No transcript for this section.
Transcript begins at 131:06.
ఓలేటి పార్వతీశం గారు మాట్లాడబోయే ముందు [గొంతు సవరించిన శబ్దం] అశరీరవాణి ఆకాశవాణి వేళ శరీర వాణిగా ప్రయాగ రామకృష్ణ గారు మాట్లాడారు. ఆ రోజుల్లో వీళ్ళ కంఠమే వీళ్ళకి ప్రాచుర్యము వీళ్ళ ప్రతిభ. రూపాలు తెలియవు జనసమోహనం చేసినటువంటిది రేడియో. దాన్ని మనం గుర్తించాలి. ఈవేళ TV మాధ్యమంలో ప్రవచనకారులు ఉద్యమిస్తున్నటువంటి సమయంలో అత్యంత తీవ్రంగా భారతీయ వాంగ్మయాన్ని చెప్తున్నటువంటి ఈ సమయంలో నాకు ఈవేళ ఉషశ్రీ గుర్తొచ్చారు. కారణం ఏంటంటే ఒక రామానందసాగర్ రా-తీసినటువంటి రామాయణం చూట్టానికి TV మాధ్యమం ఉంది. కానీ ఉషశ్రీ రామాయణం చెప్పినప్పుడు ఆంధ్రదేశం అంతటా రిక్షా పుల్లర్ తో సహా "తర్వాత వస్తాం బాడికి మీరు పక్కన నుంచండి మీరు రామాయణం వినాలి రేడియో" అని గుమిగూడి విన్నటువంటి రోజులు అవి. [వందనాల శబ్దం] ఇవేళ స్వామి వాణీ స్వరూపం కాబట్టి ఆకాశవాణిని ఇక్కడికి తీసుకొని వచ్చారు అని నేను భావిస్తూ ప్రయాగ రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో మనకి ఈవేళ భాషలో take home అని ఉంటుంది కదా. ఇంటికి ఏదో తీసుకెళ్లాలి. ఏమిచ్చారు ఆయన అంటే నాకు మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్తొచ్చారు. ఆయన రామాయణ కల్పవృక్షం అంతా రాసేశారు. రాసిన తర్వాత నారాముడు అని మళ్ళీ ఒక ఖండ కావ్యాన్ని రాశారు ఒట్టి రాముడి మీద. దాంట్లో పద్యం ఏంటంటే "ఎప్పుడన్నా పద్యాలు బాగా రాస్తాను నేను రాయగా రాయగా ఒక్కోసారి అసలు ఎంత గింజుకున్నా ఒక పద్యం రాదు పంక్తి సాగదు అటు ఇటు పచార్లు చేసి వచ్చి కూర్చుంటాను పేపర్ మీద కాయత్-- కలం పెట్టగానే అది ఆహ్ రాయబడుతుంది." అని అంటూ రాముడై రాశాను అంటాడు. ఇది పోతన గారి విషయంలో కూడా జరిగింది కాబట్టి ఈయన విషయంలో కూడా అలాగే రాశారని అనుకుంటాం. అంతవరకు అట్లాగే చెప్తే ఆయన విశ్వనాథవారు కావు కాబట్టి ఆయన ఏమన్నారంటే "స్వామికి తెలుగు వచ్చునా?" అన్నాడు. నిజమేగా? ఎక్కడో అయోధ్యలో పుట్టిన ఆయనకి ఇన్ని పద్యాలు పన్నెండు వేల ఎనిమిది వందల పద్యాలు రాశాను అంతా రాముడు కూడా తెలుగులోనే మాట్లాడినట్టు నా పద్యాలున్నాయి రా స్వామికి తెలుగు వచ్చునా అని close చేశాడు. అనగానే మనం దిగ్భ్రాంతి చెందుతాం. ఏమిటి ఇలా ఇంత రామాయణం రాసి మహత్కావ్యం రాశాంటే అప్పుడు ఆయన చెప్పారు. మనం ఏ అన్నం తింటామో అట్-అటువంటి భావం పుడుతుంది. ఎట్లాంటి భావం లోపల పొటమరిస్తుందో దానిలో నుంచి అటువంటి భాష పుడుతుంది. ఎటువంటి భాష వస్తుందో అది సంస్కారాన్ని సంస్కృతిని జమిలిగా చేసుకుని ప్రవాహ వేగంతో ప్రపంచానికి ఒక్కసారిగా విశుద్ధ చక్రంలో నుంచి అందించబడుతుంది అని వారు చెప్పారు. అలాగే పదార్థ దోషాన్ని గురించినటువంటిది అందుకనే స్వామి చూడండి అతిథి దేవోభవ మనం నారాయణ సేవ చేస్తాం. ఆ నారాయణ సేవలో మనకు అతిథులు ఎవరు ఆరోజున అంటే నారాయణుడే. ముందు వాళ్ళకిచ్చిన తర్వాతనే మనం భుంచేస్తాం. స్వామి ఇవన్నీ ఇటువంటి పెద్ద పెద్ద పదాలు లేకుండా ఇలా చేయండి అని చెప్పారు. ఇది ఇంతే అని శాసించారు. ఒక సనాతన ధర్మాన్ని ప్రవాహ వేగంతో నడిపించినటువంటి స్వామి యొక్క భావాలని చక్కగా మళ్ళీ ఒక పురాణ వాఙ్మయంతో సమన్వయం చేస్తూ ప్రయాగ రామకృష్ణ గారు చక్కగా మాట్లాడారు. అందుకనే మనం స్వామికి ఏది నైవేద్యం ఇచ్చినా బ్రహ్మార్పణం చెప్తాం, అహం వైశ్వానరో భుక్త చెప్తాం. కానీ దీని మీద ఒక చిన్న చమత్కారం ఉంది. బెంగుళూరులో స్వామి seventies లో ఒక తెలుగు వారి ఇంటికి వెళ్లారు. వెళితే స్వామి ఆ రోజుల్లో ఒక డెబ్బై ఎనభై మంది ఆహ్ గృహస్తు పిలిచారు. ఇంతలో బ్రహ్మార్పణం అయిపోయింది. బ్రహ్మార్పణం చెప్తూ మనం కూడా స్వామి వైపు ఇలా చూపిస్తూ ఉంటాం. అది అయిపోయాక మన-మన ప్రసాదం మనం తీసుకుంటాం. స్వామి దూరం నుంచి ఇదంతా చూశారు. బానే పాడారు, బానే చదివారు, మంచి పదార్థాలు అద్భుతంగా తయారు చేశారు. స్వామి అంటే భగవంతుడిలో చమత్కారం ఒక భాగం. ఉత్సాహం ఒక శక్తి. మనకు ఉత్సాహం శక్తి కాదు అప్పుడప్పుడు ఉత్సాహం కలుగుతుంది. ఆయన ఏమన్నారంటే "చాలా బాగా పాడారు బ్రహ్మార్పణం చక్కగా నిర్దుష్టంగా చదివారు. అలాగే అహం వైశ్వానరు కూడా చాలా అర్థవంతంగా చదివారు. కానీ జరిగేది ఏమిటంటే చూపులు నాకు మేపులు మీకు" అన్నారు. [నవ్వు] అది. "తర్వాత నేను తినేది ఏం లేదు మీరు హాయిగా తింటారు అలాగే తినాలని నారాయణుడుగా సత్యనారాయణుడుగా సత్య సాయి భగవానుడిగా నేను కోరుకుంటున్నా" అన్నారు. కాబట్టి పదార్థ దోషం అంతా కూడా నామస్మరణతో భగవంతుడికి నివేదనతో జీవుని వేదనతో పరి-పరిపూర్ణం అవుతుందని చాలా చక్కగా ఒక అతి-ఆతిథ్యంలో దాగినటువంటి ఒక మార్మికతని చక్కగా ఆవిష్కరించినటువంటి ప్రయాగ రామకృష్ణ గారికి మనం జై వందనం. ఎందుకంటే ఏం చెప్తున్నా అదే మీరు చప్పట్లు కొట్టారు. అదేంటంటే ఇది Google కాదు గనుక గుగులే లేదు. అది. ఇప్పుడు, ఇప్పుడు మరొక ఒక నిజానికి ఒక విశిష్ట వ్యక్తి. మాకు ప్రయాగ రామకృష్ణ గారు ఎట్లా పరమ మిత్రులో ఓలేటి పార్వతీశం గారు అంతే పరమ మిత్రులు. మిగతా వాళ్ళిద్దరూ కూడా మాకు మా sisters ఏ వాళ్ళిద్దరూ ప్రత్యేకమేం కాదు. ఆయన గురించి చాలా చెప్పారుగా introduction అయిపోయింది. ఇవాళ అతిథి దేవోభవ కార్యక్రమంలో అతిథి ఆతిథ్యము అనేటువంటి వృత్తం తీసుకొని దాని చుట్టూ వారు ఆవిష్కరించేటువంటి ఆ సన్నివేశాన్ని ఆ, ఆ వయనాన్ని ఆ విన్నానాన్ని అంటే skill ఉందే దాన్ని మనం చక్కగా ఆస్వాదిద్దాం. ఇప్పుడు ఓలేటి పార్వతీశం గారు. ఓలేటి పార్వతీశం గారు ఏం మాట్లాడారు? అతిథి మర్యాదలు ఎలా చేయాలో చెప్పారా? అతిథి అంటే ఏంటో స్వరూపం చెప్పారా? అవేం చెప్పకుండాఅంత చెప్పారు అది విశేషం దాంట్లో మొట్టమొదట ప్రవరాఖుడు మనుచరిత్ర చెప్పినప్పుడు ప్రవరుడి ఇంటికి వచ్చినటువంటి ఆ అతిథి ఓ విశేషం చెప్పాడు. "ఎలా తిరుగుతావ్ ఇన్ని ఊళ్ళు అనేక ప్రదేశాలు మీరు ఇంత తొందరగా ఎలా వెళ్ళగలుగుతారు?" అంటే "నా దగ్గర ఒక చిన్న లేపనం ఉంది అరికాళ్ళకు రాసుకుంటే ఇక్కడ అనుకున్న ఏ ప్రదేశం అనుకుంటే అక్కడికి చేరుతావ్" అన్నాడు. ప్రవరుడు ఎంత నిత్యాగ్నిహోత్రి అయినప్పటికీ కూడా ఆయనకు ఓ కోరిక ఉంది. హిమాలయాల గురించి చదివాడు ఎప్పుడూ చూడలా. అక్కడికి వెళ్లాలని ఉంది అన్నాడు. వెళ్ళే మార్గం నేను చెప్తా అన్నాడు కాళ్ళకు ఒక భరిణ ఇచ్చాడు ఆ భరిణ రాసుకున్నాడు ఇతను. హిమాలయాలకు వెళ్ళాడు. వెళ్లి ఏం చూశాడు? రాసిన అల్లసాని పెద్దన గారు హిమాలయాలు చూడలా. ప్రవరుడు అక్కడికి వెళ్ళినటువంటి ప్రవరుడు అప్పుడే చూస్తున్నాడు. కాబట్టి ప్రవరుడి యొక్క హృదయంగమమైనటువంటి ఒక భావాన్ని "అటదని కాంచ భూమి సురుడంబర చుంబి శిరః సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్పుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటకచరత్కరేణు కరకంపిత శాలమున్ శీతశైలమున్" టీవీ వాడికి చూపి-చూపించాలంటే యాభై లక్షలు కావాలి. నాలుగు పాదాల్లో మొత్తం చెప్పేశాడు అక్కడ ఏమున్నది చెప్పాడు. ఇది ఒకటి. అంటే ఇక రెండవది కుచేలోపాఖ్యానం కూడా చెప్పారు. కుచేలోపాఖ్యానంలో కుచేలుడ్ని కృష్ణుడు ఎలా ఆదరించాడో చెప్పారు. అక్కడ నిజానికి కుచేలుడు ఎవరంటే, చేలము అంటే వస్త్రం. శీర్ణమై జీర్ణమయి ఉన్నటువంటి చినిగిపోయిన ఒక వస్త్రంతో కుచేలుడు వెళ్ళాడు. ఒక దారిద్ర్యానికి గుర్తుగా కుచేలుడు వెళ్ళాడు. ఐశ్వర్యానికి గుర్తుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుడు మన-- కృష్ణుడు ఎందుకు ఆ సింహాసనం దిగి వచ్చి తాను కూర్చునే చోట తన స్నేహితుడ్ని కూర్చోబెట్టాడా? కుచేలుడ్ని కూర్చోబెట్టాడు అంటే, చేలము అంటే కేవలం వస్త్రం మాత్రమే కాదు చేలము అంటే శరీరం. ఆ శరీరము అనేకమైనటువంటి ప్రాపంచిక లౌకిక భావనల వలన అది శీర్ణమైపోయింది, మాసిపోయింది. మాపు-మాపు మాత్రమే మిగిలింది రూపం కూడా మారిపోయింది. అటువంటి ఒక కుచేలుడు అంటే శరీరము శిథిలమైనటువంటి ఒక కుచేలుడు, భావనల చేత, భౌతికంగా దరిద్రం చేత, యోగము చేత సమాన భోగం చేత సుందరాకృతిని పొందినటువంటి కృష్ణ పరమాత్మ దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ప్రశ్న వేస్తే అప్పటివరకు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ అష్టభార్యలతో ఉన్నప్పటికీ పదహారు వేల మంది గోప గోపిక జనము యొక్క హృదయాంతరాళాలలో నిలిచినప్పటికీ ఆయన మనస్సు ప్రాపంచికమైన మనస్సుగా ఉన్నందువలన నిజమైన కుచేలుడు ఆ క్షణంలో ఎవరంటే కృష్ణుడే నిజమైన కుచేలుడు. తన శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి అంటే మళ్ళీ తనను తాను సమర్పించుకోవాలి. ఎవరికి? నిత్యాగ్నిహోత్రుడు, సద్బ్రాహ్మణుడు, భగవంతుడు ఉన్నాడని నమ్మినటువంటి వాడు, ఒక ఆస్తికుడు, ఒక భాగవతుడు, ఇన్ని ఉండి తాను స్నేహితుడు అని తెలిసి కూడా కృష్ణుడి దగ్గర యాచన చేయకుండా ఒక నిబద్ధతతో జీవించినటువంటి నిజాయితీ ముందు కుచేలుడు ముందు కృష్ణుడు తలవంచాడు. ఇది. ఇట్లా మనం భాగవతాన్ని అర్థం చేసుకోవాలి, అది వారు ప్రస్తావన చేశారు. తర్వాత పిఠాపురం కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పినప్పుడు "శీతవేళ రాణియకు శిశిరానికి చోటియ్యకు" అని మనకు ఒక సందేశం ఇచ్చారు. ఎవరైనా దిగులు పడ్డ వాళ్ళు depress అయిన వాళ్ళు ఆ ఒక్క రెండు వాక్యాలు చదువుకుంటే చాలు. "శీతవేళ రాణియకు శిశిరానికి చోటియ్యకు" correct గా నాలుగు రోజుల క్రితం నేను కంచి విజయేంద్ర స్వామి వారిని చూడ్డానికని వారు పిలిస్తే వెళ్ళాను. వెళ్తే అది పిఠాపురం. పిఠాపురం లోనే దిగ్గానే నేను కోరుకున్న కోరిక ఏంటంటే "కృష్ణశాస్త్రి గారి ఇల్లు ఇంకా ఉందా?" అని అడిగా. ఆయన చెప్పిన, "ఇల్లు, అరుగు ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ సందు అక్కడే ఉంది." దాన్ని ఇప్పటికీ కృష్ణశాస్త్రి వీధి అంటారు. ఈ పద్నాల్గవ తారీఖున కేవలం నాలుగు రోజుల క్రితమే నాకు అత్యంత ఇష్టమైనటువంటి కృష్ణశాస్త్రి గారి ఇల్లు చూసి వచ్చా. రాగానే ఇదిగో మన ప్రశాంతి నిలయానికి వచ్చాం ఇక్కడికి. ఇది. తరువాత చివరగా ఏకాంత సేవ ప్రస్తావన చేసినప్పుడు ఏకాంత సేవలో ఆయన పద్యాలని చదువుతున్నప్పుడు, రాసిన కవి కంఠం మనకు తెలీదు కదా. ఆయన ఎలా పాడారో తెలీదు. కానీ నా వరకు దౌహిత్రుడు అయినటువంటి పార్వతీశం గారు తమ తాతగారి యొక్క-- ఎందుకంటే వాళ్ళేగా తాతలే మనవలే పుడతారు అంతేగా. సో ఆ మనవడే ఇలా వచ్చి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు చదివినప్పుడు, ఇహ ఈ తర్వాత ఏముంది ఏకాంత సేవ అయిపోయింది అంటే కా-కథ అయిపోయినట్టు లెక్క. కానీ మధ్యలో మన వాళ్ళు చేసినటువంటి భజనతో మళ్ళీ బాహ్య లోకానికి వచ్చి ఇప్పుడు అనంతలక్ష్మి గారి వారి ప్రసంగాన్ని కొనసాగిస్తారు అంటే ప్రారంభిస్తారు అని అర్థం. భవాని గారు మాట్లాడబోయే ముందు అనంతలక్ష్మి గారు మనకివ్వాళ ఏమిచ్చారు? చాలా ఇవ్వాలి. ఆమె పొరపాటు చేశారు. "నాకు ఎంత time?" అని అడిగారు. అడక్కుండా ఉంటే నేను ఆపేవాడినే కాదు. ఇంకో అరగంట మాట్లాడమనేవాడిని. కాబట్టి ఆహ్ ఆమెకి ఆమె నియంత్రించుకున్నారు. కానీ చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు ప్రధానంగా సాగినటువంటి చాలా విషయ పూర్వకమైనటువంటి ఒక ప్రస్తావన. ఆమె అహల్య గురించిచెప్పినటువంటి విషయం. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. అనంత లక్ష్మి గారు అప్పుడప్పుడే కన్ను తెరిచి నోరు విప్పి ప్రపంచంలో తన కంఠాన్ని వినిపించేటువంటి దశలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆమెని పిలిచి "అమ్మాయి! నువ్వేమో పిట్ట కొంచెం కూత చాలా ఘనంగా ఉంది" అన్నారు. అన్నారా లేదా? అది, అది మహాదాశీర్వచనం. ఆ కూత ఇంకా ఘనంగా సాగుతున్నది చెప్పగా చెప్పగా ఇంకా సాగాలని అనుకుంటూ అహల్య శాపవిమోచనాన్ని కళా స్వరూపాలన్నీ కూడా చాలా భిన్నంగా ఆవిష్కరించినాయి. ఆ పాటలు రాసిన వాళ్ళు కూడా రామ పాదము సోకగాని తగలగాని ఆ దాంట్లో నుంచి రాతిలో నుంచి నాతి వచ్చింది ఏమో ప్రాసలు పెట్టి రాశారు. కానీ ఇంద్రియాలు అన్నీ కూడా ఒక మనస్సుని అయినటువంటి అహల్య యొక్క ఇంద్రియాలన్నీ జాగృతమై మళ్ళీ మహా తపస్విని కావటానికి మధ్యకాలంలో గౌతమ మహర్షి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటంటే దానికంటే ముందు అహల్య అడిగింది "స్వామి మీరు అన్నట్టుగా నేను రాయిని అయిపోతా, కానీ నాలో ఉన్న జీవ లక్షణాలు పోతాయా అట్లాగే ఇంకా ఉంటాయా తర్వాత?" ఆయన దానికి జవాబు ఇవ్వల. "అసలు ఈనాకి శాపవిముక్తి ఎప్పుడు కలుగుతుంది?" అని అడిగింది. అప్పటికి ఇంకా రాముడు పుట్టల. శ్రీరామచంద్రుడు వచ్చి ఆ అడవిలో ఒక్క అహల్య రాయి ఒక్కటే లేదుగా అరణ్యంలో చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ రాయిని వెతుక్కుంటూ రాముడు వెళ్ళల. ఆయన వెళుతుంటే ఆ రాయి తగిలింది. అంటే ప్రభుమేని ప్రభుమేని పై గాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి ప్రాణం వచ్చే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు కలిగే. ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన ఘస్మంబు ఘ్రాణేంద్రియము నందే. ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనినంత రాతికి కనులు కలిగే. ఆ ప్రభువు వచ్చి ఆతిధ్యంము స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్ వితానములికి శ్రీరామ భద్రాభి రామమూర్తి అగుచు తోచే. ఇంద్రియాలు ఒక్కొక్కటి ముందు ప్రాణం వచ్చింది, చెవులు వచ్చినాయి, ముకుపుటాలు తెరుచుకున్నాయి, కనులు తెరుచుకున్నాయి. ఆతిథ్యం ఇవ్వటానికి రాముడు వచ్చాడా? రాముడికి అహల్య ఆతిథ్యం ఇచ్చిందంటే అహల్య రాముడికి ఇచ్చినటువంటి ఆతిథ్యం ఏంటంటే అహల్యా స్తోత్రాలు ఏడు ఉన్నాయి రామాయణంలో. ఆ ఏడు రామ-- ఆ ఏడు శ్లోకాలలో ఏం చెప్పిందంటే మొట్టమొదటిది కళ్యాణ రామ, జగదభిరామ, ధనుజ సంహార రామ. రాముడి జీవితంలో జరగబోయేటువంటి ప్రతిదానినీ అభివర్ణిస్తూ ఖడగ పట్టాభిరామ అన్నది. పట్టాభిరామ తర్వాత అక్కడ రాముడు ఎట్టి పట్టాభిరాముడైతే ఇంకో అరవైనాలుగువ రాజు అయ్యుండేవాడు. యోగ పట్టాభిరామ అన్నది. అంటే యోగత్వాన్ని పొందిన తర్వాత మాత్రమే తన భార్యని వదులుకోవాలి, రాజ్యాన్ని వదులుకోవాలి, ఇక్ష్వాకు వంశాంకురానికి రాజ్యాన్ని అప్పజెప్పాలి, యోగ శరీరంతో సరయు నది ప్రవేశం చేయాలి. ఇదంతా దర్శనం చేసినటువంటి అహల్యాదేవి జడత్వం నుంచి చైతన్యంలోకి వచ్చినప్పుడు ఆమె పొందినటువంటి ఆమెకు లభించినటువంటి మొట్టమొదటి అతిథి ఎవరంటే పరమాత్మ రామచంద్ర ప్రభు. శ్రీరామచంద్రమూర్తి ఆమెకు అతిథిగా వచ్చాడు. ఇక కనకధారాస్తవం మనకు తెలిసిందే. అందునా ఒక ఎండిపోయిన ఉసిరికాయ గనక ఇంట్లో గూట్లో ఉన్నట్లయితే దాన్ని బుగ్గన పెట్టుకున్నట్లయితే ఒక మనిషి ఇరవై యొక్క రోజులు జీవించవచ్చు. ఆ ఇరవై యొక్క రోజులు ఎవరు జీవించాలి? జీవితాన్ని సగభాగం తీసుకున్నటువంటి తాను, తన భర్త. అంతే కదా. కానీ ప్రాణం పోయినా సరే మేమిద్దరము లేకపోయినా సరే "నా వాకిట్లోకి భవతి భిక్షాందేహి" అని వచ్చినటువంటి ఈ బాలుడికి నేను ఇవ్వాలి అనుకున్నది ఇచ్చేసింది. ప్రాణాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడింది. అప్పుడు శంకర భగవత్పాదులు బాల వటువు ఆయన, ద్రద్యా దయానూ పవనో ద్రవిణాంబు ధారాం అస్మిన్ న కించన విహంగ శిశవు విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః అన్నాడు. అమ్మా! నువ్వు ఎప్పుడూ హరితో కూర్చుని ఉండే స్త్రీవి కదా నువ్వు. నీటిలోనే ఉండేటువంటి నీకు ఈ బీద ఇల్లాలి కన్నీటి విలో తెలియట లేదా కునిపించు అన్నాడు. అదే కనకధారాస్తవం అయింది. ఆ ప్రస్తావన తెచ్చారు. భరద్వాజుడి విందు అది సరే అవి ఇప్పుడు ఇంకా ఒకటిన్నర అయితేగాని అది అవదు. కాబట్టి అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. అది భరద్వాజ విందు అయితే ఇది సాయి విందు. ఇవాళ అతిథులకు ఒక ప్రామిస్ ఏంటంటే భరద్వాజ విందుతో సమానమైన విందును మీరు అనుభవించబోతున్నారు అని. [నవ్వు] తర్వాత అది అపురూపమైనటువంటి భావన. వీటన్నింటినీ కూడా ఆ అనంత లక్ష్మి గారు చాలా చక్కగా చాలా అందంగా చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే రామాయణాన్ని గురించిన ప్రస్తావన దాంట్లో కొన్ని విషయాలు చెప్పారు. అందులో దశరథుడికి అతిథులు ఎవరో తెలుసునా? తనకు అత్యంత ప్రియ స్నేహితుడైనటువంటి జటాయువు, ఒక గిరిజనుడు అయినటువంటి గుహుడు. వాళ్ళు అప్పుడప్పుడు దశరథ మహారాజు దగ్గరికి అతిథులుగా వచ్చేవారు. ఆ ఆతిథ్యము స్వీకరించినటువంటి కారణంగానే రాముడి యొక్క పయనంలో రామాయణంలో రామాయణంలో వాళ్ళందరూ కూడా రాముడికి సేవ చేశారు. అందువల్లనే శ్రీరామచంద్రుడు సాక్షాత్ దశరథ మహారాజుకి అగ్ని కార్యం చేయకుండా, అంత్యేష్టి చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా తన తండ్రికి...ఉత్తమ స్నేహితుడు అయినటువంటి జటాయుకి అగ్నిసంస్కారం చేశాడు. అంటే స్నేహితుడు ఎవరు అంటే తండ్రి స్నేహితుడు మనకు తండ్రితో సమానం మరి స్నేహితులు ఎవరు? ఇప్పుడు మిత్రుడు కూడా భవ దేవోభవ మిత్ర దేవోభవ తర్వాత కార్యక్రమం వస్తుంది అది ఇంకా రాలే ఉపనిషత్తుల్లో చెప్పలేదు కానీ మనం వచ్చాక దా పని కూడా చేద్దాం. ఇటువంటి అనేకమైన విషయాలు స్థాలీపులాకన్యాయ విశేషంతో అక్కడక్కడ స్పృశించినటువంటి అనంతలక్ష్మి గారికి మాకు అత్యంత ప్రియమైనటువంటి నా సోదరి ఆమె. ఆమెకి మరొక్కసారి [చప్పట్లు] అభినందనలు నేను తెలియజేస్తూ. భవాని గారికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. కృష్ణారావు గారు ఆర్.ఎం. కృష్ణారావు గారు సంకల్పించినప్పుడు ఐదుగురు speakers ఉండాలి ఐదుగురు ఉండాలి అన్నప్పుడు ఆయనకు ఒక RBI నుంచి వచ్చినటువంటి ఒక insurance guarantee card ఉంది. guarantee card ఏంటంటే అనంతలక్ష్మి గారు వచ్చి తీరుతారు. వి.ఎస్.ఆర్. మూర్తి గారు ఎలాగూ ఉంటా-- దానికంటే ముందు శ్రీమతి చిల్లర భవాని దేవి గారు చాలా సాధారణంగా మాట్లాడినట్లు అనిపించినా అసాధారణమైన విషయాలు కొన్ని చెప్పారు. [చప్పట్లు] చాలా మామూలు భాష హాయేన భాష. దాన్లో ఎవరికీ తెలియని ఒక ప్రస్తావన స్వామి మీద secretariat వాళ్ళు cassette తయారు చేసినప్పుడు ఆ cassettes నాకు ఇందాక వారు ప్రస్తావన చేసిన జయంతి గారు వాళ్ళంతా మా సత్సంగంలో ఇరవై ఏడేళ్ళు ఒకరోజలా రెండు రోజుల ఇంత అద్భుతంగా స్వామి గురించి రాయగలిగారు అంటే పదాలు కూర్చటం కాదు ఇటుక, ఆము వేరు ఇల్లు వేరు అంతే కదా. ఇటుకలు పేరుస్తూ వెళితే అది ఇల్లు అవ్వదు. ఇల్లు కట్టబడాలి. అది house కంటే home గా ఉండాలి కదా. కాబట్టి ఆ ఆ పద విన్యాసం అనను ఆ పద రచన అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం. తర్వాత ఆమె అతిథికి కాలాన్ని కూడా కాస్త ఇవ్వండి. ఏదో పెట్టి పంపించడం కాకుండా పెట్టి కాసేపు మాట్లాడి మంచి చెడులు విచారణ చేసి ఒక ఐదు నిమిషాలైనా ఈ కాలదానం అనేటువంటి పదాన్ని వాడినటువంటి వారు ఎవరంటే కంచి మహాస్వామి వారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్ని దానాలలోకి సర్వోత్తమమైన కాలం ఏది దానం ఏది అంటే కాలదానమే. ఇవాళ అందరూ డబ్బు ఇవ్వగలరు, చెక్కు రాసి ఇవ్వగలరు, చందాలు ఇవ్వగలరు కొద్దిగా ten minutes మాకు time ఇవ్వండి అంటే మా దగ్గర లేదంటున్నారు. ఎంతో ఉంచుకొని కూడా లేదంటున్నారు అది దురదృష్టం కదా. డబ్బు విషయంలో ఎలాగో కాలదానం ఈ విషయాలు చక్కగా ప్రస్తావన చేశారు. ఇక్క-ఇక్కడ జిల్లెళ్ళమూడి అమ్మ ప్రస్తావన తెచ్చారు గనుక జిల్లెళ్ళమూడి అమ్మ శరీరానికి యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమెను అందరూ అడిగారు "అమ్మా నీకు ఏం కావాలి" అని అడిగారు. బంగారమా? చీరలా? డబ్బా? లేదు ఈ ఆశ్రమ అభివృద్ధి చేయటమా అని. "ఏం లేదు నాన్న నాకు ఒక లక్ష మంది ఏకపంక్తిన భోజనం చేస్తే చూడాలని ఉంది రా" అంది. ఊళ్లో యాభై ఇల్లు లేవు. ఒకవేళ వూ-- ఆ గుంటూరు జిల్లా అంతా కూడా ప్రచారం చేసిన ఒక వెయ్యి, రెండు వేల మంది రావచ్చు. వీళ్ళు నెరవ-- "అమ్మ పొరపాటు పడింది ఏమో" అని "అమ్మా లక్ష మంది ఎలా వస్తారు? వస్తే మనం ఎలా ఆతిథ్యం ఇవ్వగలం" అని అన్నారు. "వాళ్ళు అన్నం వాళ్ళు తిని వెళ్తారు నాన్న వాళ్ళని రానివ్వండి" అంది. "మీరు చేయవలసింది మీరు చేయండి వాళ్ళు వస్తారు" అని. ఒకే రోజున పొద్దున ఏడున్నర ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఆ అన్న వితరణ అనే కార్యక్రమం రాత్రి పదకొండున్నరకి ముగిసేప్పటికి ఒక లక్షా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అన్నం తిన్నారు. [చప్పట్లు] ఇది చరిత్రబద్ధమైనటువంటి విషయం దీంతో మరొకరు లక్ష్మణ యతీంద్రులని వారు ముముక్షు పీఠాధిపతి మేము నేను pre university చదివేటప్పుడే ఆయన గొప్ప సంకీర్తనాచార్యుడు వైష్ణవ మూర్తి. ఆయన్ని నేను విప్లవ-- వైష్ణవుల్లో విప్లవం ఉంది ఈయనలో అంటే విప్లవం అంటే విధ్వంసం కాదు పరిణామ క్రమం అని చెప్పాను. ఆ పరిణామ స్ఫూర్తిలో ఆయన కూడా ఒక లక్ష మందికి అన్నం పెట్టాలి అది పెట్టలేని నాడు నేను నా జీవితాన్ని చాలిస్తానన్నారు. కాబట్టి ఈ దేశంలో అన్నం పెట్టడం అనేది ఒక ఎత్తయితే అమ్మ అంటే జిల్లెళ్ళమూడి అమ్మ ఇంకో మాట అంది "నాన్న వండటం వేరు రా వడ్డించటం వేరు నాన్న. ప్రేమతో వడ్డించాలి. అందరూ వండుతారు వండుకోక ఏం చేస్తారు. వడ్డించటం నేర్పండి. పెట్టటం కాదు నాన్న పెట్టుకోవటం నేర్పండి. అదిగో అక్కడ అన్నం ఉంది తినండి, అదిగో అక్కడన్నీ భోజనాలు ready" అనగానే వీళ్ళు గబగబ వెళుతున్నారే. అట్లా పెట్టుకోండి చేత్తో మీ చేత్తో మీరు చేసుకోండి అని అనేకమైనటువంటి మహాత్ముల స్ఫూర్ణ కలిగించినటువంటి ఒక మంచి ఆ సందేశం. ఆమె అన్నారు నేను ఒక ten minutes కంటే మాట్లాడలేను అని. నాకు తెలుసు ఆమె ఒక గంట కూడా మాట్లాడగలరు అని. ఎవరు? భవాని గారు. వచ్చారు మాట్లాడారు స్వామి యొక్క అనుగ్రహం అంటే గారు రమణ మహర్షి వాళ్ళ తల్లి గారు జిల్లెళ్ళమూడి అమ్మ ఈమె ఏమో సత్యసాయి. కనుక ఉన్నదంతా కూడా అధ్యాత్మ పాయలోనే ఉంది కాబట్టి స్వామి ప్రాంగణం నుంచి స్వామి యొక్క అనుగ్రహం ఆమెపై సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటూ ఒక చిన్న సమీక్ష పది నిమిషాలు చేద్దాం. సమీక్ష కూడా కాదు ఉరికే స్పందన అనాలి. సమీక్ష అంటే వాళ్ళు చేసినది, చెప్పింది ఇవన్నీ తప్పులండీ ఆ నాకు వాళ్ళ కంటే బాగా తెలుసండీ అని చెప్తే సమీక్ష. స్పందన ఏమిటా స్పందన అంటే కొన్ని విషయాలు చెప్తాను. అకర్దమమిదం తీర్థం భరద్వాజనిశా మయ రమణీయం ప్రసన్నాంబుహు సన్ మనుష్య మనో యథా ఇది వాల్మీకిలో మొట్టమొదటి శ్లోకం ఇది. మానిషాద ప్రతిష్ఠాన్త్వమమశాశ్వతి సమాః యత్ క్రౌంచ మిధునా దేహం అవధి కామమోహితం అని అందరూ అంటారు కానే కాదు. రామాయణం రాయాలి అని అనుకున్నప్పుడు వాల్మీకి మహర్షి తపసానది తీరం పక్కన ఉన్నటువంటి అరణ్యంలో వెళుతూ వెళుతూ ఉంటే ఆయనకి ఎన్నో చెరువులు కనిపించినాయి, తటాకాలు కనిపించినాయి. అన్నీ బాగున్నాయి కానీ భరద్వాజ అంటే భరద్వాజ మహర్షి కాదు భరద్వాజ నామంతో ఉన్న ఒక శిష్యుడు వెంబడి ఉన్నాడు ఆయన. భరద్వాజుని ముందు వెళ్ళిపోతున్నాడు గురువుగారు నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వస్తున్నారు మనం కాస్త దారి clear చేయాలని ఆయన వెళ్తున్నాడు అప్పుడన్నాడు ఒక్క చోట ఆగిపోయినాడు. ఆగిపోతే ఒక తటాకం ఒక చెరువు ఆకర్షించింది ఎంతగా ఆకర్షించింది అంటే అక్కడ నీటిలో కదలికలు లేవు అసలు నీళ్లు ఉన్నాయా లేదా ఏ రకమైన గాలి కూడా దాన్ని కదల్చలేకుండా ఉన్నది తరువాత బురద లేదు కర్దమము అంటే బురద అకర్దమమిదం తీర్థం భరద్వాజ పిలిచాడు ఆయన ఇటురా నాయనా ఇక్కడ బురద లేనటువంటి ఒక తటాకం నాకు కనిపిస్తున్నది ఆకాశం దాంట్లో నిర్మలంగా ప్రతిఫలిస్తూ ఉన్నది ప్రసన్నాంభువై ఉన్నది రమణీయంగా ఉన్నది ఇదంతా ఎట్లా ఉన్నదో తెలుసునా ఒక సత్పురుషుడు అయినటువంటి ఒక మనిషి యొక్క హృదయం లాగా ఉన్నది. సన్ మనుష్య మనో యథా అట్లాగే ఉన్నది. నేను రామాయణం రాయటానికి అనువైన ప్రదేశం ఇదేనని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ భారతదేశం అకర్దమమిదం తీర్థం అంతే. ఈ అకర్దమ తీర్థంలో మనందరం పుట్టాం పుట్టి మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం భారత భాగవత రామాయణ భగవద్గీతాది అనేక గ్రంథాల గురించి స్పర్శ మాత్రంగా విచారణ చేస్తూ ఉన్నాం. స్వామి దయవలన కొన్ని వేల వేల సత్సంగాలలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఈవేళ సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి నడయాడిన ఈ శివం ప్రాంగణంలో మనం చేసింది ఒక సంగీత సాహిత్య సమర్చన. ఇది స్వామి అనుగ్రహం లేనిదే ఇది జరిగేది కాదు. ఇది జరగటానికి కారకులైనటువంటి స్వామికి నమస్కరిస్తూ మనం కుచేలోపాఖ్యానం అంబరీషుడు ఇవన్నీ చెప్పాం. పురాణ వాఙ్మయాన్ని గనక గట్టిగా చదివినట్లయితే అతిథులు తక్కువ అభ్యాగతులు మరింత తక్కు-ఎక్కువ దానికంటే ఎక్కువ ఆహూతులు. అతిథులు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అభ్యాగతులు అందరూ వచ్చేవాళ్ళు వచ్చి భక్తుడికి ఒక పరీక్ష పెట్టేవాళ్ళు ఇదిగో ఇందాక చెప్పిన దూర్వాసుడి లాగా అంబరీషుడిని హింస పెట్టడానికి అంటే వాడి యొక్క నిగ్గు తెలచడానికి బంగారాన్ని నిప్పుల్లో వేసినట్లుగా వాడి భక్తిని నిగ్గు తెలచడానికి వచ్చినటువంటి ఈ అభ్యాగతులే ఎక్కువ కాబట్టి ఈ అభ్యాగతులను అతిథులుగా మార్చుకున్నటువంటి వాడు అంబరీషుడు. ఒక అభ్యాగతుడిని అతిధిగా మార్చుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ రామాయణంలో ఒక అద్భుత విశేషం ఉంది పరమాత్మే అతిధిగా వెళ్ళినటువంటిది ఒకే ఒక సందర్భం శబరి. శబరి దగ్గరకు పరమాత్మ వెళ్ళాడు అతిధిగా వెళ్ళాడు ఏడు ద్వారులు ఏర్పడి ఉన్నాయి మాతంగ మహర్షి క్రితం రోజు చెప్పాడు శబరి చాలా సేవ చేశావు గురు సేవ చేశావు రేపు రామచంద్ర ప్రభువు వస్తున్నాడు ఆయన దర్శనం చేసుకో అన్నది. ఈ గిరిజన స్త్రీ అయినటువంటి శబరి మాతంగ మహర్షిని అదే తొలిసారి చూడటం గురువుని తెలియకుండా గురు సేవ చేసింద ఆమె. ఏమడిగిందంటే స్వామి రేపు రాముడు వస్తాడు దర్శనం చేసుకోమని నాకు చెప్తున్నారే మరి మీరు రామ దర్శనం చేసుకోరా అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నారంటే ఈ శరీరం ఈ ఉపాధి ఇలా వచ్చిన కారణంగా నాకు రామదర్శన భాగ్యం నాకు లేదు నాకు స్వర్ణరథం రాబోతున్నది ఈ భాగ్యం నీదే ఎందుకంటే ఆయన వస్తున్నది అరణ్యవాసం అనేది ఒక మిష ఆయన మిషన్ ఏమిటంటే నిన్ను చూడటం అందుకనే బయలుదేరాడు అన్నారు. మరనాడు వచ్చింది వచ్చారు రాముడు. సినిమాలన్నీ మనసు నుంచి చెరిపోయండి అందులో కల్పనలు ఎక్కువ. ఎంగిలి పళ్ళు కొరికి పెట్టింది ఆ నమిలి పెట్టింది ఆ పిప్పి ఆయన తిన్నాడు ఇదంతా కూడా fervor and emotion ఇది కాదు. రాముడు శబరితో ఇందాక చెప్పిన ఆ కాలం ఇచ్చాడు అతిథి అతిథి ఇచ్చాడు శబరి మాట్లాడింది అందులో రెండు మూడు ఉన్నాయి. ఆ మూడింటిలో-ఆయన్ని మొదటిసారిగా చూడబోతున్నది గనుక ఏమో ఎక్కువ సేపు ఉంటాడో ఉండడో visit కి వచ్చాడే గాని sitting లేదేమో కదా కాబట్టి ఉన్న సమయాన్ని ఆ సద్వినియోగం చేసుకోవాలని ఒక్కొక్క పండు ఆయన వైపు వెళుతుంటే ఆయన పండ్ల మీద చెయ్యి పెట్టి ఓ మాట ఏమన్నాడంటే శబరి ఆశాంతము ఆపాద మస్తకము శిరస్సు వరకు కూడా ఒక ఎండిపోయిన కొమ్మ వలే ఉన్నావే శరీరం సృష్టించి పోయిందే కనికుట్లు వేలాడుతున్నట్లున్నాయే. అవును ఎందుకు ఇవన్నీ ఈ రాత్రంతా ఈ పూలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు అంటే ఆవిడ ఒక మాట చెప్పింది. చేతులు ఉనికి పోని పూలు తెచ్చితిని స్వామి సతనువగుటను నేను వచ్చితిని స్వామి ఇంకా నేను దేహంలో ఉన్నాను గనుక నేను వచ్చాను. నా చేతులు రెండు ఇంకా ఆడుతున్నాయి గనుక నేనే పూలు కోసుకొని వచ్చాను పళ్ళన్నీ తీసుకొని వచ్చాను నేల రాలిన పండు తేలేదు రామా కొమ్మనే అంటిన పండును తెచ్చాను. నేను కూడా కొమ్మకు అంటిన పండు వలే ఉన్నాను అనుగ్రహించు అన్నది. ఇది [చప్పట్లు] అయిన తర్వాత రాముడు ఇది చాలా గంభీరంగా emotional అయిపోతున్నదని శబరి నీవంటి వ్యక్తి గనుక నీవంటి ఒక స్త్రీ గనుక మా అయోధ్యా నగరంలో ఉంటే ఎంత బాగుండేది అన్నాడు. అయోధ్యా నగరంలో రాముడు గనక ఉండి ఉన్నట్లయితే ఒక శబరి కూడా ఉండేది అయోధ్యను రాముడు వదిలేసాడుగా అందుకే శబరి కోసం వచ్చాడుగా అన్నది. ఎంత తెలివితేటలో చూడండి.అవును నీకు తెలుసో తెలియదో నీకు చాలా వయస్సు వచ్చి పెద్దదానివి అయిపోయావు అవ్వ అయిపోయినావు మా సీతను ఎప్పుడన్నా చూశావా అన్నాడు. చూశానంది. ఎప్పుడు చూశావ్? చూసే అవకాశమే లేదే నువ్వు అరణ్యంలో ఉన్నావు నేను అరణ్యవాసానికి వచ్చాను ఇంతలోకే వాడెవడో ఎత్తుకుపోయినాడు నువ్వు ఎప్పుడు చూశావు అన్నాడు. నువ్వు కూర్చున్నావు చూడు నువ్వు కూర్చున్నప్పుడు నాకు నువ్వు చీర కట్టిన సీతవలె కనిపించావు. సీత ఎలా ఉంటుందని నేను ఊహించినప్పుడు నార చీరలు ధరించి విల్లంబులు ధరించిన నీవే నాకు అమ్మవారై తోచావు ఇది శుద్ధాద్వైతం నీకు నాకు తేడా లేదన్నది అది అయోధ్య. అది కాలం గడపటం అంటే అతిథితో మీ ఊర్లో ఎట్లా ఉంది అక్కడ ఆ రాజ్యం ఎలా ఉంది ఈ రాజ్యం ఎలా ఉంది అప్పులపాలైందా ఇది కాదు ఇవి మాట్లాడుకోవాలి. అటువంటి ఆ శబరి రాముడితో మాట్లాడిన తర్వాత రాముడు ఒక మాట అంటాడు చాలా చమత్కారంగా అంటాడు సీతా స్వయంవరానికి వెళ్ళటానికి ముందు అహల్య మాతని కలిశాను నేను అప్పుడే శబరి నువ్వు గనక కలిసి ఉంటే అని ఒక ఆగుతాడు. ఏ ఏం చేస్తావ్ ఆహా అయోధ్య అని అహల్య దర్శనం అహల్య మాత దర్శనం చేసుకున్నాను మిహిళా నగరానికి వెళ్ళబోయే ముందు కాబట్టి నువ్వు గనక నాకు అక్కడే కనిపించి ఉంటే అని అనబోతుంటే అయితే సీతని పెళ్లి చేసుకునేవాడివి కాదా అంటుంది. చూశారా అది సౌందర్యం వేరు అందం వేరు అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది సౌందర్యం దమాన్ని మనిషికి ఒక ఆనందాన్ని ఇంద్రియాలను సమసింపజేస్తుంది. క్షమదమాదులను ఇచ్చేది అందుకనే శంకర భగవత్పాదులు అందాల లహరి రాయలే ఆనందలహరి నలభై ఒక్క శ్లోకాలు రాసి చివరలో ఉన్నదంతా సౌందర్యలహరి అమ్మవారిని సౌందర్య స్వరూపిణిగా చూశారు. ఇటువంటి ఇటువంటి ఉదాత్త భావనలన్నీ రావటానికి ఇదిగో మన రామాయణంలో ఉన్నటువంటివి భాగవతంలో ఉన్నవి భారతంలో ఉన్నవి కేవలం కథగా కాకుండా మీకు ఇంకొకటి కూడా చెప్పాలని అనుకున్నాను మనం స్వామి ప్రాంగణంలో ఉన్నాం. టీవీ సీరియల్స్ లో వచ్చే భాగవతాలను వినకండి చూడకండి అవన్నీ కల్పనలు అబద్ధాలు హాయిగా మనకు ఒరిజినల్. శివపురాణం కూడా శివ పురాణం చెప్ శివపురాణం ప్రారంభం కాగానే అది నాకు శవ పురాణంలా కనిపించింది. కాబట్టి మనకు ఆఖరి గ్రంథాలు ఉన్నాయి మనం చదువుకున్న వాళ్ళం చదువులేదనుకుందాం చదువుకున్న వాడి దగ్గరికి వెళదాం వెళ్లి వాళ్ళని అడుగుదాం అయ్యా ఇది ఇంతేనా ఇది ఇంతేనా అని. కథా గమనంలో మూల గ్రంథాలు చదివి తీరాలి ఆ తర్వాత మనంతట మనం విశ్లేషణ చేయాలి పరస్పరం మనం ఇలా మాట్లాడుకోవాలి. ఇవాళ ఏదో అతిథి దేవోభవ అంటూ గంట కాలం చెల్లగొట్టుకోవడానికి రాలే వీళ్ళందరినీ ఎందుకు పిలిచాం మనం? వీళ్ళందరూ కూడా దాంట్లో కృషి చేసినటువంటి వాళ్ళు కనుక ప్రతి వ్యక్తి యొక్క పర్సెప్షన్ ఇంటర్ప్రిటేషన్ చాలా ఉదాత్త స్థాయిలో జరిగితే తప్ప మళ్ళీ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైన ఈ వాంగ్మయం మళ్ళీ మన తర్వాత తరానికి అందించలేము కాబట్టి ఇవాళ నుంచి మనం మూల గ్రంథాలు చదివి యధావిధి చక్కగా గనుక వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక తరువాత ఆ శబరి చివరగా అన్నది శబరి నీకేం కావాలి అయోధ్యకు వెళ్తాను తొందరగా నీకేం కావాలి కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు జీవుడి మీద వేసే వల ఇది మాయావల కదా కావాలి అన్నదా జన్మ ఎత్తాలి. అక్కర్లేదు అన్నదా జన్మ రాహిత్యం ఏర్పడుతుంది మరి ఏం చేయాలి? జీవుడికో సంస్కారం ఉంటుంది అంతర్యాగం జరుగుతుంది ఆ యాగంలో నుంచి మన్మహాయోగ నిష్ఠ సమాధి నుండి విక్రియా పేత బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస దగిలి భ్రష్ట యోగిని కవి జన్మ బడిసినాడా అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. బ్రహ్మ లోకం దాకా వెళ్లి ఈ లోకమంతా వర్ణించి మళ్ళీ ఈ జనానికి చెప్తే బాగుండును అన్న ఆలోచన కలిగినందువల్ల మళ్లీ ఇదిగో ఈ జన్మ ఎత్తానని బాధపడ్డాడాయన. కాబట్టి శబరి ఏమడిగిందో శబరిని రాముడు అడిగినప్పుడు శబరి ఏమన్నదో తెలుసునా? రామా నిన్ను చూచిన తర్వాత ఇక చూడటానికి ఏముంది తపస్సులు, ఋషులు, ఆచార్య సత్తములు వీళ్లంతా తపోభూమికలో ధ్యాన ముద్రాంకితమైనటువంటి ఒక హృదయంతో నిన్ను దర్శించాలి ఫిజికల్ గా భౌతికంగా అంటే వాళ్ళకి దర్శన మాత్రంగా కూడా నీవు అనుగ్రహించలేదు నా వాకిట్లోకి నడిచి వచ్చి ఏడు దారుల్లో ఎటు నుంచి వస్తావో తెలీదు నా దగ్గరికి వచ్చావు ఒక్క పని చెయ్ ఏ శరీరంతో నేను ఇక్కడికి వచ్చానో ఏ రామదర్శన అపేక్షతో నా జీవితాన్ని గడిపానో నాకు ఇక్కడి నుంచి విదేహ విముక్తిని ఇచ్చేసెయ్యన్నది. ఇదే జీవన్ముక్తం కాదు విదేహ విముక్తి ఇక నాకు ఈ దేహంతో కూడా పని లేకుండా చెయ్యన్నది. అని యోగాగ్నిలో తనను తాను దగ్ధం చేసుకున్నటువంటి ఒక పరమాద్భుత సన్నివేశమే రామ శబరి సంయోగం ఆ సమాగమం. అటువంటి వాటిని మనం ఇవాళ చక్కగా చెప్పుకున్నాం అలాగే అతిథిగా వచ్చినటువంటి వాడు మనం మర్చిపోయినటువంటి వాడు ఒకడు ఎవడంటే వామనావతార ఘట్టం. కథంతా మనం చెప్పాం దాత ఎవరు? బలి. అతిథి ఎవరు? మహావిష్ణువు. గురువు ఎవరు? ఇది గనక నువ్ ఇచ్చావా నీ ఆస్తులు పోతాయి ఇంద్రపదవి పోతుంది అని అంటే వాడన్నాడు ఎంతమంది రాజులు రాలేదు ఎంతమంది పోలేదు పోనీ ఏ యజ్ఞాన్ని నేను ఎవరు రావాలని అనుకొని చేస్తున్నానో ఆయనే నా వాకిట్లోకి వచ్చి ఒకటి రెండు అడుగులు అన్నాడే తప్ప సినిమా వాళ్ళు దాన్ని మూడు అడుగులు చేశారు. ఒకటో రెండో అన్నాడు వీళ్ళు వన్ ప్లస్ టు ఈస్ ఈక్వల్ టు త్రీ అని మూడోది ఎక్కడ ఎక్కడ అని మనకు చూపించారు. ఓ మూడోది కూడా అడిగాడనుకున్నాం అసలు మూడు ఉన్న అడుగు ఒక్కటే అడుగే సర్వవ్యాపకమైనటువంటి చరాచరమైన జగత్తుని పధ్నాలుగు లోకాలని పధ్నాలుగు భువనాలని ఆక్రమించిన ఒక్క పాదమే ఆయన బలిని తొక్కలేదు.ఆ బలి యొక్క బ్రహ్మ రంధ్రం మీద తన పాదాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖా దవిరంచితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. గురువు యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి. జీవుడి అరచేతిలో కర్మ రేఖలు ఉంటాయి. అందువలన గురుపాద సంస్పర్శన చేయాలి. ఈ పరమేశ్వరుడు అయినటువంటి మహావిష్ణువు బలి చక్రవర్తి యొక్క బ్రహ్మ రంధ్రం మీద కాలు పెట్టి అతనికి ఆ-ఆ పాతాళ లోకానికి పంపాడు. ఒక్కడినే పంపాడా? తాత అయిన ప్రహ్లాదున్ని కూడా పంపాడు. ఇంకా ప్రహ్లాదుడికి ముక్తే కలగలా. విష్ణు లోకానికి ఇంకా వెళ్ళలా. వీళ్లిద్దరూ ఎక్కడున్నారు పాతాళ లోకంలో? వీళ్ళకి రక్ష ఏమిటంటే సుదర్శన చక్రము యొక్క కాంతి వలయమే వాళ్ళకి రక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరంతర సంతత సా-- రామనామ స్మరణ అంటే నారాయణ నామస్మరణ చేస్తూ ఇంకా అక్కడే ఉన్నారు. ఇటువంటి పురాణగతమైనవన్నీ గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎవరు అతిథి అంటే మన ఇంటికి వచ్చిన వాడు. మనకు తెలిసిన వాడు. అభ్యాగతుడు sudden గా వచ్చేవాడు దుర్వాసుడి లాంటి వాడు. ఆహూతుడు మనం పిలవగా వచ్చినవారు. నిజానికి three different layers అయినప్పటికీ కూడా ఈ ముగ్గురూ ఒక్కటే అనేటువంటి భావనతో మనందరికీ పరిచయమైన, మనందరం అనుభవించిన సత్యసాయి భగవానుడిని మించినటువంటి host ఈ ప్రపంచంలో ఉన్నాడా? అంటే లేడు, లేడు, లేడు. సామాన్య భక్తుడి నుంచి రాష్ట్రపతి వరకు స్వామి ఆతిథ్యం ఎట్లా ఇస్తారో, ఎట్లా personal గా ప్రతి ఒక్క విషయాన్ని చూస్తారో tumbler, tongue cleaner, powder, soap అన్నీ ఎలా పెడతారో చూసినప్పుడు ఓహో! ఎప్పటికైనా ఒక అతిథిగా గనుక స్వామి దగ్గరకు వెళితే స్వామి యొక్క attention ప్రతి వ్యక్తి మీద ఎలా ఉంటుందో చూసిన వాళ్ళం, అనుభవించిన వాళ్ళం గనుక ఇవాళ ఈ జరిగినటువంటి కార్యక్రమం అంతా మనల్ని స్వామి అతిధులుగా ఇక్కడికి పిలిపించి, ఆహూతులుగా ఆహ్వానించి స్వామి యొక్క దయని మనకు ప్రసాదనం చేయబోతున్నారు. ఆ కరుణా ప్రవాహాన్ని అందుకునే దిశగా మనం మళ్ళీ వచ్చే సంవత్సరం, ఏమిటి దానికి ఏదో పేరు పెట్టుకున్నాం కదా! మిత్రుదేవోభవ అనేటువంటి కార్యక్రమానికి స్వామి అనుగ్రహం మనపై ఉండుగాక అని స్వామిని మనసా, వచసా, శిరసా ప్రార్థిస్తూ ఇవాళ వచ్చినటువంటి ఇవే-- వచ్చేదాకా ఇక్కడ అతిధులు వాళ్ళు కదా! స్వామి సివం ప్రాంగణంలోకి వచ్చాక వాళ్ళు మన సోదరులు, సోదరీమణులు. వాళ్ళు అతిధులు ఎలా అవుతారు? వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? ఇలాగే స్వామి కార్యక్రమాలలో మా ప్రయాగ రామకృష్ణ గారు, అలాగే మా పార్వతీశం గారు, భవాని గారు, అలాగే అనంత లక్ష్మి గారు ఎవరు ఎప్పుడు పిలిచినా కాదనకుండా వెళ్ళవలసిందిగా నేను కోరుతూ మీ అందరికీ సాయి రామ్.
YouTube · audio
Sri Satya Sai Study Circle Prashanthinagar Samithi , HYD ll SATHSANGH "ATHIDHI DEVO BHAVA" ll LIVE
Sri Satya Sai Study Circle Prashanthinagar Samithi , HYD ll SATHSANGH "ATHIDHI DEVO BHAVA" ll LIVE
Source: Cultural TV live on YouTube
0:00 / 4:33:18
More in this series
Sri Sathya Sai Study Circle — SATHSANGH (Prashanthinagar Samithi)
-
39 min 1 Sri Satya Sai Study Circle Prashanthinagar Samithi , HYD ll SATHSANGH "ATHIDHI DEVO BHAVA" ll LIVE
Now playing -
35 min 2 Sri Sathya Sai Study Circle Prasanthi Nagar Samithi ,Hyd l"SATHSANGH" On "MITHRA DEVO BHAVA" l LIVE
-
20 min 3 Sri Sathya Sai Study Circle, Prashanthnagar Samithi ll SATHSANGH ON AYAM ATHMA BRAHMA