Skip to content
Transcript తెలుగు
[ప్రారంభిక సంగీతం] ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం! బాల్యమందున పలువురితో గూడి ఆటపాటలందు ఐక్యుడగును. యవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కి కామిని లోలుడై కాలుచుండు. అర్ధవయస్సున ఐహికంబున ముంగి ద్రవ్యమార్జించుటన్ దవిలియుండు. ముదిమి వచ్చిన యెంత మురహరి తలవక అది ఇది లేదని అలమటించు. వివిధ దుర్వ్యసనంబులు వీడలేక, భక్తిమార్గంబు వెతుకు నాసక్తి లేక, కర్మపంకిలమున బడి క్రాలుచుండు. మట్టి కలుపును జన్మంబు మానవుండు. ఇది సత్యసాయి భగవానుడు అందించిన పద్యం. ఎంతో విలువైన, ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని విధంగా గడుపుతున్నాడు ఈనాటి మానవుడు. ప్రతీ మనిషి భూమిపై జన్మించి తన నిజతత్వాన్ని గుర్తించడానికి బదులు ప్రపంచమనే మాయలో పడి కొట్టుకుపోతున్నాడు. ఒక గొర్రెల గుంపును కనుక గమనించినట్లయితే అందులో ప్రతి గొర్రె తల కిందికి పెట్టి కేవలం తన ముందు ఉన్న గొర్రెను మాత్రమే గమనిస్తూ అది ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించి, ముందున్నది ఎక్కడికి చేరితే అన్నీ అక్కడికే చేరుతాయి. ఇంకా చెప్పాలంటే ముందు ఉన్న గొర్రె అలా వెళుతూ బావిలోనో పడి ప్రాణాలు విడిచిపెట్టినా కూడా మిగిలిన గొర్రెలన్నీ కూడా కనీసం అది కూడా గమనించకుండా బావిలో పడి వాటి ప్రాణాలను కూడా కోల్పోతాయి. నేటి మనిషి పుడుతున్నాడు. ప్రతి పిల్లవాడు school లో చేరి చదువుకుంటున్నాడు కాబట్టి తానూ school లో చేరి ఏం చదువుతున్నాడో, ఎందుకు చదువుతున్నాడో కూడా తెలియకుండా కేవలం మార్కుల కోసం పాకులాడతాడు. తరువాత అందరూ డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగం కోసం తపిస్తాడు. ఇక ఉద్యోగం రావటంతో ఏదో సాధించిన వాడిలా తృప్తి పొంది, ఈలోగా యవ్వన వయస్సు రావటం చేత అందరిలా తాను కూడా వివాహం చేసుకుంటాడు. తరువాత పిల్లలు, ఆస్తులు వాటిని పెంచి పోషించి, కృషించి సంసారంలో మునిగి తేలే సరికి వృద్ధాప్యాన్ని చేరుకుంటాడు. ఇందాక స్వామి పద్యంలో విన్నట్లు అప్పటికీ భగవంతుణ్ణి తలవక గడిచిన జీవితాన్ని గురించి చింతిస్తూ అమూల్యమైన జీవితాన్ని ముగిస్తున్నాడు. ఇదంతా గమనిస్తుంటే, నిజంగా పోల్చుకుంటే కనుక నేటి మనిషి పరిస్థితి గొర్రెలానే ఉంది. మరి గొర్రె అలా పడిపోతే, "అయ్యో పాపం మూగజీవి" అంటారు. అదే పని మనిషి చేస్తే "ఆమాత్రం బుద్ధి జ్ఞానం లేదా" అని అంటాం. అవును అనంతమైన జీవకోటిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది. విషయాన్ని మనం ముందుగా గుర్తించి వర్తించాలి. బుద్ధి జ్ఞానం లేదా అనేవి తిట్లు కాదండి. కేవలం మనిషికి మాత్రమే ఉన్న గుణ సంపద. విచక్షణా శక్తి కలిగిన కేవలం మానవ జన్మలోనే ప్రతి జీవి తనను తాను తెలుసుకొని పరమాత్మని చేరుకోగలదు. అయితే కలియుగంలో మానవతా విలువలను సైతం మరిచిపోయిన మానవుణ్ణి ఉద్ధరించడానికి, తీర్చిదిద్దడానికి ఆదిశంకరాచార్యుల నుండి స్వామి వివేకానందుని వరకు ఎందరో గురుమూర్తులు, ఆదర్శ పురుషులు భరత భూమిని పావనం చేశారు. వారి జీవితాన్ని అంతా మానవోద్ధరణకు దారపోశారు. అయితే school లో పిల్లవాడు చెప్పినది సరిగ్గా నేర్చుకోకపోతే teacher గారు వారి తల్లిదండ్రులకు వెళ్ళి complaint చేసినట్లు వీరంతా దేవదేవుణ్ణి వేడుకున్నారో ఏమో, అమ్మలను కన్న అమ్మ, సృష్టినంతటినీ భరిస్తున్న తండ్రి, గురువులకు గురువు అయిన పరమాత్ముడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అవతారం దాల్చి తల్లి, తండ్రి, గురువుల ప్రేమతో జీవకోటిని అనుగ్రహించారు. మరి పరమ ప్రేమమూర్తి చంటి పిల్లవానికి గోరుముద్దలను అందించినట్లు మానవాళికి ఎన్నో బోధలను చేశారు. మరి మానవ జన్మ ఎత్తి అటువంటి ప్రేమను అనుభవించకపోతే అంతటి దురదృష్టం మరొకటి ఉండదు. అది కేవలం పుట్టలోని చెదలు పుట్టవా, గిట్టవా అనే అర్థాన్ని సార్థకం చేసినట్లు అవుతుంది. ఇక మనిషి జీవితంలో మూడు స్థాయిలలో ఉద్ధరింపబడటానికి అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి జన్మతః కొంత సంస్కారంతో పుడతాడు. తరువాత జీవి పుట్టిన కుటుంబ సంస్కారం వ్యక్తిపై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక తను సమాజంలోకి వెళ్ళాక విద్యార్థిగా, ఒక యువకుడిగా తాను ఏం నేర్చుకుంటాడు అనేది ఇంకో విషయం. అయితే జన్మతః వచ్చే సంస్కారం మన పూర్వ జన్మలపై ఆధారపడి ఉంటుంది. అంటే దానితో మనం ప్రస్తుతం ఏమీ చేయలేము. వచ్చేదేదో వస్తుంది. తరువాత కుటుంబంలో పుడతామన్నది కూడా జీవి అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కానీ యువత స్థాయికి చేరుకున్నాక తాను స్వతంత్రంగా ఆలోచిస్తున్నప్పుడు తనను తాను ఉద్ధరించుకునే అవకాశం మాత్రం మన చేతిలో ఉంటుంది.దానిని బట్టి మన జీవితంలో ఎటువంటి స్థాయికి చేరుకుంటాం అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా అంటే స్వామి కాలం గురించి చెప్పినట్లు భూతకాలం గడిచిపోయినది మన చేతిలో లేదు రాబోయే భవిష్యత్ కాలం కూడా మన చేతిలో లేదు వర్తమానంలో మాత్రం మనం అనుకునేది చేయగలం. దీనితో పోలిస్తే జీవితంలో మనతో వచ్చిన లక్షణాలు వ్యవస్థలో పుట్టి పెరగామన్నది మన చేతిలో లేదు. తరువాత జీవితంలో స్థితికి చేరుతాం అన్నది మనకు తెలియదు కనుక వర్తమానం లాంటి యువదశలోనే మనిషి తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు యువదశ గురించి యువశక్తి సామర్థ్యాల గురించి ఎన్నోమార్లు నొక్కి వక్కాణించారు. విషయంలో సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఆదర్శాన్ని అందించి బోధించారు. మంచితనము నందు మానవత్వము నందు మంచితనము నందు మానవత్వము నందు నీతి యందును నిండు నిజము నందు ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్లా ఆచరించి చూపు ఆదర్శములనెల్లా అతడే యూతు ఆమె యువతి ఆచరించి చూపు ఆదర్శములనెల్లా అతడే యూతు ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో తొంభై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ యువతీ యువకులపై ప్రత్యేకంగా యువత అనే కార్యక్రమాన్ని మీకు అందించబోతుంది. [పేజీ మార్చే శబ్దం] యువత యువత సనాతన భావం సనూతన రూపం యువత యువత నేటి నుండి ప్రారంభమయ్యే మన కార్యక్రమం ప్రతి వారం యువతకు సంబంధించిన పలు రకాల అంశాలపై వివిధ భాగాలను మీకు అందించనుంది. మన రేడియో సాయి తెలుగు బృందం నుండి యువత అను కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన మొట్టమొదటి భాగంలో యువదశ ప్రాముఖ్యత పై జరిగే చర్చా కార్యక్రమంలో మనతో పాటు మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ కూడా ఉన్నారు. సాయిరాం గణేష్. సాయిరాం సాయి ప్రసాద్ ఇక కార్యక్రమంలో మొదటి అతిథిగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్వామి వారి చిరకాల భక్తులు శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో ఉండటం విశేషం. వారితో జరిగే చర్చాగోష్టిలో యువదశ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వారి మాటల్లో విందాం. సాయిరాం వి.ఎస్.ఆర్. మూర్తి గారు. సాయిరాం సాయి ప్రసాద్ సాయిరాం గణేష్ సాయిరాం సార్. పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి స్వామి నడయాడిన దివ్య ప్రాంగణంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువతను ఉద్దేశించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అనుకోవటమే స్వామి సంకల్పంగా నేను భావన చేస్తూ స్వామి తొంభై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామికి ప్రాంజలు ఘటిస్తూ ప్రపంచాన్ని సుమారు తొంభై సంవత్సరాలు పరమాద్భుతంగా నడిపించినటువంటి స్వామి ఆచరణ స్వామి ఆలోచన స్వామి భావన స్వామి దర్శనం స్వామి ప్రణాళిక వీటన్నింటినీ మనం కాస్త స్థాలీపులాక న్యాయంగా విచారణ చేద్దాం. అవసరమైన చోట కాస్త విస్తృతంగా వెళదాం. ఎందుకంటే మానవ జీవితంలో యవ్వన దశ చాలా ప్రధానమైనటువంటిది.అంతే కాదు, ఇవ్వాళ మీరు దేశం తీసుకోండి అంటే నాగరికత వృద్ధి చెందినటువంటి దేశాలు గనక గమనించినట్లయితే డెబ్బై ఎనిమిది percent యువత ఉంది. అంటే సమాజానికి అది ఆలంబన అవుతున్నది, ఆధారం అవుతున్నది. డెబ్బై ఎనిమిది percent ఉన్నటువంటి యువత తన నిజ శక్తిని తాను గుర్తించలేకపోయినట్లయితే జాతి మనుగడకే ఒక ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ముందుగా అసలు యవ్వన దశ, దానికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని positive కొన్ని negative. కొంత ఒక సమర్థవంతమైనటువంటి శక్తి. శక్తి ఉన్నది గానీ అనుభవం లేదు. అవును మిగిలిన ఇరవై రెండు percent ఏదైతే ఉందో దాని దగ్గర పూర్ణ అనుభవం ఉంది గానీ శక్తి లేదు. చూశారా? ఇది ప్రతి మానవుడు తన జీవితంలో తాను ఎదుర్కొంటాడు. ఉమ్ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దిశలుగా, దశలుగా మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నిర్వచనం చేసింది. బాల్యమంతా తల్లి చాటునా, తండ్రి చాటునా గడిచిపోతుంది. యవ్వన ఆరంభ వేళ అంటే adolescent age అంటాం మనం. అక్కడికి వచ్చేప్పటికీ మనిషి తన కాళ్ల మీద తాను నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సుమారుగా నడిమి వయస్సు దాకా, నలభై ఏళ్ల దాకా సాగుతుంది. ఇవాళ లెక్క ప్రకారం యాభై ఏళ్ల దాకా సాగుతుంది. ఉమ్ ఉమ్ తర్వాత ఏర్పడేది వార్ధక్యం అనండి, ముసలితనం అనండి, ఇంకోటి అనండి. అది నెమ్మదిగా సూర్యుడు పడమటి వాకిటి వెళ్తున్న లెక్క. దశలో డెబ్బై ఎనిమిది percent youth లో ఏమున్నది అంటే ఇప్పుడే అనుకున్నట్లుగా అపారమైన శక్తి ఉంది. ఉమ్ అపారమైనటువంటి యుక్తి ఉంది. మరి ఇది positive అయినప్పుడు negative ఏమిటి ఆలోచిస్తే ఓర్పు లేదు, కూర్పు లేదు. ఉమ్ నేర్పు లేదు. మూడు గనక మనం యువత ఓర్పుని, కూర్పుని అంటే ఓర్పు అంటే tolerance, patience. సహనం. అలాగే కూర్పు orientation, orientation of thought, orientation of action. ఇది రెండోది. తర్వాత నేర్పు. ఏది చేసినా కర్మ సుఖౌ శలం అన్నాడుగా భగవద్గీతలో కృష్ణుడు. ప్రజ్ఞతో చేయాలి, skillful గా చేయాలి. మూడు గనక లేకపోతే అది negative ఉంటే అది positive అంతే. తర్వాత మానవ జీవితాన్ని దశలు పక్కన పెట్టినట్లయితే మూడు aspects నడిపిస్తుంది. ఒకటి నమ్మకమే లేని స్థితి, అది మొదటి రోజులు. మధ్య వయసుకు వచ్చినప్పుడు నమ్మీ నమ్మనీ స్థితి. చివరి దశలో నమ్మకమే నడిపించే స్థితి. చూశారా? కాబట్టి మూడింటిని కూడా గమనించుకోవాలంటే నమ్మీ నమ్మనీ స్థితి ఎక్కడుంది? మధ్య వయసులో ఉంది. ఉమ్ దేవుడున్నాడు అంటాడు, మళ్ళీ రేపు పొద్దున లేడు అంటాడు. లేడు లేడు అంటూ యవ్వనం గడుస్తున్నా గానీ దేవుడే ఉన్నాడు అంటాడు కానీ తెలుసుకోలేడు. కాబట్టి ఇవాళ ప్రపంచ పోకడలని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే చాణక్య నీతిలో ఒక సూత్రం ఉంది. మనిషి యవ్వన ఆరంభ వేళ అంటే youth గా రూపాంతరీకరణం చెందుతున్నటువంటి వేళ యవ్వన దశలో అతని మానసికమైనటువంటి శక్తిని ప్రభావితం చేసే నాలుగు అంశాలు చెప్పాడు. ఒకటి జన్మ సంస్కారం. తనకు తానుగా తెచ్చుకున్నది, అది ఒక పాలు one fourth. రెండవది తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది. మూడవది తన సహచరుల నుంచి సంపాదించేది. నాలుగవది సమాజం నుంచి పొందేది. అంటే తల్లి తాను, తల్లి తండ్రి, తన సమాజము, ఇవన్నీ కూడా కలిపి ఒక వ్యక్తిగా రూపాంతరీకరణం చెందుతున్నాడు. అంటే తన ఆలోచనా విధానం నాలుగు కోణాల నుంచి effect అవుతాయన్నమాట. అంశాలు వాటిని ప్రభావితం- ప్రభావితం చేస్తాయ్. చేస్తాయి. కాబట్టి నాలుగింట్లలో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్ మంచానికి నాలుగు కోళ్ళు. మూడున్నా పర్వాలేదులె అంటే మంచం కాదుగా, నాలుగూ కావాలి. ఉమ్ అందులో తల్లిదండ్రులు good parenting. మనం రీతిన వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం చాణక్యుడు అంటాడు, "Trust but have a check" అంటాడు. నమ్ము కానీ జాగ్రత్తగా అది ఎట్లా దారి, ఎట్లా నడుస్తున్నాడో గమనించమంటాడు. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక మనం పదే పదే చెప్పుకున్నట్లుగా జన్మ సంస్కారంతో మనం వస్తాం. మనకు కొన్ని traits and tendencies అంటాం. అవి మన వ్యక్తిత్వ నిర్మాణంలో అవి ప్రధాన భూమిక. మిగతావన్నీ తర్వాత acquire చేసేవి. ఉమ్ తల్లి తండ్రి బాగా చదువుకున్న వాళ్ళు, విశాల హృదయులు, ప్రేమ స్వరూపులు, భగవంతుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు, సమాజం పోకడని గౌరవించే వాళ్ళు, మారుతున్న అవసరాలు పట్టి జీవితాన్ని గడిపే వాళ్ళు, జీవించే వాళ్ళు, విలువలను పాటించే వాళ్ళు, అటువంటి తల్లిదండ్రులు గనక అయితే యవ్వన దశలోకి వెళ్ళే లోగానే ఇతడు సగం వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. అవును తర్వాత యవ్వన ఆరంభ వేళే కాదు చిన్నప్పుడే స్కూల్కి వెళ్తాడు. ప్రాథమిక విద్య నుంచి ప్రారంభమై పదహారు, పద్దెనిమిది ఏళ్ళు వచ్చేప్పటికీ చదవటం, రాయటం, నేర్వటం, మాట్లాడటం అన్నీ నేర్చుకుంటాడు. మరి ఎవరు ప్రభావితం చేస్తున్నారంటే ఒక ideal teacher. ఆదర్శవంతమైనటువంటి గురువు. ఉమ్ లోకగురువు. మనకి పాఠం చెప్పే గురువుగారు. ఆయన time కి రావటం అంటే సమయపాలన, విజ్ఞత, విషయం మీద అధికారం, విజ్ఞాన భాండాగారంగా ఆయన మనకు కనిపించటం. classroom లో ఎంత ఉదాత్తంగా ఉన్నాడో ఆయన class బయట కూడా అంతకంటే ఉదాత్తంగా ఉన్నాడు. అది మనల్ని influence చేస్తుంది. చూశారా?అలాగే ఇక నాలుగవది వచ్చినప్పుడు సమాజం. ఉమ్ సమాజం అంటే అది నిజానికి మన స్నేహితుల యొక్క extensionే సమాజం. గడప లోపల మనం కూర్చున్న ప్రదేశం వరకు మన స్నేహితులు మన తల్లిదండ్రులు మనము ఉంటాం. గడప దాటగానే నీ సమా-- నీ ఇంటితో గాని నీ స్నేహితులతో గాని సంబంధం నెమ్మదిగా తెగిపోతుంది. నువ్వేమవుతున్నావ్ నువ్వు? సమాజం అయిపోతున్నావ్. కాబట్టి గడప లోపల ఎంత ఉదాత్తంగా ఉన్నావో, నువ్వు రేప్ పొద్దున సమాజంలోకి వెళ్ళబోతున్నావు అన్నప్పుడు దీని కంటే ఒక పరమాద్భుతమైన స్థాయిలో వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. దానికి యవ్వన దశ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యసాయి భగవానుడు మన స్వామి అవతారాన్ని గనుక జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇది మోక్షం ఇవ్వటానికి వచ్చిన అవతారం కాదు. Man making వ్యవహారం దాంట్లో ఉంది. అంటే మనిషిలో మిగతా గుణాలన్నీ పోగొట్టి ఒక బండరాయిని శిల్పంగా మలిచే దిశలో శిల్పి ఏం చేస్తాడు? అక్కరలేని parts అన్నీ చెక్కి బయట పడేస్తాడు. కృష్ణుడో, రాముడో బొమ్మ తయారు చేస్తాడు. చేసి, "ఆహ్ ఇప్పుడు తీసుకెళ్ళండి" అంటాడు. స్వామి విద్యా విధానంలో కానీ ఉమ్ స్వామి యవ్వన దశలో ఉన్న వారందరినీ ఒక కంట గమనిస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేయడంలో గాని స్వామి స్పష్టంగా చేసింది ఇదే. దాని వల్ల ఏమయ్యింది? యవ్వనంలో చక్కగా తయారైన వ్యక్తులు మధ్య వయసుకు వచ్చేప్పటికి జీవితం మనకు ఏమిస్తుంది, ఏమివ్వదు తెలుసుకున్నారు. జీవితాన్ని నడపటం గడపటం వదిలేశారు. జీవితాన్ని నెమ్మదిగా జీవించడం ప్రారంభించారు. జీవించడం. జీవితాన్ని జీవించటం ప్రారంభించటం అంటే ఎత్తుపల్లాలు ఉంటాయి, చీకటి వెలుగులు ఉంటాయి, జనన మరణాలు ఉంటాయి, సుఖదుఃఖాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, మానవమానాలు ఉంటాయి, ఆశాభంగాలు ఉంటాయి. అన్నింటినీ సమదృష్టితో చూడగలిగిన ఒక స్థితి ఏర్పడుతుంది. స్థితి. అంటే స్థితి రావటానికి మళ్ళీ ఆధారం ఏమవుతున్నది? యవ్వన దశ. యవ్వన దశ. అయితే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న దానికి కొద్దిగా మనం కొనసాగింపుగా ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఉమ్ యవ్వన దశలో మూడు aspects ఉంటాయి. Adolescent innocence ఉంటుంది. సమాజం క్షమిస్తుంది. చిన్నవాడు కదా, ఇంకా వ్యక్తి కాలేదు కదా అంటుంది. Adolescent ignorance ఉంటుంది. సమాజం అర్థం చేసుకుంటుంది. ఏదో తెలిసి తెలియని వయస్సు అంటుంది. Adolescent arrogance ఉన్నదే వీడు పనికిరాడు అంటుంది. చూశారా? ఉమ్ [నవ్వు] innocence, ignorance, arrogance అనే మూడింట్లలో ఉమ్ ముందు మనం వదిలిపెట్టవలసింది ఏమిటి? arrogance. ఉమ్ Arrogance ఉన్నదా intolerance పెరుగుతుంది. ఉమ్ అసహనం ఉంటుంది. ఓర్పు ఉండదు. అంతా వేగంగా అయిపోవాలి, అప్పటికప్పుడు అయిపోవాలి, అనుకున్నట్లు అయిపోవాలి. అనుకున్నట్లు జీవితం జరగదు. ఉమ్ అనుకోకుండా జరిగేదాని పేరు దాని పేరే జీవితం. కాబట్టి ఇవన్నీ యవ్వన దశలో గనుక చక్కగా నేర్చుకోగలిగినట్లయితే దీని ప్రాముఖ్యత ఇంత అంత అని చెప్పటానికి వీల్లేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళి కొద్దిగా విచారణ చేసినట్లయితే మనకి ఆహ్ పురాణగతమైనటువంటి ధార్మిక దేశం కాబట్టి రాముడున్నాడు. శ్రీరామచంద్రుడు. ఎనిమిదేళ్ళు వచ్చేప్పటికి యోగవాసిషటం విన్నాడు. పన్నెండేళ్ళు వచ్చేప్పటికి విశ్వామిత్రుడితో అడవులకు వెళ్ళాడు. పదహారేళ్ళు వచ్చేప్పటికి అరణ్యాలకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేప్పటికి ముప్పై ముప్పై రెండు ఏళ్ళ వయస్సు. నడిమి వయస్సు నాటికి అయోధ్య చేరుకున్నాడు. అంటే శ్రీరాముడి యొక్క పరాక్రమం, శ్రీరాముడి యొక్క శక్తి, శ్రీరాముడి సుగుణం, శ్రీరామ సౌశీల్యం, శ్రీరాముడి యొక్క అనంత బాహుశక్తి, తర్వాత అట్లాగే దర్శనం, తన కర్తవ్య దీక్ష, ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయి? యవ్వన దశ యవ్వన దశలో బయటపడ్డాయి. అవును తర్వాత తర్వాత పదకొండు వేల ఏళ్ళు పాలించని, అది extension. మనం అది మాట్లాడుకోవాలి. శ్రీకృష్ణుణ్ణి తీసుకుందాం. శ్రీకృష్ణుడు అయితే మరీ చిన్న వయస్సు నుంచే అసలు పాలు తాగే వయస్సు నుంచే పూతన సంహారంతో మొదలు పెట్టాడు. పెట్టి అదిగో అట్లాగే ఎనిమిది పదేళ్ళ వయస్సు రాకుండానే మధురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కంసవధతో ప్రారంభించాడు. అవతార కార్యక్రమం, సంహార క్రీడ, అదాయనకి ఆట. ప్రారంభించాడు. అంటే ఏమర్థమవుతున్నది? ఆయన శక్తి యుక్తులన్నీ పరమేశ్వరుడైనా సరే మానవ దేహం తీసుకుని ఇక్కడికి వస్తే పదహారు ఏళ్ళ లోపే ప్రారంభించాలి. సరే అంతెందుకు? మన స్వామి సంగతి చూద్దాం. ఉమ్ పధ్నాలుగు ఏళ్ళు వచ్చింది. 1926 గా నవంబర్ 23 క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం. ఇరవై ఆరు ప్లస్ పధ్నాలుగు, నలభై. అదిగో ఇప్పుడెక్కడే ఉన్నాం మనం. ఆహ్? 1940, పధ్నాలుగు ఏళ్ళు వచ్చేప్పటికి నేను సాయిబాబా అని అన్నారు. అవును "ఇదిగో నేను చేయబోయే పని అంతా ఇదే" అన్నారు. ప్రణాళికే-- ప్రణాళికేమిటి? ఎలా తెలుసు? రేపేం జరగబోతున్నదో మనకు తెలీదే. ఇది అయిన తర్వాత ఇంకో పావుగంటలో ఏం జరగబోతుందో తెలీదే. అటువంటిది స్వామి తన కార్యక్రమాన్ని, తన అవతార రహస్యాన్ని, ప్రణాళికని, విశిష్టతని వయస్సులో బయటపెట్టారు? యవ్వన వయస్సులో యవ్వన వయస్సులో. బాల్యం వీడి యవ్వనంలో అడుగుపెట్టే వేళ పరమాత్మ తనను తాను ఆవిష్కరించుకున్నారు. రాముడు, కృష్ణుడు, సత్యసాయి కంటే ఇంకా మనకి గొప్ప ఉదాహరణలేమైనా కావాలా? ఇవన్నీ భారతం చెబుతున్నది, భాగవతం చెబుతున్నది, రామాయణం చెబుతున్నది. సత్యసాయి-- సత్యం శివం సుందరమో వాహినో మన కళ్ళతో మనం చూశాం. కాబట్టి యవ్వనం మన భావి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇది ఒకటి. యవ్వనం అనేది జీవితంలో వర్తమానం. బాల్యం యవ్వనంలోకొచ్చిన వాడికి అది భూతకాలం. భూతకాలం. ఉమ్. ముసలితనానికి వెళ్ళిన వాడికి ఇదే యవ్వనం భూతకాలం అవుతున్నది. మరి యవ్వనంలో ఉన్నవాడు ఏం చేయాలి? ఉమ్ తాను యవ్వనంలోకి రాగానే అప్పటివరకూ తాను పరిశీలించిన, పరికించిన, చూసిన, అనుభవించిన అనేకమైనటువంటి విషయాలు మనసు మీద ముద్ర వేసి ఉంటాయి కాబట్టి, తల్లిదండ్రుల ప్రవర్తనతోటి సహ విద్యార్థుల ప్రవర్తన త్యాగం ఇవన్నీ మంచి మంచి గుణాలు గురువులు లోకం చూసి ఒక-ఒక రూపం తాలుస్తాడు. రూపం తాల్చినప్పుడు అతని దగ్గర ఏముంటుందంటే ఒక అద్భుతమైన knowledge ఏర్పడుతుంది. knowledge లో నుంచి అప్పటిదాకా జరిగిన పధ్ధానిగేళ్ళో పదిహేనేళ్ళో time స్ఫూర్తిని పొందుతాడు. నేను ఫలానా వారి వలె అవ్వాలి మనం ఉన్నాం పన్నెండు పదమూడేళ్ళ వయసులో స్వామి దగ్గరకు వస్తే మన dream ఏముంటుంది? స్వామి వలె జీవించాలి అంటే ఒక image form చేసుకుంటాం మ-మనంతట మన- మనంతట ఇలా ఉండాలి అని మనం ఒక ఊహ ఊహ ఊహ కల్పన చేసుకుంటాం కల్పన కల్పనకు అనుగుణంగా మన జీవిత విధానాన్ని నిర్ణయ-నిర్ణాయకం చేసుకుంటాం. కాబట్టి యవ్వనానికి స్ఫూర్తి ఏదంటే బాల్యం. యవ్వనంలోకి రాగానే ఇక్కడ నుంచి మనం ఇక ఇది ఆచరణ, ఇదొక వేదిక ఇది practical field. ఇందాక అనుకున్నాం knowledge వచ్చేసింది అని కొంత పుస్తకాలు అనండి, వినండి పెద్దవాళ్ళని చూడండి వాళ్ళ ప్రవర్తన గమనించండి కొంత ఏర్పడింది కదా. అక్కడికి వచ్చేప్పటికి సామెత ఉంది కదా "Wisdom comes by birth but knowledge lingers in the streets" బయట నుంచి దాన్నే స్వామి ఏమన్నారు "గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకం" ప్రత్యక్ష లోకం అది. ప్రత్యక్ష లోకాన్ని మించిన పుస్తకం లేదు మిగతావన్నీ inputs information ఇస్తాయి. కానీ జీవితాన్ని యదార్థంగా నిర్మాణం చేసుకోవాలి. తనకు, తన కుటుంబానికి, తన సమాజానికి, తన దేశానికి తాను ఒక అద్భుతమైనటువంటి సంపదగా మారాలి అంటే దానికి దశ మాత్రం యవ్వన దశ. అందుకనే యువత is a cream of any society. మరి దశ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్లయితే సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక positive direction లో వెళుతుంది. సరైన విధానంలో మనం ఉపయోగించుకోకపోతే అది negative direction గా వెళుతుందని మనం ఇప్పుడు society లో బాగా గమనిస్తున్నాం. అవును అవును మరి సరిగ్గా వెళ్ళడానికి మనం చేయవలసిన తీసుకోవలసిన steps ఏంటి? జాగ్రత్తలు విధంగా ఉండాలి? అవి కొంచెం చెప్తారా? తప్పకుండా. అసలు ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో అదే రేడియో సాయి inauguration రోజున స్వామి కొన్ని points చెప్పారు. ఉమ్ అవును మళ్ళీ కొత్తగా ఏం వెతుక్కోక్కర్ల ఆయన చెప్పందంటే ఏం లేదు. ఉమ్ ఏం చెప్పారు? vision ఉండాలి, knowledge ఉండాలి, skill ఉండాలి. skill ఇవి స్వామి మాటలే అవును knowledge ఉండాలి. knowledge ఉంది నా దగ్గర కానీ ఎలా వాడుకోవాలో తెలీదు skill కావాలి. wisdom ఉంది జన్మతః నాకు తెలివితేటలున్నాయి కానీ ఎలా channel ache చేసుకోవాలి తెలియట్లేదు. అలాగే skill, wisdom, knowledge, vision-vision వీటన్నింటిని మించి కావాల్సింది tolerance. సహనం ఉండాలి. చూడండి రుతువు గాని, కాలం గాని దాని నిర్దిష్టమైన నిర్ణీతమైన సమయంలోనే పువ్వు పండు అవుతుంది, ముందు కాయ అవుతుంది. కాయ పండు కావటానికి కొంత time ఉంది. పండు ఎండటానికి కొంత time ఉంది. మనకు పువ్వు పుట్టగానే ఎండిపోయిన కాయో, పండిపోయిన కాయో కావాలంటే వస్తుందా? యవ్వనంలోనే ధనవంతుడిని అయిపోవాలి కోటీశ్వరుడిని అయిపోవాలి అంటే ప్రమాదం అంతా దాంట్లో నుంచి వచ్చింది. అంటే ఆలోచనలో ఉన్న అపరిపక్వతే వేళ సమాజానికి పట్టిన రుగ్మత. కాబట్టి మనకి మన దగ్గర అన్నీ ఉన్నాయి వాటిని సమన్వయం చేసుకోవాలి. వాటిని equalize చేసుకోవాలి. అందుకే మూడు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. Equanimity నేర్చుకోవాలి యువత. Equanimity సర్వసమభావం ఇందులో ఎవరూ గొప్పలే తక్కువ లేరు మనము అందరితో పాటు పెరుగుతున్న వాళ్ళం కదా ఒకటి. Equilibrium ఉండాలి. జీవితంలో ఒక్కోసారి అడుగు తడబడుతుంది. పడిపోయినట్టు కాదు దిద్దుకోవటానికి అవకాశం ఉందన్నమాట. ఉమ్ Equilibrium అంటే balance balance ఉమ్ మూడోది Equipoise ఉండాలి. దుఃఖం వచ్చింది తట్టుకోవాలి నిలబడాలి. ఇది ఊరికే చిన్న మేఘం లాగ వచ్చింది అదే పోతుంది అనుకున్నామా దుఃఖం తగ్గుతుంది. ఉమ్ ఇది ఇంతేనేమో ఇది పోదేమో దీన్నుంచి నాకు విముక్తి లేదేమో ఎక్కువవుతుంది దేవుడా నన్ను రక్షించు అంటే ఆయన కూడా ఇందాక అనుకున్నాం కాలానికి లోబడే ఆయన కూడా పని చేస్తాడు మనతో పాటే. అవును ఉమ్ కాబట్టి Equipoise, Equilibrium, Equanimity మూడు సమభావము, సమతుల్యత, సమస్థితి. మూడు ఎప్పుడైతే ఉన్నాయో there is no failure. అయితే యువత స్థాయిలో మీరు ఇప్పుడు చెప్పారు ఆలోచనలో పరిపక్వత, సమభావం తర్వత సమస్థితి ఇవన్నీ. ఉమ్ ముందుగా నిజానికి మనం కాలంలో యువతను గమనిస్తే కనుక వారి ఆలోచనలో ఒక అర్థం ఉండదు. అంటే అది మీరు చెప్పిన ఆలోచనలో పరిపక్వత అన్నదానికి ఇందుకు వస్తుంది. నిజానికి వాళ్ళు ఆలోచిస్తుంది correct కాదా? దాన్ని ఒక పద్ధతిలో ఉండడానికి అంటే ఆలోచనా పరిపక్వత చెందడానికి మనిషి ఎలా ప్రయత్నం చేయాలి? ఇప్పుడు సాయి ప్రసాద్ Old order changeth yielding place to new. మన తాతల కాలంనాటి పరిస్థితులు ఇవాళ ఉండాలి అంటే ఉండవు. ఉమ్ పరిస్థితులు మారినాయి. ఉమ్ ప్రపంచం తనకు తెలియకుండానే ఒక వేగం mode లో పెట్టుకుంది. ఉమ్ speed పెరిగింది. speed of thought పెరిగింది. ఉమ్ speed to implement పెరిగింది. మరి దీంట్లో ఏం చేయాలి? విద్యార్థులు మన సహచరులు మనతోనే ఉన్నారు. తల్లిదండ్రులు ఎలాగో ఉన్నారు. ఇల్లు ఎలాగో ఉంది. సమాజము, దేశం ఉండనే ఉంది. దాంట్లో అవి constant factors. దాంట్లో ఏం మార్పులే. మరి ఇవ్వేళ ఎందుకని ఇట్లా అవుతున్నది స్పష్టత లేదు, ఏం చేస్తున్నామో తెలియదంటానికి కారణం నాలుగు వ్యవస్థల మీద ఆధారపడ్డటువంటి యువకుడికి రావలసిన inputs రావటం లేదు. మా పిల్లవాడు తొందరగా ఏదో అయిపోవాలి, తొందరగా అందరినీ దాటుతూ వెళ్లిపోవాలి అని తల్లిదండ్రుల ఆశ. ఉమ్ అవునవును నా friend ని దాటి నేను ముందుకెళ్లిపోవాలి. వాడు నాకంటే ముందు దేశం వదిలిపెట్టి వెళ్ళాడు. ఉమ్ నేను అసలు దేశం వదిలిపెట్టానంటే రానే రాను. ఇటువంటి విపరీత ధోరణుల వల్ల, భావాల వల్ల Materialism మీద ధనాపేక్ష భౌతిక సుఖాల మీద ఒక స్పష్టత లేని కారణంగా డబ్బుంటే అన్నీ వస్తాయి అని. చూడండి జాగరాజ స్వామి వారు శాంతము లేక సౌఖ్యము లేక అని పాట పాడాడు. సౌఖ్యము అవును కీర్తన చేశాడు. మనం ఏమంటున్నాం అంటే సౌఖ్యము లేక శాంతమే లేదు పొమ్మంటున్నాం. [laughing] Just reverse అయింది. సౌఖ్యముండనివ్వండి. సౌఖ్యము ఆనందం కాదు కదా! సుఖం దాని పేరు. సుఖం వస్తువు ఇస్తున్నది. కనుక ఇది రావాలి అంటే మానవతా విలువలతో కూడిన విద్యని గనుక అభ్యసనం చేస్తే మనకు తెలియకుండానే మనం ఒక మంచి గ్రూప్ లో పడతాం. ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చే వారం తరువాతి భాగాన్ని వింటారు. సాయిరాం.
SSSMC · audio

Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 01

Home

Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 31:33

More in this series

Yuvatha — Importance of the Youthful Stage of Life

2 episodes · 1 hr 6 min

  1. 31 min 1

    Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 01

    Now playing
  2. 34 min 2

    Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 02