No transcript for this section.
Transcript begins at 0:00.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రథమ ప్రచూష వేళ ఒక సంగీత సాహిత్య సమన్వయమైనటువంటి సమలంకృతమైనటువంటి ఒక సరస్వతీ సభలో ఆకాశవాణి అశరీరవాణి అసలైనవాణి మనందరం కూడా అనుభవించవలసినటువంటి ఒక సన్మంగళ వేళ ఇది. ప్రధానంగా ఉగాది అనగానే ఇది వేదగమనమే ఉగాది, కాలగమనమే ఉగాది, నక్షత్ర గమనమే ఉగాది ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం. వేదగమనం ఏమిటి? వేదాలు నడిచినయా? అని కాకుండా మానవుడు తన బుద్ధి విశేషం చేత ఏది తెలుసుకోవాలో ప్రకృతి ద్వారా తాను తెలుసుకుంటూ తొలినాళ్లలో తనలో ఉన్నటువంటి ఒక సంస్కార ధారని తాను అర్థం చేసుకుంటూ తన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అక్కడి నుంచి ఉత్కృష్ట స్థితికి ఆపై ఉదాత్త స్థితికి కడగా యదార్థ స్థితికి తీసుకువెళ్ళింది ఈ దేశపు సంప్రదాయం గనుక వేదగమనమే ఉగాది అనేటువంటిది వేదోక్తమైనటువంటి మాట. ఇక మధుష్య మాధవస్య వాసంతికావృతౌ అంటుంది ఋగ్వేదం. మధువు పుట్టేది ఇక్కడే మాధవుడు నడిచేది ఇక్కడే. ఈ కాలం వసంత కాలం అంటే మధువు అంటే ఈ ప్రకృతి అంతా కూడా వసంత శోభతో విరాజిల్లుతున్నప్పుడు అనేకానేకమైనటువంటి పుష్పాలు తమలో ఉన్నటువంటి మధువుని తీసుకుని నింపుకొని మళ్ళీ ప్రపంచానికి అందిస్తూ ఉన్నప్పుడు ఇది మధుశ్చ. మరి మాధవశ్చ అనగానే మాధవుడు అంటే విష్ణువు అని ఒక అర్థం అయితే మా అంటే ధరిత్రి ధవుడు అంటే భర్త. ఈ ధరిత్రికి భర్త అయినటువంటి వాడు మాధవుడే గనుక ఈ ప్రకృతి సంపూర్ణమైనటువంటి ఒక శోభతో అలంకృతమై ఉండి సమస్తమైనటువంటి ఆనందాలకి సమస్తమైనటువంటి సద్వాసనలకి మూలమై ఉంటుంది గనుక ఈ ఉగాది కామల-- కాలగమనానికి సంకేతంగా ఖగోళ శాస్త్రం వేదాల్లో నుంచి ఒక పారశ్యం తీసుకుని ఆ వేదమే ఆ గమనమే ఇవాళ మన పంచాంగ శ్రవణం కానిందాకా రమణాచారి గారు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేస్తూ వచ్చారు. దానిలో ఆయనము, పక్షము, తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినయి? నక్షత్ర గమనంలో నుంచి వచ్చినయ్. కాబట్టి వేద గమనమైన, నక్షత్ర గమనమైన, మధువైనా, మాధవుడైనా సంపూర్ణంగా ఆవిష్కరించుకునేటువంటి ఋతువే వసంత ఋతువు. శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఒక మాట చెప్తారు. సంవిత్ ఫలమైనటువంటి జ్ఞానాన్ని ఎలా పొందాలి? దాన్ని ఎట్లా పట్టుకోవాలి? ఆ జ్ఞానం అంటే ఏమిటి? పుస్తకాలలో నుంచి, గ్రంథాలలో నుంచి అనేక సూక్తులలో నుంచి, సూక్తాలలో నుంచి మనం ఏరుకొని సంకలనం చేసుకొని సమన్వయం చేసుకొని అర్థం చేసుకుంటే అది జ్ఞానమా అంటే Intellectual interpretation is only విజ్ఞాన it is not జ్ఞాన. మరి జ్ఞానం అంటే ఏమిటి? దేనిని తెలుసుకుంటే ఇక తెలియబడవలసినది లేదో దానిని తెలుసుకోగలిగినటువంటి ఒక స్థితి పేరు జ్ఞానం. జ్ఞానం information కాదు. శంభు జ్ఞాన వసంత సంగిని హృదారామేఖ జిర్ణచ్ఛదా స్రస్తా భక్తిలతాచ్ఛతా విలసితా పుణ్యప్రవాళ శ్రితాః దీశ్యంతే గుణకోరకా జపపచ్చ్ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి అంటారు. ఏం చేయక్కర్లేదట. ఈశ్వరా అనేటువంటి పరమేశ్వరుడిని సంబోధిస్తూ ఉంటే జీవితంలోకి వసంత కాలం వస్తుందట. ఆ వసంత కాలం వస్తూనే అప్పటిదాకా సాగినటువంటి అనేకమైనటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి పాత ఆలోచనలనేటువంటి ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురాకులు మొసులెత్తుతాయట. చిగురాకుల పక్కనే దీశ్యంతే గుణకోరకా చిన్న చిన్న మొగ్గలు వస్తాయట. అవి సత్వ రజస్ తమో గుణాలకి సంకేతంగా మూడు మొగ్గలు వస్తాయి. అవి నెమ్మదిగా వికాసమానం చెంది పుష్పాశ్చ సద్వాసనా పుష్పాలై తెల్లవారేసరికి ఒక సొబగులు, శోభలు, ఆనందాలు అలాగే పరిమళాలు వెదజల్లుతూ ప్రకృతిని శోభాయమానం చేస్తాయి శోభకృతం చేస్తాయ్ అన్నమాట. పుష్పాశ్చ సద్వాసనా ఇదంతా అయిన తర్వాత మరి మొగ్గ కాయ అయింది, తర్వాత ఏం కావాలి? జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి తద్వారా కలిగేటువంటి ఒక జ్ఞానము వలన అది ఒక ఆనంద సుధామరందమై ప్రవహిస్తూ ఉంటే దానిలో సంవిత్ అనేటువంటి ఒక ఫలం మనకి చేతికందుతుంది. ఆ అందించేటువంటి సర్వోత్తమమైనటువంటి ఆనంద సంధాయకమైనటువంటి ఆనంద రసతుందలమైనటువంటి ఋతువే వసంత ఋతువు. అందుకనే ఋతువులలో మొట్టమొదటి ఋతువే వసంతం అవుతున్నది. మాసము చైత్ర మాసం అవుతున్నది. ఇవన్నీ ఏది ప్రథమంగా ఉన్నదో, ఏది ప్రథమాకృతిగా ఉన్నదో, ఏ ప్రకృతి అనేకమైనటువంటి ఆనందాలను ఇవ్వటానికి సంసిద్ధమై ఉన్నదో అటువంటి దివ్యమైనటువంటిది ఈ వసంత కాలం. ఈ వసంత కాలంలోనే వచ్చింది గనుక ఇది చిత్రంగా వచ్చినటువంటి చైత్రం గనుకఆ చైత్ర మాసం అంతా కూడా మనకి రాబోయేటువంటి ఆగామి కాలాలకి పూలబాట వేసేటువంటి పరమోత్కృష్టమైనటువంటి కాలం. దీనికి యుగాది ఉగాది అని రెండు పేర్లున్నాయి. ఈ ముందుగా ఉగాది అంటే ఉక్ అంటే మాట. మాట పుట్టినటువంటి కాలము ఉగాది. అంటే మానవుడు భాష లేక, భాష తెలియక, భాష రాక అంటే అభివ్యక్తి చేయాలి అంటే ఒక భాష కావాలి. ఆ భాష ఎలా వస్తుంది అని ఈ వేద ప్రామాణికమైనటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి. అందులో సామవేదం తీసుకుంటే అంతా గానమే. ఋగ్వేదం తీసుకుంటే అంతా మాటలే. యజుర్వేదం తీసుకుంటే అంతా కర్మకాండే. మరి ఈ నానానాథ సందోహమైనటువంటి ఈ గాలిలో నుంచి అడవి ఆకుల మధ్యలో నుంచి వచ్చినటువంటి గాలిలో నుంచి పుట్టినటువంటి ఒక నాదమే సంగీతమై అది సాహిత్యమై సాహిత్యమూ సంగీతమూ కలిసి ఒక భావమై ఆ భావము మాటై దానికి భాషై ఎంత రూపాంతరీకరణం చెందిందో ఇది ఆరు రుతువుల యొక్క సమన్వయ స్థితి దానికి ఆరంభ వేళ ఇదిగో ఈ ఉగాది. అంతే కాదు ఇది దీనికి ఇందాక మళ్ళీ రమణాచారి గారు ప్రారంభంలో చెప్పారు. యుగాది యుగాదికి ఇది ఉగాది అయింది. యుగాది అంటే యుక్ యుగము అంటే మనం అనుకుంటాం నాలుగైదు యుగాలు మనకు పెద్దవాళ్ళు చెప్పారు. కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇదిగో నడుస్తున్న కలియుగం అని. అది మాత్రమే కాదు మనిషి ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి విరామ కాలం పేరే యుగము అని అర్థం. ఒక మనిషి యొక్క మెదడులో ఒక సెకనులో ఆరువేల ఆలోచనలు పుట్ట-పుట్టేటువంటి సందర్భంలో మనలో ఎన్ని యుగాలుగా సాగుతున్నవో ఎన్ని యుగాలు పుట్టి కాల గర్భంలో కలిసి పోతున్నయో విచారణ చేస్తే ఇది కేవలము వేద గమనమే కాదు నక్షత్ర గమనమే కాదు ఇది కాలగమనమే ఉగాదిగా మనం భావన చేసినట్లయితే శోభకృత నామ సంవత్సరంగా ప్రారంభం అవుతున్నటువంటి ఈ శుభ వేళలన్ని కూడా ఒక శోభని అందుకోవలసి ఉన్నది. ఆ శోభ ఎక్కడ ఉన్నది? అది ఆంతరంగికమా? బాహ్యమా? అంటే బాహ్యంలో ఉండి- ఉండేది దాని పేరు అందం అది ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. సౌందర్యము ఆంతరంగికం అది ఇంద్రియాలను క్షమింపజేస్తుంది. కాబట్టి అందం వేరు సౌందర్యం వేరు. శృంగారం వేరు శృంగారము వేరు. కాబట్టి ఇవన్నీ ఈ భాషా సామాగ్రి అంతా కూడా మనకి ఇచ్చినటువంటి ప్రాచీన కవుల అందరికీ ఋషులందరికీ వేదమూర్తులందరికీ ఇవాళ ఈ ఉగాది నాడు మనము శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాలి. వారికి స్మృత్యంజలి ఘటించాలి. వారే గనుక మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాస్తూ అవతారికలో ఒక మాట అంటారు. "ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేనిన్ మౌని భాషా సంక్రాంతలు నమ్ము తీర్పగలదా" అంటారు. ఆ వాల్మీకే గనుక నాకు రామాయణం రాసి ఇవ్వకపోతే నేను తెలుగులో రాయగలిగేవన్నా పైగా అందులో ఆయన వాడిన పదం చూడండి భాషా సంక్రాంతం. ఇవాళ ఉగాది నిజానికి తెలుగువారి పండగ. ఇవాళ మాతృమూర్తి, మాతృదేశము, మాతృభాష. ఈ మూడింటిని కూడా మనం సంపూర్ణంగా సవినయంగా సమర్పణతో శరణాగతి భావంతో మనం చేయాలి. మరి దీనికి మూలమైనటువంటి ఒక సంస్కార ధార, ధార రావటానికి ముందు ఏర్పడినటువంటి ఆ బిందువు ఎక్కడ ఉన్నది అంటే రామాయణ రచన చేయాలి అని వాల్మీకి అనుకున్నప్పుడు ఇదిగో ఈ వసంత కాలంలోనే భరద్వాజుడు అనేటువంటి ఒక శిష్యుడిని వెంబడి పెట్టుకొని అడవి దారుల వెంట వెళుతూ వెళుతూ ఉంటే నాడు నగరాలు లేవు పట్టణాలు లేవు గ్రామాలు కూడా ఏర్పడలేదు ఉన్నదంతా అడవి దారే. వెళుతూ ఉంటే ఆయన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలి అని అనుకున్నారు. వెతుకుతున్నారు. ఉన్నవన్నీ తటాకాలు, అన్ని చెరువులు కనబడుతున్నాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా ఇతి, నా ఇతి, నా ఇతి అంటూ వెళుతున్నారు. కానీ గురువు గారికి మార్గం చూపించటానికి కాస్త నాలుగు అడుగులు ముందు వెళ్ళినటువంటి భరద్వాజుడు ఆయనా వెతుకుతున్నాడు. కానీ ఒక్క చోట మాత్రం వాల్మీకి హృదయం ఆగిపోయింది. ఆలోచన ఆగిపోయింది. ఆనంద తరంగితమైంది. "అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబుహు సన్మనుష్య మనో యథా" అన్నాడు. ఇది నిజానికి "మానుషాద ప్రతిష్ఠాన్త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచమిథునాదేకమవధిః కామమోహితం" ప్రథమ శ్లోకం అంటాం. కానీ ఇది ప్రథమ శ్లోకం. అకర్దమమిదం తీర్థం అంటే కర్దమం అంటే బిరు-- ఆ బురద. అకర్దమం అంటే ఇక్కడ బురదే లేదు. చాలా clean clear absolute గా ఉన్నది. ఎట్లా ఉన్నది? నిశామయ రమణీయం నీలి నీలి ఆకాశం నీళ్లలో కనబడుతూ ఉన్నది. ప్రసన్నాంబుహు అలలు లేవు, కలలు లేవు, అలజడులు లేవు. ఆ నీరు ఉన్నదా లేదా అన్నట్లున్నది. ఇది ఎట్లా ఉన్నది అంటే సన్మనుష్య మనో యథా సత్పురుషుడైన ఒక మహా మనిషి యొక్క హృదయం లాగా ఉన్నది. ఆ మహా మనిషి ఎవరంటే శ్రీరామచంద్రుడు. కనుక ఆయన కథని ఇక్కడే రాద్దాము భరద్వాజా అని పిలిచాడు. అంటే ఒక భాష సంస్కృతంలో నుంచి ఆంధ్రం పుట్టి ఒక తెలుగు ఏర్పడి ఒక భాష ఏర్పడి అభివ్యక్తిని సంపూర్ణంగా ఆవిష్కరించుకోవటానికి ఆలోచనలను పంచుకోవటానికి ఒక సంస్కృతికి సంస్కారానికి జీవ గర్ర అయినటువంటి ఒక భాష ఇవాళ ఏదో జారిపోతున్నది, మారిపోతున్నది, కూలిపోతున్నదిని విషాదం ప్రకటించే బదులు ఇవాళ ఇందాక యువకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కవిత్వం చదివినప్పుడు శ్రద్ధాళువునై నేను విన్నప్పుడు నేను నమస్కరించింది యువశక్తికి నమస్కరించుకున్నా.ఎన్నెన్ని భావాలు ఎన్ని గాఢమైన సాంద్రమైన భావాలు వాళ్ళ జీవితాన్ని ఎంత దగ్గరగా ఎంత లోతుగా ఎంత గంభీరంగా ఎంత గభీరంగా ఎంత ఉదాత్తంగా ఉన్నతంగా ఆలోచిస్తున్నారో తలుచుకున్నప్పుడు మనం మాధ్యమాలలో వినిపించేటువంటి negativity పారిపోయిన క్షణాలను నేను ఒడిసి పట్టుకున్నాను ఇవాళ అంతేకాదు ఆకాశవాణిలో school days లో peace program కి విజయవాడ station కి వెళ్ళినప్పుడు నేను పొందినటువంటి ఆనాటి తాదాత్మ్య అనుభవాలని నేను నెమరువేసుకున్నప్పుడు ఎప్పుడైనా హైదరాబాద్ ఎప్పుడూ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళినప్పుడు నేను మానసికంగా నమస్కరించకుండా అడుగు పెట్టలేదు ఈ క్షణం వరకు కూడా ఇవాళ కూడా ఆకాశవాణి వల్లే నేను ఇక్కడికి వచ్చాను ఈ నేను అనేటువంటిది మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇవాళ ఉగాది నాడు మనందరం కూడా మనం మరచిపోతున్నటువంటి భాషా సంస్కృతులని వీటన్నింటినీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే సంస్కృతి పాతది కాదు అది stagnant water కాదు నీటి చలమ కాదు అది మహాసముద్రం మహాసముద్రం అది ఎలా అయింది అనేక నదులు పాయలు కలిసి కలిసి కలిసి ఒక్క సముద్రమై నిలబడితే ఆ సముద్రమే మళ్ళీ ఆకాశంలోకి ఉపరితలం మీద నుంచి ఒక నీటి ఆవిరి ఏర్పడి మేఘాలు ఏర్పడి బల్లున త్రెల్లి మళ్ళీ ఎక్కడో పడ్డప్పుడు జీవనదులై ప్రవహిస్తున్నప్పుడు ఈ నదీ సాగర సంగమం జీవాత్మ పరమాత్మల సంకేతంగా ఆ సంకేత భావనా స్థితిని ఈ జాతి అందిపుచ్చుకున్నటువంటి వైనం మనది ఎందుకంటే ఒక వెయ్యి సంవత్సరాల పద్యం కావచ్చు కానీ ఈ దేశం సంస్కృతి లక్షల సంవత్సరాల సంస్కృతి మనం కాలాన్ని కొలవలేం అటువంటి ప్రతి ఉగాది జీవితంలో మనకి birthdays వస్తాయి ఒక year add అవుతుంది అరవై తొమ్మిది డెబ్బై అవుతుంది కానీ ప్రతి ఉగాది డెబ్బై అరవై తొమ్మిది అవుతుంది అరవై తొమ్మిది అరవై ఎనిమిది అవుతుంది మళ్ళీ ఒక్కసారి retreat వెనక్కి వెళ్ళి జీవితం ఇంకాస్త ఉంటే బాగుండు కదా ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా అని అనిపిస్తుంది ఇక్కడ రామాయణ ప్రస్తావన మళ్ళీ మరొక్కసారి చేసుకున్నట్లయితే ఈ వసంత కాలమంతా రామాయణంలో ప్రధాన ఘట్టాలు అక్కడ ఏర్పడ్డాయి ఈ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రయాణంలో అరణ్యవాస ఆరంభ వేళలు వసంత కాలం అలాగే సుగ్రీవ మైత్రి సుగ్రీవ మైత్రి కంటే కూడా హనుమతో ఏర్పడినటువంటి ఒక బాంధవ్యం వసంత కాలంలో ఏర్పడింది సీతాన్వేషణ ప్రారంభమైంది వసంత కాలం లంకా సామ్రాజ్యం మీద ఒక దండయాత్ర హనుమ చేసింది వసంత కాలం శ్రీరామ పట్టాభిషేకం జరిగింది కూడా వసంత కాలమే రాబోతున్నది శ్రీరామనవమి అంటే రామాయణము మానవ జీవన యానం కనుక అయినట్లయితే మన జీవితాలలో కూడా అనేకమైన అరణ్యవాసాలు ఉంటాయి అపహరణాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అనుమానాలు ఉంటాయి సందేహాలు ఉంటాయి సందిగ్ధాలు ఉంటాయి వీటన్నింటికీ కూడా చరమగీతం పాడగలిగినటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక సంస్కృతి ధార అది ఏది అంటే ఇదిగో ఈ భారత జాతి పైగా తెలుగునాడు ఏర్పరచుకున్నటువంటి ఒక భాషా విశేషం అందుకే నండూరి రామకృష్ణమాచార్యుల వారు సంస్కృతంలో తెలుగు పద్యం రాశారు ఆయన "పూర్వాంభోనిధి కాళహస్తినగరీ శ్రీమన్ మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరీ ప్రాతర్ణ వోషస్విని కృష్ణా కంకణ కింకిణి జన జనత్ గోదావరి కాంచికా ద్రాక్షా పేసల వాంమయి విజయతాం త్రిలింగ పృధ్వీ స్థలి" అన్నాడు కనుక ఇవాళ మనం పుట్టినటువంటి ఈ నేల ఈ తెలుగు నేలకి మనందరం కూడా నమస్కరించుకోవలసినటువంటి సమయం ఇది ఉగాది ఇక రెండవది సంస్కృతము ఆంధ్రము రెండూ కూడా అప్పచెల్లెళ్ళ వంటివిగా కలిసిపోతాయి ఎట్లా అంటే ఒక అక్క ఒక చెల్లెలు కలుసుకున్నప్పుడు విరామం ఎరుగకుండా మాట్లాడుకుంటారు ఒక అన్న తమ్ముడు కలిసినప్పుడు comma పెట్టుకొని ఎవడి దారిన వాడు వెళ్ళిపోతాడు ఇది ఒక విశేషం అంటే అప్పచెల్లెళ్ళ హృదయాలు వాళ్ళు వేరే ఎళ్ళకు వెళ్ళిపోయినారు కలవ కలవ కలుస్తారు అట్లా కానీ నిరంతరంగా అనాహతంగా మాట్లాడుకున్నట్లుగా సంస్కృతముతో కూడినటువంటి ఆంధ్రము ఆంధ్రముతో కూడినటువంటి సంస్కృతము ఒక విశిష్టమైన వరిష్టమైన శిష్టమైన చిక్కనైన అందమైన మధురమైనటువంటి భాష తెలుగు భాష ఆ తెలుగు భాషని నిలబెట్టుకోవలసినది సాధ్యమైనంతవరకు తెలుగులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి ఒక అవకాశం అవసరం ఏర్పడింది కాబట్టి ఈ ఉగాది అది ప్రారంభ వేళ కావాలి ఇక రెండవది మాతృమూర్తి తల్లి చనుబాలలో నుంచి రామాయణం విని తల్లి కనుసన్నలలో నుంచి శ్రీకృష్ణ లీలలని ఉయ్యాలలూగి శివ పారమ్యాన్ని అనుభవించి పూర్ణాద్వైత అనుభవాన్ని పొందినటువంటి మన బోటి వాళ్ళందరం మన జాతి అంతా కూడా ఇవాళ మాతృమూర్తికి నమస్కరించుకోవలసినటువంటి సమయం ఎందుకంటే తల్లే లేకపోతే తనువే లేదు తండ్రే లేకపోతే భావమే లేదు భావము భాష తనువు అన్నీ మనకి ఏర్పరచినటువంటి తల్లిదండ్రులకు నమస్కరించుకోవలసినటువంటి ప్రథమమైనటువంటి సన్నివేశమే ఉగాది కాబట్టి ఈవేళ తెలుగు సంప్రదాయంలో పాద నమస్కారాలు తక్కువ ఉత్తరాదిలో ఎక్కువ అది లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళరు కానీ మనం కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలి తల్లి తండ్రి వాళ్ళు ఉన్నట్లయితే లేకపోతే స్మృతి నీరాజనం ఉన్నట్లయితే పాద నమస్కారం చేసుకోవాలి అది మాతృమూర్తి ఇక మాతృదేశం దేశం అనేటువంటిది భారతదేశం అనేటువంటిది ఆసేతు సీతాచలం పరుచుకున్నటువంటిది కాబట్టి అందులో అనేక రాష్ట్రాలలో అనేక ఉగాదులు ఇట్లాగే ఈ వసంతాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి తెలుగునాట ఉగాదికి ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ మనం చాలా సేపు మాట్లాడుకున్నాం పరంపరానుగతంగా మాట్లాడుతున్నాం ఇవాళ కొత్త ఆలోచనలు పుట్టాలికొత్త సంస్కృతులు రావాలి అన్ని సంస్కృతులు విరాజమానం కావాలి. సంస్కృతి చేత గాని మతము చేత గాని భావము చేత గాని కులము చేత గాని స్థితిగతుల చేత గాని మానవులు గనక విడిపోతూ ఉన్నట్లయితే ఈ ఉగాదికి అర్థమే లేదని నేను భావన చేస్తూ మనం చేయవలసిందంతా inclusiveness అంటాం ఇంగ్లీషులో అంటే అన్నింటినీ సమన్వయం చేసుకోగలిగిన అటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మ వేదికగా ధర్మ భూమికగా మన మనస్సులన్నీ కూడా రంజిల్లా లని నేను అనుకుంటూ సాహిత్యము సంగీతము అనేక సర్వ కళల సమాహారంగా ఉన్నటువంటి ఆకాశవాణి ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచి మనందరినీ పిలిచి ఒక చోట సంఘటిత పరిచి మన భావాలన్నీ కూడా చక్కగా విశ్లేషణాత్మకంగా ఆలోచనాత్మకంగా చింతనాత్మకంగా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆకాశవాణి డైరెక్టర్ ఉదయశంకర్ గారికి మాకు పరమ మిత్రులు అలాగే భాషా సంస్కృతులు తెలుగు పద్యం మీద doctorate చేసిన మాకు ఆ వయసులో నాకంటే ఆయన చిన్నవారు గనుక మా సోదరులు రమణాచారి గారు అలాగే మాకంటే వయసులో పెద్దవారు పద్మనాభరావు గారు అలాగే ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ సంకల్పం చేస్తే ఆరంభము నేనే ఆ సమాపనోత్సవము నేనే గా ఆకాశవాణి ఆదరించటం ఇవన్నీ కలిసినప్పుడు అలాగే ఆకాశవాణిలో వచ్చినప్పుడల్లా అక్కడికి ఒక పుట్టింటికి వెళ్ళిన భావన మొగవాడికి పుట్టింటి పుట్టిల్లు ఏమిటి అని కానీ నాకు కలిగేటటువంటి ఉదాత్త భావన అదే అందరికీ కూడా పేరుపేరునా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ యువకులందరూ కూడా నిరాశ్యంలో కురుకు పోకండి నిరాశ శీతవేళ రానీయకు శిశిరానికి చోటు ఇయ్యక అన్నాడు కృష్ణశాస్త్రి అట్లా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి ఆ కాంతి పుంజంలో నుంచి మనంతట మనం ఆ నిజానికి సత్యప్రభ అని రామాయణంలో చిన్న గుహ ఉంటుంది ఆ గుహలోకి ఏ మనిషి వెళ్ళినా ఎటువంటి వాడు వెళ్ళినా gloomy గా వెళతాడట చాలా విషాదంతో ఒక హృదయ భారంతో వెళతాడు కానీ లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి ఆనందంతో వెలుగుతో ఉత్తేజంతో ఉద్వేగంతో మహోత్సాహంతో బయటకు వస్తాడట అటువంటి ఆ సత్య ఆ ప్రభ ఏదైతే గుహ ఉన్నదో ఆ గుహను నేను ఆకాశవాణి గా భావన చేస్తూ చీకట్లు పో పోకార్చి మానవ జీవితాలలో మానవ సంస్కృతి విలసనం కలిగే రీతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన జరగాలని ఇంతకుముందు ఆకాశవాణి చిన్నప్పుడు వాళ్ళందరి పేర్లు చాలా పెద్దవి ఒక్కొక్కరు ఒక్కొక్క మహా వటవృక్షం వారి వారి రీతులలో నాకు తెలిసి ఇద్దరిని ప్రస్తావన చేసి ముగిస్తాను ఒకరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారు శరీరాన్ని ఇంకొక రెండు నెలల్లో వదిలిపెడతారనంగా ఆ time లో కూడా చెన్నైలో నాతో అన్న మాట ఏంటంటే ఈ బాలమురళీకృష్ణ అనేటువంటి ఈ దేహం తిన్న తొలి ముద్ద ఆకాశవాణిది అది నాకు ఉద్యోగం ఇచ్చింది నాకు చదువు లేదు నా ప్రతిభను గుర్తించింది రెండవ వారు నేను student గా ఉన్నప్పుడు ఘంటసాల గారిని ఐదున్నర గంటలు interview చేసినప్పుడు ఆయన అన్నారు ఈ discipline అంతా కూడా శబ్దాన్ని ఎలా పలకాలి ఏ అక్షరం మీద ఒత్తిడి తేవాలి దేనిని తేలికగా పలకాలి దేనిని సమన్వయం చేస్తూ పాడాలి భావం పోకుండా ఎలా పాడాలి లలిత సంగీత లలిత శాస్త్రీయ సంగీతం అనేది ఒకటి పుట్టటానికి కారణమైనటువంటి ఆకాశవాణి నా హృదయ స్థానంలో ఉన్నది నా తర్వాత ఇవాళ ఈ బాణీలు ఘంటసాల బాణీగా అనుకున్నప్పటికీ నా హృదయంలోది ఆకాశవాణి బాణీ కాబట్టి వేళ ఆకాశవాణిని తెలుగు జాతిని తెలుగు సంస్కారాన్ని తెలుగు సంస్కృతిని తెలుగు వెలుగులని మరొక్కసారి స్మరించుకుంటూ ఈ ఉగాది శోభకృత్ నామ సంవత్సరంగా ప్ర సర్వ ప్రకృతి కూడా శోభాయమానమై వెలుగొందు గాక అని మంగళాశాసనం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.
YouTube · audio
వసంత శోభ | శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి | Vasantha Shobha
వసంత శోభ | శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి | Vasantha Shobha
Source: AIRHyderabad on YouTube
0:00 / 22:31