Skip to content
Transcript తెలుగు
మూర్తి గారు మీ దగ్గర ఇన్ని సమాధానాలు ఉన్నప్పుడు P ఉమ్ ... ఇన్ని రకాల సమాధానాలు మీ దగ్గరే ఉన్నప్పుడు ఉమ్ మీరు మరి రవిశంకర్ గురూజీ గారిని పదమూడు గంటలు interview చేశారు అవును మీరు వారిని ఏమడిగారు? పదమూడున్నర గంటల్లో అసలు ఆయన తొమ్మిది నిమిషాలు time ఇస్తా అన్నారు. ఆచార్య దేవోభవ program చేసి అవును నన్ను ఎవరు interview చేస్తారంటే వాళ్ళు పంపించారు నా గురించి ఉమ్ సరే అని అన్నారు. వీళ్ళు కూడా తొమ్మిది నిమిషాలు కాబట్టి ఏదో ముత్తి గారు కదా ఇంకో పది నిమిషాలు ఒక అరగంటకి plan చేసుకొని వచ్చారు చేసుకున్నారు. ఉమ్ హ్మ్ మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నవి భారతీయమైనటువంటి సనాతన వైదిక వాంగ్మయం మీద ఉమ్ బ్రహ్మసూత్ర భాష్యాల మీద, భారత స్వరూపం మీద అంటే మహాభారత స్వరూపం మీద, అది లక్ష శ్లోకాలు, ఎనిమిది వేల శ్లోకాలు మధ్యలో జైమిని భారతాలు అనేక మతాలు దాని యందు చొచ్చుకుని రావటం, తర్వాత వాటి application ఇవాళ, ఇవాళ ఉన్న context లో నడుస్తున్న భారత చరిత్రలో లేదా ప్రపంచ పటం మీద వైద వాంగ్మయాన్ని మళ్ళీ ఎట్లా తీసుకుని వెళ్ళాలి ఉమ్ ఇటువంటి చాలా మార్మికమైనటువంటి విషయాలన్నీ కూడా వెళుతూ ఉంటే పదమూడున్నర గంటల తర్వాత ఆయన ఏమన్నారంటే "ఇప్పటివరకు మా ఆశ్రమానికి వచ్చి మా నుంచి ఏదో తీసుకుని వెళుతున్నాం అని అంటున్నారు. ఇవాళ ఒక్కమాట చెప్పి మీరు నాకు చాలా ఇచ్చి వెళుతున్నారు." ఆహ్ [నవ్వు] "చాలా ఇచ్చారు. మిమ్మల్ని వదిలి పెట్టాలని నాకు లేదు." అన్నారు "తరచు కలుస్తూ ఉందాం." ఉమ్ అంటే ఏమైంది అంటే resonance చూడండి. ఆయనకి కూడా ఎక్కడో భావాలన్నీ పంచుకోవాలి ఉమ్ అని బాగా చదువుకున్నవారు ఉమ్ నిస్సందేహంగా చదువుకున్నవారు ఉమ్ మళ్ళీ దాన్ని ఆయన కర్మయోగంలోకి తీసుకుని వెళ్లారు ఉమ్ తన చుట్టూ ఒక అద్భుతమైన సృష్టి చేసుకుంటూ వెళ్లారు. కాబట్టి పదమూడున్నర గంటలలో మాట్లాడుకోనిది అంటూ ఏమీ లేదు ఉమ్ మరణం మీద, జననం మీద, పునర్జన్మల మీద, సనాతన ధర్మం మీద, దాన్ని ఎందుకు నిలబెట్టాలి, దాన్ని ఇవాళ యువతకు ఎట్లా అందించాలి, రూపంలో అందించాలి, భాషలో అందిస్తే వాళ్ళకి మళ్ళీ మన పట్ల గౌరవాలు పెరుగుతాయి, మానవుడు మానవుడిగా జీవించగలిగిన మార్గాలు ఏమిటవి అన్నీ అన్వేషిస్తూ ఉమ్ పదమూడున్నర గంటలు సాగింది. అంటే పునర్జన్మ అనేది ఉందని నమ్ముతారా మూర్తి గారు ఉందా? హైందవ ధర్మం లేదా సనాతన ధర్మం కచ్చితంగా నమ్ముతుంది ఉమ్ ఇది ఒక్క ధర్మమే నమ్ముతుంది. మిగతా మతాలకి లేదు. మిగతా మతాలు మనం వాటి పేర్లు కూడా అవసరం లేదు పునర్జన్మ మనం పుట్టాం వెళ్ళాం అన్నారు వచ్చాము కొంతకాలం ఉన్నాము వెళ్ళిపోయాము. కానీ మనది అట్లా కాదు ఉమ్ దీని ఎట్లా-- అంటే పురాస్మృతులు ఉంటాయి మనకి ఉమ్ మనకు తెలియకుండా పురాస్మృతుల వల్లనే మనకి వేళ child prodigies అని కనిపిస్తూ ఉంటారు. బాలమురళి గారు బాలమురళి గారు సాక్షాత్తు సాక్షాత్తు example దాంట్లో. ఉమ్ చదువు ఎయిత్ standard pass గా అయినటువంటి సత్యసాయిబాబా గారు ఒక అద్భుతమైన university పెట్టారు ఉమ్ కోటానుకోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగారు. పద్నాలుగేళ్ళ వయట నాకు ప్రపంచంతో సంబంధం లేదని ఉన్న ఊరు నుంచి బయటకు రాగలిగారు. ఎంత ధైర్యం ఉండాలి? శంకర భగవత్పాదులు మూడేళ్ళకేరు మీరు వేదాలన్నీ కూడా ఆయన నోట్-- ఆయనే వేద స్వరూపం. మీరు నాలుగేళ్ళకి చదివే చదువు చదివే చదువు కూడా అటువంటిదే అటువంటిది child prodigies అన్నీ కూడా అంటే జన్మ అంతకు ముందు గడచిన జన్మలో ఉమ్ కొంత సాధన అయిపోయింది. యా ఉమ్ నాకిక్కడ ఒక సందేహం ఉంది చెప్పండి. ఆత్మకి వేయు అంటం అంటారు అవును ఇప్పుడు మరో జన్మ తీసుకున్నప్పుడు అంటే ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను నేను నా ఆత్మ వెళ్ళిపోయింది ఉమ్ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను. ఉమ్ నేను అంటే నాలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి ఉమ్ మరో శరీరాన్ని తీసుకున్నప్పుడు అవును ఆత్మకి ఏది అంటునప్పుడు ఉమ్ దేనికి స్మృతి గుర్తున్నది? దేనికి ఆత్మకా? ఆత్మకు ఏది అంటుకోకపోతే గుర్తుండే అవకాశం లేదు కదా? అంటుకోలే అంటించుకోలేదు గానీ గుర్తులైతే ఉన్నాయి దానికి. ఆత్మ జాడలు ఉన్నాయి ఉహు అది ఏం చేస్తుందంటే ఇప్పుడు దేహంలో ఉన్నటువంటి ఆత్మ, మాట్లాడుతున్న ఆత్మ, అడుగుతున్న ఆత్మ ఇది దేహాన్ని వదులుచుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చేయవలసినటువంటి కర్తవ్యాలు గనక ఉన్నట్లయితే సరైనటువంటి ఒక సమయంలో ఒక గర్భాలయాన్ని ఆశ్రయించి మళ్ళీ మరొక జన్మ ఎత్తి కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. కనుకనే రామావతారం అయిన తర్వాత కృష్ణావతారం వచ్చింది. మనకి పరంపర ఉందది. కనుకనే రామావతారాన్ని, కృష్ణావతారాన్ని దర్శనం చేసుకుని ఆంజనేయస్వామి ఉన్నాడు మధ్యలో ఉమ్ కృష్ణుణ్ణి ఆయన అంగీకరించలే. చివరికి కృష్ణుడికి తప్పక రామదర్శనం ఇవ్వాల్సి వచ్చింది ఉమ్ కాబట్టి పునర్జన్మలు మనకి కచ్చితంగా ఉన్నాయి. ఆత్మ అంటించుకోదు దేనిని కానీ కొన్నింటిని అంటుకుని ఉంటుంది గనుక potency ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ క్షేత్రం మళ్ళీ అణు అణుక్షేత్రంలోకి వస్తుంది ఉమ్ వచ్చి అందుకనే ఆయన అంటాడు "यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥" "అహం" అంటే అక్కడ కృష్ణుడు కాదు నేను ఉమ్ నేను ఎవరు? మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను. రెండు నేనులు ఒకటి. నేనులు different గాని నేను ఒకటి ఆహ్ [నవ్వు] అంతే. చాలా బాగుందండి. అవును నేనులు వేరు గానీ నేను [background music] మూర్తి గారు మీరు భగవద్గీత ఇంత ఉమ్ వివరంగా చెప్తున్నారు. ఘంటసాల గారితో మాట్లాడక మున్ ముందు అంటే మీకు భగవద్గీత పరిచయం ఉన్నాకనే వారితో మాట్లాడారా? ఘంటసాల గారు భగవద్గీతని మా బోటు వాళ్ళకి పరిచయం చేసింది ఎక్కువగా ఆయన కాబట్టి ఆయనే ఆయనే అవును ఆయనతో మీ సంభాషణ ఎలా ఉండింది? దేనిమీద సాగింది? ఆయన ప్రధానంగా అప్పుడే ఆయన భగవద్గీత పూర్తి చేశారు ఆహా నేను ఆయనతో మాట్లాడిన సమయానికి నాకు ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఉహు ఆయన తాడేపల్లిగూడెం వచ్చారు కచేరీ చేయడానికి వచ్చారు. ఆయన health ఏం పెద్ద బాగా లేదు. అది December ఇరవై నాలుగు February పదకొండవ తారీఖు వారు దేహాన్ని వదిలిపోయారు. మాతో చేసిందే last interview. అప్పటికి భగవద్గీత పూర్తి చేసేశారు. చేసి ఆయన విషయాలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆయన సంగీతంలో కొన్ని మెళకువలు, పద్య పఠనంలో ఆయన ఆలాపనలు, ఆయన వాడుకున్నటువంటి రాగాలు వీటన్నింటి మీద మాట్లాడినప్పుడు తన్మయులైపోయారు ఆయన. ఇవాళ మీ తరం ఒక భగవద్గీతే కాదు తెలుగు పద్యాన్ని, ఆయన ఎక్కడ కూడా శబ్దాన్ని విడగొట్టడుపోతనామాత్యుడు ఎలా రాశాడో యకారాలతో, దంత్యాలతో, తాలవ్యాలతో యధాతథంగా మార్పు లేకుండా స్వరద్రోహం జరగకుండా అద్భుతమైనటువంటి బాణీలో పాడగలిగినటువంటి ఒకే ఒక మహా గాయకుడు ఘంటసాల గారు. అది ఆయనతో చాలా సేపు ఐదున్నర గంటలు మాట్లాడాం మాట్లాడిన తర్వాత చివరిలో మన కంచి మహాస్వామి వారి ప్రస్తావన వచ్చినప్పుడు వారు భగవద్గీతను వినిపించారు తీసుకుని వెళ్ళి. వినిపిస్తే పెద్ద స్వామి వారు అడిగారు మీరు సంస్కృతం చదువుకున్నారా అని నాకు తెలియదు సంస్కృతం అన్నారాయన. మరి సంస్కృతం తెలియకుండా సంస్కృతం రాకుండా ఇంత అద్భుతంగా ఎలా పాడావు అని అడిగారు. పాడాను అని నేను అనుకోవటం లేదు ఎవరో పాడారు నాకు తెలియని వారు అన్నారాయన. అంటే ఇంటి ఇంట భగవద్గీత వాణి వినిపిస్తూనే ఉంటుంది అని మహాదాసి వచనం ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన పుట్టపర్తికి వచ్చారు. ఊహూ ఇది ఘంటసాల గారు చెప్పిందే నేను పుస్తకంలో కూడా రాశా. చరిత్ర బద్ధం చేశా. చేస్తే అప్పుడు స్వామి ఇట్లా నేను పెద్ద స్వామి వారిని కలిశాను భగవద్గీత అంటే పాడమన్నారు ఆయన కూడా శ్లోకాలు కొన్ని వినిపించారు. ఇంటి ఇంట కాదు బంగారం ఇంచ్ ఇంచ్ నా వినిపిస్తుంది. ఆహహహ ఇంచ్ ఇంచ్ వినిపిస్తుంది దీనితో నువ్వు శాశ్వతుడివి అయినావ్. అయితే ఆయన కూడా ఇప్పుడు మనం అనుకున్న అకర్తృత్వ భావంతో ఎన్నో సార్లు ఆయన పద్యాలు పాటలు విన్నప్పుడు నాకు కలిగే అనుభూతి ఏమిటంటే ఆయన తెచ్చుకున్న డిప్లొమాతో పాడారని నేను అనుకోవటంలే. ఊహూ అవన్నీ ఆయనకు తెలియకుండానే ఒక విస్ఫురణలోనే పాడేశారు. అంటే పాడిన వాడు ఎవరో ఉన్నారు. ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏడు శరీరాలు దాటిన తర్వాత ఎవడో ఉన్నాడంటారే వాడు కూడా వాడు అది నేను కాదుగా అంటున్నాడు. అది. విశ్వనాథ సత్యనారాయణ వారు అంటే ఇది గుర్తొస్తుందండి మీకు. కల్పవృక్షం రామాయణ కల్పవృక్షం చాలా అవును చాలా ఇష్టము చాలా బాగా మీరు చెప్తారన్న పేరు ఎలా అది దాని గురించి కాస్త వివరించండి రామాయణ కల్పవృక్షం. తెలుగు వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఒక సొత్తు ఘంటసాల గారి భగవద్గీత పోతన భాగవతం, విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం మూడు ఒక స్థాయి ఇక దాని జోలికి మనం వెళ్లకూడదు. విశ్వనాథవారు దాన్ని కావ్యంగా రాయలే. అది వాల్మీకిలో లేనివి చాలా రాశారు దాంట్లో. అవి ప్రమాణం మాత్రమే కాదు అద్భుతమైనటువంటి కల్పనలు కాబట్టి మళ్ళీ రాముడి కథ ఎందుకు రాశావు అంటే ఆయనే సమాధానం ఇచ్చారు "మరల ఇదేల రామాయణంబు అన్నచో ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమీ తినుచున్నదిన్నాళ్ళు" పద్యం చాలా ఫేమస్. అది ఆయన రాసిన వాటిలో ఆఖరిదా అండి లేకపోతే దాని తర్వాత మళ్ళీ రాశారా దాని తర్వాత చిన్న చిన్న నారాముడు అని రాశారు రాశారు మళ్ళీ నారాముడు కూడా అదొక అద్భుతమైన ఖండ కావ్యం లాగా రామాయణ కల్పవృక్షంలో ఉన్న రాముడికి ఒక సమగ్ర వ్యాఖ్యానం చేశారు సో ఎందుకంటే ఆయనకి వెయ్యి పడగలు ఇవన్నీ రాశాక రాశాకే రాసే ఒక థాట్ దీంతోకి వెళ్లాలని వెళ్ళాలి అని రామాయణం ఆయన రాయటం మొదలు పెట్టి మళ్ళీ ముప్పై మూడేళ్ళ గ్యాప్ మధ్యలో ముప్పై మూడేళ్ళ తర్వాత మళ్ళీ అందుకున్నారు అందుకనే he dictation ఇచ్చేశారు. మధ్యలో మొదలు పెట్టి ముప్పై మూడేళ్ళు గ్యాప్ ముప్పై మూడేళ్ళు మధ్యలో ఆపేశారు ఇక ఆయనకి ఇది రాసే సమయం రాలే రాలా ఊహూ అందుకనే ఆయన అంటాడు ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఒక చమత్కారం ఉంటుంది కల్పవృక్షం అంతా ఒక ఎత్తు ఆయన రామాయణ కల్పవృక్షం ఇవాళ యువత చదవాలి కంఠోపాఠం చేయాలి ధారణ పెరుగుతుంది. ఆయన మూడు ప్రమాణాలు ఉంటే రామాయణ కల్పవృక్షం చదవండి లేకపోతే చదవకపోయినా ఫర్వాలేదు అన్నాడు. అదేంటంటే "యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్" నీకు సంస్కృతము ఆంధ్రము బాగా వస్తే నా రామాయణ కల్పవృక్షం చదువు లేకపోతే ముట్టుకోకు ఇది ఒక కండిషన్ "సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్" నీకు అన్ని శాస్త్రాలు తెలిసుండాలి పై పైన కాదు వాటి రహస్యం తెలిసి ఉండాలి రెండూ లేవు "మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన" కొన్ని ఉదాత్త కల్పనలు చేశా అహల్య శాపవిమోచనం రామావతార ఘట్టం ఇవన్నీ కూడా అద్భుతంగా చేసుకుంటూ వెళ్లాను వాటియందు నీకు గనక ఆసక్తి ఉంటే చదువు "విశ్వనాథ శారద సకలార్థదాయినీ సురధ్రుగు రామకథం భజింపుమి" అంటూ ఒక శాసనం చేశాడాయన చేశారు చేసాడు ఇదంతా అయిపోయింది ఆయన చివరికి ఒకరోజున ఇప్పుడు హుయామై అన్న ప్రశ్న వస్తుంది కదా ఆయనకు కూడా వచ్చింది వచ్చింది నేనెవరు ఏమిటి ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏమిటి రామాయణం రాయటం ఏంటి? ఏదో అప్పుడు ఎప్పుడో రామాయణం మొదలు పెడుతూ "రామా! రాసినంత కాలం నాలో ఉండవయ్యా" అని అంటున్నానే రాయటం అయిపోయింది. దానికి ప్రప్రథమ జ్ఞానపీఠ పురస్కారం రావటం అయిపోయింది ఇంకా మరి రాముడు నానించి పోవడం ఏమిటి? అని ఒకరోజున ఆయనకు ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఏమయ్యా నా అంతట నేను రాసిననాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీల వెయ్యి పడగలు ఇరవై తొమ్మిది రోజుల్లో రాశాను. ఊహూహూ మీ రామాయణం నేను గుండెల్లో పెట్టుకుంటే నా ముప్పై ఐదేళ్ళు పట్టింది. అయ్యో సరే అదేదో అయిపోయింది కదా ఇంకా వెళ్ళలేదు ఏమిటంటూ ఇంకా నా నుంచి వెళ్ళలేదు ఏమిటి అని "ఆ రామాయణం అట్లు వ్రాసితిని నిత్యము ధ్యానించెదన్" "శ్రీరాముండన్నంతనే హృత్సీమ పొంగెత్తడున్ రామాయణం అట్లు పూర్తియైనన్ విడడ రాముడు ఆత్మారాముడై ఉండెను భయం బయ్యెడున్" ఆహాహా జీవ లక్షణం పోలే నాకు ఇంకా పోవడం ఏమిటి నా నుంచి ఇంకా లోపల ఉన్నాడా ఇంకా నేను చేయాలా ఆత్మారాముడైపోయాడు ఆత్మారాముడై ఉండెను భయం బయ్యెడున్ భయం జీవ లక్షణం అనంటూ ఇలాగే అనేకమైన ఒక్కొక్కసారి ఎంత ప్రతిభ ఉన్నా ఉపజ్ఞ ఉన్నా ప్రజ్ఞ ఉన్నా భాష మీద ఎంత అధికారం ఉన్నా ఒక్కొక్కసారి ఒక లైను పంక్తి సాగదు. బహుశా ఆయనకు experience ముప్పై మూడేళ్ళ experience కూడా add అవ్వాల్సి add అవ్వాల్సి- ఉంది లేకపోతే పరిపాకం చెందకపోతే ఆయన రాయలేరుగా రాయలేరు కానీఆ మళ్ళీ కాసేపు ఆలోచిస్తాను టకటక పంక్తి రాస్తాను రాముడై వ్రాసెను రాముడై వ్రాశాడా అని అంటూ అంతవరకు ఎవరైనా అంటారు స్వామికి తెలుగు వచ్చునా అది చమత్కారం చమత్కారం పడిపోయింది స్వామికి తెలుగు వచ్చునా మరి ఎక్కడో అయోధ్య లో పుట్టాడు నేనేమో రామాయణ కల్పవృక్ష పద్యాలను తెలుగులో వ్రాశాను రాముడు అంతా తెలుగులో మాట్లాడాడు ఇది వచ్చునా అని అంటూ దాని ప్రమాణం చెప్తాడు మనం అన్నం తింటామో భావం పుడుతుంది భావం కలుగుతుందో భాష పుడుతుంది భాష లోపల కలుగుతుందో అది అభివ్యక్తమవుతుంది కాబట్టి నేను అన్నం తిన్నానో నా రాముడికి రోజు అదే నేను నైవేద్యం ఇచ్చా కాబట్టి ఆయన వెరన్నం తిన్నాడు తెలుగునాట గాలి పీల్చాడు మా స్వామికి తెలుగు వచ్చు అది చమత్కారం సో ఇవన్నీ అద్భుతం అది మూర్తి గారు సో మీరు మీకు వయసు చదివారు మీరు నేను ఒకే ఒక్కసారి అంటే ఒకసారి అసలు సంపూర్ణంగా చదవలే అక్కడక్కడక్కడ చదువుకుంటూ వెళ్ళా ఆనందం కలిగింది కొన్ని కొన్ని అద్భుత పద్యాలు ఉన్నాయి ఇవి గనక చదివితే ధారణ ఒకటి భాష ఒకటి తెలుగు భాష సుసంపన్నమైనటువంటి ఒక అమృత కలశం మన చేతికి ఇచ్చాడు ఈయన దీన్ని ఇలా వదిలిపెట్టకూడదని ఎప్పుడు విరామ కాలం ఉంటే అప్పుడు చదువుతూ వెళ్ళా కానీ అది పూర్తిగా చదవలేకపోయినా కానీ ఇవి మీరన్నట్లు సత్సంగ ప్రవాహాలు సాగుతున్నప్పుడు ఒక సుమారు ఒక నూట యాభై మంది డాక్టరేట్స్ తెలుగులో దివాకర్ల వారి శిష్యులు ఇటువంటి వారంతా కూడా రామాయణ కల్పవృక్షం మీరు చెప్తే బాగుండును అని ఒక ఆలోచన కలిగినప్పుడు రాజమండ్రి లో శ్రీమద్రామాయణ కల్పవృక్ష సమారాధన డెబ్బై రెండు మంది పండితులతో వాళ్ళు చేసినప్పుడు ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళిన ఏకైక వ్యక్తిని నేనే నన్ను అసలు వాళ్ళు పండితులుగా గుర్తించలే అహల్యా ఖండాన్ని నేను చెప్పినప్పుడు ఆరోజు వాళ్ళు రాజమండ్రి లో పరమాద్భుతంగా ఇట్లా చెప్పాలి రామాయణ కల్పవృక్షం అని వాళ్ళు ఒక ఆమోద ముద్ర వేసుకున్నప్పుడు అదే నేను మన హైదరాబాద్ లో పద్నాలుగు నెలలు పూర్తి చేసినప్పుడు పూర్తి ఎప్పుడైందంటే ఇది ఆశ్చర్యం ఇది భగవదనుగ్రహం తెల్లవారితే శ్రీరామనవమి అనంగా రామాయణ కల్పవృక్షం పూర్తయింది దీనికి షెడ్యూల్ వేసిన వాళ్ళే లేరు ఇవాళ్టికి చెప్పాలి రోజుకి పూర్తి చేయాలి ఆలోచన లేదు కానీ జరిగిపోయింది కాబట్టి దాని intricacies లోకి వెళ్ళా ఊరికే రాముడి కథ అని కాకుండా రాముడి కథ తెలియని వాడు ఎవడు కానీ విశ్వనాథవారి దర్శనం ఏమిటి శ్రీరామ దర్శనం ఏమిటి essence అంతా గమనించినప్పుడు పాత్రల చిత్రీకరణ నేను సంపూర్ణంగా చాలా analytical mind తో చూసినప్పుడు ఒకే ఒక frame దానికి లోబడి ఆయన రాశారు అది మనిషి చెడ్డవాడు కాదు పరిస్థితులే చెడ్డవి అబ్బా అంతే మనం మనిషిని నిందిస్తాం పరిస్థితులను పట్టించుకోం అంటే రావణాసురుడికి కూడా పరిస్థితి ఉందంటారా అసలు శ్రీరాముడు అడుగుతాడు ఆంజనేయస్వామిని రావణ దర్శనం అయిందా అని అడుగుతాడు రాముడు రావణ దర్శనం అయితే ఎంత మంచి పదం ఎంత పదం అండి అది అంటే ఆంజనేయస్వామి మరి నవవ్యాకరణ పండితుడు ఎటువంటి జవాబు ఇచ్చాడంటే నీలాంజన పర్వతం కదిలి వచ్చినట్లున్నది స్వామి అన్నాడు అంజనం అంటే కాటుక చీకటి తామసం కదా అసురి భావంతో ఉన్నవాడు నీలం రంగు నీలాగానే నీలం రంగులో ఉన్నాడు వాడు నీలాంజన పర్వతం నీలవి నలుపు రెండు కలిసి blue black combination లో అటువంటి వాడిని నేను చూశాను అన్నాడు రంగు నీదే ఉన్నా నువ్వు పూర్ణ పురాణ పురుషోత్తముడివి అది కాస్త తామసం అది ఆంజనేయస్వామి ఇవన్నీ చణుకులన్నీ మనకి కల్పవృక్షం నిండా దొరుకుతాయి మీరు ఇందాక అహల్య కథ గురించి చెప్పానన్నారు అక్కడ అహల్య సంఘటన ఘటన చాలా వేరేగా చూస్తుంటారండి చాలా అసలు అంటే చాలా సినిమాల్లో కూడా దాన్ని చాలా ఒక కామెడీగా ఒక హేళనగా పూరైన అంశంగా అనిపిస్తుంది హేళన కాదు స్త్రీ జాతిని అవమానపరిచే రీతిగా రాశారు కళా స్వరూపాలన్నీ అలా ఆవిష్కరిస్తూ వస్తే విశ్వనాథవారి అహల్యాఖండం గనుక మీరు చదివితే మీ గుండె నిండిపోతుందండి కొద్దిగా మాకు చెప్పండి అహల్య గురించి ఉదాహరణ మేము ఎలా అర్థం చేసుకోవాలి చేసుకోవాలి పద్యాలు మీకు ఒక పద్యం వినిపిస్తా చాలా important పద్యం సరే ఇంద్రుడు రావటం గౌతమ మహర్షి కంట పడటము తెలియటము జరగటం నువ్వు రాయివైపో అని అన్నప్పుడు అహల్యాదేవి ఆమెను అడుగుతుంది నేను రాయిని అవుతాను సరే రాయిని అవుతాను గానీ నాలో ఉన్నటువంటి మోహం తీరుతుందా ఇది ఇంతటితో అయిపోతుందా మోహం తీరే మార్గం ఏంటో చెప్పు దాన్ని చెయ్యి అని నన్ను అడుగుతుంది అంటే శ్రీరామచంద్ర పద సంస్పర్శతో మళ్ళీ నువ్వు అహల్యవు అవుతావు ప్రతీకాత్మకంగా చెప్తాడు అయిన తర్వాత సరే మూడు ముగ్గురు ప్రధానమైనటువంటి స్త్రీమూర్తులు రాముడిని రాముడి జీవితంలో కళ్యాణ ఘట్టం వరకు తాటకి సంహారంతో రాముడిలో తామస సంహారం పూర్తయింది తామసం ఉంది రాముడిలో పురాణ పురుషోత్తముడైన పాంచభౌతిక దేహాన్ని తీసుకొని వచ్చాడు కనుక అలాగే అహల్య శాపవిమోచనంతో రాజసం పూర్తయిపోయింది సీతా కల్యాణంతో పూర్ణ సత్వపురుషుడు అయినాడు అంటే వివాహ వ్యవస్థకి అది పట్టం కట్టిన సందర్భం అక్కడ అహల్య వెళుతూ ఉంటాడు ముందు విశ్వామిత్రుడు వెనక రాముడు వెనక లక్ష్మణస్వామి వెళుతూ ఉన్నారు అనేక రాళ్ళు పడి ఉన్నాయి ఒక్క రాయియే ఉండదు కదా రాయి దగ్గరికి ఆయన వెళ్ళలేదుగా వెళుతూ ఉండగా ఒక రాతిలో నుంచి ఒక స్త్రీమూర్తి వచ్చింది సినిమాల్లో చూపించినంతగా రాలే దాన్ని విశ్వనాథవారి దర్శనంగా భావించాలి.ప్రభువు మేని పై గాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి ప్రాణమొచ్చే. అమ్మా! ముందు ప్రాణం వచ్చిందట. ప్రభువు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిల్లకు ఒక్కదానికి చెవులు కలిగే. ప్రభువు మేని మెత్తవి పరిమళించిన తోన హిస్వంబు ఘ్రాణేంద్రియమునందే. ప్రభువు నీలరత్న తోరణ మంజులాంగంబు కన్నంత రాతికి కనులు కలిగే. ప్రభువు వచ్చి ఆతిధ్యము స్వీకరించినంత ఉపలహృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి అగుచుతోచే. శ్రీరామ భద్రాభిరామమూర్తి అగుచుతోచే. రామమూర్తి అగుచుతోచే. భద్రాభిరామమూర్తి అగుచుతోచే. ఊ.. అంటే ఒక్కొక్కటి ఒక జడత్వంలో నుంచి చైతన్యం ఎలా ఆవిష్కరించింది? కాబట్టి అహల్యము కానీ నాగలి సోకని నేలకి అహల్య అహల్యంగా పడున్నది, అచేతనంగా ఉన్నది శ్రీరామ భగవద్దర్శనంతో చేతని ప్రకృతి పొందింది. ఊ.. అంటూ అహల్యాదేవిని ఆయన ఆవిష్కరిస్తాడు. గౌతమాశ్రమంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి రాముడు వెళ్ళాడు కదా. "ఏంటి ఇలా ఉన్నది? గౌతమ మహర్షి ఎలా ఉన్నాడు?" అని అడుగుతాడు. ఊ.. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు. రాముడు ఇప్పుడు వస్తున్నాడు కదా! గౌతముని ఎప్పుడు చూశాడు ఈయన? ఈయన నారాయణ స్మృతిలోకి వెళ్తున్నాడా? అవతార భంగం అయిపోతుందే! కనుక విస్మృతి కలిగించాలని హిమాచల సానువుల్లో దీర్ఘ తపస్సులో ఉన్నాడు ఆయన అంటాడు. ఊ.. "అవును యజ్ఞకుండాలు ఆగిపోయి ఉన్నాయేమిటి? ఎక్కడా కూడా కషాయ వస్త్రాలు అన్నీ కూడా కట్టబడి ఉండేవి రోజుల్లో. అవీ ఏం లేవేమిటి? ఊ.. చిలక వాలిన చిన్న లేదు" అంటాడు. చెట్టు మీద చెట్లన్నీ ఎండిపోయినాయి. అసలు చిలకే లేదేమిటి కనపడదే అంటాడు. చిలక వాలిన చిన్న లేదు. అందమైన పదాలివి. అంటే అప్పుడు అంటూ అంటూ ఉండగా అహల్యాదేవి చైతన్యం బయటకు వస్తుంది. వచ్చినప్పుడు మామూలుగా శాపవిమోచనం జరిగినప్పుడు ఆమె ఈయనకు నమస్కరించాలి. కానీ రాముడు ఆ.. రాముడు నమస్కరించాడు. ఊ.. ఆమె అహల్య స్తోత్రం అని ఏడు శ్లోకాలు పద్యాలు రాశారు విశ్వనాథవారు. ఊ.. ఏడు శ్లోకాలలో రాముడి జీవితంలో జరగబోయేటువంటి ఘట్టాలన్నింటినీ కూడా మంగళాశాసనం చేస్తుంది. ఊ.. ఎట్లాగంటే కల్యాణ రామ. వెంటనే అయిపోతుంది కల్యాణం. తర్వాత అసుర సంహార రామ. అరణ్యాల పాలవుతాడు ఆయన. పట్టాభిరామ జగదభిరామ అని ఏడు శ్లోకాలలో సప్త శ్లోకాలలో అహల్య దీవిస్తుంది రాముణ్ణి. ఊ.. రాముడు మనసంతా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. ఊ.. గుర్తు రాగానే అహల్య లాగా లేదు ఈమె కౌసల్య లాగా మా అమ్మ లాగా ఉందనుకుంటాడు. తల్లి నుంచి దూరమైన చిన్నతనం కదా! అవును కాబట్టి శ్రీమద్రామాయణ కల్పవృక్షం స్థూలంగా ఎలా చదవాలి అంటే వాల్మీకి రామాయణం అంతా కరుణ రసం అయినట్లయితే రామాయణ కల్పవృక్షం అంతా శాంత రస ప్రధానం. ఊ.. మీకు పాత్రలను చూసినా జాలి, సానుభూతి, కరుణ, వాత్సల్యం. అరే ఇట్లా ఉండి ఉండకుండా ఉంటే బాగుండేదేమో. సరే విధి కృతం ఇలా జరిగిందా అని మనం అతని పట్ల ఒక ఔదార్యాన్ని చూపిస్తాం. వీడు దుర్మార్గుడు, వీణ్ణి వెలివేయమనేటువంటి పరుష భాష మన నుంచి రాదు. భావం కూడా కలగదు. మీరన్నట్టుగా మనిషి మంచివాడే. పరిస్థితులు చెడ్డవి. పరిస్థితులు చెడ్డవే. పరిస్థితులు ఎప్పుడూ చెడ్డవే. ఊ.. పరిస్థితుల్లో నిలదొక్కుకున్న వాడు, ఎదుర్కున్న వాడు.. మనిషి వీరుడవుతున్నాడు. ఊ.. జయించిన వాడు విజేత అవుతున్నాడు. కానీ అధ్యాత్మ ఏం చెప్తుందంటే నేను మరొకరిని జయించినప్పుడు విజేతను కావటంలే. నన్ను నేను జయించుకోగలిగితే నేను విజేతనవుతా. ఊ..ఊ.. అది. కాబట్టి రామాయణ కల్పవృక్షం నిజానికి ఒక అధ్యాత్మ భూమిక అది. ఊ.. ఆయన మొదలు పెట్టడమే ఆత్మ నిత్యంబు కలాజవిచ్ఛిన్నంబు అపరిణామ ప్రాప్తంబు అప్రమేయంబు అది అచ్చ తెలివి అంటాడు. ఆత్మజ్ఞానానికి తెలుగులో ఆయన వాడిన పదం అచ్చ తెలివి. అచ్చ తెలివి. అబ్బా! ఎంత మంచి మంచి పదాలు. ఎంత మంచి పదాలు. అద్భుతమైన పదాలు. తెలుగు ఎంత బాగుందో. తెలుగు ఎంత అందం. ఆత్మజ్ఞానం ఆనంద.. బరువుగా ఉంది. బరువు, గంభీరం. ఇది మంది కాదు అచ్చ తెలివి. Wonderful
YouTube · audio

Cheppalani Undi | Part-3 | Medapati Ramalakshmi | Bharat Today

Home

Cheppalani Undi | Part-3 | Medapati Ramalakshmi | Bharat Today

Source: Bharat Today on YouTube

0:00 / 24:27

More in this series

Cheppalani Undi (with Medapati Ramalakshmi)

4 episodes · 1 hr 35 min

  1. 21 min 1

    Cheppalani Undi | Part-1 | Medapati Ramalakshmi | Bhaarat Today

  2. 21 min 1

    Cheppalani Undi | Medapati Ramalakshmi | Bharat Today

  3. 22 min 2

    Cheppalani Undi | Part-2 | Medapati Ramalakshmi | Bhaarat Today

  4. 22 min 3

    Cheppalani Undi | Part-3 | Medapati Ramalakshmi | Bharat Today

    Now playing