Skip to content
Transcript తెలుగు
మహాత్ములంతా వెళ్లిన ఎందుకని వెళ్లారు వారి దగ్గరికి? అంటే వారు అంతవరకు చేసుకున్నటువంటి సాధన పూర్ణం అయ్యిందా? కాలేదా? ఇంకా ఏదైనా మిగిలి ఉన్నదా? అని తెలుసుకోవటానికి తాము ఎరిగిన దానిని ఆత్మావలోకనం వైపు ఆత్మసాక్షాత్కారం వైపు కడగా ఆత్మగా సంస్థితం కావటానికి మార్గం ఎలా ఉంటుంది? మార్గాన్ని రమణులు ఎట్లా బోధిస్తారు అని చెప్పి విని దానిని ఆచరించి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయికి వెళ్లేటువంటి పరమోదారమైనటువంటి వ్యక్తులందరూ కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి దగ్గరకు వెళ్లటం ఆరంభించారు. అయితే పటాటోపము లేని ఒక పూర్ణ గురువుగా ఒక సద్గురువుగా తనను తాను ప్రకటించుకోకుండా ఒక జ్ఞానమూర్తి వలె దక్షిణామూర్తి వలె ప్రపంచంలో ఒక జ్ఞాన స్వరూపిగా నిలబడినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక కాలాలకి అంటే నిజానికి ఒక శంకరులు, ఒక రమణులు, ఒక బుద్ధుడు అనేకమైన సాంప్రదాయ రీతులలో ఉన్న మహా గురు పరంపర మహా యోగుల యొక్క ప్రవాహం ఇది ఒక అనంత వాహిని. ఇది అఖండ భారతావని ఆసేతు సీతాళచలం చేసుకున్నటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి భావన కనుక ఇక్కడ పరమ పురుషులంతా కూడా ఆయా కాలాలలో వచ్చి ఆయా జాతులు అనుభవిస్తున్నటువంటి వైక్లబ్యాన్ని విషాదాన్ని వారిని బయట పడేసి మళ్ళీ ధర్మ మార్గం వైపు నడిపించే దిశగా నడిపించినటువంటి వారు గనుక కోవలో భగవాన్ శ్రీ రమణ మహర్షి జ్ఞాన మార్గోపదేశం చేశారు. నిజానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక స్వర్ణయుగం ఏర్పడింది. స్వర్ణయుగం ఒకవైపు అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి మరొక్క వైపు పాండిచ్చేరిలో అరవింద మహా యోగి, శృంగేరిలో చంద్రశేఖర భారతి స్వామి వారు, కంచిలో పరమాచార్య చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామి వారు, అటు శ్రీ రామకృష్ణ పరమహంస మరొక్క వైపు వివేకానందుడు. అఖండ భారతావని మహాత్ములైనటువంటి వారు గురు స్థానంలో ఉండదగినటువంటి వారు, గురువులైనటువంటి వారు ఆత్మసాక్షాత్కార భావనని తమ జీవన విధానంగా మార్చుకున్న వారు సనాతనమైన, వైదికమైన, ఆర్యషమైన, భారతీయమైన ఒక తత్వ సిద్ధాంతాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించి ఆధ్యాత్మిక సుసంపన్నతని, ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ప్రపంచానికి వరదానం చేశారు. కారణంగానే భారతదేశం గురు స్థానంలో నిలబడగలిగింది. గురుస్థానీయమైనటువంటి భారతదేశంలో ఇవాళ గురువులంతా కూడా ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా, ఎన్ని రకాల విశ్లేషించినా, వ్యాఖ్యానించినా కొన్ని కాలాతీతమైనటువంటి భావనలు ఉంటాయి. కాలాతీతము అంటే కాలంలో చెల్లిపోయినవి కాదు, అన్ని కాలాలకు వర్తించేటువంటివి గనుక రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, శంకర వాంగ్మయం ఇవన్నీ కూడా కాలాతీతమైనటువంటి ఒక దివ్య భావనా గరిమ. అందులో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేకమైనటువంటి విషయాలపై వారు వ్యాఖ్యానం చేయవలసి వచ్చినప్పుడు చేశారు. అట్లా మురుగనార్ అనబడేటువంటి ఒక భక్తుడు తాను అనుభూతి సారము అని ఒక పుస్తకాన్ని రాసుకొని వస్తే భగవాన్ యందు ఉన్నటువంటి అమిత విశ్వాసం చేత, భక్తి ప్రపత్తుల చేత భగవాన్ చేతికి పుస్తకాన్ని ఇచ్చి "దీనిని ఎలాగైనా ఒక్కసారి చూడండి" అని అడిగినప్పుడు లోకోపకారి, కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి రమణులు విషయాన్ని పరిష్కారం చేశారు. అనుభూతి సారము అన్న మాట కొట్టివేసి ఉపదేశ సారము అని పేరు పెట్టారు. ఎందుకంటే అనుభూతి మాటలకు అందేది కాదు, అనుభూతి లిపికి లొంగేది కాదు, అనుభూతి ప్రశ్నోత్తరాలకు అది సందేహ సమాధాన పరంపర కాదు. మరి ఏమిటి అది అంటే ఉపదేశ సారమే. ఉపదేశనం కావాలి ఉప అంటే దగ్గరగా దేశ అంటే భావనకు అతి సన్నిహితంగా ఉండేటువంటి ఒక మార్గం చెప్పాలి. ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. మార్గాన్ని అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి జ్ఞాన మార్గం అంతా ఆత్మ విచార ధారకు లోబడినటువంటిది గనుక కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని ఒకసారి ఒక మాట అడిగారు. "భగవాన్ ప్రపంచంలో అందునా భారతదేశంలో ఎన్నో అందమైన కొండలు, కోనలు, వాగులు, వంకలు ఉన్నాయే, అతి రమణీయ ప్రదేశాలున్నాయే, ఇవన్నీ వదిలిపెట్టి వేసవి కాలంలో యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటువంటి రాళ్ళు రప్పలతో కూడినటువంటి అరుణాచలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు?" అన్నప్పుడు భగవాన్ తమ దగ్గర ఉన్నటువంటి ఒక కాగితం తీసుకుని దానిమీద పెన్సిల్ తో అరుణాచలం యొక్క కొండ సానువులన్నీ కూడా ఒక ఔట్ లైన్ బొమ్మగా గీసి కింద రాశారు. "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది" అని. అంటే చిదంబరంలో నటరాజస్వామి దర్శనం కన్నా, తిరువయ్యూరులో జన్మ ఎత్తటం కన్నా, కాశీలో గంగాస్నానం కన్నా అరుణాచల శివ అంటే చాలు పరముక్తి లభిస్తుంది. ఇది నీకు రాళ్ళు రప్పలతో కూడిన కొండగా కనిపిస్తున్నదా? ఇది అట్లా కాదు. కరుణామృత జలధి కరుణ అనేటువంటి ఒక అమృతం అనేటువంటి సముద్రం అమృత సముద్రం గనుక అంటే మృతి లేని, చావు లేని, మార్పు ఎరగనిఅనాహతమైన అనంతమైన అవ్యయమైన అప్రమేయమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది అరుణాచలం అని ఎరుగరాదా అన్నారు భగవాన్. అటువంటి రమణ మహర్షి అరుణాచలానికి వచ్చిన కొత్తల్లో అరుణాచలాన్ని గురువుగా భావించారు కొండని గురువుగా భావించారు. కొండని గురించి మాట్లాడుతూ అరుణాచలమనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. తన మీదే భావాన్ని పెట్టుకొని నేను నేను అన్నటువంటి అహం లో నుంచి నాది నాది అన్నటువంటి మమకారంలో నుంచి నాకు మాత్రమే చెందాలన్న దురాశ పేరాశలలో నుంచి విముక్తమయ్యేటువంటి మార్గం కావాలి అంటే అహాన్ని వదిలిపెట్టాలి. అహం ఎక్కడిది అని విచారణ చేస్తే అహం మనస్సు యొక్క by product. అలాగే మనసు కూడా అహం యొక్క ఛాయ. దీనిని ఒక తీవ్రమైనటువంటి విచార ధారలో భగవాన్ శ్రీ రమణ మహర్షి తమదైనటువంటి దివ్యానుభవాన్ని ఆధారం చేసుకొని తాము పొందినటువంటి ఆత్మాభవ-- ఆత్మానుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని భగవాన్ శ్రీ రమణులు ఇదిగో మురుగనార్ కి అనుభూతి సారాన్ని ఉపదేశ సారంగా ఉపదేశనం చేశారు. ఉపదేశ సారం ఒక కాలాతీతమైన అద్భుత వాంగ్మయం. అతి సరళమైన అతి సుందరమైన సూటియైన గంభీరమైన అలతి అలతి సంస్కృత పదాలతో సుమారు ముప్పై శ్లోకాలలో సాగే ఉపదేశ సారం సార్వకాలికము విశ్వజనీనం. అది కేవలం భారతీయులకు మాత్రమే కాక మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికీ కూడా ఒక మార్గాన్ని ఉపదేశనం చేస్తుంది. అటువంటి ఉపదేశ సారం ఇవాళ ఎవరికో జ్ఞానులకో పండితులకో శాస్త్రవేత్తలకో శాస్త్రాధికారం ఉన్నటువంటి వారికి మాత్రమే కాక ఇవాళ ఆధునిక యువత Globalization, Liberalization, Consumerism, Commercialization అనబడేటువంటి భావాలతో కొట్టుమిట్టాడుతూ పొత్తిళ్ళ నాడే ఒత్తిళ్ళకి గురవుతున్నటువంటి ఒక జాతిని ఒక ముక్-ముక్త జాతిగా ఒక భద్ర జాతిగా ఒక భక్త జాతిగా ఒక తత్వ జాతిగా రూపాంతరీకరణం చేయటానికి అంటే వ్యక్తి తనలో ఉన్న అనేకానేక సందేహాలకు సమాధానాలను పొంది అంటే సమాధాన పడక సమాధాన పడటం అంటే compromise. అది చేయకూడదు. సమాధానం పొంది అంటే జీవితంతో adjust కావాలి. వీటన్నింటినీ కూడా ఇవాళ యువత ఉపదేశ సారాన్ని కేవలం ఒక పారాయణ గ్రంథంగా కాక పారాయణ ఖండంగా కాక దీనివలన చదువుతూ చదువుతూ ఉంటే ముక్తి వస్తుందనే ఆలోచన నుంచి మనస్సుని బయట పడేసుకుని తాము ఎదుర్కుంటున్న లేదా తాము గడుపుతున్న లేదా తాము నడుపుతున్న ఆపై తాము జీవిస్తున్న జీవితానికి ఒక అర్థము పరమార్థము ఒక సార్ధకత లభించేటువంటి రీతిలో తమ జీవితాలని సమున్నతమైనటువంటి స్థాయిలో భారతీయ తత్వ సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి ఒక సహ-సహజమైన జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించుకునేటువంటి దిశగా తమ జీవితాలని తమ మనుగడలను చక్కగా సాగించుకోవటానికి భగవాన్ రమణుల ఉపదేశం, సారం గ్రహించగలిగినట్లయితే The quint essence of the teachings of భగవాన్ శ్రీ రమణ మహర్షి. అదంతా కూడా ఉపదేశ సారంలో నిక్షిప్తమై ఉన్నాయి. అనేక సందేహాలు, దేహం ఉంది కదా! మనస్సు ఉంది కదా! అనేక ఆలోచనలు. కొన్ని కావాల్సినవి, కొన్ని అక్కరలేనివి, కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి, కొన్ని హాని కలిగించేవి, కొన్ని ప్రయోజనాన్ని చేకూర్చేవి. అనేకమైనటువంటి భావాలన్నింటినీ కూడా తాత్వికమైనటువంటి ఒక చింతనా స్ఫూర్తితో అంటే మానవుడికి మూడున్నాయి. ఒకటి చితి ఇది తప్పదు. రెండవది చింత ఇది తప్పదు. మరి తప్పనిది ఏది? మరొకటి మూడో dynamics అంటాం అది చింతన. చితి ఇదిగో దహయతీతి దేహః. ఎప్పుడైనా దహింపబడేది గనుక దీనికి దేహం అని పేరు. చితి ఎక్కనివారు దానిని ఎవరు తప్పించుకోలేరు అంటే మరణం తధ్యం. సరే. చింత జీవితంలో చాలా ఉన్నా చింతే, ఏమీ లేకపోయినా చింతే. ఏదో కావాలి అన్న మరుక్షణమే చింత ప్రారంభమవుతుంది. వస్తువుని పొందేదాకా చింత ఉంటుంది. ఆపై మోహం ఏర్పడుతుంది. మోహంలో నుంచి వ్యామోహం ఏర్పడుతుంది. వ్యామోహంలో నుంచి బంధం ఏర్పడుతుంది. బంధనంలో నుంచి బాంధవ్యం ఏర్పడుతుంది. చివరకు అది కడగా వ్యసనంగా మారుతుంది. అంటే బయటపడటానికి వీలు లేనటువంటి ఒక దుస్తర-- దుష్కరమైనటువంటి ఒకానొక పరిస్థితిలో మనస్సు ఇరుక్కుపోయినప్పుడు బయటకు రాలేని పరిస్థితి తెలిసినప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళటం మాత్రమే తెలిసి మరలి తిరిగి రాకుండా ఎట్లాగైతే తన ప్రాణాలు కోల్పోయినాడో అట్లాగే ఇవాళ జీవుడు మనస్సు అనబడేటువంటి ఒక వస్తువుని ఆధారం చేసుకొని ప్రపంచం అనేటువంటి పద్మవ్యూహంలోకి అడుగుపెట్టి మళ్ళీ తాను ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో, ఎక్కడ ఉంటే తనకు ఆనందం కలుగుతుందో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రధానంగా ఇవాళ సమకాలీన ఆధునిక ప్రపంచానికి సుఖాలకి ఏం తక్కువ లేదు. సంతోషమే కాస్త కరువైంది. అప్పుడప్పుడూ సంతోషం కలిగినా అది ఆనందంగా భ్రమిస్తున్నాం. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. సుఖం శరీరానికి సంబంధించింది. సంతోషం మనసుకు సంబంధించింది. ఆనందం హృదయానికి సంబంధించింది.అంటే ఇవ్వాళ పాశ్చాత్యులంతా body, mind, soul అని వాడుతున్నారే మాటలన్నీ ఇక్కడివే. ఇక్కడివే లో మనం సుఖానికి అలవాటు పడిపోయినాం. అప్పుడప్పుడు సంతోషం పొందుతున్నాం. దాన్నే ఆనందం అనుకుంటున్నాం. మరి ఆనందం అంటే ఏమిటి అని ఆలోచించినట్లయితే అది మనుష్యానందం అని, మనీషా ఆనందం అని, మానవ గంధర్వా ఆనందం అని, దేవ గంధర్వా ఆనందం అని, పితృ పితా ఆనందం అని, ప్రజాపితా ఆనందం అని, కడగా హిరణ్యగర్భ ఆనందం అని అనేకమైనటువంటి స్థాయిలలో ఆనందాన్ని మనం అనుభవించాలి. ఎందుకంటే మనమంతా కూడా నిజానికి ఆనంద స్వరూపులం. కనుకనే మనకు ఆనందం కావాలి. శాంతి స్వభావుకులం కనుక శాంతిని మనం కోరుతాం. రెండూ వదిలిపెట్టి మనం ఇంకేదో పొందాలి అంటే వస్తువుని పొందాలి అన్న ఆలోచన కలిగినప్పుడు వస్తువు తాలూకు అన్ని దుఃఖాలను మనం అంగీకరించవలసిందే. వస్తువుని దాటి సద్వస్తువుని గనక వెతుక్కోగలిగినట్లయితే సద్వస్తువు ఏది అన్న విచారణలో ఆత్మ అనేటువంటి ఒక భావన కలిగినప్పుడు పురా సంస్కృతిలో అంటే అతి ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఆత్మను గురించిన విచారణ వేదకాలం నుంచి అంటే వేదం పుట్టినప్పటి నుంచి ఉన్నది అని. వేదకాలం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాలమంతా వేద స్వరూపమే. మధుశ్చ మాధవశ్చ వాసంతీకావృతై అదే వేదం. అంటే కాలము వేద స్వరూపము, వేదము కాల స్వరూపము. అందుకనే కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలత్రయాతీతాయ నమః అని మనం కాలానికి నమస్కరిస్తాం. అటువంటి కాలం దేశకాల కరణా విచిత్ర చిత్రీకృతం అన్నటువంటి భావనలో ఈనాటి పరిస్థితులలో ఆనందాన్ని ఎట్లా పొందాలి, సుఖం నించి శరీరాన్ని కష్టం వైపు, ఆనందం వైపు, కర్మ, భక్తి, జ్ఞాన, యోగాల వైపు ఎట్లా నడిపించాలి అన్నటువంటి ఒక విచారధార మానవుణ్ణి తొలుస్తూనే ఉన్నది. వేద ప్రామాణికమైనటువంటి ఆత్మ విచారధార నిజానికి శంకర భగవత్పాదుల సమయానికి వచ్చేసరికి, నిజానికి శంకర భగవత్పాదుల కంటే ముందు ద్వాపరాంతంలో మహాభారత సంగ్రామ వేళ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీతలో ఆత్మ నీట నానదని, నిప్పున కాలదని, అది కుంగదని, పొంగదని, లొంగదని, వంగదని అనేక రీతులలో ఆత్మను గురించి చెప్తూ ఆత్మను నేను అన్నటువంటి భావనలో నిలకడ చెందించుకోమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. [భక్తి సంగీతం]
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -02

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -02

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:54

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

    Now playing
  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77