Skip to content
Transcript తెలుగు
పరమోదాత్తమైన భావన ఇది అనాత్మను గురించిన విచారణ. కనుకనే అనేక సంఘటనలు-- ఒకసారి వారు అరుణాచలం మీద వెళుతున్నప్పుడు వారి వెనుక కొంతమంది శిష్యులనండి, భక్తులనండి, వారి వెంట పరివారం అనండి వెళుతున్నారు. వెళుతూ ఉంటే అరుణాచలం పైన ఒక చిన్న చెరువు లాంటిది ఉంటే, కొలను లాంటిది ఉంటే అక్కడికి నీళ్లు తాగటానికి ఒక పులి వచ్చింది. భగవాన్ తో వస్తున్న వారంతా వేదం చదువుతూ వెళుతున్నారు. కానీ అకస్మాత్తుగా నీళ్ల దగ్గర [తుమ్ము] పులిని చూసినప్పుడు ఒక్కసారి భయపడ్డారు. చదివే వేదాన్ని ఆపేశారు. భగవాన్ మాట అన్నారు "ఎందుకు ఆపారు? వారు ఒక మహాత్ములు. వారు రూపంలో మీరు చదువుతున్న వేదాన్ని వినటానికి వచ్చారు. దేహం ఉన్నది గనుక దాహం తీర్చుకొని వారి దారిన వారు వెళ్లిపోతారు. వారు మనకు అపకారం ఏం చేయరు." ఎవరు? పులిని గురించి మనం వారు అనం, అది అంటాం, వాడు అంటాం. ఆత్మను దర్శించిన వాడు మర్యాదను పాటిస్తాడు. పిల్లవాడు లేడు, పెద్దవాడు లేడు. జడమా, ఇది అజడమా అనుకోడు. కనుక భగవాన్ కేవలం అరుణాచలాన్ని శివుడుగా మాత్రమే కాక ఒక పాముని-- వారు రోజు అరుణాచలంలో కింద కూర్చుని ఉండగానే చాలా పెద్ద తాచుపాము వారి పాదాల మీదిగా పాకుతూ వెళ్లిపోయింది. భక్తుడు అడిగాడు, "వారు ఏం చలించలే, మామూలుగా కూర్చున్నారు, పాము పాకి వెళ్ళిపోయింది. భగవాన్! పాము పాకి వెళ్ళింది కదా! మీకు భయం వేయలేదా? మీరు కాళ్లు కూడా కదపకుండా కూర్చున్నారే, అప్పుడు ఏమనిపించింది?" అంటే, "It was cold and moist" అన్నారు. చల్లగా ఉంది, కాస్త చెమ్మగా ఉంది అంతే, ఏం లేదు అక్కడ అన్నారు. మనమైతే భయభ్రాంతులం అయిపోతాం. మనకి దాని స్పర్శే ఒక అలజడి సృష్టిస్తుంది. సమస్థితమైనటువంటి మనస్సుకి అలజడి లేదు, ఆందోళన లేదు, కంగారు లేదు, భయం లేదు. భయం లేనివాడు భగవంతుడు, భయమున్నవాడు జీవుడు. భయంతోనే బతుకు వెళ్లదీసేవాడు జీవుడు. పరమానందుడై, నిత్య తృప్తుడై, ఆనంద సంధాయకుడై, పూర్ణుడై, పరిపూర్ణుడై, ఒక వెలుగై వెలిగేటువంటి వాడు భగవంతుడు గనుక భారతీయ తత్వ సిద్ధాంతం భగవంతుడి భావనకి పెద్ద పీట వేసింది. రూపంలో ఉన్న దాన్ని భావించమన్నది, పూజించమన్నది, నమ్మకాన్ని పెట్టుకోమంది. నీకంటే అత్యున్నతమైన ఒక మహా శక్తి ఏదో ప్రపంచాన్ని నడిపిస్తున్నది, దానికి భగవంతుడు అని పేరు పెట్టుకో. వాడు రూపంలో ఉన్నా అది ప్రధానమైన విషయం కాదు. కానీ నడిపిస్తున్న, అనుగ్రహిస్తున్న ఒక నిర్ణాయక శక్తి ఏదో ఉన్నది. అందుకే భగవాన్ మాటలన్నీ కలిపి ఒకే ఒక్క వాక్యంలో పూర్తి చేశారు ఉపదేశ సారంలో. "కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం" వాడు అనుగ్రహించినంతే ఫలితం మనకు వస్తుంది. అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది. మనం చేశాం గనుక ఫలితం రావాలని ఏం లేదు. కర్త ఈశ్వరుడు అయినట్లయితే, కర్త భగవంతుడు అయినట్లయితే, కర్త పరిపూర్నుడు అయినట్లయితే, కర్త నిత్య సత్య శాశ్వతుడు అయినట్లయితే, కర్త నీ దేహాన్ని దాటి లేడు. ఎక్కడ ఉన్నాడు? నీ యందే ఉన్నాడు. హృదయ కుహర మధ్యంలో ఉన్నాడు, ఆత్మై వెలుగుతున్నాడు. నేను, నేను, నేను అని ప్రకాశమానంతో మనకి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. నా ఉనికి ఇక్కడ, నా అస్తిత్వం ఇక్కడ, నా మూలం ఇక్కడ. నా మూలం ఇక్కడ అంటే, నీ మూలం కూడా ఇక్కడే. నువ్వు మనసుతో, దేహంతో, భావనతో, ఆచరణతో, మూల వాసనలతో, వాసనలతో, సంస్కారంతో అనేకమైనటువంటి ఆలోచనలతో Connectivity ని పోగొట్టుకున్నావ్. Just get back to me and get reconnected. We are one and the same అనేటువంటి ఒక భావన. "త్వమేవాహం సంశయః" అన్నటువంటి దివ్య భావనని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తున్నది ఎవరు అంటే ఆత్మ విచార మార్గంలో నేనెవరు అన్న ప్రశ్నే. కనుక అది ప్రశ్నే కాదు, అది ఒక ఆధారం. ఆధారాన్ని పట్టుకొని మనం నెమ్మది నెమ్మదిగా మనల్ని గురించి మనం విచారణ చేస్తూ దేహం నాది కాదని, నేను దేహం మాత్రమే కాదని, ఇంద్రియాలు నా యందు ఉన్నవి తప్ప, నేను ఇంద్రియాలు కాదని, సర్వాంగములు నాతో ఉన్నాయి గనుక అవి అంగములే గాని, అంగములన్నీ నేను కాదని, సమగ్రమైనటువంటి ఒక స్వరూపం ఏదైతే ఉన్నదో దానిని నేనుగా భావిస్తున్నానే తప్ప, అసలు నేను నా యందు ఉన్నది అనేటువంటి ఒక విచికిత్స, ఒక తీవ్రమైనటువంటి ఆలోచన, ఒక Complete analysis, ఒక In-depth introspection, Insight, ఇవన్నీ కూడా కావాలి అని చెప్తూ ఇవాళ యువత ఆత్మ విచార మార్గం వైపు మనం వెళ్ళలేం. దాని జోలికి మన వల్ల పని కాదు అని చతికిల పడకుండా, ఇవాళ ఉన్నటువంటి Intelligence ని, IQ levels ని, విషయ పరిజ్ఞానాన్ని, ఆలోచించగలిగిన మేధాశక్తిని, అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఆంతరంగికమైనటువంటి అవలోకనాన్ని అంటే To get back inside, looking from within, not looking from outside, looking from within అలవాటు గనక చేసుకున్నట్లయితే భగవాన్ ఉపదేశించిన Law of Grace అన్నాంఅంటే కరుణకి అనుగ్రహానికి కూడా ఒక law ఉంది. ఒక న్యాయరీతి ఉన్నది. ఇదంతా మనం సాధనా మార్గంలో మనం పొందవలసినటువంటి దివ్యమైనటువంటి భావన. భావనని మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ గనుక వెళ్ళినట్లయితే ఆత్మానాత్మ విచారణలో అనాత్మలో కూడా ఆత్మను చూడమని, ఆత్మలో అనాత్మ లేదని, ఆత్మే అంతా అయి ఉన్నదని, ఆత్మ మూలమని, ఆత్మ బింబమని, అనాత్మ దాని యొక్క ఛాయ అని అంటే నీడ అని మనకి ఇంత స్పష్టంగా ఆహ్ సూక్ష్మ శరీరం ద్వారా కనిపిస్తున్న స్థూల శరీరం ద్వారా, కారణ శరీరం ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, చిత్తం ద్వారా, అహంకారం ద్వారా, అహంకారం కూడా మనస్సు యొక్క స్థితే. అహం స్పురణ ఆత్మ యొక్క స్థితి. విచార మార్గంలో వారు సోహం లోకి వెళ్ళమని, నెమ్మదిగా నేనెవరన్న ప్రశ్న వేసుకోమని, నేనెవరన్న ప్రశ్నలలో నుంచి మన పాండిత్యాలు, కవిత్వాలు, శాస్త్ర పరిచయాలు, శాస్త్ర విశ్లేషణలు, ప్రసంగాలు, ప్రవచనాలు, ఉపన్యాసాలు వీటన్నింటినీ దాటి దాటి దాటి వెళ్లాలని వెళుతున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి రాజమార్గాన్ని రాజమార్గాన్ని భగవాన్ శ్రీ రమణులు ఉపదేశ సారంలో మనకి స్పష్టం చేస్తూ ప్రతి విషయాన్ని కూలంకషంగా ఎరగమని, స్థూల శరీరానికి ఉన్న పరిమితులు జాగ్రదవస్థలో సమసిపోతాయని, నిజానికి స్థూల శరీరము జాగ్రదవస్థ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరమే లేదని, సూక్ష్మ శరీరం లో ఉండగా స్థూల శరీరం వెనకబడి పోయిందని, కారణ శరీరం వైపు వెళ్లగానే స్థూల, సూక్ష్మ శరీరాలు మరింతగా వెనకబడి పోయినాయని, వాటి కార్యకలాపాలు మన మనసు నుంచి దూరమైనాయని, అంతవరకు రాత్రిపూట నిద్రాణమై ఉన్న, నిస్తేజమై ఉన్న, నిర్వీర్యమై ఉన్నటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉన్నటువంటి ఇంద్రియాలు మళ్ళీ మేల్కొని ఆత్మ వైపు వెళుతున్నాయని మనకి విచారణా మార్గంలో పరమాద్భుతమైన ఆవిష్కరణ చేస్తూ, అలాగే మనస్సును జాగ్రత్తగా గమనించుకోమని, అది మన ఆలోచనల పుట్ట అయినని, ఆలోచనల కట్ట అయినని, ఒక్కొక్క ఆలోచనని మనం గనుక వెడదీస్తూ వెళ్ళిపోయినట్లయితే దారపు ఉండ ఎట్లాగైతే చిక్కుపడ్డప్పుడు చిక్కు విడదీస్తూ మనకు కావలసినంత దారం ముక్కని మనం తీసుకుంటామో, అనేకమైన ఆలోచనలన్నీ కూడా చిక్కు ఆలోచనలుగా, ముడులుగా ఏర్పడినప్పుడు ఒక్కొక్క దాన్ని విడగొట్టుకుంటూ విడగొట్టుకుంటూ నీకు కావలసినటువంటి ఆత్మను మాత్రమే నీవు పట్టుకొని అక్కడి నుంచి నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించమని ఒక విచార మార్గాన్ని ఆత్మ విచార మార్గం వైపు, సోహం వైపు భగవాన్ మనల్ని ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా నడిపిస్తూ ఉన్నారు. అంతే కాదు ప్రాపంచికమైనటువంటి భావనలో నుంచి మనస్సుని లోపలికి మరల్చమని, లోపలికి మరల్చినప్పుడు ఆత్మాన్వేషణ ప్రారంభం అవుతుందని, ఆత్మాన్వేషణ ప్రారంభం కావా-కాగానే అసలు వస్తువు మనకి స్పష్టంగా కనిపిస్తుందని ఉపదేశ సారంలో భగవాన్ మనకి చాలా చాలా crystal clear గా మొట్టమొదటి రోజే ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళండి అని చెప్పకుండా అన్ని మార్గాలను అనుసరిస్తూ అనుసరిస్తూ అనుసరిస్తూ పోగా పోగా పోగా అసలు ఇక్కడికి రండి అని చెప్పేటువంటి విచార ధారణి మనం చక్కగా కొనసాగిస్తున్నాం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -74

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -74

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:03

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

    Now playing
  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77