చిన్నప్పుడు ఇట్లాగే ఉన్నదా? తల్లి గర్భంలో ఒక అండమై, ఆపై అది పిండమై, అది శిశువై, బాలుడై, కౌమార, యవ్వన దశలు దాటి సర్వాంగీ-సర్వాంగీణమైనటువంటి భావనతో ఏది నిలకడ చెంది ఉన్నదో ఇది కూడా మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందుతున్న దేహంలో మార్పే ఎరగని ఆత్మ లోపల ఉన్నది. ఇది విచిత్రం. కాబట్టి జడ చైతన్యాల మేలు కలయిక మానవ దేహం కాబట్టి సర్వాంతరాత్మ అయినటువంటి పరమాత్మ చీమలో, దోమలో, శివకేశవులలో అన్నారు త్యాగరాజ స్వామి వారు. కాబట్టి ఆత్మ పరివ్యాప్తమై ఉంది. సర్వే సర్వత్రా ఉన్నది. అది అఖండమై ఉన్నది. ఆరని వెలుగు వలె ఉన్నది. కనుక నేను ఆత్మనన్న భావనలో ఉండమన్నది అదే నాలుగు వేద ప్రమాణమైనటువంటి మహా వాక్యాలు ఇవాళ మనం స్మరించుకోవాలి. "ప్రజ్ఞానం బ్రహ్మ", "అయం ఆత్మా బ్రహ్మ", "అహం బ్రహ్మాస్మి", "తత్వమసి". ప్రజ్ఞానం నాలో ఉన్న ప్రజ్ఞానము బ్రహ్మమై ఉన్నాను. నేను నేను అంటున్న నేను బ్రహ్మమునై ఉన్నాను. అన్నింటికంటే నేనే బ్రహ్మమునై ఉన్నాను. బ్రహ్మమునకు నాకు అభేద అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక నాయందున్నది. కడగా ఏమున్నది? "తత్ త్వం అసి" అదే నేనై ఉన్నాను. పరమాత్మ! నీకూ నాకూ ఎట్టి తేడా లేదు. "త్వమేవాహం సంశయః" అనేటువంటి దేహాత్మ భావనను దాటి పూర్ణమైనటువంటి అచలాద్వైత స్ఫూర్తిని పొందాలి అని భగవాన్ రమణులు ఆత్మని ఒక దేహంలో ఒక అద్భుతమైనటువంటి సద్వస్తువుగా సద్విచారణ చేయమన్నారు. సత్తును గురించి ఆలోచించండి. సత్తు నీవే. సత్తు నేను నేను నేను నేను అట్లా తెలుగు పదం. సత్తు సంస్కృత పదం అంతే. నేను అన్న భావన ఓంకారంతో పాటు మొదలై-మొదలైంది. నేను అన్నదే ప్రథమ తలపు. మనం ఏది ఆలోచించినా, పని చేయాలన్నా, ఇదిగో ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్నా, మనందరం కూర్చొని ఇది వినాలన్నా నేను అనబోతున్నాను నేను అక్కడే ఉందిగా. నేను అంటున్నాను నేను అక్కడే ఉందిగా. నేను వింటున్నాను నేను అక్కడే ఉందిగా. నేను అనటం లేదు నేను అక్కడే ఉందిగా. అన్నా అనకపోయినా కర్మలకి కర్మలకు అతీతమైన స్థితికి, జ్ఞానానికి జ్ఞానాతీతమైనటువంటి ప్రజ్ఞాన భూమికకి, వీటన్నింటికీ కూడా నేను అన్నది ప్రథమ తలపు. ఇక ఓంకారమా? అది "అకారోకార మకారయుక్తమగు ఓంకారాభిధానం" అంటాడు దుర్జటి. అంటే అకారము అగ్ని స్వరూపమై, మకారము చంద్రబీజమై, ఓంకారము ఉమా యుక్తమై ఉన్నది గనుక ఓంకారము మహా త్రిపుటిగా ఒక శక్తివంతమైనటువంటి ప్రణవ శబ్దంగా primordial sound అన్నాడు వెస్ట్రన్. మన వాళ్ళు అవేం చెప్పలేదు. ప్రణవము అన్నారు. ప్రణవానికి పుట్టుక ఎక్కడ అని విచారణ చేస్తే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటే శబ్ద బ్రహ్మ అవుతున్నది. నిశ్శబ్దము శబ్ద బ్రహ్మమై నెమ్మది నెమ్మదిగా మాటలు మలగి అంటే ఆగి మౌనం వెలిగి మనల్ని ఆత్మ స్పురణామూర్తులుగా మనల్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఎరుక మనల్ని సంపూర్ణమైనటువంటి జ్ఞానైక స్థితిలోకి తీసుకు వెళుతుంది గనుక అట్లా వెళ్ళాలి గనుక అఖండమైనటువంటి ఆత్మని ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళండి అని చెప్తూ భగవాన్ అనేకమంది వారిని అడిగారు. ఏదన్నా ఒక మంత్రం చెప్పండి అని. మంత్రమా? మంత్రం? ఏమీ లేదు ఊరకుండండి. ఇదే మంత్రం అన్నారు. ఆమెన్
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -03

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -03

Source: TFC Spiritual on YouTube

0:00 / 14:29

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

    Now playing
  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77