No transcript for this section.
Transcript begins at 4:26.
అమ్మ దివ్య శ్రీ చరణాలకు నా ప్రణామ సాదర సన్మానిస్తూ! అమ్మ సంకల్పానుసారం అమ్మ నిర్ణయించిన కాలం ప్రకారం జరుగుతున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది వాక్కు అర్చన, రెండవది అక్షరార్చన. ఒక తపస్సు లో నుంచి అమ్మ జీవితాన్ని అనేక కోణాల్లో అంతరంగిక దర్శనం చేసి అమ్మ అవతార కార్యక్రమం వెనుక ఉన్నటువంటి ఆ శక్తి అది ఎట్లా బహుముఖీనంగా ఈ ప్రపంచానికి సుమారు తొంభై తొమ్మిది సంవత్సరాలుగా ఎలా సాగిపోతున్నదో, కేవల భౌతిక అవస్థకు మాత్రమే పరిమితం కాక భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలో ఒక స్త్రీ మూర్తిగా అవతారం దాల్చినటువంటి జగజ్జనని మన అమ్మ. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలి? పైకి కేవల లౌకికంగా కనిపించే అనేకమైనటువంటి పరిస్థితులు, విషయాలు. ఇవన్నీ తాత్విక చింతనా ధోరణులు గనుక అదే అమ్మని ఒక సత్వాస్తువుగా భావించి విచారణ చేస్తే అమ్మని ఎలా అందుకోవాలి, అమ్మని ఎలా అర్థం చేసుకోవాలి. కేవల పూజాధికారులు మాత్రమే కాక, కేవలము అమ్మని వాత్సల్య స్వరూపిణిగా మాత్రమే కాక మనం విశ్వజననిగా, జగజ్జననిగా, లలితగా, రాజరాజేశ్వరిగా ఎన్నో రకాలుగా సంభావన చేస్తున్నప్పుడు అటువంటి ఆ మహాస్థితిలో ఉన్నటువంటి ఒక శక్తి పాంచభౌతిక దేహం తీసుకుని వచ్చి ఈ ప్రపంచంలో ఏం చేసింది, ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేటువంటి అనేక విషయాలని ఆ-ఆ కోణంలో ఆవిష్కరిస్తూ ఒక పు-పుస్తకం రాయడం జరిగింది. జరిగి కూడా నాలుగైదేళ్లు అయిపోయింది. ఆ పుస్తకం పేరు అమ్మత్వం. అమ్మ తెలుగు పదం, త్వం సంస్కృత పదం. ఈ రెండూ కలుస్తాయా? కలుస్తాయి. రామత్వం, కృష్ణత్వం లాగానే అమ్మత్వం. ఆ అం-ఆ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి బీజాక్షరాలే అమ్మ ఈ కాలం మీద చేసిన పెద్ద సంతకం. కాలాతీతమైనటువంటి ఒక జగజ్జనని తన సంతకం అనసూయ అని రాయలేదు, జగ్గెళ్ళ మూడి అమ్మ అని రాయలేదు. మనం రాసినట్టు ఆ పక్కన మా-మా కింద వత్తు పెట్టలేదు. ఏం జరిగింది అంటే అం ఆ అని చెప్పి. దాన్ని ఆ అనేక కోణాల్లో ఒక తరం అయిపోయింది, ఒకటేమి To be కొని తరాలు అయిపోయాయి. కొత్త తరం మళ్ళీ పుడుతూ-పుడుతూ ఉన్నది. ఈ పుడుతున్న సమయంలో అమ్మని ఎలా పరిచయం చేయాలి మళ్ళీ కొత్త తరానికి. మహిమలు, అనుభవాలు మనకున్నాయి కానీ మన అనుభవాలు మనమే కానీ ఇంకొకళ్ళవి కావు. నిజమేనా అనే ప్రశ్న కంటే మేము అనుభవించింది ఇది అని మన వైయక్తికంగా చెప్పేకంటే ఒక విస్తృతమైనటువంటి canvas మీద అమ్మని గనక ఆవిష్కరించుకుంటే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన కలిగినప్పుడు వచ్చిన పుస్తకమే అమ్మత్వం. ఆ రోజుల్లో ఆ ఒక్క వెయ్యి పుస్తకాలు వేస్తే నాకు తెలిసిన నా దగ్గరకు వచ్చినటువంటి information లో సుమారు యాభై ఎనిమిది వేల మంది ఆ గ్రంథాన్ని చదివారు. ఈ మధ్య ఊరికే ఏ సందర్భం లేదు ఒక phone వచ్చింది. వంద కాపీలు కావాలని. నా దగ్గర రెండు కాపీలున్నాయి. అదే సమయంలో అతి విచిత్రంగా రామబ్రహ్మం గారు కూడా నాకు కొన్ని కాపీలు ఇవ్వాలి, అమ్మత్వం ఇప్పుడు చదవాలని అనుకుంటున్నాను అన్నారు. ఇవ్వగలిగితే ఒక్క కాపీ ఇవ్వగలనేమో కానీ providence మనమంతా-అంతా coincidence అని ఏదో కాకతాళీయంగా జరిగిపోతాయి అనుకుంటాము. అమ్మ సంకల్ప మాత్రం చేత అమ్మత్వం పుస్తకం ఆ పాత edition ని first print ని కాకుండా మళ్ళీ ఒక వినూత్నమైనటువంటి రీతిలో revision revised edition. అమ్మ దేహం వదిలిపెట్టిన తర్వాత ఒక చైతన్య స్వరూపిణిగా సర్వవ్యాపిగా ఉన్నటువంటి సమయంలో జిల్లేళ్ళమూడిలో జరుగుతున్నటువంటి, జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఛాయాచిత్ర రూపంలో నిక్షిప్తం చేసి ఇవాళ తరానికి అందేట్లుగా ఆ గ్రంథ రచన సాగింది. ఇది అమ్మ మాకు ఎంత అర్థమైపోయింది, మాకంతా తెలుసు అన్న వాళ్ళకి ఈ పుస్తకం అక్కర్లేదు. ఎందుకంటే తెలుసు అన్న వాడికి తెలియ చెప్పవలసిన పని లేదు. తెలుసుకోవాలి అనుకున్న వాడికి ఈ గ్రంథం కరదీపిక, చేతిలో torch light. ఈ కేవల విగ్రహ నిగ్రహ స్వరూపంగా మాత్రమే కాక, వాత్సల్య స్వరూపిణిగా మాత్రమే కాక, మనం ఊహించి సంభావన చేసిన దేవతా మూర్తిగా మాత్రమే కాక, ఒక మానవతా వనిదీపంగా అమ్మని ఎలా అర్థం చేసుకోవాలి, ఆమె వేసిన బాట ఏమిటి, చూపిన మార్గం ఏమిటి, దాంట్లో మనల్ని మనం ఎలా పునర్నిర్మాణం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి, ఆలోచన స్థిరపడిన మరుక్షణమే రామబ్రహ్మం గారు ఆ బాధ్యత నేను తీసుకుంటా అన్నారు. అయితే ఎప్పుడైనా ఒక పుస్తకం నేను ఎప్పుడూ print చేయను. పుస్తకాన్ని craft చేస్తా. దాన్లో అమ్మంత అందంగా ఉండాలి, అమ్మంత పవిత్రంగా ఉండాలి. అమ్మ మా-సర్వ ప్రపంచాన్ని తన ఆవరణంలోకి ఎలా లాక్కున్నదో ఆ గ్రంథం దానిలో ఉన్న విషయాలు కూడా అలాగే ప్రపంచానికి అందాలని భావన చేసినప్పుడు ఆ పుస్తకాలన్నీ print అయిపోయాయి. అయిపోయాక ఎప్పుడో జనవరిలో వెళ్దాం, ఫిబ్రవరిలో వెళ్దాం అనుకునే సమయంలో ఈ రోజున ఇక్కడికి రావటం గ్రంథావిష్కరణ కోసం రాలే. అలాగే...కాలేజీ స్వరన్ ఉత్సవాలు కాబట్టి బుక్కు ఇక్కడ రిలీజ్ చేయాలని అనుకోలేదు. అదే అనుకున్నట్లయితే రేపు సభలో చేసి ఉండేవాళ్ళం. దీనికి దానికి ఎట్టి సంబంధం లేదు. ఆ వంద పుస్తకాలు అడిగిన ఆ అమ్మవారు ఎవరో నాకు తెలీదు. మళ్ళీ నాకు ఫోన్ రాలే. రామబ్రహ్మం గారికి అవకాశం ఇచ్చి. ఆ మళ్ళీ నాకు ఒక కాపీ కావాలని ఆమె అడగలేదు. బహుశా ఆ ఫోన్ ఆమె ఎవరో మనకు తెలియదు. అది అమ్మాయి ఉండాలి. దాని అవసరం కాదా వచ్చింది కనుక నేను దాన్ని అట్లాగే కావాలని చేశా. అమ్మ భక్తుడు అయినటువంటి రామబ్రహ్మం గారు సింహభాగం అయన్ని చేస్తే మిగతా వాళ్ళు కొద్దికొద్దిగా వాళ్ళకి తోచింది ఏదో దాని కోసం అమ్మకి సమర్పించినట్లుగా చేసినప్పుడు ఆ పుస్తకం బయటికి వచ్చింది. ఆ పుస్తకం మాత్రమే కాదు అది అమ్మ యొక్క తత్వ స్వరూపం. కాబట్టి జీవితంలో అమ్మ అంటుంది కదా, అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు. మనకంతా అమ్మ తప్పదు అంటే నెగెటివ్ కాదు. మంచి పనులు ఎప్పుడూ చేయడానికి ఉన్నయి తప్పం, చేయవలసిందే. అటువంటిది ఇవాళ ఈ మంచి సందర్భంలో మార్గశిర మాసంలో చాలా అత్యంత పవిత్రమైనటువంటి వేద సమానమైనటువంటి కాలం మార్గశిర మాసం. ఆ సమయంలో అమ్మ సన్నిధిలో ఈ సాయంకాలం మనందరం ఇక్కడ ఉండి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకునేటువంటి ఒక అదృష్టాన్ని అమ్మ కల్పించింది. అమ్మకు శతఘట, బహుధా, సర్వధా, మనసా, వచసా, శిరసా ప్రణమిల్లుతూ ఈ గ్రంథావిష్కరణని చేయడానికి అంటే నిజానికి జిల్లెళ్ళమూడిలో ఏ కార్యక్రమం జరిగినా అది ఎప్పుడు జరిగినవ్వండి, ఎవరి పర్యంగా జరిగినవ్వండి అమ్మ కొడుకైనటువంటి రవన్న అయ్యర్ చేతి మీదుగా జరగాలి. అది మనం అమ్మకి ఇచ్చే గౌరవం. కనుక తర్వాత అమ్మకి నిజమైన సద్భక్తుడు వినయశీలి అయినటువంటి రామబ్రహ్మం గారికి కూడా అర్హత ఉన్నది. ఆయన ప్రెసిడెంట్ గా చేశారు. నిరంతరము జై హో మాతా అంటూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. ఆ ఆయన రవన్న అయ్యర్ కలిసి ఆ గ్రంథాన్ని అమ్మ పాదాలకు సమర్పించవలసిందిగా కోరుతూ ఇవాళ అమ్మకి ఇంకా సంతోషం కలిగేది ఏంటంటే ఆ ఆమె స్టూడెంట్ ప్రిన్సిపాల్ అయి కరెస్పాండెంట్ అయిన సుగుణా, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి సందర్భం రవన్న అయ్యర్, పి.ఎస్.ఆర్. ఆ దినకర్ వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు. వీళ్ళంతా అమ్మ ఎంచుకున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు. అలాగే కొన్ని పుస్తకాలు మాత్రమే ఇవాళ ఈ క్షణానికి నేను తెచ్చాను గనుక ఈ సందర్భానికి. ఒక చిన్న లిస్టు నా మనసుకు తోచిన కొన్ని పేర్లు వెంటవెంటనే చెప్పాను. దాని ప్రకారమే ఆ కాపీలు తీసుకోండి. మిగతా వాళ్ళు ఇవాళ ఇవ్వలేదని అనుకోకండి. ఉన్నాయి. అవి రేపటికి, ఎల్లుండికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో ఉన్నటువంటి ఆ లిస్టు ప్రకారమే ఆయన చేస్తారు. ముందుగా రామబ్రహ్మం గారిని, రవన్న అయ్యర్ ని వచ్చి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. నవీన్ రండి. ఆ మది లేదు మనకు సంపవలేదు. నేను చేసేదేంటి వాళ్ళు చేస్తే నేను చూస్తా అండి. జై హో మాతా. ఓం జశ్చందసా విశ్వరూపః ఛందభ్య జమదా సంభూతా సకలేంద్ర మేధయా స్ప్రుతా అమృతస్య దేవతా పూజనం శేలీలం తే విధధతు. యత్వాంగే భగవంతా ధన్దాన ధ్యాన్ధ విశ్ర్వమ్ బ్రహ్మణో వచో నిధిధయా విహితః వృదన్మే నో వాజా ఆహుం దీవిదం వానా దుర్వాణా జయమాధ్వానః వాజాం స్తిరమగా పశ్చాన్నరామేక సర్వదా తతో మే శ్రియమాధ్వ లోకాన్ బరుహి సాస్వాహా. ఆమాయెంధో బ్రహ్మదారినస్వాహా ఇమాయెంధో బ్రహ్మదారినస్వాహా ప్రమాయెంధో బ్రహ్మదారినస్వాహా యేషోనిధే బ్రహ్మదారినస్వాహా యశ్శాధినేధానిస్వాహా శ్రేయాధమస్య ప్రసాదిస్వాహా తన్మా భగ భవిష్యతిస్వాహా సనాత్ భగ భవిష్యస్స్వాహా. తే నం గాణేచ విద్మహే నారకేచ పథీచ ధీమహి తన్నో మహసూర్యా ప్రచోదయాత్. మాతృశ్రేయసూయా మహాదేవికి జై! కోటి నాగ స్వరూపిణి అసుయా మహాదేవికి జై! నిత్యా స్వరూపిణి అసుయా మహాదేవికి జై! నితాంతేశ్వరిణి అసుయా మహాదేవికి జై!పుస్తకం తరగగానే [క్రాస్ టాక్] అమ్మ తత్వాన్ని చాలా గొప్పగా చెప్పారు సర్. ఒకట్టా కాదు, చాలా... ఎంత గొప్పగా ఉందంటే, ఎంత గొప్పగా... అమ్మను సాక్షాత్కరింప చేసినట్లు అయిందన్నమాట. మీరు వచ్చేసి మా-మా మాటలు చెప్తా, సాక్షాత్కరింప చేశారన్నమాట. ఆ వాక్కు దైవదత్తం అన్నమాట. మీరు మాట్లాడుతున్నది అమ్మ గురించి, తత్వాన్ని అమ్మ తత్వం చెప్తూ, ఆ భాషాభావం అనేటువంటిది, ఆ దైవదత్తమైనటువంటి ఆ పదప్రయోగం ఆ పదాలు అలవకుస్తున్నా అంటే, ఆమె మనకు అమృత వాక్కులను మనకు ఇచ్చినట్లుగా నాకు అనిపించిందన్నమాట. మీరు ఎంత అలరకలగా చెప్తున్నారంటే, ఒక గొప్ప పండితులు, ఆ బాగా చదువుకున్న నిష్ణాతులు కూడా అంత తరహా చెప్పలేరు. కానీ మీరు అంత స్వచ్ఛంగా సరళంగా చెప్తున్నారంటే నాకెంతో ఆనందంగా ఉంది. నేను భాషాభావం చదువుకోలేదు కదా, కానీ నాకు సంతోషం అయింది. ఆ చాలా సంతోషం. సర్ నేను మాట్లాడతా [క్రాస్ టాక్] నా పేరు నర్ముల ప్రసాద్ సర్ మా, మదనపల్లి నుంచి. ఎక్కడి నుంచి? మదనపల్లి. మదనపల్లి ఓ [క్రాస్ టాక్] అమ్మ పాదాలకి నమస్కరిస్తూ, అన్నయ్య గారికి నమస్కారం. ఈరోజు, ఈరోజు అనుకోకుండా జరిగిన ఈ అద్భుతమైన సంఘటనలో పాల్గొనటం నాకు చాలా సంతోషం. ఇది ఊహించింది కాదు, అనుకోకుండా అమ్మ సంకల్పించింది. అయితే అమ్మ శతజయంతికి ముందుగా వస్తున్న ఈ పుస్తకం లక్షలాది మందికి, కోట్లాది మందికి అమ్మని పరిచయం చేసి, వారందరినీ అమ్మకి ప్రియముసు పెట్టుకోవడానికి, తన శతజయంతి ఉత్సవాలు అద్భుతంగా జరగటానికి, ఇది ఒక నాందిగా భావిస్తూ అమ్మకి ఆ రకంగా ప్రేరణ కలిగించమని ప్రార్ధిస్తూ నేను సేవ చేసుకుంటా. [క్రాస్ టాక్] అమ్మ పాదాలవద్దకి నమస్కారం చేసి, ఇక్కడున్న అక్కయ్యలకి, అన్నయ్యలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పుస్తకం ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు వచ్చినప్పుడు చదవడం జరిగింది గానీ, నాకు ఈ పుస్తకం రావడం చాలా ఆలస్యంగా వచ్చింది నా చేతికి. ఆ వచ్చిన పుస్తకం కూడా పొరపాటున ఇక్కడే ఉండిపోయింది కరవు కాలం, నేను చదవలేకపోయాను. సరే గత సారి వచ్చినప్పుడు నా ఇక్కడున్న లైబ్రరీలో నుంచి తీసి పుస్తకం తీసుకెళ్లి చదివా. చదివిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో ప్రతి అ-అ-అధ్యాయం అని వస్తే, ఇందులో వచ్చిన chapters ప్రతి దీంట్లోనూ ముందు ఒక గుణాన్ని గురించి విశేషంగా చెప్పి, ఆ గుణాన్ని అమలు చూపించి, ఫైనల్ గా మనం దాన్ని ఎట్లా ఆవిష్కరించుకోవాలో చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లోనూ అలా ప్రతి chapter లోనూ నాకు తోచినటువంటి ఇది విశేషం ఇదన్నమాట. ఈ ప్రథమ ఉపాయ పంచరణనే ఒక రెండు మూడు సార్లు చదివా. సరే ఇది నిన్న నాకు permission ఇచ్చారు చూడొద్దన్నారు. నిన్న ఉదయం నిన్న మొన్న phone చేసి, ఇవాళ చాలా మంచి రోజు త్వరగా ఈ అమ్మ పాదాల మీదకి తీసుకు, ఆ పుస్తకం మీరు తీసుకోమని చెప్పి అన్నయ్యగారు నాకు permission ఇచ్చారు. సరే పాచీలు తీసి తీసి అమ్మ పాదాల దగ్గర పెట్టి చదవటం మొదలు పెడితే, మొత్తం ఒక రోజులో మొత్తం పుస్తకమంతా ఒకసారి చదివా, రెండోసారి చదివా. అసలు ఈ పుస్తకంలో మన జీవితాన్ని ఏ పుస్తకాలు చదవకో-కో-కోకుండా మోక్షాన్ని పొందటం అంటే ఏంటో ఆ స్థితికి తీసుకెళ్తుంది. అమ్మ అందరికీ సుగతి అన్నది కదా! ఇందులో ఒక సుగతి అనే పదం ఒక ఆ chapter ఉంది. ఆ సుగతి అంటే మంచి దారి అని. ఆ మంచి దారిని మనం ఎట్లా అసలు చూడాలి అనేది కూడా చెప్పారు అన్నమాట. అది ఎట్లా సుగతి, అందరికీ సుగతి అయిద్దో చెప్పారు. అట్లా మనకి అమ్మ చెప్పిన వాక్యాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరణ ఇచ్చుకుంటూ పోతే, మనకి చాలా లోతైనటువంటి అధ్యయనం దొరుకుతుంది అనేటటువంటిది నేను భావించాను. కాబట్టి మనం చదవటం ఒక ఎత్తు, ఆచరణాత్మకంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అంతవరకు దాని యొక్క ప్రయోజనం లేదు. ఏది అయినా సరే సత్యం పలుకు అంటాం, కానీ మనం సత్యం పలకడం అనేది ఎట్లా అభ్యాసం చేశాం అనేది important. ఇందులో ప్రతి chapter లోనూ కూడా ఆ ఆచరణకి అనుకూలమైనటువంటి దానిగా ఆయన ఇవి చెప్పుకుంటూ వచ్చారని నా-నేను భావిస్తున్నాను. ఇది మన జీవిత విధానాన్ని మార్చగలిగినటువంటి, సత్తా కలిగినటువంటి పుస్తకమనిగా నేను భావిస్తున్నా. విశేషం ఏంటంటే, ఈ పుస్తకం వచ్చింది ముందు నేను భావించలేదు. నాకో రెండు వందల కాపీలు పంపించారు, మూడు వందల కాపీలు పంపించారు అన్నయ్యగారు. ఆ మొన్న శేషాజ్రికి phone చేసి, "నేను కూడా చదివాను ఈ పుస్తకాన్ని, [కొవ్వు] ఈ పుస్తకం సత్తా మా old students అందరికీ ఇస్తే అమ్మ గురించి వాళ్ళు చక్కగా అవగాహన చేసుకోవటమే కాకపోకుండా పది మందికి అమ్మ message ని చాలా perfect గా తీసుకెళ్తారని నాకు మంచి విశ్వాసం కలిగింది" అన్నయ్యగారు, ఆ మొత్తం అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారన్నమాట. అయితే అన్నయ్యగారికి చెప్తే వెంటనే ఆయన స్పందించి మనం రెండు వందల రూపాయలు ఫీస్ పెట్టాము కానీ వంద రూపాయలకే మొత్తం మూడు వందల మందికి ఇచ్చేద్దాం అన్నారన్నమాట. మూడు వందల, ఇప్పుడు ఈ మూడు వందల మంది old students కి ఇవ్వటానికి మూడు వందల పుస్తకాలు నేను తీసుకొచ్చాను. ఇంకో వంద పుస్తకాలు రాగివ్వటానికి ఆయన, నేను కోరింది మట్టుకు వంద పుస్తకాలు కావాలని.అంటే నా స్నేహితులు కానీ friends కానీ అమ్మను గురించి చెప్పాలంటే అమ్మ అంటే ఇది అని చెప్పటానికి అమ్మ అవతారాలు గురించి నేను రాస్తూ ఆ నేను ఆ మొదటిసారి President అయినప్పుడు పుస్తకాలు reprint చేస్తూ ఒక దాంట్లో రాశాను అన్నమాట అమ్మ ఎందుకు అవతారాలు ఎత్తింది అని. ఈ అమ్మ ఆ అమ్మను తెలియజేయటానికైనా ఒక అవతారం ఎష్టంగా ఆయనే చెప్పారు. అట్లాగే నేను భావించింది ఏంటంటే ఒక అవతారం ఇచ్చినప్పుడు ఒక ధర్మం క్షితి అయితే ఆ క్షితిని ఉద్ధరించడానికి భగవంతుడు వస్తాడు అనేటువంటిది మనకి భగవద్గీత చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి నేను అమ్మ ఈ ప్రపంచంలో ప్రేమ అనేది దూరమైపోతున్నది ఆ ప్రేమని మళ్ళీ ఏమిటో చవి చూపించి మనందరినీ ఆ సేవలో, మార్గంలో మనల్ని తీర్చిదిద్ది ఒక మానవీయ కోణంలో మనల్ని పెంచడమే కాకుండా మనలో దైవాన్ని ఆ-ఆవిష్కరించడం అనేటువంటి ఇది అన్నమాట. ఆ దైవం ఆవిష్కరించినట్టే నేను చదవగా చదవగా ఒక రెండు మూడు వేల పుస్తకాలు చదివిన తర్వాత మనసుని తీసుకెళ్లి హృదయంలో కలపడమే మనకి ఆ సాధన అంతా. ఏ సాధన చేసినా సరే అదేరా అనేటటువంటిది ఈ మాట. ఈ పుస్తకంలో ఆ హృదయాన్ని మాస్టారుగారు మనల్ని తీర్చిదిద్దారు అన్నయ్య గారు అనేది నేను పూర్తి విశ్వాసంతో ఇది చెప్పి ఏదో మాకున్న చిన్న వరాహంలో నేను చేసి ఇద్దరు ముగ్గురు స్నేహితులు అడిగితే వాళ్ళు ముందుకు వచ్చారు మొత్తానికి. అయితే పుస్తకంలో ఫోటోలు తీసేద్దామా ఒక పదిహేడు ఏళ్ళు తగ్గుతుంది మరి మీరు భరిస్తారా అని అడిగితే ఆ పుస్తకంలో అవి లేకపోతే సరైనది లేదని ఆయన అభిప్రాయం అదే, నాచేత చెప్పించారు. అమ్మా మనచేత చెప్పించి ఆ చెప్పేటప్పుడు ఆ అన్నయ్య గారు కూడా ఇది లేకపోతే బాగా లేదు అని నాచేత చెప్పించి మళ్ళీ అప్పుడు అయితే ఇందులో ఈ పుస్తకంలో మన సంస్థల గురించి వ్రాసి లేదు. ఇది ఒక రోడ్ గా వెలిసిపోతుంది అంటే మన సంస్థ ఏ ప్రచురణ అయినా సరే మనకు జరుగుతున్నటువంటి ఇక్కడ సంస్థలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలకు తెలియాలి. అమ్మ జీవితాన్ని అంటే ఆ-దేవ-ఆ నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి అని చెప్పాలి కాబట్టి మరి ముఖ్యంగా అనంపు నవాబు, తర్వాత ఆ వైద్యాలయం, విద్యాలయం, దేవాలయం గోశాల ఆ దేవు-గోశాల ఇట్లాంటివన్నీ ఉండి లే-లేటెస్ట్ గా ఉన్నటువంటి ఛాయాచిత్రాలు ఇక్కడి నుంచి తెప్పించుకుని దానిలో మొత్తం ఏరి, ఊరి ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రెస్ వాళ్ళు ఆ తీసే చరిత ప్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఆ ఆ కళాజ్యోతి కళాజ్యోతి వాళ్ళు కానీ అసలు ఎంత వాళ్ళు కేవలం డబ్బు కోసం చేసినట్టుగా లేదు ఇది. ఒక అద్భుతమైనటువంటి తర్వాత ప్రింటింగ్ మిస్టేక్ ఎక్కడైనా దొరుకుతయా అని చాలా clean గా చూశాను. నాకు తెలిసినంతవరకు ఎక్కడా నాకు అది దొరకలేదు ఇవాళ. ఫస్ట్ రీడింగ్ లో, రెండు రీడింగ్ లోనూ ఇవాళ ఈ పుస్తకంలో రెండు త్రీ రీడింగ్ జరిగాయి రెండు రీడ్ లో నాకు ఒక్క తప్పూ కూడా దొరకలేదు అంటే బాగా ఉంటే ఒక ఐదు, ఆరు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, దొర్లి ఉండొచ్చు కానీ అంత శ్రద్ధగా ఆయన ఐదు-ఐదు సార్లు దాన్ని ఆ సవరణ చేసి ఇంత సర్వాంగ సుందరంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువచ్చారు. అంచేత మనం అన్నయ్య గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను, నేను మిమ్ములందరినీ కూడా అభినందిస్తున్నాను. మళ్ళీ ఒకసారి పంతొమ్మిది వందల అరవై రెండులో అమ్మను దర్శనం చేసుకుని మొట్టమొదటిసారి అమ్మని నేను ఎప్పుడూ చూడలే అమ్మని దర్శనం చేసుకున్నాను. మొదటి రోజు నుంచి చూట్టం వేరు, దర్శనం వేరు. ఈ ఇరవై రెండు కంటే ఇంకో ఇరవై ఐదు రోజుల తర్వాత అమ్మ దర్శనానికి షష్టిపూర్తికి నేనున్నా. బాగుంది అరవై సంవత్సరాలు అమ్మ అందుకే దర్శన షష్టిపూర్తి అని రాసాం. అలాగే అమ్మ మనందరినీ కూడా చల్లగా కాపాడి ఆమె అవతార కార్యక్రమాల్లో మనకు-మనము ఎవరెవరు ఏం సేవ చేయగలమో ఆమెకు తెలుసు. ఆ సేవ మన ద్వారా అమ్మ ప్రపంచానికి అందించాలని మనస్సా కోరుకుంటూ అమ్మ ఇప్పుడు వారు చెప్పినట్లుగా అవన్నీ ఛాయాచిత్రాలు వేశాం. అది మళ్ళీ ఒక publicity pamphlet గా కాకుండా బొమ్మలు చెప్పిన కమ్మని కథలాగా. ఓహో. ఆ బొమ్మలే వేశాం చరితో ఓహో ఇట్లా జరిగినయి, ఇలా ఉన్నాయా అని అందరికీ తెలుస్తుంది. ఈ మనోత్తర సన్నివేశాన్ని కల్పించిన అమ్మకి మరొక్కసారి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ అనుగ్రహం ఈ సమస్త ప్రపంచం మీద ఉండాలని మంగళాశాసనం చేస్తూ జై హో మాత.
YouTube · audio
అమ్మత్వమ్ (Ammathvam) - Book Release Event
అమ్మత్వమ్ (Ammathvam) - Book Release Event
Source: Sree Viswajananee Parishat Trust - Jillellamudi on YouTube
0:00 / 34:29