No transcript for this section.
ఆచరణాత్మకంగా మ్ ఇప్పుడు మనం అనుకోవాలంటే మ్ నిత్య జీవితంలో మ్ మనం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మ్ అంటే దైవం పట్ల ప్రీతి కలిగి ఉండటం మ్ అవతార పురుషుల బోధనల పట్ల అవగాహన కలిగి ఉండటం మ్ వాటిని అర్థం చేసుకుని ఆచరించగలగటం మ్ ఇది చేయాలి మనం చేయాలి అట్లాంటి మనం సాధన చేయటానికి మనం విన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఆచరించగలిగినటువంటి స్థాయికి మ్ మనని మ్ ఇటువంటి సాధన నిత్య జీవితంలో ఇటువంటి సాధన తీసుకెళ్లగలుగుతుంది. ఎందుచేతనంటే మనం చాలామందిలో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్లలో వచ్చినటువంటి ఒక లోపం ఏమిటంటే మనం దైవ ప్రీతి కలిగి ఉంటాం పూజలు చేస్తాం అర్చనలు చేస్తాం నామ సంకీర్తనలు చేస్తాం ఇన్ని చేసినప్పటికీ కూడా మ్ మనం ఒక్కొక్కప్పుడు మనం సంఘ నీతిని పాటించటంలో మనం అపజయం పొందుతుంటాం మ్ విజయం సాధించలేం మ్ మనం అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నట్టుగా మనం ఆచరించలేం మ్ అయితే ఈ ధైర్యాన్ని ఈ స్థైర్యాన్ని ఎటువంటి సాధన నిత్య జీవితంలో అవును ఎటువంటి సాధన ఇవ్వగలుగుతుంది మనకి దీనికి ఒక్కటే మళ్లీ స్వామి మాటలే God fearing వదిలిపెట్టమన్నారు స్వామి God loving నేర్చుకోండి అది మనం దైవానికి భయపడటం ఏమిటి దైవాన్ని ప్రేమించగలగాలి అటువంటి హృదయాన్ని మనం సాధన ద్వారా తెచ్చుకోవాలి. ఆ సాధన ఎలా చేయాలి అంటే దీన్లో మూడు విషయాలున్నాయి ఒకటి దైవమనేటువంటి ఒక పరవస్తువు ఉన్నదని ఆ పరవస్తువే ఈ ప్రపంచానికి కర్త అని మన జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకి ఆయన సాక్షిభూతుడని మనం చేసినటువంటి కర్మలకు ఆయన బాధ్యుడు కాడని నాకు దైవం ఆ చల్లగా చూడలేదని ఒకడు చూశాడు అని ఒకడు ఆయన చూడంది లేదు చూస్తున్నది లేదు సాక్షిభూతుడు అనేటువంటి ఒక భావనలో ఉండగలగటం ఒక స్థాయిలో ఒక స్థాయిలో నేను మంచి పనులు చేస్తే పరమాత్మ అనుగ్రహం నాకు ఎప్పుడూ లభిస్తుంది నేను ఇంకా మంచి పనులు చేయగలుగుతాను నిత్య జీవితానికి సంబంధించి అదే కాబట్టి దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం దైవం పట్ల అనురాగం దైవం పట్ల ఆ అత్యంత ప్రీతి. ప్రపంచంలో నీకు ఏది ఇష్టం అంటే నాకు భగవంతుడు అంటే ఇష్టం అని చెప్పగలగాలి అదే మమకార రాహిత్యం భగవంతుడు అంటే ప్రత్యేకంగా రాముడా కృష్ణుడా సాయా ఎవరంటే అసలు ఉన్న చైతన్యం అంతా ప్రపంచం ప్రపంచంలో ఉన్న చైతన్యం అంతా పరమాత్మే గనుక నాకు దేనియందు ప్రత్యేకమైన అపేక్ష లేదు ఉపేక్ష లేదు సమభావంతో నేను ఉండగలుగుతున్నాను సాధనలు ఇవన్నీ మార్గాలు వీటిని ఆచరించాలి ఇవి తెలుసుకుంటున్నది ఎందుకు ఇందాక మీరన్నట్లు ఒక గురువు యొక్క వాక్యాన్ని విని ఇంటికొస్తే ప్రయోజనం లేదు వినాలి ఆచరణకి ప్రయత్నం చేయాలి అనేక అవరా-- అవరోధాలు మన మనస్సే మనకు అడ్డుపడుతుంది ఇవన్నీ కావులే అనిపిస్తుంది ఒడ్డాలి పోరాడాలి నిలబడాలి గెలవాలి అనుభవాన్ని పొందాలి దానిలో నుంచి దివ్యానుభూతిని పొందాలి ఇది ఒక క్రమ సాధన ఇది అంటే నేను ఎందుకు అడిగానంటే మ్ సాధారణంగా సామాన్య జీవితాన్ని గడుపుతున్నటువంటి మానవుల్లో ఒక అపోహ ఉన్నది మ్ ఏమిటంటే మనం రోజు అష్టోత్తర శతనామ పూజలు చేస్తున్నాం మ్ నగర సంకీర్తనలు చేస్తున్నాం నామ సంకీర్తనలు చేస్తున్నాం ఇది ఈ ఆధ్యాత్మిక సాధన ఇది ఇంతకంటే మించి ఏం సాధన చేయాలి ఆ అనేటటువంటి ఒక పరిస్థితిలో అక్కడ ఆగిపోతున్నాం మనం ఆ అక్కడ ఆగిపోతున్నాం మ్ అది ఆగకుండా ఇప్పుడు ఈ నామ సంకీర్తన ఎందుకు చేస్తున్నాం మ్ నగర సంకీర్తన ఎందుకు చేస్తున్నాం దైవాన్ని పూజ ఎందుకు అర్చన ఎందుకు చేస్తున్నాం మ్ అనేటటువంటి వీటిలో వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని మ్ ఎటువంటి ధైర్యాన్ని ఈ సాధనలు మనలో కలిగించగలుగుతాయి అనేటటువంటి అవగాహన ఒక్కటే కొంచెం లోపిస్తుంది అవును చేస్తారు పాపం చేస్తారు అన్ని సాధనలు చేస్తారు మ్ సాధన చేసిన తర్వాత కూడా మ్ ఆ సాధనలన్నీ కూడా పూజ గదికే పరిమితమైపోయేటటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఆ కానీ ఎక్కువ దీన్ని మనం స్వామి యొక్క అనుగ్రహంతో చాలామంది ముఖ్యంగా సత్యసాయి భక్తులు మ్ దైనందిన జీవితంలోకి కూడా తీసుకెళ్లి-తీసుకెళ్లగలుగుతున్నారు అవును అవును దాన్ని ఆ వాటి యొక్క పరమార్థాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు ఆచరించగలుగుతున్నారు ఇవన్నీ బాగున్నాయి అయితే ఇంకా ఓ మహా-మహనీయుల యొక్క బోధనలకి ప్రభావితం కానటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు మ్ అట్లాంటి వాళ్ళు కూడా గ్రహించగలగాలి అవును అవును దీనిని ఇది గ్రహించగలగాలి అంటే ఈ వీడియో యొక్క అంతరార్థం కొంచెం ఇట్లాంటి ఆధ్యాత్మిక సాధనల వల్ల మ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ధైర్యం కలుగుతుంది ఆ ఎట్లా కలుగుతుంది అనేది కొంచెం అవును మరికొంచెం వివరించండి దీంట్లో ఇందాక చెప్పిన ఈ పూజ ఆరాధన అర్చన అభిషేకం రోజు చేసుకునే నిత్యనైమిత్తికం day to day life లో చేసేవన్నీ కూడా అవి rituals ఏ అది అది ఆధ్యాత్మికం అది ఎందుకు అడుగుతున్నానంటేనండి అవును ఇది చాలా మంది మనం ఈ చేసేటువంటి సాధనలు యాంత్రికంగా చేస్తాం యాంత్రికంగా ఇవి యాంత్రికం కాకూడదు కాకూడదు యాంత్రికం కాకూడదు అంటే ఏం చేయాలి ఎటువంటి సాధన చేయాలి ఒకటి వాటి పరిమితి తెలియాలి ముందు పూజకి పరిమితి ఏమిటి? ఈ విగ్రహం ఆ విగ్రహానికి అలంకారం చేసింది నయనానందంగా ఉన్నది అంతే అవును అభిషేకం చేసుకున్నది కాసేపు మనస్సు స్థిమిత పడింది ఒక పరమాత్మ భావనతో ఉన్నటువంటి శివలింగానికి నేను ఇవ్వాళ అభిషేకం చేసుకున్నా మనస్సు హాయిగా ఉంది కానీ ఏదో కోరి గనుక ఇవన్నీ గనుక చేసినట్లయితే కోరిక సిద్ధించే దాకా యాతన ఇది. అందుకనే ritual నుంచి spiritual కి ఎదగాలి మనిషి.ఇదంతా అధ్యాత్మలో ఒక పూర్వరంగం మాత్రమే అవును అసలు ఉత్తర రంగం ఏమిటి? అసలు రంగం ఏమిటంటే వీటన్నింటినీ దాటి ఈ ప్రకృతి అంతా పరమాత్మే అనే భావనలో ఉండాలి. అయితే వచ్చిన చిక్కల్లా సమస్య ఏంటంటే spiritual స్థాయిలో విచారణ చేయగలిగిన వారి శాతం తక్కువ. ఓ రోజు దేవుడు ఆయనకు ఓ దండ వేసుకోవటం అగరుబత్తి వెలిగించటం ఆయనకు మీరన్నట్లు అష్టోత్తర శతనామం చదువుకోవటం దీనివల్ల నాకేదో హాయిగా ఉందనుకోవటం దాటాలి. దాటకపోయినట్లయితే నువ్వేం చేశావు భగవంతుని గుణనామ సంకీర్తనం చేశావు దానివలన నీ మనసు కాసేపు ఆనంద పారవశ్యాన్ని పొందింది అంతే. ఆ పొందినటువంటి ఆనందంతో నువ్వు మిగతా time జీవితాన్ని ఎలా గడపబోతున్నావ్ అన్నదే ప్రశ్న. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు జాగ్రదవస్థ ఏడు గంటలు, ఏడున్నర గంటలు సుమారుగా నిద్రావస్థ ఒక్క అరగంట సుషుప్తి అరగంట కూడా ఉండదు అది ఉరికే academic గా. ఈ పదహారు గంటల సుదీర్ఘమైనటువంటి జాగ్రదవస్థలో పూజ కోసం మనం ఆ-ఖర్చు పెడుతున్న సమయం అరగంట అని అనుకున్నట్లయితే ఈ అరగంటలో మనం పొందినటువంటి ఆనందం ఈ మానసికమైనటువంటి ఒక శక్తి మిగతా పదిహేనున్నర గంటలు నడపాలి. అంత దానికి దారి తీయాలి. ఎట్లా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దాంట్లోనే ఉన్నదని, ఇవాళ ఏం జరుగుతుందో అది పరమేశ్వరుడి లీలా అని, పరమేశ్వరుడే దీనికి సమాధానం చెబుతాడని అనేక రకాలుగా మానసికంగా గనుక అనుకోగలిగినట్లయితే నెమ్మదిగా ఈ పూజ స్థాయి నుంచి బయటపడతాడు. బయటపడమని కాదు. రెండోది, పూజ చేస్తే ముక్తి వస్తుందని ఎవరూ పూజ చేయరు. పూజ చేస్తే కోరిక తీరుతుంది అని చేస్తాడు. ఈ కోరికలు సముద్రం అలలు. సముద్రం ఉన్నంత కాలం అల పుట్టక తప్పదు. మానవుడి జీవితంలో ఉన్నంతకాలం కోరిక నశించటం అసంభవం, అసహజం. ఎందుకంటే కోరిక పుట్టాలి తీర్చేవాడెవడు? ప్రపంచం తీర్చదు. తీర్చగలిగిన అంత శక్తిమంతుడు ఒక పరమాత్మ ఉన్నాడని ముందే అనుకున్నాం కనుక రోజూ ఆయనకు విన్నపం చేస్తున్నాం. ఆయనా పాపం తీరుస్తూనే ఉన్నాడు. ఆయనా తీరుస్తున్నాడు మనము పొందుతూ ఉన్నాం ఇది ఎడతెగని జీవన ప్రవాహం అయిపోయింది. అందుకనే ఈ rituals కి దాటి దీనిని మించి ఇంకేదైనా ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తే ముందు కోరికలు గనుక ఆగిపోయినట్లయితే పూజలు అర్థం ఎరిగి చేస్తాం. పూజ అంటే ఈ శరీరాన్ని, ఈ కాలాన్ని, ఈ జీవితాన్ని, బతకటానికి ఇచ్చిన ఈ ఒక్కరోజుని అత్యంత పవిత్రంగా, హాయిగా, ఎవరికీ ఇబ్బంది లేని విధంగా కో-- సాగించేట్టుగా అనుగ్రహించమని అడగటమే పూజ. అంతేతప్ప నీకీ పూజ చేస్తున్నాను నాకు ఇవ్వాళ ఈ లాభం నేను ఈ సమస్యలో ఉన్నాను తీర్చు అన్నట్లయితే అది పూజ కానే కాదు. పూజకి అర్థం అది కాదు. అంటే ఉమ్ సాధారణంగా ఏమవుతుందంటే ఉమ్ మీరన్నట్టు ఉమ్ కోరికలతో పూజ చేస్తాం ఉమ్ చేస్తాం ఒకప్పుడు ఈ కష్టాలు గట్టెక్కాలని చేస్తాం చేస్తాం ఆ కష్టాలు గట్టెక్కిపోయినటువంటి సందర్భాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి ఎదురవుతాయి అట్లాంటి సందర్భంలో కాస్త నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి అవును మనిషిని అవును ఆవరించి తాను అనుకున్నటువంటి అవును ఈ సాధన తాలూకు ఫలితాన్ని పొందలేదు కాబట్టి నిరాశ నిస్పృహల్లో పడి తను ఆచరించదలుచుకున్నవేమీ ఆచరించలేకపోతున్నాడు అవును ఈ నిరాశ నిస్పృహల నుంచి ఎలా బయటపడాలి? ఈ నిరాశ దీనికి కారణం ఒకటే. ఏది ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని ఆశించి కార్యకలాపాల్లో మనం ఉంటామో అది జరగనప్పుడు నిరా-- ఆశ ఉంది గనుకే నిరాశ. అసలు ఆశే లేకపోతే నిరాశకి తావే లేదు అవును కానీ ఆశ లేకుండా మనిషి జీవితం లేదు. ఆశ ఉంది రేపు ఉంటాము అన్నాం గనుకే ఇవాళ ఉన్నాం. నువ్వు రేపు-- రేపటి నుంచి నువ్వు ఉండవు అని ఎవడన్నా అన్నాడనుకోండి అది జరగదు. కాబట్టి ఈ నిరాశ కలగకుండా ఉండటానికి ఒకే ఒక మంత్రం దేనిని ఆశించకుండా పరమాత్మకు కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేయండి. అదే నేను ఇందాక అన్నది. ఈ శరీరం ఇచ్చినందుకు, జన్మ ఇచ్చినందుకు, బతకటానికి ఓ రోజు ఇచ్చినందుకు అయ్యా! నీకు నమస్కారం. ఇగో ఈ రోజంతా నిన్నట్లాగానే హాయిగా గడిచేట్టుగా చూడు. నా వల్ల ఎవరికీ అపకారం జరగకుండా చూడు. అది ప్రధానం. నాకు ఉపకారం జరిగేట్టుగా చేయు అంటే అది అర్థవంతమైన పూజ మాత్రం కాదు ఏ స్థాయి వాడికైనా. ఇది గ్రహించగలగాలి గ్రహించగలగాలి ముఖ్యంగా ఉమ్ మీరన్నది ఇటువంటి అవగాహన ఉన్నట్టయితే ఉమ్ సాధారణంగా ఉమ్ పూజలు పరమార్థాన్ని గ్రహించి చేయగలుగుతాడు అంతే ఎందుచేతనంటే ఉమ్ ఈ పూజలు ఇతర సాధనలన్నీ కూడా మనం కోరికలు ఆశించే చాలామంది చేస్తున్నాము ఉమ్ చేసి-- దాని వల్ల నిరాశ పొందుతున్నాం ఉమ్ అది ఒకవేళ తీరకపోతే ఉమ్ లేకపోతే మనం అనుకున్నది జరగకపోతే జరగకపోతే ఈ నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి మనకి. కాబట్టి కోరికలు లేకుండా చేసినట్టయితే ఉమ్ ఇది తప్పకుండా మనకి ధైర్య స్థైర్యాలు తప్పకుండా కలుగుతాయి. మన సా-- అంటే మనం చేసేటటువంటి సాధన తాలూకు నిజమైన పరమార్థాన్ని ఎరిగి చేయాలి ఉమ్ ఏది ఆశించకుండా చేస్తే ఉమ్ ఆ Where there is no de-desire there is no disappointment అంతే కదా అంచేత ఉమ్ ఆ disappointment అనేది మనకు ఉండదు. ఎప్పుడైతే disappointment ఉండదో ఉమ్ అప్పుడు మనం ధైర్యంగా ఇవన్నీ ఆచరించగలుగుతాం అవును తర్వాత ఇంకొక విషయం అండి ఉమ్ మనం ఆచరించగలగాలి ఏదన్నా ఉమ్ మనస్ఫూర్తిగా ఆచరించగలగాలి ఉమ్ ధైర్యంగా ఆచరించగలగాలి. దేనికి భయపడకుండా ఆచరించగలగాలి అంటే ఉమ్ నిరంతరము భగవంతుడు నా చేయి పట్టి నడిపిస్తున్నాడు అనేటటువంటి భావనలో ఉండగలగాలి ఉమ్ అట్లాంటి భావన కలిగినప్పుడు భగవంతుడు నా, నా వెంటనే ఉన్నాడు, నా జంటనే ఉన్నాడు ఉమ్ నన్ను నడిపిస్తున్నాడు, నాకు ఏ విధమైనటువంటిఅపజయం లా ఉండదు అని అనేటువంటి ఒక విశ్వాసం అంటే స్వామి ఒకమారు చెప్పినటువంటి విశేషం ఏంటంటే నీవు రోజూ కూడా సర్వజ్ఞాయ నమః అని పూజ చేస్తూ ఉంటావు పూజ చేసి స్వామి నీవు సర్వజ్ఞుడివి అన్ని ఎరిగిన వాడివి కానీ నా కోరికలు మాత్రం నీకు తెలియవు అన్నట్టుగా మనం కోరుతూ ఉంటాం స్వామి చెప్పినటువంటిది ఏంటంటే అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను అడగని వాడికి అన్ని ఇస్తాను అన్నారు స్వామి అసలు అన్ని ఉన్నవాడు అడిగే అవసరమే లేదు అన్నారు మూడో మాట అది అది అంచేత స్వా ఇంకొక విషయం ఏంటంటే స్వామి నాకు మీరు ఏమిచ్చారు అని అడిగినప్పుడు స్వామి చెప్పారు దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇచ్చాను నీకు జన్మ ఇచ్చాను నీకు ప్రేమించేటువంటి తల్లిదండ్రులను ఇచ్చాను నీకు ఆ విజ్ఞానాన్ని అందించడానికి గురువుని ఇచ్చాను నీతో ఆడుకుందుకు స్నేహితులను ఇచ్చాను నీకు జీ నీ జీవితాన్ని ఆనందమయంగా గడపడానికి జీవిత భాగస్వామిని ఇచ్చాను ఇన్ని ఇచ్చిన ఇంకా సంతృప్తి లేకుండా ఇంకా ఏమి ఇచ్చేయాలని అడుగుతున్నావు అని స్వామి చెప్పారు అంటే ఈ మనకు ఉన్నటువంటి స్థిర సంపదలు కానివ్వండి మనకు ఉన్నటువంటి యోగ్యతలు కానివ్వండి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పం వల్ల వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మాత్రమే కలిగాయి కలిగాయి అని అనుకుంటే మనకి ఇటువంటి భావన కలుగుతుంది ఏమోనని నేను అనుకుంటాను మీరు చెప్పండి కొంచెం అంతే కాదు అది ఒక ఎత్తైతే వేదవ్యాసులవారు భాగవతంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు ఇది అందరూ ఆ గుస్తు పెట్టుకోదగిన మాట ఎవరు నా నిజ భక్తుడని నేను అనుకుంటానో నేను చేయబోయే మొట్ట మొదటి పని వాడి సుఖ సంపదలన్నీ మొత్తాన్ని తీసేసుకుంటా వాడి దగ్గర ఏమీ ఉంచను అన్నాడు ఉమ్ భయమేస్తుంది అంటే భాగవతం ఇటువంటి ప్రమాణం కూడా చేస్తాడా భగవంతుడిని ఆ సుఖము అంటే ప్రాపంచికమైన వస్తువులు దాని వలన ఏర్పడిన సుఖం నేను తీసేసుకుంటా అప్పుడు వాడి మనసు ఎవరి మీద ఉంటుంది నా మీదే ఉంటుంది అప్పుడు వాడు సద్భక్తుడు అవుతాడు అని ఆయన మన వస్తువులు తీసుకోవటం ఎందుకు మనం యాతన పెట్టడం ఎందుకు మన మనసునే పరమాత్మ యందు లగ్నం చేసేస్తే పోలా అవును ఆ ఈ దుఃఖం అనేటువంటి ఆవరణంలోకి వెళ్లటం కంటే ఆనంద తారక స్థితిలో ఉండేటట్టుగా అన్నివేళలా దీనికంతకీ మూలము పరమాత్మే అని ఒక భావనలో గనక ఉండగలిగితే అది దివ్యమైనటువంటి పూజగా దివ్యమైన తపస్సుగా నేను భావన చేస్తాను అనేక దైనందిన కార్యకలాపాలు అన్నింట్లోలో కర్మ చెయ్యి కర్మ వలన ఫలితం ఏర్పడింది కర్మలు చేయటం మానమని గీతలో కూడా చెప్పలా కర్మ ఫల త్యాగం చేయమన్నది అవును కర్మల వలన ఒక ఫలం ఏర్పడింది దాన్ని త్యాగం ఇందాక అనుకున్న ఆ త్యాగం కర్మ ఫలం కూడా త్యాగం చేస్తే కర్మలు చేసే అవకాశం ఆయన ఇస్తాడు కర్మలు మంచి కర్మ కర్మ అంటే ఇక్కడ సత్కర్మ అని సత్కర్మలు చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు ఎవరికి ఇవ్వాలి మళ్ళీ పరమేశ్వరుడికి ఇవ్వాలి సర్వేశ్వరుడికి ఇవ్వటం అంటే ఎలా ఇస్తాం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి పరమాత్మే సాకార సగుణ పరబ్రహ్మగా ప్రపంచంగా ఉన్నాడు గనుక సమాజానికి ఇవ్వటమే సర్వేశ్వర సమర్పణం ఆయనకివ్వాలి ఇవి ఈ భావనలు అన్నివేళలా నిలబెట్టుకోవాలి అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు ఎట్లా సాధన ఏ సాధన వల్ల ఇవి నిలబడతాయి నాలుగు ఉన్నాయి నిరంతర సత్సంగం మంచి మాటలు ఏ వినటం ఒకటి అది ఈ భావనతో కూడి ఉన్న వారితో జీవించే ప్రయత్నమే చేయటం ఒకటి వాదము నినాదము లేని వేద ప్రామాణికమైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగి బోధించగలిగినటువంటి వారితో కూడి ఉండటం రెండు ఈ రెండూ లభించకపోయినా సంకీర్తనలో గనక ఉన్నట్లయితే భగవంతుడి యొక్క గుణగానాన్ని మనం భజన అంటాం ఆ భజనలో గనక ఉన్నట్లయితే మనసు ముందు రాగరంజితం అవుతుంది ప్రేమ పూరితం అవుతుంది మనస్సు అనేక ఆందోళనలతో ఉన్నది ప్రశాంత ప్రసన్న చిత్తం ఏర్పడుతుంది కాబట్టి సజ్జన సాంగత్యం అవసరం సత్ సాంగత్యం అవసరం సత్సంఘం అవసరం సద్గోష్టి అవసరం విచారణ చేయాలి ఇప్పుడు మీరు నేను పది నిమిషాలు మాట్లాడుకుంటున్నాం ఇది సద్గోష్టి దేనిని గురించి ప్రపంచము జీవుడు జగన్నాథుడు ఈ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాం చివరికి ఏతావాతా తేలవలసింది ఏంటంటే అసలు ఆ మూడు ఒకటే అనేటువంటి అద్వైత భావనకి వెళ్ళాలి అది కాస్త టైం పడుతుంది కానీ నిత్య జీవితంలో మాత్రం మంచి వాళ్ళ యొక్క ప్రాపు కోసం పాకులాడాలి మహాత్ముని సమాశ్రయించాలి ఒక మహాత్ముడి దగ్గరకు ఒకసారి వెళితే ఆస్తికుడు భక్తుడు అవుతాడు ముందు అసలు నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు ఆస్తికుడు భక్తుడు అవుతాడు భక్తుడు జ్ఞాని అవుతాడు జ్ఞాని ప్రేమమయుడు అవుతాడు ఒకమారు ఆ స్వామి ఒక భక్తుడితో చెప్పారండి ఉమ్ స్వామి ఉమ్ మీ పట్ల అచంచలమైన విశ్వాసం నాకు ఎట్లా కలుగుతుంది ఉమ్ మీరు చెప్పినటువంటి బోధనలన్నీ ఆచరించాలనేటువంటి సంకల్పం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి ఉమ్ అని అంటే ఉమ్ స్వామి బంగారం ఉమ్ అచంచలమైన విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించి వారి యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తుల తాలూకు చరిత్రలు చదువు చదవాలి దాని వల్ల నువ్వు ఉత్తేజితుడివి అవుతావు అని చెప్పేసి స్వామి చెప్పారు ఉమ్ అందుచేత ముఖ్యంగా స్వామి యొక్క సాహిత్యం భగవద్ భక్తుల యొక్క చరిత్రలు మీరన్నట్టుగా మంచి మాటలు వినటం వినటం సత్సంగం చేయటం ఇవి తప్పకుండా అవసరం ఉమ్ ఇవి నిత్య జీవితంలో ఒక భాగం కావాలి కావాలి అని నా అభిప్రాయం అండి కచ్చితంగా దాంట్లో రెండో అభిప్రాయం లేదు అసలు ఉమ్అని అందుచేత స్వామి చెప్పినటువంటి ఈ మార్గాన్ని అనుసరిస్తే మనం దీని వల్ల లబ్ది పొందగలుగుతాం మన జీవితంలో మనం అనుకున్నటువంటిది ఆచరించగలుగుతాం మీరన్న సంఘ నీతి దైవ ప్రీతి ఇవన్నీ ఏర్పడతాయి ఇంకొక విషయం అండి ఆ దైవ ప్రీతి గురించి ఉమ్ నాకు ఒక చిన్న సందేహం ఉంది ఉమ్ మీరు దయచేసి దాన్ని వివరించండి చెప్పండి ఏమిటంటే ఉమ్ దైవ ప్రీతి అంటే దైవం పట్ల ప్రేమ కలిగి ఉండటం అంటే కేవలం ఆరాధనలు అర్చనలు కాకుండా ఉమ్ దీన్ని దాటి దైవాన్ని ప్రేమించగలగటం ప్రేమించగలగటం దైవాన్ని ప్రేమించగలగటం అంటే ఉమ్ ఏం చేస్తే మనం అది దైవాన్ని ప్రేమించడం అనేటటువంటి ఆ స్థాయికి వెళ్తాం ఆ దైవాన్ని ప్రేమించటం అంటే ఏ విషయమైనా మూడు స్థాయిలు ఉన్నాయి భౌతిక స్థాయి, ఆధి భౌతిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి. Physical, Meta Physical and Spiritual ఈ Levels. దీనికి Physical Level లో పరమాత్మని ప్రేమించాలి అంటే ఆయన సగుణ రూపుడై ఉండాలి. ఆయనకు ఆకారం, ఆయనకు స్వభావం, ఆయనకు గుణం ఇవన్నీ ఉండాలి. అలా చేస్తూ చేస్తూనే ఒక Metaphysical State లో ఒక విచార ధారకు గురిచేయాలి. ఈ తత్వం ఏమిటి? సత్య సాయి భగవానులున్నారు. స్వామి అది సౌందర్య సార సర్వస్వం. సౌందర్యమే రాసిపోసినటువంటి మహా ఆనంద స్వరూపం అది. అది అక్కడ ఆగిపోకూడదు. అక్కడి నుంచి విచార-ఎవరు ఈ స్వామి? ఎట్లా వచ్చారు? అనేకమైన ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాలతో కాస్త స్వాధ్యాయం చేయాలి. Self Study చేయాలి. Epics చదవాలి. రాముడు, కృష్ణుడు వీళ్లందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఆ స్వామి In Isolation you can't experience him. స్వామి గాని భగవంతుడు. భగవంతుడు ముందు, భగవంతుడు తర్వాత, భగవంతుడు ఉన్న మూడు కాలాలని సమన్వయం చేసినట్లయితే అనేకమైన దైవీ లక్షణాలన్నీ ఈ పరమాత్మ అనే భావనలో నిలకడ చెందుతాయి. ఇక మూడవది ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్ళినప్పుడు భగవంతుడి పట్ల విశ్వాసము, భగవంతుణ్ణి ప్రేమించటం అంటూ రెండు లేడు-లేవు. విశ్వాసమే భగవంతుడు. అసలు ప్రేమే భగవంతుడు. భగవంతుడికి ప్రేమకి రెండు మా-రెండు పాయలు కావవి. కానీ Metaphysical Level లో దేవుడు ఒకడున్నాడు, ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను బానే ఉంది. ఆధ్యాత్మిక స్థాయిలో అసలు ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అది ప్రాపంచికమైన రాగ అనురాగాలు రెండూ దాటి ఈ దివ్యమైనటువంటి ప్రేమ ఎక్కడైతే ఈ లావాదేవీలు లేవో, ఎక్కడ బేరసారాలు లేవో, ఎక్కడ ఇచ్చుపుచ్చుకోవటాలు లేవో, ఎక్కడ ఆ ఆయన వేరు నేను వేరు అన్న భావన లేదో అది ఒక దత్తమైనటువంటి స్థాయి. ఆ స్థాయికి వెళ్ళాలి. అదే నిజమైనటువంటి దివ్య ప్రేమ. మిగతాదంతా స్వామిని ఒక అందగాడిగా ప్రేమించటం వేరు, సర్వజ్ఞుడుగా ప్రేమించటం వేరు, సర్వాంతర్యామిగా భావించటం వేరు. అసలు ఉన్నదంతా స-సత్యము సాయిమయమే అనుకోగలిగితే అది మాత్రం ఆధ్యాత్మిక స్థాయి. అది సంసారే చేయాలి, గృహస్తే చేయాలి, ఈ ప్రపంచంలో ఉన్నవాడే చేయాలి. ఎందుకంటే ఇది కార్య క్షేత్రం, ఇది కురుక్షేత్రం. సన్యాసికి సన్యసించటానికి ఏం లేదు. సన్యసించాడు గనుకనే సన్యాసి అయినాడు. సంసారి అన్నింటి మధ్య ఉంటూ ఇది ఏదీ నాది కాదనుకోగలిగిన స్థాయికి వెళ్ళాలి. అది దైవ ప్రీతి. Unconditional Love. దాంట్లో Anticipations లేవు, Expectations లేవు, Appointments లేవు, Disappointments లేవు, Fusion తప్ప Confusion లేదు, Conflict లేదు. ఏమున్నదంటే పరదైవమే నాయందు ఉన్నాడు. నేను పర దైవంతో కూడి ఉన్నాను. అసలు నేను ఆయన్ని మళ్ళీ ప్రత్యేకం పట్టుకోవటం ఎక్కడుంది? అది. ఆ స్థాయికి ఈ మూడు మార్గాలు మాత్రం గొప్పవి. వ్యక్తి వ్యక్తే సంఘం యొక్క సూక్ష్మ రూపం. వ్యక్తి యొక్క విస్తృత స్వరూపమే సంఘం. ఈ రెండింటికీ ఆహ్ ఆ రెండూ చక్కగా నడవటానికి పాపభీతి లేదా పుణ్య ప్రీతి రెండో మాట అది కారణం అవుతున్నది. ఈ మూడు ఈ రెండూ కలిపితే దైవ ప్రీతిగా రూపాంతరం చెందుతున్న దైవ ప్రీతి ప్రత్యేకం కాదు. ఈ రెండింటిలో నుంచి అది ఇప్పుడు దైవ ప్రీతి ఉంటే సంఘం బాగుంటుందనేది కాదు. సంఘం బాగా చేయాలి, బాగు చేయాలి. బాగు చేయటానికి వ్యక్తి పరిణామం మాత్రం చాలా ప్రధానం. అదే సత్య సాయి భగవానుడి ఉపదేశం అంతా ఏమిటి? Information to Transformation కాదు. Have Information, Aim for Transformation through Implementation. నా దగ్గర Information ఇంతుందంటే నేను Transform అయిపోయిన జ్ఞానిని కాదు నేను. అవును నేను Implement చేయగలిగిన నాడు నేను జ్ఞాని అయ్యే స్థాయి ఎప్పుడో ఏర్పడుతుంది. అయినా నాకు దాంతో ప్రమేయం లేదు. నాకున్న Information నా వ్యక్తిత్వాన్ని ఆహ్ మెరుగు దిద్దుకోవటంలో, రూపాంతరీకరణం చేయటంలో దానిని నేను ఎలా వాడుకున్నాను? ఆ వాడుకోవటానికి నా ఇల్లు, నా సమాజం, నా వృత్తి, నా ప్రవృత్తి ఇన్నింటిలో దానిని ఎలా ప్రతిఫలించాను? దాని వలన ఫైనల్ గా నాకు ఆనందం కలిగిందా లేదా? అసలు ఈ ఆనంద స్వరూపం భర-భగవంతుడే కదా! భగవంతుణ్ణి నేను ఆనందంగా లోపల అనుభవించాను అనుకోవటం ఉదాత్తమైన స్థాయి. మీరు చెప్తూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి ఆ స్వామి చెప్పినటువంటిది ఆ చెప్పండి అంటే సామాన్య మానవుడు నిత్య జీవితంలో ఉమ్ ఎట్లాగ స్వామి యొక్క ఉనికిని ఉమ్ తనతో పాటుగా ఉన్నాడన్నటువంటి భావన ఉమ్ ఎట్లా కలిగి ఉండాలి అనడానికి ఉమ్ స్వామి చెప్పారు, "బంగారు! ఈ ఇంటికి యజమాని నువ్వు కాదనుకో అవును నేననుకో ఉమ్ ప్రతి గదిలోనూ ఉమ్ నా చిత్రపటం ఒకటి పెట్టుకో ఉమ్ నువ్వు చేసే ప్రతి పనికి ఇంటి యజమానిని నేను గనుక ఉమ్ నా దగ్గర అనుమతి పొందు ప్రతిదానికిని ఉమ్ ఇట్లా చేసుకుంటూ పోయినట్టయితే ఉమ్కొన్నాళ్ళకి అది నీ స్వభావమే అవుతుంది. ప్రతి పనికి కూడా నన్ను తలుచుకోవటమే అవుతుంది. ఉమ్ అప్పుడు జీవితంలో ప్రత్యేకంగా ఇది చెయ్యాలి- ఉమ్ ... అని అనేటువంటి సంకల్పం చేసుకోవలసినటువంటి అవసరం లేదు. దానికి అవసరమైనటువంటి ధైర్య స్థైర్యాన్ని నేనే ఇస్తాను బంగారు- అవును ... అన్నాడు. అవును ఇది చాలా సులభమైన సాధన- చాలా చాలా ... అనిపించింది మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇది. అవును అవును అందుచేత ఇట్లాగ అనుక్షణము స్వామి యొక్క భావనలో ఉంటూ సత్సంగం చేసుకుంటూ ఉమ్ స్వామి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, ప్రేమని కలిగి ఉంటే ఉమ్ మనం తప్పకుండా ఈ సమాజంలో మనం నిర్వహించవలసినటువంటి పాత్ర ఉమ్ అంటే ఏ నైతిక విలువలనైతే స్వామి ప్రబోధించారో ఉమ్ ఆ నైతిక విలువలని అనుక్షణము మన జీవితంలో పాటించగలిగిన ధైర్య స్థైర్యం మనకి ఏర్పడి మన వల్ల మనకి, సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. అవును సమాజం సుఖశాంతులతో వర్ధిల్ల కలుగుతుంది- ఉమ్ ... అని నేను అనుకుంటున్నానండి అవునండి ఖచ్చితంగా. మనమే మనమే చేయాలి. చేయటానికి సమాజం ఒక విస్తృతమైన canvas. ఇది కార్యక్షేత్రం. సమాజం నుంచి మనిషి విడిపడి లేడు. అలాగే దైవము మన నుంచి సమాజం నుంచి విడిపడి లేడు. అందుకే ఉపనిషత్తు వాక్యం ఏమిటంటే "జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒక్కటే" త్రిపుటి. నడిపించే వాడుగా ఆయన, నడుస్తున్నదిగా ప్రపంచం, దానిలో ఉన్నవాడుగా జీవుడు. మూడు. ఈ మూడు ఒక link. ఒక సమగ్రమైన సమాహార స్వరూపం ఇది. కాబట్టి సత్య సాయి భగవానుడే సమాజం. ఆ సమాజంలో ఉన్నటువంటి మనమే సూర్యకిరణాలు సూర్యుని నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నా కిరణాలు చంద్ర-చంద్రుని నుంచి ఎట్లా భిన్నం కావో మనం కూడా పరమాత్మ నుంచి భిన్నం కావు. పరమాత్మ నుంచి మనం ఏమి కోరుతున్నామో మనం పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళంగా మనం కూడా ఈ ప్రపంచానికి అదే ఇవ్వగలగాలి. ఆ స్థాయిలో కాకపోయినా మన స్థాయిలో మనం ఇవ్వగలుగుతూ ఉండాలి. ఇది నిత్యమైనటువంటి సత్య సాధన. అందుకే పదార్థంలో నుంచి పరమార్థంలోకి, పరమార్థంలో నుంచి యదార్థంలోకి మానవుడు ప్రస్థానం చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక ప్రస్థానం. ఈరోజు మా studio కి వచ్చి ఈ సంఘ నీతి, పాపభీతి, దైవ ప్రీతి గురించి చక్కటి వివరణ ఇచ్చి మా సందేహాలు తొలగించినందుకు రేడియో సాయి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. సాయి రామ్. సాయి రామ్ అండి.
SSSMC · audio
Interview - 02
Interview - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 26:47
More in this series