Skip to content
Transcript తెలుగు
ఫలితమే వస్తుంది. ఎంతో కష్టపడతాం ఫలితం రాదు. ఒక్కోసారి అసలు ఏం పని చేయం అనుకోని ఆనందం వచ్చి ఒళ్ళో పడిపోతుంది. రెంటికీ కారణం ఎవరు మనమా? కాదంటున్నారుగా భగవాన్. అసలు ఉపదేశ సార ప్రారంభమే భావనతో ప్రారంభించారు ఆయన. కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ. నువ్వు చేసే కర్మలన్నీ దైవాలేం కావు అవి. దైవం కోసం చేసే కార్యం కూడా దైవం కాదన్నారు ఆయన. కర్మలు జడాలు వాటికేం తెలియదు అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోతున్న వాటికి ఫలితం ఇచ్చేవాడు మాత్రం ఎవడో ఉన్నాడు. వాణ్ని కర్త అనుకుందాం అన్నారాయన. కర్తే కారణం అవుతున్నాడు. వాడే ప్రేరణ చేస్తున్నాడు. వాడే చరణాన్ని అనుగ్రహిస్తున్నాడు. వాడే మనతో విచారణ చేయిస్తున్నాడు. వాడే తరణానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. అంటే, ఇదంతా ఎవరి వల్ల జరుగుతున్నది అంటే, వ్యవహార నిష్ట లో కూడా ప్రాపంచికమైన భావనలో కూడా భగవంతుడే ఉన్నాడు. భగవంతుని యొక్క శక్తే మనల్ని నడిపిస్తున్నది, మన చేత అనిపిస్తున్నది అని ఎవరు నిత్య స్ఫూర్తిలో ఉంటారో వాళ్ళకి అంటున్న దాని వలన కలిగే ఫలితాలతో కూడా ఎట్టి సంబంధం లేదు. తాను అనవలసి ఉన్నది గనుక అంటున్నాడు, వినవలసి ఉన్నది గనుక వింటూ ఉన్నాడు. అనిపిస్తున్నవాడు, వినిపిస్తున్న వాడు మాత్రం వాడు వేరే ఉన్నాడు. ఇది వ్యవహార నిష్ట. నేను జ్ఞానిని అయిపోయినాను, నాకీ లోకంతో ఏం పని లేదు అంటావా? వీలు లేదన్నారు, భగవత్పాదులు అన్నారు, భగవాన్ కూడా అదే అన్నారు. నీవు జ్ఞానివి అయిన తర్వాత లోకానికి మరింతగా ఉపయోగపడాలి. నీవొక విజ్ఞాన సర్వస్వ అని ఒక ఎన్సైక్లోపీడియా అయిపోయినావ్ అనుకుందాం. అది నీ దగ్గరే ఉంచుకుంటే ప్రయోజనం లేదు. అందుకే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఆధునిక కాలంలో అటు ఇంగ్లీషులో ఇటు తెలుగులో సూటిగా ఒక బోధ చేస్తారు, పట్టుకోగలగాలి. దాచిపెట్టి ఏం ప్రయోజనం? దాచిపెడితే అంతా పాచిపోతుంది. పంచిపెట్టటం మొదలుపెట్టు పెరుగుతూ ఉంటుంది. ఎంత అందమైన మాటలు చూడండి. దాచి పెడతాం తినము ఎవడికి పెట్టం, మరనాటికి పదార్థం పాడైపోతుంది అండ్ వి కాన్ సైన్ ఇట్ టు డస్ట్ బిన్. ఎవరు తిన్నట్లు. మనం కావలసిందే తిన్నాం మిగిలిందో లేదు ఎవరికో పెట్టాం మిగిలింది మనం తిన్నాం. రెండు భావాలతో ఇద్దరము తృప్తి పడ్డాం. ఇది జీవన సౌందర్యం, జీవన రహస్యం. పెట్టాలి, పెట్టుకోవాలి, తినాలి, తినిపించాలి, అనాలి, వినిపించాలి, కలిసి పని చేయాలి, కలిసి ప్రయాణం చేయాలి, కలిసి అధ్యాత్మలో ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలి. భగవంతుడు దారిన మనల్ని నడిపిస్తే దారిన వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. వెళ్ళటానికి కావలసిన మనస్సును మాత్రం మనకు కావలసినట్లుగా తీర్చిదిద్దుకోవాలంటున్నారు భగవాన్. అంటే, యాతనామయమైనటువంటి ప్రపంచంలో యోగత్వాన్ని సిద్ధించుకుని తత్వదర్శనం చేద్దామనుకునే యోగి కూడా మనసు మీద ఆధారపడే పని చేయాలి. కానీ, యోగి దగ్గర ఉన్న మనస్సు వేరు, మన దగ్గర ఉన్న మనస్సు వేరు. యోగి సర్వాత్మన ఆత్మ దర్శనం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. హి విల్ ట్రాన్సెండ్ టైమ్ అండ్ స్పేస్. కాలాన్ని దాటుతాడు. రేపు జరగబోయేది ఏమిటో గ్రహించగలుగుతాడు. నిన్న కొన్ని ఏళ్ల క్రితం ఏం జరిగిందో స్మృతి పథంలో ఇంప్రింట్ చేసుకొని ఉంటాడు. వర్తమానంలో అవసరమైనప్పుడు దాన్ని నిదర్శన పూర్వకంగా ప్రదర్శిస్తాడు. అంటే, ఇన్ని ఆత్మ శక్తులున్నాయి, ఇంత విషయం దీని వెనుక ఉన్నది, మనకు బోధించటం కోసమే. మనం దాన్ని అందుకోగలిగిన స్థాయిని మనం పొందుతూనే మానవ జీవన వికాసాన్ని మనం సాధించుకోవాలి. ఇక రెండవది బ్రహ్మనిష్ఠ. బ్రహ్మజ్ఞానాన్ని పొంది, బ్రహ్మత్వాన్ని పొంది, తాను బ్రహ్మమై అహం బ్రహ్మాస్మి అనుకున్నవాడు కూడా తాను దానిని ఎట్లా పొందాడో కూడా చెప్పాలి. మాట ద్వారా అన్న చెప్పచ్చు, మౌనం ద్వారా అన్న ట్రాన్స్మిట్ చేయొచ్చు కానీ చెప్పాలి. చెప్పవలసినటువంటి బాధ్యత అందుకున్నవాడు, పొందినవాడి యందు ఉన్నది గనుక ఒక గురు పరంపరా భావనలో భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతం కడగా నిలుస్తూ ఉన్నది. దీనిని మనం కాస్త విచారణ చేస్తూ మనస్సుని హృదయంలో నుంచి ఒక రశ్మిగా, కిరణంగా భావించమన్నారు. ఒక స్వర్ణకారుడి దగ్గరికి వెళదాం, గోల్డ్ స్మిత్ దగ్గరికి. మనం బయట కంట్రీ నుంచి తెచ్చుకున్న ఒక చిన్న బంగారపు కణిక అతని చేతిలో పెడదాం. ముందు అతను ఏం చేస్తాడు? దాని ప్యూరిటీ ఎంత ఉందో చూస్తాడు, అది చెక్ చేస్తాడు. చేసిన తర్వాత, ఇంత ప్యూర్ బంగారంతో ఆభరణం రాదమ్మా! దీనికి కాస్త రాగి కలపాలి అంటాడు. అలాగేనండి అంటాం. డిజైన్ చేస్తాడు. మనం చాలా భద్రంగా తెచ్చుకున్న బంగారు కణికని నిప్పుల్లో విసురుతాడు, కాల్చుతాడు. దానిలో మాలిన్యాలన్నీ పోగొడతాడు. దాన్ని చెక్కుతాడు, కొడతాడు, సాగదీస్తాడు. స్వర్ణాభరణం తయారు చేస్తాడు. మన చేతిలో పెడతాడు. ప్యూరిటీస్ ఎక్కువున్నాయి, ఇంప్యూరిటీస్ పోయినాయి కానీ బలం కోసం ఒక వస్తువుని చేర్చాడు. వస్తువు రాగి లేదా ఇంకొకటి. ఇవాళ క్యాడియం ఇలాంటివి వాడుతున్నారు. ఇంకో మెటల్ వచ్చి దాంట్లో చేరాలి. చేరితే అది రూపాన్ని సంతరించుకుంటుంది.ఇక్కడ మన మనస్సు బంగారు మనస్సు గనుక చేసుకోవాలి అంటే మనస్సుని పుటం పెట్టాలి. కాలం అనేటువంటి అగ్నిలో దాన్ని కాల్చగలగాలి. పుటం పెట్టాలి. అన్ని పరీక్షలకు మనం గురి కావాలి. అన్ని పరీక్షలలో నుంచి మనం, అన్ని అగ్ని పరీక్షలలో నుంచి బయటకు రావాలి. నిగ్గు తేలాలి. లోపల ఉన్నటువంటి కాంతిని బహిర్గతం చేయాలి. purity ని నిలబెట్టుకోవాలి, impurity ని వదిలిపెట్టాలి. చింతను వదిలిపెట్టాలి, చింతనా భూమికలోకి వెళ్ళాలి. చిత్తశోధన చేయాలి, తత్వసాధనంగా మార్చుకోవాలి. భగవాన్ పదే పదే మనసు గురించే చెప్తున్నారు. మనకి నిజానికి అడ్డంకి అదే, ఆయుధం అదే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అడ్డంకిని తొలగించుకోవాలి, ఆయుధాన్ని పదును ఎక్కించుకోవాలి. స్వర్ణాభరణం తయారైన తర్వాత దాన్ని అలంకరించుకొని, అద్దంలో చూసుకుని, స్వర్ణకారుడు ఎంత బాగా చేశాడు అని మనం ఆనందిస్తున్నామో, అట్లాగే జీవుడు కూడా ప్రపంచం అనేటువంటి అనుభవాల అగ్నిగుండంలో, కొలిమిలో తనను తాను పరీక్షించుకోవాలి. బ్రహ్మనిష్ఠలో నిలకడ చెందాలి. బ్రహ్మనిష్ఠ అంటే నిస్వార్థమైనటువంటి భావన, ప్రేమపూరితమైనటువంటి ఆలోచన, విశ్వశాంతిని కాంక్షించే మనస్సు, సమాజాన్ని నడిపించే కార్యకలాపాలు. ఇవన్నీ కూడా అనుకోవటానికి ఎంత అందమైనవో, ఆచరించటంలో అంత కష్టమైనవి. అయినా మానవ జన్మ ఎత్తాం గనుక మనం అదే ప్రయత్నం చేయాలి. బ్రహ్మనిష్ఠలో ఉన్నటువంటి జ్ఞాని తన మౌనం ద్వారా, తపస్సు ద్వారా అనేకమైన విషయాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ప్రభావితమైనటువంటి మనస్సు మరీ అనేకమందిని ప్రభావితం చేస్తూ ఉన్నది. వెయ్యి దీపాలు వెలిగించాలంటే మరొక వెయ్యి దీపాలు అవసరం లేదు, ఒక చిన్న దీపం చాలు. ఒక చిరుదీపంతో అనేక దీపాలను వెలిగిస్తూ వెలిగిస్తూ వెళ్ళినట్లుగా జ్ఞాని తన చూపు ద్వారా, సంకల్పం ద్వారా, తలపు ద్వారా, మౌనం ద్వారా, నిర్మల నిశ్చలమైనటువంటి చరిత ద్వారా, మధుర వర్తనం ద్వారా, కరుణాసంభరిత హృదయం ద్వారా, ఆత్మను ఎరిగినటువంటి తత్వదర్శనం ద్వారా ప్రపంచానికి సమున్నతమైనటువంటి మార్గోపదేశం చేస్తూ బ్రహ్మనిష్ఠను, వ్యవహార నిష్ఠను perfect గా సమన్వయం చేసి, blend చేసి కర్మ సుకౌశలాన్ని ప్రపంచానికి అనుగ్రహిస్తున్నాడు. ఆయనని చూసి నేర్వవలసింది ఎక్కువ ఉంటుంది, బోధ-బోధల వలన పొందేది చాలా తక్కువ ఉంటుంది. చూస్తూ ఉండాలి. మనం గురువుని స్వీకరించినప్పుడు గురువు తన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నాడో మనం గమనించుకోకపోయినట్లయితే ప్రయోజనం లేదు. గురువు చెప్పిన మాటలు వెల్లవేస్తే ఏం ప్రయోజనం? పారాయణం చేసినా ప్రయోజనం లేదు, ఆచరించాలి. ఆచరణాత్మకమైన అనుష్ఠాన వేదాంతానికి మనస్సుని ఆయత్తం చేస్తూ భగవాన్ ఉపదేశ సారాన్ని కొనసాగిస్తున్నారు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -62

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -62

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:34

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

    Now playing
  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77