No transcript for this section.
Transcript begins at 0:00.
అమ్మ శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ గా భారతదేశం చక్కగా ఒక పర్వదినంగా చేసుకుంటూ, పాఠశాలలో మనకు "ఓం నమశ్శివాయ" అని పాఠం మొదలుపెట్టి అంటే విద్యాారంభం చేసినటువంటి గురువు దగ్గర నుంచి జీవితంలో తారసపడ్డ అనేకానేక గురు సమూహాలు అందరినీ కూడా మనం మరొక్కసారి స్మరించుకుంటూ, మహాత్ములు, మహర్షులు, జ్ఞానులు, జిజ్ఞాసువులు, తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు అనేకమైనటువంటి విధాలుగా భారతీయ ఆత్మను ఆవిష్కరించేటువంటి దిశగా ఈ ప్రవాహం సాగుతూనే ఉంది. అయితే ఎన్ని పర్వదినాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ గురుపూర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటి పూర్ణిమ. కారణం వ్యాసులవారు వచ్చేదాకా అంటే వ్యాసులవారికంటే ముందు త్రేతాయుగంలో రాముడికి ఇద్దరు గురువులు. లోకగురువు లేదా అస్త్ర గురువైనటువంటి విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి. జ్ఞానగురువు అయినటువంటి వశిష్ఠుల వారు మరొక గురువు. త్రేతాయుగం కంటే ముందు ఇద్దరు గురువులు ఎవరినీ వాళ్ళు మార్గోపదేశం చేశారు వాళ్ళకంటే దేవగురువైన బృహస్పతి, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. ఆ తర్వాత వ్యక్తిగతమైన గురు శిష్య బాంధవ్యాలు మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. ఒకవేళ ఉన్నా అవి కథా కథనంగా సాగిపోయినాయి. ద్వాపర యుగంకి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ కేవలం ఒక్క గురువు దగ్గర అతి కొద్దికాలం సందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఇక ఆ తర్వాత కలియుగం వచ్చిన తర్వాత అనేకమంది గురువులు ఏర్పడ్డారు. ఈ అనేక గురువులందరూ కూడా మనం ఎంత చెప్పుకున్నా వ్యాసుల వారు, ఆ తర్వాత ఆ శంకర భగవత్పాదులు, ఆ తర్వాత వారికంటే ముందు యోగేశ్వర కృష్ణుడు ఇట్లా అనేకమంది పురుష రూపంలో ఉన్నటువంటి గురు స్వరూపాలను మాత్రమే మనం తలుచుకుంటూ ఉంటాం. అయితే మరి స్త్రీ గురువు కాదా? ఇక్కడ ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఇందాక ఆ మీరందరూ అనుకున్నట్లు మనకు తెలిసినట్లు అమ్మ ఒక ప్రకటన చేసింది. ఏ ప్రకటన చేసింది? నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు అని. అది మరుగుగా ఉండటం అమ్మ యొక్క అవతార విధానం కాబట్టి నేను గురువుని మీరు శిష్యులు అంటే దూరం పెరిగిపోతుంది అనేటువంటి భావనతో అమ్మ అన్నదే తప్ప అమ్మ నిజానికి గురువు. ఎట్లా? నిజంగానేనా? మరి అమ్మే అన్నదిగా నేను గురువుని కాదు, నేను తల్లిని మీరు బిడ్డలు అన్నది అంటే అది మనల్ని కాస్త జోకొట్టి, కాస్త మాయలో పెట్టి మన పనులు మనం చేసుకున్నట్లు గా తనకు ఒక దగ్గరగా అంటే సాలోక్య, సామీప్య, సాన్నిధ్య అనే మూడు స్థితులను అనుగ్రహిస్తూ నెమ్మదిగా సాయుజ్యం వైపు నడిపించేటువంటి ఒక ప్రణాళిక అమ్మ నిర్వచించుకుంది, రచించుకుంది కూడా. కాబట్టి మనం చాలా ఆ అమ్మ అన్నది కాబట్టి అమ్మ గురువు కాదని అనుకోకూడదు. అసలు అమ్మే గురువు. ఎందుకని అంటే శ్రీ లలితా సహస్ర నామాన్ని దాని మూలాలను గనక మనం వెతికినట్లయితే ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, అగస్త్యుడు, లోపాముద్ర అలాగే కుబేరుడు, త్రిమూర్తులు, త్రిమాతలు వీళ్లందరికీ గురువు ఎవరంటే శ్రీ లలితా దేవి. తెల తెలవారేటువంటి ఆ సుప్రభాతం చిత్త నవప్రభాత వేళకు ముందుగా వీరందరూ ప్రతిరోజూ శ్రీ లలితా దేవి ముందు నిలబడి, అమ్మా! నీవు సృష్టించిన ఈ జగత్తంతా నడవటానికి నిన్న కొంత శక్తి ఖర్చైపోయింది అనేక విధాలుగా కాబట్టి మళ్ళీ ఆ శక్తిని పూర్తి చేయటానికి, పూరించటానికి నీ అనుగ్రహం కావాలి అని అమ్మని ప్రార్థిస్తారు. అటువంటి ఆ అమ్మ ఎవరు అంటే జగజ్జనని అయినటువంటి శ్రీ లలితా దేవి. శ్రీ లలితా దేవి, రాజరాజేశ్వరి ఇవన్నీ ప్రత్యామ్నాయ నామాలు కాబట్టి అసలు ఎవరు అంటే మూలము తల్లే తొలి అని అమ్మ చెప్పింది. అలాగే మనందరికీ కూడా తల్లే ప్రథమ గురువు. కాబట్టి ఇవాళ ఈ గురుపూర్ణిమ నాడు ప్రత్యేకంగా మన అందరి తల్లులకి కూడా మనం మనసా, వచసా, శిరసా నమస్కరిద్దాం. ఎందుకంటే తల్లి లేకపోతే తనువు లేదు. ఈ తనువు ఏర్పడటానికి తన గర్భాలయంలో మనల్ని తొమ్మిది నెలలు మోస్తూనే మనకి ఒక సంస్కారాన్ని, ఆపై సంస్కృతిని, ఆపై పరమాద్భుతమైనటువంటి దివ్య భావనలని అందిస్తూ తన ఊపిరిని మన ఊపిరితో కలిపి శృతి లయాత్మకమైనటువంటి ఒక భావ ప్రపంచంలో మనల్ని తొమ్మిది నెలలు అక్కడే నిలబెట్టి, ఆపై బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మళ్ళీ ఆ సంస్కారాన్ని మరిచిపోకుండా తన చనుబాలతో, ఉగ్గుపాలతో రంగరించి రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది పౌరాణిక వాంగ్మయాన్ని లాలి పాటలతో, లాలనతో, ఆలనతో, పాలనతో, అదలింపుతో, మందలింపుతో మనందరికీ ఒక వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసేటువంటి ఆ తల్లికి ప్రథమ వందనం మనం చేద్దాం ఇవ్వాళ. అది, అది మాతృదేవోభవ అంటే. అంటే భగవంతుడు మాతృమూర్తియై వెలుగొందుతున్నాడు అని అర్థం. అంతేతప్ప తల్లే దైవం అని కాదు. దైవమే తల్లిగా వచ్చింది అని అర్థం చేసుకున్నట్లయితే ఆ దైవం పరదైవతం అయినటువంటి అమ్మని ఆ ఇందాక.చెప్పినట్లుగా మరి అమ్మని ఎలా చూద్దాము అని అర్చా మూర్తిగా చూద్దామా ఆరాధనా స్ఫూర్తిగా చూద్దామా ఆ అమ్మ ఏం చదువుకోలేదు కాబట్టి శాస్త్రాలు ఏమి తెలియదు కాబట్టి అంటే ప్రత్యేకంగా తెలియదు కాబట్టి అమ్మ అందుకని తల్లిగా ఉండాలని నిర్ణయించుకున్నదా అని ప్రశ్న వేసే వారికి నా అనుభవం నా దర్శనం ప్రత్యేకం ఎందుకంటే గురువులు కేవలము బోధ గురువులు మాత్రమే కాదు సూచక మోచక వాచక నిషిద్ధ మంత్ర దీక్ష విహిత కారణ అనేటువంటి ఈ గురువులందరూ ఉన్నారు. ఈ గురువులందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో తత్వం ఉంది ఇది మహా సుదర్శన చక్రం అయినట్లయితే ఏ గురువు ఇంకో గురువుతో మనం పోల్చడానికి వీలు లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క aspect తో వస్తారు ఆ aspect ను మనకు పరిచయం చేసి మనని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు గనుక అమ్మను నేను ఎలా దర్శనం చేశాను అనేదాన్ని ఇవాళ మనం మాట్లాడుకుంటూ తల్లి అయినటువంటి విశ్వ జనని అయినటువంటి జగజ్జనని అయినటువంటి అమ్మకి ప్రణమిల్లుతూ ఈ విషయాలన్నీ కూడా కాస్త ముచ్చటించుకుందాం. గురువులు అంటే కేవలం శంకరులు రామానుజులు మధ్వులు మధ్వాచార్యుల వారు రమణ మహర్షి వీరు మాత్రమే కాదు గురు స్వరూపంగా లలితా దేవి ప్రమాణం ఉంది కలియుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై రెండవ తారాల్లో ఇరవై ఒకటి అయిపోయినాయి గనుక ఇరవై రెండవది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు సంవత్సరాల తర ఇరవై ఏడు వేల సంవత్సరాల తర్వాత వచ్చే కల్కి అవతారం కాబట్టి ఈ లోగా అనేకమైనటువంటి అవతార స్వరూపాలు వస్తూ ఉంటాయి కానీ ఈ జగజ్జనని ఆ తాను ఎంచుకున్నటువంటి ఈ కాలం ఈ కలికాలం అంటారు నేను దానిని కలికి కాలం అని పేరు పెట్టుకున్నా. ఆ కలికి ఎవరంటే పలుకు కలికైన సరస్వతి అమ్మ అవుతున్నది సర్వ శక్తులు ఇచ్చే అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు మూడు ఇచ్చేటువంటి దుర్గ కూడా అమ్మ అవుతున్నది అలాగే పరమ రమణీయమైనటువంటి లౌకిక జ్ఞానాన్ని పారలౌకిక జ్ఞాన ధారని అందించేటువంటి పార్వతీదేవి కూడా రమాదేవి కూడా అమ్మే అవుతున్నది గనుక త్రిమాతలు మూడు ఎక్కడ ఉన్నాయి అంటే అదిగో అక్కడే ఉన్నాయి. కనుకనే ఈ త్రిమాతల ముగ్గురినీ కూడా వారికి కూడా ఆనందాన్ని కలిగించి అత్రి మహాముని అత్రి అంటే మూడు కానివాడు ఒకటి అయినవాడు అని అర్థం అత్రి మహాముని యొక్క భార్యగా వచ్చినటువంటి నాటి ఆ అనసూయాదేవి యొక్క తత్వాన్ని అంటే అసూయ లేని తత్వాన్ని అసూయ లేకపోతే ఉండేది ప్రేమే కాబట్టి ప్రేమ తల్లి యొక్క లక్షణం కాబట్టి ఆ లక్షణాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి బహిర్ బహిర్గతం చేస్తూ తన దివ్యత్వాన్ని తన గురుత్వాన్ని మరుగున పెరి మరుగున విధానమైన అమ్మే ప్రకటన చేసింది కాబట్టి ఆ కోణంలో కూడా దర్శనం చేసినట్లయితే మనం అమ్మని ఎంతవరకు చూస్తామో అంతవరకు కనబడుతుంది. కానీ అమ్మను దర్శనం చేయటానికి సాధన కావాలి అది నిరంతరమైనటువంటి ఒక అభ్యాసం అంతేకాదు ధ్యాన ధారణ సమాధి స్థితులు దాటిన మహాయోగంలో గనక నెలకడ చెందగలిగితే అప్పుడు అమ్మ మనకు సంపూర్ణంగా గురువుగా అర్థమవుతుంది. అమ్మని నేను అమ్మ అమ్మే అని అన్నది నేనే అమ్మ దేవతగా భావిస్తే దూరం అవుతుందని అనుకున్నది నేనే కానీ గురువుగా నా జీవితంలో ఎలా ప్రవేశించింది ఎలా నడిపించింది అనేటువంటిది ఇవాళ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అవన్నీ సంఘటనలు కావు ఒకటి సూచక గురువు అమ్మ ఉపన్యాసాలు ఇవ్వలే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళని ఆపల కాబట్టి తాను ఏం చేసిందంటే అనేకమంది అమ్మ దేహంలో ఉన్నప్పుడు రోజు ఒక పదివేల మంది అమ్మ దగ్గరికి ఉన్నట్లయితే అందరినీ ఆ మాతృభావనతో దగ్గర తీసుకొని చెవిలో చెప్పిందో చేతిలో పెట్టిందో గుండెకి హత్తుకుందో తల నిమిరిందో బుగ్గలు తాకిందో కన్నీరు తుడిచిందో ఏం చేసినా ఆ మాతృ మహా స్పర్శ లోనుంచి వాడికి కావలసిన సూచన చేసింది. మనకి సూచన చేయగలిగిన వాడు సర్వోత్తమమైనటువంటి గురువు. ఆ సూచన ఏమిటంటే కష్టంలో నుంచి బయట పడేయటానికి ఒక సూచన మహా ఆనందాన్ని పట్టరాని సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి ఆ మేఘం నుంచి కిందకు దిగి వచ్చేట్లుగా నువ్ ఇట్లా ఉంటే బాగుంటుంది నాన్న అని చెప్పగలిగినటువంటి ఒక సూచన గనుక నేను ఆ పన్నెండవ ఏట అమ్మ మంచం చుట్టూ అనేకమంది అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ గమనించినప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఈమె సూచక గురువు అని. అంతే కాదు సూచక గురువు అట్టి సౌజన్యం చేస్తే అందరికీ అర్థం కాదు గనుక అమ్మ వాచక గురువు రెండు విషయాలు చెప్పింది, అంతా వాడే చేస్తున్నాడు అనుకో నాన్న అంది. ఆ వాడే ఎవరంటే సర్వాత్మ అయినటువంటి పరమాత్మ. వాడికి రూపం లేదు. వాడు ఈ భూలోకంలోకి పంచభౌతిక దేహం తీసుకుని వస్తే రూప నామాలు భావాలు తత్వాలు ఏర్పడతాయి. కానీ రూప-- నామ రూప భావ తత్వాలకు అతీతమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అమ్మ గనుక అమ్మ వాచక గురువై మాట మాట్లాడింది. మాట్లాడుతూ అమ్మ మాటల్లోనే గీత దాటి నేను ఏం చెప్పాను నాన్న అన్నది. రెండర్థాలు శ్లేషార్థంలో వాడింది. ఎ-ఎవరు ఏ పండితుడు వాడగలడు? గీత అంటే భగవద్గీతను దాటి నేను మాత్రం ఏం చెప్పాను నాన్న అని ఒక అర్థం. రెండవది గీత దాటి ఏదీ చెప్పలేదన్నది. అంటే సనాతన ధర్మం అనేదానికి లోబడి మాత్రమే వైదికమైన భారతీయమైనటువంటి ఆర్ష ధర్మానికి లోబడి మాత్రమే నా నుంచి ఏ మాట వచ్చినా బయటకు వచ్చింది అన్నది. కనుక అమ్మ వాచక గురువు. అంతేకాదు అనేకమైనటువంటి శాస్త్రాలు సంస్కృత భాషలో.దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు సామాన్య మానవుడు అందుకోలేని స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు తేట తెలుగులో అచ్చంగా అంటే ఒక శాస్త్రాన్ని ఏకవాక్యంతో పూర్తి చేసింది. ఉదాహరణకి బృహదారణ్యకోపనిషత్తులో ఒకే ఒక్కమాట ఉన్నది. ఆ మాట ఏమిటంటే ఉన్నదంతా బ్రహ్మం అనేది ఉపనిషత్తులు మొత్తం చెప్పినాయి. కానీ బృహదారణ్యకం ఏం చెప్పిందంటే మనసే దైవం అని చెప్పింది. అమ్మ దానిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి భావనే భగవంతుడు నాన్న అంది. అంటే నువ్వు ఉన్నావు అనుకుంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు. నువ్వు ఎట్లా ఊహిస్తే వాడు అట్లా నీకు కనపడతాడు నాన్న అని దాని అర్థం. కాబట్టి భావనే భగవంతుడు అనేది ఒక బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క సారము రెండు మాటలలో పుదిగి ప్రపంచానికి ఇచ్చింది. అట్లా అమ్మ ఒక్కొక్క మాట వాటిని విశ్లేషించుకుంటూ గనక వెళ్లినట్లయితే అవన్నీ కూడా తైత్తరీయము అదే దశోపనిషత్తులలో అమ్మ ఏం చెప్పిందో అవన్నీ ఉన్నాయి గనక అమ్మ నా దృష్టిలో వాచక గురువు. అంతే కాదు మోచక గురువు కూడా. మోచక గురువు మన దృష్టిలో పౌరాణిక గతమైనటువంటి అంటే శాస్త్రపరంగా చూసినట్లయితే దక్షిణామూర్తి మోచక గురువు, పరశివావతారం. మోచకము అంటే విమోచనం చేసేవాడు అని. ఏ ప్రాపంచిక బంధనాలలో మనం ఇరుక్కుపోయి ఉన్నామో, దేని నుంచి బయటపడలేక బయట ఉన్నటువంటి గురువులను ఆశ్రయిస్తూ ఉన్నామో వాళ్లందరి దగ్-- అందరి భావాన్ని తాను తీసుకొని మోచకం చేసింది. అంటే ఏమిటి? ఎక్కడ ఇరుక్కుపోయినామో దాన్ని సడలించింది. ఆ ముడి విప్పి దాన్నుంచి మన మార్గాన్ని సరళతరము, శుభగతరము, సౌందర్యవంతము, ప్రసన్నము, హాయి అయినటువంటి స్థితిలో అధ్యాత్మ ప్రస్థానాన్ని కొనసాగించేట్లుగా చేసింది. కాబట్టి సూచక, వాచక, మోచక. ఇక నిషిద్ధ గురువు Do's and Don'ts ఇవి చెయ్యి, అవి చెయ్యద్దు అని చెప్పేవాడు కూడా గురువే. ఏది చేయాలో చెప్పటం కంటే ఏది చెయ్యకూడదో చెప్పటం సర్వోత్తమమైనటువంటి స్థాయి. ఎందుకంటే ఏది చెయ్యకూడదో తెలిస్తే ఏది చేయాలో దానంతట అదే మనకు అర్థమవుతుంది గనుక అమ్మ అపరోక్షానుభూతిగా సమస్తమైనటువంటి జనులకి వాళ్లందరికీ కూడా ఆ-ఆ మార్గోపదేశనం చేసింది గనుక అమ్మ నిషిద్ధ గురువు. అంతే కాదు దీక్షా గురువు. నువ్వెళ్లి అక్కడ అభిషేకం చేసుకో లేకపోతే ఇక్కడేదో ఆ పని చేసుకో, ఈ పని చేసుకో లేకపోతే పొలం వెళ్లి పని చేసుకో లేదు నా చాట, చీపురు, రోకలి, రోలు ఇవన్నీ నా ఆయుధాలని ఎట్లా చెప్పిందో అంటే ఎంత సరళంగా చెప్పిందంటే ఈ ప్రపంచంలో బ్రహ్మము కానిదంటూ ఏమీ లేదు దాన్ని అర్థం చేసుకోండి అని చెప్తూ దీక్షా గురువుగా అనేకమందిని ఆ మంచి మార్గంలో నడిపించింది. ఆ పైన మంత్ర గురువు. మళ్ళీ ఇప్పుడే ఒక ప్రస్తావన జరిగింది మాఘ పౌర్ణమి నాడు కాలాన్ని స్తంభింపజేసి వేలాదిమందికి ఏకకాలంలో ఒక ఉపదేశం ఇవ్వటం మామూలు సంగతి కాదు. అట్లాగే రాజమ్మ గారికి అమ్మని కలిసి అమ్మకి ఉపదేశం చేద్దామనుకున్నటువంటి రాజమ్మ గారికి అమ్మే ఉపదేశం చేసి తాను ఏమీ ఎరగనట్లుగా బయటకు వచ్చిన వైనం అమ్మ భక్తులందరికీ తెలుసు ఆ కథ. అంటే అమ్మ దీక్షా గురువు మాత్రమే కాదు మంత్ర గురువు కూడా. ఏ గురువు కానిదేక్కడ? ఇక విహిత గురువు. ఏం చేయాలి? కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు మానవుడితో ముడిపడి ఉన్నాయి గనుక సత్కర్మలు చేయాలి, సదాలోచన చేయాలి, సమ్యక్ సంకీర్తన చేయాలి. అదే వేళ మనం పాడుకునే జై హో మాతా. ఎంత నిరంతరమైనటువంటి సంకీర్తన జిల్లెళ్ళమూడిలో వినిపించేది మైకుల ద్వారా Twenty four by seven అని వేళ ఏది అంటున్నామో అది ఒక జిల్లెళ్ళమూడిలో ఆ రోజుల్లో వినిపించేది. ఆ అరవైల నుంచి సుమారు ఒక ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాలు. నిరంతరం ఇప్పుడు కూడా ఆ నామం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మంత్ర గురువు అయిన తర్వాత ప్రపంచానికి ఒక నామ సంకీర్తన ద్వారా, సదాచారం ద్వారా, ఒక క్రమశిక్షణ ద్వారా అది మానసిక క్రమశిక్షణ ద్వారా ఒక సామూహికమైనటువంటి స్థితిలో అమ్మ చెప్పిన మాటే అందరి కోసం ఒక్కడుండాలి, ఒక్కడి కోసం అందరూ ఉండాలి ఇది జీవితం నాన్నా అని చెప్పింది. అంతే కాదు అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు అని చెప్పింది కూడా అమ్మే. అది రమణ మహర్షి ఇంకో భాషలో చెప్పినా అమ్మ తర్వాత సినిమా కవి అనుకున్నామని జరగవు అనే అమ్మ మాటలే పాటలుగా ప్రపంచమంతా కూడా వ్యాపించినాయి. కాబట్టి ఆ వాచక, మోచక, సూచక, నిషిద్ధ, దీక్షా, మంత్ర గురువుగా అమ్మని మనం భావన చేస్తే అమ్మ నా దృష్టిలో ఒక పరిపూర్ణమైనటువంటి గురువు. అయితే అమ్మ సంప్రదాయవాదయా, సంప్రదాయాన్ని ధిక్కరించిందా, సంప్రదాయాన్నే సంస్కరించిందా అంటే కొడుకులు లేనివారు మరణించినట్లయితే కూతుళ్లు దహనకాండ చేయవచ్చునని చెప్పి చేయించింది గోపాల కృష్ణ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారి అమ్మాయి చేత. అది ఆనాటి సమాజంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సాధ్యమేనా అని అనిపిస్తే అమ్మ సుసాధ్యం చేసింది. కాబట్టి ఆ గురువు అనేటువంటి ఇట్లాగే ఉంటే గురువు అని మనకెక్కడా లేదు. ఈ వేషం వేసుకున్నవాడే గురువు అని కాదు, కాషాయం కట్టినవాడే అని కాదు, రుద్రాక్షలు పెట్టుకున్నవాడే అని కాదు, అంతరంగ స్పర్శ చేసి లోక లోకాంతర ప్రాణాలను తడిమి మనలో ఉన్నటువంటి ఒక సంస్కార ధారని బయటకు తీసుకొచ్చి సర్వజనామోద పూర్వకంగా అందరి యందు సర్వజనహితంగా చేసేటువంటి ఒకానొక స్థితి విహితమైనటువంటి గురువు. ఇక కారణ గురువు. కారణ గురువు ఎవరు అంటే ఇదిగో నువ్వు జన్మ ఎందుకెత్తి వచ్చావ్?ఈ జన్మను నువ్వు ఎలా నడిపిస్తున్నావు? నువ్వు చేయవలసింది ఏమిటి? దేనిని తెలుసుకోవాలి? దేనిని తెలుసుకుంటే ఇక తెలియబడవలసినది అంటూ లేదో? వీటన్నింటినీ కూడా తన జీవన విధానం ద్వారా గృహస్థాశ్రమానికి అమ్మ పచ్చతోరణం కట్టింది. తాను విరాగి కాదు, తాను యోగిని కాదు, తాను మరొకటి మరొకటి కాదు, ఒక సంపూర్ణమైనటువంటి శ్రీ లలితా దేవి యొక్క భావనా స్థితి ఏదైతే ఉన్నదో, ఎవరు శ్రీ లలితా దేవిని ఉపాసన చేసి ఆమె దర్శనాన్ని కోరి దర్శనానంతరం ఒక అనుభూతిని మిగుల్చుకుంటారో, దానికై జన్మ యావత్తు కూడా శ్రమ పడతారో అటువంటి ఆ భావమే ఒక మూర్తియై, బొమ్మయై, సగుణమై, స్వభావమై, స్వరూపమై, అమ్మై, బొమ్మై మన ముందు నిలబడింది. ఇలా గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అమ్మ నిజానికి కారణ గురువు. సద్గురువు కాదా? అమ్మ గురువు అని ఎవరు certify చేయక్కర్లే, అమ్మ గురువే. మన తల్లి భౌతికమైనటువంటి biological mother మనకి ఎట్లా తల్లో, ఇక్కడ biology ని దాటి అన్నింటినీ దాటి సర్వజనామోద యోగ్యమైనటువంటి ఒక భావనలో తల్లిదనాన్ని తన మీద తాను తీసుకుని అంటే మాతృత్వాన్ని తాను స్వీకరించి ఈ జగత్తుకి తల్లి కావటం మామూలు విషయం కాదు. జగత్తంతా ఆమెను త-అమ్మగా భావించటం కూడా సాధ్యం కాదు. కానీ అమ్మ విషయంలో అది సాధ్యమైంది. ఎప్పుడు? అనేకమైన మాధ్యమాలు, అనేకమైన సాహిత్యాలు ఏర్పడిన ఈ రోజుల్లో కాదు, బాగా వెనకబడిన ప్రాంతం అయినటువంటి అర్కపురిలో అంటే జిల్లెళ్ళమూడి వంటి చిన్న కుగ్రామంలో నుంచి అమ్మ తన ప్రస్థానాన్ని పరమాద్భుతంగా సాగించి కొన్ని వేల లక్షల మందికి జ్ఞాన వరదానం చేసింది. అంతే కాదు ఇంకా ఇద్దరు గురువులు మిగిలారు. నిజానికి ముగ్గురు గురువులు మిగిలారు. ఎవరంటే ఒకడు లోకగురువు వ్యాసులవారు, రెండవ ఆయన జగద్గురువు కృష్ణ పరమాత్మ, తర్వాత సద్గురువు అనేక దక్షిణామూర్తి. దక్షిణామూర్తితో పాటు ఈ కాలానికి చెందినటువంటి ఆ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సాక్ష్య-సాంఖ్యం చెప్పిన కపిలుడు. దత్తాత్రేయుడు. ఇటువంటి వారందరి యొక్క ఈ కోవని మనం గనుక తీసుకున్నట్లయితే ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇవ్వటానికి మాత్రమే ఈ లోకంలోకి వస్తారు. ఈ జ్ఞానం మనకిచ్చిన తర్వాత మనల్ని చాలా చక్కగా నడిపించి మనం మామూలుగా ఏదో పూజలు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యోగాలు, యాగాలు చేసుకుంటూ అదే spirituality అనుకుంటాం. అది కానే కాదు. ఏమిటి అంటే భగవంతుడైనా సరే, మాధవుడైనా సరే, మాధవి అయినా అమ్మ అయినా సరే సంపూర్ణ మానవత్వంతో ఉంటేనే, అందుకనే If one is totally humane he or she is divine. ఆ మానవత్వపు కోణం గనుక లేకపోయినట్లయితే మనం లోకగురువుగా సంచారం చేయలేం. ఈ లోకగురువు ఈ లోకంలో ఎలా బతకాలో, ఏం చేయాలో, యా విహిత కర్మ అంటే ఏమిటో, ఆ అకర్మ, సుకర్మ, వికర్మ అంటే ఏమిటో ఇవన్నీ చెప్తూ మనల్ని నడిపించేవాడు విహిత గురువు అయినట్లయితే, లోకగురువు అయినట్లయితే, సద్గురువు ఆత్మ విచార మార్గంలోకి మనల్ని నడిపించేవాడు సద్గురువు. ఏది ఉన్నా, ఏది చెప్పినా, ఎంత చెప్పినా అదంతా కూడా సద్గురు స్థానంలోకే వస్తుంది గనుక ఎన్ని విషయాలు చెప్పినా మనల్ని మళ్ళీ ఆత్మ విచారణలోకి తీసుకుని వెళ్తాడు. అది ఆ అతడు సద్గురువు అవుతున్నాడు. ఇక జగద్గురువు ఎవరు అంటే కంచి మహాస్వామి వారు ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. అది అమ్మకి ఇక్కడ మనం apply చేయాలి. లోకమంతా అమ్మని గురువు అనుకుంటే అమ్మ లోకం కూడా నాకు గురువేనంది. అంటే దత్తాత్రేయుడు ఎట్లాగైతే లోకంలో ఇరవై నాలుగు మంది గురువులు అన్నారో, ఈ లోకము-లోకాన్ని గురువుగా భావించిన వాడు జగద్గురువు ఎట్లా అవుతున్నాడో అమ్మ అనేక సందర్భాలు మనకున్న సమయంలో ఒక్క విషయం నాకు గడియారం చూట్టం చేతకాదు నాన్న అని అందరి ముందు అన్నప్పుడు నువ్వు కాల స్వరూపిణివి అని వీళ్ళు కవితాత్మకంగా అమ్మని వర్ణించినప్పుడు, నిజం చెప్తున్నాను నమ్మండి నాకు ఆ కాలం అంటే తెలియదు, time చూట్టం తెలియదు గడియారంలో అని అమాయకంగా కూర్చున్నప్పుడు వీళ్ళు దాన్ని నమ్మి ఆ మరగు గుర్తుపెట్టుకోల చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు అమ్మ దానికి ఇచ్చినటువంటి, ఇవాళ భాషలో finishing touch అంటారే అది ఏమిటంటే ఆ వెలుగు రేఖ, ఆ సంపాలత, ఆ ఇంద్రాణి, ఆ మెరపు తీగ ఏమిటంటే, నాన్నా మీరంతా పైకి అనిపిస్తున్నది ఒకటేమో second ముల్లు, ఒకటేమో minutes అంటున్నారు, మూడోది గంటలు చూపిస్తుం-అంటున్నారు, మరి ఈ మూడింటిని నడిపిస్తున్నది ఎక్కడన్నా ఉంది నాన్నా లోపల అంటే బ్యాటరీ ఉన్నది అన్నది. మరి కనపడనివిదే అంతా, కనపడని బ్యాటరీయే మన కాలాన్ని నడిపిస్-చూపిస్తున్నప్పుడు కనపడని పరమాత్మ కూడా మనకి అట్లాగే నడిపిస్తున్నాడు ఈ జగత్తుని అని ఒక అద్భు-అద్భుతమైనటువంటి అద్వైత భావనా భూమికలో నెలకొల్పి చెందింది. అది అమ్మ యొక్క పరిపూర్ణమైన తత్వం. ఇంకొక్కటి మాతృత్వానికి ఒక సంకేతం. మనందరం జల్లెడ ముడి బళ్ళు కట్టుకొని వెళ్ళొచ్చు గాక. కొన్ని వేల లక్షల మంది అమ్మ దగ్గరికి వెళ్ళి స్వాంతన చెంది ఉండొచ్చు గాక. అందరికీ ఉపశమనం అమ్మ అనుగ్రహించి ఉండొచ్చు గాక. కానీ తన దాకా రాలేని వారి కోసం అమ్మ ఇంటింటికీ వెళ్ళింది. ఆ ఇంటింటికీ వెళ్ళింది దేశంగాని దేశం వెళ్ళింది. అరుణాచలంలో చలం అక్కడ ఉంటే ఆయనకు వయస్సు వచ్చేసిందని అమ్మ అక్కడి దాకా వెళ్ళి దర్శనం ఇచ్చి వచ్చింది. అంటే ఈ గురువు కేవలము భౌతిక గురువు మాత్రమే కాదని నేను నా పరంగా అమ్మని ఆంతరంగికంగా దర్శనం చేసుకొని ఈ అరవై సంవత్సరాలు జీవితం అంతా కూడా అమ్మ ఆంతరంగికమైన గురువుగా బయటకు అమ్మే అమ్మ అమ్మేగా అమ్మని దైవంగా చూసినప్పుడు ఆ నాకు చాలా దూరము, భారము అనిపిస్తుంది. ఈ రెండింటిని జాతి...హృదయ స్థానంలో నిలుపుకోగలిగినట్లయితే అమ్మ మనకు నేర్పిన అనేకమైన మార్దవమైన లలితమైనటువంటి మానవీయమైనటువంటి భావాలన్నీ కూడా మన వ్యక్తిత్వంలో జోరబడి మనలో గనక ఏ లోపాలున్న వాటన్నింటినీ బయటకు నెట్టి వాటినే మనకు బలాలుగా శక్తులుగా మనకు అనుగ్రహం చేస్తుంది గ-కనుక ఇవాళ నా దృష్టిలో ఈ ఆషాఢ పౌర్ణమి ఇవాళ అమ్మని నేను అనుభవించిన గురువుగా కష్టంలో సుఖంలో అదృష్టవశాత్తు కష్టాలేం లేవు సుఖమూ కాదు జీవితమంతా ఒక ఆనంద మహా ప్రవాహంగా సాగిపోతున్న వేళ దీనిని నడిపిస్తున్న చోదక శక్తి ఎవరు అనుకున్నప్పుడు పౌరాణికమైన మైథలాజికల్ గా గనక ఆలోచిస్తే శ్రీ లలితా దేవి దేవీ దేవతలకు మూలమైన చిచ్ఛక్తి అయినట్లయితే నాకు జిల్లాల్లమూడి అమ్మ లేదా అమ్మ. అమ్మ ఒక గురు స్వరూపిణిగానే నేను భావన చేశాను. అమ్మ ఎట్లా సంప్రదాయాన్ని సంస్కరించిందో శంకర భగవత్పాదుల తల్లి ఆర్యాంబ ఆమె ఆయనకు బ్రహ్మోపదేశం చేసింది. అంటే ఈ జగత్తుని స్త్రీమూర్తులంతా కూడా గురుస్థానంలో నిలబడి ఏ రకమైన పటాటోపం లేకుండా మరుగుపరచుకొని వారికున్నట్టు వాళ్ళు ఏర్పరచుకున్న పరిమితులకు లోబడి అపరిమితమైన అనంతమైన అవ్యయమైన అచ్యుతమైనటువంటి ఒక మహా ఆనంద ప్రవాహాన్ని ఈ ప్రపంచానికి అందిస్తూనే జన జాగృతం చేశారు. ఈ జన జాగృతము జన కళ్యాణము రెండూ ఏకకాలంలో చేసి ఒకే ఒక్కసారి ఒక లక్ష మంది అన్నం తింటుంటేనే చూడాలి అన్నటువంటి ఆ కోరిక ఉన్నదే అది తల్లితనమే తప్ప అన్యం కాదని భావిస్తున్నా. అదేదీ ఒక హిస్టారిక్ గిన్నిస్ బుక్ లో మనం రాయదగిన విషయం కాదు. ఏమిటి అంటే ఒక తల్లి ఏమి కోరుకుంటుంది? బిడ్డ ఆకలి తీరాలి, వాడు కంటినిండా నిద్రపోవాలి, జీవితంలో స్థిరపడాలి, వాడి మనసు స్థిమితంగా ఉండాలి, వాడు గృహస్తుగా ఉండాలి. అందుకే అమ్మ సన్యాసాశ్రమ స్వీకారం చేయటానికి వచ్చిన వాడితో అన్న మాట గుర్తు పెట్టుకోవాలి. ఆమె గురువు కాకే-గురువు కాకపోతే ఆ మాట అనుండేది కాదు. సన్యాసాశ్రమం స్వీకరించడమేంటి నాన్నా సన్యాసిగా ఉండటం కదా ప్రధానం అన్నది. మళ్ళీ ఆశ్రమము దానికో కొమ్ము దానికో మళ్ళీ చుట్టూ దాని ఏర్పడే పారాఫర్నేలియా ఇది కాదు మానసికంగా సమన్యాసం చేయాలి అని చెప్పింది అమ్మ. అటువంటి అమ్మకి అమ్మని ఇవాళ తలుచుకునేటువంటి ఒక మహదవకాశాన్ని జిల్లాల్లమూడి ఆ సోదరీ సోదరులు నాకు కల్పించినందుకు నేను అమ్మని ఎలా భావించానో మీ ముందు ఆవిష్కరించే ఒక ప్రయత్నం చేశాను. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనందరం కూడా సమర్చన చేసుకోవాలి. తల్లితనానికి మనం గొడుగు పట్టాలి. తల్లిని మాతృస్వామ్య వ్యవస్థలో పుట్టిన ఈ భారతీయ ఆత్మ నెమ్మదిగా పురుషాధిక్య సమాజంలోకి వెళ్లిపోయింది గనుక ఆ స్థితి నుంచి మళ్ళీ మాతృస్వామ్య వ్యవస్థ రావాలి. ఎందుకంటే ఒక్కొక్క మాతృమూర్తి ఒక్కొక్క వీరుడిని తయారు చేసింది. ఛత్రపతి శివాజీ, ఒక మహాత్మా గాంధీ, అంతకంటే ముందు కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడికి "అమ్మా నాయనా అరణ్యానికి వెళ్తున్నాను పదహారేళ్ళు కనపడను నాకేమిటి మార్గోపదేశం చెయ్"మని అడిగితే "ధర్మో రక్షతి రక్షితః" నువ్వు ధర్మాన్ని ఆచరించు నాన్నా ధర్మమే నిన్ను రక్షిస్తుందని కౌసల్యాదేవి చెప్పింది. కాబట్టి రామాయణ కథాకాలం నుంచి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే ఈ మాతృమూర్తులంతా కూడా తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా ఒక సన్మార్గోపదేశనమే మహా మంత్రంగా కేవలం వాళ్ళు పెట్టిన ముద్దలు ఒట్టి అన్నపు ముద్దలుగా కాక జ్ఞానాన్నంగా, పట్టిన చనుబాలు కేవలం చనుబాలు మాత్రమే కాక ఒక సంస్కార జీవధారగా నేను భావన చేస్తూ అటువంటి మాతృమూర్తికి విశ్వజనునికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు, శుభాకామనలు తెలియజేస్తూ మంగళాశాసనం చేస్తూ జై హో మాతా.
YouTube · audio
Speech - on Guru Pournami 2021
Speech - on Guru Pournami 2021
Source: AMMA TATVA SANDESHAM on YouTube
0:00 / 28:25