Skip to content
Transcript తెలుగు
అర్థతాత్పర్యాలు చెప్పటానికి భాష తెలిస్తే చాలు. భావాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే అందుకున్నంతవరకు చెప్పగలుగుతాం. అనుభూతిని పంచాలి అంటే తీవ్రమైనటువంటి తత్వచింతన కావాలి. దానిని ఎరగాలి. దేనిని అని. దేనిని ఎరిగితే తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో దానిని ఎరగాలి. ఇక ఆపై ఏం లేదు అది తత్వదర్శనం అంటే. చిత్తానికి తత్వదర్శనం అలవాటు చేయాలి. చిత్తం అనేక సంచితాలతో కూడి ఉన్నదని అనేక జన్మలుగా పేరుకొని చోటికి వచ్చిందని అది ఒక రూపం తీసుకున్నదని మనం అనుకుంటూ ఉన్నాం. అటువంటి చిత్తాన్ని తత్వం వైపు నడిపించాలి అంటే దానికి చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ లో మనం అనేక సందర్భాలలో మూట అనే మాట వాడాం. మూట మనం విప్పటం మొదలు పెట్టాలి. జన్మాంతరమైన కొన్ని సంస్కారాలు మనకు తెలుసు మన మనసుకి. సంస్కారాల యొక్క పోగు ఏదైతే ఉన్నదో గంప ఏదైతే ఉన్నదో అది చిత్తం అనుకున్నట్లయితే అంటే మనలో దాగి ఉన్నటువంటి చీకటి కోణాలు The unknown self, The darker self, The known self మూడు దాటి Real self లోకి మనం వెళ్ళాలి. మనం ఉన్నాం. దీన్ని జోహారి అనేవాడు జోహారి Windows అని పెట్టాడు దానికి పేరు. Known self ఇగో ప్రపంచానికి మనం ఎవరో తెలుసు స్థూలంగా తెలుసు. ఎర్రగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు, సన్నంగా ఉంటారు, ఆయనకి ఇన్ని degrees లు ఉన్నాయి, ఆయన ఇన్ని పుస్తకాలు రాశారు, ఆయన జ్ఞాన సరస్వతి. ఇవన్నీ పైన కనిపించేవి. Unknown self ఒకటి ఉంది. దాని వెనక దాగినటువంటి ఒక self. అది ప్రపంచానికి అంత తేలిగ్గా అర్థమయ్యే self కాదు. నిజానికి మనోమయుడు అయినటువంటి మానవుడికి self కూడా అర్థం కాదు. ఇక మూడవ పార్శ్వం ఉంది That is called the darker self. అది ఎవరికీ తెలియదు. darker self లో మనల్ని మనం అతిగా ఊహించుకుంటాం. మనం చాలా గొప్ప వాళ్ళమని మిగతా వారికంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తులమని మనకున్నంత knowledge, మనకున్నంత శక్తి, మనకున్నంత డబ్బు, మనకున్నంత అందం ఇంకెవరికీ లేదని darker self లో సంపూర్ణ తమోగుణంతో కూరుకుపోయి ఉంటాం. ఇక మనసుకి ఆలోచన పుట్టే అవకాశం లేదు. వేరే ఆలోచన. అదే ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రపంచం అంతా తన వల్ల బాగుపడుతున్నదని తానే కర్త అని భావించే తమోగుణం కూడా అక్కడే ఉన్నది. ఇక్కడ జీవుడు సాధకుడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే Known self ప్రపంచం నీ గురించి ఏమన్నా అనుకోని అది దాని భావన దానికి వదిలేద్దాం. నిన్ను మంచివాడు అంటున్నది పొద్దున్న సాయంకాలానికి అదే ప్రపంచం నన్ను చెడ్డవాడు అంటుంది. మంచివాడివో చెడ్డవాడివో నీకు తెలిస్తే నువ్వు అట్లాగే ఉండిపో చెడ్డవాడివి అయితే మారు మంచివాడివి అయితే మంచితనాన్ని నిలబెట్టుకో. Known self is public That's called public self. ఇక రెండవది Unknown self ఉంది. Unknown self మనల్ని ఎక్కువ భాగం నడిపిస్తుంది నిజానికి. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఏమి అక్కరలేదో తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు, విచక్షణ లేదు, వివేకము లేదు, ఔచిత్యము లేదు. నిజానికి జీవితమే సున్నా. ఇది ఒక Unknown self. మూడింటితో పాటుగా జోహారి చెప్పని ఇంకోటుంది That is called pseudo self. మనల్ని మభ్యపెట్టేటువంటి ఒక మా మనసు యొక్క పార్శ్వాలిక్కడ self అనే మాట వాడినా ఇదంతా మనసు లక్షణాలే self కి ఇన్ని self లు లేవు మనసుకి ఉన్నదే పదంగా వాడాడు అంతే. pseudo self మనల్ని చాలా మోసం చేస్తుంది. మనకు లేని బలాన్ని మనకు ఉన్నట్లుగా భ్రాంతి కలిపిస్తుంది. మన శక్తిని మనకు తెలియకుండా చేస్తుంది. మనల్ని మనమే పాపులుగా చెప్పుకుంటాం. మనం పాపులము కాదు పుణ్యాత్ములం కాదు కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళం. పాప పుణ్యాల బేరీస్ తర్వాత నిత్యమూ నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అంటూ వాడు పుణ్యం చేసేది ఎప్పుడు? ఇక అడిగే వాడు ఎవడు? పాపం నువ్వు చేస్తావ్ కడిగే వాడు ఇంకొకడు కావాలా? ఇది ఒక డొల్లతనం. జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి మనం విషయాలు. కాబట్టి ఇక్కడ మానసికమైనటువంటి ఒక పవిత్రత లేనప్పుడు pseudo self ఏర్పడుతుంది.ప్రతి వాపు ఒక బలంగా కనిపిస్తుంది. ప్రతి బలము ఒక ధైర్యంగా కనిపిస్తుంది. తెంపరితనాన్ని ఇస్తుంది. ఇంకొకటి సూడో సెల్ఫ్ బాగా మాట్లాడే వాడికి కలిగించేటువంటి ఒక తెచ్చే అపఖ్యాతి గాని, వాడికి కలిగించే ఒక భ్రాంతి గాని ఏమిటంటే, శాస్త్రం చెప్పటం ప్రారంభిస్తాడు. ఉద్దేశం మంచిదే. కొద్ది రోజులు అయిపోతుంది. ప్రపంచం తనను వింటున్నది అన్న నమ్మకం వాడికి కలుగుతున్నది. ప్రపంచం కూడా వచ్చి చెప్తుంది మీరు చెప్తున్నది చాలా బ్రహ్మాండంగా ఉంది అని. శాస్త్రం చెప్పటంతో మొదలైన కథ తాను చెప్పింది శాస్త్రంగా మారుతున్నది అని గ్రహించలేకపోతాడు. ఇది అహంకారానికి ప్రతీక-- ఒక ప్రతీక పరాకాష్ట. తాను చెప్పింది శాస్త్రం కావడానికి వీల్లేదు. శాస్త్రంలో ఏముందో మనం చెప్పాలి. ఏముందో దాన్ని అర్థం చేసుకోవాలి ముందు. దాన్ని ఆచరించాలి. ఆచరించడంలో ఉన్నటువంటి కష్టం చెప్పటంలో లేదు. చెప్పుట సులభము చేయుటే కష్టము. కాబట్టి ఇవన్నీ దశలన్నీ దాటుతూ దాటుతూ మనం వెళ్ళినప్పుడు సూడో సెల్ఫ్ ను జయించాలి. నోన్ సెల్ఫ్ ప్రపంచం సృష్టించింది. దాని మానాన్న దాన్ని వదిలేద్దాం. రోజూ ప్రపంచం మన దగ్గరికి రాదు మనము ప్రపంచంలోకి వెళ్దాం, పక్కన పెడదాం. అన్నోన్ సెల్ఫ్ అది ఇగ్నోరెన్స్ కి, ఇన్నోసెన్స్ కి ఆలవాలం. దాన్నే క్షమించి పక్కన పెడదాం. ఎప్పుడో నెమ్మదిగా అజ్ఞానాలు, అమాయకత్వాలు, బేలతనాలు, డొల్లతనాలు కరిగిపోతాయి స్వస్థితి ఏర్పడుతుంది. దాన్ని కూడా కాలానికి వదిలి పెడదాం. మొదటి దాన్ని లోకానికి వదులుదాం, రెండవ దాన్ని కాలానికి వదిలి పెడదాం. డార్కర్ సెల్ఫ్ లో ఉన్నటువంటి తమో గుణాన్ని నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. అహంకారం నుంచి అహం స్పురణ వైపు నడుద్దాం. దేహాత్మ భావనలో నుంచి ఆత్మ వైపు అడుగులు వేద్దాం. కానీ అత్యంత ప్రమాదకారి అయినటువంటి సూడో సెల్ఫ్ ను గనుక మనం జయించకపోతే అది ఒక్కరోజు మనను ముంచెత్తేస్తుంది. మనను ఓడిస్తుంది. మన సాధనని మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంది. సూడో సెల్ఫ్ ఎట్లా ఉంటుందంటే దూర్జటి చెప్తాడు కదా, కదంబవనం దాకా వెళ్లినా అది ఒక దుర్గాటవి గనుక అయితే అక్కడ మనస్సు అనే మృగం పొంచి ఉంటుందంటాడు ఆయన. అక్కడ కూడా నేను గొప్పవాడిని, నేను-- నా అంతటి వాడు లేడు అనేటువంటి భావనలో నుంచి జీవుడు బయటపడాలి. సూడో సెల్ఫ్ ను దాటాలి. అప్పుడు ఏర్పడుతుంది రియల్ సెల్ఫ్. ఆత్మ అంటే అక్కడికి. అక్కడి దాకా చేరాలంటే గదులన్నీ దాటాలి. దాటాలంటే ఇక్కడొక పరిణామ దశ ఉంది. సాధనా మార్గం. ఎక్కడ ప్రారంభం అవుతున్నది? ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి ఒక శబ్దం, అక్షరం. నిజానికి దానిలో మూడు బీజాక్షరాలున్నాయి. అకార, ఉకార, మకారాలున్నాయి. దాని జోలికి ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మము అక్షర స్వరూపమై అక్షర బ్రహ్మై క్షి-క్షితి ఎరగని, నాశనం ఎరగని ఒక అద్భుతమైనటువంటి ప్రణవ నాదంగా, ప్రణవ శబ్దంగా, ప్రణవాక్షరిగా మనకు కనిపిస్తున్నది. ఇది ఒకటి. దానిలో నుంచి ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి. అంటున్నది ఒకటి, వింటున్నది ఒకటి, రెండు ఏర్పడ్డాయి. అది రెండు. దానిలో నుంచి మూడు త్రిగుణాలు ఏర్పడ్డాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆపై నాలుగు ఏర్పడుతున్నాయి. చతుర్విధ పురుషార్థాలు ఏర్పడుతున్నాయి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -52

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -52

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:25

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

    Now playing
  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77