Skip to content
Transcript తెలుగు
[సరిగా లేదు] భయం లేనివాడు జీవుడు, భయం తెలియని వాడు దేవుడు. అందుకనే ఉపనిషత్తులు ఆయనకి "అభీహి" అని పేరు పెట్టినాయి. భీతి లేనివాడు. ఎందుకు భీతి లేదు? ఆయనకు కూడా ఉండాలి కదా! ప్రపంచంలో కృష్ణుడికి భయం ఉండాలిగా, రాముడికి భయం ఉండాలిగా, రమణ మహర్షికి భయం ఉండాలిగా అంటే మనకంటే, నాకంటే రెండవ వాడు లేడు, ఉన్నాడు అంటే భయం వేస్తుంది, లేడు అంటే భయం ఉండదు. మన భయాలన్నీ మనక-- మనతో పాటో మన కంటే ఇంకోడు ఉన్నాడనగానే భయం వేస్తుంది. భయం వదిలిపెట్టాలి. మనం మనతో పాటు మనలో ఒకడు ఉన్నాడు. ఒక్కడు ఏకాదశ పురవిహారిగా ఆత్మ స్వరూపిగా ఉన్నాడు అనేటువంటి భావనను గనక అర్థం చేసుకుంటే, ఇవాళ మన కోపాలు, తాపాలు, అభిజాత్యలు, అహంకారాలు, అసూయలు, మదాలు, మాత్సర్యాలు ఇవన్నీ కూడా నశించి ఒక నిష్కల్మషమైన భావనలో జీవితాన్ని గడపటమే నిజానికి రమణుల యొక్క వైభవం. మరొక్క విషయం, ఒక భక్తుడు భగవాన్ తెల్లవారుజామున లేచి స్నానంకి బయటికి వెళ్ళి తాను ధరించిన కౌపీనాన్ని తానే ఉతుక్కుని పదల మీద ఆరేసుకోవటం ఆయన చూశాడు. నో, ఇవ్వాళ నుంచి కాదు భగవాన్ కి సర్వీస్ అన్నా నేను చేయాలి, అన్నీ ఆయనే చేసుకుంటున్నారు అనుకున్నాడు. మర్నాడు భగవాన్ లేచే లోగా అరగంట ముందే లేచి కౌపీనాలు రెండో మూడో ఉన్నాయ్ అవన్నీ ఉతికాడు, ఆరేసి వచ్చేశాడు. ఎక్కడికి వచ్చాడంటే, అతనికి వంట గదిలో పిండి రుబ్బేటువంటి పని ఒకటి ఉంది. పనికి వచ్చాడు, చేతులు కడుక్కున్నాడు వచ్చాడు పిండి రుబ్బుతున్నాడు. భగవాన్ వెళ్లారు. వస్తూ వస్తూనే వంట గదిలోకి ప్రవేశించి "నువ్వు కాస్త తప్పుకో అప్ప" అన్నారు. అంటే భగవాన్ నేను పిండి రుబ్బుతున్నాను, ఇది అయ్యాక వస్తే, "కాదు నువ్వు తప్పుకో" అన్నారు. భగవాన్ అక్కడ స్వయంగా కూర్చొని పిండి రుబ్బారు. రుబ్బి, వారన్న మాట ఏమిటో తెలుసునా? "ఎవరు ఆశ్రమంలో ఉన్నా, ఎవరూ పని చేయకుండా ముద్ద ఎత్తే అధికారం ఒక్కడికి లేదు. పని చేయవలసిందే. మీరు నా పని చేశారు, నేను చేసుకోవలసిన పని. కనుక మీరు చేయవలసిన పని నేను, నేను చేస్తా". అంటే ఒక సమతుల్యమైనటువంటి భావన Dignity of Labour. మనం ఉపన్యాసం ఇవ్వటం కాదు, జీవితంలో వీటిని ఆచరించాలి. దానిలో చాలా వదులుకుంటే తప్ప భావనలన్నీ కూడా మనం ఆచరించే స్థితికి మనం వెళ్ళలేం. ఇట్లా ట్రావెన్కూర్ మహారాజు, అవును మహర్షి చాలా గొప్పవారు అని విన్నాం. జ్ఞాని. నేను రాజుని, కర్మ యోగంలో జ్ఞానాన్ని ఎలా చొప్పించి చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయాలో వారి నుంచి కొంత ఉపదేశం పొందాలి అని అనుకొని వస్తున్నాను అని కబురు పెట్టారు. ఎప్పుడైతే మహారాజు వస్తున్నారో ఆశ్రమం అంతా కూడా చక్కగా clean చేశారు, స్వాగత తోరణాలు కట్టారు. అలాగే స్వాగత గీతికలు పలకటానికి, వేద పఠనం చేయటానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తెల్లవారితే రాజు గారు వస్తారు అనంగా ఆరోజు రాత్రి పెను వర్షం, పెను గాలులు, భీభత్సం ఏర్పడింది. ఆశ్రమంలో ఉన్నటువంటి అరటి చెట్లన్నీ కింద పడిపోయినాయి. ములగ చెట్లన్నీ కింద పడిపోయినాయి. సమయంలోనే ట్రావెన్కూర్ మహారాజు వచ్చారు. వీళ్ళు ఇదేమిటి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆయన స్వాగతం పలకలేం, వారిని లోపలికి తీసుకెళ్లలేం, ఇంత అమర్యాద జరిగింది అని అందరూ అటూ ఇటూ అనుకుంటూ ఉంటే వారందరినీ చేతితో వారించి లోపలికి ప్రవేశించారు. అప్పుడు భగవాన్ ఎక్కడున్నారో తెలుసా? నేల మీద బురదలో పడిపోయినటువంటి ఒక ములగ చెట్టు కాండం మీద కూర్చొని దాని ఆకుల వినియోగం ఎలా చేయాలో, ఆరోగ్య సూత్రాలలో అది ఎంత ప్రధాన భూమిక వహిస్తుందో, దాని యొక్క ఉపయోగాలు ఏమిటో అని చెప్తూ మనం ఎక్కి కోసుకో లేము అని తల్లే నేలకి దిగి అంది వచ్చిందెప్పా అని చెప్తున్నారు. దానిని చూశారు. భగవాన్ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడాలనుకున్నానో, ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకొని వచ్చి జవాబు పొందాలని అనుకున్నానో, జ్ఞానంలో ఒక కర్మయోగి, జ్ఞానయోగి కర్మయోగంలో ఎలా ఉంటాడో భగవాన్ నాకు demonstrate చేసి చూపించారు. వారిని ప్రశ్నించవలసినదంటూ లేదు, ఇక తెలుసుకోవలసింది అంటూ లేదు. రాజుగా నేను సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు, ప్రజల కోసం నేను అవసరమైతే నేల మీద కూడా చతికిలబడగలిగినటువంటి ఒక జ్ఞాన భూమికలోకి నేను వెళ్లగలగాలి. భగవాన్ ది నాకు మహోపదేశం అని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవాళ పాలకులు రమణాశ్రమానికి వెళ్తారు పుణ్యం కోసం. ఏదో మేము కూడా రమణాశ్రమం చూసి వచ్చాం, నాలుగు రోజులు ఉన్నాం. కాస్త tourism కి వెళ్తాం, pilgrim center కి వెళ్తాం, భగవాన్ నడిచిన నేల అంటాం. కాసేపు ఉద్వేగానికి, భావావేశానికి లోనవుతాం. కానీ ఆయన జీవిత విధానాన్ని గనక గమనించినట్లయితే, మనం జాగ్రత్తగా observe చేసినట్లయితే, మనం నేర్చుకోవలసినవి, మనల్ని మనం సరిదిద్దుకోవలసినవి అనేకమైనటువంటి విషయాలు. సందర్భాలు కొన్ని కోకొల్లలు. కడగా aspect ను గురించి ఇంకొక విషయం చెప్తాను. శ్రీ రాజగోపాలాచారి అలాగే గవర్నరు ఇద్దరూ కలిసి భగవాన్ దర్శనానికి బయలుదేరారు. గవర్నర్ గారికేమో భగవాన్ ని చూడాలని ఉంది.రాజగోపాలాచారి గారికి భగవాన్ దగ్గరికి ఏముంది ఆయన ఏం పెద్ద మాట్లాడరు మన మన మన దగ్గర ప్రశ్నలు ఉంటాయి ఆయన ఏం పెద్దగా జవాబు ఇవ్వరు పెద్ద ప్రయోజనం ఉండదేమో అని లోపల ఆలోచన. సరే ఆలోచన ఎట్లా ఉన్నా వాళ్ళు అరుణాచలేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చారు ఇద్దరు. ఒక టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ ఏమిటంటే Chief Minister of Tamil Nadu రోజుల చెన్నై. వెనక్కి వెంటనే రావలసింది ఒక urgency ఉన్నది అని అరుణాచలేశ్వర దేవాలయంలోకి కూడా అడుగు పెట్టకుండానే రాజగోపాలాచారి గారు వెనక్కి వెళ్ళిపోయినారు గవర్నర్ గారు భగవాన్ తో కాసేపు కూర్చొని మాట్లాడి వచ్చారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ జమునాలాల్ బజాజ్ దేశం ఏమైపోతుంది పరదాస్యం నుంచి ఎప్పుడు విముక్తమవుతుంది దేశం సర్వ స్వతంత్ర సార్వభౌమత్వాన్ని ఎప్పుడు పొందుతుంది మీ తపస్సు మీ ధ్యానము మీ యోగము మీ అనుగ్రహం కావాలి అంటూ భగవాన్ దగ్గరికి వెళ్లి కూర్చొని భగవాన్ ఎప్పుడు విముక్తి అని అడిగితే ఎవరు సంకెళ్ళు వేసుకున్నారో సంకెళ్ళు విడిపించుకోవటం కూడా వారి యందే ఉన్నది కనుక మనం దానిని చూస్తూ ఉంటే అన్నీ తెగి చీకట్లు పోయి వెలుగులు మళ్ళీ భారతదేశంలోకి తమంతట తామే సూర్యకిరణాల వలే ప్రసరిస్తాయి అని మాత్రం సమాధానం ఇచ్చారు అంతేగాని నా తపస్సు ధారపోసాను నా ధ్యానంలో అనుభవం కలిగింది నాకు దర్శనం కలిగింది ఆగస్టు పదిహేను వచ్చేస్తుంది ఇవేమీ చెప్పలే అంటే జ్ఞాని అయినటువంటి వాడు నిరాశతో ఉంటాడు నిరాశ అంటే pessism కాదు నిర్-ఆశ దేనిని ఆశించడు ఇది కావాలి అన్న కోరిక ఉండదు కానీ భగవంతుడు అనేక రూపాలలో అతనికి ఏది సౌఖ్యమో దానివలన అతని అధ్యాత్మ జీవితం ఎంత సుసంపన్నం కాగలదో దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు భగవంతుడే చేస్తాడు భగవంతుడు అంటే రమణ మహర్షి వచ్చో శిరిడి మహాస్వామి వచ్చో సత్య సాయిబాబా వారు వచ్చి మన వాకిట్లో కూర్చొని మన పని చేయరు కానీ వారి యొక్క చైతన్యము ఎవరి యందో ప్రవేశించి మన బాగు ఓగు మన క్షేమము మన సంక్షేమము మనకు కావలసినవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు గనుక మనకు ఏర్పాటు చేసేవారు ఎవరు అంటే వారు భగవత్ స్వరూపులే. భావన ఉండాలి వాళ్ళు మనకి చాకిరీ చేయటానికి రాలే మనల్ని కాపాడటానికి వచ్చారు అనే భావన ఉండాలి ఇటువంటి ఉదాత్తమైన భావనలన్నీ కూడా రమణ వైభవంలో ఉన్నాయి. ఇక మళ్ళీ గంభీరమైనటువంటి విషయాల్లోకి వెళ్లాలంటే కాస్త రెండు చమత్కారాలు చెప్పమని అడిగారు దీనిలో నిజానికి భగవాన్ subject లో చమత్కారాలకు పెద్దగా తావు లేదు ఒక్క చమత్కారం మాత్రం చెప్తాను. చమత్కారం ఏంటంటే నిన్ననే ఒక శాంతమ్మ గురించి మాట్లాడుకున్నాం కదా శాంతమ్మ రోజు చాలా బాధపడింది ముప్పై నాలుగు ఏళ్ళు అయిపోయింది ఆశ్రమానికి వచ్చి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వండటం వార్చటం వడ్డించటం తప్ప నా జీవితం ఇంక ఇంతేనా ఇక్కడే మగ్గిపోవలసిందేనా అని అనుకొని ఇవాళ ఏమైనా సరే భగవాన్ ని ప్రశ్న వేయాలి అని అనుకుంది. వారు సహజంగానే భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోటానికి వెళితే ఆమె కాస్త దూరంగా నిలబడి భగవాన్ అందరూ వచ్చి ఇవాళ భగవాన్ విషయం చెప్పారు విషయం చెప్పారు ఎంత బాగా చెప్పారో ఇవాళ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పారు అని ఇవన్నీ చెప్తారు చెప్తూ వింటూ ఉంటాను కానీ నాకు ఆనందం కలగటం లేదు నా జీవితం అంతా వంట గదిలోనే ముగిసిపోతుందా అనే భయం వేస్తున్నది నాకు కూడా ఏదన్నా అనుగ్రహం ఇవ్వండి భగవాన్ అని అడిగింది. వారు చేయి కడుక్కోవడం ఆపేసి శాంతమ్మ చూడు నువ్వేమో ఇవాళ భగవాన్ ఏం చెప్పారో ఎవరొచ్చి ప్రశ్న వేశారో ప్రశ్నకి భగవాన్ ముఖతః సమాధానం వచ్చిందో అని నీ మనసంతా భగవాన్ మీద బయట ఉన్నది అక్కడ భగవాన్ చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ ఏముందో తెలుసునా ఇవాళ శాంతమ్మ పిండివంట చేసిందో కూర వండిందో అని నా దగ్గర భగవాన్ దగ్గర ఉన్న వాళ్ళ మనసంతా వంటింట్లో ఉంది నువ్వు వంటింట్లో ఉన్న నీ మనసంతా భగవాన్ మీద ఉంది నువ్వు ఇక్కడే ఉండు ఇదే సాధన అన్నారు. చూడండి మనసు ఎక్కడ ఉన్నది అనేది ప్రధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా విషయరతో వా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ శంకర భగవత్పాదులు. నువ్వు ఎట్లా అన్నా ఉండు నీ మనస్సు నీ చిత్తము నీ హృదయము నీ మనస్సు నీ ఆలోచన నీ తలపులు నీ స్మృతులు నీ భావనలు అన్నీ బ్రహ్మము నందు పరబ్రహ్మము నందు గనుక లగ్నమై ఉన్నట్లయితే అది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది నందత్యేవ అది మాత్రమే ఆనందం. ఇటువంటి అనేక యాభై నాలుగు సంవత్సరాల జీవితంలో ప్రతిరోజూ ప్రతి పుటా ఉదాత్తమైనటువంటిదే గనుక ఉదాత్తమైనటువంటివన్నీ కూడా రమణ వైభవంలో వెలిగిన వెలుగులు వెలార్చినటువంటి కాంతి రేఖలు గనుక నిజంగా గాఢమైన ఘనమైన నేను అనుకున్నాం శాంతర్నితాంత మహితా పరమాస్య శక్తిఃహి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శన మయం రమణో మహర్షిఃహి అనుకున్నాం కదా సాంద్రమైన ఘనమైన సైన్స్ చదువుకునే వాళ్ళకి specific gravity అంటామే సాంద్రము సాంద్రత అంటే అదే. నిజానికి కవితా భావనలో వాఙ్మయ భావనలో సాంద్రము సంద్రము సముద్రము సాగరము ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి గాఢమైన గంభీరమైన ఉదాత్తమైన విస్తృతమైన చెలియలి కట్ట దాటనటువంటి ప్రవాహాన్ని నిలబెట్టుకునేటువంటి సాగర గంభీరమైనటువంటి కరుణామూర్తి అయిన భగవాన్ ధ్యానం గురించి ఏమైనా చెప్పారా?చెప్పారు మనకు పెద్దగా అది ఇష్టం ఉండదు నచ్చదు ఎందుకనంటే నిన్న విషయం నేను ప్రస్తావన చేశా ఏమి చేయకపోవటమే ధ్యానం నేను ధ్యానంలో ఉన్నాను ధ్యానం చేస్తున్నాను ధ్యానం class లకు వెళ్ళాను అని గనక ఇవన్నీ అనుకుంటే ను నేను అక్కడే ఉన్నాను నాతో పాటు నా మనసు కూడా అక్కడే ఉంది రెండు దాటి నేను ఏం చేయటం లేదు ఆలోచనే లేదు భావ శూన్యత ఏర్పడింది ప్రాపంచిక భావనలు నా నుంచి దూరమైపోయినాయి ఇది కావాలి అది కావాలి ఇది ఏమవుతుందో అది ఏమవుతుందో అనే ఆందోళన లేదు ఆలోచన లేదు ఏమీ లేనటువంటి ఒక నిరామయమైన నికేతనమైన నిరంజనమైన స్థాయిలో మనస్సు స్థగితమైనప్పుడు స్తంభించినప్పుడు దానికి వారన్న వాడిన మాట "be still" నిశ్చలంగా ఉండు అయితే ఇక్కడ ధ్యానాన్ని గురించి ధ్యానం చేసుకునేవారు లేదా ధ్యానంలో ఉన్నవారి కోసం ఒక రెండు నిమిషాలు శంకర భగవత్పాదుల ప్రస్తావన తేవాలి ఎందుకంటే శంకర భగవత్పాదులు సంస్కృతంలో చెప్తే దానినే భగవాన్ రమణ మహర్షి తమిళంలో చెప్తే దాన్ని మళ్ళీ చివరగా తెలుగులో చెప్పుకుందాం ఒకటి బ్రహ్మైవాస్మితి సద్వృత్య నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని అనేది ప్రౌఢానుభూతి లో ఉన్నటువంటి మహా శ్లోకం ఇది శంకర వాంగ్మయంలో కీలకమైన శ్లోకం బ్రహ్మైవాస్మితి నేను బ్రహ్మమునై ఉన్నాను అనుకోగలమా ఎప్పటికైనా అనుకోగలమా కన్నుమూసేలోగా ఎప్పటి ఒక్క క్షణమైనా నేను బ్రహ్మమునై ఉన్నాను అంటే అనుకోలేము నేను అనగానే నా bio data గుర్తొస్తుంది నేను రాసిన పుస్తకాలు గుర్తొస్తాయి నేను చెప్పిన ప్రసంగాలు స్పురణకు వస్తాయి నేను నడిచిన మనుషులు గుర్తొస్తారు నేను కలిసిన వాళ్ళు నేను పొందిన కీర్తి నా డబ్బు అవే గుర్తుంటాయి తప్ప నేను అసలు నేను నాకు ఇంకా స్పురణకు రాదు కానీ రాగలిగితే అది మొట్టమొదటి సోపానం బ్రహ్మైవా అస్మి ఇతి నేను బ్రహ్మైవా బ్రహ్మము మాత్రమే అయి ఉన్నాను బ్రహ్మమునై ఉన్నాను కాదు stage కి వస్తే ఏమవుతుందంటే సద్వృత్య సత్ అనేటువంటి ఆత్మకు వృత్తులు ఏర్పడతాయి మనోవృత్తులు విన్నాం చిత్తవృత్తులు విన్నాం చిత్తవృత్తులు నిరోధిస్తే యోగము అని పతంజలి యోగశాస్త్రం చెప్పింది మనోవృత్తులు వదిలిపెట్టుకోండి అనేమో అన్ని పురాణాలు వాంగ్మయాలు ప్రవచనకారులు అందరూ చెప్తున్నారు కానీ సద్వృత్తులు ఏమిటి ఆత్మకి వృత్తులు ఏమిటి అంటే ఆత్మకు కూడా ఒక వృత్తి ఉన్నది తాను కదలకుండా సమస్త ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి మహా శక్తి సంపన్నమైన ఆత్మ మన యందే ఉన్నది గనుక సద్వృత్తి ఒక్కసారి మనకు అనుభవంలోకి వస్తుంది స్పర్శ మాత్రంగా మనం దానిని అనుభవిస్తాం ఎప్పుడైతే ఆత్మ వృత్తులు పడసూపుతాయో లేదా రేఖా మాత్రంగా స్పర్శ మాత్రంగా మనల్ని తాకుతాయో నిరాలంబయతా స్థితి అది independence కాదు independence అంటే స్వేచ్ఛ dependence అంటే స్వేచ్చ గాని మరొకరి మీద ఆధారపడిన స్థితి నిరాలంబయతా స్థితి అంటే a state of non dependence it is not equal to independence దేనిమీద ఆధారపడినటువంటి ఒకానొక స్థితి మనకు ఏర్పడుతుంది మూడు ఏర్పడితే మాత్రమే దాని పేరు ధ్యానము అని పేరు పెట్టుకోమన్నారు ఇవాళ ధ్యానానికి ఉన్న అర్థాలు వేరు ఆరోగ్యానికి దర్శనాలకి ఆయుష్షుకి తేజస్సుకి నిజానికి ఇవాళ జరుగుతున్నదంతా ఆలోచనలు పోగొట్టుకోండి ఆలోచనలు నియంత్రించుకోండి అంటున్నాం కానీ ధ్యానం ఎక్కడ చేయాలి ఎలా చేయాలి చేయాలి అంటే ధ్యానంలో ఎలా ఉండాలి ఎలా ఉంటే నిజమైన ధ్యానం అంటే బ్రహ్మైవాస్మితి సద్వృత్య నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత ధ్యానము అనబడేటువంటి పదము ద్వారా అది popular అవుతుంది ప్రపంచానికి తెలుస్తుంది మరి ధ్యానం ఏమిస్తుంది అని మామూలు ఇవాళ అనేక ధ్యానాలు ఉన్నాయి అనేక ధ్యానాలు అనేక ప్రక్రియలు ప్రపంచంలో నడుస్తున్నాయి అవన్నీ ఏమిస్తున్నాయి అంటే దర్శనాలు ఇస్తున్నాయి ఆజ్ఞా చక్రం దగ్గర రాముడు కనిపించాడు అంటున్నాం సహస్రారం దగ్గరికి వెళ్తున్నాం ఏమి కనపడటం లేదు అంటున్నాం ఒకడేమో నాకేమీ కలగటం లేదు అంటున్నాడు రెండో వాడు నాకన్నీ లభిస్తున్నాయి అంటున్నాడు ధ్యానానికి ఇది సంకేతం కాదు ఇది అపరిపక్వమైనటువంటి ధ్యాన స్థితి ధ్యానం ఏమివ్వాలో తెలుసునా పరమానందదాయిని పరమ చరమమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో బ్రహ్మానందాన్ని అది ఇవ్వాలి ఆనందం యొక్క సోపానాలు ఎట్లా అంటే ముందు మనుష్యానందము మనీషానందము గంధర్వానందము దేవగంధర్వానందము పితృపితా నందము ప్రజాపితా నందము కడగా హిరణ్యగర్భానందము హిరణ్యగర్భానంద స్థాయికి ధ్యానాలు తీసుకొని వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు మరి రోజులలో ధ్యానాలు ఎక్కడ జరిగినాయి అడవుల్లో జరిగినయి చల్లని ఆకుల నీడలో జరిగినయి సెలయేటి తావున జరిగినయి ఏకాంతంలో జరిగినాయి సామూహికంగా జరగలేదు సామూహిక ధ్యానాలు ఆనందప్రదాలు కావు ధ్యానము అంటే ధ్యానమే ధ్యానం ధీ అంటే intellect నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనస్సు ఉన్నది అది తెలుసుకుంటున్నప్పుడు నా మనస్సు ఉన్నది తెలుసుకున్న తర్వాత నాకు మనస్సు లేదు అంతే కదా తెలుసుకునేదాకా మనసు అందరికీ రమణ మహర్షికి కూడా పదహారు ఏడు వరకు మనసు అక్కడ ఉండనే ఉన్నది అలాగే భగవాన్ ధ్యానాన్ని గురించి వారు ధ్యానం చేశారు రమణ మహర్షికి ధ్యానంలో అనుభవాలు కలిగినయి వారు తపస్సు చేశారు ఇవి ఏమీ ఆయన చేయలేదు ఇదే సత్యం సత్యం ఎంత సత్యం అంటే వారు అరుణాచలానికి ప్రమేయం లేకుండా వచ్చారు అరుణాచల శిఖరం మీదికి తాను కావాలని వెళ్ళలేదు.మళ్లీ వారు కిందకు వచ్చారు. వచ్చే చెట్టు కింద కూర్చున్నారు. భగవాన్ మీరు అక్కడ హాయిగా స్కందాశ్రమంలో ఉండొచ్చు కదా అంటే, ఏమోనప్పా ఎవరెవరో ఎక్కడినుంచో నన్ను శక్తి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ రప్పించింది. వారే అన్నీ చూసుకుంటారు అని వదిలేశారు. ఇది ఒక పరమాద్భుతమైన వైరాగ్యం. మామూలుగా రమణ వైభవం అని పేరు పెడతాం. వైభవం అనే పేరు ఎందుకు పెట్టాము అంటే వైరాగ్యమే వైభవం. మిగతా వైభవాలన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. కడుపున పుట్టినటువంటి బిడ్డలు మనకు మనతో ఉండరు. వాళ్లతో మనం ఉండం. అలాగే కట్టుకున్న ఇల్లాలు ఉండదు. చదువు నేర్పిన గురువులు ఉండరు. నీవు లేకపోతే జీవితం ఎట్లా అన్న మనిషి మాయమైపోతాడు. స్నేహితులు దూరం అవుతారు. ప్రపంచంలో ఏది మిగిలి ఉన్నది అంటే ప్రపంచంలో నీతో ఉన్నటువంటి నీతో పాటుగా ప్రపంచంలో ప్రవేశించినటువంటి ప్రవేశించిన దానికే విశ్వము అని పేరు. విశ్వము అంటే ప్రపంచం కాదు. విశ్వము అంటే జీవుడు అని అర్థం. జీవుడు సత్తువ నుంచి సృష్టి అయి సృష్టి నుంచి విశ్వంగా ప్రవేశించాడు గనుక జీవుడి యొక్క మారుపేరు ఏమిటంటే వాడి పేరు విశ్వం. విశ్వం అంటే మనం ప్రపంచంతో కూడి ఉంటాం. ప్రపంచం అంతా మనదిగా భావిస్తాం. ప్రపంచం అంతా మనల్ని మొయ్యాలని అనుకుంటాం. ప్రపంచాన్ని మొత్తం జయించాలని అనుకుంటాం. ప్రాపంచికమైన భావనలన్నీ మన అణువణువునా ఉంటాయి గనుక విశ్వము నిండి ఉన్నది గనుక వాణ్ని విశ్వంభరుడు అని పేరు పెట్టుకున్నారు, అంతే. అంటే జీవుడే విశ్వంభరుడు. విశ్వంభరుడు నిజానికి దేవుడు కాదు. కానీ దత్తాత్రేయ సంప్రదాయంలో విశ్వంభర శబ్దం ఉన్నది. విశ్వంభర శబ్దం ఏమిటి అంటే సమస్త ప్రపంచాన్ని నిండి ఉన్నటువంటిది అని అర్థం. ఏది నిండి ఉన్నది? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆత్మే నిండి ఉన్నది గనుక. కనుక రమణ మహర్షి భావనలో ఏమీ చేయకపోవటమే ధ్యానము. ఏదైనా చేయటం అనేటువంటిది ధ్యానంలో చాలా ప్రాథమిక స్థాయి. అది నిజంగా మనకు కావలసిన శాంతిని మాత్రం అది ఇవ్వదు. దాని వలన వచ్చే శాంతి మీరు చేసే ధ్యానాన్ని కొద్ది రోజులు ఆపండి. మళ్లీ అశాంతి ప్రారంభం అవుతుంది. కాసేపు ఆలోచనలు లేనట్టుగా ఉంటుంది. మళ్లీ ఆలోచనలు మొలకెత్తుతాయి. మరి దేనికై మనం ఇవాళ ధ్యాన మందిరాలు కడుతున్నాం? అవి ఎందుకు కడుతున్నాం అంటే, నీవు నిశ్చలంగా ఏకాకిగా ఏకాత్మగా ఏకోన్ముఖమైనటువంటి అంతర్ముఖ స్థాయిలో నిన్ను నీవు అర్థం చేసుకొని నిన్ను నీవు విమర్శ చేసుకొని నిన్ను నీవు పరామర్శ చేసుకొని నిన్ను నీవు అనుభవించటానికి ఏర్పడిన ఒక ఏకాంత స్థితే దాని పేరు ధ్యానము. అదే ధియానము. ఇంటలెక్ట్ ని బయట పడేయాలి. మనము దేవాలయ ప్రాంగణంలోకి రావాలి అంటే మన కాళ్ల చెప్పులు ఎంత ఖరీదైనవైనా బయట వాడికి అప్పజెప్పే లోపలికి రావాలి. రెండు కాళ్లకున్న రెండు చెప్పులు అహంకారము రెండవది మమకారం. ఇక్కడికి ప్రాంగణంలోకి వచ్చి కూడా దైవతం దగ్గర కూడా మనకు అహంకారం మమకారాలు రెండు ఉన్నట్లయితే పైకి చెప్పులు వేసుకుని రాకపోయినా మనల్ని అంటిపెట్టుకున్న రెండు చెప్పులతో వచ్చినట్లే లెక్క. కనుక దేవాలయ ప్రవేశానికి కానీ మహాత్ముల దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను అన్నటువంటి మన అస్తిత్వాన్ని బయటకు నెట్టాలి. [నవ్వు]
YouTube · audio

Sri Ramana Maharshi Vybhavam Part III

Home

Sri Ramana Maharshi Vybhavam Part III

Source: P V S on YouTube

0:00 / 22:57

More in this series

Sri Ramana Maharshi Vybhavam (Feb 2020)

3 episodes · 1 hr 21 min

  1. 29 min 1

    Sri Ramana Maharshi Vybhavam

  2. 27 min 2

    Sri Ramana Maharshi Vybhavam Part II

  3. 22 min 3

    Sri Ramana Maharshi Vybhavam Part III

    Now playing