Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ సత్యసాయి భక్తులు ఆస్ట్రేలియా నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీ రమణ వైభవం అనే అపురూప అపూర్వ కార్యక్రమానికి అనంతకోటి గురు స్వరూపాల దివ్యానుగ్రహం మహామృత వృష్టి వలె కురియాలని వారందరినీ అభినందిస్తూ శ్రీ రమణ వైభవం అనగానే రమణుల వైభవం అంటే ఏమిటి అని మనకు ఒక చిన్న ఆలోచన కలుగుతుంది. వారి జీవితాన్ని జాగ్రత్తగా గమనించినా వారు చేసిన బోధలు సరిగ్గా అర్థం చేసుకున్నా మనకు తెలిసేది ఒకటే. ప్రాపంచికమైన వస్తువులు కానీ, సంపద గానీ, కీర్తి గానీ, ఒక్కటి కూడా శాశ్వతం కాదని నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక ఆత్మానుభూతే నవనవోన్మేషమని నిత్య నూతనమని సర్వానందదాయకమని ఆనందతారక స్థితికి జీవుడిని తీసుకు వెళుతుందని కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు యందు ఆత్మను దర్శించగలిగితే అది ఒక పూర్ణాద్వైత ప్రభావమని రమణులు బోధించినప్పుడు ఇది శంకర భగవత్పాదులు వివేక చూడామణి లో బోధించినటువంటి ఒక వైరాగ్యానికి ఇది పరాకాష్ట ఇది సోదాహరణం. ఇక్కడ ఇది అంటే రమణ మహర్షి. ఎందుకని అంటే నిజానికి మనమందరం అనుకుంటాం వైభోగాలన్నీ పోయాక ఒక అపజయంలో నుంచి పుట్టేది వైరాగ్యం అని. కానీ ఒక ఆత్మానుభూతి లో నుంచి ఒక మరణానుభవంలో నుంచి తన నుంచి ఏది విడిపోతున్నదో తాను తెలుసుకున్నటువంటి వేళ తాను ఆత్మనైనన్నటువంటి నిశ్చల నిశ్చిత మనీషాయత్త చిత్తమైనటువంటి భావనలో నిలకడ చెందినప్పుడు కలిగేటువంటి ఒక పరమార్ద్రమైనటువంటి ఒక రేఖ ఏదైతే ఉన్నదో దాని పేరు వైరాగ్యం. జ్ఞానికి వైరాగ్యమే వైభోగం. జ్ఞాని కాని వాడికి ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలతో పెనవేసుకుని ఉన్నటువంటి వాడికి వైభోగమే వైరాగ్యం వైపు దారి తీస్తుందని మనకి శృతి స్మృతులు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శంకర భగవత్పాదులు చెప్పినా, యోగీశ్వర కృష్ణుడు చెప్పినా, అంతకు ముందు వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు బోధించినా, దేహాత్మ భావన దాటిన తర్వాత ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అచ్చమైనటువంటి వెలుగుని దర్శనం చేయటమే మానవ జన్మకి పరమావధి అని గ్రహించినప్పుడు సర్వమూ ఆత్మే అన్న భావన నిలకడ చెందినప్పుడు ప్రపంచంలో ఆశా లేదు, నిరాశా లేదు, సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. అంటే మానవమానాలు కూడా లేవు, ద్వంద్వాలు లేవు. కనుక ఇది సర్వోన్నతుడైనటువంటి ఒక గురువు ప్రపంచానికి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇచ్చినట్లు గా మనం భావన చేస్తూ కరుణాపూర్ణ సుధాబ్ధే ఖబళిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మా అరుణాచల పరమాత్మా అరుణాచల పరమాత్మా అరుణోభవ నిత్యకంజ చిత్తకంజ సువికాసాయ ఇది మన చిత్తము అనేటువంటి ఒక మనోజ్జ్యం మనోపుష్పం వికాసమానం చెందటానికి గురువు అనుగ్రహం కావాలని రమణుల పరంగా ఇది గురు ప్రార్థన. మరి గురువు ఎట్లా ఉన్నాడు? నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసితో యజబాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతుపితరం వటమూలవాసం సంస్మరయంతమచలం తమనుస్మరామి మూర్తిభవించినటువంటి బ్రహ్మీ స్వరూపమే బ్రహ్మమే జ్ఞాన వృక్షం కింద కూర్చున్నటువంటి భగవాన్ శ్రీ రమణులు అని. శ్లోకం రాసినవారు మహా తపస్వి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. ఇద్దరినీ స్మరించుకుంటూ జీవితం ఎక్కడ ఎట్లా ప్రారంభమవుతుంది? అది ఎట్లా మలుపు తిరుగుతుంది? మలుపులో ఏయే అనుభవాలు జీవుడికి కలుగుతాయి? కలిగినప్పుడు జీవుడు వాటిని ఎంతవరకు ఒడిసి పట్టుకోగలుగుతాడు?పట్టుకున్న వాటిని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతాడు అన్నటువంటి అనేకమైన విషయాలు మనకు స్పష్టమవుతున్నటువంటి వేళ ఒక ఆనందం కలుగుతుంది. ఓహో! మానవ జన్మ అంటే ఇదా? అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితంబు. నారాయణున్ని అన్వేషించాలి. నారాయణుడు అంటే మహావిష్ణువు కాదు. జ్ఞానము అయనముగా కలిగినటువంటి వాడు. నారము అంటే నీరు అని అర్థం, జ్ఞానము అని అర్థం. జ్ఞానంలో స్థితోతుమూలం, ఎక్కడైతే మూలంలో కూర్చొని ఉన్నాడో మూలము మన హృదయ స్థలి అయినట్లయితే, దాన్ని గనక పట్టుకోగలిగినట్లయితే సర్వాత్మగా కనిపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క విన్యాసం అంతా కూడా అంగుష్టమాత్ర పురుషోత్తముడుగా మన హృదయంలో ప్రకాశమానంగా, శ్రీమయంగా, వాంగ్మయంగా, చరాచరమయంగా, జ్యోతిర్మయంగా, అఖండంగా, అవ్యయంగా, అద్వితంగా, నిత్యంగా, సత్యంగా వెలుగుతున్నటువంటి వెలుగు రేఖను పట్టుకోగలగటమే నిజానికి అధ్యాత్మ సాధన. ఎవరు రమణ మహర్షి? ఆయన అసలు పేరు వెంకట్రామన్. తిరుచ్చుళి, మధురైలో మధురై దగ్గర తిరుచ్చుళిలో జన్మ ఎత్తి సుమారు పదిహేను, పదహారు సంవత్సరాలు వచ్చే వరకు మనలాగానే అందరి వలె మామూలు బాలకుడుగా ఉన్నటువంటి ఆయన వైగై నదీ తీరంలో కసరత్తు చేసినటువంటి వెంకట్రామన్ ఒకరోజున తమ ఇంటికి ఒక బంధువు వచ్చినప్పుడు బంధువుని తమ తండ్రి బస్ స్టాండ్ దగ్గర వదిలి పెట్టడానికి వెళుతూ ఉన్నప్పుడు తండ్రికి బంధువుకి కొద్ది దూరం వెనకగా నడుస్తున్నటువంటి వెంకట్రామన్ రెండు మాటలు విన్నాడు. మొదటి మాట తండ్రి అడుగుతున్నాడు, "మీరు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం. మీరు మా దగ్గర ఉండి మాకు ఆనందాన్ని ఇచ్చారు. ఇంతకి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వేళ?" అని అడిగారు. ఆయన అరుణాచలం నుంచి అని సమాధానం ఇచ్చాడు బంధువు. అరుణాచల అనేటువంటి పదం ఒకటి వెంకట్రామన్ చెవి సోకింది. ఒక్కసారిగా భావ వివశత్వాన్ని పొందాడు. ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళాడు. అది ఏదో తనదని తాను అరుణాచలానికి చెందినవాడని తనకు మాత్రమే తెలిసిన కొన్ని కొన్ని మధురానుభూతులు లోపల సుడులు సుడులు తిరుగుతున్నటువంటి వేళ నెమ్మదిగా, ప్రశాంతంగా మనస్సును నిబ్బర పరచుకొని సం-సంస్థితం చేసుకొని సమన్వయం చేసుకొని సమయమనం పాటించి తనలో తాను తనను వెతుక్కునేటువంటి ఒక ప్రయత్నం బీజప్రాయంగా ప్రారంభం చేసుకున్నాడు. క్షణం నుంచి వెంకటరామన్లో తెలియనటువంటి ఒక అన్వేషణ, ఒక తత్వ అన్వేషణ, ఒక ప్రశ్న. ప్రశ్న ఆయనను వేధించటం మొదలు పెట్టింది. ప్రాపంచికమైన వస్తువుల యందు గాని తాను చదువుకునేటువంటి పాఠశాల యందు గాని లేదు తాను చదువుకున్నట్టు చేసుకుంటున్నటువంటి విద్యాభ్యాసాన్ని బట్టి గాని దేనియందు ఆసక్తి లేకుండా ఒక నిరాసక్తతతో ఉండటం ప్రారంభించాడు అన్యమనస్కంగా. స్కూల్ ఫీజు కట్టమని కొంత డబ్బు వాళ్ళు ఇస్తే, స్కూల్ ఫీజు కట్టడానికి ముందు రోజున ఆయన ఒక్కరూ ఏకాంతంగా మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆయనకు ఒక అనుభవం కలిగింది. అది స్వప్నానుభవం కాదు. ఆయన నిద్ర పోవటం లేదు. ఉరికే పడుకొని ఉన్నారు. కానీ అనుభవం ఏమిటంటే తనలో నుంచి ఏదో ఒక వస్తువు బయటకు వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్ళీ తనలోకే ప్రవేశించినట్లుగా ఒక అనుభూతి ఆయనకు కలిగింది. ప్రశ్న, నేనుగా స్థూలంగా కనిపిస్తున్న నాలో నుంచి ఇంతవరకు నాకు పరిచయం లేని ఏదో వస్తువు ఏమిటి? అది బయటకు వెళ్ళటం ఏమిటి? వెళ్ళిందేమిటో మళ్ళీ దీనిలోకి రావటం ఏమిటి? ఇంతకీ వచ్చింది ఏది? బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చింది ఏది? ఉంటున్నది ఏమిటి? పోబోతున్నది ఏమిటి? పోయేదేమిటి? అనేకమైన తాత్వికమైన ప్రశ్నలు. ప్రశ్నలకి సమాధానం ఒక్కటే దొరికింది. నాలో ఉన్నటువంటి ఒక చిద్ఘన రసమైనటువంటి ఆత్మే నేను. కనిపిస్తున్న దేహం, పాంచభౌతిక దేహం వెంకట్రామన్ అనే ఆయనది. కనుక నేను దేహాన్ని కాదు అనుకున్నారు. నేను దేహాన్ని మాత్రమే కాదు అని కూడా అనుకున్నారు. ఇక మరునాడు స్కూల్ ఫీజు కట్టడానికి ఇవ్వబడిన డబ్బులో నుంచి రెండు రూపాయలు తీసుకొని ఒక చిన్న చిటిి రాశారు. "నేను స్కూల్ ఫీజు కట్టటం లేదు. ఇవ్వబడిన డబ్బులో రెండు రూపాయలు తీసుకోబడింది. మీరు దీనికై వెతకకండి. నాకై అనలేదు, దీనికై వెతకకండి. మీ పనిలో మీరు ఉండండి. ఇంతే." అని రాశారు. రాశారు, బయలుదేరారు. ఆయనకు అరుణాచలం ఎక్కడుందో తెలీదు. కానీ వెళుతున్నారు. కాళ్ళు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినాయి. ఇంతలో ఒక ట్రైన్ వచ్చింది. కంపార్ట్మెంట్లోకి ఎక్కేశారు. కంపార్ట్మెంట్ అంతా చాలా అలజడిగా ఉంది. ప్రయాణీకుల మధ్య కూర్చున్నాడు. అందరూ ఏవేవో లౌకిక విషయాలు మాట్లాడుకుంటున్నారు. కానీ తనదైనటువంటి స్వాత్మానంద స్థితిలో తాను మౌనంగా అంతర్ముఖుడై తనలో తాను కూర్చొని తనలో తాను ఒక ఆంతరంగికమైన స్పర్శా రేఖతో ఉన్నటువంటి క్షణాల్లోఈయనని దూరంగా కూర్చొని ఒక మౌల్వీ ఒక ముస్లిం పెద్ద ఆయనను చూస్తూ ఉన్నాడు. ఏమిటి పదహారేళ్ళు నుండి పదిహేడు రాణి పిల్లవాడికి ఇంత వైరాగ్యమా? ఇంత ఆనందమా? చేతిలో ఏమీ లేదే, వస్తువులే లేవు. ఎట్లా ఉండగలుగుతున్నాడు? ఆహ్ తినుబండారాలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ఇంత ప్రశాంతంగా, ఇంత నిర్మలంగా, ఇంత హాయిగా ఉన్న బాలకుడు ఎవరో కానీ అసాధారణుడు అనుకున్నాడు. ఇంతలోకి ట్రైన్ విల్లుపురం వచ్చింది. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక్క వెంకటరామన్ మాత్రమే మిగిలారు. అప్పుడు మౌల్వీ ఆయన దగ్గరకు వెళ్ళి, "ఈ ట్రైను ఇకపై వెళ్ళదు. ఇది చివరి స్టేషన్. మీరు దిగవచ్చు" అన్నారు. యాంత్రికంగా దిగారు. దిగి ఎవరో నడిపించినట్లుగా సుమారుగా రెండున్నర రోజులు ఆయన నడుస్తూ వెళుతూనే ఉన్నారు. దారిలో వచ్చేటువంటి అనేకమైన పట్టణాలు, గ్రామాలు దాటుకుంటూ వెళుతున్నారు. ఆకలిదప్పులు లేవు. చివరికి ఆయన తనకు ఇంతకు ముందే తెలిసినట్లుగా అరుణాచల దేవాలయానికి చేరుకున్నారు. అది September ఒకటి అభిజిత్ లగ్నంలో అంటే మొట్ట మధ్యాహ్నం వేళ సుమారు పన్నెండు గంటల సమయానికి అరుణాచల దేవాలయంలో ప్రవేశించారు ఆయన. అరుణాచల దేవాలయం రాజగోపురం నుంచి గర్భాలయం వరకు వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. చాలా పెద్ద దేవా-దేవాలయం అది. సా-కానీ అతి విచిత్రంగా రోజున పూజారి గర్భాలయం తలుపులు వేయటం మర్చిపోయి వెళ్ళిపోయినాడు. వేశాను అనుకొని తాళం చెవులు లేవు తలుపులు మాత్రం దగ్గరగా వేసి ఉన్నాయి. ఎవరో పిలిచినట్లుగా వెంకటరామన్ అక్కడికి వెళ్ళి అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఆయన అన్న మాటలు చాలా గొప్ప మాటలు. "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం" అంతే. అది సమర్పణ, అది శరణాగతి, అది వినయం. మూడు చక్కగా సాగినటువంటి వెంకటరామన్ జీవితం మనం అంటాం twist with destiny అని ప్రారంభమైంది. విధి ఏం అలుపు తిప్పుతుందో, ఎవరిని ఎందుకు ఎటు నుంచి లాక్కెళుతుందో తెలియదు. అట్లాగే కాసేపు అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్న వెంకట్రామన్ బయటికి వచ్చారు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అక్కడున్నటువంటి క్షురకుడికి ఇచ్చి శిరోముండనం చేయించుకున్నారు. జుట్టు తీసేశారు. తాను ధరించినటువంటి పై చొక్కా పక్కకు పడేశారు. మిగిలిన నాలుగు నాణ్యాలు ఎంత మిగిలినయో అవి కొలనులో పుష్కరిణిలో పడేశారు. గోచి పెట్టుకున్నారు. స్నానం చేశారు. అక్కడి నుంచి అరుణాచల దేవాలయంలోనే ఉన్నటువంటి ఒక పాతాళ లింగంలోకి దిగి వెళ్లారు. పాతాళ లింగం వెనక కొన్ని సంవత్సరాలు వెళ్లి కూర్చున్నారు. అంతే తనదైనటువంటి దానిని ధ్యానం అందామా, యోగం అందామా, దేహాత్మ భావన నుంచి వదులుచుకున్నటువంటి మహా స్థితి అందామా, తపస్సు అందామా ఎవరు పేరు పెట్టినా ఆయన భౌతిక ప్రపంచంతో రకమైనటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మానసిక సంబంధాలను తెంచుకుని రుద్ర రూపుడై మూల కూర్చుని ఉన్నారు. కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. అక్కడ ఒకాయన ఎవరో ఒక బాలకుడు ఉన్నాడు అని కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు వెళ్ళినటువంటి సమయం దేవాలయంలో ఎవరూ లేని సమయం. ఒక్క అరుణాచలేశ్వరుడు తప్ప. కనుక ఇట్లా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరొక మహా వ్యక్తి, ఆయన పేరు శేషాద్రి స్వామి. బాలుడు, ఉన్మత్తుడు, పిశాచి, అవధూత వీళ్ళంతా కూడా ఒక అద్భుతమైన స్థాయికి చెందినవారు. వీళ్ళంతా జ్ఞానైక స్వరూపులు. జ్ఞానం అంటే పాటలు పాడటం, శ్లోకాలు చెప్పటం, పద్యం పాడటం కాదు. జ్ఞానము అంటే తనను ఎరిగిన ఎరుకలో నిలకడగా ఉండటమే జ్ఞానం. జ్ఞానాన్ని పొంది కూడా ప్రాపంచికమైనటువంటి అనేక విషయాలలో అనేక మందికి మహాదాశీర్వచనం అందించినటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే శేషాద్రి స్వామి. సమయం వచ్చింది. ఆయన అక్కడ నుంచున్నారు. అక్కడి నుంచి ఒక ఆమె వెళుతూ ఉంటే ఆమెను ఆపారు ఆయన. శేషాద్రి స్వామి ఎవరినన్నా పిలిచి మాట్లాడటం అన్నా, ఎవరినన్నా తాకటం అన్నా అది భగవంతుడు తాకినట్లుగా భావించేటువంటి రోజులవి. ఆమె ఒక్కసారి స్వామివారు పిలిచారని ఆగిపోయింది. "ఏమిటి?" అని అడిగింది ఆమె. "నువ్వు పాతాళ లింగంలోకి దిగు. అక్కడ ఒక మహాత్ముడు. ప్రపంచం, పుడమి అంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా నువ్వు బయటకు తీసుకురా" అన్నాడు. ఆవిడ మంచి యవ్వనంలో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి వ్యక్తి. ఆమె శేషాద్రి స్వామి యొక్క ఆదేశాన్ని అనుసరించి మెట్లు దిగి లోలోతులకు వెళ్ళి ఆయన్ని పట్టుకొని వస్తే శరీరమంతా శవం లాగా ఉన్నది. విగుసుకుపోయి ఉంది. గోళ్ళు పెరిగిపోయి ఉన్నాయి. తర్వాత జుట్టంతా కూడా ఎంత పెరిగిందో కొలమానం లేదు. అలాగే శరీరం అంతా పురుగులు తినేసి ఉంది. కానీ ఆయన తన బాహ్య స్మృతిలోకి రాలే. అప్పుడు మళ్ళీ క్షురకుడ్ని పిలిచి కొంత సంస్కారం చేసి ఆయనకు స్నానం చేయించి ఒక చిన్న బట్ట మొలచుట్టూ కట్టి ఆయన అన్నారు, "ఇక లోకం తరించబోతున్నది, అజ్ఞానం అంతరించబోతున్నది" అన్నారు. ఇది శేషాద్రి స్వామి చెప్పిన మాట. ఎప్పుడైతే కొంత తతంగం జరిగిందో వెంకట్రామన్ బాహ్య స్మృతిలోకి వచ్చారు. బాహ్య స్మృతిలోకి వచ్చి మళ్ళీ ఎవరో పిలిచినట్లుగా అరుణాచల సానువుల్లోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయినారు. ఆనాడు ఆయనను చూసినవారు ఆయన ఎవ్వరితో మాట్లాడలేదు. నాకు ఆకలి అవుతున్నదని లేదు.దాహం అవుతున్నది అనలేదు ఇది కావాలి అనలేదు కానీ ఎవరు ఆయన నువ్వెవరు అని మాత్రం ప్రశ్న వేయలేకపోయినారు. కారణం ఏమిటంటే శరీరం ఎట్లా ఉన్నా ఎంత సంస్కారానికి దూరమై ఉన్నా రెండు కళ్ళు మాత్రం అఖండమైనటువంటి తేజో మండలాలుగా ఒకటి సూర్యమండలమై రెండవది చంద్రమండలై పగలు రాత్రి వెన్నెలు కురిపించినట్లుగా కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి వెంకట్రామన్ నెమ్మదిగా ముందుకు వెళుతున్నప్పుడు ఆయన్ని మౌనస్వామి అని బాలస్వామి అని వాళ్ళు పిలుచుకునేవారు బ్రాహ్మణ స్వామి అని కూడా పిలిచేవారు. ఇక్కడ బ్రాహ్మణ అంటే కులానికి సంబంధించిన బ్రాహ్మణ కాదు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకర భగవత్పాదులు. ఎవరి చిత్తము అనవరతము నిత్యము బ్రహ్మము నందు లయించి ఉంటుందో వారు బ్రాహ్మణులై ఉన్నారు. వారు పొందేటువంటిది ఆనందం వారు పొందేదే ఆనందం వారు పొందినది మాత్రమే ఆనందం కాబట్టి అది మాత్రమే అయినటువంటి ఆనందాన్ని తాను అనుభవిస్తూ వెళ్లారు చెట్టు కిందున్నారు పుట్ట కిందున్నారు ఇంకో చోట ఉన్నారు ఎక్కడున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో అప్పుడు హంఫ్రీస్ అనేటటువంటి ఒకాయన వేలూరు లో ఆయన్ని ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఎవరో ఒక బొమ్మ స్వప్నం అంటే ఒక దృశ్యం ఏర్పడింది ఆయన చిత్రకారుడు గనుక తెల్ల కాగితం మీద బొమ్మ గీసుకున్నాడు. బొమ్మ గీసుకుంటే ఎవరో వచ్చి అరుణాచలం మీదున్న మౌనస్వామి ని చూశారా అని అడిగారు నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఎట్లా ఉంటారు ఆయన అంటే మీరు వేసిన బొమ్మ లాగా ఉంటారు అన్నారు. ఆయన రూఢి పరుచుకోవటానికి అరుణాచలం పైకి వెళితే బ్రహ్మణ స్వామి కనిపించారు కానీ హంఫ్రీస్ మౌన స్వామితో ఒక్క సంభాషణ చేయలేదు. ఆయన వెనక్కి వచ్చేశారు. ఇదంతా కూడా కాస్మిక్ డిజైన్ అంటాం మనం నమ్మాలి దాన్ని కాస్మిక్ ప్లాన్ అంటాం నమ్మాలి దాన్ని మన జీవితాలన్నీ కాస్మిక్ ఎక్సిక్యూషన్ మన చేతిలో ఏమీ లేదు. అదే సమయంలో పద్నాలుగు ఏళ్ళ చిర తపస్సు చేసి సంస్కృత వాఙ్మయాన్ని మధనం చేసి మంత్రా శాస్త్రాన్ని అవగతం చేసుకొని మంత్రాలలో ఉన్న బీజాక్షరాల వెనక ఉన్న అధిష్టాన పరదైవతాలను దర్శించి సర్వోత్తమమైనటువంటి పాండితీ మండితుడు అయినటువంటి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని ఒక గురువు కోసమై అన్వేషిస్తున్నటువంటి వేళ ఎవరో చెప్పగా హంఫ్రీస్ దగ్గరకు వెళ్లారు. అప్పుడు ఆయన అన్నారు మీకు సమాధానం కావాలి అంటే అరుణాచలం మీదికి వెళ్ళండి అక్కడ ఒక మౌనస్వామి ఉన్నారు ఆయన మీకు ఏమన్నా దారి చూపిస్తారేమో వెళ్ళండి అన్నారు. ఆయన మాట్లాడతారా అన్నాడు నేను మాట్లాడలేదు అన్నారు ఈయన. అంతా నిజాయితీయే. ఈయన వెళ్లారు భగవాన్ ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. కావ్యకంఠ గణపతి ముని సమీపించారు దగ్గరికి ఇప్పుడు మనం అనుకున్నదే అయ్యా పద్నాలుగు ఏళ్ళు తపస్సు చేశాను మంత్ర శాస్త్రాధ్యయనంలో పండితుడినైనాను సంస్కృతం నా వెనక పరిగెత్తుకు వస్తుంది అనేక ఛందస్సులన్నీ నాకు కరతలామలకం అయిపోయినాయి. దీక్షా తపస్సు చేశాను కానీ నాకు చిత్తశాంతి లేదు కారణం ఏమిటి అని అడిగారు. కొన్ని ఏళ్లుగా మాట్లాడని కారణంగా మౌనస్వామి లేదా బ్రాహ్మణ స్వామి లేదా వెంకట్రామన్ కంఠనాళాలు సవరించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని లోపల నుంచి బయటకు తీసుకువస్తూ మాటకి మాటకి కాస్త విరామం ఉండగా అన్ని మాటలు కూర్చుకొని నెమ్మదిగా ఒక్క మాట చెప్పారు. నేను అన్న ప్రధమ తలుపు ఎక్కడ నుంచి ప్రారంభం అవుతున్నదో దానిని గమనించి దాని వెంట వెళుతూ వెళుతూ వెళుతూ మళ్ళీ నేను దేనిలో లయిస్తున్నదో గమనించగలిగితే దాని పేరు తపస్సు. సమాధానం దొరికింది. తపస్సు చేసినా మంత్రశాస్త్రం చదివినా మనస్సు వరకే తప్ప మనసును దాటిన స్థితులు కావు. కనుక ఆయనకి విజ్ఞానమూర్తి గనుక మహా తపస్వి గనుక భగవాన్ అంటే ఇంకా వెంకట్రామన్ ఇచ్చినటువంటి సమాధానం పూర్తిగా అర్థమైపోయింది. నేను అసలుని వదిలిపెట్టి అన్ని పట్టుకుంటూ చాలా చేస్తూ వెళ్ళాను అని అంటూ అయ్యా తపస్సు నేను చేశాను అని అన్నాను కదా నేను తపస్సు చేశాను అది ఫలించింది అన్నదానికి గుర్తు ఏమిటి అని అడిగాడు. ఇది రెండవ ప్రశ్న. వెంకట్రామన్ పరమ దయగా పరమ ఆర్ద్రంగా ఒక్కమాట చెప్పారు. తపస్సు చేస్తున్నప్పుడు చేయటానికి ముందు నీవు ప్రపంచంలో ఉంటావు తపస్సు పూర్తయింది అంటే ప్రపంచం అంతా నీలో చేరుతుంది అని మౌనం వహించారు. సమయంలో దక్షిణాపథం నుంచి అంటే దక్షిణ దిక్కు నుంచి రమణ మహర్షి యొక్క ఆజ్ఞాచక్రం మీదకి అంటే మనం విభూతి ధారణ కుంకుమ ధారణ తిలక ధారణ చేసేటువంటి రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం మీదకి ఆరు సార్లు కాంతి పుంజాలు వచ్చి తాకినాయి. ఈయన అప్పటికే మహా పండితుడు కవి దేనినైనా డీకోడ్ చేయగలడు దేనినైనా ఇంటర్ప్రెట్ చేయగలడు దేనినైనా పర్సీవ్ చేసిన దాన్ని కొంత చెప్పగలడు గనుక మీరు స్కందులా అని అడిగారు. మౌనం వహించిన వెంకట్రామన్ ఇది ఏమిటో తెలుసుకునే కంటే మీరేమిటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదే నిజమైన సాధన అన్నారు.ఆశ్చర్యపోయినాడు ఆనందపడ్డాడు అబ్బురపడ్డాడు చకితుడైనాడు కావ్యకంఠులు "శాంతిర్నితాంతమహితా పరమాస్య శక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం రమణో మహర్షిహి" అన్నాడు అద్భుతం గురువు అంటే ఎవరయ్యా మహర్షి అంటే ఎవరయ్యా అంటే "శాంతిర్నితాంతమహితా పరమాస్య శక్తిహి" ముఖమండలంలో నుంచి ఒక శాంతి రసము ప్రవాహవేగంతో వస్తూ కదలి వస్తూ ఉన్నప్పుడు వైరాగ్యం అద్భుతమైన వైరాగ్యంలో ఒక వైభోగం వెలిగిపోతున్నప్పుడు మధురమైనటువంటి ప్రవర్తనతో సౌశీల్యంతో సగుణంతో స్వభావంతో నిశ్చల నిర్మలమైనటువంటి స్థితిలో అజ్ఞానం అనేటువంటి ఒక భూమికని ఖండించగలిగిన జ్ఞాన ఖడ్గాన్ని ఎవరైతే ధరించి ఉన్నారో ఇవన్నీ ధరించి ఉన్నప్పటికీ "కరుణాతు సాంద్ర" కరుణతో కూడి ఘనీభవించిన కరుణా రూపమై ఉన్నట్లయితే ఆయన మహర్షి అవుతాడు అటువంటి మహర్షి ఎవడన్నా ఉన్నారా అంటే "ఋణాం నిదర్శనమయం రమణో మహర్షిహి" అన్నాడాయన. క్షణమే వెంకట్రామణ్ అని ఆయన పేరు పెట్టారన్నమాట నామకరణం ఏం జరిగింది అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు ఆయన. ఇక వెంకట్రామణ్ అని పిలిచే వాడు లేడు అప్పటికే నామ రూప దేహ భావ తత్వాలకి అతీతమైనటువంటి మహా చైతన్య స్ఫూర్తితో నిలకడ చెందినటువంటి వెంకట్రామణ్ లోకానికి భగవాన్ గా రమణ మహర్షి గా పరిచయమైనారు. పేరు ఎందుకు పెట్టారు? భగవాన్ అంటే అంటే వెలుగు అంటే జ్ఞానం. రెండూ కలిగిన వాడు మాత్రమే భగవాన్ అవుతాడు. అందరూ భగవాన్లు కారు. జ్ఞానము రూపం కావాలి జ్ఞానము వెలుగుమయం కావాలి వెలుగులో సమస్త ప్రపంచము నడవాలి కనుక భగవాన్ అనేటువంటి పదం కొందరు మహాత్ములకు మాత్రమే అది వర్తిస్తుంది అది భగవాన్. శ్రీ అంటే శ్రీ అంటే సంపద సంపద అంటే జ్ఞాన సంపద శ్రీ అంటే సరస్వతి వాంగ్మయం శ్రీ అంటే హాలాహలం అందుకనే శివుడికి శ్రీకాంతుడు అని పేరు శ్రీ అంటే సాలెపురుగు శ్రీ కాళహస్తి లో శ్రీ అంటే సాలెపురుగు మన జీవితము మన ఆలోచనలు శ్రీ వలె అల్లుకుంటూ ఉంటాయి దానిలోనే మనం పడిపోతాం పట్టుబడతాం చిక్కుకుంటాం విడిపడలేం కాబట్టి మనందరం కూడా శ్రీమంతులమే డబ్బుంది జ్ఞానముంది అన్నీ ఉన్నాయి హాలాహలం జీవితానుభవాలు ఉన్నాయి కాబట్టి శ్రీ రమణ అంటే రమణుడు అంటే రమింపజేసే వాడు అని దేనిని రమింపజేసే వాడు అంటే దేహం ద్వారా రమింపజేస్తే రమణ మహర్షి అందగాడు అని పిలవాలి. దేహమే లేని దేహాత్మ భావనే లేనటువంటి రమణులు దేనిని పరవశం చేయిస్తారు అంటే "రమయతీతి రామః" అని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని గురించి మనం ఎట్లా అనుకుంటామో ఇక్కడ రమణ శబ్దం కూడా రమణులు మనల్ని రమింపజేస్తారు ఎవరిని మనలో ఉన్నటువంటి ఆత్మని శుద్ధాత్మగా మార్చి తీర్చిదిద్ది దానితో ఆయన కూడి ఉంటారు అని చెప్తూ రమణంలోనే రమణ శబ్దంలో ఏమున్నదయ్యా అంటే మరణము ఉన్నది రణము ఉన్నది చారణము ఉన్నది విచారణ ఉన్నది కడగా తారణము ఉన్నది తారణం అంటే ముక్తి ఉన్నది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క వ్యక్తి అంశాలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. జీవితం మహా పోరాటం మహాయుద్ధం కనుక దాంట్లో రణం ఉంది చారణం నడుస్తూనే ఉండాలి కూలిపోయే దాకా పనిచేస్తూనే ఉండాలి "కర్మానుబంధి మనుష్య లోకే" మానవ జన్మ ఎత్తిన నేను విశ్రాంతిగా ఉంటాననటానికి వీల్లేదు కర్మానుబంధంతో ఉండాలి అలాగే విచారణ చేస్తూ ఉండాలి నేనెవరు ఏమిటి ప్రపంచం ఇదంతా ఉండేదేనా వస్తువులన్నీ నావేనా నేను తెచ్చుకున్నానా వెళ్లేనాడు ఇవన్నీ నా వెంబడి వస్తాయా ఇది విచారణ ఆత్మ విచారణ. విచారణలో నుంచి చివరికి మరణము అంటే మరణం అంటే దుఃఖం కాదు అదొక మంగళాశాసనం మరణము అంటే మార్పు మార్పు అంటే "వాసాంసి జీర్ణాని యథా విహాయ" దేహాన్ని వదిలిపెడతాం మళ్ళీ ఇంకో దేహాన్ని ధరిస్తాం ధరిస్తున్న వాడెవడు భరిస్తున్న వాడెవడు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ కాబట్టి పైకి మనం కనిపిస్తున్నటువంటి అందం గాని సౌందర్యం గాని శక్తి గాని ప్రజ్ఞ గాని ప్రతిభ గాని ఉత్పత్తి గాని ఏదీ మనది కాదు ఇదంతా దేహానికి మనస్సు వరకు పరిమితమైనటువంటిది మాత్రమే. దీనిని దాటి ఏమీ లేని కానీ అన్నీ తానై తాను కదలకుండా కానీ అన్నింటినీ కదిలించే అనంతమైనటువంటి సర్వాత్మకమైనటువంటి సర్వవ్యాక-వ్యాపకమైనటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉన్నదో అది మనంగా భావించగలిగేది స్థితిని ఇవ్వగలిగేది విచారణ విచారణ పూర్తి కావటానికి కలిగే పేరే తారణము అదే మోక్షము మోక్షము అంటే మనం మరణించగానే స్వర్గానికి వెళ్ళటం కాదు మోక్షము అనగానే మనమేదో అన్నీ ఇక్కడ ఇక్కడి నుంచి అనేకమైన కీర్తులు తీసుకుని ప్రపంచం గాని ఇంకో సెలెస్టియల్ వరల్డ్ లో ఉండబోతున్నామా అంటే కాదు ఎక్కడ ఉండబోతున్నావు అంటే ఇక్కడే ఉండబోతున్నావు ఇక్కడి నుంచి ఘటాకాశం బద్దలయింది శరీరం వదిలిపెట్టాం చిదాకాశం వైపు వెళ్ళాం ధారాకాశం వైపు వెళ్ళాం కానీ ఎక్కడ ఉన్నావో తెలుసునా ఆకాశం నీ యందే హృదయమై ఉన్నది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళటం లేదు ఇక్కడే ఉంటున్నాం పోయి ఇవన్నీ కూడా అనుబంధాల వల్ల వాత్సల్యాల వల్ల మనకుండేటువంటి ప్రాపంచిక సంబంధ బాంధవ్యాల వలన అపేక్షల వలన.వాత్సల్యాల వలన మనం చింతిస్తూ ఉంటాం. మరణం-- సూర్యోదయం ఎంత గొప్పదో సూర్యాస్తమయం కూడా గొప్పదే. మనం రెండింటికీ సంధ్యావందనం చేస్తాం, నమస్కారం చేస్తాం. కాబట్టి పుట్టిననాడు ఎంత ఆనందంగా ఉన్నామో దేహం వదిలిపెట్టిన నాడు కూడా అదే ఆనంద తారక స్థితిలో మనమందరం ఉండాలి అని చెప్పే వైభోగమే రమణ వైభవం. ఇది జరిగింది. ఇక ఇది అసలు ఒక వెంకట్రామన్ తిరుచ్చుళి నుంచి వచ్చి అరుణాచలానికి వచ్చారు. ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఆయన అనుకున్నారు. తపస్సు చేశారన్నారు, చెట్ల కింద కూర్చున్నారు, పడుకున్నారు, కూర్చున్నారు ఎవరూ పట్టించుకోలేదు. ఆయన ఎవరినీ పట్టించుకోలేదు. కాలం గడిచిపోతున్నది. అరుణాచలాన్ని ఒక్కసారి చూశారు. చూడగానే ఆయనకు ఒక భావోద్వేగం, ఒక తాదాత్మ్యత, ఒక రసాత్మకమైన కమ-- కవనీయమైనటువంటి ఒక కవితా ప్రవాహం పెల్లుబికి "అరుణాచలమనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపుం అరుణాచలా" అని అరుణాచల స్తుతి పంచకం రాశారు. అక్షరమణమాల రాశారు. ఎన్నో రాశారు. రాశారంటే, అనుకున్నారు. మొట్టమొదటగా వారు అన్నది ఏమిటంటే అరుణాచలం అనేటువంటి నీ పేరు స్మరిస్తూ నేను వచ్చినట్లయితే ముందు నువ్వు చేయవలసిన పని నాకు మోక్షమివ్వు, డబ్బు ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ప్రాపంచికమైన సుఖాలివ్వు. ఇవి ఏవీ కావు. "అరుణాచల మనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచల" ఎరేజ్ మై ఈగో అని అడుగుతున్నారు ఆయన. అహం ఇంకా నేను వెంకట్రామన్, నేను రమణ మహర్షి, ఇంకా నేను నేను నేను అంటున్నానే, నేనుని వదలచగలిగిన శక్తి అరుణాచలం లోనే ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన. ఋణాన చలా అరుణాచల. అరుణాచలం వెళితే ఏమిటి లాభము అంటే ప్రాపంచికమైనటువంటి వస్తువులతో మన కొన్ని జన్మ జన్మలుగా ఏర్పడిన బాంధవ్యాలన్నీ, బంధలన్నీ బళ్ళున త్రిల్లి తెగిపోయి మనం ముక్తులమైపోతాం. మనం ముక్తులమైనాము అని తెలుసుకోవాలి అంటే అరుణాచలానికి వెళ్ళాలి. రెండవది అచలము. చలచ్చలితమైనటువంటి మనస్సు కాసేపు ఆనందంగా ఉంటుంది, కాసేపు మహాదుఃఖంలో కూరుకుపోతుంది. ఎందుకో తెలియదు. ఆరాటము, పోరాటము, కామాటము మూడు మానవుణ్ణి వ్యధకు గురి చేస్తూ ఉంటాయి. అరుణాచలానికి వెళ్ళినప్పుడు లేదా స్మరించినప్పుడు మనస్సు స్థిమితపడుతుంది. ఏది కావాలో, ఏది అక్కరలేదో, ఏది పొందాలో, దేనిని వదిలిపెట్టాలో, అసలు ఇది ఏదీ కాదో, ఇవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి ఒక మహాద్భుత స్థితి. దాని పేరు సంస్థిత స్థితి అంటాం. సమస్థితే సంస్థితం. నేను నేనుగా, నేను నేనైన నేనుగా ఉండటమే సమస్తమైనటువంటి ఒక అద్భుతమైన స్థితి. అక్కడ ఎప్పుడైతే-- అక్కడికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అది మహదానందమైనటువంటి, బ్రహ్మానందమైనటువంటి ఒక స్థితి. ఇక్కడ సత్యసాయి భగవానుడు ఎవరికీ తెలియని కానీ స్వామి బెంగుళూరులో డిక్లేర్ చేసినటువంటి ఒక విషయం ఏమిటంటే, పదహారు సంవత్సరాలు అంటే అవతార ప్రకటన అయిన రెండేళ్ళకి భగవాన్ అరుణాచలానికి వెళ్లారు. స్వామి అరుణాచలానికి వెళ్లారు. అప్పటికి అందరి భోజనాలు అయిపోయినాయి. భగవాను, భగవాను కాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు లోకానికి తెలియదు. కానీ సత్యసాయి భగవానుడు తన అవతార కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ భజన సాంప్రదాయంలో రాసిన మొట్టమొదటి కీర్తన, భజన "మానస భజరే గురు చరణం". దానిలో స్వామి రాస్తారు "అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం" అంటారు. ఎందుకని అరుణాచలాన్నే ప్రస్తుతించారు అనంటే దానికి తర్వాత కాస్త వివరంగానే చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు చెప్పిందే. ఋణాన చలా అరుణాచల. బహు బంధాలు తెంచుకోవాలి అంటే అందరినీ వదిలిపెట్టమని కాదు, అందరితో ఉంటూనే ఏదీ నాది కాదన్నటువంటి వైరాగ్య వైభవంలో మన జీవితాలు వెలార్చుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. జీవితాన్ని ఎట్లా మనం సాధించాలి, సాగించాలి, ముగించాలి, ఇటువంటి పరమోదారమైన, ఉదాత్తమైనటువంటి భావనలన్నీ ఉంటే ఇందాక చెప్పినట్లుగా నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు స్వామి ఒక మాటన్నారు. "జీవితంలో నువ్వు ఎప్పటి-- ఎప్పుడైనా అరుణాచలానికి ఒక్కసారి వెళ్ళు. వెళ్ళాలి. ఎందుకు అంటే పరమ చరమమైనటువంటి మహాస్థితిని నీవు పొందవలసి ఉంటే నువ్వు అరుణాచలానికి వెళితే అది లభిస్తుంది. నువ్వు వెళ్ళాలి. అని అంటూ వెళతావు" అన్నారు. అవకాశమే లేదు అని నేను అనుకున్నా. కానీ ఎనిమిది సంవత్సరాలు దాటకుండానే నేను అరుణాచలానికి వెళ్ళటం కథంతా వేరు. మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఐదవ తారీఖున అరుణాచలం నుంచి నేను ప్రశాంత నిలయానికి వచ్చినప్పుడు స్వామి అందరితో పాటు ఏడ, ఎనిమిది మందిని పిలిచారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, అందరినీ సాగనంపిన తర్వాత నన్ను కాసేపు ఉండమని చివరగా బయటకు వెళుతున్నప్పుడు స్వామి నేను వేసుకున్నటువంటి షర్టు చేత్తో నెమ్మదిగా లాగి, జనరల్ గా అవన్నీ చెయ్యరు స్వామి, లాగి సూటిగా కళ్ళలోకి చూస్తూ అన్నారొక మాట. "రమణులు అంటే ఎవరిని అనుకున్నావు? సాక్షాత్తు ఈశ్వరుడు, మరచకు బంగారం" అన్నారు. అన్వేషణ ముగిసింది. ఇది నేను నా మొట్టమొదటి పుస్తకం సాయి రమణీయంలో రాసినప్పుడు అన్ని పేజీలలోది అదొక్కటి మాత్రమే స్వామి చక్కగా చూసి "సత్యం లోకానికి చెప్పాలి" అన్నారు. కనుక, ఇవాళ మనమంతా రమణ మహర్షి గురించి తెలుసుకోవాలని గాని, వారి గురించి నేను చెప్పే యోగం కలగటానికి గాని, నేను అరుణాచలానికి వెళ్ళటానికి గాని ఎవరి కారణము అంటే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారు. అయితే ఒక్క విషయం. భగవాన్ రమణ మహర్షి దేహంలో ఉండగా నేను చూడలేదు. వారు దేహం వదిలిపెట్టిన నాలుగు నెలలకి నేను జన్మ ఎత్తా. కాబట్టి ఇదంతా అపరోక్షానుభూతిగా భావన చేస్తూ స్వామి అనుగ్రహం ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎక్కించారు. కనుక, ఇదిగో ఈవేళ మనందరం స్వామి గురించి, భగవాన్ గురించి సమన్వయం చేసుకుంటున్నారు గనుక పుస్తకానికి పెట్టిన పేరు కూడా శ్రీ సాయి రమణీయం.సాయి రమణీయం స్వామి రమణీయమూర్తి రమణీయంగా కనిపించేటువంటి రమణులు సాయి. ఈశ్వర స్వరూపం. రెండింటిని సమన్వయం చేస్తూ మళ్ళీ నవరాత్రుల్లో మాట్లాడుకుంటున్నాం. సరే కథా కథనంలో అనేక విషయాలు మనం మాట్లాడుకోవాలి అందులో నాలుగైదు ప్రస్తావన చేయాలి ఇవాళ. వైభవం ఏమిటి అని? అసలు ఏమీ లేకపోవటమే అన్నీ ఉన్నట్లు లెక్క. ఏమీ లేనితనమే అన్నీ ఉన్నటువంటి తనం. భగవాన్ రమణ మహర్షి జీవితంలో కొన్ని సంఘటనలు, వారి బోధనలు మనం గనక అర్థం చేసుకున్నట్లయితే వారు రెండు మాటలు, నిజానికి మూడు పదాలు జీవిత కాలంలో వాడలేదు. వస్తువుని గానీ, ఒక పక్షిని గానీ, ఒక కుక్కని గానీ, ఒక నెమలిని గానీ, ఒక చెట్టుని గానీ, దేనిని కూడా అది, వాడు అన్న రెండు పదాలు ఆయన వాడలేదు. కారణం ఏమిటంటే తనలో ఆత్మ అయితే అఖండంగా వెలుగుతున్నదో అదే ఆత్మని ఆయన దర్శనం చేశారు గనుక సర్వాత్మ దర్శనం చేసినందువలన వాటికి గౌరవ వాచకంగా వారు, వారు అనేవారు అది, వాడు రెండు మాటలు లేవు. మూడవది, దేవుడు అన్నమాట ఆయన వాడలేదు. దైవం అన్నమాట వాడలేదు. కర్త అని మాత్రమే వాడారు. ఎందుకని అంటే ఉపదేశ సారాన్ని ప్రారంభిస్తూ కూడా "కర్తృ రాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం" అన్నారు. మరి దైవం అంటే ఉన్నదా అంటే దైవం కూడా మన వలె ఉంటాడు. కర్త మన వలె ఉండడు. మనల్ని నడిపించే మహా చోదక శక్తిగా, ప్రచోదక శక్తిగా, ప్రబోధ శక్తిగా, వినూత్న శక్తిగా, అఖండ చైతన్యంగా ఉంటాడు గనుక కర్త అనే పదాన్ని ఆయన అంటే చేయించేవాడు అని. దేవా అంటే ఆడించేవాడు అని అర్థం. ఆడించేవాడు అంటే ఆడుకునేవాడు కూడా ఉంటాడు. దేవా కంటే కూడా ఉదాత్తమైన పదం కర్త గనుక ఉపదేశ సారాన్ని దాంతో ప్రారంభించారు. తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు చేశారు, అనేకమైనవి చెప్పారు. ఇక వైభవంలో దేవుడు అనే మాటకి ఆయన ఇచ్చినటువంటి గాడ్ అనేదానికి "It is a force and feeling within" అది ఒక అంతర్గతమైనటువంటి శక్తి, అది ఒక అనంతమైనటువంటి భావన అంతే. దైవము అంటే ఒక భావన. నువ్వు ఎట్లా భావిస్తే అట్లా. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అంతే. ఒకడికి రాముడు, ఒకడికి కృష్ణుడు, ఇంకోడికి అది, ఇంకోడికి మరొకటి. ఇట్లా భిన్న భిన్న రూప నామ తత్వాలతో కూడి ఉంటుంది గనుక రూప నామ భావ తత్వాతీతమైనది ఏదైతే ఉన్నదో అది మాత్రమే చిత్ శక్తిగా మనం చెప్పుకుంటాం గనుక దానిని కర్తగా వారు భావన చేసి అనేక పదాలు వాడుతూ వచ్చారు. ఇక, వారు ప్రాపంచికంగా ఉన్నప్పటికీ మనం అనుకుంటాం నాకు స్వామి కలలో కనిపించారు, నాతో మాట్లాడేశారు, రేపు పొద్దున పని చేయమని చెప్పేశారు అంటారు. మనము నమ్ముతాము. ముప్పై మూడు సంవత్సరాలు అడగమ్మ అని భగవాన్ కోసం కొండ మీదికి సమయపాలన చేస్తూ వంట చేసి ఆయన కోసం తీసుకొని వెళ్ళేది. ముప్పై మూడేళ్ళ తర్వాత ఒకరోజున పరుగు పరుగున పైకి వచ్చి క్యారియర్ అక్కడ పెట్టి "భగవాన్ మీరు నాకు రాత్రి కలలో కనిపించారు" మామూలు గురువు అయితే ఏమంటాడు? "అవును కనిపించాను, నువ్వు చాలా సేవ చేశావ్, నువ్వు ఉత్తమురాలివి, నువ్వు అసలు నిజ భక్తురాలివి నువ్వే" అని ఏవేవో చెప్తాడు. ఆయన ఏమన్నారు ప్రశాంతంగా? "దృశ్యం దాటు యదృశ్యం తన్నశ్యం" ఏది దృశ్యంగా కనిపిస్తున్నదో అది సత్యం కాదు. దాని వెనక ఏదున్నదో దాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు చేయి. అంటే దృశ్యం దాటు అన్నదే సమాధానం. రెండు పదాలే. అడగమ్మ మళ్ళీ ఆమె కథ మొదటికి వచ్చింది. అంటే నిన్న రాత్రి వచ్చినటువంటి కల దీన్ని ఎవరు డీకోడ్ చేశారంటే నా మనస్సే డీకోడ్ చేసింది. దాంట్లో ఏమి స్వామి ఏమి చేయలే, భగవాన్ ఏమి చేయలే, ఆమె కలలోకి ఆయన వెళ్ళలే. ఇది సత్యం. అందుకే ఆయన అంటారు [గొంతు సవరించిన శబ్దం] ప్రపంచంలో ఒక జ్ఞాన సంబంధమైనటువంటి విషయానికి ముసుగును తొలగించండి. ముసుగు వేశారా? రూపం మారిపోతుంది. మీరు జీవిత కాలంలో సత్యాన్ని గ్రహించలేదు. అన్వీల్ చేయండి. ముసుగు తొలగించండి. సత్యం యథార్థంగా, పారమార్థికంగా, పరమ పూర్ణంగా, దయాపూర్ణంగా, కరుణా స్ఫురితంగా మీకు కనిపిస్తుంది, అనిపిస్తుంది అదే ఆత్మానుభూతి. సరే. అలాగే జంతువుల యెడ, పాముల యెడ, కోతుల యెడ, కుక్కల యెడ, ఉడతల యెడ వారికున్నటువంటి దయ, కథంతా చదివితే మనకు తెలుస్తుంది. అంటే సర్వుల యందు ఆయన ఆత్మను దర్శనం చేశారు. ఆత్మ దర్శనానికి ఉదాహరణగా, ఇవన్నీ బానే ఉన్నాయండి, ఇటువంటి మహాత్ములు దేశంలో చాలామంది వచ్చారు కదా. రమణులు ప్రపంచానికి రకంగా relevant అనేది ప్రశ్న ఇవాళ మనమంతా చదువుకున్న వాళ్ళం, వేయాలి. ఆయన మహానుభావుడు, ఆయన ఎవరితో మాట్లాడలేదు, అవన్నీ అబద్ధాలు. మహానుభావుడు నిజం, మాట్లాడలేదు అబద్ధం. మాట్లాడారు. అవసరమైంది మాట్లాడారు, అక్కడికొచ్చేది మాట్లాడారు, క్లుప్తంగా మాట్లాడారు, సమాధానం పడేట్టుగా కాక సమాధానం ఇచ్చేట్లుగా మాట్లాడారు. ఏది సత్యమో దాన్ని నిష్కర్షగా చెప్పారు. అందుకోగలిగిన వాడా? అందుకోగలుగుతాడు. లేదు, మళ్ళీ ఆయనకు పూజలు, హారతులు, ఊరేగింపులు చేస్తామా? చేద్దాం. దానివల్ల ఆయనకు ఒరిగేది లేదు, మనకి ఒరిగేది లేదు. కాబట్టి ఏమి చేయాలంటే సత్యాసత్య వివేచనతో ఉండాలి. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? విచారణ చేయమన్నారు. ఇంతకీ relevance దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి మన సనాతనమైన, భారతీయమైన, ఆర్షమైన, వైదికమైనటువంటి విజ్ఞానాన్ని అనేకమైనటువంటి విషయాలను స్పృశిస్తూ వస్తే అది తెలిస్తే తప్ప రమణులు ఎందుకు వచ్చారో తెలీదు. ఒక fervor ఒక emotion తో రమణుల గురించి మాట్లాడటం ఒక ఎత్తు.కానీ rational గా chronological గా scientific గా దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు రమణ మహర్షి అంటే మన గౌరవం పదింతలు పెరుగుతుంది. ఏమిటది? వేదాల నిండా అంటే మనకున్న నాలుగు వేదాలు నాలుగు కాదు మూడే. అందుకనే దానిని వేదత్రయీ అన్నారు. నాలుగవది అధర్వణం. అన్నీ పోగా కాగా మిగిలినదంతా కలగూర గంపగా అధర్వనుడనే ఆయన పేరు మీద అధర్వణ వేదం వచ్చింది గనుక నిజానికి వేదాలు మూడే. వేదత్రయీ. విద్య వేదవిద్య కూడా త్రయీ విద్య అని పేరు పెట్టారు గనుక వేదం అంతా కూడా ఆత్మ అనేటువంటి దానిని ప్రత్యేకంగా స్పృశించలేదు. ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేప్పటికి కొంత వ్యాఖ్యానం జరిగింది. ప్రధానంగా కఠోపనిషత్తులో నచికేతస యమ సంవాదంలో ఆత్మను గురించిన విషయాలు కొన్ని మనకు బయటికి వస్తాయి. అయితే అది కూడా ప్రపంచంతో మొదలు పెట్టింది. కడగా బృహదారణ్యకోపనిషత్తులో అన్ అంతా ఒకటే అని చెప్తుంది. దాని జోలికి పోకుండా ఆత్మ అనేటువంటి ఒక చిన్న స్పర్శ ఒక చిన్న భావన కలిగింది ఉపనిషత్తులలో. కాలం అయిపోయింది. ద్వాపర యుగం వచ్చేసింది. ద్వాపర యుగానికి ముందున్నటువంటి త్రేతాయుగంలో వశిష్టుల వారు శ్రీరామచంద్రమూర్తి కూర్చొని మాట్లాడుకున్న ముప్పై మూడు వేల శ్లోకాలలో గ్రహించబడిన నిబద్ధమైన నిభృతమైన పరమాద్భుతమైన వాఙ్మయ ధార ఏదైతే ఉందో దానిలో ఆత్మ విచారణ లేదు. యోగవాశిష్టం అంతా మనస్సును గురించిన విచారణ ఉన్నది. ఆత్మను గురించి తక్కువగా ఉంది. లేదని కాదు తక్కువ ఉన్నది. దాటిన తర్వాత ద్వాపర యుగం వస్తే ద్వాపర యుగంలో కూడా ఇది మాట్లాడిన వారు లేరు. పురాణాలు మాట్లాడుకున్నారు. ఇతిహాసాలు మాట్లాడుకున్నారు. కొంత వేదాధ్యయనం జరిగింది అది నడుస్తూ వచ్చింది. అయితే కృష్ణ పరమాత్మ ద్వాపరాంతంలో మహాభారత సంగ్రామ వేళ ఉపనిషత్తుల యొక్క మహాసారాన్ని బయటకు తీసి పద్దెనిమిది అధ్యాయాలుగా తొలి ఆరు కర్మయోగంగా మలి ఆరు భక్తి యోగంగా కడగా ఉన్న ఆరు జ్ఞానయోగంగా కర్మ భక్తి జ్ఞాన యోగ త్రివేణిగా భగవద్గీతను మనకు అందిస్తే ఆయన అలాపిస్తే దానిలో కూడా ఆయన ఏం చేశారు? "ఆత్మ నీట నానదు నిప్పున కాలదు అది పుంగదు పొంగదు లొంగదు వంగదు" అని చెప్పాడు. అంతే వదిలేశారు. అయిపోయింది. సమయం అయిపోయింది కలియుగం వచ్చింది. శంకర భగవత్పాదులు వచ్చారు. సంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. శివ స్వరూపమే వాఙ్మయ స్వరూపమై ఆయనే దక్షిణామూర్తియై అన్నీ అయి అంతా అయి వచ్చి అన్నీ చెప్పి ఆత్మబోధ చేసి ఆత్మను గురించి పరమాద్భుతమైన భాష్యాలు ప్రకరణాలు చేసి ఆయన ఏమన్నారంటే ఆత్మను పట్టుకో ఆత్మను వెతుకు నువ్వే ఆత్మ ఇవన్నీ చెప్పిన ఆయన ఆత్ అంటే ఏమి? మా అంటే లేదు. అసలు ఏమీ లేదు. ఆత్మ అంటే ఏమీ లేదు అని తెలుసుకోండి అన్నారు. మరి ఏమీ లేని దాని కోసం ఏమీ లేదంటూనే ఇంత చెప్తున్నారు ఏంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు అసలు ఉన్నదంతా ఆత్మే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఏకం ఏవా ఒక్కటే ఉన్నది. ఆత్మే అనేక రూపాలు జగత్తు జగదీశ్వరుడై వస్తున్నదని మళ్ళీ ఇదంతా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అని ఆయన శంకర భగవత్పాదులు నిర్వచనం ఇచ్చారు. వారి సమయం అయిపోయింది. అయితే అంతా ఆత్మే అని చెప్తున్నారు కదా. ఉన్నదంతా ఆత్మే అన్నప్పుడు నేను దాన్ని ప్రత్యేకంగా ఎక్కడ దర్శనం చేయగలను? అంతా ఆత్మ అయినప్పుడు అంతా దైవమే అయినప్పుడు అంతా బ్రహ్మమే అయినప్పుడు నేను గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఇవాళ అధునాతనమైన యువకుడు ఒక ప్రశ్న వేస్తాడు. సమాధానం ఏమిటంటే పూర్తిగా పరచుకున్నటువంటి ఒక శక్తి ఏది expansive గా ఉన్నదో Palachhబడి ఉన్నదో అదంతా ఒకచోట ప్రతిష్ఠ జరిగినప్పుడు అది శక్తి కేంద్రం అవుతుంది. అది శక్తి క్షేత్రం అవుతుంది కనుక దేవాలయానికి వెళ్ళాలి. అన్నింట్లో చూడటం వేరు అక్కడికి వెళితే అనుభవం అవుతుంది కనుక దేవాలయానికి వెళ్ళాలి. గోవు ముఖ మండలం నుంచి తోక వరకు అంతా పవిత్రమే సర్వ దేవతల నిలయమే అని అంటాం. కానీ పాలు కావాలి అంటే చివి పిండితే పాలు రావు. పొదుగు దగ్గరకు వెళ్ళాలి. చేపాలి పట్టాలి పాలు తీయాలి. దానిలో నుంచి మహానందాన్ని మనం ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అదే యుక్తాహార విహారస్య అన్నాడు. విహారము అట్లాగే ఉండాలి యుక్తమైన ఆహారంతో ఉండాలి ఇవన్నీ చెప్తూ చెప్తూ అక్కడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత అక్కడ ఆపేశాడు. అయితే భగవద్గీతతో పాటు అంతా అయిపోయి యుద్ధం అయిపోయి ధర్మరాజు రాజైన తర్వాత ద్వారకకు బయలుదేరబోతున్నాడు కృష్ణ పరమాత్మ. సమయంలో అర్జునుడు ఒక మునిమాపు వేళ కృష్ణుడ్ని పట్టుకున్నాడు. "అయ్యా! యుద్ధరంగంలో నా మనసంతా యుద్ధం మీద యుద్ధం చేయకపోవటం మీద రెండుగా చీలిపోయింది. మొత్తానికి ఏదో నా చేత యుద్ధం చేయించావు. నువ్వు ఇక వెళ్ళిపోతున్నావు మళ్ళీ కనపడతావో లేదో. నువ్వు పదే పదే పదే బ్రహ్మము బ్రహ్మము అని చెప్పావు అది ఏమిటి అసలు?" అని అడిగాడు. నాకు కావలసింది ఇదే. ఇప్పుడు అడిగావు కదా నీకోసంనే చెప్తానన్నాడు దాని పేరు ఉత్తర గీత. రెండు వందల యాభై ఐదు శ్లోకాలలో పరమ ఆర్ద్రంగా రమణీయంగా గంభీరంగా ఉదాత్తంగా సమున్నతంగా మనకి బోధ చేస్తుంది. కానీ దేనిని బోధ చేసింది? భగవద్గీత అంతా మనస్సును గురించి బోధ చేస్తే ఉత్తర గీత అంతా బ్రహ్మమును గురించి బోధించింది. కృష్ణ పరమాత్మ మొదట చెప్పిన నీటనానదు అక్కడ ఆపేసి వదిలేశారు ఆయన. ఎందుకనంటే అవతార పరంపర ప్రవాహమై వస్తూ ఉండాలి.ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కళ్ళు రావాలి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అధర్మం అంటే ప్రపంచంలో జరిగే అనాచారం మాత్రమే కాదు మనం చదవాల్సింది చదవకపోయినా, చదివింది ఇంకొకడికి చెప్పకపోయినా, చెప్తున్న దాన్ని డబ్బుకి అమ్ముకున్నా, ఇదంతా అనాచారమే ఇది అధర్మమే. కనుక మహాపురుషులు వాళ్ళకి అక్కరలేని ఒక దేహాన్ని తీసుకుని వస్తారు. అట్లా వచ్చినటువంటి మరి రమణ మహర్షి ఎందుకని మనకివ్వేళ మహర్షి అయినారు అంటే, మనిషి ఋషి కావాలి, ఋషి బ్రహ్మర్షి కావాలి, బ్రహ్మర్షి మహర్షి కావాలి. మహర్షి ఏకకాలంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏదన్నా ఉంటే అది భగవాన్ శ్రీ రమణ మహర్షి. మరి ఇంతకీ ఆత్మకి ఈయన చెప్పే బోధకి ఏమిటి సంబంధం అంటే, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మే అని చెప్పిన దానిలో ఎవరికీ పేచీ లేదు, ఘర్షణ లేదు, question లేదు. అయ్యా నాలో ఆత్మ ఎక్కడున్నది ఇంతవరకు ఎవరూ చెప్పల. మనస్సు ఎక్కడున్నది అని మనల్ని అడుగుతాం అనుకోండి, మీ మనస్సు ఎక్కడున్నది అంటే నాకు కాలి దగ్గర గనక ఏదన్నా పాకితే నా మనస్సు అక్కడ ఏదో పాకింది అని చెబుతుంది. నా వీపు వెనక ఏదన్నా స్పర్శ గనక దెయ్యిల్తే మనస్సు అక్కడికి వెళుతుంది. దానికి రూపం లేదు కానీ సర్వవ్యాపకమై ఉంది. మన ఆలోచనే bundle of thoughts become the mind అంతే కదా! కాబట్టి ఆలోచనా ప్రవాహాన్ని మనం దాటి ప్రవాహమే కానీ నిశ్చలమైనటువంటి ఒక స్థితికి వెళ్ళాలి అంటే ఆత్మని ఎరగాలి. ఆత్మ ఎక్కడ ఉన్నది అనగానే మనకు తెలియదు. ఇది first question. first answer కూడా అదే. దానిని చెప్పటానికే భగవాన్ రమణ మహర్షి వచ్చారు. వారి వైభవమంతా ఒక్క శ్లోకంలో ఉంది. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విస మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్టో భవత్వం. చాలా straight గా, సూటిగా ambiguity లేకుండా తాను దేనిని త్రిరుచ్చులిలో అనుభవించారో, అనుభవం తర్వాత తాను ఎలా ఉన్నారో దానిని మళ్ళీ లోకానికి ఇచ్చారు. అలా ఇవ్వాలి. అలా అందించవలసినటువంటి బాధ్యత జ్ఞానిది. దీనికి ప్రమాణం మళ్ళీ మనకు శంకర భగవత్పాదులే "ప్రవుడ ప్రవుడ నిజానుభూతి కలిత దైతేంద్ర జాలౌ గురుః స్వచ్ఛుష్య బోధయాత్ సత్యం అశ్రితావన్". తాను పొందినటువంటి ఒక మహానుభూతిని అయ్యా ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఒకడిని పిలిచి వాడికి సమాధానం ఇచ్చి జ్ఞానాన్ని వరదానం చేయాలి. ఇది జీవుడి యొక్క, గురువు యొక్క ఆహ్ ప్రత్యేకమైన బాధ్యత. హృదయ కుహర మధ్యే. హృదయము అనంగానే మనం physical heart ఏదైతే ఉందో గుండెని చూపిస్తాం. గుండె మనకు తెలియకుండా అది మనల్ని న-నడిపిస్తూ ఉంటుంది. దానికి వారు clear గా చెప్పారు. One and half inches towards right side of your physical mechanical heart there is a cave. Cave అంటే utter emptiness is called a cave, గుహ. దానిలో గుహలో reverberations ఉంటాయి, resounds ఉంటాయి, resonances ఉంటాయి, reflections ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కనుక. ఖాళీ పాత్రలో ఇంకో గిన్నెలు పెట్టి గనక దాన్ని కొట్టినట్టయితే ఎట్లాగైతే sound వస్తుందో కానీ ఎప్పుడైతే వస్తు స్పర్శ లేదో నిశ్శబ్దంగా ఉంటుందో అటువంటి ఒక గుహ ఉంటే దానిలో కేవలం బ్రహ్మ మాత్రం absolute reality గా ఉన్నది. absolute reality ఎలా ఉన్నదంటే "యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి". అది ఏమంటున్నది అట అంటే వినగలిగితే నేను నేను నేను నేను నేను నేను అంటున్నదట. ఎక్కడి నుంచో ప్రారంభించి ఉదాత్త అనుదాత్త స్వరాలు వచ్చి నెమ్మదిగా మౌన ముద్రాంకితమైన భావనలోకి వెళ్ళి ఒక స్వరంగా స్వరంగా సస్వరంగా సుస్వరంగా ప్రారంభమై నిస్వరంగా నిశ్శబ్దంగా మహా మౌనంలోకి వెళ్తున్నది. అందుకనే నేను అన్నది నేను నేను నేను నేనై ఏమీ కాకుండా అయిపోతున్నది కానీ అది అక్కడ ఉన్నది. అయితే "యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి" ఆత్మ రూపంగా ప్రకాశమానంగా ఉన్నది. అయితే ఇది నాకు జ్ఞానం లేదు, చదువు లేదు, నేను పామరుడిని ఎట్లా నేను అనుభవించగలను అంటే, ఏమీ లేదు నువ్వు భగవంతుణ్ణి ఆరాధన చేస్తావు కదా, ఆయన దగ్గర ఒక జ్యోతి వెలిగిస్తావు కదా, అది ఆరిపోకుండా ఉండాలని చిల్లులు ఉన్నటువంటి ఒక పాత్ర బోర్లిస్తావు కదా, బయట నుంచి ఎంత ప్రచండ వాయువులు వీచినా అన్నీ మలగి పోవచ్చు గాక కానీ లోపల ఉన్నది వెలుగుతూనే ఉన్నది. అట్లే నీ దేహమనే పాత్ర మలగిపోయినా, కరిగిపోయినా, శిథిలమైనా, కూలిపోయినా, కాలిపోయినా నిత్యమూ దివ్యమైనటువంటి మహా జ్యోతి వలె ప్రకాశమానమై ఉండేటువంటి నేను ఏదైతే ఉన్నదో అది నీవుగా భావించు. ఆత్మ నిష్టో భవత్వం. నేను అది. జ్యోతిని నేను. కనిపిస్తున్న దేహము, అలంకారము, మాటలు, ఇవన్నీ కూడా కావు. ఇవి ఏవీ కానీ మాటలు మలగాలి, మౌనం వెలగాలి, లోపల తలపులు నశించాలి. ఏముండాలంటే నిశ్చలమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, నికేతనమైన, నిరంజనమైనటువంటి మహాద్భుతమైనటువంటి మహా మౌన భూమిక ఏదైతే ఉన్నదో అదే స్మరణీయ, వర్ణనీయ, రమణీయమైనటువంటి భావనా. కాబట్టి రమణ మహర్షి ప్రపంచంలోకి ఎందుకు వచ్చారు అంటే మన దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నదో చెప్పడానికి వచ్చారు. ఆయన ఎలా చెప్పగలరు? scientist ఆ? ఆయనేమన్నా research చేశారా? లేదు. స్వీయానుభవం, మరణానుభవం, మరణానుభూతి. ఏది మరణిస్తున్నదో తెలుసుకున్నారు, ఏది మరణించలేదో మరణించదో తెలుసుకున్నారు, మరణించనిది మరణించే దాంట్లో ఉన్నదని తెలుసుకున్నారు. కనుక ఆయనకి దేహాత్మ భావన లేదు. నాలుగైదు సందర్భాలు మనం చక్కగా చెప్పుకోవాలి. అందులో ఒకటి...వారు ఇలా అయితే ఆశ్రమంలో వారు ప్రతి రోజు పని చేసేవారు proof reading చేసేవారు పుస్తకాలకు అట్టలు వేసేవారు లేకపోతే ఎవరైనా వస్తే పది నిమిషాలు మాట్లాడేవారు సందేహం ప్రపంచానికి అక్కరకు వచ్చే ప్రశ్న వేస్తేనే సమాధానం చెప్పేవారు లేకపోతే మౌనంగా ఉండేవారు ఇవన్నీ చేస్తూ పదకొండు గంటలకి ఆశ్రమం వాళ్ళు గనుక భోజనానికి లేవండి అని గంట కొట్టగానే అందరికంటే ముందు ఆయన లేచేవారు ఎందుకని ఆకలి కోసమే లేవలే నేను సమయాన్ని అతిక్రమించి గనుక వెళ్లినట్లయితే నా వెనుక వాళ్ళు కూడా వాళ్ళు అతిక్రమిస్తారు నేను ముందు follow కావాలి అని తనదైనటువంటి తనకు మాత్రమే చెందినటువంటి అలౌకిక రీతిలో ఆయనకు ఏమీ చెందలే ఆయన ఏమన్నారు కర్మ నిష్టలో లేనివాడు కర్తవ్యం చేయని వాడు రోజు పని చేయని వాడు వాడికి ముద్ద ఎత్తే హక్కు లేదు అన్నారాయన ఒక ముద్ద ఎత్తాలి అంటే రోజు పని చేయాలి ఇది ఈవేళ అధునాతన యువతకు కూడా ఒక గొప్ప సందేశం ఇది ప్రతి నిత్యమూ నిత్య నూతనమైనటువంటి వైవిధ్యంతో కూడిన అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి పని చేయకూడదు అన్నీ చేయవలసినవే అన్నీ చేస్తేనే ప్రపంచం నడుస్తూ జరుగుతూ ఉంటుంది. అలాగే బాగా చదువుకున్నటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు శివానంద వంటి వారు పరమహంస యోగానంద వంటి వారు రమణ యొక్క దర్శనానికి వెళితే అక్కడ ఉన్నటువంటి వారు భగవాన్ ను ప్రశ్నం వేశారు భగవాన్ మేము వస్తున్నాం వెళ్తున్నాం మాకు ఏదన్నా ఒక సందేశం ఇవ్వండి అని అడిగారు ప్రతి గురువుని మనం అడుగుతాం మీరు ఏదన్నా చెప్పండి అని మనం చేసినా చేయకపోయినా ఒకటి అడుగుతాం మనం చేస్తామో చేయమో ఆయనకు తెలుసు అయినా అడిగారు గనుక ఇస్తారు ఆయన ఏమన్నారంటే ఏమీ లేదు ఊరకుండండి అన్నారు ఆశ్చర్యపోతాం ఇదేమిటి ఇంత simple గా చెప్పారేమిటి ఇదేదో నువ్వు అధ్యయనాలు వై రోజు నువ్వు మండల దీక్ష చేయి ఎర్ర బట్టలు కట్టుకో తాయత్తులు కట్టుకో మెడలో రుద్రాక్ష మాలలు వేసుకో అని ఏమీ లేదే ఏమీ లేదు అనుకోండి మొట్టమొదట అనుకోగలమా మన మనసు అనుకొనిస్తుందా స్మశాన వైరాగ్య ప్రసూతి వైరాగ్యాలకు ఎప్పుడూ లోనవుతుంది కదా కనుక అన్నివేళలా ఏమీ లేదు ఇక్కడ అసలు ఏమీ లేదు ఏమీ లేదు లో ప్రపంచం కాదు అసలు నేనే లేను నా దేహమే లేదు ఇది కూడా ఉండదు అనుకున్నట్లయితే మరణ భయం ఉండదు ఏమీ లేదు అనుకోవటం ఒకటి ఊరకే ఉండండి ఊరక ఉండండి ఊరక ఉండటం అంటే ఎక్కువ ఆలోచనలు లేకుండా ఉండండి ఆలోచనలు నిమిషానికి ఆరువేల ఆలోచనలు పుడతాయి మన brain లో మనసు దాన్ని మనల్ని తొందర పెడుతుంది పరిగెత్తిస్తుంది అవసరం లేదన్నారు మరి ఏం చేయాలి దాన్నెట్లా అంటే దీనికి కారణం మోక్షానికి ప్రపంచంలో ఉన్న బంధనాలకి మనస్సే కారణం కనుక మనసును తీసుకెళ్లి దాని పుట్టిల్లు అయినటువంటి హృదయ స్థానం దానికి చేర్చు ఇది సాధన అంటే బహిర్ముఖంగా ఉన్నటువంటి ఇంద్రియాలని అంతర్ముఖం చెయ్ అటు ఇటు పరిగెత్తుతున్న మనసును తీసుకెళ్లి నిలకడగా ఉన్న గుహలోకి తీసుకెళ్లు ఎందుకంటే అది దాని పుట్టిల్లు గనుక మనసు హృదయంలోనే పుట్టి అంటే ఆలోచన అక్కడే పుట్టి శిరసు ద్వారా విజృంభించి వాక్కు ద్వారా ప్రకటన చేయబడి కన్ను ద్వారా చూడబడి కరచరణాది అవయవాల ద్వారా ప్రపంచంలో అనేకమైన కర్మలు చేసి అలసి సొలసి ఏమీ పొందకుండా పొందినదల్లా పోగొట్టుకుంటూ జీవితాన్ని గడుపుతాం కనుక ఏమీ లేదు ఊరకుండండి ఊరికే ఉండండి just keep the mind shut be still అన్నారాయన నిర్మలంగా ఉండని ముందు ఏవో సంఘటన జరిగిపోతుంటాయి ఒకరోజున అరుణాచలంలో వారు కూర్చుని ఉంటే ఇరవై ఒక్క అడుగులు ఉన్నటువంటి ఒక రాజ సర్పం తెల్లని తాచుపాము ఆయన మీదిగా పాకి వెళ్తుంటే పాదాల మీదిగా అందరూ భయభ్రాంతులై దూరానికి వెళ్లిపోయారు అది పాకుతూ వెళ్లిపోయింది అందరూ కాసేపు అయిన తర్వాత భగవాన్ ఇరవై ఒక్క అడుగుల రాజ సర్పం మీ పాదాల మీదిగా వెళ్లిపోతున్నది మీకు భయం అనిపించలేదా అని అడిగారు it was cold and moist అంతే అన్నారు చల్లగా ఉంది చెమ్మగా ఉంది అన్నారు అంతే అది స్పర్శ ఇక భయమా మనసున్నవాడికి భయం గాని మనసును దాటిన వాడికి భయం ఎక్కడ అందుకనే వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మకి రాముడు కృష్ణుడు అని పేరు పెట్టలే అభీహి అన్నది భీతి లేని వాడు ఆయనకి భీతి ఎందుకు లేదు భయం ఎందుకు లేదంటే ఆయన అంతటి వాడు ఇంకొకడు లేడు గనుక అంతే మనక్కూడా భయం ఎప్పుడు వస్తుంది అంటే మన అంతటి వాడో మనల్ని దాటిన వాడో పక్కన కూర్చుంటే భయం వేస్తుంది పరమాత్మకి అటువంటి ఆస్కారమే లేదు అవకాశమే లేదు కాబట్టి ఇటువంటి సంఘటనలన్నీ కూడా రమణ చరిత్రని రమణులు చెప్పిన philosophy ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా దృశ్యమాన ప్రపంచంలో మనం చేయవలసిన కర్తవ్యాన్ని చేయాలి సాక్షిభూతంగా చేయాలి భగవాన్ ని అడిగారు ఒకసారి మనసుని సంకల్పించదు వద్దు అది ఇది అంటున్నారే ఒక మాట మరి మీరు train రాలేదా సోమసుందరం దిగాడా లేదా భోజనాల ఏర్పాట్లు అయినాయా అని అడుగుతూ ఉంటారే మనసేమిటి అని అడిగారు అప్పుడు చెప్పారు ఆయన స్పృహ ఉన్నవాడు అనుభవాన్ని పొందినవాడు మనసుని హృదయమనే గూట్లో నుంచి బయటకు తెచ్చి లౌకిక సంబంధ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ గూట్లో పెట్టుకుంటాడప్పా అంతే అన్నాడు అంటే మనం మన మనసుని లోపల పెట్టను లేము బయటకు తీస్తే మళ్ళీ తిరిగి పెట్టలేము కాబట్టి వీటన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ చివరగా ఎందుకంటే రమణ మహర్షి యొక్క వైరాగ్య వైభవాన్ని అనేకమైన విషయాలని అతి తక్కువ సమయంలో సంక్షిప్తీకరించడం కూడా న్యాయం కాదు చాలా విస్తృతమైన మహా గంభీరమైన విషయం రెండు విషయాలు చెప్పి మనం ఇవాళ ముగించుకుందాం ఒకటి ఆయన్ని చిదంబరం రమ్మన్నారు చిదంబరం దగ్గరే ఉంటుంది ఎన్నోసార్లు ఒక్కసారి మా చిదంబరం రండి భగవాన్ అని పిలిస్తే ఆయన ఏమన్నారంటేతిరువయ్యూరు లో జన్మ ఎత్తటం కన్నా, కాశీలో గంగా స్నానం కన్నా, నటరాజ చిదంబరం లో నటరాజ దర్శనం కన్నా అరుణాచలం లో ఉండటమే సర్వోత్తమమైనది అన్నారు. ఎందుకని ఆయన ఉన్నారు గనుకనా? ఆయన కంటే ముందు మహాత్ములందరూ అరుణగిరి మీద ఉన్నారు గనుకనా? కానే కాదు, వారు అప్పుడు చెప్పారు,"స్మరణ మాత్రమునే పరముక్తి ఫలదా, కరుణామృత జలధి అరుణాచలమిది" అన్నారు. నువ్వు మిగతా వాటి అన్నింటికీ పూజ చేయాలి, అలంకారాలు చేయాలి, అర్చనలు చేయాలి, వేడుకలు చేయాలి, జాతర్లు చేయాలి, ఊరేగింపులు చేయాలి. అక్కడ ఏం లేదు, అరుణాచలా అంటే చాలు. ఏమవుతుంది అంటే పరముక్తి లభిస్తుంది. పరముక్తి అంటే మళ్లీ మళ్లీ జన్మ లేనిదా? జన్మ ఎత్తినా ఆత్మభావనతో ఉండేది అంటే, రెండు కలిపితే అది అవుతున్నది గనుక ముక్తి అంటే ఒక భావన నుంచి విడిపోతే ముక్తి. అసలు నేను అన్న దేహాత్మ భావన నుంచి విడిపోతే విముక్తి. అసలు నేను ఆత్మనే అన్న భావనలో గనుక అన్నింటినీ వదిలిపెట్టి ఉండగలిగితే దాని పేరు పరముక్తి గనుక, పరముక్తిని ఫలదా ఇవ్వగలిగినది ఏది అంటే అరుణాచలం. అందుకే స్వామి భగవాన్ సత్య సాయిబాబా వారు మనకి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అని మనకి సంప్రదాయం నేర్పారు. చివరగా వారికి ఇది రసార్ద్రమైన సన్నివేశం. వారికి ఎడమ భుజం మీద సార్కోమా అంటే ఇవాళ cancer. ఒక పెద్ద పుండు లేచింది. అది రక్తం కారుతూ ఉన్నది ఎర్రగా కనిపిస్తూ ఉండేది. ఆయన మామూలుగా ఉండేవారు ఏమీ లేనట్లే ఉండేవారు. చుట్టూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా,"భగవాన్ మా రోగాలు పోగొట్టారు, మా ఇబ్బందులు తొలగించారు, మీ దగ్గరికి వచ్చాక మా జీవితాలన్నీ బాగున్నాయి, మీరు ఒక్కసారి సంకల్పించండి ఆరు-- అది పోవాలి అని. పోతుంది, మా అందరికీ ఆనందం. మేము చూడలేకపోతున్నాం" అని అన్నప్పుడు ఆయన అన్నారు,"మీలో ఒక్కరినైనా ఇక్కడికి రండి అని నేను పిలిచానా? మీరందరూ వచ్చారు. ఒక్కరినైనా ఇక వెళ్ళండి అన్నానా? లేదే. వారు అలాగే వచ్చారు. వారు ఉన్నంత కాలం ఉంటారు. వారిని ఉండనివ్వండి. వారితో మనకేం పని?" అన్నారు. ఆశ్చర్యం! "కాదు భగవాన్ మీరు ఎట్లాగైనా సంకల్పించండి" అని పట్టుబట్టారు. అప్పుడు ఒక పసివాడి వలె, ఒక బాలుడి వలె కరుణ చిప్పిల్లుతుండగా ఒక్క మాటన్నారు,"అవును సంకల్పించుకోవాలి అంటే మీ అందరికీ మీ మీ మనస్సులున్నాయి. ఏది కావాలి అనుకుంటారో, ఏది వద్దనుకుంటారో, ఏది పొందాలి అనుకుంటారో, పోగొట్టుకుంటాను అనుకుంటారో అన్నీ అనుభవించడానికి మీకు మనస్సు అంటూ ఉన్నది. ఇక్కడ మనసే లేదే. లేని మనసుతో సంకల్పం ఎట్లా చేయటం? వారిని అలా ఉండనివ్వండి" అన్నారు. చివరగా పందొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి ముందు, రెండు నిమిషాల ముందు ఎక్కడో గేటు దగ్గర ఉన్నటువంటి మాధవ స్వామిని ఇట్లా చెయ్యెత్తారు. దగ్గరగా పిలిచినట్టు అనిపించి వెళ్ళాడు పరిచారకుడు. అప్పటికే భగవాన్ ఇక ఉండరు, దేహం వదిలి పెడతారనే క్యూ కట్టి ఉన్నారు జనం. ఎప్పుడైతే భగవాన్ తనని పిలుస్తున్నారు అన్న భావన కలిగిందో పరుగు పరుగున ఏడుస్తూ వెళ్లి నిల్చున్నాడు. నిల్చొని వారు అన్నమాట,"రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన అవసరం లేదు మాధవా". అనగానే ఒక్కసారి బళ్ళును ఏడిచ్చి,"భగవాన్ ఎట్లా? ఎట్లా? రేపటి నుంచి ఎట్లా మాకు?" "అవును నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఉండదేమో. నేను ఇక్కడే ఉంటా" అన్నారు. అని మూడవది,"థాంక్స్" అన్నారు. వాడికి English రాదు. రోజుల్లో పదం కూడా తెలియదు. అంటే ఏమిటి అన్నట్టుగా చూశాడు. అదేదో వరం ఏమో అన్నట్లు. " థాంక్స్ అంటే ఏం లేదు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. థాంక్స్ అంటే ఆనందం" అన్నారు. దాంతో భగవాన్ రమణుల యొక్క వైరాగ్య వైభోగం పరమ రమణీయంగా ఆకాశమంతగా విస్తృత పరచుకున్నది అలా ముగిసింది. కానీ దేహయాత్ర ముగిసిందిగా. కానీ ఇవాల్టికి అరుణాచలం స్వామి అనుగ్రహంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొదలైన నా అరుణాచల యాత్ర, యాత్ర అంటే ఏం లేదు. నేను యాత్రలు ఏం చేయును. వెళ్తాను మౌనం, మహా మౌనం. ఎందుకంటే మూడు వందల అరవై రోజులు మాట్లాడుతూనే ఉంటాం కదా! మాట్లాడకుండా ఉండవలసిన స్థితి ఉండాలి కదా! అందుకని అరుణాచలానికి వెళ్ళటం. సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తారీఖుకి గిరి ప్రదక్షిణ భగవాన్ రమణ మహర్షి aspect లో చాలా పవిత్రమైంది. గిరి అంటే దేహము, ఆత్మగిరి. మన దేహం three hundred and sixty degrees తిరిగి తిరిగి తిరిగి త్రికోణాత్మకమైనటువంటి బ్రహ్మస్థానానికి చేర్చేదే కనుక అది గిరి ప్రదక్షిణం. కేవలం దేహ ప్రదక్షిణం కాదు, అది నిజమైనటువంటి ఆత్మ ప్రదక్షిణం. అది మొన్న ఫిబ్రవరి ఆరో తారీఖున అక్కడికి వెళ్లి పదమూడు రోజులు ఉండవలసి వచ్చి ఉన్నప్పుడు అప్పటికి నేను తొంభై ఆరు గిరి ప్రదక్షిణాలు చేసుకొని సంవత్సరమే స్వామి అనుగ్రహంతో, చూడండి మార్చిలో అయి ఉన్నట్లయితే అయ్యేది కాదు. Covid వచ్చేసి అందరినీ ఆపేసి ఉండేది. కానీ ఫిబ్రవరి ఆరు నుంచి పన్నెండవ తారీఖు లోగా నూరు గిరి ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని భగవాన్ చల్లని పాదస్పర్శతో-- దీనికంతకీ కారణం మళ్ళీ ఏది ఏది ఏది అని ప్రశ్న వేస్తే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి అనుగ్రహ విశేషంతోనే ఇది సాధ్యమైందని, అలాగే అనేక సందర్భాలు మనం ఏర్పరచుకొని భగవాన్ని అనేక కోణాల్లో కర్మ యోగంలో, భక్తి యోగంలో, జ్ఞాన యోగంలో, తత్వ విచారణలో, భావనా స్థితులలో వాటి వారి గురించి అనేక సందర్భాలు, అనేక సన్నివేశాలు పండితులతో, కామరులతో వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ చెప్పాలి. వాటన్నింటినీ మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అనేక చోట్ల Australian group ప్రారంభించినటువంటి శ్రీ రమణ-రమణ వైభవానికి నేను ఆనంద పరవశుడ్ని అవుతూ, ఇవాళ నా గురువైనటువంటి భగవాన్ గురువే కాదు, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము భగవాన్ శ్రీ సత్య సాయి. వారు ఆదేశించిన ప్రకారమే నేను అరుణాచలానికి వెళ్లగలిగాను. వారికి మరొక్కసారి నమస్కరిస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శరన్నవరాత్రులు నవనవోన్మేషమై నవ్యరీతిలో నవరాత్రులుగా సాగాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిరాం.
YouTube · audio

Sri Sathya Sai Katha Jhari - Sri Ramana Vaibhavam

Home

Sri Sathya Sai Katha Jhari - Sri Ramana Vaibhavam

Source: Vijay Sai Ram Kambhampati on YouTube

0:00 / 1:11:55