No transcript for this section.
ఇవాళ వల్లీశ్వర్ అనబడేటువంటి శివకుమారుడు [అప్లాస్] ఇక్కడికి వచ్చాడు. లేకపోతే రాలేడు. ఇవాళ ఎందుకు రావాలి? నిన్న ఎందుకు రాలేదు? శివ కుటుంబం నేను దర్శనం చేయలేదే, చేయలేకపోయినానే అన్నటువంటి ఒక తహతహ ఎవరికి ఉన్నదో వారిని ఇక్కడికి ఆయన రప్పించుకుంటాడు. ఇక్కడికి రావాలి ఇవాళ. ఎవరి నిర్ణయం? భగవాన్ రమణ మహర్షి నిర్ణయం. నేను చూ-చూస్తే ఏమీ చూడకపోతే ఏమీ కాదు. చూడలేకపోయినానే, అది తపన. తపన లో నుంచి ఒక ఆర్తి. ఆర్తి లో నుంచి అన్వేషణ. ఆ అన్వేషణ ఆంతరంగికంగా సాగుతున్నప్పుడు తన ఆవరణంలోకి పరమాత్మ లాక్కొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. ఆ సన్నివేశాన్ని మనం ఇవాళ చూసాం. కాలగమనంలో నెమ్మది నెమ్మదిగా భగవాన్ ఉపదేశాలు ఇవ్వలేదు, సందేశాలు చెప్పలేదు, ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదు. అనేక ఘట్టాలు. ఎందుకంటే భగవంతుడికి కథ లేదు. ఎవరికి వ్యధ ఉంటుందో వాడికి ఒక కథ ఉంటుంది. ఎవడికన్నా కథ ఉంటే వాడికి వ్యధ ఉంటుంది. కథ లేని వాడికి వ్యధ లేదు కాబట్టి భాగవతమంతా భక్తుల కథ, భగవంతుడి యొక్క ఆర్తత్రాణ పరాయణత అంతే. అది కృష్ణుడి కథ, కుచేలుడి కథ అనంటే భాగవతం కుచేలుడి కథే. కృష్ణుడి కథ ఏముంది? లేదుగా. వాడి వ్యధ తీర్చటానికి ఆ కథలో తాను ఒక పాత్ర వహించాడు తప్ప మరొకటి లేదు గనుక రమణీయమైనటువంటి కథా గమన మణిమాలలో నుంచి అనేకమైనటువంటి విషయాలు గనుక దర్శనం చేస్తే శంకర భగవత్పాదులు ఏ అద్వైత సిద్ధిని ప్రతిపాదించారో, అది మతం కాదు, అది సిద్ధాంతం కాదు. ఏ సిద్ధాంతమైనా రాద్ధాంతానికి దారితీస్తుంది. ఏ సిద్ధి అయినా శుద్ధత్వానికి దారితీస్తుంది. ఆ శుద్ధత్వంలో నుంచి సిద్ధత్వము, దానిలో నుంచి సంసిద్ధత్వము, దానిలో నుంచి పూర్ణత్వము, దానిలో నుంచి సాయుజ్యము కలుగుతాయి గనుక ఆ ప్రణాళికలోనే రమణ మహర్షి ఒకచోట కూర్చొని ఉన్నప్పుడు అనేక సన్నివేశాలు. నెమ్మదిగా ఒకరోజున తన తల్లి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. కన్నీరు మున్నీరు అవుతోంది. "కడుపున ఇంతమంది బిడ్డల్ని కన్నాను, అందరినీ నేను పెంచటం లేదా? నీకోసం రెండు ముద్దలు ఇవ్వలేనా? ఎందుకదిలిపెట్టి వచ్చావు నాయనా?" అన్నది. ఎందుకంటే భగవాన్ వయస్సు చాలా చిన్నది. పదహారేళ్ళు, పదిహేడేళ్ళ మధ్యలో. పదిహేడు ఇంకా రాలేదు అరుణాచలం చేరుకునేప్పటికి. అక్కడ ఎవరు అన్నం పెడతారో తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు, తన వారెవరో తెలియదు, తన జీవితం ఏమవుతుందో తెలియదు. కానీ తర్వాత చెప్పారు ఎలా వచ్చారో చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తల్లి వచ్చి రోదిస్తూ ఉన్నట్-సన్నివేశంలో మన బోటి వారంతా భగవాన్ వైపు ఒక ప్రార్థనా పూర్వకంగా ఒక మాట అడిగారు." మీకు జన్మనిచ్చినటువంటి తల్లి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి విలపిస్తున్నది భగవాన్! ఆమెకు స్వాంతన కూర్చే లాగా ఏదైనా రెండు మాటలు చెప్పండి." పక్కనే ఉన్న ఒక కాగితం తీసుకున్నారు. పెన్ తో రాశారు. "కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగవలసి ఉన్నదో అది జరగక మానదు. ఏది జరగకూడదని మనం ప్రయత్నిస్తామో ఎంత ప్రయత్నించినా అది జరిగితీరుతుంది. కనుక మనం నిస్సహాయులం. మరి ఏం చేయాలి? మౌనంగా ఉండటమే ఉత్తమము." ఈ సందేశాన్ని కాగితం మీద రాసి మాతృమూర్తి ద్వారా ప్రప్రథమ సందేశాన్ని జగత్తుకి భగవాన్ రమణ మహర్షి అందించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి సన్నివేశం అది. ఇచ్చారు. "నేను ఇక్కడ ఉండవచ్చునా?" అని అడిగింది. అప్రూవల్ ఏం లేదు. Yes లేదు, No లేదు. ఉండవచ్చును అంటే ఇంకా తాను తన తల్లి అక్కడ ఉన్నట్లు లెక్క. వద్దు అన్నట్లయితే నిరోధించినట్లు లెక్క. జ్ఞాని ఎట్లా సంచారం చేస్తాడంటే, ఉంటే ఉంది లేకపోతే లేదు. అయితే ఏంది కాకపోతే కాలేదు. ఈ కావటానికి ఎవడో కర్త కారణం, కాకపోవటానికి కూడా కర్తే కారణం. మనం ఎవ్వళ్ళం కారణం కాదు. అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అధ్యాత్మ భావన అక్కడ నుంచే మొదలైంది. తర్వాత కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని అనేక సందర్భాలలో ఆయన మహాకవి, పండితుడు గనుక ఉమాసహస్రం అనేటువంటి ఒక ఉత్కృష్ట గ్రంథం రాశారు. ఉమాదేవి మీద వేయి శ్లోకాలతో రాయాలి అని అనుకున్నారు. ఎవరి సమక్షంలో? అరుణాచలం మీద సాక్షాత్తు భగవాన్ కూర్చొని ఉన్నారు. తొమ్మిది వందల శ్లోకాలు రాశారు ఆయన. రాసి మనసులో ఒక ఆలోచన కలిగింది. భగవాన్ మౌనంలో ఉన్నారు, ఆయన ఏం direction ఇవ్వటం లేదు, ఆయన ఏం వింటున్నట్టు లేదు. ఈయన రాసుకుంటూ చదువుకుంటున్నారు. తొమ్మిది వందల శ్లోకాలు కాగానే కావ్యకంఠుల మనసులో కలిగిన ఆలోచన ఏమిటంటే, 'ఎంత బాగా రాస్తున్నాను' అనుకున్నారు. అదే సమయంలో రమణులు కన్ను తెరిచి, "నాయనా! నేను చెప్పినవన్నీ బాగా రాస్తుంటివా?" అని అడిగారు. అంటే ఆ తొమ్మిది వందల శ్లోకాలు ఎవరు రాసినట్లు అని. భగవాన్ రమణులే రాయించినట్లుగా లెక్క. అందువల్లనే ఉమాసహస్రంలో ఈ అహంకార మమకార భావన, కర్త్రుత్వ భావన వదిలిన తర్వాత చివరి వంద శ్లోకాలు పరమ ఉన్నత స్థాయిలో ఉంటాయి, తొమ్మిది వందలు మామూలు కవిత్వ స్థాయిలో ఉంటాయి. కారణం నేను రాస్తున్నానన్న భావన కావ్యకంఠుల మనసు నుండా ఉన్నది గనుక అవి ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఓహో! ఇది రమణులు రారాయిస్తున్నారు అన్న భావన కలిగిన తర్వాత రాసినందువలన ఆ వంద శ్లోకాలు జ్ఞానయోగంలో పరమ పతాక స్థాయికి చెందినటువంటివి. దానిని మనం అధ్యయనం చేయాలి, అది ఒక స్థాయి. అలాగే భగవాన్ జీవితంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. మాములు జ్ఞాని అనగానే insulated గా isolated గా ఈ ప్రపంచానికి దూరంగా ఉంటాడు, మనకందడు అని కదా. కానీ జ్ఞాని సాలోక్యంగా, సామీప్యంగా, సాన్నిధ్యంగా ఉండి సాయుజ్య మార్గాన్ని ఉపదేశిస్తాడు తప్ప సాయుజ్యాన్ని ఇవ్వడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం.ఏ గురువు అయినా నీకు ఉద్ధారణ ఇస్తాను అంటే ఆ గురువుని తక్షణం వదిలిపెట్టాలి మనం. ఎందుకంటే ఆ గురువు చేసే పని అది కాదు. కానీ ఉద్ధారణకి పొందటానికి కావలసిన మార్గాన్ని సూచించేటువంటి పరమోత్కృష్టమైన కారణ గురువు దొరికితే మాత్రం వదిలి పెట్టకూడదు, ఇది రెండవది. అటువంటి ఆ కారణ గురువు ఆత్మ విచార మార్గంలోకి మనల్ని తీసుకుని వెళ్ళాలి. ఈ ఆత్మ విచారణ మార్గంలో హృదయం చాలా dry గా ఉంచుకోవాలా? స్పందన రాహిత్యంతో ఉండాలా? ఏమీ లేనట్టు ఒక రాతి బొమ్మ వలే ఉండాలా? ఇది జ్ఞాని యొక్క లక్షణమా అంటే, రమణులు కరుణాపూర్ణ సుధాబ్ధి. అందుకనే ఓసారి కావ్యకంఠులు అడిగారు. అనేకమైనటువంటి hill stations చాలా చల్-చల్లని శీతల ప్రదేశాలు ఉండగా, భగవాన్ అంగారకుడు వంటి ఈ అగ్నిగుండంలాన్ని అరుణాచలాన్ని మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఎందుకు ఎంచుకున్నారు? అని అడిగినప్పుడు మళ్ళీ మౌనమే. కాగితం తీసుకున్నారు. దాని వెనక పెన్సిల్ తో అరుణాచలం బొమ్మ గీసారు outline. కింద రాశారు "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది". ఆశ్చర్యపోవాలి కదా! కావ్యకంఠులు అడిగారు భగవాన్ ఇంత అందమైన తెలుగు మీకెప్పుడు వచ్చు అని. రాదని నీవు అనుకున్నావు అన్నారు. అది. మనకు కూడా doubt. బాబా వారు ఏం చదువుకోలేదు కదా. French వాళ్ళు Italians వీళ్ళు ఎవరెవరు వచ్చా room లో నుంచి దీన వదనంతో వెళతారు, దివ్య వదనంతో బయటికి వస్తారు. ఏం జరుగుతుందో ఎవడికి తెలీదు మధ్యలో. ఈ దీన వదనంతో వెళ్ళిన వాడు ఏమంటాడంటే బాబా నా అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చేశారు. అడిగినవి, అడగాలని అనుకున్న వాటికి కూడా ఇచ్చారని మహా ఆనందంతో బయటికి రావటమే కొన్ని వేల సందర్భాలు మనం దర్శనం చేసిన వైనం మనకు తెలుసు. అంటే పరాస్వరూపుడైన ఈశ్వరుడికి ఈ భాష ఉండదు. ఒక హృదయ భాష, ఒక ఆత్మ ఘోష ఉంటుంది. ఘోష అంటే శబ్ద బ్రహ్మము అని అర్థం. ఆత్మ ఘోష అంటే రోదనం కాదు, ఏడుపు కాదు, విలాపం కాదు, విషాదం కాదు. ఘోష అంటే శబ్ద బ్రహ్మము అని. ఆ శబ్ద బ్రహ్మమే ఆ సాకార స్వరూపంలో కాసేపు ఉండి, ఏ language ఏ mode లోకి అది వెళ్లాలో వెళ్లి అక్కడికి ఆ పని పూర్తి చేసి మళ్ళీ మామూలు స్థాయిలోకి వస్తారు. ఎందుకంటే ఎక్కిన వాడు ఎప్పటికైనా దిగి రావాలి. చక్కగా ఒక మనిషి గనక హిమాలయ పర్వతాలపై దాకా వెళ్లి అక్కడ జెండా గనక పాతి నట్లయితే అక్కడే ఉండిపోయినాడా? మళ్ళీ అధిరోహణం అవరోహణం చేయాలి. మామూలు స్థాయికి రావాలి. Altitude levels అన్నీ తగ్గించుకుంటూ తనదైనటువంటి స్వస్థానానికి తాను వచ్చినప్పుడే తాను ఆనందాన్ని అనుభవించగలడు గనుక అటువంటి స్థితికి వెళ్ళటానికి రమణ మహర్షి జీవితంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అయితే మానవుడు తన అహంకారం చేత పరమేశ్వరుడు నా కోసం వచ్చాడు అనుకుంటాడు. పరమేశ్వరుడు అట్లా అనుకోడు. ఒకసారి కోతులన్నీ భగవాన్ చుట్టూ చేరి అక్కడున్నటువంటి విషయాలన్నీ చిందరవందర చేస్తుంటే, అలాగే బయట కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పలు, అరుటి పండ్లు తీసుకుని వెళుతుంటే కోతులు తమ చేతుల్లో నుంచి లాక్కుంటుంటే వెళ్లి భగవాన్ కి complaint ఇచ్చారు. ఏమనంటే కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది భగవాన్! దీనికి ఏదన్నా ఓ పరిష్కారం మీరు చూడాలి అని. ఏం వింటున్నావ్ అయ్యా? అవి ఉండే ప్రదేశానికి మనం వచ్చి వాటిని వెళ్లగొట్టమంటున్నారే! వారిని అక్కడ ఉండనివ్వండి. వారు మనల్ని ఇస్తున్-ఉండనివ్వచ్చు-ఇస్తున్నందుకు వారికి రోజూ నమస్కరిస్తూ ఉండండి. అది. అలాగే భగవాన్ paper చదువుకుంటూ హాయిగా కళ్ళజోడు పెట్టుకొని paper చదువుతున్న ఆ చివరి దశలో ఒక ఉడత ఆయన కితకితలు పెట్టేది. ఆయనతో ఆడుకునేది. ఏమీ disturb అయ్యేవారు కాదు. ఆ అరచేతిలో ఒక ఉడతను అలా పట్టుకొని దాన్ని చూస్తూ ఉండేవారు. ఉడత బెదిరిపోయేటువంటి అల్ప జీవి అది. చిన్న ధ్వని గనక వినపడితే భయపడి ప్రాణభయంతో పారిపోతుంది. అటువంటిది ఆ ఉడత మనస్సు అంత నిశ్చలంగా, అంత నిర్మలంగా, అంత ఘనీభవించిన మౌనంగా, తోక ఆడించకుండా, కనురెప్ప కదల్చకుండా ఎక్కడ ఉన్నది అంటే పరాస్వరూపుడైన రమణుల యొక్క అరచేతి యందు ఉన్నది అంటే దాని మనస్సుని తన మనసుతో అనుసంధానం చేశారన్నమాట. అందుకనే మహాత్ముల్ని దర్శనం ఎందుకు చేయాలి అంటే కేవలం మన ప్రాపంచికమైన కోరికలు తీర్చుకోవటానికి మహాత్ముల దర్శనానికి వెళ్ళక్కర్లేదు. నిజానికి వెళ్ళద్దు కూడా. కానీ మహాత్ముణ్ణి గనక దర్శనం చేస్తే ఏమవుతుంది అంటే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు భక్తుడవుతాడు. భక్తుడు ప్రేమమయుడవుతాడు. చివరగా జ్ఞాని అవుతాడు. ఆ మహాత్ముని యొక్క దర్శనంలో ఉన్నటువంటి భాగ్య విశేషం అది గనుక అందుకోసమై వెళ్లినట్లయితే జ్ఞానం దొరుకుతుంది, కాదు ప్రాపంచికమైన కోరికలతో వెళ్లినట్లయితే కామ్యసిద్ధి కలుగుతుంది. మరి కామ్యసిద్ధి ఒకచోట ఆగేదా? ఇవాళ ఇప్పుడు పుట్టింది, ఆయన తీర్చాడు. మళ్ళీ పుట్టింది, మళ్ళీ తీర్చాడు. ఆయన ఎందుకు వచ్చాడా? మనం ఎందుకు వచ్చామా? దేనికొచ్చాం? అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితం. నారాయణ గురువు వచ్చాడొకసారి భగవాన్ జీవితంలో. ఒక్కరోజు దర్శనం చేసుకొని వెళ్ళాలి అని వచ్చారు. నారాయణ గురువు సాంప్రదాయకమైన గురువు కాదాయన. సంఘ సంస్కర్త. నాస్తికవాదాన్ని ప్రబలంగా ప్రచారం చేసిన కేరళీయుడు. కానీ భగవాన్ యొక్క మానవతా పరిమళాన్ని అనుభవించి ఆ ఆనందాన్ని ఎందరో ఆయన దగ్గరకు వచ్చి పంచిన కారణంగా తాను పొందుదామని వచ్చారు. శిష్యులందరూ వచ్చారు. భగవాన్ ఈయనతో మాట్లాడలేదు. ఈయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు.నాలుగు రోజులు అయిపోయిన తర్వాత నారాయణ గురువు శిష్యులు అన్నారు "ఏమీ మాట్లాడని ఈయన దగ్గర ఉండేకంటే మన దారిన మన ఇంటికి వెళ్లిపోదాం. ఆయన ఏమీ మాట్లాడేట్టు లేరు. ఇక్కడ ఏం మర్యాద లేదు, ఆయన ఏం రిసీవ్ చేసుకోవటం లేదు. మనం ఎందుకు వచ్చినట్లు గురుదేవా?" అంటే నారాయణ గురువు ఒక్క మాట అన్నాడు. "ఏ సంఘ సంస్కరణ విధానంలో నుంచి పరమాత్మ దర్శనం చేయాలని నేను అనుకున్నానో, మానవ సేవ ద్వారా ఒక మాధవుడిని గమనించాలని అనుకున్నానో, ఆ మాధవుడే రమణుడై ఇక్కడికి వచ్చి ఉండగా ఇంకా నేను దేనిని చూడాలి?" అని ఒక శ్లోకం రాశారు. వారి పాదాల దగ్గర పెట్టారు. వెళ్లిపోయినారు. గురువు మన రుణాన్ని ఎప్పుడూ ఉంచుకోడు. నారాయణ గురువు యొక్క పరమ చరమమైనటువంటి దశలో కుంజుస్వామి అనేటటువంటి ఒక భక్తుడ్ని ఒకరోజు భగవాన్ పిలిచారు. ఈ సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి రమణుల జీవితంలో. కుంకుమ, విభూతి అతని చేతికి ఇచ్చి "ఇవి నారాయణ గురువుకి ఇచ్చిరా" అన్నారు. ఈయన చాలా దూరం వెళ్ళాలి కేరళ-- ఇది తమిళనాడు, అది కేరళ. వెళ్లారు, గురువు ఆజ్ఞ ప్రకారం. ఆయన మంచం మీద పడుకొని ఉన్నారు. "రమణులు మీకు ఈ రెండు ఇవ్వమని పంపారు" అని చెబుదామని అనేలోగా "ప్రాణ నిర్గమన వేళ నా తండ్రి, నా గురువు, నా దైవమైన రమణులు ఈ రెండు నాకు పంపారా? జీవన్ముక్త స్థాయిలో ఉన్న ఒక మహా జ్ఞానికి ఎంత కరుణ?" అన్నారు ప్రాణం విడిచారు. అది. గురువు యొక్క స్థాయి అది. అటువంటి గురువులు ఇక్కడ ఉన్నారా? ఈ లోకంలో ఇంకా ఉన్నారా అంటే ఏమో వెతకాలి, వెతుక్కోవాలి. అటువంటి వాళ్ళు గుప్తంగానే ఉన్నారు. లేకుండా గనక ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఇంకా ఇట్లా నడిచేది కాదు. బాహ్య రకమైనటువంటి అనేకమైనటువంటి నటగురువులు మాత్రం చాలామంది ఎక్కువైపోయినారు. ప్రతి వాడికి గురువైపోవాలని ఆతృత, గురు స్థానంలోకి వచ్చాక దేవుడైపోవాలని తొందర. అందుకే భగవాన్ సత్యసాయి అద్భుతమైన మాట అన్నారు. "మనిషి దేవుడు కావటమేమిటి బంగారు? మనిషి దేవుడే తెలుసుకోగలిగితే." మళ్ళీ కావటం ఏమిటి, కాకపోవడం ఏమిటి? మనిషి దివ్యుడే, ఆ దివ్యత్వాన్ని అనుభవించే స్థాయికి వెళ్ళాలి అని. ఇది ఒక స్థాయి అయితే, మాయని గురించిన విచారణ జరుగుతూ ఉన్నది ఓ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చి భగవాన్ దగ్గర కూర్చున్నారు. అప్పటికి మూడు రోజులు అయింది. ఆయన అప్పటికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. కూర్చుని ఉన్నారు. మూడు రోజులు గడిచింది. వారు, ఈయన ఏం మాట్లాడుకోలేదు. మూడు రోజులు అయిపోయిన తర్వాత రాధాకృష్ణన్ వారికి నమస్కారం చేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హాల్లో ఉన్న వారంతా ఆయన్ని సాగనంపడానికి వెళ్ళిపోయారు. మాయ అంటే ఏమిటి అని ప్రశ్న వేసిన వాడు ఒక్కడు భగవాన్ దగ్గర ఉంటే, "మాయ అంటే అదే. వాళ్ళంతా ఇందాకటిదాకా రమణ మహర్షి కోసం వచ్చారు అని అనుకున్నావు కదా. అలా వెళ్తున్నారే, మాయ అంటే అదే. వాళ్ళు వచ్చింది వారి కోసం, వీరి కోసం కాదు." అది. చిన్న చిన్నవి. మానవ జీవితంలో నుంచి మనకు ఏర్పడే స్వల్పకాలికమైనటువంటి ఒక అనుభూతి లో నుంచి ఆ దివ్యత్వాన్ని ఉడిసి పట్టుకోవాలి. అదేదో శాస్త్రాలు, పాండిత్యము, కవిత్వం అంతా నోటికొచ్చేస్తే వాడు జ్ఞాని అయిపోయినాడని మనం భ్రమ పడకూడదు. వాడు విజ్ఞాని మాత్రమే, వాడు జ్ఞాని కాదు. జ్ఞాని ఏం చేస్తాడంటే తన దివ్య జీవన విధానం ద్వారా పరమోత్కృష్టమైనటువంటి బోధ చేస్తాడు తప్ప మిగతావన్నీ చెయ్యడు. అలాగే కావ్యకంఠ వాసిష్ట గణపతి మునితో పాటుగా అనేకమంది పాశ్చాత్య దేశీయులు అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అందులో అందరికీ తెలిసిన పాల్ బ్రంటన్ ఒక గొప్ప జర్నలిస్ట్. అద్భుతమైన జర్నలిస్ట్. ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడ గుప్తంగా ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని, రహస్యాలు పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయాలని ఆ మిషన్ మీద వచ్చాడాయన. అనేకమందిని ఆయన దర్శనం చేశాడు, కలుసుకున్నాడు, మాట్లాడాడు. చివరకు ఆయన చేరుకున్న ప్రదేశం కాంచీ. కాంచీపురానికి వెళ్ళినప్పుడు మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నాడు. మూడు రోజులు ఉన్నాడక్కడ. నాలుగవ రోజున పరమాచార్యని దర్శనం చేసి "నా జీవితాన్ని ఇక్కడ ముగించుకోవాలని, ఇక్కడ గడపాలని నాకు అనిపిస్తూ ఉన్నది. మీరు నన్ను ఇక్కడ ఉండనివ్వండి, అనుగ్రహించండి." అని అడిగారు. అడిగితే పరమాచార్య, "కాదు కాదు. ఇక్కడ నుంచి తిరువణ్ణామలై గనక వెళ్ళినట్లయితే తిరువణ్ణామలైలో రమణ మహర్షి అని ఉన్నారు. వారి దగ్గరకు మీరు వెళ్ళండి. మేమా ఇంకా లొట్టిపిట్టలు, ఇంకా పల్లకీలు, ఇంకా అనేకమైనటువంటి ఉపాసనలు వీటితో ఒకచోట ఆగిపోయిన వాళ్ళం. ఇవి అన్నీ దాటినటువంటి ఒక పూర్ణ జ్ఞాన స్వరూపాన్ని మీరు అనుభవించాలి అంటే అరుణాచలం చేరుకోండి. అదే మీకు తగిన ప్రదేశము" అన్నారు. అన్న తర్వాత ఆయన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని ఓ బుక్కు రాశాడు. దాంట్లో రమణ మహర్షిని ఎట్లా దర్శనం చేసింది, అవన్నీ అయితే ఒకచోట అడుగుతారు. "భగవాన్ మీరు మౌనం ద్వారా అనేకమందికి వీక్షణ దీక్ష ద్వారా అనేక సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారే, ఈ మౌనానికి సంకేత భాష ఏమిటి? లిపి లేని ఈ భాషకి ఆ గాఢత ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలా ఉంటుంది?" అంటే అప్పుడు ఆయన అన్నారు, "భాషా ప్రవాహము, మాటల ప్రవాహము అసలు మౌనానికి అది అంతరాయం. అసలు భాష ఏది అంటే మౌనమే. అందుకనే మాట మలగాలి, మౌనం వెలగాలి. లోపల ఎ-- అవసరమైనప్పుడు మాత్రమే ఈ వాక్శుద్ధిని వాడాలి. ఈ క్షణం అయిపోయిన తర్వాత మనం మౌనభూమికలో ఉండాలి. మౌనభూమికలో గనక ఉండగలిగినట్లయితే మనం ఎవరితో కూడి ఉంటాము? మనతో మనం కూడి ఉంటాం. మనతో మనం కూడి ఉండగలిగితే దాని పేరు యోగం. మనలో మనం ఉండగలిగితే దాని పేరు ధ్యానం." ఇంతకు మించి లేదు. ధ్యానం ఏ ఇంటలెక్ట్ నిఏ జ్ఞానాన్ని! ఏ విజ్ఞాన సర్వస్వాన్ని! ఏ మమత్వాన్ని! ఏ కర్త్రుత్వాన్ని! ఏ అహంత్వాన్ని! సర్వాన్ని వదిలిపెట్టి అంతా నేనే, నేనే అంతా. నాకంటే మరొక వస్తువు భిన్నమైన పరవస్తువు లేదన్న ఒక దివ్యమైన ఏకాత్మ భావనలో నిలకడ చెందితే వాడి పేరు జ్ఞాని. ఆ జ్ఞానికే అచ్చ తెలుగులో స్వామి అని పేరు. ఇంకా మరి గ్రామీణ భాషలోకి వెళితే వాడి పేరు ఆసామి అని. ఆసామి, స్వామి, జ్ఞాని ఒక స్థాయికి చెందినవారు. అరుణాచలం మీద ఇట్లాగే ఒక హేమంత ఋతువులో సాయంకాలం వేళ భగవాన్ ఒక్కరే నిల్చొని ఉన్నారు. ఆకాశం నిండా చుక్కలు మొలిచి ఉన్నాయి. చంద్రుడు పరిపూర్ణంగా వెలుగులు విరజిల్లుతూ ఉన్నాడు వెన్నెల. ఆ వెన్నెలలో రాజగోపురాలన్నీ మెరిసిపోతున్నటువంటి వేళ తనలో తాను ఒక loud thinking అంటామే స్వాగతం అనుకున్నారు. ఈ కనిపిస్తున్న ఈ నక్షత్రాలు, ఈ సుషుమ్నా కిరణాలు, ఈ వెన్నెల దారాలు, ఈ అరుణాచలం, నేను నుంచున్న ఈ ప్రదేశం, నా చుట్టూ ఉన్నటువంటి ఈ galaxy అంటే ఈ ఖగోళము అంతా నేనుగా నాకు అనిపిస్తుంటే ఇందులో మరి నేనెవ్వరు? నాకంటే భిన్నమైన మరొక పరవస్తువు ఉన్నదా? అని ఒక స్థాయిలో నిలబడి పోయినారు. ఆ సమయంలో మన బోటి భక్తుడు ఒకడు దగ్గరకు చేరి "భగవాన్! చల్లని గాలులు కాదు చలిగాలులు వీస్తూ ఉన్నాయి. కొండ చిట్టచివర మనం ఉన్నాం. మేమంతా తట్టుకోలేక ఒక్కొక్కళ్ళం రెండు రగ్గులు కప్పుకొని ఉన్నాం. కౌపీనం తప్ప మరొకటి లేదే, అనారోగ్యం పాలవుతుందేమో దేహం కనుక నా దగ్గర ఒక spare కోటు ఉన్నది, అది మీకిస్తాను" అన్నాడు. భగవాన్ అన్నారు, స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమనే మరొక నాలుగు శరీరాలు. ఆ నాలుగు plus మూడు ఈ ఏడు శరీరాలతో అసలు ఆ సామి లోపల కుతకుతలాడుతున్నాడయ్యా, మళ్ళీ ఇంకో ఎనిమిదో కోటు ఎందుకు అన్నారు. అది ఆ సామి ఆత్మ అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మ స్వరూపంగా వెలిగిపోవడం ఒక రమణుల విషయంలోనే సాధ్యమైంది. ఎందుకంటే ఒక అనుభవం కలగవచ్చు, ఒక అనుభూతి చెందవచ్చు, ఒక స్థాయికి వెళ్ళవచ్చు కానీ తానేమిటో, తన ఉనికేమిటో, తన అస్తిత్వం ఏమిటో, తన పూర్ణత్వం ఏమిటో, తన మూలం ఏమిటో ఎరిగినటువంటి ఒక వ్యక్తి తనకు అక్కరలేని ఈ ప్రపంచంలో అదే అనుభూతిలో పదుపరి యాభై నాలుగు సంవత్సరాలు జీవించి మనతో మామూలు స్థాయిలో సంచారం చేయటం భారతీయ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. ఎక్కడైనా ఎప్పుడైనా జారిపోయే అవకాశం ఉన్నా ఎక్కడా బెదరనటువంటి ఒకే ఒక స్థాయిలో సంచారం చేశారు. ఒక మహారాణి ఆయన దగ్గరకు వచ్చి ఒక వెండి glass gift ఇచ్చింది ఆయనకి. "భగవాన్! మీరెట్లా ఒక రాగి glass లో, వేరే glass లో అలా తాగటం నాకు బాధగా ఉంది. మీరు ప్రత్యేకంగా మీ కోసం నేను చేయించుకొని వచ్చాను. రేపటి నుంచి మీరు దీంట్లోనే మంచినీళ్ళు తాగాలి. ఇది మీకే నేను ఇస్తున్నాను, ఇది మీరే వాడుకోవాలి" అని అన్నది. ఇవాళ్టి గురువు అయితే ఏం చేసేవాడు? "ఇంత చిన్న glass తెచ్చావే? glass తేవాలన్న ఆలోచన ఉంటే కంచం కూడా తేవాలిగా" అంటాడు ఇప్పటివాడు. ఆయన అన్నారు పక్కనున్న వారికి, పరిచారకుడిని పిలిచారు. వారు ఒక glass తెచ్చారు. వీరిని కాపలాగా ఏమంటున్నారు. వీరిని వీరే కాపలా కాసుకోలేని పరిస్థితిలో ఉన్నారు గనుక దానిని ఆఫీసులో ఇచ్చి వారికి ముట్టింది అని రసీదు ఇచ్చి వారిని ఇక్కడి నుంచి పంపండి. వాటితో మనకేం పని అన్నారు. అది, అది గురు స్థానం అంటే. అది గురువు, ఉత్తమ గురువు యొక్క స్థాయి అది మాత్రమే. అలాగే అన్నామలై అనేటువంటి ఒక తాపీ మేస్త్రీ. ఇవాళ మనకు కనపడేటువంటి రమణాశ్రమాన్ని కట్టినటువంటి తొలి రోజులలో ప్రతిరోజూ భగవాన్ దగ్గరికి వెళ్ళేవారు. ఏం చేయాలో, ఎలా చేయాలో perfect గా బొమ్మ గీసేవారు. దాని ప్రకారం ఆ తాపీ మేస్త్రీ పనిచేస్తూ ఉండేవాడు. అతను రమణాశ్రమం కట్టడానికి తాపీ ఉద్యోగానికి రాలేదు, భగవాన్ కోసం వచ్చాడు. కానీ భగవాన్ ఆయన ఏం పని చేయగలడో తెలుసు గనుక ఆ పని అతనికి అప్పజెప్పారు. పని అయిపోయింది. ఈ రోజు సాయంకాలం అయిపోగానే మామూలుగా అటువంటి ఒక తాపీ మేస్త్రీ స్థాయి వాడు లేదా మన బోటి వాడు గాని ఏం expect చేస్తాం? గురువు ఆశీర్వదించాలని, ఏదో అనుగ్రహించాలని, దగ్గరకు తీసుకోవాలని, ఒక ఉపాయం, బహుమతి ఇవ్వాలని ఏదో కోరుకుంటాడు. అదే క్షణంలో రమణులు అన్నారు, "ఇక్కడ పని అయిపోయినది గనుక మళ్ళీ మీరు రమణాశ్రమానికి రావద్దు" అన్నారు. అందరికీ భగవాన్ ఏమిటి ఇంత కఠినంగా ఎవరి పట్ల లేరే అని అనుకుంటే, ఈ అన్నామలై తన గురువు చెప్పారు గనుక, అవశ్యం అంటే వెంటనే మళ్ళీ రేపు కాదు చెప్పిన మరుక్షణమే రమణాశ్రమాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి ఓ చెట్టు కింద ఓ పూరిపాక వేసుకుని తాను ఉండటం మొదలు పెట్టాడు. మరునాడు సాయంకాలం నెమ్మదిగా అక్కడక్కడ నాలుగు ఇటుకలు తీసుకుని చిన్న గుడిసె తయారు చేసుకునే సమయంలో వెనక్కి తిరిగి చూస్తే భగవాన్ అక్కడ నిల్చొని ఉన్నారు. ఎందుకని అక్కడికి వచ్చారంటే, ఒకేమాట "భగవాన్! మీరెందుకు వచ్చారు?" అంటే "నిన్ను రావద్దు అన్నాను అంటే నేను రాను అని కాదు కదా. నువ్వు నాకు చేసినటువంటి నాకోసం నా పేరు మీద చేసిన సేవ కోసం నీది ఏర్పడేదాకా నేను వస్తూనే ఉంటాను. నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత జ్ఞానంగా, ఎంత పూర్ణంగా చేశావో నాకు తెలుసు. కనుక నీవు అన్నామలై స్వామి అన్నామలై కాదప్ప ఇకపై నీవు అన్నామలై స్వామివి" అన్నారు.అంటే ఒక తాపీ మేస్త్రీ గురువుకి గనక సేవ అఖండంగా నిస్వార్థంగా ఏకాగ్ర స్థితితో గనక చేసినట్లయితే ఆ గురువు నుంచి ఆయన పొందినటువంటిది శిఖరాయమానమైనటువంటి ఒక స్థితి అది. అందుకనే అన్నామలై స్వామి సాధువు కాదు, సన్యాసి కాదు, కేవల ఒక తాపీ మేస్త్రీ మాత్రమే. ఆ గురువుతో కూడి ఉన్నట్లయితే ఆ పువ్వు దారము పోలికలో దారానికి కూడా ఎట్లాగైతే పరిమళం అబ్బుతుందో అన్నామలై అన్నామలై స్వామి అయినారు. అలాగే ఇదంతా మనుషుల కథలైతే అరుణాచలం లో భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు, భక్తుడు అని మనం అనుకున్నాం గానీ ఆయన ఎవరినీ వీడు నా శిష్యుడు అని గానీ, వీడు నా భక్తుడు అని గానీ ఎన్నడూ అనలేదు. అట్లా అనటం కూడా ఆయన పెద్ద పట్టించుకోలేదు. "భగవాన్! ఈ ఆవుని మీకివ్వటానికి తీసుకొని వచ్చాను" అన్నారు. మరి వెండి గ్లాస్ వద్దన్న రమణులు ఆవును వద్దనాలి కదా? దీన్ని ఎవరు కాపలా గాస్తారు అనలేదు-- అనాలి కదా? అంటే భగవాన్ ఏమన్నారంటే, దానిని తీసుకు వచ్చేటువంటి విషయం వెనక మీకు ఇక్కడ ఉండాలని ఉన్నదని అర్థమవుతున్నది గనుక మీరు ఉండండి మీతో పాటు వారిని ఉండనివ్వండి. ఆవుని కూడా వారు అన్నారు. ఆ ఆవు భగవాన్ పెట్టిన పేరు లక్ష్మి. లక్ష్మి, భగవాన్ అరుణాచలం నుంచి పైనుంచి కిందకు వచ్చి సాయంకాలం వేళ దర్శనం ఇచ్చేటువంటి సమయంలో చెప్పుకున్నాం కదా, కౌపీనం తప్ప ఆయన శరీరం మీద ఏ వస్త్రం లేదు. వచ్చి ప్రేమగా ఆయన వీపు నాకుతూ ఉండేది. ఒక ఆవు నాలుక ఒక ఫైల్ లాగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. రక్తస్రావం అవుతుండేది. కానీ దేహ భ్రాంతి, దేహాత్మ భావన లేనటువంటి రమణులు అది ఎంత నాకినా సరే ఏ రకంగానూ దానికి అడ్డు చెప్పేవారు కాదు. చూసే వాళ్ళందరికీ ఇది వెళ్లిపోతే బాగుండును అనేవా-- అనుకుంటే భగవాన్ అనేవారు, "లక్ష్మి ఎంత పుణ్యం చేసుకుందో అరుణాచలంలో తిరుగుతూ ఉన్నది, వారిని అక్కడ ఉండనివ్వండి" అని అంటూ. సాకిన వైనం చాలా గొప్పది. భగవాన్ కి కూడా దాని యందు అపారమైనటువంటి కరుణా విశేషం ఉన్నది. అట్లాగే పరమ చరమమైనటువంటి ఆ ప్రాణ నిర్గమన వేళ ప్రాణం కొట్టుమిట్టాడుతున్నటువంటి వేళ భగవాన్ గబగబా కిందికి దిగివచ్చారు. దిగి వచ్చి నేలమీద అందరూ చూస్తుండగా కూర్చొని ఆ ఆవు తలని తన ఒళ్ళో పెట్టుకొని "ఏమ్మా! ఇంకా వెళ్ళా-- వెళ్లిపోదామని కనిపిస్తోందా? వెళ్తావా?" అంటూ దాని కళ్ళు నెమ్మదిగా మూశారు. భగవాన్ ప్రాపంచికంగా ఒక జీవుడికి ఎటువంటి సంస్కారం చేయ్యాలో అటువంటి సంస్కారం చేశారు గోవు లక్ష్మికి. ఒక గోవుకే కాదు ఒక కాకికి, ఒక కోతికి, ఒక మనిషికి. ఇలాగే పదకొండు గంటలకు ఇక్కడ భోజనం పెడతారు ఆశ్రమంలో. నాటి సాంప్రదాయమే ఇప్పటికి కూడా. పదకొండు గంటలకి కరెక్ట్ గా బెల్లు కొట్టి వేళ అందరూ క్యూ లో వెళ్తున్నారు ఎవరో నలుగురు మాత్రం మాసిన బట్టలతో గబగబా దాంట్లో జాయిన్ అయిపోయినారు. అక్కడ ఎవరో గమనించారు ఈ నలుగురినీ, భగవాన్ దగ్గరికి వచ్చి "భగవాన్! చూశారా, మీరు భోజనం చేసేటువంటి వేళ ఇది, పరమ పవిత్రమైన వేళ. మీతో పాటు మేమందరము కూర్చొని భోంచేసే వేళ. ఈ నలుగురూ జొరబడ్డారు భగవాన్. వీళ్ళెవరో తెలుసునా? వీరూ ఇప్పుడే ఒక శవాన్ని దహనం చేసి వచ్చిన శవ వాహకులు వీళ్ళు. స్నానం చేయాలన్న ఇంగితం కూడా లేకుండా వచ్చేసారే." అని అన్నప్పుడు భగవాన్ అన్నారు, "వారిని గురించా మీ ఆలోచన? మనం కూడా నిత్య శవ వాహకులమే కదా. మన శవాన్ని మనం మోస్తూ తిరగటం లేదా? మన శవాన్ని మనం ఉన్నంత కాలం మనం మోస్తున్నాం. మనం దీన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక నలుగురు మోస్తారు. ఎంత పుణ్య కార్యం చేశారో వారిని ముందు భోంచేయనివ్వండి" అన్నారు. సాంప్రదాయ ధిక్కారం కాదిది. కరుణాపూర్ణ శతాబ్ది అంటే ఇటువంటి సన్నివేశాలలో నుంచే ఒక పరమాద్భుతమైనటువంటి అవతారమూర్తి యొక్క వైశిష్ట్యము ఆవిష్కరింపబడుతుంది.
SSSMC · audio
Talk on Sri Ramana Maharshi Philosophy - 02
Talk on Sri Ramana Maharshi Philosophy - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 28:43
More in this series