No transcript for this section.
Transcript begins at 2:43.
రామానుజాచార్యుల వారి ప్రస్థానానికి సంబంధించి వారు నిర్దేశించిన మార్గానికి సంబంధించి and ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగిన ఈ భారతీయ సంస్కృతిలో వారు మనకు అందించినటువంటి ఆదర్శనీయమైనటువంటి ఆ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన విలువలని వెలుగుల్ని ఈ తరానికి తెలియజేసే ఒక కార్యక్రమంగా నేను నేషనలిస్ట్ హబ్ ద్వారా కొంతమంది ప్రముఖులతోటి ఆధ్యాత్మికవేత్తలతోటి and స్ఫూర్తి ప్రదాతలతోటి చర్చించే ఒక ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.ఎస్.ఆర్. మూర్తి గారి ఇంటికి వచ్చాము వారితో ఆ శ్రీమద్ రామానుజాచార్యుల వారి జీవిత విశేషాలకు సంబంధించి ఈ తరానికి ఎలా వారి జీవితం నుంచి స్ఫూర్తిని తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వి.ఎస్.ఆర్. మూర్తి గారు నమస్తే చర్చుకు స్వాగతం శ్రీమద్ రామానుజాచార్యుల వారి అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం భాగ్యనగరానికి అతి చేరువలోనే సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకునే ఒక వేడుక ప్రారంభమైపోయింది. ఇట్లాంటి సందర్భంలో అసలు రామానుజాచార్యుల వారి జీవితం గురించి మాట్లాడుకోవాలి అన్న చర్చించాలి అన్న ఈ తరానికి చాలామందికి అసలు తెలియదు వారి-వారి జీవితం గురించి కావచ్చు వారు ఏమేం అంశాల్ని వారు స్పృశించారు ఎలా ఈ జాతిని జాగృత పరిచారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే వారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏవి అసలు? కేవలం ఆధ్యాత్మికమా? సామాజికమా? ఇంకా ఏవైనా అంశాలు ఉన్నాయా? ఎలా? శ్రీమద్రామానుజాచార్యుల వారి సమతా మూర్తి విగ్రహావిష్కరణ సన్మంగళ వేళ వారి గురించిన కొన్ని విశేషాలు మనం మాట్లాడుకోవటం చాలా హర్షదాయకం కారణం ఏంటంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఒక మహాత్ముడు ఈ భారతదేశంలో ప్రధానంగా దక్షిణాపథంలో జన్మ ఎత్తి ఉమ్ సమతావాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అని వాదాలు మిత వాదాలు ఉన్నాయి అతి వాదాలు ఉన్నాయి కానీ ఒక సమతావాదాన్ని తొట్ట తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తి భగవద్ రామానుజులు వారిని మనం స్మరించుకుంటూ ఇక్కడ వారిది సామాజిక కోణమా లేక ఆధ్యాత్మిక కోణం అంటే సామాజిక పరమైన ఆధ్యాత్మిక కోణం ఉమ్ అంటే socio spiritual combination అన్నమాట ఓకే ఆ రెండింటిని సమన్వయం చేశారు దాన్ని విడివిడిగా ఆయన చూడలే ఉమ్ ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక భావానికి సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి ఒక అంశం ఉమ్ అంతే కదా! సమాజం actual ga practical కళ్ళ ముందు కనిపిస్తున్న manifest world ఉమ్ దీనిని మించిన రంగస్థలం మరి ఇంకొకటి లేదు ఎవరికీ కూడా అవతార మూర్తులకే లేదు జీవాత్మకే లేదు ఉహు ఉహు ఏదున్నా ఇహమేవా అన్నదిగా వేదం ఉమ్ అంటే ఇక్కడే ఇప్పుడే అంతే now and here అన్నది ఎంత అందంగా చెప్పిందో చూడండి ఉమ్ నువ్వు స్వర్గం అనంగానే కుడి చెయ్యి పైకి లేచి ఆకాశం వైపు చూపిస్తే ఆకాశం అంటే శూన్యం ఖగనం అక్కడ ఏం లేదు ఉమ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ అక్కడే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని సమన్వయం ఎలా చేయాలి ఎందుకు ఒక మనిషి సంఘర్షణకు లోనవుతున్నాడు ఈ నేపథ్యంలో వచ్చినటువంటి వారే రామానుజులు ఓకే ఇది ఆయన వచ్చినటువంటి ఒక నేపథ్యం అంతే అయితే ఆ నేపథ్యంలో ఆయన చుట్టూ పరుచుకున్నటువంటి భావజాలాలు చాలా మా ఏమంటామంటే అత్యంత ప్రాథమికమైనవి కాస్త రాతి యుగపు ఛాయలు ఉన్నటువంటి శాఖలు సంప్రదాయాలు ఉన్నాయి ఉహు మతం ఎక్కడి నుంచి పుట్టింది మనిషి మతిలో నుంచి పుట్టిందే మతం ఉమ్ ఆ మతం పది మందిని నడిపిస్తే అది రాచబాట అయిపోయి మతం ఒక రూపాన్ని దెద్దుకుంటుంది ఉమ్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలలో నుంచి పుట్టేది మతం ఉమ్ విస్తృత సమూహంలో నుంచి కాలాజ్య విచ్ఛిన్నమైనటువంటి ఒక భావజాలం ఘనీభవించిన ట్లయితే అది ధర్మం అబ్బా! అద్భుతంగా చెప్పారు. ఉమ్ కాబట్టి ధర్మానికి మతానికి ఎప్పుడూ ఘర్షణే ఉమ్ అంటే వ్యక్తి సమష్టితో పోట్లాడుతున్నాడు ఉమ్ సమష్టి వ్యక్తిని అంగీకరించటంలా ఓకే అంతే అంతే ఇది నిజమైనటువంటి యుద్ధం ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు వీరశైవం ఉంది ఉమ్ వీరవైష్ణవం ఉంది ఉమ్ చరిత్ర మనం చదువుకున్న ట్లయితే శైవులు వైష్ణవులు కత్తులు దూసుకున్నారు ఒకానొక సందర్భంలో సందర్భంలో ఉమ్ కత్తులు దూసుకోవటమే కాదు జంజాలు తెంపుకున్నారు ఉమ్ అంటే వాళ్ళు యోగపట్ట జంజ అంటే ఏంటి యోగపట్ట దాన్ని కూడా తెంపుకున్నారు ఆవేశం వల్ల ఆలోచనా రాహిత్యం వల్ల అనుభవ రాహిత్యం వల్ల కరడు కట్టిన అటువంటి ఆ monoism వల్ల వాళ్ళు మాకు శివుడే ఇష్టం అని ఒకరు అని ఒకరు ఉమ్ విష్ణువు తప్ప ఇంకొకడు లేడు అని రెండో వాడు ఇది కేవలం రామానుజుల వారి సమయంలో కాదు ఇది ప్రారంభమై పురుడుపోసుకున్నది త్రేతాయుగంలో లంక ఆ లంకా నగరంలో రావణబ్రహ్మ ఏమన్నాడండి శివుడు తప్ప ఇంకొకడు దేవుడు లేడు అన్నాడు హర నామమే తప్ప హరి నామం వినపడటానికి వీలు లేదన్నాడు కాబట్టి యజ్ఞాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఉమ్ అయితే శ్రీరామచంద్రుడు ఏ declaration ఇవ్వలే కృష్ణుడి లాగా ఉమ్ ఆయన మా సామాన్య మానవుడిగా ఉండదలుచుకున్నాడు వచ్చి అధర్మాన్ని అణచివేశాడు క్షాత్ర ధర్మంతో ధర్మసంస్థాపన చేశాడు ఎట్లా by demonstrating through his own life ఉమ్ correct రమణిని రాజ్యాన్ని అనుకూలాలని సుఖాలని యవ్వనాన్ని అన్నీ పోగొట్టుకునిఒక ఏకాత్మగా అరణ్య సంచారం చేస్తూ అరణ్యంలో ఉన్న తాపసులను రక్షించాడు. ధనుర్జునుడిని శిక్షించాడు. దాంతో ధర్మం నిలబడింది. ఏ ధర్మం నిలబడింది? సనాతన ధర్మం నిలబడింది. ఎప్పుడైతే సనాతన ధర్మం నిలబడిందో రామావతారం పూర్తయింది. కృష్ణావతారం వచ్చేప్పటికి పూర్తిగా మారిపోయింది. ఒక రావణబ్రహ్మకి బయట ప్రపంచానికి ఉన్న ఈ మత సంఘర్షణ నుంచి యుద్ధం ఇంట్లోకే వచ్చేసింది. కౌరవులు పాండవులు. అచ్చా అన్నదమ్ములు దాయాదులు కొట్టుకోవడం మొదలు పెట్టారు. మరి వీళ్ళని ఏం చేయాలి? అన్నప్పుడు తాను కూడా వారి మధ్యలో ఒక బాంధవ్యాన్ని పెంచుకొని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లతో ఉండి యుద్ధం దాకా జాతిని నడిపించి, జాతి అంటే రెండు వర్గాలను నడిపించి భగవద్గీత చెప్పి చెప్తూ చెప్తూ అక్కడ ఒక ప్రమాణం చేశాడు. ప్రమాణం కాదది రెవలేషన్. ఆ ఏమిటా రెవలేషను? యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మీరెవరూ నన్ను చేయలేరు. నన్ను నేను సృష్టించుకుంటా. ఇప్పటికి కూడా నేను వాడికి వాడిని నేను నాయకుడిని చేశాం అంటాం. మనం చేయం. They are all emergent individuals. సమాజం ఒక వ్యక్తి యందు ఆ శక్తిని ప్రవేశపెడుతుంది. ఆ వ్యక్తి ఒట్టి దుర్బలుడు మనలాంటి వాడే. ఒట్టి కట్టే. ఆ శక్తి అతని ఆ శక్తి అతని యందు ప్రవేశించి ఆయా దేశ కాల పరిస్థితులను సమన్వయం చేస్తుంది. గ్లాని అంటే మామూలుగా ఈ ప్రవచనకారులంతా కూడా ధర్మము నశించినప్పుడు అంటారు. గ్లాని అంటే నశించటం కాదు ఇంబ్యాలెన్స్. మ్ ఒకవైపు పెరిగి ఒకవైపు తగ్గినప్పుడు. తగ్గింది. రెండూ ఉన్నాయి అక్కడే. ఒకటి ఎక్కువైంది ఒకటి తగ్గిపోయింది. కాబట్టి ఈ పెరిగిన దాన్ని గనక తరిగితే రెండూ ఒక సమ స్థాయికి వస్తాయి. ఇది ఒకటి. రెండవది సమాజం ఎప్పుడూ హెటీరోజినస్ హోమోజినస్ కాదు. సమ సమాజ స్థాపనే మా లక్ష్యం అంటాం. అసలు అసమగ్రత, అసహజత సమాజం యొక్క మౌలిక ప్రాథమిక లక్షణం అది. ఈ రెండూ ఉంటేనే అంటే కలిగిన వాడు ఉంటేనే నలిగిన వాడు కాపాడబడతాడు. అందరూ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ relevance లేదు. కదా. అందరూ నలిగిన వాళ్ళు అయితే జాతి పురోగమించదు. కాబట్టి ఇద్దరూ ఉండాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇది ఈ నేపథ్యంలో సుమారుగా ఒక దానికి year seen అని చెప్పలేం గానీ మాములుగా వేదకాలం అనే మాట వాడుతుంటారు. వేదకాలం అనే మాట మనం వాడకూడదు. వేదం కాలాతీతం. మ్మ్ మ్మ్ దానికి ఈరా వేదకి ఈరా అంటూ ఏం లేదు. ఓకే ఓకే దాన్ని తీసేస్తాం. కాబట్టి ఈ వేదకాలంలోకి వచ్చేప్పటికి ఏమైంది అంటే భాగా అనేటువంటి ఒక శాఖ ఏర్పడింది భాగా. మ్ ఆ భాగా అంటే ఎవరంటే భా అంటే వెలుగు. మ్ గ అంటే జ్ఞానం. ఓకే వెలుగుతో కూడిన జ్ఞానం. జ్ఞానం చివరికి వెలుగే జ్ఞానమని జ్ఞానమే వెలుగని తెలుసుకోవటమే అద్వైతం. ఓకే ఇప్పుడు చూడండి ఆ పెద్దవారిని మనం సంస్కృత నాటకాల్లో గనక చదివినట్లయితే మహాభాగా అని address చేసేవారు. ఆ అంటే మహాత్మ అని మనకు అర్థమైంది. కానీ వాళ్ళు భాగ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఆ భాగ అంతా ఒక community గా ఏర్పడినప్పుడు వాళ్ళు భాగవతులు అయినారు. భాగవతోత్తములు భాగవతులు ఆ భాగవతులు అయినారు. ఈ భాగవతులు అందరికీ కూడా ఒక unmanifest god ఎవరో ఒక force కావాలి. మ్ కావాలి అన్నప్పుడు అవతారాలు ముగ్గురే కదా మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మకు అవతారం లేదు. ఆయన ఎంతో అవతారం తీసుకోలే. శివుడు పూర్ణావతారంగా రాలే. వచ్చాడు ఆయన కూడా వచ్చాడు దక్షిణామూర్తి స్కందుడు అయి అనేక రూపాల్లో వచ్చాడు. కానీ అంశావతారమై వచ్చాడు. కానీ శ్రీమహావిష్ణువు మనకు అందినంతవరకు దశావతారాలు అంటాం. కానీ నిజానికి నారాయణావతారాలు ఇరవై ఒకటి. మ్-హ్మ్ సనక సనందనాదులతో మొదలై ఓకే వాళ్ళందరి పని ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చారు. వచ్చారు పనిచేశారు వెళ్లిపోయినారు. వేదోద్ధరణ చేశారు లేకపోతే దీనజనోద్ధరణ చేశారు. ధర్మాన్ని రక్షించారు, అధర్మాన్ని అణిచారు వెళ్లిపోతున్నారు. ఆ కాలక్రమంలో వచ్చిన వారే? ఆహా కాలక్రమంలో వీళ్ళంతా వస్తే ఈ భాగవతులు ఏం చేశారంటే కంటికి కనిపిస్తున్నటువంటి ఇరవై యొక్క అవతారాలు అందులో ప్రధానంగా రామకృష్ణావతారాలు రెండు పూర్ణమాన అవతారాలుగా వచ్చాయి గనుక విష్ణువు మనకి దేవుడు అని నిర్ణయించుకున్నారు. మ్ మహావిష్ణువు అనండి విష్ణువు అనండి విష్ణువు మనకు దేవుడు. విష్ణువు అంటే ఆ శబ్దం ఏంటంటే సర్వవ్యాపకుడు. ఇవాళ omnipresent, omnipotent, omniscient అంతే కదా మూడు. అంతే కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉన్నది ఎవరు అంటే విష్ణువు. కాబట్టి ఈ భాగవతులు ఏం చేశారంటే విష్ణువుని దైవతగా ఆ అంగీకరించుకొని సమన్వయం చేసుకొని దానిలో నుంచి ఒక భావాన్ని సృష్టించారు. ఆ భావమే ఇజం అంటే పుట్టింది. దాని నుంచి జం అంటే పుట్టింది. మ్ విష్ణువు నుంచి పుట్టింది గనుక వైష్ణవం అయింది. ఆ వైష్ణవానికి ఏం చేశారంటే విష్ణు అవతారాలు మళ్ళీ ఉన్నాయి జగన్నాథుడు, వెంకటేశ్వరస్వామి, రాముడు, బలరాముడు వీళ్ళందరు ఉన్నారుగా. ఈ aspects అన్నీ తీసుకొచ్చి వైష్ణవిజం లో కలిపారు. మ్ కలుపుకున్నారు inclusiveness చేశారు. మ్ చేసి దానికి ఒక ప్రధానమైన పీఠిక ఏర్పరచుకున్నారు. ఆ పీఠం మీద ఇగో జాతి నడుస్తూ ఉన్నది. ఎవరిదో ఒకరు ఒకడికి ఆలోచన కలిగింది. శివుడంటూ ఒకడు ఉండంగా విష్ణువును ఎందుకు అంగీకరించాలి మనం అని. మళ్ళీ ఆ స్పర్ధ మొదలైంది. కానీ అప్పటికే అరవై ఏడు percent ఆనాటి population లో వైష్ణవులు ఉన్నారు.మిగతా అనేక మార్గీ అనుయాయులు ఉన్నారు ముఖ్యంగా ఈ కాలంలో ఒక వంద, నూట యాభై సంవత్సరాల క్రితం మహారాష్ట్ర దేశంలో ఆ విఠల సాంప్రదాయము, నాథ సాంప్రదాయం ఎట్లైతే వచ్చిందో. చూడండి నాథ సాంప్రదాయానికి చెందినవారు కనుకనే శిరిడిబాబాని సాయినాథుడు అంటారు నాథుడు అంటారు ఆ అంటే నాథుడు అంటే యజమాని అని కాదు నాథ సాంప్రదాయ వాదులు ఆయన్ని భగవంతుడిగా అంగీకరించారు. సాయినాథ శబ్దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. సరే keeping apart. ఇంతలోకి ఏమైందంటే ఈ ఆళ్వార్స్, నాయనార్స్ వాళ్ళు. ఆళ్వార్స్ యొక్క ప్రతిభ వెలిగిపోతున్నటువంటి ఆ సమయంలో జైనులు బౌద్ధులు కూడా విజృంభించారు. ముఖ్యంగా దక్షిణాపథంలో, ఇవాళ మంగళూరు ప్రాంతంలో ఉహు ధర్మస్థల, ఇటువంటి వాటిలలో ఓకే, ఓకే ఆ కాబట్టి జైన, బౌద్ధ మతాలలో ఏమైందంటే నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసన చేయటం మొదలు పెట్టారు. అసలు, అసలు విగ్రహాలు లేవు ఆకారమే లేదు ఆకారం లేదు. అసలు "ప్రతిమా ఈశ్వరః" అని వేదంలో ఓ మాట ఉంది కదా! నాకు బొమ్మ ఉంటే బొమ్మ ద్వారా నేను బ్రహ్మమును ఎరగాలి. ఓకే. అసలు ఆ, ఆకారమే అసలు ఆకారమే లేదన్నప్పుడు నేను I can't grow up in darkness. కరెక్ట్ చీకట్లో యుద్ధం చేయలేను. సొంత వెలుగు కావాలిగా! కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు రామానుజులు అనబడేటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి ఈ ప్రపంచంలోకి వచ్చి ఓ గురువుని ఆశ్రయించి తర్క మీమాంస వ్యాకరణాదులన్నీ తీవ్రంగా అధ్యయనం చేసి వాదనా పటిమలో తనను మించిన వాడు మరొకడు లేడు అనేటువంటి స్థాయికి చేరుకొని వాదం చేయటం మొదలు పెట్టాడు. ఓకే ఏమిటి establish చేశారు ఆయన అంటే, వైష్ణవ సాంప్రదాయం గాని, శైవ సాంప్రదాయం గాని విగ్రహారాధన అంతే కదా. వైష్ణవ సాంప్రదాయంలో అలంకారం ప్రధానం. అవును శైవ సాంప్రదాయంలో అభిషేకం ప్రధానం అభిషేకం ప్రధానం కాబట్టి అర్చన, అభిషేకము రెండూ కూడా rituals ఏ మరి జాతి spiritual ఎప్పుడు కావాలి అని ఉమ్ అర్చన ఎవరు చేయగలడు? ఓ మంత్రం తెలియాలి, ఓ శ్లోకం తెలియాలి, ఓ పాట తెలియాలి, ఓ మాట తెలియాలి, ఉచ్చారణ ఉండాలి, భాష తెలియాలి, వాఙ్మయ పరిచయం ఉండాలి, ఉన్నవాడే చేయగలడు అని నిర్ణయించుకొని ఇవి ఏవీ లేని వాళ్ళని ఎవరినీ లోపలికి రానివ్వల. వాళ్ళంతా దైవానికి బహుదూరంగా నిలకడ చెందారు. ఓకే లోపలికి రానివ్వల. నువ్వు బయట ఉండు లోపలికి రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు అన్నారు అంటే అది జాడ్యం కావచ్చు, మౌఢ్యం కావచ్చు కారణాలు ఏవైనా వాళ్ళని రానివ్వలే. వాళ్ళని రానివ్వలేదు అనుకున్నప్పుడు ఈ రామానుజుల వంటి ఒక శక్తి ఏమనుకున్నది అంటే, నేను ఒక్కడినే శక్తివంతుడిని అయితే ఏం ప్రయోజనం? ఉమ్ అందరూ శక్తివంతులు కావాలి కదా! దానికి నేనేం చేయగలను అని అనుకున్నారు. సరే వాళ్ళ గురువుగారు పీట ఏసీ కూర్చున్నారు ఎవరో వచ్చారు ఒక వాదన చేస్తున్నారు. సుదీర్ఘమైనటువంటి వాదన. తన వాదనా పటిమతో అవతల వాడిని తల్లడిల్లా చేస్తున్నాడు ఈయన. గురువుగారు చూశారు. ఏమిటి ఇతను నన్ను మించి చేస్తున్నాడే! చూశారా మనో బలహీనత. నన్ను మించిన శిష్యుడు ఉంటే ఉన్నాడే అని అనుకుంటే అతడు ఉత్తమ గురువు. కాదు కదా! అని "రామానుజ ఇకమీదట నువ్వు ఎవరితోనూ వాదన పెట్టుకోకు" అన్నారు. గురు ఆజ్ఞను పాటించారు. వాదిస్తున్న రామానుజులు ఠక్కున మౌన ముద్రలోకి వెళ్ళిపోయినారు. కానీ లోపల అలజడి. సమాజం తన చుట్టూ ఉన్న సమాజం అతలాకుతలం అయిపోతున్నది. privileged, underprivileged, deprived వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు. వీళ్ళకి ఏ ముగ్గురో, నలుగురో మార్గోపదేశనం చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక సమ స్థాయికి ఎలా తీసుకురావాలి అని ఒక ఆలోచన చేశారు. వైష్ణవిజాన్ని ఆయన గట్టిగా నమ్మారు. ఉమ్ నమ్మితే తన గురువుని, ఈ ఏది ఈ సంఘటన జరగటానికి ముందు పదిహేడు సార్లు అడిగారు. ఏదన్నా నాకు, ఆ రోజుల్లో దీక్షా గురువులు ఉంటారు మన గురువులు అనేకం కదా! సూచక గురువులు, మోచక గురువులు, వాచక గురువులు, మంత్ర గురువులు, దీక్షా గురువులు, నిషిద్ధ గురువులు, విహిత గురువులు, కారణ గురువులు. ఇంతమంది ఉంటారు aspects. అందులో ఈయన దీక్షా గురువు కాబట్టి ఓ మంత్రం చెప్పమని అడిగాడు. చెప్పలే. పదిహేడు సార్లు అయిపోయిన తర్వాత మంత్రం చెప్పాడు. చెప్పి "రామానుజ ఒక మాట. ఇది నువ్వు ఎవరికీ చెప్పడానికి వీల్లేదు." ప్రమాణం అష్టాక్షరి మంత్రం ఆ అష్టాక్షరి మంత్రం. ఉమ్ "నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఇది ఆ గురు ఆజ్ఞ" అప్పుడు ఆయన ఏం మాట్లాడలా. మంత్రం తీసుకున్నారు, ఇంతలో ఈ మౌనంలోకి వచ్చారు. ఏం చేయాలని లోపల మధన పడుతూ ఉన్నప్పుడు గురువుని వదిలిపెట్టాడు. భారతీయ అధ్యాత్మ మనకు ఏం బోధిస్తుందంటే ఆత్మోన్నతికి గనుక నీ గురువు అడ్డమైనట్లయితే గురువుని వదిలిపెట్టమని చెప్పింది. అబ్బా! ఉమ్ వమనావతార ఘట్టంలో విష్ణువు వస్తాడు. బలి చక్రవర్తి దానం ఇవ్వటానికి ready గా ఉన్నాడు. శుక్రాచార్యుడు వద్దంటున్నాడు. "ఒరేయ్! నీకింద్ర పదవి రాదు. వచ్చిన వాడే విష్ణువు. మూడు అడుగులు అంటున్నాడు. నీకు తెలియటంలా, అర్థం కావటంలా. నీ కులం, కులము, వంశము అన్నీ భ్రష్టు పట్టి పోతాయి" అని చెప్తే "అసలు ఏది కోరి నేను యజ్ఞం చేస్తున్నాను? ఆయనే నా వాకిట్లోకి వచ్చినప్పుడు నేను ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వను" అన్నాడు ఈయన. అంతే కదా అని శుక్రాచార్యుని పక్కకి నెట్టి, ఆత్మోన్నతి కోసం గురువు సహాయపడాలి తప్ప వెళ్తున్న వాడిని వెనక్కి లాగటం, నిరోధించటం చేయకూడదు. అప్పుడు గురువుని వదిలేయాలి. ఈయన గురువుని వదిలేశారు. గురువుని వదిలేశారు, వాదన వదిలేశారు. ఇక ఏం చేయాలి? ఈ నేర్చుకున్న, తెలుసుకున్న ఈ అనుభవం అంతా ఏం చేయాలి? ఇది సమాజహితం చేయాలి. సమాజహితం ఎందుకు చేయాలంటే, "यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीविजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।।" చిట్టచివరి శ్లోకం భగవద్గీతలో ఇదేఒక సర్వ సమర్ధుడు అయినటువంటి ఒక బోధకుడు ఆచార్యుడు యోగీశ్వరుడు అయినటువంటి ఆచార్యుడు సర్వ సన్నద్ధుడు సిద్ధుడు శుద్ధుడు అయినటువంటి అర్జునుడు వంటి ఒక సాధకుడు బోధకుడు సాధకుడు కలిస్తే దానిలో నుంచి వచ్చినటువంటి ఈ అమృతం ప్రపంచానికి సమాజానికి ఇవ్వాలి. దానివల్ల దృఢమైన నీతి ఏర్పడుతుంది ధర్మం నిలబడుతుంది అన్నాడు ఆరు వందల తొంబై తొమ్మిది శ్లోకాలు చర్చ విశ్లేషణ ఫలమేమిటయ్యా అంటే ఇది చివరి శ్లోకం చివరి శ్లోకం ఫలం ఆ చివరి శ్లోకాన్ని ఆ ద్వాపర యుగం అయిపోయింది కాబట్టి దీన్ని ఎవరు who will translate into action కదా He took over He took over అది beauty అద్భుతంగా చెప్పారు సార్ నిజంగా [చప్పట్లు] రామానుజాచార్యుల గురించి మరి ముందున్న పరిస్థితి గురించి ఒక విషయం అడుగుతాను సార్ మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక కోణంలో ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన శ్రీమద్రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం అన్నారు. ఆ తర్వాత మధ్వాచార్యుల వారు ద్వైతం అనే సిద్ధాంతం కూడా తీసుకొచ్చారు. ఈ అద్వైత విశిష్టాద్వైత ద్వైత సిద్ధాంతాలకు సంబంధించిన చర్చలు అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి అవి. ఒకవేళ మీరు ఇందాక వైష్ణవ సంప్రదాయం అన్నారు కదా సంప్రదాయ బద్ధంగా వచ్చిన కొన్ని నియమాలు నిబంధనలు వాటన్నింటిని పాటిస్తూనే వీళ్ళందరూ కోరుకున్నది ఒకటే సమతా అనేదే కోరుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆదిశంకరాచార్యులు కూడా సమాజాన్ని కొంత. అసలు ఆయన ప్రప్రథమ సమతా మూర్తి ప్రప్రథమ [నవ్వు] అవును చిన జీయర్ స్వామి వారు ఒక ప్రవచనంలో చెబుతూ ఒక మాట అన్నారు అది మీరు మీ ముందు కూడా అంటారు. అంటే ముప్పై రెండు సంవత్సరాల ఆ వయసులో వారు ఈ తన దేహాన్ని త్యజించాల్సి వచ్చింది శంకరాచార్యులు. శంకర భగవత్పాదుల వారు ముప్పై రెండు సంవత్సరాలు విశేషమైన కృషి చేసి ముళ్ళతో నిండిపోయిన వాటిని ఆ ముళ్ళు తీయగలిగారు తీశారు ఈ సమాజంలో అనేక వృగ్మతలు జాడ్యాలు అనేకం ఉంటే వాటిని తీశారు. అక్కడ రామానుజాచార్యుల వారు భవనాలు నిర్మాణ నిర్మించారు అనేది చిన జీయర్ స్వామి వారు చెప్పిన మాట. ఉమ్ అంటే కొనసాగింపు ఇదంతా అయితే గనుక ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలకు సంబంధించి ఈ తరానికి అర్థమయ్యే విధంగా ఏమైనా చెప్పగలుగుతారా? రామానుజాచార్యుల వారు చెప్పిన సిద్ధాంతానికి సంబంధించిన relevance ఈరోజు ఏంటి అసలు? దీంట్లో మూడు ఉన్నాయి. అందుకనే మనం వాళ్ళని ఏమంటాం అంటే త్రిమతాచార్యులు అంటాం. అవును త్రిమతాచార్యులు అంతే కదా! మతం అంటే ఇందాక అనుకున్నట్లు మార్గం అదొక భావం భావం మధ్వాచార్యుల వారు మధ్యేవాది ఉమ్ మధ్యేవాది ఆయన ఏమన్నారంటే హరి సర్వోత్తమ వాయు సర్వోత్తమ అని క్లోజ్ చేశారు ఆయన. హరి అంటే ప్రాణం ఉహు హరి అంటే చైతన్యం ఉమ్ సర్వోత్తమమైనది దేహమే మన ప్రపంచం కదా! ఈ ప్రపంచంలో సర్వోత్తమమైన వస్తువు ఏది అంటే చైతన్యమే సర్వోత్తమమైనది గనుక హరి సర్వ-- ఇక్కడ హరి అంటే విష్ణు అని కాదు ఉమ్ హరి సర్వోత్తమ వాయు సర్వోత్తమ మన ప్రాణం అంటే ఏమిటి వాయువు మన ఆయువే మన వాయువు అంతే కదా! గాలి కూడా కాదు అది తిరుగుతుంది దేహంలో దాన్నే మనం life అంటున్నాం ఇంకోటి అంటున్నాం చైతన్యం అంటున్నాం fluid అంటున్నాం current అంటున్నాం. ఏదున్నా ఆయన చెప్పింది ఏంటంటే ద్వైతం దేవుడున్నాడు జీవుడున్నాడు. ఉమ్ జీవుడు ప్రత్యేకం దేవుడు ప్రత్యేకం ఉమ్ ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధిస్తూ జీవుడు తన జీవయాత్ర సాగించాలి అది మధ్వాచార్యుల వారి పరిమళం కరెక్ట్ శంకర భగవత్పాదులు అద్వైతం అనేది అది సిద్ధాంతమూ కాదు ఉహు అది మతమూ కాదు ఉమ్ మరి ఏమిటి అంటే ఒక మనీష ఒక conviction భావన ఒక స్థిర భావన ఓకే ఉమ్ ఏదన్నా అటూ ఇటూ కదలడానికి వీల్లేదు ఉమ్ అయితే ఈ స్థిర భావనని ఆయన ఎప్పుడన్నా experience చేశారా? మనీషా పంచకం చదివితే మనకు అర్థమవుతుంది. ఉహు ఇప్పుడు ఆయన సమతావాదంలో తొలి అడుగు వేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. ఉమ్ ఆయన కాశీలో గంగా స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు ఒక చండాలుడు ఎదురైనప్పుడు తొలుగు తొలుగు అన్నారు ఉమ్ ఆ వచ్చిన చండాల రూపంలో ఉన్నటువంటి ఆయన ఏమన్నారంటే "నీది నాది మానవ దేహమే. నీలో ఏముందో నాలో నాలో ఏముందో నీలో ఉన్నప్పుడు దేనిని నువ్వు తలగమంటున్నావు" అని అన్నప్పుడు ఆయన జ్ఞానాధీశుడు కాబట్టి ఎవరు భగవత్పాదులు ఈ వచ్చింది చండాల రూపంలో వచ్చినటువంటి సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడైన పరశివుడు అని నమస్కరించారు. అప్పుడు మనీషా పంచకం చదివారు ఐదు శ్లోకాలు అవి. ఆ ఏది చండాలుస్తవిద్విజోస్తు అని వాడు చండాలుడైనా సర్వోత్తముడైన బ్రాహ్మణుడైనా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ ఉంటారో ఆతడిని నేను గురువుగా భావించి నమస్కరిస్తున్నాను. మనీషా మమ ఇట్ ఇస్ మై గ్రేట్ conviction అని ఆయన వరల్డ్ కి చెప్పేశారు. పర్ఫెక్ట్ అంటే జాతి మత వర్గాలకి అతీతమైనటువంటి భావనా భూమికని ప్రపంచానికి తొట్ట తొలిసారి పరిచయం చేసినటువంటి వారు భగవత్పాదులు. ఆయన వచ్చిన పని వేరు. ఆయన వచ్చిన పని సమాజ ఉద్ధరణ అయిన పని కాదు. ఉహు సమాజంలో నిరీశ్వరవాదం బౌద్ధం వలన నిరీశ్వరవాదం ఏర్పడినప్పుడు దేవాలయాలు మూతబడిపోయినప్పుడు వైదిక క్రతువులన్నీ వెనకబడిపోయినప్పుడు మానవుడు అధర్మ వర్తనుడు అయినప్పుడు దీనిని మళ్ళీ మొట్ ఒక్కసారిగా వెనక్కి ఎలా తిప్పాలి? దానికి ఆయనకున్న సమయం సరిపోయింది. ఓకే మృతులు గీతాలు స్తుతులు వ్రాయవలసిన మహా అది సరస్వతీ స్వరూపం అంతే ఆ ప్రవాహం అది కాబట్టి అన్నీ ఈవేళ మనం ఏ శ్లోకం పాడినా ఆ ఏ భావన చెప్పినా అది అందులో అది దానిలో నుంచి వచ్చిందే తప్ప మనం చెప్పగలిగింది ప్రత్యేకించి చెప్పగలిగినది ఏమీ లేదు. మనం కేవలం వ్యాఖ్యాతలం మాత్రమే కరెక్టే కానీ మూలం ఎవరు అంటే భగవత్పాదులు ఉమ్ ఆయన దానికి ఏం చెప్పారంటే అద్వైతం అంటే మామూలు అర్థం fundamental గా రెండు లేవండి అంటారు భగవత్పాదుల భావన అది కాదు. ఉమ్ రెండు లేవు కాదు ఉన్నది ఒకటి రెండు అనే పదం కూడా నువ్వు వాడొద్దు అన్నారుదేహో దేవాలయ ప్రోక్తో దేవజీవః సనాతనః. ఈ దేహం దేవాలయం అయితే జీవుడు దేవుడు సనాతనలై ఉన్నారన్నాడు ఆయన. Okay దేవుడు అనేది మనం సృష్టించుకున్న ఒక ఆకారం ఒక భావన మూర్తి మత్వాన్ని ఇచ్చాం. కానీ జీవుడు ఉన్నాడు virtuallyగా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు నేనున్నాను మీరున్నారు వీరున్నారు అందరూ ఉన్నాం. కానీ వీళ్ళందరి యందు ఉన్నటువంటి చైతన్యం ఒకటేగా. ఆ చైతన్యానికి అధ్యాత్మలో ఆత్మ అని పేరు పెట్టుకున్నాం గా కానీ వండి. ఈ ఆత్మల అన్నింటినీ సమన్వయం చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఉన్నాడు. ఆ ఉన్నాడు లేదా ఉన్నది ఏదన్నా చెప్పినా అది రమణ మహర్షి దాన్నే కర్త అని చెప్పి వదిలేశారు. [నవ్వు] correct దేవుడు దేవత అనలేదు ఆయన throughout his life ఈ సాంప్రదాయం వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల అద్వైతం ఏమిటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంతే it is differently told by the wise Wise Not unwise wise వాడు దానికి చెప్పాడంటే ఒక ప్రమాణం ఉండాలి. వాడికి ఒక శక్తి ఉండాలి. అంతే కాదు శాస్త్ర పరిచయం it is only విజ్ఞానం intellectual interpretation is only విజ్ఞాన but not జ్ఞాన. జ్ఞానికి సమదృష్టి ఉంటుంది. ఉమ్ అంతే కదా! పండితాః సమదృష్టి ఉన్నటువంటి వాడు పండితుడు. పండిన వాడు జ్ఞానంతో పండిన వాడు పండితుడు. అంతేగాని బీలిట్టు డీలిట్టు కాదు. ఉమ్ correct కాబట్టి ఇవన్నీ ఏర్పడినటువంటి సందర్భంలో మరి అద్వైతాన్ని value addition ఇచ్చారా? ఆ Expand చేశారా? అది చాలలేదా? ఎందుకని విశిష్టాద్వైతం అనేది ప్రచారంలోకి వచ్చింది వైష్ణవిసం లో నుంచి పుట్టింది. ఉమ్ చూడండి శంకర భగవత్పాదులది వైష్ణవిసం ఒకటే కాదు అది స్మార్తం. శివాలయాలకు వెళ్లారు శ్రీచక్ర జే పూజ చేశారు శక్తి పీఠాలు పెట్టారు అన్ని చేశారు. ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చేప్పటికీ విష్ణువు ఆలంబనగా మొత్తం భావజాలం పుట్టుకొచ్చింది. ఉమ్ ఇక్కడ విశిష్ట అద్వైతం ఇది కూడా అద్వైతమే విశిష్ట ద్వైతం కాదు విశిష్ట అద్వైతం ఉమ్ Supreme ఆ non dualism అంతే కదా. ఆ ఈ supreme non dualism లో ఏంటంటే జీవుడు దేవుడు ఒకటే అని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తే దానికి అనుగుణంగా మళ్ళీ దేవాలయాలు ప్రారంభం అయితే పునః రామానుజుల వారు వచ్చిన సమయంలో అనేక వర్గాలు చదువుకు దూరమైనాయి. అసలు లౌకిక విద్య శూన్యం ఉహు ఒక రాతి యుగనాటి మనుషుల వలె ఒక ప్రవర్తన. అదే సమాజంలో ఒక five percent శక్తి ఉన్నటువంటి వాడు బలాఢ్యుడైనాడు. అది విద్యా అహంకారం కావచ్చు, దాన అహంకారం కావచ్చు, ఉమ్ రణాహంకారం కావచ్చు. అంటే వాడికి ఏ faculty strong గా ఉంటే వాడు మిగతా సమాజం మీద కర్ర పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. Okay అచ్చ తెలుగులో. ఆ కర్ర విరగ్గొట్టాలి. విరగ్గొట్టాలి అంటే ఏం చేయాలంటే ఈ ఐదుగురిని వాళ్ళు, వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళని పక్కన పెడదాం. ఈ మిగతా ninety five కి మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన పుట్టినప్పుడు తన భావంలో నుంచి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా వారు గ్రహించి ఈ విశిష్టాద్వైతం అనేదానికి ఒక అంతఃసూత్రం. కానీ దురదృష్టం వైష్ణవులై ఈ మాట చెప్పటం లేదు I am very sorry to use this. ఏమిటంటే ఆయన ఏమన్నారంటే అసలు వైష్ణవిసం అంటే ఏమిటి? అది కూడా మనం తెలుసుకోవాలి వేళ. ఉమ్ విష్ణువుని పూజించడమే వైష్ణవిసం కాదండి. విష్ణు పరమైన భావాలు ఆ deities మాత్రమే కాదు. ఇందాక అనుకున్నాం local, non local deities అన్నింటినీ కూడా ఆ కలుపుకున్నందువలన వైష్ణవిసం అనేది వచ్చింది. వైష్ణవిసం అంటే ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా note చేసుకొని ఆలోచించవలసిన point. జాగ్రదవస్థలోనే ఉమ్ తురీయాన్ని అనుభవించగలగటమే వైష్ణవము అన్నాడాయన. తురీయాన్ని అంటే అదే చెప్తున్నా ఆ జాగ్రదవస్థలో మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఉన్నాం నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉమ్ లేదా నాకు శివుడు అంటే ఇష్టం లేకపోతే నాకు ఒక నల్లపోచమ్మ ఇష్టం. ఆ లేదా ఇంకెవరో ఇష్టం గ్రామదేవతలు ఇష్టం. ఆ ఇష్టం ఏమైపోయింది అంటే నన్ను అక్కడ ఒక బంధనకు గురి చేసేసింది. నామ రూప భావాలతో నేను అక్కడ ఆగిపోయినా. ఇంకోటి అంగీకరించేటువంటి స్థితిలో నేను లేను. ఉమ్ అంటే నా mind ఏమైంది అంటే fossilize అయిపోయింది. ఉమ్ అది ఇక మళ్ళీ వెనక్కి రాదు condition అయిపోయింది. conditioned mind ని unconditioned చేయాలి విస్తృతం చేయాలి. ఈ విస్తృతం చేయటానికి ఈ జాగ్రదవస్థ అంటే ఇప్పుడు మనం ఈ మాట్లాడుకుంటున్న ఈ అవస్థ అంతా జాగ్రదవస్థ కదా. దీనిలో మనం తురీయంలో లేము తురీయంలో ఎక్కడున్నాం మాట్లాడుకోవాలి గనుక విషయాలన్నీ కూడా స్పష్టంగా clarity తో అధికార ముద్రతో మాట్లాడుకోవాలి మీరు అడగాలి ఇది జాగ్రదవస్థ. ఉమ్ ఈ జాగ్రదవస్థలో ఉంటూనే తురీయము అంటే ultimate. ఇక ఆ దాన్ని మించి ఇంకా జాగ్రదవస్థ అంటే ఏమిటి? ఇదిగో మేలుకున్నది మేలుకున్నది తర్వాత స్వప్నావస్థ ఉమ్ మూడవది సుషుప్తి. ఈ మూడు మనం అనుభవిస్తాం. ఇప్పుడు మేలుకొని ఉన్నాం జాగ్రదవస్థ. పోయి నిద్రపోయాం స్వప్నావస్థ లేదా నిద్రావస్థ. నిద్రలో నుంచి మళ్ళీ జాగృతమయ్యేటువంటి ఆ time లో తెల తెల వారేటువంటి వేళ సుషుప్తిలో ఉన్నాం. ఈ మూడు అవస్థలను దాటి, ఈ మూడు అవస్థలలో అవస్థలన్నీ ఉన్నాయి. [నవ్వు] సమస్యలన్నీ సమస్యలన్నీ ఉన్నాయి. Okay వీటన్నింటికీ అతీతమైనటువంటి ఒక భావనా స్థితి ఏదైతే ఉన్నదో దానికి తురీయము అంటాం. సన్యాసులందరూ తురీయాశ్రమానికి చెందిన వారిగా ఈ జాతి గౌరవిస్తుంది. ఉమ్ కాశాయం కట్టినవాడు, దండం ధరించినవాడు, నలుగురికి బోధ చేసేవాడు వీటన్నిటికి అతీతమైన అతీతమై తన యందు తనతో తాను రమించటమేతనతో తాను కూడి ఉండటమే అది ధ్యానాన్ని యోగాన్ని దాటినటువంటి తురీయమైనటువంటి ఒక అవస్థ. అది కూడా ఒక అవస్థ. అక్కడ ఏముంటుందంటే inactivity is a perfect action there. inactivity ఏం ఉండదు మనం చేసే ఈ మాట్లాడుకోవటాలు పుస్తకాలు రాయటాలు ప్రవచనం ఏం ఉండదు కానీ perfect action ఏమిటంటే the alignment with the పరమాత్మ. ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యేటువంటి వేళలు ఆ స్థితి. కాబట్టి అటువంటి స్థితిని గనుక ఎవడైనా జాగ్రదవస్థలో అనుభవించగలిగితే ఆతడు మాత్రమే వైష్ణవుడు అని ఒక నిర్ణయం అయిపోయింది. ఆ హ్మ్ ఇవ్వేళ ఏమైందండి? ఎక్కడున్నాం మనం అసలు? అయితే రామానుజుల వారు ఈ point చెప్పకుండా మీరందరూ సన్యాసించండి అనలేదు మీరందరూ తురీయంలో ఉండండి అనలేదు ఏ పని చేసినా తురీయావస్థలో చేద్దాం అన్నారాయన. అంటే selflessness. Okay నాకిది కావాలి అని గాని ఇది నాది అని గాని నాకు మాత్రమే ఇది చెందాలని కాకుండా సర్వజనులకు బహుజనులకు ఇది చెందాలి. ఆ బహుజనులలో ఆ రోజులలో వెనుకబడినటువంటి వర్గాలు అణగారిన వర్గాలు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళందరికీ స్తోత్రాలు మంత్రాలు మంత్రదీక్షలు జపమాలలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం? వాళ్ళకేం తెలియదు కదా. నా గురువు నాకు ఒక మంత్రం ఇచ్చాడు. ఉమ్ ఈ మంత్రాన్ని నేను ప్రపంచానికి ఇచ్చేస్తా అన్నాడు. అయితే ఆయనొక rule పాటించారు. గురువు దగ్గరికి వెళ్ళి నేను ఈ మంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చేస్తున్నా అన్నారు. నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అన్నాడాయన. నేను ఇస్తాను అన్నాడు. నీకు ఇచ్చిన నాడే చెప్పా కదా అన్నాడు. అప్పుడు చెప్పారు అప్పుడు నేను తీసుకున్నా ఇప్పుడు నాకు అది ప్రపంచానికి ఇవ్వాలని అనిపిస్తున్నది ఏంటే. నరకానికి పోతావు జాగ్రత్త అని హెచ్చరించాడు గురువు. నేను ఈ మంత్రాన్ని ప్రపంచానికి ఇస్తే కొన్ని కోట్ల మంది గనుక స్వర్గద్వారం తెరుచుకొని వెళుతూ ఉంటే అది నాకు కలిగించే ఆనందం పరమానందం. ఉమ్ ఈ కారణంగా నేను ఒక్కడినే నరకానికి వెళ్ళవలసి వస్తే నేను సర్వసన్నద్ధంగా ఉన్నాను. I will enter the presence of hell. It is my resolve అన్నాడు. అని నమో నారాయణాయ మంత్రం అష్టాక్షరి మంత్రం ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పాడు. చేతులు రెండు బాహువులు అనంత ఆకాశంలోకి చూస్తూ నారాయణ స్మరణ చేస్తూ దానిని కులశేఖర ఆళ్వారు ఉమ్ మన ముకుందమాళలో చెప్తాడు "బద్దేనాంజలినా నతేన శిరసా కాత్రైః సర్వమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనైర్ద్వీర్ణ మా బాష్పాంబువా నిత్యం తత్ చరణారవింద ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం" అంటాడు కులశేఖరుడు అంటే ఎలా భగవంతుణ్ణి సేవించాలి ప్రార్థించాలి అంటే "బద్దేనాంజలినా" ముందు చేతులు జోడించు "నతేన శిరసా" శిరసు వంచు తరువాత "గాత్రైః సర్వమోద్గమైః" సర్వాంగీణమైనటువంటి దేహం పులకలు తేలేట్టుగా భావన చెయ్. ఆ సమయంలో "కంఠేన స్వరగద్గదేన" గాద్గద్యం వహించిన కంఠస్వరంతో ఉపాసన చెయ్. "నిత్యం తత్ చరణారవింద ధ్యానామృతాస్వాదినాం" నీ పాదపద్మాల మీద నా మనస్సును నెలబెట్టుకొని దాని వలన కలిగినటువంటి ఆ ఆనందాన్ని అమృతంగా నను తాగని నాకు ఇటువంటి సంపదని ఇవ్వమన్నాడు. షడైశ్వర్యాలలో cash లేదు cash మనం పుట్టించుకోలేదుగా. షడైశ్వర్యాలలో ultimate ఏది అంటే విభూతి. ఆ విభూతితో కూడిన సంపద విభూతి ఒక మహా ఐశ్వర్యం irreversible process అది. జన్మ రాహిత్యానికి సంకేతంగా దానిని అనుగ్రహించమని అడిగాడు. అడిగి నారాయణ మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చేప్పటికీ ఇంత తేలికగా భగవంతుడికి దగ్గరగా వచ్చునా అయ్యో మనల్ని రానివ్వలేదే పూజలో కూర్చోనివ్వలేదే ఏదో వాళ్ళ ప్రసాదం విసిరితే పట్టుకొని పోయినామే వాడు విసిరాడు మనం కళ్ళకద్దుకొని తీసుకెళ్ళాం. దీన్నుంచి బయట అప్పుడు ఆయన సంఘాన్ని panoramic గా చూశారు. ఒక విహంగ వీక్షణంతో సమాజ దర్శనం చేశారు. దానిలో ఆ సమత. సమతకి ఇవ్వేళ equality అనేటువంటి పదం వింటున్నాం. ఇవ్వేళ సమతా మూర్తి అంటే ఆ సమత మూర్తీభవించి ఒక బొమ్మ అయితే అది రామానుజులు గనుక అయితే అది సమతా మూర్తి అయింది. సమత అంటే నా దృష్టిలో కేవలం equality యే కాదు equality అంటే ఏమిటి equality అంటున్నారా ఆ కాదు కాదు equality అంటే ఏమిటి we use in commerce కదా equality shares కదా share and care అనుకుందాం పోనీ అది కాదు equanimity equipoise equilibrium equality లేదు equality ఎలా ఉంటుంది? మీరు unique నేను unique అతను unique ఆయన unique we are all unique by individuals. కానీ గౌరవించుకోవటంలో ప్రేమించుకోవటంలో పరస్పరం ఆ సహకరించుకోవటంలో సమాజాన్ని మనందరం కలిపి నడిపించాలి అంతే కదా. కాబట్టి equality సమ- అందరూ సమ సమాజ స్థాపన చేస్తా ఉంటారండి అది అసంబద్ధం. సమాజం ఎప్పుడూ కూడా అవకతవకలతోనే ఉంటుంది హెచ్చు తగ్గులతోనే ఉంటుంది ద్వంద్వాలతోనే కూడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అనాచారాలు వైరుధ్యాలు వైవిధ్యాలు పరస్పర విరుద్ధ భావజాల సముద్రం ఈ ప్రపంచం. వీటి అన్నింట్లో ఉంటూ నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పటానికి వచ్చిన వారే భగవత్ రామానుజులు. దానికి ఆయన వాడినవారు మాట సమత. సర్వమత సమ్మతమైనటువంటి మతమే సమత.అది మార్గంతో కూడి ఉంది నిర్దుష్ట కూడివున్న మత మార్గం అది విశిష్టాద్వైతం గా ఉంటే దాన్ని ఆయన ఏం చేశారంటే liberalize చేశారు. రాతిని బద్దలు కొట్టారు లోపల ఉన్న శక్తి అనే జలాన్ని ప్రపంచానికి ఇచ్చారు నిజంగా వారు కన్నా ఆ కళ అంటారా లేకపోతే వారు చూపించిన మార్గం అంటారా అది సజావుగానే కొనసాగుతూ వచ్చిందా రానున్న కాలంలో లేదు వారి స్ఫూర్తిని ఈరోజు మనం ఎలా కొనసాగించాలి అంటే ఏం చెప్తారు ఇది ఈ ప్రశ్నకి జవాబు చాలా స్పష్టంగా చెప్పాలండి without any ambiguity మీరు వేసిన ప్రశ్న ఇది ఎవరు నొచ్చుకోవాల్సిన పని ఏం లేదు ఎవరినో తక్కువ చేసి చెప్పే మాట కాదు. ఆయన చెప్పినటువంటిదే గనుక అందరూ పాటించి ఉంటే వెయ్యేళ్ళకి సమతా మూర్తి విగ్రహం ఎందుకు రావాలి అది జరగలేదు రామానుజులతో ఆగిందది రామానుజుల తర్వాత కొనసాగింపు లేదు. మళ్ళీ ఈవేళ సమాజం అప్పటికంటే చాలా దారుణంగా ఇవాళ divide అయిపోయింది. కులాలు శాఖలు గోత్రాలు మతాలు ఏవో ఒకటి కాదు పీలికలు చీలికలు అయిపోయాయి. ఈ సమయంలో రామానుజుల యొక్క స్ఫూర్తి మనకు కావాలి. ఇంతకాలం కొనసాగిందా అన్నారు కొనసాగలేదు అనేదే నా ఉద్దేశం ఎందుకనంటే కొనసాగటువంటి అర్చన కేవలం అర్చన కాదు కదండీ మూర్తి పూజ మాత్రమే కాదు కదండీ ఇప్పుడు మన శంషాబాద్ లో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోయేటువంటి ఈ సమతా మూర్తి యొక్క విగ్రహావిష్కరణ గానే భావించటం లే అది మానవుడి యొక్క మనో నిగ్రహ మూర్తిగా నేను భావిస్తున్నా అబ్బా అద్భుతం నిగ్రహం మనము intolerance పెరిగిపోయింది. ప్రతి వాడు ఇంకో మతం మీద ఒక ఆధిపత్యం కోసం పోరాడుతున్నటువంటి ఒక సమయం ఇది దాన్ని సామాజిక స్పృహ లోకి తీసుకుని వస్తున్నారు సమాజం వ్యక్తిని భిన్న భిన్నంగా చూస్తున్నారు ఒరేయ్ నీ శరీరంలో ఉన్న అంగాంగములు అన్నీ ఎంత coherent గా పనిచేస్తున్నాయో చేస్తున్నాయి కనుకనే నువ్వు బతక్కి బట్ట కట్టావు అట్లాగే ఈ సమాజంలో అందరూ ఉండాలి అనే భావన నుంచి మనం వైదొలిగాం. మనం మతాల వారీగా విడిపోయినాం సర్వాంగీణమైన దేహమే మనకు ఉపాధిగా ఉన్నటువంటి ఇదే మనకు ఉదాహరణ కాలేకపోయింది కాబట్టి వేయి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒకే సమాజం అప్పుడు రెండు మతాలు వైష్ణవం శైవం. డబ్బున్నవాడు డబ్బు లేని వాడు చదువుకున్నవాడు చదువుకోని వాడు ఇవ్వాళ అంటే fragmented society ఈవేళ ఈ fragmented society కి మళ్ళీ స్ఫూర్తి ఎక్కడి నుంచి రావాలి అంటే నిజానికి భగవత్ రామానుజుల యొక్క స్ఫూర్తి ఈ సమాజాన్ని మళ్ళీ కలుపుతుందని నేను భావన చేస్తున్నా. దాన్ని correct perspective లో మనం అందించి మళ్ళీ మీరు విష్ణువునే పూజించండి శివుడ్ని పూజించొద్దు వాళ్ళు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనొద్దు ఎందుకంటే ఒక బిందువు సముద్రం కాదండి సముద్రంలో ఒక బిందువు ఒక part ఆధ్యాత్మిక మహా కడలి ఇది ఈ కడలిలో అన్నీ ఉంటాయండి నీళ్లుంటాయి దానిలో నుంచి కెరటాలు పుడతాయి కెరటాలలో నుంచి అలలు కెరటాలు తుంపరలు తుప్పర్లు అన్నీ పుడతాయి కానీ వాటి మూలం ఏమిటంటే సముద్రమే Correct ఆ మూలంలో నుంచి పుట్టి విస్తృతమై manifest అయి ఈ ప్రపంచాన్ని తడిమి తడిపి పారాడి పారుతూ ఒక జాతిని జీవన స్రవంతిని పరమాద్భుతంగా నడిపిస్తాయి. ఆ స్ఫూర్తిని గనుక మనం రేపు ఈ సమతా మూర్తి యొక్క విగ్రహాన్ని గనుక ఆవిష్కరించుకొని ఆ పరంగా గనుక మనం వెళ్లగలిగితే మన అనంత బాహువులు అన్నీ కూడా అనంతం అంటే రెండు మనకుండేవి వంద మంది కలిసాం రెండొందలు అయినాయి ఒక లక్ష మంది కలిసాం ఈ బాహువులు అన్నీ గనుక సమాజంలో ఉన్న చిట్టచివరి వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి గనుక మనం పునః నిర్మాణం చేసుకుంటూ రాగలిగితే రామానుజుల వారికి మనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన నివాళి అది Thank you very much sir
YouTube · audio
Greatness of Sri Ramanujacharya | Statue Of Equality | Sai Krishna | Nationalist Hub
Greatness of Sri Ramanujacharya | Statue Of Equality | Sai Krishna | Nationalist Hub
Source: Nationalist Hub on YouTube
0:00 / 45:03