Skip to content
Transcript తెలుగు
నీలారవింద సహృదా సుదృశం ప్రసాదే తుల్యం తథా మహః శ్తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్త్యతోతు పితరం వటమూలవాసం సంస్మార యంతమచలం తమనుస్మరామి భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఆత్మానాత్మ విచారణలో సోహం వైపు నడిపించినటువంటి భగవాన్ మనల్ని నెమ్మదిగా ముందుముందు నేను దేహం కాదని దేహాత్మ విచారణ చేసి దేహం యొక్క పరిమితులన్నీ చెప్తూ అది శరీరమని అది క్షేత్రమని అది రథమని కడగా దేవాలయమని సనాతనమైన వైదికమైనటువంటి ధర్మ ప్రబోధం ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణ విచారణ చేసి దేహాత్మ భావన లో నుంచి కోహం నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న వేసుకోమని నేను ఎవరన్న ప్రశ్నలో నేను ఏది కాదో తెలుసుకోగలిగితే అది స్వస్వరూపానుసంధానమని దేహము కోహమై అంటే కోహానికి దారి తీసి కోహం నేను ఎవరు నాహం నేను ఇది మాత్రమే కాదు సోహం అది నేనై ఉన్నాను అనేటువంటి నాలుగు భావాలని పరమ ఉదారంగా భగవాన్ విచారణ చేస్తూ ఆత్మానాత్మ విచారణ ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి రూపం చేత వేషం చేత భావం చేత భావన చేత తత్వం చేత భిన్నభిన్నమైనటువంటి భావనా స్థితులతో జీవన సంచారం జరుగుతూ ఉన్నది గనుక వీటన్నింటినీ కూడా విచారణ చేస్తూ భగవాన్ చాలా స్పష్టంగా మనల్ని ఇంకొక మార్గం వైపు తీసుకు వెళుతూ ఆత్మానాత్మ విచారణలో ఆత్మ విచారణ కోసమై జ్ఞానం కావాలని జ్ఞానంలో నుంచి ఒక శుద్ధమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుందని శుద్ధ జ్ఞానంలో నుంచి పరిపూర్ణ జ్ఞానం ఏర్పడుతుంది అని పరిపూర్ణ జ్ఞానంలో నుంచి అచల ధ్యానం అచల జ్ఞానం ఏర్పడుతుందని ఇక కదలనట్టిది ఏదైతే ఉన్నదో అది ఆత్మే నని ఒక ఎరుక కలిగిన తర్వాత ఒక ఆత్మానుభవం కలుగుతుంది సర్వమూ నేనై ఉన్నాను నేను సర్వాత్మ యందు ఒక భాగాన్ని అనేటువంటి ఒక భిన్నమైనటువంటి భావనలో నుంచి అసలు ఉన్నదంతా నేను తప్ప నేను కాని మరొక వస్తువు లేదు అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మానుభూతి ని పరమ యోగ్యంగా భావన చేసినప్పుడు భావనా స్థితిలో జీవుడు తన సంచారాన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడ ఏదో తనను తాను ఎరగటానికి ఒక జ్ఞానం అనేది ప్రత్యేకంగా ఉంటుందా కావాలా అని అంటూ అటువంటి జ్ఞానం అంటూ లేదని జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానము దేహము ప్రాణము మనస్సు చిత్తము చైతన్యము ఇవన్నీ కూడా వెనుకబడిపోయి వీటన్నింటికీ మూలమైనటువంటి ఆత్మే ఆత్మనిష్ట గా మారి నేను ఆత్మను అన్నటువంటి ఒక నిశ్చలమైన మనీషతో ఒక భావనతో నెలకడి చెందుతుంది గనుక అటువంటి భావనా స్థితిలోకి వెళ్ళాలి అని చెప్తూ భగవాన్ మనల్ని ఆత్మ విచార మార్గంలో నాహం ఏది నేను అనుకుంటున్నాను ఏది నాది అనుకుంటున్నాను నేను అనబడే నేను తప్ప అన్యం లేదని ఇంతకాలం అజ్ఞానంలో కూరుకుపోయినాను ఇవన్నీ దాటి సమస్తమైనటువంటి ప్రకృతి చరాచర ప్రపంచంలో నేను కూడా అనాత్మనే అంటే దేహంగా ఉన్నటువంటి నేను అనాత్మనే ఆత్మ నేనై సర్వమై ఉన్నాను గనుక దేహం పోయినా నేను ఉంటాను నేను జారిపోయినా నేను నెలకడగా ఉంటాను గూడు చిన్నదైపోయినా జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక కవితామయమైనటువంటి భావనని భగవాన్ శ్రీ రమణ మహర్షి పరమోదారంగా మనకు చెప్తూ ఆత్మ విచార మార్గంలో ఒక ఆత్మానుభవాన్ని పొందిన తర్వాత ఇక జ్ఞానంతో పనిలేదు అని అంటూ భగవాన్ ని జీవితంలో అనేక ప్రశ్నలు వేశారు జ్ఞానికి ప్రారబ్ధాలు ఉంటాయా భగవాన్ అని అన్నప్పుడు వారు ఇచ్చిన సమాధానం లోకోత్తరమైన సమాధానం ఎందుకుండవ్ తనకు అక్కరలేని దేహాన్ని తాను మోస్తూ తిరగటం దానిని మించిన ప్రారబ్ధం ఉన్నదా భగవాన్ జ్ఞానికి కర్మలు ఉంటాయా ఎందుకుండవ్ అందరికంటే ఎక్కువ ఉంటాయి కానీ ఆతని ఆచరణలో పర్ఫెక్షన్ ఉంటుంది నిర్దుష్టంగా ఉంటుంది అకర్తృత్వం ఉంటుంది నేను చేస్తున్నానన్న భావన లేకుండా చేయబడతాయి కర్మలు కానీ వాహిక ద్వారా దేహం ద్వారా ఉపాధి ద్వారా కనుక జ్ఞానికి అందరికీ ఉన్నట్లే అన్నీ ఉంటాయి ఉన్నట్లుగా కనిపిస్తాయి కనిపిస్తున్నటువంటి వాటన్నింటినీ జ్ఞాని అయినటువంటి వాడు నిష్కామ కర్మగా చేస్తాడు దాన్ని సత్కర్మ లేదు వికర్మ లేదు కానీ అది అకర్మ గా చేస్తాడు చేస్తున్నానన్న భావనే ఉండదు జరగబడుతూ ఉంటాయి ఏవో జరుగుతూ ఉంటాయి సాక్షిభూతంగా ఉన్నాం ఎవరో పుట్టారు సంతోషం ఎవరో పోయారు ఏమీ లేదు అక్కడ సంతోషము లేదు ఇక్కడ విషాదము లేదు వచ్చిన వారి రాకని చూస్తూ ఉన్నారు వెళ్ళిన వారి పోకని చూస్తూ ఉన్నారు సాక్షిభూతంగా ఉన్నారు ఇది ఆత్మానుభూతి అరుణాచలంలో భక్తుడు వచ్చాడు ఎవరు వెళ్లారు ఎవరు ఉన్నారు అని విచారణ లేదు మీ అందరినీ నేను రమ్మన్నానా మీ అందరికీ నేను ఆహ్వానాలు పంపానా మీరందరూ వచ్చారు ఉన్నారు అలాగే మా శరీరం మీద ఒక రాచపుండు ఏర్పడింది వారు వచ్చారు ఉండనివ్వండి వారు వెళతారు వారిని వెళ్లిపో అనటానికి మాకు సంకల్పం చేయటానికి మా దగ్గర మనస్సు లేదే.అసలు మేమే లేమే, ఏమీ లేని మేము ఇవన్నీ ఎలా సంకల్పించగలం అన్నటువంటి శుద్ధ జ్ఞాన ఏకమూర్తి భగవాన్ శ్రీ రమణ మహర్షి. స్థితికి వెళ్ళాలి అంటే తీవ్రమైన సాధన చేయాలి. తీవ్రమైన సాధన అంటే ఉన్నవన్నీ వదిలిపెట్టి కాదు, ఉన్న వాటిలలో నుంచే, కర్మ క్షేత్రంలో నుంచే ధర్మ క్షేత్రాలు, కర్మ ధర్మ క్షేత్రాలలో నుంచే జ్ఞాన క్షేత్రాలు, జ్ఞాన క్షేత్రాలలో నుంచే అణు క్షేత్రాలు, అణు క్షేత్రాలలో నుంచే ఆత్మ క్షేత్రాలు ఆవిష్కరింపబడతాయి. దానికి ధ్యానము, యోగము అనేటువంటి రెండు ఉపాంగాలు. తెలియకుండా ఎకడమిక్ గా మాట్లాడుకోవటానికి ధ్యానం, మాట్లాడుకోవటానికి యోగం ఇవి ఏర్పడ్డాయే తప్ప, రెండూ కూడా సమసిపోయి జీవితంలో second nature అంటాం or real nature. దానినే భగవాన్ తమ భాషలో, తమ భావరలో సహజ స్థితి అన్నారు. సహజంగా ఉండటమే మిగతావన్నీ అసహజ స్థితులే. ప్రపంచంలో అనుభవాలు తక్కువ, అభినయాలు ఎక్కువ. ఆవేదనలో, రోదనలో కూడా అభినయమే తప్ప ఎక్కడున్నది? అజ్ఞాన పొరల్లో నుంచి, చీకట్లలో నుంచి చీల్చుకొని వచ్చినటువంటి భావావేశాలే తప్ప ఒక సంస్థితమైనటువంటి భావనా స్థితిలో జీవుడు, పరమేశ్వరుడు, జగత్తు ఒక్కటే అన్నటువంటి ఒక పరమాద్భుతమైన త్రిపుటి అది. చాలా అందమైనటువంటి త్రిపుటి. త్రిపుటి అంటే మూడు పెనవేసుకున్నట్టుగా మూడు దారాలు ఒక చిన్న తాడు అయినట్టుగా, త్రివేణి మూడు పాయలు ఒక జడ అయినట్టుగా ఒక బలమైనటువంటి వస్తువుగా ఏర్పడుతున్నప్పుడు అది ఆత్మే అవుతున్నది. ఆత్మానుభూతిని, ఆత్మానుభవాన్ని చందించుకున్నటువంటి జ్ఞాని నిశ్చలుడై ఉన్నాడు, నిర్మలుడై ఉన్నాడు, నిర్నిమేషుడై ఉన్నాడు. ఆత్మావలోకనంతో అంతరంగ యానంలో తనను తాను స్మరించుకుంటున్నాడు. తనను తాను చూసుకుంటూ ఉన్నాడు. అదీ దాటాడు. ఇక చూడబడవలసినటువంటి వస్తువే లేకుండా పోయింది. ద్రుక్కు లేదు, ద్రష్ట లేడు, దర్శనం లేదు. చూసే వస్తువు లేనప్పుడు దర్శనం లేదు. చూసేవాడే లేనప్పుడు వస్తువు లేదు, తత్-దాని తాలూకు దర్శనమూ లేదు. కాబట్టి చూడబడేవాడు, చూస్తున్నవాడు ఇద్దరుగా కనిపిస్తుంటే, చూస్తున్నవాడు నెమ్మదిగా ఆత్మానుభూతికి లోనైనప్పుడు తాను చూడటానికి మరొక వస్తువు ఏదీ లేదు. ఒకే పరమాత్మ అనేకంగా పరిచ్ఛన్నమైనట్లుగా, అనంత మహా చిచ్ఛక్తి సర్వాణువులుగా రూపాంతరీకరణం చెందినట్లుగా, విస్ఫోటనం జరిగినట్లుగా, సర్వాణువుల యందు పరమాత్మ యొక్క శక్తి దాగి ఉన్నట్లుగా, అనంతమైనటువంటి మహా సృష్టిలో ఆత్మ యొక్క potency, ఆత్మ యొక్క splendour, ఆత్మ యొక్క కాంతి, ఆత్మలో దాగిన చైతన్యం శక్తివంతంగా సర్వాణువుల యందు ఉన్నదని చెప్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారం ద్వారా జీవితాన్ని ఎట్లా అధ్యయనం చేయాలో, ఆత్మ విచార మార్గంలోకి ఎట్లా వెళ్లాలో, ప్రపంచంలో కనిపిస్తున్న అనేకానేక భిన్నభిన్న వస్తువుల యందు కూడా ఏకసూత్రమైనటువంటి ఆత్మని ఎలా పట్టుకోవాలో, ఆత్మ అంటే విచారం లేనిది, విచారణ లేనిది, చారణ లేనిది. దానికి సంచలనం లేదు, చలనం లేదు, కదలిక లేదు. నిజానికి తారణమే ముక్తి అదే ఆత్మ. ఆత్మ అంటే ముక్తి, ముక్తి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -75

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -75

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:08

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

    Now playing
  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77