No transcript for this section.
Transcript begins at 1:22.
మరొక్కసారి ప్రణామం తెలియజేస్తూ, చాలా పవిత్రమైనటువంటి సంబంధమైనటువంటి ఈ వేళ ఈ గురుపూజ వేళ ఈ సంధ్యా సమయంలో ద్వాపర యుగంలో తొలి లోకగురువుగా వేదవ్యాసులవారు తొలి జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఇద్దరినీ ఆవిష్కరించినటువంటి సనాతనమైన భారతీయమైన ఆరుద్రమైనటువంటి మహా సంస్కృతికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గురుదేవుల మానస పుత్రిక హృదయాంతర్గతమైనటువంటి సకల ధర్మాన్వసారము సనాతన ధర్మంలో ఇంకోడి ఉన్నదని మన కాలంలో సమకాలీనంగా జగత్తుకి బోధ చేసి సనాతన ధర్మానికి ఒక విజయ పతాకాన్ని ఎత్తినటువంటి శివానుల గురుదేవులకి మరొక్కసారి ప్రణమిల్లుతూ జిహ్వానం జిహ్వానం సుజలా వీణ మౌఖ్యం దుఖానం దుఖానం సుధాం వేణురాగై లిఖానం లిఖానం సులిఖైరపాంగై మహారంద సర్వస్వామి తనమస్కార్ అంటారు వేదాసుడు శ్రీకృష్ణ కర్మామృతంలో కృష్ణ పరమాత్మను గురించి చెప్తూ ఇప్పటిదాకా సుధాం వేణురాగైహి అంటే దుఖానం దుఖానం ఎప్పుడు విన్నా ఎంతసేపు విన్నా ఎన్నిసార్లు విన్నా విన్నన్ని భావాలతో విన్నా సంగీతము సాహిత్యము వాఙ్మయము ఇదంతా కూడా భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం కాబట్టి వాటికి కైవాలం చేస్తూ ఈ సనాతన ధర్మం ఎలా మనల్ని రక్షిస్తుంది? సనాతన ధర్మాన్ని మనం ఎందుకు ఆచరించాలి పాటించాలి? మరికొన్ని మౌలిక విషయాలు ఇవాళ స్పర్శించే ముందు కృష్ణాష్టమి కాబట్టి శ్రావణ బడువ అష్టమి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కేవల మౌలానికపరమైన విశేషాలు మాత్రమే కాక, అవన్నీ రోజు వింటూనే ఉంటాం మనం. శ్రీకృష్ణ పరమాత్మ తన అవనీ సంచారాన్ని సుమారుగా నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు సాగించారు. ఇది ఒక సంపూర్ణమైనటువంటి మానవ జీవన కాలం. అతి విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడుగా మనం సంభావన చేస్తాం. ఏ యోగ కదంబానికి ఈశ్వరుడు అనే యోగములో శిఖర స్థాయికి చెందిన వాడు అనే యోగానికి ఈశ్వరత్వాన్ని అలవడిన వాడు అనే అద్దిన వాడు అనే ఏమిటి? కాస్త విచారణ చేస్తే మాయావరణాన్ని చిందిన్చుకొని లోకమాయను వెంబడి పెట్టుకొని బ్రజ భూమికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ అంతకుముందే తన తల్లి అయినటువంటి దేవకికి యోగమాయను కాస్త అప్పజెప్పి లోకమాయను వెంబడి పెట్టుకొని బ్రజభూమికి వెళ్ళటం మనందరికీ ఆ కథ తెలుసు. యోగీశ్వరుడు ఎందుకైనాడు అని ఒక తాత్వికమైనటువంటి ధోరణిలో విచారణ చేసినప్పుడు, మూడు యోగాలున్నాయి కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. ఇది మనందరికీ తెలుసు. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు భక్తి జ్ఞాన యోగాలకి మధ్య ఒక చిన్న విరామ కాలం ఉంది. ఆ విరామ కాలంలో అసలైనటువంటి జ్ఞాన యోగం. జ్ఞాన యోగము అనగానే శాస్త్రాల మీద అధికారం, ప్రవచనాలు సులభంగా సిద్ధిగా చెప్పటం, అనేకమైనటువంటి విషయాల మీద ఒక అధికార ముద్రను సంపాదించటం వీటిగా మనం భావిస్తూ ఉంటాం. అంటే శ్రీలా రమణ మహర్షి ఒక సందర్భంలో చెప్పారు "Intellectual interpretation is not జ్ఞానం it is only విజ్ఞానం" అంతే. కాబట్టి జ్ఞాన విజ్ఞానములు రెండు ఒక స్థాయికి వెళ్ళబోయేటువంటి సమయంలో ఈ లౌకికమైనటువంటి ఈ జగత్తులో జీవుడు ఉండగానే పరమైనటువంటి ఒక ఆత్మానుభూతిని తాను పొంది మళ్ళీ ఈ జగత్తుకి తాను అందించేటువంటి ఒక అద్భుత ప్రక్రియకి సాధారణ స్వరూపం ఏదైనా ఉన్నదా అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని కాస్త స్థాయి కులాంత న్యాయంగా మనం విచారణ చేసినట్లయితే మూడు యోగాలు కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం మధ్యలో ఇప్పుడు నాలుగవది జ్ఞానం అని కూడా అంటున్నాం. ఈ కర్మయోగాన్ని భారతమంతా పరుచుకున్నాడు కృష్ణుడు. భారతాని అతి వ్యాస భారతంగాని పవిత్ర భారతాన్ని గాని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితేమానవుని రూపంలో వచ్చినటువంటి ఒక పరమాత్మ ఏ ఏ పనులు చేయాలో అవన్నీ నిర్దుష్టంగా చేశాడు. చేయవలసిన రీతిలో చేశాడు. రాజనీతిని అద్భుతంగా ప్రదర్శించాడు. లౌకికమైనటువంటి అనేకమైనటువంటి మాన ఓమానాల వెన్నంటేనీ కూడా పరమాద్భుతమైనటువంటి అద్వైత దృష్టితో వానిని అనుభవించాడు. అందుకనే ఒకచోట అరవిందగారు అంటుండేవారు జ్ఞానులు "శ్రీకృష్ణ పరమాత్మ మధుర విషాద గాధ" అంటారు. అంటే విషాదంగా కనిపించే మాధుర్యం, మధురంగా వినిపించే, అనిపించే, కనిపించేదానిలోని దాగిన ఒకానొక విషాదం. ఈ రెండూ కలిసి ఒక మేళవింపుగా సాగింది కృష్ణావతారం అని అంటారు. రాజనీతిజ్ఞత, లోక నీతిజ్ఞత ఈ రెండింటినీ కూడా జమిలిగా సాగించినటువంటి వాడు కృష్ణుడు. కర్షతి ఇతి కృష్ణః, కృషితి ఇతి కృష్ణః, కృషితి ఇతి కృష్ణః. మూడు. ముందు ప్రధానమైనటువంటిది ఆకర్షణ. రెండవది ఆనందము, కృషి అంటే ఆనందం. తరువాత ఆనందము దానితో పాటు కృషి కూడా ఉన్నది. మానవుడు కేవలం మానవ దేహాన్ని తీసుకుని, పంచభౌతిక దేహాన్ని తీసుకుని కృష్ణుడు వచ్చాడు గనుక కేవలం వీణామానుష గ్రహంగా ఉండటానికి వీలులేదు, కర్తవ్యం చేయాలి ఈ లోకంలో. తన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు కలిపి, ఏడు శరీరాలు కాల్చి, ఎనిమిదవ శరీరమైనటువంటి ఆత్మ వైపు ఈ లోకాన్ని ఒక నాయకుడిగా నడిపించాలి. కనుక ఆయన జగన్నాయకుడయ్యాడు. జగత్తుని పాలించినందువలన జగన్నాయకుడు కారే. జగత్తుని అధ్యాత్మ వైపు నడిపించాడు. కారణం ఏమిటి అంటే మానవ జన్మకి పరమార్థం ఏమిటి అని విచారణ చేస్తే, అన్ని శబ్దాలకు ఉట్ట నిశబ్దమందు, అన్ని యుగాల మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయే నరజన్మ, అరయ నారాయణం అన్వేషం. నారాయణుడిని అన్వేషించాలి. ఎవరిది నారాయణుడు? ఎక్కడున్నాడు? అంటే సరే నారాయణుడు దేని జన్ము ఈ ప్రపంచంలో? నారాయుడు అంటే పరబ్రహ్మ alone. కేవలం విష్ణువు అని మాత్రమే అర్థం కాదు. ధర్మం అంటే జ్ఞానం. ఎవరైతే జ్ఞానయోగంలో ఒక స్థిర స్థాయికి చేరుతారో, ఎవరు జ్ఞాన యోగాన్ని అనుసరించి భక్తిని, కర్మను, అనుష్ఠానం చేస్తారో, ఈ అనుష్ఠాన భూమికని ప్రపంచానికి పరిచయం చేస్తూ తన జీవితాన్ని సాక్షాత్కారం చేసుకుంటారో అటువంటి వారంతా కూడా సర్వోన్నతమైనటువంటి యోగులవుతారు. యోగం అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టిన వాడు కాదు. ప్రపంచంతో తాను కూడి ఉండి, ప్రపంచంలో ఉండవలసిన, అనుభవించవలసిన అన్నింటినీ తాను అనుభవిస్తూ కడగా అన్నింటా అంతగా తన ఆత్మ స్వరూపాన్ని అఖండంగా, చిత్, చిత్తంగా నిలబెట్టుకునేటువంటి వాడు యోగి అవుతున్నాడు గనుక ఇది పూర్ణ యోగం వైపు నడిపించాలి మానవుణ్ణి. కనుక ఈ గురు స్థానాన్ని తాను సంపాదించుకున్నాడా, తెచ్చుకున్నాడా అంటే లౌకిక దృష్టితో చూసినప్పుడు మహాభారతమంతా పరుచుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర్మయోగం పతా, పరాకాష్ట స్థాయికి చేరి అక్కడ పరమాత్మదమైనటువంటి ఒక స్థాయిలో కృష్ణుడు తనను తాను ఆవిష్కరించుకుంటాడు. కర్మ లేకపోతే భక్తికి విలువ లేదు. మరి భక్తి రసాయనమంతా కూడా భక్తి స్వరూపాన్నంతా, భక్తి తత్వాన్నంతా తాను పరవంతుడై సర్వ భాగవతులను ఆదుకున్నటువంటిదంతా భాగవతమైపోయింది. కనుక భక్తి యోగానికి ఒక నిరుపమానమైనటువంటి ఉదాహరణ ఎవరు అంటే కృష్ణ పరమాత్మ అవుతున్నాడు. భారతం కర్మయోగం అయితే, భాగవతమంతా భక్తి యోగం అయితే, భగవద్గీతంతా జ్ఞాన యోగం. ఈ మూడింట ప్రధాన కథానాయకుడు ఎవరంటే మన కృష్ణ పరమాత్మ. మ-మరి కృష్ణుడు బాలకృష్ణుడికి మనం నమస్కారం చేయం. బాలకృష్ణుడిని ముందు పెట్టుకుంటాం. మన పిల్లవాడిగా, మనవడిగా, మన ఇంటి పిల్లవాడిగా ఒక భావాన్ని చేస్తాం. బౌద్ధ కృష్ణుణ్ణి ఆనందిస్తాం. ఎందుకంటే మహానంద స్వరూపం. మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అంటాడు కదా. రెండు అర్థాలు ఉన్నాయి మహానంద స్వరూపం అని ఒక అర్థం. నందనుడికి మహానందాన్ని ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు. తన్ను పిచ్చినటువంటి తండ్రికి ఏమి రెండవ అర్థం. సరే, ఈ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తి రసాయనాన్ని పరమాద్భుతంగా పండించారు. భక్తి గనుక లేకపోతే మానవ హృదయాలు ఎడారిలైపోతాయి. అక్కడ ఇంకించుకోవలసినటువంటి మరొకపక్క గతించిన భారతీయ చరిత్ర, అలాగే నడుస్తున్నటువంటి వర్తమాన భారతీయం, తర్వాత భవిష్యత్ దర్శనం. వీటివైపు ఏకాంతంలో మేము ముచ్చటించుకున్న సందర్భాలు బహుశా కొన్ని వందలు ఉండి ఉంటాయి. ఇక రెండవది, గురువుగారి ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఎన్ని గ్రంథాలు రాసినా కథా యోగం మీద వారి ముద్ర ఒక అధికార ముద్ర.కథ యోగాన్ని కేవలం నచికేత యమ సంవాదం గా కాక దాని యందు ఉన్నటువంటి యోగ రహస్యాలు అన్నిటినీ కూడా ప్రపంచానికి చక్కగా చెప్పారాయన. మరి శివానందమూర్తి గారి అమృత ఘడిమే అనుకుంటా సందర్భం మా అరవిందరావు గారిని గుర్తు చేస్తున్నా. 2002 వ సంవత్సరం నేను విరుదరాజు రామారావు గారు కలిసి గురువుగారి దర్శనానికి వెళ్ళాం. ఊళ్లో ఉన్నారు రండి తీసుకెళ్తాను అని నన్ను తీసుకెళ్లారు రామారావు గారు ఇంకా గురువుగారి అనుష్టానం చివరికి వచ్చింది అందరికీ తీర్థం ఇచ్చే సమయం ఆసన్నమైంది. రామారావు గారికి మోకాళ్ళ నొప్పి ఉన్నందువల్ల ఆయనకు కుర్చీ తెప్పించి ఇవ్వమన్నారు. 2002 అంటే పదహారు ఏళ్ళ క్రితం నాకు మోకాళ్ళ నొప్పి ఎప్పుడూ లేదు కనుక అప్పుడు అసలే లేవు నాకు కూడా కుర్చీ తెప్పించారు. గురువుగారు పీట మీద కింద కూర్చుని ఉన్నారు మాకు చాలా ఇబ్బందికరమైంది అయితే రామారావు గారు అన్నారు గురువుగారు కూర్చోమన్న తర్వాత నేను కూర్చోవలసిందేనన్నారు నవ్వుతూ. అప్పుడే అరవిందరావు గారు అక్కడున్నారు కఠ యోగ ప్రింట్ అయి వచ్చింది bounded version అది. The first copy అప్పుడు తీసుకుని రాగానే sign చేసి నాకు ఒక copy ఇచ్చారు. బహుశా నేను దాన్ని ఆ ఆ కారణంగా బహుశా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ తరువాత ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము సహచరులుగా ఉన్నాం కాబట్టి ఇవాళ అరవిందరావు గారిని ఇక్కడికి chief guest గా పిలవటం ఇది ఎవరికి సంకేతించా గురువు గారికి. [చప్పట్లు] ఇవన్నీ మధురమైన స్మృతులు ఈ విషయం ఆయన absence లో చెప్తే మనకు అర్థం కాదు. ఆయన presence లో చెప్తే ఆయనకు కూడా గుర్తు వస్తుంది. కఠ యోగం ఒక బ్రహ్మాద్భుతమైనటువంటి యోగం. దాన్ని యోగశాస్త్ర ప్రమాణంగా గురువుగారు ఆవిష్కరించారు. నిజానికి మా LV సుబ్రహ్మణ్యం గారు రెండేళ్ళ నాడు ఒక మాట అడిగారు. ఒక సాయంకాలం అందరం కలుద్దాం ఈ కఠ యోగాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం like mind ed పది మందిని కూర్చుందాం అని ఆయన అనుకున్నారు. సరే రాష్ట్రం రెండు ముక్కలైపోయింది ఆయన అటు వెళ్లిపోయారు మేము ఇక్కడ ఉండిపోయాం. మరి ఏం చేయాలి? క్రితం సంవత్సరం మే నెల ఏప్రిల్ మే నెలలు ఎండలకు భయపడి బయటికి వెళ్ళకూడదు ప్రయాణాలు చేయకూడదు అని అనుకొని ప్రయాణం చేయొచ్చు గానీ ఇంట్లో నిద్రపోకూడదు కదా మరి కర్మ యోగాన్ని గురించి మాట్లాడేవాళ్ళు నిద్రపోతే ఎట్లా అని రెండు మూడు వేల పేజీలు విస్తరించి చెప్పగలిగిన ఉపనిషత్తులన్నీ కూడా ఇవాళ నా కడుపున పుట్టినటువంటి బిడ్డకి అవంటే ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నా శక్తిలేని వాడికి దాన్ని దశోపనిషత్ సార సర్వస్వంగా రాసినప్పుడు కేవలం వంద పేజీలలో అది ముగించినప్పుడు ఇరవై ఐదు పేజీలు కఠోపనిషత్తుకు మాత్రమే కేటాయించారు. ఆ తరువాత ప్రశ్నోపనిషత్తు. ఈ రెండూ ప్రధానం. [చప్పట్లు] అంటే ఇవాళ ఉపనిషత్ శుద్ధ రావడానికి కారణం ఎవరంటే మా సోదరుడు LV S. ఎవరో కారణం అవుతారు ఎవరో ప్రే ప్రేరేపిస్తారు ఇలా చెప్తే బాగుండు కదా అని that answers all the questions. అటువంటి ఈ సందర్భంలో మనకున్నటువంటి సమయాన్ని దేనినైనా సరే కాలానికి లోబడి మనం మన మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇది అంత మహాసాగరం ఇది ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఒకటుంది mathematics languages కి ఎట్లా శాస్త్రం ఉందో ఆధ్యాత్మిక కూడా కేవలం ఊకదుంపుడుగా కాలక్షేపంగా కాసేపు పది మందిని enlightenment కు బదులు entertainment గా నడిపేదానికంటే తాత్విక చింతనా భూమికలోకి వెళ్లి మన మహర్షుల యొక్క దర్శనాలను మనం చక్కగా ఆకళింపు చేసుకొని మన నిత్య జీవితంలో దాన్ని గనుక మనం అనుష్ఠానం చేయగలిగినట్లయితే అది సర్వోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి అని నేను భావన చేస్తూ పరమ పవిత్రమైనటువంటి ఈ క్షణాలన్నీ కూడా అనంతకోటి గురు స్వరూపాలు అదృశ్య రూపులై ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నవి వింటున్నవి లోలోపల అనుకుంటున్నవి వాటన్నింటినీ గ్రహించి మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో కావలసిన శక్తిని యుక్తిని కోర్కుని కూర్పుని కావలసిన మార్పుని తీర్పుని అన్నింటినీ కూడా సమగ్రంగా దేవతా సమూహాన్ని కోరుకుంటూ శివానంద మూర్తి గారు కొన్ని గొప్ప పనులు ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ఒక ఐదు సంవత్సరాల క్రితం మిత్రులంతా కలిసి ఆధ్యాత్మిక మిత్రులంతా కలిసి V S R foundation పెట్టాలి అని అన్నప్పుడు ఆ రోజున inaugural day ఒక మాట చెప్పాను. మనం ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని మనమే అచ్చు వేసుకోవటం కాదు ఒక మంచి రచన గనుక ఎవరన్నా చేస్తే దాన్ని ఈ foundation చక్కగా ప్రింట్ చేసి గురువుగారు చేసినట్లే ఇవన్నీ ఆయన చేసిన పనులే ఆయన నేర్పిన పనులే మంచి పుస్తకం ఉన్నా మంచి విద్వాంసుడున్నా మంచి సంగీతకారుడున్నా ఆతని ప్రజ్ఞనిప్రోత్సాహం చేసే రీతిలో గురువుగారు చక్కని రాచబాట వేసి మనకి అందించారు. అటువంటి గురువుగారి ఆదేశాన్ని, వారిచ్చిన ఉపదేశాన్ని, వారితో గడిపిన అనేక మధుర క్షణాలని, ఇవాళ నేను గుర్తు చేసుకుంటూ, రాబోయే కాలంలో ఈ ప్రపంచానికి కావలసినటువంటి వాఙ్మయాన్ని, మహర్షులు ఎంత నిస్వార్థంగా మనకి వాఙ్మయాన్ని ఇచ్చారో అట్లాగే ఇవ్వగలిగిన ఏదైనా రచన కండబడితే దాన్ని VSR Foundation ప్రింట్ చేసి ప్రపంచానికి ఇస్తుంది. ఇది గురువు గారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి రివార్డ్. [సంగీతం] అలాగే వేద వాఙ్మయానికి [సంగీతం] వేద సంస్కారానికి మనం నమస్కరించవలసిన ఒక సందర్భం ఉన్నది గనుక Foundation పెట్టినప్పటి నుంచి కూడా వేదమూర్తులైనటువంటి వారందరినీ కూడా వారిని మనమే గుర్తించి మనం వారికై శ్రమపడి వెళ్ళి వెతికి పట్టుకొని సమాజంలోకి వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా గుప్తంగా వెనక ఉండటువంటి ముందుకు రమ్మని పిలిపించి అటువంటి వారిని సమాహరించుకునేటువంటి ఒక రీతి, ఇవన్నీ కూడా VSR Foundation అనేటువంటిది ప్రపంచానికి చెందినది. దానిలో మనమొక భాగస్వాములం. కానీ దాని వెనక, ఆ ప్రణాళిక వెనక శివానందమూర్తి గారి విద్య ఆశీస్సులు అవి ఎప్పుడూ ఉన్నాయి, ఉంటాయి అని నేను నమ్ముతూ, శ్రీకృష్ణ పరమాత్ముని మనం "కృష్ణం వందే జగద్గురుం" అని ఎట్లాగైతే భావన చేస్తామో, ఎవరైతే ఈ మూడు యోగాలని త్రిభుజిగా చేసి త్రివేణిని చేసి తమ జీవితంలో అనుష్ఠాన వేదాంత భూమికని నిర్మాణం చేయగలిగి మళ్ళీ భారతీయమైనటువంటి ఆత్మ ప్రజ్వరిల్లే రీతిలో జగజ్జనీయమయ్యేటువంటి రీతిలో మనందరి జీవితాలు బహుశా పునరేళించటం కావలసిన ఒక సమయం కూడా ఆసన్నమైంది గనుక ఈ సమయాన్ని మనం కూడా అందిపుచ్చుకొని వీలైనంత ఎక్కువగా మనదైనటువంటి ఈ భారతీయ ఆత్మని, ఈ భారతీయ ముద్రని, వాఙ్మయాన్ని మనందరం కలిసి పంచుకుంటూ పెంచుకుంటూ వాఙ్మయ స్వరూపానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని మనం కావలసిన అవసరం ఉన్నది. సాంస్కృతిక గాడుల అన్నింటినీ కూడా దాటి దాటి దాటి వెళ్ళి మన మూలాలు గనక గట్టిగా పట్టుకుంటే భగవాన్ సత్యసాయి బాబా వారు గొప్ప మాట చెప్పారు, గొప్ప మాట. "రూట్స్ బాగా ఉంటేనే ఫ్రూట్స్ బాగుంటాయి బంగారు జాగ్రత్త పెట్టుకోండి" అన్నారు. ఆ రూట్స్ సనాతన ధర్మం. ఆ ఫ్రూట్స్ ఇవాళ మనం అనుభవించేటువంటి అన్ని ఫలాలు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇందాక వారు చెప్పారు "శంభో mూర్తిః శరది భువనే శంకరాచార్య రూపా" శంకరుల కంటే ముందు తర్వాత శంకరులు ఆ మ్నాయ పీఠాలు ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయకమైన వైదికమైన ఆర్షమైనటువంటి భారతీయ తత్వాన్ని ఈ జగత్తుకి నిర్మమంగా పరమాద్భుతంగా ఏ రకమైన స్వార్థం లేని రీతిలో అందించే దిశగా మన అడుగులు వడివడిగా పడాలని నేను మనసా, వచసా, చేసా కోరుకుంటూ సమస్త లోకాః సుఖినోభవన్తు.
YouTube · audio
Sri Krishna Jayanthi Celebrations - Pravachanam & Felicitation
Sri Krishna Jayanthi Celebrations - Pravachanam & Felicitation
Source: P V S on YouTube
0:00 / 24:09