Skip to content
Transcript తెలుగు
భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇవాళ సాధనా మార్గాల గురించి చాలా స్పష్టంగా మనకు చెప్తున్నారు. పూజ, వాక్కు, మనస్సు, చింతన. ఇదంతా ఒక క్రమ పరిణామం అని చెప్తున్నారు. వీటన్నింటిలో చాలా ప్రధానమైనవి మొదటిది పూజ అది భౌతిక స్థాయి. వాక్కు మానసిక స్థాయి. ఎప్పుడైతే వాక్కు ద్వారా మనం భగవంతుణ్ణి కీర్తిస్తామో, స్తుతిస్తామో దానివల్ల మనస్సు శుభ్రపడుతుంది. శుభ్రపడినటువంటి మనస్సు వలన మనకి ఆలోచనలు కలుగుతాయి. అసలు ఏమిటి మాయామేయ జగత్తు? ఏంటిని కష్టాలు ఏమిటి? సుఖాలు ఏమిటి? ఆనందాలు ఏమిటి? విజయాలు ఏమిటి? అసలు జగత్తుతో ఇంతగా మనం ఎందుకని మమేకమై పోతున్నాం? అక్కరలేని ఆలోచనలన్నీ మనసులో ఎందుకు పెట్టుకుంటున్నాం? కావలసినది ఏది ఎందుకు తెలియటం లేదు? తెలిసిన కొద్ది అన్నీ తెలుసు అని అనిపిస్తోంది అహం వల్ల. మరి ఎవరికీ ఏమీ రాదంటున్నాం అభిజాత్యం వల్ల. ఏమీ రాకపోయినా చాలా తెలిసినట్లుగా ఉంటున్నాం దంభం వలన. తెలిసింది అతి కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నాం ప్రగల్భం వల్ల, గర్వం వల్ల. అని ఎప్పుడైతే శుద్ధ మనస్సు మనకి ఒక చిన్న హెచ్చరిక చేస్తుందో క్షణంలో ఒక చింతన ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు చెంతే. పూజలో వేళ కొబ్బరికాయ కొట్టామా లేదా, పూలు అందించామా లేదా, అగరుబత్తి వెలిగిందా లేదా, కుడిచేత్తోనా ఎడం చేత్తోనా, అసలు అగరుబత్తి దేవుడికి ఇష్టమా, వాసన ఆయనకి ఇష్టమా, ఇవన్నీ ఎవరు కల్పించారు? మన మనస్సే. అది అయిపోయింది మళ్ళీ ఏదో ఒక నామం పట్టుకున్నాం జపం చేస్తున్నాం. యాభై నాలుగు అయిందా, వంద అయిందా, నూట ఎనిమిది అయిందా మనస్సు దాని యందు లగ్నమైంది. అసలు విషయం వెనక్కి వెళ్ళిపోయింది. అది దాటాం నాకు నంబరుతో స-సంఖ్యతో సంబంధం లేదు. నంబరు నేనేం చేసుకొను నేను అజపం చేసుకుంటానంటున్నాం. అజపం అంటే రెండు అవచ్చు, రెండు వేలు అవచ్చు, రెండు లక్షలు అవచ్చు, రెండు కోట్లు అవచ్చు. అక్కడ మన ప్రమేయం లేదు. అది జరిగిపోతూ ఉన్నది యాంత్రికంగా, మాంత్రికంగా, మార్మికంగా లోలోపల జరిగిపోతున్నది. అక్కడ మన ప్రమేయం లేని ఒక స్థితి ఏర్పడింది. దీనిని దాటి మనస్సు కూడా ఏర్పడింది. మనస్సు మనకి ఒక ఆలోచన కలిగిస్తున్నది. ఆలోచన ఏమిటంటే నిజమే పూజలో నువ్వు చక్కగా చేస్తున్నావ్ భగవంతుడికి ప్రీత్యర్థం చేస్తున్నా అంటున్నావ్. దానికంటే ముందు నీకు కనువిందుగా ఉందిగా, మనోహరియంగా ఉందిగా, ఆనందంగా ఉందిగా. విష్ణుమూర్తిని సాలంకృతుణ్ణి చేయగానే, అమ్మవారికి చీర కట్టగానే నీకు ఆనందం కలుగుతున్నది. ఎందువలన? ఇంద్రియాలు దివ్యమైనటువంటి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అందం వేరు, సౌందర్యం వేరు. అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. సౌందర్యం ఇంద్రియాలను క్షమింపజేస్తుంది. ఒక మానసికమైన ఉల్లాసాన్ని, ఉద్వేగ రహితమైనటువంటి ఒక భావ పరంపరని మనకు కలిగిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనస్సును చూసినా, పౌర్ణమి నాడు పూర్ణంగా వికాసమానం చెందిన చంద్రుణ్ణి చూసినా, ఒక అందమైన లోయ చూసినా, వాగు చూసినా, సన్నటి పాయ చూసినా, చిన్న నీటి చలమను చూసినా, చిన్న సీతాకోక చిలుకను చూసినా, గడ్డి పువ్వును చూసినా అది సౌందర్యం. అక్కడ ఇంద్రియాలు రెచ్చగొట్టబడటంలే, అవన్నీ నాకు కావాలని అనిపించటంలే ఇది సౌందర్యం. కాబట్టి అందానికి సౌందర్యానికి అర్థం ఎరిగి ఎప్పుడైతే ఒక మనస్సు శుభ్ర మనస్సుగా మారిందో శుభ్రమైన ఆలోచనలు మాత్రమే కలుగుతూ ఉన్నాయి గనుక శుభ్రమైనటువంటి మనస్సు ఇంకొక మెట్టు వైపు తీసుకుని వెళుతూ ఏమంటుంది అంటే చింతన చేయవయ్యా. ఎందుకు ఇంత చింత? జీవితం అంటే లాభనష్టాలేనా? డెబిట్ క్రెడిటేనా? సంపాదనా దానివలన ఏర్పడిన సుఖమేనా? సుఖం వలన ఏర్పడిన తాత్కాలికమైన సంతోషమేనా? ఆలోచన చెయ్. ఇలా నువ్వు గనక చేస్తూ, చేస్తూ, చేస్తూ వెళ్లినట్లయితే నీకు ఒక చింతన కలుగుతుంది. చింతన ఏమిటి అంటే నేను ఎవరు? ఏమిటిదంతా? నేను ఎట్లా వచ్చాను? నా మూలం ఏమిటి? ఎక్కడ ప్రారంభమైంది నా జీవన ప్రస్థానం? ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నది? ఇందులో నా ప్రమేయం ఏమీ లేకుండా అయిపోతున్నదే. అనేకమైన సంఘటనలు నా కళ్ళముందు నా పరంగా, నా గతంగా జరిగిపోతున్నాయి. జరిగిన ఆనందాలు, పొందిన దుఃఖాలన్నీ మళ్ళీ కాల గర్భంలో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏమిటిది? అన్నటువంటి ఒక ప్రశ్న పొటమరించినప్పుడు, మనస్సులో కలిగినప్పుడు ఇది తాత్విక చింతన వైపు దారితీస్తుంది. మనం ఇంతకు ముందే ఒక్కసారి అనుకున్నాం. మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ అనుకోవాలి పునః పునః దోషం లేదు. చెడ్డ విషయాలు ఎప్పుడైనా మనసుకు తాకినా మళ్ళీ అనుకోకూడదు అవి నిషిద్ధం. ఇవి స్వాగతించదగిన విషయాలు. మంచి విషయం ఏమిటంటే చితి, చింత, చింతన అని మూడు మాటలు వాడుకున్నాం. చితి ఏదైతే ఉన్నదో అది దేహానికి సంబంధించిందని, చింత మనసుకు సంబంధించిందని, చింతన అధోస్థితి నుంచి ఊర్ధ్వ స్థితిలో ఉన్నటువంటి.మనసుకి ఊర్ధ్వ మనస్సు లేదా హృదయం యొక్క meeting point ఏదైతే ఉన్నదో అక్కడ జరిగేది చింతన. దానినే మనం అంతరంగ సమాలోచన అంటాం, ఆలోచన అంటాం, సమాలోచన అంటాం. ఇవన్నీ కూడా హృదయంలో పుడతాయి. అసలు ఉన్నదంతా ఆత్మంతా ఆత్మమూలమంతా హృదయంలోనే ఉంది. నిజానికి మనస్సు యొక్క పుట్టుక కూడా హృదయమే. హృదయంలో నుంచి శిరస్సు ద్వారా విజృంభించి అనేకమైన అహంకార మమకారాలకు తాను కారణమై, కారకమై, ప్రేరకమై, చోదకమై మనల్ని యాతన పెడుతున్నది మనసు. మనసుని కూడా నేను శుభ్ర మనస్సు చేయగలిగినట్లయితే సూడో mind నుంచి ఒక real mind కి real mind నుంచి pure mind కి దాన్ని గనక నేను తీసుకు వెళ్లగలిగినట్లయితే ప్రశ్న కలుగుతుంది. ప్రశ్నకి ప్రారంభం పునాది ఎక్కడ పడింది అంటే నేనెవరు అన్న ప్రశ్న ఇక్కడ పుట్టింది. ఇది ప్రతి వాడికి జీవితంలో ఒకరోజున కలుగుతుంది. అది పదవ ఏట జరుగుతుందా? నలభై ఏట జరుగుతుందా? వందేళ్లు రాబోయేటప్పుడు కలుగుతుందా ఏమిటిదంతా అని తెలీదు. వాడి వాడి జన్మ సంస్కారాలను బట్టి, విశేషాలను బట్టి తాను నడ-- నడచి గడచి వచ్చినటువంటి జీవితాల గురించి వాటిలలో నుంచి ఏర్పడిన అనేక సంస్కార భావాల నుంచి చింతన ఏర్పడుతుంది గనుక. చింతన అంటే నేనెవరు అన్నదే చింతన. నేను అంటే ఆత్మను అన్న ఎరుక వచ్చే దాకా సాగేదే చింతన. ఇది ఇంతకు ముందే భగవాన్ చిత్తశోధకం ముక్తి సాధకం అని రెండు మాటలు మనకి చెప్పారు. చిత్తశోధకం ముక్తి సాధకం ఎప్పుడు కలుగుతాయి? మళ్ళీ వీటికి మూలాలు ఏంటంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. నాకిది కావాలి అన్న భావన లేకుండా క్రియ కలాపాలు, కర్మలు చేసుకుంటూ వెళితే అవి చిత్తశోధకానికి దారితీస్తాయి. ముక్తి పొందటానికి సాధనా మార్గాలు సాధకాలవుతాయి, instruments అవుతాయి. instruments మళ్ళీ మనల్ని పూజ వైపు, వాక్కు వైపు, భావన వైపు, శుద్ధ మనస్సు వైపు, జపం వైపు, అజపం వైపు ఆపై కడగా చింతన వైపు నడిపిస్తాయి గనుక క్రమాత్ ఇది అందమైన మాట క్రమాత్ ఏదైనా సరే humble గా ప్రారంభం కావాలి. పెద్దగా ప్రారంభం కావటానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా అది అసహజం. బిడ్డ పుట్టాడు అంటే వాడు ముందు పడుకోవాలి, బోర్లా పడాలి, నెమ్మదిగా పాకాలి, నిలబడే ప్రయత్నం చేయాలి, నడక నేర్వాలి. నడక నేర్చిన తర్వాత వేగంగా నడవటం నేర్వాలి. ఆపై పరిగెత్తడం ప్రారంభించాలి గనుక అప్పుడే పుట్టినటువంటి బిడ్డ పరిగెత్తడం ప్రారంభిస్తే ప్రకృతిలో అది చాలా అసహజమైన అటువంటిది. చూడండి ప్రకృతిలో కూడా ఋతువు వెంట ఋతువు transition మార్పు క్రమంగా జరుగుతూ వస్తుంది. కృష్ణ శుక్ల పక్షాలు దాటుకుంటూ కాలాన్ని అధిగమిస్తూ కాల ప్రవాహాన్ని నెమ్మదిగా పారిస్తూ పరమాద్భుతంగా సాగుతూ ఉంటుంది గనుక అందమైనటువంటి చింతన మనకు కలగాలి. చింతన కలగకపోతే work is worship మంచి మాట. దాన్ని మనం worship is work గా మారిస్తే సుమారు ఎనిమిది, తొమ్మిది గంటలు పూజలలోనే గడిపితే ఇక మనం చేసేది ఎప్పుడు? పొందేది ఎప్పుడు? మనకోసం మనం కూర్చునేది ఎప్పుడు? కాబట్టి దేనినైనా పరిమిత కాలంలో చేయాలి. కాలాధీనులమై చేయాలి. కాలానికి గౌరవాన్ని, మర్యాదని ఇస్తూ చేయవలసినంత చేయాలి. స్తవం చేయాలి. భగవంతుని గురించి మంచి పద్యం రోజు ఒకటి అనుకోవాలి. తెలుగులో భాగవత పద్యాలు చదువుకోవాలి. భాగవతంలో పోతనామాత్యుడు మనబోటి వారందరి కోసం అచ్చ తెలుగులో కలకండ అచ్చులుపోసినట్టుగా మనకిచ్చాడాయన. ఒక అపాత మధురంగా కవిత్వాన్ని రాశాడాయన. దర్శనం చేశాడు. అనేక లోకాలు దర్శనం చేశాడు. తాను దేనిని దర్శించాడో దానికి స్వరూపాన్ని ఏర్పరిచాడు. ఏర్పరిచినటువంటి స్వరూపంలో నుంచి మనకి భగవంతుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా గీతించాలో ఉదాహరణే చూడండి. "అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరాంబృతసరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమావినోదియగు అపన్నప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అను కుయి ఆలించి సరంభియై" పద్యం ఏం చెప్తోంది? ఇక్కడ కూర్చున్న పోతన విష్ణులోకాన్ని చూశాడు. విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో చూశాడు. అమ్మవారు ఎలా ఉందో చూశాడు. ఇది దర్శనం. అలాగే గజేంద్రుడి యొక్క హృదయంలో కలుగుతున్న మూలుగు ఏమిటో విన్నాడు. కుయి అంటే మూలుగు. ఇక అరవ-- అరిచే శక్తి కూడా లేదు. అరవలేకపోతున్నాడు. దీనినంతా ఒక పోతన ఒకచోట కూర్చొని ఒక మహాయోగ స్థితిలో దీన్ని దర్శనం చేశాడు. అచ్-- దానిలో పోతనగారి చింతన కూడా ఉంది. మనల్ని కూడా ఇలా చింతన చేయమంటున్నాడు. అప్పుడే ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు గజేంద్రుడిని రక్షించటానికి. దృశ్యం మీద మనస్సు నిలబడింది పోతనగారికి. అక్కడున్న అమ్మవారు రమావినోది అంటే రమాదేవి అక్కడుంది, అమ్మవారు ఉంది. మరి ఆమేం చేస్తుంది ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే? "అడుగెదనని కడువడి చనునడిగిన తన మగడు నుడువడను నడయుడుకున్ విడవిడ చిడిముడి తడబడ నడుగుడు నడుగిడదు జడిమ నడుగుడు నడలన్". చివరికి ఏదో అడుగు వేద్దామా? ముందుకు వద్దామా? వెనక్కి వద్దామా? అని ఒక Hamletarian complex లో ఒక బిడియంతో ఉన్నటువంటి అమ్మవారు చివరికి మొత్తం final గా ఒక అడుగు వేసిందని చెప్పటానికి ఒక దృశ్యం. దృశ్యం కాదు, దర్శనం. దర్శనంలో నుంచి ఒక చింతన. ఓహో! భగవంతుడికి భక్తుణ్ణి రక్షించాలి అన్నటువంటి ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం positive. ఆతృత. మనం కూడా ఇంకొల్లకి సహాయం చేయాలి అన్నటువంటిది ఉద్వేగంతో కాక ఉత్సాహంతో చేయాలి. అందుకనే అక్కడ "గజప్రాణావనోత్సాహియై" విష్ణువుని గురించి చెప్పాడు. అది చింతన. ఇదంతా పౌరాణికగతమైనటువంటి, కవితాత్మకమైనటువంటి ఒక భావనా రీతి. అయితే భగవాన్ వీటి జోలికి పోరు. అది కూడా పెద్ద మాయే అన్నారు. ఇదంతా పంచకోశాల బయట జరుగుతున్న తంతే తప్ప పంచకోశాత్మకమైనటువంటి ఆత్మ దగ్గర వాదం లేదు, వివాదం లేదు, నినాదం లేదు, సునాదం లేదు. ఏమున్నది అంటే నిశ్చలమైనటువంటి ఒక స్థితి ఏర్పడున్నది. నిశ్చలమైన, వినిర్మలమైనటువంటి ఒక అచేతనా భావనా స్థితి ఏదైతే ఉన్నదో భావన నెలకొలి చెంది ఉన్నది గనుక ఉమ్ అట్లాగే నేనెవరు అన్నటువంటి ప్రశ్నని నిరంతరం వేసుకుంటూ ఉండు. నేను engineer నా? నేను doctor నా? నేను పండితుడినా? నేను సంఘ సంస్కర్తనా? నేను రాజకీయవాదినా? నేను ధనవంతుడినా? ఇవన్నీ ఇక్కడికి వచ్చి నీవు సంపాదించినవే తప్ప నీకంటే ముందు లేవు, నీ తర్వాత ఉండవు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -15

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -15

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:04

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

    Now playing
  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77