⁂
No transcript for this section.
Transcript begins at 0:35.
ఇది చాలా కఠినమైనటువంటి సాధన. పైకి ఎంత తేలికగా అనిపిస్తుందో, ఏమీ లేదు అని ఉండగలమా? మన దేహాన్నే మనం శాశ్వతం అనుకుంటాం. మన ఇంటలెక్ట్ ను మనం శాశ్వతం అనుకుంటాం. మనం సంపాదించిన స్థిర సంపదలు, కీర్తి శాశ్వతం అనుకుంటాం. అన్నీ నిన్ను-- నీ నుంచి ఒక రోజున వీడిపోయేవి, వాడిపోయేవి, ఊడిపోయేవి. నీ దేహమే నీతో ఉండదు కొద్ది రోజులు అయిన తర్వాత. కా-కనుక ఇది నాది అని అహంకార మమకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే అహంతో కూడిన మనసులో నుంచి. "అహం మమత్వా శిథిలాయమా" అని అంటారు శంకర భగవత్పాదులు. దానినే ఇక్కడ అహాన్ని వదిలిపెట్టండి. అహం వదిలిపెడితే తప్ప, నీకు గురువు ఎవరు అర్థం కాదు. అహంకారం ఉండనా గురువు చిక్కడు. గురువు చిక్కనా అహంకారం ఉండదు. గురువు దక్కిన తర్వాత, చిక్కిన తర్వాత కూడా ఇంకా నేను నేను నేను అనుకుంటే, మేనుతో కూడిన నేను వదిలిపెట్టండి. నేనైన నేనుగా అన్ని కాలాల్లో నిలకడ చెందండి అని చెప్పే ఈ అద్భుతమైనటువంటి ఆత్మ విచార ధారణే ప్రపంచానికి ఇవాళ అనుకూలమైనటువంటి భాషలో రెండవది, ఊరకుండండి అన్నారు. ఊరక ఉంటామా? ఉండగలమా? ఊరక ఉండాలి అంటే ఇంకేదో పని చేద్దాం అనిపిస్తుంది. ఇంకేదో సంపాదించుకోవాలనిపిస్తుంది. ఇంకేదో పొందాలనిపిస్తుంది. దేనినో వదులుచుకోవాలనిపిస్తుంది. కనుక ఈ ఏమీ లేదు, ఊరకుండండి అంటే మనస్సు యొక్క నియంత్రణే. ఈ మనస్సుని ఆధునిక యువత చాలా జాగ్రత్తగా గమనించండి. ఎట్లా దీనిని మనో నియంత్రణ ఎలా చేయాలి అంటే, అనేక చోట్ల అనేక శిబిరాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ డబ్బు కట్టు, నీ మనస్సు ఎలా అరికట్టాలో మేము చెప్తాం అని. ఏమీ అవసరం లేదు. మైండ్ ని మైల్డ్ చెయ్. భక్తి చేత, భక్తి భావన చేత, భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం చేత, ఆయన రాముడా, కృష్ణుడా నీ ఇష్టం. శివుడా, కేశవుడా, మాధవుడా నీ ఇష్టం. శక్తి ఆ నీ ఇష్టం. కానీ, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక పంచాక్షరి మంత్రాన్ని గనక పెట్టుకున్నట్లయితే, ఆ మైండ్ వయోలెంట్ గా ఉన్న మైండ్ చాలా అతలాకుతలమైనటువంటి మనసు నెమ్మదిగా మైల్డ్ గా మారుతుంది. ఆ మైల్డ్ గా ఉన్నటువంటి మైండ్ ని నెమ్మదిగా మెండ్ చేసుకో. నీకు కావలసిన రీతిలో దాన్ని రూపాంతరీకరణం చెయ్. కాసేపు మనసా ఆగు అని చెప్పాలి. మనసా నా పనికి అడ్డు రాకు అని చెప్పగలగాలి. మనసు చెప్పినట్లే గనక మనం వెళ్లినట్లయితే, మనలో పుట్టి మనతో పెరిగి మనలో ఉన్న మన మనసుకి మనం బానిసలం అయినట్లయితే, మనం జీవితాలు పోగొట్టుకుంటాం. చెల్లగొట్టుకుంటాం. అందుకనే మైండ్ ని మైల్డ్ చేయాలి. మైల్డ్ చేసిన దానిని మెండ్ చేయాలి. ఆ మెండ్ అవుతున్న సమయంలో దాన్ని కావలసినట్లుగా బెండ్ చేయాలి. అంటే ఉంచుకోవాలి, కావలసిన రీతి. బెండ్ అయిన మైండ్ ని ఎండ్ చేయాలి. ఇది మనస్సు యొక్క స్థితి. మనోనాశనము అంటే మనస్సు లేకుండా చేసుకోవటం కాదు. మనకు కావలసిన రీతిలో ఆ మనస్సును నిర్మాణం చేసుకోవటం. మనకు కావలసిన రీతి అంటే ప్రాపంచికమైనది గాక, ఆత్మవిచార మార్గంలో ఆ మనస్సుని ఎలా తీసుకు వెళ్ళాలి, దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అన్నప్పుడు ముందు ఆ మనసుకి ట్రైనింగ్ ఇవ్వు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ మనస్సుని టేమ్ చెయ్. టేమ్ చేయటం అంటే నువ్వు చెప్పినట్లు అది వినాలి. టేమ్ చేసిన మైండ్ ని టేర్ చేసేసెయ్. దాన్ని పల్ప్ చెయ్. దాన్ని పిండి చేసేయ్. ఆ కించిత మనసుతో ప్రపంచంలోని జీవయాత్ర సాగించు. ఈ ఆంగ్ల పదాలు వేళ మనం ఎందుకు వాడుకోవాలి అంటే, ఆధునిక యువత ఉపదేశ సారమో, రమణ మహర్షియో, శంకర భగవత్పాదులో, యోగేశ్వర కృష్ణుడు, వేదమో అనంగానే, అమ్మో ఇది మాది కాదు, అవి మాకు అర్థం కావు అనుకుంటారు. అర్థమయ్యే రీతిలో మనం విచారణ చేద్దాం. ఈ ఆత్మవిచార మార్గంలో ఏమీ లేదు, ఊరకుండండి తో పాటుగా తీవ్రమైనటువంటి సాధన చేసినవారు పరమహంస యోగానంద, పాల్ బ్రెంటన్, కోహెన్, చాడ్విక్, నారాయణ గురువు. ఇదిగో కావ్యకంఠ వాసిష్ఠుల వంటి ఒక స్థాయికి చెందిన వారందరూ వారి దగ్గరికి వెళ్లి, "ఆత్మవిచార మార్గంలో మమ్మల్ని మేము ఎరిగే ఆ ఎరుకలోకి ఎట్లా వెళ్ళాలి భగవాన్?" అని అన్నప్పుడు, "నేనెవరు అన్న ప్రశ్న వేసుకో" అన్నారు. ఇది రమణాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే అతి బలమైనటువంటిది. నేనెవరు అన్న ప్రశ్న మనం వేసుకుం. నువ్వెవరు అన్న ప్రశ్న మనం వదిలిపెట్టం. చూసారా. నువ్వెవరు, Who are you అంటాం తప్ప Who am I అని ఒక్కనాడు కూడా అద్దం ముందుకు నుంచొని గాని, అద్దం వెనక నుంచొని గాని, మనతో మనం కూడి ఉండి గాని, మరి ఎవరితోనో ఉన్నప్పుడు గాని, నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవటం లేదు. ఆ నేనెవరు అనంగానే, నా డిగ్రీలు చెప్తున్నాం, నా డాక్టరేట్లు చెప్తున్నాం, నాకున్న బిరుదులు చెబుతున్నాం, నాకున్న సంపద చెప్తున్నాం, నా దేహ సౌందర్యాన్ని చెప్తున్నాం. ఇవన్నీ చెప్పి ఇవన్నీ నేను అనుకుంటున్నాం. ఈ అనుకున్నవన్నీ శరీరానికి సంబంధించినవి. అవన్నీ నువ్వు ఈ ప్రపంచంలో acquire చేసినవి. ఇక్కడ పొందినవే, ఇక్కడే వదిలిపెట్టవలసినవి. నీతో వచ్చేది ఒక్కటి కూడా లేదనేటువంటి ఒక వైరాగ్య విభూతిని, ఒక వైరాగ్య భావనని, ఒక నిశ్చితమైనటువంటి ఒక rational approach ని, ఒక జీవన దృక్పథాన్ని పరమ రమణీయార్ద్రంగా ఆవిష్కరించినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆత్మవిచార మార్గంలో నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవాలి. ఈ నేనెవరు అన్నటువంటి ప్రశ్న ఎలా వేసుకోవాలి, దీన్ని ఎక్కడ పట్టుకోవాలి? అంటే స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు, దాంతో పాటు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్న మరొక నాలుగు శరీరాలు. ఈ నాలుగు ప్లస్ మూడు ఏడు శరీరాలు. ఇది దాటితే ఆత్మ ఉన్నది అని మనం చెప్తున్నాం. అందుకనే విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం అవతారికలో...ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబ యేని ఈ శరీరంబు నీదే. ఓ పరమాత్మ నేను నేను నేను అంటూ ఇంతకాలం జీవితం సాగించాము. మరి ఈ నేను లో ఈ దేహం నేను అనుకున్నట్లయితే పంచభూతాలు నేను కాదు కానీ అన్నీ కలిపితే నేనవుతున్నానా? దివాకరుండు కుడి ముక్కు కుడి రంధ్రం. నిశాకరుడు అంటే పగలు రాత్రి అనబడేటువంటి కాలం. దివా రాత్రాలు అంటే సూర్య చంద్రులు శాసిస్తున్నారు గనుక. సూర్య నాడి చంద్ర నాడి అనబడేటువంటి ఈ రెండు. అదిగో పంచభూతాలు ఐదు. ఈ రెండు మొత్తం కలిపితే ఏడు అవుతున్నాయా? అయితే పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబ యేని. అవి ఏవీ నేను కాదు. విడివిడిగానే గాలి కాదు, నేను నీరు కాదు, నిప్పు కాదు, అలాగే సూర్య నాడి కాదు, కాలము నేను కాదు, నేనేం కాదు. కానీ ఇవన్నీ కలిపితే నేనవుతుంటే ఆ నేను ఎక్కడి నుంచి వచ్చి-వచ్చింది అంటే అది నేను నుంచి వచ్చింది గనుక ఆ ఇదంతా నీవే అన్నమాట అని అంటూ కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగకెట్లు? నేను పుట్టాను అంటున్నాను. నాకు తెలీదు. ఎలా పుట్టానో తెలీదు, ఎప్పుడు పుట్టానో తెలీదు, ఎక్కడ పుట్టానో తెలీదు, ఎవరో చెప్తే నాకు తెలిసింది తప్ప అది నేను ఎరుగను. కన్ను మూయుట అది నాకు తెలీదు. ఎప్పుడు కన్ను మూస్తానో తెలియదు, మూశానో తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కనురెప్ప వాలాలన్నా, కనురెప్ప ఎత్తాలన్నా నువ్వు లేకుండా ఎట్లా జరిగింది? మరి అన్నీ నీదే అంతా నీదే అయినప్పుడు ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు. ఈ ఏడును కాకపోతే ఎవరు అంటే వాడు అని ఎనిమిదో వాడు లోపల ఉన్నాడట. ఆ ఎనిమిదో వాడికి ఆత్మ అని పేరు పెడదామా? అని అంటూ కెరలి నన్నేమి మిగిల్చితి నా స్వామి. నేను పద్మశ్రీ అన్నాను, పద్మభూషణ్ అన్నాను, భారతరత్న అన్నాను, డాక్టరేట్ అన్నాను, ఇంకేదో అన్నాను. కానీ ఇవన్నీ కాక చివరికి విచారణలో నేను ఏమీ కాదని తేలినప్పుడు నిజానికి నేనెవరు? బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక. ఇప్పుడు అర్థమైంది పరమాత్మ. నేనెవరు? నేనెవరో తెలుసునా? అవి ఏవీ కాకపోయినా, నాయందున్నవన్నీ నీవే అయినా, నేనంటూ ఇక్కడ ఉన్నాను అంటే నువ్వు ఉన్నావు అన్నదానికి నన్ను అభిజ్ఞ గుర్తుగా నన్ను నిలబెట్టావా తండ్రీ అన్నాడు విశ్వనాథవారు. అంటే ఆ నేను అనేటువంటిది దేహపరంగా వాడుతూ వచ్చాం మనం. దానిని ఆత్మ పరంగా వాడమని పరిచయం చేసినవారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అందుకే Who am I అన్నారు. దీనికి ఒక చిన్న అరుణాచలంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకుందాం. మంచి చలికాలం. అరుణాచలం పైన ఉన్నారు కొండమీద. ఇంకా చలి ఎక్కువ ఉంది. చలిగాలులు బాగా వీస్తున్నాయి. ఆయన చుట్టూ కొంతమంది భక్తులున్నారు. అందరూ శాలువాలు కప్పుకున్నారు. చలి నుంచి కాపాడుకోవటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలతో అందరూ ఉన్నారు. ఒక్క భగవాన్ రమణ మహర్షి తప్ప. అందులో ఒక భక్తుడికి ఒక చిన్న బాధ కలిగింది. అయ్యో మనందరం బాగున్నాం, గురువుగారు చలికిలా ఉట్టి కౌపీనం కట్టుకొని చలికిట్లా వణికిపోతారా? అని బాధ కలిగి భగవాన్ దగ్గరికి వెళ్లి, భగవాన్ తిరువణ్ణామలైకి మీ దగ్గరికి వచ్చేటప్పుడు నా సూట్కేసులో రెండు కోట్లు తెచ్చుకున్నాను. ఒకటి ఇప్పుడు నేను ధరించాను. రెండవది కొత్తది. అది నేను తెచ్చి మీకు ఇవ్వనా, కప్పుకుంటారా? అని అడిగారు. ఏమయ్యా! కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఇక్కడే ఉంది. అది ఒకటి. రాత్రి పదైన తర్వాత పడుకుంటే స్వప్నావస్థకి సూక్ష్మ శరీరం రెండవది ఉండనే ఉంది. ఇలా కల కానీ మెలకువ కానీ స్థితిలో సుషుప్తి అని మూడవది కారణ శరీరం ఉంది. అన్నివేళలా ఉన్న మనస్సు అక్కడే ఉంది. బుద్ధి అక్కడే ఉంది. చిత్తము, అహంకారము ఇయన్నీ కలిపితే ఏడు శరీరాలు ఇక్కడే ఉండగా దాని లోపల ఉన్న ఆత్మకు చలి వేస్తుందా, కోటు అక్కర్లేదులే అన్నారు. అంటే జ్ఞాన ధారలో ఒక జ్ఞాని దేహాంతరాత్మని దాటి, దేహాత్మ భావనను దాటి, ఆత్మైక స్వరూపుడుగా, జ్ఞానిగా నిలకడ చెందినప్పుడు తన దేహాన్ని ఏ మాత్రము పట్టించుకోడని, ఆ దేహము నడిచినంత కాలం నడుస్తుందని కానీ నడిపించేవాడు ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనిన. ఈ శరీరానికి, ఈ ఆలోచనకి, ఈ భావనకి, ఈ కర్మకి, ఈ యోగానికి, ఈ ప్రాప్తికి, ఈ అనుగ్రహానికి కారణం ఎవడో ఉన్నాడు. ఆ ఎవరు అంటే వాడు ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అంటే మళ్ళీ పరమాత్మలో నుంచి ఎట్లా-- సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి వెలువడే సుషుమ్నా కిరణాలు చంద్రకాంతికి ఎట్లా చెంది ఉన్నాయో, అంటే చంద్రుడిలో నుంచి వచ్చిన చంద్ర కిరణం చంద్రుడే. సూర్యుడిలో నుంచి వచ్చిన సూర్యకిరణం సూర్యుడే. అట్లాగే సర్వవ్యాప్తమైనటువంటి, పరివ్యాప్తమైనటువంటి పరమాత్మలో నుంచి వచ్చిన జీవుడు కూడా తన యందు ఆత్మను నిలుపుకొని ఉన్నాడు గనుక పరమాత్మ వలె జీవించాలని, పరమాత్మ వలె సంభావించాలని, పరమాత్మ వలె దేనినీ అంటకుండా, అంటించుకోకుండా, Doership లేకుండా, ఇది నేను చేశానన్న అహాన్ని వదిలిపెట్టి, లోపల ఉన్నటువంటి ఆత్మ వలె, జ్యోతి వలె, ప్రకాశమానమైనటువంటి వెలుగుగా, క్రాంతిగా, కాంతిగా, దాంతిగా ఉండగలిగినట్లయితే అదే సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ. ఎందుకంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ హరయా నారాయణాన్వేషితం. నారాయణుడిని అన్వేషించటానికి వచ్చిన కట్టకడపటి జన్మ ఇది, మానవ జన్మ.అందుకనే భగవద్గీతలో యోగేశ్వర కృష్ణుడు చెప్తాడు "బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అనేక జన్మలు ఎత్తి ఇదిగో ఈవేళ జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? దేహం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అంటే ఏమిటి? ఈ శాస్త్రాలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పటికీ నా యందు పొటమరించింది, నా యందు పుట్టింది. అంటే అనేక జన్మల చివరి జన్మగా నేను దీనిని భావన చేసినప్పుడు దీనిని నేను సద-సద్వినియోగం చేసుకోవాలి. సద్వస్తువుకై వెతకాలి. ఆ సద్వస్తువు బయట లేదని, నా యందు ఉన్నదని నేను ఆ ఎరుకలో నిలకడ చెంది ఉండాలి. ఉదాహరణకి చూడండి, అన్నమాచార్యుల వారు ముప్పై మూడు వేల సంకీర్తనలలో శ్రీ వేంకటేశ్వరుడిని వర్ణించని రీతి లేదు. ఎన్ని రకాలుగా ఎన్ని దేవీదేవతలతో ఎన్ని భావాలతో అనేకమైనటువంటి రీతులలో కవితా విన్నానంతో ఆవిష్కరించుకున్నాడు. కానీ జీవన చరమాంకంలో దర్శనమే లభించని ఒకానొక స్థితిలో ఏమన్నాడు? "చిత్తజగురుడా! నీకు శ్రీమంగళం" బయట వెతికాను, శివుడువన్నాను, భవుడువన్నాను, మాధవుడువన్నాను, కేశవుడువన్నాను, అమ్మవారువన్నాను, నేనేనన్నాను, ఆత్మనన్నాను, గురువు అన్నాను. కానీ ఎక్కడున్నావు నువ్వు? చిత్తజగురుడువై యున్నావ్. నా చిత్తము లోపల నీవు నాయందు ఉన్నావ్. అటువంటి ఓ గురుడా, ఓ ఆత్మా! నీకు నమస్కారం అన్నాడు అన్నమాచార్యులవారు. అలాగే చాగరాజ స్వామి వారు ఏమని ఏమన్నారాయన? "మరుగేలరా ఓ రాఘవా! తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య." నువ్వు బయట ఉన్న రఘురాముడివి, దశరథ రాముడివి కాదు. నా యందున్న ఆత్మ రాముడిని నేను తిన్నగా వెతికా. అంతకు ముందు తిన్నగా వెతకలే. శాస్త్రాల్లో వెతికాను, పుస్తకాల్లో వెతికాను, ఎవరో చెప్పిన మాటల్లో వెతికాను, ప్రవచనాల హోరులో వినిపించిన మాటలు అవుననుకున్నాను. ఇవేవీ కాదని నేను నేనుగా, నేనైన నేనుగా నిలకడ చెందినట్లయితే, నాలోనే ఆత్మ పూర్ణంగా వికాసమానం చెంది ఉన్నదని, అది వెలుగు ముద్ద అని, అది వెలుగుమయమని ఒక విద్య నాకు ఏర్పడింది. ఆ విద్య సద్విద్య. ఆత్మను గురించిన అటువంటి విద్య. సద్విద్య, ఆత్మ విచారణ, నేనెవరిన్న ప్రశ్న, సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి మాట, వాడే అంతా చేయిస్తున్నాడన్న మరొక మాట, ఏదో ఒక అనంత మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అనేటువంటి ఒక వరిష్ఠమైనటువంటి నమ్మకం, ఇవన్నీ భారతీయ ఆత్మకు ఆ-సంకేతాలు కనుక, అవే ఆధారాలు కనుక, ఈ పరిణామశీలమైనటువంటి, పరిణామ గతమైనటువంటి ఈ ప్రపంచం క్షణక్షణానికి చలచ్ఛలితంగా మారిపోతుంది. అందుకనే శంకర భగవత్పాదులు [గొంతు సవరించుకుంటున్నారు] "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా, యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే" ఇది ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ ప్రపంచం అంతా నాకు అద్దంలో బొమ్మల్లే కనిపిస్తున్నది. అంటే బింబం ఎక్కడో ఉంది, ఇది ప్రతిబింబం. ప్రతిబింబాన్ని చూసి నేను బింబం అనుకుంటున్నా. అద్దం ముందుకు వెళ్లాను, నుంచున్నాను. నేను బొట్టు పెట్టుకుంటే అద్దంలో బొ-ప్రతిబింబానికి బొట్టు పెట్టినట్లే. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి నేను బొట్టు పెట్టలేను. కాబట్టి అద్దం ముందు ఉన్నది ఈ ప్రపంచం, అద్దం వెనుక ఉన్నది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఇది ఇంతే. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు. దాని స్వభావంతో, దాని వేగంతో, దాని ఆవేగంతో, దాని ధృతితో అనేకమైనటువంటి రీతులలో సాగుతూ వెళుతుంది గనుక ఆ ప్రపంచాన్ని చక్కగా అర్థం చేసుకొని, ప్రపంచంలో మనం ఈ జన్మ ఎత్తి వచ్చినందుకు ఆ జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా వాడు యువకుడా, బాలుడా, కౌమారంలో ఉన్నాడా, వృద్ధాప్యంలో ఉన్నాడా, జీవన చరమాంకంలో ఉన్నాడా, ఎక్కడ ఉండనివ్వండి. మానవ జన్మ ఎత్తినందుకు తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి మనకు చాలా అడ్డంకులున్నాయి. మనస్సు ఉంది, క్రతువులున్నాయి, rituals ఉన్నాయి. ఏది ritual, ఏది spiritual మనకు అర్థం కాదు. ఈ తత్వ విచార ధారణి భగవాన్ శ్రీ రమణ మహర్షి కరుణాపూర్ణ శుతాబ్ది గనుక మురుగనార్ అనేటువంటి ఒక భక్తుడు రాసినటువంటి అనుభూతి సారాన్ని పరిష్కారం చేసి, ఈనాటి, ఏనాటికైనా చెల్లేటువంటి ఒక ఉద్గీతగా, పరమాద్భుతమైనటువంటి వైదాంతిక భూమికని మనకు పరిచయం చేస్తూ ఉపదేశ సారాన్ని అందించారు. ఆ ఉపదేశ సారాన్ని వేళ ప్రధానంగా యువకులు తమ జీవితానికి సమన్వయం చేసుకునే దిశగా వెళ్లాలని, ఆ దిశగా మన ఆ-విచార ధార కొనసాగాలని మనసా, వచసా, శిరసా భగవాన్ శ్రీ రమణను ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.