No transcript for this section.
Transcript begins at 5:06.
తుర్యాతీత పదస్థితాంశ కరుణం జ్ఞానాగ్ర శిలస్థితాం. మజ్జన్మాంతర పుణ్యపాక విసత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం మే. పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మెహబూబ్ నగర్ సమర్పిస్తున్నటువంటి ఈ సమర్పణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక యోగం ఒక అవకాశం మళ్ళీ స్వామి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకునే ఒక సదవకాశం అనుగ్రహించినందుకు స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మానవ జీవిత పరమార్థం ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నట్లయితే నిజానికి అధ్యాత్మ అంటే ఏమిటి? అని ఈ ప్రశ్న ఒక అరవై సంవత్సరాల క్రితం స్వామిని అడిగారు. ఆ రోజుల్లో ఆనాడు స్వామి దగ్గరికి అరవై ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు వెళ్లారు. బాగా. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, భారత, భాగవత, రామాయణ, భగవద్గీతలు వాటినంటి అన్నింటినీ కూడా ఔపోషణం పట్టిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్లారు స్వామి దగ్గరికి. కనుక వాళ్ళకి సహజంగానే వేదాల్లో ఇలా చెప్పబడింది, ఉపనిషత్తుల్లో ఇలా చెప్పబడింది, మరి స్వామి ఇప్పుడేం చెప్తారు అని ఒక ఉత్సాహం వల్ల వాళ్ళు ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి కావలసినట్లుగా స్వామి ఈ అందమైనటువంటి జవాబు ఇచ్చారు. ఇది అరవై ఏళ్ల నాటి మాట. ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే మనలో మిగిలిపోయింది. మనలో మనం అనేక విధాల చాలా మంచి వాళ్ళ కింద లెక్క మనం. పైగా సత్య-- ఒక అవతారమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడితో కూడి ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం. మనలో ఇందాక చెప్పినటువంటివి ఏవీ చెడు ఉండటానికి వీలు లేదు. కానీ ఉంటాయి. ఎందుకుంటాయి? పరమాత్మతో కూడి ఉన్నామే, పైగా పరమాత్మ నాలో ఉన్నాడంటున్నామే, ఆవో సాయి మనో మందిరమే అని భజన చేస్తున్నామే, మరి మనో మందిరానంలోకి భగవంతుణ్ణి పిలవాలి అంటే స్వామిని రమ్మని పిలవాలి అంటే ఆ మనస్సు ఎలా ఉండాలి? మన బూటు వాడు ఎవరైనా ఒకరి ఇంటికి గనక వెళ్ళినట్లయితే ఫలానా వారు వస్తున్నారు అన్నప్పుడు మన ఇంటిని ఎంత శుభ్ర పరుస్తాం. అట్లాగే భగవంతుణ్ణి మన మనో మందిరంలోకి రమ్మనమని పిలుస్తున్నప్పుడు మన మనస్సుని అంతకంటే శుభ్రంగా ఉంచుకోవాలి. అది ఏదో ఆయన వచ్చే కాసేపు ఉంటుందా? ఆ తర్వాత మళ్ళీ మనం మామూలుగానే ఉంటామా? మందిరంలో ఒక విధంగా మైదానంలో మరొక రకంగా ఉంటామంటే ప్రవృత్తిని జయించని వాళ్ళ కింద లెక్క మనం. ఇంటా బయటా, లోపల వెలుపల, అన్నిటా అంతటా, అన్ని వేళలా అన్ని స్థితులలో ఒకే ఒక్క స్థితిలో ఉండగలగాలి. అది నిజమైనటువంటి అధ్యాత్మ. ఈ నివృత్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది నిజానికి సాధ్యమేనా అంటే సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏం లేదు. మరి ఏమిటి సాధన? అష్టాంగ యోగాలా? ప్రాణాయామమా? ధ్యానమా? ఈ పెద్ద మాటలు వదిలిపెట్టి నీకు ఏది సాధ్యమో అది చేయగలిగితే దాని పేరు సాధన, అంతే. అందరూ అన్నీ చేయలేరు. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాత్రం చేయగలరు. ఆ ఏదో ఒకటి మంచి పాట పాడగలిగిన వాడు, చక్కగా రచన చేయగలిగిన వాడు, పాకెట్లో ముగ్గు వేయగలిగిన వాడు, లేదు ఇంకొకటి ఇంకొకటి ఏదైనా ప్రజ్ఞ లేని మానవుడు లేడు. ఈ ప్రజ్ఞ ఆధారం చేసుకుని ప్రవృత్తి మార్గంలో మనల్ని మనం పరామర్శ చేసుకుని, విమర్శించుకుని, మన లోపలికి మనం చూసుకుని, ఉదాహరణకి రాముడు గురించి మంచి ఆర్టికల్ రాయండి అంటే మనం ఇరవై ముప్పై పేజీలు రాయగలుగుతాం. ఇంకా రాయగలిగిన తెలివితేటలు ఉన్నవాడు పుస్తకమే రాస్తాడు, కదా. ఆ కృష్ణుడి గురించి రాయండి, ఇంకో ఇరవై పేజీలు రాస్తాం. మన స్వామి గురించి కాస్త మంచి ఆర్టికల్ రాయండి, అది కూడా రాస్తాం. అదే బ్రెత్లో అదే పాయలో మీ గురించి కాస్త రాయండి అన్నప్పుడు ఏం రాయాలో తెలియక తికమక పడిపోతాం. కారణం ఏంటంటే రాముడు గురించి తెలుసు, కృష్ణుడు గురించి తెలుసు, స్వామి గురించి తెలుసు, మన పక్కవాడి గురించి తెలుసు, మన ఇంట్లో ఉన్న ప్రతి వాడి గురించి తెలుసు, కానీ మన గురించి మాత్రం మనకేం తెలియదు. నా గురించి ఆ ఏముందండి చెప్పటానికి అంటాం. నిజానికి నీ గురించి చెప్పటానికే చాలా ఉంది. కానీ చెప్పం. ఎందుకంటే అహం వల్ల, ప్రగల్భం వల్ల, పల్చనైపోతానేమో అనేటువంటి న్యూనత వల్ల మనల్ని మనం ఆవిష్కరించుకోం. నివృత్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ జీవుడు ఎలా ఉంటాడంటే తనను తాను ఆవిష్కరించుకుంటాడు ముందు తన ముందు. రోజూ మనందరం కూడా స్నానం చేసిన తర్వాత చేసే మొదటి పని అద్దం దగ్గరికి వెళ్లి నుంచుంటాం. ఎందుకని? ఈ శరీరానికి అలంకారం చేయాలి. ఈ ప్రపంచానికి దీన్ని ఈ శరీరాన్ని చూపించాలి. అది మర్యాదపూర్వకంగా చూపించాలి. కనుక కట్టుబొట్టు అంతా తీరుగా ఉందా? తెన్నుగా ఉందా? చెక్ చేసుకుంటాం. ఆ అద్దంలో ఎవరు కనిపిస్తున్నారు? ఏ శరీరం అద్దం బయట ఉందో అదే అద్దంలో కనిపిస్తున్నది, అంతే. మనం బొట్టు పెట్టుకుంటే అద్దంలో ఉన్నదానికి బొట్టు కనపడుతుంది. అద్దంలో కనుపు-- కనబడుతున్నటువంటి బింబానికి బొట్టు పెట్టలేం. అలాగే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడు అన్నిటా అంతటా ఒక్కటై ఉంటాడు. ఇది సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ సమస్త సృష్టిని తన ఇంటిగా భావిస్తాడు.అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా సమాదరణ చేస్తాడు, సమన్వయం చేస్తాడు, సంఘర్షణ లేకుండా జీవితాన్ని గడుపుతాడు. ఇది నిజమైనటువంటి అధ్యాత్మ. అధ్యాత్మ అంటే ఆ మనం అందుకోలేనిది కాదు, పండితులు మాట్లాడేది కాదు, కవులు ఊహించి, భావించి, సంభావించి రాసే పద్యాలు, పాటలు, గేయాలు కావు. మరి ఏమిటి అంటే మన గురించి మనం నిష్కర్షగా, ఖచ్చితంగా బేరీజు వేసుకుని నా లోపాలు ఇవి, నాలో ఉన్నటువంటి plus points ఇవి. ఈ plus ని పెంచుకుంటూ వెళితే negativity పోతుందా అంటే దానికంటే మనలో ఉన్నటువంటి negativity, minus points ని గనక తగ్గించుకుంటూ వెళ్లగలిగినట్లయితే positivity పెరుగుతుంది. ఇది ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళితే అది ఒక అద్భుతమైనటువంటి అధ్యాత్మ స్థితి. ఇక పదేళ్లు అయిపోయింది. మళ్ళీ స్వామిని ఓ తరం మారింది. తరం మారి ఆ పండితుల తర్వాత వచ్చిన తరం ఏం అడిగింది అంటే, "స్వామి అధ్యాత్మ అంటే ఏమిటి?" వాళ్ళ దృష్టిలో ప్రతిరోజూ నియమంగా, నియతితో దేవాలయానికి వెళ్ళటం, ప్రతిరోజూ కాసేపు ధ్యానంలో ఉండటం లేకపోతే ప్రార్థన చేయటం, భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం ఇలాంటివన్నీ కూడా అధ్యాత్మ అని అనుకుంటాం మనం. కానీ స్వామి ఏమన్నారంటే, "ప్రభావంలో నుంచి స్వభావంలోకి రాగలిగితే దాని పేరు అధ్యాత్మ" అన్నారు. చూశారా, ఇప్పుడు ప్రవృత్తి నివృత్తి అనే గంభీర పదాలు వాడలే. ప్రభావంలో నుంచి స్వభావంలోకి రా. అది రాగలిగినట్లయితే అది అధ్యాత్మ అవుతుంది అని. ప్రభావం ఏమిటి? స్వభావం ఏమిటి? మళ్ళీ ప్రశ్నలు. ప్రభావం అంటే చూడండి మన వాకిట్లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దానంతట అది కదలదు, ఆకులు కదలవు, కొమ్మలు కదలవు, కొమ్మలు ఊగవు. కానీ గాలి గంభీరంగా వీచినప్పుడు, ఒక వేగంతో వీచినప్పుడు లేదా నెమ్మదిగా వీచినప్పుడు ఆకుల కదలికలు మనం వింటాం. అంటే దే ప్రభావమూ లేనటువంటి ఒక చెట్టు గాలి తాకిడి వలన ఆకులు అల్లలాడుతూ ఉన్నాయి. ఆకులు కదులుతున్నాయి. ఒక శబ్దం, ఒక గాలి మోసుకు వెళుతున్నటువంటి శబ్దం వినిపిస్తున్నది. అంటే తనది కాని ఒక ప్రభావానికి లోనై తన స్వస్థితిని మర్చిపోయి తాను ఉండవలసిన స్థితి నుంచి గతి తప్పి అది ఊగటం మొదలు పెట్టింది. ఆ గాలి ఆగిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ ఆ చెట్టు కూడా స్థిమితంగా తన సహజ స్థితిలోకి వస్తుంది. ఇలాగే చెట్టు ఒక ఉదాహరణ అయితే మనం కూడా పెద్ద ఉదాహరణ ఈ ప్రపంచంలో. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఆనందాలు వస్తాయి, జయాపజయాలు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తాయి, కష్టనిష్టూరాలు ఏర్పడతాయి, అన్నీ ఏర్పడతాయి. అన్నింటికీ కూడా మనం react అవుతూ ఉంటాం. దీనికి స్వామి చెప్పిన మాట ఏమిటంటే, "మీరు react కావటం తగ్గించండి, respond అవటం నేర్చుకోండి." దానికి తీవ్రంగా మీరు ప్రతిస్పందించవలసిన పని లేదు. కష్టం వచ్చింది కాస్త దాన్ని కర్మనిష్ఠగా మార్చుకోండి. మీకేదో అనుకూలత ఏర్పడింది కాసేపు నిబ్బరంగా మనస్సును ఉంచుకోండి. అది ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోతుంది. మీరు దాన్నే పట్టుకున్నట్లయితే అది వెళ్ళిపోయినా మీరు అక్కడే ఉంటారు. దాన్ని ఆసరా చేసుకుని మీ మనస్సుని కష్టపెడుతూ మీరు కూడా కష్టాల పాలు అవుతూ ఉంటారు. కనుక ప్రభావానికి లోను కాకండి. ఈ ప్రపంచం మనకు అనేక ఆకర్షణలు, అనేక సవాళ్లు, అనేక ఒత్తిళ్లు అన్నింటినీ కూడా ఇస్తుంది. మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలంటే, నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతిఃహి. నామస్మరణమే కలియుగంలో అత్యద్భుతమైనటువంటి సాధనకు మార్గం. ఎందుకంటే అది ఎవరికి వారు individual గా చేసుకునేది. నలుగురు కలిసి చేస్తే అది భజన అవుతున్నది. సంగీతంలో రాగ, భావ, తాళ, లయాత్మకంగా చేస్తే అది సంకీర్తన అవుతున్నది. కొన్ని వందల మంది గనక కలిసి చేస్తే సమ్యక్ కీర్తన అవుతున్నది. అనేక రూపాలు మారినా దాని వెనుక ఉన్నది ఏమిటంటే నారాయణ స్మరణ, భగవన్నామ స్మరణ. ఆ భగవంతుడు రాముడా, కృష్ణుడా, స్వామే, ఎవరా, ఎవరు కానివ్వండి. ఏదో ఒక నామాన్ని మనం గనక అనుకుంటూ ఉన్నట్లయితే నెమ్మదిగా మనకు ఏర్పడేటువంటి ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక నారాయణ మంత్రం, ఒక పంచాక్షరి. ఈ రెండింటినీ కూడా మళ్ళీ స్వామి దేవీదేవతలకు ముడి పెట్టకుండా అష్టాక్షరి, పంచాక్షరి సరే మంచిదే కానీ అసలు పంచాక్షరి ఏమిటంటే basic గా దేవుడున్నాడు ఇదే పంచాక్షరి. దేవుడున్నాడు ఐదు అక్షరాలు. ఆ దేవుడు రూపం నువ్వు ఏది కావాలో అది తీసుకో. ఏదైతేమి ఏదో ఒక దేవుడు, ఏదో ఒక కర్త ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని కంటికి కనిపించకుండా నడిపిస్తున్నటువంటి మహాద్భుతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది భగవంతుడని, ఆ భగవంతుడు లేకపోతే మనం శ్వాస కూడా పీల్చలేమని, ఈ భగవంతుని వరణనే ఈ చరాచరమైనటువంటి ఈ ప్రకృతి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టి, మెట్టి, గిట్టి నిరంతరమూ జీవన చక్రభ్రమణంలో తిరుగుతూ ఉన్నాయి. కనుక దీనికి మూలమైనటువంటి ఒక కర్త ఎక్కడో ఉన్నాడు అని నమ్మండి. దేవుడున్నాడు అన్న తర్వాత లేడు అనేవాడికి విచారణే లేదు. కానీ దేవుడున్నాడు అన్నప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఎట్లా ఉన్నాడు? ఉంటే ఆయన రూపం ఏమిటి? అంటే స్వామి, "దేవుడనగా వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు." మనం ఏ మంచి పని చేస్తే దానిలో భగవంతుడున్నాడు మనకంటే ముందు. ఒక మంచి మాట, మధుర మంజులమైన లలిత లలితమైనటువంటి భాషను గనక వాడుతున్నట్లయితే ఆ భాషకి మనం పెట్టుకున్న పేరు సరస్వతీదేవి. దానిని జ్ఞానమయంగా, విజ్ఞానమయంగా, సుజ్ఞాన, ప్రజ్ఞానమయంగా, సంపూర్ణమైనటువంటి అధికారంతో మాట్లాడినట్లయితే అది జ్ఞానలక్ష్మి.జ్ఞాన సరస్వతి జ్ఞానలక్ష్మి ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మన మాటలు మన పాటలు మన ఆటలు మనం కూడటాలు వీడటాలు ఇవన్నీ కూడా ఏదో ఒక తెలియని మహా దృశ్యమైన అటువంటి అంటే కంటికి కనపడని. మా-- మనసుకి మాటకు అందని అటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తికి మనం దేవుడు అని గనక పేరు పెట్టుకోగలిగినట్లయితే ఆయనో ఆమెనో ఉన్నది అని అనుకున్నప్పుడు మనకి భారం తగ్గుతుంది. ఉదాహరణకి మనం ఏదో train ఎక్కాలి railway station కి వెళ్ళాం మన దగ్గర baggage మనం మోయలేని baggage కాస్త ఎక్కువ ఉంది అప్పుడు మనం ఎవరిని పిలుస్తాం ఒక Porter ని పిలుస్తాం. ఆ Porter ఏదో ఇంత డబ్బు ఇవ్వండి నేను తీసుకెళ్తాను అంటాడు అతనికి మనం తీసుకెళ్తున్న baggage ఖరీదు కొన్ని లక్షలు ఉంటుంది కానీ అతనికి ఇచ్చేది కొన్ని పదుల రూపాయల్లో ఉంటుంది ఓ వంద రూపాయలు ఇరవై రూపాయలు అనుకోండి కానీ అప్పటివరకూ మనమే మోసుకు వెళ్లినటువంటి baggage ని ఎప్పుడైతే మనం Porter కి అప్ప చెప్పేసమో మనకి great relief వస్తుంది, వస్తుంది కదా. అప్పటివరకూ ఆ Porter ఎవరో మనకు తెలియదు మనకి అతనికి చుట్టరికం లేదు బాంధవ్యం లేదు పరిచయం లేదు భగవంతుడు కూడా he is a Porter Transporter Importer and also Exporter నాలుగు స్థాయిల్లో భగవంతుడు సంచారం చేస్తాడు. చేస్తే అట్లా మనవన్నీ కూడా మన ఇష్టానిష్టాలు కానీ మనకున్నటువంటి మూటలు కానీ పరమేశ్వరుడికి అధీనం చేసి ఉన్నట్లయితే మనం బెర్త్ మీద ఎంత హాయిగా కూర్చున్నామో అతనే వచ్చాడు అతనే సర్ది పెట్టాడు అతనే డబ్బు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు ఈ భగవంతుడు మన కష్ట నిష్టూరాలు అన్నింటిని కూడా ఇక్కడ పడేయండి అని చెప్తున్నాడు. అరవై అరవై ఐదు ఏళ్ల క్రితం స్వామి ఒక మాట చెప్పారు మీరు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు కాసు ఖర్చు లేదు మీరు ఏం చేస్తారంటే మీకేవో ఇబ్బందులు ఉంటాయి మీరు మోయలేని భారాలు ఉంటాయి జీవితం సక్రమంగా నడుస్తూ ఉండదు దాన్నంతా కూడా ఇక్కడ వదిలి పెట్టండి. నా దగ్గర ఆ మూటలన్నీ ఇక్కడ పడేయండి. ఇక్కడి నుంచి కాస్త ప్రేమను తీసుకుని వెళ్ళండి. ప్రపంచంలో ప్రేమ బీజాలు మీరు సాధ్యమైనంత వరకు చల్లుతూ వెళ్ళండి. దీనిలో మీరు ఇక్కడ డబ్బు కట్టవలసిన పనే లేదు డబ్బుతో సంబంధమే లేదు మీరు రండి హాయిగా వెళ్ళండి వచ్చేటప్పుడు భారంతో రండి వెళ్ళేటప్పుడు భారం వదులుచుకొని వెళ్ళండి. చూశారా ఎంత చక్కని ఉపదేశం చేశారు మార్గం చూపించారు సాధన. కానీ మనం ఏం చేస్తాం అంటే మైదానంలో మేకలు మేపే అతను హాయిగా ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు కూర్చొని ఉంటాడు పోనీ మేక మెళ్ళో తాడు కడతాడు ఆ తాడు చాలా పొడుగు ఉంటుంది తనకు నిద్ర వస్తుందేమో అది మేత మేసేలోగా పారిపోతుందేమో అని ఏం చేస్తాడు ఆ తాడు తన చేతికి చుట్టుకొని కూర్చుంటాడు మేక అనుకుంటుంది అమ్మయ్య నా యజమాని నన్ను దూరంగా పంపించేశాడు నేను నడవకపోయినా కూర్చున్న చెప్పిన పని చేయకపోయినా కొడుతున్నాడు నా యజమాని చాలా దూరంగా ఉన్నాడు నేను స్వేచ్ఛగా గడ్డి మేస్తున్నాను అని అది అనుకుంటుంది అది ఎక్కడికి వెళ్తుంది నా చేతుల్లోనే తాడు ఉంది కదా అని వీడు అనుకుంటాడు. మనం కూడా అదిగో ఆ మేకను మేపేటువంటి వాడి లాగా నేను భగవంతుడికి సమర్పించానండి I surrendered to భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అండి స్వామికి ఎప్పుడో సమర్పించేసానండి అంటాం కానీ మనం ఏమీ సమర్పించం. అన్నీ మన దగ్గరే పెట్టుకుంటాం పెట్టుకొని స్వామి చూసుకుంటారు అంటాం స్వామి చూసుకుంటారు ఎంతవరకంటే తాడును వదిలి పెడితే ఆయన భారం మోస్తారు మీ baggage Porter కి ఇస్తే ఆ బరువు ఆయన మోస్తారు. కానీ అన్నీ మన దగ్గరే పెట్టుకొని దీనికి తోడుగా నువ్వు కాపలాగా నువ్వు చెయ్యి అంటే చేయడు. అంటే ప్రాపంచికమైనటువంటి ప్రభావానికి లోనైనటువంటి మనస్సు నిజమైన అసలైన శిశలైన అచ్చమైన సత్యమైన స్వచ్ఛమైన అటువంటి అధ్యాత్మ భూమిక లోకి మనం వెళ్ళలేం. కాబట్టి ఈ ప్రభావాన్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి ఉదాహరణకి ఇరవై ఏళ్ల క్రితం మనందరి కుటుంబాలు మన జీవితాలు ఎలా ఉండేవి ఇరవై ఏళ్ళు కాదు ఇంకా అంతకు ముందు మన తండ్రులు లేదు మన తాతలు వాళ్ళు ఎంత హాయిగా ఏమీ లేకపోయినా తనకు ఉన్నదాంట్లో నుంచి కడుపులో నుంచి ఒక ముద్ద తీసి ప్రపంచానికి ఇవాళ మా ఇంటికి ఎవరు వస్తారు మాతో పాటు ఎవరు భోంచేస్తారు మా ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు ఎవరైనా వస్తే బాగుండును అని ఎదురు చూసినటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఇవాళ మన దగ్గర ఉన్న సుఖం గాని సంపద గాని అవకాశాలు గాని ప్రపంచానికి expose అయినటువంటి స్థితులు గాని ఇవాళకి ఏమీ లేవు. ఏమీ లేని నాడు ఒక మనిషి ఎంత సుఖంగా ఉన్నాడో చూడండి. ఇవాళ మన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు అన్నీ ఉన్నాయి సుఖం ఉన్నదా సంతోషం ఉన్నదా ఆనందం ఉన్నదా తృప్తి ఉన్నదా ఇవేవీ లేవు మన దగ్గర. లేవు కనుకనే ఇవన్నీ ఎవరైనా ఇస్తారేమోనని మనం వెళ్తూ ఉన్నాం అందుకనే స్వామి ఆ యాభై అరవై ఏళ్ల నాడు ఒకే ఒక్క మాట చెప్పారు "రాబోయే రోజులలో మీకు విత్తాపహారులైన గురువులు దొరుకుతారు తప్ప చిత్తాపహారులైన గురువులు మాత్రం మీకు దొరకరు చాలా అరుదుగా ఉంటారు" అన్నారు. అంటే మన దగ్గర ఉన్న డబ్బును బట్టి వాళ్ళు వస్తారు ఆ డబ్బు కోసమే వస్తారు. అరె ఇతని మనసు ఇతని చిత్తము బాధ పడుతున్నదే మనసు కుందిపోయిందే మనం ఏం చేయగలము అనేటువంటి భావనలో ఉండే గురువులు తగ్గిపోతారు అని చెప్పారు. ఇవాళ ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ప్రపంచం వలన ఎంత ప్రభావితం అయిపోయినమో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభావితం అయినాం కనుకనే మనకి అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలి అన్నీ నాకే కావాలి ఇక ఆనందం ఎక్కడ ఉంటుంది వస్తువుని పొందాలి అనుకుంటాం.చాలా తాపత్రయ పడతాం, దానికి కావలసిన డబ్బంతా సంపాదించుకుంటాం, market లోకి వెళ్తాం, వస్తువును కొనుక్కుంటాం, చాలా హాయిగా ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు మన యాతన ప్రారంభం అవుతుంది. దీన్ని ఎలా maintain చేయాలి? ఇది ఉంటుందా ఉండదా? నడుస్తుందా నడుస్తున్నదా లేదా? అసలు ఎంత కాలం నడుస్తుంది? అని అనేలోగా ఈ వస్తువు బదులు ఇంకో కొత్త వస్తువు వస్తోంది market లోకి. ఇది కాదు అది, అది కాదు అది అంటూ మనం మనస్సుని కకావికలం చేసుకుంటూ వెళుతున్నాం. అంటే ప్రపంచంలో మనకి ఆశయాలు తగ్గిపోయినాయి, ఆదర్శాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. మిగిలింది ఏమిటంటే ఆశలు, దురాశలు మిగిలిపోయినాయి. ఈ ఆశ దురాశలను నించి మనం నెమ్మదిగా గనుక మన మనస్సును బయట పెట్టుకోగలిగినట్లయితే, మన మనస్సునే మనం విసిరి వేయగలిగినట్లయితే అది నెమ్మదిగా స్వభావంలోకి వెళుతుంది. మానవుడి యొక్క స్వభావం, మనందరి స్వభావం ఏమిటి? తొలినాళ్లలో మనందరికీ బాగా చదువు కావాలి, తప్పేమీ లేదు బాగా చదవాలి. మంచి ఉద్యోగం కావాలి, అది కూడా కావాలి. బాగా డబ్బు కావాలి, అది కూడా కావాలి. అరవై ఏళ్లు, అరవై ఐదు ఏళ్లు ఏదో వచ్చినాయి. ఆ తర్వాత ఏం కావాలి? చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం ఎవరు ఇవ్వరు. మరి ఈ ఉన్న డబ్బు చాలదా? అవునా? కాదా? ఈ మీమాంసలో అధికమైన డబ్బు గనక సంపాదించినట్లయితే వాడు ఏమనుకుంటాడంటే, నాకు డబ్బు అవసరం లేదు. చాలు ఉన్నదేదో చాలు. మరి ఏం కావాలండి మీకు? ఈ డబ్బు కోసమే కదా ఇంత కష్టపడ్డారు అంటే, వాడు అంటాడు నాకు కాస్త ఆనందం కావాలి. ఆ ఆనందం ఎవరన్నా ఏమైనా గురువు గారి దగ్గరికి వెళ్తే ఇస్తారా? ఏదన్నా తాయత్తు మెడకు చుట్టుకుంటే ఏదన్నా వస్తుందా? ఆనందం కోసం నేను పరిగెత్తుతున్నాను అంటాడు. కస్తూరి మృగం అనే ఒకటి ఉంటుంది. అది అడవిలో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఆ సువాసన, ఆ సుగంధం ఎక్కడో ఉన్నదని పాపం అమాయకంగా అడవంతా తిరిగి వస్తుంది. ఎక్కడ దానికి అది కనపడదు. కానీ ఎక్కడికి వెళ్లినా పరిమళం తనతో ఉంటుంది. కానీ అది కంటికి కనపట్టడం లేదు. నిదానంగా కూర్చున్నప్పుడు ఆ ఆ మృగానికి అర్థమైంది ఏమిటంటే, ఆ పరిమళం నాలోనే ఉన్నది, నా నుంచి ఈ ప్రపంచానికి వెళుతున్నది అన్నప్పుడు స్థిమిత పడింది. కాబట్టి, ఇవాళ మనందరికీ ఏం కావాలి? అని అడిగితే eighty percent ఒక అరవై ఏళ్లు దాటిన వాళ్లని ఎవరినైనా అడగండి, నాకన్నీ ఉన్నాయండి కాస్త శాంతి, కాస్త ఆనందం ఉంటే ఏదో ఉన్న జీవితాన్ని గడిపేస్తాను అంటారు. సత్యము, ధర్మము రెండూ ఎవరైతే ఆచరిస్తారో, దేవుడున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని ఎవరు ఆశ్రయిస్తారో, ఒక వ్యక్తి ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, ప్రదేశ దేశ ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకుని తదనుగుణంగా జీవిస్తారో వాళ్లకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అక్కడ జాతి లేదు, మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, స్థితిగతులు లేవు. ఉన్నదంతా ఒక్కటై కనిపిస్తున్నది గనుక అటువంటి స్థితిలోకి గనుక వెళ్లగలిగితే, ఇవాళ ఏ ఆనందం కావాలని అటు ఇటు వెళుతున్నామో ఆ ఆనందమే మన యందు ఉన్నది కాబట్టి ఈ ఆనందాన్ని బయటకు ఎలా తెచ్చుకోవాలి? ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలగాలి? ఎప్పుడూ energetic గా ఎలా ఉండాలి? అలసటే లేనట్లుగా ఎలా జీవించాలి? అంటే నేను ఆనంద స్వరూపుడిని అనేటువంటి ఒక భావనలోకి మనం రావాలి. మరి ఆనందం యొక్క స్వరూపం ఏమిటి? ముందుగా మనుష్య ఆనందము, తర్వాత మనీష్ ఆనందము, గంధర్వ ఆనందము, దేవ గంధర్వ ఆనందము, మానవ గంధర్వ ఆనందము, పితృ పితా ఆనందము, ప్రజాపితా ఆనందము, కడగా హిరణ్యగర్భ ఆనందము. మనకి సుఖానికి, సంతోషానికి తేడా తెలియదు. సుఖము, సంతోషము కాక ఆనందం అంటే అసలే తెలియదు. కాబట్టి మనం ఏదో అనుకుంటాం, వస్తువు కొనుక్కోవాలనుకుంటాం, ఓ degree రావాలనుకుంటాం, ఓ PhD రావాలనుకుంటాం, వ్యాపారంలో లాభాలు రావాలనుకుంటాం, ఓ ఇల్లు కట్టాలనుకుంటాం. ఈ ప్రాపంచికమైన అన్ని విషయాలు మనం achieve చేసినప్పుడు అంటే సాధించుకున్నప్పుడు మనకి ఆనందం కలుగుతున్నది అంటున్నాం, అది ఆనందం కాదు. శరీరానికి సుఖం కావాలి, మనస్సుకి సంతోషం కావాలి, ఆనందం హృదయానికి సంబంధించింది. అసలయం సంతోషమే. అలాగే బాగా సంపాదించుకున్నాం, ఒక్కళ్ళంగా ఉన్నాం, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది, ఈ ఆనందం అంతా ఆనందం అని అనిపించుకుంటున్నదంతా నేను ఒక్కడినే ఎలా అనుభవించగలను? నాకు అనుభవించడానికి ఇంకో మనిషి కావాలి కదా, వాడు ఎవరు? ఆ వస్తువు ఏది? అన్నప్పుడు ఈ ఒక్క మనిషి ఇద్దరవుతారు, ఇద్దరు ముగ్గురవుతారు. అంటే మనుష్య ఆనందంలో కలిగినటువంటి ఆనందాన్ని అత-ఇతరులతో పంచుకోవాలి అన్నటువంటి ఆలోచన కలగ్గానే మనుష్య ఆనందము మనీష్ ఆనందం అయింది. ఈ మనీష్ ఆనందం కొన్నాళ్ళు ఉంటుంది. అదే మనుషులు నలుగురో, నలభై మందో, నాలుగు వందల మందో చుట్టూ ఏర్పడ్డారు. అప్పుడు అనిపిస్తుంది, ఈ ఉన్నదే నాలుగు వందల మందో నలభైయో పంచుకుంటున్నాము దీన్ని మించి ఇంకేం లేదా? అంటే దాని పేరు గంధర్వ ఆనందం. బాగా భజన చేయగలిగితే, చేస్తున్న వారికి కలిగే ఆనందం ఒక వంత అయితే వింటున్నటువంటి వారి ఆనందం పదింతలు కావాలి. అది గంధర్వ ఆనందం. గంధర్వం అంటే ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ఇవాళ చూడండి ప్రజ్ఞ కానిదేమున్నది? అంతా ప్రజ్ఞే. బాగా మంచి handwriting ఒక ప్రజ్ఞ, సులువుగా లెక్కలు చేయటం ఒక ప్రజ్ఞ, చక్కని వంట చేయటం, అల్లిక చేయటం, రంగవల్లులు తీర్చిదిద్దటం, అలంకారం చేయటం, organise చేయటం, ఇదంతా ఒక ప్రజ్ఞ వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ ప్రజ్ఞ యొక్క స్వరూపం ఏమిటంటే ఆనందమే. కాబట్టి మనీష్ ఆనందం వల్ల గంధర్వ ఆనందం అయింది. గంధర్వ ఆనందంలో మళ్ళీమా--మానుష గంధర్వ ఆనందం లేదా మానవ గంధర్వ ఆనందం అని ఉంది. ఈ మానవ గంధర్వ ఆనందంలో ఓ పాట పాడారు, ఓ భజన చేశారు. చాలా హాయిగా ఉంది మనసుకి. చాలా ఎంత ఆనందంగా ఉందంటే, వింటే మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకోవాలి అని అనిపించింది. అంటే, నీ లోపల ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ బయట ఉన్న ప్రజ్ఞతో కూడి ఉన్నది గనుక అది మానవ గంధర్వ ఆనందం అయింది. అందరినీ "వినండి వినండి ఎంత బాగుంది" అని మనమే పది మందికి చెప్తాం. ఆ తర్వాత, దేవగంధర్వ ఆనందం అని ఉంది. మన ప్రజ్ఞ ద్వారా పరమేశ్వరుడికి గనక ఆనందం కలిగింది అని మనకు అనిపిస్తే, ఆయన వచ్చి చెప్పడు కదా! మనకే కనిపించినట్లయితే, మనకు అనిపించినట్లయితే, ఈ సారి దసరా--నవరాత్రులు బాగా చేసుకున్నాం, దీపావళి చాలా బాగా చేసుకున్నాం, ఈ సారి సమర్పణ భిన్నంగా ఉన్నది, ఇది కూడా బాగుంది అని గనక మనం అనుకున్నట్లయితే దాని పేరు దేవగంధర్వ ఆనందం. అంతయుం ఈశ్వర ప్రీతికే. మనం ఇవాళ కూర్చున్న అందరం కూడా స్వామి భక్తులం కాబట్టి మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా, మనం ఏమంటాం? "మా స్వామికి ఆనందం కలిగితే చాలు. లోకం నన్ను మెచ్చక్కర్లేదు. లోకేశ్వరుడు మెచ్చితే చాలు" అంటాం. అది దేవగంధర్వ ఆనందం. దేవగంధర్వ ఆనందం తర్వాత పితృ పితా ఆనందం అని ఒకటి ఉంది. ఈ సేవాదళంలోనో, స్వామి devotee యో ఒక కార్యకర్తో లేదు ఒక పదవిలో ఉన్నటువంటి వారో, సంపూర్ణమైనటువంటి త్యాగంతో ప్రపంచంలోకి వెళ్లి తమ తనువుని, ధనాన్ని, మనస్సుని, ప్రజ్ఞని ఉపయోగించి అందరిలో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఆ తండ్రి కొడుకును పిలిచి "నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు" అని ఎన్నడూ చెప్పడు. కానీ, ఆనందం పొందుతూ ఉంటాడు. "నేను కన్న బిడ్డ నేను అంత సేవ చేయలేకపోయాను, స్వామి అంటే ఏమిటో తెలుసుకోకుండానే పెద్దవాడినైపోయాను. కానీ, నా బిడ్డ అతి చిన్న వయస్సులో స్వామిని అర్థం చేసుకుని సేవా కార్యక్రమాలలోకి వెళ్లి తనకున్నటువంటి సమయాన్ని, తనకున్నటువంటి శక్తిని, యువశక్తినంతా కూడా ఖర్చు పెడుతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా కుమారుడు మంచి మార్గంలో ఉన్నాడు" అని అనిపిస్తే దాని పేరు పితృ పితా ఆనందము. పితృ పితా ఆనందం తర్వాత ప్రజాపిత ఆనందం అని ఒకటి ఉంది. ప్రజాపిత అంటే బ్రహ్మ కాదు. ప్రజలు అందరూ కూడా అందరి చేత "ఈతడు సర్వోత్తముడు, మంచివాడు, ఉత్తముడు" అని గనక అనిపించుకోగలిగినట్లయితే ప్రజా బాహుళ్యం వచ్చి మన ఇంటికి వచ్చి ఏదీ ఎవరూ ఒక్కళ్ళు కూడా చెప్పరు. "చాలా బాగుంది, చాలా హాయిగా ఉన్నది" అని చెప్పరు. కానీ, ఎవరికి వారే. హిమాలయాలు మనం ఎంతవ-- ఎంతమందివి చూశాం? మానస సరోవర యాత్ర ఎంతమందివి చేశాం? చేయలేదు కదా! కానీ, వాటిని గురించి విని, అర్థం చేసుకుని, వాటిని గురించిన ఆలోచన కలిగినప్పుడల్లా ఒక ఆనందం కలుగుతున్నదే, అది అపరోక్ష ఆనందము అంటారు. అదే ప్రజాపిత ఆనందము. ఇక తర్వాత హిరణ్యగర్భ ఆనందం. అది ఒక్క పరమేశ్వరుడి యొక్క సొత్తు. ఆ హిరణ్యము అంటే బంగారము, బంగారము అంటే రుక్మము, రుక్మము అంటే చైతన్యము. మనలో ఉన్నటువంటి ఒకానొక చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యమే ఇవాళ మాట్లాడుతున్నది, ఆ చైతన్యమే ఇవాళ వింటూ ఉన్నది, ఆ చైతన్యమే అనేక సేవలలో, కార్యక్రమాలలో పాల్గొంటున్నది, అనేక ఆలోచనలు చేస్తున్నది. ఇదంతా కూడా స్వభావానికి సంబంధించినటువంటి మాట. ఆ తరము అయిపోయింది. నలభై మంది ఉన్నటువంటి స్వామి భక్తులు కేవలం నలభై మంది ఉన్న రోజుల నుంచి నాలుగు వేలు, నలభై వేలకు వచ్చి, నాలుగు లక్షల దాకా వచ్చినటువంటి ఆయా సందర్భాలలో మళ్ళీ ఇదే ప్రశ్న. సుమారు ఒక-- ఆ మొదటి ప్రశ్న వేసిన నలభై ఏళ్ళకి అధ్యాత్మ అంటే ఏమిటి అని స్వామిని అడిగితే, ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటం అని చెప్పలే, ప్రభావం నుంచి స్వభావంలోకి వెళ్ళటం అని చెప్పలే. ఏం చెప్పారంటే, "మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది అధ్యాత్మ" అన్నారు. దీనిలో భగవంతుడి యొక్క నిర్వేదం ఉన్నది. అంటే మానవుడు కనీసం మానవుడిగా కూడా జీవించటం లేదు. మానవుడు తన మనోప్రవృత్తి ప్రకారంగా, ఇవాళ పదహారు, పదహేడు పేజీలు ప్రింట్ అయి తెల్లవారేప్పటికి మన వాకిట్లో ఒక పేపర్, న్యూస్ పేపర్ పడితే, ఆ న్యూస్ పేపర్లో పధ్నాలుగు పేజీలలో సుమారు పదమూడున్నర పేజీలంతా కూడా ఈ ప్రపంచంలో, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్ధాలకు అక్షర రూపమే అది. దాని వలన మనస్సు కకావికలం అయిపోతున్నది. అది కాదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి టీవీ ఆన్ చేస్తే జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదీ కాదు. మరి ఏం చేయాలి? ఈ స్వభావంలోకి రావటానికి మానవుడు మానవుడిగా జీవించాలంటే, మానవుడు అంటే ఆకార మానవుడా, ఆచార మానవుడా, ఆస్తిక మానవుడా, నాస్తిక మానవుడా, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కానీ, దీనికి ఒకే ఒక్క జవాబు ఏమిటంటే, మనందరం మానవ జన్మ. స్త్రీలు గాని, పురుషులు గాని. మనలో నాలుగు భాగాలున్నాయి. ఒకటి దానత్వము-- దానవత్వము ఉన్నది. negative factor అది. అలాగే ఎవరి ముందైనా చెయ్యి జాపే దీనత్వం ఉన్నది. మూడవది మానవత్వం ఉన్నది. నాలుగవది దివ్యత్వం కూడా మనలోనే ఉన్నది. మనం మానవత్వ, దివ్యత్వాలు పక్కనబెట్టి దానవత్వ, దీనత్వాలతో జీవితాన్ని గడుపుతున్నాం గనుక మనం ఆనంద స్వరూపులం కాలేం. దానవత్వం అంటే ఇందాక చెప్పిన అరిషడ్వర్గాలు అనండి, అహంకారం అనండి, దంభం అనండి, కోపం అనండి, ఇవన్నీ రాక్షస గుణాలు కాబట్టి మనం ముందు వదులుచుకోవలసిన ఒక భాగం ఏమిటంటే దానవత్వాన్ని వదులుకోవాలి. ఆలోచనలో కూడా ఎవరికీ హాని తలపెట్టని రీతిలో మన ఆలోచనలు సాగాలి. ఇక రెండవది దీనత్వం. ఎంత ఉన్నా ఎవరి ముందో చెయ్యి జాపినప్పుడు మనం పరిదీనులమైపోతాం. ఏం కావాలి? ఈశ్వరుణ్ణి అడగాలి. ఈశ్వరుణ్ణి అడిగితే ఆయన తెచ్చి చేతిలో డబ్బుల కట్టలు పెట్టడు. అవకాశాలు ఇస్తాడు.ప్రపంచంలో ఆ ధనము సంపాదించుకోవటానికి గల మార్గాన్ని సులువు చేస్తాడు. అది మన ప్రాప్తిని బట్టి, ఆర్తిని బట్టి, అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఆ అనుగ్రహాలన్నీ మనకు లభిస్తూ ఉంటాయి గనుక ఆ దీనత్వాన్ని కూడా మనం వదిలిపెట్టాలి. దానవత్వము, దీనత్వము fifty percent పోయిన తర్వాత ఇక మిగిలినవి రెండే. ఒకటి మానవత్వం. ఆ మానవత్వమే పరిమళమై మన యందు బాసించాలి. అందరి పట్ల దయ, జాలి, సానుభూతి, కరుణ, ప్రేమ, concern ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి గనక లేకపోయినట్లయితే మానవ జీవితానికి పరమార్థమే లేదన్న భావనలోకి మనం వెళ్ళాలి. ఈ మానవత్వాన్ని గనక మనం పెంచుకుంటూ వెళితే, ఎలా పెంచుకోవాలి? అదేమన్నా ప్రత్యేకమైన subject ఆ? లోపలంటే? దానికే స్వామి మనందరికీ ఇచ్చిన ఒక అనుగ్రహ వరదానం ఏమిటంటే, ప్రేమ ద్వారా లేదా ప్రేమతో సేవ చేయండి. సేవ ద్వారా ప్రపంచాన్ని ప్రేమించండి. ప్రపంచాన్ని మీరు ప్రేమించినప్పుడు ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీకది అండగా నిలబడుతుంది. మీరు చేసే చిన్న సాయం తరతరాలకు మిగిలిపోతుంది. ఆ right time లో right action వల్ల సరైన సమయంలో సరైనటువంటి కర్తవ్య నిర్వహణ ద్వారా ఈ సమాజం యొక్క స్థితి, గతి, ఆదృతి, ధృతి అన్నీ కూడా సక్రమంగా, సునాయాసంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా నడుస్తాయి కాబట్టి మీరు మీ ఆలోచనా పరిధులను విస్తృతం చేసుకోండి. విస్తృతమైన మమకారమే ప్రేమ, అంతే. రాగము, అనురాగము, ప్రేమ అని మూడు భావాలున్నాయి. రాగము అంటే మనను కన్న మన తల్లిదండ్రుల పట్ల మనకుండేటువంటి ప్రేమ. అదో ప్రేమ. అది స్థితిగతులు మారని, కాల పరీక్షలలో ఓడిపోని, నెగ్గని మనం ఎట్లా ఉండని, మనం అత్యున్నత స్థితిలో ఉండనివ్వండి లేదు కడు బీద స్థితిలో ఉండనివ్వండి మనకు మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి బంధము, రాగబంధము ఎవ్వరూ చెరపలేరు. అది అట్లాగే ఉంటుంది. రెండవది అనురాగ బంధం ఉన్నది. ఈ అనురాగ బంధం ఏమిటి అంటే, ప్రపంచంలో మనకి చాలామంది పరిచయాలు ఏర్పడతాయి. అనేకమైనటువంటి సంఘటనలలో, జీవన దశలలో పదేళ్ళప్పుడు, ఇరవై ఏళ్ళప్పుడు, ముప్పై ఏళ్ళప్పుడు రకరకాల మనుషులు జీవితంలోకి వస్తూ ఉంటారు. పరిచయాలు ఏర్పడతాయి. నిజానికి cell phone లేనప్పుడు మన telephone directory లో maximum ఒక నలభై నెంబర్లు ఉండేవి. ఆ నలభై నెంబర్లు ఇవాళ-- ఆ రోజుల్లో మనకు గుర్తుండేవి. ఇవాళ connectivity అనే కారణంగా cell phone అనేటువంటి కారణంగా మనకున్నటువంటి contacts గనక చూస్తే contacts పెరుగుతున్న కొద్ది storage పెరిగి మనం సెల్స్గు ఉంటున్నాం. తగ్గించుకోవాలి. Connectivity ఎంత తక్కువుంటే మనసుకి అంత హాయి ఉంటుంది. ఎంత తక్కువ పరిధిలో తక్కువ మంది మనుషులతో మనం విరాజమానం చేసేటువంటి స్థాయిలో గనక ఉన్నట్లయితే ఈ సేవ చేయగలుగుతాం. కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే జీవన గమనంలో మన జీవితంలోకి వచ్చారో, ఎవరైతే పరిచయమైనారో, ఎవరైతే స్నేహితులుగా చలామణి అయి కొంతకాలం ఉంటారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. ఒక batch వెళ్ళిపోతే కొత్త batch వస్తూ ఉంటుంది. ఈ కొత్త batch వచ్చినప్పుడల్లా పాతవన్నీ మరుగున పడిపోతాయి. మరపుని సంతరించుకుంటాయి. మళ్ళీ కొత్త వాళ్ళతో కొత్త బంధాలు, అనుబంధాలు ఆ కొన్ని పైపైన ఉండే ఆత్మీయతలు ఏర్పడతాయి. ఇవి కూడా తాత్కాలికమైనవి. అత్యంత అశాశ్వతమైనవి. కానీ వాళ్ళతో మాకు కూడా ఒక బంధం ఏర్పడి ఉంటుంది. దాని పేరు అనురాగ బంధము. ఇక మూడవది ప్రేమ బంధం. మనందరం సేవలో ఉన్న వాళ్ళం. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను గురించి స్వామి ఎప్పుడు ప్రస్తావన చేసినా service చేయటంలో మహబూబ్ నగర్ జిల్లా స్వామి హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా అని స్వామి చెప్పేవారు, ఆ రోజుల్లో. [చప్పట్లు] కారణం ఏమిటంటే, నిస్వార్థమైన సేవ, ఆడంబరం లేకుండా సేవ, దేనినీ ఆశించని సేవ. ఏదో మేము సేవ చేశాం, మాకు స్వామి దగ్గరగా, దగ్గరికి వెళ్లి కూర్చు-- ఇటువంటి ఆలోచనలే లేని ఒక అద్భుతమైన స్థితిలో చేసినందువలనే మీరు స్వామి యొక్క హృదయానికి దగ్గర కాగలిగారు. దాన్ని సమాజంలో కూడా మనం గనక అట్లా దగ్గర కాగలిగినట్లయితే, ఎట్లా కావాలంటే మళ్ళీ సేవ ద్వారా అహంకారం, మమకారాలు రెండూ తగ్గించుకొని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మానవ జీవితంలో తగ్గించుకోండి అని చెప్పాలే తప్ప వదులుచుకోండి అంటే అహంకారము లేక, మమకారము లేక మానవ జీవితం. అక్కడ అహంకారము అంటే గర్వము, ప్రగల్భము కాదు. నేను పరమాత్మ నుంచి వచ్చిన వాడిని. నా మూలం పరమాత్మ. నేనేదో ఆయన నుంచి విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాను కానీ నేను పరమాత్మ కంటే భిన్నం కాదు. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి ఏర్పడే సుషుమ్నా కిరణాలు, చంద్ర కిరణాలు ఎట్లా చంద్రుడి నుంచి భిన్నం కాదో, సముద్రంలో పుట్టే అలలు సముద్రం కంటే ఎట్లా భిన్నం కావో, నేను కూడా పరమాత్మ కంటే భిన్నం కాదు. కానీ మాయావరణం చేత ఇందాక చెప్పిన మానవత్వ దీనత్వాల వలన దాన-దానవత్వాల వలన మానవత్వం అడుగున పడిపోయింది గనుక ఈ దీనత్వ దానవత్వాలు వదిలిపోయిన తర్వాత నాలో ఉన్న మానవత్వాన్ని నేను పైకి తెచ్చుకుంటానని అన్నప్పుడు మానవతాభావంతో సమాజ సేవలో గనక మనం వెళ్లగలిగినట్లయితే, వెళ్లగలిగినట్లయితే అనేదానికి ఎవరు వెళ్లగలరు సమాజ సేవకి? క్లబ్బులా? పబ్బులా? వెబ్బులా? ఇవేవీ చేయలేవు. అలా చేయగలిగితే ప్రపంచంలో చేయగలిగినటువంటి ఒకే ఒక్క సంస్థ ఉన్నది. అది శ్రీ సత్యసాయి సేవా Organization. [చప్పట్లు] ఇంకా మరొకటి లేదు. దానివలన మన అహంకారాలు, మనల్ని మనం project చేసుకోవటం, నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని అని చెప్పుకోవటం అవి ఏవీ లేనటువంటి ఒక ప్రదేశం ఏదన్నా ఉన్నదంటే అదిగో మన Organization మాత్రమే. ఈ Organizationలో మనందరం రావటానికే చాలా time పడుతుంది. కానీ ఒక విచిత్రం ఉంది.రావటానికి సమయం పట్టవచ్చునేమో కానీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ ఈ సంస్థ నుంచి బయటకు వెళ్ళరు ఎందుకని అంటే ఒక సుఫృద్ భావం స్త్రీల పట్ల పురుషుడికి ఉండేటువంటి ఆ మర్యాద ఒక సోదరి అనేటువంటి ఒక సమా సనాతనమైనటువంటి ఒక దివ్య భావన అలాగే మన ఏ పరిచయము లేని అసలు తెలియని తెలియని ప్రదేశంలోకి వెళ్లి ప్రజలతో మమేకమై మనం సేవలు చేస్తూ ఉన్నప్పుడు మన పదవులు మన స్థితిగతులు మనకు వెనుక ఉన్నటువంటి ఆస్తులు సమాజంలో ఉన్న పరపత్తులు అన్నీ కూడా ఒక హ్యాంగర్ కి తగిలించి కొక్కేనికి తగిలించి మనం ఏదో గ్రామ సేవకు వెళ్ళిపోతాం అక్కడ ఒక కంపెనీ chairman మురుక్కు కాలువలో చేయి పెట్టి clean చేస్తాడు అక్కడ ఏమి ఏదైనా చేయగలిగిన ప్రతి వాడు ఆ పని చేస్తాడు ఆ గ్రామస్తులతో తన ఉనికిని అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని దాచిపెట్టుకొని ఈ దేశ్ ఈ ప్రదేశంలో నేను నేనుగా బతకాలి ఇది నా కర్మక్షేత్రం అనేటువంటి భావనతో వెళ్లి ఆ సేవ చేస్తాడే దానికి సమర్పణ అని పేరు అది సమర్పణ అంటే అది అంతేతప్ప నేను స్వామికి ఎంత దగ్గరగా ఉన్నాను స్వామిని ఎన్నాళ్లు చూశాను స్వామి నాతో ఎంత మాట్లాడారు స్వామి వేసిన చమత్కారాలు ఇది ఏదీ కాదు ఇవన్నీ మనకు education ఇవ్వవు మరి ఏమిస్తుందంటే మనం నిజంగా సేవ చేసినప్పుడు ఆ సేవలో ఒక మానవత్వం ఉంటుంది ఆ సేవలో ఒక ఔదార్యం ఉంటుంది మర్యాదతనం ఉంటుంది సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది ఇవన్నీ మనం చేస్తాం అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాం. ఇవాళ ఎలా ఉన్నారు ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని ఇంట్లో వాళ్ళు భర్త భార్యను అడిగినా, ఆ ఓ స్నేహితుడు మరొక స్నేహితుడిని అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే నాకివాళ కోటి రూపాయలు లాభం వచ్చింది అన్న వాడికి సంతోషం లేదు ఆనందం లేదు సుఖం తెచ్చిస్తుంది కానీ ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటి అని మనం గనక అతన్ని గట్టిగా అడిగితే, ఇవాళ స్వామి సేవకు వెళ్ళాము అందువల్ల ఆనందంగా ఉన్నది అంటాం. ఆ స్వామి సేవ అంటే స్వామికి ఏమి సేవ చేయటంలా మనం స్వామి రూపంలో ఉన్నటువంటి ఈ జగత్తు జగన్నాయకుడు జీవుడు ఈ ముగ్గురు ఒక్కటే అనేటువంటి భావనలో ప్రతి వాడి యందు మనం స్థాయిని చూడగలిగేటువంటి ఒక స్థాయి అలాగే దానిని మనం పుణ్య క్షేత్రంగా కర్మ క్షేత్రంగా భావన చేసి మనలో ఉన్నటువంటి మానవీయ భావాన్ని ఏ రకమైన గుర్తింపుని కోరుకోకుండా మనం చేసిన కారణంగా మనకు ఆనందం కలుగుతుంది చిన్న ఉదాహరణ ఇదిగో పొద్దున ఎప్పుడో నాలుగింటికో ఐదింటికో నిద్రలేచాం. మళ్ళీ వెళ్లి పడుకునేప్పటికి పన్నెండు పదకొండు అవుతుంది. తెల్లవారు లేస్తాం. చాలా హాయిగా నిద్రపట్టింది ఎంత హాయిగా ఉన్నదో అంటాం అదే మనం పొద్దున లేచాం ఇందాక చెప్పిన ఐదింటికి లేచాం వ్యాపారం చేశాం లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేశాం increment లు bonus లు రావలసినవన్నీ వచ్చాయి మనం ఏమంటున్నాం అంటే పగలంతా పనిచేసిన తర్వాత అలసిపోయాను అంటున్నాం. హాయిగా ఉన్నాం అనటంలా అలసిపోయాం అంటున్నాం కానీ రాత్రిపూట ఏ పని చేయల ఉద్యోగం లేదు వ్యాపారం లేదు డబ్బు ఇవ్వటం లేదు డబ్బు పుచ్చుకోవటం లేదు వెళ్ళాము పడుకున్నాము నిద్రలేచాం కానీ ఏమంటున్నాం అంటే ఇవాళ హాయిగా ఉన్నది మనస్సు ఇంత హాయి నేను ఎన్నడూ అనుభవించలేదు అంటే ఏదీ చేయకపోవటంలో నిజానికి ఒక హాయి ఉన్నది అంటే ఏమీ చేయకుండా ఉండటమా అని కాకుండా ప్రాపంచికమైన కర్మలను ఎంతవరకు మనం చేయగలమో ఒకటి, పరహితంగా ఎంతవరకు జీవించగలమో రెండవది, సేవా కార్యక్రమంలో మనకు ఇవ్వబడినటువంటి ఒక designated duty ఏదైతే ఉందో నువ్వు బాగా ఇవాళ మంచి భజన వచ్చి పాడు అన్నప్పుడు ఆ భజన పాడినప్పుడు ఆ భజనను విన్నప్పుడు ఇందాక చెప్పినట్లుగా పాడిన వాడి ఆనందం ఆనందమే కానీ విన్న వాడి ఆనందం మాత్రం పదింతలు ఎందుకు ఇక్కడ భజన చేస్తున్న వారు ఒక్కరే వారితో గొంతు కలిపిన వారు వంద మంది ఈ ఒక్కరి ఆనందం వంద ఆనందాలుగా రూపాంతరీకరణ చెందింది మారింది మనమందరం కూడా అంతటి ఆనందాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి సేవ అనేటువంటిది ప్రేమకి మార్గాన్ని చూపిస్తుంది మళ్ళీ ఆ సేవలో మనం పోటీ పడకూడదు సేవ చేయటంలో పోటీ పడాలి గాని దాన్ని ఒక స్పర్ధగా మార్చుకోకుండా పరమేశ్వరుడు ఇవాళ ఇట్లా అనుగ్రహించాడు ఇలా చేయవలసి ఉన్నది అని గనక మనం చేసినట్లయితే దాని పేరే సమర్పణ దాని పేరే శరణాగతి అది వినయంతో చేయాలి కాబట్టి మానవుడు మానవుడిగా జీవించడమే అధ్యాత్మ అని స్వామి అన్నప్పుడు మానవుడిగా మనం ఏం చేయాలి? సరే మామూలుగా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి బాగా సంపాదించాలి ఆ కడుపున పుట్టిన వాళ్ళ కోసం దాచి పెట్టాలి అప్పజెప్పాలి ఆ వెళ్ళాలి కానీ ఇక్కడే అసలు అధ్యాత్మం ఇమిడి ఉన్నది అదేమిటంటే, నీ ప్రజ్ఞ ద్వారా నీ శక్తి యుక్తుల ద్వారా సమాజంలో నీకున్న పరపతి ద్వారా నీకు ఉన్నటువంటి resources ద్వారా వనరుల ద్వారా నువ్వు ఈ ప్రపంచానికి ఆనందం కలిగించగలిగినట్లయితే ప్రపంచానికి ఒక్క రోజైనా ఉపయోగపడగలిగినట్లయితే ఒక్కరి కన్నీరైనా తుడవగలిగినట్లయితే అది మానవుడు మానవుడిగా జీవించినటువంటి ఒక అత్యద్భుతమైన స్థాయి. ఓసారి ప్రశాంతి నిలయంలో కుప్ప భైరాగి శాస్త్రి గారని ఒక మహానుభావుడు వేద పండితుడు ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో ప్రశాంతి నిలయం యొక్క పంచాంగం రాసేటువంటి వేద పండితుడు ఆయన. స్వామి ఒకసారి వారిని పిలుస్తూ వారితో పాటు నన్ను కూడా పిలిచారు. ఆ రోజే స్వామి ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆ ఉపన్యాసంలో G O D god అంటే ఏమిటి అని చెప్తూ G అంటే generator.ఓ అంటే organizer డి అంటే destroyer సృష్టి స్థితి లయ సృష్టించేది బ్రహ్మ స్థితిగా ఉంచేవాడు విష్ణువు లయింపజేసేవాడు శివుడు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు తత్వాలతో కూడి ఉన్నట్లయితే ఆతడికి దైవము అని మనం పేరు పెట్టుకున్నాం అని వ్యాఖ్యానం చేశారు స్వామి. వీరు వేద పండితులు కాబట్టి ఆ room లోకి వెళ్ళిన తర్వాత స్వామి కూర్చున్న తర్వాత స్వామి ఈవేళ చాలా అత్యద్భుతమైన విషయాలు చెప్పారు మీరు మరి god అనే దానికి నిర్వచనం చెప్పారు కదా మరి మానవ అనే శబ్దం ఒకటి ఉంది కదా దానికేమన్నా అర్థం ఉన్నదా అని అడిగారు. ఆయన వేదం చదువుకున్నటువంటి వారు స్వామి ఒక split second అంటే కనురెప్ప సగం మూసి ఎత్తే లోగా ఏమన్నారంటే అదేమన్నది మానవ అంటే మా అంటే కాదు నవ అంటే కొత్త వైరాగి శాస్త్రి నవ నువ్వు కొత్త వాడివి కాదు నీకు కొత్తగా అనిపిస్తున్నది నా దృష్టిలో మా నవ నువ్వు కొత్త వాడివి కాదు ఎవరైతే సనాతనంగా ఉన్నాడో ఆతడే ఈనాడు Sanutanam గా కనిపిస్తున్నాడు తప్ప అలాగే పరమేశ్వరుడి యొక్క చిత్ శక్తి కూడా ఒకస ఒక సమయంలో ఆ కృష్ణుడై వచ్చింది ఒక సమయంలో రాముడై వచ్చింది ఒక సమయంలో సత్య సాయి అయి వచ్చింది అని ఒక revelation ఇచ్చారు స్వామి. అంటే ఏమిటి ఆ చైతన్యం మానవుని వేళ మనమందరం ఉన్నాం ఇక్కడికి వచ్చేదాకా మనమందరం పరస్పరం కొత్త వాళ్ళం నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు కానీ ఇది అయిన తర్వాత ఆ మాట అనటానికి వీల్లేదు నాకు మీరందరూ తెలుసు మీకు కూడా నేను కూడా తెలుసు మీ అందరికీ కూడా నేను తెలుసు కాబట్టి ఇందులో మానవ శబ్దం అంటే మనది ఇది కొత్త జన్మ కాదు ఇప్పుడే పుట్టింది కాదు బహూనాం జన్మ నాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే భగవద్గీతలో యోగేశ్వర కృష్ణుడు చెప్తాడు అనేక జన్మలు ఎత్తి ఎత్తి ఎత్తి ఎన్ని ఎత్తావో తెలియదు గాని ఈ జన్మలో వచ్చి జ్ఞానం అంటే ఏమిటని అడుగుతున్నావే ఇది సర్వోత్కృష్టమైనటువంటి జన్మ జ్ఞానము అంటే ఆ భగవద్గీత మీద వ్యాఖ్యానం భాగవతం మీద ప్రవచనం ఇది జ్ఞానానికి సంకేతం కాదు intellectual interpretation is not జ్ఞాన ఒక శాస్త్రాన్ని మధించి శోధించి వ్యాఖ్యానం చేస్తే వాడు వ్యాఖ్యాతగా మిగిలిపోతాడు దాని మీద కాస్త విస్తృతంగా మాట్లాడితే ప్రవచన కారుడవుతాడు అంతేకాని జ్ఞాని కానేరడు మరి ఎవరు జ్ఞాని అంటే ప్రౌఢః ప్రౌఢః నిజానుభూతి కలిత దైతేంద్రియ జాలౌ గురుః స్వచ్ఛిష్య బోధయాత్ స సత్యం అశ్వితావన్ తాను పొందినటువంటి ఒకానొక జీవితానుభవాన్ని తన చుట్టూ ఉన్న వారందరికీ పంచటం కోసం ఎవరి యందు ఆతృత కలిగి ఉంటుందో ఏ ఆతృత వలన ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మని సార్ధకం చేసుకున్నటువంటి వాడు అవుతాడు అటువంటి వాడు గురువు అవుతాడు అని స్వామి చాలా స్పష్టంగా చక్కగా విశదీకరించారు. కాబట్టి ఈవేళ మనం సమర్పణ చేయటం అంటే సమర్పణ అనగానే మామూలుగా నేను స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళానో అవి కథలు కాబట్టి వీణుల విందుగా ఉంటాయి కాసేపు బాగుంటాయి తర్వాత అది నా కథ మీకు సంబంధమే లేదు కానీ నేను చెప్పాలి ఎలా చెప్పాలి స్వామితో సంబంధం ఉన్నది గనుక చెప్పాలి స్వామితో ఆ సంబంధం ఎలా ఏర్పడిందో చెప్పాలి దాని ప్రభావం నా మీద నా జీవితం మీద నా కుటుంబం మీద ఏమైనా అసలు ఉన్నదా లేదా నేను స్వామిని చూశాను స్వామితో మాట్లాడాను స్వామి నాతో చాలాసార్లు పలకరించారు నన్ను నేను నాకు స్వామి బాగా తెలుసు అందామా? ఇవి ఏవీ కావు. ఏమిటంటే ఒక పరమాత్మ యొక్క దర్శనం చేసిన తర్వాత మనలో పరిణామం ఏమన్నా జరిగిందా ఇది నిజమైన సమర్పణ కావాలి. ఈ సమర్పణ నా వరకు నేను సమర్పణ చేశాను స్వామికి అని నేను ఎన్నడూ చెప్పలేదు ఎందుకంటే అది నాకు తెలియదు చేశానో లేదో తెలియదు నేను స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం నా వయస్సు పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాల వయస్సులో అప్పటికే నేను భాగవతం చదువుకున్నాను నాలుగు సంవత్సరాల వయస్సులో హనుమాన్ చాలీసా నోటికి వచ్చింది నాకు అది స్వామి ఎదురుగా చేతులు కట్టుకొని హనుమాన్ చాలీసా చదవటం నాకు బాగా గుర్తుంది. పన్నెండేళ్లు వచ్చేప్పటికి స్వామి దగ్గరికి వెళ్ళినందువల్ల అసలు జీవితం అంటే ఏమిటి? ఈ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి? దీనికి రంగు ఎలా వేయాలి? లేదు రంగే వేయకుండా జీవితం ఎట్లా వస్తే అట్లా ఆస్వాదిద్దామా? మరి కష్టం రాకుండా ఉంటుందా? నీరు పల్లంగానే వెళుతుందా? ఎదురు ప్రవాహం ఉంటుందా? అని ఆలోచించినప్పుడు అవన్నీ నాకెందుకు అది ఎట్లా రానివ్వండి ఏమి కానివ్వండి స్వామి చూసుకుంటారు. కానీ స్వామి చూసుకుంటారని నేను పని చేయకుండా ఉండటానికి వీల్లేదు. నేను రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తే అది స్వామికి సంతోషం. నేను పద్దెనిమిది గంటలు స్వామి భజనలో గడిపితే అది స్వామికి సంతోషం కాదు. ఒకసారి ధ్యానం అనే విషయాన్ని గురించి స్వామి మాట్లాడుతూ ఆ వయసులో మా వయసులో ఆరు గంటల ధ్యానం ఎనిమిది గంటలు ధ్యానంలో ఉన్నాను ధ్యానం చేశాను నిజానికి నా దృష్టిలో చేసేది ఏది ధ్యానం కాదు ఏమి చేయకపోవటమే ధ్యానం సరే ఎంత చేయాలి అన్నప్పుడు స్వామి చెప్పారు ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు చేస్తే అంతవరకు అది చాలా గొప్ప ధ్యానం కింద లెక్క అన్నారు. అంటే ఒక అరగంట నేనే ఎనిమిది గంటలు గనుక ధ్యానంలో ఓ నాలుగు గంటలు పూజలో ఓ నాలుగు గంటలు ఇంట్లో గడిపేస్తే ఇక నేను ప్రపంచంలోనే చేసే కర్మ ఏముంది ఏమీ లేదు. సరే స్వామి నవ్వుతూ అన్నారు ఒకతను వచ్చి స్వామి నాకు పది నిమిషాల కంటే ధ్యానం కుదరటం లేదు కానీ నా స్నేహితుడు ఉన్నాడు అతను seven to eight hours చేస్తున్నాడు స్వామి అనంటే స్వామి నవ్వుతూ ఏమన్నారంటే లేదు మీ ఇద్దరూ ఒకచోట కూర్చోండి ధ్యానంలో ఉందామని అనుకోండి ధ్యానంలో మనసు కుదరటానికే కొంత time పడుతుంది. పట్టి ఏదో శాంతి కలిగింది ఆనందం కలిగింది అని నీకు అనిపించేప్పటికి అరగంట అయిపోతుంది.అది ఏమి జరగలేదని, ఏ అనుభవము లేదని అనుకున్నట్లయితే అది ఆనాడు నీవు పొందే అనుభవం అవుతుంది. కానీ మీ రెండో friend ఉన్నాడే, ఎనిమిది గంటలు ధ్యానంలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు చూడు. మొదటి అరగంటలో కలిగితే దాని పేరు ఎరుక. అరగంట దాటిన తర్వాత చేస్తే మిగిలేది నీకు గురక. నిద్రపోతున్న దాని నువ్వు ధ్యానంలో, యోగంలోకి వెళ్లిపోయావని, నీ కర్తవ్యం నుంచి నువ్వు దూరం అయిపోతే, నీ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరు ఆదరిస్తారు? దాని అవసరాలు ఎవరు తీరుస్తారు? నువ్వు బాధ్యతారాహిత్యంతో బతకవచ్చునా? అని చాలా గట్టిగా స్వామి చెప్పారు. అట్లా అని ధ్యానం వద్దని చెప్పలా. చేయటానికి ముందు అరగంట చెప్పి, అరగంట అన్నమాట చెప్పి చాలా ఏళ్ళు అయిపోయింది. ఆ మధ్య స్వామి వారి దేహాన్ని వదిలిపెట్టడానికి నాలుగు, మూడు, నాలుగేళ్ళ క్రితం అంటే 2005, ఆ ఎనిమిది ప్రాంతంలో ఒక మాట ఏమన్నారంటే, మీ మనస్సుని పదకొండు నిమిషాలు నిగ్రహించుకోండి చాలు అన్నారు. అరగంటలో ఎక్కడైనా పదకొండు నిమిషాలు దొరుకుతాయి. పదకొండు నిమిషాలలో అయితే ఒక్క నిమిషం కూడా దొరకదు. కానీ అదే నిజమైన ధ్యానం. ఆ తర్వాత ప్రశాంతి నిలయంలో నుంచి స్వామి చెప్పిన ఒక మాట ఈ క్షణాన గుర్తొస్తున్నది. పదకొండు నిమిషాలు కాదు, మీలో గనక మీరందరూ గనక పదకొండు సెకన్లు మీ మనస్సుని ధ్యానంలో నిమగ్నం చేయగలిగితే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రూపంలో నేను దర్శనం ఇస్తానన్నారు. అంటే అసాధ్యమైన విషయం అది. కనుక జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకోవాలి తప్ప ధ్యానమే జీవితం గనక అయిపోతే మనం చేయవలసిన చాలా పనులు మనం చేయవలసిన మరొకరు చెయ్యడు, చేయలేడు, చేసినావి మనకు చెందవు, చెందినవి రాణించవు, రాణించినా శోభ కలగవు. కాబట్టి మనందరం కూడా కర్మానుశక్తులం కావాలి. భగవంతునితో కూడి చేస్తే ప్రతి పని కర్మయోగం అవుతుంది. అలాగే భక్తి యోగంలో- దానికి తెలియంది ఏమిటంటే నడుస్తున్న నౌక మీద అది ఉన్నదని కాకుండా తానే నడిపిస్తున్నానన్నటువంటి భ్రాంతిలో, మాయలో, అహంకారంలో మెలకువ చెందింది. అలాగే మనం కూడా మన జీవితాలని మనం చాలా భద్రంగా, అద్భుతంగా శక్తి వంచన లేకుండా మనమే నడిపిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి నడిపిస్తున్నటువంటి జగన్నాయకుడు, లోక నాయకుడు ఒక్కడే. అది మన యందు ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం. అదంతా కూడా మన లోపలే ఉన్నది గనుక ఆ చైతన్యానికి మనం శరణాగతి పొందాలి. ఎందుకనంటే మనం ఏ వ్యక్తి ముందు తలవంచం, ఏ వ్యక్తికి మనం సమర్పణ చేసుకోం. ఒకవేళ చేసుకున్నా అది తాత్కాలిక మారిపోతూ ఉంటుంది. గురువులే మారిపోతూ ఉంటారు. గురువుల పటాలు మారిపోతూ ఉంటాయి. మూడు నెలలకు ఒక గురువు ఫోటో కనపడుతూ ఉంటుంది. ఇది ఏమిటి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాను ఏదో లాభం వచ్చింది, ఈయన దగ్గరికి వెళ్ళాను ఏదో కష్టం పోయింది, ఆయన దగ్గరికి వెళ్ళాను ఏదో సుఖం కలిగింది, ఆయన దగ్గరికి వెళ్ళాను ఒళ్ళు నొప్పులు తగ్గినాయి. గురువు యొక్క స్థితి ఇదా? కావలసింది అది కాదు. మన మనస్సుని నియంత్రించగలిగినటువంటి ఒక మహా చైతన్య స్ఫూర్తి ఏదైతే మన యందు ఉన్నదో ఆ చైతన్య స్ఫూర్తే కేవలం భగవంతుడు గనుక శరణాగతి ఎవరికి చెందాలి అంటే మనకు మన లోపల ఉన్నటువంటి ఆత్మకి శరణాగతి చెందాలి. అలాగే ఎన్ని జరిగినా, ఇంత జరిగినా, ప్రపంచం మొత్తం కూడా నుంచొని నీవంటి వాడు లేడు, నీతో సమానమైన వాడు లేడని ఘోషిస్తూ ఉన్నా, వినయంగా గనక ఉండగలిగితే అది సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణమైనటువంటి శరణాగతి. ఎనిమిది సంవత్సరాల శ్రీరామచంద్రుడు వందల సంవత్సరాల వయస్సు దాటినటువంటి వశిష్టుడి దగ్గర శిరస్సు వంచి సాక్షాత్తు నారాయణమూర్తి అయినప్పటికీ కూడా యోగ వశిష్ఠాన్ని విన్నాడు. ముప్పై మూడు వేల శ్లోకాలుగా జరిగింది అది. అంటే పరమాత్మ ఎంత వినమ్రుడో చూడండి. ఎంత వినయంగా విన్నాడో చూడండి. ఎంత నేర్చుకున్నాడో చూడండి. ఆయన ఏమన్నా నేర్చుకోవడానికి వచ్చాడా? నేర్పడానికి వచ్చాడు కదా! అలాగే కృష్ణ పరమాత్మ మహారణ రంగంలో రాత్రిపూట యుద్ధ విలవణ అయిపోయిన తర్వాత, సాయం సంధ్య దాటిన తర్వాత ఆ హాహాకారాలు, భార్యలను పోగొట్టుకున్న వారు, భర్తలను పోగొట్టుకున్నవారు, క్షతగాత్రులైనవారు, అంగవైకల్యాన్ని పొందినవారు, ప్రాణం కోసం ఇట్టాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ హాహాకారాలు చేస్తుంటే, వాటి మీద అంతఃశయం మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ఆ లోపల ఉన్నటువంటి చెడు రక్తమంతా కూడా కారిపోయిన తర్వాత తన కట్టెదుట నుంచున్నటువంటి శ్రీకృష్ణుడి యందు ఆయన మూలమైనటువంటి మహావిష్ణువు యొక్క దర్శనం చేశాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింపని, అంటే ఆ త్రిజగన్మోహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని విష్ణు సహస్ర నామాన్ని ఒక ఆత్మ గీతారాపన చేసి తన సుషుమ్నా గీతంలో నుంచి లోక లోకాంతర ప్రాణాలను దాటి తనలో దాగి ఉన్నటువంటి దానినంతా చెప్తూ ఉన్నప్పుడు ఆయన గురించే, ఆ విష్ణువును గురించే విష్ణు సహస్ర నామం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చేతులు కట్టుకొని శిరస్సు వంచి అత్యంత వినయ వినమ్రత గాత్రుడై విన్నాడు. శరీరం మొత్తాన్ని ఆ వింటున్న దానిలో అప్పజెప్పాడు. ఎవరిని గురించో చెప్తున్నట్లుగా, కానీ భీష్ముడు ఎవరి గురించి చెప్తున్నాడు? కృష్ణుడి గురించే. నీవే ఆ శ్రీమహావిష్ణువి. ఆయనకున్న ఈ attributes, ఈ గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలో నేను దర్శనం చేస్తున్నాను అంటూ వెళ్ళినటువంటి ఆ సందర్భంలో భగవంతుడు ఎంత వినయంగా ఉన్నాడో చూడండి. కాబట్టి వినయం మన లక్షణం కావాలి. స్వామి ఎనభై ఏడు గ్రామాలకి మొదటి major water projects అయిపోయిన తర్వాత ఎనభై ఏడు గ్రామాలకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎనభై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది కలిసి స్వామికి కృతజ్ఞత చెప్పుకోవాలి, ప్రశాంతి నిలయానికి వెళ్ళి అని అనుకున్నారు. అనుకొని వెళ్లారు.వెళితే స్వామికి లోపల కబురు పెట్టాలి ఇట్లా ఎనభై ఏడు గ్రామాల నుంచి మీ దర్శనానికి వచ్చారు అని. స్వామి వచ్చారు బయటికి వచ్చి వాళ్ళు స్వామి మీకు కృతజ్ఞతలు అనేలోగా స్వామి అన్న మాట ఏమిటో తెలుసునా? మీ ఎనభై ఏడు గ్రామాలకి నీళ్ళు ఇవ్వగలిగినటువంటి ఒక అవకాశాన్ని మీరు స్వామికి ఇచ్చినందువలన స్వామి మీకు కృతజ్ఞతలు చెప్పటానికి బయటికి వచ్చారు అన్నారు. అది వినయం. ఇది సత్యం ఇది చారిత్రక సత్యం. పుల్వంత హాల్లో జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. అలాగే పంతొమ్మిది వందల ఎనభైవ ప్రాంతం ఎనభై ఎనభై ఒకట్లో స్వామి భజన మందిరంలో లోపల భజన లీడ్ చేస్తున్నారు. తాళం వేస్తున్నారు మేమంతా భజన పాడుతూ ఉన్నాం. నేను నాకు భజన రా-- చేయటం పాడటం చేత కాదు ఆ రోజుల్లో ఇప్పటికి కూడా. సరే ఆ రోజుల్లో అక్కడ స్వామి నాకు భజన రానప్పుడు ముందెందుకు కూర్చోవాలంటే నువ్వు రా కూర్చో అన్నారు. కారణం మనకు తెలీదు. సరే అందరూ నీట్ భజన్స్ బ్రహ్మాండంగా పాడుతున్నారు స్వామి సన్నిధిలో స్వామి చక్కగా తాళం వేస్తున్నారు. ఆ చక్కగా చేతులు చరిచి చప్పట్లు కొడుతున్నారు మహదానందంలో ఉన్నారు. ఇంతలోకే సడన్ గా స్వామి ముఖం ఒక్కసారిగా వివర్ణమైపోయింది. వివర్ణం అంటే ఆ-ఆ తేజస్సు ఆ ఆనందంలో నుంచి ఒక్కసారి బయటికి వచ్చారు. వచ్చి నాకు ఇట్లా అన్నారు సిగ్నల్ చేశారు. నేను గబుగబా లేచి స్వామి దగ్గరికి వెళ్ళాను. అక్కడొక పళ్ళెం ఉంది ఆ పళ్ళెం తీసుకో అన్నారు. ఆ పళ్ళెం నేను తీసుకుని స్వామి దగ్గరికి వచ్చాను. వచ్చి అది ఏం చేయాలో నాకు తెలీదు. కాదు కాదు కాదు కాలు కింద పెట్టు పాదం కింద పెట్టు బొటనవేలు కింద పెట్టు అంటున్నారు స్వామి చెబుతున్నారు. నేను చాలా అటెంటివ్ గా దాన్ని తీసుకెళ్ళి స్వామి కుడి పాదంలో ఉన్నటువంటి బొటనవేలు కింద పెట్టాను. దానిలో నుంచి ఒక ధవమ్ ఊరి స్వామి పాదంలో నుంచి వచ్చింది. ఇది తీసుకువెళ్ళి ఎర్ర స్వెటర్ వేసుకుని చెట్టు కింద ఒక ముసలాయన కూర్చున్నాడు ఇమ్మీడియట్ గా నువ్వు తీసుకెళ్ళి ఇది ఆయనకు తాగమని చెప్పు అన్నారు. నేను ఆ పళ్ళెం తీసుకుని వెళితే అందరిలో ఒక్కరే ఒకాయన ఎర్ర షర్టు వేసుకుని ఉన్నారు స్వెటర్ వేసుకుని ఉన్నారు. ఆయనకీ ఇది స్వామి మీకు తాగమని ఇచ్చారు తాగండి వెంటనే అన్నారు. ఆయన స్వామి భక్తుడు వెంటనే స్వామి ఆజ్ఞ పాటించి అది తాగాడు. మామూలుగానే నేను ప్లేట్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఆ ప్లేట్ పక్కన పెట్టి మళ్ళీ నా స్వస్థానం ఆ ప్లేస్ లో నేను కూర్చున్నా. భజన అయిపోయింది హారతి అయిపోయింది బయట కూర్చున్న వాళ్ళందరూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. హాల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. స్వామి ఒక్కరూ వరండాలో నుంచుని ఉన్నారు. ఆ ఎర్ర స్వెటర్ తొడుక్కున్న పెద్దాయన మాత్రం అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు స్వామి దగ్గరికి రమ్మన్నారు. ఆయన వచ్చాడు. నీకు ఎనభై రెండు సంవత్సరాల వయస్సు వచ్చింది స్వామిని చూడాలని నువ్వు వచ్చావు. నీకు కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉంది నువ్వు మందులు వేసుకుంటున్నావు. నీవు ఎవరినన్నా బండ వెంట పెట్టుకుని తోడు తీసుకుని రావాలి కదా. ఈ చరణామృతం వలన స్వామి మాట ఈ పదం స్వామే వాడారు. ఈ చరణామృతం వలన నీకు ఆయుష్షు పెరిగింది కానీ ఇటువంటి రిస్క్ ఎప్పుడూ తీసుకుని రావద్దు. ఎవరినన్నా వెంబడి పెట్టుకుని రా. నిజానికి నువ్వు రానక్కరలేదు. నామస్మరణ చేసుకుంటూ నీ ఇంట్లో ఉండవలసిన చోట నువ్వు ఉన్నట్లయితే స్వామి నిన్ను కాపాడలేడా? నువ్వు నాకు చెప్పావా? నీకు ఇప్పుడే ఒక హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయింది కానీ ఇకపై అది నిన్నేమి ముట్టుకోదు తొంభై ఐదు సంవత్సరాల వరకు నువ్వు ఉంటావు అని అనుగ్రహించారు. తొంభై ఐదు నిజానికి ఆయన హీ కంప్లీటెడ్ హండ్రెడ్ ఇయర్స్. స్వామికి తొంభై ఐదే ముందు చెప్పారు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే స్వామి ఉంగరం ఇచ్చారా, పొంగరం ఇచ్చారా లేకపోతే మనల్ని దగ్గర తీసుకున్నారా ఇది కాదండి. ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడికి ఏం చెప్పాలో చెప్పారు. మనం రిస్క్ తీసుకోకూడదు ఇంకొకళ్ళను రిస్క్ లో పెట్టకూడదు. జీవితంలో డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వాడు ప్రతి వాళ్ళు చేయవలసిన పని అది. స్వామి చూసుకుంటారులే అంటే చూసుకుంటారు కానీ ఆ భర్తను ఆయన మీద మోపకూడదు కదా ఆయన మోసారిగా. ఆనందం అనుభవిస్తున్నారు ఆ రోజున స్వామి భజన పాడుతున్నారు హీ వస్ ద లీడ్ సింగర్ ఇన్ ద భజన హాల్. కానీ దాని నుంచి ఒక్కసారి మనం చేసిన పొరపాటు వల్ల మామూలు బాహ్య స్-స్-స్మృతులకు రావటం ఆ చ-- అందుకనే బహుశా నన్ను అక్కడ కూర్చోబెట్టారేమో నేను భజన పాడేవాడిని కాదు. నా కాంట్రిబ్యూషన్ సున్నా అయినప్పటికీ ఆ చరణామృతం తీసుకెళ్ళటానికి భజన పాడేవాడిని స్వామి లేపలేదు. కాబట్టి అది తీసుకు వెళ్ళవలసిన వాడు ఒకడు కావాలి ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయనకి కావాలి. ఆ-ఆ దృశ్యాన్ని నేను చూసినప్పుడు స్వామి పాదంలో నుంచి చరణామృతం అసలు ఎలా వచ్చింది? అది నేను తీసుకుని వెళుతున్నప్పుడు ఇవాళ మీకు చెప్తున్నాను. దాని నుంచి వచ్చినటువంటి పరిమళం ఇంకా నన్ను వదిలిపెట్టలేదు ఎన్నేళ్ళు అయిపోయిందో. ఇంకా నిన్నో మొన్నో జరిగినట్లుగా ఉంటది. ఆయనకి అప్పుడు స్వామి ఎవరితోనన్నా రావాలి అని చెప్పినటువంటి ఆ స్వామి ఒక విద్యార్థిని ఇచ్చి ఇతన్ని ఇవాళే నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పజెప్పి వాళ్ళ కొడుకులకు అప్పజెప్పి విషయం చెప్పి నువ్వు వెనక్కి రా అని చెప్పారు. అందుకనే ఆ మధ్య ఎవరో నన్ను ఒక టీవీలో ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి మా బోటి వాళ్ళమంతా కూడా అసలు స్వామిని చూడనే లేదు మా దురదృష్టం ఇప్పుడు బాధ పడుతున్నాం మరి దగ్గరకు వెళ్ళిన వారికి మాత్రమే స్వామి ఇవన్నీ చెప్పారా, ఇవన్నీ చేశారా అని అంటే ఆ ఎర్ర స్వెటర్ కట్టుకున్న ఆయనకి తొడుక్కున్న ఆయనకిస్వామికి ఏదైనా సంబంధం ఉన్నదా? లేనే లేదు. రెండవది ఆయన ఏమన్నా ఈయన్ని ప్రార్థించారా? లేనే లేదు. ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగా ఆయనకి తెలుసా? అది తెలియదు. మరి ఇవన్నీ ఇంతమంది ఉండగా అది ఎలా తెలిసిందని చెప్తూ అసలు విషయం ఏమిటంటే నేను స్వామికి చాలా దగ్గర నన్ను ఎవరన్నా పరిచయం చేసినప్పుడు స్వామికి అత్యంత సన్నిహితుడు అని చెప్పినప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను సన్నిహితుడిని అనుకోవటం నేను అనుకోవచ్చు గానీ ఇతడు నాకు సన్నిహితుడు అని స్వామి ఇంతవరకు చెప్పలా. చెప్పారా? ఇతడే నాకు సన్నిహితుడు ఇతను లేకపోతే నా వ్యవస్థ నడవదు అని చెప్పారా? లేదు చెప్పలేదే. కాబట్టి సన్నిహితత్వం ఏమిటి అంటే మనం దగ్గర వారి చుట్టూ ఉన్నప్పుడు అనేక అవకాశాలు వస్తాయి. ఈ పని చెయ్యి అని చెప్తారు, ఈ పని చేయించు అని చెప్తారు, ఇలా చేసుకో అని చెప్తారు. అది లోక నిష్ఠ, వ్యవహార నిష్ఠ. బ్రహ్మ నిష్ఠ ఏమిటంటే స్వామి అన్నారు "వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అని మీరు అనుకోకండి. నేను నిజంగా ఎవరికి దగ్గరో మీకు చెప్పనా? ఎవరైతే నా దగ్గరకు ఇంతవరకు రాలేకపోయినారో, వచ్చినా నా దర్శనం మాత్రమే లభించి స్పర్శను దొరకలేదో, నాతో ఎవరైతే మాట్లాడటానికి కూడా నోచుకోలేదో, వా-వా మీరందరూ ఇక్కడికి వస్తారు నేను వాళ్ళ ఇంటి దాకా వెళ్లి వాళ్ళతో నేనుంటాను" అన్నారు స్వామి. [చప్పట్లు] కాబట్టి ఇక్కడ న్యూనత లేదు. పరమాత్మ మనల్ని deprive చేయడు, చేయడు. ఖచ్చితంగా అనేక అనుభవాలు చెప్పి వెళితే మనకు సమయం చాలదు. కొన్ని వేల వేల అనుభవాలు, అనుభవాలు అనుభవాల కంటే అనుభూతి కంటే మానవుడి యొక్క జిజ్ఞాస జ్ఞానం వైపు నడవాలి. వాడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటినవాడు, జీవితాన్ని చూసినవాడు, జీవితంలో ఢక్కాముక్కీలు తిన్నవాడు ఇంకా నేను రిటైర్ అయిపోతాను నాకు ఉద్యోగం ఇప్పించు స్వామి అంటే ఇప్పిస్తాడు అది ప్రారబ్ధం. మనం అనుకుంటాం ఇంకో యాభై వేలు ఇంటికి వస్తుంది రోజు అని నెలకి అది ప్రారబ్ధం. కానీ అప్పుడు మరి ఏం చేయాలి? రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మాట ఏమిటంటే పంతొమ్మిది వందల అరవయ్యవ సంవత్సరం వరకు ఆనాటి సమాజంలో లేదా ఆనాటి జనరేషన్ లో వాళ్ళ maximum సగటు వయస్సు యాభై ఏళ్ళు. చాలామంది మన ముత్తాతలని తాతలని చూడండి. వాళ్ళెవరూ ఎక్కడో వంద ఏళ్ళు బతికిన వాళ్ళు తక్కువ. యాభై అరవైకి వెళ్ళిపోయేవాళ్ళు. పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరానికి వచ్చేపటికి సుమారుగా ఆ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ వరకు ఆయుష్షు పెరిగింది పదేళ్ళు. ఇప్పుడు ఈ మనకి ఇంకో ఎనభై ఏళ్ళు వచ్చాయ్ అనుకుందాం. ఇప్పుడు డెబ్భై ఏళ్ళు వస్తే ఇవాళ డెబ్భైయవ birthday చేసుకున్నాం అనుకోండి. వాడు ఇంకొక పదేళ్ళు గ్యారెంటీగా బతుకుతాడు. ఎలా బతుకుతాడు? జీవన శైలిలో వచ్చిన మార్పులు, medical field లో వచ్చినటువంటి breakthrough, రెండవది technological breakthrough దానితోపాటు సమర్థవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని discipline గా గడిపినందువలన వాడి ఆయుష్షు పెరుగుతుంది. ఇది రెండు. మొన్న మొన్ననే ఒక study ఏం చెప్పిందంటే 2050వ సంవత్సరం వచ్చేసరికి of course మనమైతే ఉండం. 2050 ఇంకా చాలా time ఉంది. ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత అప్పుడు వచ్చే ఇవాళ మన generation మన తర్వాత పుట్టిన పిల్లలు. వాళ్ళకి ఇంకో ఇరవై ఏడు ఏళ్ళు age గనక కలిపినట్లయితే ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే నూట ఇరవై ఏళ్ళు మళ్ళీ మానవుడు బతుకుతాడు అని చెప్పింది. బతకనివ్వండి కానీ ఏం చేయబోతున్నాం? అరవైకి రిటైర్ అయిపోతాం. ఇది ఎప్పుడేదో ఎనభై ఏళ్ళు బతుకుతాం అంటున్నాం. కనీసం వంద ఏళ్ళు బతుకుతాం అంటున్నాం. మొదటి జీవితంలో తొలి ఇరవై ఏళ్ళు మనకు తెలియకుండా గడిచిపోతుంది. తర్వాత నలభై ఏళ్ళు ఉద్యోగంలో గడిచిపోతుంది. అరవై ఏళ్ళు అయిపోయినాయి. ఎనభై గనకైతే ఇరవై మిగిలినాయి. ఇరవైలో ఎనిమిది గంటలు గా-ఓ ఎనిమిది ఏళ్ళు నిద్రలో సరిపోతుంది. ఐదు సంవత్సరాలు ఆ ఊరు ఈ ఊరు తిరగటంతో సరిపోతుంది. మిగతా ఏడేళ్ళల్లో నువ్వు చేయవలసిన కర్మలు చేయటంతో కొంత సరిపోతుంది. నీకై నీ ఆయుష్షులో నీకోసం మిగిలింది ఎంత? అని ఆలోచిస్తే వందలో మనకోసం మనం బతికే సమయం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. ఆ ఐదు సంవత్సరాలని మనం గనక ఆధ్యాత్మిక మార్గంలోకి మలచుకున్నట్లయితే, తీర్చిదిద్దుకోగలిగినట్లయితే, ఆశలని అదుపులో పెట్టుకోగలిగినట్లయితే, కోరికలను నియంత్రించగలిగినట్లయితే disciplined గా మన జీవితాన్ని మనం నడపగలిగినట్లయితే ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పక్కర్లా స్వామి చెప్పినట్లుగా జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి వాస్తవిక జీవితాన్ని మనం గడపగలుగుతాం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. స్వామి స్వామి దగ్గరికి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ప్రపంచంలో చేయటానికి ఏం లేదు ప్రశాంతి నిలయంలో సేవ చేస్తే ఏదో ఉండి ఉన్నాళ్ళు పదేళ్ళో ఐదేళ్ళో బతుకుతాం వెళ్ళిపోతాం అని వెళితే స్వామి సేవలోకి వచ్చినటువంటి ఆ అరవై ఏళ్ళు దాటిన almost అందరికీ maybe ఒక one or two percent persons తప్ప వంద మంది వెళ్లారనుకుందాం తొంభై ఎనిమిది మందికి స్వామి చెప్పిన మాట ఏంటంటే సేవ ద్వారా సేవ చేయటం ద్వారా నీకున్నటువంటి నీ బంధాలని మమకారాలని దాటి సమస్తమైన ప్రపంచాన్ని ప్రేమించగలిగిన ఒక మనస్సు ఏర్పడిన కారణంగా నాకు మాత్రమే ఇది కావాలన్నటువంటి అహం వదులుకున్న కారణంగా నేను కూడా ఏం చేయగలను అన్నటువంటి ఒక భావన కారణంగా ఇక్కడ సేవ చేసిన ప్రతి వ్యక్తి నూరు సంవత్సరాలు జీవిస్తారు అని స్వామి చెప్పారు. నిజానికి వాళ్ళంతా నూరు సంవత్సరాలు పూర్తైన వాళ్ళే. ఒకాయన పేరు చెప్పక్కర్లేదు. ఆయన తొంభై ఎనిమిది ఏళ్ళు వచ్చిన ఇంకా వీల్ చైర్ లో స్వామి దర్శనానికి వచ్చేవారు. ఆయనకి జీవితం అంటే కొద్దిగా విసుగు వచ్చింది ఎప్పుడో ఓ రోజు. స్వామి దర్శనానికి వచ్చి వెళుతూ ఉంటే స్వామి ఆ వీల్ చైర్ దగ్గర ఆగారు. ఆగినప్పుడు ఆయన ఏమడిగారంటే "స్వామి తొంభై ఎనిమిది వచ్చేస్తున్నాయినాకు ఇంకా చాలు అని అనిపిస్తున్నది అని అన్నారు. స్వామి వెంటనే "రెండేళ్లు కూడా పూర్తి కానీ బంగారం" అంటూ ముందుకెళ్లిపోయారు. [నవ్వు] correct గా hundred years birthday నాడు ఆయన body వదిలేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సేవలో మన ఆయుష్షు పెరుగుతుంది. సేవలో మన శక్తి purify అవుతుంది. ఒక కష్టాన్ని మనం తీర్చడంతో మనకి అష్ట ఐశ్వర్యాలు మనకి ఏర్పడతాయి. భగవంతుడి సంపద ఒక వ్యక్తికి ఎందుకిస్తాడు అని? సత్కర్మలు చేయమని ఇస్తాడు. ఓం అందుకే స్వామి చెప్తారు "డబ్బు పాపిష్టిది కాదు" మీరు రాసుకోండి. డబ్బు ఉండాలి. ప్రపంచం నడవాలంటే డబ్బు ఉండి తీరాలి. కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు ఉండకూడదు. అది ఈ ప్రపంచానికి వినాశన హేతువు అవుతుంది గనుక అధ్యాత్మ మార్గంలోకి రండి. ఈ అధ్యాత్మ మార్గం ముందుగా భజనతో ప్రారంభించండి. తర్వాత రోజు జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఒకప్పుడు నగర సంకీర్తన ఒక నలభై ఏళ్ల క్రితం చాలా విస్తృతంగా జరిగేది. అందరూ భక్తులు, భక్తులు కాని వాళ్ళు, స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంకా నమ్మకం కుదరని వాళ్ళు అందరూ కూడా వచ్చేవాళ్ళు. అది ఒక సామాజికమైనటువంటి ఒక చైతన్యం కలిగించింది, నగర సంకీర్తన. ఇవాళ నగర సంకీర్తన నెమ్మదిగా పలచబడిపోయింది. భజనలు కోవిడ్ కారణంగా మనమెవ్వరం ఇలా కలుసుకోలేకపోయాం రెండున్నర ఏళ్ళు. మళ్ళీ ఇవాళ మీ అందరినీ ఇక్కడ చూస్తున్నప్పుడు పాతకాలం నాకు గుర్తొచ్చి చాలా ఆనందం కలుగుతుంది. ఇది-- అదెందుకు-- అదెవరిచ్చారు, ఇదెవరిచ్చారంటే కరోనా కాలంలో మనందరికీ కూడా జీవితం ఎంత అశాశ్వతమో తెలిసి చెప్పింది. కాబట్టి కరోనా మనకు గురువై నిలబడింది. నాయనా! నీ దగ్గర ఎంత ఉన్నా నేను వచ్చానంటే నువ్వే ఉండవు అని చెప్పింది. రేపు ఉంటామో ఉండమో అని చెప్పింది. ఏమైపోతామో అని చెప్పింది. కాబట్టి ఒక వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు చెప్పినటువంటి వైరాగ్యం మొత్తాన్ని రెండున్నర ఏళ్ళు మనకి అది నేర్పింది. కదా. ఇవాళ ఆ phase మనం దాటిపోయినాం. మళ్ళీ పునః ఇట్లాగే చాలా విస్తృతంగా ఇంకా బాగా బయటకు రావాలి. నగర సంకీర్తన బాగా జరగాలి. నగర సంకీర్తనం వలన ఏమిటి లాభం అంటే discipline ఒకటి ఏర్పడుతుంది, రెండు ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తన స్మరణ జరుగుతుంటుందో వాతావరణ కాలుష్యం కూడా తగ్గిపోతుంది. ఇవాళ భావ కాలుష్యం పెరిగిపోయింది. ఒక మనిషి ఇంకో మనిషిని ఆ-అంగీకరించే స్థితిలో లేడు. ఒక మనిషి ఇంకో మనిషిని అక్కరకు వచ్చే స్థితి లేదు. అక్కున చేర్చుకునే స్థితి లేదు. మరి ఇట్లా గనుక మనిషి మనిషి విడిపోతూ ఉన్నట్లయితే వసుధైక కుటుంబ నిర్మాణం జరుగుతుందా? జరగదు. కానీ అలా జరగగటానికి ఒక-ఒకే ఒక్క అవకాశం ఉన్నటువంటి సంస్థ, దాని పేరు సత్యసాయి సేవా Organization. [చప్పట్లు] ఇది మాత్రమే చేయగలదు. ఇంకా ఎవ్వరూ చేయలేరు. ఎందుకనంటే మనకి మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. ప్రశాంతి నిలయంలో కులం గదుల్లో గనుక మనం కూర్చున్నట్లయితే అక్కడ కేవలం నలుగురు భక్తులు కూర్చున్నటువంటి బృందం కాదది. సమస్త దేశాలు నానా దేశాల నుంచి నానా వర్గాల నుంచి వాళ్ళందరూ వచ్చి ఒక్క స్వామి యందు మనస్సును నిలిపి ఈ వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచం అంతా ఒక్క కుటుంబమే అని ఏ సంస్థలోనైనా ఎక్కడైనా జరిగిందా? అంటే ఒక్క ప్రశాంతి నిలయంలో తప్ప ఇంకెక్కడా జరగలేదు, జరగదు. దీనికి కారణం ఏంటంటే స్వామి మనకిచ్చినటువంటి intense training. ఆ training ఎలా ఇచ్చారు? మీరందరూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పారా అంటే ఆయన అలా ఉన్నాడు. ఒక ముస్లింని పిలిచారు, ఒక క్రిస్టియన్ ని పిలిచారు, ఒక జొరాస్ట్రియన్ ని అతని సంప్రదాయం ప్రకారం చేశారు, ఒక హిందూ ధర్మాన్ని పాటించేవాడిని పిలిచారు. సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని పతాక స్థాయిలో తీసుకుని వెళ్లారు. అంతేకాదు తాను ఉన్నచోటు నుంచి కదలకుండా సమస్త దేశాలని కూడా పుగ్రామమైన ప్రశాంతి నిలయానికి పుట్టపట్టికి దారి చూపించారు. ఇదిగో ఉన్నదేదో ఇక్కడ ఉన్నది. ప్రశాంతి, ప్రేమ, దాతృత్వము, ఒక కరుణ, ఒక వాత్సల్యము, ఒక ప్రేమ, ఒక మానవీయ భావనలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని ఒక ఆకర్షణగా ప్రపంచాన్ని తన దగ్గరకు రప్పించుకున్నారు. మనం ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి అంటే మనం అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక దేశాలకు వెళ్ళాలి, అనేక మందితో మాట్లాడాలి, seminars లు, conferences లు పెట్టాలి. అయినా ఎవరు మారుతాడో మనకు తెలియదు. కానీ స్వామి ఇవేవీ చేయలేదు. ఒక వైదికమైనటువంటి ఒక ధర్మాన్ని చాలా practical గా అనుష్ఠాన వేదాంత భూమికలో నిలబెట్టి ఈ ప్రపంచానికి అందించినటువంటి మహిమా స్వరూపులు ఎవరంటే స్వామి. నన్ను అడుగుతారు "మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక్క మహిమ కూడా చెప్పరేమిటండి? ఏవో మహిమలు మీకు కూడా జరిగి ఉంటాయి కదా, అవన్నీ మాకొక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి" అంటే ఒకటి మాత్రం చెప్తాను. [గొంతు సవరించుకుంటున్నారు] ఆ మహిమ అనండి దాన్ని, మాయ అనండి, స్ఫూర్తి అనండి, అసంభవం అనండి, అద్భుతం అనండి, incredible అనండి, ఏదన్నా పేరు పెట్టండి. స్వామి వస్తారు, దర్శనం ఇవ్వటానికి వస్తారు. దర్శనం ఇస్తారు, వెళ్తారు, వారు కూర్చొని ఉంటారు. ఇంతలోకి మన భజనలు, మన వేదపఠనం తర్వాత మనందరం ఆయనకేదో చెప్పుకోవటం, మానసికంగా కొన్ని కొన్ని కోరికలు వారి పట్ల వెలిబుచ్చటం ఇవన్నీ అవుతాయి. ఇంతలో హారతి తీసుకుంటారు, స్వామి లోపలికి వెళ్ళిపోతారు. స్వామి లోపలికి వెళ్ళగానే మనం కూడా మన gate లల్లో నుంచి మనం బయటకు వస్తాం. అత్యద్భుతమైన మహిమ ఏమిటి అంటే ఒక్క స్వామి, ఒక సింహాసనంలో కూర్చునున్న స్వామి మనం బయటకు వెళ్తుంటే కుడివైపునా, ఎడమవైపునా, వెనకా, ముందు మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు ఏమిటంటే "ఈవేళ స్వామి నన్నే చూశారు" అంటారు. "నా వైపే చూశారు. నా లోపల ఏదో ఒక కోరిక కలిగింది, అది తీర్చేశారు. సమాధానాలు వచ్చేసినాయి" అంటారు. స్వామి ఎంతమందితో మాట్లాడారు? ఎవరితో మాట్లాడనే లేదే. వచ్చారు, దర్శనం ఇచ్చారు, కూర్చున్నారు, హారతి తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మరి దీనిని మించిన ఒక అద్భుతం ఏదన్నా ఉన్నదా? మహిమ ఏదన్నా ఉన్నదా?మనకి మహిమానంగానే వస్తు సృష్టి జరిగితే దానికి మహిమా అని పేరు పెట్టుకున్నాం. [దగ్గరగా చప్పట్లు] ఇవాళ మనమందరం ఇలా కూర్చొని ఉన్నామంటే ఇది సత్య సాయి భగవానుడి యొక్క మహిమగా నేను భావిస్తున్నాను. [దగ్గరగా చప్పట్లు] దీన్ని మించిన మహిమ మరొకటి లేదు. మనమందరం కూర్చోవాలి, మంచి విషయాలు మాట్లాడుకోవాలి, అవి అర్థమయ్యే రీతిలో జీవితానికి సమన్వయం చేసుకోవాలి. విన్న తర్వాత మన జీవితాన్ని కూడా మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏం చేయాలి అని మనం ఎప్పుడూ కూడా ఒక ఉదాత్త స్థాయిలోనే సంచారం చేయాలి. వినయంగా ఉండాలి. ఏ స్థితికి వెళ్ళినా, ఏ శిఖరాలు దాటినా, వాటిని ముట్టుకోగలిగినా, ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది సాధించినా, మనం వినయంగా ఉండాలి. ఏది వచ్చినా పరమేశ్వరుడికి సమర్పణం చేయాలి. ఏది జరుగుతున్నా సన్నాహితి భావంతో ఉండాలి. దాని యందు భక్తి, పరమాత్మ యందు అనురక్తి, పరమాత్మ శక్తి యందు కావలసినటువంటి దివ్యమైనటువంటి భావన, ఇవన్నీ కూడా మన యందు ఉండాలి. అలాగే మన కడుపున పుట్టినటువంటి బిడ్డలకి స్వామి యొక్క దివ్యత్వాన్ని అనేక విధాల-- చూడండి, 2011 ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత పుట్టిన వారెవ్వరికీ స్వామిని భౌతికంగా చూసే అదృష్టం లేదు, కదా. కానీ ఒక Technology కారణంగా ఇవాళ CDలున్నాయి, DVDలున్నాయి, మాధ్యమాలున్నాయి, ఆ... Multimedia ఉంది, మన ఆ... Radio Sai ఉన్నది, Media Center ఉన్నది, Photos ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీని ద్వారా స్వామిని చూడవచ్చు, స్వామిని వినవచ్చు. కానీ ప్రత్యక్షానుభూతికి మాత్రం ఒక శకం, ఒక తరం కోల్పోయింది. అట్లా అని అవతారమూర్తి అయినప్పటికీ కూడా పాంచభౌతికమైనటువంటి ఒక దేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆ దేహాన్ని వాళ్ళు కూడా వదిలి పెట్టవలసిందే. ఇది ప్రకృతి ధర్మం ప్రకారం జరిగేదే. మరి ప్రకృతి ధర్మం ప్రకారం మనమేం చేయాలంటే సత్య సాయి భగవానుడి యొక్క స్ఫూర్తిని, సందేశ ఆదేశ ఉపదేశాలని మనం మహా మంత్రంగా స్వీకరించి సత్య సాయి సేవా Organization విన్నవించుకున్న అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలోకి మనం బాహువులను చొప్పించి, మన కాళ్ళను అటువైపు నడిపించి, మన కళ్ళను అటువైపు ఆ దృష్టి సారించి, మనం గనక జీవితాన్ని Spiritualize చేసుకోగలిగినట్లయితే, తద్వారా Divinise గనక కాగలిగినట్లయితే అది సర్వోత్తమమైనటువంటి స్థాయి, దాన్ని మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు లేదు అని భావన చేస్తూ మీ అందరూ కూడా పరమేశ్వర సమానమైనటువంటి ఒక జీవితాన్ని మీరు పొందారు. మీరు కాదు మనమందరం పొందాం. ఎందుకని అంటే "త్వమేవాహం న సంశయః" అని ఒక మాట ఉంది. నీకూ నాకూ తేడా లేదు, ఇది వేదం చెప్పింది. స్వామి దానిని వేళ అధునాతన భాషలో "You are me, I am you" నువ్వే నేను, నేనే నువ్వు. నేను భగవంతుడిని అని నాకు తెలుసు, మీకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానికి పెద్ద పెద్ద అరణ్యాలకు వెళ్ళద్దు, ఉన్న సంసారాలను చుదుముకోవద్దు, తాళాలు వేయద్దు, ఎవ్వరినీ వదులుకోవద్దు. అందరితో మీరు ఉండండి, చక్కగా ఉండండి, సామరస్యంతో ఉండండి, ఆనందంతో ఉండండి, పరస్పర ప్రేమాభిమానాలతో నిలకడ చెంది ఉండండి అని అనేకమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి బీజాలని మన హృదయాలలో చల్లినటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞుడు ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయి. అటువంటి స్వామికి మనమివాళ ఏం చేయాలి, మన తరవాతరానికి ఏం చేయాలి, ఆయన ఏం చేశారో గంట మాట్లాడి-- రెండు గంటలు మాట్లాడొచ్చు. కానీ అది ప్రధానం కాదు ఇవాళ. ఆయన ఏం చేశారో చరిత్ర బద్ధమైంది. ఇవాళ మనమేం చేయాలి As devotees of Sathya Sai. ఇందాక చెప్పిన ప్రక్రు-- ప్రవృత్తి నుంచి వివృత్తిలోకి, ప్రభావంలో నుంచి స్వభావంలోకి, మానవీయమైనటువంటి గుణంతో మన జీవితాన్ని మనం ఆవిష్కరించుకోవటానికి తగిన తగు ఆశలతో, సమయానికి తగిన మంచి మాటలతో, మంచి వాగ్భూషణంతో, మంచి భావ సంపదతో మనం గనక సమాజంలో గనక మనం చొచ్చుకొని వెళ్లగలిగినట్లయితే, స్వామి చెప్పారు "ప్రబోధము అంటే నలుగురికి చెప్పేది, ప్రచారము అంటే నాలుగు వేల మందికి చెప్పేది, ప్రసారము అంటే నీ నుంచి ప్రసారమయ్యేది." నీవే డొల్లవాడివైతే, నీవే శక్తిహీనుడవైనట్లయితే, నీకే Spirituality అర్థం కాకపోతే, నీవు ఎవరికి చెప్పగలవు, ఎవరిని మెప్పించగలవు? ముందు Redeem yourself from the bondages that life has granted. ఈ జీవితం మనకిచ్చినటువంటి అనేక బంధనాలున్నాయి. అవి ఆ... ఆ సంకెళ్ళు ఏమంటే ఇత్తడి సంకెళ్ళా, ఇనుప సంకెళ్ళా, వెండి సంకెళ్ళా, బంగారు సంకెళ్ళా, సంకెళ్ళ సంకెలే. ఏదైనా దానికున్న Screw తీయాలి, వాటిని వదులుచుకోవాలి. ఎవరు వదులుస్తారు? "ఉద్ధవే రాత్మన ఆత్మానమ్" మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మాకా శక్తి లేదే అన్నప్పుడు పరమేశ్వరుడి యొక్క శక్తిని మనం ఆవాహన చేసుకోవాలి. ఒక Eighth standard complete చేయనటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ప్రపంచం మెచ్చేటువంటి ఒక University ని ఎలా పెట్టగలిగారు? Medical Sciences అనేవి ఏమీ తెలియని ఒక స్వామి అత్యద్భుతమైన Super Speciality ఎలా కట్టగలిగారు? అనేక Governments లో కొన్ని వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలున్నా చుక్క నీరు అందించలేనటువంటి ఒక స్థితిలో ఎవరెవరికి ఎంతెంత కావాలో ఒక్క వ్యక్తి ఎలా సృష్టించి ఇవ్వగలిగారు? అన్నప్పుడు నాకు సత్య సాయి భగవానుడు కేవలం వ్యక్తిగా కాక ఒక వ్యవస్థగా, ఒక శక్తిగా, ఒక దివ్యశక్తిగా కనిపించినప్పుడు నేను అంత పెద్ద పనులు చేయలేనేమో కానీ, నా కడుపున పుట్టినటువంటి బిడ్డ మాత్రమే కాక ఇంకెవరో ఒక ఆడపిల్లో, మగపిల్లవాడో ఒక్కడికి నేను చదువు చెప్పించగలిగినట్లయితే నేను కూడా ఒక University నిర్మాణంలో భాగస్వామిని అవుతా.అలాగే ఒక హాస్పిటల్ లో ఇవ్వాల మనం సేవలు చేస్తున్నాం నేను కూడా కొంత సేవా చేయగలిగినట్లయితే నేను hospital కట్టక్కర్ల అలాగే ఈ ప్రపంచంలో ఒకటి దాహం తీర్చకలిగితే ఒకడికి క్షుద్బాధ ఆకలి బాధను తీర్చగలిగితే దీనిని మించినటువంటి ఒక సేవ మరొకటి ఉన్నదా స్వామి చాలా macro level చేశారు micro level మనం కూడా చేయగలము ఆ మాత్రం సంపదలు ఆ డబ్బు మన దగ్గర ఉండనే ఉంది మన దగ్గర లేనిది ఏమిటంటే చెయ్యాలి అనేటువంటి దృఢసంకల్పం లేదు చేయించ గలిగిన మనస్సు లేదు చేద్దామన్న హృదయము లేదు ఈ మూడు శరీరాన్ని మనసుని హృదయాన్ని ఏకీకృతం చేసి తద్వారా గనుక మనం ఈ సమాజహితమైన జీవితాన్ని మనం గడప కలిగినట్లైతే అదే నిజమైనటువంటి సమర్పణ అదే నిజమైనటువంటి శరణాగతి అదే నిజమైన అటువంటి వినయ పూర్వకమైన అటువంటి స్వామి మనం ఇచ్చేటువంటి నీరాజనం అదే నివాళి అదే మనం శిరస్సు వంచి స్వామి పదాభివందనం చేస్తామ్ శిరస్సు వంచి నమస్కరిస్తాం కానీ నమస్కరించిన ఈ వినయాన్ని ప్రపంచం పట్ల కూడా మన అందరి పట్ల పరస్పరం ఎవరు కానివ్వండి వారు ఎవరైతే మనకు.. కృష్ణుడు కుచేలుణ్ణి కాపాడటానికి సింహాసనం దిగి వచ్చాడు కృష్ణుడు కుచేలుడు కాళ్లు ఒత్తాడు భార్యల చేత పాదాలు కడిగించాడు ఆ నీళ్ళు తన నెత్తి మీద చల్లుకొని అందరికీ చల్లారు అంటే పరమేశ్వరుని మించిన వినయశీలి మరొకడు లేడు మనం అవన్నీ చేయగలుగుతున్నామా అంటే మనం చేయలేకపోతునాం ఇప్పటికీ స్వామి తొంబై ఏడు సంవత్సరాలు ఇంకో మూడేళ్లలో నూరేళ్లు ఆయన ఈ అవతారం వచ్చి వంద సంవత్సరాలు అందులో చాలా భాగం మనం స్వాമితో గడిపాం మనం ఇప్పటికైనా మన ఆలోచనా రీతిని గనుక తగురీతి మార్చుకోలేకపోయినట్లయితే ఏదో వచ్చాం కాసేపు భజన చేశాం ఏదో ఎక్కడ నుంచి ఓకాయు నాకు came సమర్పణ గురించి మాట్లాడాರು యో కొన్ని మంచి విషయాలు చెప్పారు ఆయనకి ఆయన అనుభవ పరిధిలోనివి చెప్పారు అని మనం వెనుక మనం వెళ్లి పోయినట్లు అయితే ప్రయోజనం లేదు వాటిని మనం ఆచరించాలి ఇవాళ చూడండి టేక్ హోమ్ అని బోర్డ్ లు కనిపిస్తుంటాయి hotels దగ్గర కదా ఇక నుంచి మీరు parcels పెట్టించుకుని వెళ్ళాలని చెబుతారు మరి మీటింగ్ సత్సంగం అయిన తర్వాత మనకివ్వela టేక్ హోమ్ ఏం ఉన్నదీ అంటే సమర్పణా శరణాగతి వినయం మన టేక్ హోమ్ ఇంకేమీ లేదు మిగతాదంతా దాని చుట్టూ అల్లుకున్నటువంటి భావాలు గనుక అటువంటి ఉదాప్తమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యభావ స్థితిని îvvalà ఆ ఇక్కడికొస్తున్నప్పుడు మన మెహబూబ్ నగర్ అనేటువంటి board చూశాన్ మన మెహబూబ్ నగర్ నాక్కుడా అనిపించింది ఇది మన మెహబూబ్ నగర్ ఎందుకని అనిపించిందంటే మనందరి లక్ష్యం ఒక్కటే మాట్లాడుతున్న నాది వింటున్నా మీది ఈ రెండు చేస్తున్న స్వామిది లక్ష్యం ఒక్కటే ఈ సమాజం చల్లగా ఉండాలి సమాజం പ്രശാంతంగా ఉండాలి పిల్లలు అందరూ చక్కగా వృద్ధిలోకి రావాలి ఆరోగ్యకరమైన ఆరోగ్యవంతమై అయూష్amantమైనటువంటి జీవితాలను నిర్మాణం చేసుకోవాలి తదనుగుణంగా మరొక రాబోయేటువంటి తరానికి ఉదాత్తుమైన ఆధ్యాత్మిక భావాలన్నింటినీ కూడా అందించగలగాలి అనేటువంటి ఒక అద్భుತ స్థితిని ಅನುಗ್ರಹించినందుకు Swami పట్ల నా వినయం నా సమర్పణ నా శరణాగతి మళ్లీ మరొక్కసారి ಸಂಪೂರ್ಣమైనదని నేను భావన చేస్తూ ఈSamarpan కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను రాగలిగినందుకు వచ్చిన కాసేపు కొన్ని మాటలు చెప్పగలిగినందుకు అన్నింటికీ కారణమైనటువంటి సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి ಸತ್ಯಸಾಯಿ ಭಗವಾನನಿ యొక్క ದಿವ್ಯ ಶ್ರೀ ಚರಣಾರವಿಂದలకు మరొక్కసారి ಪ್ರಣാമം ఇస్తూ మీ అందరికీ ಶುಭಕಾಮനಗಳು తెలియజేస్తూ ಮಂಗಳಪ್ರದమైన ఆహ్లాദകരమైన ಪ್ರಸನ್ನమైన ಪ್ರಶಾಂತమైనటువంటి భವಿష్యత్తు మీ అందరికీ కలగాలని మనందరం కలిసి సత్యసాయి మహోద్యమంలో మనం చేయవలసినటువంటి నిర్వర్తించవలసిన man కర్తవ్యాన్ని ನಿರ್ವರ್ತಿoಚಾಲని ತದ್ అనుగుణమైనటువంటి యుక్తిని ഭక్తిని రక్తిని శక్తిని ಯೋಗ್ಯತೆನಿ ప్రాప్తిని ಸರ್ವdevata ಸ್ವರೂಪುಡైనటువంటి ಸ್ವಾಮಿ ಮನக்கு సంపూర్ണ്ണంగా അനുగ్రహించు గాక అని ಮంగళಾಶಾಸನಂ చేస్తూ మీ అందరికి Sai Ram chippe loga ఒక bhajan ravu gaani ఒక Sankirtana చేస్తాను మీరందరు చక్కగా గొంతు విప్పి ఏ రకమైన inhibition లేకుండా గొంతు కలపండి అది స్వామికి మనమిచ్చేటువంటి ಅಚ್ಚమైన స్వచ్ఛమైన ನಿಜ ನೀರಾజനം దానివైపు మనం వెళ్దాం ವಂದೇ ವಂದೇ ಸಾಯೀಶಂ വಂದേ വന്ദേ സായിശം वंदे वंदे पतीशम् वंदे वंदे पतेशं વંદે વંદે સાયીશં వందే वन्दे साईशं ವಂದೆ ವಂದೆ ಪದೇಶಂ వందే వందే పతీశం ವಂದೆ ವಂದೆ ಮನೋ ನത്തೇಶಮ್ వందే వందే మనో నతీశం వందే వందే ಹೃದಯ ಪತೀಶಂ వందే వందే ഹൃദയപതീശാം ਵੰਦੇ ਵੰਦੇ ਸਾਈਸ਼ਾਂ వందే వందే సాయిషం ವಂದೆ ವಂದೆ ಪತೇಷಂ వందే వందే పతీశం ವಂದೆ ವಂದೆ ಮನೋ ನತ್ತಿಶಂ వందే వందే మనో నతீశం ವಂದೆ ವಂದೆ ಹೃದಯ ಪತೀಶಂ వందే వందే హృదయపతీశం ನೀ ಹೃದಯಮೇ దయాಕರమై నీ హृநீ గమనமே சீகரமை நீ ஹ்ருதயமே தயாகரமை நீ கமனமே சீக்கரமாய் நிరాகாரமே சாக்காரமை கிருపా காராரமை வந்தே வந்தே சாயீஷம் வந்தே வந்தே பத்தீசம் நீ சன்னிதானமே நிதானமாய் நீ சங்கீர்த்தனமே மனோ நத்தனமாய் நீ சன்னि ప్రధానమే నిధానమై నీ సంకీర్తనമേ మనో నటనమై നീ തലപേ ನೀ തലപേ అంతరంగ తరంగ మృదంగ నాదమై సునాదమై ಸುಮసుందరమై നിత్య సత్యమై శివమై சிவమై സദാ ശിവమై வந்தே வந்தே சாயீஷம் வந்தே வந்தே பத்தீஷம் வந்தே வந்தே மனோ நர்தீஷம் வந்தே வந்தே ஹ்ருதய வர்த்தீஷம் Sairam
YouTube · audio
22st Samarpan Talk
22st Samarpan Talk
Source: Sri Sathya Sai Seva Samithi { Mahabubnagar } on YouTube
0:00 / 1:33:18