No transcript for this section.
కబీర్ తన జీవితంలో ఒకానొక సంఘటన జరిగింది. ప్రతిరోజూ కబీర్ యొక్క రామ నామాన్ని వినటానికి తన గురువు తన దగ్గరకు వచ్చేవాడు. ఒకరోజున మరొక వ్యక్తిని వెంబడి పెట్టుకొని వచ్చాడు. వస్తే కబీర్ మనస్సు ఒక్కసారి చెలించింది. ఎవరికి నమస్కరించాలి? రోజు వచ్చే నా గురువుకా? కాక ఈ గురువు పక్కన వచ్చిన అతిథిక అని. కానీ ఆయన అంటాడు, "గురు గోబిందు దొను ఖడే కాకే లాగు పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" అని. ఈ వచ్చిన వాడే భగవంతుడు అని వచ్చిన నా గురువే గురువు దేవుడి కంటే గొప్పవాడు అన్నాడు. అటువంటి ఆదిశంకర భగవత్పాదులు ఏం చేశారు? తత్వబోధ ఏమిటి? అసలు అద్వైతం శంకరుల వారితో ప్రారంభమైందా ప్రశ్న. అద్వైతం శంకరుల వారికంటే ముందే ఉన్నది. కొత్తదేం కాదది. కానీ ద్వైత భావనలో ప్రాపంచిక భావనలో మనిషి మనస్సు రెండుగా చీలినటువంటి వేళ, ఈ రెండూ కాకుండా పరస్పర విరుద్ధ భావజాలంతో ఉన్నటువంటి మానవుడు ఒక అద్వైత సిద్ధాంతాన్ని గనక ఆలంబనం చేసుకున్నట్లయితే, రెండంటూ లేవు ఉన్నది ఒకటే అనేటువంటి సప్రమాణికమైనటువంటి భావన గనక ఉన్నట్లయితే పెద్ద చికాకులు ఉండవు కనుక సాధన హాయిగా సాగుతుంది గనుక ఆ రకంగా శంకర భగవత్పాదులు అద్వైత ప్రతిపాదన చేశారు. అద్వైతం ఒక మతం కాదు. అద్వైతం ఒక సిద్ధి. అది ఒక ఆనంద సిద్ధి. అది ఒక అమృత బోధ. అది ఒక అచల బోధ. అది పరిపూర్ణమైనటువంటి ఆత్మబోధ. కనుకనే వివేక చూడామణి కానీ, మరొకటి గాని, మరొకటి గాని ఏది బోధి-బోధించినా దాని వెనక ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. విచిత్రమే! మనీషా పంచకం శంకర భగవత్పాదులు చెప్పినటువంటి వేళ, పై కథని గనక కథగా చూసినట్లయితే ఆశ్చర్యపోతాం. ఈయన మహా జ్ఞాని కదా! ఈయనకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా అని. ఒక్కసారి మహాభారతాన్ని గనక చూసినట్లయితే, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కౌరవుల వలన ఏర్పడిన అక్కడ తిన్న అన్నం వలన ఏర్పడిన రక్తమంతా కూడా కారి ఇంకిపోయింది. కేవలము అస్థిపంజర ప్రాయంగా ఉన్నటువంటి భీష్మ పితామహుడికి కేవలము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన మంగళ విగ్రహం కనిపిస్తూ ఉన్నది. ఆ సమయంలో విష్ణు సహస్ర నామాన్ని రణరంగంలో పాడుకున్నాడాయన. అది ఆదా-ఆత్మ గానము, హృదయ గానము. దానిని విన్న వారెవరో తెలుసునా? సాక్షాత్తు మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడే చేతులు కట్టుకొని అమిత శ్రద్ధగా విన్నటువంటి ఉత్తమ శ్రోత శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి సన్నివేశం ఏర్పడినప్పుడు కృష్ణుడు ఏం విన్నాడు అని? తనను గురించి తాను విన్నాడు. తాను అంటూ ప్రత్యేకంగా ఉన్నదా? విష్ణు సహస్రనామం నుండా విశ్వంతో ప్రారంభమై పరమాత్మతో ముగిసేటువంటి మహత్తరమైనటువంటి ఆ దివ్య గానం నుండా తనను తాను దర్శనం చేసుకున్నటువంటి వైనం. తనను తాను మరొక్కసారి చూసుకున్న వైనం. కనుకనే విష్ణు సహస్రనామ పారాయణంలో మనం విష్ణువుని దర్శనం చేయటం మాత్రమే కాదు, విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఆత్మ దర్శనానికి అభిముఖంగా మానవుడి యొక్క ప్రస్థానం కొనసాగాలి. అటువంటి సన్నివేశమే కృష్ణుడు వినటం ఏమిటి, భీష్ముడు పాడటం ఏమిటి అనుకోకూడదు. సన్నివేశాన్ని పరమాత్మ సృష్టిస్తాడు. గంగా నదిలో స్నానం చేసి శిష్య సమేతంగా వడ్డుకు వస్తున్నటువంటి భగవత్పాదులకి నాలుగు కుక్కలను వెంబడి పెట్టుకొని వస్తున్న ఒక చండాల రూపం కనిపించింది. కనిపించగానే ఈయన ఏమన్నారంటే, "తొలుగు తొలుగు" అన్నారు. దారి తప్పుకో నేను గుళ్లోకి వెళ్ళాలి. నువ్వు తప్పుకో అన్నారు. వచ్చిన వాడు తప్పుకోలేదు. ఏమన్నాడంటే, "నీ శరీరము అన్నమయంతో ప్రారంభమై ఆనందమయం దాకా వెళ్ళే పనులో ఉంది. అలాగే ఈ శరీరం కూడా అన్నంలో పుట్టి అన్నంలోనే పెరుగుతున్నది. నీకూ, నాకూ తేడా ఎక్కడ? భౌతికంగా చూస్తే ఏం తేడా లేదు మరి దేనిని తొలగమంటున్నావు? ఇక చైతన్యమా? నీలో ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నాయందు కూడా ఉన్నది గనుక మరి చైతన్యాన్ని తొలగమంటున్నావా? మా-దేహాన్ని తొలగమంటున్నావా? విచారణ చేసి చెప్పు" అన్నాడు. ఈ సన్నివేశం శంకర భగవత్పాదులకు బోధించినటువంటి సన్నివేశం కాదు. శంకర భగవత్పాదుల యొక్క అనల్ప కల్పనా చాతుర్యంతో ఏర్పడినటువంటి ఈ సన్నివేశంలో ఒక జ్ఞాని ఒక సన్నివేశం ద్వారా మనకి ఆత్మబోధ చేస్తాడు. నిజానికి అది మనకి బోధ. దేనిని తొలగాలి అని అడగాలంటే ఇక్కడ తొలగవలసింది ఏం లేదు. తొలగవలసింది మన దేహాత్మ భావనే తొలగాలి. నేను దేహము, నేను ఫలానా, నేను ఫలానా, నాకింత ఉన్నది, నేను మాత్రమే చేయగలను అన్న అహంకార మమకారాలు రెండూ గనక తొడిమ వీడినట్లయితే వాడు ఆత్మనిష్ఠ వైపు అడుగు వేస్తాడు. సాధనలో అది తొలి మెట్టు. అహంకార మమకారాలు నశించాలి. తల ఎత్తి చూశారు శంకర భగవత్పాదులు. ఈ బోధ చేయగలిగిన వాడు ఎవరై ఉంటాడు? సాక్షాత్తు పరమేశ్వరుడు తప్ప అని. చూద్దాము అనగానే అక్కడ కుక్కలు లేవు, వచ్చిన చండాల రూపము లేదు. శంకర భగవత్పాదులు పూర్ణ వినమ్ర మూర్తి. ఆయన ఏం చేశారో తెలుసునా? ఎక్కడ ఆ చండాలుడు నుంచున్నాడో ఆ పాదాన్ని, ఆ ప్రదేశాన్ని నుదురు తాకి ముద్దు పెట్టుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి రమణీయ సన్నివేశం శంకర భగవత్పాదుల జీవితంలో. అంటే ఏ మహాత్ముడు ఎక్కడ నిల్చున్నాడో ఆ పాదధూళి పరమ పవిత్రమైనటువంటి విభూతి. ఏ మహాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శాంతి, ఆనందము, మాధుర్యము, సద్వర్తన, సదాలోచనలు అన్నీ కూడా ఒక్కసారి ముప్పిరిగొని ఆనంద తారక స్థితికి జీవుణ్ణి చేరుస్తుంది గనుక ఆత్మబోధ ప్రకారమే శంకర భగవత్పాదులు ఆ మనీషా పంచకంలో మనీషా అంటే నిశ్చితమైన conviction. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు translation ఉండేది.ఇప్పుడు తెలుగులో మాట్లాడితే అర్థం కావాలంటే కాస్త English మాటలు చెప్పాలి. మనీష అంటే తిరుగులేని నిశ్చితమైన అభిప్రాయం. ఏమిటి ఆ మనీష అంటే "చండాలోస్తు ద్విజోస్తు" అన్నారాయన. చండాలుడు కానీ మరొకడు కానీ బ్రాహ్మణుడు కానీ ఎవరైనా సరే ఎవరి మనస్సు పరబ్రహ్మము నందు లగ్నమైయున్నదో అటువంటి వాడు నాకు గురు సమానుడు, గురువు. ఆ గురువుకి నేను నమస్కరిస్తున్నాను. ఇది ఐదు రకాల ప్రమాణం చేశారు శంకర భగవత్పాదులు. ఇది ఒక పాయ. శంకర భగవత్పాదులు పరిపూర్ణ పరివ్రాజక మహాసన్యాసి అంటే సమన్యాసి అని. సన్యాసి అంటే కాషాయం కట్టిన వాడు. మనస్సుని, దేహాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని అలాగే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలని సమన్యాసము ఎవరు చేయగలరో వాడు మాత్రమే సన్యాసి. ఇవాళ ప్రపంచంలో భగవానులు కొన్ని వేల మంది పుట్టారు. ఇంద్ర సరస్వతులు కొన్ని వేల మంది పుడుతూనే ఉన్నారు, రాసిస్తున్నారు. ప్రతి పీఠానికి ఒక సాంప్రదాయం ఉన్నది. శంకర భగవత్పాదుల పీఠాలు నాలుగే. ఆ నాలుగు పీఠాలలో శృంగేరి భారతీయ సాంప్రదాయం. కంచి ఇంద్ర సరస్వతీ సాంప్రదాయం. అవి మనం వాడుకోకూడదు. మనకు అర్హత లేదు. కానీ ప్రతి వాడు వాడేసుకుంటున్నాడు. ఇది ధర్మంలో జరిగేటువంటి కొంత అపచారం. అయితే దీని correction నెమ్మదిగా జరుగుతుంది. ఆ జరగటానికి వచ్చినటువంటి శంకర భగవత్పాదులు ఒక రోజున భిక్షాటనకు వెళ్లారు. భాగవతం చెప్పుకున్నటువంటి వేళ శుకుడు విషయాన్ని ఒక నిమిషం అనుకుందాం. శుకుడు ఏ గృహస్తు ఇంటికి వెళ్ళినా ఎంతసేపు ఉంటాడు అని. గోవు పొదుగు దగ్గర కూర్చొని గోపాలుడు పాలు పిండుతుంటే పొదుగు ఖాళీ-- అంటే పాలు పిండటం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆ శుక అవధూత-- శుక బ్రహ్మ, శుక మహర్షి మూడు స్థాయిలు. అటువంటి వాడు అంతః సమయం మాత్రమే గృహస్తు ఇంట్లో ఉండాలి. ఆ సమయం దాటి ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే ఒక మహాత్ముడ్ని కొన్ని క్షణాలు మనం భరించగలం గానీ కొన్ని గంటలు భరించలేం. మనకా శక్తి లేదు ఒకటి. రెండవది సాంసారిక కార్యకలాపాలకి ఆ మూర్తి అక్కడ అడ్డం అవుతుంది గనుక ఆయనే తనంతట తాను వైదొలగాలి రెండవది. నిజానికి ఒక స్థాయికి వెళ్ళినా మనస్సుకి చంచలత్వం ఉన్నది గనుక ఒక గృహస్తుతో గనుక ఒక సాధకుడి మనస్సు గనుక లగ్నమైన, లీనమైన, లయమైన, అన్వయమైన, అనుసంధానమైన జరిగే ప్రమాదం ఆ గృహస్తు యొక్క ఆలోచనలన్నీ సన్యాసికి transfer అవుతాయి. కాబట్టి సాధన కుంటుపడుతుంది గనుక శుకదేవుల వంటి వారు కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగలరు. అట్లాగే ఒక సన్యాసి అయినటువంటి వాడు తన శరీర పోషణార్థం ఇరవై నాలుగు గంటలలో కేవలం మూడు ముద్దలు మాత్రమే ఎత్తాలి. ఈ మూడు ముద్దలు ఏ ఇంటికి వెళ్ళినా మూడు సార్లు "భవతి భిక్షాం దేహి" అని అడగాలి. ఆ మూడు ముద్దలు అయిపోయిన తర్వాత నాల్గవ ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు. నాలుగవ ముద్దకు కూడా వీలు లేదు. కాబట్టి ఒక ఇంటి ముందు ఆగారాయన. జరిగిన ప్రమాదం ఏమిటంటే ఆ లోపల నుంచి ఒక ఇల్లాలు బయటకు వచ్చింది. ఆ ఇల్లాలు ఈయన అడిగినటువంటిది ఏదీ ఇవ్వటానికి ఆమె దగ్గర ఏమీ లేదు. అంతా ఇల్లు ఖాళీ. కానీ గూట్లో మా దగ్గర ఏం లేదు నువ్వెళ్ళిపో అంటే చాలా తేలిక. కానీ ఆమె ఏం చేసిందంటే ఎండిన ఒక ఉసిరిక్కాయ ఒక గూట్లో ఉంటే అది తీసుకొచ్చి తుడిచి "నాయనా! ఇది తప్ప మా ఇంట ఏదీ లేదు. ఇది కూడా ఎందుకు ఉంచుకున్నాము అంటే రేపు ఎట్లా గడుస్తుందో మాకు తెలియదు గనుక నేను నా భర్త దీనిని బుగ్గన పెట్టుకున్నట్లయితే ఒకరోజు గడుస్తుంది కదా అని పెట్టుకున్నాము" అన్నది. కరుణా తరంగితమైనటువంటి శంకర హృదయం ఒక్కసారి పల్లవించింది, ద్రవించింది. అణిమాది సిద్ధులు ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ప్రార్థించారు ఆయన. ఎవరిని? లక్ష్మీదేవిని. ద్రద్య దయానూ పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ న కించన విహంగ శిశోవిషన్నే. దుష్కర్మమపలీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంభువాహః. అమ్మా! ఎప్పుడూ నీళ్ళల్లో ఉండేటువంటి నీకు ఈ బీద ఇల్లాలి కన్నీళ్లు తెలియలేదా? శంకర భగవత్పాదులు ఏం చెప్పినా poetic గా అడుగుతారు. ఒక భావావేశం, హృదయంగమమైనటువంటి ఒక సంస్కారవంతమైన భాష, ఒక గంభీరమైన, గభీరమైన, విస్తృతమైన, అచ్చమైనటువంటి ఒక భావావేశంలో మాత్రమే అమ్మవారిని ఉపాసన చేశారు. ధ్యానించగానే ఆ బీద ఇల్లాలు వెనుదిరిగి లోపలికి వెళ్ళగానే ఇంటి నిండా ఏమున్నాయి అంటే బంగారపు ఉసిరికాయలు కొన్ని టన్నులు టన్నులు దాని నిండా ఉన్నాయి. అందుకనే ఇబ్బందిలో ఉన్నవాడు, డబ్బు చేతికి రానివాడు ఏం చేయాలి అంటే లక్ష్మీ స్తోత్రము లేదా కనకధారా స్తవాన్ని చదువుకోండి అన్నారు. కనకధారా స్తవం అంతా నోటికొచ్చినా రాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఒకటి చదువుకున్నట్లయితే అన్ని టన్నుల డబ్బు రాదు గానీ డొక్క నిండే డబ్బు మాత్రం వస్తుంది. ఇబ్బందేం లేదు. రోజూ అనుకున్నామనుకోండి అమ్మా ఇక చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా అని. అన్నమైతే చాలు అంటాడు గానీ డబ్బు చాలు అనేవాడు లేడు గనుక అమ్మవారు కూడా మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఎక్కువ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనం చెడిపోతాం. తక్కువిచ్చామనుకోండి నిరసించిపోతాం. పరమ కరుణా దయా స్వరూపిణి అయినటువంటి తల్లి తన బిడ్డకు ఏ సమయాన ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూనే ఉంటుంది. అడిగినా అడక్కపోయినా. అడిగితే తొందరగా వస్తుంది, అడక్కపోతే నెమ్మదిగా వస్తుంది.మనకన్నీ తొందరగా రావాలి కాబట్టి అడగటం నేర్చుకోవాలి. కనకధారాస్తవాన్ని కలియుగ మానవుడి కోసం అందించారు శంకర భగవత్పాదులు. అలాగే తమ జీవయాత్రలో సాగుతూ సాగుతూ వెళుతుండగా ఎనభై ఐదు తొంభై ఏళ్ళ వయస్సు వచ్చిన వాడు చెట్టు కింద కూర్చొని వ్యాకరణాన్ని వల్లెవేస్తున్నాడు. శంకర భగవత్పాదులు శిష్య సమేతంగా వస్తున్నారు. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూడగానే ఒక్కసారి ఒక వైరాగ్య వీచిక, భావన తగిలింది మనస్సుకి. ఈ ముదుసలి, పండు ముదుసలి ఎండిపోయే స్థితిలో ఉన్నాడే ఇంకా ఏం నేర్చుకుంటున్నాడు? ఏం వల్లెవేస్తున్నాడు? ఏమి ఆశించి నేర్చుకుంటున్నాడు? అంటూ వెళ్ళి ఆయన అడిగారు ఏం నేర్చుకుంటున్నావు అని. అన్నీ వదిలిపెట్టిన వాడివి నీకెందుకయ్యా వైద్యులకి వెళ్ళిపో నన్ను disturb చేయొద్దు అన్నాడాయన. కాదు, ఏమిటి చదువుతున్నావ్ అంటే వ్యాకరణం నేర్చుకొని తత్వశాస్త్రాన్ని మధనం చేసి శాస్త్రాలన్నింటి మీద అధికారాన్ని సంపాదించి శాస్త్రాల ద్వారా పరమాత్మను నేను చూడాలని అనుకుంటున్నాను. ఇది వయస్సా? తొంభై ఏళ్ళ వయస్సున్నవాడు. అప్పుడు కరుణాపూర్ణ శుభాబ్ది అయినటువంటి శంకర భగవత్పాదులు ఇది నీ వల్ల కాదు అనలేదు కానీ ప్రపంచానికి ఒక అత్యద్భుతమైనటువంటి పన్నెండు శ్లోకాలలో ఈనాటికే కాదు రాబోయే రెండు వేల సంవత్సరాల వరకు కూడా విశ్వజనీనమైన సార్వకాలికమైన సమాజ పరమైన మనో తంత్ర యంత్ర శాస్త్రం అయినటువంటి భజగోవిందాన్ని ఉపాసన చేయమన్నారు. భజగోవిందం అంటే గోవిందుణ్ణి భజ-భజన చేయమని కాదు. భజ గోవిందం అంటే గోవింద స్వరూపంలో ఉన్న నారాయణుడని మాత్రమే కాదు, భజ స్మరిస్తూ ఉండవయ్యా. గోవిందం, గో అంటే జ్ఞానం. కనుక జ్ఞానము చేత పాలింపబడితే గోపాలకులు, జ్ఞానాన్ని గురించి పాడితే గోపికలు, జ్ఞానము చేత విందు చేస్తే గోవిందుడు. ఇవన్నీ గోపాల శబ్దం ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధం. మన మూలాలు కూడా గోలోకానికి సంబంధించినవి. స్వామి సత్యసాయిబాబా వారు ఒక ఉపన్యాసం లో ఒక మాటన్నారు. అసలు గోలోక వాసులే పాపం భూలోకం మీద ప్రీతి కలిగి వచ్చారు గాని మా లోకంలో పడిపోయారేమి అన్నారు. అది మా లోకం అంటే మాయా లోకం. వస్తువుల కోసం మాత్రమే జీవించే స్థాయికి ఎందుకు వచ్చారు అని ఒక ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అటువంటి ప్రకటనే శంకర భగవత్పాదులు భజగోవింద అని చెప్తూ గోవింద నామస్మరణం చెయ్, భగవన్నామస్మరణ చెయ్, అనునిత్యము కూడా నేను ఎందుకు వచ్చానన్న ఒక ప్రశ్న వేసుకో, నా జీవితానికి పరమార్థం ఏమిటి విచారణ చెయ్, ఇవన్నీ కూడా భజగోవిందంలో పన్నెండు శ్లోకాలే. అందుకనే దానికి రెండు పేర్లున్నాయి. ఒకటి మొహముద్గర, రెండవది ద్వాదశ మంజరిక స్తోత్రం. అంటే పన్నెండే. మరి ముప్పై చెప్తారే అంటే గురువుగారు రాసినవి చూసి శిష్యులకి ఆనందం కలిగింది. గురువుగారి లాగా రాద్దామని ప్రయత్నం చేశారు. అచ్చం గురువుగారు ఎలా రాశారో అలా రాశారు. కాకపోతే ఈ ముప్పై లో మొదటి పన్నెండు మినహా ఇస్తే మిగతాంతా ఏమున్నదయ్యా అంటే మొదటి పన్నెండు లో ఏమున్నాయో అవి మళ్ళీ పునః చెప్తూ వచ్చారు. కొత్తది ఏం చెప్పలేదు వాళ్ళు. అయినా మీరు నాకంటే ఏం చెప్పగలరు అని ఆయన అనలేదు. అనకుండా ఎంత బాగా చెప్పారని పరిష్కారం చేశారు. పరిష్కారం చేసి దానిని మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలుగా భారతదేశానికి అందించారు శంకర భగవత్పాదులు. అలాగే మనం అనుకుంటాం I am very close to భగవాన్. నన్ను మించిన వాడు లేడు. నేను proximity ని నేను అనుభవించాను అనుకుంటాడు. వేదం ఒక మాట అన్నది, దూరాత్ దూరాత్ అంతికీచ. దూరం దూరం అనుకుంటున్నావే వాడు దూరంగా లేడయ్యా, నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. వాడు గమనించాడు, నువ్వు గమనించుకోలేదు అంతే తేడా. సత్యసాయిబాబా వారిని ఇదే సందర్భంలో ఒక మాట అడిగితే స్వామి ఏమన్నారంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నారే కనపడ్డ గురువునల్ల నయనాంజన రేఖ వలె ఉన్నాడు బంగారు అన్నారు స్వామి మాట ఇది. నయనాంజన రేఖ అంటే కంటి గుడ్డుకి కనురెప్పకి కాటుక ఎంత దగ్గరగా ఉన్నదో అంత దగ్గరగా పరమాత్మ ఉన్నాడు. కానీ చూడాలి అంటే ఏం చేయాలి? కన్ను తెరిచినా కనపడదు, కన్ను మూసినా కనపడదు. మరి ఏం చేయాలి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అదే దక్షిణామూర్తి స్తోత్రం. శంకర భగవత్పాదులు ప్రపంచాన్ని ప్రకృతిని పరబ్రహ్మ తత్వంగా ఉపాసన చెయ్. ప్రకృతి పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా విలాసానికి ఒక అభిజ్ఞ, ఒక గుర్తు, ఒక సంకేతం, ఒక ప్రమాణం. ఇది ఒక అద్దంలో బొమ్మ. బొమ్మ ఉన్నది గనుకనే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తున్నది. బొమ్మ లేదా? అర్ధ శ్లోకంలో చెప్పారు శంకర భగవత్పాదులు జగత్తు మిధ్యా. సత్యమే శాశ్వతం. బ్రహ్మే సత్యం. ఈ జగత్తు మిధ్యా. అంటే నిరీశ్వరవాదులు, బౌద్ధులు చేసిన వ్యాఖ్యానం ఏంటంటే శంకర భగవత్పాదులు ఈ కనిపిస్తున్న ప్రపంచాన్ని కాదంటారేమిటి అని. కాదనలేదు. ఎండమావి కనిపిస్తున్నది, నీరున్నదా? లేదే. నేతి బీరకాయ ఉన్నది, నెయ్యి ఉన్నదా? లేదే. అట్లాగే ఈ ప్రపంచం ప్రకృతి పరమేశ్వరుడి యొక్క విలాసంగా, హేలగా, లీలగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అది అద్దంలో బొమ్మ వలే ఉన్నది.అద్దం తొలగించిన బొమ్మ వైదొలగినా ప్రతిబింబం ఏర్పడినట్లుగా జీవుడు తనలో ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని ఆంతరంగిక ప్రపంచాన్ని తన దేహంతో ప్రారంభించి ఈ ఏడు శరీరాలు దాటి స్థూలమైన మూలమైన ప్రాకృతమైన ప్రాథమికమైన అంచమైన నిత్యమైన సత్యమైన శాశ్వతమైన ఆత్మానుభూతిని పొందాలి అని చెప్తూ దక్షిణామూర్తి స్తోత్రం రాశారు దానికి దశశ్లోకి అని పేరు అంటే పది శ్లోకాలు పది శ్లోకాలలో చిట్టచివరిది ఇది చదివితే ఏం లాభం అని చెప్పారు కాబట్టి అక్కరకొచ్చేవి తొమ్మిది శ్లోకాలు తొమ్మిది శ్లోకాలలో నాలుగు పాదాలలో చిట్టచివరి పాదం తస్మై శ్రీ గురుమూర్తయే నవ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే అంటే తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు లైన్లలో ఈ సర్వ ప్రపంచము బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్పారు అది శంకర భగవత్పాదులైతే ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు ఒక మాట చెప్పారు చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ ఇది అద్వైతం ఈ కనిపిస్తున్న చుక్కలు చంద్రుడు సూర్యుడు నదీనదాలు కొండలు కోనలు వాగులు వంకలు మిట్టలు గుట్టలు పిట్టలు అన్నీ కూడా బ్రహ్మమే తప్ప అన్యం కాదు అన్నటువంటి ఒక దివ్య భావనాకృతిని ఈ జగత్తుకి తొట్టతొలిగా అందించినటువంటి వారు శంకర భగవత్పాదులు ఎప్పుడైనా సరే ఒక గురు స్వరూపాన్ని మరొక స్వరూపంతో పోల్చుకోకపోతే ఈ గురు స్వరూపం యొక్క పూర్ణత్వం అర్థం కాదు గనుక శంకర భగవత్పాదుల భజగోవిందం ఇవాళ personality unfoldment మీద కొన్ని కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క యువకుడు బాగుపడ్డ సందర్భం మనకు లేదు అవుతున్నాయ్ అంతే కానీ భజగోవిందంలో ఉన్న మౌలిక సూత్రాలను గనక గమనించినట్లయితే మానవుడు ఉన్న స్థితి నుంచి మహోన్నత స్థితికి ఎలా వెళ్ళవచ్చునో ఎంత వైరాగ్య భూమికలో జీవించవచ్చునో ఏది ఎంత అశాశ్వతమని మనకు అర్థమవుతుందో ఇదంతా కూడా ఒక విభూతిమయంగా మనకు బోధ చేశారు శంకర భగవత్పాదులు వీటన్నింటిని పక్కనబెట్టి ఒక ఎత్తు కాగా ప్రబోధసుధాకరము అని ఒకటి రాశారు ఆయన దాని పేరు ఆయన కృష్ణానంద లహరి అన్నారు శ్రీ శంకర భగవత్పాదుల కులదైవం ఎవరో తెలుసునా శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడి కులదైవం ఎవరో తెలుసునా సూర్యుడు కాదు శ్రీరంగనాథుడు బొమ్మెర పోతనామాత్యుడు ఎవరిని ఉపాసన చేశాడో తెలుసునా శివుణ్ణి దర్శనం ఎవరిది అయింది రామదర్శనం అయింది శివోపాసన చేసి రామదర్శనాన్ని పొంది రాసిన కథ కృష్ణుడి కథ రాశాడు ఇది అద్వైతం శివుడి కథ ఎక్కడ రాయలే ఆయన రాసింది మనకు భాగవతాన్ని అందించాడు కాబట్టి మనస్సు గీసుకున్నటువంటి బొమ్మలన్నీ దాటి రూప నామ భావాలను దాటి ఎవరు తత్వార్థ విచారణలోకి వెళ్లగలుగుతారో వాడు జీవన్ముక్తుడై ఇక్కడ జీవిస్తాడు అని అర్థం ఈ తత్వార్థ విచారణకి ప్రబోధసుధాకరంలో శంకర భగవత్పాదులు ధ్యానాన్ని యోగాన్ని అనేకమైనటువంటి స్థాయిలని ఒక స్థాయికి చెందిన వారందరికీ కూడా బోధిస్తూ ఒక మాట అంటారు శ్రీకృష్ణ స్వరూపాన్ని గోపగోపికా బృందాలతో ఆడుతున్నటువంటి యమునాతటీ విహారి అయినటువంటి ఆనంద గోపాలున్ని భ్రూమధ్యంలో నిలుపుకో అంటే ఆజ్ఞాచక్రం దగ్గర నిలుపుకొని ఒక్కసారి నీతో నీవు నిలకడ చెంది ఉండు నీవు కృష్ణుడు అయిపోతావ్ ఏ కోదండాన్ని ధరించిన శ్రీరామభద్రుడిని హృదయం మీద పెట్టుకొని ధ్యానిస్తావో ఎక్కడ నీవు నిలకడ చెంది ఉంటావో కొన్ని నిమిషమాత్రమైన విశేషం చేత నీవు రామచంద్రుడివి అవుతావు ఎట్లాగో తెలుసునా కేవలము ఒక కంటి చూపు ద్వారా ఒక చేప తన గుడ్లను ఎట్లా పొదిగి పిల్లలను చేయగలుగుతున్నదో పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం నీ మీద పడ్డప్పుడు ఆ అనుగ్రహమే విభూతియై బోధయై ఉపదేశమై సందేశమై ఆదేశమై నిన్ను సంవిద్ అనేటువంటి మహోన్నతమైన ఆత్మ స్థాయికి తీసుకు వెళుతుంది గనుక అటువంటి స్థాయిని ఈ జీవితం ఉండగానే నీవు గమనించుకో సాధించుకో ఇక్కడ ఏమీ లేదనుకోకు ఓ డిగ్రీ రావటం ఓ ఉద్యోగం సంపాదించటం ఓ పదవి పొందటం ఏం చేయాలని అటు ఇటు గందరగోళం పడిపోవటం మానవ జీవితం అందుకు కాదు అన్ని శబ్దాలు పుట్ట నిశబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం నారాయణుడిని అన్వేషించాలి ఈ నారాయణ ప్రబోధాన్ని గనక మనం జాగ్రత్తగా కర్మ భక్తి జ్ఞాన యోగాలను గనక సమన్వయం చేసుకోగలిగినట్లయితే యోగ స్థితిలో ఆత్మవిద్యని సమన్వయం చేసుకోగలిగినట్లయితే అది పరిపూర్ణమైన బ్రహ్మవిద్య అది అక్ష తెలివి అది ఆనంద తారక స్థితి దాన్నే స్థూలంగా శంకర భగవత్పాదులు బోధించారు అయితే ఇవన్నీ ఎవరో చాలా పండితులు చాలా పెద్దవాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం చూస్తే తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి చెప్పమన్నారు ఫలానా చేయమంటే ఇంకో పండితుడికి చెప్పమన్నారు అయ్యా మాకేం మాటలేం రావు మాకు వ్యాకరణం రాదు స్వచ్ఛమైన భాషే లేదు నిన్ను ఎలా కీర్తించను అన్న వారి కోసం పరదేవతా స్వరూపాల స్తుతి గీతాల మాలికను అందించారు భగవత్పాదులు నువ్వు ఏ ఏ రూపాన్ని నీవు దర్శనం చేయాలన్నా ఉపాసన చేయాలన్నా ఒక్కొక్క దైవతం మీద ఒక్కొక్క స్తోత్ర రత్నావళి ఆయన ఆవిష్కరించారు సుమారుగా రెండు వందల యాభై ఒక్క ప్రకరణ గ్రంథాలలో ఆయన సాగించినటువంటి గురుబోధ ఏమిటి తత్వబోధ ఏమిటి గురువుగా ఆయన చేసినదేమిటిమనిషిలో ఉన్న మాలిన్యాన్ని వదలిచ్చి, జాజ్యాన్ని వదిలిపెట్టి మాంజియాన్ని వదిలిపెట్టి అంటే మనలో ఉండేటువంటి అలసత్వాన్ని procrastination రేపు చేద్దాం అనే భావన కుదరదన్నారు భగవత్పాదులు. రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. నువ్వు ఉన్నది ఇవ్వాలే. దానినే సత్యసాయి భగవానుడు ఒక మాట అన్నారు "రేపుకు రూపం లేదు బంగారు, ఇప్పుడున్నదే మంది". పట్టుకున్నదే కొమ్మ, నీవు పట్టుకున్నదే నీ కొమ్మ. మిగతా చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉన్నా అన్నీ ఎవరివో, ఎవరెవరివో, ఎవరేం పట్టుకుంటారో తెలియదు. నీవు దేనిని పట్టుకున్నావో, ఏ గురు స్వరూపాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావో ఆ ఒక్క గురు స్వరూపం నీ జీవితాన్ని ఉద్ధరించలేదా? నీకు మార్గాన్ని చూపించలేదా? అట్లాగే సర్వ ప్రపంచంలో ఉన్న గురు స్వరూపాల జోలికి మాత్రం వెళ్ళకు. All gurus are one. ఆనంద పడిపోతాం. స్వామి ఎప్పుడు చెప్పినా మొదటి వాక్యం statement, రెండో వాక్యం హెచ్చరిక. comma పెట్టి But all are not gurus అన్నారు. అందరూ గురు స్థానానికి చేరలేరు. గురువు అంటే జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు. మన కాల పరిమితిని చెప్పేవాడు, ఎందుకు వచ్చామో చెప్పేవాడు, ఏం చేయాలో చెప్పేవాడు, ఎట్లా చేస్తే ఏం దొరుకుతుందో చెప్పేవాడు, ఏం దొరికితే ఈ జీవితం ఒక సాఫల్యాన్ని పొందుతుందో అది చెప్పేవాడే కారణ గురువు గనుక అటువంటి ఆ గురుబోధలో అద్వైత బోధ ప్రధానంగా ఇప్పుడు వివేక చూడామణి ఒక ఎనిమిది వందల పేజీలు ఉంది. చదివే ఓపిక లేదు ఎవరికీ. చదివినా అది గహనమైన విషయం కాదు, అర్థం కాదు అంత తేలిగ్గా. స్థలీపులాకంగా ఒక్క నిమిషం చెప్తాను. మూడు ఆనందాలు ప్రకటించారు వివేక చూడామణిలో. ఐహికానందము, ఆముష్మికానందము, కైవల్యానందము. ఐహికానందం అంటే మనమేదో మంచి పనులు చేస్తాం, మంచివాడిని అనిపించుకుంటాం, తదనుగుణమైన జీవితాన్ని గడుపుతాం. ఆనందం దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది. మనము, మన సంసారం, మన భార్య, పిల్లలు, మన బంధువులు అందరూ హాయిగా ఉంటారు. కానీ నువ్వు జన్మ ఎత్తాలి. ఎందుకనంటే అది మాత్రమే జీవిత పరమార్థం కాదు గనుక. నెమ్మదిగా యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, దానాలు చేశాను, త్యాగాలు చేశాను, యోగాలు చేశాను, చేశాను, చేశాను. మంచిదే ఆముష్మికానందం లభించి ఇన్ని మంచి పనులు చేశావు గనుక మరొక జన్మ ఎత్తాలి. ఎందుకు? దాని ఫలితాన్ని అనుభవించాలి గనుక. కైవల్యానందాన్ని అనుభవించాలి అంటే మానవుడు మళ్ళీ పునరావృత్తి రహితమైన, అంటే ఆవృత్తి పూర్ణమై మళ్ళీ జన్మ లేని స్థాయికి వెళ్ళాలి అంటే ఇవన్నీ చేయవలసిందే కానీ కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. దీనికోసం చేస్తున్నాను, దానికోసం చేస్తున్నాను, సత్యనారాయణ వ్రతంలో ఈ ఫలితం ఉందని ఎవడో చెప్పాడు, నేను చేశాను. ఆయన్ని చూస్తే ఏదో దొరుకుతుందన్నారు, నేను వెళ్ళాను. ఇది కాదు. కేవలము మనల్ని మనం చూసుకోవటానికి, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ లో వెలుగుని గమనించుకోవటానికి, ఆ వెలుగులో ప్రయాణం చేయటానికి కారణమైనటువంటి ఆ కైవల్య ఆనందాన్ని పొందాలి. కైవల్యం అంటే ఏమిటి అన్నారు. కైవల్యం మీద ఒక వెయ్యి పేజీల పుస్తకాలున్నాయి. సత్యసాయి భగవానుడు ఒక మాట చెప్పారు. "ఎక్కడ వైకల్యం లేదో అది కైవల్యం బంగారం" అన్నారు. ఒక్కటే మాట. ఎంత అందమైన మాటో చూడండి! వైకల్యం ఎక్కడున్నది? మన ఆలోచనలో, మన సంకల్పాలలో, మన బుద్ధిలో, మనం ఊహించే దానిలో, మనం చూసే దానిలో, చేసే దానిలో అంతా వైకల్యమే గనుక, అంతా అపరం గానే ఉన్నది గనుక, పరం లభించటం లేదు. ఆ వైకల్యాన్ని గనుక కైవల్యం గనుక చేసుకోగలిగినట్లయితే, నీవైపు తిప్పి గనుక camera click చేస్తే నీ photo వస్తుంది, ఇంకోడి photo వస్తుంది. నీవైపు తిప్పి గనుక click చేస్తే నీ photo నీకు వస్తుంది. ప్రపంచం యొక్క photos తీయటంలో gallery నిండిపోయింది. నీ photo నువ్వు ఎప్పుడన్నా తీసుకున్నావా? అన్నారు బాబా. ఎంత అందమైన మాట! మామూలు ఈరోజు, ఈ కాలానికి తగినటువంటి భాష ఇది. ప్రపంచం photos తీయటంలో we are experts but we don't know how to take our own photo. దాన్ని తీయటానికి ఎవడో కావాలి. కాబట్టి ఆత్మవిచార మార్గం ఇంత సులభము అని చెప్తూ శంకర భగవత్పాదులు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైన అసమానతలన్నీ తొలగించి కుల, మత, వర్గ, వర్ణమైనటువంటి గుణాలు దాటినటువంటి ఒక సమృద్ధమైన అధ్యాత్మ జాతిని నిర్మాణం చేశారు. ఎలా చేశారు? ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ కన్యాకుమారి, ఎలా వెళ్లారు అని. ఖేచరీ విద్యని ఆశ్రయించి, కాలినడకన కొన్నిసార్లు, సంకల్ప మాత్రంతో కొన్నిసార్లు, అవసరాన్ని బట్టి timeని spaceని దాటుకుంటూ ఎక్కడెక్కడ తన అవసరము ధర్మ ప్రతిష్ఠాపన కోసం ఉన్నదో అక్కడిదాకా ఆయన నిస్వార్థంగా వెళ్లారు. కనుకనే మీకు శ్రీచక్రము లేనటువంటి శంకర భగవత్పాదులు ప్రతిష్టించిన శ్రీచక్రం లేని దేవాలయాలు లేవు. అలాగే శంకరులు ప్రతిష్ఠాపన చేసిన శ్రీచక్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ దేవాలయాలలో కుబేరుడు, ఇంద్రుడు, లలితాదేవి తదాదిగా కలిగినటువంటి దేవీదేవతా స్వరూపాలు శక్తి స్వరూపంగా అక్కడ ఉంటాయి. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా, దేవాలయంలో కూడా శ్రీ వేంకటేశ్వరుడి యొక్క గర్భాలయంలో శంకర భగవత్పాదులు ప్రతిష్ట చేసినటువంటి శ్రీచక్రము అక్కడ ఉన్నది. ఆ చక్ర ప్రభావం ఏమిటంటే మన దగ్గర ఉన్న డబ్బంతా అటు వెళ్ళిపోతుంటుంది. ఎందుకు తీసుకుంటాడయ్యా ఆయనకి డబ్బు, ఏం చేసుకుంటాడు ఆయన అంటే మా-మహావిష్ణువు భాగవతంలో ప్రమాణం చేశాడు. "నిజమైనటువంటి ఒక భక్తుడు నాకు ఎవడు అని నేను నిర్ణయించిన వేళ". మనం నిర్ణ-- "I am a devotee of భగవాన్ బాబా" అని నేను చెప్పుకుంటున్నా కదా, ఆయన అన్నారా అని. ఆయనేం అనలేదే. కానీ మనం అనుకుంటున్నాం. అయితే బాగుండునో, అయినావనో మనం అనుకున్నాం తప్ప "He is my devotee" అని ఎవరినీ ఆయన పేరెత్తి చెప్పలా. అలాగే ఈ పరమాత్మ కూడా ఒక విచారధారులు, విచారణ గనుక చేసినట్లయితే, ఈ ఎవరి దగ్గర సంపద ఉన్నదో ముందు ఆ సంపదను నేను హరిస్తానన్నాడు.భాగవతం చదివే వాడు ఎవడైనా ఒక్కడు ఉన్నాడా ఇప్పుడు? ఉండడు. భాగవతం చదివితే డబ్బు వస్తుంది అంటే భాగవతం చదువుతాం గానీ ఉన్న డబ్బు పోతుంది అంటే చదివేవాడు లేడు. అంటే ఆయన అన్నమాట ఏమిటంటే, దాని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే సిరి గనక నా దగ్గరకు వస్తే హరి నీవాడవుతాడు అని. హరితో కూడిన సిరి నీ దగ్గర ఉన్నదా అని జోలికి రాను. హరి లేని సిరి నీ దగ్గర ఉన్నదా నువ్వు నాకు అక్కర్లేదు. నిజంగానే నిన్ను నేను భక్తుడిగా స్వీకరించాలని అనుకున్నట్లయితే ముందు ఏది అడ్డు? డబ్బే అడ్డు. దాన్ని తొలగిస్తా. రెండవది, ప్రాపంచికమైన అనేకమైనటువంటి నిష్టూరాలు, కష్టాలు నేను ఇస్తా. వరాలేమి ఇవ్వను. శాపాలు ఇవ్వను. అనేక కష్టాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు కూడా నేను interfere కాను. ఎందుకని అంటే, నీ కర్మ నీవు అనుభవించాలి. నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తినాలి. నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి. నీకేం కావాలంటే నువ్వే ఎలాగో పొందుతున్నావో అట్లాగే "ఉద్ధరేదాత్మనత్మానం". నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నేను మాత్రం ఉద్ధరించే మార్గం చెప్తా. ఏ మార్గంలో వెళితే నువ్వు ఆ destination కి వెళ్లగలవో అది చెప్తా. కానీ నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ మాత్రం కూర్చోబెట్టడం అది నా పని కాదు. కనుక భాగవతం గానీ, ఓ గురువు గానీ, ఓ కృష్ణుడు గానీ ఎవరైనా సరే నిజంగా మనల్ని భక్తులుగా గనుక అంగీకరించినట్లయితే ఆ గురు స్వరూపాలు చేసే మొట్టమొదటి పని మన సిరి హరణం చేస్తారు. డబ్బు ఎప్పుడైతే లేదో-- డబ్బుంటే అది కొందాం, ఇది కొందాం, ఇది పెంచుదాం, ఇది పంచుదాం ఇవన్నీ ఉంటాయి. డబ్బే లేదు. రామదాసు ఏం చేశాడు జైల్లో? రామనామం చేసుకున్నాడు. డబ్బు ఎప్పుడైతే లేదో, సిరి ఎప్పుడు తొలగిందో హరి మిగులుతాడు. హరిని మిగుల్చుకున్నవాడు మాత్రమే హరిభక్తుడవుతాడు. హరి యందు భక్తి ఉన్నవాడు మాత్రమే కర్మ క్షేత్రంలోకి వస్తాడు. అటువంటి కర్మని కర్మ యోగం చేసుకుంటాడు. మనస్సు శుద్ధీకరణ జరిగింది గనుక భక్తి యోగంలోకి వస్తాడు. ఆ భక్తిని ప్రేమగా మార్చుకుంటాడు. జ్ఞానైక స్వరూపంగా ఈ జగత్తు చేత జ్ఞాన స్వరూపం అంటే వీరే అనిపించుకుంటాడు. శాస్త్రాలు, పాండిత్యం, కవిత్వం, oratorial skills ఇవన్నీ జ్ఞానానికి గుర్తు కావు. అవి కేవలం విజ్ఞాన భూమిక వరకు మాత్రమే. మరి అసలు జ్ఞాన భూమికలో ఏమున్నదయ్యా? అసలేం లేదు అక్కడ. ఏదన్నా ఉన్నది అంటే అది జ్ఞాన భూమిక కంటే కింద ఉన్నది. మరి జ్ఞాని ఏం చేస్తాడు? perfect గా చేస్తాడు. మీరు మనం చెప్పుకోబోతున్న శంకర భగవత్పాదులతో సహా ఇవాళ మొదలుపెట్టి వీళ్ళ జీవితాలన్నీ జాగ్రత్తగా చరిత్రలు, అవతార వైభవాన్ని గమనించినట్లయితే వాళ్ళ కార్యకలాపాలన్నీ perfect గా ఉంటాయి. ఎందుకు perfect గా ఉంటాయి అంటే స్వార్థం లేదు గనుక perfect గా ఉంటాయి. వాళ్ళ సంకల్పాలు అనుకుంటుండంగానే పని అయిపోతుంది. ఎందుకవుతుంది? వాళ్ళకేం అక్కర్లేదు గనుక అవుతుంది. మన సంకల్పాలు ఎందుకు కావు అంటే మనకే కావాలి గనుక అవి కావు. అందరికీ చెందాలన్న భావన, ఆ విశాల విస్తృత భావన, నిస్వార్థ భావన ఎవరి యందు ఉంటుందో వారి యందు పరమాత్మ యొక్క దైవ ప్రజ్ఞ కూర్చొని దైవము తన కార్యకలాపాలను ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచంలో సాగిస్తాడు.
SSSMC · audio
Talk on Adi Shankara - 02
Talk on Adi Shankara - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 33:35
More in this series