No transcript for this section.
Transcript begins at 0:05.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వయోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఏ క్షేత్రంలో పదిహేను సంవత్సరాల మహా తపస్సు సాగిందో ఆ క్షేత్రంలోనే భారతీయ గురుతత్వాన్ని ప్రారంభించుకోవటం అనంతకోటి గురు స్వరూపాల దివ్యానుగ్రహంగా నేను భావన చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తత్వవేత్తలే శాస్త్రవేత్తలే తక్కువైన వాళ్ళు ఎవరూ లేరు. ఈ సభ పరిపూర్ణం కావటానికి ఆశీస్సులు మహదాశీస్సులు అందించటానికి వచ్చినటువంటి మా సోదరులు రమణాచారి గారికి పెద్దలు రంగారావు గారికి ఏ ఎస్ మూర్తి గారికి మీ అందరికీ స్వామి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించు గాక. జీవితంలో ఒక కొత్త మలుపు తిరిగినప్పుడల్లా పరమేశ్వరుడి యొక్క శక్తి మనకు కావాలి. కేవలం జీవ ప్రజ్ఞతోనే జీవుడు పరిపూర్ణతను సాధించలేడు. జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది కాసేపు అట్లా కాసేపు ఇట్లా. మలుపు తిరిగినప్పుడల్లా మనకు కావలసినటువంటి అనంత శక్తి ధారని అందించటానికి గురువు, దైవం, పరాదైవం ముప్పది ముక్కోటి దేవతలు సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కానీ మనలో శుద్ధత్వం లేకపోతే ఆ సిద్ధి మనకు లభించదు. ఆ శుద్ధత్వం కోసమే మనం చేసుకుంటున్నటువంటి ఈ సాంప్రదాయకమైనటువంటి ఒక సత్సంగ ధార. ఈ ధారలో భారతీయ గురుతత్వంలో శంకర భగవత్పాదులతో ఎందుకు ప్రారంభమైంది అంటే నిజానికి శంకర భగవత్పాదులతో పాటుగా రామానుజులు, మధ్వాచార్యులు ఆ ముగ్గురు ఆచార్యత్రయం అది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ అంటాం. ఆ మూడు కోణాలలో ముక్కోణాలలో మానవుణ్ణి భగవంతుడి దగ్గరకు తీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఇందాక రమణాచారి గారు అన్నట్లు తమ దేహాన్ని తమ గేహాన్ని తమ ధనాన్ని తమ మనస్సుని తమ వాయువుని ఆయువుని సంపూర్ణంగా సమాజహితం చేసినటువంటి మహాపురుషులే వీరంతా. తల్లి ఋణం తల్లిని ప్రేమించటంతో వృద్ధాప్యంలో ఆమెని రక్షించుకోవటంలో ఆమెను గౌరవించుకోవటంలో ప్రేమించుకోవటంతో ఆ ఋణం తీరిపోతుంది. తండ్రి ఋణాన్ని శరీరానికి కారణమైన తండ్రికి అఖండమైనటువంటి కీర్తి ద్వారా నీరాజనం సమర్పించి తండ్రి ఋణాన్ని తీర్చుకోవచ్చు. తండ్రి కంటే అధికుడైనటువంటి కొడుకు ఉంటాడా? అంటే లోకన్ రీతిలో ఎలాగు ఉంటాడో ఆయన తన తండ్రి ఋణాన్ని తాను సంపాదించిన కీర్తి ద్వారా పూర్ణం చేస్తాడు. గురు ఋణాన్ని ఎలా తీర్చుకోవాలి? గురువు ఆజ్ఞను పాటిస్తూ గురు ఋణాన్ని తీర్చవచ్చు. చివరకు మిగిలింది ఋషి ఋణం. ఋషి ఋణాన్ని ఎలా తీర్చాలి? వాళ్ళెవరూ ఏమీ కోరి చేయలేదు ఈ పనులన్నీ. వేదాలన్నీ ఈ ప్రపంచానికి వాఙ్మయాన్నంతా ఈ ప్రపంచానికి అందించి నానానాథ సందోహమైనటువంటి శబ్ద జాలాన్ని వాఙ్మయ స్వరూపిణిగా మార్చి మానవుడి యొక్క సంస్కార విశేష ధారకు ఊతమిచ్చినటువంటి ఈ ఋషి పుంగవులందరి ఋణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఎంత మంది ఉన్నారు? ఋషి ఋణాన్ని ఋషులు చెప్పిన మాటలు తలచుకుంటూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. దానికే సత్సంఘము అని పేరు. సత్సంగం అంటే ఉపన్యాసం కాదు. సత్సంగం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. సత్సంగం అంటే కాలక్షేపం కాదు. సత్సంగము అంటే ఒక ఆత్మ స్పర్శ, ఒక విమర్శ, ఒక అనుభవం, ఒక అనుభూతి చివరగా ఒక విభూతి. ఆ స్థాయికి గనక వెళ్లగలిగినట్లయితే అది పరమేశ్వరుడితో అనుసంధానమైనటువంటి మనస్సు పరమేశ్వరుడు పలికించే వాణిగా పలుకుతున్న వాడు కేవలం ఒక వాహికగా మాత్రమే మిగిలిపోతారు. అన్నవాడు విన్నవాడు ఒకటైతే దాని పేరు సత్సంగం. అన్నవాడు వేరు విన్నవాడు వేరు అయితే అది కానే కాదు. సుమారు సుమారు కాదు నిండుగా యాభై సంవత్సరాల పరిపూర్ణమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క సాంగత్యంలో స్వామితో తొమ్మిది సంవత్సరాల ప్రాంతంలో స్వామి దగ్గరకు చేరుకొని యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ అధ్యాత్మ ప్రస్థానంలో తల్లి తండ్రి గురువు దైవమై స్వామి నడిపించారు. పదార్థం ఒకటే అనుభవించే తీర్థంనుడు వేరు. సత్యం ఒక్కటే అనుభవంలోకి వచ్చే దారులు వేరు. ఆ దారులన్నింటినీ కూడా సమన్వయించేటానికి నిజానికి శంకర భగవత్పాదుల కంటే ప్రథమంగా మనం తలుచుకోవలసినటువంటి తొలి లోక గురువు వేదవ్యాసులవారు. తొలి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపరాంతము కలియుగ ఆరంభము సంధివేళ కలియుగ మావుడికి అక్కరకు వచ్చేటువంటి భగవద్గీతని మనకు అందించినటువంటి వ్యాసులవారికి నమస్కరించాలి. ఒక మహారణరంగంలో కొన్ని క్షణాలలో ప్రారంభమయ్యేటువంటి యుద్ధానికి ముందు జ్ఞానబోధ చేసిన కేవలం జ్ఞానం మాత్రమే కాదు కర్మ భక్తి జ్ఞాన యోగ త్రయగాఅర్జునుడి ద్వారా కలియుగ మానవుడికి అందించినటువంటి యోగేశ్వర కృష్ణుడికి నమస్కరించాలి. అయితే కాలము అనంత ప్రవాహంగా సాగిపోతున్నప్పుడు ద్వాపర తెల్లవారింది అదిగో కలియుగం పుట్టింది. కృతయుగంలో దేవుడు ప్రత్యేకంగా లేడు అవతారాలు లేవు. అమృత లోకంలో నుంచి ఈ జగత్తు లోకి వచ్చిన ప్రతి ఒక్కడూ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువునీ పరమాత్మ యొక్క ప్రతీకగా, సంకేతంగా, సంజ్ఞగా, అభివ్యక్తిగా భావన చేశాడు. ఆ కాలం అట్లా చెల్లిపోగా త్రేతాయుగం వచ్చేసరికి భగవంతుణ్ణి ఎట్లా రప్పించుకోవాలి, ఎట్లా దర్శనం చేయాలి అంటే యజ్ఞయాగాదుల ద్వారా చేయాలి అన్నారు. అందుకనే ఇక్ష్వాకు రాజులలో అరవైనాలుగవ రాజైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు రావటానికి పుత్రకామేష్టి కారణమైంది. అంటే యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి చూడవచ్చును అని తెలుసుకున్నటువంటి యుగం త్రేతాయుగం. ఆ యుగంలోనే మానవుడిలో ఉన్నటువంటి సత్వ రజస్ తమో గుణాలకు ప్రతీకంగా సత్వగుణానికి ప్రతీకగా మిధిలా నగరం రాజర్షి అయిన జనకుడు. రజస్ గుణానికి ప్రతీక అయిన దశరథ మహారాజు అయోధ్యా నగరం. అరణ్యం దాటి, సముద్రం దాటి వెళ్ళబోతుంటే లంక మధ్యలో "షష్టిరియోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వార పురీ లంకാം సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంచ వీధీనాం రావణేన సురక్షితం" అని వాల్మీకి రావణబ్రహ్మ పరిపూర్ణమైనటువంటి తమస్సుకి గుర్తుగా ఈ మూడు పురాలు ఉంటే, ఈ మూడు పురాలలో శ్రీమన్నారాయణుడు ప్రాపంచికమైన తమస్సు పెరిగి, సత్వం తగ్గి, రజస్సు అటూ ఇటూ అవుతున్నటువంటి వేళ నారదాది మునులకు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహ వరదానం ఏమిటంటే దశరథుడి ఇంట రామచంద్రుడినై వస్తా. దశ యుగాల వరకు రామనామం వినపడేలా ఆ పేరు తీసుకొని వస్తాను. అలాగే దశకంధరుడి యొక్క పది కుత్తుకలు ఉత్తరించి ధర్మసంస్థాపన చేస్తా. ధర్మ ప్రబోధం చేస్తాను. ధర్మ ప్రచారం చేస్తాను. అందుకనే రాముడు మాయామానుష విగ్రహ స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చాడు. రాముడు కంటే ముందు వచ్చిన అరవై మూడు మంది ప్రాపంచికమైన ఒక భౌతిక ధర్మాలను రక్షించడంలో వాళ్ళ జీవితాలు వెచ్చించబడ్డాయి. కానీ రామచంద్రుడు పూర్ణ పురుషుడుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తరం మాత్రమే కాదు, ఆ యుగం మాత్రమే కాదు, అనేకమైనటువంటి యుగాలను ప్రభావితం చేసేటువంటి "రామో విగ్రహ్వాన్ ధర్మః" అన్నటువంటి ఒక వాక్యానికి సాకార స్వరూపంగా వచ్చాడు రామచంద్రుడు. అది అయిపోయింది ద్వాపర వచ్చింది. ద్వాపర వచ్చేప్పటికీ యుగ ప్రభావం చూడండి శ్రీకృష్ణ పరమాత్మని దేవుడన్న వాళ్ళు బహు తక్కువ మంది. పంచ పాండవులు ఐదుగురు, కుంతి, ద్రౌపది, భీష్ముడు, విదురుడు, అక్రూరుడు లెక్కపెట్టవచ్చు వీళ్ళ మీద. కనుక ఆయన ఏం చేశాడంటే ఈ యుగానికి ఇది మందు కాదు. ఏం చేయాలి? నేను దైవాన్ని అని ప్రకటించాలి తదనుగుణంగా జీవించాలి. తన జీవయాత్ర, తన అవతార కార్యక్రమాన్ని ఆ రకంగా కొనసాగించాలి గనుక ద్వాపర అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రకటనలు "నేనే దైవాన్ని, నన్ను మించిన వస్తువు మరొకటి ఈ ప్రపంచంలో లేదు. ఎవరైనా ఈ ప్రపంచం చేత గొప్ప వాడు అని ఒక ముద్ర వేసుకుంటే వాడు నేనే. నేను తప్ప అన్యం లేదు" అని ఆయన ప్రకటన చేశాడు. ఇక కలియుగం ఆరంభ వేళ. దేవుడు లేడంటూ ప్రారంభమైన యుగం. నా దృష్టిలో ఇది పాపకాలం కాదు, ఇది మహా పుణ్యకాలం. కృతయుగంలో దేవుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోలేదు. త్రేతలో రాముణ్ణి నువ్వు దేవుడివయ్యా అంటే కాదు కాదు నేను రఘురాముడిని, నేను దశరథ రాజకుమారుడినని ఆయన అంగీకరించలేదు. శ్రీకృష్ణ పరమాత్మ నేను దైవాన్ని అంటే నువ్వు కాదు ఎట్లా అయినావు? నీ కులమిది, నీ గుణమిది, నీ బిహేవియర్ ఇది, నీ ఆలోచనలివి, నువ్వు దేవుడివి ఎట్లా అవుతావు? అని ఆయన దివ్యత్వాన్ని గ్రహించలేని ఒక జాతిగా ఒక యుగం సాగిపోతే కలియుగంలో "నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతిః" ఒక్క హరినామం పట్టుకో, పరమేశ్వర నామాన్ని గనక పట్టుకున్నట్లయితే, నామస్మరణ చేసినట్లయితే అనంతమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అతి సునాయాసంగా చేరగలవు అని చెప్పినటువంటి కలియుగమిది. ఇంత దివ్య విచారణ కానీ, దైవ ప్రచారం కానీ, దైవ భావన కానీ, దివ్యతత్వ విచారణ కానీ ఏ యుగంలోనూ ఇంతవరకు జరగలేదు ఒక్క కలియుగంలో తప్ప. అందులో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలలో ఐదు వేల మూడు వందల సంవత్సరాలే మనం ఖర్చుపెట్టాం. ఇంకా ఈ కలియుగం ఎంత కాలం సాగాలి? ఎట్లా సాగాలి? ఇప్పుడే భయభ్రాంతులమైపోతున్నామే, ఏమైపోతుంది ఈ కలియుగం అని. ఏమైపోతుందో అని ఆలోచించకూడదు. అది అలా కాకుండా ఉండటానికి మనం ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని మన తలకు మనం ఎత్తుకోవాలి. డిగ్రీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, కీర్తులు వచ్చినాయి, సంపదలు వచ్చినాయి భగవంతుడికి ఇబ్బంది ఏముంది? వీటన్నింటినీ ఏం చేయాలి? పరమేశ్వరుని ముఖం చేయాలి. పరమేశ్వరుడు ఈ తాను సృష్టించిన ఈ సమాజం ఎంత ధర్మ సమాజంగా ఉండాలని కోరుకున్నాడో ఆ హృదయాన్ని ఎరిగి గనక మనందరం గనక ప్రవర్తించినట్లయితే కలియుగం కృతయుగం కంటే కూడా గొప్పదవుతుంది. సత్య యుగం వస్తుంది వస్తుందని జ్యోతిష్కుడు చెప్తే అది రాదు. సత్య యుగం వచ్చేట్లుగా కలియుగ మానవుడు జీవించినట్లయితే సత్య యుగం వచ్చి ఉళ్ళోపడుతుంది. అంతేగాని తపస్సు చేస్తే సత్య యుగం రాదు. ధర్మవర్తనం ఉండాలి, ధర్మ కర్మ ఆచరణ ఉండాలి, దైవీ సంపద ఉండాలి, అసురీ సంపద నాశనం చేసుకోవాలి. ఇది ఒక జాతి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అయితే ఇందాక అన్నట్లుగా జీవితంలో అనేక మలుపులు వస్తూ ఉంటాయి. ఆ మలుపులలో వచ్చిందే బౌద్ధం.బుద్ధుడు ఒక enlightenment ప్రబుద్ధ మానస స్థితి వచ్చే దాకా ఆయన వెంట వేలాది లక్షలాది శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఈ ప్రబోధము ఈ ప్రచారము నాకు సాధనకు అడ్డగవుతున్నదని అనుకున్నాడో ఆత్మానుసంధాన దృష్టితో కూర్చున్నాడో ఆయనకొక్క ఎరుక కలిగింది. ఈ దేహాన్ని సృష్టింపజేయటం వలన మోక్షం నాకు లభించదు. దీనిని యాతన పెట్టినందువలన నాలో ఉన్న దివ్యంని నేను గమనించలేను. కనుక ముందు ఆ పని విరమించుకుందామనుకున్నాడు. ఈ ప్రబుద్ధ మానవమైన స్థితి ఏర్పడే నాటికి బుద్ధుని చుట్టూ ఉన్నవారు కేవలం పన్నెండు మంది శిష్యులు మాత్రమే. కన్ను తెరిచి ఒక మాటన్నారు మీలో దేవుడున్నాడు గమనించుకోండి అన్నాడాయన. పన్నెండు మంది ఎట్లా విన్నారంటే మీ పన్నెండు మంది దేవుళ్ళని మా గురువుగారు చెప్పారు అని అనుకున్నారు ప్రమాదం అక్కడ వచ్చింది. వచ్చి ఈ పన్నెండు మంది నిరీశ్వరవాదాన్ని ఈ భారతదేశంలో ఆసేతు సీతాచలం కూడా ప్రచారం చేశారు. దేవాలయాలు మూతబడిపోయినాయి. దైవ భావన లేదు. ప్రతి వ్యక్తి నేనే దేవుణ్ణనేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టబడ్డాడు. నిరాశావాదము నిరీశ్వరవాదము రెండు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి వేళ పరమేశ్వరుడు శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుంటాడు ప్రమాణం ఏమిటి? యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకుంటాను నాకు తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళని నేను నిర్ణయించుకుంటాను ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎట్లా రావాలో, ఏ పేరు పెట్టుకొని రావాలో, ఏం చేయాలో అవన్నీ నాకు ఎరుకే. ప్రణాళిక ముందు సిద్ధమవుతుంది తర్వాత అవతార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవతార మూర్తుల చరిత్ర calendar event కాదు. వారి చరిత్ర ముందే నిబద్ధతతో ఉంటుంది, ముందే అప్రకటితంగా ఉంటుంది. వారు ఈ ప్రపంచంలోకొచ్చి తమ అనేకానేకమైన కార్యకలాపాల ద్వారా ధర్మ స్థాపన, దైవము యందు ఉండవలసిన అమిత విశ్వాసము వీటిని నెలకొల్పి మళ్ళీ ఆ జాతిని పురోగమన దిశగా ఆత్మవిచారణ మార్గంలోకి నడిపిస్తారు కనుక అటువంటి వారంతా కూడా గురు స్థాయిని మించి ఒక అవతార మూర్తులుగా ప్రజల చేత కొనియాడబడతారు, పూజింపబడతారు. సరిగ్గా ఆ సమయంలో శంకర భగవత్పాదులు ఈ ప్రపంచంలోకి వచ్చారు. విచిత్రం ఏమిటంటే అప్పటికే భారతదేశం యాభై రెండు ముక్కలైపోయింది. ఈ దేశం ముక్కలు కావటం మనకు కొత్తేం కాదు. ఎప్పుడు ముక్కలవుతున్నదో అతగటానికి పరమాత్మే స్వయంగా వచ్చిన దేశం ఇది. అంతేకాదు హిమాలయం దగ్గర నుంచి కన్యాకుమారి వరకు పరమేశ్వరుడు అవతారం ఎప్పుడన్నా ఎత్తితే ఇక్కడే ఎత్తాడు. వేదముల ప్రామాణికమైనటువంటి ఒక మాట ఎవరు భారతదేశంలో మానుష దేహం తీసుకొని మానవ జన్మ ఎత్తి వస్తారో వాళ్ళు నిజానికి ముక్తులే. ముక్తులైన వారే ఇక్కడ జన్మ ఎత్తుతారు అని ఒక ప్రమాణం. మళ్ళీ మనం ఇంకొకరి దగ్గరికి వెళ్లి నాకో ముక్తి ఇవ్వమని అడగక్కర్లేదన్నారు రమణ మహర్షి. ముక్తులు కాకపోతే ఇక్కడ జన్మ ఎత్తం. ఇక్కడ జన్మ ఎత్తి కూడా ముక్త స్థాయిని ఇంతకు ముందే పొంది కూడా మళ్ళీ పాప కర్మలలో గనుక జీవితాన్ని గడిపినట్లయితే మళ్ళీ పునః ఈ జన్మ ఎత్తవచ్చునేమో కానీ ఇక్కడ మాత్రం ఎత్తం. ఇది ప్రమాణం. రెండవ ప్రమాణం ఒకటుంది. వింధ్య పర్వతాలకి ఇవతల దక్షిణాపథంలో ఎవరు జన్మ ఎత్తుతారో అందులో ప్రధానంగా ఆంధ్రదేశంలో వాళ్ళు పూర్ణ ముక్తులు అన్నారు. ఈ రెండు వేదంలో ప్రమాణం ఉంది. దాన్నే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యంలో చెప్పారు. ఆ పద్యంలో ఇది త్రిలింగ దేశం మూడు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి శివాలయాలలో నుంచి వచ్చేటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పుట్టిన ప్రతి జీవుడు సహజంగానే శ్వాసిస్తూ ఉంటాడు అని. అయితే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదా అని. అమిత లాభం మనకు కలగాలి అంటే మనం ఇవన్నీ చేయాల్సిందే. ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టి ఇంత గొప్ప జన్మ ఎత్తి దీనిని కూడా మనం సద్వినియోగం గనుక చేసుకోకపోయినట్లయితే ఒక జన్మ వృధా అయిపోతుంది కనుక ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవటానికి జన్మాద్యపాయం ము తప్పించుతన్ అంటారు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు. మహానుభావుడు. ఆయన ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షా దక్షమై తాండవాహంకార స్థిర చంద్ర యశ్శకల చైత్య ప్రాప్త శాంతత్వమై శంఖా సంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించు తన్. ఆంధ్రుడిగా పుట్టి తెలుగుదేశాన పుట్టి ఈ అఖండ భారతావరణిని ఒక్కసారి జోడించినటువంటి ఒక మహా చైత్య పురుషుణ్ణి పరశివావతారాన్ని మేధా దక్షిణామూర్తి యొక్క అపర అవతారాన్ని మనం గమనించకపోయినట్లయితే శంకర వాంగ్మయాన్ని అధ్యయనం చేయకపోయినట్లయితే శంకరులు ఈ జాతికి ఏం చేశారో తలుచుకోకపోయినట్లయితే కృతజ్ఞత అంతకంటే మరొకటి లేదు. కనుకనే గురుతత్వంలో శంకర భగవత్పాదులు మాత్రమే ఆది శంకరాచార్య అన్నారు. శంకరాచార్య ఆయన పేరు కాదు ఆచరిస్తూ బోధించారు గనుక శంకరులు శంకర ఆచార్యులైనారు.తొట్ట తొలి అద్వైత భావనా భూమికని జగత్తుకు పరిచయం చేశారు గనుక ఆయన ఆదిశంకరుడు అయినారు అది. ఎక్కడి కాలడి ఎక్కడి కేదారం? ఎక్కడి ఈ ప్రస్థానం? కేవలం ముప్పై రెండు సంవత్సరాల తల్లిదండ్రుల తపఃఫలంగా పరమేశ్వరుడు వచ్చి "నీకో బిడ్డనిస్తాను కానీ అల్పాయుష్కుడైన బిడ్డ మాత్రమే నీకుంటాడు" అని చెప్పినప్పుడు కేవలము ఎనిమిది సంవత్సరాలు రాకుండానే చతుర్వేదాలను నాలుక మీద నర్తింపజేసినటువంటి భగవత్పాదులు, ఎనిమిది సంవత్సరాలు రాకుండానే సన్యసించినటువంటి భగవత్పాదులు, ఎనిమిది సంవత్సరాలు రాకుండానే తన తల్లి "నాయనా! అవసాన సమయంలో నువ్వు ఎక్కడుంటావో నాకోసం నువ్వు రావాలి" అన్నప్పుడు ఒక కర్మకాండని ధర్మబద్ధం చేసినటువంటి శంకర భగవత్పాదులు కేవలము తన స్వీయ కృషి చేత ఎనిమిది సంవత్సరాల ఆయుష్షుని పదహారు సంవత్సరాలు చేసుకున్నారు. మళ్ళీ పదహారు సంవత్సరాలు రాగానే మృత్యువు దగ్గరకు వచ్చింది. "శంకరా! సమయం అయిపోయింది" అని. "ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను నా దగ్గరే ఉండు" అన్నారు. మృత్యువుని శాసించినటువంటి ఆచార్య సత్తముడు సత్యాచార్యుడు శంకర భగవత్పాదులు. పదహారు అయింది, ఇరవై నాలుగు అయింది, ముప్పై రెండు అయింది మృత్యువుని పిలిచారు. "నా వెనక నడవమ్మ" అన్నారు. కేదారంలో అందరూ చూస్తుండగానే పంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని పంచభూతాలలో కలిపి తన మూలమైన స్వస్థానమైనటువంటి విశ్వ మహా చైతన్యంలో తాను ఒకటిగా ఒక పూర్ణత్వాన్ని సాధించుకున్నటువంటి ఒక మహాపురుషుని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకనే గురూణాం గురుху వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వత్మసుఖావబోధే జనస్యయే జంగలికాయమానే సంసారహాలాహలమోహశాన్యే. అసలు ఈ గురువుని నమస్కరిస్తే గురువుని దర్శిస్తే ఏం లభిస్తుంది అని. గురువుని దర్శిస్తే తాయత్తు లభించదు వద్దు ఆ గురువు మనకు అక్కర్లేదు. గురువుని దర్శిస్తే ప్రాపంచికమైన కోరికలు తీరుతయా ఆ గురువు నాకు అక్కరలేదు. జన్మాంతర సంగతంగా వచ్చినటువంటి సంచిత కర్మల మూటంతా మటుమాయం చేయగలిగినటువంటి జ్ఞానబోధ చేసేటువంటి ఒక గురువు నాకు దొరికినట్లయితే అటువంటి ఆ గురువుకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకు అంటే కామ్యసిద్ధినిచ్చే గురువు స్వల్ప గురువు, అల్ప గురువు. సూచక గురువు, మోచక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువు, లోక గురువు, శోక గురువు, బోధ గురువు, బాధ గురువు అనేకమైన గురు స్వరూపాలు ఈ ప్రపంచంలో చలామణి అవుతుంటే ఒక్కడుంటాడు ఆయన పేరు కారుణ గురువు. ఈ జన్మ ఎత్తి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తాడు కారణం చెప్తాడు. కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చిన ఈ దేహాన్ని ప్రపంచానికి ఎట్లా అందించాలో ప్రపంచం కోసం ఈ దేహాన్ని ఎట్లా వాడాలో చెప్పటానికి వస్తాడు. చివరికి ఈ దేహము ఉండేది కాదు. దహయతీతి దేహః దహింపబడుతుంది గనుక దీనికి దేహం అని శర్యతీ ఇతి శరీరః మార్పు చెందుతుంది గనుక దీనికి శరీరమని అట్లాగే పంచభూతముల నుంచి ఇన్సులేట్ అయి ఉంటుంది గనుక కవచమని, దశేంద్రియాలతో నడుస్తుంది గనుక ఇది రథమని చివరకు పరమంగా చరమంగా నీలోనే దివ్యుడైనటువంటి పరమాత్మ ఆత్మ స్వరూపంగా ఉన్నాడు గనుక నీ దేహమే దేవాలయం అని చెప్పిన ఒక సనాతనమైనటువంటి ధర్మ వేదిక ఈ భారతదేశం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్దతా మధతా వా పవన చరణ రోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. ఏ గురువైనా నీవు ఆత్మవు అని చెప్పిన వాడు కారుణ గురువు. అందుకే సత్యసాయి భగవానుడి యొక్క డెబ్బై రెండు సంవత్సరాల ప్రభోదాకృతిలో వారి బోధ సంబోధన ఎట్లా ఉన్నది? "దివ్యాత్మ స్వరూపులారా! ప్రేమాత్మ స్వరూపులారా!" ఏ ఒక్కరిని ఆయన పేరుతో పలకరించిన వైనమే లేదు. దివ్యాత్మ స్వరూపులు మీరు దానిలో ప్రేమాత్మ స్వరూపులు మీరు. ప్రేమ అంటే కరుణ, దయ, జాలి, సానుభూతి అహంకారానికి ఛాయలు అయితే కరుణ రసార్ద్రమైనటువంటి ఒక ఘనీభవించినటువంటి రసప్లావితమైనటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య చైతన్యానికి కరుణ సంకేతం. అదొక ప్రవాహం. అందుకనే సకరుణం అంటాం పరమాత్మని. అలాగే పరమాత్మకి ఉపనిషత్తులు పెట్టిన పేరు అభీహి అన్నది. అభీహి అంటే భీతిలేని వాడు అని, భయం ఎరుగని వాడు అని. మనకంతా భయమే. పుట్టటం భయం, ఉండటం భయం, బతకటం భయం, పోవటం భయం అన్నీ, శ్వాసించటం భయం. మరి మనవంటి దేహాన్ని ధరించిన వాడు ఆయన భయం లేకుండా ఎలా ఉన్నాడంటే తనకంటే మరొక వ్యక్తి లేడు గనుక, తనవంటి వాడు మరొకడు లేడు గనుక, తనతో సమానమైన వాడు ఇంకొక వ్యక్తి లేడు గనుక పరమేశ్వరుడు అభీహి. మన భయాలన్నీ మనవంటి వాడు ఇంకోడు ఉంటాడేమో ఉన్నాడేమో మళ్ళీ మనలాంటి వాడు ఇంకోడు వస్తాడేమో మన స్థానాన్ని ఇంకోడు ఆక్రమిస్తాడేమో వాడి వల్ల నేను నా వల్ల వాడు పరస్పరం భయభ్రాంతులం అవుతామేమో ఇవన్నీ కూడా మటుమాయం చేయటానికి శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు. సామాన్య మానవుడి నుంచి పెద్దవాడికి పెద్ద ముద్ద ఇచ్చారు. చిన్నవాడికి గోరుముద్ద ఇచ్చారు. ఎవరు చేయగలరు ఈ పని? ఒక తల్లి మాత్రమే చేయగలదు. ఆ తల్లి ఈ గురు స్థానంలో ఉన్నప్పుడు ఆ గురువు ఈ జగత్తుకి ఎటువంటి బోధ చేస్తాడు అంటే గురువు అనంగానే చీకటిని పోగొట్టి అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అని. గురువు అంటే ఆ వస్తువుని ఆ పదార్థాన్ని మించి మరొక పదార్థం లేనిది ఏదైతే ఉన్నదో అది గురువు. అంతేకాదు ఎవరిని అందుకోవలసి ఉన్నదో, ఎవరు అందుకో తగినవాడో, ఎవరు అంది అందకుండా ఉంటాడో అందుకనే प्रत्यक्ष कल्याण भुवे सुनाम्ने प्रत्यर्थ पियूष दुहे स्वधाम्ने प्रचक्षर स्वादुरसैकसीम्ने भूम्ने नमस्ते निकमाग्रधाम्ने. ఈ వేద వేదాలు కూడా పైన వాటి పైన ఎవరున్నారయ్యా అంటే
YouTube · audio
ఆదిశంకరాచార్య గురుతత్త్వం | Sri AdiSankaracharya Guru tatvam | Kshetra Channel
ఆదిశంకరాచార్య గురుతత్త్వం | Sri AdiSankaracharya Guru tatvam | Kshetra Channel
Source: kshetra channel on YouTube
0:00 / 25:16