Skip to content
Transcript తెలుగు
సౌందర్య సారు సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వైశవ్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబ్యేన విహీనం యో మాం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామా సహస్రం సమర్పిస్తూ స్వామి ఆరాధనా మహోత్సవంలో భాగంగా సత్యసాయి సేవా సంస్థలు కోటి హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ స్వామి అవతారం ఒక అద్భుతం స్వామి మహావినిష్క్రమణం ఒక అద్భుతం. నడిమి కాలంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశము ప్రతి సంఘటన ప్రతి సందర్భము అద్భుతావహమే అద్భుతము అంటే మానవాతీతమైనటువంటి విషయము అని అర్థం. మానవుడు ఊహించలేని మానవుడు భావించలేని మానవుడు సంభావించలేని మానవుడు రకంగాను ఇది నేను చేయగలను అని అనుకున్నా అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా జరిగినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క అవతార వైభవం అంతా కూడా ఒక పరమాద్భుతంగా భావన చేస్తూ, ఇవాళ దాన్ని మనం ఆరాధనోత్సవంగా ఒక పర్వదినంగా ఒక మహాద్భుతమైన పునరంకిత కార్యక్రమంగా మనం భావన చేస్తున్నాం. పర్వదినం ఎందుకు అవుతుంది అంటే వారికి జనన మరణాలు రెండూ లేవు. మరణము నిర్యాణము ఇవన్నీ మన బోటి వారికి. అదంతా అసలు రావటమే నిర్వాణమై వచ్చింది. ఉన్నంత కాలము నిర్వాణ స్థితినే ఉన్నది. కడగా నిర్వాణ నిక్వాణంతోనే వారి అవనీ సంచారం బహు సుందరంగా ముగిసింది. అయితే ఇప్పటివరకు ఇన్ని ఏళ్లుగా సుమారుగా నా పరంగా నలభై ఆరు సంవత్సరాలుగా స్వామి ఏం చేశారో స్వామి ఏం చెప్పారో స్వామి ఏమి సాధించారో స్వామి ప్రపంచానికి దేరిని నిదర్శన పూర్వకంగా ప్రదర్శనాత్మకంగా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా తేటతెల్లం చేశారు. మానవాతీతమైనటువంటి ఒక పరమాద్భుత శక్తిని దివ్యశక్తిగా ప్రపంచానికి పరిచయం చేశారు. కర్మ భక్తి జ్ఞాన యోగాలకి అతీతమైనటువంటి స్థాయిలో తురీయానికి అతీతమైన స్థాయిలో ఎలా సంచారం చేశారో బృహత్తరమైనటువంటి తన కార్యక్రమంలో సమస్త ప్రపంచాన్ని ఎలా నడిపారో చెప్పుకుంటూ వచ్చాం. ఇదంతా స్వామి ఏమి చేశారో చెప్పుకోవటంతో మనకి చాలా సమయం గడిచిపోయింది. అంటే స్వామి దేహంలో ఉండగానే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సత్సంగాల్లో ఉండేవాళ్ళం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు స్వామి కనుక ఇలా చేయగలిగారని తర్వాత తర్వాత కాలంలో ఇవన్నీ చేశారు గనుక ఆయన స్వామి అయినారని అనేకమైనటువంటి తృణనాత్మకమైనటువంటి పరిశీలనాత్మక పరిశోధనాత్మక విషయాలన్నింటినీ కూడా గ్రహణం చేసి అర్థం చేసుకుని స్వామిని కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే రెండువేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున స్వామి తమ అవనీ సంచారాన్ని ముగించుకొని తాము ధరించు వచ్చినటువంటి శరీరాన్ని మనకు అప్పజెప్పి మళ్ళీ దివ్యత్వంతో ప్రపంచంలోకి వచ్చారో దివ్యత్వాన్ని ఇంకా బలపరుస్తూ దృఢతరం చేస్తూ బలీయం చేస్తూ శక్తివంతం చేస్తూ అనేక క్షేత్రాలలోకి శక్తిని ప్రసారం చేస్తూ ఎలా వెళుతూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. రెండువేల పదకొండు నుంచి ఇదిగో రెండువేల ఇరవై ఒకటి వరకు. మరి ఏం జరుగుతున్నది అంటే త్రేతాయుగ నాటి రాముడికి మనం శ్రీరామనవమి చేశాం. అంటే కళ్యాణం చేశాం పట్టాభిషేకం చేశాం రాముడిని తలుచుకున్నాం రాముడి గొప్పతనాన్ని కీర్తించాం శ్లాఘించాం ఆయన పట్ల భక్తిని పారమ్యాన్ని గౌరవాన్ని అన్నింటినీ ప్రదర్శించాం రాముడు దేవుడే అని స్థిమిత పడ్డాం. ద్వాపరయుగ నాటి శ్రీకృష్ణ పరమాత్మకి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి చేశాం భగవద్గీతకు పుట్టినరోజు చేశాం భాగవత కథలన్నీ విన్నాం భాగవత కథలతో పాటు భగవద్గీతలో ఉన్న కర్మ భక్తి జ్ఞాన యోగాలన్నీ కూడా విచారణ చేసుకున్నాం జ్ఞానాన్ని గురించి విచారణ చేయాలి అంటే భగవద్గీత తప్ప అన్యము లేదు అని నిర్ణయించుకున్నాం. మళ్ళీ కృష్ణుడే చెప్పిన రెండువందల ఇరవై ఐదు శ్లోకాల్లో ఉన్నటువంటి ఉత్తర గీతని మళ్ళీ బ్రహ్మ ప్రతిపాదక యోగ్యంగా-- యోగంగా దాన్ని అర్థం చేసుకున్నాం. అంటే బ్రహ్మ ప్రతిపాదక యోగము బ్రహ్మ సందర్శన యోగము తురీయ యోగము ఇట్లా అనేకమైనటువంటి యోగాలన్నింటినీ కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ వచ్చాం. సత్యసాయి భగవానుడు కలియుగంలో వచ్చినటువంటి ఒక మహా పరిపూర్ణ అవతార మూర్తి. ఎనభై ఆరు సంవత్సరాల వారి అవనీ సంచారంలో తొలి పద్నాలుగు ఏళ్లు కూడా ఒక పక్కన పెట్టినట్లయితే డెబ్బై రెండు సంవత్సరాలు స్వామి ఒక బౌద్ధ అంటే బోధాకృతి. స్వామి బోధ చేశారు సాధకులంగా మనం విన్నాం సాధన చేసుకున్నాం. అయితే రాముడు లేడు.కృష్ణుడు లేడు, స్వామి లేరు అనుకోవటానికి లేదు. అలా అనుకోకూడదు. ఎందుకంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, సత్యసాయి భగవానుడు కూడా ఉన్నారు, ఉంటారు. ఎంత వరకు అంటే కల్పాంతం వరకు వీళ్ళందరూ ఉంటారు. కల్పాంతం వరకు మన బోటి జీవులు వస్తుంటాయి, పోతుంటాయి, నిలబడుతుంటాయి, అర్థం చేసుకుంటాయి. కొన్ని అర్థం చేసుకోకుండా మిగిలిపోతాయి, కొన్ని చూస్తాయి. కొన్ని ఆరాధనా మార్గంలోకి వెళతాయి, కొన్ని అనుసరణీయ మార్గంలోకి వెళతాయి. మౌలికమైనటువంటి ధర్మాలు అంటే కృతయుగం నాటి సత్యము, త్రేతాయుగం నాటి ధర్మము, ద్వాపరయుగం నాటి శాంతి, ప్రేమలు నాలుగు కలిపి సత్య, ధర్మ, శాంతి, ప్రేమావతారంగా సత్-- సత్యసాయి భగవానుడు ప్రపంచంలోకి వచ్చి నాలుగు మార్గాలను కూడా మనకి స్పష్టంగా, వినూత్నంగా, విశిష్టంగా, వరిష్ఠంగా సమాజానికి అర్థమయ్యే భాషలో సరళ సుందరమైన తెలుగులోనూ చమత్కారపూరితమైన ఆంగ్ల భాషలోనూ అనేక భాషలలో స్వామి మహా రహస్యాలన్నీ కూడా ప్రపంచానికి చెప్పారు. బాగుంది. మరి అవతార పరిసమాప్తి అంటున్నాం, ఆరాధన ఉత్సవం అంటున్నాం, ఇవాళ మనం ఏం చేయాలి? అనేది ఒక ప్రశ్న. ప్రశ్నకి ఇవాళ మనం జవాబు పొందాలి. ఏం చేయాలి అంటే ఒక తండ్రి, మన తండ్రి మనకో చిన్న ఆస్తి ఇచ్చి వెళ్ళిపోతారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిని నిలబెట్టడానికి మన శాయశక్తులా ప్రయత్నిస్తాం. కాలం కలిసి రాకపోతే, ఏదో అననుకూలాలు ఏర్పడితే ఇచ్చిన కాస్త కూడా నిలబెట్టుకోలేకపోవచ్చు గాని నిలబెట్టుకోలేకపోయినామే అన్నటువంటి ఆలోచన మాత్రం మన యందే ఉండిపోతుంది. మళ్ళీ మన స్వయంకృషితో, మన శక్తితో, మన శక్తి చాలనప్పుడు మరొకరి శక్తిని కూడా తీసుకొని దానికి ఒక పరిపూర్ణమైన ఆకృతిని ఇచ్చి మనం తండ్రి గౌరవాన్ని, తండ్రి మాటని, తండ్రి మనకు చూపిన ఆదర్శాన్ని ఆచరణీయ మార్గంలో చెప్పి తండ్రి దివ్య మహా స్మృతికి మనం ప్రాంజలి ఘటిస్తాం. అలాగే ఏదో ఒక రోజున నా తండ్రికి నేను చెడ్డపేరు తేలేదు, నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టాను అని సంతృప్తి పడతాం. అది స్వామి విషయంలో భిన్నం కాదు, కాకూడదు. స్వామి మన తండ్రికి కూడా గురువే, మన తండ్రికి కూడా భగవంతుడే. కాబట్టి స్వామి మనకేమిచ్చి వెళ్లారు అంటే ఆశయాలు ఇచ్చారు, ఆదర్శాలు ఇచ్చారు. రెండు అధివాస్తవికతతో కూడిన అంటే Idealism ఒకటి, అది ఆదర్శవంతం. ఆచరణయాత్మకం Practical అనుష్ఠానం. రెండింటిని అనుసంధానం చేసేది Pragmatism. అంటే అధివాస్తవికమైన దృష్టిలో మనం పని చేయగలం, ఎంత చేయగలం, చేసినందువల్ల ముందు నాకు, నా కుటుంబానికి తద్వారా ప్రపంచానికి స్వామి ఎట్లాగైతే విస్తరిస్తూ, విస్తరిస్తూ ప్రపంచం మొత్తము సాయిరామమయం చేశారో నేను నాకున్న పరిధిలో నేను ఏం చేయగలను అని ఆలోచించినప్పుడు స్వామి సత్యసాయి సేవా Organization పెట్టారు, సంకల్పించారు. అంటే దానికి నియమాలు, నిబంధనలు, దానికి పద్ధతులు, ప్రణాళికలు, దానికి కావలసిన వనరులు, దానికి కావలసినటువంటి సైన్యం, దానికి కావలసిన సేవాదళ్, దానికి కావలసిన అనేక అంగాలు, ఉపాంగాలు అన్నీ కూడా ఒక Model Create చేసి స్వామి మనకిచ్చారు. మనం ఎక్కడ దాంట్లో fit అవుతామో మనం గమనించుకోవాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. కొందరు కొన్ని పనులు చేయగలరు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక దాంట్లో నిష్ణాతుడై ఉంటాడు. ఎవరూ ఊహించని రీతిలో స్వామి అనేక కార్యక్రమాలు చేశారు. నిజానికి స్వామి తమ యవ్వన కాలంలో కంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత, నిజానికి డెబ్బై దాటిన తర్వాత ఎనభై ఆరో సంవత్సరం వరకు స్వామి చేసిన ప్రతి కార్యక్రమము కూడా చాలా అద్భుతం. మళ్ళీ నా చరిత్రలోకి వెళ్ళక్కర్ల, అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకు వయస్సు ప్రధానం కాదు, మనస్సు ప్రధానం ఒకటి. శిక్షణ ప్రధానం. path లోకి మనం ఎందుకు వచ్చాం? వచ్చినందుకు స్వామికి అనుగుణంగా జీవిస్తున్నామా, లేదా? ఉన్న అహంకారాన్ని పెంచుకున్నామా? కాస్త అహంకారాన్ని తుంచుకోగలిగామా? మన ప్రేమని అందరియందు ఒకేరీతి ప్రదర్శించగలుగుతున్నామా? అందరినీ ఒకే పద్ధతిలో గమనించగలుగుతున్నామా? అందరినీ నిజంగా ఆదరించగలుగుతున్నామా, గౌరవించగలుగుతున్నామా? ఇవన్నీ కూడా ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్నలు. ఎందుకని అంటే Self evaluation, Self audit రెండూ లేకపోతే అధ్యాత్మలో మనం చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్లిపోయాం అని మనం అనుకుంటాం, అది భ్రాంతి, భ్రమ. ఎందుకంటే సమాజము, ప్రపంచము, జీవితం మనకి అనేక సందర్భాలు, అనేక సంఘటనలు ఏర్పరుస్తుంది. వాటన్నింటిలో మనం మనంగా ఉన్నామా, లేదా? సత్యసాయి భక్తులుగా, స్వామిని ఆరాధించిన వాళ్ళంగా, స్వామితో కలిసి కొంత జీవించిన వాళ్ళంగా మనము ఎక్కడైనా స్వామిని reflect చేస్తున్నామా, లేదా? ఇది చాలా important. సేవ అంటే చాకిరీ కాదు. సేవ అంటే అహంకారాన్ని వదులుకోవటం. సేవ అంటే మమకారాన్ని విస్తృతం చేయటం. వీటన్నిటితో పాటు మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనఃఆలోచన మనం మాట్లాడే మాట చేస్తున్న పని ఒక్కటి కావాలి. కాకపోయినట్లయితే we are not into spiritual realm. మనం దానికి బయట ఎక్కడో దూరంగా ఉండిపోయినాం. మనం కేవలము rituals religious గా పని చేయటం వేరు spiritual గా పని చేయటం వేరు. దానికి సత్య సాయి భగవానుడి యొక్క అవతారం core concept మనకు అర్థం కావాలి. అది జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి మానవాభ్యుదయ అని కాంక్షించినటువంటి పరమ ప్రకృతిని అంతా కూడా ఒక ప్రశాంత నిలయంగా మార్చటానికి స్వామి వేసినటువంటి బాటలు అవన్నీ కూడా. మనం మార్గంలో వెళ్లాలనుకున్నామో మనం నిర్ణయించుకోవాలి. మార్గంలో organization విధించిన నిబంధనలకు అనుగుణంగా పరమ సంపూర్ణమైనటువంటి వినయంతో వాటిని గౌరవిస్తూ ఆదేశాలను స్వీకరిస్తూ అమలు పరుస్తూ ఎక్కడ మనదైనటువంటి విషయాలను దాంట్లో చొప్పించకుండా అంటే మన ఇష్టాలు అయిష్టాలు మన prejudices మన preferences ఇవి ఏమీ లేకుండా ఒక శుద్ధ చైతన్య మూర్తులమైనటువంటి స్థాయిలోకి మనం గనక సేవా యోగంలోకి వెళ్లగలిగినట్లయితే అది సర్వోన్నతమైనటువంటిది. రెండు అరవై ఏళ్లు వచ్చినాయి retire అయిపోయినాం. ఏదో pension వస్తుంది బతుకుకేమీ ఇబ్బంది లేదు. ఏం చేయాలి? ఇవ్వేళ వైద్య విధానం కారణంగా మనిషికి ఎనభై తొంభై ఏళ్ల వరకు ఆయుష్షు ఇవ్వబడింది జాగ్రత్తగా కాపాడుకుంటే. మరి అరవై ఏళ్లకు retire అయిపోయిన తర్వాత ఇంట్లో కాలక్షేపం చేసేకంటే ఎక్కడికక్కడ groups గా ఏర్పడి ఇవాళ పిల్లలకు గనక విద్యా వర్దానం చేయగలిగినట్లైతే దానికి స్వామి పెట్టినటువంటి అనేక centers ఉన్నాయి. లేదు community centers లో గనక వెళ్లి మేము we offer our knowledge మీ పిల్లలకు మేము tuition చెప్పగలము సందేహ నివృత్తి చేయగలము అని చేసే ఒక-ఒకటి వైద్య వృత్తిలో మరొకరు సంఘ సేవానురక్తులుగా కొందరు ఎక్కడికక్కడ విభాగంలో మనం పని చేయగలమో పని కాస్త చిన్న పని చేయగలిగిన groups groups గా చక్కగా ఏర్పడి కానీ అందరమూ organization నిబంధనలకు లోబడి గనక చేసినట్లయితే స్వామి సంకల్పంతో సేవా organization వరల్డ్ వైడ్ పెట్టారో దానికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఒక administration purpose కోసం కొంతమందికి కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి. మనం అధికారం అనుకుంటాం బాధ్యతలు ఇవ్వబడతాయి. బాధ్యత నిర్వహణలో వాళ్ళకి సంపూర్ణ సహకారం ఇవ్వాలి. అక్కడ వ్యక్తి ఎవరు కాదు దారిలో ఎవరున్నారు ఎవరు ఏం చేస్తున్నారు పని వాళ్ళు చేయగలిగిన పనే చేస్తున్న పని correct ఏనా అని బేరీజు వేసుకుంటూ మనం నెమ్మదిగా పనులన్నీ చేయాలి గనక ఇవన్నీ కూడా మనకి తెలియనివి కాదు. ఇవ్వేళ మళ్ళీ ఆరాధనోత్సవం అంటే స్వామి దేవుడు స్వామి సర్వదేవతా తీర్థ స్వరూపుడు అని చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు what is that we are doing in the name of Swami. మనం ప్రపంచానికి మనం వీధి వెంట నడిచి వెళుతుంటే ఉండగలిగితే ఇట్లా జీవించాలి. ఈ-ఈతడు ఇలా జీవించడానికి కారణం వీరి గురువైనటువంటి సత్య సాయిబాబా వారే కారణము అని మన తండ్రికి గౌరవం ఎలా తెచ్చామో స్వామికి కూడా అటువంటి గౌరవాన్ని తెచ్చే దిశగా ఆరాధనోత్సవం నాడు మనం పునరంకితం కావాలి. పునః పునః అసలు నిరంతరం చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఏదో కరోనా భయం ఏదో గాలి భయం ఏదో పిడుగులు వస్తాయి అని మనం పని మానేసే కంటే స్వామి చూసుకుంటారు అంటూనే మనం స్పృహలో ఉండాలి. మన కర్తవ్యాలు మనం చేయాలి pragmatism ఇందాకే చెప్పినట్లుగా స్వామి చూసుకుంటారులే అని మందు వేసుకోకుండా ఉండకూడదు. మనం మందు వేసుకోవాలి. ఆహార విహార వ్యవహారాల్లో సమున్నతమైన స్థాయిలో ఉండాలి. నిరంతరము భగవంతుడే నడిపిస్తున్నాడు అన్న భావనలో ఉండాలి. ఉంటూ మన కర్తవ్యాన్ని మన జీవ ప్రజ్ఞను గనక చక్కగా వాడగలిగినట్లయితే అప్పుడు స్వామి యొక్క దైవ ప్రజ్ఞ మన యందు ప్రవేశించి మన చేత అనేక పనులు సునాయాసంగా చేయిస్తాయి. దీన్ని మనం గమనించాలి. ఇక ప్రధానంగా పోటీ సమితి నాకు తెలిసినంతవరకు నేను చాలాసార్లు వెళ్ళాను గనక ఆరాధనోత్సవాన్ని స్వామికి సంగీతం అంటే చాలా ఇష్టం గనుక అంటే ఆయనకు అన్నీ ఇష్టమే సంగీతం కాస్త ఇంకాస్త ఎక్కువ. వాటిని ప్రోత్సహించారు. లలిత కళలు అన్నింటినీ ప్రోత్సహించారు అందులో సంగీతానికి సాహిత్యానికి పెద్ద పీట వేశారు. స్వామి ముందు పాడని గాయకుడు లేడు. ప్రపంచ స్థాయికి చెందిన వాడు మన-మన కళ్ళ ముందు పుట్టిన వాడు అందరూ కూడా పాడారు స్వామి దగ్గర. అందరినీ సమాదరించిన అటువంటి స్వామికి చాలా ఇష్టమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని పోటీ సమితి ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చింది. అయితే సంవత్సరం covid కారణంగా అందరము కూడా ఒకచోట గుమిగూడటానికి వీలు లేదు గనుక ఎందుకంటే సాంఘిక మర్యాదని దేశ మర్యాదని కూడా మనం కాపాడాలి. మన నాయకుడు మా దేశ నాయకుడు మనకు ఏం చెప్పాడో సాధ్యమైనంతవరకు మనం అమలు చేయాలి. అది దేశం పట్ల గౌరవం. అక్కడ నాయకుడు వ్యక్తి కాదు. స్థాయి స్థితి కాబట్టి ఇవాళ అలా చేయలేని కారణంగా zoom meeting ద్వారా మనందరం కలుసుకుంటున్నామో మనందరం కూడా ఆరాధనోత్సవంలో మనల్ని మనం చక్కగా ఏం చేయగలమో నిర్ణయించుకోవాలి. చేసిన తర్వాత దానిలో నిమగ్నం కావాలి. ఇవ్వేళ ప్రధానంగా స్వామి ఆనాడు బాల వికాస్ గనక ప్రారంభించి ఉండకపోతేఆ బాల వికాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ జగత్తును నడిపిస్తున్నటువంటి గురువులుగా కూడా తయారైనారు. అనేక క్షేత్రాలలో మంచి మంచి స్థాయిల్లో పనిచేస్తున్నారు. మళ్ళీ బాల వికాస్ అంటే మన మూలం, బాల వికాస్ అంటే సనాతన ధర్మం, బాల వికాస్ అంటే భారతీయ ఆత్మ, బాల వికాస్ అంటే భారతీయ విజ్ఞానం. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరికి వాళ్ళు బాల వికాస్ కి పిల్లలను మనం దగ్గర చేర్చుకోవాలి లేదా మనం పిల్లల దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళి ఆరాధన అంటే, ఆరాధన అంటే ఏమిటి? స్వామికి కైంకర్యం చేయటం. స్వామిను మీరు మాకు ఇంతిచ్చారు, మేము మళ్ళీ మీకు ఆహ్ సమర్పించుకుంటున్నాం అని చెప్పటమే. మనమేమీ చేయగలిగింది లేదు. స్వామి ఎప్పుడో చెప్పారు, "ప్రతి వాడు నేను త్యాగం చేశాను, సమయం త్యాగం చేశాను, ధనం త్యాగం చేశాను అంటారు. నువ్వు ప్రవహిస్తున్న నీళ్ళలో నుంచున్నావు. నీళ్ళల్లో నీళ్ళనే దోసిళ్ళలోకి తీసుకున్నావు, సూర్యుడికి చూపించావు, సూర్యుడికి అజ్ఞం ఇచ్చావు, నీది ఏమిచ్చావు?" అని ప్రశ్నించారు. మనది ఏమివ్వగలరు అంటే ఒకడు డబ్బు ఇవ్వగలడు, ఒకడు జ్ఞానం ఇవ్వగలడు, ఒకడు స్ఫూర్తిని ఇవ్వగలడు, ఒకడు ధైర్యాన్ని ఇవ్వగలడు, ఒకడు మంచి సదా ఆలోచనని ఇవ్వగలడు, ఒకడు పాట నేర్పగలడు, ఒకడు భజన నేర్పగలడు, ఒకడు వేదం నేర్పగలడు. స్వామి అనేకమైన పారిశ్రామిక. అందుకే నేను ఎప్పుడూ అంటాను సత్య సాయి అవతారంలో అసలు core subject ఏది? అని గనక అంటే స్వామి indulged in man making process. మనిషిని తయారు చేసే పనిలో పడ్డారు ఆయన. చేశారు. అందుకున్న వాళ్ళు స్థాయికి వెళ్లగలుగుతున్నారు, వెళ్లారు. వెళ్లని వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈవేళ స్వామి మహాభినిష్క్రమణ తర్వాత బాధ్యత ఎవరిది అంటే, నేను స్వామి devotee నే అనుకుంటున్న ప్రతి ఒక్కటిది కూడా. ఇక్కడ మనం ఏం చేయగలం? ఎంత చేయగలం? ఎలా చేయగలం? సంఘటితమై, సమన్వయమై దాన్నే ఆయన మామూలుగా మనకు అర్థం అయ్యేట్టుగా unity, purity, divinity ఇవన్నీ వ్యాసాలకి, ఎలక్షన్స్ కి topics కావివి. We have to unite. We must live united. We must think unitedly. దాంట్లో deliberations ఉంటాయి. అన్నింటినీ కూడా గమనించుకోవాలి. Purity of thought ఉండాలి. పని చేసినా ఒక పవిత్రత ఉండాలి, ఒక శుద్ధత్వం ఉండాలి. దానిలో నుంచి సిద్ధత్వం వస్తుంది, preparedness వస్తుంది. దానిలో నుంచి మళ్ళీ మన ఆలోచనలన్నీ సక్రమ రీతిలో చేసుకోవటానికి అవకాశం వస్తుంది గనుక, ఇవన్నీ చేస్తే దాని పేరే divinity. Divinity ప్రత్యేకంగా లేదు. స్వామి చెప్పారు, "దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు". మన intention ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ మన actions ను బట్టి మనమేంటో అది చెప్పేస్తుంది. కాబట్టి మన intention, మన action రెండూ unify కావాలి. మన ఆలోచనలన్నీ కూడా జగత్హితం కావాలి. జగత్తుకి శోభ కలిగించే రీతిలో మన జీవయాత్ర సాగించాలి. జగత్తుకు కళ్యాణం జరిగేట్లుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం గమనించుకోవటానికి ఇవాళ హైదరాబాదే కాదు, నా వరకు నేను ఆంధ్రదేశం, భారతదేశం ఎన్ని వందల వేల సమితులు, భజన మండల్స్ చిన్న చిన్న కుగ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా స్వామి యందు వారికున్నటువంటి అపరిమితమైన, అనన్యమైనటువంటి భక్తి it is impeccable. ఎవరూ దానిని చెరింపచేయలేరు. ఏది జరిగినా స్వామి మాకున్నారు అనేటువంటిది మన గిరిజనులు, పాడేరు అటువంటివన్నీ వెళ్ళినప్పుడు స్వామి యొక్క దివ్య ప్రభని అనుభవించాం. మనం ఈవేళ నాగరిక ప్రపంచంలో ఉన్నాం. technology మన చేతికి వచ్చేస్తుంది. కనుకనే నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి వీటన్నింటినీ గమనించుకుంటూ ఆధునికమైనటువంటి technology ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేయొద్దు, ప్రబోధం చేయొద్దు, ప్రసారం చేయాలి. We have to transmit. స్థాయికి వెళ్ళాలి. ఎందుకని? ఒక స్థాయికి, ఒక సమయానికి చెందిన వారంతా they are beyond sixty. వాళ్ళు physical level లో ఎక్కువ పని చేయలేకపోవచ్చు. కానీ I always say one word, "Youth shall reshape the world of course with the help of adults". మనకంటే ముందు వాళ్ళని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళతో కొంత సమయాన్ని గడపాలి. ఎ-ఆ experience తీసుకోవాలి. మన energy ని, experience ని రెండూ జోడించే స్వామి యొక్క కార్యక్రమాలు చేయాలి. ఇవాళ ఏదో రెండు పాటలు, ప్రవచనం అయిపోయింది ఆరాధనోత్సవం అంటే. పాటలతో ఆరాధనోత్సవం కాదు. అది నివాళి, అంతే. నివాళి కాసేపు చేయాలి. కానీ మనం ఏం చేయాలి? What is that we have to do in reality? అని గనక అన్నట్లయితే స్వామి ఆదర్శం ఒక్కటే. ప్రపంచం నిండా శాంతి ఉండాలి. శాంతి ఉన్నప్పుడే ప్రేమించగలం. ప్రేమ గనక ఒకటి ఉంటే శాంతి వస్తుంది. దాని వెనక ధర్మం వస్తుంది. దాని వెనక సత్యం ఎప్పుడూ నిలబడే ఉంది. సత్యం వద, ధర్మం చర. ధర్మం చర అంటే నడవటం. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. మనకి విషయాలలో role models ఎట్లాగైతే భారత, భాగవత, రామాయణాలు అన్నీ ఉన్నాయో మనకి సజీవమైనటువంటి ఒక practical role model నన్నే, మీకెవరు role model అంటే భావనా ప్రపంచంలో నాకు సాకేత రాముడు గనక అయినట్లయితే practical world లో, ప్రపంచంలో సత్యసాయి భగవానుడే నాకు role model. స్వామి ఒక్క క్షణాన్ని waste చేయలా. ఎవరినీ పరికరించకుండా పంపలా. ఎవరినీ ఆదరించకుండా వదిలిపెట్టలా. అందరియందు కూడా అపరిమితమైనటువంటి దివ్య ప్రేమని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. నన్నెవరైనా మీరు మీ జీవితంలో జరిగిన అద్భుతం, మి-మిరాకిల్ చెప్పండి అని అడుగుతారు. నేను ఎన్నడూ మిరాకిల్స్ చెప్పలేదు, చెప్పనక్కర్లేదు. కానీ ఒక్క మిరాకిల్, ఒక అద్భుతం మాత్రం చెప్తాను. అదేంటంటే...స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. మనమందరము ఎదురు చూస్తూ ఉంటాం. ఇరవై, ఇరవై ఐదు వేల మంది అందరూ కూర్చుని ఉంటారు. కాసేపు అయిపోతుంది. అయిపోయిన తర్వాత అందరూ బయటికి వస్తున్నప్పుడు మనకి అలవాటైన గణేష్ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి, temple-- గణేష్ temple దగ్గరికి వచ్చేప్పటికి అందరూ అడుగుతారు, "ఏ-- ఎట్లా ఉన్నారు? బాగున్నారు?" ఆ-- చెప్పటానికి ముందే ప్రతి ఒక్కడు అనేటువంటి మాట, "ఈవేళ స్వామి నన్నే చూశారు" అని. ఒక human being ఇరవై ఐదు వేల మందితో అలా connect కాగలడా? ఎవరైనా సరే. connect అయినారు అంటే ఆయన భగవంతుడు అని అర్థం. కాబట్టి భగవత్ తత్వానికి అతి సన్నిహితంగా జీవించినటువంటి మనం ఆరాధనోత్సవాన్ని సంగీత కార్యక్రమం నివాళిగా చేయవలసిందే, సాహిత్య కార్యక్రమం చేయవలసిందే. కానీ ప్రవచనం మాత్రం స్వామిని కీర్తించడంతో సరిపెట్టవద్దు, number one. number two, స్వామితో మనకున్న proximity ఏదన్నా ఉంటే దాన్ని మన గుండెలో మనం దాచుకుందాం. దానికి ప్రపంచానికి ఎట్టి సంబంధం లేదు. మరి ఏమిటి సంబంధం అంటే, స్వామి వేసిన మార్గంలో నేను నడిచినందువల్ల నాకీ ప్రయోజనం కలిగింది, ఆనందం కలిగింది, దుఃఖం పోయింది. దీనివలన నాలో ఉన్న negativity పోయింది. నేను ఉత్తమ మానవుడిగా జీవించే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాను. అదే మార్గంలో ఉన్నాను అనుకుంటూ స్వామి-- ఈవేళ సత్య సాయి సేవా Organisation రెండూ భిన్నం కావు. స్వామి యొక్క సంకల్ప స్వరూపమే Organisation. Organisation ని మన తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, స్వామిగా చూడగలిగినట్లయితే మన కార్యక్రమాలన్నీ స్వామి అలా నల్లేరు మీద బండి నడక లాగా నడిపించి మనల్ని మన స్వస్థానం వైపు చక్కగా నడిపిస్తారని నేను భావన చేస్తూ కోటి సమితి శాస్త్రిగారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కొన్ని-- సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కోటి సమితితో కలిసి నడిచినటువంటి వాళ్ళంగా, వాటి తొలినాళ్ల నుంచి మల్లినాళ్ల వరకు చూసిన వాళ్ళంగా ఒకే ఒకటి ఇలాగే కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండండి. నిరపేక్షతో ఇవన్నీ చేశారో అలాగే చేస్తూ ఉండండి. చేస్తూ అహంకార మమకారాలను దాటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో స్వామి యందు ఉన్నటువంటి భక్తితో, గౌరవంతో, ప్రేమతో కార్యక్రమాల రూపకల్పన చేయండి. స్వామి మన వెంట ఉండి మనల్ని నడిపిస్తారు. మన వెంటే కాదు మన లోపల కూడా ఉండి అంతర్జ్యోతియై, అఖండ జ్యోతియై మనల్ని నడిపిస్తారని నేను భావన చేస్తూ అలా చేయాలని స్వామినికి ప్రణమిల్లుతూ కోటి సమితి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని, వాటిల్లో మనందరం కూడా భాగస్వాములం కావాలని అపేక్ష పడుతూ, అలా అనుకుంటూ స్వామి సమితిని, సమితి ద్వారా అనేక మందిని, తద్వారా ప్రపంచాన్ని నిరంతరము కూడా ఒక రక్షణ కవచంగా రక్షిస్తూ ఉండాలని అలాగే పురోగమన దిశగా మనందరినీ నడిపించాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
YouTube · audio

Sri Sathya Sai Aaradhanotsavam Sssso- Koti Samithi, Hyderabad

Home

Sri Sathya Sai Aaradhanotsavam Sssso- Koti Samithi, Hyderabad

Source: P V S on YouTube

0:00 / 31:51