Skip to content
Transcript తెలుగు
ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాన్మే నీలారవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తదా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూల వాసం సంస్మార యంతమచలం తవనుస్మరామి ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ శ్రీ రమణ మహర్షి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ ప్రపంచానికి ఆత్మానాత్మ విచారణా మార్గాన్ని అంటే ముందు అనాత్మను గురించి చెప్పి ఆపై ఆత్మవిచార మార్గం వైపు వెళ్ళమని చెప్తున్నటువంటి సందర్భంలో అనాత్మను గురించినటువంటి విచారణ కొంత మనం చేసాం. అనాత్మ ప్రకృతి అని దేహం అనాత్మ అని మనం చెప్తూ వచ్చాం. అయితే అనాత్మ మనస్సుగా, భావనగా, ప్రాణంగా, శక్తిగా, చైతన్యంగా, ఒక భావనా భూమికగా మనకు గోచరిస్తూ ఉన్నది ఇదే అనాత్మ. శాస్త్ర పాండిత్యం, కవిత్వం అంతెందుకు అరవైనాలుగు కళల సమాహారం ఇదంతా కూడా అనాత్మకు సంబంధించిందే. కానీ మరువరానిది, మరువకూడని మాట కళాత్మక సమ్మేళనం ఏదైతే ఉన్నదో అది నిజానికి ఆత్మ యొక్క కదలికే, దాని సంచలనమే. ఆత్మే గనక కదలించకపోతే ఇంద్రియాలు పనిచేయవు. మనస్సే గనక కమాండ్ ఇవ్వకపోతే ఇంద్రియాలకు రకమైనటువంటి పని లేదు. కాబట్టి ఆత్మ అధో స్థాయిలో మనస్సు అంటే దాని కంటే కింద స్థాయిలో మనస్సు దానితో కూడి ఉన్నటువంటి లేదా దాని చేత నియంత్రించబడుతున్న కంట్రోల్ చేయబడుతున్న సర్వేంద్రియాలు. సర్వేంద్రియాలు అంటే పది ఇంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. పదింటికీ అధిష్టాత ఎవరు అంటే మనస్సు. యజమాని ఎవడు అంటే మనస్సు. పదకొండు పది-పది ఇంద్రియాలు ఒక మనస్సు కలిపితే పదకొండు. పదకొండింటినీ నడిపించేది ఎవరు అంటే ఆత్మ గనక. ఆత్మ అఖండంగా ఉన్నది, స్థిరంగా ఉన్నది, స్థిమితంగా ఉన్నది, సంస్థితమై ఉన్నది, దేనితోనూ ప్రమేయం పెట్టుకోలేదు, అప్రమేయంగా ఉన్నది. అన్ని సంఘటనలకు తాను మూలమై ఉన్నది కానీ సంఘటనలోనూ స్వరబారటం లేదు, అది intervene కావటం లేదు, interfere కావటం లేదు, influence చేయటం లేదు. కానీ inspire చేస్తున్నది, ignite చేస్తున్నది. జరుగుతున్నటువంటి అనేక కార్యకలాపాలకు తాను మూలమై ఉన్నది గనుక ఆత్మవిచార మార్గంలో నేను అన్నటువంటి ప్రశ్న ఏది? నేనెవరు? అన్న ప్రశ్న భగవాన్ విసిరిన బ్రహ్మాస్త్రం లోకం మీదకి. అది చాలా తేలికగా అనిపిస్తుంది. కానీ చాలా క్లిష్టతరమైనది, సా-చాలా గూఢమైనటువంటిది. అనేకమైనటువంటి మానసిక పొరలు, తెరలు చీల్చి అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మ వైపు నడిపించగలిగిన శక్తివంతమైనటువంటి అస్త్రం అది. అందుకనే హుయామై అన్నటువంటి ప్రశ్న [గొంతు సవరించిన శబ్దం] రమణ మహర్షి కంటే ముందే ఉన్నా అధ్యాత్మ మార్గంలో దాన్ని సాధనా మార్గం చేసింది మాత్రం భగవాన్ శ్రీ రమణ మహర్షి. మిగతావి ఆయన గురించి ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా వారి జీవితంలో జరిగిన సంఘటనలే మనకు ఒక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ ఆత్మవిచార మార్గం వైపు వెళ్ళాలి అంటే ఇది ఒక్కటే మార్గం, నేనెవరు అన్న ప్రశ్న. నేనుని నేనుగా, శరీరంగా, దేహంగా, క్షేత్రంగా, కర్మగా, ఒక భావనగా, ఒక స్థితిగా మనం అనుకున్నంత సేపు అది అనాత్మే. అనాత్మ అంటే ఆత్మ కానిది. ఆత్మ కానిది ఏది అంటే ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఒక్కటే ఆత్మ, అది కానిదంతా అనాత్మే. మనమంతా అనాత్మతోనే ఎక్కువగా కూడి ఉన్నాం. మన ఆలోచనలు వేరు, మన మేధాశక్తి వేరు, మన విచార మార్గం వేరు, మనం వెతుక్కునే దారులు వేరు, మనకి సంతోషాన్ని కలిగించే వస్తువులు వేరు, సంభ్రమాన్ని కలిగించే విషయాలు వేరు. ఇవన్నీ కూడా ఒక సమన్వయమైనటువంటి స్థాయిలో గనుక మనం చేసుకోగలిగినట్లయితే అనాత్మ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చి ప్రపంచంలో అడుగు పెట్టగానే [గొంతు సవరించిన శబ్దం] ఆకలి, నిద్ర రెండు ఏర్పడుతున్నాయి. ఆకలి అని కేక పెడుతున్నాం, నిద్ర అని కనురెప్పలు వాలుస్తున్నాం. ప్రకృతితో సంబంధం ఏర్పడిన మరుక్షణమే మనలు-మనకి మన ఆత్మకి ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో అది తెగదు గాని దూరం అవుతుంది. దాన్ని uncoil చేయటమే ఆత్మవిచార మార్గం. మళ్ళీ మూలంలోకి వెళ్ళటమే, connectivity కోసం చేసే ప్రయత్నమే ఆత్మవిచార మార్గం. Since you are detached from the root, try to get back the root and reestablish your contact. ఇది ఆత్మవిచార మార్గానికి వేల స్థూలమైనటువంటి key. ఇది కాకుండా ఆత్మ అనంగానే ఆత్మలు, పరమాత్మలు ప్రపంచానికి అతీతంగా ఉన్నాయని, ఇదే ప్రపంచంతో ఎట్టి సంబంధం లేవని, అవి మన బోటి వాళ్ళు పట్టుకోలేమని మనల్ని వెనక్కి నెట్టే వారుంటారు. ఇది అందరూ అనుభవించవలసినఅనుసరించవలసినటువంటి సమున్నతమైనటువంటి మార్గమే ఆత్మ విచార మార్గం. మనసుతో ప్రపంచాన్ని చూసినంత సేపు మనకి స్పర్ధ, భగ, ద్వంద్వం రెండుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ బాగా ఆత్మ విచార మార్గంలోకి మనం వెళుతున్నప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఆనందం. అది మనకి స్వస్వరూపానుసంధానము అంటాం. అంటే స్వస్వరూపము. ఏది అరూపంగా ఉన్నదో అదే నిజానికి స్వరూపం. స్వరూపానికి అనుసంధానం కావటమే, అనుసంధానం అంటే reconnection, connectivity. ఎప్పుడైతే మన వాకిట్లో మన ఇంట్లో వెలుగుతున్నటువంటి ఒక చిన్న zero watt బల్బు మూలంతో గనక connectivity లేకపోతే అది వెలగదు. ఏదీ వెలగదు, ఏదీ నడవదు. కానీ నడిపిస్తున్న current కంటికి కనపట్టలేదు. దానిని ఉత్పత్తి చేస్తున్న turbine చాలా దూరంగా ఉంది. కానీ వీటినన్నింటినీ connect చేస్తున్నటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ప్రవాహాన్ని, విద్యుత్ ప్రవాహాన్ని పుట్టిన చోటు నుంచి మన వాకిట్లో వెలిగేటువంటి బల్బు దాకా తెచ్చినట్లుగా మన కాలి గోటి నుంచి శిఖ వరకు, తల వెంట్రుక వరకు చైతన్యం జరుగుతూనే ఉన్నాయి. జడంగా కనిపించే ప్రాణమే లేదనుకున్న గోళ్ళు పెరుగుతున్నాయి. కారణం మూలంతో connectivity ఉంది. జుట్టు పెరుగుతూ ఉన్నది మూలంతో connect కట్ కాగానే ఏదీ పెరగదు. పెరగదు, రాదు. అట్లాగే ప్రపంచంలో జడంగా కనిపించే వస్తువులన్నీ పెరుగుతున్నాయి. స్వస్థితిలో ఉంటున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి. చెట్లు మొలుస్తున్నాయి, పెరుగుతున్నాయి. శాఖోపశాఖలు అవుతున్నాయి, ఆకులు అవుతున్నాయి. కాయలు, పూలు, పళ్ళు అన్నీ ఏర్పడుతున్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. రాలిపోయినాయి గానీ మళ్ళీ పుడుతున్నాయి. ఎట్లా అంటే connectivity వల్ల ఏర్పడుతున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో గురువుగారు ఒక పాఠం చెబితే మన అధ్యాపకుడు-- దాన్ని ఈవేళ గుర్తు చేసుకుంటాం. కారణం మన మనసు దాంతో connect అయి ఉన్నది. అట్లాగే అనాత్మకు కూడా ఒక connection ఉంది. దానిని విశ్వాత్మ అన్నారు. ప్రాపంచికమైనటువంటి విశ్వాత్మతో మనం connectivity గనక పెంచుకున్నట్లయితే, విశ్వంతో connect గనక అయితే ప్రపంచం బాగా కనిపిస్తుంది. విశ్వాత్మతో connectivity ఉంటే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి పటిష్టంగా ఉంది, రెండోది స్పష్టంగా ఉంది. పటిష్టంగా ఉన్నా బలహీన పడొచ్చు. స్పష్టంగా ఉన్నది బొమ్మై లోపల imprint అవుతుంది గనక. ప్రకృతిని సమదృష్టితో, సహన దృష్టితో, సంయమన దృష్టితో, ప్రేమాత్మకమైనటువంటి భావంతో ఒక వైరాగ్య విభూతితో ఒక ఆనందంతో దానిని గనక మనం సమాధానించగలిగినట్లయితే ప్రకృతి పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు కనిపిస్తుంది.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -72

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -72

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:36

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

    Now playing
  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77