Skip to content
Transcript తెలుగు
జిహ్వానం జిహ్వానం సుజ్వానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ శ్రీకృష్ణ దివ్య పాదారవిందాలకి ప్రణామ సహస్రం సమర్పిస్తూ క్షేత్ర ఛానల్ భారతీయ దృశ్య మాధ్యమంలో మొలకెత్తిన ఒక అపురూపమైనటువంటి పుష్పం. పుష్పం సొబగులను, సౌందర్యాలను, పరిమళాలను అనేక క్షేత్రాలలో వికాసమానం చేస్తూ ప్రవాహ వేగంతో సాగిపోయేటువంటి ఒక అద్భుత వాహిక ఇది. అయితే క్షేత్రము అనగానే కార్య క్షేత్రము, ధర్మ క్షేత్రం. నిజానికి మానవ జీవితం అంతాకూడా క్షేత్రమే. మన దేహము ఒక క్షేత్రమే. సమస్త కార్యకలాపాలకి క్షేత్రము ఆధారం కాబట్టి మానవ జీవితాన్ని ఆవహించి, ఆవేశించి, ఆవరించి ఉన్నటువంటి అరవైనాలుగు కళల సమాహార సమ్యక్ దృశ్యం ఏదైతే ఉన్నదో అదంతా క్షేత్రం ద్వారానే మళ్ళీ ప్రపంచానికి అందాలి. మానవుడి మేధ, మానవుడి భావన, మానవుడి ఆలోచన సర్వజన శ్రేయోదాయకమై, జగద్ధితమై, జగత్తుకి మార్గోపదేశనం చేసేటువంటి దిశగా సాగుతుంది గనుక క్షేత్ర నామంతో ఇప్పుడే ప్రాదుర్భవించినటువంటి ఛానల్ సమస్త మానవాళికి కూడా సంస్కృతిని, సంస్కారాన్ని, భారతీయమైనటువంటి ఒక ఆర్ష ధర్మాన్ని పునః పునః పరిచయం చేస్తూ అనేక కాలాలు, ఆగామి కాలాలు అంటే రాబోయే కాలాల అన్నింటినీ కూడా పరుచుకొని ప్రభావితం చేస్తూ ప్రధానంగా యువతని, మహిళలని, చిన్నపిల్లలని వారిలో కలిగేటువంటి మానసిక వికాసానికి దోహదపడేటువంటి రీతిలో ఉపనిషత్తులు, వేదాలు అట్లాగే ఇతిహాసాలు దాంతోపాటుగా భారత భాగవత రామాయణాది భగవద్గీతాది గ్రంథాలు వీటిలల్లో దాగిన మార్మికమైనటువంటి విషయాలని చాలా సుస్పష్టంగా కేవలం శబ్దార్థం కాకుండా, వాచ్యార్థం కాకుండా, తాత్పర్యం కాకుండా దానిలో ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి రస స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మళ్ళీ జాతిని ధర్మ మార్గం వైపు ప్రధానంగా సనాతన ధర్మం వైపు నడిపించేట్లుగా ఈనాటి సమకాలీన మానవ జాతి అనేక కోణాలలో అనేక వైఫల్యాలు చెందుతూ ఉన్నది, ఆందోళన చెందుతూ ఉన్నది, మనస్సు ప్రపంచం నుంచి మనల్ని వేరు పరుస్తున్నది. ఇది కాకుండా, దీన్నంతా కూడా సమన్వయం చేయగలిగినటువంటి ప్రాచీన వైదిక ఆర్షమైన భారతీయమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని మళ్ళీ ప్రజలకు చేరువ చేయడమే క్షేత్రం యొక్క లక్ష్యం, లక్షణం కూడా. క్షేత్ర దిశగా పయనిస్తూ అనేకమైనటువంటి క్షేత్రాల్ని సంపద్ వైభవంతో విరాజమానం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శ్రీ వికారి నామ సంవత్సర శుభ ఆరంభ వేళ, ఇది సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ కాబట్టి మనందరి జీవితాలలో, అనే వారి జీవితాలలో, వినే వారి జీవితాలలో, చూసే వారి జీవితాలలో అనేకమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి జీవితాన్ని పరిపుష్టము, ఫలప్రదము, సంతోషప్రదము, ఆనందదాయకము, పారమార్థికము అయ్యే దిశగా తీర్చిదిద్దుకునేట్టుగా కార్యక్రమాలు రూపొందించుకొని ప్రతి ఇంట ప్రవేశించి అందరికీ కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని దాంతోపాటుగా పరమ రమణీయమైనటువంటి విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞానాలని నిరపేక్షంగా అందించేటువంటి దిశగా క్షేత్ర తన కార్యక్రమంలో తొలి అడుగు వేస్తున్నది. శు
YouTube · audio

Ugadi Special | Happy Ugadi | ఉగాది శుభాకాంక్షలు | kshetra channel

Home

Ugadi Special | Happy Ugadi | ఉగాది శుభాకాంక్షలు | kshetra channel

Source: kshetra channel on YouTube

0:00 / 4:40