No transcript for this section.
Transcript begins at 0:00.
[పాట] మందారు జనమందారం నందే సై మహేశ్వర ప్రియాతీత పదస్థితాం సకలం జ్ఞానాగ్ని శేష సవితాం మజ్జమాంతః యపాకవిసప్రాప్తం సకలం సత్యసాయి ఈశ్వర ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశబ్దం గుణురూపం తత్ బ్రహ్మ స్వరూపా పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణాలవి వాలు [దగ్గర ఉన్నవి వస్తువుల శబ్దం] ప్రణామ సహస్రం సమర్పిస్తూ [దగ్గర ఉన్నవి వస్తువుల శబ్దం] తిప్పెడ్పల్లి సమితి సత్య సాయి భగవానుడి దివ్య అనుగ్రహ విశేషం చేత ఒక సంవత్సర కాలం సంకల్పించుకున్నటువంటి ఈ వాఙ్మయ తపస్సు కలిగించి అనేక క్షేత్రాలలో సనాతనమైన వైదికమైనటువంటి ధర్మ సంస్థాపన జరగాలి. ఇవాళ భౌతిక ప్రపంచంలో మనకి అందరి సుఖాలు లేవు, దొరకని డబ్బు లేదు, ప్రపంచమంతా పరచుకొని తెలుసుకొని మన ముందే ఉన్నది. కానీ చిత్తశాంతి లేదు, ఆనందం లేదు, హాయిగా నవ్వగలిగినటువంటి స్థితులు లేవు, ప్రశాంతంగా ప్రసన్నంగా జీవించగలిగిన అవకాశాలు మనం పోగొట్టుకుని కూర్చున్నాం. మరి దీన్ని మళ్ళీ ఒక వైదిక మార్గంలో అంటే ఒక ధర్మ మార్గంలో సనాతనమైనటువంటి ఒక మార్గంలో పునః ప్రతిష్ఠ ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు కృతయుగం అంతా కూడా యజ్ఞమయం అయింది. యజ్ఞాలు చేశారు, జాపాలు చేశారు, తపస్సులు చేశారు. అయితే వాళ్ళు చేసిన యజ్ఞాలన్నీ కర్మకాండలకు సంబంధించినవి కాదు. మనస్సుని పరమేశ్వరునితో అనుసంధానం చేసి అసలు ఈ కనిపిస్తున్న ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మం కాని వస్తువు అంటూ ఒకటి లేదు. ఈ లోకము కాని మరొక లోకం లేదు, ఒకవేళ ఉన్నా అది ఇది ఒకటే అనేటువంటి ఒక తాత్వాత్మకమైనటువంటి భావాలతో వాళ్ళందరూ కూడా అంటే ఆ యుగ జీవులందరూ కూడా తన జీవితాలని ధన్యవంతం చేసుకున్నారు. మరి పరమేశ్వరుడు ఏం చేస్తున్నాటివ్వాలి? పరమేశ్వరుడు కూడా తాను చేయవలసిన పని తాను చేస్తూ వచ్చాడు. శ్రీ మత్స్య కూర్మ వరాహ నరుసింహ అవతారాలైతే వేదోద్ధరణ చేశాడు, ధర్మోద్ధరణ చేశాడు. సముద్రంలో మునిగిపోయినటువంటి వేదాలను మళ్ళీ తీసుకుని వచ్చి లోకానికి అప్పగిప్పాడు. ఇవి గనక మాయమై నీట్లో కరిగిపోయినట్లయితే ఆ తర్వాత మంచి మాటలే వినబడని, కనబడని రోజులు వస్తాయి గనుక రాబోయే యుగాలను దృష్టిలో పెట్టుకొని పరమేశ్వరుడు ఒక సంపూర్ణమైనటువంటి సేవ చేశాడు లోకానికి. మానవుని కంటే ఏ యుగంలోనైనా మాధవుడు చేసిన సేవ ఏముంటది? ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. ఇది అంత తేలికగా వచ్చేది కాదు, వచ్చింది కాదు. ఇది మనం కూడా మన సంస్కారం చేత, ధర్మ నిబద్ధత చేత, సౌశీల్యం చేత, భక్తి భావం చేత ఒక సంస్కార ధార చేత, ఒక సంస్కృతి వైభవం చేత ఈ జన్మ తీసుకుని వచ్చాం. ఇవన్నీ లేకపోతే ఈ జన్మ మనం ఎత్తు ఉండేవాళ్ళం కాదు. కనుక కృతయుగంలో పరమేశ్వరుడు చేసిన సేవ ఏమిటి అంటే వేదోద్ధరణ ప్రధానంగా చేశాడు. వేదము అంటే విద్యను నిలబెట్టాడు. ఏ విద్యను నిలబెట్టాడు? ఇటు లౌకిక, అటు పారలౌకిక రెండు విద్యలని సమన్వయం చేస్తూ ఆత్మవిద్య వైపు మానవుడిని నడిపించే ప్రయత్నం పరమేశ్వరుడు చేస్తూ వచ్చాడు. కనుకనే అనేకమైనటువంటి అవతారాలు ప్రధానంగా నరసింహ అవతారం వచ్చేసరికి భక్తి భావాన్ని జగత్తులో నిలపటానికి హరి లేడు అన్నటువంటి ఒక హిరణ్యకశిపుడి కడుపున హరి ఉన్నాడు అన్న ప్రహ్లాదుడికి జన్మనిచ్చాడు. కలడందడుడు దీనులయెడా అని మనకి ఆ పద్యాలు అంటే వచ్చు. ఉన్నాడో లేడో అంటే కలడు కలండనిడు వాడు కలడో లేడో అంటే లేకపోతే ఏంటి అసలు ఉన్నదంతా వాడేనన్నాడు. నువ్వు చూపిస్తావా అన్నాడు. నేను చూపిస్తానన్నాడు. నేనేమని చూపించడానికి? నువ్వు కూడా కోరుకో ఆయనే వచ్చి నీకు దర్శనమిస్తానన్నాడు. అంటే పరమేశ్వరుని యందు ఒక ధృడమైనటువంటి భావాన్ని, భక్తి భావాన్ని కలిగిస్తూ ఈ తపస్స్వాధ్యాయ యోగాలని దాటి మానవుణ్ణి భక్తి రంగంలోకి ప్రవేశపెడుతూ కృతయుగం అంతం అయిపోయింది. ఇక త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేప్పటికి మత్స్య కూర్మ వరాహరులు లేరు, నరసింహుడు లేడు. పూర్ణ మానవ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు. ఏడవ అవతారంగా వచ్చాడు. వచ్చి ఆ కాలమంతా యజ్ఞ కాలం, యాగ కాలం, యోగ కాలం, అద్భుతమైన కాలం. జ్ఞాన కాలం కూడా. మిథిలా నగరం అంతా కూడా రాజర్షి అయినటువంటి జనక మహారాజు కారణంగా అక్కడ శుకదేవుడు, యాజ్ఞవల్కుడు అటువంటి వారు ఆయన దగ్గరికి శిష్యరికం చేయడానికి వచ్చారు, ఆత్మజ్ఞానం పొందటానికి వచ్చారు. వేదవ్యాసుల వారిని శుకుడు అడిగాడు.నన్ను అక్కడికి ఎందుకు పంపుతున్నావు? నీకు తెలియని విద్య రాజ్యం పాలించేటువంటి జనకుడికి తెలుస్తుందా తండ్రీ? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? అని అడిగాడు. అప్పుడు వ్యాసులవారు అన్నారు "నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడ మాట్లాడుతున్నది అంతా theory. అక్కడికి వెళితే వైరాగ్యం అంటే ఏమిటో, ఒక రాజ్యపాలన చేసేటువంటి రాజు యొక్క మనస్సు ఆత్మవిచార మార్గంలో ఎంతగా మమేకమై ఉన్నదో, ఆత్మ ప్రజ్ఞ ఎట్లా ప్రతిఫలిస్తుంటదో నువ్వు వెళ్ళు. వెళ్ళినట్లయితే జనక మహారాజు కొలువులో నీకంటే ముందు యాజ్ఞవల్కుడు వెళ్ళాడు. అక్కడ అహల్యాదేవి కుమారుడు అయినటువంటి శతానందుడు అక్కడే ఉన్నాడు. ఆయన మాములుగా ఏడు, ఎనిమిది రకాల ఆనంద స్వరూపాలు ఉండే ఆయన శతానందుడై ఉన్నాడు. ఒక్కొక్క ఆనందమూ వంద రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి వాడు. గౌతమ మహర్షికి అహల్యాదేవికి జన్మనిచ్చిన వాడు. వారి దర్శనం చేసుకో. ఒక రాజు రాజ్యాన్ని ఎలా పాలిస్తున్నాడో భగవత్ ప్రీత్యర్థమై తన కార్యకలాపాలు ఎట్లా సాగిస్తున్నాడో గమనించుకో. అందుకై నువ్వు వెళ్ళాలి" అని శుకదేవుడిని పంపించాడు. శుకదేవుడు, శుకావధూత, శుకమహర్షి ఈ మూడు ఆయనకి చెల్లినాయి. దేవుడు ఎందుకైనాడంటే ఆత్మను కనుగొన్నాడు గనుక. మహర్షి ఎందుకైనాడంటే మహస్సుని ఎరిగాడు గనుక. అవధూత ఎందుకైనాడంటే, అమదానంద విమల ధామమై వర్తమాన వర్తిత అత్యధాకారకమై ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చరణమై నిలచునీ జగతి అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత. ఒక నిర్మలమైన నిశ్చలమైనటువంటి, ఏది పట్టని, ఏది అంటని, దేనిని అంటించుకొని ఒక ఉదాత్తమైనటువంటి వైఖరిలో అడుగు శుకదేవుడున్నాడు. శుకావధూత ఉన్నాడు. అవధూత ఈ లోకంలో వర్తమానంలో సంచరిస్తాడు. జన్మాంతరమైనటువంటి ఏ సంగతులు ఆయనకు లేవు. పరారధ్ధాలు లేవు. భగవంతుని యందు మనస్సుని లగ్నం చేసి ఉంచుకుంటాడు. కనుకనే ఉన్మత్తుడు, పిశాచి, అవధూత, వారుడు ఈ నలుగురూ కూడా అవధూత స్థాయికి చెందినవారు. కనుక శ్రీరామచంద్రుని ఆగమనంతో జరిగింది ఏమిటంటే లోక కళ్యాణం ప్రారంభమైంది. ఈ జగత్తు ఆశామయ జగత్తు ఇది. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. ఏది దొరికినా దీనికంటే భిన్నమైనది కావాలని కోరుకుంటుంది. ఉన్నదానితో తృప్తి చెందడని మానవుని జీవితం కనుక ఇంకేదో ఏదో కావాలని కోరుకునేటటువంటి మనోమయుడైనటువంటి మానవుడిగా వచ్చాడు రామచంద్రుడు. కనుకనే శ్రీరామచంద్రుడికి వశిష్ఠులవారు ముప్పై మూడు వేల శ్లోకాలలో యోగవాశిష్ఠం ద్వారా బోధ చేశారు. అది మనస్సును నిలకడ చెందించుకునే ఒకానొక అద్భుత స్థితి. మనస్సును నిలకడ చెందించుకోవాలి. దానిని నిగ్రహం చేయాలి. దానిని నిర్లిప్తం చేయాలి. దానిని నిశ్శేషం చేయాలి. అది యోగవాశిష్ఠం నిండా రామచంద్రుడు వశిష్ఠులవారు మాట్లాడుకుంటే శ్రీరాముడి యొక్క మనస్సుని లోక కళ్యాణం చేయటానికి ఆయత్తం చేసిన వాడు వశిష్ఠులవారంటే, ఆయత్తమైనటువంటి మనస్సుని ప్రపంచంలోకి తీసుకువెళ్ళిన వాడు విశ్వామిత్రుడు. లోకమంటే ఏమిటో, తాటక అంటే ఏమిటో, మారీచుడు అంటే ఏమిటో, సుబాహు అంటే ఏమిటో, ఆపై కబంధుడు అంటే ఏమిటో, ఎలాంటి వాళ్ళు ఎదురు కాబోతున్నారో, ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని సంసిద్ధం చేశారు. ఒక మానవాతీతమైనటువంటి శక్తిని మానవ దేహంలో ప్రవేశ పెట్టి శ్రీరామచంద్రుడిని పూర్ణ మానవుడిగా ఆవిష్కరించినటువంటి మహా మనుముపేతమైనటువంటి గురు స్థానము విశ్వామిత్రుల వారికి. కనుక లోక వాశిష్ఠము జ్ఞానకాండ అయితే విశ్వామిత్రుల వారిదంతా కర్మకాండం. కనుకనే ఈ ఇద్దరు గురువుల మధ్యలో రామచంద్రుడి మనస్సు దశరథ రాముడై, రఘురాముడై, ప్రజా రాముడై వచ్చినప్పటికీ కూడా ఆయన మనస్సు యోగాత్మకమైంది. యోగము అంటే తాను చేయబోయేటువంటి పని యందు లక్ష్యం కలిగి ఉండటం. తన యందున్నటువంటి జీవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో అనుసంధానం చేయటం. తాను దైవం కావటం యోగంలో లేదు. యోగం ప్రసాదించదు. యోగం యొక్క లక్ష్యం ఏమిటంటే మనలో ఉన్న జీవ ప్రజ్ఞని పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞతో కలిపి కూర్చి ఉంచుతుంది గనుక మనం చేసే పనులన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క కార్యకలాపంలో భాగమైపోతాయి. అందుకనే వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మహాత్ముడు అంటే ఆత్మను ఎరిగిన వాడు అని కాదు. మహాత్ముడు ఎవరు అంటే వచస్యేకం ఏమి అంటున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో, మనస్యేకం ఏమి ఆలోచిస్తున్నాడో, అంటే మాట ఆలోచన ఒకటవ్వాలి. కర్మణ్యేకం దానినే చేయాలి. చేయగలిగింది చెప్పాలి, చెప్పగలిగింది చెప్పినది చేసి తీరాలి. ఈ రెండింటికీ ఏ రకమైన తేడా లేకుండా ఉండాలి గనుక శ్రీరామ అవతారం అంతా కూడా ధర్మ స్వరూపం కనుక రాముడి మనస్సు ధర్మబద్ధం కావాలి గనుక రాముణ్ణి లోక కళ్యాణం కోసం ఈ జగత్తు వినియోగించుకున్నది. అందుకనే శ్రీరాముడు ఏం చేశాడు? పదకొండు వేల సంవత్సరాలు పాలించాడు అన్నప్పుడు రాముడు పాలించిన పదకొండు వేల సంవత్సరాలు రామ రాజ్యం కాదు. ఏది రామ రాజ్యం అంటే అయోధ్య నుంచి పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్యలో రాముడు లేని కాలమే రామ రాజ్యం. రాముడు ఉన్నాడని జీవించారు వాళ్ళు.కనుక ప్రతి వ్యక్తి కూడా దైవ శక్తిని రామ శక్తిని తాము నమ్ముతున్నారు. తాము చేయవలసినటువంటి నిత్య నైమిత్తికమైనటువంటి ధర్మకాండలన్నీ కూడా యధాతథంగా మా రాముడు అంతఃపురంలో ఉన్నాడు అనుకున్నారే తప్ప అరణ్యానికి వెళ్ళాడు ఎన్నవస్తాడో రాడో అనుకోల. పద్నాలుగేళ్ళు కాగానే మా రాముడు వస్తాడు. పట్టాభిషిక్తుడు అవుతాడు. మమ్మల్ని ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. ముగ్గారు పంటలు పండిస్తాడు. మాకు శాంతిని కాంతిని దాంతిని హాయిని అన్నింటిని వరదానం చేస్తాడు అన్నటువంటి ఒక అచంచల విశ్వాసంతో రాముడు లేనటువంటి కాలాన్ని రామరాజ్యం చేశారు అయోధ్యా నగర ప్రజలు. ఇది అసలు యాగము ఇది అసలు యోగము. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు అరణ్యంలో భార్యతో తమ్ముడితో కలిసి వెళ్ళాడు. కొంత ప్రయాణం అయిన తర్వాత పదమూడు సంవత్సరాల ప్రయాణం తర్వాత ముగిస్తున్నటువంటి వేళ భార్య నుంచి ఆయన దూరమయ్యాడు. ఒక్క ఏడాదిపాటు నియోగాన్ని అనుభవించవలసిన ఒక పరిస్థితి వచ్చిన ఇంతవరకు చాలులే అడిగేవాడు ఎవడు అని ఆయన వెనక్కి వెళ్ళలా. రావణ వధ చేయాలి ధర్మసంస్థాపన చేయాలి తాను ఏ కార్య నిమిత్తమై కాల కార్యకారణ నిమిత్తమై వచ్చాడో ఆ పనిని సంపూర్ణం చేసి మళ్ళీ అయోధ్యా నగరానికి వెళ్ళి ఇక్ష్వాకురాజు అనే రాజ్యాన్ని పాలించాలి. ఈ ఈ విషయంలో ఆయనకెట్టి సందేహం లేదు. కనుక ఆ కార్యక్రమంలో నరులు ఎవ్వరూ ఆయన చుట్టూ లేదు ఇది విచిత్రం. శ్రీరాముడంతటి వాడు నారాయణుడంతటి వడు శ్రీరామ స్వరూపుడిగా వస్తే ఒక్కడై అయోధ్యను వదిలిపెట్టి వెళ్లిపోతే నరుడన్నవాడు ఆయన పక్కన లేడు ఎవరున్నారు? వానరులున్నారు. ఆ వానర సైన్యం అంతా కూడా రామకార్యంలో నిమగ్నమైపోయింది. అంకితమైపోయింది. మా జన్మలన్నీ ధన్యమైపోతాయి రాముడికి సేవ చేస్తే. రాముడికేమి సేవ కావాలి? రాముడి ద్వారా లోకకల్యాణం జరగాలి అది సేవ. రాముడికి అక్కరలేదు. రాముడు ఒక బాణాన్ని సంధానం చేసి ఒక్కసారి అయోధ్య నుంచి గనక వదిలిపెడితే అది లంకదాకా వెళ్తుంది. రావణ బ్రహ్మ పది తలలు నరకటానికి నేను వస్తున్నానని ఆయన చెప్పాడు. దశరథుని ఇంట పుడతా దశకంధరుడి కుత్తుకను ఉత్తరిస్తా దశయుగాల వరకు రామనామము తారక మంత్రమై వినపడేట్టుగా ధర్మసంస్థాపన చేస్తా అని మహావిష్ణువుగా ఉండగా ప్రమాణం చేశాడాయన. అయినా ఆయన ఆ అవతారంలో వానరులందరికీ కూడా ఒక అవకాశమిచ్చాడు. నేను సేవ చేస్తున్నాను అన్నది అహంకారం. నాకు ఈ సేవ ఇవ్వబడింది అనేటువంటిది అది అద్భుతమైనటువంటి లోభం. సేవ అందుకునే వాడికి మనం నమస్కరించాలి. అందుకునేవాడు లేకపోతే సేవ ఎవరికి చేయాలి. కాబట్టి ఇందులో ఎవరు ఉదాత్తమైన వ్యక్తి అంటే సేవ చేయటానికి అవకాశమిచ్చిన వాడు ఉదాత్తమైనటువంటి వ్యక్తి గనుక శ్రీరామచంద్రుడు వానరులందరికీ ఇచ్చాడు. ఒక్క వానరులకే ఇచ్చాడా? సముద్రునికి ఇచ్చాడు. జానాతి రామ తమ నామ రుచుం మహేషు అంటూ శంకర భగవత్పాదులు చెప్తారు. వదతి వదతి వాణి రామ రామేతి మంత్రం సరస్వతీదేవి కూడా రామనామం చేసుకుంటుంది. ఆమె ఏం జపం చేస్తుంది అంటే వదతి వదతి వాణి రామ రామేతి మంత్రం. రామా రామా రామా అంటే దానిలో నుంచి సప్తస్వరాలు అక్షరాలు అలా వెంబడి వెంబడి వచ్చి అవి పదాలై వాక్యాలై కావ్యాలై మహాద్భుతమైన వాఙ్మయ సృష్టి జరుగుతుందట. అంటే ఈ ప్రపంచానికి మూలమైనటువంటి మంత్రము తారక మంత్రము ఏది అంటే రామనామమై నిలిచింది. అటువంటిది ఆ వెళుతున్నప్పుడు వానరులంతా వెళుతున్నారు. యధాధమనంలో మనం విన్నాం. బండరాయి వేయగానే మునిగిపోతూ ఉన్నది. రాముడికి కాస్త కోపం వచ్చింది కోపం నటించాడు. పరమేశ్వరుడికి కోపం వస్తే ఆయన పరమేశ్వరుడు కాదు కదా. కోపం నటించకపోతే పని జరగదు కదా. ఆ తీక్షణంగా చూసే సమయంలోనే సముద్రుడు మధ్యలో నుంచి వచ్చాడు. వచ్చి శంకర భగవత్పాదులు శ్రీరామ చరణామృతంలో ఒక అద్భుతమైన రచన చేశారు రాముడి గురించి. ఆ రచన ఏంటంటే అది జానాతి రామ తవ నామ రుచిం మహేషు రామా! నీ నామ మహిమ ఎవరికి తెలుసు చెప్పురా? రామదాసుకో చాగరాజుకో కాదు రుచిం మహేషు పరమేశ్వరుడు ఒక్కడికే తెలుసు నీ రామనామ మహిమ. అట్లాగే జానాతి రామ తవ నామ రుచిం మహేషు జానాతి దూర్బల పరాక్రమము ఈశజాకో నీ పరాక్రమం ఎవరికి తెలుసంటే శివ ధనుస్సును అడగండి చెబుతుంది అది. జానాతి గౌతమసతి చరణ ప్రభావం రామా! నీ పాద ప్రభావం ఏమిటంటే పోయి అగల్యాన్ని అడగండి. అని సముద్రున్ని గనక అడిగినట్లయితే నీ బాణ పటిమ ఏమిటో సముద్రుడు చెప్తాడు. ఇంకా బాణం తీయలేదు ఆయన. నువ్వు నాకు అడ్డం తొలగకపోతే ఇట్లాగే నీళ్ళల్లో గనక మునిగిపోయినట్లయితే యుద్ధం నీ మీద ప్రకటిస్తా అన్నాడు రాముడు. అనుకున్నాడు. బాణం తీసేలోగా సముద్రుడు బయటికి వచ్చాడు. వచ్చి అన్నాడు రామకార్యంలో నేను అడ్డు ఉంటానా? నీకు కోపం తెప్పించకపోతే నువ్వు నాకు దర్శనం ఇప్పిస్తావ్. కాబట్టి కాస్త అడ్డు తగిలా. అడ్డు తగలాలి గనుక నువ్వు బయటికి వచ్చావ్. నా జన్మ ధన్యమైంది. ఇక ఈ సముద్రంలో ఏ రాయి మరగదు అన్నాడు. ఇవన్నీ వింటున్నది ఒక చిన్న జంతువు. ఉడత. అనుకున్నది ఇంతమంది రాముడి పని చేస్తూ ఉంటే ఇంతమంది శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ జయజయ ధ్వానం చేస్తూ వెళ్ళిపోతూ జీవితాన్ని ధన్యవంతం చేసుకుంటూ ఉంటేనేను ఏమీ చేయకుండా ఉండనా? నేనేం చేయగలను అంటే ఒక బండకి బండకి మధ్య ఉన్నటువంటి ఇసుకని తొలగించే ప్రయత్నం చేసింది. ఆ దృశ్యం శ్రీరామచంద్రుడికి కనపడింది. కరిగిపోయిండంట. కరుణాపూర్ణ సుధాబుధి అయినటువంటి రామచంద్రుడి గుండె కరిగిపోయింది, కరిగిపోయింది. దాన్ని ఇసుకతో పాటుగా అరచేతిలోకి తీసుకున్నాడాయన. ఆ అరచేతిలో ఉడత ఎప్పుడూ కూడా అది వెదిరిపోయే అటువంటిది అది. మనల్ని చూడగానే పారిపోతుంది అది. చాలా వేగంగా వెళ్ళిపోతుంది. దానికి అనిపించాలి దాన్నెవరో చూస్తున్నారు అని, ఎక్కడుండదు. అటువంటిది శ్రీరామచంద్రుడు ఆయన రామభద్రుడు గనుక ఆయన అరచేతిలో హాయిగా, ప్రసన్నంగా కూర్చుంది. ఆ ఇసుక జారిపోయేదాకా రాముడు దాన్ని మోసాడు. ప్రేమగా నిమిరాడు. ఆ నిమిరినప్పుడు ఏర్పడినటువంటి మూడు చారలే అని మన వాళ్ళు మనకి అంటే రాముడి యొక్క కార్యక్రమంలో కాస్త ఇసుక పక్కకు తొలగించినా ఆ రాముడి అనుగ్రహం చినుకుత్రయే మన మీద నిలబడుతుంది అని మనకి ఒక ప్రోత్సాహం ఇచ్చేటటువంటి ఒక పౌరాణిక వాఙ్మయ గాథ ఇది. కనుక జంతువులు, వానరులు వీళ్ళందరూ కూడా రామకార్యంలో ఉన్నారు. ఇంతే కాదు శ్రీరామచంద్రుడికి ఒక అత్యవసరమైనటువంటి సేవ చేసిన వాడు ఎవరు అంటే రావణ బ్రహ్మ తమ్ముడైనటువంటి విభీషణుడు. గుట్టు చెప్పలా, లంకానగరం గుట్టు ఎక్కడైనా వెళ్ళి చెప్పలా. ఆయన పరమ భాగవతోత్తముడు. రాముడితో నువ్వు అధర్మయుద్ధం చెయ్, రాముడు ధర్మస్వరూపుడు, రాముడు విష్ణువే. ఆయనతో నీకేం పనిలేదు. రాముడికి సీతమ్మవారిని అప్పజెప్పేసెయ్. మన లంకానగర వైభవాన్ని నిలబెట్టు అని హితోక్తి చెప్పాడు. మృదువచనం చెప్పాడు. భాగవతోత్తముడిగా అస్తేయము, అపరిగ్రహము అనేటువంటి రెండింటిని వదులుచుకోమన్నాడు. నీది కాని వస్తువుని నాది అని అనుకోవద్దన్నాడు. అది నీది కాదు. నీ జన్మకి ఆమె రాముడి భార్య అది అంతే. నువ్వు దాన్ని ఎలా అడుక్కుంటావు? ఆ భార్య నాకు కావాలని నువ్వెలా కోరుకుంటావు? అని ఇన్ని మాటలు చెప్పినా వాడు చెవికెక్కించుకోని కారణంగా నేను ఇక్కడ ఉండటం మర్యాద కాదు అనుకున్నాడు. తెలివిగలవాడు ఎవడైనా సరే ఇక్కడ జరుగుతున్న దానిలో మర్యాద లేదు అన్నప్పుడు వాడు దర్శనపడడు. తగాదా పడడు. అక్కడినుంచి తప్పుకొని వెళ్ళిపోతాడు. ఎవరినీ ఏమీ మాట్లాడడు. ఒక్కమాట మాట్లాడడు. తప్పుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక మాటామంతంలో నుంచి స్పర్ధలు మొదలవుతాయి. కనుక విభీషణుడు రామశిబిరానికి వస్తే హనుమంతుడు ఒప్పుకోలేదు. బూటచారిగా వచ్చాడన్నాడు. రాముడన్నాడట. తన లంకని, తన అన్నని, తన కుటుంబాన్ని, తన వైభోగాన్ని, తనకున్న సుఖాలను వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చాడు, శరణాగతి పొందాడు గనుక నేను విభీషణుడిని నేను కాచుకుంటానన్నాడు. కొంతకాలం అయిన తర్వాత విభీషణుడు ఏకాంతంలో హనుమంతుని ఒక ప్రశ్న చేశాడు. వానర యోధులు, వానర యోధులు, వానర సమూహం ఉంది. వాటితో పాటుగా నేను ఉన్నాను. కానీ శ్రీరామచంద్రుడి యొక్క ప్రేమను ఎలా పొందగలిగావు నువ్వు? ఆ రహస్యం నాకొక్కటి చెప్పు హనుమా. నా భక్తిలో లోపం లేదు, నా శరణాగతిలో లోపం లేదు, నాకు రాముడంటే ఇష్టం లేదంటంలో లోపం లేదు. అసలు నా మనసులో రాముడు దైవమే, విష్ణువే. అయినా శ్రీరామచంద్రుడి సంపూర్ణమైన ప్రేమను నేను పొందలేకపోతున్నాను. కానీ నువ్వు పొందగలిగావు. ఆ తిట్టు నాకు చెప్పు అన్నాడు. రాముడు దైవము అని నమ్మి ఆగిపోయినావు. రాముడు పరమాత్మే అని నమ్మి ఆగిపోయినావు. కానీ రాముడికి నువ్వేమీ సేవ చేయలే. రాముడికి సేవ చేయటం మొదలుపెట్టు రాముడు నీవాడైపోతాడన్నాడు. తిట్టు చెప్పేశాడు హనుమ to భగవంతుడు సత్యసాయి భగవంతుడు కోడె మీద రాసినా ఒకటే, నోట్లో అనుకున్నా ఒకటే. ఆయన మనవారేప్పుడవుతారంటే సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? రాముడికి సేవ ఏముంది? స్వామికి సేవ ఏముంది? మరి ఎవరికి చేయాలంటే ఆ ఆలోచనలకి, ఆశయాలకి, ఆదర్శాలకి అనుగుణంగా ఆ కార్యక్రమాలలో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే అది సేవైనప్పుడు స్వామి మనవారైపోతారు. మనకున్న ఆస్తులన్నీ ఆయనకి రాసిచ్చినా ఆయన మనవారు కావు. ఎందుకంటే ఇచ్చిన ప్రతివాడి దగ్గర ఆయన తీసుకోలేదుగా. ఆయన అంగీకరించలేదుగా. ఎవరో కొంతమంది వాళ్ళు ఎక్కడో ఒక మహాద్భుతమైన తపశ్శక్తి ఉన్నటువంటి వారు గనుక ఆ ధనంతో స్వామి కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్లాగే ఇక్కడ రామచంద్రుడు కూడా కిష్కింధ నగరాన్ని వాలివధ అయిపోయిన తర్వాత సుగ్రీవుడికి అప్పగించేశారు. అదే నిర్లిప్తత. ఎందుకని సేవ చేశాడు గనుక. ఆ సేవలో హనుమ సుగ్రీవుడికి సేవ చేస్తూ ఒక మాటన్నాడు. సుగ్రీవా! రాముడు వచ్చేదాకా నువ్వు రాజువి. నువ్వు యజమానివి. నేను నీకు మంత్రిని, నీ బంటుని. ఇప్పుడు మన ఇద్దరికీ స్వామి వచ్చాడు, రాముడు. కనుక నేను ఇప్-ఇకపై రాముడు నాకు యజమాని. రాముడు నాకు స్వామి. నేను ఆయనతో ఉంటున్నాను. ఆయన కార్యక్రమాలు చేస్తాను అంటూ సేవా కార్యక్రమం చేశారు. ఎవరూ చేయలేని, సాహసించలేని పనులు చేశారు. ఒకటి సీతాన్వేషణ చేశారు. ప్రాణత్యాగం చేయబోయినాడు. అయినా నిర్భయంగా మళ్ళీ వచ్చి అమ్మవారి సంగతులన్నీ అయ్యవారికి చెప్పారు. స్వామికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించారు. రెండవది లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు, ప్రాణాంతకమైనప్పుడు సంజీవి మొక్క ఎట్లా ఉంటుందో ఆయనకి తెలియదు గనుక పర్వతాన్నే పెకలించి తీసుకొచ్చి ప్రాణవదానం చేశాడు. అట్లాగే సేవ చేయటంలో ఆనూ పానూ తెలిసేటట్లుగా లంకానగరంలో వీధి వీధిని, ఇంటి ఇంటిని తరిమి చూశాడు.అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ మనసులోకి ఎక్కుతున్నాడు. రామరావణ సంగ్రామం జరుగుతున్నటువంటి వేళ హనుమంతుడు చేసినటువంటి సేవ పరమోన్నతమైనటువంటి సేవ. ఇది త్రేతాయుగం అయిపోయింది, రాముడు పట్టాభిషిక్తుడు అయినాడు. ఎప్పుడూ త్రేతా ఉండదు కదా ద్వాపర యుగం వచ్చింది. రాగానే కృష్ణ పరమాత్మ వచ్చేశారు. కృష్ణ పరమాత్మ వచ్చి జన్మ ఎత్తిన కొన్ని నిమిషాలల్లో చెరసాలలో నుంచి బయటపడి, ప్రజా భూమికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి తన లీలా కాండ ప్రారంభించి, కురుక్షేత్ర సంగ్రామమై ఉత్తర గీత చెప్పే దాకా కృష్ణ పరమాత్మ ఏ భోగాన్ని అనుభవించలేదు. తన భక్తులైనటువంటి పాండవులు ఐదుగురు, కుంతి, ద్రౌపది ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాల్లో వాళ్ళతో ఉన్నాడు భగవంతుడు. అంటే రాముడి సేవలు వానర సైన్యం అంతా చేస్తే, ఇక్కడ మాధవుడే సేవ చేసినటువంటి సందర్భం ద్వాపర యుగం అంతా. కృష్ణుడే సేవ చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ ధర్మ సంస్థాపన చేస్తూ వెళ్ళాడు. కడగా మహాభారత సంగ్రామం జరుగుతున్నటువంటి వేళ, రాత్రిపూట ఆదమరిచి పాండవులంతా నిద్రపోతూ ఉంటే, భాగవతంలో దశమ స్కంధం తొలి పద్యాలు చదవండి. దాంట్లో భాగవతంలో పోతనామాత్యుల వారు అక్కడ ఉండి చూసి రాసినట్టు రాశారు. కాలి పిట్టలలో ఇరుక్కున్నటువంటి ఇనుప ముక్కలు, బాణాలు అవన్నీ కూడా దుర్రాల దంతరాలలో నుంచి తొలగించాడు. వాటి ఒంటికి మాలిష్ చేశాడు. అక్యుప్రెషర్ ఇచ్చాడు, మళ్ళీ జీవాలు రావాలి. వాటికి తగిన గాయాలకి మందు రాశాడు. ఆ దుర్రాలకి అంటుకున్నటువంటి అనేకమైనటువంటి ధూళి ధూసరమైనటువంటి దాన్ని తుడిచేశాడు. ఏ దేనితో? తన భుజం మీద ఉన్నటువంటి బండువాతం. దాన్ని కట్టుకున్నాడట తలకి, దాన్నే కట్టుకున్నాడు. లక్ష్య సిద్ధి, కార్యసిద్ధి ఉన్నవాడు ఏ పని చేస్తాడో కృష్ణ పరమాత్మ అట్లా చేశాడు. అర్జునుడు మళ్ళీ పొద్దున యుద్ధం చేయడానికి రథం ఎక్కితే, ఆ రథాన్ని చుట్టూ అంటుకున్నటువంటి రక్తపు చాలికలన్నీ కడిగాడు. అర్జునుడు రథం ఎక్కి మళ్ళీ యుద్ధం చేయాలి గనుక దానికి కావలసినటువంటి దాన్ని సిద్ధం చేశాడు పరమాత్మ నిద్రపోలే, పాండవులు నిద్రపోయినారు. మళ్ళీ వాళ్ళు లేచారు. లేచాక కృష్ణుడు ఆ ఆ అంశతో ఆ అంశతో పరిపూర్ణమైనటువంటి మాధుర్యంతో, ఒక విలాసంతో, ఒక తేజస్సుతో, ఒక వచ్చస్సుతో, ఒక శుద్ధత్వంతో, సంసిద్ధత్వంతో తాను సారథిగా నిలబడ్డాడు. చూడండి, అర్జునుడికి సారథి కావటం అంటే దానిని మించిన సేవ ఉన్నదా? కృష్ణుడు తాను దైవమన్న అహంకార మమకారాలు దూరం చేసుకుని, తాను కృష్ణుడన్నటువంటి భావనను తాను వదిలిపెట్టి, తాను పరిపూర్ణమైనటువంటి వినయ వినమ్రత దాత్రుడై శరీరం మొత్తం వినయాంచితం చేసుకొని పాండవులకు సేవ చేశాడు. రణ నీతిని, రణ చాతుర్యాన్ని ప్రదర్శించాడు. అర్జునుడిని, పాండవులని కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఒక ధర్మానికి, ఒక న్యాయానికి లోబడినటువంటి ఐదుగురు పాండవులు రాజ్యం ఏలవలసి ఉన్నది. ఇక ద్వాపర అంతరించబోతున్నది, కృష్ణ పరమాత్మకి ఇవన్నీ తెలుసు. కనుకనే అక్కడ భగవద్గీతను చెప్పాడు. ఆ భగవద్గీత ఎవరికి చెప్పారు అంటే అంతరించబోతున్నటువంటి ద్వాపర కోసం కాక, అవతరించబోతున్న కలియుగం కోసం చెప్పాడు. ఈ సేవా కార్యక్రమంలో ఎందరెందరో కృష్ణ పరమాత్మకి సాయపడ్డారు అంటే కృష్ణ పరమాత్మ ఎందరెందరికో సాయపడ్డాడు. మాధవుడు మానవుడికి సేవ చేసిన వయం మనకి అక్కడ కనిపిస్తుంది. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం ప్రారంభమైంది. మనకు తెలిసినంతవరకు ఐదువేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఐతిహాసిక చరిత్ర కాలంలో సుమారుగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు అంటే షిరిడి సాయి నాధుడు ఒక అవతారం దాల్చి వచ్చే వరకు రెండు మతాల మధ్య ఒక ఘర్షణ ఏర్పడినప్పుడు దాన్ని నివారించడానికి భగవద్గీతని పారాయణం చేయండి. ఆయన భగవద్గీత రాలేదు, అది జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరిని పారాయణం చేసుకోండి. లలితా సహస్ర నామాన్ని, విష్ణు సహస్ర నామాన్ని చదువుకోండి అని చెప్పినటువంటి షిరిడి సాయి నాధుని అవతారం అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడున సత్య సాయి భగవానుని యొక్క అవతారం రంగప్రవేశం చేసింది. ఈ అవనీలో ప్రవేశించింది. ఆ రావటం రావటమే కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగంలో పాటించవలసిన అహింస, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనబడేటువంటి ఐదు అంశాలు ఒక్క సాకారమై వచ్చినటువంటి ఆ అవతారమూర్తే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. వచ్చి జనజాగృతం చేశారు. ఇది దత్త అవతారంలో పూర్ణ అవతారం గనుక ఈ జగత్తుని ఆయన అడాప్ట్ చేసుకున్నారు, జగత్తుకి తనను తాను అడాప్ట్ చేసుకున్నారు. ఇది దత్త అవతారంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశంలోనే సత్య సాయి భగవానులు వేదాంతం చెప్పారు, మహిమలు చేశారు, కొంతకాలం చేశారు, ఆపై ఆపేశారు. ఆవరణంలోకి వచ్చే వాళ్ళందరూ వచ్చేలాగా అవి చేస్తూ వచ్చారు. రావలసిన వాళ్ళు రాగానే ముందు మహిమలు, ఆయన చేసిన మొట్టమొదటి పని మహిమలు చేయటం ఆపేశారు.రెండవది మనబోటి వాళ్ళందరూ మా పాద నమస్కారం కోసం ఎగబాకుతుంటే ఇది కూడా వీళ్ళకు వ్యామోహం ఏమో ఈ వ్యామోహం నుంచి వీళ్ళని దూరం చేయాలి అని రెండు పాదాలు వెనక్కి విత్తక్రవ చేసుకున్నారు అది మనం చూశాం. చాలా దగ్గరగా తీసుకుని రెండేసి గంటలు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ప్రబోధం చేసిన స్వామి చివరికి రెండు సెకన్లు కూడా time ఇవ్వటానికి వీలు లేని ఒకానొక పరిస్థితిని తన చుట్టూ తాను సృష్టించారు. ఈ మధ్యలో ఏం చేశారు? వ్యవస్థలని బాగు చేశారు. ఆయన money making కాదు man making process లో పడిపోయారు. మనుషుల్ని గనక మరంమత్తు చేయగలిగితే, మనుషుల్ని గనక ఉదాత్తమైన స్థాయిలో సంచారం చేయించగలిగిన స్థితికి తీసుకు వెళ్లగలిగితే ఒకవైపు ధర్మ ప్రబోధం చేస్తూనే వాళ్ళ సర్వాంగీణమైనటువంటి ఈ దేహాన్ని కాయకమైనటువంటి అనేకమైన కార్యకలాపాలు నిమగ్నం చేయగలిగినట్లయితే సర్వ అవయవాలు కూడా ఈ ప్రపంచానికి వినియోగ పడాలి. మానవులందరూ కూడా కుల, మత, జాతి, వర్గ, వర్ణాలు దాటాలి. ఒకే ఒక్క కులం మానవ కులం అనే భావన, ఒకే ఒక్క భాష హృదయ భాష, ఒకే ఒక్క భావన దివ్య ప్రేమ, ఒకే ఒక్క సంస్కరణ అది ఆత్మ విచారణ, దివ్యాత్మ, ప్రేమాత్మ అనబడేటువంటి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి సత్యసాయి భగవానుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక బౌద్ధగా, ఒక సామాజిక ధర్మంగా ఏమి మార్చారు అంటే ఏ వేదవ్యాసుడు అయితే పద్దెనిమిది పురాణాల సారాన్ని పరోపకారం కోసమే జీవించాలని అదే పుణ్యమని ఇతరులను పీడించినట్లయితే అదే పాపమని ఆయన ముక్తా ఇస్తే ఆధునిక భాషలో help ever hurt never అనే రెండు ఆంగ్ల పదాలతో ఒక సూచన, ఒక సాధనా మార్గాన్ని నిర్దేశం చేశారు స్వామి. చేసి ఈ సేవ ఎలా చేయాలి? సేవలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి బాగా కష్టపడి అర్థం తెలియకుండా బండగా, ముండిగా చేసుకొని వెళ్లిపోవడం. తప్పేమీ లేదు. ఇవాళ ఇది చేశాము స్వామి అనుగ్రహం నా మీద ఉందో లేదో అంటే సాయంకాలం కల్లా అనుగ్రహం కూలి డబ్బులే చేతిలో పడిపోతాయి. ఆయన account settle చేసేస్తారు. అసలు నేను ఎవరిని చేస్తున్నది? చేయిస్తున్నది సాయి పరమాత్మ. సేవ బినా నిర్వాణ నహి ఇది అద్భుతమైన ప్రవచనం. సేవను మించిన మోక్షం ఏముంది ఇంకా మోక్షం ఎక్కడుందో చెప్పమని అడిగారట స్వామిని. సేవ చేయండి. మీరున్న ఈ ప్రపంచంలోనే మీ సేవ అందుకోవటానికి అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మీ శక్తి యుక్తుల్ని, ప్రజ్ఞని, మీ సంపదని, మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని, మీకున్న సర్వ శక్తులను వడ్డండి. అవి ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు అయినట్లయితే ఈ ప్రపంచానికి బరవాణం చేయండి. సేవ చేయండి. జగత్తులోకి వెళ్ళండి. జగత్తు మీ కోసం ఎదురు చూస్తున్నది. సేవ బినా నిర్వాణ నహి అని దాని ఒక సామాజిక ధర్మం చేశారు. ఈ సామాజిక ధర్మానికి రెండు నేపథ్యాలున్నాయి. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి కొద్దిగా ఒక higher level లో దాని విచారణ చేయాలి మనం. సత్య సాయి భగవానుని అవతారం కంటే రెండు అవతారాలు ఈ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసినయి. ఒక అవతారం కృష్ణావతారం. అది ఎంత ప్రభావితం చేసిందంటే ఏడు వందల శ్లోకాలలో మనకు ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు రాకపోయినా నష్టమేమీ లేదు భగవద్గీతలో. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క శ్లోకం "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" ఎక్కడ యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు, ఎక్కడ సిద్ధుడు, సంసిద్ధుడు అయినటువంటి అర్జునుడు వంటి ఒక శిష్యుడు గనక ఉన్నట్లయితే వాళ్ళిద్దరి వలన, ఆ సంయోగం వలన, ఆ కలయిక వలన, వాళ్ళు అనుకున్నటువంటి మాటల వలన, చేతల వలన ఈ ప్రపంచానికి ధృడమైనటువంటి ఒక నీతి, కలకాలం నిలిచేటువంటి ఒక నీతి దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుంది? సేవాయోగమై తెలకని చిందుతుంది. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. కృష్ణ పరమాత్మ తర్వాత కొన్ని సంవత్సరాలు సుమారుగా మూడున్నర వేల సంవత్సరాలు, నాలుగు వేల సంవత్సరాలు దాటిన తర్వాత వివేకానంద స్వామి వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన ఉత్తరాంశగా వచ్చాడని చెప్తారు. ఆయన నరేంద్రుడుగా వచ్చాడు. గురు సమాశ్రయాన్ని పొందాడు. పొంది దేవుడు ఉన్నాడా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు అని ఒక అనుభవాన్ని పొంది దేవుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత నేనేం చేయాలి అని ప్రశ్నించుకున్నాడు. నేను దేవుడినైపోవాలని ఆయన అనుకోలే. ఆయన ఏం చేశాడంటే పాశ్చాత్య దేశాలకి సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పాలి అని అనుకుని ఆయన స్వయంగా అమెరికా వెళ్లారు. Parliament of religions లో మాట్లాడారు. ఆయన ఉరికే మనకి కాస్త కళా స్వరూపంలో dramatize చేస్తే dear brothers and sisters అనంగానే వాళ్ళు దండం పెట్టారు అని, అబద్ధం. అది అట్లా కాలే. ఆ తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన మాటల వలన ప్రభావితమైనారు. ఉపనిషత్తుల యొక్క సారం మొత్తం అక్కడే కనబడింది. మా ఉపనిషత్తులు, మా వేదాలు, మా సాంఖ్య ధర్మాలు, మా ఋషులు, ఆ ప్రవచనాలు ఇవన్నీ కూడా మానవుల్ని ప్రబుద్ధ మానం చేస్తాయి.ఆకలి ఎరగని, లేమి ఎరగని, కలిమి తొలగని ఒక సమృద్ధ ఆధ్యాత్మిక దేశమే భారతదేశమని వాటికి పరిచయం చేసి ఆయన వెనక్కి వచ్చేసాడు. అక్కడికి ఆయన కార్యకలాపం అయిపోయింది. కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల ఇరవై నాలుగు రోజుల్లో అవతార కార్యక్రమం పూర్తయిపోయింది. మరి భారతదేశం యొక్క ఉన్నత్యాన్ని ఒక అమెరికా దేశానికి చెప్తే ఎట్లా? అమెరికా దేశంలో ఎంతమంది ఆ సందేశాన్ని అందుకున్నారు? ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఉంటే, ఈ ప్రశ్నల జోలికి పోకుండా, తర్కం లేకుండా, ఇటువంటి ఈ ప్రశ్నలన్నింటికీ ఇది జవాబు అని అనకుండా సత్య సాయి భగవానుడు అమెరికా దేశమే వెళ్ళకుండా, ప్రశాంతి నయం దాటకుండా, తాను ఎక్కడ పుట్టారో అక్కడే ఉండి అమెరికా దేశం వంటి కొన్ని నూట యాభై ఎనిమిది దేశాలని ప్రశాంతి నయానికి రప్పించుకున్నారు. అది, ఇది ఒక పరమాద్భుతమైనటువంటి ఒక విన్నానం. ఇది ఆధ్యాత్మిక చరిత్రలో మనకిది అపురూప పరిచయం. మనం నూట యాభై ఎనిమిది దేశాలు వెళ్ళొచ్చు, మన బయోడేటాలో రాయొచ్చు. నూట యాభై ఎనిమిది దేశాలు వెళ్లి నేను ప్రవచనాలు చేశాను, నువ్వు వెళ్ళావు అంట. కానీ నీ దగ్గరకు ఎవరన్నా వచ్చాడా? ఎవరూ రాలే. నేను వెళ్ళాను అంతే కదా! నా దగ్గరకు రప్పించుకున్నటువంటి అంటే అటువంటి ఆ వైభోగాన్ని, సమాధాన ధర్మాన్ని ఒక సత్య నిష్ఠ ద్వారా, సేవ ద్వారా అది కేవలం సామాజిక ధర్మం మాత్రమే కాక అది ఒక ఆధ్యాత్మిక సాధనా మార్గం చేశారు స్వామి. కాబట్టి వేళ సేవ అంటే ఏమిటి అంటే బేసిక్ గా సామాజిక ధర్మం. కానీ ఆంతరంగికంగా చూసినట్లయితే అది ఒక ఆధ్యాత్మిక సాధన. మనందరం ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నాం. సేవకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? మన పదవి, మన కీర్తి, మన శరీరానికి ఉన్న అననుకూలతలు అన్నీ పక్కన పెడతాం. మనకి ఏర్పడేటువంటి కొన్ని ప్రైవేట్, మనం కూడా లోకంలో ఉన్నాం గనుక లోక సంబంధ కార్యాలు ఉంటాయి. అదే రోజున సేవ డ్యూటీ పడుతుంది, ఇంట్లో పెళ్లి ఉంటుంది. పెళ్ళికి అయిపోదామా, సేవకు వెళ్ళిపోదామా? నూటికి తొంభై తొమ్మిది మంది సాయి డివోటీస్ పెళ్లి మానుకొని సేవకు వెళ్లారు. [చప్పట్లు] వాళ్ళు ఎక్కడా కాంప్రమైస్ కాలేదు. అందుకని స్వామికి సేవాదులన్నా, తన భక్తులన్నా అపారమైనటువంటి ప్రేమ. వాళ్ళని ఆయన సోమరిపోతుల్ని చేయలేదు. మీరందరూ హాయిగా భోంచేసి పడుకోండి, నేను చూస్తాను అని చెప్పలేదు. నాకు సోంబేరులు అవసరం లేదు అన్నాడు. సోంబేరులు అంటే పని లేకుండా తిరిగేవాళ్ళు. కర్మకాండలో నిలబడండి, కర్మ యిష్టులు కండి. దానిలో నుంచి బ్రహ్మ నిష్ఠను అలవర్చుకోండి. అహంకారం, మమకారాన్ని తగ్గించుకోండి. నేను ఇంతటి వాడిని, నేను సేవ చేయటం ఏంటి అని అనుకోకండి. సేవ చేస్తున్న వాడికి నమస్కరించండి. సేవ అందుకుంటున్న వాడికి నమస్కరించండి. మళ్ళీ ఏమో డెభై ఏళ్ళు, అరవై ఏళ్ళు వచ్చాక సేవ చేద్దాం అన్నా, మా అమ్మ వాళ్ళు రానివ్వరు. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఏదో చేసినంత కాలం చేశారు, మీరు ఇంట్లో ఉండండి, మీకు ఇంత ప్రసాదం తెచ్చి ఇస్తాం అంటారు. అంత ప్రయోజనం లేదు కదా! మరి ఎప్పుడు చేయాలి? మన సర్వ అవయవాలు మన చేతుల్లో ఉన్నప్పుడు, మన మాటలు వింటున్నప్పుడు, ఏ అనారోగ్యం పాలు కానప్పుడు, కాకుండా ఉండేటట్లుగా మనం గనుక మన తను, మన ధనం ఈ మూడింటిని గనుక సేవలో వినియోగించినట్లయితే మానవుడు పూర్ణాయుర్తాయాన్ని పొందుతాడు. దీనికి రెండు ఉదాహరణలు చెప్తాను నేను. స్వామి సేవలోకి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఫోరం కూడా ఉంది గనుక సేవలోకి వస్తే మనం వెళ్లి చేయగలమా అని ప్రశ్నించుకోకండి. సేవలోకి గనుక వెళితే అందరికంటే ఎక్కువ చేయగలం, బాగా చేయగలం, పర్ఫెక్ట్ గా చేయగలం. ఇది ఒకటి. రెండవది మమకారం తగ్గిపోతుంది. నా కొడుక్కి నేను చొక్కా కొనిపెడితే, నా భార్యకి పట్టుచీర కొనిపెడితే, నా కన్నతండ్రికి నాలుగు చీరలు కొనిపెడితే, నా కన్నబిడ్డకి నగలు చేయిస్తే అది సేవ కాదు. నా అహాన్ని నేను తృప్తి పరుచుకుంటున్నాను. నా ముందే ఒక బీద ఇల్లాలు కూర్చుని ఉంది, మానం కాపాడుకోవటానికి చీరే లేదు. ఒక సాయి డివోటీగా నేను ఏం చేస్తానంటే మా అమ్మకి కొనే చీరల్లో నాలుగు కొని-కొనే దాంట్లో రెండు కొని ముసలమ్మకు ముందు ఇస్తా, తర్వాత మా అమ్మకి ఇస్తా. అది స్వామి నేర్పింది. అది సేవ అంటే. [చప్పట్లు] పali చాగం చేయమన్నాడు. న కర్మణా, న ప్రజయా, న ధనేన, చాగేనైక అమ్రుతత్వమానశు. మనం మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే ఈ పనులు చేయండి బంగారు. మీకు ఈ అవకాశం వచ్చింది, ఎవ్వరికీ రాని అవకాశం. సేవ చేసుకోండి, ప్రపంచంలోకి వెళ్ళండి, మీ చుట్టూ ఉన్న వారందరినీ గమనించండి. గమనించి వారి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకోండి, చేయగలిగినంత చేయండి. మీ దగ్గర ఉన్న హండ్రెడ్ లో యా పైసలు మీరు ఖర్చు పెట్టకండి, ఒక్క యా పైసా పక్కన పెట్టుకోండి. వన్ పర్సెంట్. ఇవ్వలేవా? వంద రూపాయలుంటే రూపాయి ఇవ్వగలం. రూపాయి అంటే ఒక్క పైసా ఇవ్వగలం. లక్ష రూపాయలుంటే వంద రూపాయలు ఇవ్వగలం. ఇవ్వగలం. ఆ ఇవ్వగలిగిన ఆ జాగాన్ని నేర్చుకోండి. ఈ సేవా ధర్మాన్ని ఆధ్యాత్మికమైనటువంటి సాధనా మార్గం చేశారు. చూడండి మనం ఒక పెద్ద వ్యాపారం చేస్తాం, డబ్బు వస్తుంది. వస్తాం ఇంట్లో బ్యాంకులో యాభై, యాభై ఐదు సద్దుకోవాలి, సద్దుకుంటాం. ఆనందం ఉందా? లేదు. దీన్ని మళ్ళీ ఎక్కడ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి? దీనికి మళ్ళీ పిల్లల్ని ఎలా పుట్టించాలి? ఈ డబ్బులు మళ్ళీ మన కోడలు అడిగితే, కూతురు అడిగితే అందరూ మన వాళ్ళే గుర్తొస్తారు. కానీ సేవలో మన వాడు ఒక్కడు గుర్తురాడు, గుర్తుపెట్టుకోండి. అనేకమైన సేవా కార్యక్రమాలు, గ్రామ సేవకు వెళ్ళినప్పుడు...ఒక కంపెనీ chairman అది రెండు వేల కోట్ల రూపాయలకు ఆయన అధిపతి. మురుక్కు కాలంలో కుడి చెయ్యి పెట్టి దానిలో ఉన్న మట్టిని తీసి పక్కన పెట్టాడు. అయ్యయ్యో! మీరిద్దరూ Dettol పట్టుకొస్తే Dettol తో కడుక్కుంటే అది సేవ కాదు నన్ను చేయనివ్వండి అన్నాడాయన. General Manekshaw ప్రశాంత నిలయంలో వడ్డన చేశారు. General Manekshaw ఆయనకు వడ్డన చేసే అవసరమే లేదు కానీ చేశాడు. అట్లా కొన్ని వందల వేల లక్షల పేర్లు చెప్పగలను. అయితే దీని వలన ఎప్పుడూ మానవుడు వేసుకునే ప్రశ్న నాకేమి రాదు కదా. ఈ ప్రశ్న లేకుండా మనం చేయం కదా! ఏమి లేకపోతే మనకు తెలియని మోక్షం అన్న వస్తుందిగా. ఊరికే అడిగేస్తాం ఇవన్నీ చేస్తే మోక్షం వస్తుందా? మోక్షం ఏంటో తెలీదు, అది ఎక్కడుంటుందో తెలీదు, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో తెలీదు, అక్కడ ఏం చేయడానికి లేదని తెలిసి అక్కడ ఉందామని అనుకుంటాం. మరి ఏం చేయాలి అంటే ఒక్క నిరూపణ ప్రశాంత నిలయంలో జరిగింది. నా సుమారు పందొమ్మిది వందల అరవై రెండు నుంచి ఈ క్షణం వరకు. retirement అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రశాంత నిలయం లేదా స్వామి సేవలో ఎవరు ఎక్కడ సేవ చేసినా వాళ్ళు కనీసం తొంభై ఎనిమిది సంవత్సరాలు జీవించాలి. వంద దాటిన వాళ్ళు ఉన్నారు. [చప్పట్లు] అంటే మామూలుగా వంద సంవత్సరాల ఆయుష్షులో తొలి ఇరవై ఏళ్ళు తెలియకుండా గడిచిపోతాయి. నలభై ఏళ్ళు ఉద్యోగం చేస్తాం అరవై ఏళ్ళు అయిపోయినాయి. చివరి ఇరవై ఎవరికీ పనికిరాకుండా ఇంట్లో వాళ్ళకి భారంగా గడిచిపోతుంది. retire అయిపోయిన మరుక్షణం ప్రశాంత నిలయంలోకి లేదా పుకట్ పల్లిలో ఒక సేవలోకి, స్వామి సేవలో కి అయ్యా నాకు సేవ ఇవ్వండి నేను teacher ని పిల్లలకి పాఠాలు చెప్తాను. లేదు నేను engineer ని ఇక్కడ ఏదన్నా road వేస్తుంటే చెప్పండి నేను వచ్చి కొడుగేస్తూ ఉంచుతాను. ఏదన్నా కాలువలు కొడుతున్నారే చెప్పండి ఆ flow ఎలా ఉంటుందో నేను చెప్తాను. నేను తెలుగు పండితుడిని పిల్లలకి పద్యాలు, పాటలు నేర్పిస్తా, భగవద్గీత మీద నాకు authority ఉంది నేను అన్నీ నేర్పిస్తా. ఎవరికి చేయగలిగిన సేవ వాళ్ళకి చేయడానికి సిద్ధం. దానికి మనం గనక సేవ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది అనేటువంటి దానికి తనువు గోపాలరావు గారిని ఆంధ్రా బ్యాంక్ chairman చేశారు ఆయన. ఆయన కూడా అందరితో పాటే అరవై ఏళ్ళకు retire అయిపోయారు. retire అయిన తర్వాత ఏదో ఇంకా పదేళ్ళు బతుకుతాం అనుకున్నారాయన. సేవ చేశారు డెబ్బై, ఎనభై, తొంభై. ఒక్కరోజున అడిగారు స్వామి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఇంకా నా అవసరం ఇక్కడ ఉందా? ఏదో ఇదివరకైనుక చేయలేకపోతున్నానంటే, ఇదివరకైనుక చేయటం లేదు గానీ ఇప్పుడు చేయగలుగుతున్నావు కదా చేస్తూ ఉండు అన్నారు. తొంభై ఎనిమిదికి వచ్చింది స్వామి కాస్త చెయ్యి ఆడటం లేదన్నాడు. రెండు చేతులా ఒక్క చెయ్యా అని అడిగారు. ఒక్క చెయ్యన్నారు. ఒక్క చెయ్యి ఆడుతుంది కదా చెయ్యి అన్నారు. స్వామి మరి ఇంక నాకు ఎంత కాలం ఈ planet earth మీద అంటే నూట రెండు సరేనా అన్న. [నవ్వు] కరెక్ట్ వన్ నూట రెండవ సంవత్సరం వచ్చింది వాళ్ళ date of birth పెట్టేసి. [చప్పట్లు] నిజంగా అంకితమైన చరిత్ర పుత్త కాలా రాశ మహిమను గాథ ఇది. అంటే భగవంతుని సేవలో ఉంటే పూర్ణాయుష్షాయం ఉంటుంది. మనకి ఉంటున్న పూర్ణాయుష్షాయం వందేళ్ళు ఉండాలని ఉంటుంది. కానీ ఎందుకుండాలి అని ప్రశ్న. ఉండి ఏం చేయబోతున్నాం? కొడుకు తిట్టి, కోడలు కొట్టి దానికోసమా? అరవై ఏళ్ల వరకు మానవ జీవితాన్ని మనం హాయిగా గడిపేసాం. సంసార బంధంలో నుంచి కాస్త బయటకు వచ్చి ఒక విశ్వ సంసారంలోకి పరమేశ్వరుడి వద్దకు వచ్చాడు. ఆయనవారూ మనవారూ. స్వామికి మాకు రక్తసంబంధం ఉన్నదా? రాగ బంధాలున్నాయా? మరి ఏమైనా చుట్టరికాలున్నాయా? మరి లేదే. ఈ నూట యాభై ఎనిమిది దేశాలలో ఉన్నటువంటి వారు మనవోటి వారు. మనం ఇంకా ఎంత చేసినా ఇంకా చేయాలనే అనిపిస్తుందే. మరి ఈ హాయి కలవడానికి కారణం ఏమిటంటే సేవా మార్గమే నిర్వాణ మార్గం అని చెప్తారు. ఆ సేవ చందాలు, డబ్బులు ఇస్తే పరమాత్మ పెంచడు. చెప్పేశారు మీ డబ్బుతో నాకు ఎట్టి సంబంధం లేదు. నన్ను మీరు ఏదైనా కోరవలసిన రోజు వస్తే, ఇవన్నీ interview లో చెప్పిన మాటలు. Never ask for the trivial and trash. Ask for me. When I am yours everything is yours. నేనే మీ వాడినై తర్వాత మీరు ఇంకా ఎవరి ముందు చేయి చాపుతారు. ఆ దీనత్వాన్ని, పరిదీనత్వాన్ని వదిలిపెట్టండి. సేవ చేయండి. చక్కగా పాఠం చెప్పగలిగిన వాడు వెళ్లి పాఠం చెప్పాలి. ఇటువంటి-
YouTube · audio
Sathasangam_4 Service -Social Responsibility part 1
Sathasangam_4 Service -Social Responsibility part 1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 47:14
More in this series