Skip to content
Transcript తెలుగు
మంత్రమయమ కార్యక్రమంలో మన ఉపనిషత్ వాహినీ క్రమంలో ఉపనిషత్తుల గురించి చర్చించుకుంటున్నాం. క్రమంలో భాగంగా మాండూక్య ఉపనిషత్తుని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.ఆర్.మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువు గారు మాండూక్య ఉపనిషత్తు చిన్నది చెప్పాలంటే పెద్దది. పెద్దది. [నవ్వు] అసలు మాండూక్య ఉపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది? శాఖకు సంబంధించింది? అథర్వణ వేదం మూడు కూడా ప్రశ్న ఉండక మాండూక్య మూడు కూడా. ఇది కూడా మాండూక్య మహర్షి అని ఒక పేరు. అయితే దానికి అంతరార్థంలో గనక వెళ్లినట్లయితే మాండూక్యము అంటే కప్ప. కప్ప గెంతుతుంది. దానికి నడక లేదు. ఒక చోట నుంచి ఒక చోట గెంతుతూ వెళుతుంది. మన మనసు కూడా అంతే. గెంతుతూ ఉంటుంది. గెంతుతూ అటు ఇటు ఎటు వెళుతుందో తెలియదు. పరిగెత్తుతూ. పరిగెత్తుతూ ఉంటుంది. ఆగదు. ఆ? ఆగి అలసట తీర్చుకుంటుంటుంది. మళ్ళీ పరిగెత్తుతుంటుంది. మన మనసు కూడా అంతే. అందుకనే దీనికి మాండూక్య ఉపనిషత్తు అని పేరు పెట్టారు. మొదటి అర్థం మహర్షి పేరు మీద వచ్చింది. రెండవ అర్థం మనస్సమన్వయం. మనస్సమన్వయం. అంటే మనసుకు related కాబట్టి మనస్సుని నియంత్రించాలి, నిగ్రహించాలి అనుకున్నాం కదా. దాని గురించి విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి గనుక ఇది మాండూక్య ఉపనిషత్తు. దీనిలో ఎంత చిన్నది అంటే పన్నెండు మంత్రాలు ఉన్నాయి. ఒక్క పన్నెండే! కానీ చాలా విస్తృతమైనది. చెప్పాలంటే సమయం చాలనంత గొప్ప ఉపనిషత్తు ఇది. అది, అది మాండూక్య ఉపనిషత్తు అథర్వణ వేదంలో ఉన్నది. దీనిలో ఉన్న సూక్ష్మంగా దీంట్లో చర్చించే విషయాలు చెప్తారా? ఇది ఓంకారాన్ని గురించిన ప్రస్తావనే నిండుగా ఉంటుంది దీంట్లో. అది ఓంకారం అనేటువంటిది ఏమిటి అసలు? అది ఎక్కడ పుట్టింది? దాని పుటక ఏమిటి? దాని స్థాయి ఏమిటి? దాని స్థానం ఏమిటి మంత్రాల్లో? ఇవన్నీ కూడా ఓంకారాన్ని గురించినటువంటి తీవ్రమైన విచారధార మాండూక్య ఉపనిషత్తు. అసలు ఓంకారం అంటే ఏమిటి? అకారోకారం అకారయుక్తమగు ఓంకారాభిధానం అంటారు. మూడు బీజాక్షరాలు. మూడు బీ j ఒకటి ఆకారం. ఆకారం. రెండవది ఉకారం. మూడవది మకారం. అందుకనే English వాడు కూడా A U M అని రాస్తాడు. ఓం లో O M రాడు. అంటే O M గనక రాస్తే దాని అర్థం ఏమిటంటే అనేకం ఏకమైందని. One as many. ఏకం అనేకం అయిందని అలాగూ రాయొచ్చు. కానీ ఇక్కడ మూడు బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒకటి అకారము అగ్ని బీజం. ఉకారము ఉమా బీజం. మూడవది మకారము చంద్ర బీజం. అంటే సూర్య చంద్ర సూర్య అగ్ని మొదట్లో అకారం సూర్యుడనొచ్చు అగ్ని అనొచ్చు. మకారం చంద్రబీజం. ఉమ్. రెండింటి మధ్య ఉకారము సంధి. రెండింటినీ కలుపుతుంది. అంటే వేడి వెన్నెల, వెలుగు వెన్నెల ఇట్లా. ప్రపంచమే అగ్ని సోమాదు సూర్యాత్మకమే. అంతే కదా. రెండు ఉంటేనే అసలు ప్రపంచం. అమోదం. లేకపోతే మొలకే ఎత్తదు. విత్తనం మొలకెత్తదు కదా. అవును. కాబట్టి ఓంకారానికి రెండు అర్థాలున్నాయి. ఇది, ఇది బీజాక్షర సమన్వయం ఇది. ఓంకారము అంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మమును గురించి పుంఖానుపుంఖంగా మనం మాట్లాడుకుంటున్నామో, బ్రహ్మము ప్రపంచం అంతా విస్తృతమై ఉన్నదని చెప్పుకుంటున్నామో, బ్రహ్మము ప్రపంచాన్ని వీడి లేదని చెప్తున్నామో, అది రసాత్మకం అని చెప్తున్నామో అటువంటి ఓంకారము ప్రపంచం యొక్క మూల బీజం అది. ప్రపంచము, శాస్త్రము అన్నింటికీ బీజం ఓంకారమై ఉన్నది. అందులో అకారం అగ్ని బీజం అనుకున్నాం కదా. అగ్ని బీ-- అగ్ని లేకపోతే ఏమీ లేదు. మనం పుట్టింది అగ్నిలో. ఉంటున్నది కూడా అగ్నిలో. అగ్నిలో. శరీరం పోయేది కూడా అగ్నిలోనే. కాబట్టి అగ్ని చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే జోరాస్ట్రియన్స్ అగ్ని పూజ చేస్తారు. దయానంద సరస్వతి వారు కూడా అగ్ని పూజకి ప్రాధాన్యత ఇచ్చారు. ముందు మన వాళ్ళు కూడా అందరూ అగ్ని పూజే చేసేవాళ్ళు కదా. అగ్ని. అంతే. ఋగ్వేదం కూడా అగ్ని మీ లేపురోమితమని start అవుతుంది. అదేనండి. అసలు అగ్నితోనే ప్రారంభం. ప్రారంభం అవుతుంది. కాబట్టి వేదాలన్నీ కూడా అగ్నికి ప్రాధాన్యత ఇచ్చినాయి. యజ్ఞం చేయాలి. అగ్ని ఎక్కడ పుడుతున్నదో అక్కడే పుడుతున్నది. పుట్టినటువంటి దాంట్లో నుంచే మనం యజ్ఞం చేయాలి. కాబట్టి మూలం ఏమిటంటే అగ్ని. తర్వాత చంద్రుడు. చంద్రుడు మనస్సుకి. మనసుకు. ఆ? చంద్రమా మనసోజాతః. జాతః. కాబట్టి చంద్రుడు అనేది మనస్సు లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచం అంతా నిండి ఏమున్నదంటే మనస్సు నిండి ఉన్నది. మనస్సుని అటు జ్ఞానాన్ని, మనస్సుని పుట్టుకని, మూల కారణమైన దానికి కార్యకారణ సంబంధం అంటాం. Cause and effect. రెండింటికీ సమం-సమన్వయం చేస్తూ వచ్చేది ఉకారం. ఉకారం అంటే ఉమా బీజం అంటే ఉమా అంటే పార్వతిని కాదు conjunction. రెండింటినీ కలిపేది అని. రెండింటినీ కలుపుతూ ఒక ప్రణవం ఏర్పడుతుంది. ఒక నాదం ఏర్పడుతుంది. నాదం ఏమిటంటే అన్ని సంగీతాలకు మూలమైనటువంటిది నాదం. నాదం సంగీతం కాదు. నాదంలో సంగీతం ఒక భాగం. కాబట్టి ప్రపంచమంతా కూడా ఎలా సృష్టింపబడింది ఈవేళ Big Bang Theory అంటున్నామే అలాగా విస్ఫోటనంలో నుంచి పుట్టింది. విస్ఫోటనం జరగాలి ఒక volcano బద్దలు కావాలంటే దాంట్లో నుంచి ఏం వస్తుంది? అగ్ని వస్తుంది. నీళ్లు రావటం లేదుగా. విస్ఫోటనం జరిగింది. అగ్ని. అగ్ని పర్వతం అంటాం. అగ్ని పర్వతం. అగ్ని పర్వతంలో నుంచి ఎట్లాగైతే లావా ప్రవహిస్తూ ఉన్నదో అట్లాగే దీంట్లో కూడా ప్రపంచం సృష్టి కూడా అలాగే సృష్టింపబడింది గనుక కానీ అది శమింపబడి ఎక్కడో ఒక చోట ఆగి ప్రసన్నమైన స్థాయిలో స-సంచారం జరగాలి గనుక రెండింటికీ అనుసంధానమై ఉన్నటువంటి బీజాక్షరం ఉమా బీజాక్షరం. ఉమా అంటే స్వల్పకాలికమైన అత్యంత సూక్ష్మ సూక్ష్మేతరమైనటువంటి నిశ్శబ్దమే ఉమా బీజం. సూర్యుడు కనిపిస్తున్నాడు. సూర్యుడు ప్రభావవంతంగా ఉన్నాడు. చంద్రుడు కనిపిస్తున్నాడు వెన్నెలలాగా హాయిగా ఉన్నాడు. మరి కనబడుతున్న రెండింటినీ కలిపి- అనుసంధానం చేయాలి. చేసేటువంటిది అనబడేటుంది కాబట్టి అకారోకార మకార యుక్తమగు కలిసి ఉంది. దానికి ఓంకారము అభిధానమై ఉన్నది చెప్పబడి ఉన్నది. ఒప్పి ఉన్నది. అభిధానం అంటే ఒప్పి ఉన్నది. కాబట్టి ఓంకారం అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఇది? దీని ఉత్పత్తి ఎక్కడ అంటే నిశ్శబ్దంలో నుంచి పుట్టింది.దానికి శబ్దం లేదు నిశ్శబ్దంలో నుంచి పుట్టే అది శబ్దం అయింది ఎట్లా అయింది అక్షరాలలో అది ప్రథమాక్షరం ఎట్లా అయిందో శబ్దాలలో కూడా ప్రప్రథమ శబ్దం ఏంటంటే ఓంకారమే ఇప్పుడు మీరు ఒక మంత్రం రాశారు ఒక కాగితం మీద ఏదో ఒక గురువు గారి గురించి దేవుడి గురించి రాసుకున్నారు దానికి మీరు ఓం గనక జపం చేయకపోతే అది మంత్రం కాదు ఒట్టి మాటే కాగితం మీద రాసినట్లే ఓం చేర్చగానే దానికి మంత్ర శక్తి ఏర్పడుతున్నది అది మంత్రమయం అవుతున్నది అంటే ఓంకారము ప్రథమాక్షరమైయున్నది ప్రథమ ధ్వని అయి ఉన్నది ప్రథమ శబ్దమై ఉన్నది కాబట్టి సృష్టి మొత్తం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఓంకారంభవ ఓంకారంభవ మూడు సార్లు అనాలి అది ఓంకారంలో నుంచే పుట్టది అంటే మూడు సార్లు అనాలంటే వ్రతం కాదు అది స్పష్టంగా స్పష్టంగా నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదులు అంటే అది ఆనందం అదే ఆనందం అది మాత్రమే ఆనందం లాగా ఓంకారాన్ని కూడా మనం మూడు సార్లు ఉచ్చరించాలని మనం చెప్పుకుంటాం మూడు మళ్ళీ జాగ్రదవస్థ నిద్రావస్థ సుషుప్తికి సమన్వయం చేసుకోవాలి అవస్థాత్రయం ఉంది కదా అవస్థాత్రయానికి కూడా ఓంకారం మూడు సార్లు ఉచ్చరించడం అనేది పదకొండు సార్లు దానికి చాలా లెక్కలు ఉన్నాయి ఇరవై ఒకటి నూట ఎనిమిది ఒక్కొక్క దానికి ఒక్కో ప్రమాణం ఉంది కాబట్టి ఇది ఓంకారం అనేది నిశ్శబ్దంలో నుంచి పుట్టింది దాని పుట్టుక అది మామూలుగా silence is god అంటారు కదా దాన్లో నుంచే ఇది పుట్టుకొని వచ్చింది వచ్చి ఏం చేసింది ఇది ఓంకారం లేకపోతే ఏమై ఉండేది అంటే ఏమీ అయ్యేది కాదు ఓంకారం ఉన్నది గనుక అన్నీ ఉన్నాయి ఓంకారం అనేటువంటిది ప్రాథమికమైన ఇప్పుడు foundation లేకుండా building కట్టలేం కదా కాబట్టి మంత్రానికి గాని శాస్త్రానికి కానీ మంచి ఉచ్చారణకి కానీ మంచి యజ్ఞానికి కానీ ఒక స్వాహాకారానికి కానీ దేనికైనా ఓంకారము ప్రథమమై ఉన్నది ఓంకారంలో నుంచే ధ్యానం వచ్చింది అంటారా ధ్యానం అంటే ఏంటి? కాదు కాదు ధ్యానం వేరు ఓంకార ధ్యానం వేరు ఓంకార ధ్యానాన్ని ప్రణవ ధ్యానం అని అంటాం ప్రణవ ధ్యానం అది వేరే ముందు ధ్యానం అంటే ఏంటో తెలిస్తే ఓంకార ధ్యానం వైపు మనం వెళ్ళొచ్చు మామూలుగా ధ్యానం అంటే ఏదో కాళ్ళు చేతులు కట్టేసుకోండి ముక్కు మూసుకోండి ఏదో మీకు అవి కనపడతాయి ఇవి కనపడతాయి రాముడు కనపడతాడు భీముడు కనపడతాడు ఇవన్నీ ఉన్నాయి అవి కాదు ధ్యానం అంటే ధ్యానమే ధ్యానం ధ్యా అంటే intellect మనకి తెలివితేటలు బుద్ధి దాని ద్వారా చేసే యానం అంటే ప్రయాణం ప్రయాణం ఎక్కడికి బయట ప్రయాణానికి రైళ్లు ఉన్నాయి విమానాలు ఉన్నాయి కానీ లోపలికి ప్రయాణం అంతర్గత ప్రయాణానికి వీలైనటువంటిది ధ్యానమే ధ్యానము అందుకనే శంకర భగవత్పాదులు చెప్తారు బ్రహ్మైవాస్మితి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని అంటాడాయన అంటే మనం అనుకోవాలట ధ్యానం యొక్క లాభం ఏంటి ధ్యానం ఎలా చేయాలో నూట ఎనిమిది రకాలు ఉన్నాయి అందులో ఏదో ఒకటి రెండు మిగిలినాయి ఇప్పటికి పన్నెండు మిగిలినాయి అందులో రెండో మూడో చేస్తున్నాం ఇక్కడ అసలు ధ్యానం చేసేది ధ్యానమా అంటే ధ్యానం చేసేది ధ్యానం కాదు ఏమీ చేయకపోవటమే ధ్యానం ఏదో చేస్తున్నాను అంటే నా మనస్సు ఉందిగా ఏదో ఆలోచన చేస్తున్నా ఏదో పని చేస్తూ ఉన్నా అంటే అది ధ్యానం కాదు మరి ధ్యానం అంటే cessation of thought ఆలోచనారాహిత్యం వైపు మనసును తీసుకొని వెళ్ళాలి అంటే కొన్ని వేల ఆలోచనలను ఐదు ఆరు ఆలోచనల దగ్గరికి తీసుకురాగలగాలి తీసుకొని వచ్చినట్లయితే అది కొంత ధ్యానంలో మొదటి స్థాయి ప్రాథమిక స్థాయి ఇందాక అన్నట్టు బ్రహ్మైవాస్మితి మనం ఏమనుకోవాలి అనుకుంటున్నాం కదా ఇందాకే అనుకున్నాం అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇవన్నీ నాలుగు అనుకుంటున్నాం నాలుగింట్లో ఇక్కడ కూడా నేను బ్రహ్మమునై ఉన్నాను నేను ఫలానా నా పేరు కాదు నా ఉద్యోగం కాదు నా స్థితి కాదు నా శరీరానికి ఉన్న అందచందాలు కావు నా కీర్తి కాదు ఏమీ కాదు నేను బ్రహ్మమునై ఉన్నాను ఉన్నాను అంటే బ్రహ్మం అంటే ప్రత్యేకంగా లేదు ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా అదే సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి దాన్ని వారు అలా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఈవేళ మనం ప్రత్యేకంగా ధ్యాన ప్రక్రియలోకి మన మనస్సుని కనుక్కొని మన అంతరాత్మని తట్టిలేపేటువంటి ఒక ప్రయత్నం చేస్తే దాని పేరు ధ్యానం దానికి ముందు మనం ఏం చేయాలి ఇప్పుడు దేవాలయం లోపలికి ఇక్కడికి వస్తాం మనం ఎంత ఖరీదు కానివి అండి చెప్పులు ఏం చేస్తాం ముడిచాల్సిందే బయట వదిలేసి వస్తాం ఒక చెప్పు అహంకారం రెండో చెప్పు మమకారం రెండు చెప్పులు అక్కడ బయట పెట్టే ఇక్కడికి రావాలి అంతేనా అంటే అక్కడ మన వినయాన్ని మనం మనం అంగీ శిరస్సు వంచుతున్నాం ఇక్కడ వచ్చేసాం అట్లాగే నేను బ్రహ్మమును అని అనుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన కలిగిన తర్వాత దానిలో మనస్సును స్థిమితం చేసుకుంటున్నటువంటి వేళ సద్వృత్యా మనోవృత్తులు మాట్లాడుకున్నాం మనసుకు వృత్తులు ఉంటాయి అని చిత్త వృత్తులు మాట్లాడుకున్నాం నిరోధిస్తే యోగం అనుకున్నాం మరి ఇదేమిటి సద్వృత్యా సత్ అంటే ఆత్మ ఆత్మ వృత్తులు అప్పుడు మనకి పరిచయం అవుతాయి ఆత్మ నీట నానదన్నారు నిప్పున కాలదన్నారు కుంగదు పొంగదు indivisible విభజించలేవన్నారు మళ్ళీ ఇదేం దానికి వృత్తులు ఎలా ఉన్నాయి అంటే వృత్తులు ఉన్నాయి ఏం వృత్తులు ఉన్నాయి అంటే మన చేతి గడియారంలో బ్యాటరీలో ఉన్నటువంటి శక్తి ఎట్లా ఎనర్జీ ఉన్నదో ఆత్మకు కూడా ఎనర్జీ potency ఉంటుంది potency ఒకటి ఉన్నది అని మనకు తెలుస్తుంది కామ్ గా కూర్చుంటే అహం అదే బ్రహ్మైవాస్మితి సద్వృత్యా రెండూ కలిగినప్పుడు మనకు ఒకటి తెలుస్తుంది నిరాలంబయతా స్థితి అంటే ఎవరి మీద ఆధారపడని ఒక స్థితి ఇప్పుడు మనం మామూలు ధ్యానాల్లో ఆధారపడే చేస్తున్నాం కదా అవును AC room కావాలి చెప్పే instructor కావాలి music కావాలి చాపలు కావాలి fanలు కావాలి lightsలు కావాలి లేదా అవీ వద్దు కావాలి వద్దు మధ్యనే ఇది నడిచిపోతున్నది నడిచిపోతుంది అంటే ఒక క్రతువు ఒక తంతుగా నడుస్తున్నది అట్లా కాదు సద్వృత్తులు ఎప్పుడైతే ఏర్పడతాయో నేను ఆత్మని అన్న భావన కలుగుతుందో నా పేరు నాకు గుర్తుండదునేను చదివిన చదువు నాకు గుర్తుండదు. నేను చేసిన ఉద్యోగము, నేను పొందిన పదవి ఏవీ గుర్తుండవు. నేను ఒక ఆత్మగా ఉన్నాను అనేటువంటి భావన కలుగుతుంది. కలుగుతుందా? అంటే కలిగిన వాడు చెప్తాడు కలుగుతుంది అని. ఇంకా కలగని వాడు కలుగుతుందేమో అని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నిస్తాడు. అసలు నమ్మకమే లేని వాడికి పద్యం అక్కర్లేదు శ్లోకం అక్కర్లేదు. శ్లోకం అక్కర్లేదు. అంతే కదా. అంతే. బ్రహ్మైవాస్మితి సద్వృత్యా నిరాలంబయతా స్థితి అంటే independence కాదు. స్వేచ్ఛ రావటం కాదు. నేను వీటన్నింటి నుంచి విముక్తుడిని అయిపోయినాను అనే భావన కాదు. దేనిమీద ఆధారపడని ఒక స్థితి. అద్భుతంగా కాదా అది? అవును. అది ఎంత గొప్ప స్థితి. మామూలు వాడికి వస్తుందా? కా-- ప్రతి వాడికి ఏదో ఒక ఆధారం కావాలి. ఇక్కడ అసలు నాకు ఆధారమే వద్దంటున్నాడు. ఎందుకని అంటే ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాన్మే. ఎవరు గురువు అంటే ఆకాశం వలె విస్తృతంగా ఉన్నాడట ఆయన. ఆయన శరీర ఆచ్ఛాదనంత దిగంబరుడు అంటే దిగంబరుడు అంటే నగ్నంగా ఉన్నవాడు కాదు. దిక్కులను అంబరంగా ధరించిన వాడు. దిగంబర దిగంబర శ్రీవాసవ లభదిగంబర పాడతారు కదా. అవును పాడతారు. అంటే దాని అర్థం అది. దిక్కుల అంబరం. దిక్కుల అంబరం. ఆకాశం అంతా దిక్కులన్నీ కూడా ఆయన్ని ఆవహించి ఉన్నాయి అని. కాబట్టి ఇటువంటి స్థితిలో వాడు ఉన్నప్పుడు అటువంటి వాడు ఆలంబేన విహీనం. ఆయన ఎవ్వరి మీద ఆధారపడలేడు. కానీ ఆయన అందరికీ ఆధారమై ఉన్నాడు. వ్యోమాభం ఆకాశంలో ఉన్నాడు. పరిపూర్ణం ఆకాశం అంటే మేఘాలున్నాయి, నక్షత్రాలున్నాయి, చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు. ఆకాశం శూన్యంగా కనిపిస్తున్న పూర్ణ స్థితి అది. పూర్ణ స్థితి. పూర్ణంగా కనిపిస్తున్న శూన్య స్థితి. మళ్ళీ ఆకాశం అంటే ఏంటి కాస్త చెప్పండి అంటే ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేకుండా పూర్ణంగా కనిపిస్తోంది. పూర్ణంగా కనిపిస్తూ లేనిదై ఉన్నది. కాబట్టి గురువు కూడా అంతే. పూర్నుడిగా ఉండాలి కానీ శూన్యుడై ఉండాలి. ఈయనకి ఏం అక్కర్లేదు. శూన్యంగా ఉన్నాడు. ఎందుకు శూన్యంగా ఉన్నాడంటే ఏమీ అక్కర్లేదు గనుక. అంతే కదా. ఏదన్నా కావాలి అన్నాడనుకోండి వాడు గురువు ఎట్లా అవుతాడు? గురువు కాడు. నెమ్మదిగా స్థాయి పల్-- పల్చబడిపోతుంది. కాకూడదు. ఏమీ అక్కర్లేని స్థితిలో ఉండాలి. కానీ ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః సత్యస్య బోధయా తత్సత్యమశ్రితావన్. నేను నేర్చుకున్నటువంటి జ్ఞాన సంపత్తిని అందుకోగలిగిన ఒక్క శిష్యుడు నాకు దొరికితే చాలు అనేవాడు గురువు అట. ఇంకొక మాట గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? గురువు అంటే ఏంటి అసలు? అన్నింటికంటే గురోరధికమ్. గురోరధికమ్. గురువును మించి ఇంకా అధికమైన వస్తువు లేదు. లేదు. అట్లా ఉండాలిగా. ఉండాలి. గురువు అని పిలవబడటం కాదు. పిలవబడటం ఒకటి అది అవతలి వాళ్ళు ఇచ్చే గౌరవం. కానీ గురువు స్థానంలో గురువుగా ఉండాలి అంటే తాను నిండుగా ఉండాలి, శూన్యుడై ఉండాలి. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం. శూన్యం అంటే ఏంటి గారు? పూర్ణం అంటే రెండు సున్నాలే కదా. రెండు సున్నాలే. శూన్యము అన్నా పూర్ణం అన్నా నిజానికి ఒకటి. పూర్ణమదః పూర్ణమిదం మీకు తెలుసుగా. అవును పూర్ణమదః పూర్ణమిదం. పూర్ణానికి వస్తే మళ్ళీ పూర్ణమే. మళ్ళీ పూర్ణానికి వస్తే అదే పూర్ణం. శూన్యంగా కనిపించేది పూర్ణం. పూర్ణంగా కనిపించేదే శూన్యం. ఇక తర్వాత ఏం లేదు. ఏం లేదు. సంపూర్ణంగా ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసేశారు. ఇక పోయడానికేముంది? పోస్తే ఒలికిపోతాయి. కదా. అసలు నీళ్ళే పోయలేదు. ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్నట్టు ఉన్నది. కానీ దాని నిండా గాలి ఉన్నది. కాబట్టి గురువు ఎలా ఉండాలి అంటే సంపూర్ణుడై ఉండాలి. సకల విద్యా ప్రావీణ్యాన్ని సంపాదించి ఉండాలి. ఒకరికి ఇచ్చినా గాని ఆయన దగ్గర తారకకూడదు. నిరపేక్షంగా ఇవ్వాలి. అదొక గని. గనిలో నుంచి ఎవరికీ ఏం కావాలి అది పట్టుకుపోతుంటే ఆనందపడాలి. ఇది నాది అన్నవాడు గురువు కాదు. నాకే అన్నవాడు గురువు కాదు. నాకిది లేకపోతే జీవితం సాగదన్నవాడు కూడా గురువు కాదు. అక్కర్లేదు. పరమేశ్వరుడు నీకేం కావాలో అది ఇచ్చాడు. అది ఇచ్చాడు. దాంతో ఉండు నువ్వు. అంతవరకే నీకు ఇచ్చాడు అనుకో. ఏం దాంతో ఉండు. కష్టమైనా, సుఖమైనా, ధనమైనా, విద్య అయినా, రోగమైనా మంది మనకే వచ్చి చేరుతుందండి. చేరుతుంది. ఇక్కడ కూర్చున్న గా. అది ఎక్కడ ఉన్నా. అనుభవించబడుతుంది. వచ్చి తీరుతుంది. అది ఇస్తాడు. స్వామి దగ్గరికి వెళితే కోరికలు తీరుతున్నాయా అని అన్నప్పుడు తీరుతున్నాయి. తీరుతున్నాయి. కానీ ఆయన ఎలా తీరుస్తున్నాడంటే నువ్వు అనుకున్నట్టు తీర్చటంలా. ఆయన అనుకున్నట్టు తీరుస్తున్నాడు. ఆయన అనుకున్నట్టు తీరుస్తున్నాడు. తీరని వాడెవ్వడు లేడు. అందరూ తీరే బయటకు వస్తారు. అది. కాబట్టి వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం. గురువు యొక్క స్వరూపం ఏమిటి అంటే నిశ్శబ్దమే. దీనికి ప్రమాణం ఏమిటి? దక్షిణామూర్తి. దక్షిణము, అమూర్తమైనటువంటి వాడు ఆయన. సర్వజ్ఞాన. సర్వజ్ఞాని. ఘనుడు ఆయన. అవును. కానీ ఆయన ఏం మాట్లాడటంలా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా పంచకోశాలకు లోబడి మాట్లాడుకుంటున్నాం. పంచకోశాలకు అతీతమైన తర్వాత వాదము లేదు. ఏమీ లేదు. వేదము లేదు. ఏమీ లేదు. ఏం లేదు ఖాళీ. అది గురువు. ఇప్పుడు ధ్యానంలో తురీయ స్థితికి చేరిన వాడిని చెప్పమంటే వాడేం చెప్పలేడు. చెప్పలేడు. అది ఎవరంతట వాళ్ళు అనుభవించాలి. ద్రష్టలు కావాల్సిందే. అంతే కావాలి. వాళ్ళంతట వాళ్ళు ఏమి పొందారో పొందారు. ఎవరూ ఏం చెప్పలేరు. అసలు వాళ్ళు చెప్పరు. చెప్పటానికేం ఉండదు గనుక. చెప్పటానికి ఏదో ఉంది నాకు రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అంటే నువ్వు అక్కడ ఆగావు. అంటే నువ్వు ఆజ్ఞా చక్రానికి లోబడి సంచారం చేస్తున్నావు. కనిపించినవాడు రాముడే అని నీకెలా తెలుసు? అంతే కదా. నువ్వు రాముడిని చూస్తే ఆయన్ని ఏన్నైనా పోల్చుకోవచ్చు. కాదే. కాబట్టి ఏమీ లేకపోవటం. నిరాలంబయతా స్థితి. ధ్యాన శబ్దేన విఖ్యాతః పరమానందదాయి. ఇక్కడ గురు శబ్దంలో పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాన్మే. గురువుని చూడగానే బ్రహ్మమును గురించి నేను ఇంత యాతన పడుతున్నానో, ఇంత స్వాధ్యాయం చేశానో, ఇంత శాస్త్ర విజ్ఞానాన్ని పెంచుకున్నానో అది గనక ఒక ఆకారం తాలిస్తే అది ఈయన. ఈయన గురువు. ఈయన గురువు. గురువు అంటే అది. అది తెలియక మన మీ ఇష్టం వచ్చినట్టు ఆకారాలు మనం తెచ్చుకుంటున్నాం. మనం ప్రతి ఆకారానికి గురువుని తగిలిస్తున్నాం. గురువుని తగిలిస్తున్నాం. కాదు కాదు. నిరాలంబయతా స్థితి ఏర్పడితేధ్యా దానిని మాత్రమే ధ్యానము అనమన్నారు భగవత్పాదులు. ప్రౌఢానుభూతి అనేటువంటి దాంట్లో "బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత" అలా చెప్పబడుతుంది దానిని ధ్యానము స్థితి రావాలి. మీరు ఓంకార ధ్యానం చెప్పారు కదా తనవ ధ్యానం అని ఓంకార ధ్యానంలో ఓంకారం అనుకుంటూ ఉండడమా లేకుంటే సైలెన్స్ వచ్చేంతవరకు అనుకుంటూ ఉండడమా లేకుంటే మూడు సార్లు అనేసి మొదలయ్యలా? కాదు కాదు ముందు ధ్యానం అంటే పూర్తవ్వాలి కదా అవును ధ్యానం అయితే ఇది చివరికి కడగా ఏమిస్తుంది ఇటువంటి ధ్యానం ఏది బ్రహ్మము అని అనుకున్నాం బ్రహ్మం సద్వృత్తులు ఏర్పడ్డాయి ఎవరి మీద ఆధారపడని పరిస్థితి ఏర్పడింది ఆమెన్ దాన్ని నేను ధ్యానం గనక అనుకుంటే అది నాకు ఏమిస్తున్నది అంటే పరమానందదాయని. బ్రహ్మానందాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావో అది ఇవ్వగలిగినటువంటిది ఇది ధ్యానం ధ్యానం ధ్యానానికి వెనక మూడు గనక conditions నువ్వు achieve చేయగలిగితే పొందగలిగితే ఉత్తీర్ణుడివి అయినట్లయితే అది నిజంగా ధ్యానము అనబడుతుంది. ఇప్పుడు ఓంకార ధ్యానం ఓంకార ధ్యానం అనేది ధ్యానం ముందు. ధ్యానంలో అనేక మార్గాలున్నాయి నూట ఎనిమిది విధాల. మొదట్లో నిజానికి పదకొండు వందల ధ్యాన ప్రక్రియలు దేశంలో పాటించబడ్డాయి ఉన్నాయట ఒకప్పుడు అయితే అవి కాలగమనంలో నెమ్మదిగా వెనక్కి వెళ్లి కొన్ని కఠినమైనవి కొన్ని గాలిని కుంభించటం అందరి వల్ల కాదు హఠ యోగం చేసి అందుకనే శంకర భగవత్పాదులు చెప్తారు "సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మన్యతమం లయానాం" అంటారు. ఒక లక్షా ఇరవైఏడు వేల లయోగాలు ఉన్నాయట. అందులో నాదానుసంధాన యోగం గొప్పది అని చెప్తారు. అంటే అక్కడికి ఒక దాంట్లోనే లక్షా ఇరవైఏడు వేలు అదిగాక ఇంకా కఠ యోగం ఉంది హఠ యోగం ఉంది మఠ యోగం ఉంది మున్మనీ యోగం ఉంది మనోన్మనీ యోగం ఉంది అనేకమైనట్టు రాజయోగం ఉంది ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ధ్యానము అనబడేటువంటి మనకు మూడు conditions తెలిసినాయి కదా అవును అప్పుడు అక్కడి నుంచే మనం ధ్యానం వైపు వెళ్ళాలి. ఇవాళ జరుగుతున్న ధ్యాన ప్రక్రియలను పక్కన పెట్టండి. ఇవి కావు ఇవి కావు ఇవి కావు ఇవి కేవలం ప్రచారానికి ఉపయోగపడే ధ్యానాలు. కానీ ఇవి కూడా అసమగ్రం అసంపూర్ణం. దాన్ని పక్కన పెడితే ధ్యానంలో ఓంకార ధ్యానము సర్వోత్కృష్టమైనది అనేది ఒక మాట ఉన్నది. మ్ ఎందుకని? దానికి కారణం ఏంటంటే "ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ" అనేటువంటి మాటలో అక్షరము అంటే letter అని కాదు ఈలు కాదు అది. నాశనము లేనిది అని అర్థం. నాశ క్షరము అంటే నాశనము క్షరము అంటే నాశనము క్షరము నాశనం కానిది నాశనం లేనిది నాశనం కానిది ఏది? ప్రకృతి నాశనం అవుతుంది మార్పు చెందుతుంది అవును పరా సృష్టి ఏదైతే ఉన్నదో మూలం ఏదైతే ఉన్నదో అది నిత్యమూ సత్యమూ శాశ్వతం సచ్చిదానందం సచ్చిదానందం. స్థితికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇదిగో ధ్యానంలో గనక నువ్వు ఉన్నట్లయితే ధ్యానం చేయటం అనే పదం తప్పు. ధ్యానిగా నీవు గనక ఉండగలిగినట్లయితే అది ఎవరు చేస్తారు? చేస్తున్నది ఎవరు? ప్రశ్న. అంతేనా? అంతే మనం కూర్చుంటాం. దానికి అనువైన ప్రదేశం కావాలా? ఏసీ హాలు కావాలా? ఏం అవసరం లే చెట్టు కింద కూర్చుంటా-- ధ్యానం అనేది అనుగ్రహించబడేది అంతే మీరు కూర్చుంటే ఎక్కడో చోట ముందు నువ్వు కూర్చో అనుగ్రహించబడుతుంది ముందు స్థిమితంగా కూర్చో స్థిమితంగా కూర్చో కూర్చుంటే నీకు స్థితి ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అంటే నువ్వు మనం దాహం వేస్తుంది ప్రయాణం చేస్తున్నాం మంచి నీళ్ళ సీసా లేదు మన దగ్గర ఎక్కడా మంచి నీళ్ళు దొరకటం లేదు దొరకటం లేదు ఎక్కడో చిన్న నీటి చలవం కనిపించింది. మనం అక్కడికి వెళ్ళాం. పైన తెట్టు ఏర్పడింది. మనం నీళ్ళు తాగాలంటే ఏం చేస్తాం? తెట్టుకు తీస్తాం తెట్టు తొలగిస్తాం. తొలగిస్తే అడుగున స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి దానిని గనక పానం చేసినట్టయితే అది ధ్యానం ధ్యానం అంటే ప్రాపంచికమైనటువంటి వాసనామయమైన జగత్తులో ఒక నేను నాది అన్న అహంకార మమకార బంధితమైనటువంటి ఒక మనస్సుని పైదానిని తేటగా తెల్లంగా చేసి అదే తేటతెల్లం అంటే. తేట తీసేయాలి పైది. తెల్లగా కనపడాలి. లోపల ఉన్నటువంటి మహా శుద్ధ చైతన్య స్థాయి ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు గనక ముందు చూడగలిగితే ఆపై దర్శించగలిగితే పైన పానం చేయి అంటే తాగగలిగితే దాన్ని నువ్వు అనుభవించగలిగితే అది ధ్యానం అవుతున్నది. గురువు గారు చాలా బాగా ఓంకారం గురించి ఓంక-- అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎలా చేయాలి? ఉమ్ సైలెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ చాలా బాగా చెప్పారు గురువు గారు. అవును ధన్యవాదాలు. శుభం శుభం ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం. చూశారు కదా మౌనవ్యోగ పరిచిత్ లో ఓంకారం గురించి దాని యొక్క ధ్యానం గురించి ఓంకార యొక్క అసలు తత్వం గురించి బీజాక్షరాలు గురించి అది ఎలా చేయాలి సైలెన్స్ లోనే ఎలా చేయాలి ఉచ్-ఉచ్చరించడంలో కాదు సామూహికంలో కాదు ఏకాంతంగానే మనం పరమాత్మను దర్శించగలిగే స్థితి తెలుసుకోవాలి అని గురువు గారు మనకి సవివరంగా చెప్పారు. ఇది ఈనాటి మంత్రమయమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.
YouTube · audio

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 135

Home

Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 135

Source: SVBC TTD on YouTube

0:00 / 27:51

More in this series

Manthramahima (with Y. Swarna Latha Reddy)

4 episodes · 1 hr 44 min

  1. 19 min 133

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 133

  2. 19 min 134

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 134

  3. 23 min 135

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 135

    Now playing
  4. 23 min 136

    Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 136