Skip to content
Transcript తెలుగు
సాయిరాం మూర్తి గారు సాయిరాం అండి రేడియో సాయి స్టూడియోకి మా హృదయపూర్వక స్వాగతం అండి సాయిరాం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మీరు మంచి గుర్తింపు పొందారు ఆధ్యాత్మిక విషయాల్లో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి విషయాలకి మంచి వివరణ ఇచ్చారు మీ శ్రోతల్లో వారికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉండేటటువంటి సందేహాలను తొలగించగలిగారు మీరు అయితే భగవాన్ అనేకమైనటువంటి ఉపన్యాసాలలో ప్రపంచంలో సుఖశాంతులు నెలకొనడానికి సంఘం సుఖశాంతులతో వర్ధిల్లడానికి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారండి అవి దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి అంటే విషయాల్ని మనం గమనించినట్టయితే చాలా సూక్ష్మమైనటువంటి అల్పాక్షరముల అనల్పార్థ రచన అన్నట్టుగా మానవుడి యొక్క జీవితం సఫలమయ్యేందుకు మానవుడు ప్రపంచానికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి సుఖశాంతులతో వర్ధిల్లలా చేయటానికి మూడు విషయాలు జీవితంలో ఆచరించాలి కానీ ఇవి ఎట్లా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని గురించి సరి అయినటువంటి అవగాహన చాలామందికి లేదు. విషయంలోనే మిమ్మల్ని ప్రసిద్ధం అని నేను అనుకుంటున్నాను తప్పకుండా ముఖ్యంగా దైవ ప్రీతి అంటే మామూలుగా దైవ ప్రీతి అంటే దైవం పట్ల భక్తి కలిగి ఉండటం ఒక విషయం లేదా మనం అర్చనాధికాలు నిర్వహించటం ఒక విషయం కరెక్ట్ దైవ ప్రీతి అంటే దైవానికి నచ్చినట్టుగా జీవించటం అనేది మరొక విషయం అవును అవును దీనికి కాస్త వివరంగా సామాన్యుడికి అర్థమయ్యేటువంటి రీతిలో ఉమ్ మీరు వివరించాలని నా కోరిక సరూ సత్యసాయి భగవానుడి అవతారమే చాలా పరమాద్భుతమైన అవతారం ఆయన బోధ చేసినా వేదశాస్త్ర ప్రామాణికంగానే బోధ చేశారు అవును అయితే వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలని సామాన్య మానవుడికి ఒక నైతిక ప్రవర్తన నైతిక నియమావళి రకంగా బోధ చేస్తున్నట్టు చేయనట్టుగా అంటే చేసి చేయనట్టుగా దివ్య ప్రబోధం చేస్తూ వచ్చారు అందులో ఇప్పుడు మీరు చెప్పిన మూడు చాలా ఉదాత్తమైనటువంటివి దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి మూడు ఒక వరస అయినప్పటికీ అసలు ఎక్కడ ప్రారంభం కావాలి అని విచారణ చేస్తున్నట్లయితే సంఘంతో ప్రారంభం కావాలి అవును సంఘం అంటే వ్యక్తుల సమూహం సంఘం అంటే సంఘానికి మూలం ఏంటి అని గనక మళ్ళీ విచారణ చేసినట్లయితే వ్యక్తి మూలం అవుతున్నాడు అవును వ్యక్తి గనక తనను తాను సంస్కరించుకుంటూ తాను ఎవరికీ అపకారం చేయకుండా సమాజం మీద తాను ఆధారపడుతూ సమాజంలో తాను ఒక భాగమై సమాజానికి ఒక ఎసెట్ గా గనక జీవితం గడపగలిగినట్లయితే ఒక నీతి ఒక నియమం రెండు ఏర్పడతాయి అవును అంటే తన ఉనికి చేత తాను చేస్తున్న పనుల చేత తాను నేర్చిన విద్యలను జీవన విధానంగా స్వీకారం చుట్టుకున్నటువంటి వేళ ప్రపంచానికి ఒక వ్యక్తి ఆదర్శప్రాయమైన వ్యక్తి అవుతున్నాడు సంఘానికి ఉన్నటువంటి పరిమితులు, మర్యాదలు, గౌరవాలు వాటిని గమనిస్తూనే తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూనే సంఘాన్ని తానుగా తాను సంఘంగా భావించగలిగితే నిజానికి సంఘ నీతి ఏర్పడుతుంది సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కట్టుబాట్లని విశేషంగా భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ తన జీవితాన్ని గనక గడిపినట్లయితే దాని పేరు సంఘ నీతి. సంఘ నీతికి స్వామి చాలా సపోర్టివ్ గా రెండు మాటలు చెప్పారు ఏంటండీ సంఘ నీతికి చాలా దానికి ఒక ఉదాత్తమైనటువంటి బలాన్ని చేకూరుస్తూ సపోర్టివ్ గా అవును ఏంటి అవి అంటే పద్దెనిమిది పురాణాల సారము రెండు మాటల్లో యుమిట్ చేశారు స్వామి ఏంటండీ అవి అవి ఒకటి అందరికీ నోటికొచ్చినటువంటి మాట Help ever hurt never ఎవరిని ఎప్పుడూ బాధించకు చేయగలిగితే అన్నివేళలా సాయం చేస్తూ ఉండు అని ఉమ్ సంఘ నీతిలో ఇది చాలా కీలకమైనటువంటి ఉపదేశం అండి సహాయం చేస్తూ ఉండాలి తాను సహాయం పొందుతూ ఉండాలి అవును తాను ఎవరికీ హారం చేయకూడదు అలాగే తాను కూడా సమాజం వలన ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదు ఇదే కదా మళ్ళీ కాస్త మూలంలోకి వెళితే పద్దెనిమిది పురాణాలతో పాటుగా ఋగ్వేదం ఏం చెప్పింది అన్ని వైపుల నుంచి నాకు ఉదాత్త భావనలు అన్నివేళలా కలుగు గాక అవును దాని కిందనే ఇంకో మాట కూడా చెప్పింది నా నుంచి ప్రపంచానికి అన్నివేళలా ఉదాత్త భావనలు ప్రసారమవ్వు గాక అంటే నా నుంచి ప్రపంచానికి ప్రపంచం నుంచి నాకు ఇది పరస్పరాధేయంగా ఒక దాని మీద ఒకటి ఆధారపడింది గనుక సంఘ నీతి వ్యక్తి లో నుంచి ప్రారంభమైంది వ్యక్తి సమాజాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక నియమం గనక పెట్టుకున్నట్లయితే నేను ప్రపంచంలో ఉన్నంత కాలం నా వలన ప్రపంచానికి నష్టం కలగకూడదు లాభం కలుగుతుంది కలగ తర్వాత అది ఎప్పుడైతే నష్టం కలగకూడదు అన్నాడో అది మొట్టమొదటి లాభం ఈ-ఈ రకంగా వ్యక్తి వ్యవస్థ కలిసి ఏర్పరచుకున్నదే సంఘ నీతి కాబట్టి సంఘానికి బాబా చాలా ఉత్తమోత్తమ స్థాయిని ఇచ్చారు అంటే నాకు ఇక్కడ ఇంకొంచెం వివరణ కావాలండి ఉమ్ ఎందుచేతనంటే సరే సమాజానికితన వల్ల విధమైనటువంటి అపకారం జరగకూడదు అదేవిధంగా తనకు కూడా సమాజం నుంచి విధమైనటువంటి హాని జరగకూడదు బాగుంది అయితే ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తి చేస్తూ ఉంటాడు ముఖ్యంగా తన విద్యుక్త ధర్మం సరిగ్గా నిర్వర్తించలేకపోతే సమాజానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది అటువంటి సందర్భంలో తన విద్యుక్త ధర్మ నిర్వహణలో సంఘ నీతిని విధంగా పాటించగలగాలి ఇక్కడే ఉన్నది అసలు ప్రబోధమే చాలా దివ్యాత్మకమైన ప్రబోధం సంఘ నీతి అనేది ఒక ఆలోచన ఒక భావన భావనని మనము ప్రపంచంలో ఆచరించాలి ఆచరణ మార్గానికి ఇంకొక స్థాయి కూడా స్వామి చెప్తూ సంఘ నీతిని ఉపాసించేవాడు లేదా ఆచరించేవాడు పాటించేవాడు పాపభీతి కలిగి ఉండాలి అని ఇందాక మీరు అడిగిన దాంట్లోనే ఉంది అసలు అవును ఎప్పుడైతే పాపము చేయకూడదు చేస్తే నాకు ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం అన్నాడో దానిలోనే అసలు సంఘ నీతి విడిపోయి ఉన్నది కాబట్టి రెండు రెండుగా కనిపిస్తున్న నిజానికి ఒక భావమే పాపం అంటే ఏమిటి తన వల్ల ఇంకొకడికి అపకారం జరిగితేనే పాపం అది చూపు చేత భావన చేత సంకల్పం చేత కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి సంఘ నీతి పాపభీతి రెండూ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు పాపం చేస్తే నాకు ఏదో చుట్టుకుంటుంది నాకు నష్టం కలుగుతుంది ఇవ్వాల కాకపోతే రేపైనా అనుభవించవలసి ఉంటుంది అని ఎప్పుడైతే ఒక చిన్న భయం లోపల ఉన్నదో పాపపు కార్యకలాపాలలో మనసుని వాడు ముందు పోని వాడు అవును సంఘానికి భయపడుతూనే దాని పట్ల భక్తి గౌరవం కూడా కలిగి ఉండాలి ఒట్టి భయం మాత్రం మనిషిని నడిపించదు అందువలన పాపభీతి సంఘ నీతిలో ఒక భాగం మాత్రమే రెండింటిని ఇట్లాగే తృణాత్మకంగా మనం విచారణ చేయాలి పాపభీతి అంటే జపాలు తపాలు చేయని వాడు పాపాత్ముడు దానాలు ధర్మాలు చేసినవాడు పుణ్యాత్ముడు అని ఇది ఇక్కడ లేదు మనసు ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని మనకు చెప్తుంది మంచిని గ్రహించుకొని గనుక సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవన విధానం చేయగలిగితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అందరూ ఆచరించగలిగినటువంటి ఒక సంఘ నీతి తనంతట అదే ఏర్పరచుకుంటుంది ఇప్పుడు సమాజంలో కొంతమంది వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తారు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు అయితే వారికి నీతి నియమాలకి కట్టుబడి ఉండటంలో ఒక్కొక్కప్పుడు వాళ్ళు విజయం సాధించలేకపోతుంటారు అటువంటి సమయంలో ఏం చేస్తే నీతి నియమాలని కట్టుబాట్లని ఘర్షణ లేకుండా పాటించడానికి తగినటువంటి ధైర్యాన్ని సంపాదించుకొని తన యొక్క జీవితాన్ని ఆదర్శంగా నిలుపుకోగలుగుతాడు బాగుంది దానికే దైవ ప్రీతి కావాలి అది అది ఇప్పుడు మీరు అడిగిన వీటి ఘర్షణ ఏర్పడుతుంది ఇది ప్రపంచం ప్రపంచంలో తాను ఒక ధర్మాన్ని పాటించాలని అనుకున్నాడు అది ప్రపంచంలో అది ఒక విచిత్రంగాను పనికిరానిది గాను కనిపిస్తున్నది మనసు ఘర్షణకు లోనవుతున్నది అందుకనే దైవ ప్రీతి కావాలి అంటే సంఘ నీతి పాటించాలి మానవతా విలువలను అనుసరించాలి అనేటటువంటి చాలా దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది సంకల్పం ఉండి కూడా సమాజంలో ఉండేటటువంటి ప్రలోభాలకనండి లేదా పరిస్థితులకనండి లోబడి పాటించలేనటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అంటే సర్దుకుపోయేటటువంటి ఏర్పాటు ఉంటుంది అటువంటి సమయంలో నీతి నియమాలను పాటించగలిగినటువంటి గొప్ప ధైర్యం కావాలి అంటే సంస్కారం కావాలి సంస్కారము ఎట్లాగా దైవ ప్రీతిలో నుంచే అది ఏర్పడుతుంది అంటే మనల్ని ఒకడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు మన ఆలోచనా విధానం ప్రారంభం కాగానే మన కార్యకలాపాలు ముగిసే వరకు ఆయన దీన్నంతా చూస్తున్నాడు నా కంటికి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ ఎవడో నా మీద ఒక అజమాయిషీ చేస్తున్నాడు నేను నా వాటినన్నిటినీ గమనిస్తున్నాడనే భావన ఉంటే వాడు భయపడతాడు దాని అది దానికి దైవం అని పేరు పెట్టుకుందాం కాసేపు దైవం మామూలు కళ్ళకు కనిపించేవాడు అయితే కాదు ఎక్కడున్నాడయ్యా నీ లోపలే ఉన్నాడు వాడు చెబుతున్నాడు నువ్వు చేస్తున్న పని తప్పు అది ఎప్పుడు దైవం పట్ల నాకు భయం ఉంటే పాపం పట్ల భయం ఉంటుంది సంఘం పట్ల భయం ఉంటుంది నేను భయాన్ని వదిలిపెట్టాలి దైవం పట్ల నాకు ప్రీతి ఉంటే పుణ్యం పట్ల ప్రీతి పెరుగుతుంది పుణ్యం పట్ల ప్రీతి ఉంటే సంఘం పట్ల ప్రీతి పెరుగుతుంది అంటే నేను భయపడుతూ జీవించే కంటే ఒక భక్తితో ఒక నమ్మకంతో నాకంటే శక్తివంతుడైన వాడు ఒకడున్నాడు వాడు దేవుడు పరమాత్మ రాముడు కావచ్చు సత్య సాయి భగవాన్ కావచ్చు ఎవరు కానివ్వండి ఒక దైవం ఉన్నాడు అనగానే నాకు పరిమితి ఏర్పడుతున్నది నా ఆలోచన కట్టు దాటి పోయే ప్రసక్తి లేదు కాబట్టి దైవ ప్రీతి సంఘ ప్రీతి పుణ్య ప్రీతి మూడు కూడా చాలా positive elements మూడు మనం ఇక్కడి నుంచే ప్రారంభం చేయాలనేది స్పష్టమైనటువంటి భావన అంటే ఇంకొక విషయం ఇందులో ఉందండి అంటే సంఘ నీతి అంటే కేవలం తన విద్యుక్త ధర్మమే కాకుండా సమాజంలో అనేకమైనటువంటి వర్గాలతో మనకి సంబంధం ఏర్పడుతుంది సంబంధంలో సమాజంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి రుగ్మతల్ని మన విద్యుక్త ధర్మంతో సంబంధం లేకుండా వాటిని తొలగించగలిగినటువంటి ఒక సంకల్పం మనకు ఉండి వాటి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తే సంఘం మరింత సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది ఖచ్చితంగా కదా అంచేత ఇలాంటి బాధ్యతలు తన విద్యుక్త ధర్మమే కాకుండా దీన్ని మించికొన్ని మంచి పనులు చేయాల్సి వస్తుంది అవును అవును అంటే దురాచారాలు ఉంటాయి అనేకమైన దురాచారం ఉంటాయి సంఘంలో ఉమ్ వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉమ్ అలాగే కాకుండా సత్పురుషులు ఉంటారు ఉమ్ వారిని సేవించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఉమ్ ఉమ్ అదే కాకుండా ఎవరితో దీనజనులు ఉంటారు వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది అవును దానికి తన విద్యుక్త ధర్మంతో ఏమి సంబంధం లేదు సంబంధం లేదు అవును అవును విద్యుక్త ధర్మం ఒక పార్టే ఉమ్ సంఘ నీతిలో విద్యుక్త ధర్మం ఒక భాగం మాత్రమే ఉమ్ కానీ దీన్ని మించి అనేకమైనటువంటి రీతులలో సమాజానికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అవును సమాజ సుఖ సంతోషాలకు అనేక విధాలుగా మనం పాలుపంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అవును అవును వీటి పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి ఉమ్ దీనికి స్వామి చాలా అందంగా ఒక మాట చెప్పారండి గొప్ప పరిష్కారం చెప్పండి ఒక లైన్లో చెప్పారు ఉమ్ ఏంటంటే "ప్రపంచానికి నువ్వు పాజిటివ్ గా contribute చేయగలిగినా చేయలేకపోయినా నెగిటివ్ గా మాత్రం contribute చేయవద్దు" ఉమ్ ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ఉమ్ statement ఇది స్వామి అయితే నెగిటివ్ గా చేయ్ చేసేవాడు ఇక్కడ చోటు లేదు వాడి గురించి విచారణ లేదు ఉమ్ పాజిటివ్ గా చేసేవాడు ఎట్లా చేయాలి అని ఇదిగో ఇందాక మీరన్నట్లు సమాజంలో జరిగేటువంటి అనేక అనేక అనాచారాలు దుష్టాచారాలు తర్వాత రాతియుగం నాటి భావాలు వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఒక అద్భుతమైన మానవ సంబంధాలు గనుక మెరుగుపరుచుకుంటూ జీవించగలిగినట్లయితే తాను కూడా ప్రపంచాన్ని వెలిగించగలడు తన స్థాయిలో ఉమ్ ఇది చాలా అవసరం ఉమ్ అలాగే మహాత్ములంతా ఉన్నారు మీరన్నట్లు మహాత్ముల పాత్ర సంస్కర్తల పాత్ర ఏమిటంటే చాలా broad గా ఉంటుంది చాలా విశాలం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సంస్కరణ ప్రారంభించరు అవును సమస్త ప్రపంచము తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఆదర్శవంతమైన నీతివంతమైన పవిత్రవంతమైన అటువంటిదిగా ఉండాలి అనాచారాలు పోవాలి దానికి ఏమి చేయాలి అంటే వ్యక్తిగా సంస్కరణలు ప్రారంభం కావాలి వ్యక్తి సమాజం భిన్నం కావు కాబట్టి వ్యక్తి సంస్కరణ చాలా ప్రధానం అవును సంస్కరింప నేల సంఘమంతటి నీవు సజ్జనుండవగు స్వార్థముడివి అవును ఒక్క నీచుడప్పుడు ఉర్విలో తగ్గును అట్లా ఎవరికి వాళ్లే అనుకున్నారు అనుకోండి సహజంగా పరిణామం సంభవిస్తుంది అందుకనే సత్యసాయి భగవానుడు ప్రారంభించినటువంటి సేవా organization లో సంఘం చాలా ఉదాత్తమైన పాత్ర ఉంది దానికి తన భక్తులైన వారిని భక్తులు కాని వారిని స్వామి అంటే ఇంకా తెలియని వారిని అమితంగా ఆకర్షించినటువంటిది సేవా యోగం సేవ ఎక్కడ చేస్తాం ఒక జడమైన దానికి చేయలేం అవును ఏది చైతన్యంగా ఉన్నదో ఏది ప్రాణం పోసుకున్నదో దేనికి అవసరాలు ఉన్నాయో దేనికి ఆకలి ఉన్నదో వీటన్నింటినీ గమనించమన్నారు దానిలో మీరు చెప్పిన దీనజనోద్ధరణ ఉంది దీనజనులు ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథలు ఉన్నారు మరి వీళ్ళందరికీ అన్నం ఎవరు పెట్టాలి సంస్కరింపబడినటువంటి వ్యక్తి అహంకారం లేకుండా సేవ చేస్తాడు సంస్కారానికి లోను కాని వ్యక్తి దయా జాలి అనేటువంటి రెండు భావాలతో చేస్తాడు ఇక మూడవవాడు అసలు రకమైనటువంటి పరిచయం భావమే పరిచయం లేని వాడు డబ్బు వెదజల్లుతాడు స్వామి అన్నారు సేవలో సంఘ నీతిలో vanity కి చోటు లేదు బంగారు charity కే చోటున్నది charity versus vanity అవును ప్రపంచంలో అనేకం జరుగుతుంటాయి charity గా చేయాలి charity అంటే పరమాత్మ నాకు ఇచ్చిన దాంట్లో నేను మళ్ళీ సంఘానికి ఇవ్వగలుగుతున్నా ఎందుకంటే నేను అంతా సంఘం నుంచే పోగుచేసుకున్నా కాబట్టి సంఘాన్ని తన దర్పణంగా ఒక మంచి అద్దంగా తన ప్రతిబింబంగా ఒక ప్రతిధ్వనిగా భావించుకోగలిగినట్లయితే సంఘ నీతి అనేటువంటిది వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ స్థాయి వరకు ఇది పరిణామం జరుగుతూ ఉండాలి ఇది ఏదో కొంత చేసి ఆగేది కాదు it's a continuous process అవునండి వ్యక్తిగత పరిణామం చాలా ముఖ్యం అవసరం ప్రపంచంలో మనం పుట్టినప్పుడు మన వ్యక్తిత్వపు ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రని సంఘంపై వేయలేకపోతే ఉమ్ మానవుడిగా పుట్టి లాభం ఏమిటి అంటాడు వివేకానందుడు అవును అవును అందుచేత వ్యక్తిలో పరిణామం రావాలి అవును వ్యక్తి పరిణామం వస్తే సంఘ నీతిని బాగా పాటించగలుగుతాడు అవును అయితే ఉమ్ వ్యక్తిలో పరిణామానికి ఉమ్ ఎటువంటి సాధన అవసరం సాధన చేస్తే ఉమ్ తనకి తాను అనుకున్నటువంటి నీతిని చక్కగా పాటించగలుగుతాడు విధంగా త్యాగమయుడుగా కాగలుగుతాడు నా కర్మణా ప్రజయా ధనేన ౠౠౙౘ౩ౙ అమృతత్వమానశుః ఇది వేద ప్రామాణికమైన మాట అవును సత్యసాయి భగవానుడు కూడా అదే చెప్పారు ఉమ్ దేనిని త్యాగం చేయాలి మీకున్న భౌతిక సంపదలు ప్రపంచానికి అక్కర్నే లేదన్నారు ఒకటే మాట ఏం త్యాగం చేయాలి అహంకార మమకారాలు త్యాగం చేయాలి అదే ఆభిజాత్యం పోగొట్టుకోవాలి అవును ప్రగల్భం పోగొట్టుకోవాలి నేను తప్ప మరొకడు ఉండటానికి వీలు లేదనేటువంటి అసహజమైన భావన వదిలిపెట్టాలి అవును నేను అందరితో అందరూ నాతో ఇది సహనాభవతు సహనౌభునక్తు ఉమ్ స్వామి ఇదే చెప్తూ వచ్చారు అందరూ కలిసి ఉండండి అందరి కోసం నువ్వు నీ కోసం అందరూ ఉమ్ అప్పుడే అందరూ కలిసి ఒక చోట ఉండగలుగుతారు అంటే ప్రశ్న మిమ్మల్ని ఎందుకు వేశానంటే చాలామంది సమాజానికి మేలు చేశామంటే ఏదో కాస్త విరాళం ఇచ్చినా ఉమ్ దానం చేసినా ఉమ్ మంచి పని చేసినా చాలు ఇంతకంటే నేనేం చేయాలి సమాజానికి మాత్రం చేశాను కదా ఉమ్ ఇది చాలా మంచి పనే చేశాను ఉమ్ నా యొక్క ధర్మం ఇంతటితో అయిపోయింది అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది ఉమ్ అది కాకుండా అది కాదు దీన్ని దాటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని మరి కొంచెం వివరించండి ఏం లేదు కర్మణా మీరు చెప్పిన దానాలు చందాలుఏదో మందిరాలు కట్టటాలు ఇంకేదో చేయటాలు ప్రతి ఏడాది ఒక చలువ పందిళ్ళు వేయటం మంచిదే కానీ దానివలన అమృతసిద్ధి మాత్రం పొందదు. ఎందుకని చిరస్మరణీయమైన ఒక పాత్ర ఒక ముద్ర కాలమనే ఇసుక ఎడారి మీద పడాలి అంటే నువ్వు చేసిన కర్మలన్నీ కూడా అక్కడి దాకా తీసుకు వెళ్ళవు. నీ మనస్సుని ప్రశాంత స్థితికి కొంత వరకు తీసుకెళ్లగలవు భావనను బట్టి అహంకారంతో చేస్తే అది కూడా ప్రయోజనం లేదు బలి చక్రవర్తి లాగా. విషయం వేరు. అలాగే నా ప్రజయా మనకో లక్ష మంది పరిచయం అయినారు ప్రపంచం అందరికీ మనం very popular అనుకుంటాడు ఒకడు ఏం లేదు అక్కడ. అవును వాళ్ళ వల్ల నీకు అమృతత్వం రాదు. అలాగే నా ధనయా నీ దగ్గర ఉన్న విపరీత భౌతిక సంపద వలన నీకు అమృతత్వం రాదు. ఇవి మూడు చాలా ప్రధానమైనవి. మానవుడిని అజ్ఞాన భూమికలోకి నెట్టేవి ఏంటంటే నేను చాలా పుణ్య కార్యాలు చేశానని ఒక మత్తెక్కిన వాడు ఒకడు. కొన్ని లక్షల మందికి నేను ఎవడో తెలుసు నా పేరు అందరి నోటా నానుతుంటుంది అనేవాడు రెండో వడు. తర్వాత నాకు మితిమీరిన సంపదలు ఉన్నాయి పది తరాల వరకు కాబట్టి నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు అని ఎవ్వరూ గుర్తు పెట్టుకోరు. త్యాగేనైక త్యాగము చేత మాత్రమే పరిత్యాగం ఏమిటంటే స్వామి మహా పరిత్యాగి. స్వామిని మించిన example ఇవ్వలే మూడు శబ్దాలకి. మీరు ఇందాక చెప్పిన దానిలో త్యాగం అంటే ధనం మాత్రమే కాదు. కాదు ధనాన్ని మించినటువంటి త్యాగాంశాలు అనేకం ఉన్నాయి. త్యాగం చేయాలి అహంకారాన్ని త్యాగం చేయాలి. మమకారం త్యాగం చేయాలి. అవును నాది నేను మాత్రమే అన్నటువంటి దంభం పోవాలి. మదం పోవాలి. పోతే దమం ఏర్పడుతుంది. అవును కాబట్టి మూడు ఎవరైతే దగ్గర అన్నివేళలా గుర్తుపెట్టుకొని ఉంటారో తమ భావనల యందు నిలుపుకొని ఉంటారో వాడు అమృత పుత్రుడు అవుతాడు. అమృతతుల్యుడు అవుతాడు. వాడికి మరణం లేదు శరీరం ఉంటుంది పోతుంది అది వేరే సంగతి. అయితే ఇప్పుడు వీటిని పాటించడానికి తగినటువంటి సాధన అంటే అహంకార నిర్మూలన కావాలి. తర్వాత మమకారాన్ని త్యాగం చేయాలి. కానీ ఇంత సులభమైనటువంటి విషయాలు కావు ఇవి. త్యాగం చేయగలమా? సామాన్యుడు మానవ జీవితంలో సామాన్య సంసారి అనేటటువంటి వాడు ప్రపంచంలో సాధారణమైనటువంటి ఉద్యోగమో వ్యాపారమో చేసినటువంటి వ్యక్తికి అహంకార మమకారాలు త్యాగం చేయటం అంత సులువైనటువంటి పనా? దీనికి కావలసింది ఏమిటి? సులువైన పనేనా మనం చేయగలమా అనుకుంటే అసలు సాధన ప్రారంభం కాదు. ఏం? ఎక్కడో సంకల్పం కలగాలి. అందుకనే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఎవడో ఒకడు ఉంటాడు మనకు ఒక role model. ఉమ్ త్యాగం చేయొచ్చు. నిజానికి మీ ప్రశ్నలోనే ఒక అందమైన జవాబు ఉంది. చేయగలిగితే సంసారే త్యాగం చేయగలడు. సన్యాసికి త్యాగం చేయడానికి ఏముంది? ఇన్ని ఉండి ఇన్నెంటి మధ్య ఉండి ఇవి ఏవీ నావి కాదన్న భావనలో ఉండగలిగితే, ఇవాళ నా కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు వాళ్లతో పాటు నా దగ్గర పనిచేస్తున్న వాడి కొడుకు, కూతురు నా పిల్లలే అనుకోగలిగితే ఎంత గొప్ప విషయం. మమకార రాహిత్యం అంటే మమకారం వద్దని కాదు మమకారము మీ వారి యందు మాత్రమే ఉంచద్దు అని. అంతేగాని మమకారమే లేకపోయినట్లయితే అసలు మానవుడి ఉనికికే వ్యక్తిత్వ అస్తిత్వం లేదు. అవును మమకారం ఉండాలి ఎట్లా ఉండాలి అంటే నా పిల్లలను దాటి కూడా భగవాన్ స్వామి ఉన్నారు మనందరి మీద ఆయనకి ఎందుకు ఇంత అపేక్ష ఎందుకు ఇంత ప్రేమ అది మమకార రాహిత్యం అంటున్నాను నేను. ప్రత్యేకించి ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే ఆగింది కాదది. సర్వ ప్రపంచం మీద సర్వ సృష్టి మీద ఉన్నది. అట్లా ఒక భగవంతుడు ఒక role model గా మన కళ్ళ ముందు ఉండి ఇలా చేయవచ్చును అని నిరూపించిన తర్వాత మనం చేయలేకపోతే లోపం మనదే. నాకు ఒక పిల్లో ఒక పిల్లవాడో ఉంటే అసలు సమస్త ప్రపంచంలో ఉన్న పిల్లలందరి యందు నేను అదే రకమైనటువంటి ప్రేమను నేను ఎందుకు చూపించలేకపోతున్నాను మమకారం వదులుకోలేనందువల్ల నా వ్యామోహం వలన పుత్ర వ్యామోహం వలన అవును అది దాటాలి. అలాగే అహంకారం నేను మాత్రమే కాదు నాకంటే గురువులు నాకంటే ముందు వచ్చినవారు కొన్ని కోటానుకోట్లు లక్షలాది ప్రజలు ఇక్కడ పుట్టారు వాళ్ళందరూ ఎవరి ప్రజ్ఞలు ఎక్కడున్నాయో తెలియదు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రజ్ఞని రకమైనటువంటి అహంకారం లేకుండా రకమైన ఆశ లేకుండా చేయాలి. ఇవన్నీ utopian గా idealistic గా అనిపిస్తాయి. ఏవండీ! స్వామి అన్నారు ఆశలతో బతికే కంటే ఆశయాలతో బతకడమే ఉత్తమ జీవితం. ఆశయం ప్రధానం. ఆశయంతో ప్రారంభిస్తే ఆశలు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. అదొక natural phenomenon. సహజ పరిణామంలో జరుగుతాయి. కాబట్టి సంస్కారం అనేటువంటిది ఇదంతా కూడా వ్యక్తి సాధనలో చాలా ప్రధానం. అహంకార మమకారాలు సంసారి వదిలిపెట్టగలడు, పెట్టాలి. పెట్టకపోతే ఊరికే కాసేపు మాట్లాడుకున్నట్టు అవుతుంది తప్ప ఆచరణాత్మకంగా నీ శాస్త్రానికి విలువ లేదు.
SSSMC · audio

Interview - 01

Home

Interview - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 23:12

More in this series

Interview with VSR Murthy

2 episodes · 49 min

  1. 23 min 1

    Interview - 01

    Now playing
  2. 26 min 2

    Interview - 02