No transcript for this section.
Transcript begins at 0:00.
శ్రీ విళంబి నామ సంవత్సరానికి హృదయ పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ కాలం మళ్ళీ కొత్త రూపాన్ని సంతరించుకొని కొత్త శక్తిని ఆవాహన చేసుకొని ఒక వసంతోత్సవంగా సాగుతున్నది. ఇది నిజానికి సాక్షర వసంతోత్సవం. సాక్షరము అంటే పరబ్రహ్మము అని అర్థం. శక్తి స్వరూపుణి అయినటువంటి శ్రీ విళంబి నామ సంవత్సరం ముప్పై రెండవ సంవత్సరంగా భావన చేస్తాం. ఆ విషయాలు ఎట్లా ఉన్నా ఉగాది అంటే ఉక్ ప్లస్ ఆది. మానవుడు మొట్టమొదటిసారి మాట్లాడుట నేర్చుకున్నటువంటి రోజుగా భావన చేయాలి. రెండవది యుగాది అని రెండు, రెండో అర్థం. యుగాది అంటే కొత్త యుగానికి కొత్త కాలానికి ఈరోజు మొదలవుతున్నది అని ఒక అర్థం. కాబట్టి ఈ ఉగాది పర్వదినం అనేటువంటిది జీవితంలో షడ్రుచుల సమ్మేళనంగా భావన చేస్తాం. ఆ షడ్రుచులు అనేటువంటివి పరస్పర విరుద్ధ భావజాలాలతో కూడి ఉంటాయి. తీపి, వగరు, చేదు ఇట్లా అనేక పులుపు అన్నీ కలిపి ఉండేదే మానవ జీవితం అని, మానవ జీవితం ఎప్పుడూ కూడా ఏకపక్షం కాదని అది బహుళంగా ఉంటుందని, అననుకూలాలు, కష్టాలు, యాతనలు, ఇబ్బందులు, ఈసులు, కాసులు ఇవన్నీ దానిలో అంతర్భాగం అని గమనిస్తూనే మానవుడు ధార్మిక వర్తన ద్వారా మనల్ని మన అవనీ సంచారంలో పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్షుని ఒక ఉదాత్త భూమికలో సంచారం చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతికి మనం నమస్కరించవలసినటువంటి రోజు ఇది. రావి చెట్టు, వేప చెట్టు రెండు దైవీ వృక్షాలుగా భావన చేసేటువంటి భారతీయ సంస్కృతిలో అవి కూడా తమ ఆకులను రాల్చి కొత్త ఆకులని, కొత్త పూలని వాటిలలో కొత్త మధువుని, తేనెని నింపి ఈ జగత్తుకి పర-పరమోత్కృష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అట్లాగే ఈ ఆరు చక్రాలు కాలచక్రంలో కాలనేమిలో ఈ వసంతోత్సవం అనేటువంటిది ఒక పుణ్యకాలంగా భావన చేయాలి. శ్రీరామచంద్రుడి జీవితం అంతా కూడా లేదా ఆయన జీవితంలో జరిగిన మహోదాత్తమైనటువంటి గంభీరమైన విషయాలన్నీ కూడా వసంత కాలం నాడే జరిగినాయి. వసంత కాలంలో ప్రధాన ఘట్టాలున్నాయి. కాబట్టి ఇది రమణీయము, రామత్వంతో కూడి ఉన్నటువంటిది గనుక ఉగాది కేవలం క్యాలెండర్ మార్చుకునే గ్రిగేరియన్ క్యాలెండర్ కాదిది. ఋషులు, తాత్వికులు వీరందరూ కూడా భూగోళం నుంచి ఖగోళాన్ని దర్శనం చేసి ఖగోళంలో ఉండేటువంటి గ్రహతారక స్థితుల అన్నింటినీ కూడా అధ్యయనం చేసి దానిని గణిత శాస్త్రంగా రూపాంతరీకరణం చేసి ఇవాళ మనకి పంచాంగములుగా మనకి అప్పజెప్తూ ఉన్నారు. అంటే మానవుడు తనను తాను సరిదిద్దుకొని సవరించుకొని సమన్వయ సహజ స్ఫూర్తితో తన జీవితాన్ని కొనసాగించటానికి దిశానిర్దేశం చేసేటువంటిదే పంచాంగము. దానిలో కేవలం జాతక ఫలాలు మాత్రమే కాదు, సృష్టి, ఏ పంటలు పండుతాయి, వానలు ఎప్పుడు కురుస్తాయి, ఎండలు ఎట్లా ఉంటాయి, అగ్నిపీడ, శత్రుపీడ ఏమిటి, దీని నుంచి ఉపశమన మార్గాలు ఏమిటి, ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కాల ప్రమాణంగా తీసుకున్నట్లయితే ఉగాదితో ప్రారంభమై మళ్ళీ మరొక ఉగాది వచ్చే మూడు వందల అరవై నాలుగు రోజుల ఈ కాల ప్రవాహంలో జీవుడు తనను తాను నిత్య వసంతోత్సవంగా తన జీవితాన్ని రూపాంతరీకరణం చేసుకోవటానికి ఒక మహత్తరమైనటువంటి ఒక ఆధార భూమిక ఉగాది గనుక ఈ ఉగాది యుగాదియై సర్వ కాలములకి కూడా అశావహమై మానవ పరిణామ దశలో అద్భుతమైన స్థితులు అందుకోవటానికి, జీవితాన్ని సమగ్రంగా అనుభవించటానికి, జీవితం అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవటానికి, ఉత్థాన పతనాల అన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవటానికి ఇది నాంది పలుకుతుంది గనుక ఈ ఉగాది సర్వ శ్రేయోదాయకమైనటువంటిది. ఇది ప్రకృతి ఆరాధనలో పుడమి తల్లికి మనం చేసేటువంటి ఒక నమస్కారము ఇక్కడే, ఆమె పట్ల పురస్కారము ఇదే, ఆమెకు చేసే అలంకారము కూడా ఇక్కడే గనుక ఉగాది ఒక వైభవోపేతమైనటువంటి ఒక పచ్చదనానికి, చక్కదనానికి, సౌందర్యానికి, తీయదనానికి, శక్తివంతమైనటువంటి కాల ప్రమాణాన్ని ఎరగటానికి, ఎరిగి ఆచరించటానికి అనువైనటువంటి కాలానికి ఇది తొలిమెట్టుగా, అందుకనే ఉగాది మొట్టమొదటి అడుగు. ఆ పైన అనేక అడుగులు పడుతూ వెళతాయి. మళ్ళీ మరొక ఉగాది వస్తుంది. దీనికంటే ఉదాత్తమైనటువంటి భూమిక ఏర్పడుతుంది గనుక శ్రీ విళంబి నామ సంవత్సరానికి మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ ఈరోజు నుంచి హైందవమైన, సనాతనమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా మనందరం కూడా కంకణధారులం కావాలి. చేయగలిగినంత వ్యక్తులు తమకున్న పరిధిని, తమకున్న శక్తిని స్ఫుటం చేసుకుంటూ ఒక పరిపూర్ణమైనటువంటి మానవతా పరిమళాన్ని ప్రపంచానికి పూర్తిగా, నిరపేక్షంగా వెదజల్లగలిగినటువంటి స్థాయిని గురువులు, దేవతలు అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ ఉగాదికి స్వాగతం పలుకుతున్నాను.
YouTube · audio
Ugadi Special | Sreepeetam | 20108 | Happy Ugadi | ఉగాది శుభాకాంక్షలు
Ugadi Special | Sreepeetam | 20108 | Happy Ugadi | ఉగాది శుభాకాంక్షలు
Source: Sreepeetam on YouTube
0:00 / 6:03