No transcript for this section.
Transcript begins at 0:00.
ఎక్కువ ఉన్నాం మాట్లాడుకోవటానికి కాయ-కాయం మూలం భూమి కాబట్టి మూడుగా కనిపిస్తున్న నిజానికి మూడు కూడా ఒక్కటే. మరి సాధన ఎలా చేయాలి? మేము చేస్తున్నాం కదా, భజన చేస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా భక్తి కిందనే వస్తాయి కదా, ఇవన్నీ ఆధ్యాత్మిక కిందనే వస్తాయి కదా ఇంకా ఏమిటి? అన్నప్పుడు ఒక ఆలోచన ప్రతి వ్యక్తి యందు కలగాలి. మరి ఈ ఆధ్యాత్మిక సాధన ఎక్కడ ప్రారంభం కావాలి? ఇలా సామూహికంగా ఒక మంది వారు కొందరు ఈ విన్న దాని ప్రకారం గ్రహించేవారు కొందరు ఇదేదో మనకు సంబంధించింది కాదనుకుంటూనే నిలబడాలి. వ్యక్తిగత సాధనలో మనం గనక వెనకబడి పోయినట్లయితే ఆధ్యాత్మిక సాధన దానికి నిజానికి అర్థమే లేదు. మన పూర్వీకులు, మన తల్లులు, తండ్రులు, తాతలు, ముత్తాతలు పరంపరానుగతంగా మనకు నేర్పింది ఏమిటంటే మరి ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక దేవాలయం గనక ఉన్నట్లయితే దేవాలయానికి వెళ్లటం, భారతీయమైనటువంటి హరి కలివిని పెంచుకోవడం, కలివిని పంచుకోవడం అలాగే సమాజహితంగా జీవించడం, సమాజానికి ఆదర్శప్రాయంగా జీవించడం ఇది ఈ జాతి కొత్తగా నేర్చుకునే విషయాలు కావు. ఇవన్నీ మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అన్నీ మనకి ఆ సంపద ఇచ్చారు, మార్గం కూడా ఏర్పరిచారు. దానికి తోడు మనకు ఋషులున్నారు, జ్ఞానులున్నారు, తత్వవేత్తలున్నారు, అనేకమైన ప్రకరణాలకి వ్యాఖ్యానం, భాష్యం చెప్పిన వాళ్ళున్నారు. ఇవన్నీ కూడా ఒక వైదిక వాఙ్మయం అంటాం అంటే వేదము చుట్టూ తిరిగే వాఙ్మయం అంతా వైదిక వాఙ్మయం కాబట్టి ఆ వాఙ్మయం అంతా చేరవలసినంతగా చేరని కారణంగా ఇంకా ఈ జాతి అందుకోవలసి ఉన్న కారణంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున రూక్ సమాకృతి, యదుర్ మూర్తిగా అవతరించినటువంటి ఒక విశిష్ట అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి. అది ఆ అవతారం బ్రహ్మ స్వరూపం, ఆ అవతారం వేద స్వరూపం, ఆ అవతారం నాగ స్వరూపం, ఆ అవతారం సంఘ స్వరూపం. సంఘం శరణం yechani అంటాడు బుద్ధుడు. ధర్మం శరణం yechani అంటాడు. ఈ రెండింటికి సహకారంగా బుద్ధుడు తర్వాత ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే ఆ మాటలు అనకుండా ప్రపంచానికి అసలు ఉన్నదంతా ఒక్కటే రెండంటూ లేవు అని చెప్పినటువంటి బుద్ధుడి తర్వాత వచ్చిన శంకర భగవత్పాదులు వాఙ్మయ సరస్వతీ ప్రవాహం అయినట్లయితే ఆ సరస్వతీ ప్రవాహాన్ని ముడిసిపెట్టి సర్వ ప్రపంచానికి తనదైనటువంటి భాషలో ప్రధానంగా సుమధുరమైనటువంటి తెలుగు భాషలో అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా అంటే దివ్యోపన్యాసాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి వేద వాఙ్మయాన్ని చాలా సులువుగా అందించినటువంటి స్వరూపం ఏంది అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామిని చూసిన వాళ్ళు, స్వామిని దర్శించిన వాళ్ళు, స్వామితో Amekమైనటువంటి వారు, స్వామి Organizationలో సంస్థాగతంగా అనేక సేవా కార్యక్రమాల్లో దశాబ్దాలరకంగా-దశాబ్దాలుగా జీవితం సాగిస్తున్నటువంటి వారు ఇంకా వారి యందు ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. మేము చేస్తున్నదంతా సాధన కాదా? ఇప్పుడు మేము వ్యక్తిగత సాధన ఏం చేయాలి? ఇవాళ YouTube లాంటి వేదికల మీదకి వెళితే ధ్యానం మీద ఒకరు, ప్రార్థన మీద ఒకరు, గానం మీద ఒకరు, జ్ఞానం మీద మరొకరు ఇట్లా చీలికలు బీలికలుగా, పాయలు పాయలుగా ఆధ్యాత్మిక సాధనని అనేక రీతులలో ఆవిష్కరిస్తున్నటువంటి వేళ సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచం మీద ప్రసారించినటువంటి ఆ వెలుగు రేఖలో, ఆ కాంతిలో, ఆ మార్గంలో మనం కొన్ని విషయాలు పట్టుకోవాలి. నవసూత్ర ప్రణాళిక స్వామి devotees అందరికీ తెలుసు. నేను దాని ప్రస్తావన ఒక్క క్షణం కూడా అందా. ఎందుకంటే ఏది నువ్వు ఆచరించావో, నీ ఆచరణ ద్వారా ఒక అనుభూతిని పొందావు, ఈ అనుభూతి, ఆచరణ జరగటానికి ముందు నువ్వు ఏమి అధ్యయనం చేసావో, అధ్యయనం చేసిన దాన్ని ఎలా అర్థం చేసుకున్నావో, అర్థం చేసుకున్న దాన్ని స్వాధ్యాయంగా ఎలా మార్చుకున్నామో ఇవన్నీ గనక క్రమంగా అర్థం చేసుకోగలిగితే వ్యక్తిగత సాధన చాలా సులువు అయితది. ఎలా చేయాలి? ఇది సంవత్సరాల గురించో, నెలల గురించో నలభై రోజులు చేయండి అవి అలవాట్లు అవుతాయి, ఆరు నెలలు చేయండి అలవాట్లు అవుతాయి అంటే ఆరు నెలలు చేయటానికి ముందు మనం ప్రణాళిక ఒక రోజు ఎలా ఒక spiritualize ఎలా చేయాలి ఒక రోజుని. నిద్రలేచాం, పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయవలసినవి చేస్తున్నాం. సంసారాన్ని ఎలుతున్నాం.విద్యార్థులంతా చదువుతున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కార్యకలాపాలు సాగుతుంటే ఎక్కడా ఆధ్యాత్మిక అనేదానికి చోటే లేదు, సాధనకు చోటే లేదు. మీరు ఎవరినైనా ఇవాళ ఒక వంద మందిని గనక మీరు చేస్తున్న సాధన ఏమిటి అని అడిగితే, ఏమి లేదంటారు. తెలియదంటున్నారా, చేస్తున్నదంతా సాధనే అనే అనుభవం లేకంటున్నారా, ధ్యానం అంటే ప్రత్యేకంగా ఉన్నదా, సాధన అంటే ప్రత్యేకంగా ఉన్నదా అంటే అది ఇవాళ మనం మాట్లాడుకుంటే ఒక రోజును గనక చక్కగా దాన్ని ఒక unit గా తీసుకుని గనక schedule చేసుకోగలిగినట్లయితే ఆ వ్యక్తిగత సాధన ప్రారంభం అవుతుంది. పెద్ద వాన కురవాలి అంటే ఆకాశం నుంచి కొన్ని చినుకులు ముందు పడతాయి. ఒక నది పుట్టాలి అంటే ఒక చినుకుతో ప్రారంభం అవుతుంది. మనిషి తన లక్ష్య గమ్యాల వైపు వెళ్లాలి అంటే ముందు ఒక్క అడుగే వేస్తాడు, పది అడుగులు పరిగెత్త చేయడు. కాబట్టి ప్రారంభం ఎక్కడ కావాలి? ముందు ఒంట్లో ప్రారంభం కావాలి ఆ తర్వాత ఇంట్లో ప్రారంభం కావాలి. చూద్దాం. ఇవాళ నిద్దాం, రేపటి నుంచి ఒక, ఒక రోజుని మేము model చేసుకొని ఒక laboratory లో ప్రయోగంగా, ప్రయోగాత్మకంగా ఆలోచించి గనక చేసినట్లయితే ఇది spiritualize ఎలా చేయొచ్చు అనేది ఒక బాటసారుగా మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా మనం వేకువనే నిద్రలేవాలి అని చిన్నప్పటి నుంచి విన్నాం. వేకువనే అంటే ఎప్పుడు వేకువ? ఇది ప్రశ్న కదా! IT రంగంలో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామున పన్నెండు గంటలకు అది వేకువ, మనకు కాదు. మరి ఆధ్యాత్మిక సాధన ప్రత్యేకమైంది కాబట్టి ఏ సమయంలో నిద్రలేవాలి అంటే పెద్ద పదం బ్రహ్మే, బ్రహ్మ ముహూర్తం అంటారు. అదేమిటో ఎవరికీ తెలియదు. అవునా? ఒకడంటాడు అత్యంత తెలివిగల వాడు ఏమంటాడంటే, "నేను లేచిందే బ్రహ్మ ముహూర్తం అండి" అంటాడు. కాదంటారు. మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు దాటిన తర్వాత మనం గనక ఆ సమయంలో లేస్తే అది నిజమైనటువంటి బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ అంటే ఇక్కడ బొమ్మలు వేసే బ్రహ్మ కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మ కాదు. ఈ ప్రపంచం కనబడబోతున్న ప్రపంచానికి అప్పటి వరకు నిద్రావస్థలో కనబడని ఈ ప్రపంచమంతా బ్రహ్మమై ఉన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క ముహూర్తం అంటే నువ్వు నిద్రావస్థలో ఉండి అప్పటి దాకా నిద్రపోయి మళ్ళీ లేచి ప్రపంచంలోకొచ్చి పనులు చేయాలి గనక ఆ సంధికాలానికి మనం బ్రహ్మ ముహూర్తము అని పేరు పెట్టుకున్నట్లయితే ఆ మూడు గంటల ఇరవై ఎనిమిది ఏదో technical గా మూడున్నర గంటలకి. ఇవాళ మూడున్నర గంటలకి ఎంతమంది నిద్ర లేస్తున్నారు అని గనక ప్రశ్న వేస్తే, మీరెవరో చేతులెత్తకండి, నాకు ఎంతమంది లేస్తున్నారో తెలుసు. ఎంతమంది అంటే ఒక్కడు కూడా లేవటం లేదు, ఇదే జవాబు. ఎందుకని అంటే పూర్వకాలంలో తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఎవరూ నిద్రపోయే వారు కాదు. గనుక మూడున్నరకు లేవగలిగేవారు. ఇప్పుడు అరచేతిలో cell phone ఉంది కదా! TV పెద్దది పైన అరచేతిలో TV అరచేతిలో ఉన్న cell ప్రపంచం మొత్తాన్ని మన చుట్టూ తీసుకొచ్చి ఒకటిన్నర ఆ ప్రాంతంలో కళ్ళు, మనస్సు అలసిపోయి మనకున్న సమస్యలు కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల్ని పెదలలోకి ఎక్కించుకొని నిద్రపో అంటే నిద్రపోయేది ఏది మనమా, మన మనస్సా? కాదు కదా! కాబట్టి ఇవాళ సాధనా మార్గంలో కంచె తొలి పెట్టి ఏంటంటే రేపటి నుంచి, దాని తర్వాత నేను అనొద్దు, మళ్ళీ నేను వస్తున్నా August లో అప్పుడు మళ్ళీ release చేస్తాం. మూడు గంటల ముప్పై నిమిషాలకి కొద్దిగా alarm పెట్టుకొని మీరు లేవండి. లేచి లేవగానే ఏం చేయాలి? మనకి ఎలా ఉంటుందంటే లేవగానే ఏదో ఒకటి చేసేయాలి. అంటే నిన్న మిగిలిపోయిన పనులు, చేయాలనుకొని చేయలేని పనులు, రేపు చేయవలసిన పనులు, దానికి ప్రణాళికలు అవి ఏవీ చేయకండి. మూడున్నర గంటలకి మీరు నిద్ర లేచినప్పుడు సుమారుగా ఒక అరగంట సేపు three thirty to four మీతో మీరు ఉండండి. ఈ మీతో మీరు ఉండటానికి మళ్ళీ పద్మాసనం వేసుకోవాలా, జింక చర్మం మీద కూర్చోవాలా లేకపోతే విత్తారలు, అవన్నీ వదిలేయండి. మీ ఇంట్లో sofa ఉంటే హాయిగా, ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకని కూర్చోవాలంటున్నానంటే ఆ సమయంలో ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకోదు, మీ అవసరం దానికి లేదు. అలాగే మీకు అవసరం ఉన్నా ప్రపంచం ఇంకా మేల్కోలేదు. కా-కాబట్టి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా నిద్రలో ఉన్నారు. కాబట్టి మీకు ఎవరితోనూ సంబంధం లేని అద్భుతమైనటువంటి కాలమే బ్రహ్మ ముహూర్త కాలంగా భావించి ఒక అరగంట కూర్చోండి. కూర్చొని మళ్ళీ ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలి అనే question కదా! కూర్చొని ఏమీ చేయకండి. ఇది బాగుంది కదా! కూర్చొని మళ్ళీ ఏదో ఆ.. సంకీర్తన చేద్దాం, గాయత్రి చేద్దాం, గరగసరాస్తం ఏమీ చదవకండి, ఏమీ చేయకండి, మీతో మీరు ఉండండి. మీతో మీరు ఉండేది అసాధ్యం ఈ అవస్థలో. ఇప్పుడు నాతో నేనుండలేను, నేను మీతో ఉండాలి, నేను నా మనసుతో ఉండాలి, నా బుద్ధి, చిత్తము, నా భావన, నా శక్తి వాటితో కుడిబడి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడగలను. కానీ ఆ సమయంలో మూడున్నర గంటలకి లేచినప్పుడు మీతో మీరుండటం చాలా తేలిక. మిమ్మల్ని ఎవరూ disturb చేసేవాళ్ళు లేరు. మీతో మీరుండటం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా మీలో మీరుండటం కూడా మీకు అలవాటఆ మీలో మీరు ఉండటానికి ప్రయత్నం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా పెరుగుతాయి. ఆ ఆలోచనలన్నీ మిమ్మల్ని కొద్ది నిమిషాలు వికృత చేస్తాయి. గతమి, భవిష్యత్, రాబోయేవి, గత దాని వల్ల బాధ, రాబోయే దాని వల్ల భయం. ఈ రెండు వర్తమానాన్ని బాధిస్తాయి గనుక మీరు మీతో ఉండి మీలో ఉండే ఆ అరగంటని మీ జీవిత కాలంలో ఆ ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రముఖమైనటువంటి కాల ఖాళీగా భావించండి. ఆ అరగంట అయిన తర్వాత మీరున్న చోటు నుంచి బయటికి వచ్చినప్పుడు మీకు తెలియని శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీకు తెలియదు, అది అనంత శక్తి. ఇంద్రియాలన్నీ కూడా మేల్కొని నిద్రలో నుంచి మేల్కొని కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ మళ్ళీ నెమ్మదిగా తమ కార్యకలాపానికి చేరువయ్యేటువంటి సమయంలో పడుకున్నప్పుడు మీరు ఎంత హాయిగా నిద్ర పోయామని అనుకుంటారో ఆ హాయితనంలో నుంచి ఒక ఆనందంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మీ సోఫా నుంచి మీరు దిగుతారు. ఇది మొదటి భాగం అంటే మూడున్నర గంటలకి లేవాలి, నాలుగు గంటలకి మనము ఇంకో ఏమీ పేరు పెట్టక్కర్లేదు అది, పేరే వద్దు. మీతో మీరు ఉండండి. దాని పరిచయం అయిన ఒక ఐదారు రోజులు అయిపోయిన తర్వాత అలారం క్లోక్ పెట్టవలసిన పనిలేదు. శరీరానికి biological clock ఉంటుంది. మనతోనే ఉంటుందండి. అది మనల్ని మేల్కొలుపుతుంది. నిన్న లేచావు, ఇంత అందాన్ని అనుభవించావు చూడు. ప్రకృతితో సంబంధం లేదు, ఇంటితో సంబంధం లేదు, మాటలతో సంబంధం లేదు, ఏమీ లేదు. అసలు ఏమీ లేకుండా ఉండగలిగే స్థితి అది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. ఆ ఏమీ అక్కరలేని స్థితి, ఏమీ లేని స్థితి. ఆ రెండు ఎవరికి ఇవ్వాలంటే మంత్రతంత్రాలతో వచ్చేది కాదు, సాధనతో వచ్చేది. వ్యక్తిగత సాధనలో ఇది మొట్టమొదటి మెట్టుగా మీరు భావన చేయండి. నాలుగు గంటలకు లేచారు, కార్యకలాపాలు మామూలుగా జరిగే దేహపరంగా జరిగేటవన్నీ అయిపోతాయి. మీ పనులన్నీ మీరు చేసుకుంటూ ఉండండి. అయిపోయిన తర్వాత కొంత సమయం మీకు గనక టైం ఉన్నట్లయితే వైదికమైనటువంటి సంస్కృతి విలాసాన్ని మళ్ళీ మనం గనక తెచ్చుకోవాలి. పండగనాడే దేవుడికి దీపం పెట్టడం, పండగనాడే ఆయనకి నైవేద్యం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోకుండా ప్రతిరోజు భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అనంగానే ఇంతలో స్తోత్ర రత్నావళి పుస్తకాలు మన చేతిలో పెడతారు. అది చూడగానే దీంట్లో ఏదన్నా లేకపోతే ఆ పుస్తకాన్ని తలదిందుగా వాడుకుంటాం. ఒక స్తోత్రం చదువుతాం. మరి ఏమి చదవాలి? ఏది ప్రార్థన అంటే సత్యసాయి భగవానుడు మనకి ఒక గొప్ప ప్రార్థన ఇచ్చారు, అనుగ్రహించారు. ఏమని ప్రార్థించాలి? ఇదిగో నేను ఈవేళ వ్యాపారానికి వెళ్తున్నా, ఓటి రూపాయలు రావాలి. లేదు మా పిల్లవాడు competitive exam కు వెళ్తున్నాడు, వాడికి rank రావాలి ఇది కాదు. సమస్త లోకాః సుఖినోభవంతు. ఇది మొట్టమొదటి ప్రార్థన. ప్రపంచమంతా బాగుంటే ఆ ఆనందంలో మనకు భాగస్వామ్యం దొరుకుతుంది. ప్రపంచం ఏదన్నా కానీ నేను ఒక్కడినే, నా కష్టము, నా సుఖము, నా ఇల్లు, నా సంసారం అన్నప్పుడు ఏమవుతుందంటే అది అసహజమైనటువంటి ప్రకృతి వ్యక్తిని అనుగ్రహించదు. వ్యవస్థని అనుగ్రహిస్తుంది. అందరం, మనందరం ఒక సామూహికంగా ప్రార్థన చేయవలసింది. ఈ ఫలానా స్తోత్రం, ఈ గురు స్తోత్రం, ఈ గాయత్రి ఇవన్నీ పక్కన పెట్టండి. practical గా rational గా ఆలోచిస్తే ఇదిగో నేను మళ్ళీ నిద్ర లేచాను. అంతే కదా! కరోనాలో ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తెల్లవారేప్పటికి నేను ఖచ్చితంగా లేచి మళ్ళీ సూర్యుడిని చూస్తాను అనుకున్న వాడు ఎవరన్నా ఉన్నాడా అంటే ఒక్కడు లేడు. అయిపోయింది, కలిగింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే సమస్త లోకాః సుఖినోభవంతు అంటారో మీ మనస్సంతా కూడా విశాల భావనలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా బాగుండాలని అనుకోవటమే గొప్ప విన్యాసం, ఆత్మ విన్యాసం. ఈ ప్రపంచం నా మీదే భిన్నం కాదు. నేను ఈ ప్రపంచాన్ని కంటే భిన్నం కాదు. ప్రపంచంలో ఏమున్నదో నాలో అదే ఉన్నది. నాలో ఏమున్నది అదే బహిర్గతంగా ప్రపంచమే కనిపిస్తున్నది. దీనికి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఓ శ్లోకం చెప్తారు. అది మీరు చదువుకోక్కర్లా. అందుకే మాట్లాడుతున్నా కనుక చెప్తున్నా. విశ్వం తర్వణ దృశ్యమాణ నగరీ తుల్యం నిజాంతః జనవత్ కృతే ప్రబోధ సమయే సాత్మానమేవావతయం తస్మై శ్రీ గురుమూర్తయే నమై శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఇప్పుడు ఇక్కడ అనుకుందాం మీరు మీరేమనద్దు. సమస్త లోకాః సుఖినోభవంతు. తర్వాతే మనకు పనులున్నాయి. ఆ పనులేమున్నాయి? మీ అందరికీ కనీసం మీలో ఎక్కువ మందికి ఇంటి పని, వంట పని అవన్నీ ఉంటాయి. పురుషుడికి సంపాదించాలి, facilitate చేయాలి. తనకు ఇచ్చినటువంటి నిజుత్త ధర్మాలను తాను నెరవేర్చాలి. ఆ ఎప్పుడైతే ప్రపంచమంతా బాగుండాలి అని ప్రార్థన చేశామో మనలో స్వార్థం నశించిపోతుంది. నాకు ఈ లాభం కలగాలి అనేటువంటి ప్రార్థనకి గనక ధనరాశిని చదువుతూ మొదలు పెట్టినట్లయితే నా చుట్టూ, నా ఆశ చుట్టూ, నా దురాశ చుట్టూ, నా పేరాశ చుట్టూ నా ఆలోచనలు సాగి సాగి నన్ను ఎదగనివ్వవు కాబట్టి అది ఆధ్యాత్మికం సంబంధించింది కాదు. అది కేవలం ritual కి సంబంధించింది. కాబట్టి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నిర్మలమైనటువంటి మనసుతో మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన కర్తవ్యాలన్నింటినీ కూడా నిస్వార్థంగా చేస్తాం. అతిశయించిన అహంకారం లేకుండా చేస్తాం. నిజానికిఇంకో వేదంలో ఇంకో శ్లోకం ఉంది శ్లోకార్థం ఏంటంటే ఏనకేన ప్రకారేణేష కశ్శాపితేతినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వరపూజనం ఇది మాట అంటే ఏంటంటే సమస్త లోకాః సుఖినోభవంతు అన్నాం బాగానే ఉంది నేను ఎవరు? నేను అసలు ఎందుకు వచ్చాను? వచ్చి నేను చేయవలసింది ఏమిటి? ఉద్యోగమా అరవై ఏళ్ళు అయింది రిటైర్ అయిపోవాలి కదా, వ్యాపారమా డెబ్బై ఏళ్ళు అయింది చెప్పండి ఇప్పుడు తప్ప చెప్పాలి కదా. మరి ఇంకేదన్నా ఇంకేదన్నా అంటే మనం చేసినా చేయకపోయినా శరీరానికి వయస్సు ఏర్పడుతుంది. వయోధర్మం ప్రకారం చిన్నప్పుడు చేసినంత వేగంగా ఇప్పుడు చేయలేము. ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి అవి తెలిసినవే. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే మనం నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మంచి పనులు చేయడం మొదలు పెడతామో ఆ పనులన్నీ కూడా మన ప్రజ్ఞ ద్వారా జరుగుతాయి ఎందుకంటే మనకి skill ఉంది. అదే ఈ శ్లోకంలో చెప్తుంది. ఏమంటుందంటే నేను ఎందుకు వచ్చాను, ఎవరికోసం వచ్చాను, వచ్చి ఏం చేస్తున్నాను అని అనుకుంటూనే తన ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారికి గనక ఆనందం కలిగించగలిగినట్లైతే దాని పేరు ఈశ్వర పూజ తదేవ ఈశ్వర పూజనం. ఈ ఈశ్వర పూజనం అనేటువంటి దాన్ని సేవ చేయడం ఉంది కదా. కనుక సత్యసాయి భగవానుడు మనకిచ్చింది ఏమిటంటే సేవ చేయడం. ఇవాళ చేస్తున్న సేవ యొక్క స్వరూపం వేరు నేను దానిలోనికి వెళ్ళటం లేదు. అసలు సేవ అనేటువంటిది ఎ-ఎట్లా అది ఏమిటి అంటే సేవ అంటే భావన. ఇంగ్లీషులో మూడు మాటలున్నాయి sympathy, empathy, ఎమపతి అని మూడు మాటలున్నాయి. ఆ మూడింటిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఒక్క ప్రార్థన సమస్త లోకాః సుఖినోభవంతు ఆశీర్వచనం కాదు అది ప్రార్థన. మనల్ని మనం ఎచ్చరిక చేసుకోవడానికి మన మనస్సుని దిట్టం చేసుకోవడానికి మన ఆలోచనలు అటు ఇటు చెల్లాచెదురు అయిపోకుండా నిలబెట్టుకోవటానికి ఇది చాలా అత్యవసరమైంది కాబట్టి ఆ లేచినప్పటినుంచి మన కార్యకలాపాలకు వెళ్ళేటప్పుడు చిట్టచివరిదాకా అంటే ఇదిగో ఆ పడుకోపోయే సమయం వచ్చేదాకా ఒకే జీవితంలో ఒకే రోజులో ప్రతి వ్యక్తి అనేక అనుభవాలను పొందుతాడు. అది ఆనందం పరం కావచ్చు, దుఃఖ పరం కావచ్చు, సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదేనం కావచ్చు కానీ స్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడినప్పుడు ఆ ఏర్పడిన స్థితుల్లో మనం ఎలా ఉన్నాం అని నిర్ణయించేది మన ప్రార్థన. దానిలో నుంచి అప్పుడు ఏది రానివ్వండి, ఏది పోనివ్వండి దాన్ని ఎదుర్కోగలిగినటువంటి ఒక స్థితి మనకు ఏర్పడుతుంది కాబట్టి ఆ స్థితి ద్వారా మనం పది గంటల వరకు పడుకునేదాకా దాన్ని నిలబెట్టుకుని ఉండగలిగితే మీరు ఆ day లో ఆ రోజులో జరిగినవన్నీ బేరీజు వేసుకోండి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, ఎవరికీ ఏం చేశాం, ఎవరు మనకు ఏం చేశారు, ఇవన్నీ calculate చేసుకుంటే మనకు ఎవరో సహాయం చేశారు మనం కూడా ఎవరికో సహాయం చేశాం. ఈ సాయం అనే మాటే స్వామి దాన్ని సేవగా మార్చారు. అది సడన్ గా ఎవరికైనా blood కావాలనొచ్చు, సడన్ గా మందు కావాలనొచ్చు, సడన్ గా ఏదో కావాలనొచ్చు. దానికి మనం సర్వదా సిద్ధమై ఉండాలి. అందుకే స్వామి చెప్తారు హింకర్ అయినవాడు మాత్రమే శంకరుడు కాగలడు అని. హింకర్డు అంటే himkarం నేనేం చేయాలి, నేనేం చేయాలి అంతే తప్ప వీళ్లందరూ నాకేం చేస్తారు అన్నప్పుడు వాడు ఎదగలేడు. ఎప్పుడూ పరాన్న భూతవు అంటే ఇంకొకడి మీద ఆధారపడి a total dependence తో వాడు బతుకుతాడు. అది ప్రయోజన శూన్యమైన జీవితం. ఇట్లా గనుక మనం ఒక రోజుని spiritualize చేయగలిగితే మరి ఈ మధ్యలో అంతా వ్యాపారమే చేస్తున్నామా? అంతా ఉద్యోగమే చేస్తున్నామా? మనం పది గంటలు ఉద్యోగం చేయాలి. మధ్యలో friends తో మాట్లాడటానికి ఒక గంట పోయింది, తర్వాత YouTube లో కొంత పోయింది, WhatsApp లో కొంత పోయింది. ఉద్యోగం మానేశారు నిత్య జీవితంలో మనకోసం వ్యక్తిగతమైన సాధన కోసం ఏం చేయాలి? అంటే ముందు మొట్టమొదటిది ఇంటికి ఇది సభ ఇది ఇంటికి చదవాలి scriptures చదవాలి scriptures అనగానే అమ్మో మరి ఎవరో పండితులు వాళ్ళు మాట్లాడే భాష మాకు తెలియదు అనకూడదు. ఇవాళ ఈ పూటకి ఒక మాట భగవద్గీత ఉంది. భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలున్నాయి. అంటే మీరు మొదటిది పోతుంది మూడోది చదివితే మొదటి రెండు పోతాయి. కాబట్టి ఒక శ్లోకాన్ని ఒక రోజున మననం చేయండి చదవండి. చదువుతూ చదువుతూ అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు ఒక యోగీశ్వర స్థాయికి చెందిన ఒక వ్యక్తి ఒక అరి దిక్కు వైనము తెలియని వాడికి బోధించిన భగవద్గీత ఆడుకునే పాట కాదు.మానవ జీవితాన్ని మానవ దేహాన్ని మానవుడి-- మనోవైజ్ఞానిక యోగశాస్త్రమే భగవద్గీత. ఆ కోణంలో చదవండి. చదివితే, భగవద్గీత చదవండి, మీకు రోగాలు బాగుతాయి. అవేమీ నమ్మకంటే రోగాలు ఎక్కడికి పోతాయి, దానికి మందు వేసుకోవాలి మనం. ఆకలి వేసింది అన్నమే తినాలి. ఆకలి వేసినప్పుడు శ్లోకం చదవండి. చదవలేనివాడు చదవగలిగిన వాడితో చదివి వినిపించుకోండి. దాని అర్థం తెలుసుకోండి. అట్లా స్వాధ్యాయము ఒక పార్ట్ కావాలి ఇరవై నాలుగు గంటల్లో. మరి అన్నీ బానే చెప్తున్నారు మాకు వినోదానికి. అనేక దశాబ్దాలుగా తిష్ట వేస్తున్నటువంటి టీవీ కదా! టీవీ ఒకప్పుడు వచ్చినప్పుడు మన ఇంట్లో సినిమా చూసాం. మరి ఒక భ్రమ రాక్షసుడు అయిందంటే, ఇవాళ నా వరకు మా ఇంట్లో అది గోడ మీద బొమ్మ. దాని మీద ఎప్పుడూ బొమ్మలు పలకం. ఎందుకనంటే criminal waste of time is watching TV. YouTube లో వార్తలు తెలుసుకోండి, ప్రపంచంలో general knowledge సంపాదించుకోండి, కొంచెం కూడా ప్రమాణాలు తెలుసుకోండి. ఏది అవసరమో, ఏది సమాజ బలమైనటువంటి inputs ఇస్తున్నదో వాటికోసమే నిజంగా YouTube ని positive గా వాడుకోగలిగితే అది కూడా ప్రపంచంలో ఉన్న కొత్త దారుడు చూపిస్తుంది. ఇట్లా ఒక పుస్తకం. అందుకనే నేను ఎప్పుడూ కాలేజీలకు వెళ్ళినప్పుడు చెప్తుంటాను, మా life లో మా యవ్వన దశలో, నిజానికి ఇగో పది, పదిహేనేళ్ల క్రితం వరకు మా దగ్గర book ద్వారా మేం knowledge సంపాదించాం. ఇవాళ bookish knowledge ఎప్పుడో దారిసారిపోయింది. ఇవాళంతా lookish knowledge వచ్చింది. చూడటం, వాడెవడో చెప్పటం, ఆ news అంతా వినటం, అదే నిజం అనుకోవటం, అలా వెళ్ళటం. అనే కాదు. మూలమైనటువంటి భగవద్గీత శ్లోకం, భగవద్గీత ఉదాహరణగా చెప్తున్నా, చాలా ఉన్నాయి. ముందు ఎక్కడో ప్రారంభమైతే అది నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. కాబట్టి మనకి స్వాధ్యాయం ఉంది, ప్రార్ధన ఉంది, అభ్యంతరమున్నది, సమాజం బాగుండాలన్న కోరిక ఉంది, నిస్వార్థ ప్రవృత్తి ఏర్పడింది, ప్రపంచానికి సేవ చేయాలన్న ఒక మంచి ఆధ్యాత్మిక భావన కలిగింది. ఇవన్నీ కలిగి రాత్రి పది గంటలకి మనం పడుకోపోయేటప్పుడు, ఇక్కడ మూడున్నరకి లేవండి అని ఎలా గట్టిగా చెప్తున్నానో, మీరు ten o' clock కి మీకున్న cell మీ hall లో పడేయండి. అది లేకుండా నా వరకు నేను అరవై ఏళ్ళు వెళ్ళిపోయా. అది లేకుండా చాలా హాయిగా. ఇప్పుడు అది పెద్ద అడ్డంకి అయిపోతున్నది. నిజానికి ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు cell రూమ్ లో పడేసి వచ్చా. నాకు దానికి సంబంధం లేదు. పర్సనల్ ఇది. అలాగే మీరు కూడా రాత్రి పది గంటలకి ఏం message వస్తుందో, ఏం విషయ తార వస్తుందో, రాదు మిస్ అయింది వాడికి, మనకి కాదుగా. చేసిన వాడికి మిస్ అయింది. కాబట్టి వాడికి అవసరం ఉంటే మళ్ళీ వాడు తెల్లవారి చేస్తాడు. మనం దానికోసమే ఆందోళన పడవలసిన పని లేదు. వెంటనే instant గా చేయవలసిన పని లేదు. మనసును ఉద్విగ్నతకి, ఒక అక్కరలేని వేగానికి గురిచేయకుండా cell phone నుంచి మనసును దూరంగా పెట్టండి. పది గంటలకి ఆ hall లో dining table మీద పడేసి మీ దారి మీరు పడుకోండి. మోగితే మోగుతుంది లేదా silent mode లో పెట్టుకోండి. చక్కగా నిద్రపోండి. Ten to three అంటే కేవలం ఐదున్నర గంటలు. అంతే కదా! పిల్లలకి, చిన్న వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కనీసం ఆరేడు గంటలు నిద్ర పడుతుంది. మధ్య వయస్సు వాళ్ళకి ఐదున్నర గంటలు కచ్చితంగా పడుతుంది. మరి పెద్దవాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళు పాపం లేస్తుంటారు, పడుకుంటూ ఉంటారు. రేపు ఏమవుతుందో అని భయం, ఆందోళనలు ఉంటాయి. వాళ్ళ గురించి నేను చెప్పటం కాదు. ఇవాళ ఈ దేశానికి అరవై ఎనిమిది నుంచి డెభై పర్సెంట్ ఉన్నటువంటి యువకులు, యువతులు గనక జీవితమంతా, రాత్రులంతా గనక YouTube లో గనక గడిపినట్లయితే మూడు నష్టాలున్నాయి. ఒకటి, దేనినీ విశ్లేషించగలిగిన శక్తిని వాళ్ళు కోల్పోతారు. దేనినీ గుర్తుపెట్టుకోగలిగిన శక్తిని కోల్పోతారు. ఏది అక్కరలేదో మనసులో మాత్రమే నిలుపుకునేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. కనుక ఏ జీవితాన్ని మనం గడపకూడదో, ఏ జీవితాన్ని నడపకూడదో, ఏ జీవితాన్ని జీవించాలో, ఇవన్నీ కూడా మర్చిపోతాం. కాబట్టి జీవితాన్ని గడపద్దు, నడపద్దు, జీవించాలంటే ten o' clock switch off the light. మూడున్నరకి లేవండి. ఇది ఒక రోజుని spiritualize చేయడానికి. ఈ మధ్యలోనే పుస్తకం చదవమన్నాం, శ్లోకం చదవమన్నాం, మంచి ఆలోచనలు చేయమన్నాం. ఒక్కొక్కసారి మహాత్ముల సందర్శనం చేస్తాం. ఎవరో మంచివాడు వస్తారు ఊర్లోకి, వాళ్ళని చూస్తాం. సంసారం అన్న తర్వాత బంధువులు వస్తారు, అతిథులు వస్తారు. వాళ్ళకి చేయవలసిన మర్యాద, గౌరవం వాళ్ళకిద్దాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఎలా ఉండాలంటే ఎప్పుడు భయం ఉందో, ఎప్పుడు నేను ప్రశాంతంగా నిద్ర పోగలనో, మళ్ళీ ఆ పడుకోపోయేటప్పుడు మనం ప్రార్ధన ఉంది. అది ఈ ప్రార్ధన కంటే చిన్నదైన ఇంకో ప్రార్ధన కాదు. అయ్యా! నేను పడుకోబోతున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను. నా కాలు ఎక్కడుందో, చెయ్యి ఎక్కడుందో నాకే తెలియదు. నా శరీరం నా అధీనంలో లేదు. నేను సుమారుగా వృద్ధాప్యంగానే ఉంటాను. వచ్చే కలలో ఏదో లోపల వస్తాయి కానీ బయట పని ఏమీ లేదు. కానీ నేను తెల్లవారి లేచి ఈ ప్రపంచానికి ఉపయోగపడే జీవితాన్ని గడపాలి గనుక, నేను అలా గడపాలి అంటే ప్రపంచం ఉండాలి. ప్రపంచం ఎలా ఉండాలి అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సమస్త లోకా: సుఖినోభవన్తు. అంటే మొదటి ప్రార్ధన అదే. రాత్రి పడుకోబోయేటప్పుడు ప్రార్ధన అదే. నిద్ర లేవండి అరచేతిలో మంత్రం చదువుకోండి, అరకాలులో మంత్రం చదు-- అవన్నీ అయిపోయాయి. అవి వేరు. అవన్నీ ఎప్పుడంటే ఆధ్యాత్మిక లోకంలో ప్రయాణం చేశాక. ఇవాళ అసలు ప్రయాణమే చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.కాబట్టి ఇష్టదేవతా ప్రార్ధన అని ఒకటి, ఇలదేవతా ప్రార్ధన అని ఒకటి, గురు ప్రార్ధన అని ఒకటి అనేకంగా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే మూడున్నరకు మనం లేవటం మనం మర్చిపోతాం simple సమస్త లోకాః సుఖినోభవన్తు ఇది ఆధ్యాత్మిక వ్యక్తిగత సాధన ఇది ఒక పార్ట్ ఇంకా రెండవది స్వామి ఇవాళ కాదు సుమారుగా ఒక డెబ్బై ఆ అరవై డెబ్బై సంవత్సరాల క్రితం రెండు మాటలు చెప్పారు ఆధ్యాత్మిక సాధన లో ఇవి చాలా అందరికీ ప్రధానమే అందులో మొట్టమొదటిది ఏంటంటే గాసిప్ అనేటువంటి దానిలో అంటే పుకార్లు అక్కర్లేని న్యూస్ అక్కర్లేని విషయాల పట్ల ఒక్క క్షణం కూడా దాని కోసం మీరు నిచ్చించకండి అన్నారు. ఎందుకనంటే పుకార్లను నమ్ముతూ గనక మీరు జీవించినట్లయితే మనస్సు తన స్థిరత్వాన్ని కోల్పోతుంది, నిగ్రహం ఉండదు అన్నీ నశించిపోతాయి. ఇక రెండవది ఏ వ్యక్తిని కూడా అతని వెనుక విమర్శించకండి. ఎవరిని మీకు నచ్చలేదు ప్రశాంతంగా ఉండండి, దూరంగా ఉండండి. నచ్చిన వ్యక్తితో ఆధ్యాత్మిక భావాలు పంచుకుంటూ ఉండండి, జీవిత భావాలు చెప్పుకుంటూ ఉండండి, మీరు విన్న మంచి మాట మాట్లాడుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైనటువంటివి. మూడవది ఏమిటంటే మనకి ప్రతి వాళ్ళము సంపాదిస్తున్నాం దాన్ని X అనుకుందాం ఆ సంపాదనలో ఒక వంద రూపాయలు సంపాదించాం. వంద రూపాయలు మనకు కావు కుటుంబానికి చాలా భాగం ఉంటాయి అందులో కేవలం two percent అంటే వంద రూపాయల్లో రెండు రూపాయలు సమాజహితం కోసం ఖర్చు పెట్టండి. తొంభై ఎనిమిది మీ దగ్గరే ఉంచుకోండి. మీరు తొంభై ఎనిమిది challenge చేసి స్వామి చెప్పిన ప్రకారం మేం చేశాం ఇలా అయిపోయాం అనకండి స్వామి ఆమాట ఎన్నడూ చెప్పలేరు. Two percent of your savings సమాజహితం కోసం మీరు ఖర్చు పెట్టండి. అది medical కావచ్చు, education కావచ్చు లేదు ఏదన్నా ఎవరికన్నా అవసరానికి కావచ్చు, ఆ ఎవరికన్నా ఆరోగ్యం కోసం వచ్చి దేనికైనా two rupees మనం కాదనుకుందాం. పదివేల రూపాయలు వచ్చినాయి two percent మందికి కాదు, పది లక్షలు వచ్చాయి two percent మందికి కాదు, నైన్టీ ఎయిట్ percent మందికి అయినప్పుడు మనకేం ఢోకా లేదుగా. ఆ two percent ఎవరికి అంటే కలిగిన ప్రతి వాడు నలిగిన వాడిని కాచుకోవాలి. నలిగిన వాడు మన పక్కనే ఉంటాడు, మన ఎదురుగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఎవరో వచ్చి చెప్తారు, "నా కూతురికి కష్టం వచ్చిందండి, ఆ పిల్లా పెళ్లి అయిపోతున్నదండి, ఏదో ఆ తండ్రికి పదివేల రూపాయలు తక్కువ పడింది" అన్నప్పుడు పదివేలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే నలుగురిని కలుపుకొని పదివేలు తీసుకెళ్లి ఇవ్వండి. స్వామి అన్నది వ్యక్తిగత చాగాలు ఈ ప్రపంచాన్ని నడిపించవు సామూహికమైన చాగమే సర్వోత్తమమైనది. అందరం కలుస్తాం పదివేలు కావాలంటే తలా పది రూపాయలు ఇక్కడ వేస్తే పదివేలు ఐదు నిమిషాల్లో వస్తాయి. మీరు పదివేలు ఇవ్వండి, మీరు పదివేలు ఇవ్వండి అంటే పదివేలు ఎక్కడినుండి రావు అక్కర్లేదు. కాబట్టి ఒక కష్టాన్ని గట్టెక్కించే ఒక ప్రయత్నం ఆధ్యాత్మిక సాధనలో చాలా చాలా ముఖ్యం. ఆ అవతల వాడు ఎవరో మనకు తెలియదు మనకి అతనితో ఎటువంటి రక్తసంబంధం లేదు, రాగుబంధం లేదు, అనురాగ బంధం లేదు. ఉన్నది ఏమిటంటే ప్రేమ బంధం మాత్రమే. మనలాగానే ఒక మానవ జన్మ ఎత్తుకొచ్చినటువంటి వాడు కష్టంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మనం చేయగలిగి గనక చేయకపోతే దానికించిన అరాచకం, రాక్షసత్వం మనకు లేదు. మనలో నాలుగు components ఉన్నాయి. ప్రధానంగా దానవత్వం ఎక్కువ ఉంటాది. దాని పక్కనే దీనత్వం రెండవదాన్ని, మూడవ భాగం మానవత్వం ఆ విడతది దివ్యత్వం. మనలో దివ్యత్వం ఉన్నది అని మనకు తెలియదు. మీలో ఉన్నది అని స్వామి డబ్ల్యు.డి. అంటే ఏమిటి చెప్పారు? దివ్యత్వం వైపు మనం వెళ్లనే లేదు. దివ్యత్వం అంటే ఆత్మ, పరమాత్మ అదేదో వేదాంతం అంటే అంటారు. దివ్యత్వం అంటే మీ inner lights మన ఆలోచన, మన భావన, మన సంకల్పాలు, మనం ఆలోచించేటువంటి తీర్మానాలు, ప్రపంచం పట్ల మనకున్న అవుదార్యం, ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైన అంశాలు. ఇవేవీ లేకుండా మీరు మూడు వందల ప్రదక్షిణలు చేసినా లేదంటే వేల దేవాలయాలకు వెళ్లి రోజు కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చినా ఏం మిగులుతుంది అంటే ఏమీ మిగలదు. ఏం ఇప్పుడు మిగులుతుంది అంటే ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ ఈ రెండూ సమష్టిగా సంఘటితంగా గనక మనం చేయగలిగినట్లయితే ఆధ్యాత్మిక సాధన మరమ-- మరియొక మారుతుంది. అందుకనే సంస్కరింపనేల సంఘమంతటినీ సజ్జనులగు స్వార్థులని ఒక్క నీచుడప్పుడు ఉరిలో తగులు. సమాజం మొత్తాన్ని మనం మార్చలేం redefine చేయలేం refine చేయలేం ఏమీ చేయలేం. ఏది? సమాజం మొత్తాన్ని. కానీ సమాజం మొత్తం మారాలి అంటే అది వ్యక్తిగతమైనటువంటి స్థాయి నుంచి ప్రారంభం కావాలి గనక ఒక వ్యక్తి గనక మారితే వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ గనక మారితే సమష్టి మారుతుంది, సమష్టి గనక మారితే సృష్టి మారుతుంది. సృష్టి అద్భుతమైనటువంటి రూపాంతరీకరణ చెంది గనక అయినట్లయితే మార్పు చెందినట్లయితే అది పరమేశ్వర స్వరూపంగా మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ సమాజం అంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. మనము విశ్వరూప దర్శనం సినిమాల్లో చూశాం కదా! ఆ నాటకాల్లో కూడా చూశాం, కావ్యాల్లో చదివాం, పౌరాణిక వంపయంలో అనేక మంది పౌరాణికులు, హరికథకులు వాళ్ళు చెప్తే విన్నాం. ఈ విశాలస్వరూపం ఏంటి అంటే అది seventy MM మీద కనిపించేది కాదు gross గా ఉండేది కాదు subtlest of the subtle అణువు కంటే పరమాణువు కంటే కూడా సూక్ష్మ సూక్ష్మేతరిగా ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉన్నది ఆ spark ఎక్కడ ఉన్నది అంటే మనలో ఉన్నది. దాన్నే స్వామి ఈ వేదాంత పరిభాషని కాస్త పక్కన పెట్టి మీలోనే ఆత్మ శ్రీమయంగా చరాచరమయంగా వాంగ్మయంగా జ్యోతిర్మయంగా ఉన్నది అని చెప్పారు. అంటే స్వామి మా అంటే శ్రీచరము శ్రీ శ్రీమయము అంటే శ్రీ అంటే బుద్ధి శ్రీ అంటే సంపద శ్రీ అంటే ఆహారం శ్రీ అంటే స్థానం కూడా చూసారా కాబట్టి అనేక అర్థాలు ఒక్కొక్క అక్షరానికి ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీమయంగా ఉన్నది మనలోనే ఉన్నది ఆహారం మనలోనే ఉన్నది అమృతం మనలోనే ఉన్నది ఆహారాన్ని వదులుచుకోవాలి. ఆహారం అంటే వేల English లో negativity అమృతము అంటే positivity ఎప్పుడైతే positivity మనలో పెరుగుతూ ఉంటుందో negativity మన నుంచి దూరమైపోతుంది అంతే కదా. light వెయ్యగానే torch light వెయ్యగానే చీకటి వెళ్ళిపోయింది అంటాం చీకటి ఎక్కడికి వెళ్ళలా వెలుగు వచ్చింది చీకటి కనపడటం లేదు. చీకటి పోయింది కాదు వెలుగు వచ్చింది కాదు వెలుగు మనం సృష్టించుకున్నాం. అట్లాగే చరాచరమయంగా ఉన్నది చరంగా అచరంగా నడుస్తున్నట్లుగా నడవనట్లుగా ఉన్నట్లుగా లేనట్లుగా కనిపించినట్లుగా కనిపించనట్లుగా చరాచరమై అని ఒక అర్థం రెండోది విస్తృతంగా సర్వైస్ సర్వత్రా వ్యాపించి ఉన్నది ఇది అఖండమై చింతనమై అనంతమై అవ్యయమై అద్వితమై అప్రమేయమై అపరిమితమై ఉన్నటువంటి ఒక స్థితి ఏంటంటే దాని పేరే ఆత్మ. దాని పేరే వెలుగు ఆ వెలుగు మనలో ఉన్నది. ఇక శ్రీమయమైంది చరాచరమయమైంది వాంగ్మయంగా ఉన్నది. ఆ వాంగ్మయం అంటే మాట ఇప్పుడు ఈ మాటలన్నీ వినపడుతున్నాయి అనబడుతున్నాయి ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయి. వాక్కుకి అగ్ని స్వరూపం అని పేరు లోపల అనేక భావాలు పుట్టి అనేక ఆలోచనలు పుట్టి అవన్నీ రగిలి రగిలి పుగిలి పుగిలి అనేకమైనటువంటి పరిణామాలను తోచుకొని అది నెమ్మదిగా అధోస్థానం నుంచి అనాహత చక్రం ఎక్కడిదాకా వచ్చి ఇది కూడా దాటి కంఠస్థానం వరకు వచ్చేప్పటికి ఇవన్నీ కూడా ఒక మాటగా నిలకడ చెందుతాయి. ఆ మాట మాట్లాడాలి అంటే ఒక భాష కావాలి అది తెలుగు ఆ English ఆ అరబ్బా ఏది కానివ్వండి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిలోనూ మాట పుట్టడం అనేది లోపల నుంచి భావనల నుంచి ఆలోచనల నుంచి పుడుతుంది గనుక దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అది విశుద్ధ చక్రం అంటారు. అంటే దీన్ని మించి ఇంకో శుద్ధ చక్రం లేదు. ఇవాళ మాట్లాడుకుంటున్నాం ఇది మర్యాద పురుషోత్తముడు ఉండే place ఇది స్వయంగా స్వామి ఇక్కడ గురువు అయినటువంటి place అంతే కాదు మనందరం వచ్చిన purpose వేరు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణ ప్రదేశము ఆవరణ దోషము లేని ఈ ప్రదేశంలో ఎలాగైతే అంటే మందిరంలో ఇప్పుడు ఎలా నిశ్శబ్దంగా highly disciplined గా highly focused గా concentration తో ఉన్నామో ఈ మందిరం దాటి మనం మైదానంలోకి వెళ్తాం. ఆ మైదానంలో కూడా ఇలాగే ఉన్నట్లయితే వ్యక్తి సాధ-వ్యక్తిగత సాధనలో మనం వందల percent సాధించం. ఈ గంటా బాగుండి ఇరవై మూడు గంటలు గనక ఇంకో రకంగా ఉన్నట్లయితే వ్యక్తిగత సాధనే పదానికి అర్థమే లేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇక్కడే ప్రారంభమైంది. ఇక కడగా ఇదంతా ఈ దివ్యత్వం ఎక్కడ ఉన్నది అంటే జ్యోతిర్మయంగా ఉన్నది ఒక వెలుగుగా ఉన్నది మనకి స్వామి చెప్పిన జ్యోతి ధ్యానం అనే ఒక ప్రక్రియ ఇది. అంటే ఏం లేదు మనల్ని మనం తెలుసుకోవడానికి మొట్టమొదట చెప్పిన మనలో మనం ఉండటానికి మనతో మనం ఉండటానికి ఎదురుగా కనిపి-కనిపిస్తున్న వస్తువు దాని శక్తిని మన లోపలికి తీసుకుని ఈ బయట ఏది కనిపిస్తున్నదో అది నాయందే ఉన్నది అది నేనై ఉన్నాను అనుకోగలిగితే అది అపూర్వమైనటువంటి వ్యక్తిగత సాధన. ఇక్కడ వ్యక్తిగత సాధనలో జాగాలు పరిచయాగాలు చందాలు దందాలు దానాలు ఇవి ఏవీ కావు వీటికి స్థానమే లేదు. నేను ఒక వ్యక్తిగా నాలో ఉన్న దివ్యత్వాన్ని గనక గ్రహించాలని నేను ప్రయత్నం చేయటం మొదలు పెడితే దాని పేరు మాత్రమే అధ్యాత్మ సాధన. ఈ అధ్యాత్మ సాధన వ్యక్తిగత సాధన నుంచి ప్రారంభమై నేను ముందై నేను ముందు దారి చూపించి నేను కట్టుకున్న ఇళ్లను కూడా ఆ దారిలో నడిపిస్తూ నేను కన్న బిడ్డలను కూడా అదే దారిలో నడిపిస్తూ మేం నలుగురమో ఐదుగురమో పది మందిమో నా అన్నలు తమ్ముళ్లు స్నేహితులు అందరం కలిసి సామూహికంగా గనక సమష్టిగా ఒక వహెసిగా సంఘటితంగా శక్తివంతంగా మనం గనక వ్యక్తిగత సాధనే సమష్టి సాధనగా గనక చేయగలిగినట్లయితే అది ఒక అధ్యాత్మ సాధనై అది నెమ్మదిగా సంఘ వికాసానికి దారితీస్తుంది. సంఘము అనేది మనందరం కలిస్తే సంఘం మనందరం కూడి ఉంటే దాని పేరు సంఘం అంతే ఇది ఘం అది ఘం సంఘం ఇప్పుడు మనందరం కూడి ఉన్నాం. మనందరం ఎవరి వైపు ఎవరి ఇంటి వైపు మనం వెళ్ళిపోతున్నప్పుడు దేనితో కూడి ఉంటున్నాం సంఘంతో కూడి ఉన్నాం అక్కడ సంఘం లేదు. మన చుట్టూ సంఘం ఏర్పడింది దాని మర్యాదలు వేరు దాని పరిమితులు వేరు దాని అవసరాలు వేరు దాని అవకాశాలు వేరు అక్కడ మనం చేయవలసినటువంటి తీర్పు తప్పులు వేరు కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని.ఆ మూడున్నర గంటలకు లేచి మనం ఎప్పుడైతే వ్యక్తిగత సాధనని ఆ లేవటంతో మొదలు పెడతామో, దీనిని మీరు నేను time ఏం పెట్టను కొంతమంది అయితే నాలుగు రోజుల్లోనే దీన్ని అందుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరికి వారు ఈ ప్రయత్నం గనుక చేసినట్లయితే సమాజం విశ్లేషించాలి. వ్యక్తి లేకుండా సమాజం లేదు, సమాజం లేకుండా వ్యక్తి కూడా లేడు. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు manifest అయిన వాడు వాడి పేరు వ్యక్తి. ఆ అవతల వ్యక్తి అంటాం ఆ అవతల వ్యక్తికి మనం అవతల వ్యక్తి. అవతలా ఇవతలా అంటూ లేదు ఉన్నంత ఇక భూమండలం మీదే ఉన్నది గనుక వీటన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని సమాజాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. సమాజ అవసరాలను గమనించాలి. సమాజం అనేక రీతులలో అది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఒక దారి విత్తు ఎందుకు లేదంటే ఒక నాటి సమాజం ఋజుమార్గంలో ఉండి ఆ ఋజుమార్గానికి రెండు మాటలు ఉండేవి సత్యం పదా ధర్మం చ. సత్యం పదా అంటే సత్యమే పలుకు అని కానీ మా వాళ్ళు ఏం చెప్పారంటే అబద్ధం చెప్పకపోతే అది సత్యమే అని చెప్పారు. చాలా ప్రాథమికమైనది. సత్యం పదా అంటే సత్యము అంటే సతతము ఉండేది అట్టి వేళలా ఉండేది. ఇప్పుడు మనం ఉన్నాం నేనే ఉన్నాను. ఈ దేహం నేను ధరించి వచ్చాను. ఈ దేహాన్ని నేను భరిస్తున్నాను. దీనిని భవించాను, ధరించాను, దీన్ని నిలబెట్టుకుంటున్నాను. దీనికి ఒకానొక సమయం ఏర్పడినప్పుడు దీనిని ఒక కాచు పౌర్ణమి నాడు పగలలో తన పై పొర ఎట్లాగైతే ఏర్పడి కుబుజం విడిచేసి మళ్ళీ కొత్త చర్మాన్ని తనంతట తాను తెచ్చుకుంటున్నదో అట్లాగే పుట్టిన ప్రతి వ్యక్తి ఈ దేహాన్ని వదిలి పెట్టవలసిందే. అంతే కదా! no exception. మరి ఈ వదిలిపెట్టేటువంటి దీనిని మన నుంచి దూరమయ్యేటువంటి దాన్ని సత్యంగా భావిస్తాం. చూశారా! సత్యం ఏంటంటే దేహం పోవచ్చు గాక మన లోపల ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఈ container లో నుంచి, ఈ పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి వెళ్తుంది. అది గనుక మనం గ్రహించగలిగితే ఇది అధ్యాత్మ సాధన. వ్యక్తిగానే ఇలా అయినప్పుడు మరి ప్రపంచమంతా ఏమిటంటే మనం ఎలా మార్పు చెందాం. చెప్పండి బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం ఇన్ని దశలు ఎప్పుడైనా బాల్యం మనకు వీడ్కోలు చెప్పిందా? చెప్పలే. కౌమార యవ్వన దశలు మేం నుంచి వెళ్ళిపోతున్నాం టాటా అన్నయ్యా అనలే. మనకి చెప్పకుండానే మన నుంచి వెళ్ళిపోయి వృద్ధాప్యం లోపల అడుగు పెట్టింది. ఈ వృద్ధాప్యం ద్వారా, ఈ ద్వారం ద్వారా మనిషి తన జీవ యాత్రను ముగిస్తాడు. ఇది వేదాంతం. ఈ వేదాంత భూమికలో మనం ఏమి చేయాలి అంటే నేను ఆత్మనై ఉన్నాను. నేను పోవచ్చు గాక, ఈ శరీరం పోవచ్చు గాక, నేను చేసిన పనులన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. నేను చెప్పిన మాటలన్నీ నా రాముడు "రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు ఎప్పటి రాముడు, ఎప్పటి త్రేతాయుగం ఇంకా ఆయనకి సీతారామ కళ్యాణం చేస్తున్నాం. ఇంకా రామరావణం చేస్తున్నాం. గోకులాష్టమి చేస్తున్నాం. ఈ-ఈ పేరు మీద వారి స్మృతి వారు ఈ ప్రపంచానికి వదిలిపెట్టినటువంటి ఆ మార్గాలను ఇంకా పట్టుకొని మనం నడుస్తూ వెళ్తాం. మరి ఒక రాముడు, ఒక కృష్ణుడు మరొకరు మరొకరు శరీరాదులు వదిలిపెట్టిన ఈ చైతన్యం మిగిలిపోయింది కదా. స్వామి దేహం వదిలిపెట్టి పదకొండు ఏళ్ళు అయిపోయింది. పన్నెండవ ఏట ప్రవేశించాం. మరి ఆ చైతన్యం ఉండబట్టే గా నేను అంత దూరం నుంచి వచ్చిన, మీరందరూ అన్నీ వదిలిపెట్టి రాగలిగిన, ఎవరి కోసం వచ్చామంటే ఒక్క సత్య సాయి భగవానుడి కోసం వచ్చాం. [కప్ తట్టడం] ఆ అదేమీ కనపడదు. కనపడనక్కర్లేదు. మరి ఆ చైతన్యం ఎక్కడ ఉంటది? అప్పుడు ఆ శరీరం వలకే పరిమితమైన ఆ చైతన్యం ఇవాళ విశ్వవ్యాప్తమైపోయింది. నదులలో, కాలువలలో, కుంటలలో, బిందెలలో అన్నింటా, అంతటా ఒక చైతన్యం ఏర్పడింది గనుక ఆ చైతన్యానికి మనం పెట్టవలసిన పేరు ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి consciousness అంటాం. దానికి ఇవాళ స్వామి చైతన్యానికి నమస్కరిస్తున్నాం. అంతే కదా! స్వామి యొక్క దివ్య మహా స్మృతికి ప్రాజెక్ట్ వేపిస్తున్నాం. కనుక మనం కూడా ఒక స్వామి, ఒక రాముడు వదిలిపెట్టినట్లుగా మనం కూడా ఈ ప్రపంచ యాత్రలో కాలం అనేటువంటి ఒక ఇసుక ఎడారి మీద మనం నడుస్తూ ఉన్నాం. కాలంలో తప్పించుకో గలిగే శక్తి లేదు దానికి. అది ఎంత దయామయో అంత కఠినమైనది. అది ఎవరినీ అపేక్షించదు, ఎవరినీ ఉపేక్షించదు. ఒక కాలంలో ఒక మనిషిని ఉద్ధానం చేస్తుంది, అదే కాలం అదే మనిషిని పతనం చేస్తుంది. మనిషిని విశ్వవిఖ్యాతం చేస్తుంది, అదే కాలం అపఖ్యాతి కూడా తెచ్చేస్తుంది. కాబట్టి కాలం ఎవరికన్నా బంధువు అంటే ఎవరికీ బంధువు కానీ పరమాద్భుతమైన శక్తి ఏదైతే ఉన్నదో అది కాలమైనప్పుడు ఆ కాలం ఎడారిగా ఉన్నప్పుడు మనం మన పదముద్రలన్నీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే వెనక్కి తిరగం. మన దగ్గర గోడ గడియారం ఉంటుంది. గోడ గడియారంలో ఎనిమిది గంటల పది నిమిషాలు చూపిచ్చిందనుకుందాం. కాదండీ నాకు ఏడు యాభై అయితే బాగుండు అంటే నువ్వు దాన్ని ముల్లు వెనక్కి తిప్పగలవు గానీ కాలాన్ని వెనక్కి తిప్పలేవు. అంతే కదా! నదీ ప్రవాహాన్ని వెనక్కి తిప్పలేము. జీవితంలో పుట్టిన ఒక ఆలోచనను మళ్ళీ వెనక్కి మళ్ళించలేము. కానీ దేనినీ మళ్ళించలేని, వెనక్కి మళ్ళించలేని మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం. నేను బాలుడిని అయిపోవాలి, ఇదిగో ఈ పిల్లల వయసుకు రావాలంటే మానసికంగా కాగలమేమోగానీ దైహికంగా కాదు. శారీరకంగా నేను ముందుకు వెళ్ళాలి. అందుకే ఒకసారి ప్రశాంతి నిలయంలో ఓ పెద్దాయన వచ్చారు. ఆయనకి అప్పటికి తొంభై నాలుగు ఏళ్ళు. వస్తే స్వామి ఆయనకి కుర్చీ తెప్పించి వేశారు. ఇలాంటిదే ఒక కుర్చీ వేశారు వరండాలోస్వామి room నుంచి బయటకు వచ్చారు. వస్తుని ఆ రోజు ఎవరినీ పలకరించలేదు direct గా ఆయన దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన తొంబై రెండు ఏళ్ళు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి స్వామి కనిపిస్తున్నారు ఆనందంగా నమస్కారం చేశారు. స్వామి ఆ దయా హృదయం ఉంది కాబట్టి ఆ ఒక విభూతిని సృష్టించి పక్క వాళ్ళ దగ్గర ఒక paper అడిగి తీసుకొని కొంత ఒట్టు పెట్టి కొంత ఆయన ఒట్టులో వేసి కొంత ఆయన వింటిలకి రాసి అందరి ఎదురుగానే ఆ మిగిలిందంతా కూడా ఆ paper లో వేసి ఒక చిన్న table లో పెట్టారు. ఇదంతా చాలా బాగుంది కదా! అప్పుడు స్వామి ఆయన్ని ఏమడిగారంటే, ఏం చేస్తున్నావు? అని అడిగారు. ఏదో కాలక్షేపం చేస్తున్నాను స్వామి, ఇంకా చేయటానికి ఏముంది తొంబై నాలుగు ఇప్పుడు మనం డెబ్బైకి అంటున్నాం. ఎవరినన్నా డెబ్బై వాళ్ళని పలకరించండి, ఏముందండి అండి, ఏమైంది? ఏమైపోయిందంటే మీ పిల్లలు పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్ళు మనవోళ్ళు పుట్టారు. వాళ్ళ సంసారం ఏర్పడింది. ఇంకా అది నీదని అనుకుంటున్నాం అది యాతన నా రేఖ. సరే స్వామి మళ్ళీ మళ్ళీ మరొక ప్రశ్న వేశారు. కాలక్షేపం అంటే ఏం చేస్తున్నావు? ఏదో కాలం గడిచిపోతున్న స్వామి అన్నాను. నువ్వు కాలాన్ని గడుపుతున్నావా? కాలమే నిన్ను గడుపుతున్నదా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా అన్నారు. ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. కాలమే మనల్ని గడుపుతుంది. కాలమే మనల్ని ముందుకు నడుపుతుంది. కాలమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ సత్యం వద అంటే ఇలా అంటా, వద అంటే అను లేదా నేను అంటా. ఎలా అంటామంటే, మీరనుకునే ఈ వి.ఎస్.ఆర్ మూర్తి ఆ ఇవాళ ఇట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు బతికి ఇంకో యాభై ఏళ్ళు బతకొచ్చు అది ఎవరి చేతుల్లో లేదు. దాన్ని పక్కన పెడితే, నేను ఒక వి.ఎస్.ఆర్ మూర్తినో ఒక సుబ్బారావు గారినో ఇంకెవరినో ఎవరినో ఆత్మ స్వరూపుడిగా గనక నేను భావించినట్లయితే నేను కూడా నా మనసుకి బయటికి కాదు మనసుకి ఏం చెప్పాలి అంటే సత్యం వద నేను ఆత్మనే అని చెప్పాలి. దాని అర్థం అసలది. ఇవాళ అది కూడా పోయింది. నువ్వు ఎవరూ తెలుసుకోవాలి అని గనక ఎవరు నన్ను అడిగితే, ఆమెంది ఎందుకండీ ఈ రమణ మహర్షి ఎందుకు సత్యసాయిబాబా వారు ఎందుకు? ఈ వేదాంత గ్రంథాలు ఎందుకు? just give me your ఆధార్ కార్డు I will tell every think about you అంటున్నారు. ఆ ఆధార్ కార్డు గనక పెట్టేస్తే మన జీవిత విశేషాలు వస్తాయి గనక కానీ మనం ఎవమో అది చెప్పలేదు. సత్యాన్ని ఆవిష్కరించ లేదు. ఇవన్నీ మనం సృష్టించుకున్న అనుకూల విశేషాలు తప్ప మరి మిగతావి. రెండవది ధర్మం చల, చల అంటే నడవటం. ధర్మ మార్గంలోనే నేను నడుస్తాను. ఏది ధర్మ మార్గం? వ్యక్తిగతంగా నాకు ఒక ధర్మం ఉంటుంది. నేను ఎలా behave చేయాలి? నా character ని నేను ఎలా నిలబెట్టుకోవాలి? నా సంస్కారాన్ని, నా తల్లిదండ్రులు, నా జాతి, నా దేశము, నా గురువులు, నా ఋషులు, నా మహర్షులు, వారు అందించినటువంటి ఒక సంస్కృతి ఏదేదై ఉన్నదో దానికి వారసుడిగా నేను పుట్టాను. నేను దానికంటే భిన్నమైన ప్రదేశంలో పుట్టలా. వాటి మధ్యనే పుట్టాను. కాబట్టి వాటన్నింటినీ పరిరక్షించేటువంటి మార్గం ఏమిటి అంటే ధర్మ మార్గాలంబిగా ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించి నేను జీవిస్తాను. అలాగే అది వ్యక్తి ధర్మం. ఇక రెండవది కుటుంబ ధర్మం ఉంది. మనందరికీ కుటుంబాలున్నాయి, సంసారాలున్నాయి. భార్య, పిల్లలు, తల్లులు, తండ్రులు, బాత్తలు, మనవోళ్ళు అందరున్నారు అందరికీ. వాళ్ళ పట్ల మనకి ఒక ధర్మం ఉన్నది. ఏంటి ఆ ధర్మం అంటే గడిచిపోతున్న కాలం నుంచి రాబోతున్న భ, భవిష్యత్తులోకి వర్తమానం ఒక bridge అయినట్లయితే మన నుంచి వచ్చినటువంటి మన బిడ్డలందరూ నెమ్మదిగా ఎదుగుతూ ఎదుగుతూ వాళ్ళ జీవితాలు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాలని గనక మనం సాక్షిగా చూడగలిగినట్లయితే without interfering and without intervening మనం అడియాసగా నిలబడితే దాని పేరు ధర్మం. ధర్మ మార్గంలో. ఇది అయిన తర్వాత ఒక భర్తకి తన భార్య పట్ల ఒక క్రమం ఉంది. ఏమిటంటే తాను ఉన్నంత కాలము తన భార్యని ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. మూడోది చాలా ప్రధానం. అందరూ అభిమానిస్తారు ప్రేమిస్తారు కానీ గౌరవించాలి. ఒక వ్యక్తి తన భార్యని గనక తన ఇంట్లో తాను గౌరవించకపోయినట్లయితే అధ్యాత్మ లేదు, సాధన లేదు, వికాసము లేదు, జన్మ ఫలా. అలాగే ఒక స్త్రీమూర్తి తన భర్తని కాచుకోవాలి. తన భర్త క్షేమాన్ని కోరుకోవాలి. ఎందుకనంటే he is a facilitator అది మూల శక్తి. మూల శక్తికి నీళ్ళు పోస్తూ స్త్రీ ఉండాలి. ఆ శక్తి వలన సంసార వృక్షం పెరుగుతున్నప్పుడు ఆ భర్త ప్రతి ఆకుని, ప్రతి కోపని, ప్రతి రెమ్మని సంపూర్ణతగా అందరింగా కాపాడుకోవాలి. ఇది కుటుంబ ధర్మం. అలాగే ఈ కుటుంబానికి రెండు responsibilities ఉన్నాయి. ఒకటి బంధువులున్నారు. ఆ బంధువులకి నిజానికి ఒక నిజమైనటువంటి ఒక కష్టం ఏర్పడినట్లయితే ఆ కష్టాన్ని పంచుకోగలిగిన ఔదార్యం ఉండాలి. అలాగే వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళ ఆనందంలో కూడా అసూయ చేయకుండా భాగస్వామ్యం పంచుకోవాలి. అది ఒక ధర్మం. వ్యక్తి ధర్మం ఏంటి? కుటుంబ ధర్మం ఏంటి? ఇక సంఘ మర్యాదలు, సంఘ ధర్మాలున్నాయి. సంఘ నీతిని దాటి మనం వెళ్ళటానికి వీల్లేదు. ప్రతి సంఘానికి, ప్రతి సమాజానికి కొన్ని సీమారేఖలుంటాయి. లేదా లక్ష్మణ రేఖలుంటాయి. వాటిని దాటి ప్రవర్తించటానికి వీలు లేదు. ఒక పురుషుడు పురుషుడి మధ్య కూడా మర్యాదపూర్వకమైన దాన్ని వాళ్ళు English వాళ్ళు ఏమన్నారంటే respectable distance అన్నారు. మనం ఒక చేతి దూరం మోచేతి దూరం ఉండాలి అన్నారు. ఈ మోచేతి దూరం ఎలా ఉండాలో కరోనా మనకు బాగా నేర్పింది కదా.మోసం కాదు ఇక్కడ వీడు ఉంటే అక్కడ భార్య ఉంది భార్య అక్కడ ఉంటే వీడు అక్కడ ఉన్నాడు అది కాదు ఆ దూరం కాదు మానసికంగా మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇవాళ మీరు అనేక organisations చూశారు పక్కన పెడితే సత్యసాయి organisation లో ఒక డెబ్బై రెండు సంవత్సరాలు క్రితం స్వామి భార్యాభర్త కలిసి అయినా ప్రశాంతి నిలయం కి వెళ్ళినప్పడికి కూడా స్త్రీ స్త్రీలలోనే ఉండాలి పురుషుడు పురుషుడుగానే ఉండాలి ఎందుకంటే ఆధ్యాత్మిక వ్యక్తిగత సాధనలో అక్కడ భార్యాభర్తలు కలిసి చేయటం లేదు యజ్ఞం కలిసి చేయాలి కానీ సాధన వైయక్తికం అంటారు అంటే individual మీ సాధన మీరు చేయాలి పురుషుడు సాధన పురుషుడు చేయాలి దీనిని సూచించటం కోసమే ఎవరి మార్గంలో ఎవరి దారిలో వాళ్ళు ఉండాలని స్వామి నిర్దుష్టంగా దాన్ని ఆ ఆచరించి చూపించారు. మీరు విడివిడిగా ఉండండి ఇది అయి సాధన అయిపోయిన తర్వాత మీరు మీరు భార్యే మీరు భర్తయే మిమ్మల్ని ఎవరూ విడదీసే వాళ్ళు లేరు మీ పనిలో మీరు ఉండండి. కాబట్టి సమాజ ధర్మంలో మనం అన్ని పాటించాలి సమాజ అవసరాలను గుర్తించాలి ఆ తర్వాత రాజధర్మం ఒకటి ఉంది. రాజధర్మం ఏంటంటే ఈ భారతదేశానికి అంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ఇక్కడ మనకి అద్భుతమైన రాజ్యాంగం ఒకటి ఏర్పడింది రాజ్యాంగానికి లోబడే President of India కూడా ప్రవర్తించాలి దాని వెనకాడానికి వీల్లేదు. మరి రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఏమవుతుంది అంటే వెంటనే ఏం కాదు తర్వాత అయ్యేది మనకి గుర్తుకు వస్తుంది మన వల్ల కాదు కాబట్టి నన్ను ఎవరు ఏమి చేయటం లేదు నేను ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను రాజ్యాంగం నాకు సంబంధం లేదు అంటే ఆ రాజ్యాంగమే నీకు చదువు చెప్పించింది ఆ రాజ్యాంగం రాజ్యాంగంలోనే నువ్వు ఉద్యోగం చేశావ్ ఆ రాజ్యాంగంలోనే నువ్వు అన్ని కూడా నేర్చుకున్నావ్ ఆ రాజ్యాంగమే నిన్ను రక్షించింది కాబట్టి ఇవాళ ఈ భారతదేశానికి శిక్షా స్మృతిలో శిక్షా స్మృతికి కూడా మూలమైనటువంటిది ఏందీ అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి మనం నమస్కరించాలి ఎందుకంటే అది ఆ బోతులు, వెనుబోతులు, ఏనుగులు, మదపు ఏనుగుల పట్ల అది అంకుశంగా ఉన్నది కాబట్టి రాజ్యాంగానికి నమస్కరించాలి. మనలో వేళ దురదృష్టవశాత్తు students ని ఎవరైనా students ఏంది? ఒక అరవై ఏళ్ళు దాటిన ఆయన్ని కూడా భారత రాజ్యాంగం ఎప్పుడన్నా చదివారా అంటే నాకేంటికంటే ఇది లైన్ లో చదువుతారంటారు. ఆ భగవద్గీత ఎలా చదివేమో భారత రాజ్యాంగాన్ని అలాగే చదవాలి. స్వామి చూడండి tax evasion ఎప్పుడూ చేయకండి మీరు tax లు కట్టండి tax planning చేసుకోండి ఇదే రాజ్యాంగం ఇవేటి చేయటానికి దారి చూపించలా తప్పు అది నేరం అని చెప్పింది కానీ tax planning చేసుకోవడానికి పదును చేసుకోవడానికి అదే రాజ్యాంగం నీకు ఒక positive అవకాశం ఇచ్చింది. ఏ మార్గం? ధర్మ మార్గంలో వెళ్ళినవాడు tax కడతాడు tax planning చేస్తాడు అధర్మ మార్గంలో వెళ్ళిన వాడు tax evade చేస్తాడు సంపదని గుప్తధనంగా మారుస్తాడు కాబట్టి వీటన్ని మనమే ఎవరి గురించో కాదు మనమే we have to pay the taxes. దానికి చేసేయాలి అన్నీ facilitate చేసినాయి కాబట్టి ఈ ధర్మం చెడగా దాని ఆ మార్గంలో నేను నడుస్తాను అన్నప్పుడు అధర్మంలోకి వెళ్ళిన వాడిని మాత్రమే శిక్షిస్తారు అంతే కదా! ధర్మ మార్గంలో ఉన్నవాడికి police ను పంపి స్వామిని అడిగారు స్వామి ఇంత చెడ్డ వాళ్ళంతారు ఉన్నారు కదా వీళ్ళందర్నీ ఎట్లా మీ దగ్గర ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఆలోచనలు చెడ్డవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందర్నీ ఎందుకు మీరు దగ్గర పెట్టుకున్నారు అంటే అసలు నేను వచ్చిందే వాళ్ళ అవసరం అన్నారు. మీకోసం మీకు నేను మంచివాడిని కాబట్టి మీకు దేవుడు ఉన్నాడన్న నమ్మకం స్వామి దేవుడన్న నమ్మకం మంచి భర్తలుగా భార్యలుగా ఉన్నారు చక్కని సంసారం నడుపుతున్నారు ఇంకా మీకు దేవుడు ఎందుకయ్యా మీది దేని వాని కోసం నేను వచ్చాను దానిలో ఇంకా మితిమీరిన వాళ్ళందర్నీ నా దగ్గర పెట్టుకున్నాను అన్నారు బాగుందా. మంచి వాడికి దేవుడు అక్కర్లా రావణాసురుడి కోసమే రాముడై వచ్చాడు కంసుడికై కృష్ణుడు వచ్చాడు అక్రూరుడి కోసం కృష్ణుడు అక్కర్లా విదురుడి కోసం కృష్ణుడు అక్కర్లా కాబట్టి మనము సత్యం పద ధర్మం చర అనేది మన ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తిగత సాధనలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి నేర్పాలి. మొన్న ఈ మధ్యనే కంచి స్వామి వారితో నేను ఒక గంట మాట్లాడినప్పుడు ఆయన అన్నారు text books మళ్ళీ రాయాలి అని గొప్ప పెద్దబాలశిక్ష రాయాలి అని చెప్పారు ఆయన అన్నారు. పెద్దబాలశిక్ష సంస్కృతం మీద సంగీతం మీద నాట్యం మీద అదంతా మీకు ఆ YouTube లో దొరుకుతుంది అక్కడ విశేషం ఏంటంటే నేను ఏమన్నానంటే స్వామి మా దగ్గర మా చిన్నప్పుడు పెద్దబాలశిక్ష అని ఒక పేరుతో పెద్ద పుస్తకం ఉండేది అది ఏమిటో తెలుసా? పెద్ద బాల శిక్ష చాలా పెద్దది ఎందుకంటే మా వాళ్ళికి బాలలకి శిక్షణ ఇప్పుడు కావలసింది ఏంటంటే పెద్ద బాలశిక్ష కాదు పెద్ద బాల శిక్ష కావాలి పెద్దవాళ్ళకి కూడా తెలియాలి. ఇవాళ బ్రహ్మవా విమ్హవా అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా అని నేను ప్రశ్నించాను. లేదు చైత్ర వైశాఖం లేదు మరి ఎన్ని మాసాలు ఉన్నాయి January February March December వరకు దంచేస్తారు అంటే భారతీయమైనటువంటి మూలాలు మనం పోగొట్టుకున్నాం. అంటే మళ్ళీ మీరు clock ని వెనక్కి తిప్పుతున్నారంటే ఒకసారి వెనక్కి తిరగించటువంటి జీవితాన్ని కూడా వెనక్కి తిరిగి చూడాలి కదా. ఏదన్నా ఆలోచన కలిగినప్పుడు వెనక్కే తిరిగి చూస్తాం ముందుకు చూసి ఆలోచన చేయం కదా కాబట్టి వెనక్కి తిరిగి ఎప్పటికప్పుడు review చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ వ్యక్తిగత సాధనలో ఉన్న అనేకమైనటువంటి పరిశ్రమ. ఇట్లా ఒక వ్యక్తి ఒక సంపూర్ణమైనటువంటి నిర్మాణం జరిగినప్పుడు దాని ద్వారా సమాజం వికసిస్తుంది తప్ప సమాజ వికాసానికి ప్రత్యేక మార్గాలు లేవు.వ్యక్తితో ప్రారంభమై సమష్టిగా ఏర్పడి సమాజ వికాసమానం చెందినప్పుడు ఒక సభ్య సాంస్కృతిక నాగరిక ఆరుష భారతీయమైనటువంటి ఒక వేద పరిపూతమైనటువంటి సమాజ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేశంలో అశాంతికి తావు లేదు, అభద్రతకు తావు లేదు, అనాచారానికి తావు లేదు, అస్పష్టతకు తావు లేదు, అవిద్యకు తావు లేదు, అహంకారానికి తావు లేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే వ్యక్తిగా మన నుంచి ప్రారంభం కావాలి ప్రపంచానికి అది విస్తృతమై శాఖోపశాఖలై ఈ ప్రపంచం మొత్తానికి ఆరంభమై ఊడలై నీడలై సాచి తన అనంత బాహువులతో ఈ ప్రపంచానికి ఒక ధర్మార్థోపదేశం చేయగలిగినటువంటి ఒక్కా ఒక్క శక్తి ఎక్కడ ఉన్నది అంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది. [చప్పట్లు] దీనికి కారణం ఏమిటి అంటే భగవంతుడు ఎప్పుడైనా ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని, సృష్టిని సంస్కరించాలి అని ఒక అవకాశం ఏర్పడినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు మానవ దేహం తీసుకొని వచ్చినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఇంకెక్కడా దేవుళ్ళు రాలే, అనేక మంది వచ్చారు. దేవుళ్ళంటూ పుట్టిన దేశం ఏదన్నా ఉంటే, అవతారమూర్తులంటూ వచ్చారా ఎక్కడ అంటే అది కేవలం భారతదేశం. అది ఆసేతు సీతాచలం కూడా యోగ భూమిగా, తపో భూమిగా, కర్మ భూమిగా, ధ్యాన భూమిగా, కాణ్య భూమిగా అనేక రకాలుగా భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా, ఎవరు ఎంతెంత కొల్లబట్టుకొని వెళ్ళిపోయినా, ఆధునిక వెజనీళ్ళు ఇంకా దోచు-- పోసుకొని వెళ్తున్నా ఈ దేశానికి మాత్రం ఢోకా లేదు. ఎట్లా ఉంటదండి అన్ని ఇంట్లవన్నీ పట్టుకుపోతే ఇల్లు ఖాళీ అవ్వదా అంటే ధర్మో రక్షతి రక్షితః. ఈ దేశాన్ని ఏది రక్షిస్తున్నది అంటే ఒక వంద మందిలో నలుగురు ధర్మ మార్గంలో ఉంటే ఈ దేశం రక్షింపబడుతుంది. వందలో తొంబై మంది గనక అయితే ఈ దేశం రక్షింపబడుతుంది. వందకి వంద ధర్మ మార్గంలో ఉంటే ఈ దేశం గురు స్థానంలో నిలబడి ప్రపంచాన్ని శాసిస్తుంది. [చప్పట్లు] ఇవాళ సత్య సాయి భగవాన్ జీ యొక్క అవతార లీలా వైభవంలో ఆయన చెప్పిన సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనేటువంటి మార్గం గాని help your partner never గాని అవేవి ఇంగ్లీష్ భాషలో చెప్పారు కానీ అవన్నీ వాటి మూలాలు అన్నీ వేద, శాస్త్ర, ఉపనిషద్ ప్రమాణమైనటువంటి మాటలే. అట్లా చెప్తే అర్థం కాదు గనక మనకి ఇంగ్లీషులో చెప్పారు. వేద వ్యాసులు వారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని help your partner never అన్నారు, love all serve all అన్నారు. అట్లాగే ఈ ప్రపంచాన్నంతా చదవ అన్నారు. అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథ రాజమగును ప్రత్యక్ష లోకమీ ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఎవర్రా? నీ గురువు ఎవరంటే? అక్షతలు పెట్టిన వాడా? రుద్రాక్ష మెడలో వేసుకున్న వాడా? ఆయుధం ఇచ్చేవాడా? కాదు. నీ అంతరంగం నీకిచ్చిన గురువు లేడు. కాలమే మీకు గురువు. పరమ గురువు ఎవరంటే కాలం. కాలం నీకేం నేర్పుతుందో, కాలం ఎన్నెన్ని విశేషాలు ఆవిష్కరిస్తుందో, జీవితాన్ని శతపత్ర సుత్తరంగా ఆవిష్కరిస్తుందో, ఎన్ని రకాల మనుషులను పరిచయం చేస్తుందో, ఎన్నెన్ని సందర్భాలు సృష్టిస్తుందో, ఎన్నెన్ని సన్నివేశాలను రచిస్తుందో, ఎక్కడ కాలం పడద వేసి ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి కాలమే నీకు పరమ గురువు. మరి నువ్వు ఏం పుస్తకం చదవాలి? ఇందాక చెప్పా భగవద్గీతలో రోజుకో అది practice కోసం. అసలు పుస్తకం ఏమిటి అంటే స్వామి అద్భుతమైనటువంటి పెంచె ఇది. గ్రంథ రాజమగును ప్రత్యక్ష లోకమే. నీ కంటి ముందు ఉన్నటువంటి ఈ సమాజాన్ని మించిన గ్రంథం మరొకటి లేదు. సమాజం భిన్నంగా, వ్యవస్థలు భిన్నంగా, వ్యక్తులు భిన్నంగా, జరుగుతున్న పరిణామాలు గనక ఇంకే భిన్నంగా చూసినంత కాలం మనం ఎదగలేము, ఎరగలేము, మనల్ని మనం ఎలదొక్కుకోలేము. అవన్నీ నా నుంచి ఏర్పడినయి, ఎవరి నుంచో ఏర్పడిన దానిలో నేను కూడా ఉన్నాను. దీనిని నేను నెమ్మదిగా నా శక్తి కొద్దీ సంస్కరించాలి అని గనక మీరు అనుకున్నట్లయితే ఇందాక చెప్పిన వ్యక్తి సాధన, వ్యక్తిత్వ సాధన, వ్యక్తిత్వ పరిణామం ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ఈ మార్గాలన్నీ కూడా ఉపదేశం చేయడానికి వచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయి. కాబట్టి వీటన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్వామి ఏర్పరిచినటువంటి ఆ నగర సంకీర్తన, భజన సాంప్రదాయం, కాస్త వేద పఠణం, వేద శ్రవణం అందరూ పట్టించలేరు. వేదం వినొచ్చు, రుద్రం వినొచ్చు, నమక చమకాలు వినొచ్చు, భగవద్గీత శ్లోకాలు వినొచ్చు. ఇవాళ technology మన చేతిలో ఉంది. ఏదైనా ఇట్లా బట్ట తొక్కగానే ఏది కావాలంటే అది వినండి. మనస్సుని ప్రతిరోజూ మన ఇంటిని ఎలా శుభ్రం చేస్తున్నామో, ప్రతి గదిని మనం అనేక chemicals పెట్టి clean చేసి మన ఇల్లు బాగా ఉండాలి అని అనుకుంటున్నామో, చీమలు దోమలు రాకూడదని కోరుకుంటున్నామో, మన మనస్సులోకి కూడా పాములు, తేళ్లు రాకుండా చూసుకోవాలి. మన మనస్సు గనక నిర్వీర్యమైతే, నిస్సత్తువతో ఉంటే, అలసత్వంతో ఉంటే, శక్తిహీనంగా ఉన్నట్లయితే మనకి మనము సహాయం చేసుకోలేం. మనం ఈ దేశానికి సేవ చేయలేం. దేశం అంటే ఈ సమాజం. మన చుట్టూ ఉన్నవారికి కూడా చేయలేం. కాబట్టి దానికి స్వామి ఇచ్చిన జవాబు ఏమిటంటే ఎవడు స్నేహితుండు అని. నీకు ఎవడు స్నేహితుడు అంటే ఒకడంటాడు ఇట్లా నేను ఒకసారి పిలుపిస్తే యాభై వేల మంది వస్తారు. వాళ్లందరూ నీ స్నేహితులా? పరిచయిస్తు లేమో.నీకు వాళ్ళు తెలుసు వాళ్ళకి నువ్వు తెలుసు అంతే. సరే కాస్త ఆలోచిస్తే ఓ వెయ్యి మందికి నువ్వు బాగా తెలుసు ఓ పది మందికి దగ్గరగా తెలుసు ఒకరిద్దరికి నువ్వు బయట ఏమిటో తెలుసు నీ లోపల ఎవరికి తెలుసు అంటే నీ లోపల ఎవరికి తెలుసు అంటే ఆ తెలిసిన వాడికి నువ్వే తప్ప రెండో వాడు ఉండడు. ఇంకొకడి మనసు మనకు తెలియదు మన మనసే మనకు అప్పుడప్పుడు తెలియదు కాబట్టి ఈ శరీరం మనం వదిలిపెట్టే దాకా ఎవరయ్యా మనకి స్నేహితులు అంటే ఒకాయన అన్నాడు పంచ ప్రాణాలు మనకి మన శరీరం తోడు అన్నాడు సహచర ప్రాణాః శంకర భగవత్పాదు మనం ప్రాణం వదిలిపెట్టే దాకా మనతో ఉన్న నిజమైన స్నేహితులు ఎవరంటే మనలో ఉన్న పంచ ప్రాణాలు. మనం అది వదిలిపెట్టినప్పుడు ఆ ఐదు ఒక్కసారి ఎగిరిపోతాయి కాబట్టి ఈ ప్రాపంచికమైన స్నేహాలన్నీ అవసరాలకి అవకాశాలకి అనేక సందర్భాలకి లోబడి ఏర్పడతాయి. ఆ మిత్రత్వంలో దాతుత్వము ఒక నమ్మకము విశేషమైనటువంటి సంస్కారం అన్నీ ఉన్నట్లయితే స్నేహాలు నిలబడతాయి. కానీ వీటితో ఏ ప్రమేయం లేకుండా నీతో నిలకడ చెంది ఉన్నటువంటి పరమేశ్వరుడు మాత్రమే నీకు స్నేహితుడు. రప్పించిన వాడు ఆయనే, నడిపించిన వాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, తెప్పించిన వాడు ఆయనే, వదిలించి పెట్టేవాడు కూడా ఆయనే గనుక ఎవడు స్నేహితుడు దగ్గర ఆగి ఈశ్వరుడే అనుకోగలిగితే అది నిజమైనటువంటి వ్యక్తిగత సాధన. ఆ వ్యక్తిగత సాధన లోనుంచి సమాజం విస్తృతం కావాలి. ఇవాళ ముక్కు నగరంలో ఈ మందిర నిర్మాణం వెనుక అనేక మంది యొక్క కృషి అనేక మంది చేసిన తపస్సు అది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. మీకు మీ కబుర్కి అంటే ఈ తరానికి బహుశా కొంత వాళ్ళు ఉంటే ఉన్నారు వాళ్ళకి బహుశా చెప్తాను. ఇక్కడే కూర్చొని స్వామి సత్సంగం పగలు ఎప్పుడో పదకొండు గంటల వేళ చేస్తున్నప్పుడు ఆ ఎదురుగా గులాబీ చెట్లు చాలా ఉన్నాయి. ఆ గులాబీ చెట్లు చాలా వికాసమాన స్థితి ఉండేవి. మనకి ప్రపంచంలో ఒకే ఒక్క పువ్వు సూర్యుడి గమనాన్ని బట్టి తిరుగుతుంది. అదే కదా! దాని పేరు పొద్దు తిరుగుడు పువ్వు. అంటే పొద్దును బట్టి తన తిరుగుడు తనం ఉదయంతో ప్రారంభిస్తుంది నెమ్మదిగా తిరిగి తిరిగి సూర్యాస్తమయం అయ్యేప్పటికి వాడిపోతుంది. అది కూడా పడమటి దిక్కు చూస్తుంది. దాంట్లో ఎప్పుడూ mechanism లేదు. కానీ ముక్కు నగర మందిరంలో ఉన్న పరమాద్భుతం ఏంటంటే సత్సంగం ప్రారంభించి సత్సంగం అయ్యేదాకా గులాబీ చెట్లన్నీ ఇటు తిరిగినయి పోలుతాం. అది ఎవరికీ చెప్పాల్సింది [దగ్గరfrom people] ఇది సత్యం. అది ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. రాజు గారు వీళ్ళందరికీ తెలుసు నాయుడు గారు వీళ్ళందరికీ. కాబట్టి మన భావాన్ని బట్టి ప్రకృతి మనతో సహకరిస్తుంది. ప్రకృతి మన మీద కరాళ కృత్యం చేయదు. ప్రకృతితో సహజీవనం చేయాలి. దానితో పాటు నడవాలి. ప్రకృతి మీద మనం ఆధిపత్యం పయనించాలి అన్నప్పుడు భూమిని తవ్వినప్పుడు భూకంపం వస్తుంది. నదులను ఎండబెట్టినప్పుడు మళ్ళించినప్పుడు భూమి అంతా ఎడారిగా మారిపోతుంది. కనులను తవ్వుతున్నప్పుడు మన ecology అంతా దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా నిరోధించి ప్రకృతితో సహజీవనం చేయడం కూడా అధ్యాత్మ సాధనలో చాలా గొప్ప వ్యక్తిగత సాధన. మనం చెరపకూడదు. మనం ఏ రకమైన దుష్కార్యానికి కలాపానికి పాల్పడకూడదు. మనం చేయగలిగినంత positive గా మనం చేయగలిగినంత రీతిలో మన జీవితాన్ని కేవలం spirituality అనే పేరు మీద కేవలము భక్తి మార్గం కాదు కర్మ మార్గంలో కూడా జ్ఞానాన్ని మొన్న ఏదో ఒక interview లో చెప్పాను కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు యోగాలు ఉంటే ఒక నిమిషి నెమ్మదిగా భక్తుడై ఆ తర్వాత జ్ఞాని అయి ఏం చేయాలి? ఏం చేయకూడదా? నేను జ్ఞాని అయిపోయినానండి నన్ను interview కి పిలవొద్దు నేను ఇంక వైజాగ్ కి రాను నేను మా ఇంట్లో బయలు చేతులు కట్టేసి కూర్చుంటానంటే నువ్వు ఎవరికి ఉపయోగం? నేను ఆ జ్ఞానాన్ని బట్టి భక్తిగా మార్చుకోవాలి నేనే. ఆ భక్తిని నేను మళ్ళీ కర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి. తెలియనప్పుడు కర్మని కర్మగా చేశాను జ్ఞానం సిద్ధి పొందిన తర్వాత అదే కర్మని జ్ఞానంతో చేశా. అదే భక్తిని విశేషమైనటువంటి ఒక rational approach తో సార్వజనీనమైనటువంటి భావనతో, విశ్వభావనతో, సమర్పణ భావనతో, శరణాగతితో, వినయంతో మనం గనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక భూమిక దాని సమాజ వికాసం దారలో పుడిపడిది. ఇవాళ అనేక సంస్థలకి నేను speaker గా వెళతా. సత్యసాయి సంస్థకి seeker గా వస్తా అంతే తేడా. అక్కడ మాట్లాడుతాము, ఇక్కడ తెలుసుకుంటాము. అవన్నీ ఇది కర్మ క్షేత్రం ఇక్కడ పని చేయాలి. విశేషమైన బుద్ధితో చేయాలి, భక్తితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. ఈ కార్యకలాపాలన్నీ స్వామి ఇక్కడ వింటున్నారు అన్న భావనతో మన నుంచి మాట బయటికి రావాలి. స్వామి ఇవన్నీ వింటూ ఆనందిస్తున్నారు అన్న ఆనందంతో మనందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలి. దీనిని మించి ఈ మరొకటి లేదు. అనేకమైన సంస్థలకి నేను వెళ్ళినప్పుడు వాటిని చాలా తీవ్రకంగా చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు కలిగే ఒక భావన నేను సత్యసాయి organization ని ఎక్కడో ఒక highest pedestal లో పెట్టడానికి fervor, emotion ని నేను ఆ-ఆహ్వానించకుండా rational గా ఒక యథార్థంగా absolutely ఒక reality మీకు చెప్తున్నాను. అదేమిటంటే వ్యక్తిగత సాధనకి అనువైనటువంటి ఒక సం-సంస్థ ఏదన్నా ఉన్నదా? ఒక సంస్థ ఏదైనా ఉన్నదా? అని నన్ను ప్రశ్నిస్తే దాని పేరు సత్యసాయి సేవాభగవత్ తత్వాన్ని తెలిపేటువంటి మార్గం సూచించే సంస్థలు ఉన్నదా? అంటే మళ్ళీ సత్యసాయి సేవా Organization. కాదండి, మాకండి మా దగ్గర సంపద ఉంది ఆలోచనలు ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ నేను ప్రారంభించాలో సేవ నాకు తెలియట్లేదంటే దానికి మార్గం సూచించేటువంటి ఒకే ఒక్క ప్రపంచ విఖ్యాతమైన సంస్థ సత్యసాయి సేవా Organization. [అందరూ ఒకేసారి చప్పట్లు] దీన్ని మనం ఎంత అదృష్టమో ఎన్ని జన్మల తపస్సు చేసి ఒక పరిపూర్ణ మహా అవతారికి సమకాలినులమై ఒక జన్మ ఎత్తి వారు వేసినటువంటి మార్గంలో అడుగులు వెడివెడిగా వేస్తూ వెళ్తూ జీవితాలను శుభ్రపరుచుకుంటూ ఒక నది ఎక్కడో పుడుతుంది, ఎక్కడో ఎత్తులో పుడుతుంది నెమ్మదిగా పల్లానికి జారుతుంది ముళ్ళ పదనని అనేకమైన ప్రాంతాలని చక్కగా శుభ్రపరుస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ తనలో ఉన్న మాలిన్యాలను వదిలిపెడుతూ నెమ్మది నెమ్మదిగా వెడివెడిగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి నిష్ఠంత్రమంత్రంగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా సాగర సంగమం చేసి తన మూల స్థానంలోకి తాను వెళ్లిపోతుంది. మనకు కూడా సత్యసాయి సేవా Organization లో అడుగుపెట్టిన నాడు ఒట్టి raw diamond గా వస్తాం. వజ్రాలమే raw diamond దానికి polish లేదు. కొన్నాళ్ళు ఈ సంస్థతో ముడిపడి స్వామి చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని గనక ఆశ్రయించినట్లైతే, నేను ఆత్మ స్వరూపుడినన్న భావనతో నిలకడ చెంది ఉండగలిగినట్లైతే సాగర సంగమం వేళ కొన్నేళ్ళకి మనం ఏమవుతామో తెలుసునా? జానపట్టిన వజ్రాల వలే నిలిచిపోతాం. అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. మనకి external cosmetic అవసరం లేదు. అనంతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక వెలుగు ఒక విభూతిమయమై మన శరీరాన్ని, బుద్ధిని, మనస్సుని, చిత్తాన్ని, అహంకారాన్ని, ఆనందాన్ని అన్నిటినీ కూడా ఆవహించి ఆవహించి ఆవేశించి మనని సర్వోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళుతుంది గనుక ప్రతి చోట ఎక్కడైతే స్వామిని మందిరాలు కట్టారో, తొలినాళ్ళలో అవి మందిరాలేమో తొలినాళ్ళలో అవి స్వామి temples ఏమో, ఇవాళ నా దృష్టిలో అవి కేవలం ఒక గుడు రూపాలు, ఒక బడు రూపాలు. మరి ఏమిటంటే అవి గుణ మందిరాలు. [అందరూ ఒకేసారి చప్పట్లు] మనకు ఉన్నటువంటి గుణాలే మందిరాలుగా రూపాంతరం చెందిని. ఈ గుణ మందిర నిర్మాణంలో సత్యసాయి భగవానుని యొక్క అనుగ్రహ విభూతిని ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా అనుభవించిన మనం, జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపి ఒక ఆనందాన్ని మూటగట్టుకున్న మనం, పరస్పరమైనటువంటి ఏ రకమైన వైషమ్యం లేకుండా, ఇవాళ నిజానికి సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను విశాఖ వచ్చా. తొమ్మిదేళ్ళు. నాకు ఎట్లా ఉన్నది అంటే నిన్ననే రాజు గారిని చూసినట్టు, నిన్ననే మా నాగేశ్వరరావు గారిని తెలిసినట్లు, నిన్ననే మా రామకృష్ణ గారిని చూసినట్లు, నిన్ననే నాకు తెలిసిన వాళ్ళందరినీ నా నరస ముప్పీ గారిని చూసినట్లు ఉన్నదే తప్ప తొమ్మిదేళ్ళ ఒక ఎడబాటు ఉన్నదన్న భావనే లేని స్థితి ఎవరు కల్పించారంటే ఈ తొమ్మిదేళ్ళలో మీరందరూ నా గురించి ఆలోచించారు, నేను కూడా మీ అందరి గురించి ఆలోచించా. [అందరూ ఒకేసారి చప్పట్లు] మనందరం కలిసి ఒకరిని ఆలోచించాం. ఆయన భగవాన్ శ్రీ సత్య సాయి. కనుక మన అందరి యందు ఉన్నటువంటి సర్వాత్మనుడైనటువంటి స్వామి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇదే ప్రాంగణంలో ఇట్లాగే ఇంత ప్రసన్నంగా, ఇంత ప్రశాంతంగా ఈ వ్యక్తిగత సాధన నుంచి సమాజ వికాసం వైపు ఎలా వెళ్ళాలో ఒక ఆలోచన చేసేటువంటి సందర్భాన్ని సృష్టించినటువంటి సర్వదేవతా అతీతమైనటువంటి ఒక స్వరూపమై, తేజమై, తల్లే, తండ్రై, గురువై, దైవమై, సర్వమూ తానై, అన్నీ తానై, అంతా తానై ఉన్నటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ miracles చెప్పలేదని అనుకోకండి. Miracles నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే స్వామి doesn't represent miracle. అసలు స్వామి ఈ ప్రపంచంలోకి వచ్చి ముప్పై ఎనిమిది కోట్ల మందిని తన భక్తులుగా మార్చినటువంటిది అది మొదటి miracle. [అందరూ ఒకేసారి చప్పట్లు] నూట ఎనభై ఎనిమిది దేశాలలో తన వాణి, తన భావం తనని చూడని వారితో ఎక్కువగా చేయి చకచక ఉండదే అది miracle. మనందరం ప్రశాంతి నగరానికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకొని hall లో నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న ఇరవై ఐదు వేల మంది అనే ఒక మాట ఏమిటంటే ఇవాళ స్వామిని అన్నే చూశారని. చూసిన ఆయన ఒక్కరే సత్యసాయి, చూడబడిన వారు ఇరవై ఐదు వేల మంది అది నా దృష్టిలో miracle. [అందరూ ఒకేసారి చప్పట్లు] ఇటువంటి ఒక పరమాద్భుతమైన స్థాయిలో స్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఇవాళ అనుకున్న spiritualization అనేటువంటి దానిని మనం గనక ఒక ఆధ్యాత్మిక మార్గంగా స్వీకరించినట్లయితే స్వామి మనల్ని ఎంత దూరం తీసుకెళతారో, ఏ వైపుగా మళ్ళించి తీసుకెళతారో. కానీ ఒకాయన, వైజాగ్ లోనే ఒకాయన నాకు ఉత్తరం రాశారు. "అయ్యా జీవితంలో నేను చరమాంకానికి వచ్చేసాను. స్వామి నన్ను అక్కున చేర్చుకుంటారా?" అని కొంత అమాయకంగా ఉత్తరం రాశారు. నేను దానిలో బాధ ఉన్నది, కాస్త అవుదో కాదో అనే సంశయం ఉన్నది. నేను ఆయనకి ఒక ఏకవాక్యపు ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో ఏం రాశానంటే "సర్వ జగత్తునీ ఎత్తుకున్న భర్తృహారునికి మేల ఎత్తుకొనుడు" అని రాశాను. [అందరూ ఒకేసారి చప్పట్లు] ఈ ఒక్కటి వదిలేస్తారా ఆయన? సమస్త ప్రపంచాన్ని పట్టుకోలేదా? కాబట్టి ఇటువంటి అమృత భావనలన్నీ మనం పునః పునః వింటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి, నితిధ్యాసనంలో నిలబెట్టుకోవాలి, సేవా మార్గంలో మన జీవితాలను ధన్యవంతం చేసుకోవాలి, భగా కార్పణ్యము, భేదము ఇవన్నీ వదిలిపెట్టి ప్రేమైక జీవులుగా ఉండగలిగేటువంటి స్థాయికి మనందరం గనక ఎదగగలిగినట్లయితే అది నిజంగా మనం స్వామికి ఇచ్చేటువంటి నివాళిగా భావన చేస్తూ మీ అందరూ స్వామి మాట ప్రకారమే ఎవరు సత్యసాయి భగవానుడి యొక్క నామాన్ని అంటారో, ఎవరు నిరంతర చింతనా భూమికలో నిలకడ చెంది ఉంటారో వారియాదాన్ని మాత్రమే కాక వారి రాబోయే ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటానని స్వామి ప్రతిజ్ఞ చేశారు. [సభలో చప్పట్లు] ఇవాళ మనం చేస్తున్న ఈ తపస్సు, ఈ పూజ, ఈ భావన, ఈ వ్రతము ఇదంతా కూడా కేవలం మనతో ఆగదు. మన కన్నబిడ్డలు రాబోయే ఇరవై ఒక్క తరాలు స్వామి కాచుకుంటారు. ఆయన నుడుగై మనకి ఆ.. ఆరక్షణగా నిలబడతారు అని స్వామి మాటనే మీ ముందు మరొక్కసారి ఉంచుతూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ పాడగలిగిన వాళ్ళు బాగా పాడుతూ ఇంకా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడే ఈ center లోనే speakers ని తయారు చేశాం. తర్వాత వాళ్ళంతా ఎంటో వెళ్ళిపోయినారో తెలియదు. బాగా మాట్లాడండి, బాగా చదవండి. స్వామిని అనుభవించండి. స్వామిని అనుభవంలో తెచ్చుకోండి. స్వామి దైవమని గోడకు బొమ్మ పెట్టి, ఫోటో పెట్టి దానికి పూలదండ వేస్తే ప్రయోజనము లేదు. ఏమిటి ప్రయోజనం-- అది గౌరవం. ఎలా ఉండాలి? గురువాక్యని పాటించడమే గురువుకి ఇచ్చే గురుదక్షిణ. మన దగ్గర డబ్బు కావాలా? మన డబ్బు ఆయనకి. స్వామి అన్నారు "అల్పమైన, తుచ్ఛమైన మీ సంపదలు నాకేందుకు?" అన్నారు. ప్రపంచంలో చెయ్యి చాపని గురువు ఎవరన్నా ఉన్నారా? చెయ్యి చాపని ఆ కైలాస విష్ణువు కూడా చెయ్యి చాపాడు. అది లోకాద్ధరణ కోసం. కానీ చెయ్యి చాపని అవతారముతో ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఒక్క సత్య సాయి భగవానుడు మాత్రమే. [సభలో చప్పట్లు] కాబట్టి ఇవన్నీ మనం తలచుకుంటూ మనందరి జీవితాలు ధన్యవంతం కావాలని మళ్ళీ ఉక్కునగరంలో మనం ఇన్ని విశేషాలు మాట్లాడుకునే ఈ విలువైనటువంటి సమయాన్ని అనుగ్రహించిన కాలవరదాయి అయినటువంటి, జ్ఞానవరదాయి అయినటువంటి సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ భజన మందిరాలు భజనలతో అనేకమైన సమితులన్నీ కూడా సాంస్కృతిక కార్యకలాపాలతో ఆధ్యాత్మిక వేదికలుగా ఈ ప్రపంచ అంతరాంతరమైపోతున్న ఈ సమాజానికి నిర్దేశము, దిశానిర్దేశము, మార్గోపదేశం చేసే దిశగా సత్య సాయి సంస్థలు leadership తీసుకుంటేయని, అవే role model గా ఉండాలని స్వామిని నేను మనసా, వచసా, చలసా ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకామనలు తెలియజేస్తూ సాయిరాం. [సభలో చప్పట్లు]
YouTube · audio
Sri Sathya Sai Adhyatmika Upanyasam by renowed Techno-Spirtualist Prof
Sri Sathya Sai Adhyatmika Upanyasam by renowed Techno-Spirtualist Prof
Source: The Wed Makers on YouTube
0:00 / 1:41:35