No transcript for this section.
Transcript begins at 1:47.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈ సన్మంగళ వేళ ఈ సాయం సంధ్యా సమయంలో శ్రీ ప్లవ నామధారి అయినటువంటి కాల స్వరూపానికి నమస్కరిస్తూ అటువంటి పుణ్యకాలము ఆగమించినటువంటి ఈ కాలానికి ఈ సందర్భానికి ఈ సన్నివేశానికి ఉగాది అని మనం పేరు పెట్టుకుని ఒక పర్వదినంగా దీన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ముందుగా హిమాయత్ నగర్ సత్యసాయి సేవా సమితి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యంత విశిష్టమైనటువంటి ఈ ఉగాది మహోత్సవాన్ని జరపటం ఎంతో ఆనంద సంధాయకం అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ కాలం వసంత కాలం అతి పవిత్రమైనటువంటి కాలం ఇది. ఇది కాలానికి తొలిగా చెప్తారు. సృష్టి రచన ప్రారంభమైనటువంటి సమయం కాబట్టి దీనిని యుగాది అన్నారు. మానవుడు మాట నేర్చుకున్నటువంటి రోజు కాబట్టి అంటే అంతకుముందు సౌజ్ఞల ద్వారా ఆ పరోక్షంగా తన భావాలను వ్యక్తీకరించినటువంటి మానవజాతి నెమ్మదిగా ఒక భాషని ఒక మాటని అలవాటు చేసుకొని పలుకు పలకటం ప్రారంభించినటువంటి సమయం కాబట్టి ఇది ఉగాది. ఉట్ అంటే మాట. ఉగాది. ఇక యజుర్వేదం ఏమన్నదంటే అసలు వేద గమనమే ఉగాది అన్నది. వేదం ఏమిటి గమనం ఏమిటి వేదాలు నడవటం ఏమిటి అంటే వేదము అంటే ఈ సమస్త సృష్టిని ఆవరించినటువంటి ఏ బ్రహ్మము ఉన్నదో అన్ని కదలికలకు ఏ బ్రహ్మము మూలమై ఉన్నదో ఏ బ్రహ్మమును తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినదంటూ లేదో అటువంటి దానికి వేదము అని పేరు గనుక సామ రుక్ యజుహు ఈ మూడు వేదాలు అంటే త్రయి విద్యా స్వరూపమైనటువంటి ఈ వేదం ఒక ప్రవాహ వేగంతో సృష్టిలోకి ప్రవేశించిన రోజు కనుక వేద గమనము అన్నారు. వేదం నడక ప్రారంభించింది. అదే సమయంలో మానవుడు మాట్లాడటం నేర్చుకున్నాడు నెమ్మదిగా. తత్వానుసంధానం కంటే ముందు ఈ వేదాలన్నింటినీ కూడా డీకోడ్ చేసుకుంటూ అడవి ఆకుల సందడిలో ఏర్పడినటువంటి నానానాథ సందోహంలో నుంచి మహాత్ములు, దార్శనికులు, తత్వజ్ఞులు, ముముక్షువులు, మోక్షగాములు వీళ్లందరూ కూడా అవతారమూర్తులు. ఈ నాదం ఏమిటి దీనిలో నుంచి ఏం పుడుతున్నది అని విచారణ చేసి వాటికి అక్షర రూపం ఇచ్చినటువంటి రోజు గనుక ఇది ఉగాది. ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏమిటంటే భూమి భూమి తర్వాత జలము జలము తర్వాత అగ్ని అగ్ని తర్వాత వాయువు వాయువు తర్వాత ఆకాశము ఇది భూమి నుంచి ప్రారంభించినప్పుడు యాన్ ఆర్డర్ ఆఫ్ అసెంట్ అంటాం. మరి ఆర్డర్ ఆఫ్ డీసెంట్ ఏమిటిని? ఆకాశము వాయువు అగ్ని జలము భూమి పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి. ఈ ఆకాశంలో నుంచి గాలి ఉరిపిడి వలన తాకిడి వలన మహా నిశ్శబ్దం శూన్యంలో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దం భంగమై శబ్దమై కిందకు జారింది. ఆ శబ్దమే ఓం అనేటువంటి ప్రథమాక్షరంగా ప్రపంచంలోకి వచ్చి అదే అక్షర పరబ్రహ్మ స్వరూపమై అందుకేమరంటాం ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. ఏది చెప్పినా ఎంత చెప్పినా అన్ని ఓం అనేటువంటి ప్రణ నాదంలో నుంచి ప్రణవ శబ్దంలో నుంచి బయటకు రావలసిందే గనుక ఇవాళ ఉగాది అంటే ఓం అనేటువంటిది నిశ్శబ్దంలో నుంచి శబ్దభూమికగా మారి అక్షరమై ఈ ప్రపంచానికి అక్కరకు వచ్చినటువంటి రోజు అని మరొక అర్థం. అంతే కాదు యజుర్వేదం ఏమన్నదంటే మధుశ్చ మాధవశ్చ వాసంతీకా వృతౌ అన్నది. ఈ ప్రకృతి అంతా కూడా మధువుతో అంటే తేనెతో మాధవశ్చ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు యొక్క శక్తితో కూడి ఉన్నటువంటి సమయం కాబట్టి ఇది ఉగాది అయింది అన్నారు. ఈ ఉగాది వచ్చినటువంటి సమయం ఏమిటి అంటే వాసంతీకా వృతౌ వసంత కాలంలో వచ్చింది వసంత ఋతువులో వచ్చింది. ఈ వసంత ఋతువు ఎట్లా ప్రాదుర్భవించింది ఎట్లా బయటకు వచ్చింది అంటే శిశిరం పోయింది వసంతం ఆగమించిందిపండుటాకులు, పాపపుటాకులు రాలిపోయినాయి, కొత్త ఆకులు పుట్టుకొచ్చినాయి, కొత్త గుణాలు పుట్టినాయి, కొత్త కొత్త పుష్పాలు పుట్టినాయి. దానిలో నుంచి కొత్త కొత్త ఫలాలు కూడా అందిని. ఇది ఈ లోకంలో మాత్రమే జరిగేటువంటి ఒక వైచిత్రి. దీన్ని శివార్ందలహరిలో శంకర భగవత్పాదులు "శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామేక జీర్ణచ్ఛదా, స్రస్తా భక్తిలతాచ్ఛతా విలసతా పుణ్యప్రవాళ శ్రతాః, దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా, జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి" అంటారు. ఇది పరమోదారమైన, పరమ రమణీయమైన సంగీత సాహిత్య సమరంకితమైనటువంటి అభివ్యక్తి. కారణం శంకర భగవత్పాదులు పరశివావతారం కనుక, ఈ ప్రకృతిని అంతా కూడా శివాయ తరంగా భావించారు గనుక, ఏం జరిగింది అంటే నామస్మరణ చేశామట. రామ, కృష్ణ, సాయి, శివ, శంభు ఇట్లా ఒక-ఒక దేవీదేవతల యొక్క నామాన్ని మనం స్మరించినంత మాత్రముననే లేదా ధ్యానించినంత మాత్రముననే హృదయము అనేటువంటి ఉద్యానవనంలోకి వసంత కాలం ఆగమించింది. శంభుజ్ఞాన వసంత సంగిని వచ్చి మనల్ని కౌగలించుకుందట. మనల్ని పట్టుకుంది. "నేను వచ్చేశాను వసంత" అని అన్నది. మనము "నువ్వు వచ్చావు" అని మనం ఆనందపడాలి. కానీ వసంత కాలమే ఆనందం పడినటువంటి రోజు, ఆనందాన్ని అనుభవించినటువంటి రోజు. అదే సమయంలో ఏం జరిగింది అంటే పాత ఆకులు, ఎండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోయినాయి. పాత ఆకులు పోయినాయి, పాత ఆలోచనలు పోయినాయి, నిన్నటి భయాలు పోయినాయి, నిన్న సాధించిన విజయాలు వెనకబడి పోయినాయి, సాధించలేనివన్నీ కూడా వెనకబడి పోయినాయి. అన్నీ మరపు అనే తెరలోకి వెళ్లిపోయినాయి గనుక అక్కడ భక్తి అనేటువంటి "స్రస్తా భక్తిలతాచ్ఛతా విలసతా" ఒక చిన్న తీగ పాకిందట. తీగ పాకితే "దీశ్యంతే గుణకోరకా". ఈ ఎక్కడ పండుటాకులు రాలిపోయినయో చిగురాకులు మోసులెత్తినాయట. వాటి పక్కనే గుణాలు అనేటువంటి మొగ్గలు, కోరకము అంటే మొగ్గ. మూడు మొగ్గలు వికసి-- వచ్చినాయట. సత్వ, రజస్, తమో గుణాలు. ఆ మూడు నెమ్మది నెమ్మదిగా వికాసమానం చెంది మొగ్గలు విచ్చుకుని నెమ్మదిగా ఒక పుష్పమైందట. ఆ పుష్పం కూడా సంపూర్ణంగా తనను తాను ఆవిష్కరించుకుని, ఎట్లా ఆవిష్కరించుకున్నది? "జపవచః పుష్పాశ్చ సద్వాసనా". జపము, తపము, ధ్యానము, ధారణ అనబడేటువంటి వాటి ద్వారా అనేకమైన సౌగంధాలు-- సుగంధాలన్నీ కూడా పరిమళభరితం చేసినాయట ప్రకృతిని. కాలం వసంత కాలం వచ్చేసింది, ప్రకృతి పులకరించింది, దానిలో నుంచి ఈ పూలన్నీ వికాసమానం చెందినాయి, దానిలో దాగిన సొబగులు, సౌరభాలు బయటకు వచ్చినాయి. అంతేనా, ఆ పుష్పము నెమ్మదిగా ఒక కాయ అయింది. అయి "జ్ఞాన ఆనంద సుధామరందలహరి" ఇదిగో మనమంతా కొన్ని ఏళ్లుగా సుమారుగా నలభై ఐదు, నలభై ఆరు సంవత్సరాలుగా నిరంతరమైనటువంటి తపోధ్యానాలతో ఉన్న కారణంగా సుజ్ఞాన విజ్ఞానములు దాటి, ప్రజ్ఞానాన్ని కూడా దాటి ఒక జ్ఞాన భూమికలో మనం నెలకొంది చెందినప్పుడు దాని వల్ల ఒక ఆనందం కలిగింది అట, మనందరికీ కూడా. "జ్ఞాన ఆనంద సుధామరందలహరి" అది ఒక అమృత పుత్తేన వాకై ప్రవహిస్తున్నది అట. అమృతం నెమ్మదిగా ప్రవహిస్తూ వచ్చే సన్నటి సలయేరులాగా నిస్తంద్ర మందారంగా వెళుతూ ఉంటే, అంటే నెమ్మదిగా వెళుతూ ఉంటే దానిలో ఒక ఫలం దొరికిందట. ఆ ఫలం పేరు సంవిత్ ఫలం. సంవిత్ అంటే వేదము అనేటువంటి పండు దొరికింది. ఆ పండు దొరికిన తర్వాత ఇక విజ్ఞానం లేదు, సుజ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, విరుదులు లేవు, గౌరవాలు లేవు, అన్నీ వెనక్కి వెళ్లిపోయినాయి. దేనిని పొందాలో, పొందటానికి అనువైనటువంటి ఋతువు ఏది అంటే ఇది వసంత ఋతువు. కాబట్టి ఈవేళ శ్రీ ప్లవ కాలానికి శ్రీ మనం ముందు చెప్పాలి. మంత్రానికి ఓం ఎట్లా చెప్పాలో, కాల నామము ఏదైతే ఉన్నదో సంవత్సర నామానికి శ్రీ ముందు పెట్టాలి. ఎందుకంటే "కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలత్రయాయ నమః" అని మనం పరమేశ్వరుని ఉపాసన చేస్తాం. వృత్తంలో కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ కాలము భగవత్ స్వరూపం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క నామంతో వస్తుంది. అసలు ఈ అరవై సంవత్సరాలు ఎవరివో తెలుసునా? ఇవాళ మనం పెట్టుకునేటువంటి పేర్లన్నీ ఎవరివి అంటే నారద మహర్షి యొక్క కుమారుల నామాలు, పేర్లు ఇవన్నీ. కనుక శాశ్వతంగా ఆయన కుమారుల యొక్క పేర్లన్నీ కూడా అరవై అవగానే మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ అరవై నే-- ఆ పేర్లే తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి గనుక ఈవేళ ప్లవ అనేటువంటి నామంతో ఒక సంవత్సర కాలం, మళ్ళీ ఇట్లా వసంత కాలం వచ్చేదాకా నడుస్తుంది గనుక ఈ ప్లవ అంటే ఏమిటి? మనం విప్లవం విన్నాం, ప్లవం వినలేదు. విశిష్టమైనటువంటి ప్లవ అంటే, విప్లవం అంటే విధ్వంసం కాదు, విప్లవం అంటే పరిణామం అని అర్థం. ఈ ప్లవ కూడా పరిణామం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై యదార్థ స్థితికి నువ్వు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ ప్లవ నామ సంవత్సరంకాలము నీకు దోహదం చేస్తుంది. కాలం నీ పక్షాన ఉంటుంది. లేదు హాయిగా బొంచేసి నిద్రపోయి చెల్లగొట్టుకున్నా వాడి అనేవాడికి ఆ అట్లాగు చెల్లుబాటు అయిపోతుంది. కానీ చదువుకున్న వాళ్ళంగా ఒక అవతారమూర్తికి సమకాలీనంగా జన్మ ఎత్తిన వాళ్ళంగా మనకొక privilege ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత ఏమిటి అంటే కాలాన్ని మనం చెల్లగొట్టకూడదు. జీవితాన్ని గడపకూడదు. జీవితాన్ని నడపకూడదు. జీవితాన్ని యదార్థంగా జీవించాలి. ఆ జీవితం విసిరేటువంటి ప్రతి సవాలునీ ఎదుర్కోగలిగినటువంటి ఆధ్యాత్మిక, నవ్-- నైతిక, భౌతిక శక్తులన్నీ కూడా ఆంతరిక శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఆ సమస్య నుంచి మనం దాటాలి. ఆ దాటించటమే ప్లవ. అది దాటాలి. transcend అంటాం చూడండి. He transcend time and space అంటాం. ఈ ప్లవ నామ సంవత్సరం దాటించటానికి కాలం సిద్ధంగా ఉంది, దాటటానికి మనం సంసిద్ధులం కావాలి. లేదు ఇది ఇంకో సంవత్సరం మళ్ళీ శోభకృత్ వస్తుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అటువంటి కలలలో జీవితాన్ని గడపకూడదు. జగత్తెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను కన్నువిప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగును వసుధయెనుచు. ఈ ఆకాశంలోనో ఇంకెక్కడో ఉన్నటువంటి ఈ astral masters కి దేవీదేవతలకి పెద్దగా పని ఉండదు. అటువంటి ఆ పని కోరుకున్న వాళ్ళు అమృతస్య పుత్రాః అమృత లోకం నుంచి మనంగా మన బోటి వాళ్ళుగా ఈ జన్మ ఎత్తి ఇక్కడికి ఎందుకు వస్తాం అంటే పని చేయటానికి వస్తాం. కర్తవ్యం చేయటానికి వస్తాం. అందువనే ఒక అవతారమూర్తికి ఎట్లాగో మనకు కూడా కాల, కార్య, కారణ, కర్తవ్య ఈ నాలుగు ఉన్నాయి. కాలానికి లోబడాలి. డెబ్భై ఏళ్ళ, ఎనభై ఏళ్ళ, తొంభై ఏళ్ళ మన చేతుల్లో లేదు. కారణ, ఎందుకో వచ్చాం, ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, ఏ పని చేయాలో తెలుసుకోవాలి. ఏ పని ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఎంత నిబద్ధతతో చేయాలో గనక తెలుసుకున్నట్లయితే ఆ కర్తవ్యాన్ని మనం గనక చేయగలిగినట్లయితే ఈ వేళ ఈ ప్లవ నామ సంవత్సరంలో మనం మన ఆలోచనలని, మన మేధాశక్తిని అన్నింటినీ ఉపయోగించి మన intellectual quotientకు కూడా పదునుబెట్టి ఈ కాలం జరిగిపోయిన కాలం కంటే గొప్పగా ఉండాలి అని అనుకుంటా-- అనుకుందామంటే కాలం ఎప్పుడూ గొప్పదే. దానికి విలువ తేగలిగినటువంటి వాళ్ళం మనమే కాబట్టి కాలాన్ని తమస్సులు అంటే ఆ సోమరితనంతో, రజస్సుతో అంటే అహంకారంతో కాక సంపూర్ణమైన సత్వగుణ ప్రధానమైనటువంటి భావనతో మనం ఈ వేళ ఒక నిర్ణాయకమైన భావన చేయాలి. ఇలా ఉండాలి. ఈ సంవత్సరమంతా మనం ఇట్లా ఉండాలి. January firstకి మనకి సంబంధం లేదు. ఈ వేళే మన ఉగాది. అంతే కాదు, ఇందాక చెప్పాం ఉగాది అంటే మాట ప్రారంభించిన రోజు, పలికిన రోజు. యుగాది అంటే యుగము అంటే ఏదో నాలుగు యుగాలు చెబుతాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇదిగో కలియుగం అంటాం. యుగము అంటే క్షణము అని అర్థం. క్షణక్షణంలో రాత్రి అందరిలాగా పాశ్చాత్య దేశాల్లో లాగా మనకి రాత్రి పన్నెండు గంటలకి కొత్త సంవత్సరం రాలా. సూర్యమాన, చాంద్రమానంగా మనం గణనం చేస్తాం. దీనిని ఈ ప్రపంచానికి ఇంత ఉన్నది అని చెప్పినటువంటి మహావ్యక్తి ఎవరంటే వరాహమిహిరుడు. వరాహమిహిరుడు తన బృహత్ సంహిత కావ్యంలో జ్యోతిష్యాన్ని అంటే తాను ఈ భూలోకంలో ఉండి ఖగోళం మొత్తాన్ని దర్శనం చేసి సూర్యుడు, చంద్రుడు అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ రెండింటినీ ఒకచోట సంధి-- ఇప్పుడు సాయంకాలం మనం సత్సంగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నటువంటి లేదా మహోత్సవ కాల ప్రారంభ వేళ అది యుగం. పగలికి, రాత్రికి మధ్య ఉన్నటువంటి ఆ కలుస్తున్నటువంటి సీమ ఏదైతే ఉన్నదో దానికి యుగము అని పేరు. కాబట్టి ఆ యుగము ఎలా ఉన్నది నిన్నటికి, ఇవాల్టికి పొద్దున సూర్యోదయం అప్పుడు యుగం అయింది. ఇప్పుడు చంద్రోదయం అప్పుడు రెండో యుగం ప్రారంభమైంది. అట్లాగే ఈ రెండుగా వెలుగుగా ఉన్నటువంటి ఈ సూర్యనాడి, ఈ చంద్రనాడి ఈ రెండూ కూడా పగలుగా, రేయిగా అంటే రాత్రిగా కాలము తనను తాను విభజించుకుని కాయకష్టం చేసి ప్రాపంచిక ధర్మాలు, లౌకిక ధర్మాలన్నీ నిర్వర్తించి జీవితాన్ని సమున్నతమైన స్థాయిలో నిలబెట్టుకోవటానికి పగటి వెలుగు అవసరం. పగటి వెలుగులో పోడిమి ఉంది, తాళిమి ఉంది, మహాచైతన్యం ఉంది. దాన్ని ఇవాళ D3 అని చెప్పేశారు. అంతే కదా! మనకు అర్థం కావటానికి. రాత్రి అయిపోయింది. జీవుడు అలసిపోయినాడు. మనమే అలసిపోయినాం. అలసిపోయిన తర్వాత ఇంద్రియాలు నెమ్మదిగా నిద్రపోవాలవి. కాస్త rest తీసుకోవాలి. చూడ్డానికి సూర్యుడు లేడు, వెళ్ళిపోయాడంటున్నాం. మరి ఎవరో వస్తా-- రావాలి కదా అంటే చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడికి మనస్సుకి సంబంధం ఉన్నది గనుక మనం నిర్ణీత సమయంలో మనం గనుక నిద్రపోయినట్లయితే ఆ చంద్రుడి యొక్క చల్లని వెన్నెల, గాలిలో మిళితమైనటువంటి శీతల స్పర్శ మనకి ఒక సాంత్వనని అనుగ్రహిస్తుంది గనుక సూర్య, చంద్ర నాడులు రెండూ కూడా జీవుడికి అవసరం. పగలు కావాలి, రాత్రి కావాలి. పగలు పని చేయటానికి కావాలి, రాత్రి విశ్రాంతి చెందటానికి కావాలి కాబట్టి ఈ పగలు, రాత్రుల యొక్క సంధి ఏదైతే ఉన్నదో సుమారు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతున్నటువంటిదంతా యుగకాలంగా మనం భావన చేయాలి. వసంతకాలం అయనాల్లో మొట్టమొదటిది. అలాగే ఋతువులలో మొట్టమొదటిది. అన్నింట్లో అందునా ఈ రోజున మనమంతా లేచాం, తెల్లవారుజామున లేచాం.ఆ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తం అని ఒక పేరు పెట్టారు. బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తం అని రెండు ఉన్నాయి. రెండుగా అనిపిస్తాయి. బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నారంటే బ్రహ్మ తన సృష్టి రచన ప్రారంభం చేసినటువంటి క్షణం అది. ఎన్ని కోటానుకోట్ల జీవరాశులను ఈ ప్రపంచంలోకి సృష్టిస్తూనే ఉన్నాడాయన. మరి బ్రాహ్మీ ఎవరు అని? బ్రాహ్మీ ముహూర్తం అంటామే ఆ బ్రాహ్మీ ఎవరంటే బ్రహ్మ యొక్క కన్సా, అమ్మవారు సరస్వతీదేవి బ్రాహ్మీ. బ్రహ్మకు ఆలోచన కలగాలి అంటే బ్రాహ్మీ ఉండాలి. మంచి ఆలోచన కలగాలి అంటే ఆవిడ వీణా నాదం చేయాలి. ఆ వీణా నాదనంలో నుంచి ఆయన ఆలోచనలన్నీ చక్కగా దగ్గరై దానిలో నుంచి పరమాద్భుతమైనటువంటి సృష్టి రచన చేసినటువంటి, ప్రారంభించినటువంటి రోజు గనుక ఇవాళ ఇది యుగాది, యోగాది, ఉగాది. ఉ ఉంది, యు ఉంది, యో ఉంది, ఇన్నున్నాయి. నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలమే కలియుగం. అందులో ఇవాళ మనం ఐదు వేల ఐదు వందల పది సంవత్సరాలకి వచ్చాం ఇంకా. ఇంకా ఎంత సమయం ఉందో చూడండి. నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఈ కలియుగం నడవాలి. మరి ముందు ముందు ఎట్లా ఉంటుంది అంటే మానవుడి ప్రవర్తనను బట్టి సమాజం ఉంటుంది. మానవుడి ప్రవర్తనను బట్టి ప్రకృతి ఉంటుంది. మానవుడి యొక్క సత్వగుణాన్ని బట్టి ఈ ప్రకృతి పరమ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ వసంత కాలంలో మనం ఇవాళ ఆరు రుచులు ఉగాది పచ్చడి అని పేరు పెట్టేసుకున్నాం. ఆ ఉగాది ఆరు రుచులు ఏమిటంటే ఆరు ఋతువులకి సంకేతం. అవి ఈ శరీరానికి ధాతువుని, పుష్టిని, తృష్టిని, మనసుకు సంతృష్టిని అనుగ్రహించాలి గనుక వాటిని కేవలం రుచులుగా భావించకూడదు. షడ్రుచులు అంటాం. షడూర్మములతో, షడ్ వికారములతో, షడ్ వర్గములతో దేహం ఏర్పడింది కాబట్టి ఈ ఊర్మములు, వర్గములు వీటన్నింటినీ కూడా సమన్వయం చేయటానికి ఇవాళ భూమి నుంచి మనకి అద్భుతమైనటువంటి ఔషధీ గుణాలతో కూడినటువంటి పళ్ళన్నీ కూడా చేతికి వస్తున్నాయి. నిన్నటి వరకు కనపడని రసవత్తరమైనటువంటి, రసాత్మకమైనటువంటి, రసతుందిలమైనటువంటి మామిడి పండు వస్తుంది. అట్లా ఒక్కొక్క పండు ఈ కాలంలో వసంత కాలంలో వచ్చే పుష్పాలు వేరు. వసంత కాలంలో దొరికే పళ్ళు వేరు. వీటన్నింటినీ కూడా మనం మితంగా గనుక తీసుకున్నట్లయితే శరీరానికి immunity పెరుగుతుంది. ఇవాళ మనం అది ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇవాళ immunity tablets ద్వారా injections ద్వారా రాదు. మనిషి యొక్క ఆలోచన ద్వారా immunity పెరుగుతుంది. కోవిడ్ కోవిడ్ కోవిడ్ అనుకుంటూ ఉండండి కోవిడ్ వచ్చేస్తుంది. దాని గురించి పట్టించుకోలేదు అది అటునుంచి అటే పోతుంది. ఇది సత్యం. ఇది encourage చేయటానికి చెప్పే మాట కాదు స్వీయ అనుభవంలో నుంచి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఏది రానివండి ఎన్నో వచ్చినాయి ఇవాళ ఏదో భయపడిపోతున్నాం గాని ఇది వస్తుందేమో అన్న భయమే దాన్ని రప్పిస్తుంది గమనించండి. ఎప్పుడైనా అంతే. negative energy ని మనలో generate కాకుండా మనం చూసుకోవాలి. దానికి ఏం చేయాలి? మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలకు అన్నింటికంటే మూలమైనది ఏది అంటే పంచాంగము. పంచాంగము శ్రవణము, పఠనము అని రెండు ఉన్నాయి. శ్రవణం అంటే వినాలి. వినాలి అంటే చెప్పేవాడు ఉండాలి. కాబట్టి పఠించేవాడు ఒకడు, శ్రోత ఒకడు ఉన్నట్లయితే దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే కాలము ఎట్లా తనను తాను విభజించుకొని, ఏ కాలంలో, ఏ సమయంలో, ఎంతగా మనం ఇక్కడ జీవించాలో, మన కార్యకలాపాలను ఎట్లా నియంత్రించుకోవాలో, తద్వారా దివ్య జీవన విధానానికి శ్రీకారం ఎలా చుట్టాలో చెబుతుంది గనుక పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం తప్పకుండా చేయాలి. పంచాంగాన్ని పఠించాలి. అందులో మనకు వచ్చే లాభనష్టాలు, తూకాలు అవన్నీ ఉంటాయి. వాటిని గురించి కూడా పట్టించుకోవద్దు. ఎందుకనంటే అది gross గా చెప్పబడుతుంది. individual గా అది applicability దాంట్లో ఉండదు. గోచార ఫలం అంటారు కదా, ఆ గోచారము అంటే ఈ ఎక్కడన్నా, ఏ జాతిలోనైనా, ఎవడైనా ఒక నక్షత్రంలో పుడితే వాడికి ఇలా ఉంటుంది అని చెబుతుంది. జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి జ్యోతిశ్శాస్త్రం ప్రకారం వ్యక్తిగతమైన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి చలనాలు, వాటిని బట్టి ఏం రాబోతున్నదో మంచో చెడో చెప్పగలిగేది జ్యోతీ jyotyam అంటే కాంతి. మనం నడిచి వెళుతూ ఉంటే ఒక torch light వేసినట్టుగా ముళ్ళున్నాయి, పొదలున్నాయి, గుంటలున్నాయని చెప్పడానికి జ్యోతిశ్శాస్త్రం కావాలి. మనల్ని మనం రక్షించుకోవటానికి, మనం attentive గా ఉండి జాగ్రత్త పడటానికి కాబట్టి జ్యోతిశ్శాస్త్రం కూడా పుట్టినటువంటి సమయం. ఈ జ్యోతిశ్శాస్త్రాన్ని ప్రపంచానికి సహేతుకంగా అంటే హేతుబద్ధంగా, చాలా scientific గా, mathematical గా, arithmetic గా ప్రపంచానికి చెప్పిన వాడు మళ్ళీ వరాహమిహిరుడే. కాబట్టి ఇవాళ వరాహమిహిరుడు అనేటువంటి ఒక మహాపురుషుడ్ని మనం తలుచుకోవాలి. ఆయన రాసిన బృహత్ సంహిత అంతా కూడా, అంతా తెలియకపోయినా ఇవాళ ప్రపంచంలో మనం science పేరు మీద ఏ research చేస్తున్నామో అవన్నీ కూడా ఆయన ముందే చెప్పారు. ఎక్కడ నీళ్ళు ఉంటాయి water divining ఎలాగ అని చెప్పారు, ఎలా చేయాలో. నేరేడు, ఆ నీలిగన్నేరు చెట్టు ఉంటే దాని కొమ్మ విరిచి ఆ కొమ్మ పట్టుకుంటూ ఆ భూమి చుట్టూ గనుక ఎక్కడికి వెళుతూ ఉంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అది గిరగిర తిరుగుతుంది ఇక్కడ నీళ్ళున్నాయని చెప్పగలుగుతారు. వాటిని water divining అని మనం పేరు పెట్టుకున్నాం. అంటే విజ్ఞాన శాస్త్రం అంతా కూడా ఈ ప్రపంచం నిండా నిండి ఉన్నది.ఈ ప్రపంచం ద్వారా ఈ సైన్స్ ద్వారా దీని మూలం ఏమిటో మనం కనుక్కోవటానికి అనువైనటువంటి కాలము ఈ వసంత కాలం ఒకటి. ఇక ఇందాక చెప్పుకున్నాం వేద విజ్ఞానం కావాలి వేద విజ్ఞానానికి అందుకనే జ్యోతిషశాస్త్రాన్ని గురించి కూడా స్వామి దాన్ని తక్కువ చేస్తూ కాక గ్రహాల పని వాటి పని వాటిని చేయనివ్వండి అవి చేస్తూ ఉంటాయి నువ్వేం చేసినా అవి ఆ పనులు జరుగుతూ ఉంటాయి కానీ నీకు దైవానుగ్రహం గనక ఉన్నట్లయితే ఈ గ్రహాలు నిన్నేమీ చేయవు అని చెప్పారు. అంటే భయపడతాం కదా ఏదో శని వచ్చాడు కేతు వచ్చాడు ఇవన్నీ మనం వింటుంటాం కానీ దైవానుగ్రహం మన యందు ఉన్నంత కాలం ఈ గ్రహాలు మనల్ని ఏమీ చేయవు. దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే దైవాన్ని అనుసరించి జీవించటమే. ఆ దైవం ఎవరంటే గురు స్వరూపంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పారో దాన్ని చక్కగా వింటూ దానికి అనుగుణంగా గనక మన జీవనం చేయగలిగినట్లయితే అది ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇవాళ ప్లవ నామ సంవత్సరంలో మనం చేయవలసినటువంటి అన్ని పనులలోకి మొట్టమొదటిది ఇవాళ నుంచి మళ్ళీ వసంత కాలం వచ్చేదాకా మనం ఏం చేయబోతున్నాం? ఏం చేయాలని అనుకున్నాం? మన ప్రణాళికలు ఏమిటి? మన షెడ్యూల్ ఏమిటి? మన జీవితాన్ని ప్రతిరోజూ ఒక క్యాలెండర్ లాగా తయారు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపాలి. ధర్మార్థ కామ మోక్షాలను అనుసరించి జీవించాలి. ఇవన్నీ జీవించటానికి వీలైనటువంటి ఇది ఈ కాలం కాబట్టి ఈ వసంత కాలానికి మనం స్వాగతం పలుకుతున్నప్పుడు చూడండి ఇందాక అనుకున్నాం నానానాద సందోహం అన్నాం అడవి ఆకుల గాలిలో నుంచి నాదం వచ్చిందని ఆ నాదంలో నుంచి సంగీతం పుట్టిందని ఆ సంగీతం ఇట్లా ఉదాత్త అనుదాత్త స్వరాలలో ఉంటుందని దానికి సరిగమపదని అనేటువంటి ఏడు స్వరాలు సప్తస్వరాలుగా ఉన్నాయి అని ఇవన్నీ అనుకుంటే సామవేదం అంతా కూడా సామగానమే. ఈ సామగానాన్ని సామవేదం యొక్క అంతర్వాహిని అయినటువంటి సామగానాన్ని ఈ ప్రకృతికి పరిచయం చేసింది ఎవరు అంటే కోకిla. కోయిల అన్నా కోకిla అన్నా ఒకటే. అది వచ్చి ఎక్కడ ఏ చెట్టు ఉన్నా అక్కడ ఆ కుహూ కుహూ అనేటువంటి ఆ పలకరింత లో నుంచి జీవితం కూడా ఉదాత్త అనుదాత్తాలతో కూడి ఉంటుంది ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎత్తు రాగానే మిడిసి పడద్దు, కింద పడిపోగానే ఇక లేవలేవు అనుకోవద్దు. కింద పడ్డావు అంటే నువ్వు లేస్తావ్. నువ్వు బాగా పైకి వెళ్ళావు అంటే చాలా జాగ్రత్తగా ఉండు. అప్రమత్తంగా ఉండాలి ప్రమత్తంగా ఉన్నట్టయితే నాకేమవుతుందిలె అంటే ఆ పైనుంచి జారి కింద పడతావు అని చెప్పటానికి ఈ సంగీతం మనకు ఏర్పడింది కాబట్టి ఈ ఇదిగో సంగీతం వచ్చేసింది ప్రపంచంలోకి అని చెప్పటానికి వచ్చినటువంటి పరమాద్భుత సంగీత దూత ఎవరు అంటే కోకిla. కోకిla గానాలు వింటుంటాం కదా, వాటిలలో నుంచి అనేక భావాలు వస్తుంటాయి కదా, అది అరుస్తున్నట్టుగా ఉంటుంది అరవటం కాదు. ఆ గొంతును గనక మనం వింటూ వింటూ ఉన్నట్లయితే దానికి అనాహత నాదం అని పేరు. మనకు అనిపిస్తుంది కోకిla కాసేపు ఆపేస్తే బాగుండు కదా, కోయిల దానికి అలుపు రాదా, దప్పిక వేదా, అలా అరుస్తున్నది ఏమిటని. అనాహత నాదం అనేటువంటిది మహా యోగం. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతం లయానాం అంటారు. అంటే ఒక లక్షా ఇరవై ఐదు వేల లయ యోగాలున్నాయట. ఆ లయ యోగాలలో నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనది అని చెప్తారు. అందుకనే సత్య సాయి భగవానుడు మనకి మీరందరూ భజన చేసుకోండి అని ఎందుకు చెప్పారు? నాదానుసంధానం జరగాలి. నామ రూప భావ తత్వాలు ఒక భజనలో మనం అనుభవించగలగాలి. మంచి ఆ భజనకారుడు లేదా సంకీర్తనకారుడు భజన చేస్తున్నప్పుడు ఆ రాముడి గురించి భజన చేస్తే రాముడు దర్శనం ఇచ్చినట్లుగా మనకి ఒక అనుభవం అవుతుంది. ఎట్లా అవుతున్నది అంటే అట్యూన్మెంట్ అంటాం. మన హృదయాన్ని రామ హృదయంతో మన హృదయాన్ని విష్ణు హృదయంతో మన హృదయాన్ని లలితా అమ్మవారి యొక్క హృదయంతో కలుపుకున్నప్పుడు ఏది అనుకుంటున్నామో దేనిని సంకీర్తన చేస్తున్నామో అది ఆవిష్కృతమవుతుంది. తర్వాత భజన చేస్తున్నప్పుడు రెండు చేతులు అరచేతులు చరుచుతూ భజన చేయాలి. ఆ భజన చేయటానికి నిశ్శబ్దంలో గనక ఉన్నట్లయితే చుట్టూ వాతావరణం ఒక అద్భుతమైనటువంటి ఆ లాభం కలుగుతుంది శరీరానికి. ఏమిటి ఆ లాభం అంటే మనకు కావలసిన సర్వశక్తులు ఎక్కడున్నాయో తెలుసునా? ఈ చేతి వేళ్ళ చివర్లో ఉన్నాయి అరచేతిలో కాదు చివర్లలో ఉన్నాయి. అందుకనే రెండు చేతులు జోడించి నమస్కరించమన్నారు. అంటే ఆ పూర్ణమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అవతల వ్యక్తికి మనం వరదానం చేస్తున్నట్లు లెక్క. అట్లాగే ఆతని నుంచి కూడా మనం అలా ఆ నమస్కారాన్ని స్వీకరించాలి. మనం ఇవ్వాలి తీసుకోవాలి తీసుకుంటూ ఉండాలి ఇస్తూ ఉండాలి. అంతే కాదు భజన వలన ముఖ్యంగా సంగీతం, సాహిత్యము, శృతి, లయ, ధృతి, ఆధృతి, వేగము, ఆవేగము, సంయమనము, సంచారము, సమన్వయము, సమ్యక్ భావన, సమ్యక్ సంకీర్తన అనబడేటువంటి అనేక కోణాల్లో ఒక భజన చేయాలి. అట్లా జరిగితేనే దాని పేరు భజన. కాకపోతే అది పాట. పాట వేరు, కీర్తన వేరు, భజన వేరు. భజనలో మన సర్వాంగీణమైనటువంటి ఈ దేహంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు మన యందు ఉన్నాయి. మెడికల్ సైన్సెస్ ప్రకారం డెబ్బై రెండు వేల నాడులున్నాయి. అంతవరకే తీసుకున్నా డెబ్బై రెండు వేల నాడులు జాగృతం కావాలి.జాగృతం కావాలి అంటే భజన చేయాలి భజజన చేయాలి అంటే క-కీర్తన రావాలి కీర్తన రావాలి అంటే పాడాలి అంటే సంగీతం కావాలి సంగీతం వచ్చిన కంఠం ఉండాలి కంఠం ఉండాలి అంటే వాక్ శుద్ధి ఉండాలి వాక్ శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది యోగంలో నుంచి వచ్చింది ఇవన్నీ ఒక ప్రకృతిలో ఒక కోకిల సాధించగలిగినప్పుడు ఒక కోయిల తన పాట పాడగలిగినప్పుడు సర్వోన్నతమైన మానవ జన్మ ఎత్తినటువంటి వాడు దీని నుంచి ఎందుకు దూరంగా వెళ్దలుగుతున్నాడు ఇది ప్రశ్న కాబట్టి నిరంతరాభ్యాసంగా మనం సంవత్సర కాలము నాస్తి నాస్తి కలవు నాస్తి హరి నామ వినా గతిహి అక్కడ హరి అంటే పరమాత్మ పరమాత్మ యొక్క నామాన్ని గనక మనం నిరంతరము చేస్తూ ఉంటే అందుకే స్వామి భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ భజన చేసే టైంలో ఇంకేదో సంపాదించవచ్చు అంటే అది సంపాదించగలవేమో గానీ దీని వలన వచ్చే లాభాన్ని నువ్వు పొందలేవు కాబట్టి దీనికి సమయాన్ని ఇవాళ ఉన్నటువంటి కొన్ని విపత్కర దుస్తర దుష్కర పరిస్థితులకు అనుగుణంగా సత్యసాయి భగవానుడి యొక్క భక్తులుగా మనకు ఒక కర్తవ్యం ఉన్నది నిత్య భజన చేసుకోవాలి ఇంట్లో దాని వలన అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తరంగాలు ఈ వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలనం చేస్తాయి. రుద్రం చదువుకోవాలి భద్రతమైన జీవితం కావాలి మనకి రెండు నూరేళ్ళు ఇక్కడ ఉండాలి ఉండి చాలా పనులు చేయాలి ఏ పని చేయటానికి వచ్చామో అది పూర్తయ్యే దాకా మనం ఉండి తీరాలి ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆయుష్మంతంగా ఉండాలి ఇవన్నీ కలగటానికి ఇదిగో ఈవేళ ఈ ప్లవ నామంతో వచ్చినటువంటి ఈ సంవత్సరం మనందరికీ కూడా శుభప్రదమై శుభాయమానంగా ఉంటుంది అలాగే ప్రతి మనిషికి ఒక ప్రజ్ఞ ఉంటుంది ఆ ప్రజ్ఞని సమాజహితం చేయాలి. రాయగలిగిన వాడు రాయాలి మాట్లాడగలిగిన వాడు చక్కని విషయాలు మాట్లాడాలి ఏదీ కాలం చెల్లగొట్టకూడదు ఏదీ కాలక్షేపం కాదు అంతా పరమేశ్వరార్చన పాట అయినా మాట అయినా ఒక భావన అయినా ఒక తలపైనా సమన్వయంగా అందరూ కూర్చొని చేసినా ఏకాంతంలో చేసుకున్నా ఎలా చేసిన ఈశ్వరార్చన కళాశీలత మనయందు ఉండాలి. దాని వలన మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పరమ పవిత్రమై ముందు మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది గనుక ఈ ప్లవ నామ సంవత్సరంలో మనం ఉన్న స్థితి నుంచి ఇంకో పై స్థితికి వెళ్ళాలి పై అంటే ఉత్తమ స్థితికి వెళ్ళాలి. ఆ ఉత్తమ స్థితికి ఎలా వెళ్లాలో భజన ఒక ప్రధానమైనటువంటిది ప్రధానంగా కలియుగంలో జ్ఞాన యోగము జ్ఞాన కాండ చాలా తీవ్రంగా చెప్పిన సామాన్యుడికి అర్థం కాదు గనుక సామాన్యుడికి గనక భజన నేర్పిన ట్లయితే నెమ్మది నెమ్మదిగా వాడు దానిలో ప్రవేశించి ఏదో ఒక రోజున జ్ఞానయోగ సాధనలోకి వాడు వెళ్తాడు గనుక ప్రాథమికంగా వాడిని లోపలికి మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. సమస్తమైనటువంటి జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి భావనలో మనం మన కార్యకలాపాలు చేయాలి స్వామి మనకు నేర్పింది అదే చేయమన్నది అదే నిజానికి ఆయన చేసింది కూడా అదే. జాతి లేదు మతం లేదు కులం లేదు వర్గం లేదు డబ్బున్నవాడు లేదు డబ్బు లేని వాడు లేడు అందరూ ఒక గొడుకు కింద రాగలిగారే అటువంటి ఆ ధీశక్తి మనయందు ఉండాలి. భగవంతుణ్ణి కీర్తించి వేడుక చేసి ఊరేగించినందువలన కొంత ఆనందం కలగచ్చు కాక కానీ భగవంతుడి వేసినటువంటి మార్గంలో లేదా చూపిన మార్గంలో మనం నడవగలిగినట్లయితే సమాజం మొత్తం కూడా ధర్మబద్ధంగా ధర్మం వైపే నడుస్తుంది ఎందుకని అంటే ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని గనక మనం ఆచరిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది అంతేతప్ప ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అని ధర్మాన్ని మనం రక్షించలేం మనం రక్షించటం అంటే దాన్ని ఆచరించడమే అలాగే సత్యమేవ జయతే ఇవన్నీ కూడా ఉపనిషత్ వాక్యాలే సత్యమే చివరకు జయిస్తుంది నిజం ఎందుకంటే సత్యానికి ఓటమి లేదు సత్యానికి పతనము లేదు ఏదో సూర్యుడి మీద మబ్బు పరచినట్లుగా గ్రహణం వచ్చినట్లుగా కనపడకుండా ఉంటుందేమో గానీ మాయా చాటున దాగిన మహిత సత్యాన్ని జీవుడు గమనించాలి మనం మాయావరణంలో ఉంటాం ప్రాపంచికమైన అపేక్షలు ప్రాపంచికమైన ఆకర్షణలు ఆ డబ్బు పట్ల లాలస జీవితం పట్ల ఒక అనాసక్తి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవగాహనా లేమి వలన ఏర్పడుతున్నాయి గనుక ఆ అవగాహన పెంపొందించుకునేటువంటి దిశగా మన ప్రాచీన వాంగ్మయాన్ని లేదా మనకు అందుబాటులో ఉన్న రామకథా రసవాహిని స్వామి రాసిన ముఖ్యంగా ప్రధానంగా రామకథా రసవాహిని భాగవత వాహిని గీతా వాహిని వంటి వాటిని మనం నెమ్మదిగా చదువుకుంటూ గనక ఉన్నట్లయితే మనకి తెలియకుండానే మనలో ఒక పరిణామ స్థితి ఏర్పడి మన ఉన్న స్థితి నుంచి తప్పకుండా ఉన్నత స్థితికి వెళ్తాం. అలాగే అనేక సమితులు ఏర్పడటానికి ముందు ఏర్పడినటువంటి హిమాయత్ నగర్ సమితిలో చాలా చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అనేకమందిని దగ్గర చేసినయి దగ్గర కూర్చినయి. అనేక విషయాలు చర్చించబడినయి అనేక సేవా కార్యక్రమాలు జరపబడినయి. అనేకమైనటువంటి కళా స్వరూపాలు స్వామి పరంగా ప్రదర్శించబడినయి ఇదంతా ఎలా జరిగింది? ఈ ప్రజ్ఞలన్నింటినీ ఒకచోటికి ఎలా తేగలిగారు అంటే స్వామి తేగలిగారు. స్వామి తెచ్చి చూపించారు దాన్ని మనం సస్టెయిన్ చేయాలి అంతే. అందరం ఒకచోట కూడి ఈశ్వరార్చన గనక చేసినట్లయితే దాని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్ళీ ప్రపంచానికి ఇవ్వగలిగినట్లయితే అది ప్లవ నామ సంవత్సరంలో మనకి అన్-- మనల్ని అన్ బర్డెన్ చేస్తుంది మిగతాదంతా బర్డెనే.సంపాదిస్తాం, విజ్ఞానం సంపాదిస్తాం, ఎవరో సత్కారం చేస్తారు, ఎవరో శాలువా కప్పుతారు. అది మోయలేని బరువు. వాటన్నింటికీ దూరంగా. కేవలం సేవాకృతులుగా, ప్రేమాకృతులుగా గనక మనం మారి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమైపోతుందో అని కాక ఏమీ అయినా ఏం చేయలేం. అందుకే భగవాన్ రమణ మహర్షి గొప్ప మాట చెప్పారు. ఆయన తల్లి అడగమ్మ ఆయన దగ్గరకు వచ్చి "ఇంతమందికి అన్నం పెట్టగలిగాని నీకో ముద్ద పెట్టలేనా, ఎందుకనాయనా ఊరు వదిలి వచ్చేసావ్?" అని అడిగితే ఆయన ఏం మాట్లాడలే. కానీ ఆవిడ రోదించింది. చాలా బాధపడింది. అప్పుడు భక్తులందరూ "భగవాన్! మీకు జన్మనిచ్చిన తల్లి ఏదో ఒక మాట చెప్పండి" అని అంటే ఆమెకు మాట చెప్పలే. ఆయనన్నారు "కర్త అంటే భగవంతుడు జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత జరగాలి, ఇది జరిగి తీరాలని నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు. ఇది జరగకూడదు అని నువ్వు ఎంత నిరోధించినా అది జరగక మానదు. కనుక నువ్వు ఏం చేయాలంటే మౌనం వహించి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి." మౌనం వహించి అంటే ఏ పనీ చేయకుండా అని కాదు. మౌనం వహించి స్థితిని అంగీకరించి మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వెళితే కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు అన్నీ వెనకబడి పోతాయి. వెనకబడిపోయి ముందు దారి అంతా కూడా వెలుగు పుంతలాగా, వెలుగు దారిలాగా మనకు కనిపించి ఈ ప్లవ నామ సంవత్సరం మనల్ని ఉన్న స్థితి నుంచి మహోన్నతమైన స్థితికి తీసుకు వెళుతుంది. కడగా ఇట్లా వెళుతూ వెళుతూ ఉండగా ఏదో ఒక రోజున మనలో మనకి నేను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న కలిగి నే కేవలం దేహం మాత్రమే కాదు, ఇంద్రియాలు మాత్రమే కాదని ఒక సత్య స్ఫూరణ కలిగి అక్కడి నుంచి జ్ఞాన యోగంలోకి వెళతాడు. తొలి రోజునే జ్ఞాన యోగంలోకి వచ్చేయాలని ఏం లేదు. ఎవరు? మహాత్ములు, కారణ జన్ములు వాళ్ళకి లభిస్తాయి. మనమంతా కూడా శారీరకమైనటువంటి ఆ-భావనతో ఈ శక్తిని ఆధారం చేసుకొని శరీరం మాధ్యం ఖలు కర్మ సాధనం, శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైనటువంటి కర్మ కలాపాలన్నీ కూడా మనం ఈ శరీరం ద్వారా చేయాలి గనుక ఈ సంవత్సరం అంతా take care of your body. శరీరానికి ఒక fitment ఇవ్వండి. Detoxify చేయండి. మనస్సుని అక్కరలేని ఆలోచనలతో నింపకండి. I always say continue to empty your mind. ఏదో ఒక పని చేయాలి, దానికి తగిన ఆలోచనలు, ఆ project work చేయాలి. Project work చేసేసావు, ఎవరికి పంపాలో పంపావు. Unburden yourself. దాన్నే don't carry everywhere. దానివలన నువ్వు మోయలేని బరువు నీ యందు ఉంటుంది గనుక ఆ సమయంలో ఆ space లో ఏం పెట్టాలంటే భగవత్ చింతన, భగవదారాధన, భగవద్భావన, భగవంతుని గురించిన తలపులతో గనుక మనం గడపగలిగినట్లయితే అది ఉదాత్త భూమికగా మనం భావన చేయాలి. స్వామి చెప్పిన అనేకమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. వాటన్నింటిలో కంటే ఈ ఒక్క సంవత్సర కాలం పరిస్థితి బాగా లేదు గనుక మనం we have to discipline ourselves. ఇవాళ ఒక survey ఏం చెప్పిందంటే vaccine సుమారుగా 20% protection ఇస్తుంది. Not beyond. Vaccine వేసుకోవాలి, దానికి time ఉంది, వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఒకటో రెండో వేసుకోవాలి. దానికి చాలా limitations ఉన్నాయి. మనం ఎవరి మీదో ఆధారపడాలి. కానీ ఎవ్వరి మీద ఆధారపడనటువంటి ఒకానొక సూత్రీకరణ ఏం జరిగిందంటే ఎట్లా ఉన్నా నువ్వు mask ధరించినట్లయితే 85% నిన్నది protect చేస్తుంది. Mask చిన్న గుడ్డ ముక్క మూతికి అడ్డం కట్టుకొని గనక జీవించగలిగినట్లయితే అది బరువు కాదు. శరీరం, ఇంత శరీరానికి ఒక చొక్కా, ఒక ప్యాంటు, బెల్టు అన్నీ పెట్టి దానికి అలంకారం చేస్తున్నామే, భద్రంగా వెళుతున్నామే. ఈ ఒక్కటి, ఈ ఒక్క సంవత్సర కాలం కరోనా అనేటువంటిది ఆ-ఉఫ్ఫ్ అని మంత్రంతో పోదది. అది వచ్చింది. అది కొంతకాలం ఉంటుంది. దానితో మనం ఉండాలి. ఎలా ఉండాలి? మన ప్రాణం పోయేట్టుగా దానితో ఉండకూడదు. ప్రాణం నిలబెట్టుకునేట్టుగా ఉండాలి. ఈ discipline ఎవరో చెప్తే కాదు, ఎవరికోసమో కాదు, ఎవడో fine వేస్తాడని కాదు, మనల్ని మనం నియంత్రించుకోవాలి. తగిన మందు వేసుకోవాలి. తగిన ఆహారమే తినాలి. తగినంతే తినాలి. ఎందుకంటే మనం ఎక్కడికి కదలటం లేదు. కాబట్టి చాలా time ఉంది కదా అని అమితంగా తినకూడదు. ఇంకా ఇదివరకు తింటున్న దాంట్లో కూడా తగ్గించుకోవాలి. ఎందుకని? Physical exercise and activities చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ covid మనకి ఏ క్రమశిక్షణ నేర్పిందో, ఏ స్వామి సన్నిధిలో మనం ప్రశాంతి నిలయంలో గాని, మన భజన మందిరాల్లో గాని, మన సమితులలో గాని ఎంత నిర్దుష్టంగా మనం చక్కగా జీవితాన్ని గడుపుతామో ఇంట్లో ఉన్నా కూడా అట్లాగే ఉండాలి. కాదు నేను మైదానంలో ఒక రకంగా మందిరంలో ఇంకో రకంగా ఉంటానంటే ప్రారబ్ధము, దాని వలన కలిగే ఫలితము నీదే తప్ప అన్యోల్లది కాదు. అలాగే ఎప్పుడూ కూడా జీవన దృక్పథం చాలా ప్రధానం. అలాగే జీవన విధానం ప్రధానం. జీవితానికి ఒక ఆశావహమైన దృక్పథం చాలా అవసరం. రేపు నేను ఉంటాను అనుకొని ఈ వేళ బతకాలి. ఇంకొద్ది రోజులు నేను ఇక్కడ ఉండబోతున్నానని పని చేయాలి. నేను ఏ పని చేసినా నా తర్వాత తరానికి అందాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. ఇవి moral philosophy కాదు. ఒక అనుభవంలో నుంచి, ఒక అనుభూతిలో నుంచి, జీవనానుభవంలో నుంచి ఉడిసి పట్టుకున్నట్టువంటి కొన్ని మహా సత్యాలు. వీటన్నింటినీ గనక మనం చేయగలిగినట్లయితేఅందరినీ ప్రే-ప్రేమించు అందరినీ సేవించు మనకి స్లోగన్ అయిపోయింది కదా Love all, serve all, Love all, serve all what is that? మనమందరినీ ప్రేమిస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారు. స్వామి ప్రేమమయుడు పరమాత్మ ఎలా అయినారు అంటే ఆయన ఈ ప్రపంచాన్ని ప్రేమించారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని ఆయన ప్రేమించారు. కనుక, ప్రపంచం మొత్తం ఆయన ఒక్కరినే ప్రేమించింది. ప్రపంచానికి సేవ ఎలా చేయాలో చెప్పారు. అందరి చేత చేయించారు. కాబట్టి ఈ సేవలో నుంచి కింకరత్వంలో నుంచి మనందరినీ కూడా శంకరత్వం వైపు నడిపించారు. నిద్ర లేస్తూనే కింకరో కింకి, ఇవ్వాళ ఏం చేయాలి నేను? What is that I have to do? భోజనం చేయాలి, మూడు గంటలకు పడుకోవాలి, ఆరు గంటలకు లేవాలి అది కాదు. నేను జన్మ ఎత్తినందుకు ఇవ్వాళ నిద్ర లేచినందుకు మళ్ళీ రేపు పొద్దున వరకు ఏం చేయాలి? ఏదోటి చేయాలి. ఏం చేయాలి? లోకహితమైనటువంటి పని చేయాలి అని అనుకున్నట్లయితే ఆ కింకరో కింకరో అనేవాడు మంచే చేస్తాడు గనుక శం అంటే శుభమని, మంగళమని, శోభ అని అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి ఆ మంగళకరమైన మంగళాత్మకమైనటువంటి దానిని ఇస్తాడు గనుక ఆయన శంకరుడు. శంకరుడు అంటే శివుడని కాదు. శం అంటే శుభం, శుభమును కలిగించువాడు. వాడికి మూలం ఏమిటి అంటే వాడు కింకరుడు, నేనేం చేయాలి అనేవాడు. కాబట్టి మనం కింకరత్వంలో నుంచి శంకరత్వంలోకి, అజ్ఞాన భూమికలో నుంచి జ్ఞాన యోగంలోకి, అలాగే ఏమవుతుందో ఏమవుతుందో ఎప్పుడు పోతామో ఈ కరోనా ఎటు నుంచి వస్తుందో నుంచి అమృతత్వ భావనలోకి, ఏమవుతుంది ఏం కాదు అనేటువంటి దాని వలన దానిని గురించి ఆలోచించే కొద్దీ మనలో immunity పడిపోతుంది. దాని గురించి ఆలోచించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దానివలన immunity పెరుగుతుంది. ఎందుకని? మనకున్నటువంటి భయం వలన మన energy కూడా drain అయిపోతుంది గనుక ఆ పని చేయకూడదు. అలాగే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తమసోమా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. మృత్యు భావన నుంచి బయటపడి సంపూర్ణమైన అమృతత్వం వైపు మనం వెళ్ళాలి. ఆహ్ వెళ్ళటానికి కావలసినటువంటి అన్ని మార్గాలు కర్మ, భక్తి, యోగ, జ్ఞాన యోగాలన్నీ కూడా స్వామి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి మనందరికీ కూడా మనకే కాదు ప్రపంచం మొత్తానికి ఆయన చెప్పవలసినవన్నీ చెప్పారు. ఇంక ఆయన చెప్పవలసిందంటూ ఏం లేదు. మరి ఏం మిగిలింది అంటే ఆచరించటానికి మనం ఇంకా ఉన్నాం. మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే మనల్ని చూసి మరొకడు ఆచరిస్తాడు. దీపం నుంచి దీపం వెలిగించుకుంటూ వెళ్ళాలి. జ్యోతిష జ్యోతి జలాతే జలో అని మనం పాడుతాం. దాని అర్థం అదే. ఏ ఆత్మ అఖండ జ్యోతి నీ యందున్నదో దాన్ని బయటకు తెచ్చి ఆ వెలుగు పుంతలో అనేకమందిని నడిపించగలిగినట్లయితే దానికి ఈ సంవత్సర కాలం మాత్రం ప్లవ నామ సంవత్సరం మానవుడి పక్షాన ఉన్నది. అది మనకు అన్ని అవకాశాలు ఇస్తుంది. ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అవకాశాన్ని అన్నింటినీ ఇస్తుంది గనుక ఆ కాలాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని జీవితంలో ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకుని జీవితాన్ని పరిపూర్ణంగా జీవించేటువంటి ఒక ఆధ్యాత్మిక భావనలో మనందరీ మనస్సులు నిలకడ చెందాలి. హృదయాలు అలాగే పల్లవిస్తూ ఉండాలి. ఏకాత్మభావనతో ఉండాలి. ఏది చేసినా ఈశ్వర ప్రీతి కోసం చేయాలి. ఆ ఈశ్వరుడు బయట లేడు. స్వామి చెప్పారు కదా, దేవుడనగా వేరు దేశమున లేడు. తాను చేయు పనుల యందు తగిలి ఉండు. మనం ఏ సత్కర్మలలో ఉంటామో అక్కడ భగవంతుడు ఉంటాడు. వాడే భగవంతుడు. ఆ కర్మే భగవంతుడు. ఆ జ్ఞానమే భగవంతుడు. భగవంతుడంటూ ప్రత్యేకంగా లేడు. కాబట్టి మనందరికీ ఇప్పుడు మనం వింటున్న, అంటున్న అందరం కూడా ఏనకేన ప్రకారేణ యః కశ్చాపి దేహినః సంతోషం జనయేత్ ప్రజ్ఞహత దేవ ఈశ్వర పూజనం. ఇది వేద వాక్యం. ఎవరో మహాకవి కూర్చొని రాసింది కాదిది. ప్రతి జీవుడికి, మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి ఒక ప్రజ్ఞ ఉన్నది. రాసేవాడు, గీసేవాడు, మాట్లాడేవాడు, పాడేవాడు అనేకమంది ఉన్నారు. వీళ్ళందరూ తమ చుట్టూ ఉన్నటువంటి చిన్న ప్రపంచానికి తమ ప్రజ్ఞ ద్వారా గనుక ఆనందం కలిగించగలిగినట్లయితే అది మాత్రమే ఈశ్వర పూజ అని చెప్పింది. మిగతా అర్చన, ఆరాధన, అభిషేకం ఇదంతా కూడా బహిరంగ క్రతువు. అది చేయవలసిందే, దాన్ని వదిలిపెట్టమని కాదు. కానీ మన ప్రజ్ఞ ఇంకొకడికి ఆనందాన్ని కలిగించాలి. మన ప్రజ్ఞ ద్వారా అవతల వాడి ప్రజ్ఞ ఇంకా పదింతలు కావాలి. దానికి ప్లవ నామ సంవత్సరం కాల స్వరూపిణియే మనకు అనుగ్రహ వరదానం చేయాలని, దానికి సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనందరి యందు సద్భావన కలిగించి, సద్భక్తి కలిగించి, సదాలోచన కలిగించి, సమ్యక్ సంకీర్తన కలిగించి, సదాచారాన్ని మన యందు ప్రవేశపెట్టి మనల్ని ఒక సమ్యక్ భావనతో, సమ్యక్ దృష్టితో అంటే comprehensive outlook ఉండాలి మనకి. వీడు వాడు, వీడి కులం ఇది, వీడి మతం అది, వీడి జాతి అది, వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు ఇది మనసు చేసే గారడీ. దాని నుంచి మన మనసును బయట పడేసి అందరము కూడా అమృత లోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాం. మళ్ళీ మన source లోకి మనం వెనక్కి వెళ్ళాలి. వెళ్తాం, ఎప్పుడో రోజున వెళ్తాం. ఆ వెళ్ళేలోగా మనం ఇక్కడ చేయవలసిన పనులన్నీ కూడా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటాడు యోగేశ్వర కృష్ణుడు. అంటే నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను నువ్వు చేయాలి. నీవు చేయలేనిది, నీవు చేయకూడనిది, ఇంకెవరో చేయవలసినది నువ్వు తలకెత్తుకోవద్దని ఒక హెచ్చరిక. అక్కడ స్వధర్మము అంటే ఆత్మధర్మమని గనుక మనం కూడా స్వామి భావాలని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో కాస్త ఉదాత్త స్థాయిలో మనము విచారణ చేసుకుంటూ వెళదాం. ఏదో మహిమలు చెప్పుకునే కాలం వెళ్లబుచ్చి, నాకేదో అనుభవించారు, రాత్రి కల్లో కనిపించారు, కనిపిస్తే మీ దగ్గర ఉంచుకోండి.అది కాదు కావలసింది, కావలసింది ఒక్కటే. ఒక అవతారమూర్తి ఈ ప్రపంచంలోకి వచ్చి సమస్త ప్రపంచాన్ని ఏకతాటి మీద నడిపించినటువంటి మహాచైతన్య పురుషులు భగవాన్ శ్రీ సత్యసాయి. అటువంటి స్వామితో మనం సన్నిహితంగా మెలిగాం, ఆయన్ని తాకం, ఆయనతో మాట్లాడాం, ఆయనతో కలిసి జీవించాం అర్ధ శతాబ్ది పైగా. మనం ఎలా ఉండాలి? కాగలిగితే స్వామి అంతటి శక్తిమంతులం కావాలి. దానికి దీక్ష కావాలి, శ్రద్ధ కావాలి, నీతి కావాలి, నిష్ట కావాలి, clarity కావాలి, conviction కావాలి, confessions కావాలి. ఇవన్నీ ఉన్నట్లయితే స్వామి ఊహించిన, స్వామి భావించిన, స్వామి ఆశీర్వదించినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఒకరోజు ప్రశాంత నిలయం అయ్యేటువంటి కార్యక్రమంలో మనందరం కూడా మన కాలాన్ని వెచ్చించాలి, కాలదానం చేయాలి. మనల్ని మనం అటువంటి సత్కర్మలలో, ఆ కార్యక్రమాలలో మనల్ని మనం నిలబెట్టుకోవాలని భావన చేస్తూ హిమాయత్ నగర్ ఇందాక కొన్ని మాటలు, మంచి మాటలు విన్నాను. ఎన్నో ఆర్.వి. సుబ్బారావు గారిల్లు ఎన్ని జరిగినాయో, మోహన్ రావు గారు, జయలక్ష్మి గారిల్లు ఎన్నెన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయో. అలాగే హిమాయత్ నగర్, గాంధీ నగర్ లో జరిగినటువంటి అనేకమైనటువంటి శిబిరాలు, బాల వికాస్ శిబిరాలు, వేసవి శిబిరాలు. కళ్యాణి, దివాకర్ వీళ్ళందరూ ఒక్కళ్ళు కాదు, భాగ్యలక్ష్మి వీళ్ళంతా స్వామి సైన్యం, స్వామి తయారుచేసిన రత్నమాల ఇవి. వీళ్ళందరూ కూడా తమ తను, ధను, మను మూడింటిని దాని యందు ప్రవేశపెట్టారు. ఇంటి ఇంటా సత్సంఘాలు జరిగినయి, ఇంచు ఇంచులో జరిగినయి, జరక్కుండా ఎక్కడా లేదు. అది దశాబ్దాలకు పైగా. అవి కేవలము ఎక్కడా, ఏనాడు స్వామి మహిమలతో దాన్ని కాలం చెల్లగొట్టుకోలే. ఎన్నెన్ని సంగతులు, ఎన్ని విషయాలు! భారతీయ పురా వైభవ వాంగ్మయాన్ని మనం పునస్మరించుకుంటూ ఎంత చక్కగా జీవితాలను మనం గడిపామో. ఆ తరానికి మళ్ళీ హిమాయత్ నగర్, గాంధీ నగర్ అనగానే ఆ బి.వి.ఎల్. నరసింహారావు గారు గుర్తు రాకుండా I just can't close. ఎందుకంటే ఒక engineer అయి ఉండి, ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక పద్ధతిని అలవర్చుకొని, ఇది స్వామి నన్ను పిలుస్తారా, నాకు interview ఇస్తారా అనేటువంటి ఏ రకమైన లాభాపేక్ష లేకుండా ఎవరు వస్తే వాళ్ళకి వేదం నేర్పి, పాటలు నేర్పి, భజనలు నేర్పి, మాట్లాడటం నేర్పి, ఆ వ-వైద్యాలు ఎలా వాయించాలో నేర్పి అనేకమైనటువంటి సాధనలు చేసినటువంటి ఆ బి.వి.ఎల్. నరసింహారావు గారిని మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి. చాలా పనులున్నాయి. హిమాయత్ నగర్, గాంధీ నగర్ రెండూ కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు కలిసే ఉన్నాయి విడిపోలే. administration కోసం రెండుగా చీల్చుకున్నామే తప్ప మరొకటి కాదని నేను భావన చేస్తూ వీటి అన్నింటియందు సుమారుగా ఇరవై ఒకటి plus ముప్పై నాలుగు, ముప్పై ఐదు సంవత్సరాలుగా మమేకమై ఉన్నటువంటి నా బోటి వాడికి ఇట్లాగే ఈ కార్యక్రమాలు నిరంతరము సాగుతుండాలని, స్వామి కీర్తి, స్వామి గౌరవం పదింతల అయ్యేట్లుగా ఇది పరిఢవిల్లాಲని నేను కోరుకుంటూ, అలాగే మిగతా ఓ కోటి సమితి గాని, అలాగే ఆ రామాలయపూర్ హబ్సిగూడ సమితి గాని, ఇవన్నీ సమితుల పేర్లు. ఏ సమితి అయినా స్వామి యందు ఉన్నటువంటి అపారమైన భక్తి వలన, ప్రేమ వలన, ఆయన యందున్నటువంటి విశ్వాసం వలన ఎన్నెన్ని ఎవరూ ఊహించలేని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్లవ నామ సంవత్స-శ్రీ ప్లవ నామ సంవత్సరం మనందరికీ కూడా యుక్తిని, శక్తిని, భక్తిని, రక్తిని, ముక్తిని సమృద్ధిగా అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మన యందు అంతర్జ్యోతియై, అంతఃశక్తియై, అనంతమైనటువంటి మహాశాంతియై మనందరినీ చల్లగా మన స్వస్థానం వైపు నడిపించు గాక అని స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ, ప్రణమిల్లుతూ మీ అందరికీ సాయిరాం.
YouTube · audio
Plava Naama Samvatsara Ugadi Satsang I I 13-April
Plava Naama Samvatsara Ugadi Satsang I I 13-April
0:00 / 56:34