Skip to content
Transcript తెలుగు
భాగవతాన్ని సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి రేగు పళ్ళ తోటలో కూర్చొని వ్యాసుల వారు పరమానందాన్ని అనుభవిస్తూ భాగవత రచన చేశారు. ఇవాల్టికి కృష్ణ పరమాత్మని మనం లీలా వైభవాన్ని అనుభవించాలి అంటే భాగవతాన్ని చదవాలి. భాగవతం నిండా వైరాగ్య విభూతులున్నాయి. ఇప్పుడు అనుకున్న భక్తి ఉంది. భక్తుల పరమైనటువంటి కథంతా భాగవతమే. నిజానికి భాగవతంలో కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అప్పుడప్పుడు కనిపిస్తాడు. కానీ అంతఃసూత్రంగా ఉన్నాడు. అన్ని స్కంధాలలోనూ ఆక్రమించి ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క పరివ్యాప్త స్థితి మామూలు స్థితి కాదు. కానీ ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క dynamics లో ఇబ్బందులు పడ్డప్పుడు, అనేక dimensions ఏర్పడినప్పుడు, ప్రాపంచికమైనటువంటి లాలసలో పడి భగవంతుణ్ణి మరిచి కష్టాల పాలైనప్పుడు భగవంతుడు ఎట్లా వచ్చి మనల్ని రక్షించాడు, అంటే భాగవతుల్ని రక్షించాడు భాగవతం మనకు చెప్తుంది. అంటే ఏమవుతున్నది? భక్తుడు పరిదీనుడైనప్పుడు, తన దైహిక మానసిక శక్తులు రెండూ కోల్పోతున్నటువంటి వేళ భగవంతుడు తాను ఉన్నాను అన్నటువంటి ఒక అస్తిత్వాన్ని ప్రకటన చేయడానికి భాగవతుడి జీవితంలో ప్రవేశించి భాగవతుడి కష్టాలు తీర్చి, వాడికి ఆనందాన్ని కలిగించి లేదా యోగాన్ని ఇచ్చి లేదా కొన్ని చోట్ల భోగాన్ని కల్పించి ఆపై సాయుజ్య అనుగ్రహం చేసిన సందర్భాలు భాగవతం నిండా పరుచుకొని ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి రసాయనం alchemy అంటామే. మనస్సుని మార్ధవం చేసుకోవాలి. దానికి పల్లవించేటువంటి లక్షణం ఉంది. ప్రశాంతంగా ఉండగోరేది మనస్సే, ఉండనివ్వంది మళ్ళీ మనస్సే. ప్రశాంతంగా ఉంచుకోవాలన్న మనస్సును మనం పట్టుకుందాం. ఆందోళనాయుక్తమైనటువంటి మనస్సును నెమ్మదిగా సద్గ్రంథ పఠనం ద్వారా, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా, సాంప్రదాయకమైనటువంటి అనేకమైన సనాతన ధర్మాచరణాల ద్వారా మానవుడు తనను తాను విముక్తం చేసుకోవాలి. దేని నుంచి విముక్తం? ప్రాపంచిక దుఃఖం నుంచి, అననుకూలతల నుంచి, కష్టాల నుంచి, భోగం నుంచి, ఒక వైరుధ్యంతో కూడినటువంటి, అంటే ఏది ఎప్పుడు ఎట్లా మనకి దారి తీస్తుందో తెలియనటువంటి ప్రాపంచిక లౌకిక సంపద నుంచి మనస్సుని మరల్చాలి. మరి దేనిని వైభోగంగా స్వీకరించాలి? వైరాగ్యమే వైభోగం. అన్నీ ఉన్నా ఇదేదీ మనది కానట్లు ఉండాలి. ఏవీ లేకపోయినా మనకేం లోటు అన్నట్లు ఉండాలి. ఇది ఒక మానసికమైన సమస్థితి. ఇదంతా ప్రాపంచికమైన విషయం. ప్రహ్లాదుడు గాని, గజేంద్రుడు గాని, బలి చక్రవర్తి గాని మనకేం బోధిస్తున్నారు? పరమాత్మతో కూడి ఉన్నట్లయితే మహదానందాన్ని, మహదైశ్వర్యాన్ని మనం పొందవచ్చును అని. పరమేశ్వరుడే మన వాడైపోయిన తర్వాత మనకు కావలసింది కూడా నిజానికి ఏం లేదు ప్రపంచంలో. ఆయన వేరు మనం వేరు అనుకున్నంత సేపు ఆతనం తప్పదు. భగవంతుడా ఎక్కడున్నావ్ అని కేక పెడుతూ ఉంటాం, అరుస్తుంటాం, ఆందోళన పడతాం, రోదిస్తాం, ఎదురు చూస్తాం. భగవంతుడు ఎక్కడో లేడు. మన ఆలోచనల యందున్నాడు. దేవుడనగ వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు అంటారు భగవాన్ సత్యసాయి బాబా వారు. ఏం ఆలోచిస్తామో దాంట్లో భగవంతుడున్నాడు. నిజానికి బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్పిందంటే మనస్సు దయ్యం కాదు మనసు దైవం అని చెప్పింది. సరే, తర్వాత తర్వాత కాలంలో మనస్సు దయ్యం అని, అది భయంకరమైందని, వాడి వాడి పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి అన్వయించుకున్నాడు కానీ మనసే దైవం అన్నది. మనస్సంటే ఒక ఆట, అదొక క్రీడ, అదొక విన్యాసం, అదొక హేల, అదొక ఖేల. నిజానికి అది ఒక లీల. మనస్సును దివ్యలీలా తరంగిణి వైపు గనక మనం కాస్త మరల్చగలిగినట్లయితే, భగవదుపాసన చేస్తూ చేస్తూ చేస్తూ ముందు స్వరూప ధ్యానంలో సగుణోపాసన చేస్తూ బొమ్మని ఆధారం చేసుకొని బ్రహ్మం వైపు అడుగు వేయగలిగితే, చింత నుంచి చింతనలోకి వెళ్లగలిగినట్లయితే, చింతనా భూమికలో తాత్వికమైనటువంటి ఒక తృష్ణ పెరిగి ఇదేమిటి? ఇది ఎందుకు? అన్న రెండు ప్రశ్నలు మొదలై వాటన్నింటికంటే పరమోత్కృష్టమైనటువంటి భగవాన్ ఉపదేశించిన నేనెవరు అన్న ప్రశ్నలోకి మనస్సు సహజంగా ప్రవేశించాలి. ప్రవేశిస్తుంది. నేనెవరన్న ప్రశ్న మొదలు కాగానే ప్రాపంచిక బంధనాలు నెమ్మదిగా సడలిపోతాయి. ఒకానొక రోజున అవి మన నుంచి విడిపోతాయి. ఎప్పుడైతే ప్రపంచం పట్ల ఒక వికర్షణ లేదా ఒక దూరం పెరిగిందో దేనికి దగ్గర కావాలో దానికి దగ్గరవుతాం. దేనికి దగ్గర కావాలి అన్న ప్రశ్న దానికి జవాబు తర్వాత విచారణ చేద్దాం. ప్రపంచం ఇంత అందంగా, ఇంత ఆకర్షణావళయంగా, ఒక గొప్ప క్షేత్రంగా, అణుక్షేత్రంగా మనకు కనిపిస్తున్నదే ఆలోచనల నుంచి, వస్తువు నుంచి, అందం నుంచి, సౌందర్యం నుంచిబాహ్యమైనటువంటి దృష్టిని అంతర్ దృష్టి చేయటం అంత సులభమా? అని విచారణ చేసుకున్నట్లయితే బాహ్యం చేయటం మనకు ఎంత సులువుగా అలవాటైందో అంతర్ముఖం కావటం మొదలు పెడితే అది నిజానికి మరింత తేలిక. కారణం ఏంటంటే బయట ఒక్కొక్కసారి వస్తువు మనకు కావాలో మనకు తెలియదు. వస్తువు వలన మనకు నిజంగా ఆనందం కలుగుతుందో అది తెలియదు. చాలా వస్తువులున్నాయి. భిన్న భిన్నమైన రీతుల్లో ఉన్నాయి. రూపాలు వేరు, నామాలు వేరు, స్థితులు వేరు, గతులు వేరు, గుణాలు వేరు. వాటికున్నటువంటి స్వభావాలు వేరు, స్వరూపాలు వేరు. రకరకాలుగా భిన్న భిన్నంగా ఉన్నాయి. ఒక్కోసారి ఇవన్నీ మనకు కావాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మనకు ఏం కావాలో తెలియక ఏదో తెచ్చుకోపోయి ఇంకో దాన్ని తెచ్చుకుని యాతన పడిపోతాం. దీనికి కారణం ఏకం అనేకమైనటువంటి ప్రపంచంతో మన మనస్సు కూడి ఉండటమే. అనేకం ఎప్పుడైతే ఉన్నాయో ఆలోచనలు కూడా అనేక రీతుల సాగిపోతున్నాయి. కావాలి అన్న మూడు అక్షరాలు మూడు కోట్ల ఆలోచనలను పుట్టిస్తున్నది. మూడు కోట్ల ఆలోచనల నుంచి మూడు లక్షల వ్యాసంగాలు ఏర్పడుతున్నాయి. దానిలో నుంచి జీవుడు ప్రబుద్ధమాన స్థితికి వెళ్ళాలి అంటే నిజానికి చాలా కష్టం. కాళ్ళకి, చేతులకి తానే సంకెళ్ళు వేసుకుని తనకు ఏం కావాలో తెలియక అక్కరలేని దాన్ని తెచ్చుకుని కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక జీవుడు ఎవరో వచ్చి సంకెళ్ళు విప్పాలి అని కోరుకున్నట్లయితే వాడు విప్పినా మన మనస్సు దాని నుంచి బయట పడుతున్నదా అన్నది ప్రశ్న. కనుక బాహ్యమైనటువంటి వస్తువుల యందు మనస్సుని ఏకాగ్ర స్థితిలో నిలపటం చాలా చాలా కష్టం. ఎందుకంటే నీతో పాటు ఉన్నటువంటి ప్రతి వస్తువు నిజానికి నీవంటిదే. ప్రతిదీ ఒక unique గా ఉన్నది. నువ్వు ఎట్లాగో అవన్నీ అట్లాగే ఉన్నాయి. ఆకర్షణ అనేటువంటి ఒక భావనలో నుంచి మనం గనుక బయట పడకపోయినట్లయితే వికర్షణ వైపు మనం వెళ్ళలేం. అందుకనే భగవాన్ ఒక constant consistent uninterrupted thought కావాలి అన్నారు. అజ్యధారయా స్తోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం. సరళమైన చింతన చేయాలి. సూటిగా ఉండాలి ఏదైనా. స్పష్టంగా ఉండాలి. ఒక light wave లాగా ఉండాలి. కాంతి కిరణం, చూడండి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. అక్కడ నుంచి భూమి మీదకి సూర్యకిరణం తాకేదాకా అది వంకర టింకర పోవటం లేదు. ఎక్కడ మొదలైందో అక్కడ-ఎక్కడికి చేరుకోవాలో ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు ఒకే సూట్ అయినటువంటి మార్గంలో అది వస్తున్నది. అదే శబ్దం అట్లా ఉండటం లేదు. అలా ఉండదు. ఉంటే శబ్దం transmit కాదు. అది ఎలా ఉన్నది? transitional గా ఉన్నది, ఎత్తు పల్లాలుగా ఉన్నది. పెరుగుతున్నది తగ్గుతున్నది, పెరుగుతున్నది తగ్గుతున్నది కానీ అది కూడా కడగా మనం చెప్తున్నాం ఒక చోటుంటే వింటున్నవాడు ఇంకో చోటుంటే వాడికి అది అందుతున్నది. [గొంతు సవరించిన శబ్దం] కానీ దానికి time పడుతుంది. కాంతికి time లేదు. మనం కూడా గదిలో switch on చేయగానే వెంటనే light ఏర్పడిపోతుంది. uniform గా ఒక homogenous status లో మనకి కాంతి అంతా కూడా పరచుకుని ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి భావనలో నుంచి సరళ చింతనం చేయటానికి ఒకే వస్తువు మీద మనస్సును గనుక నిలబెట్టగలిగినట్లయితే స్వస్థితిని, స్వస్థతని రెండింటినీ పొందుతుంది.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -46

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -46

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:18

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

    Now playing
  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77