Skip to content
Transcript తెలుగు
సహజ స్థితి అంటే నేను ఉండవలసిన రీతిలో నేను ఉండటమే. నా శక్తి సామర్థ్యాలు గాని, నా ప్రజ్ఞాపాటవాలు గాని, నా కీర్తి సంపదలు గాని, నా స్థితిగతులు గాని, నన్ను నిర్ణయించలేవు. అవన్నీ బయట ఉండేవే. నన్ను నిర్ణయించేటువంటిది నా మనస్సే. నేను పవిత్రుడిని, పూర్ణుడిని, శక్తిమంతుడిని అన్నది మనస్సే. నీవు పాపివి, నీవు నిర్వీర్యుడివి, నీవు అసమర్ధుడివి అన్నది కూడా అదే మనస్సు. కానీ ఇక్కడ యోగత్వాన్ని సిద్ధించుకున్నటువంటి మనస్సు, హృదయంతో కూడి ఉన్నటువంటి మనస్సు, లయించబడిన, నాశనం కాబడినటువంటి మనస్సు, తన మూలాన్ని తాను ఎప్పుడో వదిలిపెట్టేసింది. తన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టింది. తనకున్నటువంటి కొన్ని గుణాలను తాను విదిల్చుకొని వదులుచుకున్నది. తాను ఇప్పుడు ఆత్మకి కొనసాగింపుగా ఉంది. That what we call the projection. ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. ప్రొజెక్ట్ అయింది అంటే కనబడుతుంది. దానిలో నుంచి erupt అయింది. ఒక్కసారి బద్దలై విస్ఫోటనం జరిగి, గతించిన కాలపు స్మృతుల నుంచి, గతానుభవాల నుంచి నెమ్మదిగా వైదొలగి వర్తమానం వైపు తొంగి చూస్తున్నది. వర్తమానం పరమానందంగా కనిపిస్తున్నది. కర్తవ్య నిర్వహణ చేయటానికి జగత్తు ఒక వేదికై కనిపిస్తున్నది. ఆత్మావిష్కరణ జరిగి తత్వానుసంధానం చేసుకోవలసిన యోగికమైనటువంటి మనస్సు, యోగించి, పల్లవించి, ప్రతిఫలించి, ఫలించే రోజు ఏర్పడినప్పుడు, నీకు సర్వ ప్రకృతి చరాచరమయమైనటువంటి, మాయామయమైనటువంటి జగత్తంతా ఆత్మ స్వరూపంగా భాసిస్తూ ఉన్నది, వెలిగిపోతున్నది. నీకంటే పరవస్తువు లేదని, నీకంటే అన్య వస్తువు లేదని, నీకంటే రెండవది లేదని, ఉన్నదంతా ఒక్కటేనని, ఒక్కటే అనేకంగా గోచరిస్తున్నదనే భావన కలగగానే, భగవాన్ ఎట్లాగైతే మనసుతో ఒక కుక్కలో, కాకిలో, కోకిలలో, నెమలిలో, గోవులో, మనిషిలో ఆత్మని దర్శనం చేశారో, అట్లాగే మనం కూడా సర్వాత్మన ఆత్మ దర్శనం చేయవలసిన అవసరం మనకు ఏర్పడుతుంది. ఆత్మ విచార మార్గం అంటే నిజానికి ఇదే. ఆత్మ విచార మార్గంలో మనిషి పూర్ణుడు కావాలి. శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదులు దీనికి ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు. ఆత్మ అంటే ఏమిటి అనంగానే, అనేక వర్ణనలు చేస్తాం. ప్రయత్నం చేస్తాం. వారు కడగా చెప్పిన మాట, బోధానంతరం చెప్పిన మాట, ఇవాళ భాషలో punch line అంటారే, or tag line అంటామే, punch line కాదు అది tag line కాదు. అసలు సత్యం. సత్యార్థం ఏమిటి అంటే, ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు. ఏమీ లేదు. అదేమిటి? ఏమీ లేదంటారేంటి భగవత్పాదులు, ఆత్మ గురించి ఇన్ని మాటలు చెప్పారే. రమణులు ఆత్మ గురించి ఇన్ని విషయాలు చెప్తూ ఆత్మను పట్టుకోమన్నారే. ఆత్మ నిష్ఠో భవత్వం అంటూ బోధించారే. మరి లేందాన్ని పట్టుకోవటం ఎట్లా? అంటే, అసలు ఉన్నదంతా ఆత్మే అయినప్పుడు నువ్వు ప్రత్యేకంగా పట్టుకోవటానికి వేరే వస్తువు లేదు. గాలి, నీరు, నింగి, సమస్తమూ పంచభూతాత్మకమై పదార్థంగా కనిపిస్తున్నదే, గాలికి మూలమేది? నీటికి మూలమేది? ఆకాశానికి, శూన్యత్వానికి మూలమేది? గగన గగనాంతరాలలో దాగిన ఖగోళానికి, కింద వాలిన భూగోళానికి మూలమేది? source ఏది అని ప్రశ్నించుకున్నప్పుడు, అఖండమైనటువంటి, శబ్ద బ్రహ్మమైనటువంటి ప్రపంచము ప్రణవనాదంగా, ఓంకారంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకనే మనం అనేకసార్లు చెప్పుకున్నట్లుగా, అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, హరయా నారాయణాన్వేషితము. నిశ్శబ్దం పుట్టాలి అంటే శబ్దం కావాలి. శబ్దం పుట్టాలి అంటే నిశ్శబ్దం కావాలి. రెండూ పడుగు పేకల వలె దాగి ఉన్నాయి. చీకటి గర్భంలో వెలుగు దాగినట్టుగా ఉన్నది, వెలుగు వాకిట చీకటి దాగినట్టుగా మనకు కనిపిస్తున్నది. కానీ చీకటి, వెలుగు అనేవి మనం academic గా చెప్తూ ఉన్నాం. పాపం, పుణ్యం అంటున్నాం. మంచి, చెడు అంటున్నాం. జననం, మరణం అంటున్నాం. ఎత్తు, పల్లం అంటున్నాం. విజయం, అపజయం అంటున్నాం. మానం, అవమానం అంటున్నాం. రాత్రి, పగలు అంటున్నాం. కాబట్టి ద్వంద్వాతీతమైనటువంటి స్థాయిలో మన మనస్సు పగటినీ, రాత్రిని కలిపి ఒక కాలంగా మనం భావన చేయగలిగినట్లయితే, పగలు లేక రాత్రి రాదు, రాత్రి లేక పగలు పుట్టదు. ఇది సత్యం. ఎంత ఎత్తుకి ఎక్కినా దిగక తప్పదు. ఎవరెస్ట్ శిఖరం మీద భారతీయ జెండా ఎగరేసి, దేశానికి, జెండాకి నమస్కరించి, అంటే జెండా వందనం చేసి, world record సృష్టించిన వాడు ఎవరెస్ట్ శిఖరం మీదనే ఉండిపోతున్నాడా? పని కాగానే మళ్ళీ తన మూల స్థానమైన తన ఇంటికి వస్తున్నాడు. అలాగే ఒక కచేరీ చేసినటువంటి ఒక గాంధర్వుడు, ఒక మహాద్భుత గాయకుడు కచేరీ అనంతరం మళ్ళీ తన స్వస్థానంలోకి వస్తున్నాడు.ఒక పాత్ర నిర్వహించినటువంటి ఒక మహానటుడు రంగు తీయగానే తుడుచుకోగానే మళ్ళీ తాను మామూలు మనిషి అయిపోతున్నాడు. మూల స్థానంలోకి వస్తున్నాడు, సహజ స్థితిలోకి వస్తున్నాడు. ఇది ఒక సహజమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఒక రహస్యం. మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా ఎంత జ్ఞాన స్వరూపులమైనా మూలాధారంలో ప్రాపంచికమైనటువంటి వ్యవహార నిష్ఠలో మనం కూడి ఉండాలి. జ్ఞానికి కర్మలు ఉన్నాయా-- ఉంటాయా? అని భగవాన్ ని అడిగితే జ్ఞానికి అందరికంటే ఎక్కువ పనులు ఉంటాయి అంతేకాదు జ్ఞాని perfect గా చేస్తాడు అన్నారు. అంటే జ్ఞాని పని చేసినా కర్మ ఫలాన్ని ఆశించకుండా, దానిని పట్టించుకోకుండా తన నైపుణ్యంతో skill తో ఏకాగ్రతతో attention తో concentration తో తదేకమైనటువంటి ఒక దీక్షతో పని చేస్తాడు గనుక it turns perfect. మనం ఒక పని చేస్తూ ఉంటాం జరిగిన-జరిగిపోయిన పని గురించో చేయవలసిన పని గురించో ఆలోచిస్తాం కాబట్టి we turn imperfect while performing. జరిగిందేదో జరిగిపోయింది, నీ నుంచి దూరం అయిపోయి చాలా గంటలు అయిపోయింది. నీకూ దానికి మళ్ళీ నువ్వు అందుకోవలసిన అవకాశం నీకు లేదు. అందుకోవలసినది ఇంకా పుట్టలేదు ఇంకా రావాలి. దానిని గురించి యాతన ఎందుకు? దీనిని గురించి ఆశ ఎందుకు? వర్తమానంలో నువ్వు time లో పని చేస్తున్నావో పని యందు నీ మనస్సును లగ్నం చేస్తే మనస్సు శక్తివంతమైన మనస్సుగా, పూర్ణమైన మనస్సుగా, పవిత్రమైనటువంటి మనస్సుగా ఏర్పడి నీవు చేసే కర్మలన్నీ కర్మ సుఖౌషలం. ఒక నైపుణ్యంతో పనులు జరగ-జరగబడతాయి. ఇంటి వాకిట ముగ్గు వేస్తే అది ఒక నైపుణ్యం. ఇంటి లోపల వంట చేస్తే అది ఒక నైపుణ్యం. వండటం వేరు వడ్డించటం వేరు. వడ్డించటం కూడా అదొక కళ. తినటం వేరు తినిపించటం వేరు. ఇవన్నీ కళాత్మకమైనటువంటి భావాలు. ఒక కొత్త పుస్తకం కొనుక్కుంటాం దానికి పైన పాడైపోకుండా ఒక అట్ట వెయ్యాలి అనుకుంటాం. అట్ట వేయటంలో ఒక ప్రజ్ఞ ఉండాలి లేకపోతే మన వల్ల కాదు మనం చేయలేం. ఒక సూదిలో దారాన్ని ఎక్కించాలి ఏకాగ్రత కావాలి. ఒక నిశ్చలమైన దృష్టి కావాలి. చేతిలో ఉన్న దారము రెండో చేతిలో ఉన్న సూది లోకి అది నెమ్మదిగా వెళ్ళగలగాలి. వెళ్ళగానే దాన్ని బయటకు లాగగలిగినటువంటి speed ఉండాలి, వేగం ఉండాలి. ఇవన్నీ ప్రజ్ఞా భూమికలు అధ్యాత్మను దాటి ఏం లేదు నిజానికి. అధ్యాత్మ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరణానంతరం ఏర్పడే సుఖము సౌఖ్యము కాదు. ఇక్కడ జీవించి ఉండగానే సర్వాంగములు మన మాట వింటున్నప్పుడే, దైహికంగా శక్తివంతులుగా ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులన్నీ perfect గా చేయాలి. క్రమబద్ధంగా చేయాలి. సవివరాత్మకంగా చేయాలి. కానీ దాని పట్ల రకమైన బాంధవ్యాన్ని మనం పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒక బాంధవ్యాన్ని పెట్టుకుంటామో దానితో మనకి అదొక అలవాటు అయిపోతుంది. అలవాటు నుంచి మనస్సును తప్పించండి. ఎక్కడికక్కడ పని చేస్తూ చేస్తూ వెళ్ళిపోతూ ఉండండి. ఇది వ్యవహార నిష్ఠ. సమయంలో పని ఎట్లా చేయాలో దాన్ని అట్లాగే చేయాలి. చేయాలి కానీ దాని ఫలితం పట్ల మనం పెద్దగా మనసు పెట్టవలసిన పని లేదు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -61

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -61

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:16

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

    Now playing
  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77