Skip to content
Transcript తెలుగు
మంత్రమయమ కార్యక్రమంలో ఉపనిషత్ వాహిని క్రమంలో మనం ఉపనిషత్తులు చర్చించుకుంటున్నాం. క్రమంలో భాగంగా రోజు ముండకోపనిషత్ గురించి ఆధ్యాత్మిక వేత్త వి.ఎస్.ఆర్.మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నమస్కారం అమ్మ గురువుగారు ముండకోపనిషత్ అసలు దాని అర్థం ఏంటంటారు? దీనిలో రెండు ఉన్నాయి. ముండకుడు అనేటువంటి ఒక మహర్షి అధర్వణ వేదంలో దీని గురించిన ప్రస్తావన తెచ్చి ప్రచారంలోకి తెచ్చారు. ప్రచారం అంటే నలుగురికి బోధించాడు ఆయన. దాన్-దాంట్లో ఉన్న విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు గనుక ఆయన పేరు మీద అధర్వణ వేదంలో ముండకోపనిషత్తు అని ఒక మాట. అసలు ముండకము అంటే సన్యాసము అని అర్థం. అంటే సన్యాసం? తెల్ల బట్టలు వదిలేసి కాషాయం కట్టడమా? ఆహ్ వేషం మార్చుకోవటమా? భాష మార్చుకోవటమా? లేదు ఇల్లు ఇల్లాలు అన్నీ వదిలి పెట్టడమా? అంటే అటువంటిది కాని ఒక సన్యాసం అనేదానికి యదార్థమైనటువంటి నిరూపణ చేసింది గనుక ఇది ముండక ఉపనిషత్. ముండకోపనిషత్ అధర్వణ వేదంలో చాలా ప్రధానమైనటువంటి ఆహ్ విషయమిది. దీంట్లో చాలా తీవ్రమైనటువంటి విచారధార ఉంది. దీని గురించి కొంచెం సూక్ష్మంగా చెప్తారా దీంట్లో ఏముంది అని. దీనిలో ఉన్నదంతా కూడా ప్రధానంగా జీవుడు, పరమాత్మ. ప్రకృతి, పరమాత్మ. బింబ ప్రతిబింబ భావాలుగా ఇలా ఉన్నాయి. అలాగే జీవుడికి అవస్థలున్నాయి. అవస్థలు అంటే కష్టాలు కాదు. జాగ్రదవస్థ, నిద్రావస్థ, సుషుప్తి ఇట్లా. అవస్థలు అంటే ఏమిటి? అవస్థల్లో జీవుడికి ఏం జరుగుతుంది? ఇదంతా విచారణ. అలాగే పరావిద్య, అపరావిద్య. అలాగే ప్రవచనాల వలన కలిగే లాభం ఏమిటి? అది చెప్పినటువంటి వాడు ముండకోపనిషత్తులో ఆయన ముండక మహర్షి. కాబట్టి తర్వాత ఇవాళ భారతదేశం సత్యమేవ జయతే అని ఉన్నది కదా. Truth alone triumphs అన్నాడు బ్రిటిష్ వాడు. సత్యమేవ జయతే అనే మాట పుట్టినటువంటి ఉపనిషత్తు ఇది ముండకోపనిషత్తు. అలాగే పధ్నాలుగు లోకాలు కనిపించినయి యశోదకి కృష్ణుడి నోట్లో అని మనం పాటలు కళా స్వరూపాల్లో విన్నాం. పధ్నాలుగు లోకాలు ఎక్కడున్నాయి? ఏది అతల, సుతల, వితల, పాతాళ ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ పక్కన పెట్టండి. అసలు పధ్నాలుగు లోకాలు ఎవడన్నా చూశాడా? చూసే అవకాశం ఉన్నదా? అవన్నీ చర్చిస్తుంది. చాలా మంచి ఉపనిషత్తు ఇది. గురువు గారు మీరే చెప్పారు అవస్థల గురించి. అవస్థల గురించి కొంచెం వివరంగా చెప్తారా? అవస్థలు మనమే ఉన్నాం. మనకున్న గంటలు అంటే గంటలు మనం నిర్ణయించుకున్నవి. ఇరవై నాలుగు గంటలు గనక తీసుకున్నట్లయితే పదహారు గంటలు సుమారుగా మనం జాగ్రదవస్థలో ఉంటాం. అవును అంటే మేలుకొని ఉంటాం. మేలుకొని ఉంటాం. అంటే ప్రాపంచిక లౌకిక సంబంధాలతో కూడిన కార్యకలాపాల్లో మన మనస్సు నిమగ్నమై ఉంటుంది. జాగ్రదవస్థకి ఇప్పుడు మనం చెప్పుకునే జాగ్రదవస్థకి అసలు జాగ్రదవస్థకి చాలా తేడా ఉంది. మేలుకొని ఉన్నదే జాగ్రదవస్థ కాదు. ఒక స్ఫూర్తితో అంతర్గతమైన భావనతో నిత్య సత్య అనుసంధానంతో ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో కాదు జాగ్రత్ మేలుకొని మేలుకొని ఉంటామో, ఎరుకతో ఉంటామో అది నిజమైన జాగ్రదవస్థ. అందుకనే జాగ్రదవస్థలోనే తురీయాన్ని గనక అనుభవించగలిగితే అదే శ్రీవైష్ణవ అని పేరు. జాగ్రదవస్థలో కూడా తురీయాన్ని అనుభవించితే దాని పేరు వైష్ణవం. దాన్నే meditation అంటారేమో కాదు కాదు. అదొక అవస్థ. అవస్థ అదొక అవస్థ. అక్కడ మెడిటేషన్ లేదు, యోగా లేదు, పరమాత్మ లేడు, జీవాత్మ లేడు, ఏమీ లేడు. ఏమీ లేనటువంటి ఒక శుద్ధ మహాశుద్ధ చైతన్య స్థాయి ఏదుందో అది తురీయ అవస్థ. అది మాట్లాడుదాం. కాబట్టి ఇవాళ జాగ్రదవస్థ ఇవాళ correlate చేసుకుని సమకాలీన ప్రపంచంలో మనందరం మన బోటి వాళ్ళందరం ఎట్లా ఉన్నాం అంటే సుమారు పదహారు గంటలు వ్యాపారమో, ఉద్యోగమో ఇంకోటో ఇంకోటో లేదా ఇటువంటి మంచి పనులో కార్యకలాపాల్లో ఉన్నాం. జాగ్రత్తగా మేలుకొని ఉన్నాం. అంతే ఎరుకతో లేం ఇంకా. ఇది రెండింటికీ ఉన్నటువంటి తేడా అమ్మ. తర్వాత దైనందిన కార్యక్రమాలు అయిపోతాయి. శరీరం అలసిపోతుంది. ఇక ప్రపంచం కూడా మనల్ని పెద్ద పట్టించుకోని టైము. మనకు మనం ప్రపంచంలోకి వెళ్ళినా మనం చేయగలిగింది లేదు. మరి అప్పుడు ఏం చేయాలంటే నిద్రాం సఖే కేవల కుంభకాం. నిద్ర అనేటువంటి సఖి ఆమె మనల్ని చెలికిత్తే. మన ప్రాణం దాన్ని నిద్రని ఆవేశిస్తాం మనం. నిద్రలో ఉంటాం. నిద్రలో ఉన్న జాగ్రదవస్థలో ఏముంది? నేను ఉంది. నేను ఉంది. నేను నా visiting card ఇస్తున్నా. నా credit card, debit card ఇంకా ఎన్ని cards ఉన్నాయో అన్ని cards చూపిస్తున్నా. అదే నేనని చెప్తున్నా. అదైపోయింది. ఇప్పుడు చూపించేది లేదు, చూసేవాడు లేడు. కానీ నిద్రావస్థలో పడుకొని ఉన్నాం. పడుకొని ఉన్నా నేను మేనులో ఉన్నదో మేనులో ఉన్న నేను మనసై జరిగిన దాన్ని చూపిస్తున్నది మళ్ళీ. జరగబోతున్న దాన్ని కూడా చూపిస్తుంది. అంటే ఏమవుతుందో ఏమవుతుందో కల. అయింది అయింది కల కదా. అటు కల లేదు ఇటు ఇలా లేదు. రెండూ లేవు కానీ ఒక అవస్థ మాత్రం ఉంది. అది ఎట్లా ఉన్నది అంటే నిద్రావస్థగా ఉన్నది. నిద్రావస్థలో మనం ఏమంటున్నాం అంటే పగలంతా పని చేసాం. బాగా పని చేసాం. ఏం చెప్తున్నాం చివర్లో? నేను అలసిపోయాను పడుకోనివ్వండి నన్ను కాసేపు disturb చేయొద్దు అంటున్నాం. అంటే పని చేసినప్పుడు మీకు చాలా అలసట ఏర్పడింది result అది. ఇంకా సంపాదనని పక్కన పెట్టండి. ఏదో ఫలితం ఉంటుందిగా. నిద్రావస్థలో ఎనిమిది గంటలో పది గంటలో మంచి నిద్రపోయి తెల్లవారు లేవగానే ఏమంటున్నాం అంటే ఎంత హాయిగా నిద్రపోయాను. ఎంత హాయిగా ఉందో మనసు తేలికగా ఉ-- ఇవన్నీ అంటున్నాం. అంటే ఏమీ చేయకపోతే ఇంత ఆనందం ఉందన్నమాట. మరి చేసినప్పుడు కలిగిన ఆనందానికి ఏం పేరు అంటే అది భౌతికమైన ఆనందం. దాని result కనబడుతుంది. ఏదో డబ్బు వచ్చిందో డబ్బు పోయిందో ఏదో ఉన్నాయి.ఇక్కడ పోయింది లేదు వచ్చింది లేదు రెండూ లేవు కానీ మనసుకు ఏదో హాయి ఉంది మరి ఏవి లేకపోతే హాయి అన్నమాట అంటే ఏది లేకపోవటమే ఆనందం అన్నమాట అని మనకు పది గంటలు నిద్రావస్థ చెప్తున్నది దానిలో మనసు మేల్కొని ఉంటున్నది మనసు కూడా ఒక శరీరమై అది పనిచేస్తూ ఉంటుంది తెరమీద బొమ్మలాగా ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నది ఇది నిద్రావస్థ అంతేకాదు గతించిపోయిన జన్మల తాలూకు వాసనను కూడా తెరమీద బొమ్మగా చూపించగలదు ఒకానొక స్థాయిలో అది యోగ స్థితిలో ఇక మూడవది తెల తెల వారుతూ ఉంటుంది నేను మెలకువ వచ్చింది మెలకువ వచ్చింది కానీ ఇంకా నిద్రలో ఉన్నాం అప్పుడే బయటకు రావాలని అనిపించటం లేదు క్షణంలో ఒక అవస్థ ఏర్పడుతుంది అవస్థ పేరు సుషుప్తి సుషుప్తి అవస్థలో మనకున్న ఇందాక చెప్పిన అనేక శరీరాలు ఉన్నాయే అవి కాక కారణ శరీరం అని ఒకటి ఉంటుంది మనకి అది వడ్ల గింజ మీద ఉండేటువంటి ఒక నూగు ఉంటుందే అంత ఉంటుంది కారణ శరీరం కారణ శరీరం మనం నిజానికి అదే మనం మిగతావన్నీ కాదు స్థూలం గ్రాస్ గా ఉన్నది మనం కాదు సటిల్ గా ఉన్నది మనం కాదు సటిలెస్ట్ గా ఏదైతే ఉన్నదో అది మనం కాబట్టి సుషుప్తి అవస్థలో మనం పరమాత్మ జీవాత్మగా ఉన్న మనం మన కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఒక శక్తితో ఒక దైవతంతో అనుసంధానం అయ్యేటువంటి సమయం అది అవస్థ అందుకనే సుషుప్తి అవస్థ చాలా సూక్ష్మంగా ఉంటుంది అది గంటలు గంటలు ఉండదు కొన్ని సెకండ్స్ ఉంటుంది నిద్రావస్థ ఏడు ఎనిమిది గంటలు ఉంటుంది జాగ్రదవస్థ గ్రాస్ చాలా పెద్దది పదహారు గంటలు అంటే పెద్దదాని నుంచి చిన్నదై చిన్నది చిన్నదై ఇంత అయిపోతుంది అంటే ఇదంతా ఏమవుతున్నది అంటే ఏది ఒక విరాట్ మూర్తిగా కనిపిస్తున్నదో అది లోపలికి వెళ్లి నువ్వు చూడగలిగితే దాని స్థితి అంతే బిందువు అంతే కదా సెంటర్ నుంచి మనం బిందువుకు వెళ్లాలి అని కదా మన ప్రయాణం లలితా సహస్ర నామంలో కూడా నాదబిందు కళా స్వరూపిణి అని అమ్మవారిని అంటాం కదా అంటే బిందువు అసలు మనం కూడా బిందువే వెళ్లగలిగితే వెళ్లే ప్రయత్నం చేస్తే అవస్థలు దాటితే జాగ్రదవస్థ నిద్రావస్థ సుషుప్తి దాటిన తర్వాత మన వాళ్ళు తురీయావస్థ అని చెప్పేస్తారు కానీ తురీయావస్థ అల్టిమేట్ కాదు యోగతారావళి అనేటువంటి ఒక గ్రంథంలో శంకర భగవత్పాదులు తురీయ తల్పే అంటారు తురీయ తల్పం అంటే ఇక్కడి నుంచి మనం విజయవాడ దాకా ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం వంద కిలోమీటర్లు అయిపోయిన తర్వాత మనం ఎక్కడో కారు ఆపుతాం కదా ఆపి అక్కడ హోటల్లో మోటల్లో ఏదో ఉంటే రెండు నిమిషాలు ఆగుతాం కదా తురీయం కూడా అటువంటిదే మరి అసలు తురీయం తురీయాతీతమైన స్థితికి వెళ్ళాలి తురీయం అల్టిమేట్ కాదు అని చెప్తూ తురీయానికి అతీతమైనది ఎక్కడ ఉన్నది అంటే మనలో షట్ చక్రాలు ఉన్నాయి కదా మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార అక్కడే అయిపోతాం ఎట్ చక్రం ఉంది ఎనిమిదో చక్రం ఉంది అది ఎక్కడ ఉన్నది అంటే దానికి చంద్ర కళాస్థానం అని పేరు ఇప్పుడు మన బ్రహ్మ రంధ్రం ఉంది బ్రహ్మ రంధ్రం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో అంటే ఒక అడుగు అని మన వాళ్ళ లెక్క అది బ్రిటిష్ ఫుట్ స్కేలు కాదు అది మన కుడిచేతి బొటనవేలు యొక్క పై కణుపు ఎవరిదెవరిది length వేరే ఉంటుంది దాని అది గనక పన్నెండుతో హెచ్చించినట్లయితే ఎంత దూరంలోనో చంద్ర కళాస్థానం అని ఒకటి ఉంది అందరికీ ఉంటుంది అది కానీ పామరుడు పండితుడు ఏదో ఒక జాతి వాడు కులం వాడు అని కాదు పుట్టిన ప్రతి ప్రాణికి ఇది చంద్ర కళాస్థానం ఉంటుంది చంద్రకళ అంటేనే మనకు అర్థమవుతుంది మంచు ముక్క లాంటిది సౌందర్యలహరిలో పదో శ్లోకంలో భగవత్పాదులు చెప్తారు అమ్మా! నీ స్థానం అత్యున్నతమైన స్థానం అయినప్పటికీ కూడా మాయందున్న దయచేత ఒక బిందు రూపంగా మళ్ళీ బ్రహ్మ రంధ్రంలో ప్రవేశించి మా సర్వ శరీరాన్ని ఆక్రమించి మిమ్మల్ని ఆనంద పరుస్తున్నావు కదా అంటారు అని అంటున్నప్పుడు బిందువు ఎక్కడిది అమ్మవారు బిందు రూపంలో ఎలా వచ్చింది అని అంటే ఇందాక చెప్పిన మూలాధారం నుంచి వాయువేగ అది యోగాగ్నిగా రగిలి పైకి వెళ్లి సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పుడు సుషుమ్నా అనేటువంటి పడగ లేస్తుంది లేచినప్పుడు వేడి గాలి చల్ల ముక్కకి తగిలినప్పుడు కరుగుతుంది కరిగి ఎక్కడ పడుతుంది మళ్ళీ బ్రహ్మ రంధ్రంలోనే పడుతుంది అని యోగశాస్త్రం మనకు స్పష్టంగా చెప్తుంది కాబట్టి దానిలో నుంచి వచ్చినటువంటి పన్నెండవ స్థానానికి గనక వెళితే దాని స్థాయిలో గనక మనం వెళ్లి అక్కడ ఉండగలిగితే అది తురీయాతీత స్థితి తురీయం అనేటువంటిది intermediate అది final కాదు అందుకనే సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళందరూ కూడా తురీయాశ్రమ స్వీకారం ఉన్నదే తప్ప పీఠాధిపతులు ఉన్నారు లేదా ఎవరో సన్యాసించారు వాళ్ళందరూ తురీయాశ్రమం తీసుకోవాలి తీసుకున్నారు తురీయాతీతంలో వాళ్ళు లేరుగా వాళ్ళు పీఠం నడపాలిగా అంటే దానికి లోబడి ఉండాలిగా అది కాబట్టి ఐదు అవస్థలు నా దృష్టిలో అలాగే ఏడు చక్రాలు మాత్రమే కాదు అక్కడ ఆగకూడదు యోగం చెప్పేవారు ఎనిమిదవది యచ్ఛక్రోపాసన చేయాలి యచ్ఛక్రోపాసన ఎక్కడ ఉన్నది అని అంటే చంద్రకళాస్థానం ఒకటి దానికి దగ్గరగా ఉన్నటువంటి శిఖాస్థానం అంటాం శిఖ తిలక అది ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు అంటే యచ్ఛక్రాన్ని వాళ్ళు కాపాడుతారు ఇది ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి బొట్టు ఎందుకు పెట్టుకున్నాం ఆజ్ఞాచక్రం ఉన్నది అని చెప్పడానికి గంధం ఎందుకు పూసుకున్నాం కుంకుమ ఇక్కడ ఎందుకు విశుద్ధం ఉన్నది అని చెప్పడానికి హృదయ స్థానంలో నామం ఎందుకు పెట్టాం ఇక్కడ అనాహతం అనాహతం ఉన్నదని చెప్పడానికి కాబట్టి ఇవన్నీ సంకేతాలుగా స్థానాలుగా చెప్పడానికి ఇవన్నీ మనం చెప్పుకోవాలి కాబట్టి జాగ్రదవస్థ నిద్రావస్థ సుషుప్తి తురీయాతి తురీయము తురీయాతీత ఐదు అవస్థలకు అన్నిటికీ అంటే శరీరానికి జీవుడు జీవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటి అంటారు జీవుడు పరమాత్మే జీవుడిగా వస్తాడు మమైవాంశో అన్నాడుగా భగవద్గీతలో మీరందరూ నా అంశలే అన్నాడు సూర్యుడు ఒక్కడే సూర్యకిరణాలుకోటానుకోట్లు కోటానుకోట్లు కోటానుకోట్లకు మూలం ఏంటి సూర్యుడే. సూర్యకిరణం అంటున్నాం కదా ఏదో కిరణం వచ్చి పడింది అనటం లేదు సూర్యకిరణం అంటున్నాం. రాత్రి అయితే చంద్ర కిరణం సుషుమ్నాన గీతం అంటున్నాం సుషుమ్నా కిరణం అంటున్నాం. ఔషధులతో కూడి ఉన్నదని చెప్తున్నాం. అంటే మూలంలో నుంచి విస్తృతమై బయటకు బహిర్గతమై వ్యాప్తమై ఉన్నటువంటిది కాబట్టి ఈవేళ జీవుడు కూడా పరమేశ్వరుడే. కానీ మాయా ప్రభావం చేత ఆవరణ ప్రభావం చేత ప్రవృత్తి మార్గం చేత నివృత్తి తెలియని కారణంగా వాడు ఏం చేస్తాడంటే తన మూలాన్ని మర్చిపోతాడు. నేను దైవాన్ని వెతుకుతున్నాను అంటాడు అసలు నువ్వు దైవానివే. ఎప్పుడవుతావు? దైవం వలె ప్రవర్తిస్తే, దైవం వలె జీవిస్తే, దైవం వలె అందరి పట్ల సమా-- సమతాభావంతో ఉండగలిగితే నువ్వు [క్రాస్ టాక్] త్వమేవాహం సంశయః మనకున్నాయి కదా నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. నాలుగు ఎప్పుడూ ఎందుకంటే ఫైనల్ గా ఏముంది? అహం బ్రహ్మాస్మి ఫైనల్ కాదు, అయమాత్మా బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ కాదు, తత్ త్వం అసి. తత్ అది త్వం నేను అది నేను ఒకటే. అది నేను ఒకటే అనేది జీవాత్మ పరమాత్మ అంటే మిర్రర్ అంటే బింబ ప్రతిబింబ భావం. ఇప్పుడు దీన్ని ప్రకృతిని మనం మామూలుగా ప్రకృతి అని పిలుస్తున్నాం. వేదాంత భాషలో దీని పేరు ప్రకృతి కాదు, దీని పేరు అనాత్మ. అనాత్మ-- ఆత్మ అంటూ ఒకటి ఉంది గనుక ఇది అనాత్మ అయింది. అనాత్మ అంటూ ఒకటి కనబడుతున్నది గనుక దీనికి మూలమైన ఆత్మ ఒకటి ఉన్నది. ఇది ఈక్వేషన్. అప్పుడు మనకు మూలం తెలిసిపో-- దీని అనాత్మకు మూలం ఏమిటంటే ఆత్మ. జీవాత్మకి మూలం ఏమిటంటే పరమాత్మ. అందుకనే వేదాంత పరిభాషలో ఇంకోటుంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ముగ్గురూ ఒకటే. ఈశ్వరుడు అంటే మనకు బొమ్మ కావాలి. ఉంటే ఆయన ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వర-- ఈశావాస్యోపనిషత్తు మొత్తం చెప్పింది ఉన్నదంతా అదే. ఉన్నదంతా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఉమ్ అయమాత్మా బ్రహ్మ. అసలు బ్రహ్మము అనేదే ఉన్నది. బ్రహ్మమును గురించినటువంటి విచారణ చేసేటువంటిది ఇదిగో ఉపనిషత్తులో మనం చేస్తాం. కాబట్టి పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, సృష్టి ఇదంతా కూడా బింబ ప్రతిబింబ భావంతో ఉన్నది. అద్దం ముందు నుంచున్నప్పుడు అద్దంలో ఎవరు కనిపిస్తున్నారు? మనమే కనిపిస్తున్నాం. బింబమే మనమే. మనం లేమనుకోండి అద్దంలో ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. ఏం కనిపించదు. అది. కానీ కనిపించేది ఏదో కానీ చూపించేది ఏదో ఉంది. చూపించేది అద్దం, చూడబడేది మనం. అంతే కదా! అవును కాబట్టి ఎవరైనా అండి బ్రహ్మము అంటే ఏంటి? బ్రహ్మము అంటే ఏంటి అని అడిగాడు అర్జునుడు. ఉత్తర గీతలో కృష్ణున్నే అడిగాడు. నువ్వు భగవద్గీత చెప్పినంత సేపు బ్రహ్మము బ్రహ్మము అనే పదం వాడావు. అదేమిటో నాకప్పుడు అర్థం కాలేదు చెప్పవా అని అడుగుతాడు. రెండు వందల యాభై ఐదు శ్లోకాలలో. అయితే దాంట్లో ఏమున్నదంటే పరమాత్మ అనేటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అది ఒక అంశగా జీవుడి యందు ఉన్నది. అర్జునుడికి అదే చెప్తాడు. బ్రహ్మము అంటే నువ్వేమీ పెద్ద విచారణ చేయకు. పెద్ద విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కమాట చెప్తాను. దేనిని కనులు చూడలేవో కానీ దేనివలన కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము. అది పదార్థం కాదు. అది యదార్థం. అది. దీన్నే పరావిద్య అంటారు. పరావిద్య వేరు. మనం మాట్లాడుతున్నది అవస్థలు కదా. అవస్థలు పరావిద్య వేరు. బింబ ప్రతిబింబ భావంతో వచ్చింది. పరావిద్య వేరు మళ్ళీ అపరావిద్య ఉంది. చూడండి ప్రకృతి పురుషుడు. సృష్టికర్త, సృష్టింపబడింది. ఎట్లాగైతే పరావిద్య అంటే ఆత్మవిద్య అని అర్థం అమ్మా. నాలుగు అవస్థలున్నాయి మనకి. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అంతే కదా! పరా దేనిని పశ్యంతి చూసి మధ్యమా అనుభవించి వైఖరి చెప్పగలడో అటువంటి వాడు ఉత్తముడైనటువంటి ప్రవచనకారుడు అవుతాడు. అంటే తాను చూడాలి ముందు. అవును చూస్తాం అని. ఏది-- దేనిని తాను చెప్పదలుచుకున్నాడో, పరమాత్మను గురించి భావించి, ఊహించి, సంభావించి, అనుభవించి, అనుభూతి చెంది, ఇవన్నీ అంటే పరా. దేనినైతే పశ్యంతి చూసి దర్శించి, చూట్టం వేరు, దర్శనం వేరు. అంతే కదా! చూట్టం అంటే మామూలు వస్తువును చూట్టం. దర్శనం అంటే ఆంతరంగికంగా చూట్టం, అనుభవించటం. పశ్యంతి, మధ్యమా దాన్ని అనుభవించి వైఖరి ఇది అని చెప్పాలి. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరిలో పరావిద్య అంటే ఆత్మవిద్య. చావులేని చదువు అన్నాడని తెలుగులో. ఆత్మవిద్య, బ్రహ్మవిద్య వీటన్నింటినీ కూడా పరావిద్య ఎలా లభిస్తుంది అంటే రెండు కారణాల వల్ల లభిస్తుంది. ఒకటి జన్మాంతర పుణ్యపాక విశేషం చేత లభిస్తుంది. ఇప్పటివరకే దాని స్వాధ్యాయం అయిపోయి ఉండాలి. ఏదో ఒక జన్మలో ఎప్పుడో. లేకపోతే ఇప్పటికిప్పుడు రావు. రావు. రావు. జన్మ పరంపరగా వచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని పరావిద్యని భౌతిక ప్రపంచంలో ఉంటూనే నెమరువేసుకుంటూ అంటాం. పశువు నెమరువేసుకుంటుంది కదా. అలాగే మనం కూడా నెమరువేసుకుంటూ వేసుకుంటూ మననం చేస్తూ, శ్రవణం చేస్తూ, నిధిధ్యాసనం చేస్తూ అష్టాంగ యోగాల ద్వారా దీన్ని గనక చేసుకోగలిగితే ఆత్మవిద్య నిలబడుతుంది. ఆత్మవిద్య తెలిసిన తర్వాత లోక విద్యలు అత్యంత సులభంగా అన్నీ ఏర్పడతాయి. కొంతమంది మహాత్ములు ఉంటారు. అవును మహాత్ముల పేర్లు చెప్పా చాలామంది దేశంలో ఉన్నారు. మహాత్ములు విషయమైనా చెప్పగలరు. ఎలా చెప్పగలరు? వాళ్ళు మెడిసిన్ మీద మాట్లాడతారు. వాళ్ళు ఇంజనీరింగ్ మీద మాట్లాడతారు. వాళ్ళు వాతావరణ కాలుష్యం మీద చెప్తారు. ఇక్కడ కూర్చొని రేపు ఏం జరిగిపోతుంది చెప్తున్నారు. ఎలా అంటే విద్య ఆత్మవిద్యలో నిష్ణాతులైనారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కడ చూసినా ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆత్మ అంటే భూతము, పిశాచంగా కళా స్వరూపాలు చూపించాయి. ఆత్మ అంటే పరిపూర్ణత, ఆత్మ అంటే శుద్ధత్వం, ఆత్మ అంటే గాఢం, ఆత్మ అంటే ఘనం, ఆత్మ అంటే అన్నీ తానైనది. కానీ తాను కా-- ఏదీ తాను కానిది రెండు. అన్నీ తానైనది అదే, ఏదీ కాకుండా ఉన్నది కూడా అదే. కాబట్టి దాన్నేగా భగవత్పాదులు ఆత్మ అంటే ఆత్మ అంటే ఏమీ మా అంటే లేదు, ప్రత్యేకంగా లేదు అని కదా చెప్పుకొచ్చారు. ఉమ్ కాబట్టి ఇటువంటిది పరావిద్య అంటే ఆత్మవిద్య అని అర్థం స్థూలంగా. అది కానిది అపరావిద్య. అపరావిద్య ఎలా రావాలి? నేను ఇంజనీరింగ్ చేయాలంటే నేను ఇంజనీరింగ్ చదవాలి. మెడిసిన్ చేస్తే డాక్టర్‌ని అవుతా. ఇంకోటి చదివితే ఇంకోటి అవుతా. ఏదో చదివితే ఒకటి అవుతాను. ఒకటి అవుతాం. సబ్జెక్టు చదువుతానో అది అవుతా. అవును అది అపరావిద్య. అపరావిద్య అంతే చాలా లిమిటెడ్ వెర్షన్ భౌతిక విద్యలన్నీ అపరావిద్యలు. లౌకిక విద్య. ఎప్పుడైతే ఆత్మవిద్యో అది పరావిద్య. ఆత్మవిద్య పరావిద్య. ఇది స్థూలంగా చాలా హాయిగా అర్థం చేసుకోవటానికి వీలైన విషయం ఇది. గురువు గారు చాలా విపులీకరించి చాలా బాగా ముండకోపనిషత్తు గురించి చెప్పారు గురువుగారు ధన్యవాదాలు. శుభం. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం.
YouTube · audio

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 133

Home

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 133

Source: SVBC TTD on YouTube

0:00 / 23:52

More in this series

Manthramahima (with Y. Swarna Latha Reddy)

4 episodes · 1 hr 44 min

  1. 19 min 133

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 133

    Now playing
  2. 19 min 134

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 134

  3. 23 min 135

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 135

  4. 23 min 136

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 136