Skip to content
Transcript తెలుగు
రమణ మహర్షి అని వెంకట్రామణకి నామకరణం చేసినటువంటి వారు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని. ఆయనని తర్వాత కాలంలో అంటే ఉన్నంత కాలము భగవాన్ ఆయననే నాయనా అని పిలిచేవారు. నాయనా అంటే తమిళ సాంప్రదాయంలో గణపతి అని అర్థం. ఎలాగూ కుమారస్వామి అని పిలిచాడు గనుక కుమారస్వామికి అన్నగారు గణపతి గనుక వీరు మీరు నాకు అన్నగారు వయసు రీత్యా కూడా ఆయన పెద్దవారు. కాబట్టి నాయనా అంటే గణపతి అని అర్థం. నాయనా అంటే అన్నగారు అని అర్థం. రకంగా అరుణాచలం లో గణపతి వచ్చాడు. గణపతి కంటే ముందు కుమారస్వామి వచ్చాడు. ఆయనకి భగవాన్ రమణ మహర్షి అంటే భగవాన్ అనేటువంటి శబ్దాన్ని రమణులు రమణ అనేటువంటి పదంలో మరణం ఉన్నది స్మరణ ఉన్నది విచారణ ఉన్నది చారణ ఉన్నది కడగా తారణ ఉన్నది ముక్తి ఉన్నది. ఇవన్నీ ఒక్క నామంలో ఉన్నాయి కాబట్టి రమణ శబ్దము రమణి రమణీయమైనటువంటి పదం కాబట్టి వారి తలపు వారి భావన వారి చూపు వారి అనుగ్రహము వీక్షణ దీక్ష ఇవన్నీ కూడా రాబోయేటువంటి కాలంలో అనేక మందికి అనుగ్రహ వరదానం చేస్తుంది గనుక రమణ అని చివరిగా బ్రహ్మర్షి రమణ అని లేదు, ఋషి రమణ అని లేదు మహర్షి రమణ. రమణ మహర్షి. అంటే మనిషి మనీషి కావాలి మనందరం కూడా మనీషి ఋషి కావాలి ఋషి బ్రహ్మర్షి కావాలి బ్రహ్మమును ఎరగాలి బ్రహ్మమును ఎరిగిన తర్వాత ఇంకేమున్నది అంటే మహస్సుని ఎరగాలి. బ్రహ్మమునకు ప్రకృతికి పరాతత్వానికి మూలమైనటువంటి భావనను ఎవరైతే తెలుసుకొని ఉంటారో వారు మాత్రమే మహర్షి అవుతారు గనుక భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకోత్తరమైనటువంటి ఒక ఖ్యాతిని గడించి జగత్తులోకి ఆయన వచ్చారు. వచ్చి వారు అరుణాచలాన్ని శివుడు గా భావించారు. భావించి వస్తూనే ఆయన ఏమన్నారంటే "అరుణాచలమనుచు స్మరియించు వారలహము నిర్మూలింపు అరుణాచల" అంటూ మొదలు పెట్టారు. అక్షరమణమాల,మణమాల అంటే కళ్యాణమాల. మణిమాల కాదు అది మనమాల. కళ్యాణమాల అంటే జీవుడికి దైవానికి ఏర్పడేటువంటి ఒక వైవాహికమైన సంబంధం. అది జీవాత్మ పరమాత్మల యొక్క సాయుజ్య స్థితి. నేను వెంకట్రామణ్ని, నేను రమణుడిని, నేను వచ్చాను అని అంటున్నానే, నేనుకి మారుపేరు ఏమిటంటే అహమి. అహం వల్లే నేను, నేను, నేను అని చెప్తాం. నేను మాట్లాడాను, నేను రాసాను, నేను కూశాను, నేను గీశాను, నేను చూశాను అన్నీ నేను లేకుండా మన జీవితం సాగదు. కాబట్టి "అరుణాచల మనుచు స్మరియించు వారల" నీ దగ్గరికి రానక్కర్ల అరుణాచలానికి వెళ్ళక్కర్ల కానీ అరుణాచలాన్ని గనుక ఎవరు స్మరిస్తారో వాళ్ళ అహము నిర్మూలింపు అరుణాచల. ఎవరో అంటే అది వెంకట్రామణ్ని వింటే అరుణాచలానికి వస్తే ఇంకా నేను అన్న అస్తిత్వము, వ్యక్తిత్వము, ఉనికి, ప్రజ్ఞ, ప్రతిభ, ఉత్పత్తి ఇవన్నీ మనస్సు ఉండాలా అని ఏకకాలంలో ఒక ప్రజ్ఞా భూమిక లోకి ప్రస్థానం చేసినటువంటి మహర్షి విన్నవించుకున్నటువంటి వేడ్కోలు అది. మనం మందిరానికి వస్తాం. మందిరానికే వస్తాం. ఎప్పుడైనా నా అహం పోగొట్టమని ఒక్కసారన్నా అడిగామా అని. అడగలా. నాకిది ఆయన ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే నువ్వు అడిగినంత కాలం ఇస్తూనే ఉంటాడు. ఎప్పటి దాకా known తెలుసునా? నీ నుంచి తీసుకునే దాకా ఇస్తాడు. ఒక్క సూక్తి ఒక్క షిరిడి బాబా మాత్రమే ప్రపంచానికి చెప్పారు. కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి అని పట్టు పోతున్నాం అని అనుకోకండి. ఒక రోజు వస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతా. అప్పుడు ఏం అడుగుతానో తెలియదు, మీరు అప్పుడు అంతా నాకు ఇవ్వవలసి ఉంటుంది. ఇది మళ్ళీ భాగవతంలో శ్రీహరి శ్రీ మహావిష్ణువు ప్రమాణం చేశాడు. నిజమైనటువంటి నా భక్తుడు నన్ను కోరుకున్నంత కాలం ఇబ్బంది లేదు. శిరిని కోరుకున్నంత కాలం శిరిని ఇస్తా. హరిని కోరుకున్నట్లయితే హరిని, శిరిని ఇస్తా. హరిని కోరుకో-కోరుకోకపోతే శిరి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హరి గనుక నీకు దక్కితే హరిని వదిలి శిరి వెళ్ళదు. శిరి, హరులు ఇద్దరూ కలిసి మీ దగ్గర ఉంటారు. శిరి అంటే జ్ఞానలక్ష్మి, హరి అంటే చైతన్యం, హరి అంటే వాయువు. మధ్వ సాంప్రదాయంలో హరి సర్వోత్తమ, వాయు సర్వోత్తమ అంటారు. సర్వోత్తమమైనది ఏదంటే వాయువే, ఆయువే, ఆయుష్షే, ప్రాణమే, చైతన్యమే, మనస్సే, చలనమే, కదలికే, మెదలికే ఇవన్నీ కలిపితే ఒకటవుతున్నాయి గనుక ఇటువంటి దివ్య భావనా గరిమని వెనక పెట్టుకొని ఒక్కసారిగా రమణులు ప్రస్తావన చేసి నెమ్మది నెమ్మదిగా నిన్ను ఎక్కడో ఉన్నవాణ్ణి లాక్కొచ్చావ్. నిన్ను తండ్రి అనుకున్నాను. నేను వెనక నా జీవితంలో ఎక్కడైనా నా జాడ మరచిపోయినా, నేను దిగజారిపోయినా తండ్రివైన నీకే అపవాదు తప్ప నాక్కాదు అంటూ సంపూర్ణమైన శరణాగతి, వినయము, భక్తి అనేటువంటి మూడు పార్శ్వాలతో భగవాన్ రమణుల యొక్క ప్రస్తావన వారి ప్రస్థానం రెండు ప్రారంభమైనయి. ఇది అధ్యాత్మ చరిత్రలో ఒక మేలిమలుపు. ఒక్కసారి చారిత్రాత్మకమైన విధానాన్ని గమనించినట్లయితే అఖండ భారతావని ఒక స్వర్ణయుగాన్ని అనుభవించింది. స్వర్ణయుగం ఇవాళ చెప్పే ఐదు లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్లు కావు. స్వర్ణయుగం ఆధ్యాత్మిక సంపద. మనం గనుక ఈశాన్య భారతాన్ని తీసుకున్నట్లయితే చైతన్య మహాప్రభు భక్తి చైతన్యాన్ని పారించాడు రోడ్ల మీద. భక్తిని పరవశం చేశాడు. దానిలో నుంచి కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.అక్కడ నుంచి సంత దేశమైన మహారాష్ట్ర దేశానికి వచ్చినట్లయితే అనేకమైన సంతలు అందులో రాజాధిరాజ్ అని అనిపించుకున్నటువంటి శ్రీడి మహాస్వామి ఒకవైపు మరొకవైపు దక్షిణాపథంలోకి వస్తే శృంగేరి పీఠం లో చంద్రశేఖర భారతి స్వామి వారు వారికి సమకాలీనంగా చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామి వారు పెద్ద స్వామి వారు మహాస్వామి వారు మళ్ళీ ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి కాస్త ఇటు కర్ణాటక అటు ఆంధ్ర ఇటు తమిళనాడు మూడింటికీ central point పుట్టపర్తి లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు పాండిచ్చేరి లో శ్రీమాత అరవిందుల వారు అసలు ప్రతి ప్రదేశములను ఒక్కొక్క మహా చైత్య పురుషుడు వచ్చి జగన్నాథ రథాన్ని ఇంచి ఇంచి కదిలిస్తూ అంగుళం ముందుకు పారించినటువంటి సందర్భంలో ఇవాళ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆయన వైభవం ఇందరి మధ్యలో సాగితే వారి దగ్గరికి రోజులలోనే అక్కడ ఏమున్నాయి ఏం లేదు అరణ్యం వారిని కావ్యకంఠ గణపతి ముని ఒకసారి అడిగారు అయ్యా భారతదేశంలో ఎంతో అందమైన కొండలున్నాయి చల్లటి ప్రదేశాలు ఉన్నాయి ఇదిగో కొండ అంగారక గ్రహానికి సంబంధించిన కొండ యాభై డిగ్రీల temperature ఉంటుంది ఇక్కడ బతకటానికి వీలు లేదు నీటి చుక్క లేదు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏమిటి దీని ఫలితం అని అడిగితే వారు పక్కనే ఉన్నటువంటి ఒక కాగితం చింపి పెన్సిల్ తో అరుణాచల శిఖరాన్ని ఒక బొమ్మ గీశారు అరుణాచల శిఖరాన్ని బొమ్మ గీసి దాని కింద ఒక మాట రాశారు "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది" అని రాశారు అంటే అక్కడ పూజలు లేవు పునస్కారాలు లేవు వేడుకలు లేవు జాతరలు లేవు ఊరేగింపులు లేవు ఏమున్నది అంటే అరుణాచల అని గనక అన్నట్లయితే స్మరణ మాత్రముననే ముక్తి కాదు పరముక్తి ఫలదా పర అంటే పైనది కాదు దేహాత్మ భావన లోపల ఉన్నటువంటిదే పరము బయట కనిపించేది అపరము కాబట్టి మామూలుగా సభల్లో ఎవరినన్నా పిలిచి కాసేపు మాట్లాడండి అంటే వారు వచ్చి పాపం కూర్చుంటారు కుర్చీలో. కూర్చోగానే ఆయన పరిచయం చేస్తారు ఎవరో ఒకళ్ళు. తెలియక పాపం ఏమంటారు, వీరు అపర వివేకానందుడు అండి అంటారు. అపర శబ్దం అంటే duplicate అని అర్థం. అది వాడకూడదు. There is only one వివేకానంద, There is only one రమణ మహర్షి, There is only one సత్య సాయిబాబా, There is only one one one. పేరుతో వచ్చిన వాళ్ళు వాళ్ళే. మళ్ళీ వాళ్ళకి duplicate లు ఉండవు. వాళ్ళంతా అపర సత్య సాయి బాబాలు ఉండొచ్చు. ఏంది వేషం వేసుకుంటే వాడు అవుతాడు కాదా? వేషం వేస్తే అవుతాడా? కాదే. బాబా వేషం సినిమాల్లో వేస్తే రంగు తీసిన తర్వాత వాడు మామూలు మనిషేగా. కాబట్టి వేషము లేని, భాష లేని, భావము లేని, మనస్సు లేని, ఆత్మను మాత్రమే ఎరిగినటువంటి నిత్య అవధూతలు వీళ్ళంతా కూడా జ్ఞాన సముపార్జన చెయ్యరు. వీరు అక్కడికి వచ్చాక చాలా కలిగినయి అని చెప్తారు. నిజానికి అరుణాచలానికి వచ్చిన తర్వాత రమణ మహర్షి పొందింది ఏం లేదు. పొందిందంతా బయటే పొందారు. పొంది అరుణాచలానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మామూలుగా ఆత్మానుభవం పొందిన తర్వాత వాడికి ప్రపంచంతో రకమైన సంబంధం ఉండదు. general గా ఉండదు. మరి వారు ఆత్మానుభవం పొందాక అరుణాచలం ఎందుకు పోవాలి? అరుణాచలానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే ఆత్మానుభవం పొందిన తర్వాత కూడా ఆత్మ వలే జీవించవచ్చు అని ఋణాం నిదర్శనమయం. మనకో నిదర్శనం కావాలి. ఇవాళ ఎవడో అందరూ కూర్చొని ఉంటారు పాపం అటు ఇటు తెలియని గురువుగారు వీళ్ళలో కుండలినీ లేచింది అంటాడు. పాపం వాడు మాయలో పడిపోతాడు. కుండలినీ లేచిందో పడుకుందో వీడికి ఎలా తెలుసు? వాడికి తెలీ-ఆయ్ లేచిన వాడికే తెలియదు, చూసిన వాడికి అసలే తెలియదు గనుక ఇవన్నీ కూడా These are all called dogmas. మనంతట మనం సృష్టించుకునేవి. ఇది ఏదీ లేని, రకమైన ముసుగు లేని, నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన, అనంతమైన, అవ్యయమైన, అచ్యుతమైన, అఖండమైన, అనాహతమైనటువంటి ఒక్క ఆత్మను గురించి ప్రపంచానికి చెప్పటానికి వచ్చిన జ్ఞానైక మూర్తి ఎవరు అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. అందువల్ల ఇవాళ మనం ప్రారంభమే కాస్త late గా చేశాం. కారణాలు చాలా. ముందు స్వామి వారికి చేసేటువంటి హారతిని మనం కూడా చక్కగా విన్నాం. మనమేమీ time waste చేసుకోలే. దిల్సుఖ్ నగర్ మందిరానికి మనం ఎన్ని సార్లు వచ్చాం గనుక, వచ్చినా దండం పెట్టుకోవటం వెళ్ళిపోవటం. అక్కడ ఏం నిలబడేదే ఉండదు. మనిషి మరి ఎందుకు పరిగెత్తుతున్నాడో, ఇక్కడికి ఎందుకు వస్తున్నాడో, ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నాడో తెలియదు. రేపటి నుంచి ఇందాక వారు నాకు చెప్పారు గనుక, ఇవాళ గంట ప్రారంభం late అయినా ఇంకొక పదిహేను నిమిషాలు మీరు prepare అయి రాలేదు గనుక, మీ కోసం, నాకైతే ఇబ్బంది లేదు. నేను ఇంకో అరగంట చెప్పగలను, ఇంకో గంట కూడా చెప్పగలను. కానీ ప్రతిదీ time కి లోబడి చేయాలి. కాబట్టి ఒక పదిహేను నిమిషాల్లో మనం ప్రసంగాన్ని ముగిద్దాం. రేపంతా ఉంది కాబట్టి రేపు అందరూ ఆరున్నర కల్లా చేరుకోండి. అప్పటికి హారతి వినాలే అంటే ఆరుకే రెండు వచ్చి కూర్చోండి. ప్రసంగం వినాలంటే ఆరున్నర కల్లా వచ్చేసేయండి. ఇది. సరే, ఇది ఇట్లా ఉండగా భగవాన్ అన్నారు సరే, అకర్తృత్వము, doership ఉండకూడదు అనేది ప్రధానమైన principle. ఇందాక చెప్పాం అన్నీ మనమే చేస్తున్నామని, మనం చాలా చేశామని, ప్రపంచానికి చాలా చేస్తున్నామని, ఇచ్చామని మనం అనుకుంటాం. అవేమీ అనుకోవద్దు అన్నారాయన. అకర్తృత్వం doership లేకపోతే మనస్సు హాయిగా ఉంటుంది. నేను చేస్తున్నాను లో నుంచి బరువు పెరుగుతుంది, పరువు తగ్గిపోతుంది రెండు.కనుక భగవాన్ నెమ్మది నెమ్మదిగా అరుణాచలం పైన ఉండేవారు. ఎండకి ఎండి వానకు తడిసి దేహ భావన దాటి దేహాత్మ భావన నశించి సంపూర్ణమైన ఆత్మైక స్థితిలో నిలకడ చెందినటువంటి మహా చైత్య పురుషుడిని చూసి మన బోటి వాళ్లలో ఒకడు కందస్వామి అనేటువంటి ఆతడు నాలుగు పా-- స్తంభాలు పాతి ఒక చిన్న ఆశ్రమం లాగా ఆశ్రయం లాగా కట్టాడు ఆయన. దాని మీద దొరికిన ఆకులతో పైన పందిరి లాగా వేశాడు వచ్చి దానికి రమణ ఆశ్రయము అని పేరు పెట్టాడు. రమణ నివాసం అని పేరు పెట్టాడు. మామూలుగా భగవాన్ అలా వచ్చేప్పటికీ తన కళ్ళ ముందు అప్పటిదాకా లేని ఒక ఆశ్రయం ఆశయం లేకపోతే ఇంకా ఇవన్నీ ఏర్పడ్డ ఆవాసం ఏర్పడిందని చూస్తే భగవాన్ మీరు అట్లా ఎండకి ఎండిపోవడం బాగాలేదు వాన పడుతున్నా మీరు కదలటం లేదు మాకు ఆశ్చర్యంగా ఉంది. ఆకలి అని అడగరు మంచి నీళ్ళు అని అడగరు ఎట్లా ఇది మీరు ఇక్కడ స్థిమితంగా ఉండాలి అందుకే దీనికి రమణ నిలయం అని రమణ నివాసం అని పేరు పెట్టాను అంటే నేను కట్టానా? దీనిలో నా ప్రమేయం ఏదైనా ఉన్నదా? ఇది కావాలి అని ఎవరినైనా నేను అడిగానా? కందస్వామి నీవే కట్టావు గనుక అది నీ పరమైనటువంటి కర్మ యోగం గనుక దీనికి స్కందాశ్రమము అని పేరు పెట్టి కందస్వామి అన్నా స్కంద అన్నా ఒక్కటే కాబట్టి అది ఇవాళ స్కందాశ్రమము అనే ప్రదేశం అక్కడ ఒక నిత్య జలధార ఒకటి ఉంటుంది. సన్నటి జలపాతం నీళ్లు పరమాద్భుతంగా ఉంటాయి. సరే అక్కడ ఆయన ఉన్నారు ఇంతలోకే బిడ్డను వెతుక్కుంటూ అళగమ్మ వెంకట్రామణ తల్లి ఆమె అరుణాచలానికి చేరుకున్నది. ఇక్కడేదో బ్రాహ్మణ బాలకుడు అంటున్నారు మౌనస్వామి అంటున్నారు మంచి బంగారు పసిమి ఛాయలో ఉన్నాడు ఆరడుగుల మూడంగుళాల పొడుగు అజానుబాహు మహా తేజస్వి ఇవన్నీ విని వే-- వెతుక్కుంటూ వెంకట్రామణ నేమో అంటూ వచ్చింది ఆమె వస్తే తన కొడుకే. ఎదురుగా కూర్చుంది. నాయనా కడుపు నిండా బిడ్డల్ని కన్నాను అందరికీ పెట్టిన చెయ్యి నీకు నీ కడుపు నింపదా? ఎందుకని ఉన్న ఊరు నీ కన్నతల్లిని వదిలిపెట్టి అరణ్యంలోకి వచ్చావ్? రా ఇంటికి వెళ్లిపోదాం అంది. ఆమెకి ఈయన స్థితి తెలియదు. అడిగితే ఆయన మౌనం వహించారు. మౌనం వహించి మౌన భూమిక లో ఉంటే నిరంతరం రోదిస్తున్నది తల్లి హృదయం కదా! మాతృ వాత్సల్య విశేషం చేత బాధ పడుతున్నది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి భక్తులు లేదా అక్కడికి చేరిన వాళ్ళు మేము అడిగితే మీరేం మాట్లాడటం లేదు సాక్షాత్తు మీకు జన్మనిచ్చిన తల్లే వచ్చింది వెతుక్కుంటూ వారితో ఏదన్నా ఒక్క నిమిషం మాట్లాడి ఉపశమనం కలిగించండి అని అందరూ అడిగారు. ఆయన అప్పుడు ఒక పలక మీద. నాము రోజుల్లో నాము ఇప్పుడు పోయింది అది ముగ్గు నాముతోనే వేసేవారు. ఇవాళ చాక్ పీస్ లాంటిది అనుకోండి నాము తెలిసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. నాముతో ఆయన ఏం రాశారు అంటే కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఇది జరిగి తీరాలి అని నీవు ఎంత ప్రయత్నించినా అది జరగదు. ఇది జరగకూడదు అని నీవు ఎంత నిరోధించినా అది జరగక మానదు. అంటే జరగవలసింది జరుగుతుంది కనుక మౌనం వహించటమే సర్వోత్తమము అని పలక ఆమె చేతికి ఇచ్చారు. అది రమణ మహర్షి ప్రపంచానికి ఇచ్చిన పరప్రథమ సందేశం. ఇవాళ మనక్కూడా చాలా అవసరం. దీనికి personality unfoldment క్లాసులు పెట్టక్కర్లా, లేకపోతే శివఖేరా పుస్తకాలు తెచ్చి చదువు బట్టీ పట్టక్కర్లా. ఏది జరగాలో అది జరుగుతుంది. అంటే వితండవాదంలో ఏమంటారంటే అయితే మనం ఏం చేయక్కర్లేదు అన్నమాట. కాదు. కర్మానుబంధి మనుష్య లోకే మనం కర్మ చేయటానికి వచ్చాం. మనం చేస్తూ వెళుతూ ఉండాలి. దాని ఫలితాలు వాటంతట అవే మన ప్రాప్తిని బట్టి వస్తాయి. కనుకనే తర్వాత కాలంలో భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో మొట్టమొదటి శ్లోకాన్ని "కర్తృ రాజ్న్య ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం" ఏమిటి కర్మ కర్మ కర్మ యజ్ఞం చేయండి వైకుంఠానికి వెళతారు, యజ్ఞం చేయండి ఉత్తమ లోకానికి వెళతారు, కర్మలు చేయండి ఇంకా బాగా ఉంటుంది. బాగా ఉండటం is it not relative అని ప్రశ్నిస్తూ, నీవు ఎంత ప్రయత్నించినా, నీవు ఎంత కర్మ యోగంలో మునిగినా, నీటి ప్రవాహంలో నుంచొని పిడికిలిట నీటిని పట్టలేం. పాదరసాన్ని అరచేతిలో బంధించలేం. గాలిని బంధించలేం. అట్లాగే కర్త జీవుడి యొక్క ప్రారబ్ధాన్ని బట్టి ప్రాప్తిని బట్టి అనుగ్రహిస్తాడు కర్మలన్నీ జడాలేనన్నారు. కర్మలన్నీ నీ చేతి మీదిగా సాగేవి. నీ చేతిలో కర్ర ఉంది కర్రతో ఎవరినో కొట్టావు. కొట్టింది ఎవరు అంటే తెలియని వాడేమో కర్ర కొట్టింది అంటాడు. నిజమే కర్రే కొట్టింది. కర్మను పట్టుకున్నది ఎవడు అని మనిషి. మనిషి ఎందుకు కొట్టాడు? వాడిని ఇంద్రియం దాన్ని శాసించింది అంటే మళ్ళీ ఒక్కసారి కేనోపనిషత్ అంతా ఒక్క శ్లోకం ఒక కేనోపనిషత్ కు వ్యాఖ్యానం అది. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" అన్నటువంటి భగవద్గీతా సారానికి వ్యాఖ్యాన సదృశమైనది ఉపదేశసారంలో మొట్టమొదటి శ్లోకం. ఇటువంటివి అనేకం చెప్పారు. ఇట్లా నడుస్తూ ఉండగా అందరూ సహజంగా మాతృమూర్తి ఇంకా ఆవిడ decide చేసుకుంది ఆమె ఉండిపోయింది. తన కొడుకుగానే భావించింది కొన్నాళ్ళు.కానీ వస్తున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు అనుభూతులు పొందుతున్న వారు ఈయనని ఒక అలౌకికమైనటువంటి వ్యక్తిగా భగవంతుడిగా భావన చేయటం మొదలు పెట్టాక ఆమెకు కూడా కొన్ని అనుభవాలు అనుభూతులు కలిగిన తర్వాత ఆతడు ఇకపై తన బిడ్డ మాత్రమే కాదని ప్రపంచానికి మహోపదేశం చేయటానికి వచ్చినటువంటి చైత్య పురుషుడు అనే భావనతో ఆమె మనసు కూడా అక్కడ నిలకడ చెందింది. కనుక ఇటు లౌకిక అటు పారలౌకిక ఆధ్యాత్మిక అనుభవాలని అడగమ్మ సొంతం చేసుకొని మహర్షికి తాను జీవించి ఉన్నంత కాలం సమయానికి కాస్త అన్నం వండి పెట్టింది. అయితే ఏనాడు మహర్షి తల్లి చేస్తున్నదనో, తల్లి చేతి వంట తింటున్నాననో, ఇది కావాలనో, ఇది అక్కరలేదనో, ఒక్కనాడు వారు నొరు విప్పి చెప్పలేదు. పైగా తదనంతర కాలంలో శాంతమ్మ అనేటువంటి ఒక వంటావిడ "ఇవాళ భగవాన్ కి ఇంతవరకు ఏది ఇష్టమో మనకు తెలియదు. ఒకసారి వెళ్లి అడుగుదాం అంటే ఆయన చెప్పరు" అని ఏం చేసిందంటే చాలా శ్రద్ధగా నాలుగు గంటలకే లేచి రకరకాల వస్తువులన్నీ కూడా తయారు చేసి ఆరోజు భగవాన్ విస్తట్లో వడ్డించి నెమ్మదిగా ఒక మాట చెప్పబోయింది. ఇంతలోకే పక్కన ఎవరో భగవాన్ తో మాట్లాడారు ఆవిడ వెళ్ళిపోయింది లోపలికి. ఆవిడ కోరిక ఏమిటంటే తాను వండినటువంటి ప్రతి వస్తువుని కూడా ఒక్కొక్కటిగా ఆయన తిని "శాంతమ్మా! నువ్వు చాలా బాగా చేశావు" అని అనాలని అంటే వినాలని ఆత్మ తృప్తి కలుగుతుందని ఆమె ఆలోచన. సరే భగవాన్ భోంచేశారు. అన్నీ కలుపుకున్నారు. ముద్ద చేసుకున్నారు. తిని వెళ్లారు. చేయి కడుక్కుంటుంటే ఆమె ఏకాంతాన్ని సృష్టించుకొని రెండు నిమిషాలు భగవాన్ దగ్గర నుంచొని "భగవాన్! ఎంత శ్రమ పడ్డానో, మీకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నంలో చాలా చేశాను. మీరు అన్నీ కలిపి ఒక ముద్ద చేసేసి తినేశారే! ఎట్లా?" అన్నది. ఆయన అన్నారు "శాంతమ్మ! నాకేమో అంతా ఒక్కటే అనుకోవటం నాకిష్టం. మీకేమో ప్రతి వస్తువు వేరు వేరు అనుకోవటం మీకిష్టం. అలాగే సక్కాని" అన్నారు. అంతే కానీ ఆమెను తృప్తి పరచడం కోసం తన విధానాన్ని తాను మార్చుకోలేదు. అంటే రుచిని దాటి, చాపల్యాన్ని దాటి, కోరికను దాటి, ఇది కావాలి అన్నటువంటి భావనను దాటి తాను పొందినటువంటి ఒక ఆత్మానుభూతిని తన శరీరంలో యాభై నాలుగు సంవత్సరాలు నిలిపిన ఏకైక మహాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఎవరిది అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షిది. ఎవరో ఎక్కడో మనస్సు అటూ ఇటూ అయినప్పుడు కోపగిస్తారు, ఆగ్రహిస్తారు, అది కావాలి, ఇది కావాలి తెచ్చివ్వండని అడుగుతారు. అసలు ఏమీ లేదు ఏమీ అక్కరలేని ఒక అద్భుతమైన స్థితి. కాబట్టి భగవాన్ దగ్గరికి పామరులు వచ్చారు, పండితులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు. పందొమ్మిది వందల ఇరవై నాటికే France నుంచి లండన్ నుంచి వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఉన్న స్వసుఖాలన్నీ వదిలిపెట్టి మండుటెండలో జరజరా పాకే పాములు, మీద పడేటువంటి కోతులు అక్కడ లేని కీటకాలు లేవు జంతువులు లేవు. అన్నీ కూడా పులులు ఉండేవి రోజుల్లో. అటువంటి సమయంలో దేశానికి వచ్చి శాంతిని వెతుక్కుంటూ పొందాలని కోరుకుంటూ సత్యాన్వేషణ చేస్తూ భారత దక్షిణ భారతంలో ఉన్నటువంటి అరుణాచలానికి తిరువణ్ణామలైకి చేరుకుంటే అరుణాచలానికి మహర్షి రాకముందు అరుణాచలం ఉంది. ఎప్పటినుంచి ఉందంటే పురాణ కాలం నుంచి అరుణాచలం ఉంది. [నవ్వు]
YouTube · audio

Sri Ramana Maharshi Vybhavam Part III

Home

Sri Ramana Maharshi Vybhavam Part III

Source: P V S on YouTube

0:00 / 23:07

More in this series

Sri Ramana Maharshi Vybhavam

3 episodes · 1 hr 17 min

  1. 30 min 1

    Bhagawan Sri Ramana Maharshi Vybhavam Part I

  2. 21 min 2

    Sri Ramana Maharshi Vybhavam Part II

  3. 22 min 3

    Sri Ramana Maharshi Vybhavam Part III

    Now playing