Skip to content
Transcript తెలుగు
అలాగే మనది కాని వస్తువుని మన వస్తువు చేసుకుందాం అనుకుంటాం. రావణబ్రహ్మ. సీతమ్మవారు. ఎత్తుకొని పాకెట్లో తెచ్చిపెట్టుకున్నాడు. పరాయి వస్తువు కదా! ఆమె ఇంకొకరి భార్య కదా! ఎలా తెచ్చాడు? ఎలా తెచ్చుకోగలిగాడు? అంటే అపరిగ్రహం అనేటువంటి ఒక మాటకి, రావణబ్రహ్మ-- మనం కూడా అంతే. మరొకరి వస్తువుని మన వస్తువుగా చేసుకోవాలని అనుకోవటం మహాపాపం. చేసుకోవటం, అది ఒక దుశ్చర్య. రెండూ మన మనసులో లేనంత కాలం మనం సుఖి. అది ఉన్నంత కాలం మనను మించిన దుఃఖార్తుడు మరొకడు ఉండడు. కాబట్టి నీకు ఏది ప్రాప్తించిందో, నీకు ఏది లభించిందో, నీకు ఏది నీదైందో, నీదని అనుకుంటున్నావో, మమత్వంతో ఉన్నా, అది నీదిగా నీ వరకు పెట్టుకో. కానీ మమత్వాన్ని కూడా కాస్త వదిలిపెట్టు. దీనికి చిన్న ఉదాహరణ. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పారు కదా! మనకు తెలుసు కథ. తెల్లవారితే పట్టాభిషేకం అనగా, ఆరోజు రాత్రికి రాత్రే కథ అంతా మారిపోయింది. పట్టుబట్టలు కట్టుకోవలసిన రామభద్రుడు రామచంద్రుడు, నారచీరలు ధరించి అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయనేం కించపడలేదు. ఒక్క క్షణం కూడా ఉద్విగ్నుడు కాలేదు. పరమ ప్రశాంత ప్రశాంతమైనటువంటి దరహాసంతో నారచీరలు ధరించబోయే ముందు తన మిత్రుడు అయినటువంటి సుయజ్ఞుడి కోసం కబురు పెట్టాడు. సుయజ్ఞుడు ఒక బ్రాహ్మణ బాలకుడు. రామచంద్రుడికి పరమ మిత్రుడు. సుయజ్ఞ అతని పేరులోనే సుయజ్ఞం, రోజూ మంచి యజ్ఞం చేసేవాడు. "సుయజ్ఞ! నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను. నా తండ్రి వెళ్ళమన్నారు. పద్నాలుగు సంవత్సరాల వరకు మనం కలుసుకోలేం. కానీ, నేను ఇక్కడ ఉంటే నీకు కొంత సహాయం చేస్తూ ఉండగలిగేవాడిని. ఇప్పుడు నేనే అయోధ్యలో ఉండటం లేదు. ఇదిగో క్షణం వరకు నా శరీరం మీద ఉన్నటువంటి సర్వాభరణాలు నావి గనుక, నావన్నీ నీకు ఒలిచి చేతిలో పెడుతున్నాను. వీటిని తీసుకుని, నీవు నీ యజ్ఞాన్ని, నీ నిత్య అగ్నిహోత్ర కార్యక్రమాన్ని, నీ ధార్మిక జీవన విధానాన్ని, నీ తపస్సుని, నీ జపాన్ని, నీ అజపాన్ని, నీ క్రతువుని నిర్విఘ్నంగా మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా కొనసాగించు. అందుకే ఆభరణాలన్నీ మూటగట్టి నీకిస్తున్నాను" అన్నాడు. అది రామచంద్రుడి యొక్క మమత్వాన్ని వదిలిపెట్టేటువంటి స్థితి. ఇది కావాలి. ఏదైనా ఇవ్వగలిగినటువంటి ఒక మంచి నోబుల్ కాజ్ కోసం మనం వెళ్ళాలి. దానికోసం మనం ఎంతన్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. పూర్ణమైనటువంటి మనోవృత్తి నాశనంలో చాలా ప్రధానమైనటువంటి మన పురాణ గాథలు, ప్రధానంగా రామాయణం. రామాయణంలో రాముడి కథ ఒక్కటి చాలు. అహత్-- అహంకారం లేదు, మమత్వం లేదు. నిజానికి ఆయనకు దేనియందు మమకారం లేదు. ఎనిమిదేళ్ళు రాకుండానే వశిష్ఠులవారు అడిగారు, "ఏం నాయనా ఇట్లా ఎందుకున్నావు?" అని అడిగారు. "నాకీ ప్రపంచం దుఃఖారామమై కనిపిస్తున్నది" అన్నాడు. అదేంటి? ఎనిమిదేళ్ళ రాముడు గనుక ఇంత వైరాగ్యంలోకి వెళ్ళిపోతే, రావణ వధ జరిగేనా? తాపసులు రక్షింపబడేనా? యజ్ఞయాగాది క్రతువులన్నీ సాగేనా? అవతార కార్యక్రమం వెనకబడి పోతుందేమో అని వశిష్ఠులవారు రాముడితో కూర్చొని మాట్లాడింది యోగవాసిష్ఠమైంది. మనస్సు యొక్క మర్మాన్ని గురించి మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ. మమత్వాన్ని గురించి మాట్లాడుకున్నారు, మమకారాన్ని గురించి మాట్లాడుకున్నారు. అహం ప్రవృత్తుల గురించి మాట్లాడుకున్నారు, మనోవృత్తుల గురించి మాట్లాడుకున్నారు, చిత్తవృత్తుల గురించి మాట్లాడుకున్నారు, సద్వృత్తుల గురించి కూడా మాట్లాడుకున్నారు. ముప్పై ఆరు వేల శ్లోకాలలో ఉన్నటువంటి రసాత్మకమైనటువంటి ఆవిష్కరణ నిజానికి ఇదే. అప్పుడు రాముడు వినటానికి ముందు దుఃఖారామమై తోస్తున్నది ప్రపంచం అన్నటువంటి వాడు, వశిష్ఠ గీత, యోగవాసిష్ఠం విన్న తర్వాత వశిష్ఠుల వారికి ఆనందం కలిగింది. రాముడు శ్రద్ధాళువై వింటున్నాడు. చాలా వినయంగా వింటున్నాడు. చిత్తైకాగ్ర స్థితిలో వింటున్నాడు. ముఖా-- అరవిందం ఏదైతే ఉన్నదో, రాముడి ముఖ మండలం వశిష్ఠుల వారికి ప్రీతి కలిగించింది. ఒక సంతృప్తికరమైనటువంటి మనసుతో రాముడిని అడిగారు, "రామా! ఇప్పుడు నీ మనస్సు ఎట్లా ఉన్నది?" అంటే, ఇన్ని మంచి మాటలు విన్నాను, అద్భుతంగా ఉంది అని అనాలి. రాముడు ఏమన్నాడు? "నేను మనస్సన్యాసిని" అన్నాడు. మనస్సుని సన్యాసం చేశాను అంటే ఏమిటి? వదిలిపెట్టాననా? మనస్సుని సమన్యాసంలోకి తీసుకెళ్తున్నాను. కష్టం రానీ, నష్టం రానీ, ఏది రానీ, ఏది పోనీ, ఏది ఎట్లా జరగనీ, జరక్కపోనీ నేను నేనుగా ఉంటాను అన్నటువంటి శ్రీరామచంద్రుడి వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఇది ఆశ్చర్యం. ఇది మనోవృత్తులను వదులుచుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రక్రియ. దివ్య విధానంలో నుంచి రాముడి యొక్క అవతార కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే మనం కూడా మనోవృత్తులను దాటాలి. హరిషడ్వర్గాలని హరిషడ్వర్గాలు చేసుకోవాలి. ప్రతి ఒత్తిడిని, ప్రతి సవాలుని ఒక అవకాశంగా తీసుకోవాలి. ప్రతి అవకాశాన్ని సర్వశక్తులు ఒడ్డి సద్వినియోగం చేయాలి.సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి దానిని సమాజహితం చేయాలి. సమాజంతో సమన్వయం చేయాలి. సమాజ కారకమై సమాజహితమై సాగే మన ప్రతి ఆలోచన ధర్మబద్ధమై సాగాలి. అది సత్యాన్వేషణ వైపు అడుగు వెయ్యాలి. శాంతి వరదాయిని కావాలి. ప్రేమమయం కావాలి. తద్వారా అహింసా ప్రవృత్తి పెరగాలి. హింసా ప్రవృత్తి నెమ్మదిగా తగ్గిపోవాలి. హింస మానవుణ్ణి వెలదీస్తుంది. అది వినాశకారి. అహింస అన్నింటినీ ఒక చోట చే-చేరుస్తుంది, కలుపుతుంది. బలమైన ఒక సంఘశక్తిగా ఒక వ్యష్టి సమష్టి అవుతాడు. సమష్టి అంతా సృష్టి అవుతుంది. వ్యక్తి యొక్క ఆనందం ప్రపంచం యొక్క ఆనందం కావాలి. ప్రపంచం యొక్క దుఃఖం వ్యక్తి పంచుకోవాలి. వ్యక్తి తన దుఃఖాన్ని ప్రపంచానికి పంచకూడదు. ఎందుకంటే వ్యక్తి యొక్క దుఃఖం సమాజ దుఃఖం కాదు. కానీ వ్యక్తి ఆనందం సమాజానికి ఆనందం. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు ఉపదేశ సారం వింటున్నాం అంటే, అనుకుంటున్నాం అంటే మనల్ని మనం రిడీమ్-రిడీమ్ చేసుకోవటానికి, రీడిఫైన్ చేసుకోవటానికి, రీస్ట్రక్చర్ చేసుకోవటానికి, రీఓరియంట్ చేసుకోవటానికి, రీసెట్ చేసుకోవటానికి, రీఛార్జ్ చేసుకోవటానికి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇటువంటి ధర్మ మార్గావలంబనం కోసం జ్ఞాన మార్గోపదేశ్ట అయినటువంటి భగవాన్ రమణులు తమ యొక్క మహా స్థితి నుంచి ఆత్మైక స్థితి నుంచి మన సాధారణమైనటువంటి స్థాయికి వచ్చి ఒక బోధకుడై పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనస్సుని మరమ్మత్తు చేసేటువంటి ఒక దివ్య విధానాన్ని అహం ప్రవృత్తులని, చిత్త ప్రవృత్తులని కూడా ఎట్లా వాటిని నశింపజేసుకోవాలో వారు విచార ధారని చక్కగా కొనసాగిస్తూ మనకి మార్గోపదేశనం చేస్తున్నారు. విచారణ చేద్దాం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -68

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -68

Source: TFC Spiritual on YouTube

0:00 / 9:10

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

    Now playing
  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77