Skip to content
Transcript తెలుగు
పడుకొని ఉండటానికి వీలు లేదు. కర్త మనకి ఏది అనుగ్రహించడు. పని చేయవలసిందే. ఎందుకని అంటే అసలు దేహమే మానవ జీవితమే కర్మానుబంధి మనుష్యలోకి. ఏదో ఒక పని చేయటానికి వచ్చాం. మాట్లాడటానికి నేను వినటానికి మీరు ఎట్లా వచ్చామో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని చెప్తూ కర్మలన్నీ గొప్పవని అనుకోకండి. అవి అధమమని అనుకోకండి. చెడ్డ పని అనుకోకండి. మంచి పని అనుకోకండి. కానీ విచక్షణతో మీ అధికారాన్ని ఉపయోగించి జీవితాన్ని యదార్థంగా జీవించండని చెప్తూ కర్తృ రాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఎవరో ఫలితం ఇస్తారు. వాడు ఎవడో ఉన్నాడు మనకు సంబంధం లేదని కర్తవ్యం చేసుకుంటూ వెళితే ఏమవుతుంది అని ప్రశ్న. ఇవాళ మన ప్రజ్ఞలు బలపడతాయి. ఒకచోట మనం స్థిమితంగా ఉన్నాం. స్థిమితంగా అనేక అనుభవాలు జీవితంలో ప్రజ్ఞ అంటే ఏమిటి? అనుభవమే. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరిస్తే వస్తుంది. ఆచరణ అంటే ఏమిటి? మళ్ళీ కర్మే. కర్మలో నుంచి కర్త ఎవరంటే యజమాని. ఆయన దేవుడు కావచ్చు. ప్రాపంచిక దృష్టిలో మనకి ఉద్యోగం ఇచ్చిన యజమాని కావచ్చు. కర్మలన్నీ మనం చేసేటువంటి నిత్య నైమిత్తికమైన కర్మలు కావచ్చు. దీని వలన కర్త కర్మ రెండు ఒకచోట ఉంటే కర్త చైతన్య స్వరూపుడై లోపల ఉన్నాడు. కర్మ జడాత్మకమై దేహాన్ని ఆశ్రయించి ఉన్నది. అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన ప్రశ్న ఉన్నది. ప్రశ్న ఏమిటంటే అయ్యా! జడము దేహం అంటున్నాం. ఇది ఒట్టి ఎండు కట్టె పండు కట్టె అంటున్నాం. మరి కట్టెను నడిపిస్తున్నది ఎవరు? ఆలోచనలు కలిపిస్తున్నది ఎవరు? ఎవడో ఉంటాడు. నాకు బాగానే మంచివాడిగా బతకాలని ఉన్నది. కానీ నా మనసు ఒప్పుకోవటం లేదు. అంటే మనస్సులోకి ఆలోచనని లేదా అనేక ఆలోచనలను ఒక మనస్సుగా కట్టె కడుతున్నది ఎవరు? కట్టెల మోపు తయారు చేస్తున్నది ఎవరంటే కేనోపనిషత్తులోకి మనం వెళ్ళాలి. కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే ఆత్మ వెనక ఉంది. వెనక ఉంది. ఇంద్రియాలు ఉన్నాయి. అవేవి దశేంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. దానికి అధిష్టాత యజమాని ఎవరంటే మనస్సు. పది ప్లస్ ఒకటి పదకొండు. అదే ఏకాదశ రుద్రాభిషేకం అంటాం. జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు కదా. ఆత్మ సెన్సిటైజ్ చేస్తుంది. దేనిని? మనస్సుని. మనస్సు అనేక ఇంద్రియాలకి సంకేతాలు పంపుతుంది. ఇది సైన్స్ ప్రకారంగా కూడా కరెక్ట్. ఎందుకనంటే బ్రెయిన్ వేవ్స్ లో నుంచి ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతూ ఇప్పుడు చెయ్యి మనం ఇలా అంటూ ఉంటాం. ఎవరనమన్నారు? ఎందుకనాలి? మనం చెప్పేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం అని చెప్పటానికి ఒక సంజ్ఞగా, సంకేతంగా. నిజమే. కానీ ఇది అనిపించినది ఎవరు అని. వెంటనే అంటాం చెయ్యి అంటాం. చెయ్యిదేముంది? కదిపితే కదులుతుంది లేకపోతే లేదు. కానీ దీన్ని-- ఇది కదిలిస్తున్నది ఎవరు దీనిని అని ఆలోచిస్తే లోపల మనస్సు. మరి మనస్సుకి సంకేతం ఇచ్చింది ఎవరు? ఆత్మ. మన చేతికి గడియారం ఉంది. గంటల ముల్లు, నిమిషాల ముల్లు, సెకండ్స్ ముల్లు మనకు టైం చెప్తున్నది. ఏమిటి? ఎంత? ఎట్లా? అని. కానీ దానికి ఇది, ఇది గంటకు వైపు ఇక్కడ తిరగాలని, ఇదే వేగంతో తిరగాలని, తిరిగితేనే అది సరైన కాలమని, మెజర్ ఎట్లా ఎవరు చెప్తున్నారు? అసలు మూడింటిని నడిపిస్తున్నది ఎవరు అంటే ఎవరైనా సమాధానం ఇస్తాం. బ్యాటరీ అంటాం. కదా. బ్యాటరీ తాను కదలటం లేదు. కనిపించటం లేదు. లోపల ఎక్కడో కేసులో ఉందది. ఉన్నదని మాత్రం మనకు తెలుసు. మూడు ఆగిపోయినప్పుడు దాని శక్తి తగ్గింది అని చెప్తున్నాం. బ్యాటరీ మార్చుకుంటున్నాం. అట్లాగే ఆత్మ కూడా మన లోపల ఉండి కదలకుండా సర్వేంద్రియాలని, సర్వాంగీణమైన దేహంలో ప్రతి అణువునీ చలచ్ఛలితం చేస్తున్నది గనుక మన యందు ఆత్మ ఒక బ్యాటరీ వలె ఉన్నదని, కన్ను, ముక్కు, చెవి తదాదిగా గలిగినటువంటి అంగాంగములు అన్నీ కూడా లోపల కలిగిన ఒక ప్రేరణ చేత, ఒక కారణం చేత అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంది. దాని ప్రకారంగా పనులన్నీ జరుగుతున్నాయి. మనం కొన్ని పనులు చేయాలని అనుకోము. మనకు రావు పనులు. కానీ చేయవలసి వస్తుంది. కానీ అద్భుతంగా చేస్తాం. ఎలా చేస్తాం అంటే ఇది సహజమైనటువంటి ప్రజ్ఞ అండి అంటాం. సహజ ప్రజ్ఞలంటూ ఏం లేవు. అన్నీ ఏర్పడే ఉన్నాయి. కొన్ని ఇంతకు ముందే ఏర్పడి ఉన్నాయి. అవి ఇవాళ బయటపడుతూ ఉన్నాయి. అంతే. ఏమీ తెలియనటువంటి కాళిదాసు కవిత్వం అద్భుతంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? అప్పటిదాకా చాలా జటిలమైనటువంటి పద్యాలు రాసిన రామలింగడు చమత్కారంలోకి దిగాడు. ఎలా దిగాడు? తనను తాను ఎలా మౌల్డ్ చేసుకున్నాడు? చరిత్రలో మహాపురుషుల జీవితాలు జరి-- మనం చదివినప్పుడు ఇది మనకి కర్మలన్నీ కూడా ఒక కర్త శాసనం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇందులో ఒక వ్యక్తి విషయంలోనే ఇది అయినప్పుడు సమస్త ప్రకృతి కూడా కర్తకి అనుశాసనంగా నడుస్తాయి. ఆయన ఏం చెప్తే అవి అట్లా నడుస్తాయి. చూడండి ఒక సంవత్సరం పంటలు బాగా పండుతాయి. అదే భూమి రెండవ సంవత్సరం పంట పండదు. పండవలసినంత పండదు. కారణం రైతు కాదు. వర్షం లేక కాదు. భూమిలో పస లేక కాదు. విత్తనం బాగా లేక కాదు. కానీ ఎక్కడో మనం చేయవలసినంత పని చేయలేదన్నమాట. కాబట్టి చేసిన దానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా కర్త ఇస్తాడు అని మనం దేశం ప్రధానంగా భారతదేశం సనాతన ధర్మాన్ని నమ్మిన దేశం, సనాతన ధర్మాన్ని ఆచరించిన దేశం, గురు పరంపర ఉన్నటువంటి దేశం, యోగం ప్రవహించినటువంటి దేశం కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని, కర్త ఉన్నాడు అని అనుకో. కర్త ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి అని అనుకో. మనకు రోజూ ఆశ్చర్యమే. ఆకాశంలో చుక్కలు నేల రాలకుండా ఎలా ఉంటున్నాయి?సూర్య చంద్రాదులంతా గతి తప్పకుండా ఎట్లా నడుస్తున్నారు? అట్లాగే సముద్రాలు, నదీనదాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, పిట్టలు, గుట్టలు, మిట్టలు అన్నీ జడాత్మకమైనవి, చైతన్యవంతమైనవి. ఆయా రుతువులలో ప్రకృతి అంతా కూడా తన ధర్మాన్ని ఎట్లా పాటిస్తున్నది విచారణ చేసినప్పుడు దీన్ని నడిపిస్తున్న వాడు ఎవడో ఉన్నాడు అని అర్థమవుతుంది. అంతెందుకు? మనమే ఉన్నాం. ఆకలైంది లేదు భోజనం చేశాం. ఒక విందు భోజనం చేశాం. గంట అయిన తర్వాత అంతా సర్దుకుంది. మళ్ళీ ఏదో ఆకలైంది అంటున్నాం. తినటం వరకే మన వంతైంది. తినటం కర్మ. తిన్నది మనం. కానీ లోపల క్రియంతా ఎవడు చేశాడు? దానినంతా ప్రాణైక శక్తిగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకి vital ని ఎవరు పంపించారు అంటే మనకు తెలియదు. అంటే లోపల ఏదో ఉంది. లోపల chemical reactions ఉన్నాయి. అనేక ద్రవాలు ఉరుతున్నాయి. అందువల్ల అవన్నీ జరిగినయి. కానీ ద్రవాన్ని ఉరించిన వాడు ఎవడు? అందుకనే మనం తినేటువంటి పదార్థానికి జీర్ణం కావటానికి నువ్వు కారణం కాదు నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. అహం వైశ్వానరో భుత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నాలుగు విధాలైనటువంటి భోజనం నువ్వు చేస్తున్నావు. పదార్థం నువ్వు తీసుకుంటే నేను లోపల వైశ్వానర రూపంలో ఉండి దానిని జీర్ణం చేసి అన్నపు మెతుకులో నుంచి ప్రాణాన్ని పోస్తున్నా. convert చేస్తున్నా. ప్రాణంలో నుంచి మనస్సు పుట్టిస్తున్నా. మనస్సులో నుంచి ఆలోచన రగిలిస్తున్నా విజ్ఞానమయ కోశం. దానిలో నుంచి ఒక ఆనందాన్ని ఇస్తున్నా. చూశారా? ఒక అన్నం మెతుకు వెనుక ఇంత ఉన్నది. అన్నం బహుకుర్విత అన్నది ఉపనిషత్తు. కాబట్టి భారతదేశంలో మనం విచారణ చేయవలసినటువంటిది సంగతి ఏమిటి అంటే కర్మని చక్కగా చేయాలి, నిర్దుష్టంగా చేయాలి, సమయపాలన చేయాలి. అన్నింటికంటే ప్రధానమైనది. ఎందుకంటే డబ్బు వస్తుంది పోతుంది, వయసు వస్తుంది జారిపోతుంది, కీర్తి వస్తుంది చిన్న పొరపాటు చేస్తే అపకీర్తి కూడా వస్తుంది. కానీ కాలం ఒక ప్రవాహమై, సాక్షిభూతమై, అనంతమై, అనాహతమై, నిర్జరమై ఎట్లా నడుస్తున్నది ఎవరు వచ్చారో, ఎవరు పోయినారో, ఎవరు పుట్టారో, ఎవరు ఉన్నారో, ఎవరు గిట్టారో దానికి ఏమీ సంబంధం లేదు. కాలం చెల్లింది వీడు వెళ్లిపోతున్నాడు. రావలసి వచ్చింది పుడుతున్నాడు. దీనిలో కాలము స్వరూపంగా ఉన్నది గనుక, సాక్షిభూతంగా ఉన్నది గనుక కర్త కాలం అవుతున్నాడు. అందుకనే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై మనం వస్తాం. కాలానికి లోబడి ఉంటాం. చూడండి మనందరం కూడా పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టామో చెప్పటానికి ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫలానా రోజు ఫలానా టైం కి పుట్టాడని కాగితం రాసిస్తున్నారు. పోయినప్పుడు కూడా వీడు ఎప్పుడు పోయినాడో చెప్తున్నారు. కానీ ఎప్పుడు పోతాడో ఎవరూ చెప్పటంలే. చీటీ మన జేబులో ఉంది. తెల్ల కాగితం మీద రాసి ఉంది అంకె. మనకు కనపడదు. కాబట్టి జీవితంలో మనం పుట్టి గిట్టే లోగా నడినడి కాలం ఉన్నదే. నడినడి కాలంలో ఆత్మ విచార మార్గంలోకెళ్ళి జీవితం అంటే మనం అనుకుంటాం నందనవనం కావాలి, పూల బాట కావాలి కవులు వర్ణించినట్లుగా. జీవితమూ నందనవనం కాదు, జీవితమూ పూలబాట కాదు. మనం ఎంచుకునే మార్గం మన ఆలోచనా రీతిని బట్టి ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, మనం చేరవలసిన గమ్యాలు మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. శక్తి సామర్థ్యాలు మన ఒక్కడి వల్ల జరగవు. వైయక్తికమైనటువంటిది కాదు. We have to work as a team. tandem లో పనిచేయాలి. అందరం కలిసి పనిచేయాలి. final output అంటామే అది ఎలా ఇవ్వాలి అంటే ఎంతో మంది కూర్చుంటే, ఎంతో మంది పని చేస్తే అనుకున్న నాలుగు మాటలు బయటకు వెళ్తాయి. లేదు నేను మాట్లాడుతాను బొమ్మ గీత్తీయమంటే బొమ్మ తీసేది కావాలి, బొమ్మని సరి చేసేది కావాలి, మాటని సరి చేసేది కావాలి, ఎంతవరకు ఉంచాలో ఉంచేది ఒకటి ఉండాలి, ప్రసారం చేయాలి. అంటే ఒక మాట, ఒక పని, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి transmit కావాలంటే అనేక మంది మేధావులందరూ కలిసి ఎట్లాగైతే పని చేస్తున్నారో, మేధాశక్తి మూలమైనటువంటి కర్త జగన్నాయకుడై ప్రపంచాన్ని నడిపిస్తున్నాడన్న విశ్వాసంతో మనల్ని ఉండమని, అలాగే కర్మలన్నీ చేశాం ఫలితం రాలేదని వాపోవద్దని, ఏదో ఒక రోజున తప్పకుండా కర్త అనేటువంటి వాడు మన ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, సాధనా తీవ్రతను బట్టి అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడని భగవాన్ రమణులు చాలా చాలా స్పష్టం చేస్తూ జీవితాన్ని యదార్థంగా జీవించండి. జీవితాన్ని నడపకండి. జీవితాన్ని కాసేపు గడపకండి. జీవితాన్ని జీవించండి. దుఃఖం వచ్చిందా? రానివ్వండి. సుఖం వచ్చిందా? రానివ్వండి. ఆనందం వచ్చిందా? రానివ్వండి. ఇవేవీ రాలేదా? పోనివ్వండి. ఏది రాని, ఏది పోని, అదరక, బెదరక, చెదరక, కదలక ఎవరు సంస్థితులై ఆత్మనిష్ఠలో ఉండగలుగుతారో, జరుగుతున్నదంతా పరమాత్మ యొక్క దివ్య భావనా గరిమ అన్నటువంటి ఒక భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే రసానందమయమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి స్థాయికి ఎదుగుతారని, భగవంతుని యందు విశ్వాసం ఉంచాలని, కర్మలు మన నియతిగా చేస్తూ వెళ్లాలని భగవాన్ రమణులు మొట్టమొదటి దానిలో జీవితానికి కావలసిన కర్తను గురించిన విచారణ చేశారు. భగవాన్ శ్రీ రమణుల దివ్య భావనా గరిమకు మరొక్కసారి ప్రణమిల్లుతూ తర్వాత విచారణ కొనసాగిద్దాం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -09

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -09

Source: TFC Spiritual on YouTube

0:00 / 13:25

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

    Now playing
  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77