Skip to content
Transcript తెలుగు
మంత్రమయమ కార్యక్రమంలో మనం ఉపనిషద్ వాహినీ క్రమంలో ఉపనిషద్ గురించి చర్చించుకుంటున్నాం. క్రమంలో భాగంగా మాండూక్యోపనిషద్ ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.ఆర్.మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ప్రాపంచికమైనటువంటి వాసనామయమైన జగత్తులో ఒక నేను నాది అన్న అహంకార మమకార బంధితమైనటువంటి ఒక మనస్సుని పైదన్ని తేటగా తెల్లంగా చేసి అదే తేటతెల్లం అంటే. తేట తీసేయాలి పైది. తెల్లగా కనపడాలి. లోపల ఉన్నటువంటి మహాశుద్ధ చైతన్య స్థాయి ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు గనక ముందు చూడగలిగితే, ఆపై దర్శించగలిగితే, పైన పానం చేయి అంటే తాగగలిగితే, దాన్ని నువ్వు అనుభవించగలిగితే అది ధ్యానం అవుతున్నది. ధ్యానం అసలు ఎందుకు చేయాలి? ధ్యానంలో ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే ప్రతి దానికమ్మా ఉపనిషత్తు తీసుకోండి, వేదం తీసుకోండి, ప్రమాణం తీసుకోండి మనల్ని యాతన పెట్టేది మనల్ని యాచకుల్ని చేసేది మనస్సే. చేయి, చేయి చాపుతుంది మనం చేయి చాపు ఎవరూ ఆశపడుతుంది అది కోరుకోమంటుంది. అదిగో వాళ్లెవరో మనకు తెలిసిన వాళ్ళు అడిగేద్దాం. ఎందుకు అడగాలి నువ్వు? నీకు ప్రాప్తం ఉంటే వాళ్లే తీసుకుపోతారు. లేదు ప్రాప్తం లేదు. వాళ్ల ద్వారా ప్రాప్తం లేదు. ఎక్కడో అక్కడ జరగాలి జరుగుతుంది. నిగ్రహం గనక ఉన్నట్లయితే ఎట్లా ఉంటుందంటే దానికి ధ్యానం ఒక ప్రక్రియ. ప్రక్రియలో మీరు ఏం చేస్తున్నారంటే మీకు చాలా తెలుసు, చాలా విషయాలు తెలుసు కానీ ఏమీ తెలియనట్లు ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనసు పుడుతున్నది. పుడుతున్న మనసుని జోకోట్టటలా. ఇలా, ఇలా కాదు నువ్వు ఉండవలసింది అంటున్నాం. కాబట్టి దాన్ని మీరు మూడు సార్లు, పదకొండు సార్లు ఇవన్నీ మనం పెట్టుకున్నవే తప్ప అసలు ధ్యాని అయినటువంటి వాడు మీకు ఉదాహరణ చెప్తా. పాండిచ్చేరిలో అరవింద ఆశ్రమంలో ది మదర్ ఉండేవారు. వారి దగ్గరికి రమణాశ్రమం నుంచి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వెళ్లారు. వెళ్తే ఆమె ఒక ప్రశ్న వేశారు. మేము ధ్యానంలో ఎక్కువ గడుపుతాము. మేము చేసే ప్రక్రియ కూడా అదే. మీరు మేము కలిసి ధ్యానం చేద్దాము. కనుక ధ్యానము అనేటువంటిది ప్రాథమికమైనటువంటిది. ప్రాథమికంగా మన అధ్యాత్మలోకి వెళ్ళటానికి ఉపయోగపడేది. ఇది మనో నియంత్రణ కోసం ఇదొక సాధన. అందుకనే మనో నియంత్ర ధర్మ సాధనై ధ్యానం. ధ్యానం. అయితే దీంట్లో ఓంకార ధ్యానం మామూలు ధ్యానం ముందు తెలుసుకున్న తర్వాత ఓంకారమై పెళ్దాం. ధ్యానం అనేటువంటిది ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనసుకి స్థిమితం ఏర్పడుతుంది. స్థిరంగా ఉంటుంది. కష్ట నిష్ఠూరాలను సమంగా చూడగలిగిన ఒక స్థాయి మనసుకు ఏర్పడుతుంది. ఒక పెద్ద ఆఘాతం ఏర్పడింది. పెద్ద ఏమీ తేడా అనిపియ-- వచ్చినప్పుడు అలాగే ఉంటారు, పోయినప్పుడు కూడా అలాగే ఉంటారు. అలాగే ఉంటారు. ఇది ధ్యానం యొక్క ప్రభావం. ప్రభావం. ఇక రెండోది లోపల ఎప్పుడైతే మనసు నియంత్రించబడిందో లోపల ఉన్నటువంటి సర్వ అంగాములు కూడా యధాస్థానంలో ఉంటాయి. కంట్రోల్ అయిపోయింది. స్విచ్ అక్కడ ఉంది. అదే కంట్రోల్ అయిపోయింది. అంతేగా రెగ్యులేటరు. ఆన్, వన్ నుంచి రెండుకి వెళితే ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. మామూలుగా అయిపోయిన తర్వాత నెంబర్ వన్ తిరుగుతూ ఉంటుంది. ఆగకూడదు తిరుగుతూ ఉండాలి. కానీ అది మనకి శబ్దం గానీ మనల్ని ఉన్నవన్నీ లేపడానికి గానీ లేపడానికి గానీ కాదు. చల్లదనం ఇవ్వాలి, ఆహ్లాదం ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలి, సంతృప్తిని ఇవ్వాలి, సంతృష్టిని ఇవ్వాలి, సమన్వయం ఇవ్వాలి. ఇదంతా సాధన. సాధన అవగా అవగా ముందు ఏం చేస్తాము? దీనికంటే ముందు ధ్యానానికి సమయం ఎప్పుడు? సమయంలో ధ్యానం చేయాలి, ధ్యానంలో ఉండాలి? బ్రాహ్మీ ముహూర్తం అద్భుతమైనటువంటి స్థితి. టైంలో గనక ధ్యానిగా మీరు ఉండగలిగినట్లయితే సమయాన్ని ఎంచుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ రిలాక్స్ అవండి. అది వేరే సంగతి. కానీ సమయంలో గనక మీరు ఆలోచనా రాహిత స్థితికి వెళ్ళేట్లయితే అది చాలా కాలం నిలబడుతుంది. ఎందుకని ప్రపంచానికి మీరు అక్కర్లేదు, మీకు కూడా ప్రపంచం అక్కర్లా. మీకై మీరు, మీతో మీరు ఉన్నటువంటి ఒక మంచి స్థాయి అది. టైంలో గనక మీరు ఉంటే ఎంతసేపు ఉండాలి రెండో ప్రశ్న. కొందరు ఆరు గంటలు, ఏడు గంటలు, ఎనిమిది గంటలు చెప్తారు. ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు అంటే సుమారుగా హాఫ్ అన్ అవర్. ఒక అరగంట. అరగంట దాటి మీరు ధ్యానం చేయలేరు. చేస్తున్నామని అనుకోవచ్చు గాక. నేను పొద్దున ఆరుకు మొదలు పెట్టాను సాయంత్రం ఆరు దాకా ధ్యానంలో ఉన్నానంటే ఉన్నానని అనుకున్నావ్. నీ మనస్సు గానీ, నీ శరీరం ఇది ఒక యంత్రం కదమ్మా. శరీరం ఒక యంత్రం. యంత్రంలో నువ్వొక మంత్రం ప్రవేశపెడుతున్నావ్. ప్రవేశం ఎలా పెడుతున్నావ్ తంత్రంగా పెడుతున్నావ్. యంత్ర మంత్ర తంత్రాత్మకమైనటువంటి దేహంలో యంత్రం కూడా ఎక్కువ సేపు తిరగలేదు అది. ఒకచోట ఆగిపోతుంది. న్యూరాలజీలో ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు ఉన్నాడనుకుందాం ఒకడు ఎవరో గొప్పవాడు చాలా గొప్పవాడు అనుకుందాం. ఆయన రెండు గంటలు మాట్లాడిన వాళ్ళు వినేది నలభై ఐదు నిమిషంతో కట్ ఆఫ్ అయిపోతారు. నలభై ఆరో నిమిషం నుంచి అసలు వినేవాడికి ఓపిక ఉండదు వినడు. వినడు. అంటే మైండ్ న్యూరో సిస్టమ్ దాన్ని అలౌ చేయదు. అలాగే ధ్యానంలో కూడా ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు లెక్క ఉంది దానికి. అంటే అరగంట అనుకుందాం. తెల్లవారుజామున మూడున్నరకు మొదలుపెడితే నాలుక్కి అయిపోతుంది అది. తర్వాత అంతా ఇక మామూలు మనం కావాలని చేసుకునేదే కదా. కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేస్, చేసుకొని అది ఉండేది అది ధ్యానం. అవును. తర్వాత అరగంట గనక ఉండగలిగితే అది ధ్యానం. అరగంట దాటి అవసరం కూడా లేదు. అప్పటికే చాలా ఎక్కువ. మన వయస్సుకి ధ్యానానికి సంబంధం లేదు. సంబంధం లేదు. శరీరానికి వయస్సు మనం లెక్కబెడితే దానికి ఉంది. ఉంది. మన శరీరానికి దానికేమన్నా దాని ఏజ్ తెలుసా? తెలీదు. తెలీదు. గడియారానికి టైం తెలుసా? అది చూపించిందే టైం అనుకుంటున్నాం మనం. గడియారాలన్నీ ఒక ప్రిన్సిపుల్ మీద తయారవుతాయి గనుక తయారవుతాయి. ఇప్పుడు రెండయింది, రెండు ఒక నిమిషం అయింది అంటున్నాం. అది కాలం కాదే. కాల ప్రమాణాలు వేరే.కాబట్టి ఇక్కడ కూడా ధ్యాన అనేటువంటి దానిలో ఇరవై ఎనిమిది నిమిషాలు ఒక అరగంట సేపు మీరు గనక ధ్యానిగా ఉండగలిగితే అక్కడి నుంచి తగ్గుకుంటూ రావాలి అది పెరిగితే ధ్యానం గొప్ప కాదు తగ్గుతూ రావాలి పాండిచ్చేరి వెళ్ళినప్పుడు అమ్మవారు ది మదర్ అడిగింది అడిగింది కలిసి చేద్దాం అని కలిసి చేద్దాం అని అన్నప్పుడు ఆయన అన్నారు తప్పకుండా చేద్దాం అమ్మ నీవంటి మహాత్మురాలతో కూర్చోవడం చాలా సంతోషం అన్నారు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు పాండిచ్చేరి ఆశ్రమంలో ఒక టైం టైమర్ అనుకుందాం stop clock ఏదో పెట్టుకున్నారు అనుకుందాం అవేమీ లేవు అక్కడ ఏదో ఆరు గంటలకు మొదలు పెట్టారు అంటే ఆరు గంటల మూడు నిమిషాలకి గణపతి ముని బ్రహ్మానంద స్థితికి వెళ్లిపోయినారు ఇంకా మదర్ వెనక అప్పటికి మదర్ అంటే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అవును ఆవిడ ఒక అద్భుతమైన శక్తి అవును అటువంటి ఆమె ధ్యానంలో అరవిందుల వారిని కూడా దాటింది అటువంటి గొప్ప వ్యక్తి ఆమె ఇంకా struggle అవుతున్నది వెళ్ళటానికి ఆయనది అలా ఉండిపోయింది అంతే ఆయన వెళ్ళిపోయినారు అక్కడ బ్రహ్మానంద స్థితిలో కూర్చున్నారు గణపతి ముని ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేక దిగి రావాలిగా ధ్యానంలో స్థాయికి వెళ్లిన దిగి రాగానే అమ్మ వైపు చూశాడు ఆయన చూడగానే అది ది మదర్ అడిగింది ఇది పరమాద్భుతమైన అటువంటి విశేషం నా జీవితంలో ఇంత తేలికగా ఇంత సునాయాసంగా స్థితికి ఎలా వెళ్లగలిగారు అని అడిగింది అడిగితే ఆయన అన్నారు సాధన స్వాధ్యాయం సాధన స్వాధ్యాయం రెండింటికీ మూలం గురువు యొక్క అనుగ్రహం అంటే ఆవిడ ఏమన్నారంటే మీరు పాండిచ్చేరి లో ఉండిపోకూడదా బాగుంది నాకు చాలా సంతోషం ఇక్కడే ఉండిపోండి అంటే గురువుని వదిలి గురు నీడని కూడా వదిలి నేను రాలేను అన్నారు అరుణాచలం వెళ్ళిపోయినారు అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ధ్యానంలో పరమ చరమ స్థాయికి వెళ్లాలంటే మూడు ఉండాలి ఒకటి సాధన రెండవది స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే ఇక్కడ రామాయణ భారతాలు చదవటం కాదు స్వ అధ్యాయం తనను తాను అధ్యయనం చేయాలి తనను తాను తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు రెండు కావటానికి కారణం గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహం ఆశీర్వచనం నా దగ్గరికి వాడు పని మీద వచ్చాడు ఇది కావాలని కోరుకున్నాడు అని గురువు ఆలోచిస్తాడు అంతే తప్ప గురువు ఇలా తీసి చేతిలో పెట్టడు పెట్టాడా ఆయన కూడా మామూలు గురువే పెట్టడు మార్గం చూపిస్తాడు అంతే కదా అంతే మార్గంలో నువ్వు వెళ్ళాలి మార్గంలో చెప్తాడు ఇదే ఇది ఇది విషయం మార్గంలో నువ్వు వెళ్ళే మంచిది అని చెప్తారు అంతే అంతేగాని స్వస్థానం దాకా తీసుకుని వెళ్ళడు అసలు ఆయన పని అది కాదు కాదు నీకు నేను మోక్షం ఇచ్చేస్తానని కృష్ణుడు అన్నాడా మోక్షం ఇస్తానని అనలే మోక్షానికి మార్గం చెప్పాడు మోక్షం అంటే ఏమిటో చెప్పాడు మోక్షం ఎవరంటే వాళ్ళు సంపాదించుకోవాలి ఉద్ధరేత్ ఆత్మన ఆత్మ చెప్పాడు నీ అంతట నువ్వే సంపాదించుకో నీ నడక నువ్వే చేయాలి నీ స్వాధ్యాయం నువ్వే చేయాలి నీ విచారణ నువ్వే చేసుకోవాలి కాబట్టి ఎవరికి వాళ్ళమే చేయాలి కాబట్టి ధ్యానం కూడా సామూహిక ధ్యానాలు ఇవన్నీ unscientific అమ్మ ఎందుకు చేయాలి మీ గదిలో మీరున్న చోట మీరు ఎలా ఉన్నారో ఏకాంతం ఎక్కడ హాయిగా చేసుకోండి దానిలో ఉండండి అది ఐదు నిమిషాల్లో మీకు ఆనందం కలిగితే వదిలేసేయండి అసలు కలగట్టం లేదు అనుకుందాం ఐదు నిమిషాలు అయింది పదిని అయింది పోరాటం ఆపేసి దాన్ని అక్కడ ఆపేయటం ఉత్తమం అంతే కదా అంతే నేను ఎలాగైనా ఏదో ఏదో ఏదో తర్కించుకునే బదులు తర్కించుకునేది వదిలేసి అది కాపడం మంచిది ఆపేసి మళ్ళీ time వచ్చినప్పుడు spell అంటాం దానిలోకి మనం వెళ్ళినప్పుడు జరుగుతుంది కాబట్టి ధ్యానం వలన ఏమిటి లాభం ఎప్పుడూ చేయాలో అనుకున్నాం ఎంత సేపు చేయాలో అనుకున్నాం దాని వల్ల లాభం ఏం చేయాలో అనుకున్నాం ఏమీ చేయకపోవటమే ధ్యానం ఏం చేయద్దు అసలు just దానికి ఏదన్నా సుఖాసీన ముద్రలు ఉన్నాయా అంటే ఏం లేవు ఏం లేవు నువ్వు ఎక్కడున్నావో ఎట్లా ఉన్నావో అట్లాగే ఉండు ఏమి రమణ మహర్షి ఎండలో మండిపోయే బండరాళ్ళ మీద కూర్చుని ధ్యాన ముద్ర అంకిత స్థితిలోకి వెళ్లారాయన ఇవన్నీ equipment రోజుల్లో ఏముంది లేదు చెట్టు కింద అక్కడ ఇక్కడ పాతాళ లింగంలో ఎక్కడ కూర్చుంటే అక్కడ వారు ధ్యాన ముద్రలో ఉండగలిగారు మన దక్షిణామూర్తి కూడా మరి చెట్టు కింద కూర్చున్నారు కదా తరుమూలవాసంగా అక్కడ కూర్చున్నాడు కాబట్టి మనం ప్రదేశం ఎంచుకోనక్కర్లా మీరు మీ ఇంట్లో ఎక్కడ ఎలా ఉన్నారో అలా కూర్చుని హాయిగా వదిలేసేయండి రేపు ఏం చేయాలి దానికి ధ్యాన శక్తి కావాలి link లు ఏమీ అవసరం లేదు మీరు మీరుగా ఉండండి మీలో మీరు ఉండండి ఏరోజో ఆరోజో చేసుకోవాలి అంతే ఎప్పటికప్పుడు క్షణానికి క్షణం అయిన తర్వాత ఎంత సేపు half an hour అయిపోయింది వదిలేసాం జరక్కపోతే ఏం చేయాలి అక్కడికి ఆపేయాలి అది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఇక ఓంకార ధ్యానానికి వద్దాం ఇప్పుడు మీరు only బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలా అని చెప్పారు చేస్తే మంచిది అన్నారు time చేయలేని వాళ్ళు తర్వాత చేయొచ్చు కదా చేయొచ్చు అది నిబంధన కాదు అంటే నేను ఇక్కడికి వెళితే నాకు రెండు రూపాయలు వస్తాయి అని ఒకడు చెప్పాడు నువ్వు అక్కడికి వెళితే అలా వెళితే వంద రూపాయలు వస్తాయి నేను ఎటు వెళ్తాను వంద రూపాయలకు వెళ్తా బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది vibrations అని ఇంకా మన భావాలు దానికి అంటుకోవట్ల దైవీ భావాలన్నీ కూడా vibrations ఆక్రమించి ఉంటాయి గనుక మనకు కూడా ఏమీ అక్కర్లేదని కూర్చున్నాం గనుక మనకి శక్తి energy శక్తి అంటే energy energy కావాలంటే మనలో ప్రవేశించడానికి మనం ద్వారాలు తెరిచి ఉంచుతాం తెలుసుకున్నాము కానీ కొంతమంది ఏందంటే నిద్రావస్థ ఫీల్ అవుతారు నిద్రే దాని ధ్యానం అనుకుంటారు నిద్ర ధ్యానం అని ఇందాక చెప్పాగా అవును అరగంట దాటిన తర్వాత మీరే అన్నారు కానీ చాలామంది పొద్దున్నే లేచి కూర్చో అంటే బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని నిద్రే ధ్యానం అనుకుంటారు అది తప్పు అది తప్పు ఎందుకంటే దానికంటే వాళ్ళు లేచిన తర్వాత చేయడమే better జాగ్రత్ అవస్థలో ఏదో time దానికి నిబంధనలేమీ లేవు రమణాశ్రమంలో కూడా ఇద్దరు శిష్యులు ఇద్దరు సాధకులు అక్కడ చేశారు పక్క పక్క cottages లో ఉండేవారు ఒకాయన ఆరు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అసలు మహర్షి దర్శనానికి కూడా వెళ్ళేవారు కాదు రెండు ఆయనకు అనుమానం వచ్చింది నేను చేస్తున్నది ధ్యానం కాదా నేను అసలు ధ్యానిగా జీవితంలో వెళ్ళలేనా అతను ఏంటి ఇంత సేపు అలా కట్టె వలె కూర్చున్నాడు అని అనుకుంటున్నాడుఓ రోజు తట్టుకోలేక గురువుగారి దగ్గరికి వెళ్లి మహర్షి దగ్గరికి భగవాన్ ఇది నా సమస్య పక్కపక్కనే ఉన్నాం ఆయనేమో గంటలు గంటలు చేయగలుగుతున్నారు నాకు కావటం లేదంటే ఇందాక మనం చెప్పుకున్నదంతా వివరించి ఒక మాటే అన్నారంటే ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లలో అందుకోగలిగితే సర్వోత్తమం కానీ దానిని ధ్యానం అనుకొని కొనసాగించినట్లయితే ఎరుక రాకపోగా గురక మిగిలిపోతుంది అన్నారాయన మీరు చెప్పిన నిద్ర అదే time లో ఒకటమ్మా బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానిగా ఉండటం అలవాటు అయిన తర్వాత నిద్రావస్థ రాదు బలహీనమైన మనసుకు వస్తుంది కానీ స్పష్టంగా నేను time లో చేయాలి అనుకున్న వాడికి అది రాదు సరే అది కుదిరినా కుదరకపోయినా ఎప్పుడైనా చేయొచ్చు position లోనైనా చేయొచ్చు ముద్రలోనైనా చేయొచ్చు చేయటం అంటే ఏమిటి ఏమి చేయకపోవటమే అసలు చేయటం ఇది అయిన తర్వాత ఇక మరి దేనిని దేనిని పట్టుకోవాలి ముందు ముందు గురువుగారు ఏం చెప్తారంటే నీకు ఇష్టమైన బొమ్మ పెట్టుకో జ్యోతిని వెలిగించుకో అదంతా నీ లోపలికి వచ్చిందని అనుకో అంటే పెట్టుకో చూసుకో అనుకో అంటున్నది మళ్ళీ mind యొక్క ఆటే mind యొక్క ఆటే అంటే అది చాలా ప్రాథమికమైనటువంటి ధ్యాన ముద్ర అంతేనా? అంతే మీరు కూర్చోగానే మీ మనసు గనక ఆనందంతో నిండిపోతే ధ్యానం యొక్క ఫలితం మీకు వచ్చినట్లే ఎప్పుడైతే మనసు ఆనందంగా ఉంటుందో శరీరం కూడా దృఢం అయిపోతుంది ఎప్పుడైతే శరీరం దృఢం అయిపోతుందో మీరు చేసే అన్ని పనులు స్పష్టంగా చేస్తారు ఎక్కడ తొట్రుపాటు ఉండదు టక టక టక చేసుకుంటూ వెళ్ళిపోతారు Concentration పెరుగుతాది కాబట్టి creativity కూడా పెరుగుతాది creativity automatic మరి ఏం పని చేస్తుందో పని ఏం చేసిన అది ఇప్పుడు driving ఇంత traffic లో driving చేయటం ధ్యానమేగా ధ్యానమే అంత హడావిడిలో వంట చేయటం ధ్యానమేగా ధ్యానమే ఒక పక్కన tv చూస్తూ ఒక పక్కన phone మాట్లాడుతూ మూడో పక్కన instruction ఇస్తూ మనిషి ఇవన్నీ చేస్తున్నాడుగా చేస్తున్నాడు ఇవి కూడా ధ్యానంలో భాగమే faculty పెరిగినందు వల్లే ఇది లేనివాడు కంగారు పడిపోతాడు tv అన్నా ఆపేస్తాడు cell అన్నా switch off చేస్తాడు ఏదో ఒక పనే చేయగలుగుతాడు అన్నింటి మధ్య చేయగలగటం అనేటువంటిది ఉండగలగటం అనేది ధ్యానం దీనికిప్పుడు మనం వస్తే బొమ్మలు ప్రతిమలు ఏదో ఆధారాలు ఒక బయట ఉన్నటువంటి వస్తువుని ఆధారం చేసుకునే ధ్యానం పరిమిత ధ్యానం అపరిపక్వ ధ్యానం కానీ మొదట్లో అది అవసరం కాదనటం లేదు కొంచెమంటే కొంచెసేపు అవసరం కొద్దిగా అవసరం కొద్దిగా అవసరం తర్వాత తర్వాత ఏమవుతుందంటే అవును బొమ్మలన్నీ పోయేవే కదా అసలు నేనే పోతాను నేనే ఉండను కదా ఎందుకు దీన్ని ఆశ్రയിస్తున్నాను లేదు జ్యోతి జ్యోతిని వెలిగించి జ్యోతి కూడా కాసేప వత్తి పోయినా నూనె అయిపోయినా అది పోతుంది ఏది నిలకడగా ఉండబోతున్నదో దానిమీద నేను focus చేసి దానిమీద ఏకాగ్రస్థితిని గనక చేసుకున్నట్లయితే అది ఉత్తమం కదా అన్నప్పుడు ధ్యాన ప్రక్రియలో ఆజ్ఞాచక్రం మీచేయమని ఉంది దీని మీచేయమని త్రికూటనాముని స్థమితే అంతరంగే అంటారు భగవత్పాదులు అంటే త్రికూటం కలిసేటువంటి ప్రదేశం ఆజ్ఞాచక్రం కూటస్థానం కూటస్థానం గనక చేసినట్లయితే ఏమవుతుంది అంటే దృశ్యాలు కనిపిస్తాయి సంగీతాలు వినిపిస్తాయి అనేకమైన దేవీదేవతల astral bodies లు సూక్ష్మ సూక్ష్మేతరంగా దర్శనాలు ఇస్తాయి కానీ అవి దర్శనాలు ఇస్తున్నాయని తెలుసుకున్నది ఎవరు వచ్చిన వాటిని చూస్తున్నది ఎవరంటే మనసేగా మనసే మనసు ఇంకా అక్కడే ఉందిగా మరి ధ్యానం పూర్తి కాలేదుగా కాలేదు మరి ఏం కావాలి ఇది కూడా దాటాలి ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటిన తర్వాత ఇక్కడ అనాహత స్థానం నుంచి చక్రం నుంచి కుడివైపుకు వెళ్ళాలి ఇక్కడ హృద్గుహ ఉన్నది దాన్నే రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం అని ఒక శ్లోకంలో చెప్పారు అంటే ఏంటి నువ్వు చేయవలసింది ఆజ్ఞాచక్రము కాదు సంగీత సాహిత్యాలతో కూడిన కంఠము కాదు సహస్రారము కాదు ఏదీ కాదు కానీ ఎక్కడ మరి నేను ఎటు దేనిమీద ధ్యానించి ఉండాలి అంటే ఖాళీగా ఉన్న హృదయం అనేటువంటి గుహ దానిమీద గనక చేస్తే అది ఆత్మ యొక్క స్థావరం అది మన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే హృద్గుహలో ఉన్నది అది ఎట్లా ఉన్నదట యహం మహమితి నేను నేను అంటోందట పైగా అది ఎట్లా ఉన్నదంటే ఒక భగవంతుడి ప్రతిమ లేదా photo ముందు దీపాన్ని వెలిగించి జ్యోతి వెలిగించి దానిమీద చిల్లులు ఉన్నటువంటి ఒక పాత్రను పెడతాం అప్పుడు చుట్టూ ఏర్పడుతుంది చుట్టూ ఏర్పడటం వట్టి బయట గాలి వీచినా లోపల ఉన్న దీపకలిక ఆరదు నిశ్చలంగా నిభృతంగా ఉంటుంది అట్లాగే ఎన్ని జంజామారుతాలు వీచినా మనసు ఎన్ని విధాల పరిపరి విధాల పోయినా మళ్ళీ దానిని జ్యోతిర్మయమైన చరాచరమయమైన శ్రీమయమైన వాంగ్మయమైనటువంటి దీపకలిక దగ్గరకు తీసుకొచ్చి నిలబెడుతుంది గనుక హృస్థానం మీద హృదయం అనే స్థానం మీద నువ్వు గనక ధ్యానించినట్లయితే అంటే దానిని అదొకటి ఉన్నదని దీపకలిక అక్కడ ఉన్నదని గనక అనుకున్నట్లయితే బయట వస్తువుని లోపలికి తీసుకోవటం అనేది లేదు లోపల ఉన్న వస్తువును నువ్వు దర్శనం చేస్తున్నావ్ దానికే సద్దర్శనము దీపకలిక లాగ ఉన్న దీపం అంటే అక్కడ దీపం వెలిగించి ఉండదు వెలుగు వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వము నందున వేరు చోట లేవు అలకుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నదికిన్ గురూత్తమునకున్ నమస్కరించెదన్ గురువు ఎవరంటే ఆత్మే గురువు అని కదా ఆత్మే గురువు అయినప్పుడు గురువు ఎక్కడున్నాడంటే ఆత్మ స్వరూపంగా నీ హృదయంలో ఉన్నాడని చెప్పగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ పేరే ధ్యానము చాల బాగా చెప్పారు గురువు గారు కానీ దీంట్లో ఒక చిన్న సందేహం గురువు గారు ఉమ్ ఓంకారం అనేది చాలా మంది అంటే ఆడవాళ్ళుచెప్పకూడదు అని అంటారు. వాళ్ళకి దెబ్బ తింటుంది. వాళ్ళ సంతానోత్పత్తికి కారణం ఇది అవుతుంది. కాబట్టి ఓంకారం ఆడవాళ్ళు చెప్పకూడదు. సూత్రాలు చెప్పకూడదు. కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇవి వాటికి నేను ఖచ్చితంగా వ్యతిరేకిని. నేను ఒక సైన్స్ చదువుకున్న వాడిగా శాస్త్రాధ్యయనం గురువుల ద్వారా తెలుసుకున్న వాడిగా నా స్వీయ స్వాధ్యాయంలో స్త్రీలు వేదం చదవాలి. వేదమాత అన్నామా? అవును వేదమాత. సరస్వతీ దేవి సరస్వతీ దేవి కదా! మరి మీరు చెప్పే అష్టైశ్వర్యాలన్నీ స్త్రీ స్వరూపాలుగానే ఉన్నాయి కదా స్త్రీ స్వరూపమే. కానీ వాళ్ళకి యుటెరస్ కి ఏదో దెబ్బ వస్తుంది కదా. అది ఎప్పుడు అంటే ఘనంగా జరిగేటటువంటి చెప్పే ఘన మంత్రాలు ఉన్నాయి వేదంలో. అవి చదవకూడదు. చదవకూడదంటే అనర్హతని కాదు అది వాళ్ళకి మంచిది కాదు గనుక. ఒక యుటెరెసే కాదు వాళ్ళకి లంగ పవర్ కూడా తక్కువ ఉంటుంది. అవును స్త్రీకి పురుషుడికున్న తెలుగులో దమ్ము అంటారు అవును దమ్ము వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎక్కువ బిగబట్టలేరు. అందుకనే ప్రాణాయామం కూడా స్త్రీలకి వద్దనే చెప్తారు. నిజానికి పురుషులకు కూడా వద్దంటారు. కానీ ప్రాణాయామం కావాలి. ఎక్కడ కావాలంటే అతి తక్కువ సన్నివేశాల్లో కావాలి. కాబట్టి వేదం చదవాలన్నా ఓంకార ధ్యానం చేసుకోవటానికి యుటెరస్ కి సంబంధమే లేదు. ఎందుకనంటే ఓంకారం మూలాధారం నుంచే మొదలవుతుంది అవును అంతే కదా అంతే కదా గం అది బీజాక్షరం అవును గం ఓం గం గణపతయే నమః అని కదా అది మూలాధారంలో ఎవరు అధిష్టాత అంటే గణపతి. అంటే అవిఘ్నంగా సాగుగాక. సహస్రారంలో ఏమున్నది? గ. అంటే జ్ఞానం. మూలాధారం నుంచి సహస్రారంకు చిన్న గీత గీయండి కలపండి. గం గంగ. తిప్పి చదవండి గంగే గంగే కాబట్టి పైనుంచి కిందకు వచ్చినా కింద నుంచి పైకి వెళ్ళినా మీరు చేసుకునేటటువంటి ఓంకార ధ్యానానికి స్త్రీ శరీరంలో జరిగేటటువంటి ఆఘాతాలకు ఎట్టి సంబంధం లేదు. నెమ్మదిగా నిశ్వ-- ఓంకారం అంటే అరుపు కాదు కదా! నిశ్వనంగా చేయాలి. నెమ్మదిగా చేయాలి. ఊపిరి బిగబట్టి చేయాలి. చేస్తూ చేస్తూ దాన్ని మళ్ళీ లయం చేయాలి. ఎలా ప్రారంభమైందో ప్రారంభమైన దాన్ని కొడదాకా తీసుకెళ్లి కొసలో దాన్ని వదిలి పెట్టాలి. లీనం చేయాలి. లయం చేయాలి. అంటే లీనము అంటే లయం చేయడమంటే తనలో కలుపుకోవటం కలుపుకోవటం లీనంగా కలిసిపోవటం. కలిసిపోవడం వేరు కలుపుకోవటం వేరు. రెండూ జరగాలి. దానికి మార్గము ధ్యానం కాబట్టి స్త్రీలు తప్పకుండా ఓంకార ధ్యానం చేయాలి. దానికే మనం ప్రణవ ధ్యానం అని పేరు పెట్టాం. ప్రణవము అంటే ఓంకారం. ప్రణవం ఎలా చేస్తారు? ప్రణవ ధ్యానంలో ఇప్పుడు మామూలు మీరు చూడండి సామూహికంగా చేస్తారు కదా అది ప్రణవ ధ్యానం కానే కాదు. ప్రణవ ధ్యానం నిశ్శబ్దం. ఇప్పుడు చేసేదంతా వాడు పైకి ఉచ్చరించడమా? పైకి పూర్తిగా ఉచ్చరించి నెమ్మదిగా తగ్గిస్తారు. అది ప్రణవ ధ్యానం కాదు ఓంకారం కాదు. ఓంకారంలో మీకు శబ్దమే లేదు. నిశ్శబ్ద మూలమై మూలాధారంతో ప్రారంభించి సత్ చక్రాల ద్వారా మీరు వస్తూ వస్తూ వచ్చి సహస్రారానికి వెళ్ళినప్పుడు మీలో కలిగేటువంటి ఆనందానంద సందోహం ఏదైతే ఉన్నదో అది మీకు ధ్యానంగా రూపాంతరీకరణం జరుగుతుంది. అది ఒక్కొక్కళ్ళు మూడు సార్లే చేయగలుగుతారు. దా-- పెద్ద ప్రక్రియ అది. అలాగే కాస్త అలవాటైన వాడు పదకొండు సార్లు చేసుకుంటాడు పదకొండు సార్లు. నూట ఎనభై అది చాలా కష్టతరమైన అటువంటిది. అది ఎవరు చేయాలి అంటే దాని మీదనే దానికోసమే దానిని మాత్రమే ఆధారం చేసుకున్నటువంటి జ్ఞానులు యోగులు వాళ్ళ పని వేరు మరి వాళ్ళు ఎందుకు చేయాలి? అంటే వాళ్ళు చేయగలరు గనుక చేయాలి. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమిటి లాభం? ఒకసారి చేస్తే ఏమి? మూడు అయితే ఏమి? పదకొండు అయితే ఏమి? అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే యోగులు నిస్వార్థంగా ఉంటారు. గురువులు నిస్వార్థంగా ఉంటారు. నిస్వార్థంగా ఎప్పుడైతే ఉంటారో కలిగినటువంటి ఆనందాన్ని ప్రపంచానికి అందిస్తారు అందిస్తారు మనల్ని పిలిచి ఇవ్వరు. ప్రపంచంలోకి ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు అది ప్రపంచ వాయువులో అది కలిసిపోతూ ఉంటుంది. ఇది నిరంతరాభ్యాసం చేత కలుగుతుంది కాబట్టి ప్రణవ ధ్యానం అనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి ధ్యానం అది. అది నిశ్శబ్దమే గాని శబ్దం కాదు అది. అది Demonstrate చేసేది కూడా కాదు. అందుకే మనం చేయాలి. గురువు గారు చాలా బాగా ఓంకారం గురించి అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎలా చేయాలి? సైలెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు శుభం శుభం ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం చూశారు కదా! మౌన యోగ పరిషత్తులో ఓంకారం గురించి దాని యొక్క ధ్యానం గురించి ఓంకారం యొక్క అసలు తత్వం గురించి బీజాక్షరాల గురించి అది ఎలా చేయాలి? సైలెన్స్ లోనే ఎలా చేయాలి? ఉచ్చరించడంలో కాదు, సామూహికంలో కాదు ఏకాంతంగానే మనం పరమాత్మను దర్శించగలిగే స్థితి తెలుసుకోవాలి అని గురువు గారు మనకి సవివరంగా చెప్పారు. ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ
YouTube · audio

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 136

Home

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 136

Source: SVBC TTD on YouTube

0:00 / 27:46

More in this series

Manthramahima (with Y. Swarna Latha Reddy)

4 episodes · 1 hr 44 min

  1. 19 min 133

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 133

  2. 19 min 134

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 134

  3. 23 min 135

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 135

  4. 23 min 136

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 136

    Now playing