Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార్వ సర్వస్వం మందస్మిత మనోహరం [గాలి] వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశద్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భారతీయ గురుతత్వంలో నిన్న శంకర భగవత్పాదుల విచారణ పూర్ణమయ్యింది స్థాలిపులాక న్యాయంగా శంకర భగవత్పాదుల కంటే ముందు వేదవ్యాసుల వారు వారికంటే ముందు వాల్మీకి వేదవ్యాసుల వారి సమకాలీనమైన యోగీశ్వర కృష్ణుడు వారు కూడా తొలి లోకగురువులు గనుక వారికి అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఈరోజున అతి వరిష్ఠమైన విశిష్టమైనటువంటి ఒక మహా చైత్య పురుషుని గురించిన విచారణ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం ఎవరైనా దక్షిణామూర్తి శంకర భగవత్పాదుల దక్షిణామూర్తి స్తోత్రం అంతా రాస్తూ చివర్లో అసలు దక్షిణామూర్తి ఎక్కడున్నాడు అన్నారు దక్షిణము అమూర్తం కావాలి అన్నారు బొమ్మని ప్రతిమా ఈశ్వరః అన్న ప్రామాణికమైన మాటను తీసుకుని బొమ్మని ఆధారం చేసుకుంటూ సగుణోపాసనలో ఉంటూ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఆంతరంగికంగా అనుభవించాలి అని శంకర భగవత్పాదుల ప్రబోధం ప్రబోధం సరే దాన్ని అందుకోవటం ఎట్లా? ఎవరో రావాలి అనంత కాల మహా ప్రవాహంలో శంకర భగవత్పాదుల అవనీ సంచారం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు తాము కార్య నిమిత్తమై ఇక్కడికి వచ్చారో దాన్ని పూర్ణం చేసిన మరుక్షణమే తమ శరీరాన్ని పరిత్యాగం చేశారు భగవత్పాదులు కానీ కాలం జీవుడి కోసము ఆగదు దేవుడి కోసము ఆగదు కాలానికి పరదైవతం అవసరమో పరదైవతం ఒక మానవ రూపం తీసుకుని వచ్చి జగత్తుకు ఉద్ధారణ మార్గాన్ని సూచించాలో కర్త ఒకడు నిర్ణయిస్తాడు గనుక కర్త ఆజ్ఞ ప్రకారం భగవంతుడు కూడా దిగి రావాలి దిగి వస్తే దాని పేరు అవతరణ దిగి వచ్చిన వాణ్ణి కనుక్కునే ప్రయత్నంలో ఎక్కటమే ఆరోహణ ఆరోహణ ఒక అవరోహణ రెండు కార్యకలాపాలు ఒకచోట యోగించినప్పుడు సంభవించినప్పుడు దాని పేరే యోగం మామూలు భాషలో అది ఒక దివ్యమైన కలయిక నిన్న విచారణ చేశాం శంకర భగవత్పాదుల భజగోవిందం దక్షిణామూర్తి స్తోత్రం వివేక చూడామణి కనకధారా స్తవం ఇవన్నీ కూడా భగవంతుడికి దగ్గర అయ్యేటువంటి అనేకమైనటువంటి శ్రేయో మార్గ విచారణ అట్లాగే యోగ తారావళి లో ఆత్మ విద్యని యోగ శాస్త్రాన్ని అనుసంధానం చేసి దేహాన్ని ఆధారం చేసుకొని ఓంకారము అనే ప్రణవ శబ్దాన్ని ఆధారం చేసుకొని ద్వంద్వాన్ని త్రిగుణాలను చతుర్విధ పురుషార్ధాలను పంచ కోశాలను ఆరు చక్రాలను సప్త జ్ఞాన భూమికలను అష్టాంగ యోగాలను అన్నింటినీ దాటుకుంటూ జీవుడు తన ప్రస్థానంలో తనను తాను ఎరగాలి తనను తాను ఎరుకక సర్వ ప్రపంచాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం సున్నా అనేటువంటి ఒక గంభీరమైనటువంటి బోధ ప్రపంచానికి అందాలి అందించాలి అనుకున్నటువంటి శంకరుల అవతారం కార్యకలాపం వరకు ఆగిపోయింది శంకర భగవత్పాదులు వచ్చినటువంటి సుమారు పన్నెండు వందల సంవత్సరాల తర్వాత నిజానికి నెల తొమ్మిదో తారీఖు నాటికి నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం మదురైలో మదురై దగ్గర ఉన్న తిరుచ్చుళి అనేటువంటి గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక మహాపురుషుడు అవతరించాడు మహాపురుషుడు అని అనటానికి ఎట్లా గుర్తు అంటే ఆరోజున మహా ఉత్సవం జరుగుతుంది ఉగ్ర ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్నటువంటి వేళ పసిపిల్లవాడు అప్పుడే శిశుదయమయ్యింది పక్కన ఒక గుడ్డి ముసలి అవ్వ నుంచుని ఉన్నది అందరూ అనుకుంటున్నారు ఆడపిల్లవాడా ఆడపిల్ల మగపిల్ల తెలుసుకోలేకపోతున్నారు గుడ్డి అవ్వ అంటే చూట్టానికి అవకాశం లేని అవ్వ మహా ఆనంద సముద్రంలో తేలియాడుతున్న బంగారు బిడ్డని కన్నావమ్మా అన్నది చూసినట్లుగా అద్భుతమైనటువంటి బంగారు వర్ణంతో అజానుబాహువు అనటానికి నిదర్శనంగా ఒక పరమేశ్వరుడు జగత్తులోకి అవతారమూర్తిగా ప్రభవించినటువంటి వేళ అవతారమూర్తులందరికీ ప్రసవాలు లేవు ఇందులో ప్రత్యేకతలేమీ లేవు అందరివీ ప్రభవాలే ప్రభవించినటువంటి ఆయన పేరు వెంకట్రామన్ వెంకట్రామన్ పదహారు సంవత్సరాలు వచ్చే వరకు విద్యాభ్యాసనం కోసం స్కూల్ కి వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో తనలో ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్థితిలో నిలకడ చెంది ఉండేవాడు.సర్వ ప్రపంచంలో ఉండి కూడా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యకలాపాలని గమనిస్తూ కూడా ఇవేమీ తనకు పట్టనట్లుగా ఉన్నటువంటి ఒకానొక సందర్భంలో ఆయన ఒక్కరు ఉన్నటువంటి ఒకానొక సన్నివేశంలో ఒక అనుభవం కలిగింది. ఏమిటి అనుభవం అంటే తన శరీరంలో నుంచి ఏదో ఒక వస్తువు తన నుంచి దూరం అవుతున్నట్టు జారిపోతున్నట్లు. ఒక్కసారి ఆలోచన మొలకెత్తింది. నేను అనబడే మేను ఇక్కడే ఉన్నదే మరి నేను కానీ మేను కానీ మరొక వస్తువు ఎక్కడి నుంచి వెళుతుంది అది ఎక్కడ ఉన్నది. కొన్ని క్షణాలపాటు ఒక అనుభవం కలిగింది. మామూలుగా కవులు, పండితులు, చరిత్రకారులు దాన్ని మరణానుభవంగా భగవాన్ మరణానుభవంగా రాసినా అది మరణానుభవం కాదు అది ఆత్మానుభవం. మరణం అంటే మార్పే. ఆత్మానుభవం మార్పు ఎరగనటువంటిది. నిజమేనా? విచారణ చేద్దాం. అట్లా కలిగింది అది అయిపోయింది. కానీ ఆయనకొక నిశ్చితమైన అభిప్రాయం మాత్రం ఏర్పడింది. నేనుగా కనబడుతున్న వెంకట్రామన్ ని నేను కాదు. ఇది మాత్రమే నేను కాదు. ఇది కానీ ఏదో మరొకటి మాత్రం ఉన్నది. మళ్ళీ చదువులో పడిపోయినారు. స్కూల్ కి వెళ్తున్నారు. మధురైకి వచ్చారు. వైగాయ నదీ తీరంలో హాయిగా కబాడీ ఆడుకుంటున్నటువంటి వేళ ఒకరోజున ఒక మహత్తూర్ణమైనటువంటి సంఘటన ఏర్పడాలి గనుక వెంకట్రామన్ ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. బంధువుని సాగనంపటానికి తండ్రి ఆయన వెంబడి నడిచి వెళ్తున్నారు. వారిద్దరి వెనక వెంకట్రామన్ నడుస్తున్నారు. ఇంతలో చటాలున వెంకట్రామన్ తండ్రి వచ్చిన బంధువుని అడిగారు, "అవును ఎక్కడి నుంచి వచ్చారు?" అని. "అరుణాచలం నుంచి" అన్నారు అంతే. "ఓహో" అన్నారు అయిపోయింది సంభాషణ. వెనక నడుస్తున్న వెంకట్రామన్ కి అరుణాచలం అనేటువంటి అక్షరాలు చెవిన పడ్డాయి. పరమాద్భుతమైన విస్తృతి కలిగింది. ఇక ఒకటే తపన. ఏమిటి అరుణాచలం? ఎక్కడ ఉన్నది అరుణాచలం? తెలుసుకునే అవకాశం లేదు. కానీ అరుణాచలం అరుణాచలం అనేటువంటిది బాలుడి యొక్క మనస్సుని పూర్ణంగా ఆక్రమించినటువంటి వేళ పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. అన్నగారు ముందుకెళ్లి పోయినారు స్కూల్ కి. వీరిని ఫీజు కట్టమన్నారు. దానిలో ఒక చిన్న ఉత్తరం రాశారు. ఉత్తరం మూడే లైన్లు. "దీనికోసమై మీరు వెతకకండి. నాకోసమై కాదు. దీనికోసమై మీరు వెతకకండి. ఇది కర్త ఎట్లా శాసిస్తే అట్లా నడవబోతున్నది. మీరు ఇక్కడ పెట్టినటువంటి డబ్బులో కేవలం రెండు రూపాయలు మాత్రమే దగ్గర ఉంచుకొని మిగతాది ఇక్కడ పెట్టటం జరిగింది." అంతే. ఎక్కడికి వెళుతున్నది గాని, ఎప్పుడు వెళుతున్నది గాని, అసలు ఎందుకు తీసుకున్నది గాని, రకమైన వివరణ దాంట్లో లేదు. ప్రారంభమైంది. నెమ్మదిగా ఒక రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ వస్తే ట్రైన్ లో ఎక్కి కూర్చున్నారు. అది ఎటు వెళుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్లలో తెలియదు వెళ్లి కూర్చున్నారు. కంపార్ట్మెంట్లో ప్రపంచానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు చర్చించబడుతున్నాయి. చాలా గంభీరంగా, చాలా ఉచ్ఛ ఐశ్వర్య స్వరంతో. కానీ ఈయన మాత్రం తనలో తాను నిలకడ చెందినటువంటి ఒక స్థితిలో ఉండిపోయినారు. ఒక ముస్లిం ఫకీర్, ఒక మౌల్వి బాలుడిని గమనించారు. గమనించి, ఇంత గందరగోళం మధ్య ఇంత ప్రశాంతంగా ఉన్న బాలుడు ఎవరై ఉండాలి? ఆశ్చర్యపోయాడు. కానీ అడగటానికి అవకాశం లేదు. ఇంతలో విల్లుపురం అనేటువంటి ఒక స్టేషన్ రాగానే మౌల్వి దగ్గరికి వెళ్లి "ఈ ట్రైను ఇకపై ముందుకు వెళ్లదు గనుక ఇక్కడే దిగాల్సి ఉంటుంది" అన్నారు. దిగమన్నారు గనుక దిగారు. దిగి కాలినడకన సుమారుగా ఎవరో చెప్పినట్టుగా, ఎవరో నడిపించినట్టుగా మూడు పగళ్ళు మూడు రాత్రులు నడుస్తూ నడుస్తూ చివరికి తన దగ్గర రోడ్ మ్యాప్ లేకుండానే పరమేశ్వరుడు సూచించిన ట్లుగా అరుణాచలం చేరుకున్నారాయన. అరుణాచల గ్రామం ఆనాడు దాని పేరు తిరువణ్ణామలై. మామూలుగా అనేక పురాణాలలో జరిగేటువంటి మహిమ నిజానికి రోజున జరిగింది. మట్ట మధ్యాహ్నం వేళ పూజారులంతా కూడా దేవాలయంలో సుప్రభాత సేవలన్నీ ముగించుకొని రకమైనటువంటి భక్తులు లేనటువంటి ఒక నిరామయ స్థితిలో అరుణాచలేశ్వర దేవాలయం ఉన్నది. సమయంలో వెంకట్రామన్ నడుచుకుంటూ వెళ్లారు. ఎలా వెళ్లారు? ఎవరో తనను పిలుస్తున్నట్లుగా, తన కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్లుగా వెళ్లారు. ఆశ్చర్యం! అరుణాచలేశ్వర దేవాలయంలో గర్భగుడికి ఉన్నటువంటి తలుపులు రెండూ తెరుచుకొని ఉన్నాయి. తాళం వేయకుండా వెళ్లిపోయారు. సంభవమేనా? అక్కడికి వెళ్లగానే తలుపు తెరుచుకున్నదా? తలుపు తెరుచుకోలేదా? నా చుట్టూ ఎవరున్నారన్న ఒక భౌతికమైన దేహ స్ప్రుహ లేనటువంటి వెంకట్రామన్ అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. అక్కడ ఆయన అన్న మాటలు పరమాద్భుతమైన మాటలు, ఒళ్ళు గగుర్పొడిచే మాటలు. "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం." అది సమర్పణ, అది శరణాగతి, అది వినయం. నెమ్మదిగా బయటికి వచ్చారు. వచ్చి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో కొంత తీసుకుని శిరోముండనం చేసుకున్నారు. తాను ధరించిన వస్-వస్త్రాలు రెండు అక్కడున్న వారికి ఇచ్చేశారు. ఒక చిన్న కౌపీనాన్ని కట్టుకున్నారు.శిరోముండనం చేసుకున్నారు గనుక అక్కడ పుష్కరిణిలో స్నానం చేశారు మిగిలిన నాలుగైదు అణాలు నీళ్ళల్లో వదిలారు అంతా అయిపోయింది అన్నారు అన్నారు వెళుతూ వెళుతూ అక్కడే పాతాళ గుహము-- గుహా అని ఒకటున్నది ఇప్పటికీ అక్కడికి లోపలికి ప్రవేశించారు పాతాళ గుహలో చాలా లోతుగా చీకటి చిమ్మ చీకటి ఉన్నటువంటి ప్రాంతంలో దేవతా విగ్రహానికి ఒక మూల అలా వెళ్లి కూర్చున్నారు అంతే కూర్చోటం కొన్ని సంవత్సరాలు సాగిపోయింది ధ్యానం చేశారా తపస్సు చేశారా యోగం చేశారా ఎవరికీ ఎరుక లేదు అసలు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడన్న ఎరుకే లేదు కాలగమనంలో శేషాద్రి స్వామి అని ఒక మహాపురుషుడు అవధూత ప్రాంగణంలో నడుస్తూ నడుస్తూ ఒక ఆమెని పిలిచారు "నువ్వు కిందకి దిగి వెళ్లి దేవాలయం లోపల గుహ లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహం మూల కూర్చున్న వ్యక్తిని తీసుకుని బయటకు రా" అన్నారు. ఆమె ఏమన్నదంటే "నేను వేశ్యను ఆయన మహాపురుషుడు అయి ఉండాలి ఆయనని నేను తాకను" అంటే "ఏమి అంటని వాడికి ఇది పడుతుందా నువ్వే వెళ్లిరా" అన్నారు ఆమె తీసుకు వస్తే అప్పటికే ఆయన శరీరాన్ని క్రిమి కీటకాదులు తేళ్లు పాములు అన్నీ కూడా సగం పైగా తినేసి ఉన్నాయి అటువంటి దేహ స్థితి ఆయనది. తీసుకువచ్చారు గోళ్లు పెరిగిపోయి ఉన్నాయి జుట్టు పెరిగిపోయింది కాస్త సంస్కారం చేశారు స్నానం చేయించారు సమాధి వీడలేదు ఆయన కన్ను తెరవలేదు ఒక్క వ్యక్తిని ఆయన గమనించలేదు చూడలేదు తనదైనటువంటి ఒక స్వాత్మానంద స్థితిలో తాను నిలకడ చెంది ఉన్నారు. అక్కడితో శేషాద్రి స్వామి కర్తవ్యం పూర్ణమైపోయింది మరి ఈయనేం చేయాలి నెమ్మదిగా అరుణాచల సానువులు ఎక్కుతూ అరుణాచలం లో ఒక చెట్టు కింద తర్వాత ఒక గుహలోకి వెళ్లారు. గుహ విరూపాక్ష గుహ ఇప్పటికీ ఉంది. విరూపాక్ష గుహలోకి రమణుల కంటే ముందు ఆంధ్రదేశం నుంచి ఒక మహా సత్పురుషుడు ప్రవేశించి తాను చేసినటువంటి తపస్సు వలన కలిగిన యోగాగ్నిలో యోగము పూర్ణమైనటువంటి స్థాయిలో శరీరం అంతా దహనమైపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలిన సన్నివేశం. బాలుడికి భయం లేదు ఉపనిషత్తులు పరమేశ్వరుడిని అభీహి అన్నది భీతి లేని వాడు అని. ఆయనకు భయం ఎందుకు లేదంటే ఆయన కంటే మరొకడు లేడు గనుక ఆయనే అంతా గనుక మరొకడు ఉన్నాడు అంటే మనకు భయం గాని మరొకడు మనంతటి వాడో మరొకడో ఉన్నాడు లేడు అని గనక కనుక్కున్నట్లయితే భయం లేదు. భావంలోనే విరూపాక్ష గుహలో వెంకట్రామన్ కొన్నాళ్ళు ఉన్నారు. అయితే లోకోత్తరమైన కార్యక్రమం నెరవేర్చటానికి ఒక మహా చైతన్యం సాకార స్వరూపంగా జగత్తులోకి వచ్చినప్పుడు లోకానికి వారి రాక కళ్యాణాన్ని ఆనందాన్ని శోభని యోగత్రయాన్ని పరిపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహ వరదానం చేయవలసి ఉన్నది లేకపోయినట్లయితే వెంకట్రామన్ అట్లా వచ్చి ఉండేవారు కాదు. అదే సమయంలో సంస్కృత భాష మీద సంపూర్ణమైన అధికారం సంపాదించి మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసి మంత్ర బీజాక్షరాల వెనుక ఉన్న అధిష్టాన దేవీ గణాలను దర్శనం చేసిన ఒక మహా మంత్ర ద్రష్ట కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని వేలూరు లో ఉన్నారు ఆయన. ఆయన అసహనంగా ఉన్నారు ఇన్ని జరిగినా తనమీద తనకు ఎంత నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక లోటు మాత్రం కనిపిస్తూ ఉన్నది. అదే ఒక స్నేహితుడి దగ్గర అన్నప్పుడు దీనికి పరిష్కారం ఒకటే అరుణాచలం మీద బ్రాహ్మణ స్వామి అని మౌన స్వామి అనే పేరుతో ఒక బాలకుడు తిరుగుతూ ఉన్నాడని ఆయన దగ్గరకు గనక వెళ్లినట్లయితే చిత్తశాంతి లభిస్తున్నదని చాలామంది వెళ్లి వారు దర్శనం చేసుకొని వస్తున్నారు మీరు కూడా అక్కడికి వెళ్ళవచ్చును అన్నారు. నిజమైనటువంటి సాధకుడికి గురువు పట్ల తత్వం పట్ల అన్వేషణ తీవ్రమయయ్యేటువంటి పరిపాక స్థితిలో గురువు ఒక magnet లాగా తన ఆవరణంలోకి తానే లాక్కుంటాడు. శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెళతాడు అంటాం కానీ గురువు కూడా శిష్యుడి కోసం తహతహలాడుతుంటాడు. సన్నివేశమే ఏర్పడింది అరుణాచలం పైన బయట ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. అదే సమయంలో కావ్యకంఠులు వారిని పలకరించే ప్రయత్నం చేశారు ఎక్కడా ఉలుకు పలుకు లేదు ఎవరో వచ్చారన్న స్పృహ లేదు జాస లేదు పోనీ ఏదన్నా ధ్యానంలో ఉన్నారా తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఘనీభవించిన మౌనం లాగా కూర్చుని ఉన్నారు ఆయన. అయితే సమయంలో కావ్యకంఠులు అతి నెమ్మదిగా వారికి వినపడేట్టుగా ఒక మాట మాట్లాడారు. ఏమనంటే "స్వామి అఖండ తపస్సు చేశాను చిర తపస్సు చేశాను మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేశాను ఒక అధికారాన్ని సంపాదించాను మంత్ర ద్రష్టనైనాను సంస్కృత వాంగ్మయాన్ని కైవసం చేసుకున్నాను కానీ చిత్తశాంతి లభించటం లేదు ఇంతకీ తపస్సు అంటే ఏమిటి నేను చేసినదంతా తపస్సేనా దానికి అర్థం ఏమిటి" అని అడిగారు. కొన్ని ఏళ్లుగా మాట్లాడనటువంటి వెంకట్రామన్ కంఠ నాళాలు సవరించుకుంటూ చాలా నెమ్మదిగా ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ అతి కష్టం మీద మాటలు అన్నారు.నేను అనే తలపు ఎక్కడ ప్రారంభం అవుతున్నదో దానిని గమనించుకుంటూ గమనాన్ని సాగిస్తూ సాగిస్తూ దానితో పాటు ఉంటూ ఉంటూ చూస్తూ చూస్తూ తలపు మళ్ళీ దేనిలో లీనమవుతున్నదో గ్రహించగలిగితే అది తపస్సు. సందేహం వీడిపోయింది. కావ్యకంఠులు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మరొక్క మాట అడిగారు. నేను తపస్సులో ఒక స్థితికి చేరుకున్నాను అనటానికి నాకు గుర్తు ఎట్లా? అని అడిగారు. తపస్సు చేయక ముందు నీవు పుంటావు. తపస్సు పూర్ణమైన వేళ సర్వభూవనము నీ యందు ఉంటుంది అంతే అన్నాడు. ఇది భగవాన్ నిజానికి ఆయన అప్పటికి రమణ మహర్షి కాలేదు ఇంకా వెంకట్రామనే. సన్నివేశంలో కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని దార్శనికుడు గనుక ఊహ చేశారు. ఈయన ఎవరై ఉండాలి? వెంకట్రామణలో నుంచి రమణ శబ్దం తీసుకుంటున్నాను. రమణ శబ్దము అంటే దాని యందే మరణము కూడా ఉన్నది. మరణానుభవాన్ని ఆత్మానుభవంగా మార్చుకొని తాను మరణించినప్పటికీ జీవించే స్థాయిలో ఉన్నటువంటి ఈయనకు పేరు వెంకట్రామన్ కాదు రమణ. ఈయన కేవలము రమణ స్వామి మాత్రమే కాదు ఈయన రమణ మహర్షి. ఎందుకంటే మనిషి మనీషి కావాలి, మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. ఇది ఒక పరంపర. పరంపరలో ఈయన మహర్షి స్థాయికి చెందినవారు. అంతేకాదు భా అంటే వెలుగు, అంటే జ్ఞానం. వెలుగు జ్ఞానము రెండుగా కనపడేటువంటి ద్వంద్వంగా గోచరిస్తున్నప్పటికీ జ్ఞానం అంటేనే వెలుగు వెలుగు అంటేనే జ్ఞానం గనుక అది ఎరిగిన వాడు అది తానైన వాడు గనుక ఈయన భగవాన్. భగవాన్ శ్రీ రమణ మహర్షి అన్నారాయన. శ్రీ అనేటువంటి శకార, రకార, ఇకారములతో కూడినటువంటి అంటే అంటే శారదా శక్తి, అంటే రమా శక్తి, అంటే పార్వతీ శక్తి. ముగురమ్మలు మహా త్రిపురసుందరి దేవి యొక్క శబ్ద స్వరూపమే శ్రీకారం గనుక భగవాన్ శ్రీ రమణ మహర్షి అనబడుతూ వీరు లోకోత్తరమైనటువంటి అవనీ సంచారము కొనసాగించెదరు గాక అని కావ్యకంఠులు వారికి నామకరణం చేశారు. అదే సన్నివేశంలో ఒకాయన వచ్చారు. ఇన్నాళ్లు మౌనమే భూమిక గా ఉన్నటువంటి బాల స్వామిని, బ్రాహ్మణ స్వామిని, మౌన స్వామిని ఎవరో పలకరించి మాట్లాడించారట. వారు ఎవరు? అని అడిగారు రమణుల్ని. రమణులు ఏమన్నారంటే అదిగో ఆయనే నాయన అన్నారు. క్షణం నుంచి పూర్వ నామమైన వెంకట్రామణు తలగిపోయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అయింది. అట్లాగే కావ్యకంఠ ఆయన బిరుదు. వాశిష్ఠ గణపతి ముని అందులో ఆయన అసలు పేరు గణపతి మాత్రమే. అన్నీ పోయినాయి ఏం మిగిలింది అంటే నాయన మిగిలింది. నాయన అంటే దక్షిణాపథంలో నాయన అంటే గణపతి అని అర్థం. మరి ఈయన ఎవరు అని అదే సమయంలో [గాలి] దక్షిణాపథం నుంచి దక్షిణ దిశ నుంచి ఆరు కాంతి పుంజాలు ఆజ్ఞా చక్రాన్ని రమణ మహర్షి ఆజ్ఞాచక్రాన్ని తాకినప్పుడు కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని దాన్ని గమనించి మీరు స్కందులా? అని అడిగారు. నేను ఎవరో తెలుసుకున్నందువల్ల నీకేమి ప్రయోజనం? నిన్ను నీవు తెలుసుకో అక్కడ నీ యాత్ర ప్రారంభించు అన్నారు. హూ యామ్ ఐ? అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రశ్నలో నుంచి. రమణులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం ప్రాథమికంగా చేసినా వారి జీవితం అంతా కూడా మనల్ని మనం తెలుసుకోమని చే-చెప్పేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి బోధ గనుక ఇక్కడ భగవాన్ రమణ మహర్షి అటు నాయన అనబడేటువంటి గణపతి ఏర్పడ్డారు. ఒక ఊహ కైలాసం గనుక దిగివచ్చిన ట్లయితే అది అరుణాచలం అయినట్లయితే అరుణాచలమే మౌనభూమికలో ఉన్నటువంటి పరశివుడు గనుక అయినట్లయితే ఆయన ఇద్దరు కొడుకులు కూడా అక్కడికి చేరుకున్నారు అని ఒక చమత్కారం. ఒక కొడుకు ఎవరయ్యా? గణపతి నామంతో ఉన్న నాయన, కార్తికేయ స్వరూపమైనటువంటి రమణులు ఇద్దరు కొడుకులు కాగా ఘనీభవించినటువంటి మౌనభూమికలో ఉన్నటువంటి అరుణాచలం అనేటువంటి కొండ శివుడు కాగా దాని సానువులలో వెలసినటువంటి అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్న అమ్మవారు అపీత కుచాంబిక. స్తన్యమివ్వని తల్లి ఆమె. ఎవరికిచ్చింది? కొడుకులిద్దరికీ మాత్రమే కాదు పురుషులు అనబడే జీవులందరికీ కూడా జ్ఞానము అనే స్తన్యాన్ని ఇచ్చింది గనుక అరుణాచలేశ్వర దేవాలయంలో అమ్మవారు అయ్యవారి పక్కన ఉండదు. ప్రత్యేకంగా ఉంటుంది. శివాలయంలోనూ లేనట్లుగా అరుణాచలేశ్వరుడికి చేసే శాలంకృత లింగాన్ని గనుక మనం దర్శనం చేస్తే సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్లు ఉంటుంది ఇది ఒక భావనా భూమిక. ఇది అరుణాచలం. కాకపోతే అరుణాచలమా? అది కొండ దేవరా పలకదు. కొండ ఏం మాట్లాడుతుంది? అరుణాచలేశ్వరుడా? దానిలో ఉన్న విగ్రహ స్వరూపము అది పలకదు. పోనీ బాలస్వామిని మాట్లాడిద్దామా? ఇది అసలు మాట్లాడదు. మరి అక్కడ ఏమున్నది అంటే ఉన్నదంతా మౌనమే. మౌనమే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం అన్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రానికి అరుణాచలం ఒక ప్రతీక.
SSSMC · audio

Talk on Sri Ramana Maharshi Philosophy - 01

Home

Talk on Sri Ramana Maharshi Philosophy - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:11

More in this series

Talks on Sri Ramana Maharshi Philosophy

3 episodes · 1 hr 25 min

  1. 24 min 1

    Talk on Sri Ramana Maharshi Philosophy - 01

    Now playing
  2. 28 min 2

    Talk on Sri Ramana Maharshi Philosophy - 02

  3. 32 min 3

    Talk on Sri Ramana Maharshi Philosophy - 03