No transcript for this section.
Transcript begins at 0:00.
సద్గురుం సత్యసాయి శ్వరం అలమేల విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ ప్రంభస్ఫురతాం నిధి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వేంకటేశ్వర సన్నిధానంలో సత్యసాయి సేవా సమితి కూకట్పల్లి వారు ఒక మహా యజ్ఞంగా దీన్ని ప్రారంభించినందుకు స్వామి దివ్య అనుగ్రహం వారియందు విశేషంగా ఉండాలని అలాగే పరమ భాగవతోత్తములైనటువంటి శ్రోతలు ఒకచోట గనుక ఉన్నట్లయితే వారు ఏ గురువుని ఆశ్రయించినా, ఏ రూపాన్ని దర్శించినా, ఏ భావనతో మనస్సుని లగ్నం చేసుకొని ఉంచుకున్నా, ఏ ప్రబోధాన్ని అనుసరించి వారి వారి జీవితాలను గడుపుతున్నా, ఇదంతా కూడా సర్వ నదులు కూడా సాగరంలో పోలినట్లుగా ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ వర్ణం అయినా, ఏ గురు స్వరూపాన్ని అనుసరించినా అందరం కూడా పరమాత్మ భావన యందు త్వరగా చేరవలసిన వాళ్ళం. ఈ భావన మన మనసులోకి వచ్చినప్పుడు గురువుల పట్ల గాని, గురు భావన పట్ల గాని, గురుతత్వం పట్ల గాని, ఏ భేదభావం లేకుండా ఉంటానో, ఉండగలుగుతానో అది నిజానికి అధ్యాత్మం. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. అధ్యాత్మ అంటే కైవల్య ప్రాప్తికి మార్గం కాదు. అధ్యాత్మ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక వరదాయినిగా గనుక మనం భావించినట్లయితే, ఈ అధ్యాత్మని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, దాన్ని ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఈ మూడు విషయాలు మనకు తెలియకపోయినట్లయితే నిద్ర లేస్తాం, దేవుడికి అగరవత్తు ఎరిగిస్తాం, కాస్త అలంకారం చేస్తాం, మనం తినబోయేది ఆయనకు నైవేద్యం పెడతాం లేదా ఆయనకు నైవేద్యం పెట్టింది మనం తింటాం. తింటాం, ఉంటాం అంతే. ఆ తర్వాత ఏమిటి అనేది ప్రశ్న. దీనికి శాస్త్రాలున్నాయి, విధులున్నాయి, వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, అనేకం ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా కృత, త్రేతా, ద్వాపర దాటి కలియుగ ప్రవేశం అయిపోయింది. అయిపోయి కూడా సుమారు ఐదువేల ఐదువందలు సంవత్సరాలు అయిపోయింది. మరి మన కళ్ళ ముందే ఒక జాతి, ఒక విలువలు, ఒక మానవతా, మానవీయమైన భావనలు, దానం, ధర్మం, త్యాగం, యోగం, యాగం ఇవన్నీ నెమ్మదిగా జాతి మరిచిపోతున్నటువంటి వేళ ఇది. ఇవన్నీ కాసేపు పుస్తకాల్లో ఉండేవి, కాసేపు నలుగురు కూర్చుని మాట్లాడుకునే అకాడమిక్ డిస్కషన్ కు అనువైన పాయింట్లుగా మారిపోయాయి కానీ, జీవితంలో వీటిని సెలబ్రేట్ ఎలా చేయాలి, వీటిని ఎట్లా చెరిష్ చేయాలి, ఎట్లా ఆలోచించాలి, ఆదర్శవంతమైన భావనా భూమికలో మనం ఎట్లా నెలకొన చెందాలి, ఇవి నిజానికి పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోతున్న ఈ సందర్భంలో సుమారు తొంభై ఏళ్ల నాటి మాట, తొంభై ఏళ్లు దాటిన మాట, తొమ్మిది దశాబ్దాల క్రితం ఆంధ్రదేశంలో సత్యసాయిబాబా వారు ఒక అవతారం తీసుకొని వచ్చారు. స్వామి కంటే ముందు అవతారాలు వచ్చినాయి, స్వామి కంటే తర్వాత కూడా అవతారాలు వస్తాయి. స్వామి కంటే ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వచ్చినయి. అవి చేయవలసిన పనులన్నీ చేసినయి, వెళ్ళిపోయినయి. అయితే అది పౌరాణిక గతమైనటువంటి ఒక కాలం. ఆనాటి జాతి స్పిరిచ్యువాలిటీ మీద ప్రవచనాలు చేయలే. ఆనాటి జాతి స్పిరిచ్యువాలిటీ అంటే ఏమిటో తెలుసుకుని సెమినార్లు పెట్టుకోలే. ఆ మాటకు అర్థం తెలియకుండానే పరమాద్భుతమైనటువంటి జీవితాలను వాళ్ళు గడిపారు. అంటే మన తాతలు, ముత్తాతలు, వారి కాలం చాలా గొప్ప కాలం అది. ఏడ, ఎనిమిది మంది బిడ్డల్ని కడుపు నిండా కన్నా, అన్నం లే లేకుండా ఉన్న వారాల అబ్బాయి కోసం తల్లి ఎదురు చూసినటువంటి జాతి. ఎవరి కడుపులో, ఎవరి దొక్కలో ముద్ద లేదు అని ఆ తల్లికి తెలిసిందో వాడి కోసం ఎదురు చూసినటువంటి జాతి. ఇవాళ తల్లిదండ్రులు తమ బిడ్డలకే స్వయంగా అన్నం పెట్టుకోలేని ఒక కాలం ఏర్పడింది. కొడుకులు, కోడళ్ళు పెద్దవారిని గౌరవించడానికి ఆస్కారం లేని ఒక సందర్భం ఏర్పడింది. ఇది ఒక నిజమైనటువంటి కలికాలపు తొలినాళ్ళు ఇవి. మరి ఇప్పుడు శ్రీరామ ధర్మాన్ని మాట్లాడుదామా, శ్రీకృష్ణ జ్ఞానాన్ని మాట్లాడుదామా, లేక అవతారమూర్తులంతా ఇంత అద్భుతంగా ఉన్న ఈ పద్దెనిమిది పురాణాలు కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోదామా, ఇవి నిరంతర చింతనాత్మక వేదికలో తారాడే పారాడేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నల్లో ఎన్ని అవతారాలు వచ్చినా మరి రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అనేక అవతారాలు వచ్చినయి. కానీ మనిషి నెమ్మది నెమ్మదిగా దిగజారుతున్నాడు, జారుతున్నాడే తప్ప ఎదిగిన సందర్భాలు మనకు కనపడటం లేదు. ఇది ఒక విషాద సన్నివేశం. ఈ విషాద సన్నివేశాన్ని యోగేశ్వర కృష్ణుడు ఊహించే, అవతరించబోతున్న కలియుగం కోసం అంతరించబోతున్నటువంటి ద్వాపరలో భగవద్గీతను మనకు ఇచ్చాడు.అయితే భగవద్గీత నిత్య పారాయణ గ్రంథంగా చేసుకున్న వారు ఉన్నారు. వాళ్ళకి మనం నమస్కరించవలసిందే. అలాగే భగవద్గీత అది యోగ శాస్త్రమా? ధర్మ శాస్త్రమా? దానిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? కర్మ, భక్తి, జ్ఞాన యోగాల త్రిపుటీకరణం చేసినటువంటిదా? అని ఎన్ని ప్రశ్నలు దాటి, ఇవాళ ఆధునిక కాలంలోకి భగవద్గీత చివరికి communication skills లోకి దిగబడిపోయింది. లేదు management లోకి దిగబడిపోయింది. భగవద్గీతను చూడవలసిన దర్శనం అది మాత్రం కాదు. భగవద్గీతని ఆశ్రయించుకొని జీవితాలని, జీవనాలని, జీవికలని అంటే డబ్బు సంపాదించేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఈ దేశానికి సంక్రమించినటువంటి వేళలో, ఇవాళ మనం కూర్చొని ఆ విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకని అంటే, మీరంతా చదువుకున్న వారు. వయసుని అంటే జీవితాన్ని అనుభవించినవారు. అది ఎట్లా నడిచిందో అట్లా నడుస్తూ వచ్చినటువంటి వారు గనుక, దీనికి ఒక కవితాత్మకమైన భావన కాకుండా ఒక absolute reality ఏమున్నదో దాన్ని గనక మనం విచారణ చేసినట్లయితే, ప్రస్థానత్రయం భగవద్గీత గాని, ఉపనిషత్తులు గాని, బ్రహ్మ సూత్రాలు గాని, పద్దెనిమిది పురాణాలు గాని, ఇవన్నీ ఖడగా ఏం చెప్పినయి అని ఒక చిన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, సమాధానం ఒక్కటే. ఆ సమాధానం ఇదిగో ఈ మానవ దేహం ఎత్తినటువంటి మన బోటి వాళ్ళంతా స్వర్గ లోకానికో, కైలాసానికో ఒక చిన్న visa తీసుకుని వెళ్ళటానికి అర్హత వచ్చిందని మాత్రం మనం అనుకోకూడదు. ఇక్కడ ఈ భూమండలం మీద ఈ జన్మ ఎత్తినందుకు ఇటువంటి అనేక వైరుధ్యాలతో, వైవిధ్యాలతో, అనేకమైన సమస్యలతో, అనేకమైనటువంటి కార్పణ్యాలతో, కరుణావలయాలతో, ఇవన్ని విరుద్ధమైనటువంటి భావాలు. ఇంత ద్వైతంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం ఎలా జీవించాలి అని ప్రబోధం చేసిందే సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ధర్మం. ఈ ధర్మం అనేక స్వరూపాలు. ఆ ధర్మ స్వరూపం అంతా గనక విచారణ చేసినట్లయితే, దానికి మూలమైన సనాతన ధర్మము అంటే ఛాందసం చెప్పే సనాతన ధర్మం కాదు. కుడి చేత్తో దీపం వెలిగించాలా? ఎడం చేత్తో బట్ట పట్టుకోవాలా? ఆకాశం వైపు చూడాలా? వాడు ఎక్కడో ఉన్నాడు. కాదు, ఇక్కడే ఉన్నాడు. అందరి యందు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతా తానై ఉన్నాడు అనేటువంటి ఒక దివ్య భావనా గలిమని మనకు పరిచయం చేసినటువంటి ధర్మమే సనాతన ధర్మం. సనాతన అనే శబ్దంలోనే అది అతి పురాతనమైనటువంటిది. సృష్టి కాలం నుంచి ఈ ప్రకృతికి, జీవుడికి, పరమేశ్వరుడికి ముగ్గురికి ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని అంతఃసూత్రంగా నడిపించేటువంటి ఒక ధర్మ బద్ధమైనటువంటి భావన ఏదైతే ఉన్నదో అదే సనాతన ధర్మం. అందుకనే పంచభౌతిక దేహాన్ని తీసుకొచ్చిన రాముడైనా, కృష్ణుడైనా, సత్య సాయి భగవానుడైనా, ఈ కాల, కార్య, కారణ, కర్తవ్య ఈ నాలుగింటికి లోబడే వాళ్ళు సంచారం చేయాలి, వాళ్ళు అలాగే చేశారు కూడా. మరి అది వారికేనా అంటే, పరదైవతంగా భావించే వారందరితో పాటుగా జీవాత్మలుగా, జీవులుగా భావించే మనక్కూడా ఆ నాలుగే వర్తిస్తాయి. మనక్కూడా చూడండి, ఓ కాలానికి లోబడి వచ్చాం. ఎంతకాలం ఉండాలో నిర్ణయించబడింది. ఆ ఒక్కటి తెలియదు. కాబట్టి ఉన్నంత కాలం ఇక్కడ ఉండాలి. ఉన్నంత కాలం ఎట్లా ఉండాలి? మన degrees, మన సంపద, మన భౌతిక దేహ సౌందర్యం, మనకుండేటువంటి ప్రజ్ఞాపాటవాలు, మన ప్రతిభలు, ఇవి మనవా? అవి మనవా? అవి మనవా? అని ప్రశ్నించుకున్నప్పుడు, అవి మనకు మనం ఇక్కడ ఉన్నంత కాలం చెంది మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి, అంతే. ఆ తర్వాత మనం దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అవి ఈ సమాజానికి చెందుతాయి. ఇది సత్యం. అంటే ఈ సమాజం ఒక సభ్య సమాజంగా, సమగ్ర సమాజంగా, సమ్యక్ సమాజంగా, ఆరోగ్యకరమైన సమాజంగా, ఆదర్శవంతమైన సమాజంగా, ధర్మబద్ధమైనటువంటి సమాజంగా ఇది నడవాలి అంటే వ్యక్తి పరిణామం చెందాలి. వ్యక్తి పూజని ఆపేసేయాలి. వ్యక్తిత్వ పూజని ప్రారంభం చేయాలి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కో గుణం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక ప్రజ్ఞ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక సామూహికమైన, సమగ్రమైనటువంటి శక్తి క్షేత్రాలు, చైతన్య క్షేత్రాలు ఉంటాయి. వాటన్నింటినీ మనం గనక గమనించుకుంటూ వెళ్లగలిగినట్లయితే, ఆ వ్యక్తిలో నుంచి మనం తీసుకోవలసినటువంటి శక్తిని మనం తీసుకుని మనం శక్తివంతులమై ఈ సమాజాన్ని శక్తివంతం చేయాలి. ఇది స్థూలంగా సనాతన ధర్మం మనకు చెప్పింది ఇదే, ఇంతే. అయితే ఈ సనాతన ధర్మానికి అనేకమైనటువంటి పాండిత్య భాషలు అంది. మనకు అర్థం కాని రీతిలో, మీ వల్ల కాద్రే అనేట్లుగానూ ఒక పక్కన, ఇది ఇంతే అని రెండో పక్కన కాకుండా, ఇది ఇట్లా అని చెప్పవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. విడమరచి చెప్పాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది చెప్పాలి. చెప్పాలి అంటే ఆచరించాలి. ఆచరించి ఒక అనుభవాన్ని పొందాలి. ఆ అనుభవంలో నుంచి ఒక అనుభూతిని పరమ రమణీయంగా పొందాలి. దాన్ని సమాజానికి మనం చక్కగా, నిరపేక్షంగా అందించాలి. అంతేతప్ప సనాతన వాజ్మయాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని.మౌలికంగా ఉన్నటువంటి మానవీయ కోణాలని మనం నమ్ముకొని జీవించాలి తప్ప వాటిని market లో అమ్మటానికి పెట్టకూడదు. ప్రవచనానికి ఇంత, ప్రబోధానికి ఇంత అనేటువంటి ఆ భావనలన్నీ సమసిన నాడు మాత్రమే ఈ మాటలకు విలువ ఉంటుందని గట్టిగా నమ్ముతూ అలాగే ఉందని చెప్పినటువంటి సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి సత్యభ-- సత్యసాయి భగవానుడికి మళ్ళీ మరొక్కసారి ప్రణమిల్లుతూ అంటే వైదిక వాజ్మయాన్ని ఏం చేయాలో చెప్పారు ఆయన. అమ్మద్దు. ఆ అమ్మటాన్ని ముందు ఆపండి. దానిని నమ్మకానికి ముడివేట్టండి. దేనిని నమ్మాలి? దేవుడు ఉన్నాడు అనేటువంటి పంచాక్షరిని మీరు ఆరాధించండి. ఆ ఆరాధనలో నీవు ఒక హిందువువి గనుక అయినట్లయితే ఆ హైందవుడిగా జీవించ ముందు హిందూ ధర్మాన్ని తెలుసుకో. హిందూ ధర్మం ఏం చెప్పిందో తెలుసుకో. చెప్పగలిగినటువంటి సద్గురువు దగ్గర సమాశ్రయం పొందు. అనేకమైనటువంటి ఆలోచనలకి, అనేకమైన ప్రశ్నలకి, అన్నింటికీ సమాధానాలు పొందు. ఒక హైందవమైనటువంటి, హైందవం ఏమున్నది? సహనం ఉన్నది, శ్రద్ధ ఉన్నది, ధర్మం ఉన్నది, త్యాగం ఉన్నది, యోగం ఉన్నది. దేనినైనా అందుకోగలిగిన, ఎవరినైనా సమాదరించ గలిగిన, ఎవరి కష్టాన్నైనా, ఎవరి కన్నీటినైనా తొలగించగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తి హైందవ ధర్మంలో ఉన్నది గనుక, ఇదిగో ఈ పది, పదిహేను గుణాలు ధర్మంలో నుంచి ఎరుకో. వాటిని మూటగట్టి నీ దగ్గర పెట్టుకో. ఒక్కొక్క దాన్ని అధ్యయనించి, చేసిన దాన్ని నువ్వు ఆచరిస్తూ వెళ్ళినట్లయితే, నీవు హైందవుడుగా, హిందువుగా ఒక సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతినిధిగా నీవు ఉంటావు. అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. కర్మయ-- బద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. ప్రతి కర్మలో నుంచి ఏర్పడేటువంటి ఫలితాన్ని సమాజానికి నిరపేక్షంగా అందించాలి. కర్మఫల త్యాగం చేయాలి. గురు పరంపరానుగతంగా ఏర్పడినటువంటి గురు సాంప్రదాయానికి మోకరిల్లాలి, ఫలవంచాలి. నీవు ఎంత గొప్పవాడివైనా గురు సన్నిధానంలో నీవు శిష్యుడివై ఉండాలి. ఆ గురు స్వరూపాన్ని గనుక నువ్వు ఆరాధించగలిగినట్లయితే, ఆ గురు స్వరూపాన్ని నీవాడిని చేసుకోగలిగినట్లయితే, ఆ గురువు ముందు నీవు నిశ్శేషుడివి కాగలిగినట్లయితే, ఉనికిని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, సమస్తము కూడా జీరో చేసుకోగలిగినట్లయితే, గురువు యొక్క అనుగ్రహం నీ యందు ప్రవహిస్తుంది. అంటే మనం ఖాళీగా ఉన్న పాత్రని నింపగలం గానీ, నిండి ఉన్న పాత్రని నింపలేము, వంపగలుగుతాం. కాబట్టి మనం ఏం కావాలి అంటే ఖాళీ కావాలి. మనం ఖాళీ కావటం అంటే మన మనస్సుని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. అక్కర్లేని ఆలోచనలు, మన చుట్టూ ఉండేటువంటి సమాజం అందించేటువంటి ఆలోచనలు. సరే, సమాజాన్ని, ఇతరుల్ని పక్కనబెడితే, అందరం అనుకున్నట్లే తెలిసి చేసే గొప్ప పొరపాటు ఏమిటంటే నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయే దాకా మనం హాయిగా TV ఆన్ చేస్తే ప్రపంచంలో ఉన్నవన్నీ మన-- మన మనసులోకి ఎక్కుతూనే ఉన్నాయి. అందులో ఒక్కటి అక్కరకు వచ్చేది లేదు. ఒక్క దాన్ని మనం పరిష్కరించలేదు. ఒక్క దానిలో మన భాగస్వామ్యం లేదు. ఒక్క దాన్ని మనం ఏ రకంగానూ సంస్కరించలేము. అటువంటిది విని, విని, విని ఒక బౌద్ధికమైన, ఒక చైతన్యశీలమైన, ఒక ప్రగతిశీలమైన, ఒక ఆధ్యాత్మికమైన, ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోవటం లేదా? అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు కోల్పోయినాము అన్నదే నా జవాబు. దాని నుంచి గనుక మనం దూరం కాగలిగినట్లయితే, సరే TV ని మనం అంటున్నాం. మన చేతిలో cell phones వచ్చేసినాయి. అక్కడ అది వదులుచుకున్నాం అంటే ఇది వచ్చి పరిపోయితే, ఇది ఈ సమాజం యొక్క దౌర్బల్యాలని, సమాజంలో దిగజారిపోతున్నటువంటి నైత్యాన్ని, నీచత్వాన్ని, అల్పత్వాన్ని భాషా రూపంగా, భావ రూపంగా అనేకమైన కర్మకాండల ద్వారా మన మనసుకు, మన మన్-- మస్తిష్కంలోకి ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఆ విషాన్ని లోపల పెట్టుకొని మనం ఆనందంగా ఎలా ఉండగలం? సంతోషాన్ని ఎలా పొందగలం? సుఖాన్ని సుఖంగా ఎప్పుడు అనుభవించగలం? ఈ ఆనందకారక స్థితిని సనాతన ధర్మ వేదికగా మనం ఎప్పుడు మార్చుకోగలుగుతాం? ఇవన్నీ కూడా నిజానికి గడ్డివానలో పడ్డ సూదులు వంటివి. వెతకాలి అంటే సూదులు వెతకటం ఆపేయ్ నన్నా ఆపేయాలి లేదా గడ్డినన్నా పక్కకి తొలగించుకుంటూ మనం వెళ్ళాలి. ఇవాళ మనం చేయవలసిన పని సమాజం యొక్క గతిని, దానిలో ఎక్కడి నుంచి సమాజానికి అందుతున్నటువంటి భావజాలాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ సనాతనమైనటువంటి ఒక ధర్మం ఏం చెప్పింది స్థూలంగా అంటే మానవీయ ధర్మమే సనాతన ధర్మం. అదే హైందవ ధర్మం. హైందవ మతం లేదు. మతం అంటే ఒకటి మార్గం. హైందవ ధర్మం అంటే అది సమగ్రమైనటువంటిది. సమన్వయ రీతిలో జీవితాన్ని గడుపుకోమని ముందు నీలో ఉన్నటువంటి అంగాంగముల అన్నింటినీ ఒక్క చోటికి తెచ్చుకో. ప్రతి అంగంలో, ప్రతి cell లో, ప్రతి కణంలో చైతన్యం ఉన్నది. ఈ విరాట్ పురుషుని యొక్క మహా చైతన్యం అంతా మన యందు ఎట్లా దాగి ఉన్నదో ఆ చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ అనేక రీతులలో గనుక ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం గడపగలిగినట్లయితే ఈ ప్రపంచానికి మనం ఆదర్శ మానవులుగా రూపాంతరీకరణ చెందుతాం. ఇవాళ జన్మ ఎత్తిన ప్రతి వాడికి లేదు every alternate person. ఒకనాడు తెలుగు వారి పట్ల ఒక మాట ఉండేది. ఆంధ్రదేశంలో ప్రతి alternate person ఒక కవి. ప్రతి alternate కవి, ప్రతి alternate మనిషి సంగీతం ఎరిగినవారు. అంటే సంగీత సాహిత్యాలయందు ఆసక్తి కలిగినవారు.ధర్మము యందు ఆసక్తి కలిగిన వాడిని మనకు అభివృద్ధి కల కానీ ధర్మబద్ధమైనటువంటి ఆలోచన చేయగలిగిన వాడు ధర్మాచరణ చేయగలిగిన వాడు తెలుగువాడు. ఇవాళ నేను రెండు ప్రాంతాల గురించి మాట్లాడట్లే భౌగోళికంగా విడిపోయిన రెండు మానసికంగా మనం తెలుగు వాళ్ళం. ఓంకార స్వరలీనమై నిగమానాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాజ్యమై భువన రక్షా దక్షమై తాండవాహంకార స్థిరచంద్ర యశ్శకల శైత్య ప్రాప్త శాంతత్వమై శంఖాసంతులమైన నీవునికి ఆశాశుద్ధి కల్పించు తండ్రి. ఈ పద్యానికి అర్థం ఏం లేదు. త్రిలింగ దేశంలో మూడు వైపుల నుంచి ఉన్నటువంటి శైవ క్షేత్రాల నుంచి నానా రాగ సందోహంగా ఓంకార నాదం ఈ గాలిలో మిళితమై ఉన్నది. కనుక ఆంధ్రునిగా పుట్టినవాడు తెలుగువాడిగా జన్మ ఎత్తినటువంటి వాడు. వాడు ఏ రకమైనటువంటి తపస్సు ప్రత్యేకంగా చేయవలసిన పని లేదు ఎందుకంటే వాడు పీల్చే గాలి నిండా ఓంకార నాదమే ఉన్నది గనుక. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆ ఒక ప్రమాణం. ఈ ప్రమాణాన్ని గనుక మనం ఆధారం చేసుకున్నట్లైతే సనాతన ధర్మం ఇవాళ సమకాలికంగా పనికొస్తుందా పనికిరాదా? సనాతన ధర్మం కాస్త టీవీ మీద మాట్లాడే విషయమా? ఎక్కడ మీద నలుగురం కూర్చొని మాట్లాడేదే నిజానికి ఆచరించగలుగుతామా అని ప్రశ్న వేసుకున్నట్లయితే సనాతన ధర్మం మాత్రమే మనం ఆచరించగలుగుతాం. మిగతా ధర్మాలు తర్వాత తర్వాత పుట్టినయి. వాటి పేర్లు మనం సత్య సాయి ఆర్గనైజేషన్ లో ఏ మతాన్ని గురించి మనం తప్పుగా మాట్లాడం. ఒక ముస్లిం ఈ గుడిలోకి వచ్చి మాట్లాడిని చక్కగా మాటలు విని వెళ్ళవచ్చు. ఒక క్రిస్టియన్ ఇక్కడ కూర్చొని రావచ్చు, వినొచ్చు. ఒక జొరాస్ట్రియన్ వినొచ్చు. ఏం మతంలో ఉన్నా సరే అందుకే సత్య సాయిబాబా వారు ఒక సూచన చేశారు. మతాలు ఏవైనా చెడేప్పుడున్నా చెప్పినయ్యా మనిషి మతిలో దోషం ఉన్న తప్ప మతంలో దోషం లేదు. కనుక నువ్వు ఏ మతాన్ని ఆశ్రయించావో ఆ ప్రతి మతానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని గనుక నువ్వు ఆచరించగలిగినట్లయితే నువ్వు, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం ఒక పరిపూర్ణమైన శక్తివంతమైన అటువంటి ఆత్మ క్షేత్రంగా మారుతుంది. దానికే మీరు ప్రయత్నం చేయాలి అని చెప్తూ వచ్చారు. అటువంటి దానిని ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు ఒక బౌద్ధగా అనేకమైనటువంటి దివ్యోపన్యాసాల నిండా ఈ సనాతనమైన ధర్మాన్ని అంటే ఏమిటో చెప్తూ వచ్చారు. అంటే రాముడి వలె జీవించగలగాలి. రాముడి వలె అంటే రామాయణంలో ఉన్న రాముడి కథ మన కథ భిన్నం కాదు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అటువంటి ఇబ్బందులే మనందరికి కూడా వచ్చినయి. ఆయన కంటే మించిన కష్టాలు వచ్చినయి అంటే ఆయనకు మించిన కష్టాలు ఎప్పుడూ మనకు రాలే ఇంకా రాలే. ఏవో చిన్న చిన్నవి అవి వచ్చేప్పటికే మనం చాలా అలసిపోతున్నాం. దీన్నుంచి ఎవరు బయట పడేస్తారని చిల్లర దేవుళ్ళని, చిల్లర గురువులని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. అందుకనే సత్య సాయి భగవానుడు ఒక మాట ఇవాళ కాదు నలభై ఏడు సంవత్సరాల నాడు చెప్పారు "చిత్తాపహారులైన గురువులు మీకు ఎక్కడా దొరకరు కానీ దిక్కాపహారులైన గురువులు మీకు ప్రతి చోటా కనపడుతూనే ఉంటారు జాగ్రత్త" All gurus are one but all are not gurus. దీన్ని జాగ్రత్త పెట్టుకోండి. మీ ఆత్మను మించి మీ అంతఃచేతనను దాటి మరొక్క గురువు బయట లేడు. కాబట్టి ఆ ఉన్నటువంటి గురువులు ఎవరు అంటే మన యందే ఉన్నటువంటి ఆ గురువుని మనం వినాలి, ఆలోచించాలి. ఇవాళ ఈ దేవాలయానికి వచ్చాం. అయ్యవారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. మామూలుగా అయితే వాళ్ళు ఇచ్చే ప్రసాదం తిని వెళ్ళిపోతాం. ఆ వెళ్ళే ముందు కాసేపటికైనా కూర్చోండి అంటారు. కూర్చొని వెళ్ళాలి అంటారు. అది సాంప్రదాయమై, ఆచారమై, అలవాటై అలా కూర్చోకపోతే ఏదైనా అవ్వదు అనే భయమై అలా ఉండిపోయింది. కానీ ఎందుకు కూర్చోమన్నారు అంటే నీ పని కేవలం దైవదర్శనంతో అయిపోలేదు. నువ్వు అక్కడ కూర్చున్నట్లయితే రజస్తంభం చుట్టూ చెవుల ఉన్నటువంటి చురుమువ్వలు సభడి చేస్తాయి గాలికి. ఆ నాదాన్ని వినగలిగినటువంటి మనసును నువ్వు ఏర్పరచుకో. అంటే అంత ఏకాగ్ర స్థితిని నువ్వు అలవాటు చేసుకోవాలి. అంత ధ్యాన ముద్రాంకితమైన స్థాయిలో నువ్వు జీవించాలి. ఏ పని చేసినా అట్లాగే ఉండాలి. అన్నీ సమర్పించి మనం బయటకు రావాలి. ఖాళీగా ఉండాలి. మనసుని ఖాళీ చేయాలి. అక్కరలేని ఆలోచనలు మనయందు ఉండకూడదు. జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మార్పులు, వాటి వలన ఏర్పడుతున్నటువంటి దుష్ట ఫలితాలు, వాటి ప్రతికూల భావనాలు వీటన్నింటినీ గనుక మనం అధ్యయనం చేసినట్లయితే ఈ సమాజం మనకు పెద్ద వేదిక, పాఠశాల అయింది. మనం వేరే పుస్తకాలు చదవక్కర్ల. ఈ అంతరంగము కన్నా జాపకుడు లేడు. అరయ కాలమే నీకు పరమ గురువు. గ్రంథరాజమును ప్రత్యక్ష లోకమే. ఎవడు స్నేహితుండు? ఈశ్వరుడ్ని. ఆ ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఆయన ఉన్నాడు అనేటువంటి భావనని బలంగా, దృఢంగా నమ్ముతూ అన్ని కాలాలయందు ఎవరైతే ఒక ప్రశ్న వేసుకుంటారో, నేను ఈ మానవ జన్మ ఎత్తి వచ్చాను. ఎందుకు వచ్చాను? అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు సనాతన ధర్మం మనకు ఒక సమాధానం ఇచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చుకున్నాం అంటే రెండున్నాయి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఇది భగవద్గీత. అంటే అనేక జన్మలు ఇట్లా ఎన్నో ఎత్తుతూ వచ్చాం. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇక లేకుండా ఉండబోవటం లేదు. ఇంకా ఎన్నో ఎత్తాలి మనం. ఇదిగో ఇప్పటికి ఈ మాత్రం వచ్చామన్నమాట. వచ్చి జ్ఞానము అంటే ఏమిటి? ఇదిగో ఈ సత్సంగం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? మనం ఏం చేస్తున్నాం? చేయవలసింది చేస్తున్నామా?చేయవలసింది చేస్తున్నామా, చేయరానివి దూరంగా ఉంచగలుగుతున్నామా? ఈ ప్రశ్నలు అన్నింటినీ కూడా ప్రతిక్షణము జీవుడు వేసుకోవాలి. కనుకనే ఈ అన్ని శబ్దాలు పుట్టని శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితంబు. మానవ జన్మకి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? దాని గమ్యం ఏమిటి అంటే నారాయణుని అన్వేషించాలి. నారాయణుని అన్వేషించాలి అంటే మనం గుట్టకెల్దామా, మెట్టకెల్దామా, ఆ మనసరోవరంలోకెళ్లి స్నానం చేసి వద్దామా, ఆకాశం వైపు చూద్దామా? ఇది కాదు. ఎక్కడ ఉన్నాడు అంటే భగవంతుడు లేనిదెక్కడ అని ఆలోచన కలగాలి. ఇవ్వాళ మనం ఇక్కడ కూర్చునున్నాం, పవిత్ర ప్రాంగణంలో ఉన్నాం. అన్ని ఆలోచనలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగిస్తాడు, రగిలిస్తాడు, సమాధానమిస్తాడు. ఆ డు ఎవరు అంటే ఆ ప్రథమా విభక్తి, అభౌతికంగా మరియందే అవిభాజ్యంగా రెండుగా కాకుండా ఏకమైనటువంటి భావనతోనే ఉన్నాడు గనుక పరమాత్ముని ఎక్కడ అన్వేషించాలంటే బయట వెతకడం ఆపండి, లోపలికి వెళ్లే ప్రయత్నం చేయండి. దానికి సనాతన ధర్మాన్ని ఆశ్రయించండి. సనాతన ధర్మం అనగానే మనకు భయమేస్తుంది. కారణాలేమిటంటే అలవాట్లు అనండి, సాంప్రదాయాలు అనండి, అనేకమైన చేతస్థాలు అనండి, అనేకమైన మూఢత్వాలు అనండి, ఇవన్నీ కూడా మనల్ని జగజార్చిన కారణంగా ఇంకా జగజారుస్తున్న కారణంగా, ఎందుకనంటే పాతకాలంలో నిజాం నవాబు నాటి కాలంలో ఉన్న నాణాలు మనదగ్గర రెండు బస్తాలు ఉన్నా ఇవ్వాళ పప్పు చెక్క కూడా ఇచ్చేవాడు లేడు. మనం తయారు చేసుకున్న five hundred note, thousand note నవంబరు ఎనిమిదిన మన దేశ ప్రధాని గారు ఎప్పటినుంచి పనికిరావు అంటే పనికిరాకుండా పోయినయి. ఇక ఏమిటి పనికొచ్చేది, ఏది కలలని శ్రీ ఏమిటి? ఎప్పటికైనా కలాజ్ అవిచ్ఛిన్నమైనది ఏది అంటే అది ఆత్మను గురించినటువంటి విచారణ, భగవంతుని గురించినటువంటి విచారణ. జన్మ ఎత్తినందుకు ఈ నారాయణుని అంటే ఈ పరమేశ్వరుని, ఈ ఈశ్వరుని, ఈ దైవాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఆయన స్వరూపం ఏమిటి, ఇవన్నీ చెప్పేదే సనాతన ధర్మం. మానవీయమైనటువంటి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సాంఘిక గతమైన, దేశగతమైనటువంటి, ఎందుకంటే ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. అమెరికా దేశమే, అమెరికాలో కూడా మనుషులున్నారు. ఆస్ట్రేలియాలో మనుషులున్నారు. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు. ఆ మనుషుల యొక్క ఆ సంస్కార ధార వేరు. ఆ మనుషుల యొక్క జీవన విశేషాలు వేరు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరంపరాగతమైన సంస్కార విశేషాలు వేరు. ఆ జాతి యొక్క సంస్కారము, మూలము, ఆ చైతన్య శక్తి భిన్నభిన్నంగా ఉంటుంది. అదే ఆసేతు సీతాచలంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జన్మ ఎత్తినటువంటి మనబోటి వారందరికీ ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి కోటానుకోట్ల మంది మూలాలు ఏవేంటే అవన్నీ సనాతన ధర్మంలో కూడి ఉన్నాయి. లోకము విడి రసము లేదు. లోకం ఉండాలి. ఈ లోకము మనకి చాలా నేర్పుతుంది. ఈ లోకం అనేక విషయాలు మనకి చెప్తుంది. కానీ లోకాన్ని లక్ష్య పెట్టం. లోకం వేరు, మనం వేరు అనుకుంటాం. దానినే ఒకసారి సత్యసాయిబాబా వారు ఒక అద్భుతమైన ప్రసంగంలో చెప్పారు. మీరందరూ అమృతస్య పుత్రాః అనే మాట విన్నారు కదా, అది వివేకానంద స్వామి చెప్పారని మీరు అనుకుంటున్నారు. వివేకానంద స్వామి కాదు, అది చెప్పినవి ఉపనిషత్తులు చెప్పినయి. మీరందరూ కూడా, స్వామి చెప్పారు, మీ సమస్తము కూడా అమృత లోకంలో నుంచి ఇక్కడికి వచ్చారు. హాయిగా అమృత లోకంలో ఉండొచ్చు కదా! ఇక్కడున్న తర్వాత కైలాసానికి వెళ్లాలనుకున్నాం, స్వర్గానికి వెళ్లాలనుకున్నాం, అక్కడేదో చాలా సుఖాలుంటాయని, వయస్సు రూపాంతరీకరణం చెందదని, శరీరం అట్లాగే తేజోమయంగా ఉంటుందని, ఆకలిదప్పులు ఉండదని, నిద్ర లేదని, ఏ రకమైనటువంటి కష్టాలు ఉండదని, ఇది కదా స్వర్గాన్ని గురించినటువంటి ఒక ఊహ. మరి ఆ లోకం వదిలిపెట్టి ఇక్కడికెందుకు వచ్చారంటే ఒక్కసారి ఆ లోకంలో ఉన్నవాడు ఏమనుకున్నాడో ఆలోచిస్తే మనకి సమాధానం దొరుకుతుంది. ఆ లోకంలో ఉన్నవాడు ఏమనుకున్నాడంటే, ఏమిటిది? ఈ తేజోమయ రూపంలో ఉండటం ఏంటి? అసలు నా identity ఏమిటి? ఇక్కడ నా పేరే లేదు, ఊరే లేదు, నా అన్నవాళ్లు లేరు, నాకోసం ఏడిచేవాడు లేడు, నన్ను కోరుకునేవాడు లేడు. అదిగో ఆ భూలోకం చూడండి, తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కోడలు, మనవడు, ముని మనవలు, ఈ ఇంతమందితో సంసార వృక్షం అంతా కూడా విస్తృతమైపోతూ జీవుడు దాని యందు ఒక ఆనందాన్ని పొందుతున్నాడే, ఎప్పటికైనా మనం కూడా ఒక మానవ జన్మ ఎత్తుదామా అని మనబోటి వాళ్లు అక్కడ అనుకున్నందువల్ల ఇదిగో ఇట్లా వచ్చి ఇక్కడున్నాం. అంటే అమృత లోకానికి మరొక పేరు ఏమిటంటే గోలోకము అని పేరు. గోలోకంలో ఉన్నటువంటి వాళ్ళం మనం అనుకున్నట్లు, మనం సంకల్పించుకున్నట్లుగానే ఇదిగో ఈ భూలోకానికి వచ్చాం. భూలోకానికి రావటంలో తప్పులేదు. తల్లి గర్భారయంలో ఉన్న తొమ్మిది నెలలు భూలోకంలోనే తల్లితో పాటు మనం ఉన్నాం. ప్రమాదం అంతా ఎప్పుడొచ్చిందంటే గొడ్డు పోసి తల్లి నుంచి separate చేసిన మరుక్షణం. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు మనకు చెప్తుంది ఈ మాట. ఆ మరుక్షణమే ఆకలి, దప్పులు రెండు ఏర్పడ్డాయి. ఇది కావాలి, అది కావాలి అనటం మొదలు పెట్టాం. అంటే గోలోకంలో మొదలైన మన ప్రయాణం భూలోకంలోకొచ్చి, భూలోకంలోకొచ్చే తర్వాత మాలోకంలో పడిపోయాం. మాలోకం అంటే అజ్ఞాన భూమికలోకి పడిపోయాం. ఏది అజ్ఞానం అంటే నేను శాశ్వతమని, నా అంతటి వాడు మరొకడు లేడని, నన్ను మించిన వాడు ఉండకూడదని, నాకన్నీ తెలుసునని ఇక తెలుసుకోవాల్సింది ఏమీ లేదనిధనార్జనే పరమార్థంగా భౌతిక లౌకిక సంపాదననే పరమార్థంగా సుఖానికి సంతోషానికి ఆనందానికి తేడా తెలియని ఒక మనోనిర్మాణం ద్వారా మానవుడు తనను తాను పోగొట్టుకుంటున్నటువంటి వేళ ఈ సనాతన ధర్మం ఒక్కసారి అది రాముల రూపంలో కృష్ణుడి రూపంలో షిరిడి మహాస్వామి రూపంలో పంచామృతమైనటువంటి వేంకటేశ్వరస్వామి రూపంలో ఇవాళ మనం చూస్తున్నాం. శ్రీ వేంకటేశ్వర సన్నిధానంలో మనం కూర్చొని మనందరం చేయవలసిన ఒక చిన్న ప్రార్థన ఉంది ఈవేళ. ఆ ప్రార్థన ఏమిటంటే తెలుగు జాతి నాశనం కాకూడదు అని ప్రార్ధన చేయాలి. తెలుగు జాతికి సద్బుద్ధి కలగాలని మళ్ళీ మరొక్కసారి మనం చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతాం అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని మనం గనక గడిపినట్లైతే ఈ సనాతనమైనటువంటి ఈ ధర్మంలో నుంచే అటువంటి ప్రార్ధనలు మొలకెత్తాలి. ఈ సనాతన ధర్మం ఒక రోజుని మన జీవితంలో ఉన్నటువంటి ఒక రోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకోపోయే దాకా మనం ఏం చేస్తున్నాము? దానిలో ఏ ధర్మాలు ఇమిడి ఉన్నాయి అని గనక మనం అనుకుంటే సనాతన ధర్మం ఆధునిక కాలంలో ఎట్లా సమన్వయమవుతుంది? ఆ alignment ఏమిటి? ఆ ఎచ్చువన్మెంట్ ఏమిటి? ఆ రెండింటి యొక్క సంయోగ భావం ఏమిటి? ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మొట్టమొదటగా నిజానికి పట్టణాలు తర్వాత ఏర్పడ్డాయి. ప్రధానంగా పల్లెలతో కూడినది ఈ భారతదేశం. ఇప్పటికీ పల్లెల్లో ఇప్పుడు ఇంకాస్త మారింది మళ్ళీ టీవీ పుణ్యమా అని అది రానంత కాలం ఎనిమిదన్నర తర్వాత ఎవ్వరూ ఏ ఇంట్లో మేలుకొని ఎవ్వరూ లేరు. భావాయగా ఎనిమిదన్నరకి భోంచేసి పడుకునేవారు. కాయకష్టం చేసేవారు. ఆ, ఆ జీవితం అంతా ఎలా గడుచుకున్నదో మనం చూద్దాం. చేసేటప్పటికీ శరీరం అంతా అలసిపోయేది మనసు అంతా తృప్తితో నిండి ఉండేది. ఆ ఆనందంతో నిద్రపట్టేది. ఆ తృప్తి ఒక మోహచ్ఛయాన్ని కలిగించేది. ఆ ఆనందంగా నుంచి వచ్చినటువంటి ఆ నిద్ర ఎనిమిది గంటల నుంచి తొలిజాము వరకు అంటే సుమారు రెండున్నర, మూడు గంటల వరకు ఎక్కడ మళ్ళీ మెలకువ రాకుండా చక్కగా నిద్ర సాగిపోయేది. దానివలన ఇంద్రియాలన్నీ సత్తువని తెచ్చుకునేవి. ఆ మనసు అంతా కూడా భారం తగ్గి చాలా fresh గా తయారయ్యేది. తేజోమయంగా ఉండేది. నిశితంగా ఉండేది. కౌశల్యంతో కూడి ఉండేది. చాలా అద్భుతమైనటువంటి శక్తి కేంద్రంగా శరీరం తయారయ్యేది. ఆ సమయంలో మన బామ్మలు, అమ్మమ్మలు అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ లోకం మళ్ళీ వస్తుందా? అంటే రావాలని కోరుకుందాం. వాళ్ళు మూడు, మూడున్నర గంటలకు లేచి వాళ్ళ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇంకా పిల్లలందరూ నిద్ర లేవకుండానే సనాతనమైనటువంటి ధర్మము బోధించినటువంటి దైవపరమైన పద్యాలు, పాటలు పాడుకుంటూ అందులో అమ్మవారు, అయ్యవారు, దేవీ దేవతలు లేని వాళ్ళు లేరు. ఆ పాటలు పాడుతూ ప్రకృతిని కీర్తిస్తూ వాళ్ళు సూర్యుడు ఉదయించేదాకా ఆ పల్లెల్లో నిద్రపోయేవాళ్ళు. అప్పటికీ పశుపాలన అయిపోయేది. ఆ మరుక్షణమే శిశుపాలన ప్రారంభమయ్యేది. అంటే పిల్లలు లేచేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి స్నానాది కార్యాలు చేయించి వాళ్ళకు హనుమాన్ చాలీసానో లేకపోతే ఇంకేదో బాల రామాయణమో ఏదో నెమ్మదిగా ఒకటి, రెండు శ్లోకాలు వాళ్ళతో చెప్పిస్తూ వాళ్ళకి అలవాటు చేయిస్తూ మిగిలినటువంటి రాత్రి ఉండిన అన్నం మళ్ళీ పొద్దున చల్ది అన్నంగా మళ్ళీ వాళ్ళకి బలాన్ని, పుష్టిని, తృప్తిని, సంతృప్తిని కలిగించేటువంటి రీతిలో పిల్లల్ని వాళ్ళు అంతా పెంచుకుంటూ వచ్చారు. పిల్లలు వాళ్ళు ఏ సమయంలో పాఠశాలలో చేరాలో, వాళ్ళు ఏం చదవాలో ఒక నిర్ణయం చేసేవారు. వాడి భవిష్యత్తును ఊహించేవారు. వాళ్ళ శక్తిని తూకం వేసేవారు. ఇవాళ్టి తల్లిదండ్రుల్లాగా తూకాలే లేవు. పుట్టాడు అంటే వాడు IT చేయాల్సిందే. వాడు computer science చదవాల్సిందే. ఈ దేశం వదిలిపెట్టి పారిపోవలసిందే. డాలర్లు సంపాదించాల్సిందే. బుక్కట్ పల్లిలో బంగ్లాలు కట్టాల్సిందే. అంతే. చివరికి ఇక్కడ ఆగిపోయినాం మనం. కానీ ఆనాటి తల్లిదండ్రులకి ఆ ఆశలు లేవు. దురాశ లేదు. పేరాశ లేదు. నిరాశ లేదు. కనుక వాళ్ళకి దుర్దశ కూడా లేదు. ఈ క్రమ పరిణామంలో మీ ప-పిల్లలందరూ ఏ టైం కి ఏ స్కూల్లో చేరాలో ఓ నాలుగు నెలలతో ఎక్కువ వేసినా వాళ్ళని పంపించి ముందు స్కూల్లో చేర్చేవారు. అంటే సహజీవనాన్ని నేర్పేవాళ్ళు. అందులో అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు ఆ classroom లో ఉండేవారు. సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏమిటంటే ఇవాళ మనం కులాలు మాట్లాడుతున్నాం. ఆనాడు కులాలు తెలియవు మనకు. మరొక కులం వారిని ఇంకో కులం వారిని పిన్ని, అమ్మ, అమ్మమ్మ, బామ్మ అని పిలుచుకున్న రోజులు. అది అందువలన గ్రామం అనే వ్యవస్థ పరమ పవిత్రమైన వ్యవస్థ. అక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మం ఆచరిస్తూ భర్త ఆనాడు వ్యవసాయక దేశం కాబట్టి పొలానికి వెళ్ళి ఆయన మళ్ళీ పొలం నుంచి వచ్చేటప్పటికీ ఈ ఇల్లాలు తను చేయవలసినటువంటి అన్ని పనులు చేసేది. చేసేయి భర్త, పిల్లలు మాత్రమే కాక ఆ తల్లి హృదయంలో ఇందాక చెప్పిన వారాల అబ్బాయి ఎక్కడున్నాడు? ఇవాళ వీడికి మనం అన్నం పెడతాం, మనం పిలిపించామే, ఇవాళకి మనం వారం ఇచ్చామే ఎక్కడ అని ఆ తల్లి ఎదురు చూసేది. ఇంకొక విషయం వారాల అబ్బాయి గనక రాకపోతే ఆ రోజున ఆ తల్లి భోజనం చేసేది కాదు. ఇది ఈ జాతి సనాతన ధర్మం అంటే అది. అంతేగాని దీపాలు ఎలా వెలిగించాలి, మడి బట్ట ఎలా కట్టుకోవాలి, సంధ్యలు ఎలా వదులుకోవాలి ఇది కాదు సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మానవీయమైనటువంటి ధర్మం. ఎప్పుడైతే పొలం నుంచి తన భర్త వచ్చాడోఆ భర్తకి అన్నం పెట్టి ఆయనకు కావలసినటువంటి ఉపచారం చేసి మళ్ళీ ఆయన సాయంకాలం పనిలోకి వెళ్లే దాకా ఆ ఇల్లాలు రేపటి గురించి ఆలోచన, పనులన్నీ చేసుకునేది. ఇవాళ యాంత్రిక యుగం అయిపోయిన కారణంగా ధర్మం కూడా యాంత్రికం అయిపోయింది. అంటే ఉపన్యాసము వేరు, ప్రవచనం వేరు, దివ్యోపన్యాసం వేరు. మూడింటికి తేడా తెలియాలి. ఉపన్యాసానికి పేరేమిటంటే కాలక్షేపం. దాని పేరే అది. అంటే ఇంట్లో ఏమీ పని లేని వాడు ఇక్కడికి రావచ్చు. అసలు ఏమీ తోచని వాడు కైసే పిండు అర గంట ఉండి ఉండవచ్చు, చివరి దాకా ఉండవచ్చు, మధ్యలో లేచి పోవచ్చు. దాని పేరు ఉపన్యాసం. ప్రవచనం అంటే మంచి మాట నలుగురికి అందించేటువంటి ఒక ప్రయత్నం. దివ్యోపన్యాసం అంటే సమాజానికి ధర్మాన్ని alignment చేయాలి. లేకపోతే ఆ శాస్త్రాలు-- రమణ మహర్షి ఒక మాట చెప్పారు. "మీ దగ్గర ఒక శాస్త్రం ఉందయ్యా, మీ దగ్గర ఒక పుస్తకం ఉంది. దాన్ని నువ్వు చదివావు, బాగుంది. ఆచరణలో పెట్టకపోయినట్లయితే పశువుల కొష్టంలో ఉన్న జనప కట్ట వెలిగింది శాస్త్రం" అన్నారాయన. అది. అంటే ఆచరణ చేయాలి. ఈ ఇల్లాలు, ఈ దైనందిక జీవితంలో ఆ ఇల్లాలు ఇలాగే సాయంకాలం అయ్యేపట్టికి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళేది. ఇవాళ దేవాలయానికి మనకు భయం వేసినప్పుడు, మనకు ఏదో తీరని కోరిక మనసులో బాధిస్తున్నప్పుడు, మనకి దుఃఖం కలిగినది ఎప్పటికైనా తె-తెలవారుతుందా అని ఒక భయం ఏర్పడినందువలన భక్తి కంటే మనం భయంతో దేవాలయానికి వచ్చే దుర్దశ మనకు ఏర్పడింది. ప్రతిరోజూ దేవాలయానికి రావాలి. ఇది జనాటన్ ధర్మం నిర్దేశించినటువంటి ఒక బాధ్యత. ఎందుకు రావాలి? ఇంత ప్రాంగణం కట్టారే, ఈ ప్రాంతంలో ఇన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయే, వెంకటేశ్వర స్వామి దగ్గర పట్టుకుని పది మంది మనుషులు లేరా? ఇది ఏ జాతి చేసుకున్న దౌర్భాగ్యం ఇది. ఒక్క సాయంకాలం, మీ కోసం కట్టారే, మీరున్న ప్రాంతంలోనే అంటే మనమున్న ప్రాంతంలోనే మనకోసం కట్టారే, వచ్చి అక్కడ గనక మనం ఉండగలిగినట్లయితే ఇది ఒక అద్భుతమైన విజ్ఞాన వేదిక ఇది, దేవాలయం. ఈ దేవాలయంలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకెవరో ఓ నాటకం వేస్తారు. ఇంకెవరో ఇంకేదో వస్తారు. ఒక వేదిక. ఓ మహాత్ముడు వస్తాడు, మహా జ్ఞాని వస్తాడు. వచ్చి ఒక ఉపోధ చేస్తాడు. అట్లాగే ఇక్కడ ప్రసాదం తీసుకు వెళ్లటం మాత్రమే allow చేసుకోకూడదు. మనకున్నటువంటి సంపదని సమాజహితం చేయటానికి అన్నింటికంటే కూడా అన్నదానం చేయటానికి వీలైన, అనువైన ప్రదేశం ఏదంటే అది ఒక్క దేవాలయం మాత్రమే. ఇవాళ అట్లా లేదు. చిన్న, దాన్నేమంటారంటే ఒక plastic దాంట్లో ziplock, ziplock లో ఒక పిడికెడు వేసి వాడికి ప్రసాదం ఇచ్చి పంపుతున్నాం. ఇది కాదు చేయవలసింది. జనాటన్ ధర్మంలో ఉన్న భా-భావం ఏమిటి అంటే మనం సంపాదించిన దానిలో ప్రతిరోజూ ఒక పిడికెడు బియ్యం పక్కన పెట్టుకోవాలి. నెల అవగానే తెచ్చి వారికి, అయ్యవారికి అప్పజెప్పాలి. "అయ్యా! దీనిలో ఇంత నేను భోగం చేశా. దీనిని స్వామికి సమర్పించండి." ఇదెందుకు చెప్తున్నానంటే ఒక ఉపనిషత్తు మనకు జనాటన్ ధర్మంలో బోధిస్తున్నటువంటి మాట. మనమున్నాం. బాల్యం దాటాం, కౌమారం దాటాం, యవ్వనం దాటాం, వృద్ధాప్యంలోకి రేపో మాపో అడుగు పెడతాం. పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీరు ఎప్పుడైనా వారంతట వారు ఇంకొకరికి ముద్ద అన్నం పెట్టారా? ఇల్లాలు పెట్టిందేమో గానీ ఇంటి యజమాని ఎప్పుడూ వడ్డించిన సందర్భాలు లేవు. మరి పెట్టటం వేరు, పెట్టుకోవటం వేరు కదా! ఆ పెట్టుకోవటం గనక పురుషుడు చేయకపోయినట్లయితే ఏమవుతుందంటే ఏమీ జరగదు. మరి ఏం చేయాలి? అంటే తైత్తరీయ ఉపనిషత్తులో ఒక మాట ఏం చెప్పారంటే, నిజానికి తైత్తరీయ ఉపనిషత్తులో కూడా చిన్న వయస్సులో చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడికి నేర్పాలి. తల్లి తండ్రి ఎవరో ఒకరు వెంబడి వాడిని పెట్టుకెళ్ళి, దాన్నలా విసిరేయకూడదు. దాన్నే అందించాలి అన్నారు. ఆ అందించినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడి చేత మనం ఇప్పించాం కదా, ఆ వయస్సుకి వాడికి కావలసిన సర్వశక్తులు ఆ అన్నంలో ఉన్న ప్రతి మెతుకు వాడికి ఇస్తుంది. మనం ఇవ్వలేం. మన-మనకి వాడికి ఏదన్నా బలం ఇవ్వాలంటే boost కావాలి. కదా? Boost లో ఏం లేదండి, waste. మరి ఏమున్నదయ్యా అంటే తల్లి వెంబడి పెట్టుకుని తీసుకుని వెళ్ళి పిల్లవాడి చేత ఇవ్వటం నేర్పింది చూడండి. ఆ ఇచ్చినందువలన వాడు, ఆ వచ్చినటువంటి వాడు, తీసుకున్నటువంటి వాడు ఆయుష్మాన్ భవ అంటాడు చూడండి. ఆ ఆశీర్వచనమే ఆ పిల్లవాడిని ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి. అన్నం బహుకుర్వీత అనే మహా శ్లోకం ఉంటుంది. అదొక అద్భుతమైన శృతి. బహుకుర్వీత. చాలా పంచాలి. చాలా పెంచాలి. చాలా సమృద్ధంగా చేయాలి. మనకింతవరకు చాలులే అనుకోకూడదు. ఐదు కిలోలు మనకోసం తెచ్చుకుంటే కనీసం ఒక్క కిలో ఇంకొకరి కోసం కావాలి. పది కిలోలు తెస్తే తొమ్మిది మనం వాడుకున్నా ఒక్క కిలో ఇంకొకడికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది రోజూ మనం చేయం కాబట్టి చేయటానికి వ్యవస్థ ఉంది గనుక అన్నదానం కౌమార దశలోకొచ్చి యవ్వన దశలోకొస్తున్నప్పుడు గనక ఈ అన్నం పెట్టటం, ఇవాళ వడ్డించటం సత్యసాయి organization లో మీరు చూడండి. నారాయణ సేవ చేస్తున్నప్పుడు పిల్లలు అద్భుతంగా వడ్డిస్తూ ఉంటారు. పరమ ప్రేమతో వడ్డిస్తూ ఉంటారు. మరి వారికేమి లాభం అంటే ఆనందం ముందు ఇక్కడ కలిగినా, వారికి ఆ జీవితంలో ఏం కావాలో అవన్నీ భగవంతుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళకేం కావాలి? ఒక మంచి భార్య రావాలి. చక్కని సంసారం ఏర్పడాలి. ఒక సుముఖమైనటువంటి ప్రజాశక్తి కావాలి. అవన్నీ కూడా అన్నం అనుగ్రహిస్తుంది. మధ్య వయసుకు వచ్చాడు. ఆయన గనక అన్నదానం చేస్తే ఏమవుతుంది? అన్నం పెడితే ఏమవుతుంది? ఆ దానము అనేటువంటి మాట ఇవ్వటము అని కాదు, పంచటము అని అర్థం.ఆ పంచినట్లయితే సుఖమయ జీవితం కడదాకా ఏర్పడుతుంది. ఒక వృద్ధుడు ఉన్నాడు అండి. యాభై ఏళ్ళు దాటిపోయినాయి. ఆయన కూడా ఇట్లా అన్న వితరణ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకేమి లాభం ఏమిటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే. సూపర్ స్పెషాలిటీ hospital లోకి వెళ్ళటానికి ఆయనకి permission ఇవ్వడు భగవంతుడు. హాయిగా నిద్రలోనో, అన్నం తింటూనో, మాట్లాడుతూనో, పేపర్ చదువుతూనో దేహం వదిలిపెట్టేసాడు. దానిని మించినటువంటి సౌభాగ్యం, దానిని మించినటువంటి అద్భుత యోగం ఇంకోటి ఏదన్నా ఉన్నదేమో చెప్పండి. ఒక వెజిటబుల్ గా తొంబై ఏళ్ళు బ్రతికే కంటే తొమ్మిది సెకన్లలో శ్వాస వదిలిపెట్టగలిగితే దానిని మించినటువంటి అద్భుత యోగం మరొకటి లేదు. దానికే అనాయాస మరణం. దాన్ని పరమేశ్వరుడు అన్న రూపంలో అనుగ్రహిస్తాడు. ఇక ఈ అన్న విషయం సనాతన ధర్మంలో భారతదేశంలో అందునా ప్రధానంగా తెలుగునాట ఇది బాగా నెలబడిపోయింది. ఈ తెలుగునాట తెలుగు వారందరూ ఒకప్పుడు, ఇప్పటి సంగతి తెలీదు. ఇవాళ గ్రామీణ వ్యవస్థలో ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. గ్రామాలన్నీ townలు అవుతూతున్నాయట. town లన్నీ cityలు అయినాయట. city లన్నీ metroలు అయిపోయినాయ్. ఈ metro లన్నీ ఇంకా ఏమైపోతాయో మనకి తెలియదు. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఇవాళ సనాతన ధర్మం మనకి ఒక హెచ్చరిక చేస్తున్నది. నువ్వు దేవుడివి కావలసిన పని లేదు. దేవుడు ఒకడున్నాడు. వాడి పని వాడికి చేయనివ్వండి. మీరు మనిషి మీలో ఉన్న మనిషిని మీరు పోగొట్టుకోకండి. మనిషి మాయమైపోతున్నాడు. ఆ మనిషి అంటే ఒకరికి కష్టం కలిగినప్పుడు, ఒకడికి ఒక అననుకూలత ఏర్పడినప్పుడు, ఒకడు బలహీనుడు అయినప్పుడు, ఒకడు నలిగిన వాడైనప్పుడు కలిగిన వాడు కాపాడవలసి ఉన్నదా లేదా? ఆ కలిగిన వాడు ఎట్లా అయినాడు? ఆ కలిగిన వాడికి ఎందుకందింది అంటే పరమేశ్వరుడు వాడికి సంపద రూపంలో ఒక యోగాన్ని, ఒక అనుగ్రహం ఇచ్చాడు. దీనికి ఒక చిన్న example మీకు చెప్తాను. ప్రశాంతి నిలయంలో స్వామి దేహంలో ఉండగా ఎనభై ఏడు గ్రామాలకి నీరిచ్చాడు. ఎనభై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది మనకి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరూ చేయని పని స్వామి చేశారు. మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని దర్శనం చేసుకొని వద్దాం, వారికి మనం ఏమివ్వగలం అని ఎనభై ఏడు గ్రామాల ప్రజలు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఇది చరిత్రలో సత్యం. లోపల స్వామివారు ఉన్నారు. స్వామి దగ్గరికి వెళ్లి ఇట్లా గ్రామస్తులంతా వచ్చారు. వారిని స్వామి ప్రత్యేకంగా దర్శనం ఇస్తే, వాళ్ళతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామిని చూడాలని, అయ్యా మీరు మాకు అద్భుతమైనటువంటి నీరిచ్చారని చెప్పుకోవాలని వాళ్ళ మనస్సులు తహతహలాడుతున్నాయి. స్వామి లోపల్నుంచి వచ్చారు. వస్తూనే వాళ్ళని చెయ్యి ఎత్తి ఏమీ ఆశీర్వదించలేదు. ఏదో మీరందరికీ నేనున్నానని అటువంటి మాటలు మాట్లాడలేదు. బయటకు వస్తూనే వారు అన్నటువంటి మాటేమిటంటే మీ ఎనభై ఏడు గ్రామాలకు నీరు ఇవ్వగలిగినటువంటి యోగ్యతను నాకు కల్పించినందుకు స్వామి మీకు కృతజ్ఞత చెప్తున్నారని లోకానికి వినిపించారు. అంటే తీసుకునే వాడే యోగి, ఇచ్చేవాడు కాదు. ఆ ఇచ్చిన తీసుకునే వాడు ఎప్పుడూ ఉండాలి. ఆ తీసుకునేవాడు మనకి పరమాత్మ. ఒక యోగాన్ని, ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని మనకు కల్పిస్తూ ఉన్నాడు గనుక ఈ పరా ప్రకృతిలో ఆ నిత్య జీవితమంతా మనం గడిచినప్పుడు సాయంకాలం అవ్వగానే ఆ రోజుల్లో గుళ్ళో ఏం జరిగేది? పొరుగూరు నుంచి ఎవరో వచ్చేవారు, భాగవత పద్యాలు చెప్పేవారు. భారత పద్యాలు చెప్పేవారు. ధర్మరాజు ఇంకోడితో ఏమన్నాడు లేకపోతే భీష్ముడు ధర్మరాజుకి రాజవీధి ఎట్లా చెప్పాడు? ఆ పద్యాలు వాళ్ళు చక్కగా, కమ్మగా చెప్తూ ఉంటే వీళ్ళు అవన్నీ విని వీళ్ళకి పుస్తకం చదివే శక్తి లేదు. ధారణ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మరణం చేసుకొని అంటే ఊళ్ళోనే దులుపుకోకుండా ఇంటిదాకా అనుకుంటూ అనుకుంటూ వెళితే అవి వాళ్ళకి ధారణాత్మకంగా లోపల ఉండిపోతే వాటినే మళ్ళీ పద్యాలుగా పాడుకుంటూ ఉండేవారు. దానిలో నుంచి దివ్యత్వాన్ని, దైవత్వాన్ని వాళ్ళు అనుభవించేవారు. ఆనాటి parents ప్రధానంగా స్త్రీమూర్తులు ఏం ప్రార్థించేవారంటే మాకు రాముడివంటి కొడుకు కావాలని కోరుకునేవారు. చూడండి! అటువంటి జాతే పుట్టింది. ఇవాళ మరి అటువంటి భావాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే స్వామి సనాతన ధర్మాన్ని గురించి దాన్ని నడిపించిన స్వామికి సారాంశం రాబోయే కాలంలో అమ్మా అని ఏడ్చేటువంటి బిడ్డ ఈ కపై పుట్టడు. ఆయా అంటూ మరణించే బిడ్డలు పుడతారు అన్నాడు. అంటే తల్లి తాను కన్న బిడ్డ నుంచి తాను దూరమైన తర్వాత ఇక ధర్మమేముంది? అది మౌలికమైన ధర్మం. తల్లి, తండ్రి, గురువు దైవం అన్నటువంటి పరంపర అద్భుతమైనటువంటి పరంపర. తల్లి వీడు నీ తండ్రి అంటే బిడ్డ కనిపెట్టగలుగుతున్నాడు. తల్లి తండ్రి కలిసి ఎనిమిదవ ఏట ఓ గురువు దగ్గరికి తీసుకెళ్ళి నీ అంతటి వాడిని చేయమని కోరుకునేవారు. కృష్ణుడిని తీసుకెళ్ళి సాందీపుడిని అడిగింది. నీ అంతటి వాడిని చేయాలి మా అబ్బాయిని అని అడిగింది. ఆమెకు తెలియదు సాందీపుడే ఆయన్ని అలా ప్రార్థిస్తూ ఉన్నాడు అని. కానీ తల్లి, తల్లి హృదయం అలా కోరుకున్నది. ఇవాళ మనం పరామర్శ అంటే స్పర్శ మనల్ని మనం విశ్లేషించుకోవలసిన ఒక విషయం ఏమిటంటే ధర్మం మారుతున్నదని చాలా యాతన పడుతున్నాం. ధర్మమంతా దిగజారిపోయిందని, విలువలు పోయినాయి అని అంటున్నాం. కానీ వాటిని నిలబెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నామా? పెద్దగా ఏం చేయటం లేదు. నా వరకు నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు ఇంతవరకు బాగుంటే మిగతాది ఏదన్నా కానీ. మిగతాదంతా బాగుంటే నేను బాగుంటాను అనుకుంటే అంతా బాగుంటుంది.అట్లా అనుకోవటం లేదు నా వరకు నేను బాగుంటే చాలు అనుకుంటున్నాం ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటి ధర్మం సనాతన ధర్మం దేనికి బోధించలేదు వసుధైక కుటుంబ నిర్మాణం చేయమని అది ఆ వసుధైక కుటుంబ నిర్మాణం మొన్ననే ఒక మాట చెప్తూ చెప్పాను మళ్ళీ పునః ఆ మాట చెప్పాలి సనాతన ధర్మం అందులో ప్రధానంగా హైందవ ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి ఒక వివేకానంద స్వామి ఈ దేశం వదిలిపెట్టి అక్కడి దాకా వెళ్ళవలసి వచ్చింది అది నూట యాభై ఏళ్ళ నాటి కథ ఇవాళ నూట ఎనభై ఎనిమిది దేశాలకి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఆ దేశాలను తన దగ్గరకు రప్పించుకున్నటువంటి వారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు అమెరికా ఆస్ట్రేలియా నూట ఎనభై ఎనిమిది దేశాలు ఆయన ఎక్కడా కదలలే ఆయనకి degree లు లేవు కానీ అద్భుతమైనటువంటి English మాట్లాడేవారు ఏ భాషలో వస్తే వాళ్ళతో ఆ భాషలో వాళ్ళు వారు మాట్లాడేవారు కారణం ఏమిటి అంటే ఒక్కసారి ఆత్మానుభవాన్ని పొందినటువంటి గురువు ఒక ఆత్మ దేహాన్ని తీసుకువచ్చినటువంటి ఒక స్వరూపం ఉన్నట్లయితే వారు వారికి భాషా శాస్త్రం ఇవి ఏవి అవసరం లేదు మరి ఒక గుగ్రామం అయినటువంటి ప్రశాంతి వలయానికి రాజాధిరాజులు ఎలా రాగలిగారు అని ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నట్లయితే ఆయన దగ్గర ఏమీ డబ్బు లేదు మనకింకా ఉందరాలు దొంగరాలు మెల్లో గొలుసులు ఉన్నాయి ఆయనకు అవేమీ లేవు కాలుకి చెప్పు లేదు కంటికి జోడు లేదు అటువంటి సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏమిటో చెప్పారు అది అసలు ప్రేమ అనేటువంటిది సనాతన ధర్మానికి మూలం వసుధైక కుటుంబ నిర్మాణం ఇటుకలతో తీర్చేది కాదు ఒక అద్భుతమైన design లో నిర్చో ఏర్పడేది కాదు నేను నా పక్కనున్నటువంటి వాణ్ని పక్క జాతి వాణ్ని వాడి స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని కులాలని అన్ని వర్గాలని అన్ని వర్ణాలని ఏకం చేసుకొని ఉన్నదంతా ఒకటే అది పరమాత్మ ఒకే ఒక్క జాతి ఉన్నది ఆ జాతి మానవ జాతి మనందరికీ భాష లిపి వేరు కానీ హృదయ భాష ఒకటే ఉన్నది అమెరికాలో వాడికి ఆకలి వేస్తే వాడు మనలాగానే ఆకలి ఆకలి అంటాడు కాస్త వాడికి ఆకలి అనే పదం తెలీదు I am hungry, I am hungry అంటాడు మనకి మనం ఆకలిగా ఉన్నామని మనం అంటాం భాష మారుతున్నది కానీ భావము భావన చింతన ఏ మార్పు చెందటం లేదు అంటే వసుధైక కుటుంబ నిర్మాణం జరిగిన దానిని మనం ఎల్లలు గీచుకున్నాం ఎక్కడికిక్కడ divide చేసుకుని వెళ్ళిపోతున్నాం unite అయ్యే ప్రయత్నం చేయటం లేదు అటువంటి ఆ ప్రయత్నం చేయాలంటే సనాతనమైన వైదికమైనటువంటి ధర్మాన్ని నిత్య లైమికిట ధర్మాన్ని day to day life లో అదిగో ఆ సాయంకాలం వరకు ఈ లోగా అతిథులు వస్తారు మర్యాదస్తులు వస్తారు చుట్టాలు వస్తారు మన బంధువులలోని లేని వాడు మూట కట్టుకొని వచ్చేవాడు పెట్ట కట్టుకొని వస్తే రెండు మూడు నెలలు మన ఇంట్లో ఉండేవాడు అయ్యో వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అడిగిన వాడు లేడు మూడు నెలలు అయిన తర్వాత కూడా అప్పుడే వెళ్ళిపోతున్నావా అన్నటువంటి జాతి ఇప్పుడెందుకు వచ్చావు రా అనేటువంటి జాతికి తయారైంది కదా అంటే జాతి పరిణామం చెందుతున్నదనుకుంటున్నాం expand కావలసిన జాతి సంకుచితం అయిపోతున్నది ఇవన్నీ వదిలిపెట్టి స్వర్గం గురించి నరకం గురించి కైలాసం గురించి ఆ కథలు మన కడుపు నింపేవి కాదు మానవ జన్మ ఎత్తినందుకు స్వామిని అడిగారు స్వామి చిరు ప్రాయంలోనే సద్ధాంగ వేటనే ప్రపంచ భావనను వదిలిపెట్టి తల్లిని పిలిచి నీకు నాకు ఎట్టి సంబంధము లేదు నా భక్తులు నాకై ఎదురు చూస్తున్నారు నేను చేయవలసిన పని వేరే ఉన్నది అని అంటూ నిజానికి మే ఇరవై మూడున స్వామి ఆ మాట చెప్పారు ఏది I am సాయిబాబా అని అక్టోబర్ ఇరవై వ తారీఖు వచ్చేప్పటికి వేదోద్ధరణ ధర్మోద్ధరణ దీనజనోద్ధరణ అనే కార్యక్రమాలను ప్రకటించి వారు దాన్ని సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకొని చూడండి వారు ఎవరి ముందు చేయి చాపలేదు సనాతన ధర్మంలో మౌలికమైన ధర్మం ఏంటంటే ఎవరి ముందు మనం చేయి చాపకూడదు అంతే ఇది మొట్టమొదటిది మన విద్యని నమ్ముకోవాలే తప్ప దాన్ని డబ్బుకి అమ్ముకోకూడదు ఇది రెండు మూడవది అందరినీ ప్రేమించగలిగినటువంటి ఒక విశాల భావన మనకు ఉండాలి ఆ అందరినీ అంటే మన కంటికి కనబడుతున్న పదిమందిని కాదు దైవాన్ని కూడా మనం ప్రేమించాలి దైవాన్ని ఊరేగిస్తాం దైవాన్ని కీర్తిస్తాం దైవం మీద భజనలు ఉంటాయి పాటలు ఉంటాయి అన్నీ చేస్తాం కానీ దైవాన్ని ప్రేమించగల హృదయం మనకు ఏర్పడిందా అంటే లేదు దైవం అంటే వేరు ఆయన వేరు మనం వేరు ఆయన అక్కడుంటాడు మనమిక్కడుంటాం మనకు తను ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడి వస్తాం చెప్పుకోనేది ఏదో చెప్పుకుంటాం ఆయన చేసేది చేస్తాడు లేకపోతే చేయడు చేయకపోతే ఈ దేవాలయంలో మహత్యం లేదంటాం చేస్తే ఇక్కడే మహత్యాలున్నాయంటాం అన్నీ మనమే నిర్ణయిస్తాం ఇదంతా కూడా ఒక మానసికమైనటువంటి వైకల్యమే తప్ప మానసికమైనటువంటి జాడ్యమే తప్ప మరొకటి కాదు కనుక ఈ సమస్త ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి కేవలం మానవుల్ని మాత్రమే కాదు త్రితీరిక బ్రహ్మమయంతము ఆవరించి ఆవహించి ఆవేశించి ఉన్నటువంటి ఆత్మని గనుక మనం గౌరవించగలిగినట్లయితే ప్రేమించగలిగినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మ అధ్యాత్మకి సనాతన ధర్మానికి పర్యాయ పదాలే తప్ప అది వేరు ఇది వేరు కాదు ధర్మం గనుక ఆచరణాత్మకం అయితే దాని పేరు అధ్యాత్మ అవుతున్నది ఆ అధ్యాత్మ మానవ జీవితానికి చాలా అక్కరకు రావాలి కనుక ఈ ఒక్కరోజు ప్రయాణం అంతా ఒక ఇల్లాలు ఎట్లా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందిందో ఓ చిన్న కథ చెప్తాను భారతంలో కథ ఇది ధర్మవ్యాధ ఉపాఖ్యానం అని ఒకటి ఉంది చాలా చిన్న కథ కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఒక అడవిలో తపస్సు చేశాడు.తపస్సు బాగా సాగింది ఆయనకి ఆనందం కలిగింది. ఆ తపోభూమిక లోనుంచి బయట పడ్డాడు తపస్సు నుంచి ఎప్పుడైతే బయట పడ్డాడో లోకంలోకి వెళ్లాలని అనిపించింది లోకంలోకి వెళ్ళటం మొదలు పెట్టాడు. కొంత దూరం నడిచి వెళ్ళాడు గనుక అక్కడికి వెళ్ళేసరికి ఒక ఇంటి ఇల్లాలు ముందు నుంచున్నాడు. భవతి భిక్షాందేహి అని అడిచాడు. ఒకటోసారి రెండోసారి మూడోసారి అడిచాడు అడిగితే లోపల్నుంచి ఏరక ప్రతిస్పందన లేదు. ఆయన బయలుదేరబోయే ముందు ఆయనకు ఒక సంఘటన జరిగింది సంఘటన ఏమిటంటే ఏ చెట్టు కింద కూర్చుని ఆయన తపస్సు చేసాడో ఆ తపస్సు నుంచి బయటకు వచ్చేటువంటి వేళ పైనుంచి ఒక పిట్ట ఆయన నెత్తిన ఒక రెక్క వేసింది. ఒక్కసారి కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి దానివైపు అలా చూశాడు. ఆయన చూపుకి అది ఖాళీ భస్మం అయి కింద పడిపోయింది. తన ప్రయాణం తను సాగించాడు. ఇల్లాలి దగ్గరికి వచ్చాడు. ఈ భవతి భిక్షాందేహి అని మూడు సార్లు అనేసరికి ఎప్పుడైతే ప్రతిస్పందన లేదో లోపల ఆవేశం రగులుతున్నది. ఇలా అరుస్తూ ఉంటే అన్నం ముద్ద కూడా పెట్టే ఇల్లాలి లేదా అని కానీ ఇంతలోకే ఆమె లోపల్నుంచి బయటికి వచ్చింది వచ్చి నా భర్త పొలంలో పని చేసుకొని అలసిపోయి ఆకలి వేళ ఇల్లు చేరుకున్నాడు. చాలా శ్రమ పడ్డాడు పొలంలో ఆయనకు ఉపచారం చేస్తూ ఆయన నిద్ర అనేటువంటి సుఖంలోకి వెళ్లేలోగా ఆయనకు ఉపచారం చేసి రావటంలో కాస్త లేట్ అయింది నాయనా కాస్త దానిని తప్పు పట్టకు అని అంటూ అయినా నీ కోపాగ్నికి బలి కావటానికి నేను ఎమన్నా పిట్టనా అన్నది. ఆశ్చర్యపోయినాడు తోషితుడు. ఇదేమిటి ఇక్కడ ఏదో చదువు సంచలనం అయిన ఒక ఇల్లాలు ఎక్కడో అడవిలో నా కంటి చూపుకు భస్మం అయిపోయినటువంటి పిట్ట గురించి చెప్తున్నదే అని జ్ఞాని గనుక తపస్సు తృప్త అయిన వాడు గనుక తల్లి నాకు జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించే ఒక ఎత్తినన్నా చూపించు నువ్వన్నా బోధించు అన్నాడు. నా పని అది కాదు నా పని గృహస్థాశ్రమం. ఇక్కడి నుంచి కొద్ది కొన్ని కొంత దూరం వెళితే ఒక గ్రామ మధ్యలో ధర్మవ్యాధుడు అనే ఒకడు ఉంటాడు. అక్కడికి వెళ్లి ఆయన్ని చిరునామా కనుక్కో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు ఏం చెప్పాలో చెప్తాడు అని. ఈయన సద్బ్రాహ్మణుడు. వెళ్ళాడు. ఆ గ్రామంలో అడుగుతూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు ధర్మవ్యాధుడు అని. అడిగో అక్కడే ఆ పక్కనే ఈ పక్కనే వెళ్ళండి వెళ్ళండి అంటే ఒక గుట్టలో కూర్చొని ఉన్నాడు ఆయన. చిత్తైకాగ్ర స్థితిలో ఆయన మాంసం వ్యాపారం చేస్తున్నాడు. మాంసం ముక్కలు కోడుతూ కూర్చున్నాడు. అతిశయం చెప్పట్లేదు. నేను ఇతని దగ్గరకు వెళ్ళి ధర్మాన్ని గురించి బో నేర్చుకోవాలా? ఇతని వృత్తి ఏమిటి అనుకున్నాడు. కానీ వెంటనే ఆ తల్లి చెప్పింది. నాయనా వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నివృత్తి మార్గాన్ని ఆయన చెప్తాడు అని మాత్రం చెప్పింది అది గుర్తొచ్చింది. అప్పుడు ధర్మవ్యాధుని దగ్గరికి తన అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మం బోధించినటువంటి అంటే ఎదుటివారిలో ఉన్నటువంటి పవిత్ర ఆత్మీయక భావనను పట్టుకొని దాన్ని బట్టుకొని మనం నడవాలే తప్ప పై పైన ఉన్న వేషభాషలను బట్టి కాదు అనేటువంటి ఒక భావనను పట్టుకొని చేతులు జోడించి శిరస్సు వంచి వినమ్రుడై ధర్మాన్ని గురించినటువంటి వ్యాఖ్యానం చెయ్యి నాకు ఆ ధర్మబోధ ప్రబోధించు అని అడిగినప్పుడు ధర్మవ్యాధుడు చెప్పవలసినవన్నీ చెప్పాడు. ఎప్పుడైనా భారతంలో ఇవన్నీ చెప్పడానికి కొన్ని గంటలు పడుతుంది. అవసరం లేదు. ధర్మవ్యాధోపాఖ్యానం అని ఒకటి ఉంది. అది చక్కని తెలుగులో ఉంది. ఇంటికి వెళ్లి ఆ టీవీ పిచ్చు టీవీకి ఆ సెట్ కట్టేయండి. మళ్లీ ఎలెక్షన్స్ అయ్యేదాకా దాన్ని చూడకండి. రిజల్ట్ ఏది ఏం తెలుసుకుందో తెలుసుకుని ఎవడో వస్తాడు. కార్య రాజులు రాజ్యములు కలుగబెరి ఎవడో వస్తాడు. వాడి కోసం వాడు వస్తాడు. మనకోసం మనం ఉంటాం. అంతే కదా. ఎక్కడో ఒక ధర్మానికి ఒక నియతి ఏర్పరచుకోండి. ఒక లైన్ డ్రా చేసేయండి. మనకున్న జీవితమే చాలా అల్ప జీవితం. తల్లి గర్భాలయం నుంచి స్మశాన వాటిక దాకా వంద సంవత్సరాల ఆయుష్షు మనకిచ్చినా అందులో చాలా భాగం అజాగ్రత్తతో మనం పోగొట్టుకుంటాం. జాగ్రత్తగా గనుక గమనించుకొని దానిని వాడుకోగలిగితే దాన్ని ధర్మబద్ధం చేయగలిగినట్లయితే దాని ద్వారా సమాజానికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం కూడా మార్గోపదేశనం చేయగలిగితే అప్పుడే ఈ మానవ జన్మకి ఒక సార్థకత ఒక ధన్యత ఏర్పడుతుంది. అట్లా సత్య సాయిబాబా వారిని వారి చిన్నతనంలో వారికి ముప్పై ఏళ్లు రాకుండా ఒక మాట అడిగారు. ఆ అడిగిన వారు పండితులు అనబడేటువంటి వారందరు అడిగారు. స్వామి అధ్యాత్మ అంటే ఏమిటి అని అడిగారు. ఏం లేదు ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటమే అధ్యాత్మ అన్నాడు. వాళ్లకు అర్థమైపోయింది. అడిగిన వాడికి ఆ భాష తెలిసిపోయింది. మళ్ళీ పదేళ్ళకి ఇదే ప్రశ్న వేశారు. అప్పుడు ప్రశ్న అదే గానీ సమాధానం ఇది కాదు. ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావాలి అది అధ్యాత్మ. సనాతన ధర్మం బోధించేది అదే అన్నాడు. ప్రభావం అంటే ఈ వెల మనం ప్రభావితమై ఉన్నాం. ఈ ప్రభావితంలో నుంచి స్వభావంలోకి రావాలి. ఆత్మ భావనలోకి రావాలి. మనం ఎందుకు వచ్చాం? మనం ఏం పని చేయాలి? మనం చేస్తున్నది సక్రమంగా ఉందా లేదా? మన ఆలోచనలు బాగున్నాయా? సంకుచిత పరిధిని దాటి విశాల భావనలోకి వెళ్తున్నాయా? లేదు ఎక్కడో ఒకచోట ఆ గానుగెద్దువలె గంగెద్దువలె ఆగిపోయినామా? ఇవన్నీ గనక విచారణ చేసుకున్నట్లయితే సమాధానాలు గనక అక్కడే దొరుకుతాయి. కాబట్టి ఆ సమాధానం ప్రభావితస్వభావంలోకి రావటం తెలిసిపోయింది. మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళకి అంటే స్వామి శరీరానికి డెభై ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వేశారు. అప్పటికి అధ్యాత్మ అనే మాట మరుగున పడిపోయింది. మనం మెకాలే ఎడ్యుకేషన్ లో బాగా లోతుగా దిగిన వాళ్ళం కదా spirituality అనే మాట adopt చేసేసుకున్నాం. ఆయన కూడా అలాగే అడిగారు. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే "మానవుడు మానవుడిగా జీవించగలిగితే అదే అధ్యాత్మ" simplify చేశారు. అంటే మనం కనీసం మానవుడిగా కూడా మనం జీవించటం లేదు. ఆ జీవించేటువంటి సూత్రాలు నాలుగైదు సూత్రాలు మనం ఇవాళ మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాంగణం నుంచి మళ్ళీ మన విశాల ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు, ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి అవి అక్కరకు వస్తాయి అని మేము భావన చేస్తూ, కుక్కట్ పల్లి సమితి సత్యసాయి సేవా సమితి ఏ రకమైన స్వార్థం వెలగనటువంటి ఒక అద్భుత సమితి ఇది. ఇది స్వామి హృదయంలో నుంచి, సంకల్పం లో నుంచి, వారి ఉపదేశం లో నుంచి, వారి సందేశం లో నుంచి, వారి ఆదేశం లో నుంచి ఏర్పడింది. దాని లక్ష్యం ఒక్కటే, ఈ సమాజానికి ఎన్ని రకాలుగా నువ్వు సేవ చేయగలవో ఆ సేవని అందించు. అది మాట ద్వారా కావచ్చు, పాట ద్వారా కావచ్చు, నారాయణ సేవ ద్వారా కావచ్చు, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా చేయగలిగినటువంటి ఒక స్థాయిని ఈ జగత్తుని promote చేస్తూ రా. ఈ జగత్తుకు ఒక ప్రేరణ కలిగించు. ఇది వారి యందు. వారు వేలాది మంది జెండాలు పట్టుకొని వెళ్ళరు. చాలా నిశ్శబ్దంగా, వినయంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని గమనించాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఎవరు ఈ Sai devotees, ఎక్కడున్నారు అని కానీవారు వెతుక్కోవాలి. వెతుక్కొని అక్కడికి వెళ్తే ఆ తర్య కలాపాలే మనకి సాధనలుగా మారిపోతాయి. ఇందాక అనుకున్న అన్నం పెట్టడం తెలుస్తుంది, మందుపిల్ల ఇవ్వటం తెలుస్తుంది, దుఃఖంలో ఉన్నవాడి కన్నీరు తుడిచే వాత్సల్య రేఖ అనేది ఉదయిస్తుంది. అనేకమైన మూడు వందల అరవై డిగ్రీలలో మనం ఈ మానవ జాతికి, సమకాలీనమైన జాతికి, సహజీవనం చేస్తున్న ఈ జాతికి ఏం చేయగలుగుతామో సత్యసాయి సేవా సమితి చేస్తుంది. దీనికి ఏ రకమైన వేరే ఆలోచనలు ఉండవు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒక సంఘటితమైనటువంటి మానవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో అనుసంధానం చేసుకుంటుంది. ఈ సత్యసాయి సేవా సమితి ఎలా చేస్తుంది అని ప్రశ్నించుకుంటే దైవ ప్రజ్ఞ తోడైనందువలనే చేస్తున్నది. ఇదే ఆన్సర్. దీన్ని మించి మరొకటి లేదు. కనుక మనం ఎవరితో కూడి ఉంటే, ఎవరి సాంగత్యంలో ఉంటే మన ఆలోచనా పరిధి విస్తృతమవుతుందో వారితో మనం కూడి ఉండాలి. ఇది ఒకటి. రెండవది కుల, మత ద్వేషాన్ని మనం మన ఇంట్లో వదిలిపెట్టేయాలి. ఎందుకంటే మన ఇంటికి సింహద్వారానికి ఓ గడప ఉంది కదా. ఇప్పుడు గడపలు లేని ఇళ్ళు వచ్చేసినయి. అవి కూడా వచ్చేసినయి. కాబట్టి భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఒక గడప ఉండాలి. ఆ గడప ఏమిటంటే గడప లోపల ఉన్నంత వరకు అది నీ ప్రపంచం. గడప దాటి ఒక అడుగు వెయ్యగానే నువ్వు ప్రపంచానికి చెందాలి. అక్కడ నీ భార్య, భర్త, బంధువులు, పిల్లలు అందరితో పాటు ఉందని వీళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో ఉంటారు, వాళ్ళతో కూడా మనం ఉంటాం. అక్కడ ఉన్నటువంటి నీ భార్య తప్ప మిగిలిన వారందరూ కూడా నీకు మాతృ సమా రాము మాతృమూర్తులుగా నువ్వు భావన చేసేటువంటి ఆ సనాతన వైదిక ధర్మాన్ని మనసు నిండా నింపుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అందమైన తల్లులు, కురూపీ అయిన తల్లులు ఉండరు. తల్లి తల్లే. అట్లాగే కురూపీ అయిన బిడ్డ ఉంటాడేమో గాని కురూపీ అయిన తల్లి ఉండదు. కారణం తల్లి యొక్క స్థానం, మాతృమూర్తి యొక్క స్థానం, స్త్రీ యొక్క స్థానం ఏమిటంటే పవిత్రమైనటువంటి ఒక జాతిని విస్తరింపజేసేటువంటి పరమాద్భుత చైతన్య భూమిక స్త్రీమూర్తి. కాబట్టి ఇవాళ ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నాం అంటే TV ల ఏదన్నా చూద్దామని పెట్టగానే ఐదేళ్ళ పిల్ల మానభంగం, ఆరేళ్ళ పిల్ల kidnap, ఏడేళ్ళ పిల్లని హత్య. ఇదే, ఇదై జాతి ఇది. ఇవన్నీ-ఇవన్నీ సంస్కరించుకోకుండా, వీటిని సరిదిద్దుకోకుండా ఎక్కడో స్వర్గం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? ఈ hypocrisy నుంచి మనల్ని మనం బయట వేసుకోవాలి. ఇవాళ ఒక ఆడపిల్ల ప-పసికందు ఈ ప్రపంచానికి ఎట్లా ఆకర్షణ అవుతున్నదో డెభై ఏళ్ళు వయస్సు ఉడిగిన వాడు ఇంద్రియాలు ముడుచుకొని జీవితాన్ని భద్రత మంగా జీవించవలసిన వాడు ఎటువంటి పశు ప్రవృత్తితో జీవిస్తున్నాడో గమనిస్తే ఒక ఘేయమైన, జుగుప్సాకరమైనటువంటి సమాజం మన కళ్ళముందు నిర్మాణం జరుగుతున్నది. దీనిని ఎక్కడికక్కడ ఒక voluntary గా మనం చేయాలి. దానికి కళ్ళపట్టుకోనక్కర్లేదు. సమాజం మీద మన కన్ను విప్పి గనక చూసినట్లయితే వీటన్నింటినీ మనం నివారించగలం. ఎందుకంటే మానవతా విలువలతో కూడిన విద్యని మనం పోగొట్టుకున్నాం. రెండు వందల సంవత్సరాల దాస్యంలో మెకాలే ఎడ్యుకేషన్ తో పాటే మనలో ఉన్న మానవత్వం నాశనమైపోయింది, మన నుంచి దూరమైపోయింది. marks వచ్చే చదువు మనకు బాగా ప్రధానమైంది. ఇవాళ ఆ మనం TV, మళ్ళీ TV పెట్టగానే అరవై రెండు, అరవై మూడు, అరవై నాలుగు గుండె పగిలిపోయేట్టు ఏంటవి? దాంట్లో ఏవన్నా తొంభై ఎనిమిది, ninety eight point one, ninety eight point zero zero one ఇవే అన్నమాట. చివరికి వాడు బయటకు వస్తే వాడు ఎవరికీ పనికిరాని వ్యక్తిగా కేవలం marks ను తెచ్చుకునేటువంటి ఒక యంత్రంగా మన పిల్లల్ని మనం తయారు చేస్తున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించవలసినటువంటిది బిడ్డల్ని కన్న తల్లిదండ్రులది తప్ప వారిది కాదు. వాళ్ళు ఎప్పుడో ఒక రోజున జీవితంలో ఒక ప్రశ్న వేస్తారు. "మాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు చిన్నప్పుడు?"అందుకనే సత్యసాయి భగవానుడు బాల వికాస్ పెట్టారు. ఇవాళ మాతృమూర్తులు చిన్న వాళ్ళు గనుక ఉన్నట్లయితే చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళని బాల వికాస్ లో చేర్పండి, చేర్చండి. వాళ్ళలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆ స్త్రీ చైతన్యం, ఆ స్త్రీ యందు ఉండే మార్దవం, ఆ లావణ్యం, ఆ కరుణ, ఆ దయ, ఆ పవిత్రత అవి radiate అవుతాయి. అట్లా బాల వికాస్ ని మీరు వాడుకోండి. ఈ సభ్య సమాజం అంతా కూడా ఒకసారి రండి బాల వికాస్ లో ఏం జరుగుతున్నది, ఏముందండి రెండు భజనలు నేర్పుతారు భజనలు నేర్పరు అక్కడ. నీతి నేర్పుతారు, శీలాన్ని నేర్పుతారు, సంస్కృతి పరమైనటువంటి శ్లోకాలను నేర్పుతారు, సుశ్లోకమైన భావనలు నేర్పుతారు. చక్కటి పదాలు ఉచ్చారణ చేయగలిగిన మహాద్భుతమైనటువంటి శక్తిని బాల వికాస్ లో గనుక ఐదు సంవత్సరాల మీ పిల్లను, పిల్లవాడిను పంపితే ఎనిమిదేళ్లు అయ్యేప్పటికి వాడు మీ దగ్గరకు వచ్చి లేదా ఆమె మీ దగ్గరకు వచ్చి మీకు అనేక నీతి కథలు చెప్పగలిగే స్థాయికి మీ ఎనిమిదేళ్ల పిల్ల మీ కళ్ళముందు పెరుగుతుంది. కావలసింది ఏమిటని ప్రశ్నించుకుంటే, ఇదంతా సనాతన ధర్మంలో భాగమే. తండ్రి రెంబడి పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్లాడు? కాయకష్టం చేసే పొలానికి తీసుకెళ్లాడు. సాయంకాలం అయ్యేప్పటికి గుడికి తీసుకెళ్లాడు. మూడేముండేవి మానవ జీవితంలో ఆనాడు. ఒకటి బడి, రెండవది గుడి, మూడవది మడి. మడి అంటే పొలం. ఆ పొలంలో ఏనాటికైనా నువ్వు చదువుకుంటావో చదువుకోవెయ్యో ఈ పొలం నీకు అన్నం పెడుతుంది రా, కష్టపడితే ముద్ద బయటకు వస్తుందని చెప్పడానికి పొలానికి. ఇదిగో ఈ నిన్ను, నన్ను, ఈ మన్ను అన్నీ కలిపి సృష్టించిన వాడు దైవమని చూపించడానికి గుడి. ఆ తర్వాత ఒక కావలసిన విద్య, లోకంలో బతకాలి గనుక ఒక విద్య కావాలి గనుక ఆ విద్యకు సంబంధించినటువంటి బడి. బడి, గుడి, మడి. ఇవాళ మండుపోయినయి. మళ్ళా అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి. ఎవరన్నా ఇలా లోపలికి రాగానే వివేకానంద స్వామి విగ్రహం దాటుతుండగానే ఆ driver అంటాడు "ఒకప్పుడు ఇవన్నీ పొలాలు సార్" అంటాడు. అంటే ఏం లేవు మండులు పోయినయి. చాలా పోయినయి. ఇవాళ ఏం మిగలలా మనకి. కనీసం ఈ మిగిలిన దానినైనా మన సంస్కృతితో, మన సనాతన ధర్మంతో మనం నిలబెట్టుకుంటామా ఒక ప్రశ్న వేసుకోవాలి. అలాగే ఇవాళ వైద్య రంగం. వైద్యులు ఉన్నా బాధపడకండి. వైద్యరంగం మీద గౌరవం ఉన్న వాళ్ళమే గాని వైద్యరంగం ఇవాళ ఏమైపోయింది అంటే, అయ్యా కన్ను కనబడటం లేదు అంటే గుడ్డు పీకేస్తారా అంటున్నాడు. కారు నడవటానికి కష్టంగా ఉన్నది, ఏం లేదు ఫీలు మార్పించేస్తా అంటున్నాడు. వాడికి కావలసిన వైద్యం వాడు కట్టుకోగలడా, తట్టుకోగలడా, అంత డబ్బు పెట్టుకోగలడా అన్న ఆలోచన, మానవీయ దుర్భర నశించిపోయింది. ఎందుకని అంటే వైద్యుడిలో ఉన్న నారాయుడు అప్పుడు హరి ఇప్పుడు హరి వెళ్ళిపోయినాడు. కావలసింది అంతా డబ్బు డబ్బు డబ్బు డబ్బు. మరి ఇది ఎటు వెళ్తామో మనకి. సనాతన ధర్మం ఇవాళ ఆధునిక సమాజానికి ఎట్లా ఉపయోగిస్తుంది అంటే వాళ్ళు పాపం పాప భూమికలో సంపాదించిన దాంట్లో కొంత దాతృత్వం ఉన్నది. కానీ కావలసింది అది కాదు. సత్యసాయి భగవానుడు ఒక సు-సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాడు. ఆ వేదిక మీద నుంచి ఆయన చేసిన ప్రసంగం ఇంకా నా చెవుల్లో వింగ్కురు మంటున్నది. గుండె మీద రాసుకున్న రెండేడు మాటలు. ఈ ఆస్పత్రి మీకోసమే కట్టించాను ఒకటి. రెండవది, ఇక్కడ డబ్బున్నవారు కూడా వచ్చి వైద్యం చేసుకోవచ్చును. వాళ్ళక్కూడా ఫ్రీ. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కొన్ని లక్షల ఆపరేషన్లు ఫ్రీగా జరిగినయి. మరి అక్కడ జరిగినప్పుడు అది కాని చోట ఎందుకు జరగటం లేదు? ఇక్కడ మానవత్వం పోయింది. ఇవాళ మనం చందా ఇస్తాం. చందా ఇవ్వగానే పేపర్లో ఫోటో పడాలి. చందా ఇవ్వగానే ఇచ్చిన వాడు మనకి బా-బానిస కావాలి. తీసుకున్నవాడు బానిస కావాలి. ఇచ్చిన వాడు అధికారిగా ఉండాలి. ఇంత దౌష్ట్యము, ఇంత దర్పము, ఇంత ప్రగల్భము, ఇంత గర్వము ఉన్నప్పుడు మనం చేయగలమా? మన దానధర్మాలు చేయగలమా? స్వామి ఒకసారి అనంతపురం వెళ్లారు, వారి చిన్నప్పుడు. వారికి అప్పటికి ఇంకా ఇరవై ఏడేళ్లు కూడా రాలే. హాల్లో కిటకిటలాడిపోతున్నారు జనం. కరెంటు ఉంది. స్వామి ముందు mic పెట్టారు. స్వామి కూడా కూర్చున్నారు. ఆయన దగ్గర కూడా ఒక fan ఉంది. ఏ ఒక్క fan తిరగటం లేదు. స్వామి అడిగారు "ఎందుకని fan ఎందుకు తిరగటం లేదు? current ఉంది కదా, వేయండి" అన్నారు. అందులో ఒకాయన లేచి వినమ్రంగా "స్వామి, నా ఇప్పుడు వెయ్యము" అన్నాడు. "మరి ఇప్పుడు వేయకపోతే ఆ తర్వాత ఖాళీ హాలు అప్పుడు వెయ్యము, హాలు నిండుగా ఉన్నప్పుడు ఇప్పుడు వెయ్యము, మరి అవి ఎందుకు పెట్టినట్టు?" అని తెలియనట్టు అడిగితే, "స్వామి ఒక్కసారి మీరు పైకి చూస్తే తెలుస్తుంది. ఆ fan మధ్యలో ఉన్న hub ఏదైతే ఉందో దానిమీద మా నాన్న పేరుంది. మొదటి రెక్క మీద నా భార్య పేరుంది. రెండో రెక్క మీద నా కొడుకు పేరుంది. మూడో రెక్క మీద నా కూతురు పేరుంది. అది గిరగిరా తిరిగితే మీరెప్పుడు చూస్తారు గనుక నేను తిప్పాను" అన్నాడు. అది. ఇవాళ దానధర్మాల స్థాయి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే మానవత్వం లేదు. ప్రదర్శన ఎక్కువైంది, నిదర్శన నశించిపోయింది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా observe చేసినట్లయితే మనలోనే అపవిత్రుడు ఒకడున్నాడు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నారు, చెప్తున్నారు. ఏమనంటే, "నీ యందు ఇద్దరున్నారు. ఒకడు మాయావి, రెండో వాడు మహాయోగి. నువ్వు మాయావివి కాదలచుకున్నావా, మహాయోగివి కాదలచుకున్నావా? మాయావివి కావాలి అంటే లోకం వైపు వెళ్ళు. మహాయోగివి కావాలి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలకన్నీ సమాధానాలు దొరుకుతాయి." ఇవన్నీ మన కళ్ళముందు జరుగుతున్నటువంటి విశేషాలే. కాబట్టి సత్యసాయి సేవా organization తలపెట్టినటువంటి ముక్కట్ పల్లి కార్యక్రమంలో నేను స్వామి భక్తుడిగాస్వామి మహిమల పట్ల గొప్ప ఆకర్షణ లేని వాడిగా వాటిని లక్ష్య పెట్టలే. స్వామి ఈ ప్రపంచానికి ఒక human being గా ఏం చేశారు? కేవలం మానవుడుగా ఆయన ఈ ప్రపంచానికి ఏమిచ్చారు? వారి తత్వ చింతనా భూమిక ఏమిటని సుమారు యాభై నాలుగు సంవత్సరాలు విచారణ చేస్తే మానవుణ్ణి మళ్ళీ మేల్కొంపడానికి మరచిపోయినటువంటి మానవత్వాన్ని మళ్ళీ ఓసారి గుర్తు చేయడానికి దాన్ని ఆచరణాత్మక దివ్య జీవన విధానం చేయడానికి నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక భావనా భూమికగా పవిత్రీకరించడానికి ఇన్ని రకాలుగా మానవ జీవితాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ఒక పరమ బౌద్ధగా ఒక అవతారమూర్తిగా నేను అర్థం చేసుకున్నా. చేసుకున్నప్పుడు మరి ప్రేరణ ఏం కలిగింది, ఎలా కలిగింది అని అంటే వారు అన్నీ free గా ఇవ్వగలరు. భగవంతుడు కనుక. నేనేమంటానంటే ఉచితం వదిలిపెడదాం సముచితంగా జీవిద్దాం. ఆ సముచితం అంటే ఇచ్చిన వాడు ఇస్తే తీసుకుందాం ఇవ్వని వాడు ఉంటే వాడిని ఏమీ అడగొద్దు. ఇది doctrine గా నేర్చుకోవాలి. విద్య మౌలికమైన భారతీయమైనటువంటి సనాతనమైన ధర్మంతో కూడినటువంటి విద్యని మహర్షుల జీవితాలని మహర్షుల వాక్యాలని వీటన్నిటినీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇది రెండవది. ఇక మూడవది మన జీవితం ఇందాక అనుకున్నట్లుగా ఏమో ఎంతకాలం ఉంటాం అనేది పెద్ద ప్రశ్న కాబట్టి మనం చేదరించినటువంటి ఒక పని రేపటికి రూపం లేదన్నారు స్వామి. రేపు ఉండొచ్చేమో మనం ఉండకపోవచ్చు. కానీ రేపు చేద్దామనుకున్న పని ఇవాళే చేసేసేయండి. రేపు ఆ రేపున మనం ఉండకపోవచ్చు ఇప్పుడే చేసేసుకోండి. కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని మనం ఎవరికి వ్యక్తిత్వానికి ఆరాధన చేయాలి మనం? వ్యక్తుల ఆరాధన కోసం పుట్టింది సత్యసాయి organization కాదు. దాని మౌలికమైన లక్ష్యం ఏమిటంటే ప్రచారం దాని దృష్టి కాదు. ప్రచారలోకి వెళ్ళదు. మేము ప్రచారం చేస్తామన్నా మాకు వద్దంటా. కాకపోతే మనము ఏమనుకుంటాం ఆ ఏ సమితికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాసేపు కూర్చొని నాలుగు మంచి మాటలు చెప్పడానికి అందరం వాడేసిన రాజ సింహాసనం మనకక్కర్లా. నీలకంఠం చాలు. ఏం చేసింది? ఇది కూడా పాపం సేవ చేసిందిగా. ఒక రెండు గంటలు కూర్చోబెట్టిందిగా. మైకు తన పని తాను చేసుకున్నదిగా. అంటే ఒక సమన్వయమైనటువంటి సంయుక్త దృష్టి మనకు కావాలి. సమాజం అంతా ఒక్కటే. ఈ సమాజాన్ని ఒక బృహదాలయం గా దానిని ఆరాధించడం దానికి చేయగలిగినంత మనం మొయ్యలేనిది మొయ్యకూడదు. తప్పు. స్వామి చెప్పారు. ప్రపంచంలో ఇద్దరు దొంగలుంటారు. ఒకడు దొంగ రెండో వాడు గజ దొంగ. అనగానే మనకి మన ఆస్తులు వాడు మూటగట్టుకొని వెళ్ళిపోవడం అవన్నీ కనిపిస్తాయి. ఎవరు తన శక్తిని దాచుకొని చేయగలిగి ఉండి కూడా చేయడో వాడు గజదొంగ. రెండో వాడు ఏమీ చేయలేని వాడు కానీ ఏదైనా చేయగలనని చెప్తాడే వాడు అసలు దొంగ. కాబట్టి చేస్తానన్నవాడు చేయగలిగిన వాడు కాక చేసేవాడు ఈ సమాజానికి కావాలి. ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఆచరణాత్మకం కావాలి. కాకపోయినట్లయితే ఏదో మంచి ఉపన్యాసం కాసేపు మాట్లాడి వెళ్లారని దీని ప్రయోజనం ఏమీ కాదు. ఒక సంవత్సర కాలం మన ఈ వ్యవస్థలో ప్రతి నెలా కలుసుకోవాలి అన్నటువంటి భావన వెనుక ఏమున్నది అంటే మన కళ్ళ ముందే సమాజం కుళ్ళిపోతున్నది. దాని మీద ధ్వజం ఎత్తితే జెండాలు ఎత్తితే ఒక ర్యాలీని గనక start చేస్తే five K run, ten K run లు ఇవేమీ కావు. అవన్నీ వ్యాపార కళలని. కావాల్సింది మౌలికంగా వ్యక్తిలో ఒక ఆలోచన కలిగించాలి. ఆ ఆలోచన ఒక అద్భుతమైన ఆదర్శంగా రూపుదిద్దుకోవాలి. ఆ ఆదర్శం లో నుంచి పరమోన్నతమైన మానవుడు రూపు దాల్చి రావాలి. అయితే ఒక వయస్సు దాటిన తర్వాత ఇవన్నీ చేయలేము అంటే చేయటానికి యువత మనతో కూడి ఉన్నది. ఇవాళ ఈ ఏర్పాట్లన్నీ చేసింది వృద్ధులు కాదు యువత చేసింది. వాళ్ళ శ్రమని వాళ్ళు ఆ సమయాన్ని కేటాయించి చేస్తున్న దాన్ని మనం గుర్తించాలి. వాళ్ళని గౌరవించాలి వాళ్ళతో మన energy వాళ్ళ energy మన experience రెండూ సమన్వయం చేయాలి. దాని వలన సమాజం బాగుపడుతుంది. అలాగే వంద రూపాయల సంపాదనలో ఒక్క రూపాయి చాగం కోసం పక్కన పెట్టండి. చాగం రూపాయితో సంబంధం లేకపోయినా చాగం అనేది రూపాయి ద్వారా జరగొచ్చు గనుక ఆ మా-ఆ point చెప్తున్నా. అందరూ ఆ రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. కాలాన్ని ఇవ్వండి. కంచి మహాస్వామి వారన్నారు "మీ కాలాన్ని నాకు దానం చేయండి. మీ ఒక్క క్షణాన్ని ఐదు నిమిషాలు నాతో ఉండండి. మీకు కావాల్సింది నేను ఇచ్చి పంపుతాను. నాకు మీ డబ్బుతో పనిలేదన్నారు." సత్యసాయి భగవాన్ లో ఒక మాట చెప్పారు. "ప్రాపంచికమైన మీ మూటలు మీ కష్టాలు మీ యాతనలు అన్నీ తెచ్చి ప్రశాంత గదులలో పడేయండి. ఇక్కడ నుంచి హాయిగా ఆనందాన్ని మూటగట్టుకొని వెళ్ళండి. ఆ చైతన్యంతో పరమ ప్రశాంతంగా జీవించండి." ఇవి మౌలికమైనటువంటి సత్యాలు. ఇవి బహుశా ఇవాళ ఈ సమాజానికి ism లేనిది ఏదన్నా ఉన్నదా cult లేనిది ఏదన్నా ఉన్నదా అంటే ism లేనిది Saiism లేదు. Sai లో ఉన్నది నిజమే గానీ ism లేదు. ఆ నిజము అంటే యదార్థం. యదార్థం అంటే సత్యం. ఆ ఆవిష్కరణ చేసుకుంటూ మనం నెమ్మది నెమ్మదిగా ఈ భౌతిక అవస్థ నుంచి దాటి సమాజాన్ని సర్వేశ్వర స్వరూపంగా భావన చేసి ఈ ప్రపంచమంతా అన్నీటినీ భావంతో కూడి ఉన్నది గనుక ప్రతి క్షణము ప్రతి చేయి ప్రతి కదలిక ప్రతి మెదలిక ప్రతి చేత ప్రతి చూపు అధ్యాత్మతో నిండి ఉండాలి. అటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. దానికై సత్యసాయి సేవా organization లో చందాలు లేవు.రసీదులు లేవు డబ్బు ప్రమేయాలు లేవు కానీ సంభ్రితం అయినటువంటి భగవత్ శక్తి దాని యందు ఇమిడి ఉన్నది కాబట్టి దానిని ఆధారం చేసుకొని చేసుకొని ఈ కొకట్ పల్లి ఒక విస్తృతమైనటువంటి సమాజం ఈ బాగా ఆ డబ్బున్న సమాజం అని కూడా నేను విన్నాను ఆ డబ్బుతో సాయి సంస్థకి సంబంధం లేనేలేదు వద్దనే వద్దు ఏం కావాలి అంటే నైతికమైనటువంటి సంపదనివ్వటానికి సాయి organization ready గా ఉంది. దాన్ని మీ డబ్బుతో చేస్తారో, మీ ప్రజ్ఞతో చేస్తారో, మీ బుద్ధితో చేస్తారో, మీ ఆలోచనలతో చేస్తారో, మీ కర్మ కౌశల్యంతో చేస్తారో కానీ చేయండి. చేయటానికి ఎలా అయినా ఏ ప్రయత్నం చేయండి. ఇది చెప్తూ ఇవాళ ఈ ప్రాంగణంలోకి మనకి ఎవ్వరికీ అనుభవంలోకి రాని ఒక మహా యోగి సుమారు నాలుగు వందల సంవత్సరాలు శశరీరంగా ఉన్నటువంటి విశ్వంభరుల వారు ఈ ప్రపంచానికి అంటే ఆయన అనేకం చూశారు. ఆ అనేకమైనటువంటి జటల స్వామి అంటారు. అది మీకిక్కడ ధర్మపురి అని ఉంది కొకట్ పల్లికి దగ్గరే. ధర్మపురి క్షేత్రంలో నేను వెళ్ళాను. నేను వెళితే నాతో వారు స్వామి వారికి ఒక పువ్వు వేయిద్దాం అని పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకొని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ అంతా నేనే చేద్దాం అన్నటువంటి ఒక భావన కలిగింది. నాకు పూజ చేయటం అలవాటు లేదు స్వామికి దండం పెట్టుకోవటం తప్ప. ఎందుకంటే ఏనకైన ప్రకాలేన యశః కశ్యాపి దేహి నాః సంతోషం జనయత్య ప్రజ్ఞనా తదేవ ఈశ్వర పూజనం అని నమ్మిన వాడిని గనుక సత్య సాయి భగవానుడికి అలమరికలు లేవు గనుక సత్యసాయి devotees ఎక్కడ మసీదులోకి వెళతారు, చర్చిలోకి వెళతారు, దేవాలయంలోకి వెళతారు, ఏ గురువుకైనా నమస్కరిస్తారు. అటువంటి సంస్కారాన్ని స్వామి ఇచ్చిన కారణంగా నేను జటల స్వామి సింహాచలంలో ఉన్నటువంటి జటల స్వామి రెండు వందల సంవత్సరాలు దానికి ఒక ప్రాకారం ఒక ఆలయం కట్టించినటువంటి మా శివరామకృష్ణ గారిని ఇక్కడ చూసి మా ప్రసాద్ గారిని చూసి పరమ ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే కొకట్ పల్లి అనగానే గుర్తొచ్చేది ఒకప్పుడు వాళ్ళిద్దరే ఏడాది క్రితం. ఇవాళ కొకట్ పల్లి అనగానే మన స్వామి సమితి అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్న ఈ సందర్భం నాకు పరమ ఆనందం కలిగిస్తున్నది. ఎప్పుడైనా వారితో మాట్లాడి మీరు మీ అందరూ స్త్రీలు, పురుషులు అందరూ సింహాచల జటల స్వామి వారిని దర్శనం చేయండి. అక్కడికి వెళ్ళి స్వామి భజన చేయండి. అక్కడ చక్కగా నారాయణ సేవ చేయండి. ఒక అద్భుతమైన ఆనందానుభూతిని మీరు పొందుతారు. అక్కడ కూడా స్వామి ఉన్నారు. నేను రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే ఆ ఆకర్షణ శక్తి అటువంటిది. యోగికమైనటువంటి ఒక భూమిక కావాలి మనకి. భోగ భూమికలో నుంచి యోగాన్ని అందుకోవటం కష్టం. యోగ భూమిక లో నుంచి యోగాన్ని అందుకోవటం చాలా తేలిక. మరి ఆ యోగ భూమిక ఎక్కడ ఉన్నది అంటే ఈ సమస్తమైనటువంటి దేవాలయాల ప్రాంగణంలో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రతి అణువులో దాగి ఉన్నటువంటి ఈ దైవీ శక్తి అంతా అక్కడ ఒక మహా యోగ శక్తిగా అక్కడ కూర్చొని ఉన్నది అని గట్టిగా నేను విశ్వసిస్తున్నాను గనుక సత్య సాయి సేవా సమితి అక్కడికి ఒకరోజున వెళ్ళాలి. మీరందరూ గనక అక్కడికి వెళితే, మీ అందరూ వెళ్తున్నారు గనుక ఆ రోజున నేను కూడా అక్కడికి వస్తా. లేకపోతే వాళ్ళు పిలిస్తే తప్ప నేను వెళ్ళలేను. కాబట్టి మనందరం ఎప్పుడో ఒకసారి వెళదాం చల్లబడ్డ తర్వాత వెళదాం. వెళ్ళి అక్కడ స్వామి యొక్క ఆ ప్రవచనం అక్కడ చేసే విధానం అవన్నీ నిశ్శబ్దంగా, నిరామయంగా, నికేతనంగా, నిరంజనంగా, హాయిగా, స్వచ్ఛంగా సత్య సాయి భగవానుడి దివ్య శ్రీ చరణాలకి ఆ రోజుని, ఆ క్షణాల్ని అంకితం చేస్తున్నాము. మళ్ళీ హాయిగా వెనక్కు వద్దాం మన పనిలో మనం ఉందాం. సమాజం అంతా ఒక పెద్ద విశాలమైనటువంటి వేదిక గనుక రాబోయేటువంటి రోజుల్లో తల్లులకి ఒక సూచన ఏమిటంటే మీ పిల్లల్ని కూడా తీసు-- నేను ఇక్కడికి గుళ్ళో దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాను. ఒక చిన్న మాతృమూర్తి చిన్న పిల్లని తీసుకు వచ్చి తాను కన్న చిన్న ముద్దు పిల్లను నాకు పరిచయం చేసింది. ఇదిగో మా అమ్మాయితో నేను వచ్చాను అని. ఆ బయటకు రాగానే నా హృదయం ఉప్పొంగిపోయింది. ఎందుకనంటే ఎనభై సంవత్సరాలు దాటిన వాడికి ప్రవచనం శ్రవణ శుకం కదా! బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ప్రయోజనం లేదు. అరవై ఏళ్ళ వాడికి ఒక ఉత్సాహం కలిగిస్తుంది కానీ చేయలేడు. నలభై ఏళ్ళ వాడికి ఎప్పటికైనా చేద్దాం అనిపిస్తుంది. సంసార బంధంతో చుట్టుకొని ఉంటాడు. ఒక యువకుడికి నేను చేసి తీరాలి అనుకుంటాడు. వాడు చేసి తీరుతాడు. బాల వికాస్ లో ఉన్నటువంటి పిల్ల-పిల్లవాడు ఎవరైనా సరే ఈ అధ్యాత్మ ఆవరణంలో గనక వచ్చినట్లయితే, ఇవాళ నేను చెప్తున్నాను సీతను చూడలేదు, అరుంధతిని చూడలేదు, అనసూయను చూడలేదు, అహల్యను చూడలేదు, గార్గిని, మైత్రేయిని మనం చూడలేదు. ఏ మహా చైతన్య శక్తిని స్త్రీ స్వరూపంగా మనం దర్శనం చేయలే. కానీ ఇవాళ సత్యసాయి సేవా సమితి అనబడేటువంటి ఈ పరమాద్భుతమైనటువంటి వేదిక నుంచి ఈ రాబోయేటువంటి తరం అటువంటి మహిళలు గార్గి, మైత్రేయి అంటే జనక మహారాజుని ప్రశ్నించినటువంటి పరమ జ్ఞానులు వాళ్ళు. పరమోత్కృష్టమైనటువంటి స్థితిలో గృహస్థాశ్రమంలో ఉన్నారు. అటువంటి స్థాయికి వెళ్ళేట్లుగా మీ పిల్లలు అందరినీ బాల వికాస్ లో చేర్చండి. అలాగే వయసు వచ్చిన పిల్లలు యువకులైనటువంటి వాళ్ళని వాళ్ళ సమయం ఒక గంట దీనికి కేటాయించే మార్పులేమి తట్టవు. ఇంకా నిజానికి మనం ముప్పై ఐదు పర్సెంట్ వాళ్ళం అయితే ఒక్క గంట ఇటువంటి కార్యక్రమంలో ఉంటే automatically అది డెభైయో తొంభైయో అవుతుంది.ఏదో మిగిలిన ఆ కాస్త కోరిక మా వాడు రాడు రాడు రాడు అంటూ మనమే ఇప్పుడే నువ్వు ఇప్పుడే అని లోపలికి తోస్తాం బయటికి రానివ్వం. సమాజంలోకి రానివ్వం. రాముడు పన్నెండేళ్ళ అరణ్యవాసం చేశాడు. కృష్ణ పరమాత్మ ఇరవై ఏళ్ళ మధురా నగరాణికి వెళ్ళాడు. సత్య సాయి భగవానుడు పద్నాలుగు ఏళ్ళ ఏట ఈ ప్రపంచం కోసం నేను వచ్చానని ప్రకటించారు. వివేకానంద స్వామి అలా వచ్చారు. కాబట్టి ఈ చైత్య మహాపురుషులంతా తమ బాల్యం వారి ఈ ప్రపంచానికి తమను తాము బత్తము అంకితము చేసుకున్నారు గనుక మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు కూడా అంతటి వారు కావాలనే భావనలో మన జీవితాలు ధన్యవంతం కావాలని అలాగే అనేకమైనటువంటి విషయాలు వ్యర్థమైనటువంటి ఆలోచనలు కానీ వ్యర్థ వాదాలకు కానీ మనసుకు తావియ్యకండి. కష్టం ఏదన్నా వస్తే కాసేపు భరిద్దాం. జ్వరం వస్తుంది అది ప్రాణం తీయదు. జ్వరం రావడం మంచిదే అది హెచ్చరిక. ఒంటిమీద ఏదన్నా రావడం మంచిదే అది ఒక హెచ్చరిక జాగ్రత్త పడటానికి. కాబట్టి కష్టం కూడా జీవితంలో అటువంటిదే గనుక భగవంతుడు ఉన్నాడని నమ్ముదాం. భగవంతుడే ఇదంతా నడిపిస్తున్నాడనే విశ్వాసంతో మన జీవితాలు ధన్యవంతం కావాలని నేను కోరుకుంటూ ఈ పరమ పవిత్రమైనటువంటి ఇక్కడికి రాగానే పుకటిపల్లి లో అపార్ట్మెంట్స్ భోగం ఒకవైపు అయితే ఈ దేవాలయ యోగాన్ని చూసినప్పుడు అసలు ప్రతి నెలా ఇక్కడే పెట్టుకుంటే ఎంత బాగుండు అనే ఆలోచన కలిగింది. ఎందుకంటే ప్రాంగణం కాలే స్థలే జలే మూడు మాటలున్నాయి. కాలం కలిసి రావాలి, స్థలం కలిసి రావాలి, తీర్థ ప్రజలు అటువంటి యోగ్యమైన వ్యక్తులు కూడా ఇక్కడికి రావాలి. అవన్నీ కూడా వరం ఉండేటువంటి ప్రదేశమే దేవాలయం కాబట్టి శ్రీ వేంకటేశ ఐదేళ్ళు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానానికి వచ్చినందుకు స్వామి చెప్పిన ఒక్క మాట మీ ముందుంచి ఆ ప్రసంగాన్ని విరమిస్తాను. ఇద్దరు దేవుళ్ళు ఉంటారు ప్రతి జీవుడికి. మన అందరికీ కూడా కులదైవం ఎవరు అంటే ఇల దైవం ఎవరు అంటే శ్రీ వేంకటేశ్వర స్వామి. తెలుగు జాతికి వేంకటేశ్వర స్వామే దైవం. మరి కుల దైవం ఇల దైవం మళ్ళీ గురువు కుల దైవం కాబట్టి కులం అంటే సమూహం అని అర్థం. కులం అంటే మనం చెప్పుకునే కులాలు కావ అంటే మనం ఏర్పరుచుకున్నవి వనమున పుట్టినవి. కులము అంటే సంఘము. సంఘము అంటే సమాఖ్య. సమాఖ్య అంటే సమంగా జీవించే ఒక పేరు. కాబట్టి అటువంటి ఆ కుల గురువులు గురు స్వరూపాలు దైవ స్వరూపాలు అట్లాగే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానంలో జరిగినటువంటి ఈ సాయంకాలపు ఈ సాయకాలపు ఈ సత్సంగం మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుగ్రహం వర్దానం చేయాలని అలాగే మనస్సులన్నీ కూడా రాగ అనురాగాలను దాటి ప్రేమ వైపు నడవాలని సర్వ దేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామి మన ఈ ఒక్క తరాన్ని మాత్రమే కాక మన రాబోయే ఇరవై యొక్క తరాలను చల్లగా కాచు గాక అని మంగళ శాసనం చేస్తూ స్వామికి మనసా, వచసా, శిరసా నమస్కరిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సాయి రామ్. [అందరూ కలిసి] సాయి రామ్ [జനം చప్పట్లు]
YouTube · audio
Speech "Ancient Dharma in Contemporary Times" Satsangam-5
Speech "Ancient Dharma in Contemporary Times" Satsangam-5
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 1:28:19