Skip to content
Transcript తెలుగు
ఇరవై ఎనిమిది, ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు అంటున్నామే స్థూలంగా ఒక అరగంట చేయాలి. ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చోగానే అనేకమైన ఆలోచనలు వస్తాయి. ధ్యానం ఆగిపోతుంది. సాగదు. ఏం చేయాలి? ఆపేసెయ్. మళ్ళీ ధ్యాన ప్రక్రియను మొదలు పెట్టుకో. అసలు సాగటం లేదు ఆరోజున, వదిలేసెయ్. ధ్యానం అనేది ఒక తంతు కాదు, అది ఒక మానసికమైనటువంటి శిక్షణ. ఎప్పుడైతే మనిషి ప్రయత్నం అంతా చేస్తాడో, ప్రయత్నం ఎలా చేయాలో చెప్తున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆద్య ధారయ స్రోతసా సమం. ఒక నిర్జర నదీ ప్రవాహంలో ఉండాలి అది. ఆగకుండా ఉండాలి. లోపల ఏర్పడేటువంటి అనాహత నాదం వలే ఉండాలి. ఆగని నాదం వలే ఉండాలి. uninterrupted గా ఉండాలి. consistent గా ఉండాలి. continuous గా ఉండాలి. యజ్ఞం చేస్తుంటాం, యాగం చేస్తుంటాం. యజ్ఞ గుండంలో నెయ్యి పోస్తూ ఉంటాం. ధార ఆగకుండా ఎట్లాగైతే నేతి ధార ఒక సన్నని దారం దిగుతున్నట్లుగా ఎట్లాగైతే పోస్తారో, ఒకే స్థితిలో దాన్ని ఎట్లా దానిలో పోస్తారో, ధారని ఎట్లా కొనసాగిస్తారో. ధార అంటే తెగనిది అని అర్థం. ధారము అంటే తెంపవలసినది, తెంపుకోవలసినది అంతే. కాబట్టి ఇక్కడ ధార చాలా important. ఆద్య ధార నేయము, నెయ్యి అని ఎందుకు వాడారు అంటే ఆద్యం అంటే నెయ్యు. నెయ్యము ఉండాలి. నెయ్యం అంటే స్నేహం ఉండాలి. ఎవరితో? నీలో ఉన్న ఆత్మతో నెయ్యము ఉండాలి. నెయ్యములో నెయ్యి ఏర్పడాలి. నిరంతర ధార జరుగుతూ ఉండాలి. అక్కడే నా ఇతి నా ఇతి నేతి నేతి నేతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటూ నీ లోపలికి నువ్వు వెళ్లగలిగిన ప్రయత్నం చేయాలి. a continuous consistent uninterrupted flow దీని పేరు ధ్యానం అన్నారు. ఆద్య ధారయా స్త్రోతసా సమం. సరళ చింతనం సరళమైన చింతన. సరళము అంటే సూటి అయిన. ఒక light wave ఎట్లాగైతే straight సరళ రేఖలా వస్తుందో, sound wave ఎట్లా transitional గా వస్తుందో గమనించుకున్నప్పుడు ధ్యానం తెగి ఆగి, ఆగి తెగి ఇట్లా simultaneous గా alternative గా సాగితే దాని పేరు విరళ చింతనం. ఆగుతోంది, మళ్ళీ మొదలవుతోంది, మొదలవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కుదురుతున్నట్లుగా ఉంది, కుదరటం లేదు. కుదిరింది అనుకునేలోగా కుదరకుండా పోతున్నది. అది విరళతః పరం. అది వదిలిపెట్టెయ్. దాన్ని దాంతో నువ్వు సంబంధం పెట్టుకోకు. దేనితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి, నెయ్యము దేనితో ఉండాలి అంటే ఆద్య ధార. యజ్ఞ వాటికలోకి ఎట్లాగైతే మనం యజ్ఞ గుండంలో హవిస్సులు వేస్తూనే నేతిని ఎలా ధారగా పెడతామో, నీ చింతన ఏదైతే ఉన్నదో దానిని సరళం చెయ్. సరళం చెయ్ అంటే చింతన? నేను ఎవరు అన్న ప్రశ్న. ఇదే చింతన. నేను ఎవరు, నేను ఎవరు పైకి అనుకోవటం కాదు. అది వాచ్యం కాదు. మానసికమైనటువంటి నేను ఎవరన్న ప్రశ్నని నేను ఇది కాదే, ఇది కాదే, ఇది కాదే, ఇవన్నీ పోయేవేనే మరి ఉండేది ఏమిటి అన్నటువంటి ఆలోచన కలిగించుకుంటూ, నా శాస్త్ర పాండిత్యాలు గాని, నా అహంకారాలు గాని, నా భౌతిక స్థితిగతులు గాని, నా మానసిక పరిస్థితులు గాని, నేను ఎక్కడో అధ్యాత్మలో చాలా చివరి అంచుకు వెళ్లానన్న అహంకారం గాని వదిలిపెట్టి ఎవరైతే సరళ చింతనం చేస్తారో, నన్ను నేను ఎరుగు ప్రయత్నం చేస్తారో అది నిజమైనటువంటి ధ్యానం. consistent గా ఉండాలి. conviction తో ఉండాలి. నమ్మి చేయాలి. నమ్మి చేస్తూ, చేస్తూ ఉంటే ధార మనం రాధాస్వామి సత్సంగం అనేది వింటూ ఉంటాం. వాళ్ళు దేనిని ఉపాసన చేస్తారంటే శబ్ద బ్రహ్మాన్ని ఉపాసన చేస్తారు. ధార అనేటువంటి దాన్ని తిప్పి చదివితే దాని పేరు రాధ. రాధ శబ్దమయం. శబ్ద నిశ్శబ్దాల మేలు కలయికే రాధాకృష్ణులు. ధార అనంతంగా ఉండాలి. అనాహతంగా ఉండాలి. ఆగకుండా ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఎడతెరిపి లేకుండా ఉండాలి. ఇంత జరిగితే అది ధ్యానం. ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లలో ఏం జరుగుతుంది ధ్యానంలో అంటే మామూలుగా వేళ ధ్యానంలో రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అని మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆజ్ఞాచక్రం మీద అంటే రెండు కనుబొమ్మల మధ్య ఎక్కడ మనం కుంకుమ లేక విభూతి ధారణ చేస్తామోదానిమీద ధ్యానించినప్పుడు మనసును లగ్నం చేసినప్పుడు మనసు ప్రాపంచికమైనటువంటి దృశ్యాలను దాటి, లౌకిక భావనను దాటి, అలౌకికమైనటువంటి అనేక మూర్తులు, అనేక బొమ్మలు, అనేక దృశ్యాలు కనుక్కుంటుంది, చూస్తుంది. అక్కడ మనసు ఉంది. ఆజ్ఞాచక్రం మీద చేయండి అక్కడి నుంచి సహస్రారానికి వెళతారు అని అదొక ధ్యాన ప్రక్రియ. భగవాన్ దాన్ని ఇక్కడ ఉపాసనా మార్గంగా చెప్పటంలే. చాలా కీలకమైనటువంటి శ్లోకం ఇది. నువ్వు ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళావ్ అంటే మూలాధారంలో ప్రారంభమైనవ్, స్వాధిష్ఠానానికి వెళ్ళావ్, మణిపూరకానికి వెళ్ళావ్, హృదయ స్థానమైన అనాహతం దాకా వచ్చావ్, సెంట్రల్ పాయింట్ కి వచ్చావ్, విశుద్ధ కంఠస్థానం దాకా వెళ్ళావ్ అక్కడ పాడుతున్నావ్, ఆడుతున్నావ్, ఉపన్యాసం చెప్తున్నావ్, ప్రవచనాలు మాట్లాడుతున్నావ్, చేస్తున్నావ్ అనేకమైన హావభావాలున్నాయి. సరస్వతీ స్థానంగా భావన చేశావ్ అక్కడ నుంచే వాక్కు బహిర్గతం అవుతున్నది. వాగ్ రూపమైనటువంటి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి, సుందరమైనటువంటి భాషతో నీ భావాన్ని అభివ్యక్తి చేస్తున్నావ్. దాన్ని కూడా దాటవ్. ధ్యానిస్తున్నావ్ ఆజ్ఞాచక్రం మీద. కాసేపైన తర్వాత నీకు ఏదో ఒక దృశ్యం కనిపించింది. ఎక్కడో ఉన్న హిమాలయాలు కనిపించినాయి. నువ్ ఇంతవరకు వాటిని చూడలా. ఎక్కడో దేశంలోనో జరుగుతున్నటువంటి ఒకటి తెర మీద ఫ్లాష్ అయింది. ఆశ్చర్యపోతున్నావ్. నేను దేశం ఎప్పుడూ వెళ్లలేదే, నాకెలా కనబడుతున్నది అని. ఇవన్నీ మనసు చేసే పనులు. అంటే ఆజ్ఞాచక్రం మీద ధ్యానించినప్పుడు మనసు కొంత శుభ్రపడిన మనసు గనక శుద్ధమైనటువంటి వాటినన్నిటినీ కూడా పరిగ్రహిస్తూ ఉంటుంది. ఒక శాటిలైట్ ఎట్లాగైతే, ఇవాళ శబ్ద తరంగాలను అందుకొని మనకి కనెక్టివిటీ ఇస్తున్నదో ఆజ్ఞాచక్రం మీద ధ్యానించినప్పుడు మనకి అటువంటి సిద్ధి కలుగుతుంది. అది తాత్కాలికమైన సిద్ధి. దృశ్యం అక్కడ రాముడు కనిపించాడు అని మనకు అనిపిస్తున్నది. కనిపించిన వాడు రాముడో, కృష్ణుడో మనకు తెలియదు. ఎవరో కనిపించారు, రాముడనుకున్నాం. బొమ్మ అలవాటైంది గనుక పోల్చుకోగలిగాం. ఇది సరళ చింతనానికి మార్గం కాదిది. దృశ్యం కనపడగానే వెంటనే ధ్యానం ఆగిపోతున్నది. లేదు ఒక పాతకాలపు గతస్మృతి మళ్ళీ మరొక్కసారి సందర్భం సన్నివేశం. మనల్ని వీడిపోయినవారు, మరణించినవారు, మనకు కావలసినవారు, మనల్ని ప్రేమించినవారు, మనము ప్రేమించినవారు వాళ్లంతా దృశ్యంగా కనిపిస్తున్నారు. ఉన్నారా? లేరే. లేరన్న సత్యంలో నుంచి ఉన్నారేమో అన్న భ్రాంతిలోకి తీసుకువెళుతుంది గనుక అది విరళ తత్పరం, విరళమైనది. ప్రతికూలమైనటువంటి ధ్యానం అది. uninterrupted గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆజ్ఞాచక్రానికి వెళ్ళి అక్కడ మనస్సుని ధ్యానంలో పెట్టుకొని ధ్యానించినటువంటి వారిలో ఎవరైనా సరే నాకక్కడ ఏమీ కనపడటం లేదు అని గనక చెప్తే వారు ఆజ్ఞాచక్రంలో చక్కగా ధ్యానించినట్టు లెక్క. ఏదో కనబడుతున్నదని గాని, వినపడుతున్నదని గాని, ఎవరూ చూడనివన్నీ నేను కదలకుండా చూడగలిగానని గాని గనక చెప్పగలిగినట్లయితే లేదా చెబుతున్నట్లయితే అది విరళ ధ్యానమే గాని సరళ ధ్యానం కాదు. మనకు కావలసింది సరళ ధ్యానం. ఎవరినో చూట్టానికి మనం ధ్యానించకూడదు. మనల్ని మనం చూసుకోవాలి. మనం ఎవరంటే, యః మహమితి సాక్షాత్తు ఆత్మ రూపేణ భాతి. నేనుని, నన్ను నేను చూసుకోవాలి. నన్ను అంటే దేహాన్ని కాదు. రూపాన్ని కూడా కాదు. నేను అయినటువంటి ఆత్మని తేజోమయంగా ఉన్నటువంటి వెలుగు ముద్దను నేను చూడాలి. అక్కడ నాకు ఇంకా దృశ్యాలు లేవు, వస్తువులు లేవు, శ్రుతులు లేవు, స్మృతులు లేవు, జ్ఞాపకాలు లేవు, వాసనలు లేవు, పూర్వ వాసనలు లేవు, మూల వాసనలు లేవు. మరి ఏమున్నాయి అంటే, ఏమీ లేదు. మనసేం చేస్తుంది? ఏమీ లేదు కాబట్టి అది ఊరకున్నది. అది ఊరికే ఉన్నది, అంతే calm గా కూర్చుంది. ఇది ఆజ్ఞాచక్రం యొక్క అంటే దానిమీద మనం గనక ధ్యానిస్తే వచ్చేటువంటి ఒక ఫలితం. ఇక్కడ కాస్త ఒక విశ్లేషణ, మనకు అవసరమైన విశ్లేషణ కాబట్టి. ప్రపంచంలో మూడు రకాల జ్ఞానులుంటారు. అంటే వాళ్ళు జ్ఞానులే. ఒకరు కుంకుమ ధారణ చేస్తారు, రెండవవారు విభూతి ధారణ చేస్తారు, మరొకరు కుంకుమ విభూతి కలిపి పెట్టుకుంటారు పక్కపక్కన. మూడవ స్థాయి వారు ఏం పెట్టుకోరు. కుంకుమ చైతన్యానికి సంకేతం. విభూతి వైరాగ్యానికి సంకేతం. విభూతి అంటే irreversible. మళ్ళీ తన యధాపూర్వ స్థితిని అది పొందలేని స్థితి. వడ్ల గింజలున్నాయి, గుప్పెడు తీసుకుని కుండీలో వేస్తే కొద్ది రోజులకు మొలకలు వస్తాయి. అదే గుప్పెడు బియ్యం తీసుకుని కుండీలో వేస్తే ఏమీ రాదు దాంట్లో నుంచి. కారణం ఏమిటి అంటే ధాన్యానికిపొట్ల గింజలకి పైన రెండు పొట్లు ఉన్నాయి ఒకటి పొట్టు రెండవది చిట్టు ఒకటి ఎపికార్ప్ రెండవది ఎండోకార్ప్ బయటకు కనిపించేది పొట్టు లోపల అంటుకొని ఉన్నది చిట్టు రెండు తొలగిస్తేనే బియ్యం ఏర్పడుతున్నాయి. పొట్టు చిట్టు రెండు ఏమిటంటే ఒకటి అహంకారం రెండవది మమకారం. రెండు ఉన్నంత కాలం మొలకెత్తక తప్పదు. రెండు మన బోటి వారికి ఉన్నంత కాలం మనకు జన్మ తప్పదు. మనం ఏం కావాలి బియ్యం వలె కావాలి. అయిన తర్వాత అది ఉడకాలి అన్నం కావాలి. మెతుకు లోపలికి వెళ్ళాలి అది ప్రాణం కావాలి. ప్రాణంలో నుంచి మనస్సు ఏర్పడాలి మనస్సులో నుంచి విజ్ఞానం ఏర్పడాలి విజ్ఞానాన్ని దాటి అంచులు దాటినప్పుడు ఒక ఆనందమయ రేఖ మనకు కనిపించాలి. అందుకనే అన్నానికి కలియుగంలో అంత విలువ. అన్నం అంటే ఆకలి తీర్చుకునేది కాదు మనస్సును నిర్మించేది ప్రాణ శక్తిని నిలబెట్టుకునేది ఇంటలెక్ట్ ని షార్పెన్ చేసేది విజ్ఞానమయూఖ అది. అలాగే పరమానంద రేఖ కాబట్టి అన్నం వలె చిట్టు పొట్టును వదులుచుకొని పై వాటినన్నింటినీ వదులుచుకొని ఉండగలిగినట్లయితే అది అత్యుత్తమ ధ్యానం. ధ్యానంలో కుంకుమ పెట్టుకో విభూతి పెట్టుకో మరి రెండో వాడు ఏమిటి అని ఒకడు వైరాగ్యంలో విభూతి పెట్టుకున్నాడు రెండో వాడు చైతన్యంలో పెట్టుకున్నాడు. వైరాగ్య విభూతులు రెండు కావాలనుకున్న వాడు రెండు పెట్టుకున్నాడు కానీ మూడో వాడు ఏమీ పెట్టుకోవటం లేదు. కానీ వాడు జ్ఞాని ప్రపంచంలో. పైన చిహ్నాలు లేవు కానీ మహత్తరమైనటువంటి జ్ఞాన భూమికలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పెట్టుకోలేదు? అంటే ఆతడు ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళాడు. ఆజ్ఞా చక్రం దాకా వెళ్ళిన తర్వాత నిజానికి కార్యకలాపాలు ఏం పెద్దగా ఉండవు. కానీ కార్యకలాపాలు చేయాలి అంటే ఆజ్ఞా చక్రానికి కింద స్థాయిలో నుంచి మన విశుద్ధ చక్రం నుంచి మనం పనులు చేయాలి మాట్లాడాలి మాటలు వినాలి ఇంద్రియాలను మంచి కార్యకలాపాల్లో ప్రవేశపెట్టాలి ఇంద్రియాలను మనం శాసించే రీతిలో మనం జీవించాలి. దీనికి రెండు ఉదాహరణలు శ్రీరాముడు ఉన్నాడు శ్రీ రామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడు రాజకుమారుడు ఆయన. ఆయన అరణ్య కాల అరణ్యవాసం లో నామం ధరించాడు శ్రీరామనామం అంటే పేరనే కాదు ఆయన పెట్టుకున్న తిలకం కూడా నామమే.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -23

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -23

Source: TFC Spiritual on YouTube

0:00 / 16:20

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

    Now playing
  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77