Skip to content
Transcript తెలుగు
శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సాయిరాం కోటి సమితి శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. అయితే ఏదైనా జీవితంలో అర్థం ఎరిగి చేయాలి. సమయాన్ని లక్ష్యం చేయకుండా, నిజానికి లలితా సహస్ర నామ పారాయణంలో వేయి నామాలు నెమ్మది నెమ్మదిగా చదవాలి అది మొట్ట మొదటి విషయం. రెండవది స్పష్టంగా చదవాలి. చదువుతున్నంత సేపు నామాలకు అర్థం తెలిసినా తెలియకపోయినా భక్తితో, అనురక్తితో, మధురమైనటువంటి భావనతో జగజ్జననిని కొలవాలి. ఇట్లా గనుక చేసినట్లయితే లలితా సహస్రనామ వైభవం మనకి ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని కలిగించి భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిల్లో కూడా మనకు తెలియని ఒక పరవశ్యాన్ని, ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి పారాయణ పరమార్థం ఇదే. పౌరాణిక వాఙ్మయంలో లేదా భారతీయ ఆధ్యాత్మిక పారాయణార్హమైనవి అతి కొద్ది విషయాలే ఉన్నాయి. రామాయణం తీసుకున్నట్లయితే సుందర కాండ పారాయణార్హమైనది. అలాగే భారతాన్ని, భాగవతాన్ని చూసినట్లయితే విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలి. భగవద్గీతని నిజానికి పారాయణం చేయాలి. ఇట్లా వీటన్నింటికంటే కూడా, నిజానికి వీటన్నింటితో పాటు శ్రీ లలితా సహస్ర నామ పారాయణం ఒక విశిష్టతను సంతరించుకున్నది. దీనికి కారణం ఏమిటంటే కలియుగానికి అధిష్టాన పరదైవతం ఎవరు అంటే కోటి సూర్య మండల మధ్యస్థైన మహా త్రిపురసుందరి దేవి. ఆమె జగత్తు మీద ఉన్నటువంటి కరుణ చేత, అవ్యాజమైనటువంటి దయ చేత శ్రీ లలితా దేవిగా ఆవిష్కరించుకుని సర్వ జీవుల యందు, సర్వ అణువుల యందు తన శక్తిని నిక్షిప్తం చేసుకుని జగత్తుని తనదైనటువంటి రీతిలో తాను నడుపుతుంది గనుక వేయి నామాలు చదవటము అంటే వేయి విధాల అమ్మవారిని మనం ఆవాహన చేయటమని, అమ్మ యొక్క శక్తిని, అనంతమైనటువంటి కరుణని, వాత్సల్యాన్ని మనం పొందేటువంటి ఒక ఆధ్యాత్మిక విధానం అని మనం గనుక అర్థం చేసుకున్నట్లయితే లలితా సహస్రనామ పారాయణానికి ఒక అర్థము, పరమార్థము ఏర్పడి ఉంటాయి. ఇందులో స్త్రీలే ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. నిజానికి ఆబాలగోపాలము అంటామే! బాలురు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు వయోభేదం లేకుండా గనుక లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే అది ఇచ్చే ఫలితాలు చాలా గంభీరంగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి. జీవితానికి ఒక భద్రతని, ఆరక్షణని కల్పిస్తాయి గనుక లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది జీవితంలో ఒక దైనందిన భాగం కావాలి. దాని దిశగా అదే రీతి ఈవేళ జరుగుతున్నటువంటి పారాయణ మహోత్సవానికి మీ అందరికీ కూడా సాదర పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ అధిష్టాత అయినటువంటి మాతృమూర్తి జగజ్జనని శ్రీ లలితా దేవిని అట్లాగే సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారిని సభని ఇచ్చేసి, సభకి విచ్చేసి సభను ఆశీర్వదించి వారు ఆనందం పొందే రీతి మనందరం కూడా పారాయణాన్ని చక్కగా, నెమ్మదిగా, మంద్ర స్థాయిలో, రకమైన తొట్రుపాటు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేయాలి అని నేను మంగళాశాసనం చేస్తూ, ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటమే ఒక విశేషమైన యోగంగా, భాగ్యంగా, సౌభాగ్యంగా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఫలితాలన్నీ కూడా సర్వ జగత్తుకి అందాలని అంటే కేవలం మనకు మాత్రమే కాక సర్వ ప్రపంచానికి, సర్వ ప్రాణులకి, సర్వ లోకాలకి అందే దిశగా పారాయణ కార్యక్రమం చక్కగా కొనసాగాలని కోరుతూ స్వామిని, లలితా దేవిని ప్రార్థన చేస్తూ జయోస్తు విజయోస్తు.
YouTube · audio

Message - Lalitha Sahasra Naama Paarayanam

Home

Message - Lalitha Sahasra Naama Paarayanam

Source: P V S on YouTube

0:00 / 5:08