Skip to content
Transcript తెలుగు
అలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం మే. భగవాన్ రమణ మహర్షుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో ధ్యానం అంటే ఏమిటి? ఒక నిరంతరమైనటువంటి సరళ చింతనే ధ్యానానికి దారి తీస్తుందని, అది ఒక అఖండమైనటువంటి నేతిధార వలె సాగుతూ ఉండాలని, అది నిశ్చలాత్మక బుద్ధితో ఉండాలని, పరిపూర్ణత్వం వైపు వెళ్లాలని, అది కానిదంతా కూడా విరళ చింతనమేనని భగవాన్ మనకు బోధ చేస్తూ, చాలా పరమాద్భుతంగా భేదభావం లేకుండా చూసుకోండి. ప్రపంచము, నువ్వు, జగదీశ్వరుడు ముగ్గురు భిన్నం కాదు ముగ్గురు ఒకటే. భగవంతుడు సృష్టించాడు సృష్టిని. సృష్టిలో మానవుడు ఉద్భవించాడు. మానవుడు అంటే జీవుడు, జగత్తు, జగన్నాయకుడు ఒకటే అనేటువంటి ఒక అభేదమైనటువంటి భావంతో గనుక నిరంతరం ఉన్నట్లయితే, దీనినంతటినీ నడిపించేటువంటి ఒక కర్త కంటికి కనపడకుండా, ఇంద్రియాలకు ఒక అనుభవానికి, ఇంద్రియాల అనుభవానికి లోను కాకుండా, ఇంద్రియాల పరిధిలో, పంచకోశాల పరిధిలో భగవంతుడు దొరక్క, భగవంతుడు మనకంటే భిన్నంగా ఎక్కడో దూరంగా ఉన్నాడని ఆలోచించేటువంటి మనవోటి వారి కోసం భగవాన్ చెప్తున్నాడు. ఏమనంటే, భేదభావం లేకుండా ఉండండి పరమేశ్వరుడు మీ యందు ఉన్నాడు. నీలో ఉన్నవాడిని వెతకటం పెద్ద కష్టం కాదు. బయట సువిశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి సృష్టిలో భగవంతుడు అంటూ ఒక పదార్థంగా వెతకటం చాలా కష్టం. అది నిజానికి దుర్లభం. నిజానికి అది అసంభవం. కనుక ప్రకృతి అంతా, సమస్త సృష్టి అంతా కూడా ఈశ్వరమయంగా సర్వేశ్వర భావనతో ఉండగలిగినట్లయితే, బయట ప్రపంచం నిండా ఆవరించి, ఆవహించి ఉన్నటువంటి పరమేశ్వరుడు నీ యందు కూడా ఉన్నాడు. నీ యందు ఉన్నటువంటి ఈశ్వరుడిని నువ్వు పట్టుకో అని చెప్తూ, నిన్నటి వరకు వచ్చిన విచార ధారలో ఒక direct path ని మనకు ప్రతిపాదన చేశారు భగవాన్. direct path ఏమిటి అంటే, అనాహతం వరకు వెళ్ళినటువంటి జీవుడు తన సాధనా మార్గంలో తనదైనటువంటి మనస్సుని, చలచ్చలితమైనటువంటి మనస్సుని, ఆలోచనా సమూహంగా, ప్రవాహంగా ఉన్నటువంటి మనస్సుని, దాని మూల స్థానం అయినటువంటి హృదయంలో పెట్టేసుకుంటే మనస్సు నిలకడ చెందుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశం. ఇది మనకు తెలియక అజ్ఞాచక్రం మీద ధ్యానించి, దృశ్యాలు కనబడి, సహస్రారం వరకు వెళ్ళామని అనుకొని భ్రమించి, కుండలిని నిద్ర లేచిందని, అది మనల్ని పరిగెత్తిస్తున్నదని, ఏదో ఒక యోగ విద్య మనకు అలవడిందని అనేకమైనటువంటి భ్రాంతులతో కాంతికి దూరం అవుతున్నాం. అది లేవు-- లో వెలుగై ఉన్నది. హృదయ స్థానంలో ఉన్నది. మనస్సు మూలాధారం నుంచి బయలుదేరి అనాహతం దాకా వచ్చి, ప్రాపంచికమైనటువంటి అనేక లాభాలు మనం పొందుతూ ఉన్నప్పుడు, మనల్ని భ్రమింపజేసి, తళుక్కుమనిపించి, మనల్ని యదార్థ స్థితికి పోనివ్వకుండా అహం చేత ఆపేస్తూ ఉంటుంది గనుక, భగవాన్ ఎందుకీ ప్రమాదం అంతా? మాటలు తగ్గించుకోండి, మౌనాన్ని వెలిగించుకోండి. మౌనం అనేటువంటి నిశ్శబ్ద భూమికలో నిలు-- మీరు నిలకడ చెందండి. హాయిగా ఉండండి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. అవసరమైన దానినే మాట్లాడండి. లోకహితం కోసం నాలుగు మాటలు మాట్లాడండి. ఆపై మౌనం వహించండి. ఎన్నో విషయాల్లో మౌనం వహించటం సర్వోన్నతమైనటువంటిది. అంతా భగవంతుడే చేస్తున్నాడు అనుకోవటం శరణాగతి. ఇదంతా నా వల్ల కావటం లేదు, నాకు తెలియని ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తున్నది అనేది సమర్పణ భావం. రెండూ అన్ని కాలాల యందు ఉండటమే వినయం. విజయం సాధించినప్పుడు పొంగిపోయి, విజయం లభించనప్పుడు కుంగిపోయి, ఇర్షాద్వేషాలతో, అసూయలతో, పగలతో, కల్పన్యాలతో, కక్షలతో, పగతో, వగతో జీవితాన్ని దుర్భరం చేసుకునే కంటే ఆనంద తారకమైనటువంటి మహాద్భుత స్థితిలోకి, తృప్తిలోకి వెళ్ళు. మానవ జన్మ కంటే మహోన్నతమైనటువంటి సంపద మరొకటి లేదు. ఎవరు కోటీశ్వరుడు? కోట్లు సంపాదించిన వాడా? కాదే. సర్వాంగీణమైనటువంటి దేహంలో అఖండమైనటువంటి ఒక ఆత్మ ఉన్నదని, ఆత్మే నేను అన్నటువంటి ఒక దివ్య భావనలో గనుక నిలకడ చెందగలిగినట్లయితే, అది ఒక అనంతమైనటువంటి ఐశ్వర్య విభూతిగా భావన చేయమంటున్నారు భగవాన్ రమణులు. ఆనంద తారకమైనటువంటి స్థితిని అందుకోవాలంటే ముందు మనిషికి మనస్సులో భేదం పోవాలి. తర, తమ, తన మూడు భేదాలు పోవాలి. ప్రపంచమంతా భిన్నంగా గోచరిస్తున్నది, అనేకంగా గోచరిస్తున్నది. కానీ, ఏకమే అనేకమైంది అన్న భావన కలిగిన నాడుసర్వ ప్రకృతి మనంగా మనమే సర్వ ప్రకృతిగా విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టికి మనం ఒక మినీయేచర్ గా ఒక సంక్షిప్త స్వరూపంగా ఒక అభిజ్ఞ గా ఒక గుర్తుగా మనం నిలకడ చెంది ఉన్నాం. భావన మనల్ని ఆత్మీయక స్థితిలోకి తీసుకు వెళుతుంది. నేను దేహము నా వృత్తి ఇది నా పదవి ఇది నాకున్న స్థిర సంపదలు కీర్తి ఇంత అని గనుక మనం అనుకుంటూ ఉన్నట్లయితే అవి మనల్ని భ్రాంతిలో నెట్టేనట్లే ఎందుకంటే అవన్నీ మనం సంపాదించుకున్నవే. మహా సృష్టిలో మనం కూడా ఒక పాత్ర వహించవలసి ఉన్నది. మహా సృష్టితో సహజీవన సౌందర్యం చేయాలి. సర్వకాలికంగా ఉండాలి. సర్వోత్తమమైన జీవన విధానానికి శ్రీకారం చుట్టాలి. ఇది మానవ జీవితానికి ఉన్నటువంటి ఒక బాధ్యత. బాధ్యతను జాగ్రత్తగా గనుక గమనిస్తూ వెళ్లినట్లయితే మన ద్వారా కూడా చాలా పనులు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో అంటించుకోకుండా ఉండాలి. కర్త్రుత్వం వహించకూడదు అంటే డూయర్షిప్ నేను చేస్తున్నాను అన్న భావన నుంచి మనస్సుని పక్కకు నెట్టాలి. ఇదంతా ఒక కర్త ఒక శక్తి మనకు తెలియదు అది చేయిస్తున్నది అనుకోవటంలో సుఖం ఉన్నది. దాని వలన కలిగేటువంటి లాభ నష్టాలతో మనకు ప్రమేయం లేదు గనుక కర్తవ్య నిర్వహణలో మనము వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ వెళుతూ ఉన్నట్లయితే ఏది అంటకుండా ఉన్నట్లయితే మనం తేలిగ్గా మన స్వస్థానానికి చేరవచ్చు. స్వస్థానానికి చేరేటువంటి సర్వ మార్గాలలోనూ పూజలు, వ్రతాలు, జప తపాదులు, అజపాలు, తపస్సులు వీటన్నింటినీ దాటి ధ్యానమే ఉత్తమం అంటున్నారు భగవాన్ రమణులు. ఇక్కడి వరకు. ధ్యానమే ఉత్తమము అంటే మార్గం తెలియాలి మనకి. మార్గం ధ్యానం నిజానికి రాజమార్గం. ఎరిగి చేస్తే. తెలియక చేస్తే ధ్యానం కూడా గుదిబండ అవుతుంది. సిద్ధులు ఏర్పడతాయి. దృశ్యాలు కనపడతాయి. తద్వారా అహం మరింతగా పెరుగుతుంది నేను దైవాన్ని చూశాను అన్న తర్వాత ఇక నిజానికి అక్కడ చూట్టానికి ఏం లేదు. దైవంతో నేను మాట్లాడాను అన్న తర్వాత ఇక కోరవలసినది లేదు. దైవాన్ని నేను తాకాను అన్న తర్వాత కంపురుష లోకాన్ని చేరుకున్నట్లే. మూడు భ్రాంతులు. ఇవి దేవుడికి అంటే భగవంతుడికి పర్యాయపదమైనటువంటి ఆత్మను ఎరగటంలోనే పూర్ణత్వం ఉన్నది. దైవాన్ని చూడటం కూడా నిజానికి అది అసంపూర్ణము, అసమగ్రము. దైవాన్ని చూడగానే ఏదో అడగాలి అనిపిస్తుంది. దైవంతో మాట్లాడగానే మన స్థాయిలో మనం మాట్లాడుతాం. దైవాన్ని తాకగానే ఇంకేదో అనుభూతులు కలుగుతాయి. ఇవేవీ కాకుండా ఆత్మ అనేటువంటి ఒక నిశ్చలమైన నిశ్చితమైనటువంటి ఒక సత్యాన్ని గనక మనం గమనించగలిగినట్లయితే సత్యము నేను అన్న భావనలో గనక నిలకడ చెందగలిగినట్లయితే అది ఒక పరమాద్భుతమైన ఆధ్యాత్మిక భావన.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -27

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -27

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:54

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

    Now playing
  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77