No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి తొంబై ఆరవ జన్మదినోత్సవ మహా సంరంభ వేళ మనం స్వామి ఈ జగత్తుకి అందించినటువంటి నాలుగు దివ్య పదాలను గురించి మాట్లాడుకోబోతున్నాం. కొన్ని వేల పదాలు వారు చెప్పారే మరి ఈ నాలుగు ఏమిటి ప్రధానమైనవి అర్థం అయితే తప్ప స్వామి సంపూర్ణంగా మనకు అర్థం కాదు. స్వామిని అర్థం చేసుకుని స్వామి నడిచిన బాటలో, నడిపించిన బాటలో, నడవవలసిన బాటలో మనం గనక నడవటం మొదలు పెడితే జీవిత గమనము దాని ధమకము ఒక ఉదాత్త స్థాయిని చేరుకుంటుంది గనుక ఈ దివ్య పదాలని వాటి వైభవాన్ని దానిని స్వామి ఎలా ఆవిష్కరించారు ఇది చాలా ప్రధానమైన అంశం. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రామ కథంతా రాముడి జీవితం అంతా ధర్మబద్ధంగా నడిచిందని మనకి ఉదాహరణ ఉంది. అలాగే శాంతి ప్రేమల గురించి చెప్పుకోవాలంటే కృష్ణ పరమాత్ముని గురించి చెప్తాం జ్ఞానాన్ని గురించి చెప్తాం మరి సత్యసాయి భగవానుడు ఏ పద బంధాన్ని మనకు అందించారు? నిజానికి ఆధ్యాత్మిక భావనలో ఆధ్యాత్మిక శాస్త్రంలో నాలుగు మహా వాక్యాలు ఉన్నాయి అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ నాలుగింటిని అర్థం చేసుకుంటే జీవుడు తన జీవితాన్ని అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగించుకోవాలో స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. మరి సాక్షాత్తు ఒక పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానునికి సమకాలీనంగా జన్మ ఎత్తి వారిని కలిసి, చూసి, దర్శించి, స్పర్శించి, మాట్లాడి, అనుభవాలు పొంది, అనుభూతులన్నీ మన సొంతం చేసుకున్నటువంటి మన బోటి వాళ్ళం ఈ నాలుగింటి విచారణ గనక తెలుసుకోకపోయినట్లయితే, చేయకపోయినట్లయితే కేవల పదాలుగా మిగిలిపోతాయి. ఈ పదాలు సత్యసాయి అనంత భక్త కోటికి చాలా పరిచయమైనటువంటి పదాలు. అవి ఏమిటి అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. ఇవి తెలియని వాడు లేడు. బాల వికాస్ నుంచి తొంబై ఏళ్ల వయసు వచ్చేదాకా ఆ ప్రతి వాడు నెమరు వేసుకునేటువంటి ఒక అందమైనటువంటి మాటలు. ఇవాళ ఆ దివ్య పదాల్లో దాని దా-దాని వెనక దాగినటువంటి వైభవంలో సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. స్వామీజీ చెప్పారు ఒకసారి "అర్థం తెలియక చేసే ఏ పని అయినా వ్యర్థమే" అన్నారు. కాబట్టి అర్థము మాత్రమే కాదు శబ్దార్థము, విశేషార్థము, అంతరార్థము, యరార్థము ఈ నాలుగు స్థాయిలలో ఈ ఒక్క పదాన్ని సత్య అనేటువంటి పదాన్ని మనం నిర్వచించుకోవాలి. విషయంలోకి వెళ్లే ముందు ముప్పై, నలభై ఏళ్ల క్రితం ఒక సత్సంగంలో స్వామిని గురించినటువంటి ఒక తాదాత్మ్య స్థితి ఏర్పడినప్పుడు నా నోటి నుంచి వెలువడినటువంటి ఒక పద్యం ఇప్పుడు గుర్తొస్తున్నది. "ఔపధేయమ్మునకు సత్య నామంబిచ్చి నడకకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చమా స్వామి మల్హారమై విచ్చమా స్వామి కల్హారమై" ఇది. ఏమిటి ఇది అంటే ఈ పదాలు చాలా గంభీరంగా ఉన్నప్పటికీ ఔపధేయం అంటే ఉపాధి, ఉపాధి అంటే శరీరం, పంచభౌతిక శరీరం. దానికి ఆయన పెట్టుకున్నటువంటి పేరు సత్య. ఆయన నడిచిన మార్గం అంతా కూడా ధర్మమార్గం. నడవటమే కాదు, నడిపించడమే కాదు, నేర్పించారు. నడకకెల్ల ధర్మ నిరతి నెరపి. ఇక మూడవది ఎల్ల సృష్టిని ఎక్కడో ఆంధ్రదేశంలోనో, భారతదేశంలోనో కాకుండా ప్రపంచం మొత్తం కూడా శాంతి కాంతుల వెలార్చి, శాంతి అనేటువంటి ఒక illumination ఒక అత్యద్భుతమైనటువంటి enlightenment ఒక పరమ ప్రశాంతమైనటువంటి స్థాయి వీటన్నింటిని వెలార్చినటువంటి స్వామి ఎలా వచ్చారంటే, వచ్చమా స్వామి మల్హారమై బంగారమై వచ్చారు. విచ్చమా స్వామి కల్హారమై. సహస్రదళాలతో ఏర్పడినటువంటి ఒక మహాపద్మం వలె, ఒక విరాట్ మూర్తి వలె, వైష్ణవ తత్వంతో, శివతత్వంతో, సర్వ దేవతల యొక్క తత్వ భూమికలో అంటే నిఖిల దేవతల నిక్కవైనటువంటి రూపం ఒక్కటైతే అది సాయి గనుక అటువంటి ఆ స్వామిని నేను ఉపాసిస్తున్నాను అన్న భావన ఆరోజు కలగటం అంటే కలగటం అంటే ఇంతకుముందు ఉంది గనుక బయటకు వచ్చింది. దాని ప్రకారమే జీవితం నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఈ సంబంధమైన సన్నివేశంలో ముందు సత్య అంటే ఏమిటి తెలుసుకోవాలి. మామూలుగా శబ్దార్థం ఏమిటంటే సత్యము అంటే అబద్ధం చెప్పకపోతే సత్యము అని మనకి చిన్నప్పుడు నేర్పారు. అది కాదు. అంటే అది మాత్రమే కాదు. సత్య అంటే సతతము ఉండేది సత్యం.సతతము అంటే కాలాత్యవిచ్ఛిన్నమైన అటువంటిది, అపరిణామమైన అటువంటిది, ప్రారప్తమైన అటువంటిది. అంటే ఒక ఆత్మకి ప్రతిబింబమే సత్ అనేటువంటి శబ్దం. అంటే ఈ ఆత్మ కేవలం జీవాత్మేనా అంటే పరమాత్మ అని కూడా అర్థం. అయితే పరమాత్మ స్థాయిలో ఉన్నటువంటి స్వామికి జీవాత్మలు వేరని తాను వేరని భావం ఎన్నడూ లేదు. "త్వమేవాహం న సంశయః" నీకు నాకు తేడా ఏం లేదు తెలుసుకునే దాకా అని ఒక మాట చెప్పారు. అంటే ఈ సత్యము అన్ని వేళలా ఉంటుంది. పొద్దున్న నుండి రాత్రి మాయమయ్యేది కాదు. ఈ సత్యము ఒక అనుభవానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పదం. ఇక నిజానికి ఈశ్వరుడికి అంటే మహేశ్వరుడికి ముప్పై రెండు aspects ఉన్నాయి, అంశాలు. లేదా ముప్పై రెండు dynamics ఉన్నాయి లేదా ముప్పై రెండు dimensions ఉన్నాయి. అందులో ఈ సత్య ఒకటి, మహేశ్వర ఒకటి, రుద్ర ఒకటి, శివ ఒకటి. ఇట్లా అనేకమైనటువంటి ముప్పై రెండు aspects లో ఈ సత్య అనేటువంటిది పరమాత్మకి సంకేతం కాబట్టి స్వామి పరమాత్మ కాబట్టి తన శరీరానికి తాను కూడా ఒక శరీరం ధరించి వచ్చారు గనుక దానికి ఏం పేరు పెట్టుకోవాలి అంటే సత్య అని పేరు పెట్టారు. అంటే ఆ కొన్నాళ్ళు ఉండి తర్వాత వెళ్ళిపోయేది కాదది. ఉన్నన్నాళ్ళు లేనట్టు ఉంటుంది లేనన్నన్నాళ్ళు ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది. ఇది ఒక వైచిత్రి, ఇది ఒక చమత్కారం. కాబట్టి ఈ సత్య అనేటువంటి పదాన్ని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే, ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటలు మనం వింటూ ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం, కూడి ఉన్నాం. అనేకమైనటువంటి పాటలు, భజనలు చేస్తున్నాం. వీటన్నింటిలో నేను అనేటువంటి ఒక సత్యం ఉన్నది. కాసేపు అయిన తర్వాత మనం వెళ్ళి పడుకుంటాం, నిద్రపోతాం. నిద్రావస్థలో కూడా నేను ఉండనే ఉన్నది. అంటే అది కలగంటూ ఉన్నది. మూడవది ఇటు కల అటు మెలకువ కాని ఒకానొక సందర్భంలో మనం మళ్ళీ నిద్ర లేస్తాం. ఆ నిద్ర వదులుచుకొని జాగ్రదవస్థ లోకి అడుగుపెడుతున్న కొన్ని క్షణాలలో మనకి సుషుప్తి అని ఒక అవస్థ ఏర్పడుతుంది. అక్కడ కూడా ఆ నేను ఉన్నా. ఆ నేను ఎవరంటే, మేనా? నేను ఎక్కువగా మాట్లాడుతున్నది, నేను చేతులు కదుపుతున్నది, నేను చూస్తున్నది, నేను కంటున్నది, వింటున్నది, అంటున్నది. కానీ ఈ నేను కాదు. ఈ నేనులో దాగిన అసలు నేను ఏదైతే ఉన్నదో, ఇప్పుడూ ఉన్నది, అప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కనుక కాలానికి అవస్థాత్రయాతీతమైనటువంటి కాలత్రయాతీతమైనటువంటి ఒకానొక ఉదాత్త భావనకి సత్యము అని పేరు. అందుకనే సత్యం వద అనేటువంటి దాన్ని పరమార్థిక దృష్టితో కాక లౌకిక దృష్టితో చూసినప్పుడు ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉండు అని ఒక అర్థం. దాని విషయం మనం తర్వాత మాట్లాడుకున్నట్లయితే ముందు ఉదాత్తమైనటువంటి ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఈ సత్య అనేటువంటి పదాన్ని ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది ఏది? ఆత్మ. పంచభూతములు, దివాకరుండు, నిశాకరుడుని, తనుసప్తకంబయెని, ఈ శరీరంబు నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగకెట్లు? ఏతదధిష్టాత ఎవడో యజమానుడైన అష్టమ తనువు వాడు. ఆ అష్టమ తనువే ఈ సత్. అంటే మనలో ఏడు శరీరాలు ఉన్నాయి కదా. ఇదిగో కనబడుతున్న స్థూల శరీరం, నిద్రలో ఉన్న సూక్ష్మ శరీరం, తర్వాత సుషుప్తిలో కారణ శరీరం, మూడు plus మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంటే మొత్తం కలిపితే నాలుగు. నాలుగు plus మూడు, ఏడు. ఈ ఏడు శరీరాలు దాటిన తర్వాత కూడా ఏదైనా ఉన్నదా అంటే ఆ ఉన్నదాని పేరే సత్. కాబట్టి ఈ సత్ అనేటువంటిది సృష్టికి మూలమైనటువంటిది. దీనిని ఇంకొద్దిగా విచారణ చేసినట్లయితే సృష్టిని ఎవరు సృష్టించారు? సృష్టి దేనిలో నుంచి బయటకు వచ్చింది? ఇది ఎవరి సంకల్పంలో నుంచి వచ్చింది అంటే యుగాలు, కల్పాంతాలు, కాలం అనంత మహాకాలం అంతా జరిగిపోయినా, జారిపోయినా, సమసిపోయినా వీటన్నింటికీ అతీతంగా ఎప్పటికీ నిలకడ చెంది ఉండేటువంటి ఒక సత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, పరమార్థికమైన పదం ఒకటి ఉన్నది. దానిలో నుంచి, సత్ లో నుంచి అంటే ఎప్పుడూ ఉండే దానిలో నుంచి ఎప్పుడైనా పోయే సృష్టి ఏర్పడింది. ఎప్పటికైనా పోతుంది ఇది. ఈ సృష్టి చాలా విశాలమైన అటువంటిది. ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో, నదీనదాలతో, పర్వతాలతో, అఖండ భూమండలంతో, అనేకమైనటువంటి విషయాలతో ఈ సృష్టి సృష్టింపబడితే దీనిని సాధారణమైనటువంటి ఎవరూ కూడా అందుకోలేరు గనుక ఏం చేశారయ్యా అంటే ఆ సృష్టిలో నుంచి ఒకటి ప్రవేశించింది. సృష్టిలో నుంచి బయటకు ప్రవేశించింది. దాని పేరు విశ్వము అని పేరు పెట్టుకున్నాం. ఆ విశ్వము నుంచి సంసారము ఏర్పడింది. సంసారము నుంచి ప్రపంచం ఏర్పడింది. five elements తో కూడినటువంటి ఒక ప్రకృతి ఏర్పడింది. దానిలో నుంచి ఒక వ్యక్తి ఏర్పడ్డాడు. అంటే ఈ వ్యక్తికి మూలం ఏది? మనందరి మూలం ఏమిటి అంటే మనం చెప్తాం మన ప్రవర, మన గోత్రం, మన తాత, మన ముత్తాత, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. కానీ కాదు. వాటికి కూడా మూలం ఉంది. మన ముత్తాతకు మూలం ఉంది. ఆయనకున్న మూలాలకు మూలం మూల మూలమైన మూలం ఉంటుంది గనుక మూలం ఏమిటి అంటే అఖండము, నిత్యము, సత్యము, శాశ్వతము, నిరుపమానము, అమలము, విచలము, అచలము, విమలము అయినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఒక సత్ అనేటువంటి పదార్థం ఉన్నది గనుక ఆ సత్తే పరమేశ్వరుడిగా మనం భావన చేసుకున్నాం. ఎప్పుడైతే చూడండి శత్రుడు లేదు సత్.డు ఎప్పుడైతే వేశామో ఆయనకు శరీరం ఏర్పడింది. డు అంటే ప్రథమా విభక్తి. రామ అనేటువంటిది ఒక అలంకారికమైన భావన. రాముడు అంటే వ్యక్తి రాజు. రాముడు అంటే మనకు దేవుడు. కాబట్టి ఈ సత్ అనేటువంటిది అన్నివేళలా ఉంటుందని, అందుకనే సత్య సాయి భగవానుడు తాము ప్రారంభించినటువంటి ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలినాళ్లలో ఈ ఆత్మను గురించే ఎక్కువ చెప్పారు. ఈ సృష్టిని గురించే చెప్పారు. ఎవరూ చెప్పనటువంటి అనేక పరమ రహస్యాలన్నీ బయటకు చెప్పారు. అదే ఆత్మారామం అనేటువంటి ఒక పుస్తకంగా తర్వాత వచ్చింది. అంటే స్వామి ఉపన్యాసాలు కానీ, స్వామి మామూలుగా ఇంట-ఇంటర్వ్యూస్ లో పిలిచి మాట్లాడినప్పుడు కానీ, ఆ రోజుల్లో కేవల భావం మాత్రం చెప్పేవారు. ఏ భావన? ఆధ్యాత్మిక భావన. ఆ సత్ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది, అది మారదు. దాని చుట్టూ ఉన్న వస్తువులు, సృష్టి మారుతుంది, విశ్వం మారుతుంది, ప్రపంచం మారుతుంది, సంసారం మారుతుంది. ఇదిగో వ్యక్తులుగా మనం పుడతాం, ఉంటాం, ఒకరోజు పోతాం. అంటే ఈ మొత్తం కూడా "బ్రహ్మ సత్యం జగన్మిథ్య" ఇది కదా శంకర భగవత్పాదుల ప్రతిపాదన. అంటే ఏమిటి? ఒక కోటి గ్రంథాలలో చెప్పవలసినటువంటి విషయాన్ని "నేను శ్లోకార్ధేన ప్రవక్ష్యామి" అన్నాడాయన. ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను అర్థం చేసుకోండి సరిపోతుంది అన్నాడు. అవి కోటి గ్రంథాలు దానినుంచి రాయచ్చట. లేదా కోటి గ్రంథాల సారమేమిటో పిండితే అర్ధ శ్లోకమేనట. "బ్రహ్మ సత్యం జగన్మిథ్య" జగత్తు మిథ్య. మిథ్య అంటే లేదు అని కాదు. ఉన్నట్టుగా కనిపిస్తున్నది కానీ అన్నీ కూడా మారిపోయేవి, మార్పు చెందేవి, నశించేవి. ఉత్పత్తి పరిణామ క్రమంలో అనేకమైన మార్పులు చెంది చెంది శీర్ణమై, విశీర్ణమై, జీర్ణమై నశించిపోతాయి గనుక అటువంటి దానికి జగత్తు. జ అంటే పుట్టేది, గత్తు అంటే పోయేది. దాని అర్థమే అది. జగత్తు అంటే పుట్టి పోయేది, పోయి మళ్ళీ పుట్టేది. అందుకే "పునరపి జననం పునరపి మరణం". కాబట్టి ఇక్కడ మారనిది, మార్పు చెందనిది, మళ్ళీ కాలాజ్య విచ్ఛిన్నమైనది, కాలానికి, అవస్థాత్రయ అతీతమైనటువంటిది, విమలమైనది, దేనివలన కదలనిది. కానీ అన్నింటినీ కదిలించేది ఏందంటే అది సత్ అని ఒక అద్భుతమైనటువంటి పదం కాబట్టి, ఆ సత్ అనేటువంటి పదాన్ని మనం గనుక అర్థం చేసుకుంటే సత్య సాయి భగవానుడు తమ పద్నాలుగవ ఏట నేను సాయిబాబాను అని ప్రకటించి, అదే సమయంలో కొద్ది నెలల వ్యవధిలో తన అవతార ప్రకటన చేసినప్పుడు, ఆ ప్రకటించినది ఎవరు అంటే సత్ ప్రకటించింది. సత్ ప్రకటించింది అంటే అది ప్రకటన కావాలి లేకపోతే అది రావలసిన పనే లేదు. స్వామి ఇక్కడికి రావలసిన అవసరం ఏముంది? వచ్చింది ఏంటి అది ప్రకటించాలి, ఎందుకు వచ్చిందో చెప్పాలి. వచ్చి ఏం చేయబోతున్నదో చెప్పాలి. అసలు ఎందుకు చేస్తున్నదో చెప్పాలి. నాటి సమాజం ఎట్లా ఉన్నదో దాని యొక్క పరిస్థితిని గమనించి "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అన్నటువంటి ఆ శ్లోకానికి అనుగుణంగా, అంటే యోగేశ్వర కృష్ణుడి ప్రకటనది. దానికి అనుగుణంగా ధర్మగ్లాని జరిగినప్పుడు, ధర్మము మానవుడు ఆచరించనప్పుడు, మళ్ళీ వాడిని ధర్మ మార్గంలో పెట్టడానికి నేను నా అంతట నన్ను నేనే సృష్టించుకొని వస్తానన్నప్పుడు, తనను తాను సృష్టించుకున్నవాడు తన దేహానికి తానే పేరు పెట్టుకుంటాడు. అట్లా స్వామి ఏమన్నారు? నేను ఉపన్యాసకుడిని కాదు, యోగిని కాదు, భోగిని కాదు. స్త్రీలలో స్త్రీని, పురుషులలో పురుషుడిని, బాలురలో బాలుడిని, వృద్ధులలో వృద్ధుడిని. కానీ నేను అంటే ఆత్మ "అహం సత్యబోధకః" సత్యం అంటే ఏమిటో చెప్పడానికి వచ్చాను అన్నారు. అది, ఇది కీలకమైనటువంటి అంశం. స్వామి "అజస్య ధీరంజనోద్ధరణ, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ" అది సరే అది అవతార ప్రకటన. అసలు తన మూలం ఏమిటి? ఎందుకు వచ్చారు అంటే "అహం సత్యబోధకః" సత్యం అంటే ఏమిటో మీరు తెలుసుకోండి. అన్నివేళలా ఉండేది, అంతటా వ్యాపించి ఉండేది. నిజానికి ఆత్మ అనేటువంటి పదానికి శంకర భగవత్పాదులే ఒక అద్భుత వ్యాఖ్యానం చేశారు. ఆత్ అంటే ఏమి? మా అంటే లేదు. అసలు ఏమీ లేదో దాని పేరు ఆత్మ అన్నారాయన. అదేంటి? ఆత్మసాక్షాత్కారం అన్నారు, ఆత్మను పట్టుకోమన్నారు, ఆత్మను వెతకాలన్నారు, ఆత్మబలం అన్నారు, ఆత్మగౌరవం అన్నారు. అంటే ప్రత్యేకంగా లేదది. అసలు ఉన్నదంతా ఆత్మే. "సర్వం ఖల్విదం బ్రహ్మ" అంటే ఇక్కడ బ్రహ్మ అన్నా, సత్ అన్నా, ఆత్మ అన్నా అన్నీ కూడా పర్యాయపదాలే గనుక ఒకటే. కాబట్టి ఈ సత్య అనేటువంటి పేరు స్వామి తన దేహానికి పెట్టుకొని దానికి అనుగుణంగానే ఉన్నారా? ఇది ప్రశ్న. పేరేమోది పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అలా వారు పరమాత్మే గనుక, పరమాత్మ గనుక ఒక మానవ దేహాన్ని తీసుకుని ఈ జగత్తులోకి వస్తే ఏం చేయాలో, ఆయన ప్రణాళిక ఏమిటో, దానివల్ల ఈ జగత్తు ఎట్లా ఉద్ధరించబడుతుందో, ఏది మిథ్యా ప్రపంచమని సమస్త వాంగ్మయం చెబుతున్నదో, దాని మిథ్య, దానిలో ఉన్న బలాలు, దాని బలహీనతలు, దాని Transient and impermanent nature, దాని Tendencies, దాని Traits, దాని అల్పత్వం, దాని ఉదాత్త వైఖరి వీటన్నింటినీ కూడా ఆవిష్కరించడానికి స్వామి తమ దేహానికి సత్య అని పేరు పెట్టుకున్నారు. ఇవాళ ఆ స్వామి దేహం వదిలేశారు అంటాం. వారు దేహమే వదిలేశారు. మరి దేహం వదిలాక ఏమయ్యారండి? దేహం వదిలిన తర్వాత సర్వవ్యాపి అయి ఉన్నారు. మరి దేహంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ప్రకృతికి అనుగుణంగాప్రకృతి మూల సూత్రాలకి లోబడి తమ అవతార కార్యక్రమాన్ని తాము సాగించారు. ఎప్పుడైతే ప్రకృతి బంధన నుంచి నిబంధన నుంచి ఆవరణం లోనుంచి గ్రతావరణం లోనుంచి తమను తాము బద్ధలు చేసుకొని విరాట్ మూర్తి అయినారో, ఇవేళ సమస్త అణువులలోను సత్య సాయి భగవానుని యొక్క మహా దివ్య శక్తి దాని యందు సత్యమై, నిత్యమై, శాశ్వతమై, పరిపూర్ణమై, సర్వవ్యాపకమై, శ్రీమయమై, వాంగ్మయమై, చరాచరమయమై కడగా జ్యోతేర్మయమై అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నది గనుక, ఈ సత్ అనేటువంటి దానిని స్వామి తమ జీవిత కాలంలో అంటే ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో చాలా స్పష్టంగా దాన్ని ఆవిష్కరించారు. దానికి ఒక చిన్న చమత్కారం ఉంది. కొడైకెనాల్ లో పిల్లలు కొంతమంది పెద్దలు స్వామిని, "స్వామి మీతో ఫోటో తీయించుకుంటాము" అని అడిగారు. "అలాగే" అన్నారు స్వామి. ఆ లాన్ లోకి వచ్చారు. వచ్చి నిల్చున్నారు. నిల్చుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. కెమెరా క్లిక్ అవుతున్నది. వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. ఈ వస్తూ వెళుతూ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే స్వామి కాని వారంతా అయినారు. మరి స్వామి ఏం చేశారంటే తాను ఒక్కటిగా నిలబడి చిన్నారు మార్పు లేదు. ఏది మార్పు చెందిందంటే ఆ వచ్చే పోయే వాళ్ళు మార్పు చెందారు గాని నిలకడగా ఉన్న సత్య అలాగే ఉండిపోయినారు. చూశారా! అన్ని ఫోటోల్లో ఈ జీవుడు ఆ పరమాత్మ కలిసి ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక గొప్ప సందర్భం అది. అంటే ఏది మారదో అది నిశ్చలంగా ఉంటుంది, నిభృతంగా ఉంటుంది, నికేతనంగా ఉంటుంది, నిరపేక్షంగా ఉంటుంది, నిరంజనంగా ఉంటుంది, పరమ ప్రశాంత ప్రసన్నమైనటువంటి ఆ ప్రభాసంపన్నమైనటువంటి భావనతో విగ్రహ నిగ్రహంగా స్వామి నిల్చొని ఉంటారు. అంటే అక్కడ మనకు ఉదాహరణ ఏమిటంటే జీవులన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి, జీవాత్మలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి, పరమాత్మ మాత్రం నిశ్చలమై ఉంటాడు, ఒక్కడై ఉంటాడు. ఆ ఒక్కడే అనేకమై కనిపిస్తున్న ఈ వచ్చి వెళ్ళిన ఫోటోలు తీసుకున్న వారందరూ స్వామి యొక్క అంశాలే. ఎందుకని ఆదిత్య కిరణాలు సూర్యుడి నుంచి ఆదిత్య కిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి సుషుమ్నా కిరణాలు ఎట్లా భిన్నం కావో, సముద్రం నుంచి అలలు, కెరటాలు, తుంపరలు భిన్నం కావో, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక పరమాత్మ నుంచి లేదా పరమాత్మ చుట్టూ ఏర్పడినటువంటి ఈ ఆవరణలు అన్నీ కూడా దాని యందే పుట్టినయి. అంటే ఇదంతా సృష్టికి ప్రతిబింబం అయినట్లయితే, ప్రతీకాత్మకమైనట్లయితే అసలు బింబం ఏది అంటే బింబము సత్య సాయి. ఆ బింబం లో నుంచి ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. ఆ సత్తులో నుంచి ఈ సృష్టి ఏర్పడింది. అంతే కాదు సత్ అనేటువంటిది దేనికి పొంగదు, దేనికి పొంగదు, దేనికి లొంగదు, వంగదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే సమస్తమైనటువంటి సర్వాధికారాలని ప్రకృతిని కూడా అరచేతిలో బంధించి ఉంచగలిగినటువంటి సర్వసిద్ధుల సమన్వయ స్ఫూర్తిగా ఉంటుంది. స్వామి అవి చేశారు, ఇది చేశారు అంటే మనకి ఆశ్చర్యం, ఆయనకి సహజం. అత్యంత సహజం. ఎందుకనంటే సత్తులో నుంచి వచ్చిన దానికి ఇంకే రకమైనటువంటి అపేక్షలు ఉండవు. అది మూలమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రభావం. ఒక పవర్ జనరేటర్. మనకి శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, విద్యుత్ ప్రాజెక్ట్. దానిలో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ విద్యుత్తు, ఆ పవర్ జీరో వాట్ నుంచి thousand watts వరకు అన్నింట్లా ప్రవహిస్తూ ఉంటుంది. అది contain చేయగలిగినటువంటి స్థాయిలో ఇవన్నీ బల్బులు మనం చూస్తూ ఉంటాం. Watts అన్నీ measure చేస్తాం. కానీ మూలంగా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఏందంటే కేవలం ఆత్మశక్తే. అది సత్య శక్తే. అందుకనే సత్య సాయి భగవానుడు సత్య పరాక్రముడు కూడా. సత్యము అనేటువంటి దాన్ని తాను ఒక్కరుగా బయలుదేరి ఒక బిందువుగా బయలుదేరి ఈ సమస్త ప్రపంచాన్ని సత్ అనేటువంటి దివ్య భావన వైపు నడిపించి అన్నింటినీ ఏకం చేసి అనేకంగా ఉన్నదాన్ని ఏకం చేసి అక్కడ జాతి, మత, వర్గ, వర్ణ, కుల అన్నీ కూడా దాటి పండిత పామర స్థితిని కూడా దాటి ఒక శుద్ధ మహా చైతన్యంలో అచల భూమికలో నిలకడ చెందినటువంటి ఆ సత్తు యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏది అంటే సత్య సాయి భగవానుడిగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండటం, ఏదో ఎప్పుడూ మంచి మాటలే చెప్పటం ఇది మాత్రమే కాదు. వీటన్నింటినీ దాటినటువంటి స్థితిలోకి సాధకులమైనటువంటి మనందరం కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ముందు మన దేహంతో ప్రారంభించినట్లయితే ఈ దేహము సత్యము కాదు. ఇది బాల్యం పోగొట్టుకున్నది, కౌమారం పోగొట్టుకున్నది, యవ్వనం పోగొట్టుకున్నది, వృద్ధాప్యాన్ని పిలుస్తున్నది. కాబట్టి ఇది నిరంతరము మార్పు చెందుతూ ఉన్నది. ఏది మార్పు చెందదో, ఏది తల్లి గర్భంలో ఒక అండంలో ఉన్నటువంటి మన ఆ నేను ఆ ఆత్మ, ఆ రశ్మి, ఆ కిరణం మళ్ళీ మనం శిశువై, బాలకుడై, యువకుడై, మధ్య వయస్కుడై, వృద్ధుడై శరీరం వదిలిపెట్టే దాకా శరీరం మారింది గానీ లోపల ఉన్న ఆత్మ మారలేదు. కాబట్టి ఆత్మ సత్యము. ఈ ఆత్మ నిత్యమూ. కనుక స్వామిది, ఇవేళ మనం స్వామి ninety six years "నేను ఉంటాను దేహంలో" అని అంటే దేహానికి పరిమితమైన మనందరం తొంభై ఆరు ఏళ్ళు ఆ దేహంలో ఉంటాం అనుకున్నాం. దేహాతీతమైనటువంటి ఒక భావనలో ఈ తొంభై ఆరు ఏమిటి కల్ప కల్పాంతాల వరకు సత్య సాయి భగవానుడి యొక్క దివ్య--ఆ ధీ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ సత్య పరాక్రమం ఏదైతే ఉన్నదో, ఆ సత్యం అనేటువంటి మూల పదార్థం యొక్క చైతన్య స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది ఈ ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. ఎందరో ఎందరెందరో ఈ మహా ప్రవాహంలో దానిలో ప్రవేశించి మళ్ళీ తాము తమ జీవితాలను సముద్ధరించుకొని పర--పరిపూర్ణమైనటువంటి స్థాయికి వెళతారు గనుక ఈ సత్య అనేటువంటి ఈ aspect ని మహేశ్వర శక్తిగా చూడాలి. మహేశ్వర శక్తి అంటే శివ శక్తి. శివ శక్తి అంటే శివుడు అంటూ ఒక్కడు ప్రత్యేకంగా లేడు, శక్తితో కూడి ఉన్నాడు. కాబట్టి శివశక్త్యాత్మకమైన అర్ధనారీశ్వర తత్వమైన పురుష స్త్రీ సంబంధమైన ఈ సమన్వయమైనటువంటి శివశక్తి స్థానమే సత్యమునకు మూలమై ఉన్నది. అది సత్యమై ఉన్నది గనుక సత్య సాయి భగ-భగవానుడు సాయి అనేటువంటిది ఆయన స్వభావం, సత్య అనేటువంటిది ఆయన స్థితి. ఒక స్థితి స్వభావము రెండు కలిపితే అది సత్య సాయి అయింది. సహ అంటే ఈశ్వరుడు, ఆయి అంటే అమ్మ. మళ్ళీ ఇక్కడ మనం అనుకున్నట్లుగా ఈ సత్యమే శివమై, సుందరమై, సమున్నతమై, ధర్మమై, ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అవతార స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. సాయిరాం. [పాట] సత్య ధర్మ ప్రేమ నిత్యమై ఉండిన ఉడమి తల్లి ఎంతో ఉలకరించు. విశ్వ శాంతినిచ్చు. వివిధ సౌఖ్యము హెచ్చు. వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు.
YouTube · audio
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (సత్య)
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (సత్య)
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 26:36
More in this series