Skip to content
Transcript తెలుగు
నిజానికి ఉపదేశసారం అంతా కూడా భగవాన్ మానవాళి యందున్నటువంటి దయచేత సాధక బృందాలకి ఒక మార్గోపదేశనం చేయాలి గనుక ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠాన వేదాంతాన్ని ప్రతిపాదన చేస్తూ "దేహాత్మ భావన నుంచి విడిపడండి" స్థూలంగా ఇంతే ఆయన చెప్పింది. నేను, నాది అన్నటువంటి అహం మమత్వా శిథిలాయమాని ఎన్నోసార్లు అనుకున్నాం. అహం పోవాలి, మమకారం తగ్గాలి, నాది అన్నటువంటి భావన నశించిపోవాలి. మరి ఇవన్నీ అనిపిస్తున్నది ఎవరు? అని విచారణ చేసినట్లయితే మన మనస్సే. ఆనందానికి అదే కారణం అవుతున్నది. దేహం ఏమి అనుభవించటం లేదు. దేహం ద్వారా జరిగినటువంటి అనేక కార్యకలాపాల ద్వారా మనస్సు అనబడేటువంటి మన అహమే ఆనందిస్తున్నది. నిరాశ చెందినప్పుడు, ఓడిపోయినప్పుడు, వైఫల్యాన్ని చెందించుకున్నప్పుడు అహం వల్లనే మనం కృంగిపోతూ ఉన్నాం. కాబట్టి అహాన్ని నాశనం చేసుకోవటమే మనోనాశనం. మనోనాశనము అంటే మనస్సు లేకుండా పోవటం కాదు. కించిత్ మనస్సు కావాలి. ఇంతకు ముందే విచారణ చేశాం. మరి మనస్సుని ఏం చేయాలి? లయం చేయటం అంటే మరొక అర్థం లీనం చేయటము అని అర్థం. దాన్ని స్వస్థానానికి తీసుకొని వెళ్ళటం. దాని స్వస్థానం ఎక్కడ? హృదయమే దాని స్వస్థానం, అది చైతన్య స్థలి. చైతన్య స్థలికి భగవాన్ చెప్తున్నారు, "అనాహతం దాకా వచ్చావు కదా! బాగా చదువుకున్నావ్. వివేక విచక్షణలు రెండు ఏర్పడ్డాయి. రెండూ కలిపితే నిజానికి అది జ్ఞానం, అదొక స్ఫుర. ఇంకా ఏదో ప్రపంచానికి నువ్వు అందించాలని, బోధించాలని తాపత్రయం ఎందుకు? నీవు దేనిని పొందావు? దేనివలన నీవు స్వాత్మానంద రస సిద్ధుడివి అయినావు లేదా అవుతున్నావో, అయ్యే ప్రయత్నంలో విశుద్ధ ఆజ్ఞ సహస్రారాలను కాసేపు పక్కనబెట్టి హృదయంలోకి వెళ్ళవయ్యా. హృదయంలో నేను అన్నటువంటి నీ ఆత్మే జ్యోతిర్మయంగా వెలిగిపోతున్నది. వెలుగులోకి నువ్వు వెళ్ళాలి." అంటే పరమేశ్వరుడికి మనకి మనం ఒక అభేదాన్ని పెట్టుకోవాలి. పరమేశ్వరుడు మనకంటే భిన్నంగా లేడని మన శ్వాసగా, మన ఉచ్ఛ్వాసగా, నిశ్వాసగా, మన ప్రాణంగా, మన చైతన్యంగా, మన కదలికగా, మెదలికగా, మన యందున్నట్టి సర్వ వృత్తులు, సద్వృత్తులన్నీ కూడా వాటన్నిటికీ ఒక మూలంగా ఈశ్వరుడే ఆత్మగా ఉన్నాడు. ఈశ్వరుడు ఆత్మభిన్నం కాదు. అదే కదా విచారణ. అనేటువంటి ఒక స్ఫురకి మనం గనుక లోనైనట్లయితే అప్పుడు కలిగేటువంటి ఆనందం నిజానికి అది ఆనందం. దానిని మించిన పరమానంద బ్రహ్మానందాలు మరి వేరే ప్రత్యేకంగా లేవని చెప్తూ "నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రి లోకలోకాంతర ప్రాణముల్ పలు శ్రీదళములై విరియగ, రంగత్ సుధా భక్తి నేనానడుమ, యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రమ్ముగా, నేనే నీవై వెలిగిపోయేదము తంత్రీ నాద రమ్యాకృతిన్" ఇది ఒక అందమైన భావన. పరమేశ్వరా! నేను పువ్వైనట్లయితే నువ్వు తావి, నువ్వు పరిమళానివి. పరిమళం ఒక అద్భుతమైనటువంటి సువాసనగా అనిపిస్తున్నదే గాని కనిపించటం లేదు. పువ్వు కనిపిస్తున్నది, అది అనిపించటం లేదు. అనిపించనిది కనిపిస్తున్నది రెండూ ఒకటైతే అది నువ్వు నేను కాదా? నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రి. లోకలోకాంతర ప్రాణముల్, పైకినిపించే నాలుక, పెదవులు ఇవి కాదయ్యా. నా మనస్సు, నా బుద్ధి, నా చిత్, అహంకారాలు కాదయ్యా. ఆత్మ అనేది నా యందున్నది. అది పలు శ్రీదళములై విరియగ ప్రపంచాన్ని అష్టదళపద్మంగా భావించమన్నారు భగవాన్ రమణ మహర్షి. దానిని పూజనం చేయమన్నారు. అట్లాగే ఇది పలు శ్రీదళములై విరియగ, ఇక్కడ శ్రీ అంటే జ్ఞానము అని అర్థం. రంగత్ సుధా భక్తి నేనానడుమ, వెలిగిపోతున్నటువంటి భక్తి ఏదైతే ఉన్నదో యుగాంతర స్థిర మహానిర్మాణ సూత్రముగా అనేక జన్మలుగా నీవు నేను, నీవు నేను విడివిడిగా ఉన్నాం అనుకుంటూ అనుకుంటూ ఇక్కడికొచ్చి నేను నన్ను నేను పుష్పంగా భావించుకొని నిన్ను పరిమళంగా సంభావన చేస్తున్నాను. ఆఘ్రాణిస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను పరమేశ్వరా! అంతేకాదు నీవే నువ్వు పరిమళానివైనావు మరి నేనెవరిని? నువ్వు నేను ఎలా ఉందాం? ఒకటైపోదాం. తంత్రీ నాద రమ్యాకృతిన్, ఒక వీణ ఉన్నది. వీణకి తంత్రులున్నాయి. [గొంతు సవరించిన శబ్దం] మీటితే వైనీకుడి యొక్క ప్రజ్ఞ వలన నాదం వినిపిస్తున్నది. పరిపక్వం చెందనటువంటి వాడు వాయిస్తే నినాదం ఏర్పడుతున్నది, అపశృతి కలుగుతున్నది. సాధనా మార్గంలో పరమేశ్వరా! నేను తంత్రిణినైనట్లయితే నీవు నాదానివి. కనపడటంలే. అదిగో పరిమళంలా అనిపిస్తున్నదే ఇక్కడ కూడా వినిపిస్తున్నావ్.అక్కడ కనిపిస్తున్న దేహము అనిపిస్తున్నటువంటి పరిమళం ఒకటి ఎట్లా అయి ఉన్నాయో ఇక్కడ తంత్రిగా నేను కనబడుతున్నాను స్థూలంగా కానీ నాదంగా వినిపిస్తున్నాను. కనిపిస్తున్న వినిపిస్తున్న రెండు ఒకటి అయినట్లుగా ఒక వీణా నాదం ఎలాగైతే మోక్షమార్గం వైపు వీణా నాదం నడిపిస్తున్నదో, మోక్షము అంటే మోహ క్షయం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే మాట. మోహం అంటే నేను అన్నటువంటి భ్రాంతి దేహమే నేను అన్నటువంటి అజ్ఞానం దీనిని దాటి నేను దేహము మాత్రమే కాదని నేను ఆత్మ స్వరూపుడినని నిజానికి దివ్యాత్మ స్వరూపుడినని ప్రేమాత్మ స్వరూపుడినని ఎంతగా నన్ను నేను భావించుకుంటే నాకు అంత ఆనందం కదా. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ భగవాన్ సత్య సాయిబాబా వారు తమ ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో తొలి పధ్నాలుగు ఏళ్లు పక్కన పెడితే డెబ్బై రెండు ఏళ్లు నా భక్తులారా నా శిష్యులారా నా బిడ్డలారా అని పిలవలే దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా మీకు నాకు ఉన్నటువంటి బాంధవ్యం ఆత్మైకమే తప్ప దైహికం కాదు మానసికం కాదు. అని ఎట్లాగైతే కొన్ని trillions of people ని వారు సంబోధన చేశారో అంటే వారు దేనిని దర్శిస్తున్నారు మనలో అంటే మనలో ఉన్న ఆత్మని. నీ బాహ్యంతో నాకు పని లేదు నీ భావమే నాకు ప్రధానం అన్నటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఇటు భగవాన్ శ్రీ రమణ మహర్షి భిన్నంగా ఏం చెప్పటంలే. జీవుడు జగదీశ్వరుడు ఒక్కటే అనే భావనలో ఉండండి మీరదే మీకు తెలియటం లేదు. అజ్ఞానం చేత అహంకారం చేత అస్పష్టత చేత అనేక రకాల కారణాల వలన నిన్ను నీవు పాపిగా అల్పుడిగా భావించుకుంటున్నావు. పరమేశ్వరుడే నీ యందు సంస్థితమైనప్పుడు నీవు అల్పుడివి ఎట్లా అవుతావు అనల్పుడివి అవుతావు. నిన్ను మించినటువంటి మరొక యదార్థం మరొకటి లేదు. నీవు గుర్తుగా ఉన్నా నీవే సత్యం కనుక భేదభావాన్ని వదిలి పెట్టాలి అంటే విద్యా ప్రకాశం జరగాలి. విద్య విద్య కావాలి వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వము నందున వేరు చోట లేవు. illumination ఎక్కడ ఉన్నది అంటే మన యందే ఉన్నది. అది యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి నేను నేను అని ప్రకాశమానం చెందుతున్నటువంటి హృదయ కుహరంలో ఉన్నటువంటి శ్రీమయమైనటువంటి చరాచరమైనటువంటి వాంగ్మయమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి నేను వైపు నడవమంటున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అంటే పూర్ణద్వైత భావనలో గనుక మనం వెళ్ళకపోయినట్లయితే నీవు వేరు నేను వేరు అన్న భావనలో ఉన్నట్లయితే మనం ఎప్పుడూ కలిసే అవకాశం లేదు. కలవకపోతే యోగ ప్రాప్తి లేదు. యోగ ప్రాప్తి లేకపోతే యోగి అయ్యే అవకాశము లేదు. యోగి కాకపోతే ప్రపంచాన్ని నడిపే శక్తి ఏర్పడేది కాదు. క్రమ పరిణామ దశలో భేద భావం లేకుండా ఉండమని చెప్తూ ఇదిగో మనస్సునదే దాన్ని హృదయంలోకి తీసుకుని వెళ్లిపో.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -28

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -28

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:04

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

    Now playing
  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77