Skip to content
Transcript తెలుగు
దర్శనం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సర్వ జనావళికి అందిస్తున్న మహత్తర బృహత్తర కార్యక్రమమే యోగ దర్శనం. యోగాన్ని దర్శించటమా? యోగాన్ని మార్గదర్శనం చేసుకోవటమా? అనే రెండు ప్రశ్నల మధ్యలో పరమాద్భుతంగా సాగేటువంటి భారతీయ వైజ్ఞానికమైనటువంటి అంశాలు మానవుణ్ణి ఆందోళన నుంచి బయట పడేసి ఒక పరిపూర్ణ పరితృప్త సఫల జీవితాన్ని అనుగ్రహించే విధానంగా మానవుడికి అక్కరకు వచ్చేటువంటి అద్భుత కార్యక్రమమే యోగ దర్శనం. ఇంతకీ యోగం అంటే ఏమిటి? భగవంతునితో కూడి కర్మ చేయటమే. భగవంతుని యందు మనస్సు నిలిపి తలపులు నిలబెట్టుకోవటమే నిజానికి యోగ దర్శనం మనకి అనుగ్రహించేటువంటి వరదానం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తమ ధర్మ ప్రచారంలో ధర్మ ప్రసారంలో కర్తవ్య దీక్షలో ఇది జగజ్జేగీయం కావాలని సర్వజనులు వీటిని విని తరించి ఆనందించి ఆనందము తాముగా ఆనంద స్వరూపులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని శ్రీరామనవమి పండుగ రోజున శ్రీమద్భగవద్గీత ప్రవచకులు ఆచార్య శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం ఆరు గంటలకు తప్పక వీక్షించండి. స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి.
YouTube · audio

యోగ దర్శనం - Yoga Darshanam | Kuppa Viswanadha Sharma | April 10 - 6 pm

Home

యోగ దర్శనం - Yoga Darshanam | Kuppa Viswanadha Sharma | April 10 - 6 pm

Source: SVBC TTD on YouTube

0:00 / 1:32